teaser released
-
వైవిధ్యమైన ప్రేమకథ
ఓ వైపు హీరోయిన్గా, మరోవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలతో ఫుల్ బిజీగా దూసుకెళుతున్నారు రష్మికా మందన్న. ఆమె లీడ్ రోల్లో రూపొందుతోన్న చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’. నటుడు–దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో హీరో దీక్షిత్ శెట్టి నటిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ నిర్మిస్తున్నాయి. త్వరలో ఈ సినిమా టీజర్ విడుదల కానుంది.ఈ చిత్రం టీజర్ చూసిన అనంతరం డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ– ‘‘ది గర్ల్ ఫ్రెండ్’ టీజర్‌ను రాహుల్ రవీంద్రన్ చూపించాడు. రష్మిక నటన, భావోద్వేగాలు, క్లోజప్ షాట్స్ చాలా బాగున్నాయి’’ అని పేర్కొన్నారు. ‘‘వైవిధ్యమైన ప్రేమ కథతో తెరకెక్కుతున్న చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం చివరి దశలో ఉంది’’ అన్నారు మేకర్స్. ఇదిలా ఉంటే త్వరలో విడుదల కానున్న ఈ సినిమా టీజర్లో రష్మిక పాత్రను, నేపథ్యాన్ని హీరో విజయ్ దేవరకొండ వాయిస్ ఓవర్‌తో పరిచయం చేస్తారని సమాచారం. -
నాకు తల చాలా ముఖ్యం
‘‘మన శరీరానికి తల ఎంత ముఖ్యమో... నాకు ఈ ‘తల’ సినిమా కూడా అంతే ముఖ్యం. డ్యాన్స్ మాస్టర్‌గా నాకు తొలి అవకాశం ఇచ్చిన ఆర్బీ చౌదరిగారిని నేను దేవుడిలా భావిస్తాను. ఆయన నిర్మాణంలో మా అబ్బాయి అమ్మ రాగిన్ రాజ్‌ని హీరోగా పరిచయం చేస్తుండటం హ్యాపీగా ఉంది’’ అని డైరెక్టర్ అమ్మ రాజశేఖర్ తెలిపారు. అమ్మ రాగిన్ రాజ్ హీరోగా నటించిన చిత్రం ‘తల’. అమ్మ రాజశేఖర్ దర్శకత్వం వహించారు. ఆర్బీ చౌదరి సమర్పణలో ఎన్వీ ప్రసాద్, వాకాడ అంజన్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సినిమా టీజర్ విడుదల వేడుకలో అమ్మ రాగిన్ రాజ్ మాట్లాడుతూ– ‘‘నేను హీరోగా ఎలా ఉండాలని ప్రేక్షకులు కోరుకుంటారో అలానే ఉంటాను. ఆడియన్స్ తప్పకుండా ఆశ్చర్యపోయేలా ఈ సినిమా ఉంటుంది’’ అని తెలిపారు. ఎస్తేర్ మాట్లాడుతూ– ‘‘ఇప్పటివరకు నేను చేసిన పాత్రలకు భిన్నంగా ‘తల’లో నా పాత్ర ఉంటుంది’’ అని చె΄్పారు. -
ముక్కోణపు ప్రేమకథ
నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’. సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ద్వారా కన్నడ హీరోయిన్ రుక్మిణీ వసంత్ తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నారు. దివ్యాంశా కౌశిక్ కీలకపాత్రలో, హర్ష చెముడు ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పీ బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా నవంబరు 8న విడుదల కానుంది. కాగా దసరా పండగని పురస్కరించుకుని ఈ చిత్రం టీజర్‌ని రిలీజ్ చేశారు. ‘‘ముక్కోణపు ప్రేమకథగా రూపొందుతోన్న చిత్రమిది. ఇందులో రిషి అనేపాత్రలో నిఖిల్ కనిపించనున్నారు. యాక్షన్ ఎలిమెంట్, చేజింగ్ సన్నివేశాలు, కథలోని కొన్ని కీలక మలుపులతో టీజర్‌ని విడుదల చేశాం. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తోపాటు చక్కటి వినోదం, రొమాన్స్ వంటి అంశాలు కూడా ఈ చిత్రంలో ఉంటాయి. ‘స్వామి రారా, కేశవ’ వంటి చిత్రాల తర్వాత నిఖిల్, సుధీర్ వర్మ కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: కార్తీక్, నేపథ్య సంగీతం: సన్నీ ఎం.ఆర్, కెమెరా: రిచర్డ్ ప్రసాద్. -
బృంద వస్తోంది
హీరోయిన్ త్రిష టైటిల్ రోల్లో నటించిన థ్రిల్లింగ్ క్రైమ్ మిస్టరీ వెబ్ సిరీస్ ‘బృంద’. సూర్య మనోజ్ వంగాలా దర్శకత్వం వహించిన ఈ సిరీస్ టీజర్ విడుదలైంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, మరాఠీ, బెంగాలీ, హిందీ భాషల్లో ఆగస్టు 2 నుంచి ఈ సిరీస్ సోనీలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు.ఇంద్రజిత్ సుకుమారన్, జయప్రకాశ్, ఆమని, రాకేందు మౌళి కీలక పాత్రలు పోషించారు. ఈ సిరీస్‌లో పోలీసాఫీసర్ బృందగా త్రిష నటించారు. ఆమె నటించిన తొలి వెబ్ సిరీస్ ఇదే కావడం విశేషం. -
నా ముందు సైలెంట్‌గా ఉండాలి!
