Harika
-
ముగింపు మెరవాలి!
న్యూయార్క్: ఈ ఏడాది భారత చెస్ క్రీడాకారులు విశ్వవేదికపై అదరగొట్టారు. ప్రతిష్టాత్మక ఒలింపియాడ్‌లో భారత పురుషుల, మహిళల జట్లు స్వర్ణ పతకాలతో మెరిపించగా... క్లాసికల్ ఫార్మాట్లో దొమ్మరాజు గుకేశ్ కొత్త ప్రపంచ చాంపియన్‌గా అవతరించాడు. క్యాడెట్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ చిన్నారి దివిత్ రెడ్డి పసిడి పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఇక పలు అంతర్జాతీయ టోర్నమెంట్లలో పలువురు భారత గ్రాండ్‌మాస్టర్లు టాప్–3లో నిలిచి తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది చివరి అంతర్జాతీయ టోర్నమెంట్ అయిన ప్రపంచ ర్యాపిడ్, బ్లిట్జ్ చాంపియన్‌షిప్ పోటీలకు నేడు తెర లేవనుంది. న్యూయార్క్‌లో ఆరు రోజులపాటు ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్ జరగనుంది. భారత్ నుంచి ఓపెన్ విభాగంలో 9 మంది గ్రాండ్‌మాస్టర్లు, మహిళల విభాగంలో 8 మంది క్రీడాకారిణులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. ప్రపంచ ర్యాపిడ్, బ్లిట్జ్ చాంపియన్‌షిప్ పోటీల్లో భారత్‌కు మంచి రికార్డే ఉంది. ఫలితంగా ఈ ఏడాది ఆఖరి టోర్నీలోనూ భారత క్రీడాకారులు పతకాలు సాధించి సూపర్ ఫినిషింగ్ ఇవ్వాలని ఆశిద్దాం. 2017లో విశ్వనాథన్ ఆనంద్ ర్యాపిడ్ ఫార్మాట్లో ప్రపంచ చాంపియన్ అయ్యాక మరో భారత ప్లేయర్ ఈ విభాగంలో టాప్–3లో నిలువలేదు. ఇక ఓపెన్ విభాగంలో ర్యాపిడ్, బ్లిట్జ్ ఫార్మాట్లలో నార్వే దిగ్గజం మాగ్నస్ కార్ల్సన్ డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగనున్నాడు. మహిళల ర్యాపిడ్ విభాగంలో అనస్తాసియా బొడ్నారుక్ (రష్యా), బ్లిట్జ్ విభాగంలో వాలెంటీనా గునీనా (రష్యా) తమ ప్రపంచ టైటిల్స్‌ను కాపాడుకుంటారో లేదో వేచి చూడాలి. భారత్ నుంచి ఎవరెవరంటే.... ఓపెన్ విభాగం (ర్యాపిడ్, బ్లిట్జ్): ఇరిగేశి అర్జున్, ప్రజ్ఞానంద, రౌనక్ సాధ్వాని, సందీపన్ చందా, అరవింద్ చిదంబరం, హర్ష భరతకోటి, ప్రణవ్, దీప్తాయన్ ఘోష్, కార్తీక్ వెంకటరామన్. మహిళల విభాగం (ర్యాపిడ్, బ్లిట్జ్): కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, దివ్య, వైశాలి, వంతిక అగర్వాల్, సాహితి వర్షిణి, పద్మిని రౌత్, నూతక్కి ప్రియాంక. ఫార్మాట్ ఎలా అంటే... ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్ ఓపెన్ విభాగంలో మొత్తం 13 రౌండ్లను స్విస్ ఫార్మాట్లో... మహిళల విభాగంలో 11 రౌండ్లను స్విస్ ఫార్మాట్లో నిర్వహిస్తారు. నిర్ణీత రౌండ్ల తర్వాత రెండు విభాగాల్లో అత్యధిక పాయింట్లు సాధించిన ప్లేయర్లు విజేతగా నిలుస్తారు. ప్రపంచ బ్లిట్జ్ చాంపియన్‌షిప్‌ను రెండు దశల్లో నిర్వహిస్తారు.ముందుగా ఓపెన్ విభాగంలో 13 రౌండ్లను స్విస్ ఫార్మాట్లో... మహిళల విభాగంలో 11 రౌండ్లను స్విస్ ఫార్మాట్లో ఏర్పాటు చేశారు. నిర్ణీత రౌండ్ల తర్వాత టాప్–8లో నిలిచిన వారు రెండో దశ (నాకౌట్)కు అర్హత పొందుతారు. నాకౌట్ దశలో అజేయంగా నిలిచిన ప్లేయర్లు విజేతలుగా అవతరిస్తారు. టైమ్ కంట్రోల్ ఎంతంటే... ర్యాపిడ్ ఫార్మాట్లో ఒక్కో గేమ్ 15 నిమిషాలు జరుగుతుంది. తొలి ఎత్తు నుంచి ప్రతి ఎత్తుకు 10 సెకన్లు జత కలుస్తాయి. బ్లిట్జ్ ఫార్మాట్లో ఒక్కో గేమ్ 3 నిమిషాలు జరుగుతుంది. తొలి ఎత్తు నుంచి ప్రతి ఎత్తుకు 2 సెకన్లు జత కలుస్తాయి. నిర్ణీత రౌండ్ల తర్వాత ప్లేయర్లు సమంగా పాయింట్లు సాధిస్తే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించి విజేతలను నిర్ణయిస్తారు. ప్రైజ్‌మనీ ఎంతంటే... ర్యాపిడ్ ఫార్మాట్ ఓపెన్ విభాగంలో టాప్–40లో నిలిచిన ప్లేయర్లందరికీ ప్రైజ్‌మనీ ఇస్తారు. విజేతకు 90 వేల డాలర్లు (రూ. 76 లక్షలు), రెండో స్థానంలో నిలిచిన ప్లేయర్‌కు 70 వేల డాలర్లు (రూ. 59 లక్షలు), మూడో స్థానంలో నిలిచిన ప్లేయర్‌కు 56 వేల డాలర్లు (రూ. 47 లక్షలు) అందజేస్తారు. బ్లిట్జ్ ఫారామ్ట్ ఓపెన్ విభాగంలోనూ టాప్–40లో నిలిచిన ఆటగాళ్లకు ప్రైజ్‌మనీ లభిస్తుంది. చాంపియన్‌గా 90 వేల డాలర్లు (రూ. 76 లక్షలు), రెండో స్థానంలో నిలిచిన వారికి 70 వేల డాలర్లు (రూ. 59 లక్షలు), మూడో స్థానం పొందిన ఆటగాడికి 42 వేల డాలర్లు (రూ. 35 లక్షలు) అందజేస్తారు. ర్యాపిడ్ ఫార్మాట్ మహిళల విభాగంలో టాప్–20లో నిలిచిన వారందరికీ ప్రైజ్‌మనీ దక్కుతుంది. విజేతకు 60 వేల డాలర్లు (రూ. 51 లక్షలు), రెండో స్థానంలో నిలిచిన క్రీడాకారిణికి 40 వేల డాలర్లు (రూ. 34 లక్షలు), మూడో స్థానంలో నిలిచిన ప్లేయర్‌కు 28 వేల డాలర్లు (రూ. 23 లక్షలు) లభిస్తాయి. బ్లిట్జ్ ఫార్మాట్ మహిళల విభాగంలోనూ టాప్–20లో నిలిచిన ప్లేయర్ల ఖాతాలో ప్రైజ్‌మనీ చేరుతుంది. చాంపియన్‌కు 60 వేల డాలర్లు (రూ. 51 లక్షలు), రెండో స్థానంలో నిలిచిన ప్లేయర్‌కు 40 వేల డాలర్లు (రూ. 34 లక్షలు), మూడో స్థానం పొందిన ప్లేయర్‌కు 20 వేల డాలర్లు (రూ. 17 లక్షలు) లభిస్తాయి.4 ప్రపంచ ర్యాపిడ్, బ్లిట్జ్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్, ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి కోనేరు హంపి సాధించిన పతకాలు. ర్యాపిడ్ ఫార్మాట్లో 2012లో కాంస్యం నెగ్గిన హంపి, 2019లో స్వర్ణ పతకాన్ని, 2023లో రజత పతకాన్ని సాధించింది. బ్లిట్జ్ ఫార్మాట్లో హంపి 2022లో రజతం సొంతం చేసుకుంది. -
వాళ్లతో కలిసి తిరుమల శ్రీవారి దర్శించుకున్న బిగ్‌బాస్ హారిక (ఫొటోలు)
-
Atchutapuram: ఒక్కరోజు ఆగినా బతికేది!
సాక్షి, కాకినాడ: సోదరుడికి రాఖీ కట్టి కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపిన హారిక మరొక రోజు కాకినాడలోనే ఉండి ఉంటే మృత్యువు ఒడికి ఆమె చేరి ఉండేది కాదు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలోని ఫార్మా కంపెనీ రియాక్టర్ పేలిన ఘటనలో మృతి చెందిన చర్లపల్లి హారిక (22) కథ ఎవరికైనా గుండెలు పిండేసే విధంగా ఉంటుంది.కడు పేదరికంలో పుట్టి చదువుల తల్లిగా ఎదిగి ఇడుపులపాయ త్రిబుల్ ఐటీలో కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి 8 నెలల క్రితం కెమికల్ ఇంజనీర్ గా ఫార్మా కంపెనీలో ఉద్యోగం పొందిన హారిక కు చిన్నప్పుడే తండ్రి చనిపోయారు. సోదరుడు కూడా చిన్నప్పుడే ఇల్లు వదిలి వెళ్ళిపోవడంతో తల్లి అన్నపూర్ణ, నానమ్మ సంరక్షణలో పెరిగింది.చక్కటి విద్యాభ్యాసంతో మెరిట్ విద్యార్థినిగా పేరు గడించింది. రాఖీ సందర్భంగా పెదనాన్న కుమారుడికి రాఖీ కట్టి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపింది , మరొక రోజు తమతో ఉండాలని వారు కోరినప్పటికీ సెలవు లేదని ఆమె విధులకు అదే రోజు చేరింది. కంపెనీ ల్యాబ్ కు చేరిన కొద్ది గంటల్లోనే రియాక్టర్ పేలిన ఘటనలో హారిక మృత్యువు ఒడికి చేరింది. భవన శిధిలాలలో చిక్కుకొని ఆమె మృతి చెందినట్లుగా తెలుస్తుంది. కుటుంబ సభ్యుల రోదన అందర్నీ కలిసి వేస్తుంది. -
ఎలాంటి పాత్రలు చేయడానికైనా రెడీ
⇒ వెబ్ సిరీస్, షార్ట్ ఫిల్మ్స్ నిర్మించిన నేను ఫీచర్ ఫిల్మ్ చేయాలనుకున్న టైమ్‌లో అంకిత్ ద్వారా ‘కమిటీ కుర్రోళ్ళు’ కథ నా వద్దకు వచ్చింది. ఈ కథ నాకు, మా నాన్నకి బాగా నచ్చింది. సిటీలో పుట్టి పెరిగిన నేను జాతర అనుభూతిని పొందలేదు. ఈ కథలో నాకు కళ్లకు కట్టినట్టుగా వంశీ చూపించాడు. అందుకే ఈ కథతో ఎలాగైనా సినిమా నిర్మించాలని ఫిక్స్ అయి, తీశాను. పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే జాతర చుట్టూ ఈ కథను రాశాడు వంశీ. మూడు తరాలను చూపించేలా ఈ కథ ఉంటుంది. నాకు నటించడమే ఇష్టం. నిర్మాత కావాలని ఎప్పుడూ అనుకోలేదు. ‘ముద్దపప్పు ఆవకాయ్’ టైమ్ నుంచి అలా జరిగిపోయిందంతే. ⇒ ప్రతిభ ఒక్కటే కాదు... క్రమశిక్షణ ఉంటేనే ఇండస్ట్రీలో ఎదుగుతామని చిరంజీవిగారు చెబుతుంటారు. ఆ క్రమశిక్షణ వంశీలో చూశాను. ఈ చిత్రంలోని పదకొండు మంది అబ్బాయిల పాత్రల్లో నన్ను నేను ఊహించుకున్నాను. ప్రతి ప్రేక్షకుడు ఏదో ఒక క్యారెక్టర్‌తో ప్రయాణం చేస్తాడు. ⇒ నా గురించి బయటివారు చేసే విమర్శలు, పొగడ్తల్ని పట్టించుకోను. నా గురించి నిజాయతీగా ఉన్నది ఉన్నట్లు (పొగడ్త అయినా, విమర్శ అయినా) చెప్పేది మా అమ్మానాన్న (పద్మజ, నాగబాబు), అన్నయ్యే (వరుణ్ తేజ్). ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమాని మా అన్నయ్య, వదిన (లావణ్య త్రిపాఠి) చూశారు.. వాళ్లకి బాగా నచ్చింది. ప్రస్తుతం ఓ తమిళ చిత్రంలో నటిస్తున్నాను. అలాగే తెలుగులో ఓ వెబ్ సిరీస్ చేశాను. ‘‘మంచి కథలకే తొలిప్రాధాన్యం ఇస్తా. కథ బాగుండి నా పాత్రకిప్రాధాన్యం ఉంటే మిగతా అంశాలను పట్టించుకోను. చిన్న పాత్ర, చిన్న హీరో అని కూడా ఆలోచించను. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చాననే ఆలోచన వల్లో.. వేరే ఏదైనా కారణమేమో తెలియదు కానీ తెలుగు దర్శకులు ఎక్కువగా నన్ను సంప్రదించడం లేదు. అయితే నాకు సౌకర్యంగా అనిపిస్తే ఎలాంటి పాత్రలు చేయడానికైనా రెడీ’’ అని నటి, నిర్మాత నిహారిక కొణిదెల అన్నారు. నూతన నటీనటులతో యదు వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. నిహారిక కొణిదెల సమర్పణలో శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ నిర్మించిన ఈ సినిమా నేడు రిలీజ్ అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో వంశీ నందిపాటి రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా నిహారిక కొణిదెల చెప్పిన విశేషాలు. -
Gachibowli: అక్కాతమ్ముడి అదృశ్యం.. మా కోసం వెతికితే..
గచ్చిబౌలి: ఇంట్లో చెప్పాపెట్టకుండా అక్కాతమ్ముడు అదృశ్యమైన ఘటన గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ ఆంజనేయులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కొండాపూర్ మసీదుబండలోని ప్రభుపాదకాలనీలో నివాసముండే అడ్డాల నరేష్ డ్రైవర్. 2022 ఫిబ్రవరి 10వ తేదీన తన మేనకోడలైన హారిక(20)ను వివాహం చేసుకున్నాడు. ఇంట్లో హారికతో పాటు ఆమె తమ్ముడు ఫణీంద్ర(19) కూడా ఉంటున్నాడు. గత ఫిబ్రవరి 20వ తేదీన హారిక, ఫణీంద్ర ఇద్దరూ ఇంట్లో చెప్పకుండానే బయటకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. తమ కోసం వెతికితే చనిపోతామని హారిక లేఖ రాసి ఇంట్లో పెట్టి వెళ్లిపోయింది. ఆమె భర్త నరేష్ కొంతకాలం వారి గురించి పలుచోట్ల వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. హారిక తల్లిని సంప్రదిస్తే తమ వద్దకు రాలేదని స్పష్టం చేసింది. కాగా ఐదు నెలల తర్వాత ఆలస్యంగా మంగళవారం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని గాలింపు చర్యలు చేపట్టారు. -
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెనాలి హారిక మృతి
వాషింగ్టన్: ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన వెటర్నరీ డాక్టర్ జెట్టి హారిక(25) అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. దీంతో, ఆమె స్వస్థలం గుంటూరు జిల్లాలో విషాదఛాయలు నెలకొన్నాయి. కుటుంబ సభ్యులు హారిక మృతదేహం కోసం భారత రాయబార కార్యాలయం వద్ద ఎదురుచూపులు చూస్తున్నారు.వివరాల ప్రకారం.. అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెనాలికి చెందిన వెటర్నరీ డాక్టర్ జెట్టి హారిక మృతి చెందింది. హారిక అమెరికాలోని ఓక్లహోమా స్టేట్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డి మరణించారు. కాగా, హారిక ఏడాదిన్నర క్రితం వెటర్నరీలో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లింది. ఇంతలోనే ఇలా మృతిచెందడంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.ఇక, ఆమె తల్లిదండ్రులు జెట్టి శ్రీనివాసరావు, నాగమణి. జెట్టి శ్రీనివాస్ దేవాదాయ శాఖ ఉద్యోగిగా పని చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమె మృతదేహాన్ని స్వస్థలానికి తెచ్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని కుటుంబసభ్యులు కోరుతున్నారు. -
లైవ్‌లో హారికా నారాయణ్ స్వరాలు..
ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ హారికా నారాయణ్ తన స్వరాలతో సంగీత ప్రియులను హోరెత్తించనున్నారు. నగరంలోని ఓడియం ప్రిజమ్ వేదికగా ఈ నెల 6న నిర్వహించనున్న లైవ్ మ్యూజిక్ కన్సర్ట్‌లో హారికా విభిన్న పాటలతో అలరించనుంది. హారిక ఆర్ఆర్ఆర్ సినిమాతో సింగర్‌గా మరింత క్రేజ్ సంపాదించుకున్న విషయం విధితమే. నగరంలో మొదటిసారి లైవ్ ఈవెంట్లో పాడనుండడంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ లైవ్ కన్సర్ట్‌లో సంగీత ప్రియులకు ఆÔ్చర్యాన్ని కలిగించే అంశాలు ఉన్నట్లు తెలిపారు.శనివారం రాత్రి 8 గంటల నుంచి ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఈ ఈవెంట్‌కు సంబంధించిన టిక్కెట్లు బుక్ మై షోలో అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు పేర్కొన్నారు. -
తెలంగాణ రాష్ట్ర గీతం పాడిన సింగర్ హారిక నారాయణ్ (ఫోటోలు)
-
తెలంగాణ రాష్ట్ర గీతాన్ని పాడిన యువ సింగర్స్
తెలంగాణ రాష్ట్ర గీతంగా 'జయ జయహే తెలంగాణ'కు ప్రభుత్వం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం చేసిన ఉద్యమ సమయంలో తెలంగాణ సమాజాన్ని ఉర్రూతలూగించిన ఈ గీతం ఆవిష్కరణకు అంతా సిద్ధమైంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ప్రజల ముందుకు రాష్ట్ర గీతాన్ని తీసుకురానున్నారు.తెలంగాణ చరిత్రలో నిలిచిపోయే ఈ గీతాన్ని పాడే ఛాన్స్ యువ సింగర్స్ హారిక నారాయణ్, రేవంత్‌లకు దక్కింది. ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ పురస్కార గ్రహీత ఎం.ఎం.కీరవాణి ఈ గీతానికి సంగీతం అందించారు. అందెశ్రీ రచించిన ఈ గీతం 2.30 నిమిషాల నిడివితో ఒకటి ఉంటే.. 13.30 నిమిషాల నిడివితో మరోకటి ఇలా రెండు వర్షన్లుగా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆలపించేందుకు వీలుగా పూర్తి గేయంలోని మూడు చరణాలతో రెండున్నర నిమిషాల నిడివితో సంక్షిప్త గీతంగా రూపొందించారు. రెండింటినీ కూడా తెలంగాణ రాష్ట్ర గీతంగానే పరిగణించనున్నారు.కొన్న గంటల్లో రాష్ట్ర ప్రజలు ఈ గీతాన్ని వినబోతున్నారు. అయితే, తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కీరవాణి బృందం కలిసింది. అందులో సింగర్స్ హారిక నారాయణ్, రేవంత్‌లు ఉన్నారు. ఇంతటి సంతోష సమయంలో సింగర్ హారిక ఇలా చెప్పుకొచ్చింది. 'తెలంగాణ నూతన రాష్ట్ర గీతాన్ని ఆలపించడం చరిత్రలో నిలిచిపోయే అంశం. ఈ గీతాన్ని రాబోయే తరాలకు గౌరవప్రదంగా నిలిచిపోయేలా చేయడం విశేషం. ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో నన్ను చేర్చుకున్నందుకు కీరవాణి సార్‌కి, అందె శ్రీ గారికి నా కృతజ్ఞతలు. ఈ విజయాన్ని సాధ్యం చేసినందుకు మా గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్‌కి నా ధన్యవాదాలు. ఈ గీతం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు, అంటే జూన్ 2, 2024న ఆవిష్కరించబడుతుంది. అని ఆమె తన సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. View this post on Instagram A post shared by Harika Narayan (@harika_narayan) -
Harika Narayan: ప్రియుడిని పెళ్లాడిన సింగర్ హారికా నారాయణ్ (ఫొటోలు)
-
ప్రియుడిని పరిచయం చేసిన సింగర్ హారికా నారాయణ్.. త్వరలో పెళ్లి
టాలీవుడ్ సింగర్ హారికా నారాయణ్ త్వరలో ప్రేమ వివాహం చేసుకోనున్నట్లు ఆమె అధికారికంగా తెలిపారు. వరుస స్టేజ్ షోలు, పలు సినిమాల్లో పాటలు పాడుతూ కెరీర్లో దూసుకెళ్తోన్న హారికా పలు పాటలతో లక్షలమందిని ఉత్సాహపరిచారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో పాటలు పాడిన హారిక అనుకుంటే హీరోయిన్గా కూడా రాణించవచ్చు.. ఎందుకంటే హీరోయిన్లను మించిన అందం ఆమె సొంతం. తాజాగా హారికా నారాయణ్ తన స్నేహితుడు అయిన పృధ్వినాథ్ వెంపటితో కలిసి ఏడు అడుగులు వేయనున్నట్లు ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆమె తెలిపారు. వారిద్దరి మధ్య స్నేహంగా ఏర్పిడిన పరిచయం ఆపై ప్రేమగా మారిందని తెలిపిన ఆమె ఏడు సంవత్సరాల పాటు సుదీర్ఘమైన ప్రయాణం సాగినట్లు చెప్పారు. వారిద్దరు ఉంగారులు మార్చుకుంటున్న ఫోటోను హారికా షేర్ చేశారు. కానీ తనకు కాబోయే భర్త గురించి ఆమె ఎలాంటి వివరాలు షేర్ చేయలేదు. తూర్పు గోదావారి జిల్లా రాజోలులో జన్మించిన హారిక.. తండ్రి ఎయిర్‌ఫోర్స్‌లో బాధ్యతలు నిర్వహిస్తుండడంతో ఆమె ఉత్తరాదిలో పెరిగారు. మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి జర్మనీ వెళ్లాలని ఆమె ఎన్నో కలలు కన్నది. కాకపోతే, అనుకోని విధంగా గాయనిగా మారి నేడు తన గాత్రంతో అందర్నీ మెప్పిస్తుంది. ప్రముఖ సంగీత విధ్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ కుటాంబానికి హారిక దగ్గరి బంధువు కావడం విశేషం. కర్ణాటక సంగీతంలో శిక్షణ తీసుకున్న ఆమెకు మొదట నిహారిక కథానాయికగా నటించిన 'సూర్యకాంతం'తో ప్లేబ్యాక్ సింగర్‌గా మారారు'. ఆ తర్వాత 'నా తప్పు ఏమున్నదబ్బా (బ్లాక్ రోజ్)' సాంగ్‌తో యూత్‌కు కనెక్ట్ అయ్యారు. విభిన్నమైన వాయిస్‌తో ఎంతోమంది సినీ ప్రముఖుల్ని, సంగీత ప్రియుల్ని మెప్పించిన హారిక.. 90 సెకన్లలో తొమ్మిది మంది ఇంటర్నేషనల్ సింగర్స్‌ని అనుకరిస్తూ ఆమె చేసిన ఆల్బమ్ ప్రపంచవ్యాప్తంగా అందర్నీ ఆకర్షించింది. హారికకు హీరో మహేశ్‌బాబు అంటే మాటల్లో చెప్పలేనంత అభిమానం. ఆయన్ను దగ్గర నుంచి చూడొచ్చనే 'బ్రహ్మోత్సవం'లో నటించినట్లు గతంలో ఆమె తెలిపారు. తన అభిమాన హీరో సినిమా అయిన 'సర్కారువారి పాట'లో టైటిల్ ట్రాక్ పాడి దుమ్మురేపారు. View this post on Instagram A post shared by Harika Narayan (@harika_narayan) -
అర్జున్ ఆరో స్థానంలో... హారిక ఏడో స్థానంలో
సమర్కండ్ (ఉజ్బెకిస్తాన్): ప్రపంచ బ్లిట్జ్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారులు విశేషంగా రాణించినా పతకాలు మాత్రం సాధించలేకపోయారు. శనివారం ముగిసిన ఈ మెగా ఈవెంట్లో ఓపెన్ విభాగంలో భారత్ నుంచి తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ అత్యుత్తమంగా ఆరో స్థానాన్ని సాధించాడు. నిర్ణీత 21 రౌండ్ల తర్వాత అర్జున్ 14 పాయింట్లతో మరో ముగ్గురితో (నెపోమ్నిషి, లెవాన్ అరోనియన్, డెనిస్ లాజావిక్) కలిసి ఉమ్మడిగా ఐదో స్థానంలో నిలిచాడు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించగా నెపోమ్నిషికి ఐదో ర్యాంక్, అర్జున్‌కు ఆరో ర్యాంక్, అరోనియన్‌కు ఏడో ర్యాంక్, డెనిస్‌కు ఎనిమిదో ర్యాంక్‌లు ఖరారయ్యాయి. భారత్‌కే చెందిన ఇతర గ్రాండ్‌మాస్టర్లు అరవింద్ చిదంబరం 14వ ర్యాంక్‌లో, ప్రజ్ఞానంద 28వ ర్యాంక్‌లో, నారాయణన్ 35వ ర్యాంక్‌లో, గుకేశ్ 38వ ర్యాంక్‌లో నిహాల్ సరీన్ 43వ ర్యాంక్‌లో నిలిచారు. మహిళల విభాగంలో భారత్ నుంచి ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక అత్యుత్తమ ప్రదర్శన చేసింది. నిర్ణీత 17 రౌండ్ల తర్వాత హారిక 11 పాయింట్లతో ఏడో ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. హారికతోపాటు మరో ఎనిమిది మంది క్రీడాకారిణులు కూడా 11 పాయింట్లు స్కోరు చేశారు. మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించగా హారికకు ఏడో ర్యాంక్ దక్కింది. భారత్‌కే చెందిన దివ్య దేశ్‌ముఖ్ 13వ ర్యాంక్‌లో, కోనేరు హంపి 17వ ర్యాంక్‌లో, సాహితి వర్షిణి 27వ ర్యాంక్‌లో, వైశాలి 36వ ర్యాంక్‌లో, ప్రియాంక నూతక్కి 46వ ర్యాంక్‌లో నిలిచారు. -
Dethadi Harika House Warming Pics: ఘనంగా దేత్తడి హారిక నూతన గృహప్రవేశం (ఫోటోలు)
-
అర్జున్ విజయం హారిక ‘డ్రా’
బకూ (అజర్బైజాన్): ప్రపంచ కప్ చెస్ టోర్నమెంట్లో తెలంగాణ ఆటగాడు ఇరిగేశి అర్జున్ కీలక విజయాన్ని అందుకున్నాడు. ఓపెన్ విభాగం ప్రిక్వార్టర్ ఫైనల్ తొలి రౌండ్లో నల్ల పావులతో ఆడి అర్జున్ గెలుపు నమోదు చేయడం విశేషం. ఈ గేమ్‌లో అర్జున్ 53 ఎత్తుల్లో స్వీడన్ గ్రాండ్‌మాస్టర్ నిల్స్ గ్రాండెలియస్ను ఓడించాడు. నేడు జరిగే రెండో రౌండ్‌ను అతను ‘డ్రా’గా ముగించినా సరే క్వార్టర్ ఫైనల్ చేరతాడు. మహిళల విభాగం క్వార్టర్ ఫైనల్లో ద్రోణవల్లి హారిక తొలి రౌండ్‌ను నల్లపావులతో ‘డ్రా’ చేసుకుంది. అలెగ్జాండ్రా గొర్యాకినా (రష్యా)తో జరిగిన ఈ పోరును 48 ఎత్తులో హారిక ముగించింది. ఓపెన్ విభాగం ప్రిక్వార్టర్ ఫైనల్ రౌండ్ తొలి గేమ్‌లో నల్లపావులతో ఆడి డి.గుకేశ్ కూడా విజయాన్ని అందుకున్నాడు. గుకేశ్ 38 ఎత్తుల్లో వాంగ్ హావో (చైనా)పై గెలుపొందాడు. ఇతర ప్రిక్వార్టర్ మ్యాచ్‌లలో ఫెరెన్స్ బెర్క్స్ (హంగేరీ)– ప్రజ్ఞానంద (45 ఎత్తుల్లో)...ఇయాన్ నెపొమినియాచి (రష్యా)– విదిత్ గుజరాతీ మధ్య (31 ఎత్తుల్లో) జరిగిన తొలి గేమ్‌లు ‘డ్రా’గా ముగిశాయి. -
మంచిర్యాల: మమ్మీ.. నా రోగం ఎంతకీ తగ్గదేమోనే!
