![Sree Vishnu Single Glimpse](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/srivishnu.jpg.webp?itok=GAxUtyv0)
ఒకరు కాదు... ఇద్దరు అమ్మాయిలు ప్రేమిస్తారు అతన్ని. కానీ, ‘ఒంటరివాడను నేను... ఎవ్వరివాడను కాను...’ అనే పాట వింటుంటాడు. పైగా 35 ఏళ్ల వయసులో ఉన్న ఒక వ్యక్తి పెళ్లి కాకుండా మిగిలిపోవడానికి కారకుడు కూడా అవుతాడు. ఈ ఒంటరివాడు ఆ తర్వాత ఒక ఇంటివాడు అవుతాడా? పెళ్లి కాని 35 ఏళ్ల బ్రహ్మచారి కథ ఏంటి? అనేది తెలుసుకోవాలంటే ‘హ్యాష్‌ట్యాగ్ సింగిల్’ చిత్రం చూడాలి.
ఒంటరివాడుగా హీరో శ్రీవిష్ణు(Sree Vishnu), 35 ఏళ్ల యువకుడిగా ‘వెన్నెల కిశోర్’ నటిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో కార్తీక్ రాజు దర్శకత్వంలో కళ్యా ఫిల్మ్స్‌తో కలిసి విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మిస్తున్నారు. సోమవారం ఈ చిత్రం టైటిల్ ప్రకటించి, శ్రీవిష్ణు లుక్, గ్లింప్స్ విడుదల చేశారు. కేతికా శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: విశాల్ చంద్రశేఖర్, కెమేరా: ఆర్ వేల్‌రాజ్.
Comments
Please login to add a commentAdd a comment