am ratnam
-
ఏపీలో చిత్రపరిశ్రమ అభివృద్ధి కావాలి
ఆంధ్రప్రదేశ్ చలన చిత్ర వాణిజ్య మండలి నూతన అధ్యక్షుడిగా నిర్మాత ఏయం రత్నం ఎన్నికయ్యారు. ఆదివారం 5వ వార్షిక సర్వసభ్య సమావేశం, 2023–25 సంవత్సరాలకు నూతన కమిటీ ఎన్నిక కార్యక్రమం విజయవాడలో జరిగాయి. నూతన అధ్యక్షుడిగా ఏయం రత్నం, ఉపాధ్యక్షులుగా పి. విజయ్ వర్మ, సీహెచ్. లక్ష్మీ నరసింహం, మంతా శ్రీనివాస్, కార్యదర్శిగా జేవీ మోహన్ గౌడ్, సంయుక్త కార్యదర్శులుగా పి. రమణా రెడ్డి, యన్.యస్. మూర్తి, కోశాధికారిగా యం. శ్రీనాథరావు, కార్యవర్గ సభ్యులుగా నిర్మాతల విభాగం నుంచి íపీడీఆర్. ప్రసాద్ రెడ్డి, వీవీ రామానుజం, మిత్తాన ఈశ్వర రావు, యు. వెంకట్ రావు, రవీంద్ర గోపాల, పంపిణీదారుల విభాగం నుంచి కె. రవీంద్రనాథ్ ఠాగూర్ బాబు, ఆర్.వి.యన్. వరప్రసాద్, మిర్జా అబీద్ హుస్సేన్, స్టూడియో విభాగం నుంచి బి. హనుమంతరావు ఎన్నికైనట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఏయం రత్నం మాట్లాడుతూ– ‘‘ఏపీలో కూడా చిత్ర పరిశ్రమను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఉందని భావించి, అధ్యక్షుడిగా వ్యవహరించడానికి అంగీకరించాను’’ అన్నారు. -
ఆ రోజులు గుర్తొచ్చాయి
‘‘రూల్స్ రంజన్’ పూర్తి వినోదాత్మక చిత్రం. ట్రైలర్ చూసి నవ్వుకున్నట్లే సినిమా అంతా ప్రేక్షకులు నవ్వుతూనే ఉంటారని కచ్చితంగా చెప్పగలను’’ అని హీరో కిరణ్ అబ్బవరం అన్నారు. రత్నం కృష్ణ దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా నటించిన చిత్రం ‘రూల్స్ రంజన్’. ఏఎం రత్నం సమర్పణలో దివ్యాంగ్ లవానియా, మురళీ కృష్ణ వేమూరి నిర్మించిన ఈ సినిమా రేపు రిలీజవుతోంది. ఈ సందర్భంగా కిరణ్ అబ్బవరం చెప్పిన విశేషాలు. ► ప్రతి సినిమాలో ఒకే తరహా పాత్ర కాకుండా వైవిధ్యంగా ఉండేలా కథలు ఎంచుకుంటున్నాను. రత్నం కృష్ణ చెప్పిన ‘రూల్స్ రంజన్’ కథ మంచి విజువల్ కామెడీ డ్రామాగా ఉంటుందని నమ్మి, చేశాను. రత్నం కృష్ణ బాగా తీశారు. సినిమా అంతా సరదాగా సాగుతుంది. ‘వెన్నెల’ కిశోర్, నాకు మధ్య వచ్చే సన్నివేశాలు, వైవా హర్ష, సుబ్బరాజు, ఆది ట్రాక్‌లు మంచి వినోదం పంచుతాయి. ► సినిమాల్లోకి రాకముందు చెన్నైలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా చేశాను. పల్లెటూరి నుంచి వెళ్లిన నాకు కెఫెటేరియా (క్యాంటీన్) అంటే ఎలా ఉంటుందో కూడా తెలియదు. ఆ వర్క్ కల్చర్, ఆఫీస్ పద్ధతులకు అలవాటు పడటం కష్టమైంది. ఈ చిత్రంలో మనోరంజన్ అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా చేశాను. షూటింగ్ చేస్తున్నప్పుడు నేను ఉద్యోగం చేసిన రోజులు గుర్తొచ్చాయి. ► నిర్మాతలు ఏఎం రత్నం, దివ్యాంగ్ లవానియా, మురళీ కృష్ణగార్లు ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమా తీశారు. ఈ చిత్రంలోని ‘సమ్మోహనుడా..’ పాట హైప్ తీసుకు వచ్చింది. ఇది రొమాంటిక్ సాంగ్. అందుకే సవాల్‌గా అనిపించింది. ప్రస్తుతం సీనియర్ డైరెక్టర్స్‌తో రెండు, కొత్త దర్శకులతో రెండు సినిమాలు చేస్తున్నాను. -
‘హిట్ మ్యాన్’ టీజర్ వైవిధ్యంగా ఉంది: ఏఎం రత్నం
