
ఇటీవలే థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్ 'మ్యాడ్ స్క్వేర్'. గతంలో వచ్చిన మ్యాడ్‌కు సీక్వెల్‌గా డబుల్ మ్యాడ్‌నెస్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చారుయ. ఈ చిత్రాన్ని కల్యాణ్ శంకర్ డైరెక్షన్‌లో తెరెకెక్కించారు. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీ సక్సెస్ కావడంతో గ్రాండ్‌గా సెలబ్రేషన్స్ కూడా నిర్వహించారు. శిల్పాకళా వేదికలో జరిగిన ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హాజరయ్యారు.
అయితే తాజాగా మరోసారి మ్యాడ్ స్క్వేర్ సక్కెస్‌ను సెలబ్రేట్ చేసుకున్నారు టాలీవుడ్ నిర్మాత సూర్యదేవర హారిక. హెల్పింగ్ హ్యాండ్స్ కమ్యూనిటీలో ఉన్న అనాథ పిల్లలతో కలిసి కేక్‌ను కట్ చేసింది. అక్కడే ఉన్న పిల్లలతో సరదాగా కాసేపు ముచ్చటించింది. దీనికి సంబంధించిన ఫోటోలను నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ట్విటర్‌లో పోస్ట్ చేసింది.
Producer #HarikaSuryadevara celebrated the success of #MadSquare with the Helping Hands community!
Here are some beautiful moments from her visit. ✨#BlockbusterMaxxMadSquare in cinemas now! 🫶 pic.twitter.com/IxntxhsD4T— Sithara Entertainments (@SitharaEnts) April 9, 2025