Single
-
త్వరలో సింగిల్ ఫైలింగ్
ముంబై: లిస్టెడ్ కంపెనీలకు సంబంధించి సింగిల్ ఫైలింగ్ ప్రతిపాదన త్వరలోనే అమల్లోకి రాగలదని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చీఫ్ మాధవి పురి బుచ్ వెల్లడించారు. దీనితో, లిస్టింగ్ నిబంధనల ప్రకారం కంపెనీలు తాము వెల్లడించాల్సిన సమాచారాన్ని ఒక ఎక్సే్చంజీలో ఫైలింగ్ చేస్తే రెండో ఎక్సే్చంజీలో కూడా అది ఆటోమేటిక్‌గా అప్లోడ్ అవుతుందని పేర్కొన్నారు. పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించిన ఫైనాన్సింగ్ 3.0 సదస్సులో ప్రత్యేక ప్లీనరీ సెషన్లో పాల్గొన్న సందర్భంగా మాధవి ఈ విషయాలు తెలిపారు. సెబీ మాజీ హోల్‌టైమ్ సభ్యుడు ఎస్కే మొహంతి సారథ్యంలోని కమిటీ ఈ సిఫార్సులు చేసింది. మరోవైపు, నెలకు అత్యంత తక్కువగా రూ. 250 నుంచి ప్రారంభమయ్యే సిప్ల (సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్) ప్రతిపాదన కూడా త్వరలో సాకారం కాగలదని కాగలదని మాధవి వివరించారు. అన్ని ఆర్థిక సాధనాలను సామాన్యులకు అందుబాటులోకి తెచ్చే దిశగా ఇది కీలక పరిణామం కాగలదని చెప్పారు. ప్రాంతీయ భాషల్లో ఐపీవో పత్రాలు..: భాషాపరమైన అడ్డంకులను తొలగించేందుకు, ఇన్వెస్టర్లలో అవగాహన పెంచేందుకు ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) పత్రాలను బహుళ భాషల్లో అందుబాటులోకి తేవాలన్న నిబంధనను కూడా ప్రవేశపెట్టే యోచన ఉందని మాధవి చెప్పారు. మరింత మంది ఇన్వెస్టర్లు మార్కెట్లలో పాలుపంచుకునేందుకు ఐపీవో ప్రాస్పెక్టస్ 15–16 ప్రాంతీయ భాష ల్లో ఉండాలని ఆమె పేర్కొన్నారు. ఇన్వెస్టరు తీరుకు అనుగుణమైన వివిధ ఆర్థిక సాధనాలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయ త్నాలు జరుగుతున్నాయని తెలిపారు. మారుతున్న ఇన్వెస్టర్ల అవసరాలకు తగ్గట్లుగా కొత్త సాధనాలను ప్రవేశపెట్టడంపై పరిశ్రమతో కలిసి పనిచేయనున్నట్లు చెప్పారు.‘హోల్డ్’లో జేఎస్‌డబ్ల్యూ సిమెంట్ ‘ఆఫర్’జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ కంపెనీ జేఎస్‌డబ్ల్యూ సిమెంట్ ఇనీíÙయల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) దరఖాస్తును సెబీ ‘హోల్డ్’లో పెట్టింది. ‘పరిశీలన జారీ చేశాం. దీంతో నిలుపుదల చేశాం’అని సెబీ పేర్కొంది. కారణాలను తెలియజేయలేదు. ఈ ఏడాది ఆగస్ట్ 16న ఐపీవో పత్రాలను సెబీకి జేఎస్‌డబ్ల్యూ సిమెంట్ సమరి్పంచడం గమనార్హం. ప్రతిపాదిత దరఖాస్తు ప్రకారం.. తాజా షేర్ల జారీ ద్వారా రూ.2,000 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్ ద్వారా రూ.2,000 కోట్లు సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. తాజా షేర్ల జారీ ద్వారా సమకూరిన నిధుల్లో రూ.800 కోట్లతో రాజస్థాన్‌లోని నాగౌర్‌లో కొత్త సిమెంట్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలనుకుంటోంది. ప్రస్తుతం కంపెనీ నిర్వహణలో 19 మిలియన్ టన్నుల వార్షిక సిమెంట్ తయారీ సామర్థ్యం (ఎంటీపీఏ) ఉండగా.. 