తెలుగు చిత్ర పరిశ్రమలో బిజీగా దూసుకెళుతున్నారు యంగ్ బ్యూటీ శ్రీలీల. ప్రస్తుతం నితిన్‌తో ‘రాబిన్‌హుడ్’, రవితేజ ‘ఆర్టీ 75’ (వర్కింగ్ టైటిల్) వంటి చిత్రాల్లో నటిస్తున్నారు. కాగా శుక్రవారం (మే 14) శ్రీలీల బర్త్‌డే. ఈ సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ‘రాబిన్‌హుడ్’లో ఆమె చేస్తున్న లేడీ బాస్ నీరా వాసుదేవ్ ΄పాత్ర లుక్, టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.‘‘జ్యోతీ... సునామీలో టి సైలెంట్ ఉండాలి... నా ముందు నువ్వు సైలెంట్‌గా ఉండాలి’ అంటూ శ్రీలీల చెప్పిన డైలాగ్ టీజర్లో ఉంది. ‘ఎక్స్ట్రాఆర్డినరీ మ్యాన్’ (2023) చిత్రం తర్వాత హీరో నితిన్, హీరోయిన్ శ్రీలీల రెండోసారి జోడీగా నటిస్తున్న చిత్రం ‘రాబిన్‌హుడ్’. వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, ‘వెన్నెల’ కిశోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు.‘యునిక్ యాక్షన్, ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా ‘రాబిన్‌హుడ్’ రూపొందుతోంది. ఈ చిత్రంలో నితిన్ పాత్రకు శ్రీలీల పాత్ర పూర్తి భిన్నంగా ఉంటుంది. వారి పాత్రలు రాయడంలో వెంకీ కుడుముల స్పెషల్ కేర్ తీసుకున్నారు. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 20న మా సినిమా విడుదల కానుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
ఈ నెలలోనే లాక్డౌన్!
ఈ నెలలోనే లాక్డౌన్ అంటున్నారు హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్. కానీ కంగారు పడవలసిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే... ఆమె చెబుతున్నది ‘లాక్డౌన్’ సినిమా గురించి. అనుపమా పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘లాక్డౌన్’. ఏఆర్ జీవాను దర్శకుడిగా పరిచయం చేస్తూ లైకా ప్రోడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెలలోనే విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్.కాగా ఈ సినిమాలో అనిత అనే పాత్రలో అనుపమా పరమేశ్వరన్ నటించినట్లుగా తెలుస్తోంది. లాక్డౌన్లో చిక్కుకుపోయి కష్టాలు పడుతున్న ఓ యువతి నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందట. లాక్డౌన్ కష్టాలతోపాటు కరోనా వైరస్ గురించిన అంశాలను ఈ సినిమాలో కాస్త సీరియస్‌గానే చూపిస్తారనే టాక్ కోలీవుడ్‌లో వినిపిస్తోంది. చార్లీ, నిరోషా, ప్రియా వెంకట్, లివింగ్స్టన్, ఇందుమతి, రాజ్‌కుమార్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు ఎన్ఆర్ రఘునందన్, సిద్ధార్థ్ విపిన్ సంగీతం అందించారు. ఈ సినిమాకు కెమెరా: వీజే సాబు జోసెఫ్. -
తక్కువ అంచనా వెయ్యొద్దు!
నెగటివ్ క్యారెక్టర్స్‌లో తనదైన విలనిజాన్ని పండించిన సోనూ సూద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఫతే’. ఈ చిత్రానికి సోనూయే దర్శకత్వం వహించడంతో పాటు ఓ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. రచయిత కూడా సోనూనే కావడం విశేషం. పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రం టీజర్‌ని ‘వచ్చేస్తున్నా’ అంటూ శనివారం విడుదల చేశారు సోనూ సూద్. సైబర్ క్రైమ్ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని టీజర్ స్పష్టం చేస్తోంది. కాగా.. టైటిల్‌కి ట్యాగ్‌లైన్‌గా ‘నెవర్ అండర్‌ఎస్టిమేట్ ఎ నోబడీ’ అని పెట్టారు. అంటే.. ఎవర్నీ తక్కువ అంచనా వేయొద్దు అని అర్థం. ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్. భారతదేశానికి చెందినవారితో పాటు పలువురు హాలీవుడ్ స్టార్స్ ఈ చిత్రంలో నటిస్తున్నారు. సైబర్ క్రైమ్‌లో ఎదురయ్యే సవాళ్ల నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో యాక్షన్ సీన్స్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటాయని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుంది. -
శనివారమే 'నాని' వేట!