‘‘హిట్ మ్యాన్’ సినిమా టీజర్ చాలా వైవిధ్యంగా ఉంది. యాక్షన్ సీక్వెన్సులు ఆకట్టుకుంటున్నాయి. బిష్ణు చేస్తోన్న ఈ తొలి ప్రయత్నం పెద్ద సక్సెస్ కావాలి’’ అని నిర్మాత ఏఎం రత్నం అన్నారు. బిష్ణు అధికారి హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘హిట్ మ్యాన్’. అదితీ శర్మ, ఆంచల్ శర్మ హీరోయిన్లు. 99 సినిమాస్‌పై దీపక్ అధికారి నిర్మించిన ఈ సినిమా నవంబర్‌లో రిలీజ్ కానుంది. ఈ సినిమా టీజర్‌ను ఏఎం రత్నం విడుదల చేశారు. ఈ సందర్భంగా బిష్ణు అధికారి మాట్లాడుతూ– ‘‘హిట్ మ్యాన్’ ఒక స్పై థ్రిల్లర్. న్యూ ఏజ్ మూవీ. ఈ సినిమాను మూడు భాగాలుగా చిత్రీకరిస్తున్నాం. తొలి భాగాన్ని నవంబర్‌లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ‘‘ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలి’’ అన్నారు డైరెక్టర్ సముద్ర. ‘‘మా ‘హిట్ మ్యాన్’ సినిమాకు సహకారం అందిస్తున్నవారికి కృతజ్ఞతలు’’ అన్నారు చిత్ర సహనిర్మాత సి్ర΄ా మిశ్రా, సంగీత దర్శకుడు ‘మంత్ర’ ఆనంద్. ఈ చిత్రానికి లైన్ ్ర΄÷డ్యూసర్: రోహిత్ ఇంగ్లే, అసోసియేట్ ్ర΄÷డ్యూసర్: సన్నీ లల్వానీ, కెమెరా: వైఆర్ శేఖర్. -
టెర్రరిజం బ్యాక్‌డ్రాప్‌తో 'రోజ్ గార్డెన్'.. టీజర్ విడుదల
Rose Garden Movie Teaser Released By AM Ratnam: నితిన్ నాష్, ఫర్నాజ్ శెట్టి జంటగా చదలవాడ సోదరులు తిరుపతిరావు, శ్రీనివాసరావు నిర్మించిన చిత్రం ‘రోజ్ గార్డెన్’. ఈ చిత్రం టీజర్‌ను నిర్మాత ఏఎం రత్నం హైదరాబాద్‌లో రిలీజ్ చేశారు. ‘‘టెర్రరిజం నేపథ్యంలో రూపొందించిన ప్రేమకథా చిత్రం ఇది. కశ్మీర్లో భారీ ఎత్తున నిర్మించాం. సంగీతానికి ప్రాధాన్యం ఉన్న ఈ చిత్రంలోని అన్ని పాటలను ముంబైలో రికార్డ్ చేశాం. ఒక పాటను ఏయం రత్నం రాశారు’’ అన్నారు చదలవాడ శ్రీనివాసరావు. ఈ సినిమా మంచి విజయం సాధించాలని ఏఎం రత్నం ఆకాంక్షించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందిన ఈ 'రోజ్ గార్డెన్' చిత్రానికి జి. రవికుమార్ కథ, మాటలు, సంగీతం, దర్శకత్వం బాధ్యతలు నిర్వర్తించారు. అలాగే ఫొటోగ్రఫీ శంకర్ కంతేటి అందించగా ఎడిటర్‌గా నందమూరి హరి పనిచేశారు. పోసాని కృష్ణమురళి, గౌతమ్ రాజు, ధన్‌రాజ్ తదితరులు నటించారు. -
ప్రారంభమైన ప్యాకప్ చిత్రం.. ముఖ్య అతిథిగా ఏయమ్ రత్నం
వాసం నరేశ్, ఆశ ప్రమీల హీరోహీరోయిన్లుగా పరిచయం అవుతోన్న చిత్రం ‘ప్యాకప్’. జీవీఎస్ ప్రణీల్ దర్శకత్వంలో పానుగంటి శరత్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకకు ప్రముఖ నిర్మాత ఏయమ్ రత్నం ముఖ్య అతిథిగా హాజరై తొలి సన్నివేశానికి క్లాప్ ఇచ్చారు. ఈ చిత్రం గొప్ప విజయం సాధించి, చిత్రబృందానికి మంచి పేరు తీసుకురావాలని ఏయమ్ రత్నం కోరారు. ‘‘ప్రేమలోని మరో కోణాన్ని ఈ సినిమాతో చెప్పాలనుకుంటున్నాం’’ అన్నారు జీవీఎస్ ప్రణీల్. ‘‘ఏకధాటిగా షూటింగ్ ప్లాన్ చేశాం’’ అన్నారు శరత్‌రెడ్డి. ఒక మంచి కథతో హీరోగా పరిచయం కావడం సంతోషంగా ఉందని వాసం నరేశ్ తెలిపాడు. ఈ చిత్రానికి సుభాష్ ఆనంద్ సంగీతం అందించగా శ్రీకృష్ణ గుళ్లపల్లి లైన్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. -
హీరో అజిత్ రూటే సెపరేట్
చెన్నై : హీరో అజిత్ అండ్ కో తాజా చిత్రానికి రెడీ అవుతున్నారన్నది కోలీవుడ్ వర్గాల టాక్. అజిత్ రూటే సెపరేట్ అని చెప్పవచ్చు. సాధారణంగా వరుసగా ఒకే దర్శకుడితో చిత్రాలు చేయడానికి ఇష్టపడరు. అయితే ఇందుకు అజిత్ భిన్నం. కథ నచ్చితే ఒకే దర్శకుడితో ఎన్ని చిత్రాలు చేయడానికైనా రెడీ అనే తత్వం ఆయనది. అదేవిధంగా తనకు నచ్చితే నిర్మాతకు కూడా వరుసగా చిత్రాలు చేసేస్తారు. ఈ రెండు విషయాలు ఇప్పటికే రుజువయ్యాయి. ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం సంస్థలో ఆరంభం, వేదాళం చిత్రాలను వరుసగా చేశారు. ఇక దర్శకుడు శివతో కలిసి వీరం, వేదాళం, వివేగం చిత్రాలను వరుసగా చేశారు. ఈ చిత్రాలన్నీ కమర్షియల్‌గా మంచి విజయాలను సాధిం చాయి. ఇక అసలు విషయం ఏమిటంటే అజిత్ తాజా చిత్రం ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది. ఆయన రిస్కీ సన్నివేశాల్లో నటించడానికి ఏమాత్రం వెనుకాడరు. అలా పలుమార్లు గాయాలకు గురవడం పరిపాటే. ఇటీవల వివేగం చిత్ర షూటింగ్లో కూడా గాయాలకు గురై శస్త్ర చికిత్స చేయించుకుని ప్రస్తుతం విశ్రాంతిలో ఉన్నారు. మళ్లీ శివ దర్శకత్వంలోనే నటించడానికి సిద్ధం అవుతున్నారు. అజిత్, శివ కాంబినేషన్లో తెరకెక్కనున్న తాజా చిత్రాన్ని ఎవరు నిర్మించనున్నారన్నది ఆసక్తిగా మారింది. అయితే అజిత్ అంగీకరిస్తే ఆయన తాజా చిత్రాన్ని నిర్మించడానికి తాము రెడీ అని ఇటీవల ఏఎం రత్నం కోడలు ఐశ్యర్య పేర్కొన్నారు. -
గాయని గా మారిన నిర్మాత
సాక్షి, చెన్నై: స్వతహాగా ఉన్న ప్రతిభ, సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా బయట పడుతుంది. ఇందుకు ఉదాహరణలు ఎన్నో. అదే విధంగా నిర్మాతగా తన దక్షతను చాటుకుంటున్న ఐశ్వర్య ఇప్పుడు తనలో దాగి ఉన్న గాయని అనే ప్రతిభకు సాన పెడుతున్నారు. ఐశ్వర్య ఎవరోకాదు స్వయంకృషితో ఎదిగి, భారీ చిత్రాలకు చిరునామాగా మారిన ప్రముఖ నిర్మాత ఏఎం.రత్నం కోడలు. యువ దర్శక, నటుడు జ్యోతికృష్ణ భార్య అన్నది గమనార్హం. అంతే కాదు ఐశ్వర్య సంచలన విజయం సాధించిన ఆరంభం, ఎన్నైఅరిందాల్, వేదాళం, కరుప్పన్ చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. తాజాగా ఆమె తనలోని సంగీత జ్ఞానానికి పదునుపెట్టడం మొదలెట్టారు. ఇప్పుడీ యువ మహిళా నిర్మాత గాయనిగా అవతారమెత్తారు. ప్రముఖ సంగీత దర్శకుడు యువన్ శంకర్‌రాజా సంగీతదర్శకత్వంలో ఇప్పటికే రెండు పాటలను పాడినట్లు ఐశ్వర్య తెలిపారు. తన గానం యువన్ ను చాలా ఇంప్రెస్ చేసిందని చెప్పారు. గాయనిగా తనను ప్రోత్సహిస్తున్న యువన్ శంకర్‌రాజాకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. కూటన్ అనే తమిళ సినిమా కోసం ఐశ్వర్య రెండు పాటలు పాడారు. ఇకపై తాను గాయనిగానూ కొనసాగుతానంటున్నారు ఐశ్వర్య. -
భారతీయుడు మళ్లీ వస్తాడా..!
కమల్ హాసన్ కెరీర్ లో బిగెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచిన సినిమా భారతీయుడు. అవినీతి, లంచగొండితనం మీద తెరకెక్కించిన ఈ సినిమాకు సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకుడు. ఈ సినిమా ఘనవిజయం సాధించడంతో అప్పటినుంచి భారతీయుడు సినిమాకు సీక్వల్ ను రూపొందించాలన్న ఆలోచనతో ఉన్నారు చిత్రయూనిట్. అయితే సరైన కథా కథనాలు దొరక్క ఈ సీక్వల్ ఆలస్యం అవుతూ వచ్చింది. శంకర్ తో పాటు, కమల్ కూడా తన సినిమాలతో బిజీగా ఉండటంతో దాదాపుగా ఈ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టేశారు. అయితే ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 2.ఓ సినిమా రిలీజ్ కు దగ్గరపడుతుండటంతో మరోసారి భారతీయుడు సీక్వల్ తెర మీదకు వచ్చింది. ఇప్పటికే శంకర్ ఓ లైన్ సిద్ధం చేశాడని, కమల్ ఓకె చెపితే ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయాలని భావిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే శంకర్, కమల్ ఈ సీక్వల్ పై ఇంత వరకు అఫీషియల్ గా స్పందించలేదు. కానీ అభిమానులు మాత్రం మరోసారి ఈ సూపర్ హిట్ కాంబినేషన్ ను తెర మీద చూసేందుకు ఎదురుచూస్తున్నారు. గతంలో స్టార్ నిర్మాత ఏయం రత్నం భారతీయుడు సీక్వల్ కోసం ప్రయత్నాలు చేశారు. మరి రోబో సీక్వల్ తరువాత అయినా ఈ ప్రాజెక్ట్ పై క్లారిటీ వస్తుందేమో చూడాలి. -