మంచిర్యాల రూరల్(హాజీపూర్): మాయదారి జబ్బు.. నిండు నూరేళ్లు బతకాల్సిన ఒక అమ్మాయి జీవితాన్ని బలిగొంది. అదేం జబ్బో అర్థంకానీ తల్లిదండ్రులు.. ఎంతకీ తగ్గదేమో అనే దిగులుతో.. ఆ కుటుంబం వేదనకు గురైంది. మానసికంగా కుంగిపోయిన ఆ టీనేజర్ చివరకు ప్రాణం తీసుకుంది. హాజీపూర్ మండలంలోని దొనబండలో డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా విషాదం నింపింది. ఎస్సై ఉదయ్‌కిరణ్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రచన, సత్తయ్య దంపతుల కుమార్తె కోట హారిక (19). మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ కళాశాలలో హారిక డిగ్రీ తృతీయ సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో మూడేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. తల్లిదండ్రులు పలు ఆస్పత్రులు తిరిగినా.. చికిత్స కోసం ఎంత ఖర్చు చేసినా ఆరోగ్యం మెరుగు పడకపోవడంతో జీవితంపై విరక్తి చెందింది. బుధవారం ఇంట్లో ఎవరూలేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. హారిక బాబాయ్ కోట స్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఘటనపై దర్యాప్తు చేపడుతున్నట్లు వెల్లడించారు. మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. సమస్యలొస్తే ధైర్యంగా ఎదుర్కొని పోరాడాలి. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
అయ్యో.. హారిక..! కన్న తండ్రి భుజాలపై మోసుకెళ్లినా..
తాండూరు రూరల్ (వికారాబాద్): పదకొండేళ్ల బాలికకు నూరేళ్లు నిండాయి. జ్వరంతో ఆరోగ్యం విషమించడం.. ఊరు చుట్టూ వాగు ఉండి ఆసుపత్రికి తీసుకెళ్లడం ఆలస్యం కావడంతో బాలిక మృతిచెందింది. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం బొంకూరుకు చెందిన హరిజన్ బాలప్ప, అమృతమ్మల కుమార్తె హారిక (11) ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి చదువుతోంది. ఇటీవల స్కూల్‌కు వెళ్లి పుస్తకాలు తెచ్చుకుం ది. పాఠశాలలు తెరుచుకోవడంతో స్నేహితులతో కలిసి వెళ్లాలనుకుంది. అయితే వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో బొంకూరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో గ్రామస్తులు బయటకు వెళ్లలేని పరిస్థితి. (చదవండి: బంజారాహిల్స్: ఓయో రూమ్స్‌లో అవసరమైన వారికి..) రెండు రోజుల క్రితం జ్వరం.. హారికకు 2రోజుల క్రితం తీవ్రజ్వరం వచ్చింది. వాగు ఉధృతి కారణంగా ఆస్పత్రికి తీసుకెళ్లలేని పరిస్థితి. శుక్రవారం సాయంత్రం జ్వరం తీవ్రం కావడంతో హారికను భుజాలపై ఎత్తుకుని బొంకూర్ నుంచి పొలాల వెంట ఖాంజాపూర్ వెళ్లారు. అక్కడి నుంచి తాండూరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌లోని నిలోఫర్‌కు రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం ఉదయం బాలిక కన్నుమూసింది. బొంకూర్ నుంచి తాండూరుకు వెళ్లాలంటే బొంకూర్ వాగుపై వంతెన నిర్మించాలి. తమ సమస్యను అరవై ఏళ్లుగా ఎవరూ పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వంతెన నిర్మించి ఉంటే హారికను జ్వరం వచ్చిన రోజే ఆస్పత్రికి తీసుకెళ్లేవారమని తల్లిదండ్రులు రోధిస్తూ పేర్కొన్నారు. (చదవండి: ‘బతికున్న రోగి చనిపోయాడని చెప్పిన సిబ్బంది’) -
హారిక మృతి కేసు: విచారణ.. రూ.25 లక్షలు డిమాండ్
వంగర: శ్రీకాకుళం జిల్లా వంగర మండల పరిధి నీలయ్యవలస సమీపంలో బేతిన్ గ్రానైట్ క్వారీ ప్రదేశాన్ని పాలకొండ ఆర్డీవో టి.వి.ఎస్.జి.కుమార్, డీఎస్పీ మల్లంపాటి శ్రావణి గురువారం పరిశీలించారు. ఈ నెల 1వ తేదీన దుస్తులు ఉతికేందుకు తల్లి తొగరాపు సంతోషికుమారితో వెళ్లిన కుమార్తె హారిక క్వారీ గొయ్యిలో పడి మృతిచెందిన విషయం పాఠకులకు విదితమే. ఈ ఘటనపై సమగ్ర సమాచారం సేకరణకు క్వారీ ప్రదేశాన్ని అధికారులు పరిశీలించారు. క్వారీ లీజు సమయం, నిర్వహణ కాలం, ఎప్పటి నుంచి మూసివేశారు, హెచ్చరిక బోర్డులు, రక్షణ కంచెలు వంటివి తనిఖీ చేశారు. క్వారీకి సంబంధించి సమగ్ర సమాచారంపై నివేదిక ఇవ్వాలని తహసీల్దార్ డి.ఐజాక్‌ను ఆర్డీవో ఆదేశించారు. ఘటనకు సంబంధించిన అంశాలపై డీఎస్పీ ఆరా తీశారు. రాజాం రూరల్ సీఐ డి.నవీన్‌కుమార్, ఎస్సై సంచాన చిరంజీవి, రెవెన్యూ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. (చదవండి: ‘నా కలల హారికా.. లేమ్మా..!’ కన్నీరు పెట్టిస్తున్న తండ్రి రోదన) రూ.25 లక్షలు చెల్లించాలి.. హారిక కుటుంబానికి క్వారీ యాజమాన్యం రూ.25 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ కరణం సుదర్శనరావుతోపాటు సర్పంచ్ ప్రతినిధి చింతగుంట రామారావు, పలు పార్టీలకు చెందిన నాయకులు బెజ్జిపురం రవి, ఉత్తరావెల్లి మోహనరావు, మజ్జి గణపతిరావు డిమాండ్ చేశారు. హారిక కుటుంబ సభ్యులను క్వారీ యాజమాన్య ప్రతినిధులు కనీసం ఓదార్చలేదని, ఇప్పటివరకు పరామర్శించలేదని మండిపడ్డారు. క్వారీ గుంత వద్ద హారిక మృతదేహం వద్ద రోదిస్తున్న తండ్రి, కుటుంబసభ్యులు (ఫైల్) -
ప్రత్యేకత ఏంటో చెప్పిన చిరు.. ధన్యవాదాలు తెలిపిన హారిక
హనుమంతుడు మనవాడే అంటూ భార్య సురేఖతో కలిసి ఆంజనేయస్వామి విగ్రహం దగ్గర దిగిన ఫోటోని అభిమానులతో పంచుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్న హారిక పెళ్లికూతురిగా ముస్తాబైన నిత్యామీనన్, చూస్తే వావ్ అనాల్సిందే మెంటల్ హెల్త్‌పై ఫోకస్ పెట్టండి అంటున్న రష్మీ గౌతమ్ చంద్రుడి సోదరిని అంటూ నటి శోభిత దూళిపాళ్ల ఒక బ్లాక్ అండ్ వైట్ ఫొటో షేర్ చేసింది. View this post on Instagram A post shared by Hebah Patel (@ihebahp) View this post on Instagram A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) View this post on Instagram A post shared by Ritu Varma (@rituvarma) View this post on Instagram A post shared by Himaja💫 (@itshimaja) View this post on Instagram A post shared by D E E P T H I R E D D Y 🇮🇳 (@deepthi_sunaina) View this post on Instagram A post shared by Varalaxmi Sarathkumar (@varusarathkumar) View this post on Instagram A post shared by Alekhya Harika (@alekhyaharika_) View this post on Instagram A post shared by Nikita Sharma (@nikitasharma_official) View this post on Instagram A post shared by Suma K (@kanakalasuma) View this post on Instagram A post shared by disha patani (paatni) (@dishapatani) View this post on Instagram A post shared by Payal Rajput (@rajputpaayal) View this post on Instagram A post shared by M Monal Gajjar (@monal_gajjar) View this post on Instagram A post shared by Tejaswi Madivada (@tejaswimadivada) View this post on Instagram A post shared by RGV (@rgvzoomin) View this post on Instagram A post shared by Nithya Menen (@nithyamenen) View this post on Instagram A post shared by Regina Cassandra (@reginaacassandraa) View this post on Instagram A post shared by Poonam kaur (@puunamkhaur) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Sobhita Dhulipala (@sobhitad) -
సోషల్ హల్చల్: ఈషా కవ్వింపు..చెమటలు పట్టిస్తున్న జాన్వీ
♦ ఐదేళ్ల క్రితం సోషల్ మీడియాలో అంత యాక్టివ్‌గా లేను.. అప్పుడు ఈ పిక్ షేర్ చేశానో లేదో గుర్తులేదని ఓ ఫోటోని షేర్ చేసిన అదా శర్మ ♦ బ్లాక్ సారీ ఫోటో షేర్ చేసి చూపులతో చంపేస్తున్న ఈషా రెబ్బా ♦ బ్యాక్‌లెస్ టాప్.. టైట్ పాయింట్ ధరించి కిల్లింగ్ లుక్స్‌తో చెమటలు పట్టిస్తున్న జాన్వీ ♦ సోఫాలో వాలిపోయి లుక్స్‌తో పిచ్చెక్కిస్తున్న శ్రీముఖి ♦ హాఫ్ సారీలో అదరగొడుతోన్న బిగ్‌బాస్ బ్యూటీ హారిక View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Payal Rajput (@rajputpaayal) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by M Monal Gajjar (@monal_gajjar) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Hebah Patel (@ihebahp) View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Alekhya Harika (@alekhyaharika_) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) -
చిరంజీవిని కలిసిన లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ నటుడు
-
‘బిగ్‌బాస్ 4 రికార్డ్ చేసి నా పిల్లలకు చూపిస్తా’
ఇద్దరమ్మాయిలు.. అలేఖ్య హారిక, అరియానా గ్లోరి. ఇద్దరూ బిగ్‌బాస్ సీజన్ 4లో ఫైనల్స్‌కు చేరుకున్నారు. అందరి దృష్టిని తమ వైపు నిలుపుకున్నారు. ఇద్దరూ జీవితంలోని ఒడిదొడుకులను చిన్ననాటి నుంచీ చూస్తూ పెరిగారు. జీవితం నేర్పిన పాఠాలతోనే తమకు తాము ధైర్యం చెప్పుకున్నారు. గెలుపు ఓటముల ప్రసక్తి లేకుండా ముందుకు సాగాలనుకున్నారు. నవతరం అమ్మాయిలకు ప్రతీకగా నిలుస్తున్నారు. ►‘దేత్తడి’ అంటూ యూట్యూబ్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది అలేఖ్య హారిక. డిగ్రీ చదువుతూ పాకెట్ మనీ కోసం పార్ట్‌టైమ్ జాబ్ చేసింది. జాబ్ పోతే ఎలా అనే ఆలోచనతో కొత్త ఆలోచనలకి పదును పెట్టింది. ►యాంకరింగ్ ద్వారా టీవీ ప్రేక్షకులను ఆకట్టుకుంది అరియానా గ్లోరీ. కాలేజీ రోజుల నుంచే యాంకరింగ్ అంటే ఇష్టం పెంచుకుని తనకు అభిరుచి ఉన్న రంగం వైపే అడుగులు వేసింది. కొద్ది రోజుల్లోనే కుటుంబం మెప్పుతో పాటు ప్రేక్షకుల అభిమానాన్నీ పొందుతోంది. ఇంటిని వదిలి 105 రోజులు వేరే చోట ఉన్నారు. అంత ధైర్యం ఎలా వచ్చింది? హారిక: ఎలా వచ్చిందో నాకూ తెలియదు. ముందు మా అమ్మ, అన్న కోసం ఒప్పుకున్నాను. మా ఇంటి నుంచి బిగ్‌బాస్ ఇంటిలోకి అడుగుపెట్టాక అక్కడంతా వేరే ప్రపంచం. వెళ్లకముందు కొంత భయం అనిపించింది. వెళ్లాక, అక్కడున్నన్ని రోజులు చాలా ఎంజాయ్ చేశాను. ఒక నిర్ణయానికి వచ్చామంటే ధైర్యం ఆటోమేటిగ్గా వచ్చేస్తుంది. ఎప్పుడైనా డౌన్ అయిపోతున్నానా అనిపించినప్పుడు కళ్లు మూసుకొని రెండు నిమిషాలు కూర్చొనేదాన్ని. ‘మా అమ్మ, అన్నయ్య కళ్లముందు కనిపించేవారు. హారికా.. డౌన్ అయిపోవద్దు. ఏదైనా నీకు అండగా కుటుంబం ఉంది. ఇది కేవలం ఒక గేమ్. లాక్డౌన్ టైమ్‌లో నీకు వచ్చిన ఒక గొప్ప అవకాశం ఇది. దీనిని బాగా ఉపయోగించుకో..’ అని నాకు నేను చెప్పుకునేదాన్ని. మా అమ్మ సమస్యలను ఎదుర్కొన్న విధానం వల్ల కూడా నాకు ధైర్యం వచ్చి ఉంటుంది. అరియానా: చిన్నప్పటి నుంచీ నేనూ, చెల్లి ఏ సమస్య అయినా ఫేస్ చేసేవాళ్లం. మా మమ్మీ జాబ్ చేసేది. తను వెళ్లిపోయాక మేమిద్దరమే ఇంట్లో ఉండేవాళ్లం. తనకూ క్లాస్ ఉంటే నేనొక్కదాన్నే ఇంట్లో ఉండేదాన్ని. నేను బయటకు వెళితే చెల్లి కూడా అంతే. అలా ఇండిపెండెంట్‌గా ఉండటం మాకు ఎప్పుడో అలవాటైపోయింది. హౌజ్‌లో ఉన్నప్పుడు ఒకసారి 104 జ్వరం వచ్చింది. తట్టుకోలేక ఏడ్చేశాను. అక్కడ అందరూ నన్ను బాగా చూసుకున్నారు. ఎంతో ధైర్యం చెప్పారు. బిగ్‌బాస్‌కి కూడా చెప్పాను. నాకు ఒంట్లో బాగోలేదు, ఇంటికి పంపించేస్తే మా ఇంటి ఫుడ్ తిని, త్వరగా కోలుకుంటాను అని. కానీ, బిగ్‌బాస్ ‘స్పెషల్ కేర్ తీసుకుంటామ’ని చెప్పారు. అవినాష్ నన్ను బాగా చూసుకున్నారు. ఆ వారం రోజులు మాత్రం కొంచెం లోన్లీగా అనిపించింది. బిగ్‌బాస్ హౌస్‌లో మీ ఎక్స్‌పీరియెన్స్ ఎలా ఉంది? హారిక: బయట రంగులరాట్నంలో తిరిగితే ఎంత సంబరంగా ఉంటుందో బిగ్‌బాస్ హౌజ్‌లో అలాంటి ఎక్స్‌పీరియెన్స్. భలేగుంది. ముందు భయపడ్డా... ఎలా ఉంటుందో ఏమో అని. కానీ, లోపలకు వెళ్లినప్పుడు చిల్... మస్తుంది. టాస్క్ మీదనే నా దృష్టి అంతా. ఇదో హ్యూమన్ ఎక్స్పరిమెంట్. టైమ్ కనుక్కోకముందు సూర్యుడిని చూసి పాతకాలం నాటి వాళ్లు ఎలా అంచనా వేసుకునేవారో మేం అలా చేసేవాళ్లం. ఫోన్లు లేవు, టీవీ లేదు, వాచీలు లేవు. అదో లోకం.. ఆ లోకంలో అడుగుపెట్టడం చాలా థ్రిల్లింగ్‌గా భావిస్తాను. అరియానా: బిగ్‌బాస్ సీజన్ 4 అంతా రికార్డ్ చేసి పెట్టి, భవిష్యత్తులో నా పిల్లలకు చూపిస్తాను. అన్ని రోజుల పాటు బిగ్‌బాస్ హౌజ్‌లో ఎప్పుడెలా ఉన్నానో నాకే చాలా వింతగా, ఆశ్చర్యంగా ఉంటోంది. కోపం వస్తే ఎలా ఉంటాను, బాధ వస్తే, సంతోషం కలిగితే ఎలా ఉంటాను.. అనేవన్నీ నాకు నేనే ఎక్స్‌పీరియెన్స్ చేశాను. బిగ్‌బాస్ తర్వాత మీకు మీరుగా మార్చుకోవాలనుకున్నవి? హారిక: సహజంగా నాకు కోపం ఎక్కువ. ప్రతి చిన్నదానికి బాగా చిరాకుపడేదాన్ని. ఎలాంటి పరిస్థితుల్లో కోపం చూపాలి... ఎలాంటి స్థితిలో మౌనంగా ఉండాలనే విషయం నేర్చుకున్నాను. అరియానా: ముక్కుమీది కోపం. చిన్న చిన్న వాటికి కోపం వస్తుంది. మా చెల్లితో అలాగే గొడవ పడేదాన్ని. అదే, పెద్ద పెద్ద విషయాల్లో అయితే మౌనంగా ఉండిపోతాను. బిగ్‌బాస్‌లో బాధ కలిగించినది... అత్యంత సంతోషాన్నిచ్చిన ఇన్సిడెంట్స్..? హారిక: అన్ని రోజులు కెప్టెన్సీకి వర్క్ చేసినా బెస్ట్ కెప్టెన్సీ రాలేదు. అది చాలా బాధ అనిపించింది. హాపీ మూమెంట్స్ అయితే లెక్కలేనన్ని. నాకెవ్వరితోనూ లొల్లి లేదు. పర్సనల్‌గా ఎవ్వరిమీదా కోపం లేదు. అంతా హ్యాపీ. అరియానా: మా ఫ్రెండ్స్ ఎలిమినేట్ అవడం బాధగా అనిపించింది. ఒకసారి గిఫ్ట్‌లు ఎవరికి ఇవ్వాలో నోట్ చేయమన్నారు. అందులో ఇద్దరికి రాయాలనుకున్నాను. కానీ, ఎవరికి రాయాలి..? అనేది సందేహం. దాంతో ఎవరికీ రాయలేదు. నాకూ ఎవరూ గిఫ్ట్ ఇవ్వలేదు. అయినా ఏమీ బాధనిపించలేదు. అప్పుడు బిగ్‌బాస్ నాకు గిఫ్ట్ ఇచ్చారు. ఆ కన్సర్న్కి ఆ రోజు కళ్లలో నీళ్లు వచ్చేశాయి ఆనందంతో. రూమర్స్ గురించి.. ఏమనుకుంటారు? హారిక: వాటి గురించి పట్టించుకుంటే మనం అస్సలు నడవను కూడా నడవలేం. అరియానా: ఏం వచ్చినా పట్టించుకోను. నాది నాకు తెలుసు. అందరికీ ఎక్స్ప్లనేషన్ ఇవ్వలేం. అందరూ ఫ్రెండ్స్‌గా ఉంటారు. కానీ, ఒక పర్సన్‌కే కనెక్ట్ అవుతాం. నా సిచ్యుయేషన్ ఏంటో నాకు తెలుసు కాబట్టి పట్టించుకోను. సింగిల్ పేరెంటింగ్‌లో పెరిగినట్లున్నారు కదా... మీకు ఎలా అనిపించింది? హారిక: పిల్లలకు కానీ, పేరెంట్స్ కానీ అన్ని సౌకర్యాలు ఉంటే బాధ్యత రాకపోవచ్చు. అలా లేకపోవడం వల్లే నాలో ఒక బాధ్యత పెరిగిందనుకుంటాను. అమ్మ బొటీక్ ద్వారా కష్టపడుతుంది... తనను డబ్బులు అడగకూడదు అనుకున్నాను. అమెజాన్‌లో పార్ట్‌టైమ్‌గా జాబ్‌లో చేరాను. ‘కానీ, ఈ రోజున్న జాబ్ రేపు ఉండకపోవచ్చు. ఇంకేదైనా చేయాలి..’ అనుకున్నాను. అప్పుడే ఫ్రెండ్ ద్వారా క్రియేటివ్ థాట్స్‌ని మీడియా ద్వారా చూపవచ్చు అని తెలిసింది. అప్పటికి ఫుల్‌టైమ్ జాబ్ చేస్తున్నా. వీకెండ్లో స్కిట్లు ప్లాన్ చేసుకున్నా. ఎలాగైనా ఫర్వాలేదు.. అడవిలో ఉన్నా, ఎడారిలో ఉన్నా బతికేయాలని డిసైడ్ అయ్యాను. అరియానా: లైఫ్‌లో భార్య, భర్త, పిల్లలు అనే బంధం ఉండాలి. దీనితో పాటు మనకు మనంగా లైఫ్‌లో ఏదో సాధించాలనే పట్టుదల కూడా ఉండాలనే విషయం నేర్చుకున్నాను. అమ్మాయిల్లో టు షేడ్స్ ఉండాలి. కోడి తన పిల్లలను కాపాడుకున్నట్టుగా కుటుంబాన్ని కాపాడుకోవాలి. కుటుంబాన్ని ఇన్వాల్వ్ చేయకుండా వ్యక్తిగతంగా ఏం సాధించాలనుకుంటామో ఆ దిశగా ప్రయత్నాలూ చేయాలి. కుటుంబం కుటుంబమే. నాకు నేనుగా ఎదగడమూ ముఖ్యమే. వర్క్‌లో అధిగమించిన సమస్యల గురించి.. హారిక: నాకు జీవితంలో ఎదిగే అవకాశం ఇచ్చింది ‘దేత్తడి.’ దేవుడు.. పాపా నువ్వు ఇందులో ఉంటే సెట్ అవుతావు. నీ కుటుంబానికి హెల్ప్ అవుతావు.. అని పెట్టాడేమో అనిపిస్తుంది. ముందు 7–8 వీడియోలు చేసేవరకు నాకు వాటిలో చాలా విషయాలు తెలియవు. తర్వాత అన్నీ నేనే చేయాల్సి వచ్చింది. ఆర్టిస్టులను పిక్ చేసుకోవడానికి టైమ్ పట్టేది. ఆర్టిస్టుల కోసం టిక్‌టాక్ వీడియోలు చూసి, ఇన్స్టాగ్రామ్ ద్వారా ఓ పదిమందిని కాంటాక్ట్ చేశాను. ఎడిటింగ్, డబ్బింగ్ అంటూ స్టూడియోలు వెతుక్కొని వెళ్లాను. రిలీజ్ అప్పుడు చాలా టెన్షన్ పడ్డాను. మంచి రిజల్ట్ వచ్చింది. ముందు దీనిలో ఓనమాలు తెలియవు. అందుకే, జాబ్ చేస్తూనే ఈ వర్క్ వీకెండ్లో చేసేదాన్ని. ఆఫీస్ షూట్.. షూట్.. ఆఫీస్ అన్నట్టుగా చేసేదాన్ని. అరియానా: కాలేజీ రోజుల నుంచి ఒకే ఆలోచన.. ఒక్కరోజు టీవీలో కనిపించినా పాప్యులర్ అయిపోతాను అనుకునేదాన్ని. చాలా ప్రయత్నాలు చేశాను. అమ్మ వద్దంది. ఇంట్లో ఎవ్వరికీ తెలియకుండా ఓ మెయిల్ క్రియేట్ చేసి, టీవీలకి బోలెడన్ని ఫొటోలు పంపించాను. తర్వాత అడిషన్స్‌కి వెళ్లాను. సెలక్ట్ అయ్యాను. ఐదేళ్లుగా యాంకరింగ్ చేస్తున్నాను. ఇంటర్వ్యూలు, ఈవెంట్స్ చేశాను. మొదట్లో ఏవీ తెలియవు. అన్నీ తెలుసుకుంటూ వెళ్లడమే. నేను యాంకర్ కావాలి అనుకున్నాను. నేర్చుకునే క్రమంలో ప్రతిచోటా ప్రతిరోజూ ఇష్యూస్ ఉంటాయి. వాటిని ఎదుర్కొని ధైర్యంగా నిలబడాలి. మీ ముందున్న లక్ష్యం? హారిక: గొప్ప నటిగా ఎదగాలి. క్రేజీ క్యారెక్టర్ చేయాలి. అది సినిమా లేదా వెబ్‌సీరీస్. సినిమా ఏది వస్తుందో తెలియదు. ఇంట్లో టీవీలో సినిమా చూస్తున్నప్పుడు అందులోని నటీనటుల యాక్టింగ్ గురించి మాట్లాడుతుంటాం. అలా నా యాక్టింగ్ గురించి కూడా చాలా మంది మెచ్చుకోవాలని ఉంది. అలా నేనూ చేయాలి అదే నా యాంబిషన్. అరియానా: మంచి యాంకర్ అవ్వాలి. క్రికెట్లో కామెంటరీ చేయాలి. ఒక పెద్ద నేషనల్ ఛానెల్లో ఇంటర్వ్యూస్ చేయాలి. ఈ అమ్మాయి ఎవరో భలే మాట్లాడింది.. అనుకోవాలి. ఆ రోజు రావడానికి టైమ్ పట్టచ్చు. కానీ, తప్పక వస్తుంది అనుకుంటాను. – నిర్మలారెడ్డి సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
ఈసారైనా దక్కుతుందా.. బిగ్‌బాస్ ఎవరు?
పోటీలో ముగ్గురు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు నిలిచారు. నాలుగో సీజన్ ఇది. మూడు సీజన్లనూ అబ్బాయిలే తన్నుకుపోయారు. ఈసారైనా అమ్మాయి విజేతగా నిలుస్తుందా? అరియానా, హారికలకు చాన్స్ ఉందా? 100 రోజుల పాటు ప్రేక్షకులను అలరించిన షో ఈరోజు ముగుస్తోంది. భావోద్వేగాల కేంద్రంగా సాగే ఈ షోలో అన్ని రకాల వొత్తిళ్లను అమ్మాయిలు దాటగలిగారు. టైటిల్ చేజిక్కించుకోగలరో లేదో చూద్దాం. ఒక అంచనా. సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా నిర్వహించే హిందీ బిగ్‌బాస్‌లో ఇప్పుడు 14వ సీజన్ నడుస్తోంది. పూర్తయిన 13 సీజన్లలో ఐదు మంది మహిళా విజేతలు ఉన్నారు. పురుషులకే ఎక్కువగా ఓటింగ్ జరిగే క్రేజ్ ఉన్నచోట ఒకరకంగా పెద్ద నంబర్. హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లలో మహిళలే ఉత్తమ మానవ ప్రవర్తనను ప్రదర్శించారని దీనిని బట్టి రుజువైంది. ఎందుకంటే బిగ్‌బాస్ షో వ్యక్తుల బలాబలాలు, శక్తి సామర్థ్యాలను కాక మానవ ప్రవర్తనలను ప్రేక్షకుల ముందు పెట్టి ఎవర్ని ఎన్నుకుంటారో మీ ఇష్టం అని చెబుతుంది. మానవ ప్రవర్తనను బయటకు తేవడానికి బిగ్‌బాస్ హౌస్‌లో రకరకాల సందర్భాలను సృష్టిస్తారు. ఎత్తుకు ఎదగడానికి, పతనం కావడానికి కూడా సమాన అవకాశం ఉంటుంది. అలాంటి షోలో ఐదు మంది స్త్రీలు గెలిచి తాము మెరుగైన మానవులం అని చెప్పారు. కాని తెలుగులో కూడా అంతటి ప్రతిభావంతంగా రాణించినా పురుషులకు దీటుగా నిలిచినా స్త్రీలకు గత మూడు సీజన్లలో టైటిల్ దక్కలేదు. ఈసారైనా దక్కుతుందా... తెలియదు. మిస్సయిన శ్రీముఖి, గీతా మాధురి తెలుగు బిగ్‌బాస్ 1,2,3 సీజన్లలో మహిళా కంటెస్టెంట్లు గట్టి పోటీ ఇచ్చారు. సీజన్ 1లో నటి హరితేజ , నటి అర్చన చివరివరకూ నిలిచారు. సీజన్ 2లో గాయని గీతామాధురి రన్నర్ అప్‌గా నిలిచారు. నటుడు కౌశల్ ఆ సీజన్‌కు విన్నర్ అయినా గీతా మాధురి గెలుస్తుందని చాలామంది భావించారు. సీజన్ 3 లో శ్రీముఖి రన్నరప్‌గా నిలిచారు. రాహుల్ సిప్లిగంజ్ టైటిల్ గెలుచుకున్నారు. విజేత ఓటింగ్ ద్వారా నిర్ణయం అవుతారని నిర్వాహకులు చెబుతారు. కాని ఓటింగ్ సరళి పురుషుల ఫేవర్లో వెళుతోంది. స్త్రీలను విజేతలకు నిలబెట్టడానికి బయట సరైన బృందాలు పని చేయడం లేదనే భావన కూడా ఉంది. ఈసారి అరియానా, హారిక బిగ్‌బాస్ 4 సీజన్ కరోనాకు వెరవక అట్టహాసంగా సెప్టెంబర్ 6న మొదలైంది. మొత్తం 105 రోజుల ఈ షోలో చివరి రోజు ఇవాళ్టితో ముగియనుంది. ఈ సీజన్లో మొత్తం 20 మంది కంటెస్టెంట్లు పాల్గొన్నారు. వారిలో 10 మంది స్త్రీలు ఉన్నారు. సీజన్‌కు అట్రాక్షన్‌గా నిలుస్తుంది అనుకున్న గంగవ్వ ఆరోగ్య కారణాల రీత్యా నిష్క్రమించాల్సి వచ్చింది. ఫైనల్ వరకూ వెళుతుందనుకున్న లాస్య 77వ రోజున నిష్క్రమిస్తే గట్టి పోటీ ఇస్తూ వచ్చిన హీరోయిన్ మోనాల్ గజ్జర్ చివరి వారంలో ఎవిక్ట్ అయ్యింది. చివరి ఐదుమంది పోటీదారుల్లో టెలివిజన్ యాంకర్ అరియానా, యూ ట్యూబ్ స్టార్ హారికా మిగిలారు. అమ్మాయిలు గెలుస్తారా? ఓటింగ్ సరళిని, హౌస్‌లో అరియానా, హారికల గేమ్ తీరును, ప్రవర్తనను గమనించిన పరిశీలకులు చాలామంది ఈసారి బిగ్‌బాస్ టైటిల్ గెలిచేంత గట్టిగా వీరిరువురు లేరనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అరియానా ప్రవర్తన నిక్కచ్చిగా ఉండటం ఆమెకు మైనస్ అయ్యింది. ఒక దశలో హౌస్మేట్స్ అందరూ ఆమెను ఎలిమినేట్ చేయాలనే వరకూ వెళ్లారు. ఇక హారికా పట్ల అభ్యంతరాలు లేకున్నా ఆమె గట్టిగా ఒక అభిప్రాయాన్ని, ఒక సందర్భాన్ని, ఒక యాటిట్యూడ్‌ని చూపలేకపోయింది. మరోవైపు పురుష కంటెస్టెంట్లు అభిజిత్, సొహైల్, అఖిల్ తమ సొంత తీరుతో ఓట్లను నిలబెట్టుకున్నారు. 50 లక్షలు ప్రైజ్ బిగ్‌బాస్ 4 విజేతకు 50 లక్షల ప్రైజ్‌మనీ దక్కుతుంది. ఇప్పుడు పోటీలో నిలుచున్న ఐదుగురూ మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి అభ్యర్థులే. ఈ మొత్తం చాలా పెద్దది తమ దృష్టిలో అని వారే చెప్పుకున్నారు. అందరికీ సొంతింటి కలే లక్ష్యంగా ఉంది. ఈ 50 లక్షల కోసం బిగ్‌బాస్‌లో గత 100 రోజులుగా అభ్యర్థులు అనేక అగ్నిపరీక్షలకు లోనయ్యారు. హారికా, అరియానాలు కూడా ఎన్నోసార్లు గట్టి దెబ్బలు తిన్నా తట్టుకుని నిలుచున్నారు. హారికాకు సొహైల్‌కు మధ్య పెద్ద పెద్ద యుద్ధాలే గెలిచాయి. అరియానా సొహైల్‌కు మధ్య కూడా యుద్ధాలే జరిగాయి. హారికా అభిజిత్ ఒక జట్టు కడితే సొహైల్– అఖిల్ ఒక జట్టుగా మారి అరియానాను ఒంటరిని చేశారు. అయితే బయట ప్రేక్షకులలో అరియానా మద్దతుదారులు గట్టిగానే ఉన్నారు. ఎవిక్ట్ అయ్యి వెళ్లే ముందు మోనల్ గజ్జర్ విజేత అయ్యే ఏ లక్షణమూ అరియానాలో లేదు అని చెప్పి వెళ్లింది. కాని ప్రేక్షకుల తీర్పు ఈసారి అమ్మాయిల వైపు మొగ్గితే ఇద్దరిలో ఒకరు గెలిచి మహిళా విజేతల ఖాతా తెరుస్తారు. నేడే ఫైనల్స్ నేడు మా టీవీలో ప్రసారమయ్యే ఫైనల్స్‌లో విజేత ప్రకటన వెలువడుతుంది. చీఫ్‌గెస్ట్‌గా చిరంజీవి వస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. గత సీజన్లో వెంకటేశ్ హాజరయ్యారు. అంతకు ముందు సీజన్ చిరంజీవి వచ్చారు. మళ్లీ ఆయనే రావచ్చు అంటున్నారు. ఏమైనా లాక్డౌన్ కాలంలో మొదలైన ఈ షో పెద్ద ఆటంకాలు లేకుండా చివరి అంకానికి చేరడం వెనుక టీమ్ కష్టం ఎంతో ఉంటుంది. వారికి మెచ్చుకోళ్లు చెప్పక తప్పదు. విజేత ప్రకటన కోసం ఎదురు చూద్దాం. – సాక్షి ఫ్యామిలీ -
ఆ అలవాటు మాత్రం పోలేదు: హారిక తల్లి
జ్యోతిని ‘స్టార్’ మదర్ అని గానీ.. ‘బిగ్’ మదర్ అని గానీ.. అనాలి! ఆమె కూతురు హారిక యూట్యూబ్ స్టార్. అందుకే ఆమె స్టార్ మదర్. హారిక ప్రస్తుతం బిగ్‌బాస్ కంటెస్టెంట్.అందుకే ఆమె బిగ్ మదర్. సింగిల్ మదర్‌గా అయితే మాత్రం.. జ్యోతిని బిగ్ స్టార్ మదర్ అనాలి! ధైర్యంగా నిలబడ్డారు. పిల్లల్ని తన సమాధానంగా పెంచారు. ‘‘నా కూతురు అని చెప్పుకోవడం కాదు గానీ ఎంత క్రియేటివ్‌గా ఆలోచిస్తుందో.. అంత హార్డ్ వర్క్ చేస్తుంది. ఇంటి పరిస్థితులను, నన్ను బాగా అర్ధం చేసుకుంటూ పెరిగింది. ఎవరైనా ఏ కొంచెం తనను ఇన్సల్ట్ చేసినా గెలిచి చూపాల్సిందే అని పట్టుపడుతుంది’’ అని కూతురు హారిక గురించి చెబుతూ మురిసిపోయారు జ్యోతి. ఆమె సింగిల్ మదర్. కూతురు అలేఖ్య హారిక, కొడుకు వంశీ కార్తీక్‌తో హైదరాబాద్‌లో ఉంటున్నారు. ప్రధానంగా సింగిల్ మదర్‌గా ఆమె ఎదుర్కొన్న ఆటుపోట్లు, పిల్లల పెంపకం గురించి ‘సాక్షి’ ఆమెతో ముచ్చటించింది. చదువు గురించే ఆలోచన ‘‘పిల్లలకు డబ్బు విలువ బాగా తెలుసు. అమ్మ కష్టపడుతుంది. మనం ఇంకా ఎక్కువ కష్టపెట్టకూడదు అనేది ఇద్దరూ చిన్నతనం నుంచీ అర్ధం చేసుకున్నారు. పిల్లలు చదివే స్కూల్లోనే టీచర్‌గా చేశాను. బ్యాంక్ ఉద్యోగిగా కొన్నాళ్లు పనిచేశాను. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేశాను. కుటుంబ పెద్ద ఇంటిని పట్టించుకోకపోతే ఎలాంటి అవస్థలు ఎదుర్కోవలసి వస్తుందో అన్నీ ఎదుర్కొన్నాను. తప్పనిసరై తొమ్మిదేళ్ల క్రితం ఓ రోజు పిల్లల్తో పాటు ఇంటి నుంచి బయటకు వచ్చేశాను. ఆ సమయంలో మొదటగా ఆలోచించింది వాళ్ల చదువులు, వాళ్ల ఫీజుల గురించే. గతమేదైనా అది పిల్లల చదువులపై ప్రభావం పడకూడదు అని ఆ రోజే గట్టిగా అనుకున్నాను. వేలెత్తి చూపినవారే..! ‘‘నా చేతిలో ఎం.ఏ సర్టిఫికెట్ తప్ప మరే ధైర్యమూ లేదు. ఎవరి సాయమూ లేదు. రెండు మూడేళ్లు చిన్నా చితకా ఉద్యోగాలు చేశాను. దగ్గర ఉన్న కొంత బంగారం కొన్ని రోజులు ఆదుకుంది. సింగిల్ మదర్‌గా సమాజంలో వివక్షను ఎదుర్కోవడం చాలా కష్టం. ఆ కష్టం అద్దె ఇంటిని వెతుక్కోవడంతో మొదలైంది. ఎవరో ఒకరి రికమెండేషన్ ఉంటే తప్ప ఇల్లు అద్దెకు ఇచ్చేవారు కాదు. పిల్లలు ఎదిగే సమయంలో వేరుపడి బయటికి రావడం అవసరమా అని అన్నవాళ్లూ ఉన్నారు. ఆ మాటలన్నీ పడుతూ కుమిలిపోతుంటే పిల్లలు డిస్టర్బ్ అవుతారని అనిపించింది. ఎంత కష్టమొచ్చినా పిల్లల కోసం నిలబడాలని బలంగా అనుకున్నాను. గతంలో చేసిన ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు బొటిక్ పెట్టుకోడానికి ఉపయోగపడింది. ఆరేళ్లుగా బొటిక్ నడుపుతున్నాను. మొదట్లో వేలెత్తి చూపినవారే.. ఇప్పుడు ‘మా వాళ్లు’ అని మాట్లాడుతుంటారు. సమాజం నన్ను అన్న మాటలన్నిటికీ నా పిల్లలు సరైన సమాధానం ఇచ్చారు అనుకుంటాను. నా ధైర్యమే వచ్చింది ‘‘ఈ పనే చేయాలి, ఇది చేయకూడదు.. అని నేనెప్పుడూ పిల్లలకు ఆంక్షలు పెట్టలేదు. వాళ్లు అడిగినవన్నీ ఇవ్వగలిగాను. ఏదైనా నా శక్తికి మించినది, అంతగా అవసరం లేదని అనుకున్నదీ అడిగినప్పుడు మాత్రం వాళ్లకు నచ్చచెబుతాను. లేదంటే, వాయిదా వేస్తాను. మెల్లగా వాళ్లే అర్ధం చేసుకుంటారు. స్నేహితుల ఎంపికలోనూ వాళ్లకు కండిషన్స్ పెట్టలేదు. వంశీకన్నా హారికకు స్నేహితులు ఎక్కువ. అందరితోనూ బాగుంటుంది. ఈ కాలం పిల్లలు చాలా బాలెన్సింగ్‌గా ఉంటున్నారు. తనూ అలాగే ఉంటుంది. నా బిడ్డలపై అపోహలు, అపనమ్మకాలు, భయాలు.. ఏవీ పెట్టుకోను. ఏ వర్క్ చేయాలన్నా ధైర్యంగా మొదలు పెట్టమంటాను. వాళ్లు కూడా నాలాంటి వాళ్లే. ఒకటి అనుకుంటే వెనుకంజ వేయరు. (నవ్వుతూ). హారిక సర్ప్రైజ్ హారిక బిబిఎ మొదటి సంవత్సరంలో ఉన్నప్పటి నుంచీ పార్ట్ టైమ్ జాబ్స్ చేస్తూ వచ్చింది. తనకు నెలకు ఏడు వేల రూపాయలు వచ్చేవి. అందులో రెండు వేలు తను పాకెట్‌మనీగా పెట్టుకొని ఐదు వేలు ఇంటికి ఇచ్చేది. ఆ రెండువేలను కూడా పొదుపు చేసి నా బర్త్‌డేకి ఏదో ఒక బహుమతి తెచ్చి నన్ను సర్ప్రైజ్ చేసేది. ఇప్పటికీ అదే అలవాటు ఉంది తనకు. నా కూతురే నాకు నటనలో ఓనమాలు నేర్పింది. నిజానికి తను కూడా ఎక్కడా యాక్టింగ్ క్లాస్‌కు వెళ్లింది లేదు. చిన్నప్పుడు కొంత వరకు సంగీతం నేర్చుకుంది. మోడ్రన్ డ్యాన్సులంటే తనకు బాగా ఇష్టం. ఆరేడు గంటలు విరామం లేకుండా డ్యాన్స్ చేయమన్నా చేస్తుంది. ఎక్కువ సమయం పిల్లలతో ఉంటుంటాను కాబట్టి ఇద్దరూ వాళ్ల వర్క్‌లో నన్నూ ఇన్వాల్వ్ చేస్తుంటారు. ఆ విధంగానే హారిక తను చేసే స్కిట్లలోకి నన్నూ తీసుకుంది. వంశీని కూడా. వంశీ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. హారిక క్రియేటివ్ సైడ్ ఎంచుకొని వెళుతోంది. ‘‘ఇంక వర్క్ చేయకమ్మా! నీకేం కావాలో చెప్పు.. రెస్ట్ తీసుకో’’ అని పిల్లలు అంటుంటారు. ‘‘నేను డిజైన్ చేసే దుస్తుల్లో నువ్వింకా మెరవాలి కదా! అప్పుడే రెస్ట్ ఎందుకు?’’ అని హరికతో అంటూ నవ్వేస్తాను. పిల్లల పెళ్లిళ్లు గురించి అప్పుడప్పుడు మాట్లాడుతుంటాను. తమను అర్ధం చేసుకున్నవాళ్లు, అందరం కలిసి ఉమ్మడి కుటుంబంగా కొనసాగడానికి ఇష్టపడేవారైతే నెక్ట్స్ స్టెప్ అంటుంటారు పిల్లలిద్దరూ. ఇద్దరూ వారు ఎంచుకున్న రంగంలో వృద్ధిలోకి రావాలన్నదే నేను కోరుకునేది’’ అని ముగించారు జ్యోతి. – నిర్మలారెడ్డి సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
