
‘ప్రేమించుకుందాం రా, సూర్యవంశం, మనసంతా నువ్వే’ లాంటి చిత్రాల్లో బాలనటుడుగా చేసిన ఆనంద్ వర్ధన్(Anand Vardhan) హీరోగా నటించిన తొలి చిత్రం ‘నిదురించు జహాపన’(Nidurinchu Jahapana). నవమి గయాక్, రోష్ని సాహోతా హీరోయిన్స్ గా నటించారు. ప్రసన్న కుమార్ దేవరపల్లి దర్శకత్వంలో ఏఆర్ ఎంటర్ టైన్మెంట్స్‌పై సామ్ నిర్మించిన ఈ మూవీ ఫిబ్రవరి 14న రిలీజ్ కానుంది.
ఈ మూవీ టీజర్‌ను రిలీజ్(Teaser released) చేశారు. ‘మనిషి నిద్రపోయే వరకు సైన్స్ అయితే.. నిద్రపోయాక ఏం జరుగుతుందనేది మాయ, సింపుల్‌గా చెప్పాలంటే నీ లైఫ్‌లో పదిహేడేళ్ల జీవితాన్ని మిస్ అయిపోయావు’ వంటి డైలాగ్స్ టీజర్‌లో ఉన్నాయి. ఈ సినిమాకు సంగీతం: అనూప్ రూబెన్స్.
Comments
Please login to add a commentAdd a comment