60 ఎంటీపీఏ చేరుకోవాలన్నది కంపెనీ లక్ష్యం. ఐపీవోకు ఐడెంటికల్ బ్రెయిన్ స్టూడియోస్: వీఎఫ్ఎక్స్ సేవల కంపెనీ ‘ఐడెంటికల్ బ్రెయిన్ స్టూడియోస్’ ఐపీవోకి రావాలనుకుంటోంది. ఎన్ఎస్ ఈ ‘ఎమర్జ్’ ప్లాట్‌ఫామ్‌పై (సూక్ష్మ కంపెనీలకు ఉద్దేశించిన) లిస్ట్ అయ్యేందుకు వీలుగా పత్రాలు సమరి్పంచింది. ఐపీవోలో భాగంగా 36.94 లక్షల షేర్లను తాజాగా జారీ చేయనుంది. సమీకరించే నిధులతో ముంబైలోని అంధేరిలో ఉన్న స్టూడియో, ఆఫీస్ నవీకరణ, అంధేరిలోనే కొత్త శాఖలో సౌండ్ స్టూడియో సెటప్ ఏర్పాటుకు వినియోగించనుంది. లక్నోలో నూతన బ్రాంచ్ ఆఫీస్ ఏర్పాటు చేయనుంది. సినిమాలు, వెబ్ సిరీస్‌లు, టీవీ కార్యక్రమాలకు కావాల్సిన వీఎఫ్ఎక్స్ సేవలను ఈ సంస్థ అందిస్తుంటుంది. 2024 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి రూ.20 కోట్ల ఆదాయంపై, రూ.5.34 కోట్ల లాభాన్ని ప్రకటించింది.ఐపీవో షేర్లు.. వారంలోనే విక్రయం!లాభాల స్వీకరణకే ఇన్వెస్టర్ల మొగ్గు ఇనీíÙయల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)లలో ఉత్సాహంగా పాల్గొంటున్న ఇన్వెస్టర్లలో ఎక్కువ మంది స్వల్పకాల దృష్టితోనే వస్తున్నట్టు సెబీ అధ్యయనంలో వెల్లడైంది. ఐపీవోలో తమకు కేటాయించిన షేర్లలో 54 శాతం మేర (విలువ పరంగా) లిస్ట్ అయిన వారంలోనే విక్రయిస్తున్నారు. ఐపీవో ధరతో పోలి్చతే లాభాలతో లిస్టింగ్ అయ్యేవి ఎక్కువ ఉంటుండగా, కొన్ని నష్టాలతో లిస్ట్ కావడం లేదా లిస్ట్ అయిన వెంటనే నష్టాల్లోకి వెళ్లడం సాధారణంగా చూస్తుంటాం. అయితే, నష్టాలతో లిస్ట్ అయిన వాటి కంటే, లాభాలతో లిస్ట్ అయిన వాటిని విక్రయించే స్వభావం ఇన్వెస్టర్లలో కనిపిస్తోంది. ఇటీవలి కాలంలో ఐపీవోలలో వ్యక్తిగత ఇన్వెస్టర్లు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. రిటైల్ కోటా సైతం పదులు, వందల సంఖ్యలో అధిక సబ్‌్రస్కిప్షన్లను అందుకుంటోంది. దీంతో ఐపీవోల పట్ల ఇన్వెస్టర్ల ధోరణి తెలుసుకునేందుకు సెబీ లోతైన అధ్యయనం నిర్వహించింది. 2021 ఏప్రిల్ నుంచి 2023 డిసెంబర్ మధ్య కాలంలో 144 ఐపీవోలకు సంబంధించిన డేటాను విశ్లేíÙంచింది. యాంకర్ ఇన్వెస్టర్లు మినహా మిగిలిన ఇన్వెస్టర్లు 54 శాతం మేర షేర్లను (విలువ పరంగా) లిస్ట్ అయిన వారంలోనే విక్రయించారు. ఇందులో 50.2 శాతం షేర్లు వ్యక్తిగత ఇన్వెస్టర్లకు చెందినవి కాగా, నాన్ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు సైతం 63.3 శాతం షేర్లను వారంలోనే విక్రయించారు. ఇక రిటైల్ ఇన్వెస్టర్లు సైతం 42.7 శాతం షేర్లను లిస్ట్ అయిన వారంలోపే విక్రయించి లాభాలు స్వీకరించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఐపీవోల్లో పాల్గొన్న వ్యక్తిగత ఇన్వెస్టర్లు 70 శాతం మేర తమకు కేటాయించిన షేర్లను ఏడాదిలోపు విక్రయించినట్టు సెబీ అధ్యయనంలో తెలిసింది. -
తల్లిగా ఉండటమే గొప్ప- సుస్మితా సేన్
ఈ రోజుల్లో పిల్లల పెంపకం పెద్దలకు ఓ సమస్యగా ఉంటే తమ కెరియర్ను వృద్ధి చేసుకుంటూనే పిల్లలను పెంచడం ఒంటరి తల్లులకు అతిపెద్ద సవాల్‌తో కూడుకున్నదని దాదాపు 70 శాతం ఒంటరి తల్లిదండ్రులు తమ ఉద్యోగావకాశాలను వదులుకోవడానికి కారణం ఇదే అని స్పష్టం చేసింది న్యూయార్క్ కెరీర్ మైండ్స్ అధ్యయనం. గ్లోబల్వైజ్గా టెక్ కంపెనీలలో ఉద్యోగావకాశాలను కల్పించే ఈ సంస్థ తమ ఇంటర్వ్యూలలో పాల్గొనే సింగిల్ పేరెంట్స్ పిల్లల కోసం ఉద్యోగాలను వదులుకుంటున్నారనే విషయాన్ని స్పష్టం చేసింది. ఒంటరి తల్లిదండ్రులు తమ కెరియర్ను కాపాడుకుంటూనే పిల్లల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నిపుణులు సూచనలు ఇస్తున్నారు.