
ఐసల్ ఆఫ్ మ్యాన్ (యూకే): ఐసల్ ఆఫ్ మ్యాన్ ఇంటర్నేషనల్ చెస్ టోర్నమెంట్‌లో భారత అగ్రశ్రేణి ఆటగాళ్లు విశ్వనాథన్ ఆనంద్, ద్రోణవల్లి హారిక శుభారంభం చేశారు. శనివారం అర్ధరాత్రి తర్వాత జరిగిన తొలిరౌండ్ గేమ్‌లో తెలుగమ్మాయి ప్రపంచ నెం. 10 ర్యాంకర్ హారిక... ఇంగ్లండ్‌కు చెందిన ఒయామా అకిటోను ఓడించింది.
మరోవైపు ఐదుసార్లు ప్రపంచ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ తన తొలి గేమ్‌ను 46 ఎత్తుల్లో మార్క్ ఎస్సర్‌మెన్ (అమెరికా)పై గెలుపొం దాడు. ఇద్దరూ కూడా తెల్లపావులతో ఆడి ప్రత్యర్థులపై గెలిచారు. రెండో గేములో ఆనంద్ జర్మనీకి చెందిన లాంపర్ట్ జొనాస్‌తో, హారిక జర్మన్ ఫిడే మాస్టర్ బాబర్ మైకేల్‌తో ఆడుతుంది.