పవన్ కొత్త సినిమా ప్రారంభం
-
భారతీయుడు
దేశానికి ప్రాణం ఇచ్చేవాళ్లూ ఉంటారు.. దేశానికి ప్రాణం పోసేవాళ్లూ ఉంటారు.. దేశాన్ని ప్రేమించేవాళ్లూ ఉంటారు.. దేశానికి దేశభక్తి కథ చెప్పేవాళ్లూ ఉంటారు.. అందరూ భారతీయులే. ఇంతమంది శ్వాస తానై మన జెండా రెపరెపలాడుతుంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశభక్తి సినిమాల్లో కెల్లా గొప్ప పేరు తెచ్చుకున్న ‘భారతీయుడు’ చిత్రనిర్మాత ఏఎం రత్నంతో ‘సాక్షి’ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ..... ‘భారతీయుడు’ చిత్రం గురించి దర్శకుడు శంకర్ చెప్పినప్పుడు మీకేమనిపించింది? యాక్చువల్‌గా అప్పటికి నా మైండ్‌లో తిరుగుతున్న ఆలోచనలకు తగ్గ లైన్ ఆయన చెప్పారు. రెగ్యులర్ లైఫ్‌లో మనం ఎన్నో సమస్యలను ఫేస్ చేస్తుంటాం. ఉదాహరణకు చెన్నైలో మా ఆఫీసుకి ఓ అధికారి వచ్చి, ‘ఈ ఆఫీసుని కమర్షియల్ పర్పస్ కింద వాడుతున్నారు’ అన్నారు. ‘సరే.. ట్యాక్స్ కడతాను’ అని చెప్పా. అతను లంచం ఆశించాడు. నేను మాత్రం ట్యాక్సే కడతానన్నా. ‘పదేళ్ల నుంచీ ఈ ఆఫీసు వాడుతున్నారు. అప్పట్నుంచీ ట్యాక్స్ రాస్తా’ అన్నాడతను. అలా అంటే పదేళ్లు కట్టే బదులు ఎంతో కొంత ఇచ్చి వదిలించుకుంటానని అతని ఫీలింగ్. స్వలాభం ఆశించాడు. దేశంలో ఇలాంటి కరప్షన్ చాలా ఉంది. సినిమా పవర్ఫుల్ మీడియా. కమర్షియల్‌గా సినిమాలు చేస్తూ, వాటి ద్వారా ఎంతో కొంత మెసేజ్ చెప్పాలనేది నా ఉద్దేశం. సరిగ్గా అదే టైమ్‌లో శంకర్ ‘భారతీయుడు’ కథ చెప్పారు. నా జీవితంలో గర్వించదగ్గ సినిమా. కమల్‌హాసన్ వృద్ధ గెటప్‌కి వేసిన ప్రోస్థెటిక్ మేకప్ గురించి? ఇందులో మెయిన్ క్యారెక్టరే తాతయ్య. కమల్‌కి హాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్ మైఖేల్ వెస్ట్‌మోర్ తెలుసు. ఆయన్ను పిలిపించాం. మేకప్ వేయడానికి ఐదు గంటలు, తీయడానికి ఓ రెండు గంటలు. కమల్‌కి భార్యగా నటించిన సుకన్యకు మేకప్ వేయడానికి కూడా ఐదు గంటలు పట్టేది. ఇద్దరూ ఐదింటికి సెట్‌కి వచ్చేసేవాళ్లు. పదింటికి మేకప్ పూర్తయ్యేది. అన్నీ సెట్ చేసి, షూటింగ్ స్టార్ట్ చేసేసరికి సాయంత్రం మూడు గంటలయ్యేది. ఐదింటికి లైటింగ్ పోతుంది. జస్ట్ రెండు మూడు గంటల షూటింగ్‌కి ఐదు గంటలు మేకప్ వేయడం, రెండు గంటలు తీయడం. మీరు స్వతహాగా మేకప్‌మ్యాన్ కాబట్టి.. ప్రోస్థెటిక్ మేకప్ నేర్చుకోవాలనే ఇంట్రస్ట్ ఉండేది కాదా? ఇంట్రస్ట్ ఉంది కాబట్టే.. ఉదయం ఐదు గంటలకు నేనూ వెళ్లేవాణ్ణి. కమల్ చేతులకు నేనే మేకప్ వేసేవాణ్ణి. విగ్ అదీ సెట్ చేసేవాణ్ణి. రెండు గంటల షూటింగ్ కోసం ఐదు గంటలు మేకప్పా అని వేరేవాళ్లైతే అనుకునేవారేమో. నేను మేకప్మ్యాన్ని కాబట్టి, మేకప్ వేల్యూ తెలుసు. అందుకే ఈ సినిమా నిర్మించగలిగా. నేను గర్వంగా ఫీలయ్యేదేంటంటే... ‘మగధీర’, ‘బాహుబలి’, ‘రోబో-2’ వంటి చిత్రాలకు ఇప్పుడు వీఎఫ్ఎక్స్ చేస్తున్నవాళ్లు ఆల్రెడీ నా సినిమాలకు పని చేశారు. ‘భారతీయుడు’, ‘ప్రేమికుల రోజు’ వంటి సినిమాలకు గ్రాఫిక్స్ చేయించా. ఇప్పుడు మన కంట్రీలో సీజీ (కంప్యూటర్ గ్రాఫిక్స్) చేసేవాళ్లల్లో కమల్ కణ్ణన్, శ్రీనివాస్ మోహన్ వీళ్లే నం.1. మొన్నా మధ్య ‘బాహుబలి’ ఆడియోలో ‘మమ్మల్ని డెవలప్ చేసింది రత్నంగారే. అప్పట్లో మమ్మల్ని ఎంకరేజ్ చేశారు’ అని వాళ్లు చెప్పడం హ్యాపీగా అనిపించింది. {పోస్థెటిక్ మేకప్ వాడిన తొలి భారతీయ సినిమా ఇదే కదా! అవును. కొంచెం వ్యయప్రయాసలతో కూడుకున్నదే. ప్రోస్థెటిక్ మేకప్ రిమూవ్ చేయడానికికొలడీ అని ఓ మెటీరియల్ ఉంది. ఇండియాలో దొరకదు. అది తెప్పించడానికి టైమ్ పట్టేది. అప్పట్లో మైఖేల్ వెస్ట్‌మోర్ చాలా బిజీ. ‘ఓ వారం రోజులు అతణ్ణి పిలిపిద్దాం. తర్వాత ముంబై మేకప్మ్యాన్కి అలవాటు చేయిద్దాం’ అని కమల్ చెప్పారు. ఫస్ట్ డే చూసిన తర్వాత ‘ఇది మామూలు మేకప్ కాదు. ఇతను చేసి వెళిపోతే.. తర్వాత చేసేవాళ్లు సరిగ్గా చేయలేకపోతే’ అని నాకు భయం పట్టుకుంది. దాంతో షెడ్యూల్ మొత్తం 15 రోజులు ఉంటారా? అనడిగా. మైఖేల్ వెస్ట్‌మోర్ ఈ సినిమా కోసం ఇండియాకి ఐదుసార్లు వచ్చారు. ముసలి వ్యక్తిగా మేకప్ వేసినా, కమల్ యంగ్ కదా. అచ్చం ముసలివాళ్లు నడిచినట్లు నడవడం, చూడటంతో ఆ మేకప్‌కి న్యాయం జరిగింది. ‘భారతీయుడు’ మేకింగ్‌పరంగా ఏమైనా సమస్యలు? ఏవీ లేవు. కమల్, శంకర్, ఏఆర్ రెహమాన్.. అందరూ ఇగో ఉన్నవాళ్లు. వీళ్లతో సినిమా అంటే అది మధ్యలోనే ఆగిపోతుంది? అని బయట అనుకున్నారు. కానీ, ఆ సినిమాకి పని చేసినట్లే తెలియలేదు. అంత హాయిగా పనిచేశాం. లైఫ్‌లో ‘భారతీయుడు’ నాకో మంచి మెమరీ. ఆ సినిమాలో ఫస్ట్ టైమ్ చేసిన థింగ్స్ చాలా ఉన్నాయి. విమర్శలూ.. వివాదాలేమైనా... బ్లూ క్రాస్తో ఓ సమస్య వచ్చింది. షూటింగ్‌కి ఒంటె పిల్ల అవసరమైంది. పిల్లతో పాటు తల్లిని కూడా కొనాల్సిందే అనడంతో జైపూర్ నుంచి ఓ ఒంటె పిల్ల, తల్లిని తీసుకొచ్చాం. షూటింగ్ పూర్తయ్యాక జూకి ఇచ్చేద్దామనుకుంటే... అక్కడ ఉన్నవాటికే తిండి పెట్టలేని పరిస్థితిలో ఉన్నామన్నారు. ఈలోపు ఇక్కడి వాతావరణం ఒంటె పిల్లకి పడలేదు. మెడికల్ ట్రీట్మెంట్ ఇప్పించినా ప్రయోజనం లేకపోయింది. చనిపోయింది. ‘సినిమాకి వాడుకుని, తిండి పెట్టకుండా చంపేశారు’ అని వార్తలు రాశారు. ఎవరో బూ ్లక్రాస్కి ఉత్తరం రాశారు. లక్కీగా ట్రీట్మెంట్ ఇప్పించిన మెడికల్ బిల్స్ ఉండడంతో బయటపడ్డాం. ‘భారతీయుడు’ విషయంలో కమల్ ఏమనేవారు? ఈ సినిమా ఫస్ట్ కాపీ చూశాక ‘ఇది నాకు ఐదు సంవత్సరాల లైఫ్’ అన్నారు. ఆయన ఐదేళ్లు అన్నారు కానీ, పదేళ్ల లైఫ్ అయ్యింది. ఆ స్థాయిలో నటించారు. యాక్ట్ చేసిన కమల్‌కూ, తీసిన మీకూ పాదాభివందనాలు అని ఓ ప్రముఖ వ్యక్తి అన్నారు. అంతకన్నా తృప్తి ఏముంటుంది? అసలు బడ్జెట్ ఎంత అయింది? ఇప్పుడా బడ్జెట్ చెబితే నథింగ్ అన్పిస్తుంది. ‘భారతీయుడు’ని ఇప్పుడు తీయాలంటే వంద, రెండొందల కోట్లు చాలవు. సినిమా అంతా పూర్తయిందనుకున్నాక ‘తెప్పలెళ్లిపోయాకా.. ముప్పు తొలగిపోయిందే చిన్నమ్మా’ పాట తీద్దామని శంకర్ అన్నారు. సాంగ్ ఐడియా విని మూడు రోజులు నిద్రపట్టలేదు. 400 మంది డ్యాన్సర్లు, 1000మంది జనాలు, నైట్ ఎఫెక్ట్, లైటింగ్ కోసం 8 జనరేటర్లు, డిఫరెంట్ కాస్ట్యూమ్స్... అప్పట్లో ఆ పాటకు కోటి రూపాయల బడ్జెట్ అయ్యింది. బాలీవుడ్లో ‘హమ్ ఆప్కే కౌన్ హై’, ‘మైనే ప్యార్ కియా’ వంటి సినిమాలు తీస్తున్న టైమ్‌లో... ఇంత పెద్ద స్పాన్, ఇన్ని వేరియేషన్స్ ఉన్న సినిమా చూసి అక్కడివాళ్లు షాకయ్యారు. ‘భారతీయుడు 2’ కూడా చేయాలనుకుంటున్నారట? యాక్చువల్లీ... కమల్ అప్పట్లోనే సీక్వెల్ చేద్దామన్నారు. తర్వాత చేద్దామనుకున్నాం. ఈ మధ్య ఓసారి శంకర్ కూడా సీక్వెల్ ప్రస్తావన తీసుకొచ్చారు. ప్రస్తుతం ‘రోబో 2’తో బిజీగా ఉన్నారాయన. చూద్దాం. ‘రత్నం పట్టిందల్లా బంగారం’ అని ఒకప్పుడు మిమ్మల్ని అందరూ అనేవారు. కానీ, సడన్‌గా డౌన్ ఫాల్ అయ్యారు. దానికి కారణంగా నిలిచిన సినిమాలు..? బాయ్స్, ప్రేమికుల రోజు, నాయక్.. ఈ మూడు సినిమాల కారణంగా ఆర్థికంగా డౌన్ అయ్యాను. ‘బాయ్స్’ తమిళనాడులో తప్ప ప్రపంచం మొత్తం హిట్. ఆ సినిమాలో కుర్రాళ్లు ఓ వేశ్యని ఇంటికి తీసుకొస్తారు. అక్కడ ఇబ్బందిపడే సీన్స్ ఉండవు. అయినప్పటికీ, ‘శంకర్, రత్నం ఇలాంటి సీన్స్ తీస్తారా?’ అని చెన్నైలో ఎవరో వివాదం మొదలుపెట్టారు. అది మైనస్ అయింది. ‘ప్రేమికుల రోజు’కి కూడా డబ్బులు పోయాయ్. తర్వాత ‘నాయక్’. ఇంతవరకూ ఏ హిందీ సినిమా టెలికాస్ట్ కానన్ని సార్లు టీవీలో టెలికాస్ట్ అయింది. అయితే అప్పటి మార్కెట్ సరిగ్గా లేకపోవడంతో కమర్షియల్‌గా వర్కవుట్ కాలేదు. అప్పట్లో ఆ మూడు సినిమాలకు 65 కోట్లు ఖర్చు పెట్టాం. ఒకసారి డౌన్ అయ్యాక.. రెండో సారి కూడా అదే కంటిన్యూ అయ్యి మూడోసారి కూడా అదే జరిగితే తేరుకోవడం కష్టమవుతుంది. ఆ తర్వాత కూడా తమిళంలో నేను సూపర్ హిట్ సినిమాలు చేసినా పుంజుకోవడం కష్టమైంది. దాంతో నిర్మాణం పరంగా గ్యాప్ వచ్చింది. అజిత్ చాన్స్ ఇవ్వడంవల్లే మళ్లీ సినిమా నిర్మాణం మొదలుపెట్టారు.. ఆయనకు మీ మీద అంత అభిమానం ఎందుకు? అజిత్ చేసిన ‘ప్రేమలేఖ’ను తెలుగులో రిలీజ్ చేసింది నేనే. స్ట్రయిట్ సినిమా చేద్దామనుకున్నా కుదరలేదు. శంకర్‌తో, విజయ్‌తో రత్నం సినిమాలు చేశాడు.. వాళ్లెవరూ డేట్స్ ఇవ్వలేదని వేరేవాళ్లు అనుకుంటున్నారు. కానీ, నేనలా అనుకోను. ఒకసారి చిరంజీవిగారు ఏమన్నారంటే.. ‘రత్నం.. ఆర్టిస్ట్‌గా నేను ఎవరో ఓ నిర్మాతకు సినిమా చేయాల్సిందే. నువ్వు సినిమాలు బాగా తీస్తావ్. నీకెందుకు చెయ్యను? నాకు సూట్ అయ్యే కథతో వస్తే కచ్చితంగా నీకు చేస్తా’ అన్నారు. నేను తీసిన సినిమాల ద్వారా ఆ నమ్మకం ఏర్పరచుకోగలిగాను. ఇప్పుడు అజిత్ సినిమా ఇవ్వడం నా కమ్‌బ్యాక్‌కి కారణం అయింది. పవన్ కల్యాణ్‌తో ‘ఖుషీ’ వంటి హిట్టిచ్చారు.. మళ్లీ ఆయనతో సినిమా చేసే ప్లాన్‌లో ఉన్నారట కదా? అవును. దర్శకుడు నేసన్ని పవన్ కల్యాణ్‌గారితో కల్పించాను. ‘హీ ఈజ్ నైస్’ అని కల్యాణ్‌గారు అన్నారు. ►దేశంలో ఎక్కడ చూసినా లంచగొండితనం. జనన మరణ ధృవీకరణ పత్రం కావాలన్నా లంచం ఇవ్వాల్సిందే. ఈ పరిస్థితిని ప్రోత్సహిస్తున్న కార్పొరేషన్ కమిషనర్‌ను హత్య చేస్తాడు భారతీయుడు. ►మరోవైపు ఈ భారతీయుడి కొడుకు చందు ట్రాన్స్పోర్ట్ ఆఫీసులో ఏజెంట్‌గా ఎక్కడ లేని అవినీతి చేస్తుంటాడు. ►పోలీసు కాల్పుల్లో చెప్పులు కుట్టే వ్యక్తి చనిపోతే అతని భార్య దిక్కులేనిది అవుతుంది. ►దేశభక్తుడైన సేనాపతి దీనికి ప్రతీకారంగా బ్రిటిష్ వారిని చంపుతాడు. ►విదేశీ వస్త్రాల బహిష్కరణ ఉద్యమంలో విదేశీ వస్త్రాలు తగులబెట్టిన ఆడవాళ్లను వివస్త్రలు చేసి వారు సామూహిక ఆత్మహత్య చేసుకునేలా చేస్తారు బ్రిటిష్‌వారు. ►స్వాతంత్య్రం వచ్చాక భార్యతో కొడుకు కూతురుతో జీవిస్తున్న భారతీయుడి వ్యవహార శైలి నచ్చక కొడుకు ఇంట్లో నుంచి వెళ్లిపోతాడు. ►అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న కుమార్తెను కాపాడుకోవాలనుకున్నప్పుడే ఈ దేశంలో ఎంత లంచగొండితనం పేరుకుని ఉందో భారతీయుడికి తెలుస్తుంది. ఒకప్పుడు చేసింది తెల్లవాళ్లతో పోరాటం. ఇప్పుడు చేయాల్సింది నల్లవాళ్లపై పోరాటం. ►భారతీయుడి కోసం ఐపిఎస్ ఆఫీసర్ కృష్ణస్వామి వేట మొదలెడతాడు. ►చంపుతున్నది ఒక డెబ్బై ఏళ్లు పై బడిన వృద్ధుడు అని గ్రహిస్తాడు. ►అప్పటి నుంచి లంచగొండి ఆఫీసర్లను హతమారుస్తున్న భారతీయుడు తన సొంత కొడుకును కూడా వదలడు. పనికిరాని బస్సుకు లెసైన్సు ఇచ్చి పిల్లల మరణానికి కారణమైన కొడుకు చందును కొడుకని కూడా చూడకుండా చంపుతాడు భారతీయుడు. ►భారతీయుణ్ణి వెతుక్కుంటూ వెళ్లిన కృష్ణస్వామికి భారతీయుడి గతం చెబుతుంది అతడి భార్య అమృతవల్లి. అతడి అసలు పేరు సేనాపతి. స్వాతంత్య్ర సమరయోధుడు. ►తాను బతికే ఉన్నానని ఎక్కడ లంచగొండితనం కనిపించినా తిరిగి వస్తానని అమెరికా నుంచి ఫోన్ చేసి పోలీసులకు చెప్తాడు భారతీయుడు. భారతీయుడికి మరణం లేదు అంటూ కథకు శుభం పలుకుతాడు భారతీయుడు. ►ఫస్ట్ టైమ్ ఆస్ట్రేలియాలో షూట్ చేసిన ఇండియన్ సినిమా ‘భారతీయుడు’. ఫారిన్ టెక్నీషియన్లు, లొకేషన్లు.. ఖర్చు ఎక్కువని అంతకు ముందు ఎవరూ వెళ్లలేదు. ►ఇండియన్ సినిమాలో ఫస్ట్ టైమ్ ఫారిన్ డ్యాన్సర్లను చూపించిన సినిమా ఇదే. ‘అదిరేటి డ్రెస్సు మీరేస్తే..’ పాటలో ఫారిన్ డ్యాన్సర్లు కనిపించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ప్రతి సినిమాలోనూ ఫారిన్ డ్యాన్సర్లు కామన్ అయ్యారు. అంతకు ముందు నేను చాలా పాటలు రాశాను. కానీ, ఫస్ట్ టైమ్ ‘అదిరేటి డ్రెస్సు..’ పాటకు రచయితగా పేరు వేసుకున్నాను. ►అప్పట్లో హాలీవుడ్ నుంచి ఓ మేకప్‌మ్యాన్ ఇండియన్ సినిమాకి వర్క్ చేసింది ‘భారతీయుడు’కే. ►ఫస్ట్ టైమ్ హాంకాంగ్‌లో గ్రాఫిక్స్ చేయించిన సినిమా ఇదే. ►అన్నిటికంటే ముఖ్యంగా సినిమా క్లైమాక్స్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో షూట్ చేయాలి. ఫ్లైట్ కింద నుంచి కమల్‌హాసన్ రోల్ కావడం, ఎయిర్‌పోర్ట్‌లో గన్‌ఫైర్ చేయడం, ఫ్లైట్ ఎక్కి పారిపోవడం.. ఓ అరవై మంది యూనిట్ సభ్యులు, ఫైటర్స్‌తో సహా ఎయిర్‌పోర్ట్‌లోకి వెళ్లి షూటింగ్ చేసిన చరిత్ర ‘భారతీయుడు’ మినహా ఇప్పటికీ ఏ సినిమాకీ లేదు. ‘కబాలి’కి ముందు ‘భారతీయుడి’దే ఆ రికార్డ్ అప్పట్లో మణిరత్నం ‘రోజా’ని హిందీ నిర్మాత 25 లక్షలకు కొన్నారు. అది 5 కోట్లు కలక్ట్ చేసింది. డబ్బింగ్ సినిమాల్లో ఆ రికార్డ్ సాధించిన తొలి సినిమా అది. ఆ తర్వాత ‘భారతీయుడు’ దాన్ని అధిగమించింది. ఆ చిత్రాన్ని హిందీలో డబ్ చేసి, విడుదల చేస్తే 15 కోట్లు వసూలు చేసింది. రజనీకాంత్ సినిమా ‘కబాలి’ వచ్చే వరకూ ‘రోజా’, ‘ముంబయ్’, ఆ రెండుకన్నా బిగ్గెస్ట్ రికార్డ్‌తో ‘భారతీయుడు’ ఉండేది. - డి.జి.భవాని -
త్వరలో భారతీయుడు సీక్వెల్
లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా, సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా భారతీయుడు. దేశంలో లంచం వల్ల జరుగుతున్న అన్యాయాలపై ఓ స్వాతంత్ర్య సమరయోధుడు చేసే పోరాటంగా తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది. కమల్ హాసన్ మేకప్‌తో పాటు, ఫైట్స్ ఈ సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. అందుకే భారతీయుడు రిలీజ్ అయినప్పటి నుంచే ఆ సినిమా సీక్వెల్‌పై చర్చ మొదలైంది. అప్పట్లో భారతీయుడు సినిమాను నిర్మించిన ప్రతిష్ఠాత్మక నిర్మాణసంస్థ సూర్య మూవీస్ ఇన్నేళ్ల తరువాత ఆ సినిమాకు సీక్వెల్ నిర్మించే ఆలోచన చేస్తోంది. కమల్ హాసన్, శంకర్ కూడా భారతీయుడు సీక్వెల్‌ను రూపొందించడానికి ఆసక్తి చూపిస్తుండటంతో త్వరలోనే ఈ సినిమా కార్యరూపం దాల్చనుందన్న టాక్ వినిపిస్తోంది. సూర్య మూవీస్ నిర్మాత ఏఎమ్ రత్నం ఈ విషయాన్ని కన్ఫామ్ చేశాడు. తొలి భాగం చివర్లో విదేశాలకు వెళ్లిపోయిన భారతీయుడు మళ్లీ తన దేశానికి నా అవసరం ఉన్నప్పుడు తిరిగి వస్తానంటూ మాట ఇస్తాడు. అదే లైన్ తీసుకొని సీక్వెల్‌ను రూపొందించడానికి ప్లాన్ చేస్తున్నారట. అయితే ప్రస్తుతానికి చర్చల దశలోనే ఉన్న ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వస్తుందో మాత్రం వెల్లడించలేదు. -