ఒంటరిగా పిల్లలను పెంచడం చాలా కష్టమైన టాస్క్. ముఖ్యంగా ఒంటరి తల్లుల్లో భావోద్వేగ సమతుల్యత తప్పనిసరి. క్రమశిక్షణలో ఉంచాలా? లేక ప్రేమ, ఆప్యాయతలను చూపాలా.. అనే కన్ఫ్యూజన్లో ఉంటారు. ఒంటరి తల్లులు అప్పటికే జీవితంలో ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని ఉంటారు కాబట్టి క్రమశిక్షణతో పెంచాలనుకుంటారు.కఠినమైన శిక్షణ కూడదునేను కరెక్ట్‌గా ఉంటేనే నా పిల్లలను బాగా పెంచగలను అనుకునే దోరణిలో పేరెంటింగ్ కూడా సవాల్‌గా తీసుకుంటున్నారు. అయితే, ఈ విధానం వల్ల తరచూ భయాందోళనకు లోనవుతుంటారు. ఫలితంగా ప్రతి చిన్న విషయంలోనూ ఉద్వేగానికి లోనవుతుంటారు. వీళ్లు తమని తాము ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో తెలుసుకోవాలి. ఎవరి సపోర్ట్ లేకుండా ‘సూపర్ ఉమన్’లాగా ఉండాలనుకోవడం అన్ని సందర్భాలలో కుదరదు. శారీరకంగానూ, మానసికపరమైన సమస్యలతోనూ ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. అందుకని, తమ పెద్దవారి మద్దతు తీసుకోవడం అవసరం. కఠినమైన క్రమశిక్షణ వల్ల మంచి కన్నా చెడే ఎక్కువ జరిగే అవకాశం ఉంది.సమతుల్యత తప్పనిసరిఇంట్లో ఉన్నప్పుడు ఆఫీస్ వర్క్‌ని పిల్లల ముందుకు తీసుకురాకూడదు. సింగిల్‌గా ఉండటం వల్ల పెద్దలు ఫోన్లోనే ఎక్కువ సమయం గడుపుతుంటారు. దీనివల్ల పిల్లలు ‘తామేదో కోల్పోతున్నాం’ అనే భావనలో ఉంటారు. పిల్లలు పెద్దలను గమనిస్తుంటారు అని గుర్తుంచుకోవాలి. ‘అమ్మకు నాకన్నా ఫోన్ లేదా వర్క్ అంటేనే ఎక్కువ ఇష్టం’ అనే ఆలోచన పిల్లల్లో రానీయకూడదు.అభిప్రాయాలను తీసుకోవాలిపిల్లలు చిన్నవాళ్లు కదా అనుకోకుండా వాళ్ల అభిప్రాయాలు కూడా తీసుకోవాలి. ఇంటి నిర్ణయాల్లో వారిని పాలుపంచుకోనివ్వాలి. దీనివల్ల తమను నిర్లక్ష్యం చేయడం లేదు అనే ఆలోచన పిల్లల్లో కలుగుతుంది. ఇంట్లో ఏ మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నట్లు అనిపించినా బయట వెతుక్కుంటారు.తమ మాటే వినాలనుకోవద్దుఒంటరి తల్లుల పెంపకంలో పిల్లలు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసే అవకాశాలు ఎక్కువ. పిల్లలు నా మాట వినాలనే ఆలోచనతో పూర్తిగా పిల్లలు చెప్పినట్టు వినడం...లేదంటే తాము ఒక రూలర్‌గా ఉండాలను కుంటారు. టీనేజ్ దశలో ఈ గ్రాఫ్ విపరీతంగా పెరిగిపోతుంది. ఈ విధానం వల్ల పిల్లలను ఎలా హ్యాండిల్ చేయాలో పెద్దవాళ్లకు తెలియడం లేదు. కానీ, పెద్దలను ఎలా హ్యాండిల్ చేయాలో పిల్లలకు బాగా తెలుసు. పిల్లలు ఇద్దరుంటే వారిద్దరినీ సమానంగా చూడాలి. వీలున్నప్పుడల్లా వారిద్దరికీ టైమ్ కేటాయించి వారి ప్రతి అవసరాన్నీ తీర్చాలి. నమ్మకం ముఖ్యంపిల్లల అవసరాలు తెలుసుకొని సాధ్యమైనంతవరకు వాటిని పూర్తి చేయాలి. పిల్లల ఆలోచనా విధానాన్ని పంచుకునే విధానం ఇంట్లో ఉండాలి. స్నేహపూర్వకమైన వాతావరనంలో రోజులో కనీసం పది నిమిషాలైనా పిల్లల కోసం సమయం కేటాయించాలి. తమ పని గురించి చెబుతూనే పిల్లల విషయాలనూ పట్టించుకోవాలి. అప్పుడే ఏదో కోల్పోతున్నామనే భావన పిల్లల్లో కలగకుండా పెరుగుతారు. -ప్రొఫెసర్ జ్యోతిరాజ,సైకాలజిస్ట్, లైఫ్‌స్కిల్ ట్రెయినర్ తల్లిగా ఉండటమే గొప్పఇద్దరు అమ్మాయిలను ఒంటరితల్లిగా పిల్లలను పెంచుతూనే, తన కెరియర్‌నూ బిల్డ్ చేసుకుంటున్న బాలీవుడ్ నటి సుస్మితాసేన్ స్ఫూర్తిదాయకమైన విషయాలనూ సోషల్‌మీడియా ద్వారా