బిగ్‌బాస్: షటప్ అంటూ అభిపై హారిక సీరియస్
బిగ్‌బాస్ అంటేనే వివాదాలు, కాంట్రవర్సీలు, ఒకరినొకరు అరుచుకోవడం. ఎంత ప్రేమగా ఉండాలని ట్రై చేసిన కంటెస్టెంట్స్ మధ్య చిచ్చు పెట్టడమే బిగ్‌బాస్ పని. అయితే ఈ చిచ్చులకు పునాది వేదేది మాత్రం ప్రతి సోమవారమే. అవును ఆ రోజు ప్రసారమయ్యే ఎపిసోడ్లో ఎలిమినేషన్ ప్రక్రియ ఉంటుంది. దీంతో ఆ రోజంతా హౌస్మేట్స్ మధ్య గొడవలు, ఏడుపులు, అలగడాలు ఉంటాయి. ఇక ఎప్పటిలాగే ఈ వారం కూడా ఎలిమినేషన్ ప్రక్రియలో హౌస్మేట్స్ మధ్య చిచ్చు పెట్టాడు బిగ్‌బాస్. ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా హౌస్‌మేట్స్‌ని జతలుగా విడదీసి, ఇద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో చెప్పి వారిపై రంగు నీళ్లు పోయాల్సిందిగా బిగ్‌బాస్ ఆదేశించారు. తాజాగా విడుదలైన ప్రోమోను బట్టి చూస్తే అభిజిత్-హారిక, అవినాష్-సోహైల్, మోనాల్-అఖిల్, అరియానా-మెహబూబ్, లాస్య-దివిలను జంటలుగా విడిపోయారు. ఇక కెప్టెన్ కారణంగా నోయల్, నాగార్జున ఇచ్చిన ఆఫర్‌తో రాజశేఖర్ మాస్టర్ ఈ నామినేషన్ ప్రక్రియకు దూరంగా ఉన్నారు. ఇక తాజా ప్రోమో చూస్తే.. అభిజిత్- హారిక మధ్య పెద్ద గొడవే జరిగినట్టు ఉంది. త్యాగాలు, సర్దుబాట్లు చేసుకునే వారం కాదు ఇది అంటూ హారిక అభికి హారిక సలహా ఇచ్చింది. అయితే ఎక్కువగా నేను నామినేట్ అయ్యానని, ఈ వారం తనను సేవ్ చేయాలని హారికను అభి కోరాడు. తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ హారిక మాత్రం మాఇద్దరిది అన్పేయిర్ అని, షటప్ అంటూ అభిపై సీరియస్ అయింది. ఇక అరియానా- మెహబూబ్, అవినాష్-సోహైల్ కూడా నేనే ఉంటా అంటే నేనే ఉంటా అంటూ గొడవకు దిగారు. మరి ఈ వారం ఎవరెవరిపై రంగుపడిందో తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే. -
ఒంటి మీద బట్టలు చింపుకున్న కుమార్ సాయి
-
బిగ్ బాస్ : అభిజిత్ మైండ్ గేమ్.. భోరుమన్న హారిక
బిగ్‌బాస్ హౌస్‌లో వినోదాత్మకంగా మొదలైన బీబీ హోటల్ టాస్క్ కాస్త సీరియస్‌గా మారింది. అతిథుల మెప్పు కోసం సిబ్బంది నానా కష్టాలు పడింది. ముఖ్యంగా అవినాష్ సీక్రెట్ టాస్క్‌తో హౌస్‌లో ప్రకంపనలు చెలరేగాయి. మోనాల్‌పై అఖిల్ సీరియస్ అయ్యాడు. అమ్మ రాజశేఖర్ మాస్టర్ స్వీమ్మింగ్ టాస్క్ విజయవంతంగా పూర్తి చేశాడు. ముఖ్యంగా అభిజిత్ మైండ్ గేమ్, హారిక ఏడుపు, మెహబూబ్‌పై అవినాష్ ఫైర్ లాంటి సన్నివేశాలు నేటి ఎపిసోడ్లో ఆసక్తికరంగా మారాయి. ఇంకా ఈ రోజు బిగ్ బాస్ హౌస్‌లో ఏమేం జరిగాయో డిటైల్డ్‌గా చూసేద్దాం.. పిన్ను పెట్టిన చిచ్చు తనకు మటన్ బిర్యానీ కావాలని సోహైల్ ఆర్డర్ ఇవ్వగా.. హోటల్ సిబ్బంది కష్టపడి వండింది. అయితే దాంట్లో పొరపాటున చిన్న వెంట్రుక వచ్చింది. ఇంకేముంది సోహైల్ రెచ్చిపోయాడు. వెంటనే సిబ్బంది అంతా వచ్చి క్షమాపణలు చెప్పింది. ఇక సోహైల్ తీరును అమ్మ రాజశేఖర్ తప్పుపట్టాడు. కష్టపడి వండితే.. గుర్తింపులేదని అసహనానికి గురయ్యాడు. ఇదిలా ఉంటే సీక్రెట్ టాస్క్‌లో భాగంగా అవినాష్ సోహైల్‌కి పెట్టిన పుడ్‌లో హెయిర్పిన్ను ను పెట్టాడు. అయితే ఆ పిన్ను హోటల్ సిబ్బందే పెట్టిందని సోహైల్ ఫైర్ అయ్యాడు. అయితే సోహైలే పిన్ను పెట్టి తమను బ్లేమ్ చేస్తున్నాడని హోటల్ సిబ్బంది అనుమానించింది. దీంతో సోహైల్ ఒట్టుపెట్టుకొని మరీ నేను పెట్టలేదని చెప్పాడు. దీంతో అయోమయానికి గురైన సిబ్బంది... పొరపాటు పడి ఉండవచ్చని సోహైల్‌కి క్షమాపణలు చెప్పారు. అలకెందుకని అఖిల్‌ని నిలదీసిన మోనాల్ నామినేషన్ ప్రక్రియ రోజు జరిగిన గొడవతో తనకు దూరంగా ఉంటున్న అఖిల్‌ను కూల్ చేసే ప్రయత్నం చేసింది మోనాల్. రిసెప్షన్లో ఉండి ఫోన్ మాట్లాడుతూ అఖిల్‌ని చూసి మెలికలు తిరుగుతూ..ఎందుకు మాట్లాడటం లేదని అని అఖిల్‌ని ప్రశ్నించింది. అయినప్పటికీ అఖిల్ స్పందించకపోవడంతో పరుగున వచ్చి అఖిల్‌ని వెనుక నుంచి వాటేసుకుంది. దూరంగా ఉండటానికి గల కారణమేంటని అడగ్గా.. తాను ఎవరితో మాట్లాడతలేనని అఖిల్ చెప్పాడు. ఇక టిప్ కావాలంటే తన బెడ్‌ను రెండు నిమిషాల్లో సర్ధాలని హారిక సూచించగా..నోయల్ ఆ పనిచేశాడు. దీంతో నోయల్‌కు 2500 టిప్పు దొరికింది. సొమ్మసిల్ల పడ్డ రాజశేఖర్ మాస్టర్ ఇక రిచ్మేన్లుగా ఉన్న మెహబూబ్, సోహైల్ అయితే హోటల్ సిబ్బందికి చుక్కలు చూపించారు. హోటల్ టీంలో ఉన్న రాజశేఖర్ మాస్టర్‌కు 100 సార్లు స్విమ్మింగ్ పూల్‌లో దూకాలని టాస్క్ ఇచ్చారు. ఆయాసం వచ్చినప్పటికీ మాస్టర్ స్విమ్మింగ్ పూల్‌లో దూకుతూ లేస్తూ ఒళ్లు హూనం చేసుకున్నాడు. టాస్క్‌ని విజయవంతంగా కంప్లీట్ చేసిన మాస్టర్.. స్విమ్మింగ్ పూల్ నుంచి బయటకు వచ్చి కిందపడిపోయాడు. రాజశేఖర్ మాస్టర్ హార్డ్‌వర్క్ చూసి 3000 రూపాయల టిప్ ఇచ్చాడు మెహబూబ్. ఇక అఖిల్‌కి 150 పుష్అప్లు చేయాలని టాస్క్ ఇచ్చారు గెస్ట్‌లు.. అయితే అఖిల్ అతి కష్టం మీద 75 మాత్రమే తీయగలిగాడు. ఆ తరువాత అభిజిత్‌తో 20 కేజీలు ఎత్తించి 59 పుష్ అప్లు తీయించారు. ఈ క్రమంలో అభిజిత్ కూడా కిందపడిపోయాడు. అయితే అభిజిత్ కష్టపడుతుంటే సుజాత తెగ ఫీల్ అయిపోయింది.. ఏడుస్తూ వీళ్లను చూస్తుంటే భయంగా ఉంది అంటూ బాధపడింది. లాస్య ఆమెను ఓదార్చింది. అభి.. టాస్క్‌ను కంప్లీట్ చేయనప్పటికీ.. సోహైల్ 1000 రూపాయల టిప్పు ఇచ్చాడు. ఒక్క మాట తేడా వచ్చినా.. పుచ్చెలు ఎగిరిపోతాయి : మెహబూబ్ తనకు సర్వీస్ సరిగా అందించడంలేదని పదే పదే చెప్పడంతో మెహబూబ్‌పై హోటల్ సిబ్బంది అసహనం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో మెహబూబ్ సీరియస్ అయ్యాడు. ఒక్క మాట తేడా వచ్చినా... పుచ్చు పగిలిపోతుంది అంటూ హోటల్ సిబ్బందికి వార్నింగ్ ఇచ్చాయి. దీంతో ఆగ్రహానికి లోనైనా అఖిల్.. మెహబూబ్‌పై విరుచుకుపడ్డాడు. రౌడీయిజం ఊర్లో చేస్కో.. అవినాష్ మెహబూబ్ అలాగే రెచ్చిపోతుండటంతో అవినాష్ రంగంలోకి.. రౌడీయిజం చూపించుకోవాలంటే ఊర్లో చూపించుకో.. ఇది బిగ్ బాస్ హౌస్.. ఇక్కడ చేసుకుంటే వేరేలా ఉంటుందంటూ గట్టి వార్నింగ్ ఇచ్చాడు. మధ్యలో ఇంటి సభ్యులు వచ్చి సముదాయించడంతో అక్కడితో గొడవ ఆగింది. తర్వాత మెహబూబ్ ఒక్కరికి సారీ చెబుతూ వచ్చాడు. ఇక అవినాష్‌కు సారీ చెప్పడమే కాకుండా.. సర్వీస్ నచ్చిందంటూ టిప్పు కూడా ఇచ్చాడు. ఇక గంగవ్వ తనకు సర్వీస్ బాగా చేసిన వాళ్లకి వరుసగా డబ్బులు ఇచ్చుకుంటూ పోతుంటే.. మెహబూబ్ సీరియస్ అయ్యాడు. అలా డబ్బులు ఇవ్వొద్దు అవ్వా.. నీ దగ్గర ఇంకా ఎంత ఉన్నాయ్.. ఆ మిగిలిన డబ్బులు నాకు ఇచ్చెయ్ అని తీసేసుకున్నాడు. అయితే గంగవ్వ ఇచ్చినట్టే ఇచ్చి నాకు ఎవరితోనూ పనిలేదు. రూపాయి కూడా ఇవ్వను అంటూ తిరిగి తీసేసుకుంది. హారిక- అభిజిత్ చిలిపి ముచ్చట్లు అభిజిత్-హారికలు వేరు వేరు టీంలలో ఉన్నందుకు తెగ ఫీలైపోయారు.నాకు ఏ సర్వీస్ కావాలన్నా నీ ద్వారా చేపించుకోవచ్చు.. అంటూ అభి కళ్లలోకి కళ్లు పెట్టు చూసిన హారిక.. బిగ్ బాస్ మా ఇద్దర్నీ ఇలా ఆపోజిట్ టీంలో ఎందుకు వేశావ్ చెప్పు.. దొంగ అంటూ తెగ సిగ్గు పడిపోయింది. ఆ తరవాత అభి సేవల్ని ఉపయోగించుకుంటూ అతనితో మసాజ్ చేయించుకుంది. టిప్ కోసం అభి.. అమ్మల లొల్లి అతిథులు ఇచ్చే టిప్ విషయంలో అభిజిత్, రాజశేఖర్ మాస్టర్ల మధ్య వివాదం చెలరేగింది. వచ్చిన దాంట్లో సగం టిప్ తనకు ఇవ్వాలని మాస్టర్‌ను అభి అడగ్గా.. ఇవ్వనని రాజశేఖర్ మాస్టర్ ముఖం మీదే చెప్పే చేశాడు.దీంతో అభిజిత్ మరోసారి మైండ్ గేమ్ ఆడుతూ.. నేను మేనేజర్ని..సర్వీస్ చేయడం మానేయమని చెప్తుంటే నువ్వు ఎందుకు వినవు.. అంటూ అభి మాస్టర్‌పై ఫైర్ కాగా, నువ్ చెప్తే నేను వినాలా? నేను వాళ్లకి చేసి పెడతా అంటూ గెస్ట్‌లకు పుడ్ ఇచ్చి టిప్ సంపాదించాడు రాజశేఖర్ ఇక మోనాల్‌తో మసాజ్ చేయించుకుని గోర్లు కట్ చేయించుకున్నాడు సొహైల్. అతనికి మసాజ్ చేస్తూ పాట కూడా పాడిన మోనాల్.. ఆ తరువాత అభిజిత్‌తో మాట్లాడుతూ.. దివి కోసం మాస్టర్ ఆడుతున్నాడని.. ఆమెను కెప్టెన్ చేయడానికి మాస్టర్ చాలా కష్టపడుతున్నాడని చెప్పింది. నిజమే అన్నట్లు తల ఊపిన అభి.. కెప్టెన్సీ టాస్క్‌లో నాకు హెల్ఫ్ చేస్తానని మాట తప్పారని మాస్టర్‌పై అసంతృప్తిని వెల్లగక్కాడు. అఖిల్ మైండ్ గేమ్.. హారిక కంటతడి ఇక హోటల్ సిబ్బంది సర్వీస్‌కు మెచ్చి హారిక ఒక స్టార్ ఇవ్వడానికి ముందుకు రాగా, అది ఆమె వ్యక్తిగతం అని మెహబూబ్ చెప్పాడు. అయితే అప్పటికే 5 స్టార్లను దొంగిలించిన అఖిల్.. హారికకు ఈ విషయం చెప్పాడు. అయితే తన స్టార్ తనకు ఇస్తే తిరిగి ఇస్తానని హారిక చెప్పగా.. అభిజిత్ తెలివిగా 5 స్టార్లను తన చేతిలో పెట్టి..తిరిగి తీసుకున్నాడు. దీంతో 5 స్టార్లు అతిథులు ఇచ్చినట్లే అని అభి చెప్పగా.. లేదు లేదు నేను ఒక్కటే స్టార్ ఇచ్చానని హారిక చెప్పింది. అయినప్పటికీ గేమ్ ప్రకారం 5 స్టార్లు నువ్వే నా చేతికి ఇచ్చావని చెప్పడంతో బిత్తిరి ముఖం వేసింది. పదే పదే బిగ్‌బాస్ కెమెరా ముందుకు వచ్చి నేను ఒకటే స్టార్ ఇచ్చాను. ఐదు స్టార్స్ ఇవ్వలేదని కంటతడి పెట్టింది. -
యూట్యూబ్ సెలబ్స్
ఉన్నత చదువులు చదివి కార్పొరేట్ కొలువులు దక్కించుకుని హ్యాపీ లైఫ్ గడిపేద్దామనే ఆలోచనలు ఆధునిక అమ్మాయిలవి కాదు. మరీ ముఖ్యంగా సోషల్ మీడియా కాలపు యువతులవి అసలే కావు. వీటన్నింటికీ మించి ఏదో సాధించాలి. నలుగురినీ మెప్పించడంతో పాటు ప్రతిభతో తమకంటూ ఓ ప్రత్యేకత, గుర్తింపు ఉండాలి. వైవిధ్యభరిత విజయాలు లిఖించాలి అని ఆలోచిస్తున్నారు. అంతేకాదు.. వాటి సాధన కోసం కృషి చేసి సాధిస్తున్నారు కూడా. తమ ఆశయాల ఆలోచనలను నిజం చేసుకునేందుకు సోషల్ మీడియానే వేదికవుతోంది. సాక్షి, సిటీబ్యూరో: ఒకరు తెలంగాణ అమ్మాయి హారిక అలేఖ్య. మరొకరు అనంతపూరం వాసి గౌతమిచిత్ర. వీరిద్దరూ వేర్వేరు వెబ్ సిరీస్‌లో విభిన్నమైన పాత్రలు చేస్తూ నెటిజన్లను కడుపుబ్బా నవ్విస్తున్నారు. ఆరు నుంచి తొమ్మిది నిమిషాల నిడివి గల వీడియోస్‌ను రూపొందించి సోషల్ మీడియాలో వదులుతుంటే వాటికి వ్యూవర్స్ నుంచి అనూహ్య స్పందన రావడం విశేషం. అగ్ర కథానాయకులకు సైతం సాధ్యం గాని లక్షల వ్యూస్ వీరిద్దరి వీడియోస్‌కు రావాడం గమనార్హం. ఖాళీ సమయంలో సరదా కావాలన్నా.. ఒత్తిడిని దూరం చేయాలన్నా వీరి వీడియోస్ చూస్తే చాలు.. కావాల్సినంత రిలీఫ్ దొరుకుతుంది. వారి డైలాగ్‌లకు కడుపుబ్బా నవ్వుకోవాల్సిదే. విభిన్న ఆలోచనలతో.. హిమాయత్‌నగర్‌కు చెందిన హారిక అలేఖ్యకి చిన్నప్పటి నుంచి రేడియో జాకీ అవ్వాలనేది కోరిక. గౌతమి చిత్రకు మంచి ఉద్యోగం సాధించాలనే ఆకాంక్ష. బీబీఏ పూర్తి చేసి అమెజాన్‌లో మంచి ఉద్యోగాన్ని సంపాదించుకుంది హారిక. ఎంసీఏ పూర్తి చేసి ఓ ఉన్నతమైన ఉద్యోగంలో చేరబోతున్న సమయంలో గౌతమి చిత్ర అనుకోకుండా ఓ వీడియోలో కనిపించింది. హారిక ‘చిత్ర విచిత్రం’తో నెటిజన్లకు పరిచయమైతే.. గౌతమి చిత్ర ‘లాఫింగ్టైమ్’తో యూట్యూబ్ ప్రేక్షకులకు దగ్గరైంది. కేవలం ఏడాదిన్నర్రలో వీరిద్దరూ అనూహ్య క్రేజ్‌ను సొంతం చేసుకోవడం విశేషం. చదువు.. ఉద్యోగం వంటివే ప్రధానమనుకునే కుటుంబాల్లో సోషల్ మీడియా వైపు అడుగులు వేస్తున్నారంటే వ్యతిరేకత వస్తుంది. కానీ హారికకు ఫ్యామిలీ ఫుల్ సపోర్ట్‌నిచ్చింది. గౌతమి చిత్రకి ఫ్యామిలీ సపోర్ట్ లేకపోయినా సిటీకి వచ్చి సెటిలై నేడు లక్షలాది మంది ఫ్యాన్స్‌ని సొంతం చేసుకోగలిగింది. ఒత్తిడి పరార్ ఐటీ ఉద్యోగులు, రాజకీయ నాయకులు, స్టూడెంట్స్, ఇంట్లో ఉండేవారు.. ఏ వర్గానికి చెందినవారైనా ఒత్తిడికి గురైతే వీరిద్దరి వీడియోలనే చూడడం విశేషం. హారిక అలేఖ్య నటించిన ‘హుషార్ పిల్ల, బేరమాడితే, కళాశాల, ఫస్ట్రేటెడ్ తెలంగాణ పిల్ల, ఎంబీబీఎస్ స్టూడెంట్, సర్పంచ్, లేడీడాన్’ వంటి వాటికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆమె చెబుతున్న డైలాగ్స్‌కి, నవ్విస్తున్న తీరుకు ప్రతి ఒక్కరూ పగలబడి నవ్వుకోవడం విశేషం. ఇక గౌతమి చిత్ర విషయానికొస్తే..‘ఫన్‌బకెట్’లో హేమంత్‌కు టీచర్‌గా, ‘పెళ్లాం వంట–గుండెల్లో మంట, రిలేటివ్స్ ఇంటికెళ్తే, ది లేట్ కామర్, అటు క్లాస్..ఇటు మాస్, సమంత పెళ్లిచూపులు’ వంటి ఎన్నో వీడియోస్‌కి లక్షల్లో వ్యూస్ సొంతం చేసుకుంది. భార్యగా నటించాలన్నా.. గయ్యాళిగా మెప్పించాలన్నా.. ఇన్నోసెంట్‌గా మార్కులు పడాలన్నా గౌతమి చిత్రనే బెస్ట్ అనే స్థాయికి చేరుకుంది. లక్షల్లో సబ్స్క్రైబర్స్ వీరిద్దరూ ప్రాతినిధ్యం వహిస్తున్నయూట్యూబ్ చానల్స్‌కి లక్షల్లో సబ్స్క్రైబర్స్ ఉన్నారు. హారిక ప్రాతినిధ్యం వహిస్తున్న‘దేత్తడి’ చానల్ ఏడాదిన్నరలో పదిలక్షల బ్స్క్రైబర్స్ని చేరుకోబోతుంది.గౌతమిచిత్ర ప్రాతినిధ్యం వహిస్తున్నచానల్కు ఐదు లక్షల సబ్‌స్రైబర్స్ ఉన్నారు.సినీరంగాన్ని ఏలుతున్న తారలుసమంత, రకుల్ ప్రీత్‌సింగ్, శృతిహాసన్వంటి వారు నటించిన వీడియోస్ సోషల్ మీడియా, యూట్యూబ్ చానల్స్‌లో ఐదు నుంచి పది లక్షలు వ్యూస్ ఉంటున్నాయి. హారిక, గౌతమి తమ పొట్టి వీడియోలతోఏడాదిన్నరలోనే ముప్పై, నలబై లక్షల వ్యూస్ సొంతం చేసుకున్నారంటే ప్రపంచవ్యాప్తంగా వీరిద్దరికీ ఉన్న క్రేజ్ ఏంటనేది స్పెషల్గాచెప్పక్కర్లేదు. -
శభాష్ హారిక
సాక్షి, సిటీబ్యూరో: నగరానికి చెందిన హారిక ఇరంకి ‘అనర్ఘ్య’ పేరుతో ఎన్జీఓను రన్ చేస్తుంది. శివరాంపల్లి స్కూల్లో తాగేందుకు మంచినీరు వెసులుబాటు లేకపోవడంతో..ఆ విషయాన్ని అక్కడి విద్యార్థులు హారిక దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన హారిక అక్కడి ప్రధానోపాధ్యాయుడిని నిలిదీసింది. స్పందన లేకపోవడంతో మండల విద్యాశాఖా అధికారిని అడగ్గా..నిధులు లేవన్నాడు. స్కూల్‌కి మంచినీళ్లు సౌకర్యాన్ని కల్పించమని సంబంధిత శాఖ అధికారులను కోరగా..వాళ్లు కొత్త కనెక్షన్ కోసం రూ.78 వేలు అడిగారు. ఏం చేయోలో తెలియక అప్పుడు ఇరిగేషన్ మంత్రిగా ఉన్న హరీష్‌రావును హారిక కలిసి విషయాన్ని వివరించింది. ఆ క్షణాన హారిక ఫోన్ నుంచి కాల్ చేసి..‘నేను మంత్రి హరీష్‌రావును మాట్లాడుతున్నా. మీరు ఏం చేస్తారో నాకు తెలీదు ఆ స్కూల్‌కి 24 గంటల్లో మంచినీటి సౌకర్యాన్ని కల్పించాలి’ అంటూ హరీష్‌రావు ఫోన్లో అధికారులను ఆదేశించారు. దీర్ఘకాలికంగా నీటి సమస్యతో అల్లాడిన ఆ స్కూల్‌కు 24 గంటల్లో మంచినీరు అందింది. ఇది ఆనందాన్నిచ్చిందని హారిక వివరించింది. 8 మంది బాలికలకు రక్షణ సేవా కార్యక్రమాలే కాకుండా కొన్ని సాహసోపేత పనులకూ హారిక ముందుంది. ఆటోడ్రైవర్ల అకృత్యాలను ధైర్యంగా బాహ్య ప్రపంచానికి తెలియచేసి శభాష్ అన్పించుకుంది. దాని గురించి వివరిస్తూ ఆమె...‘శంషాబాద్, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో కొందరు ఆటోవాళ్లు స్కూల్ పిల్లల్ని తీసికెళ్లి, తీసుకురావడం చేస్తున్నారు. ఈ క్రమంలో బాలికలకు వాళ్లకు మధ్య చనువు ఏర్పడింది. ఒకరోజు ఎనిమిదిమంది అమ్మాయిలు ఇంటికి రాకపోవడంతో..వాళ్ల తల్లులు రాత్రి 11.40 గంటల సమంయలో నాకు ఫోన్ చేశారు. నేను స్కూల్ టీచర్లకు ఫోన్ చేసి అడిగితే వాళ్లు ఈరోజు స్కూల్‌కి రాలేదంటూ సమాధానం ఇచ్చారు. ఆ తరువాత రోజు ఇంటికి వచ్చిన వీళ్లతో నేను నాలుగు రోజుల పాటు ఫ్రెండ్‌గా మాట్లాడి ఎక్కడకు వెళ్లారని అడగ్గా..కొందరు ఆటోడ్రైవర్లు తమను తీసికెళ్లి అత్యాచారం చేశారంటూ బదులిచ్చారు. ఈ విషయంపై అక్కడి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారందర్నీ అదుపులోకి తీసుకుని విచారించి కొందరిని అరెస్ట్ చేసి జైలుకు కూడా పంపడం జరిగింది. అప్పటి నుంచే నాకు వేధింపులు ఎక్కువ అయ్యాయి. చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నా.’ అని చెబుతూ ముగించింది. -
6లో హంపి... 11లో హారిక
హెంగ్షుయె (చైనా): వరల్డ్ మాస్టర్స్ మహిళల చెస్ చాంపియన్‌షిప్‌లో తొలి రోజు భారత గ్రాండ్‌మాస్టర్స్ కోనేరు హంపి, ద్రోణవల్లి హారికలకు మిశ్రమ ఫలితాలు లభించాయి. 16 మంది మేటి చెస్ క్రీడాకారిణుల మధ్య ర్యాపిడ్ పద్ధతిలో 11 రౌండ్లపాటు జరుగుతున్న ఈ టోర్నీలో మంగళవారం నాలుగు రౌండ్ గేమ్‌లు నిర్వహించారు. నాలుగో రౌండ్ ముగిశాక హంపి రెండు పాయింట్లతో ఆరో స్థానంలో, హారిక రెండు పాయింట్లతో 11వ స్థానంలో ఉన్నారు. తొలి గేమ్‌లో హంపి 69 ఎత్తుల్లో బేలా ఖొటెనాష్విలి (జార్జియా)పై గెలిచింది. జన్సాయా (కజకిస్తాన్)తో రెండో గేమ్‌ను 32 ఎత్తుల్లో... కొస్టెనిక్ (రష్యా)తో మూడో గేమ్‌ను 61 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్న హంపి... నానా జాగ్‌నిద్జె (జార్జియా)తో జరిగిన నాలుగో గేమ్‌లో 53 ఎత్తుల్లో ఓడిపోయింది. మరోవైపు హారిక తొలి గేమ్‌లో 95 ఎత్తుల్లో కొస్టెనిక్ (రష్యా) చేతిలో ఓడిపోయి... ఎలిజబెత్ (జర్మనీ)తో జరిగిన రెండో గేమ్‌ను 79 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. బేలా (జార్జియా)తో జరిగిన మూడో గేమ్‌లో హారిక 44 ఎత్తుల్లో గెలిచి, అనస్తాసియా (రష్యా)తో జరిగిన నాలుగో గేమ్‌ను 35 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. హంపి, హారికతోపాటు మరో నలుగురి ఖాతాలోనూ రెండేసి పాయింట్లు ఉన్నా... మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంక్‌లను వర్గీకరించారు. -
ఆమే ఒక సైన్యం!
నగరానికి చెందిన ఈరంకి నాగభూషణం, జానకి దంపతులు కుమార్తె హారిక ఎంబీఏ పూర్తి చేసింది. ఓ పేరున్న కంపెనీలో ఉద్యోగాన్ని సైతం సాధించింది. ఉద్యోగంతో పాటు సేవా కార్యక్రమాలను సైతం చేయసాగింది. ఈ క్రమంలో సేవా కార్యక్రమాలకు ఉద్యోగం అడ్డుగా ఉందని భావించి దానికి రాజీనామా చేసి 2016లో ‘అనర్ఘ్య’ పేరుతో ఓ ఎన్జీఓను స్థాపించింది. హిమాయత్‌నగర్ :సమాజం మనకేమిచ్చిందన్నది కాదు.. సమాజానికి మనమేం చేశామన్నదే ప్రధానమంటోంది ‘అనర్ఘ్య’ ఎన్జీఓ వ్యవస్థాపకురాలు హారిక. యువతరం తలుచుకుంటే సాధించలేనిదేమీ లేదంటోంది. ఈ నేపథ్యంలో ఆపదలో ఉన్న ఎంతో మందికి రక్తదానం చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి నడుంకట్టింది. ఐదంకెల జీతాన్ని సైతం వదులుకుని సేవా దృక్పథంతో స్వచ్ఛంద సంస్థను స్థాపించి పేద పిల్లలకు వసతులు కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తోందిఈరంకి హారిక. రక్తదానంతో ప్రాణదాత 2013లో ఆపదలో ఉన్న ఓ వ్యక్తికి తాను రక్తం ఇచ్చి ఆదుకుంది. ఆ తర్వాత తండ్రి నాగభూషణం, తల్లి జానకి, సోదరుడు డాక్టర్ హరీష్, సోదరితో సైతం రక్తదానం చేయించింది. తన ఎన్జీఓ, మిత్రులు, వారి స్నేహితులు ద్వారా వందలాది మందికి రక్తదానం చేయించినట్లు హారిక పేర్కొంది. ఒక్క ఫోన్ కాల్‌తో నగరంతో పాటు, ఏపీలోని పలు ప్రాంతాల్లో రక్తం అందించేందుకు కృషి చేస్తూ ప్రాణదాతగా నిలుస్తోంది. పాఠశాలల్లో మరుగుదొడ్లు.. నగర శివారు ప్రాంతాలైన శివరాంపల్లి, శంషాబాద్, రాజేంద్రనగర్ ప్రభుత్వ పాఠశాలలను తాను సందర్శించిన సమయంలో విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్నట్లు గ్రహించిన హారిక. ఈ విషయమై ప్రభుత్వ అధికారులను నిలదీసింది. వారినుంచి నిధులు లేవనే సమాధానం రావడంతో.. ఆయా ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో తన సొంత డబ్బులతో మరుగుదొడ్ల నిర్మించింది. నెలసరి సందర్భంగా ప్యాడ్లు కొనే ఆర్థిక స్థోమత లేని పలువుర విద్యార్థినులకు ఏడాదికి సరిపడా వాటిని ఉచితంగా పంపిణీ చేస్తోంది. 24 గంటల్లో తాగునీరు.. శివరాంపల్లి ప్రభుత్వ పాఠశాలలో తాగునీరు లేకపోవడంతో.. విషయాన్ని అక్కడి విద్యార్థులు హారిక దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన హారిక అక్కడి ప్రధానోపాధ్యాయుడిని నిలదీసింది. స్పందన లేకపోవడంతో మండల విద్యాశాఖ అధికారిని అడగ్గా.. ఆయన నిధులు లేవన్నారు. పాఠశాలకు తాగునీటి సౌకర్యాన్ని కల్పించాలని సంబంధిత శాఖ అధికారులను కోరగా.. వారు కొత్త కనెక్షన్ కోసం రూ.78 వేలు అడిగారు. దీంతో ఆమె అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావుకు ఫోన్ చేసింది. ‘నేను మంత్రి హరీష్‌రావును మాట్లాడుతున్నా. మీరు ఏం చేస్తారో తెలియదు సదరు పాఠశాలకు 24 గంటల్లో తాగునీటి సౌకర్యం కల్పించాలి’ అని అధికారులను ఆయన ఆదేశించారు. దీంతో అధికారులు 24 గంటల్లోనే తాగునీటి వసతి కల్పించినట్లు హారిక వివరించింది. గతంలో పలువురు విద్యార్థులను ఆటో డ్రైవర్ల వేధింపుల నుంచి రక్షించింది. ఇలా ఎన్నో విధాలుగా సామాజిక సేవలో తరిస్తోంది నగర యువతి హారిక. -
హారిక 14... హంపి 19
సెయింట్ పీటర్స్బర్గ్: ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత అగ్రశ్రేణి క్రీడాకారులు నిరాశ పరిచారు. ఓపెన్ విభాగంలో భారత్ తరఫున విశ్వనాథన్ ఆనంద్, పెంటేల హరికృష్ణ, విష్ణు ప్రసన్న, నిహాల్ సరీన్... మహిళల విభాగంలో ద్రోణవల్లి హారిక, కోనేరు హంపి బరిలోకి దిగారు. ఓపెన్ విభాగంలో 15 రౌండ్లు జరిగాయి. 9.5 పాయింట్లు సాధించిన ఆనంద్ 23వ ర్యాంక్‌తో సరిపెట్టుకోగా... 7.5 పాయింట్లతో హరికృష్ణ 93వ ర్యాంక్‌లో, విష్ణు ప్రసన్న 111వ ర్యాంక్‌లో, 7 పాయింట్లతో నిహాల్ సరీన్ 130వ ర్యాంక్‌లో నిలిచారు. 11.5 పాయింట్లు సాధించిన రష్యా గ్రాండ్‌మాస్టర్ డానిల్ దుబోవ్ విజేతగా అవతరించాడు. 10.5 పాయింట్లు సంపాదించిన షఖిర్యార్ మమెదైరోవ్ (అజర్బైజాన్), హికారు నకముర (అమెరికా) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్స్ హారిక 8 పాయింట్లతో 14వ స్థానంతో... హంపి 7.5 పాయింట్లతో 19వ స్థానంతో సంతృప్తి పడ్డారు. 10 పాయింట్లతో జు వెన్జున్ (చైనా) టైటిల్‌ను సొంతం చేసుకుంది. హారిక ఆరు గేముల్లో గెలిచి, నాలుగింటిని ‘డ్రా’ చేసుకొని, రెండు గేముల్లో ఓడిపోయింది. హంపి ఐదు గేముల్లో నెగ్గి, మరో ఐదు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని, మిగతా రెండు గేముల్లో ఓటమి పాలైంది. శనివారం మొదలైన బ్లిట్జ్ చాంపియన్‌షిప్‌లో తొమ్మిది రౌండ్లు ముగిశాక హారిక 6.5 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో... 6 పాయింట్లతో హంపి 16వ స్థానంలో కొనసాగుతున్నారు. నేడు మిగతా ఎనిమిది రౌండ్లు జరుగుతాయి. -
హంపి పరాజయం
ఖాంటీ మన్‌సిస్క్ (రష్యా): ప్రపంచ మహిళల చెస్ చాంపియన్‌షిప్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి పోరాటం ముగిసింది. జొ లాంటా జవద్జా్క (పోలాండ్)తో జరిగిన రెండో రౌండ్‌లోని తొలి గేమ్‌ను డ్రా చేసుకున్న హంపి రెండో గేమ్‌లో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. తొలి గేమ్‌లో నల్ల పావులతో ఆడిన హంపి రెండో గేమ్‌ను తెల్ల పావులతో ఆడి 78 ఎత్తుల్లో పరాజయం పాలైంది. మరో భారత గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక మూడో రౌండ్‌కు దూసుకెళ్లింది. బేలా ఖొటెనాష్విలి (జార్జియా)తో రెండో రౌండ్ రెండో గేమ్‌ను కూడా హారిక ‘డ్రా’ చేసుకుంది. దీంతో విజేతను తేల్చేందుకు టైబ్రేక్ నిర్వహించగా... అందులో గెలిచి మూడో రౌండ్‌కు అర్హత సాధించింది. ప్రస్తుతం ఈ టోర్నీలో భారత్ తరఫున హారిక మాత్రమే బరిలో మిగిలింది. -
హంపి, హారిక గేమ్‌లు ‘డ్రా’
ఖాంటీ మన్‌సిస్క్ (రష్యా): ప్రపంచ మహిళల చెస్ చాంపియన్‌షిప్‌లో రెండో రౌండ్‌లోని తొలి గేమ్‌ను భారత గ్రాండ్‌మాస్టర్స్ కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక ‘డ్రా’గా ముగించారు. జొలాంటా జవద్జా్క (పోలాండ్)తో జరిగిన గేమ్‌ను నల్ల పావులతో ఆడిన కోనేరు హంపి 26 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. బేలా ఖొటెనాష్విలి (జార్జియా)తో జరిగిన గేమ్‌ను నల్ల పావులతో ఆడిన హారిక 64 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. నేడు జరిగే రెండో గేమ్‌లో గెలిచిన వారు మూడో రౌండ్‌కు అర్హత సాధిస్తారు. ఒకవేళ రెండో గేమ్ ‘డ్రా’ అయితే మాత్రం గురువారం టైబ్రేక్‌లు నిర్వహించి విజేతను నిర్ణయిస్తారు. -
పురుషులు ‘ఆరు’... మహిళలు ‘ఎనిమిది’
బటూమి (జార్జియా): భారీ అంచనాలతో బరిలోకి దిగిన భారత పురుషుల, మహిళల జట్లు చెస్ ఒలింపియాడ్ నుంచి రిక్తహస్తాలతో వెనుదిరిగాయి. శుక్రవారం ముగిసిన ఈ మెగా ఈవెంట్లో విశ్వనాథన్ ఆనంద్, పెంటేల హరికృష్ణ, విదిత్ సంతోష్ గుజరాతి, ఆధిబన్, కృష్ణన్ శశికిరణ్‌లతో కూడిన భారత పురుషుల జట్టు 16 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచింది. కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, తానియా సచ్దేవ్, ఇషా కరవాడే, పద్మిని రౌత్‌లతో కూడిన భారత మహిళల జట్టు 16 పాయింట్లతో ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకుంది. చివరిదైన 11వ రౌండ్లో పోలాండ్‌తో జరిగిన మ్యాచ్‌ను భారత పురుషుల జట్టు 2–2తో ‘డ్రా’ చేసుకుంది. ఆనంద్–జాన్ క్రిస్టోఫ్ డూడా గేమ్ 25 ఎత్తుల్లో... హరికృష్ణ–రాడోస్లా గేమ్ 30 ఎత్తుల్లో... విదిత్–కాక్పెర్ గేమ్ 48 ఎత్తుల్లో... ఆధిబన్–జాసెక్ టామ్జాక్ గేమ్ 55 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిశాయి. ఓవరాల్‌గా భారత్ ఏడు మ్యాచ్‌ల్లో గెలిచి, రెండింటిలో ఓడి, మరో రెండింటిని ‘డ్రా’ చేసుకుంది. మరోవైపు మంగోలియాతో జరిగిన చివరి మ్యాచ్‌ను భారత మహిళల జట్టు 3–1తో గెలిచింది. హారిక–బతుయాగ్ మున్‌గున్‌తుల్ గేమ్ 72 ఎత్తుల్లో... ఇషా–ముంక్జుల్ గేమ్ 36 ఎత్తుల్లో ‘డ్రా’కాగా... తానియా 60 ఎత్తుల్లో నోమిన్పై, పద్మిని 65 ఎత్తుల్లో దులామ్సెరెన్పై విజయం సాధించారు. ఓవరాల్‌గా భారత జట్టు ఆరు మ్యాచ్‌ల్లో గెలిచి, నాలుగింటిని ‘డ్రా’ చేసుకొని... హంగేరి చేతిలో ఓడిపోయింది. ఎనిమిదో రౌండ్లో హంగేరి చేతిలో ఓటమి భారత జట్టు పతకావకాశాలపై తీవ్ర ప్రభావం చూపింది. నిర్ణీత 11 రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నమెంట్లో పురుషుల, మహిళల విభాగాల్లో చైనా విజేతగా నిలిచి ‘డబుల్’ సాధించింది. పురుషుల విభాగంలో చైనా, అమెరికా, రష్యా 18 పాయింట్లతో సమఉజ్జీగా నిలిచినా... మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా చైనాకు స్వర్ణం... అమెరికా ఖాతాలో రజతం చేరగా... రష్యా జట్టు కాంస్యం కైవసం చేసుకుంది. మహిళల విభాగంలో చైనా, ఉక్రెయిన్ 18 పాయింట్లతో సమఉజ్జీగా నిలిచాయి. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా చైనాకు పసిడి పతకం ఖాయమైంది. ఉక్రెయిన్‌కు రజతం, 17 పాయింట్లు సాధిం చిన జార్జియా జట్టుకు కాంస్యం లభించింది. -
భారత జట్లకు మిశ్రమ ఫలితాలు
బటూమి (జార్జియా): చెస్ ఒలింపియాడ్‌లో భారత పురుషుల జట్టు వరుసగా మూడో విజయంతో ‘హ్యాట్రిక్’ సాధించింది. కెనడాతో బుధవారం జరిగిన మూడో రౌండ్లో భారత్ 3.5–0.5తో గెలుపొందింది. భారత్ తరఫున విశ్వనాథన్ ఆనంద్, పెంటేల హరికృష్ణ, శశికిరణ్ నెగ్గగా... విదిత్ తన గేమ్‌ను ‘డ్రా’ చేసుకున్నాడు. ఆనంద్ 33 ఎత్తుల్లో ఎరిక్ హాన్సెన్‌పై, హరికృష్ణ 33 ఎత్తుల్లో రజ్వాన్ ప్రెటుపై, శశికిరణ్ 28 ఎత్తుల్లో అమన్ హంబిల్టన్‌పై గెలిచారు. విదిత్, ఎవగెని బరీవ్ మధ్య గేమ్ 72 ఎత్తుల్లో ‘డ్రా’ అయింది. మరోవైపు సెర్బియాతో జరిగిన మ్యాచ్‌ను భారత మహిళల జట్టు 2–2తో ‘డ్రా’గా ముగించింది. ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్స్ కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక తమ ప్రత్యర్థులను ఓడించగా... ఇషా కరవాడే, పద్మిని రౌత్‌లకు పరాజయం ఎదురైంది. -
భారత జట్లకు వరుసగా రెండో విజయం
ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో భారత మహిళల, పురుషుల జట్లు వరుసగా రెండో విజయం నమోదు చేశాయి. జార్జియాలో మంగళవారం జరిగిన రెండో రౌండ్లో ద్రోణవల్లి హారిక, తానియా, ఇషా, పద్మిని రౌత్‌లతో కూడిన భారత మహిళల జట్టు 4–0తో వెనిజులాపై గెలిచింది. హారిక 52 ఎత్తుల్లో సరాయ్‌పై, తానియా 44 ఎత్తుల్లో అమెలియాపై, ఇషా 49 ఎత్తుల్లో రవీరాపై, పద్మిని 42 ఎత్తుల్లో పటినో గార్సియాపై నెగ్గారు. మరోవైపు విశ్వనాథన్ ఆనంద్, పెంటేల హరికృష్ణ, విదిత్, ఆధిబన్‌లతో కూడిన భారత పురుషుల జట్టు 3.5–0.5తో ఆస్ట్రియాను ఓడించింది. -
లేడీ డిజైనర్.. రైఫిల్ షూటర్..