‘‘కోపాలు రకరకాలుగా ఉంటాయి.. ఒక్కొక్క మనిషి కోపం ఒక్కొక్కలా ఉంటుంది.. కానీ ఆ కోపాన్ని క్రమబద్ధంగా పద్ధతిగా వారంలో ఒక్కరోజు మాత్రమే చూపించే ఎవరినైనా చూశారా.. నేను చూశాను’’ అంటూ నటుడు ఎస్‌జె సూర్య చెప్పే డైలాగ్స్‌తో విడుదలైంది ‘సరిపోదా శనివారం’ టీజర్. నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న చిత్రం ‘సరిపోదా శనివారం’. ఆగస్ట్ 29న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. శనివారం (ఫిబ్రవరి 24) నాని పుట్టినరోజు సందర్భంగా టీజర్‌ని విడుదల చేశారు. నాని చేస్తున్న సూర్య పాత్ర ఒకే ఒక్క రోజు (శనివారం) మాత్రమే కోపం చూపిస్తుందని టీజర్ ద్వారా స్పష్టం చేశారు. వారంలో జరిగే ఘటనలను పేపర్ పై రాసుకుని, తనని ఇబ్బందిపెట్టేవారిని శనివారం వేటాడతాడు సూర్య. ఇక నాని హీరోగా సుజిత్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్లు దానయ్య తెలిపారు. -
Yatra 2 Teaser: ఆకట్టుకుంటున్న 'యాత్ర 2' టీజర్
‘ఏన్నా.. ఇంత రాత్రి అయినా నిద్ర పోకుండా ఈడ ఏం చేస్తున్నావన్నా’ అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్రధారి జీవా డైలాగ్‌తో ‘యాత్ర 2’ టీజర్ విడుదలైంది. ‘యాత్ర’ వంటి హిట్ మూవీకి సీక్వెల్‌గా మహి వి. రాఘవ్ దర్శకత్వంలో రూపొందుతోన్న తాజా చిత్రం ‘యాత్ర 2’. ఇందులో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి పాత్రలో మలయాళ నటుడు మమ్ముట్టి, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్రలో జీవా నటిస్తున్నారు. త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్‌తో కలసి శివ మేక నిర్మిస్తున్న ‘యాత్ర 2’ ఫిబ్రవరి 8న విడుదల కానుంది. ఈ సినిమా టీజర్‌ని శుక్రవారం రిలీజ్ చేశారు. ‘మా వైఎస్ఆర్ కొడుకు వస్తున్నాడంట.. ఆయన కోసం ఎదురు చూస్తున్నానన్నా’ (వైఎస్ఆర్ అభిమాని), ‘కాదన్నా.. మీ వైఎస్ఆర్ కొడుకు వచ్చి మీ ముందు నిల్చున్నా మీకు కనపడదు కదా అన్న’ (జీవా), ‘నాకు ఆయన కనపడకపోయినా నేను ఆయనకు కనపడతా కదా అన్న, నాలాంటోళ్లు ఆయన వెనకాల ఉన్నామని తెలియడానికే నేను ఇక్కడున్నానన్నా’ (వైఎస్ఆర్ అభిమాని), ‘నా రాజకీయ ప్రత్యర్థినైనా, శత్రువునైనా ఓడించాలనుకుంటానే కానీ, మీ నాయకుడిలాగా వాళ్ల నాశనం కోరుకోనయ్యా’ (వైఎస్ఆర్ పాత్రధారి మమ్ముట్టి) వంటి డైలాగులు టీజర్లో ఉన్నాయి. 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన రాజకీయ ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు మహి వి. రాఘవ్. మహేశ్ మంజ్రేకర్, సుజానె బెర్నెర్ట్, కేతకీ నారాయణన్, ‘శుభలేఖ’ సుధాకర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: మది, సంగీతం: సంతోష్ నారాయణన్. -
చిత్రం చూడర...
