
వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు హీరో శ్రీవిష్ణు. ఫిబ్రవరి 29న తన పుట్టినరోజుని పురస్కరించుకుని డబుల్ ధమాకా ఇచ్చారాయన. శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్న రెండు సినిమాల అప్‌డేట్స్ ఇచ్చారు మేకర్స్. హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా నటించిన చిత్రానికి ‘మృత్యుంజయ్’ టైటిల్ ఖరారు చేశారు. ‘సామజవరగమన’ చిత్రం తర్వాత శ్రీవిష్ణు, రెబా జాన్ జంటగా నటించిన చిత్రమిది.
రమ్య గుణ్ణం సమర్పణలో లైట్ బాక్స్ మీడియా, పిక్చర్ పర్‌ఫెక్ట్ ఎంటర్‌టైన్ మెంట్‌పై సందీప్ గుణ్ణం, వినయ్ చిలకపాటి నిర్మించారు. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా టైటిల్ టీజర్‌ను శుక్రవారం విడుదల చేశారు. ఒంగోలు నేపథ్యంలో... శ్రీవిష్ణు హీరోగా నూతన దర్శకుడు యదునాథ్ మారుతీ రావు దర్శకత్వంలో కొత్త సినిమాని ప్రకటించారు మేకర్స్.
శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ నాయుడు జి. నిర్మించనున్నారు. ‘ఒంగోలు పట్టణం నేపథ్యంలో ఈ చిత్ర కథ సాగుతుంది. శ్రీవిష్ణు హిలేరియస్ క్యారెక్టర్‌లో కనిపిస్తారు’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సమర్పణ: హేమ–షాలిని, సహ నిర్మాతలు: సుబ్రమణ్యం నాయుడు జి, రామాచారి ఎం.