తెలియజేసింది. ‘ప్రతిరోజూ ఒక తల్లిగా నన్ను నేను భుజం తట్టుకునే పని ఏం చే యాలనేది ముందే నిర్ణయించుకుని, అది పూర్తి చేస్తాను. నా పిల్లలకన్నా నాకు ఎక్కువ తెలుసు అనుకోను. వారి ద్వారా కూడా ప్రతిరోజూ ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటాను. ఇలా ఉండటం వల్ల నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. నేనొక కళాకారిణిగా కన్నా తల్లిగా ఉండటమే గొప్పగా భావిస్తాను. ఆ రోజంతా ఎన్ని పనులు చేసినా పిల్లల వద్దకు వస్తూనే అన్నీ దులిపేసుకొని వారి ముందు ప్రేమగా ఉంటాను.’– సుస్మితాసేన్ -
సోలోగా.. జాలీగా
చేతిలో పాస్‌పోర్టు.. బ్యాగులో మూడు, నాలుగు డ్రెస్సులు, అవసరమైన డబ్బులు.. అంతే.. విమానం ఎక్కేయడం, విదేశాలకు చెక్కేయడమే. ముందుగా వీసా అవసరం లేకుండా వెళ్లగలిగే దేశాలను చుట్టేసి వచ్చేయడమే. ఇది సోలో టూరిస్టుల నయా ట్రెండ్. అదీ గ్రేటర్ హైదరాబాద్ నగరవాసుల్లో మరింత ఎక్కువగా కనిపిస్తోంది. నిమిషం తీరికలేని హడావుడి జీవితంలో కాస్త ఉపశమనం పొందేందుకు విదేశాల బాటపడుతున్నారు. వివిధ దేశాలకు చెందిన పర్యాటక సంస్థలు, ట్రావెల్ ఏజెన్సీలు రకరకాల టూరిస్టు ప్యాకేజీలు, రాయితీలతో హైదరాబాదీలను ఆకట్టుకుంటున్నాయి. ..: సాక్షి, హైదరాబాద్ :..సోలో టూర్లో ఇలా..సోలో టూరిస్టులు చాలా వరకు డమ్మీ హోటల్ బుకింగ్‌లతో ప్రయాణ ఏర్పాట్లు చేసుకుంటారు. వెళ్లిన దేశాల్లో డార్మిటరీలు, హాస్టల్ సదుపాయం ఉన్నచోట రాత్రి బస చేస్తారు. చిన్న హోటళ్లలో భోజనం చేస్తారు. వీటన్నింటి వల్ల ఖర్చు చాలా వరకు తగ్గుతుంది.⇒ ఒక నగరం నుంచి మరో నగరానికి వెళ్లాల్సివచ్చినప్పుడు.. రాత్రి పూట రైళ్లలో ప్రయాణం చేయడం వల్ల ఎక్కడో ఒకచోట బసచేయాల్సిన అవసరం కూడా ఉండదు. విమాన చార్జీలు, స్థానిక రవాణా చార్జీలు మాత్రమే సోలో టూరిస్టుల బడ్జెట్లో ఎక్కువ ఖర్చు కింద లెక్క.⇒లగేజీ తక్కువే. దీంతో ప్రత్యేకంగా హోటల్లోనే ఉండాలనే ఇబ్బంది కూడా ఉండదు.వీసాలు సులువుగా వస్తుండటంతో..శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రతిరోజు సుమారు 15 వేల మంది వివిధ దేశాలకు వెళుతుండగా..అందులో 60శాతం వరకు ‘సోలో టూరిస్టులే’ ఉంటున్నట్లు టూర్ ఆపరేటర్లు చెప్తున్నారు. గోవా, జైపూర్, కశ్మీర్ వంటి పర్యాటక, వినోద ప్రాంతాలకు వెళ్లినట్టుగానే.. ఇప్పుడు సిటీ టూరిస్టులు విదేశీ టూర్లకు వెళ్తున్నారని అంటున్నారు. కోవిడ్ అనంతరం పరిస్థితుల్లో మార్పు వచ్చిందని.. చాలా దేశాలు పర్యాటకులను ఆకట్టుకునేందుకు ‘వీసా ఆన్ అరైవల్, ఫ్రీ వీసా’ వంటివి అందిస్తున్నాయని చెప్తున్నారు.సర్క్యూట్ టూర్లుసాధారణంగా నగర పర్యాటకులు దుబాయ్, సింగపూర్ పర్యటనలకు ఎక్కువగా వెళ్తారు. ఇంటిల్లిపాది కలిసి ఏదో ఒక దేశంలో పర్యటిస్తారు. ఈ మేరకు టూరిస్టు సంస్థలు వీసాతో కలిపి టూర్ ప్యాకేజీలు అందజేస్తాయి. ఇలా నలుగురు కుటుంబ సభ్యులు కలిసి వెళ్లినప్పుడు ఒకటి కంటే ఎక్కువ దేశాల్లో పర్యటించడం కష్టమే. ఫ్యామిలీగా వెళ్లే టూర్లు బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ తదితర యూరప్ దేశాలకు ఎక్కువ. కానీ సోలో టూర్లు వీటికి పూర్తి భిన్నంగా ఉంటున్నాయి. సోలో టూరిస్టులు ఒకసారి ఇంటి నుంచి బయలుదేరితే మూడు, నాలుగు దేశాల్లో పర్యటించేలా ప్రణాళికలను రూపొందించుకుంటున్నారు.ప్రస్తుతం మలేసియా, థాయ్‌లాండ్, శ్రీలంక, మాల్దీవులు, నేపాల్ ఉచిత వీసా సదుపాయాన్ని అందజేస్తున్నాయి. దీంతో ఎక్కువ మంది ఈ దేశాల్లో పర్యటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. సింగపూర్‌కు ఈ–వీసా సదుపాయం ఉంది. దీంతో చాలా మంది సింగపూర్‌కు ఈ–వీసాపై వెళ్లి అక్కడి నుంచి మలేసియా, థాయ్‌లాండ్‌లనూ చుట్టి వచ్చేస్తున్నారు. ఇక ఇండోనేషియా, కంబోడియా, వియత్నాం తదితర దేశాలు వీసా ఆన్ అరైవల్ సదుపాయం అందిస్తున్నాయి. సోలో టూరిస్టులు ఈ దేశాలకు కూడా ఎక్కువగా వెళ్తున్నట్లు పర్యాటక సంస్థలు చెప్తున్నాయి. కంబోడియాలోని పల్లవుల నాటి అంగ్‌కోర్‌వాట్ దేవాలయం, ఇండోనేషియాలోని బాలి, జావా, సుమత్రా తదితర ద్వీపాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయని అంటున్నాయి.వియత్నాంలో బైక్ రైడింగ్సిటీ టూరిస్టులను కొంత కాలం నుంచి విశేషంగా ఆకట్టుకుంటున్న మరో పర్యాటక దేశం వియత్నాం. తక్కువ విమానచార్జీలతో ఈ చిన్న దీవుల దేశంలో పర్యటించవచ్చు. ఇండోనేషియాలోని బాలి బీచ్ కల్చర్ పర్యాటకులను ఆకట్టుకుంటుండగా.. వియత్నాంలో బైక్ రైడింగ్ ప్రత్యేక ఆకర్షణగా మారింది. హైదరాబాద్ నుంచి అక్కడికి వెళ్లిన పర్యాటకులు అద్దె బైక్‌లపై ఉత్తరం నుంచి దక్షిణం వరకు రైడ్ చేసేందుకు ఇష్టపడుతున్నారు. ‘వియత్నాం చిన్న దేశం. ఉత్తరం నుంచి దక్షిణం వరకు 2,000 కిలోమీటర్లలోపే ఉంటుంది.బైక్‌పై ప్రయాణం ఎంతో అద్భుతంగా ఉంటుంది’’ అని నగరానికి చెందిన టూరిస్టు సుబ్బారెడ్డి తెలిపారు. దేశ, విదేశాలకు చెందిన టూరిస్టులు బైక్ రైడింగ్ కోసం వియత్నాంకు వస్తారని చెప్పారు. ఇక తక్కువ బడ్జెట్లో సందర్శించే సదుపాయమున్న మరో దేశం ఫిలిప్పీన్స్. దీవుల సముదాయమైన ఈ దేశంలో పర్యటించడం హైదరాబాద్ నుంచి గోవా ట్రిప్పు కోసం వెళ్లినట్లుగానే సింపుల్‌గా ఉంటుంది. వీసా ఆన్ అరైవల్, ఈ–వీసా సదుపాయాలున్న తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ తదితర దేశాలకు కూడా సిటీ పర్యాటకులు వెళ్తున్నారు.వేర్వేరు దేశాలకు వెళ్తూ ఉంటా..2013 నుంచీ విదేశాల్లో పర్యటిస్తున్నాను. ఇప్పటివరకు 65 దేశాలు తిరిగాను. విదేశాల్లో విభిన్నమైన, వైవిధ్యమైన సంస్కృతి, సంప్రదాయాలు, ప్రజల జీవన విధానం, ఆహార అలవాట్లు వంటివి తెలుసుకోవడం, పరిశీలించడం నాకెంతో ఇష్టం. ఎక్కడికెళ్లినా అక్కడి ప్రజలతో మమేకమవుతాను. పర్యాటక ప్రదేశాలను సందర్శించడం కంటే అక్కడి ప్రజలను కలిసేందుకే ఇష్టపడతాను. – సుబ్బారెడ్డి, రెగ్యులర్ టూరిస్ట్2 నెలలకోసారి మలేసియా వెళ్తా..కనీసం రెండు, మూడు నెలలకు ఒకసారి మలేసియాకు వెళ్తాను.ఏదో ఒక ప్రాంతంలో పర్యటిస్తాను. అక్కడి తెలుగు సంఘాల ఆధ్వర్యంలో నడిచే స్కూళ్లలో పిల్లలకు తెలుగు బోధిస్తాను.దాంతో మలేసియాతో ఒక అనుబంధం ఏర్పడింది. – రాఘవాచార్య, టీచర్ఇదీ రాకపోకల లెక్క (సుమారుగా)..⇒ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రతిరోజు రాకపోకలు సాగించే ప్రయాణికులు 65,000 నుంచి 70,000⇒ అందులో దేశీయ ప్రయాణికులు 55,000⇒ అంతర్జాతీయ ప్రయాణికులు దాదాపు 15,000⇒ సోలో టూరిస్టులు 7,000 నుంచి 9,000 -
యూపీలో మళ్లీ కరోనా కలకలం
ఉత్తరప్రదేశ్‌లోని గాజియాబాద్‌లో ఏడుగురికి కరోనా సోకినట్లు గుర్తించారు. ఒకే రోజు ఏడుగురికి కరోనా నిర్ధారణ కావడంతో ఆరోగ్య శాఖలో కలకలం చెలరేగింది. రాజ్‌నగర్, వసుంధర, వైశాలి, సాహిబాబాద్‌లలో ఈ కరోనా కేసులను గుర్తించారు. ప్రస్తుతం గాజియాబాద్‌లో మొత్తం తొమ్మదిమంది కరోనా బాధితులు ఉన్నారు. వారిలో ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కరోనా సోకిన వారిలో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఒకే కుటుంబంలో ముగ్గురు వ్యక్తులు కరోనా బారిన పడ్డారు. రాజ్‌నగర్‌లో నివసిస్తున్న 53 ఏళ్ల వ్యక్తి, అతని 26 ఏళ్ల కుమారుడు దగ్గు, జలుబుతో బాధపడుతూ, కోవిడ్ పరీక్ష చేయించుకున్నారని సీఎంఓ డాక్టర్ భవతోష్ శంఖధర్ తెలిపారు. వీరికి కరోనా సోకినట్లు నిర్థారణ అయ్యింది. ఇదేవిధంగా వైశాలికి చెందిన 23 ఏళ్ల యువకుడు, సాహిబాబాద్‌కు చెంది 65 ఏళ్ల వృద్ధుడు, వసుంధరలో నివసిస్తున్న ఒక మహిళతో పాటు ఆమె ఇద్దరు పిల్లలు కరోనా పాజిటివ్‌గా తేలారు. 2020 ప్రారంభం నుండి గత నాలుగేళ్లలో దేశవ్యాప్తంగా 4.5 కోట్ల మందికి పైగా జనం కరోనా వైరస్ బారిన పడగా, 5.3 లక్షల మందికి పైగా మృతిచెందడం గమనార్హం. ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం ఇప్పటివరకు ఇన్ఫెక్షన్ నుండి కోలుకున్న వారి సంఖ్య 4.4 కోట్లకు పైగా ఉంది. జాతీయ రికవరీ రేటు 98.81 శాతం. దేశంలో కోవిడ్-19 నివారణకు 220.67 కోట్ల డోస్‌ల టీకాలు అందించారు. -
నేషనల్ కాన్ఫరెన్స్ యూ టర్న్
శ్రీనగర్: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీని కలిసికట్టుగా ఎదుర్కొనే లక్ష్యంతో ఏర్పాటైన ఇండియా కూటమి నుంచి ఒక్కో పార్టీ దూరమవుతున్న వేళ మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. జమ్మూకశ్మీర్‌లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్ని కల్లో తమ పార్టీ ఒంటరిగా బరిలోకి దిగు తుందని నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) చీఫ్ ఫరూక్ అబ్దుల్లా గురువారం ప్రకటించారు. కొద్దిసేపటికే పార్టీ నేత, ఫరూక్ అబ్దుల్లా కుమారుడు ఒమర్ అబ్దుల్లా అలాందేమీ లేదంటూ ప్రకటించారు. ఇండియా కూటమిలోనే కొనసాగుతామని జమ్మూకశ్మీర్‌లోని ఎంపీ స్థానాల్లో పోటీపై భాగస్వామ్య పార్టీలతో చర్చలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. కశ్మీర్ లోని అతిపెద్ద పార్టీ అయిన ఎన్సీ ఇండియా కూటమితోపాటు ప్రాంతీయ గుప్కార్(పీఏజీడీ) అలయెన్స్‌లోనూ కీలకంగా ఉంది. -
ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాల్సిందే
సాక్షి, హైదరాబాద్: పర్యావరణానికి ప్రమాదంగా మారిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని స్వచ్ఛందంగా నిషేధించాలని సీఎస్ శాంతి కుమారి పిలుపునిచ్చారు. సచివాలయంలో వీటి వాడకాన్ని నిషేధించి, ప్రత్యామ్నాయాలను వాడడం ద్వారా కార్యదర్శులు మొదలు ప్రతీ అధికారి, ఉద్యోగులు ఆదర్శంగా నిలవాలని సూచించారు. ఇప్పటికే రాష్ట్రంలోని 142 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 17 లక్షల మంది స్వయం సహాయక బృందాల మహిళలతో వీటి నిషేధంపై పౌరులను చైతన్య పరుస్తున్నామని తెలిపారు. శనివారం సచివాలయంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం నిషేధంపై జరిగిన వర్క్ షాప్‌లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ రాజీవ్ శర్మ తోపాటు వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నా..