వరుణ్ సందేశ్, శీతల్ భట్ హీరో హీరోయిన్లుగా, ‘నేనింతే’ ఫేమ్ అదితీ గౌతమ్ ఓ ప్రత్యేక పాత్రలో నటించిన సినిమా ‘చిత్రం చూడర..’. ఆర్ఎన్ హర్షవర్ధన్ దర్శకత్వంలో శేషు మారంరెడ్డి, బోయపాటి భాగ్యలక్ష్మీ నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్‌ను నిర్మాత టీజీ విశ్వప్రసాద్ విడుదల చేశారు. యాక్షన్ అండ్ సస్పెన్స్ అంశాలతో సినిమా కథనం ఉంటుందని టీజర్ స్పష్టం చేస్తోంది. ఈ సినిమాకు సంగీతం: రధన్, కెమెరా: జవహర్ రెడ్డి, సహనిర్మాత: ధన తుమ్మల. -
‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’సినిమా టీజర్ ఈవెంట్ (ఫొటోలు)
-
అంబాజీపేట బ్యాండు
సుహాస్, శివానీ నాగరం జంటగా నటించిన చిత్రం ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’. దుశ్యంత్ కటికినేని దర్శకుడు. జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్పై నిర్మించారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా టీజర్ విడుదలలో దర్శకులు మారుతి, హను రాఘవపూడి, శైలేష్ కొలను, సాయి రాజేశ్, సందీప్ రాజ్, ప్రశాంత్, మెహర్ రమేశ్, భరత్ కమ్మ, నిర్మాతలు ఎస్కేఎన్, శరత్ అతిథులుగా పాల్గొన్నారు. ‘‘నాలాంటి కొత్త డైరెక్టర్‌కు చాన్స్ ఇచ్చిన అల్లు అరవింద్, ‘బన్ని’ వాసు, వెంకటేష్ మహాగార్లకు, సుహాస్‌కి థ్యాంక్స్’’ అన్నారు దుశ్యంత్ కటికినేని. ‘‘నా కెరీర్లో ఈ మూవీ మైలురాయిగా నిలుస్తుంది’’అన్నారు సుహాస్. సినిమాటోగ్రాఫర్ వాజిద్ బేగ్, మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర మాట్లాడారు. -
‘నేనే సరోజ’ విజయం సాధించాలి: ఎమ్మెల్యే ముఠా గోపాల్
శాన్వీ మేఘన, కౌశిక్ బాబు జంటగా శ్రీమాన్ గుమ్మడవెల్లి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘నేనే సరోజ: ఉరఫ్ కారం చాయ్’. గాళ్స్ సేవ్ గాళ్స్ కాన్సెప్ట్ ఆధారంగా ఎస్ 3 క్రియేషన్స్ పతాకంపై రచయిత డా. సదానంద్ శారద నిర్మించిన చిత్రం ఇది. తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసిన శాసన సభ్యులు ముఠా గోపాల్ మాట్లాడుతూ– ‘‘ఉన్మాదులను ఎదిరించే కాలేజీ విద్యార్థిని పాత్రలో శాన్వీ మేఘన పవర్‌ఫుల్‌గా నటించారు.ఓ సామాజిక అంశాన్ని తీసుకుని ఈ తరహా సినిమాను నిర్మించిన దర్శక–నిర్మాతలను అభినందిస్తున్నాను. ఈ చిత్రం విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు. ‘‘ఆడపిల్ల మీద దాడి చేసే ఉన్మాదులకు, వివక్ష చూపించేవారికి తాగిస్తాం కారం చాయ్ అంటూ గుణపాఠం చెప్పేలా సరోజ పాత్ర ఉంటుంది. కుటుంబసమేతంగా చూడాల్సిన చిత్రం ఇది’’ అన్నారు శ్రీమాన్ గుమ్మడవెల్లి. ‘‘ఆలోచనాత్మక సంభాషణలు.. శాన్వి వీరోచిత పోరాటాలు, ఆర్. ఎస్. నంద హాస్యం.. ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణలు’’ అన్నారు రచయిత, నిర్మాత సదానంద్ శారద. -
గూఢచారి 111
‘వెన్నెల’ కిశోర్, సంయుక్తా విశ్వనాథన్ హీరో హీరోయిన్లుగా, మురళీ శర్మ కీలక పాత్రలో నటిస్తున్న స్పై యాక్షన్ కామెడీ ఫిల్మ్ ‘చారి 111’. టీజీ కీర్తీకుమార్ దర్శకత్వంలో అదితీ సోనీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బుధవారం ఈ సినిమాను ప్రకటించడంతో పాటు, కాన్సెప్ట్ టీజర్‌ను కూడా విడుదల చేశారు. ఈ సందర్భంగా టీజీ కీర్తీ కుమార్ మాట్లాడుతూ– ‘‘ఓ సిటీలో జరిగే అనుమానాస్పద ఘటనలను చేధించే రహస్య గూఢచారి పాత్రలో ‘వెన్నెల’ కిశోర్ కనిపిస్తారు. అలాగే ఆయన పాత్రలో ఓ కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది. స్టైలిష్ యాక్షన్ సన్నివేశాలతో ఆద్యంతం వినోదభరితంగా ప్రేక్షకులను అలరించేలా ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు. ‘‘స్పై జానర్లో ‘చారి 111’ కొత్తగా ఉంటుంది. కథలో చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి. షూటింగ్ జరుగుతోంది’’ అన్నారు అదితీ సోనీ. ఈ చిత్రానికి సంగీతం: సైమన్ కె. కింగ్. -
సినిమాలో స్పార్క్ ఉందనిపిస్తోంది – మంత్రి జగదీశ్వర్ రెడ్డి
విక్రాంత్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘స్పార్క్ లైఫ్’. మెహరీన్, రుక్సార్ థిల్లాన్ హీరోయిన్లు. హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా టీజర్ విడుదల కార్యక్రమంలో మంత్రి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘ఏ సినిమానైనా విమర్శనాత్మక కోణంలో చూసే వ్యక్తిని నేను. ‘స్పార్క్’ టీజర్ప్రారంభం చూడగానే నాకు ‘శివ’ సినిమా గుర్తొచ్చింది. విక్రాంత్‌లో, ఈ సినిమాలో స్పార్క్ ఉందనిపిస్తోంది. ఈ సినిమా కొత్త ట్రెండ్‌ని క్రియేట్ చేయడంతో పాటు విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘యూఎస్‌లో చదువుకుని, అక్కడే జాబ్ చేసినా సినిమాలపై ప్రేమ పెరిగిందే కానీ తగ్గలేదు. ఆ ప్రేమతోనే ‘స్పార్క్’ కథ రెడీ చేసుకున్నాను. నేను ప్రేమతో చేసిన ఈ సినిమాను ప్రేక్షకులు ప్రేమతో హిట్ చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు విక్రాంత్. తుంగతుర్తి ఎమ్మేల్యే కిశోర్, రచయిత అనంత శ్రీరామ్, ఈ చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ హేషం అబ్దుల్ వహాబ్ మాట్లాడారు. -
సాఫ్ట్‌గా ఉండకు.. ఆడుకుంటారు
‘కుర్రాళ్ళంటే ఈ వయసులో ఇలాగే ఉంటార్రా. నువ్వేం కంగారు పడకు’ అనే డైలాగ్‌తో మొదలైంది ‘రంగబలి’ టీజర్. నాగశౌర్య, యుక్తి తరేజ జంటగా పవన్ బాసంశెట్టి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘రంగబలి’. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా జూలై 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ‘అయ్య బాబోయ్.... రేపట్నుంచి చూత్తారుగా.. మా డెడికేషన్ చూస్తే మీకు జ్వరం వచ్చేస్తది (నాగశౌర్య)’, అయినా.. నువ్వేం అంత సాఫ్ట్‌గా ఉండకు.... ఆడుకుంటారు (యుక్తి తరేజ)’ అనే డైలాగ్స్ టీజర్లో ఉన్నాయి. ఈ చిత్రంలో బీ ఫార్మసీ చదివిన యువకుడి ΄ాత్రలో నాగశౌర్య, డాక్టర్ ΄ాత్రలోయుక్తి తరేజ నటించినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. సత్య, సప్తగిరి, షైన్ టామ్ చాకో కీలక ΄ాత్రలు ΄ోషిస్తున్న ఈ సినిమాకు సంగీతం: పవన్ సీహెచ్. -
'కొట్టర కొట్టు.. బొక్కలు చూర అయ్యేటట్టు..' అదిరిపోయిన టీజర్
‘నీ స్టేటు దాటలేనన్నావ్... దాటా!’, ‘నీ గేటు దాటలేనన్నావ్... దాటా!’, నీ పవర్ దాటలేనన్నావ్...దాటా!’, ‘ఇంకేంటి దాటేది...!’ అనే డైలాగ్స్‌తో విడుదలైంది రామ్ కొత్త సినిమా టీజర్. బోయపాటి శ్రీను దర్శకత్వంలో పవన్ కుమార్, జీ స్టూడియోస్ సౌత్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్నారు. సోమవారం (మే 15) హీరో రామ్ బర్త్ డే సందర్భంగా ‘ఫస్ట్ థండర్’ పేరుతో ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. సదర్ ఉత్సవాల నేపథ్యంలో వచ్చే యాక్షన్ సీన్ విజువల్స్‌లో ‘కొట్టర కొట్టు... నరాలు కట్టు! బొక్కలు చూర అయ్యేటట్టు..’ అనే బ్యాక్‌గ్రౌండ్ సాంగ్ టీజర్లో వినిపించింది. ‘‘మా హీరో రామ్ మేకోవర్, యాక్టింగ్, బోయపాటి శ్రీనుగారి డైరెక్షన్, తమన్ రీ రికార్డింగ్ ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంటాయి. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది. త్వరలో టైటిల్, ఇతర వివరాలు వెల్లడిస్తాం. దసరా సందర్భంగా అక్టోబర్ 20న తెలుగు, హిందీ, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
