‘హిట్‌ మ్యాన్‌’ టీజర్‌ వైవిధ్యంగా ఉంది: ఏఎం రత్నం | HITMAN Chapter 1 Teaser launch | Sakshi
Sakshi News home page

‘హిట్‌ మ్యాన్‌’ టీజర్‌ వైవిధ్యంగా ఉంది: ఏఎం రత్నం

Sep 7 2023 4:56 AM | Updated on Sep 7 2023 2:11 PM

HITMAN Chapter 1 Teaser launch - Sakshi

‘‘హిట్‌ మ్యాన్‌’ సినిమా టీజర్‌ చాలా వైవిధ్యంగా ఉంది. యాక్షన్‌ సీక్వెన్సులు ఆకట్టుకుంటున్నాయి. బిష్ణు చేస్తోన్న ఈ తొలి ప్రయత్నం పెద్ద సక్సెస్‌ కావాలి’’ అని నిర్మాత ఏఎం రత్నం అన్నారు. బిష్ణు అధికారి హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘హిట్‌ మ్యాన్‌’. అదితీ శర్మ, ఆంచల్‌ శర్మ హీరోయిన్లు. 99 సినిమాస్‌పై దీపక్‌ అధికారి నిర్మించిన ఈ సినిమా నవంబర్‌లో రిలీజ్‌ కానుంది. ఈ సినిమా టీజర్‌ను ఏఎం రత్నం విడుదల చేశారు.

ఈ సందర్భంగా బిష్ణు అధికారి మాట్లాడుతూ– ‘‘హిట్‌ మ్యాన్‌’ ఒక స్పై థ్రిల్లర్‌. న్యూ ఏజ్‌ మూవీ. ఈ సినిమాను మూడు భాగాలుగా చిత్రీకరిస్తున్నాం. తొలి భాగాన్ని నవంబర్‌లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ‘‘ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలి’’ అన్నారు డైరెక్టర్‌ సముద్ర. ‘‘మా ‘హిట్‌ మ్యాన్‌’ సినిమాకు సహకారం అందిస్తున్నవారికి కృతజ్ఞతలు’’ అన్నారు చిత్ర సహనిర్మాత సి్ర΄ా మిశ్రా, సంగీత దర్శకుడు ‘మంత్ర’ ఆనంద్‌. ఈ చిత్రానికి లైన్‌ ్ర΄÷డ్యూసర్‌: రోహిత్‌ ఇంగ్లే, అసోసియేట్‌ ్ర΄÷డ్యూసర్‌: సన్నీ లల్వానీ, కెమెరా: వైఆర్‌ శేఖర్‌. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement