
Rose Garden Movie Teaser Released By AM Ratnam: నితిన్ నాష్, ఫర్నాజ్ శెట్టి జంటగా చదలవాడ సోదరులు తిరుపతిరావు, శ్రీనివాసరావు నిర్మించిన చిత్రం ‘రోజ్ గార్డెన్’. ఈ చిత్రం టీజర్‌ను నిర్మాత ఏఎం రత్నం హైదరాబాద్‌లో రిలీజ్ చేశారు. ‘‘టెర్రరిజం నేపథ్యంలో రూపొందించిన ప్రేమకథా చిత్రం ఇది. కశ్మీర్‌లో భారీ ఎత్తున నిర్మించాం. సంగీతానికి ప్రాధాన్యం ఉన్న ఈ చిత్రంలోని అన్ని పాటలను ముంబైలో రికార్డ్ చేశాం. ఒక పాటను ఏయం రత్నం రాశారు’’ అన్నారు చదలవాడ శ్రీనివాసరావు.
ఈ సినిమా మంచి విజయం సాధించాలని ఏఎం రత్నం ఆకాంక్షించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందిన ఈ 'రోజ్ గార్డెన్' చిత్రానికి జి. రవికుమార్ కథ, మాటలు, సంగీతం, దర్శకత్వం బాధ్యతలు నిర్వర్తించారు. అలాగే ఫొటోగ్రఫీ శంకర్ కంతేటి అందించగా ఎడిటర్‌గా నందమూరి హరి పనిచేశారు. పోసాని కృష్ణమురళి, గౌతమ్ రాజు, ధన్‌రాజ్ తదితరులు నటించారు.
Comments
Please login to add a commentAdd a comment