అలాంటి సినిమాలంటే చాలా ఇష్టం
‘‘డైరెక్టర్ ఆనంద్, నేను మంచి స్నేహితులం. ‘ఊరు పేరు భైరవకోన’ లాంటి సినిమాని ఆయన నాతో చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ఇలాంటి ఫాంటసీ, అడ్వెంచర్ సినిమాలంటే నాకు వ్యక్తిగతంగా చాలా ఇష్టం’’ అని హీరో సందీప్ కిషన్ అన్నారు. వీఐ ఆనంద్ దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా, వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘ఊరు పేరు భైరవకోన’. అనిల్ సుంకర సమర్పణలో రాజేష్ దండా నిర్మించిన ఈ సినిమా టీజర్‌ని విడుదల చేశారు. ఈ సందర్భంగా సందీప్ కిషన్ మాట్లాడుతూ–‘‘నా పుట్టినరోజున(ఆదివారం) ఈ మూవీ టీజర్ విడుదల కావడం స్పెషల్ మూమెంట్. తొలిసారి చండీయాగం చేసి టీజర్ రిలీజ్ చేయడం చాలా పాజిటివ్‌గా ఉంది. అనిల్ సుంకరగారు లేకపోతే ఈ సినిమా ఇక్కడి వరకూ వచ్చేది కాదు’’ అన్నారు. ‘‘టైగర్’ సినిమా నుంచి సందీప్, నాకు స్నేహం మొదలైంది. మరోసారి కలసి సినిమా చేస్తే ఇంకా గ్రాండ్‌గా ఉండాలని ‘ఊరు పేరు భైరవకోన’ చేశాం’’ అన్నారు వీఐ ఆనంద్. ‘‘ఈ సినిమా సందీప్ కెరీర్లో మరచిపోలేని బహుమతి అవుతుందని మాట ఇస్తున్నా’’ అన్నారు అనిల్ సుంకర. ‘‘మహాచండీ యాగంతో టీజర్‌లాంచ్ చేయడం ఇండస్ట్రీలో ఇదే తొలిసారి. ఈ ఐడియా ఇచ్చిన సందీప్‌గారికి థ్యాంక్స్’’ అన్నారు రాజేష్ దండా. హీరోయిన్ కావ్య థాపర్ మాట్లాడారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: బాలాజీ గుత్తా, సంగీతం: శేఖర్ చంద్ర, కెమెరా: రాజ్ తోట. -
"మళ్ళీ పెళ్లి" టీజర్ లో రచ్చ..
-
భారత్‌లో విడుదల కానున్న కొత్త హ్యుందాయ్ కారు - ఇదే!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ ఈ ఏడాది భారత్‌లో విడుదల చేయనున్న చిన్న ఎస్‌యూవీకి ఎక్స్టర్గా నామకరణం చేసింది. ఈ మేరకు టీజర్‌ను విడుదల చేసింది. జూలైలో ఉత్పత్తి ప్రారంభం కానుంది. ఆగస్ట్ నుంచి మార్కెట్లో అడుగు పెట్టనుందని సమాచారం. దక్షిణ కొరియాతోపాటు పలు దేశాల్లో అమ్ముడవుతున్న ఏఐ3 (క్యాస్పర్) మోడల్‌కు స్వల్ప మార్పులతో ఇక్కడ ప్రవేశపెట్టనున్నారు. ఈ వాహనం భారత్ కోసం తయారు చేస్తున్నారు. భవిష్యత్‌లో పొరుగున ఉన్న దేశాలకూ ఎగుమతి చేస్తారు. గ్రాండ్ ఐ10 నియోస్ ప్లాట్‌ఫామ్‌పై దీనిని అభివృద్ధి చేస్తున్నారు. 1.0 లీటర్ టీ–జీడీఐ టర్బో పెట్రోల్ ఇంజన్, 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ వేరియంట్లతో తయారు కానుంది. -
కాలర్ ఎగరేసుకునే సమయం ఇది
సందీప్ కిషన్ హీరోగా, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో రంజిత్ జయకొడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘మైఖేల్’. దివ్యాంశా కౌశిక్ హీరోయిన్. నారాయణ్‌దాస్ కె.నారంగ్ సమర్పణలో భరత్ చౌదరి, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను గురువారం విడుదల చేశారు. సందీప్ కిషన్ మాట్లాడుతూ–‘‘నాకు నేను పెట్టుకున్న అతి పెద్ద పరీక్ష మైఖేల్. మూడుసంవత్సరాల క్రితం ‘మైఖేల్’ వర్క్‌ను స్టార్ట్ చేశాం. ఈ సినిమా కోసం దాదాపు 24 కేజీల బరువు తగ్గాను. సినిమాలను ఆదరించడంలో తెలుగు ప్రేక్షకులు నంబరవన్ అని నంబర్స్ చెబుతున్నాయి. తెలుగు ఇండస్ట్రీ కాలర్ ఎగరేసుకునే సమయం ఇది’’ అన్నారు. ‘‘మైఖేల్’ చేసేందుకు ఒప్పుకున్న సందీప్ కిషన్, విజయ్ సేతుపతిలతో పాటు నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు రంజిత్. ‘‘మైఖేల్’ పట్ల హ్యాపీగా ఉన్నాం’’ అన్నారు రామ్మోహన్ రావు, భరత్ చౌదరి. -
పునీత్ రాజ్‌కుమార్ ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్.. దేవుడి పాత్రలో..