చదివిన కోర్సు ఒకటి.. చేసిన ఉద్యోగం ఇంకోటి..ఆ రెండింటిలోనూ ‘కిక్’ లేక తనను తానే ‘డిజైన్’ చేసుకుంది. ఫ్యాషన్ రంగంలో తనకంటూ గుర్తింపు తెచ్చుకుని ‘స్టార్ డిజైనర్’గా పేరు తెచ్చుకుంటోంది ‘హారికారావు’. ఎంతోమంది సెలబ్రిటీలకు దుస్తులు రూపొందించి ఇచ్చే ఈమె తుపాకీ పేల్చడంలోనూ దిట్టేనండోయ్. తూర్పు–పడమర లాంటి రెండు విభిన్న రంగాల్లోదూసుకుపోతున్న హారిక.. తన ప్రయాణ విశేషాలను‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే.. శ్రీనగర్‌కాలనీ : ‘‘నేను పుట్టింది, పెరిగింది అంతా వరంగల్‌లోనే. ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ చేశాను. చిన్ననప్పటి నుంచి అందరికంటే భిన్నంగా ఉండడం నాకు అలవాటు. మొదట నా దుస్తులు అందరికి నచ్చేలా కొత్తగా ఉండాలనుకునేదాన్ని. అలా ఫ్యాషన్‌పై ఇష్టం పెరిగింది. కొంత ఊహ వచ్చాక నా దుస్తులు నేనే డిజైనింగ్ చేసుకునేదాన్ని. అవి నచ్చి సన్నిహితులు, బంధువులు అలాంటివి చేసి ఇవ్వమనేవారు. అలా శుభకార్యాలకు దుస్తులు డిజైన్ చేసేదాన్ని. కొత్త రంగుల మేళవింపుతో డిజైనింగ్స్ ఇచ్చేదాన్ని. నా సృజనాత్మకత నచ్చి చాలా మంది ప్రశంశించేవారు. అయితే ఫ్యాషన్ డిజైనింగ్ చేద్దామని కోరిక ఉన్నా వరంగల్‌లో శిక్షణా కేంద్రాలు లేకపోవడంతో ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ చేశాను. పతకాలే లక్ష్యం... కాలేజీ రోజుల్లో ఎన్సీసీలో చేరాను. అక్కడే రైఫిల్ షూటింగ్ నేర్చుకున్నా. ఆ శిక్షణతో ప్రతిష్టాత్మక జీవీ మౌలాంకర్ షూటింగ్ పోటీల్లో పాల్గొన్నాను. డిజైనింగ్‌తో పాటు షూటింగ్లో ఉన్న అభిరుచితో ఫిలింనగర్‌లోని గగన్ నారంగ్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ తీసుకుంటున్నాను. ఇప్పటికే లెవెల్–1 పూర్తి చేశాను. అందరూ మెచ్చేలా రైఫిల్ షూటింగ్లో అంతర్జాతీయ స్థాయిలో పాల్గొని పతకాలు సాధించడమే ధ్యేయంగా కృషి చేస్తున్నా. కుటుంబమే నా బలం నేను ఎంచుకున్న రెండు రంగాలు విభిన్నమైనవి. ఒకదానిదో మరొక దానికి పొంతన ఉండదు. నా ఈ ప్రయాణంలో కుటుంబ సభ్యులతో పాటు నా భర్త సత్య ప్రోత్సాహం ఎంతో ఉంది. ఉద్యోగం చేస్తుంగా వివాహమైంది. నా ఇష్టాన్ని గుర్తించిన నా భర్త ప్రోత్సాహంతో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేశా. ఇప్పుడు మెహిదీపట్నంలో హారిక స్టూడియోస్‌ను ఏర్పాటు చేశాను. విదేశాల్లో జరిగిన పలు ప్యాషన్ వీక్స్‌లో నా డిజైన్స్‌ను ప్రదర్శించాను. అక్కడ మంచి గుర్తింపు వచ్చింది.సినీతారలు ఆనంది, సింగర్ చిన్మయి, విష్ణుప్రియ, ఏపీ మంత్రి భూమా అఖిలప్రియ, పలువురు బుల్లితెర నటీమణులకు డిజైనింగ్ చేశాను. అంతర్జాతీయ డిజైనర్‌గా గుర్తింపు కోసం కృషి చేస్తున్నా’’ అంటూ ముగించారు హారిక. ఉద్యోగాన్నివదిలేశా.. ఎమ్మెస్సీ తర్వాత ఫార్మారంగంలో ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చాను. కానీ అక్కడ ఆశించిన ఉద్యోగం రాకపోవడంతో సాఫ్ట్వేర్ కోర్సులు నేర్చుకొని ఇన్ఫోసిస్‌లో చేరాను. ఉద్యోగంలో ఉండగా తోటి కొలీగ్స్ దుస్తులు డిజైన్ చేసేదాన్ని. అవి అందరికీ బాగా నచ్చేవి. కొన్నాళ్లకు చేస్తున్న ఉద్యోగంలో కిక్ లేకపోవడంతో అది వదిలేసి నచ్చిన ఫ్యాషన్ రంగంలోకి అడుగు పెట్టాను. -
పెళ్లి చేసుకోబోతున్న ప్రముఖచదరంగ క్రీడాకారిణి
-
హారిక.. బ్యాడ్మింటన్ ఆశా దీపిక
పశ్చిమగోదావరి, తణుకు అర్బన్: ఓనమాలు దిద్దే వయసులో నాన్న చేతి నుంచి అందుకున్న బ్యాడ్మింటన్ రాకెట్ నేడు అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టింది. ఆమే తణుకుకు చెందిన వెలుదుర్తి శ్రీనివాస్, చిన కృష్ణవేణి దంపతుల కుమార్తె హారిక. ఎనిమిదో ఏటే షటిల్ బ్యాడ్మింటన్ అకాడమీ బాట పట్టిన ఆమె అంచనాలను మించి అంతర్జాతీయస్థాయిలో భారతదేశం తరఫున ఆడుతూ గోల్డ్ మెడల్స్ సాధిస్తూ రాష్ట్రవ్యాప్తంగా అందరి మన్ననలు పొందుతోంది. ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించే ఆట తీరు హారిక సొంతం. కోర్టులో చురుగ్గా కదులుతూ హారిక కొడుతున్న షాట్లకు టాప్ టెన్ క్రీడాకారులు సైతం కంగుతింటున్నారు. వరల్డ్ ర్యాంకింగ్స్‌లో 86వ స్థానం తాజాగా ప్రకటించిన వరల్డ్ ర్యాంకింగ్స్‌లో 106వ ర్యాంక్ నుంచి ఒకేసారి 86వ ర్యాంక్‌కు ఎగబాకింది. ఆల్ ఇండియా సీనియర్స్ ర్యాంకింగ్స్ మిక్స్డ్ విభాగంలో 1వ స్థానం, డబుల్స్ విభాగంలో 4వ స్థానంలో నిలిచింది. ఒలింపిక్స్‌లో దేశం తరఫున ప్రాతినిధ్యం వహించి మెడల్ సాధించడమే తన లక్ష్యమని చెబుతోంది. అండర్–13, 14 అనంతరం 2014లో అంతర్జాతీయ స్థాయిలో అడుగుపెట్టి రోజురోజుకు ర్యాంకింగ్ మెరుగుపర్చుకుంటోంది. ప్రస్తుతం ముంబాయిలోని థానే బ్యాడ్మింటన్ అకాడమీ కోచ్ ఎంఎన్ శ్రీకాంత్ వాడ్ శిక్షణలో రాటుదేలుతోంది. ఇప్పటివరకు వివిధ విభాగాల్లో మొత్తం 50 మెడల్స్పైగా సాధించగా అందులో 22 గోల్డ్ మెడల్స్ ఉండడం విశేషం. చైనీస్ తైపీ, యూరోప్, ఉక్రెయిన్, నేపాల్, అతుల్, నైజీరియా దేశాల్లో పలు మెడల్స్ సాధించింది. తాజాగా ఈ నెలలో ఆఫ్రికాలోని çఘనాలో జరిగిన çఘనా ఇంటర్నేషనల్ టోర్నమెంట్లో మిక్స్డ్, ఉమెన్ డబుల్స్ విభాగాల్లోను గోల్డ్ మెడల్స్ సాధించి సత్తా చాటింది. తల్లిదండ్రులూ క్రీడాకారులే.. తండ్రి వెలుదుర్తి శ్రీనివాస్ చిన్ననాటి నుంచి షటిల్ బ్యాడ్మింటన్, క్రికెట్ తదితర క్రీడల్లో ప్రావీణ్యత సాధించారు. షటిల్లో యూనివర్సిటీ స్థాయిలో ఎన్నో విజయాలు సాధించారు. 2006 నుంచి 2012 వరకు షటిల్ టోర్నమెంట్ అంపైర్‌గా కూడా వ్యవహరించారు. హారిక చిన్ననాటి నుంచి తండ్రితో పాటు తణుకులోని ఆఫీసర్స్ క్లబ్‌లోని షటిల్ కోర్టుకు వెళ్లి ప్రాక్టీస్ చేసేది. మధ్య తరగతి కుటుంబానికి చెందిన శ్రీనివాస్ కేబుల్ ఆపరేటర్‌గా జీవనం సాగిస్తుండగా, తల్లి కృష్ణవేణి గృహిణి. ఆమె కూడా వాలీబాల్ క్రీడాకారిణి కావడంతో హారికకు ఎంతో ప్రోత్సాహం దక్కింది. హారిక సోదరి పావని శృతి ప్రస్తుతం హైదరాబాద్‌లో బీటెక్ చదువుతోంది. 2012లో కాలుకు గాయం.. 2012లో షటిల్ ఆడుతుండగా కాలుకు గాయం కావడంతో మోకాలికి హైదరాబాద్‌లో మేజర్ ఆపరేషన్ చేశారు. తిరిగి 2014 నుంచి బ్యాడ్మింటన్ కోర్టులో అడుగుపెట్టినప్పటికీ ప్రస్తుతం డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో మాత్రమే ఆడుతున్నారు. రానున్న రోజుల్లో సింగిల్స్ విభాగంలోను బరిలోకి దిగనున్నట్లు చెబుతున్నారు. ప్రోత్సాహకులు వీరే.. ప్రభుత్వ సహకారం లేక అకాడమీలో చేరేందుకు ఆర్థిక సమస్యలు ఎదురుకావడంతో తణుకు టీసీఎన్ అధినేత చిట్టూరి కృష్ణ కన్నయ్య(కన్నబాబు), మాజీ ఎమ్మెల్యే వైటీ రాజా అండగా నిలుస్తున్నారు. గతేడాది వరల్డ్ టోర్నమెంట్‌కు వెళ్లాల్సిన సమయంలో ఆంధ్రాసుగర్స్ తరఫున బోళ్ల బుల్లిరామయ్య, పెండ్యాల అచ్యుతరామయ్య (అచ్చిబాబు) రూ.1.30 లక్షలు ఆర్థిక సాయం అందచేసి టోర్నమెంట్‌కు పంపించారు. -
భారత్‌కు రజతం
హైదరాబాద్: ఆసియా నేషన్స్ కప్ చెస్ టోర్నమెంట్లో భారత మహిళల, పురుషుల జట్లు రాణించాయి. ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక, పద్మిని రౌత్, ఇషా కరవాడే, వైశాలి, ఆకాంక్షలతో కూడిన భారత మహిళల జట్టు ర్యాపిడ్ విభాగంలో రజత పతకం సాధించింది. సూర్యశేఖర గంగూలీ, ఆధిబన్, కృష్ణన్ శశికిరణ్, అభిజిత్ గుప్తా, సేతురామన్‌లతో కూడిన భారత పురుషుల జట్టు ర్యాపిడ్ ఓపెన్ విభాగంలో కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. ఇరాన్‌లోని హమదాన్ పట్టణంలో జరుగుతోన్న ఈ టోర్నీలో భారత మహిళల జట్టు నిర్ణీత ఏడు రౌండ్ల తర్వాత 17 పాయింట్లు సంపాదించి రెండో స్థానంలో నిలిచింది. ఇరాన్ వైట్, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఇరాన్ రెడ్ జట్లపై నెగ్గిన భారత్... ఇరాన్ గ్రీన్, వియత్నాం జట్లతో ‘డ్రా’ చేసుకొని... చైనా చేతిలో ఓడిపోయింది. విజయానికి రెండు పాయింట్లు, ‘డ్రా’ అయితే ఒక పాయింట్ లభిస్తాయి. బోర్డు–1పై ఆడిన హారిక ఆరు పాయింట్లతో కాంస్య పతకం దక్కించుకోగా... బోర్డు–3పై ఇషా కరవాడే కాంస్యం, బోర్డు–4పై వైశాలి స్వర్ణం సొంతం చేసుకున్నారు. మరోవైపు భారత పురుషుల జట్టు నిర్ణీత ఏడు రౌండ్ల తర్వాత పది పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. బంగ్లాదేశ్, ఇరాన్ గ్రీన్, ఉజ్బెకిస్తాన్, ఇరాన్ వైట్, వియత్నాంలపై నెగ్గిన భారత జట్టు చైనా, కజకిస్తాన్ జట్ల చేతుల్లో ఓడింది. బోర్డు–2పై ఆధిబన్ రజతం, బోర్డు–3పై శశికిరణ్, బోర్డు–5పై సేతరామన్ కాంస్య పతకాలు గెల్చుకున్నారు. -
అపూర్వ, హారిక శుభారంభం
సాక్షి, హైదరాబాద్: టి. విజయకృష్ణ స్మారక తెలంగాణ రాష్ట్ర ర్యాంకింగ్ టోర్నమెంట్లో ప్రపంచ చాంపియన్ ఎస్. అపూర్వ శుభారంభం చేసింది. ఖైరతాబాద్‌లో జరుగుతోన్న ఈ టోర్నీలో మహిళల సింగిల్స్ తొలిరౌండ్లో సులువుగా గెలుపొందింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో టాప్ సీడ్ అపూర్వ (ఎల్ఐసీ) 25–0, 25–0తో పి. విజయలక్ష్మిపై విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో ఎ. హారిక 25–0, 25–0తో శాద్వితను ఓడించింది. ఇతర మ్యాచ్‌ల్లో రజినీ దేవి (ఎస్బీఐ) 25–7, 25–4తో ప్రణీషపై, బి. పద్మజ (ఏజీఓఆర్‌సీ) 18–16, 12–0తో భాగ్యలక్ష్మిపై, బి. సునీత (డీఎల్ఆర్ఎల్) 25–0, 25–0తో వర్షపై, షరోన్ 20–9, 25–6తో లక్ష్మీ రత్నబాబు (ఏజీఓఆర్‌సీ)పై, ఎ. స్వాతి 25–0, 25–1తో టి. భానుపై గెలుపొందారు. జూనియర్ బాలుర విభాగంలోనూ టాప్ సీడ్ సీహెచ్ సాయి చరణ్ (మంచిర్యాల) 25–0, 25–0తో ఆకాశ్ (ఏడబ్ల్యూఏఎస్‌ఏ)పై నెగ్గాడు. పురుషుల సింగిల్స్ నాలుగోరౌండ్లో టాప్‌సీడ్ హకీమ్ (బీఎస్ఎన్ఎల్) 25–14, 25–10తో ఎల్. గోపీకృష్ణపై గెలిచి ఐదోరౌండ్‌కు చేరాడు. ఇతర మ్యాచ్‌ల ఫలితాలు జూనియర్ బాలుర సింగిల్స్: జి. సాయి 25–0, 25–0తో నమన్‌పై, మొహమ్మద్ అఫ్నాన్ (మంచిర్యాల) 25–0, 25–0తో సాయికృష్ణ (ఎస్హెచ్ఎస్)పై, బి. రమేశ్ (మంచిర్యాల) 25–0, 25–3తో శ్రీను (ఏడబ్ల్యూఎస్‌ఏ)పై, అనుదీప్ 25–0, 25–4తో విష్ణుమూర్తిపై, సూర్య 25–0, 25–0తో చందుపై, మౌర్య 25–0, 25–11తో సాయికుమార్‌పై, రాజేశ్ (ఎస్హెచ్ఎస్) 25–7, 25–0తో శివసాయి (ఎస్హెచ్ఎస్)పై, రాజశేఖర్ (హెచ్‌వీఎస్) 25–0, 25–1తో రాకేశ్ (మంచిర్యాల)పై విజయం సాధించారు. పురుషుల సింగిల్స్ నాలుగో రౌండ్: మొహమ్మద్ అహ్మద్ (హెచ్‌ఎంసీసీ) 25–7, 25–0తో కలీమ్‌పై, అనూప్ కుమార్ 7–25, 25–10, 23–12తో బి. రమేశ్ (మంచిర్యాల)పై, జైకుమార్ 25–6, 25–12తో శ్రీకాంత్‌పై, కె. శ్రీనివాస్ (ఐఓసీఎల్) 25–0, 25–0తో జీఎస్ శర్మపై, ఆర్డీ దినేశ్ బాబు (ఏజీఓఆర్‌సీ) 25–11, 25–0తో ఆర్. ప్రమోద్ (వరంగల్)పై, ఎస్. ఆదిత్య (వి–10) 25–5, 16–18, 21–5తో జె. నర్సింగ్ రావుపై గెలుపొందారు. -
వీరి క్రేజ్‌కు సెలబ్రిటీలు సైతం అవాక్కు..
ఎంత టాలెంట్ ఉన్నా ఒకప్పుడు విజయం సాధించాలంటే దానికి ఎన్నో ప్రయాసలు పడి మరెన్నో దారులు వెతకాల్సి వచ్చేది. ఇప్పుడు ప్రతిభ మనదైతే ప్రపంచమే పాదాక్రాంతమవుతుంది. ప్రస్తుత సోషల్ మీడియా యుగం విజయపు మార్గాలను సమూలంగా మార్చేసింది. సామాన్యుల్ని సైతం ఒక్క రోజులో సెలబ్రిటీలుగా మార్చే శక్తితో రోజుకో కొత్త టాలెంట్‌ని ప్రపంచానికి పరిచయం చేస్తోంది. ఇదే క్రమంలో సోషల్ సైట్లే వేదికగా అనూహ్యమైన ఆదరణను సొంతం చేసుకున్న నగరవాసులు కొందరితో ముచ్చటించినప్పుడు ‘విజయ’ విశేషాలను పంచుకున్నారు. హిమాయత్‌నగర్ : ఒకరు ఫేస్బుక్లో స్టార్ అయితే.. ఇంకొకరు యూట్యూబ్‌కు రిలేటెడ్‌గా ఉన్న ఛానల్స్‌లో స్టార్. ఫేస్బుక్లో ఒక్క పోస్ట్ పెట్టినా.. ఛానల్లో ఒక్క డైలాగ్‌తో వీడియో పోస్ట్ చేసినా వేలల్లో లైక్‌లు, లక్షల్లో వ్యూస్ రావడం ఖాయం. ఫేస్బుక్ సెలబ్రిటీగా దిల్‌సుక్‌నగర్‌కు చెందిన దివ్య అన్వేషిత కొమ్మరాజు పేరుపొందితే.. హిమాయత్‌నగర్‌కు చెందిన హారిక అలేఖ్య దేత్తడి ఛానల్లో దుమ్మురేపుతోంది. మల్కాజ్గిరి వాసి నాగభార్గవి ఫన్బకెట్లో పాగా వేసింది. వీళకున్న క్రేజ్‌కి టాలీవుడ్ స్టార్లు సైతం విస్తుబోతున్నారు. ఒక్క ఎపిసోడ్‌తో స్టార్డమ్ రావాలని లేకున్నా అనుకోకుండా ఇలా వచ్చా. ఇప్పుడు విడిచిపెట్టలేకపోతున్నా. ‘అమ్మాయి ఇంటికి దారేది’ అనే షార్ట్‌ఫిల్మ్ చేశా. ఈ ఫిల్మ్ నాలుగేళ్ల క్రితం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ తరువాత ఫన్బకెట్లో 13వ ఎపిసోడ్లో అడుగుపెట్టా. ఇప్పుడు 139 ఎపిసోడ్ నడుస్తోంది. ఫన్బకెట్లో నా స్టార్డమ్ చూసి ఫ్యామిలీ, ఫ్రెండ్స్, బంధువులు అందరూ నాకు దగ్గరయ్యారు. నేను ఎక్కడకు వెళ్లినా.. ప్రేక్షకులు నన్ను గుర్తించి నాతో సెల్ఫీలు దిగడం, ఆటోగ్రాఫ్‌లు తీసుకోవడంతో చాలా సంతోషంగా ఉంది. ఇది చూసిన మా అమ్మ గర్వంగా ఫీలవడం నాకు చాలా ఆనందంగా ఉంది. – నాగభార్గవి, ఫన్‌బకెట్ సెలబ్రిటీ దేత్తడి అమ్మాయిగా గుర్తింపు మా ‘దేత్తడి’ ఛానల్‌కు 3 లక్షలకు పైగా సబ్‌స్క్రైబర్ ఉన్నారు. ఈ ఛానల్లో నేను ఇప్పటి వరకు పది వీడియోలు చేశాను. వీటిలో ‘ఫ్రస్టేషన్ తెలంగాణ పిల్ల, హుషార్పిల్ల, తెలంగాణ పిల్ల బేరామాడితే, సేల్స్ గర్ల్స్, ఫ్రస్టేషన్ ఎంబీబీఎస్ స్టూడెంట్’ వంటివి బాగా క్లిక్కయ్యాయి. ఎక్కడికెళ్లినా దేత్తడిలో చేసిన అమ్మాయి.. అంటూ గుర్తు పట్టి మరీ పలకరిస్తున్నారు. యాక్టింగ్‌పై ఇంట్రస్ట్‌తోనే సోషల్ మీడియా బాట పట్టాను. నేను చేసిన ప్రతి వీడియోకు పది లక్షలకు పైగా వ్యూస్ రావడం సంతోషంగా ఉంది. – హారిక అలేఖ్య, దేత్తడి సెలబ్రిటీ ఫేస్బుక్ మార్చేసింది.. నేను 2016 వరకు చాలా సాధారణ అమ్మాయినే. ఫేస్బుక్లో ‘లైవ్ వీడియో’ ఆప్షన్ వచ్చినప్పుడు ఒకరోజు లైవ్ చేశా. రెండు గంటల పాటు చేసిన లైవ్‌కి అదే టైంలో 70 వేల మందికి పైగా చూశారు. ఈ స్ఫూర్తితోనే లైవ్‌ని కంటిన్యూ చేశా. ఇప్పుడు పది నుంచి పదిహేను లక్షల మంది వ్యూస్ రావడం చాలా గర్వంగా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఫేస్బుక్ నన్ను స్టార్‌గా మార్చేసింది. నాకు ఏ సమస్య ఉన్నా.. ఇతరులకు ఎదైనా సమస్య వచ్చినా నేను ఫేస్బుక్ ద్వారా ప్రపంచానికి చెప్పి పరిష్కరించడం ఆనందంగా ఉంది. – దివ్య అన్వేషిత,ఫేస్బుక్ సెలబ్రిటీ -
సాయికుటీర్‌లో దంపతుల ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయికుటీర్‌లో దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా విషాదం నింపింది. పద్మావతి ఫంక్షన్ హాల్ యజమాని సుజన్ రెడ్డి, ఆయన భార్య హారిక రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. కాగా ఆర్థిక ఇబ్బందులతో పాటు అనారోగ్య కారణాల వల్లే దంపతులు ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
బీజేపీ నేత భార్య చీర లాగిన టీడీపీ కార్యకర్త
చిత్తూరు : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో మహిళలపై టీడీపీ నేతలు, వారి మద్దతుదారుల దాడులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా శుక్రవారం టీడీపీ నేత అనుచరుడు చిత్తూరు నగరంలో ఓ వివాహిత చీర లాగి అవమానించాడు. అడ్డు వచ్చిన ఆమె భర్తపై దాడికి దిగాడు. బాధితుల కథనం మేరకు.. బీజేపీ జిల్లా మజ్దూర్ మోర్చా అధ్యక్షుడు గుత్త ప్రభాకర నాయుడుకు.. చిత్తూరు నగరంలోని మద్యం దుకాణాలు, బస్సులు నడుపుతున్న టీడీపీ నేత హరిప్రసాద్ నాయుడుకు మధ్య వ్యాపార లావాదేవీలపై వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ నేతకు బీజేపీ నేత లీగల్ నోటీసులు పంపారు. దీనిపై ఆగ్రహించిన టీడీపీ నేత తన అనుచరుడు, పార్ట కార్యకర్త అయిన వెంకటకృష్ణమ నాయుడును రెచ్చగొట్టి ప్రభాకర నాయుడుపైకి పంపాడు. శుక్రవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో ఆఫీసర్స్ లైన్‌లోని ప్రభారకర నాయుడి ఇంటికి వచ్చిన వెంకటకృష్ణమ నాయుడు అసభ్యంగా మాట్లాడడంతో పాటు ఆయన భార్య హారిక చీరకొంగు పట్టుకొని లాగాడు. అడ్డొచ్చిన తన భర్తను చంపేస్తానని బెదిరించడంతోపాటు తమపై వెంకటకృష్ణమ నాయుడు దాడి చేశాడని హారిక తెలిపారు. దాడిలో మోకాలికి గాయాలయ్యాయని చెప్పారు. ఈ మేరకు ఫిర్యాదు చేయగా వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
షార్ట్ ఫిలిం డైరెక్టర్ యోగేష్ అరెస్ట్
గచ్చిబౌలి: లఘుచిత్రాల్లో నటించే మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్‌కు అసభ్యకరమైన మేసేజ్‌లు పంపి వేధిస్తున్న కేసులో తప్పించుకు తిరుగుతున్న షార్ట్ ఫిలిం డైరెక్టర్ యోగేష్ కుమార్‌ను గచ్చిబౌలి పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఎస్ఐ రాజేందర్ తెలిపిన వివరాల మేరకు... బీహెచ్ఈఎల్ ఎంఐజీలో నివాసం ఉండే ముత్యాల యోగేష్ కుమార్(35)కు ఏడాది క్రితం గచ్చిబౌలిలో నివాసముండే హారికతో ఫేస్బుక్లో పరిచయం ఏర్పడింది. అయితే ఈ పరిచయంతో హారిక వాట్సాప్ నంబర్‌కే కాకుండా, ఆమె భర్త ఫోన్‌కు కూడా అసభ్యకర సందేశాలు పంపిస్తూ వేధిస్తున్నాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడు యోగి సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా బుధవారం పోలీసులు అతన్ని పట్టుకున్నారు. అతడి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కూకట్పల్లి 25ఎంఎం కోర్టులో హాజరుపరచగా మెజిస్ట్రేట్ వరూధిని బెయిల్ మంజూరు చేశారు. సమయానికి పూచీకత్తు చెల్లించకపోవడంతో యోగేష్‌ను చర్లపల్లి జైలుకు తరలించారు. త్వరలో కస్టడీలోకి తీసుకోనున్నట్లు పోలీసులు తెలిపారు. -
‘అందుకే డీసీపీ బూటుతో తన్నాడు’
సాక్షి, హైదరాబాద్ : షార్ట్‌ఫిల్మ్ డైరెక్టర్ యోగి తనను చెడుగా చూపించే ప్రయత్నం చేస్తున్నాడని షార్ట్‌ఫిల్మ్ నటి హారిక చెప్పింది. తప్పు చేసిన వ్యక్తిని ఓ డీసీపీ బూటుతో తంతే తప్పేముందని, పోలీసులముందే తనను యోగి బూతు మాటలు అంటుంటే తన్నారని అన్నారు. అదే దుబాయ్‌లో అయితే కాలో చేయో తీస్తారని పేర్కొన్నారు. తాను ఏ తప్పు చేయలేదంటూ యోగి పోలీసులకు కొన్ని వాట్సాప్ మెసేజ్‌లను పంపించడంపై ఆమె స్పందిస్తూ ఓ సెల్ఫీ వీడియోను తాజాగా మీడియాకు పంపించింది. ఎంతో మంది ఉద్యోగాలు చేస్తున్న వారు, చదువుకుంటున్నవారు జెన్యూన్‌గా నటించాలని ఇండస్ట్రీకి వస్తుంటారని, అలాంటి వారు యోగిలాంటి వారి బారిన పడకూడదనే తాను ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదును ఇచ్చానన్నారు. తానే స్వయంగా యోగికి అలాంటి మెసేజ్‌లు పెడితే ఎందుకు ఫిర్యాదు చేస్తానని అన్నారు. తన ఇమేజ్ను మీడియా సాక్షిగా దెబ్బకొట్టాననే అక్కసుతోనే తనపై యోగి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాడని, అతడిది పూర్తిగా క్రిమిలన్ బ్రెయిన్ అని మండిపడ్డారు. అతడిపై ఇప్పటికే మూడు లైంగిక వేధింపుల కేసులు ఉన్నాయని గుర్తు చేశారు. న్యాయం తనవైపే ఉందని, యోగిపై ఎందాకైనా పోరాడుతానని స్పష్టం చేశారు. ఏ అమ్మాయి కూడా వేధింపులను సహించకూడదని, ధైర్యంగా పోలీసులకు చెప్పాలని తెలిపారు. ‘బూతు మాట్లాడితే డీసీపీ బూటుతో తన్నాడు.. తప్పా?’ -
‘బూతు మాట్లాడితే యోగీని తన్నాడు..తప్పా?’