సామాజిక భాద్యతతోనే సాధ్యం శాంతి కుమారి మాట్లాడుతూ, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల స్థానంలో స్టీల్, పింగాణీ వస్తువుల వాడకాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు. ప్లాస్టిక్ నిషేధంపై ఇప్పటికే ప్రభుత్వం పలు ఉత్తర్వులు జారీ చేసిన విషయాన్ని ప్రస్తావించారు. అయితే కేవలం ప్రభుత్వ ఉత్తర్వుల వల్ల ఇది సాధ్యం కాదని, స్వచ్ఛందంగా సామాజిక బాధ్యతతో పాటించాలని పేర్కొన్నారు. ప్రస్తుతం వినియోగిస్తున్న ప్లాస్టిక్ లో కేవలం 9 శాతం మాత్రమే రీ–సైక్లింగ్ జరుగుతోందని, మిగిలిన ప్లాస్టిక్ వ్యర్థాలు నాలాలు, చెరువులు, నదీ జలాల్లో కలుస్తూ జీవనానికి పెను ముప్పుగా పరిణమిస్తున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ‘ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించి భూమిని కాపాడుకొందాం’అనే నినాదంతో రూపొందించిన పోస్టర్‌ను ఈ సందర్భంగా శాంతి కుమారి, రాజీవ్ శర్మ ఆవిష్కరించారు. -
20 మందితో బీఎస్పీ తొలి జాబితా
సాక్షి, హైదరాబాద్: శాసనసభ ఎన్నికల్లో బీఎస్పీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రకటించారు. తాను ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నట్టు వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్‌లోని బీఎస్పీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ కో–ఆర్డినేటర్, ఎంపీ రాంజీ గౌతమ్‌తో కలసి పార్టీ అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితాను ప్రవీణ్‌కుమార్ విడుదల చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ కన్నా ముందే 20 మంది అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటిస్తున్నామని, త్వరలో మరికొందరు అభ్యర్థులను వెల్లడిస్తామని చెప్పారు. ఎన్నికల్లో లబ్ధి కోసమే మోదీ ప్రకటనలు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి కోసమే ప్రధాని మోదీ పసుపు బోర్డు, గిరిజన యూనివర్సిటీ ప్రకటనలు చేశారని ప్రవీణ్‌కుమార్ విమర్శించారు. ఆచరణలో అమలుకాని హామీలతో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మేనిఫెస్టోలు ఉంటున్నాయని విమర్శించారు. అధికారాన్ని అట్టిపెట్టుకోవాలనే ఉద్దేశంతోనే సమగ్ర కుటుంబ సర్వేను కేసీఆర్ బయటపెట్టడం లేదని ఆరోపించారు. ప్రజల సొమ్ముతో చేసిన సర్వేను రహస్యంగా ఉంచడం ఎందుకని నిలదీశారు. బీఎస్పీ ప్రజాబలం ఉన్న పార్టీ అని, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు ధనబలమే తప్ప ప్రజాబలం లేదని వ్యాఖ్యానించారు. బీఎస్పీ తొలి జాబితా ఇదీ.. సిర్పూర్ – ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, జహీరాబాద్ – జంగం గోపి, పెద్దపల్లి – దాసరి ఉష, తాండూరు – చంద్రశేఖర్ ముదిరాజ్, దేవరకొండ – ముడావత్ వెంకటేశ్ చౌహాన్, చొప్పదండి – కొంకటి శేఖర్, పాలేరు – అల్లిక వెంకటేశ్వర్రావు, నకిరేకల్ – మేడి ప్రియదర్శిని, వైరా – బానోత్ రాంబాబు నాయక్, ధర్మపురి – నక్క విజయ్ కుమార్, వనపర్తి– నాగ మోని చెన్నరాములు, మానకొండూరు – నిషాని రామచందర్, కోదాడ – పిల్లిట్ల శ్రీనివాస్, నాగర్ కర్నూల్ – కొత్తపల్లి కుమార్, ఖానాపూర్ – బన్సీలా ల్ రాథోడ్, ఆందోల్ – ముప్పారపు ప్రకాశ్, సూర్యా పేట – వట్టే జానయ్య యాదవ్, వికారాబాద్ – గో ర్లకాడి క్రాంతికుమార్, కొత్తగూడెం– ఎర్ర కామేశ్, జుక్కల్– ప్రద్న్య కుమార్ మాధవరావు ఏకాంబర్. -