Lucky Man Teaser Released: కన్నడ పవర్ స్టార్, దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్ (Puneeth Rajkumar) మరణం సినీ లోకాన్ని విషాదంలోకి నెట్టింది. ఇక ఆయన కుటుంబీకులకు, అభిమానులకు ఎనలేని శోకాన్ని మిగిల్చింది. ఇప్పటికీ ఆయన్ను తలచుకోని అభిమాని లేడు. తన ప్రియతమ హీరోను వెండితెరపై చూడలేమన్న నిజాన్ని తట్టుకోలేకపోయారు. అయితే పునీత్ రాజ్‌కుమార్ మరణం కన్నా ముందు కమిట్ అయి, చిత్రీకరించిన సినిమాలు ఉన్నాయి. వాటిలో 2022, మార్చి 17న విడుదలైన 'జేమ్స్' ప్రేక్షకులను అలరించింది. పునీత్ రాజ్‌కుమార్‌ను వెండితెరపై చూసుకున్న అభిమానులు కంటతడిపెట్టారు. తర్వాత ఆయన్ను మళ్లీ చూస్తామో లేదో అని కుమిలిపోయారు. అయితే పునీత్ రాజ్‌కుమార్ అభిమానులకు త్వరలోనే సర్ప్రైజ్ దక్కనుంది. మరోసారి పునీత్ రాజ్‌కుమార్‌ను వెండితెరపై చూసే అదృష్టం కలగనుంది. పునీత్ మరణం కంటే ముందు ఆయన ఒప్పుకుని, నటించిన చిత్రాల్లో 'జేమ్స్'తోపాటు 'లక్కీ మ్యాన్' కూడా ఉంది. పునీత్ రాజ్‌కుమార్ గెస్ట్ రోల్ పోషించిన ఈ మూవీ సెప్టెంబర్‌లో విడుదల కానుంది. ఈ క్రమంలో ఈ సినిమా టీజర్‌ను సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేసింది చిత్రబృందం. రొమాంటిక్ కామెడిగా తెరకెక్కిన ఈ చిత్రంలో పునీత్ రాజ్ కుమార్ భగవంతుడి పాత్రలో నటించినట్లు తెలుస్తోంది. టాప్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవాతో పునీత్ రాజ్‌కుమార్ చేసే డ్యాన్స్ ఫ్యాన్స్‌తో పాటు ఆడియెన్స్‌ను ఆకట్టుకునేలా ఉంది. నాగేంద్ర ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో డార్లింగ్ కృష్ణ, సంగీత శృంగేరి, రోషిణి ప్రకాష్ హీరోహీరోయిన్లుగా నటించారు. చదవండి: పరువు పోయింది, చనిపోవాలనుకున్నా: సింగర్ కల్పన లెక్క తప్పిన జాన్వీ కపూర్.. ఆడేసుకుంటున్న నెటిజన్లు -
'మనసు తప్ప ఏదైనా వెతికి పెడతా' అంటున్న షణ్ముఖ్ జశ్వంత్..
Shanmukh Jaswanth Agent Anand Santosh Teaser: యూట్యూబ్ స్టార్‌గా గుర్తింపు పొందిన షణ్ముఖ్ జశ్వంత్ బిగ్‌బాస్ ఎంట్రీతో మరింత పాపులర్ అయ్యాడు. తనదైన ఆట తీరుతో బిగ్‌బాస్ ఐదో సీజన్లో చివరకు నిలిచి, రన్నరఫ్‌గా మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. అనేకమంది అభిమానులకు కూడా సంపాదించుకున్నాడు. అయితే అదే సమయంలో ఇదే షో.. తన ప్రేయసితో విడిపోవడానికి కారణమైంది. ఇదిలా ఉంటే బిగ్‌బాస్, బ్రేకప్ తర్వాత తన కెరీర్‌పై ఫుల్ ఫోకస్ పెట్టాడు షణ్ముఖ్ జశ్వంత్. ఈ క్రమంలోనే 'ఏజెంట్ ఆనంద్ సంతోష్' సిరీస్ చేస్తున్నట్లు ఇది వరకు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వెబ్ సిరీస్ టీజర్‌ను డైరెక్టర్ అనిల్ రావిపూడి సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. 'ఇంతకీ నువ్ ఏం చేస్తుంటావ్ ? నెలకు నీ జీతం ఎంత వస్తుంటుంది ? అసలు ఎంత ఖర్చవుతుంది ? ఎంత మిగులుతుంది ?' అంటూ షణ్ముఖ్‌ను ప్రశ్నలు అడగడంతో ప్రారంభమవుతుంది ఈ టీజర్. ఈ ప్రశ్నలకు నేను ఒక డిటెక్టివ్ ఏజెంట్‌ను సర్ అని షణ్ముఖ్ ఇచ్చే సమాధానం, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో వెబ్ సిరీస్‌పై ఆసక్తి కలిగించారు. ఇందులో షణ్ముఖ్ జశ్వంత్ స్టైలిష్‌గా కనిపించాడు. 'మనసు తప్ప.. ఫిజికల్‌గా, లిక్విడ్‌గా ఏదైనా వెతికి పెడతా' అని చెప్పే డైలాగ్ ఆకట్టుకునేలా ఉంది. ఈ సిరీస్‌కు అరుణ్ పవర్ దర్శకత్వం వహించగా, సుబ్బు స్క్రిప్ట్ అందించారు. ఈ వెబ్ సిరీస్ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో విడుదల కానుంది. చదవండి: నితిన్‌కు అసలు డ్యాన్సే రాదు: అమ్మ రాజశేఖర్ ధనుష్ కోసం ఇండియా వస్తున్న హాలీవుడ్ దర్శకులు.. నా భర్త నేను ఎప్పుడో ఓసారి కలుసుకుంటాం: స్టార్ హీరోయిన్ -