-
మాదాపూర్ అడిషినల్ డీసీపీపై బదిలీ వేటు
సాక్షి, హైదరాబాద్: సైబరాబాద్ అడిషనల్ డీసీపీ గంగిరెడ్డి తీరు వివాదాస్పదంగా మారింది. ముత్యాల యోగి కుమార్ అనే వ్యక్తిని బూటు కాలితో తన్నిన షీటీమ్స్ ఇన్చార్జి, మాదాపూర్ అడిషనల్ డీసీపీ గంగిరెడ్డిని సిటీ ఆర్మ్డ్ రిజర్వు(సీఎఆర్) హెడ్ క్వార్టర్స్‌కు బదిలీ చేశారు. షార్టు ఫిలింలో నటించే సాఫ్ట్వేర్ ఇంజనీర్ హారిక ఫిర్యాదు మేరకు యోగిని విచారణకు పిలిచి ఏడీసీపీ గంగిరెడ్డి బూటు కాలితో తన్నినట్లు ఉన్న వీడియో టీవీ చానళ్లలో, సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అందులో వాస్తవం ఎంత ఉందో విచారణ చేపట్టాలని డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశించారు. ఈమేరకు డీసీపీ విశ్వప్రసాద్‌ను విచారణ అధికారిగా నియమించిన విషయం విదితమే. ఈ క్రమంలో గంగిరెడ్డిని బదిలీ చేస్తూ సైబరాబాద్ కమిషనర్ సందీప్ శాండిల్య ఉత్తర్వులు జారీ చేశారు. తన పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించాడంటూ షార్ట్ ఫిల్మ్ హీరోయిన్ హారిక హైదరాబాద్, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. యోగి ఈ వివాదంపై ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో స్పందించిన తాను ఆమెను వేదించలేదని.. కేవలం పది వేల రూపాయల విషయంలో జరిగిన వివాదమే ఇందుకు కారణమని తెలిపాడు. అదే సమయంలో డీసీపీ గంగిరెడ్డి తనపై దాడి చేస్తున్న వీడియోను తాను రిలీజ్ చేయలేదని ఆ వీడియో కూడా హారికనే షూట్ చేసిన తన మిత్రులకు షేర్ చేసిందని చెప్పారు. -
అసభ్యంగా మాట్లాడటం వల్లే అలా చేశారు
-
‘జేడీ చక్రవర్తి భార్యను కూడా వేధించాడు’
యోగితో వివాదంపై షార్ట్ ఫిలిం హీరోయిన్ హారిక స్పందించారు. పది వేల రూపాయల కోసమే ఇంత రాద్ధాంతం చేస్తున్నానని యోగి చెప్పడం అవాస్తవమని ఆమె అన్నారు. తనను యోగి వేధించిందనందుకే పోలీసులను ఆశ్రయించానని తెలిపారు. తనతో పాటు తన భర్తకు కూడా అసభ్యకర పదాలతో మెసేజ్ లు చేశాడని, సాక్ష్యాలను పోలీసులకు అందించానని తెలిపారు. పది రోజుల క్రితం వరకు బాగానే ఉన్న యోగి కొద్ది రోజులుగానే ఇలా ప్రవర్తిస్తున్నాడని హారిక తెలిపారు. యోగి గతంలో కూడా కొంత మంది అమ్మాయిలను ఇలాగే వేధించాడని.. గతంలో జేడీ చక్రవర్తి భార్య అనుకృతి కూడా ‘పాప’ అనే షార్ట్ ఫిలిం సమయంలో యోగిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు హారిక తెలిపారు. అతడు బయటకు కనిపించేంత మంచి వాడు కాదని, అందరి ముందు ఎంతో మర్యాదగా నటించే యోగి గతంలో చాలా మంది అమ్మాయిలను ఇబ్బంది పెట్టాడని ఆరోపించారు. యోగి గురించి బయట చెడుగా ప్రచారం జరుగుతున్న విషయాన్ని ప్రస్తుతం అతనితో రిలేషన్ లో ఉన్న అమ్మాయికి చెప్పానని, దీంతో తన మీద పగ పెంచుకున్నట్లు హారిక తెలిపారు. తనపై వేధింపులకు దిగటంతో గతంలో ఇచ్చిన డబ్బు వెనక్కి ఇచ్చేయమన్నానని.. అప్పటి నుంచి వేధింపులు మరింత ఎక్కువయ్యాయని ఆమె పేర్కొన్నారు. ఇదే విషయంపై ఫిర్యాదు చేశానని, అయితే పోలీసుల ఎదుట కూడా యోగి అసభ్యకర భాష వాడటం వల్లే...అడిషనల్ డీసీపీ యోగిని కొట్టినట్లు చెప్పారు. మరోవైపు సైబరాబాద్ అడిషనల్ డీసీపీ గంగిరెడ్డి యోగీని కాలుతో కొట్టన వ్యవహారంపై మాదాపూర్ డీసీపీ విశ్వప్రసాద్ స్పందించారు. మూడు రోజుల క్రితం షీ టీంకి డైరెక్టర్ యోగిపై ఫిర్యాదు చేసిన హారిక.. తరువాత తనే ఫిర్యాదు వద్దు యోగీకి కౌన్సెలింగ్ చేయమని కోరిందని తెలిపారు. అడిషనల్ డీసీపీ గంగిరెడ్డి ఆధ్వర్యంలో విచారణ జరిగిందన్నారరు. ఆ సమయంలో డైరెక్టర్ యోగి అసభ్యంగా మాట్లాడటంతో డీసీపీ గంగారెడ్డి.. యోగిని బూటు కాలుతో తన్నినట్లు వీడియో బయటకు వచ్చిందని తెలిపారు. వీడియో ఎలా బయటకు వచ్చిందో తెలియదన్న విశ్వప్రసాద్.. డీసీపీ గంగిరెడ్డి అలా చేయటం మాత్రం కరెక్ట్ కాదన్నారు. ఈ విషయాన్ని కమిషనర్ సందీప్ శాండిల్యా దృష్టికి తీసుకెళ్లామని ఆయన చర్యలు తీసుకుంటారని తెలిపారు. -
‘హీరోయిన్ హారికకు అసభ్యంగా మెసేజ్ చేశా’
తన పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించాడంటూ షార్ట్ ఫిల్మ్ హీరోయిన్ హారిక హైదరాబాద్, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ వివాదంపై ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో స్పందించిన యోగి తాను ఆమెను వేదించలేదని.. కేవలం పది వేల రూపాయల విషయంలో జరిగిన వివాదమే ఇందుకు కారణమని తెలిపాడు. అదే సమయంలో డీసీపీ గంగిరెడ్డి తనపై దాడి చేస్తున్న వీడియోను తాను రిలీజ్ చేయలేదని ఆ వీడియో కూడా హారికనే షూట్ చేసిన తన మిత్రులకు షేర్ చేసిందని తెలిపారు. తాను హారికను ఏ రోజు వేధింంచలేదని తెలిపారు ‘గతంలో తన వ్యక్తిగత విషయాలు హారిక నాతో షేర్ చేసుకునేది. ఆ విషయాలు మరో వ్యక్తి కారణంగా బయటకు వచ్చాయి. కానీ నేనే ఆ విషయాలను బయటపెట్టానని నా మీద కోపం పెంచుకుంది. నువ్వు నా పరువు తీశావు.. నేను కూడా నీ సంగతి చూస్తానంటూ నా మీద ఆరోపణలు చేసింది. అంతే కాదు ఇండస్ట్రీలో నాకు తెలిసిన వ్యక్తులకు ఫోన్ చేసి నా గురించి తప్పుగా చెప్పేది’ అన్నారు. తన మీద తప్పుడు ప్రచారం చేయటం ఆపేస్తేనే హారిక దగ్గర తీసుకున్న పదివేల రూపాయలు తిరిగిస్తానని చెప్పానన్నారు. హారికతో తానెప్పుడు కలిసి పని చేయలేదన్న యోగి.. ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా ఆమె పరిచయం అయ్యిందని తెలిపారు. తాను హారికకు అసభ్యంగా మెసేజ్ చేసిన మాట వాస్తవమేనని, అయితే ఆమె రెచ్చగొట్టడం వల్లే అలా చేశానన్నారు. -
హీరోయిన్ ముందు పోలీస్ హీరోయిజం
-
హీరోయిన్ ముందు పోలీసాఫీసర్ హీరోయిజం
సాక్షి, హైదరాబాద్ : సైబరాబాద్ అడిషనల్ డీసీపీ గంగిరెడ్డి తీరు వివాదాస్పదంగా మారింది. షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ యోగిని కాలుతో తన్నటం మీడియాలో హల్ చల్ చేస్తోంది. తన పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించాడంటూ షార్ట్ ఫిల్మ్ హీరోయిన్ హారిక హైదరాబాద్, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. తనను శారీరకంగా లొంగదీసుకునేందుకు యోగి యత్నించాడని, రెమ్యునరేషన్ కూడా ఇవ్వలేదని ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసిన పోలీసులు, యోగిని పిలిపించి గంటన్నర సేపు విచారించారు. అయితే, ఈ క్రమంలో యోగిని గంగిరెడ్డి బూటుతో తన్నారు. కౌన్సిలింగ్ పేరుతో పీఎస్‌కు పిలిచి మరీ చితకబాదారు. అయితే స్టేషన్ లో కూడా హారిక పట్ల యోగి దురుసుగా ప్రవర్తించినట్టు అధికారి చెబుతున్నప్పటికీ... యోగి మాత్రం వాటిని ఖండించాడు. పారితోషకం ఎప్పుడో ఇచ్చేశానని.. తాను చెప్పేది వినకుండా అధికారి తనపై చెయ్యి చేసుకున్నారని యోగి చెబుతున్నారు. -
హారిక గేమ్ ‘డ్రా’
న్యూఢిల్లీ: ఐల్ ఆఫ్ మ్యాన్ ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక తన మూడో రౌండ్ గేమ్‌ను ‘డ్రా’గా ముగించింది. నిల్స్ గ్రాండెలియుస్ (స్వీడన్)తో సోమవారం జరిగిన మూడో రౌండ్ గేమ్‌లో తెల్లపావులతో ఆడిన హారిక 45 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. -
ఆనంద్, హారిక శుభారంభం
ఐసల్ ఆఫ్ మ్యాన్ (యూకే): ఐసల్ ఆఫ్ మ్యాన్ ఇంటర్నేషనల్ చెస్ టోర్నమెంట్లో భారత అగ్రశ్రేణి ఆటగాళ్లు విశ్వనాథన్ ఆనంద్, ద్రోణవల్లి హారిక శుభారంభం చేశారు. శనివారం అర్ధరాత్రి తర్వాత జరిగిన తొలిరౌండ్ గేమ్‌లో తెలుగమ్మాయి ప్రపంచ నెం. 10 ర్యాంకర్ హారిక... ఇంగ్లండ్‌కు చెందిన ఒయామా అకిటోను ఓడించింది. మరోవైపు ఐదుసార్లు ప్రపంచ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ తన తొలి గేమ్‌ను 46 ఎత్తుల్లో మార్క్ ఎస్సర్మెన్ (అమెరికా)పై గెలుపొం దాడు. ఇద్దరూ కూడా తెల్లపావులతో ఆడి ప్రత్యర్థులపై గెలిచారు. రెండో గేములో ఆనంద్ జర్మనీకి చెందిన లాంపర్ట్ జొనాస్‌తో, హారిక జర్మన్ ఫిడే మాస్టర్ బాబర్ మైకేల్‌తో ఆడుతుంది. -
హారిక కేసులో కొత్త కోణం
-
అల్లుడే చంపేశాడు
♦ హారిక మృతిపై తల్లిదండ్రుల ఫిర్యాదు ♦ పోలీసుల అదుపులో నిందితులు నాగోలు : ఎంబీబీఎస్‌లో సీటు రాలేదని, ఎంసెట్ కోచింగ్ కోసం పెట్టిన డబ్బును తీసుకురావాలని తమ కూతురిని అల్లుడే కిరోసిన్ పోసి నిప్పంటించి హత్యచేశాడని హారిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి భర్త, అత్తమామలను అదుపులోకి తీసుకున్నారు. ఎల్బీనగర్ పోలీసులు తెలిపిన మేరకు.. ఖమ్మం జిల్లాకు చెందిన హారిక (20)తో 2015 సంవత్సరంలో అదే జిల్లాకు చెందిన రిషికుమార్‌తో పెళ్లి జరిగింది. కట్నం కింద రిషికుమార్‌కు రెండెకరాల భూమి, రూ. ఐదు లక్షల కట్నం ఇచ్చారు. వివాహం అయిన తరువాత ఎంసెట్ శిక్షణ కోసం హారిక కొంతకాలం ప్రైవేటు హాస్టల్లో ఉండి కోచింగ్ తీసుకుంది. అయితే ఎంసెట్‌లో సీటు రాలేదు. బీడీఎస్ కోర్సులో సీటు రావడంతో నగరంలోని రాక్‌టౌన్‌లో నివాసముంటున్నారు. రిషికుమార్ కొత్తపేటలోని ఐటీ కార్యాలయంలో పనిచేస్తున్నాడు. ఎంబీబీఎస్‌సీటు రాకపోవడంతో హారికను భర్త మానసికంగా, శారీరకంగా ఇబ్బందులకు గురిచేశాడు. కోచింగ్ కోసం అయిన ఖర్చు ఐదు లక్షల రూపాయలను పుట్టింటి నుంచి తీసుకురమ్మని వేధిస్తున్నాడు. రిషి తల్లిదండ్రులు హరిచంద్, అరుణలు కూడా హారికను వేధిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం రాత్రి కిరోసిన్ పోసి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని కుటుంబ సభ్యులు సోమవారం ఎల్బీనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎల్బీనగర్ పోలీసులు రిషికుమార్, అతని తల్లితండ్రులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇదిలా ఉండగా హారికను భర్త రిషికుమార్ హత్య చేసి కిరోసిన్ పోసుకుని అంటించి.. తనకు తానుగానే ఆత్మహత్య చేసుకుందని నమ్మించే ప్రయత్నం చేశాడు. ప్రాథమిక సమాచారం మేరకు హత్య చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. హారిక మృతి చెందిన ప్రమాద స్థలాన్ని రాచకొండ పోలీసు కమీషనర్ మహేష్‌భగవత్ సోమవారం పరిశీలించారు. -
హారికను హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరణ
సాక్షి, హైదరాబాద్ : అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన హారికను హత్య చేసి, అనంతరం కిరోసిన్ పోసి తగులబెట్టినట్లు పోలీసులు నిర్థారణకు వచ్చారు. ఈ మేరకు పలు ఆధారాలను పోలీసులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. అయితే పోస్ట్‌మార్టం నివేదిక అనంతరం హారికను ఏవిధంగా హతమార్చారన్నది తెలుస్తాయన్నారు. కాగా రాక్‌టౌన్ కాలనీలో నివాసం ఉంటున్న మహబూబాబాద్ జిల్లా గార్ల మండలానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ రిషికుమార్‌తో ఖమ్మం జిల్లా కూసుమంచి మండలానికి చెందిన బాణోతు హారిక (24)కు రెండేళ్ల క్రితం వివాహం అయింది. ఇద్దరూ వరుసకు బావామరదళ్లు. ఇటీవలే హారిక కామినేనిలో బీడీఎస్‌లో చేరింది. అయితే ఆమెకు ఎంబీబీఎస్ సీటు రాకపోవడంతో భార్యాభర్తల మధ్య తరచుగా వాగ్వాదం జరుగుతోంది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఆమె అనుమానాస్ప స్ధితిలో నిప్పుంటుకొని మృతి చెందింది. భార్య కిరోసిన్ పోసుకుని చనిపోయినట్లు భర్త రిషికుమార్ హారిక తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు. అయితే మృతురాలి తల్లిదండ్రులు మాత్రం తమ కూతురిని అల్లుడే చంపాడని ఆరోపించారు. గత కొద్దిరోజులుగా గొడవలు జరుగుతున్నాయని హారిక తమతో చాలాసార్లు చెప్పిందని ఆమె తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. సర్దుకుపోవాలని తాము సూచించామన్నారు. ఎంబీబీఎస్‌లో సీటు వస్తేనే కాపురానికి రావాలని తమ అల్లుడు వేధించేవాడని చెప్పారు. రిషికుమార్‌కు బయట వేరేవాళ్లతో ఎఫైర్ ఉందని, అంతేకాకుండా అదనపు కట్నం కావాలని వేధించేవాడని హారిక సోదరి తెలిపింది. తన చెల్లెలును... భర్త, అతని కుటుంబసభ్యులు హత్య చేసి, అనంతరం ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించారని ఆరోపించారు. రిషికుమార్‌తో పాటు అతని తల్లిదండ్రులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. -
డబ్బులు అందాయా :టీడీపీ కౌన్సిలర్ హారిక
-
మహిళల విభాగంలో హారిక ‘టాప్’
హైదరాబాద్: అబుదాబి ఓపెన్ చెస్ అంతర్జాతీయ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక మహిళల విభాగంలో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. యూఏఈలోని అబుదాబిలో మంగళవారం ముగిసిన ఈ టోర్నీలో హారిక మొత్తం 5.5 పాయింట్లు స్కోరు చేసింది. చివరిదైన తొమ్మిదో రౌండ్లో హారిక 43 ఎత్తుల్లో డేవిడ్ ఎగెల్స్టన్ (ఇంగ్లండ్)పై విజయం సాధించింది. ఓవరాల్ ర్యాంకింగ్స్‌లో మాత్రం హారిక 29వ స్థానంలో నిలిచింది. ఈ టోర్నీలో హారిక నాలుగు గేముల్లో గెలిచి, మూడు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని, మరో రెండు గేముల్లో ఓడిపోయింది. ఓపెన్ విభాగంలో అమీన్ బాసిమ్ (ఈజిప్ట్) 7.5 పాయింట్లతో విజేతగా నిలువగా... నైజెల్ షార్ట్ (ఇంగ్లండ్–7 పాయింట్లు) రెండో స్థానంలో, ఆర్యన్ చోప్రా (భారత్–6.5 పాయింట్లు) మూడో స్థానంలో నిలిచారు. -
చైనాను నిలువరించిన భారత్
ఖాంటీ మన్‌సిస్క్ (రష్యా): ప్రపంచ టీమ్ చెస్ చాంపియన్‌షిప్‌లో ఏడో రౌండ్లో భారత మహిళల జట్టు 2–2తో పటిష్టమైన చైనా జట్టును నిలువరించింది. జూ వెన్జున్తో జరిగిన గేమ్‌ను హారిక, ప్రపంచ చాంపియన్ తాన్ జోంగితో జరిగిన గేమ్‌ను తానియా ‘డ్రా’ చేసుకోగా... కి గువోపై పద్మిని రౌత్ గెలిచింది. లీ తింగ్జీ చేతిలో ఇషా కరవాడే ఓడిపోయింది. పురుషుల విభాగంలో భారత జట్టు 2.5–1.5తో ఉక్రెయిన్‌పై గెలిచింది. ఆదిబన్ నెగ్గగా... శశికిరణ్, విదిత్, పరిమార్జన్ నేగి తమ గేమ్‌లను ‘డ్రా’గా ముగించారు. -
హారిక ఓటమి
మాల్మో (స్వీడన్): టెపి సిజ్మన్ ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారికకు తొలి పరాజయం ఎదురైంది. ఎరిక్ బ్లోమ్విస్ట్ (స్వీడన్)తో శుక్రవారం జరిగిన మూడోరౌండ్ గేమ్‌లో తెల్లపావులతో ఆడి కూడా ప్రయోజనం పొందలేకపోయింది. చివరకు ఆమె 50 ఎత్తుల్లో పరాజయం పాలైంది. ఆరుగురు గ్రాండ్‌మాస్టర్ల మధ్య రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరుగుతోన్న ఈ టోర్నీలో హారిక తొలి రెండు గేమ్‌లను ‘డ్రా’ గా ముగించింది. -
హారిక రెండో గేమ్ ‘డ్రా’
మాల్మో (స్వీడన్): టెపి సిజ్మన్ ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక రెండో గేమ్‌ను కూడా ‘డ్రా’గా ముగించింది. నిల్స్ గ్రాండెలియుస్ (స్వీడన్)తో గురువారం జరిగిన రెండో రౌండ్ గేమ్‌ను నల్లపావులతో ఆడిన హారిక 51 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. ఆరుగురు గ్రాండ్‌మాస్టర్ల మధ్య రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరుగుతోన్న ఈ టోర్నీలో రెండో రౌండ్ తర్వాత హారిక ఒక పాయింట్ సాధించి మరో నలుగురితో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో ఉంది. -
విజేత హారిక