మళ్లీ ఫాంలోకి వచ్చాడు
ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ నిర్మాణ సంస్థగా పేరున్న సూర్య మూవీ ఇటీవల కాలంలో ఆ జోరు చూపించలేకపోతుంది. శంకర్ లాంటి టాప్ డైరెక్టర్స్‌తో వరుస బ్లాక్ బస్టర్స్ అందించిన నిర్మాత ఏఎమ్ రత్నం.. తర్వాత ఆ స్ధాయి విజయాలు సాధించలేకపోయాడు. ముఖ్యంగా ఒక కొడుకును హీరోగా, మరో కొడుకును దర్శకుడిగా పరిచయం చేసిన రత్నం, వారిని ఇండస్ట్రీలో నిలబెట్టే క్రమంలో తీవ్రంగా నష్టపోయాడు. దీంతో చాలాకాలం సినిమాలకు దూరంగానే ఉండిపోయాడు. ఇటీవలే తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన రత్నం, ప్రస్తుతం మళ్లీ మంచి ఫాంలోకి వచ్చినట్టుగానే కనిపిస్తున్నాడు. తన పాత బ్యానర్ శ్రీ సూర్యా మూవీస్ కలిసి రాలేదనుకున్నాడో ఏమో గాని, రీ ఎంట్రీలో కొత్త బ్యానర్ మీద సినిమాలు చేస్తున్నాడు. తన కూతురుని నిర్మాతగా పరిచయం చేస్తూ శ్రీ సాయిరామ్ క్రియేషన్స్ బ్యానర్‌పై సినిమాలు నిర్మిస్తున్నాడు. అజిత్ హీరోగా తెరకెక్కిన ఆరంభం సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన రత్నం తరువాత, వరుసగా ఎన్నై అరిందాల్, వేదలం సినిమాలను అజిత్ హీరోగానే తెరకెక్కించాడు. ఈ మూడు సినిమాలు భారీ విజయాలు నమోదు చేయటంతో ఏఎమ్ రత్నం చాలా ఆనందం గా ఉన్నాడు. 40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన వేదలం ఫస్ట్ వీకెండ్లోనే సినిమా బడ్జెట్ కన్నా ఎక్కువ వసూళ్లను రాబట్టింది. భారీ వర్షాలు పడుతున్నా, ఇప్పటికీ మంచి కలెక్షన్లు వస్తుండటంతో ఈ సినిమా లాంగ్ రన్లో వంద కోట్ల వసూళ్లు రాబట్టడం ఖాయంగా కనినిస్తోంది. దీంతో మరోసారి ఏఎమ్ రత్నంకు పూర్వ వైభవం రావడం ఖాయం అంటున్నారు కోలీవుడ్ సినీ అభిమానులు. -
శంకర్, కమల్ ల సీక్వెల్
కమల్ హాసన్ కెరీర్ లో బిగెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచిన సినిమా భారతీయుడు. అవినీతి, లంచగొండితనం మీద తెరకెక్కించిన ఈ సినిమాకు సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకుడు. ఈ సినిమా ఘనవిజయం సాధించడంతో అప్పటినుంచి భారతీయుడు సినిమాకు సీక్వల్ ను రూపొందించాలన్న ఆలోచనతో ఉన్నారు చిత్రయూనిట్. అయితే సరైన కథా కథనాలు దొరక్క ఈ సీక్వల్ ఆలస్యం అవుతూ వచ్చింది. శంకర్ తో పాటు, కమల్ కూడా తన సినిమాలతో బిజీగా ఉండటంతో దాదాపుగా ఈ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టేశారు. ఈ సినిమా నిర్మించాడానికి ప్రయత్నాలు చేస్తున్న నిర్మాత ఏఎం రత్నం కూడా కొంతకాలంగా నిర్మాణ రంగానికి దూరంగా ఉంటూ వస్తున్నాడు. అందుకే భారతీయుడు సీక్వల్ కు సంబంధించిన వార్త చాలారోజులుగా ఇండస్ట్రీలో వినిపించలేదు. తాజాగా అజిత్ హీరోగా వేదలం సినిమాను నిర్మించిన రత్నం మరోసారి భారతీయుడు సీక్వల్ ను తెర మీదకు తీసుకువచ్చాడు. వేదలం సినిమాను దీపావళి కానుకగా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం రజనీ హీరోగా తెరకెక్కుతున్న రోబో 2 పనుల్లో బిజీగా ఉన్న శంకర్ ఆ సినిమా పూర్తయిన తరువాత భారతీయుడు సీక్వల్ మీద దృష్టి పెట్టే అవకాశం ఉంది.