ఒక్కరి మనసునైనా దొంగలించామా మామ.. ఆసక్తిగా టీజర్
Kiran Abbavaram Nenu Miku Kavalsinavadini Teaser: వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఫుల్ జోష్‌లో ఉన్నాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. ఈ హీరో ఇటీవలే 'సమ్మతమే' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మరో కొత్త సినిమాతో అలరించేందుకు సిద్ధమయ్యాడు. శ్రీధర్ గాదే దర్శకత్వంలో యూత్‌ఫుల్, ఫ్యామిలీ కథాంశంతో రెడీ అవుతోన్న సినిమా 'నేను మీకు కావాల్సిన వాడిని'. ఈ సినిమాలో సోనూ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తోంది. తాజాగా ఈ మూవీ టీజర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. 'డ్రైవర్‌వి డ్రైవర్లా ఉండూ' అనే డైలాగ్‌తో ప్రారంభమైన ఈ టీజర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. 'పదిసార్లు ప్రేమలో ఓడిపోయినా సరే.. సిగ్గు లేకుండా పదకొండోసారి ప్రేమకోసం పరితపించే ప్రేమికుల మధ్య బతుకుతున్నాం' అంటూ కిరణ్ అబ్బవరం చెప్పే డైలాగ్‌లు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ మూవీలో ప్రముఖ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్ మాస్టర్, కిరణ్ అబ్బవరం మధ్య వచ్చే సీన్లు నవ్వు తెప్పించేలా ఉన్నాయి. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు కిరణ్ అబ్బవరమే స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందించడం విశేషం. -
రణ్‌బీర్ వీరోచిత పోరాటం.. ఆసక్తిగా 'షంషేరా' టీజర్
Shamshera Teaser: Ranbir Kapoor Battle With Sanjay Dutt For His Tribe: బాలీవుడ్ లవర్ బాయ్ తన ప్రియసఖి, క్యూటీ అలియా భట్‌ను వివాహం చేసుకుని పెళ్లిపుస్తకం తెరిచాడు. ఇక తన సినీ కెరీర్‌పై ఫోకస్ పెట్టాడు రణ్‌బీర్. ఇటీవల 'బ్రహ్మాస్త్ర' సినిమా ట్రైలర్ విడుదలై ఆకట్టుకోగా మరో సినిమాకు సంబంధించిన అప్డేట్ ఆసక్తికరంగా ఉంది. యశ్‌రాజ్ ఫిల్మ్స్ పతాకంపై రణ్‌బీర్ కపూర్ హీరోగా నటించిన చిత్రం 'షంషేరా'. కరణ్ మల్హోత్రా దర్శకత్వం వహించిన ఈ మూవీకి సంబంధించిన పోస్టర్లు ఇప్పటికే నెట్టింట వైరల్ అయి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తాజాగా ఈ మూవీ టీజర్‌ను బుధవారం (జూన్ 22) విడుదల చేసింది చిత్రబృందం. ఈ టీజర్ చారిత్రక నేపథ్యంతో కూడిన యాక్షన్ సీక్వెన్స్‌తో ఆద్యంతం ఆసక్తిగా ఉంది. పోరాట యోధుడిగా, ఆపదల్లో చిక్కుకున్న తన వర్గాన్ని కాపాడుకునే వీరుడిగా రణ్‌బీర్ యాక్టింగ్, రగ్గ్డ్ లుక్ ఆకట్టుకునేలా ఉంది. ఈ మూవీలో సంజయ్ దత్ విలన్‌గా అలరించనున్నాడు. జులై 22న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం ట్రైలర్‌ను శుక్రవారం (జూన్ 24) రిలీజ్ చేయనున్నారు మేకర్స్. అలాగే ఈ చిత్రం హిందీ, తమిళం, తెలుగు భాషల్లో విడుదల కానుంది. చదవండి: బుల్లితెర నటి ఆత్మహత్య.. 'ఐ లవ్ యూ సాన్' అంటూ సూసైడ్ నోట్