హైదరాబాద్: రెక్జావిక్ ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక అగ్రస్థానాన్ని సంపాదించింది. ఐస్లాండ్లోని రెక్జావిక్ పట్టణంలో ముగిసిన ఈ టోర్నీలో హారిక మహిళల విభాగంలో ఏడు పాయింట్లతో విజేతగా నిలిచింది. జాకబ్ ఫ్రెయుండ్ (జర్మనీ)తో జరిగిన చివరిదైన పదో రౌండ్ గేమ్‌లో హారిక 44 ఎత్తుల్లో విజయం సాధించింది. ఓవరాల్‌గా ఈ టోర్నీలో హారిక ఆరు గేముల్లో గెలిచి, రెండింటిలో ఓడి, మరో రెండింటిని ‘డ్రా’గా ముగించింది. ఇదే టోర్నీ అండర్–12 విభాగంలో భారత్‌కే చెందిన ప్రజ్ఞానంద టైటిల్ సాధించాడు. -
హారిక మూడో విజయం
న్యూఢిల్లీ: రెక్జావిక్ (ఐస్లాండ్) ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక మూడో విజయం సాధించింది. శుక్రవారం మార్టిన్ బరోస్ (ఇంగ్లండ్)తో జరిగిన నాలుగో గేమ్‌లో తెల్లపావులతో ఆడిన హారిక 30 ఎత్తుల్లో గెలిచింది. నాలుగో రౌండ్ తర్వాత హారిక 3.5 పాయింట్లతో మరో ఐదుగురితో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో ఉంది. భారత్‌కే చెందిన విదిత్ సంతోష్ గుజరాతి, అభిజిత్ గుప్తా నాలుగేసి పాయింట్లతో ఉమ్మడిగా అగ్రస్థానంలో ఉన్నారు. -
హారిక శుభారంభం
రేక్జావిక్ (ఐస్లాండ్): భారత గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక రేక్జావిక్ ఓపెన్ చెస్ టోర్నమెంట్లో శుభారంభం చేసింది. తొలి రౌండ్లో నల్లపావులతో బరిలోకి దిగిన ఆమె... మాగ్నస్ మాగ్నుసన్ (ఐస్లాండ్)పై గెలుపొందింది. -
షార్జా మాస్టర్స్ టోర్నీ: హారికకు అగ్రస్థానం
సాక్షి, హైదరాబాద్: ఇటీవలే ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం నెగ్గిన ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక... అదే జోరును షార్జా మాస్టర్స్ టోర్నీలోనూ కనబరిచింది. షార్జాలో శుక్రవారం ముగిసిన ఈ టోర్నీలో హారిక మహిళల విభాగంలో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత హారిక ఆరు పాయింట్లు సాధించింది. మూడు గేముల్లో గెలిచిన హారిక, మరో ఆరు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని ఈ టోర్నీలో అజేయంగా నిలిచింది. భారత్‌కే చెందిన శ్రీజ శేషాద్రి, మేరీ ఆన్ గోమ్స్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. మరోవైపు ఇదే టోర్నీ ఓపెన్ విభాగంలో భారత గ్రాండ్‌మాస్టర్ ఆదిబన్ రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత ఆదిబన్తోపాటు మరో ఐదుగురు క్రీడాకారులు కూడా ఏడు పాయింట్లు సాధించి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంక్‌లను వర్గీకరించగా ఆదిబన్‌కు రెండో స్థానం లభించింది. వాంగ్ హావో (చైనా) విజేతగా నిలువగా... మార్టిన్ క్రాట్సివ్ (ఉక్రెయిన్) మూడో స్థానాన్ని పొందాడు. హరికృష్ణ గేమ్ ‘డ్రా’... చైనాలో జరుగుతున్న షెన్జెన్ గ్రాండ్‌మాస్టర్స్ టోర్నీలో హైదరాబాద్ ప్లేయర్ పెంటేల హరికృష్ణ ఐదో ‘డ్రా’ నమోదు చేశాడు. యు యాంగి (చైనా)తో శనివారం జరిగిన తొమ్మిదో రౌండ్ గేమ్‌ను హరికృష్ణ 31 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. తొమ్మిదో రౌండ్ తర్వాత హరికృష్ణ 4.5 పాయింట్లతో పీటర్ స్విద్లెర్ (రష్యా)తో కలిసి సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నాడు. ఆదివారం జరిగే చివరిదైన పదో రౌండ్లో లిరెన్ డింగ్ (చైనా)తో హరికృష్ణ ఆడతాడు. లిరెన్ డింగ్ 5.5 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా... అనీశ్ గిరి (నెదర్లాండ్స్) ఐదు పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. -
హారిక జట్టుకు టైటిల్
చెన్నై: పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (పీఎస్‌పీబీ) ఇంటర్ యూనిట్ చెస్ చాంపియన్‌షిప్‌లో తెలుగు తేజాలు ద్రోణవల్లి హారిక, లలిత్ బాబు ప్రాతినిధ్యం వహించిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్) ‘ఎ’ జట్టు సత్తా చాటింది. టీమ్ విభాగంలో మొత్తం 11 జట్లు తలపడిన ఈ టోర్నీలో ఐఓసీఎల్ ‘ఎ’ జట్టు చాంపియన్‌గా నిలిచింది. సూర్య శేఖర గంగూలీ, ఆధిబన్, హారిక, లలిత్‌బాబు, అభిజిత్ కుంతేలతో కూడిన ఐఓసీఎల్ ‘ఎ’ జట్టు 20 పాయింట్లను సాధించి టైటిల్‌ను దక్కించుకుంది. ఎనిమిది సంవత్సరాల తర్వాత ఐఓసీఎల్ జట్టు ఈ టైటిల్‌ను గెలుచుకోవడం విశేషం. హారిక తొలిసారిగా పీఎస్‌పీబీ టోర్నీలో ఆడింది. టీమ్ విభాగంలో లలిత్ బాబు 5.5 పాయింట్లు సాధించగా... హారిక, ఆధిబన్ చెరో 4 పాయింట్లు స్కోరు చేశారు. గంగూలీ 3.5, అభిజిత్ 3 పాయింట్లను సాధించారు. -
పోరాడి ఓడిన హారిక... కాంస్య పతకం సొంతం
టెహరాన్ (ఇరాన్): చివరి క్షణం వరకు తన శక్తి వంచన లేకుండా పోరాడినప్పటికీ.... సమయాభావం రూపంలో దురదృష్టం వెంటాడటంతో ప్రపంచ మహిళల నాకౌట్ చెస్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక కాంస్య పతకంతో సంతృప్తి పడింది. తాన్ జోంగి (చైనా)తో శనివారం జరిగిన సెమీఫైనల్ టైబ్రేక్‌లో హారిక 3–4 తేడాతో ఓడిపోయింది. ‘ర్యాపిడ్’ పద్ధతిలో జరిగిన తొలి రెండు గేముల్లో చెరొకటి నెగ్గడంతో స్కోరు 1–1తో సమమైంది. ‘ర్యాపిడ్’ పద్ధతిలోనే మళ్లీ రెండు గేమ్‌లు నిర్వహించగా... ఈసారీ చెరొకటి గెలవడంతో స్కోరు 2–2తో సమమైంది. ఆ తర్వాత ‘బ్లిట్జ్’ పద్ధతిలో నిర్వహించిన రెండు గేమ్‌లూ ‘డ్రా’గా ముగిశాయి. దాంతో స్కోరు 3–3తో సమమైంది. ‘అర్మగెడాన్’ పద్ధతిలో ఆఖరి గేమ్‌ను నిర్వహించారు. తెల్ల పావులు పొందిన హారికకు 5 నిమిషాలు... నల్లపావులు పొందిన తాన్ జోంగికి 4 నిమిషాలు కేటాయించారు. నిబంధనల ప్రకారం తెల్ల పావులతో ఆడేవారు ఐదు నిమిషాల్లో ఫలితం సాధించాలి. లేదంటే నల్లపావులతో ఆడినlవారిని విజేతగా ప్రకటిస్తారు. 99 ఎత్తుల తర్వాత హారిక వద్ద సమయం అయిపోవడం, ఫలితం తేలక పోవడంతో తాన్ జోంగి విజేతగా నిలిచింది. దాంతో ఈ మెగా ఈవెంట్ చరిత్రలో హారికకు వరుసగా మూడోసారీ (2012, 2015, 2017) కాంస్యమే దక్కింది. -
హారిక ‘హ్యాట్రిక్’
ప్రపంచ చాంపియన్‌షిప్‌లో వరుసగా మూడోసారి సెమీస్‌కు టెహరాన్ (ఇరాన్): మరోసారి టైబ్రేక్‌లో పైచేయి సాధించిన ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక... ప్రపంచ మహిళల నాకౌట్ చెస్ చాంపియన్‌షిప్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. తద్వారా కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. నానా జాగ్‌నిద్జె (జార్జియా)తో బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ టైబ్రేక్‌లో హారిక 1.5–0.5తో విజయం సాధించింది. తొలి గేమ్‌లో తెల్లపావులతో ఆడిన హారిక 53 ఎత్తుల్లో గెలిచి... నల్ల పావులతో ఆడిన రెండో గేమ్‌ను 49 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. అంతకుముందు మంగళవారం నిర్ణీత రెండు గేమ్‌ల తర్వాత ఇద్దరూ 1–1తో సమంగా ఉండటంతో విజేతను నిర్ణయించడానికి టైబ్రేక్ నిర్వహించారు. గురువారం జరిగే సెమీఫైనల్ తొలి గేమ్‌లో తాన్ జోంగి (చైనా)తో హారిక తలపడుతుంది. ఈ టోర్నీలో హారిక విజయాలన్నీ టైబ్రేక్‌లోనే ఖాయం కావడం గమనార్హం. ఈ మెగా ఈవెంట్ చరిత్రలో హారిక వరుసగా మూడోసారి సెమీఫైనల్‌కు చేరడం విశేషం. 2012, 2015లలో హారిక సెమీస్‌లో ఓడి కాంస్య పతకాలను గెల్చుకుంది. -
రెండో గేమ్‌లో హారిక ఓటమి
టెహరాన్: ప్రపంచ మహిళల చెస్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక తొలి పరాజయాన్ని చవిచూసింది. క్వార్టర్ ఫైనల్ చేరుకునే క్రమంలో ఒక్క గేమ్ కూడా తన ప్రత్యర్థులకు కోల్పోని హారిక జోరుకు జార్జియా క్రీడాకారిణి నానా జాగ్‌నిద్జె చెక్ పెట్టింది. మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ రెండో గేమ్‌లో హారిక నల్లపావులతో ఆడుతూ 67 ఎత్తుల్లో నానా జాగ్‌నిద్జె చేతిలో ఓటమి పాలైంది. నిర్ణీత రెండు గేమ్‌ల తర్వాత చెరో విజయంతో హారిక, నానా జాగ్‌నిద్జె 1–1తో సమంగా ఉన్నారు. దాంతో వీరిద్దరి మధ్య విజేతను నిర్ణయించేందుకు బుధవారం టైబ్రేక్ గేమ్‌లు నిర్వహిస్తారు. టైబ్రేక్‌లో గెలిచిన వారు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తారు. -
హారిక విజయం
టెహరాన్: ప్రపంచ మహిళల చెస్ చాంపియన్‌షిప్ క్వార్టర్ ఫైనల్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక శుభారంభం చేసింది. నానా జాగ్‌నిద్జె (జార్జియా)తో సోమవారం జరిగిన తొలి గేమ్‌లో తెల్లపావులతో ఆడిన హారిక 47 ఎత్తు ల్లో విజయం సాధించింది. రెండు గేమ్‌ల మ్యాచ్‌లో 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. నానా జాగ్నిద్జెతోనే మంగళవారం జరిగే రెండో గేమ్‌ను హారిక ‘డ్రా’ చేసుకుంటే సెమీఫైనల్లోకి ప్రవేశిస్తుంది. -
క్వార్టర్ ఫైనల్లో హారిక
టెహరాన్ (ఇరాన్): ప్రపంచ మహిళల చెస్ చాంపియన్‌షిప్ ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో భారత క్రీడాకారిణులకు మిశ్రమ ఫలితాలు లభించాయి. ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించగా... ఒడిషా అమ్మాయి పద్మిని రౌత్‌కు ఓటమి ఎదురైంది. ఆదివారం జరిగిన టైబ్రేక్‌లో హారిక 2.5–1.5తో సొపికో గురామిష్‌విలి (జార్జియా)పై నెగ్గగా... పద్మిని 1.5–2.5తో తాన్ జోంగి (చైనా) చేతిలో ఓడిపోయింది. సోమవారం జరిగే క్వార్టర్ ఫైనల్ తొలి గేమ్‌లో నానా జాగ్‌నిద్జె (జార్జియా)తో హారిక తలపడుతుంది. సొపికో, హారికల మధ్య జరిగిన తొలి రెండు టైబ్రేక్ గేమ్‌లు వరుసగా 53 ఎత్తుల్లో, 51 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిశాయి. దాంతో స్కోరు 1–1తో సమమైంది. ఫలితం తేలడానికి వీరిద్దరి మధ్యే మరో రెండు గేమ్‌లు నిర్వహించగా... తొలి గేమ్‌లో హారిక 46 ఎత్తుల్లో గెలుపొంది... రెండో గేమ్‌ను 35 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకొని విజయాన్ని ఖాయం చేసుకుంది. శనివారం జరిగిన రెండు రెగ్యులర్ గేమ్‌ల తర్వాత ఇద్దరి స్కోర్లు 1–1తో సమం కావడంతో విజేతను నిర్ణయించడానికి ఆదివారం టైబ్రేక్‌లు నిర్వహించారు. -
హారిక, పద్మిని గేమ్‌లు ‘డ్రా’
టెహరాన్ (ఇరాన్): ప్రపంచ మహిళల చెస్ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారిణులు ద్రోణవల్లి హారిక, పద్మిని రౌత్ ప్రిక్వార్టర్ ఫైనల్ తొలి గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్నారు. సొపికో గురామిష్‌విలి (జార్జియా)తో జరిగిన గేమ్‌లో నల్లపావులతో ఆడిన హారిక 49 ఎత్తుల్లో... తాన్ జోంగి (చైనా)తో జరిగిన గేమ్‌లో నల్లపావులతో ఆడిన పద్మిని 60 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించారు. శనివారం జరిగే రెండో రౌండ్లో గెలిచిన వారు క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధిస్తారు. -
హారిక, పద్మిని గేమ్‌లు ‘డ్రా’
టెహరాన్: ప్రపంచ మహిళల చెస్ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారిణులు ద్రోణవల్లి హారిక, పద్మిని రౌత్ తమ రెండో రౌండ్ రెండో గేమ్‌లను కూడా ‘డ్రా’ చేసుకున్నారు. దినారా సదుకసోవా (కజకిస్తాన్)తో జరిగిన గేమ్‌ను హారిక 22 ఎత్తుల్లో... జావో జుయ్ (చైనా)తో జరిగిన గేమ్‌ను పద్మిని కూడా 22 ఎత్తుల్లో నే ‘డ్రా’గా ముగించారు. నిర్ణీత రెండు గేమ్‌ల తర్వాత హరిక–దినారా... పద్మిని–జాయ్ జుయ్ స్కోర్లు 1–1తో సమమయ్యాయి. దాంతో గురువారం వీరి మధ్యనే టైబ్రేక్ గేమ్‌లు నిర్వహిస్తారు. గెలిచినవారు ప్రిక్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధిస్తారు. -
రెండో రౌండ్లో హారిక
టెహరాన్: ప్రపంచ మహిళల చెస్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక రెండో రౌండ్లోకి ప్రవేశించింది. షమీమా (బంగ్లాదేశ్)తో సోమవారం జరిగిన టైబ్రేక్‌లో హారిక 1.5–0.5తో విజయం సాధించింది. టైబ్రేక్ తొలి గేమ్‌లో హారిక 49 ఎత్తుల్లో గెలిచి... రెండో గేమ్‌ను 75 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. మంగళవారం జరిగే రెండో రౌండ్ తొలి గేమ్‌లో దినారా సదుకసోవా (కజకిస్తాన్)తో హారిక తలపడుతుంది. -
హారిక రెండో గేమ్ కూడా ‘డ్రా’
టెహరాన్: ప్రపంచ మహిళల చెస్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక తొలి రౌండ్ రెండో గేమ్‌ను కూడా ‘డ్రా’ చేసుకుంది. షమీమా (బంగ్లాదేశ్)తో ఆదివారం జరిగిన రెండో రౌండ్ గేమ్‌లో హారిక 38 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. దాంతో రెండు గేమ్‌ల తర్వాత ఇద్దరూ 1–1తో సమంగా నిలిచారు. ఫలితంగా సోమవారం జరిగే టైబ్రేక్‌లో నెగ్గినవారు రెండో రౌండ్‌కు అర్హత పొందుతారు. మరోవైపు భారత్‌కే చెందిన పద్మిని రెండో రౌండ్‌కు చేరింది. ఎలీనా (అర్మేనియా)తో జరిగిన తొలి గేమ్‌ను ‘డ్రా’ చేసుకున్న పద్మిని... రెండో గేమ్‌లో 29 ఎత్తుల్లో గెలిచి ఓవరాల్‌గా 1.5–0.5తో విజయాన్ని దక్కించుకుంది. -
ఆశల పల్లకిలో హారిక
టెహరాన్: గత రెండు ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ పోటీల్లో (2012, 2015) కాంస్య పతకాలు సాధించిన భారత గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక ఈసారి మరింత మెరుగైన ప్రదర్శన కనబరచాలనే పట్టుదలతో ఉంది. శనివారం ఇరాన్‌లోని టెహరాన్‌లో మొదలయ్యే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఈ తెలుగు అమ్మాయి నాలుగో సీడ్‌గా బరిలోకి దిగనుంది. శని వారం జరిగే తొలి రౌండ్ తొలి గేమ్‌లో బంగ్లాదేశ్‌కు చెందిన షమీమాతో హారిక తలపడుతుంది. మొత్తం 64 మంది క్రీడాకారిణుల మధ్య నాకౌట్ పద్ధతిలో జరుగుతున్న ఈ టోర్నీ మార్చి 3వ తేదీన ముగుస్తుంది. సెమీఫైనల్ దశ వరకు ఇద్దరు క్రీడాకారిణుల మధ్య రెండు గేమ్‌ల చొప్పున జరుగుతాయి. ఎక్కువ పాయింట్లు సాధించిన క్రీడాకారిణికి విజయం దక్కుతుంది. ఒకవేళ స్కోరు సమంగా ఉంటే టైబ్రేక్ ద్వారా విజేతను నిర్ణయిస్తారు. భారత్ నుంచి మరో ప్లేయర్ పద్మిని రౌత్ కూడా బరిలోకి దిగుతోంది. -
హారికకు ఐదో స్థానం
దోహా: ప్రపంచ బ్లిట్జ్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారులు పతకం నెగ్గడంలో విఫలమయ్యారు. మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్స్ హారిక 10.5 పాయింట్లతో ఐదో స్థానంలో... హంపి 9.5 పాయింట్లతో పదో స్థానంలో నిలిచారు. 17 రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో అనా ముజిచుక్ (ఉక్రెయిన్–13 పాయింట్లు) విజేతగా నిలిచింది. 21 రౌండ్లపాటు జరిగిన ఓపెన్ విభాగంలో సెర్గీ కర్జాకిన్ (రష్యా–16.5 పాయింట్లు) చాంపియన్‌గా అవతరించగా... ఆనంద్ 13 పాయింట్లతో పదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. -
నెట్‌బాల్ జట్ల సారథులుగా పాషా, హారిక
సాక్షి, హైదరాబాద్: జాతీయ సీనియర్ నెట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే రాష్ట్ర జట్లను గురువారం ప్రకటించారు. పురుషుల జట్టుకు సయ్యద్ అథర్ పాషా, మహిళల జట్టుకు ఆనంద హారిక సింగ్ కెప్టెన్లుగా వ్యవహరిస్తారు. ఈ టోర్నీ ఢిల్లీలో డిసెంబర్ 31 నుంచి జనవరి 3 వరకు జరుగుతుంది. జట్ల వివరాలు: పురుషుల జట్టు: అథర్ పాషా (కెప్టెన్), నిజామ్, సాయి కిషోర్, రాజేందర్, శ్రీకాంత్, ఓంప్రకాశ్, విజయ్ కుమార్, నాగ హర్ష, ప్రసన్న, రాజశేఖర్, సందీప్, పవన్, బాలరాజు (కోచ్), సమ్మయ్య (మేనేజర్). మహిళల జట్టు: హారిక (కెప్టెన్), పావని, శైలజ, సహజ, సంజన, నందిని, సంగీత, శిరీష, సుప్రియ, రజిత, భావన, శ్రీజ, షేక్ అహ్మద్ (కోచ్), నందు కుమార్ (మేనేజర్).