గడువు ముగియనున్న ఎల్ఐసీ సింగిల్ ప్రీమియం పాలసీ
ప్రముఖ బీమా సంస్థ లైఫ్ ఇన్య్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) కీలక సింగిల్ ప్రీమియం పాలసీ ‘ధన వృద్థి’ (LIC Dhan Vriddhi) గడువు సెప్టెంబర్ 30తో ముగియనుంది. ఆసక్తిఉన్నవారు గడువు లోపు దీన్ని కొనుగోలు చేసుకోవాలని ఆ సంస్థ తెలిపింది. గత జూన్‌లో ప్రారంభించిన ఈ ప్లాన్ పరిమిత ఆఫర్ గడువు ఈ నెలాఖరుతో ముగుస్తుందని వెల్లడించింది. మెరుగైన పొదుపుతో పాటు బీమా కవరేజీ కూడా కావాలనుకునే వారు ఈ పాలసీని తీసుకోవచ్చు. ధన వృద్థి పాలసీ ఆన్‌లైన్‌లోనూ లభ్యం అవుతుందని ఎల్ఐసీ పేర్కొంది. ఈ పాలసీ టెన్యూర్‌లో పాలసీదారు మరణిస్తే కుటుంబ సభ్యులకు ఆర్థికంగా సాయం అందిస్తుంది. మెచ్యూరిటీ సమయం ముగిసిన తర్వాత గ్యారంటీ రిటర్న్స్ అందజేస్తుంది. 32 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు వారు ఈ పాలసీ తీసుకోవచ్చు. -
మొలకెత్తే పెన్ను.. పర్యావరణానికి దన్ను
గుంటూరు (ఎడ్యుకేషన్): సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల తయారీ, వినియోగంపై నిషేధం విధించిన రాష్ట్ర ప్రభుత్వం ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా పర్యావరణానికి హాని కలిగించని ఉత్పత్తులను ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఉపయోగించే పెన్నులను సైతం పర్యావరణ అనుకూల విధానంలో ఉపయోగిస్తోంది. యూజ్ అండ్ త్రో (వాడిపారేసే) ప్లాస్టిక్ పెన్నులు భూమిలో కలిసిపోయేందుకు వందల ఏళ్లు పడుతుంది. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో పనిచేసే అధికారులు, ఉద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా వందలు, వేల సంఖ్యలో పెన్నులను వాడి పారేస్తుండటంతో పర్యావరణానికి హాని కలిగించని పెన్నుల తయారీ, వినియోగంపై ప్రభుత్వం దృష్టి సారించింది. తొలుత విద్యాశాఖలో ప్రయోగాత్మకంగా పర్యావరణ అనుకూల పెన్నుల వినియోగాన్ని అమల్లోకి తెచ్చింది. కాగితం పొరలతో.. కాగితం పొరలతో తయారు చేసిన పెన్నులకు మందపాటి అట్టతో రూపొందించిన క్యాప్ ఉంచిన పెన్నులను రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు జిల్లాల వారీగా నిర్వహిస్తున్న వివిధ శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఉపాధ్యాయులకు ఉచితంగా అందజేస్తున్నారు. ప్యాడ్‌తో పాటు పేపర్ పెన్నులను ఇస్తూ.. పర్యావరణ పరిరక్షణకు నడుం బిగిస్తున్నారు. ప్రత్యేకంగా పేపర్ పెన్నుల ఉత్పత్తిదారులకు ఆర్డర్ ఇచ్చి పెన్నులు తయారు చేయిస్తున్నారు. వీటిని వాడిన తరువాత పడేస్తే అవి మట్టిలో కలిసిపోతాయి. మరో విశేషం ఏమిటంటే.. ఆ పెన్నుల వెనుక భాగంలో అమర్చిన చిన్న గొట్టంలో నవ ధాన్యాలు, వివిధ దినుసులు, పూల మొక్కల విత్తనాలను అమర్చారు. బీన్స్, సన్‌ఫ్లవర్, మెంతులు తదితర విత్తనాలను కూడా అమర్చుతున్నారు. పెన్నును వాడి పారేసిన తరువాత ఇంటి పెరట్లోనో, రోడ్డు పక్కన మట్టిలోనో పారవేస్తే పెన్ను భూమిలో కరిగిపోయి.. అందులోని విత్తనాలు మొలకెత్తుతాయి. ప్రస్తుతం బల్క్ ఆర్డర్లపై తయారు చేస్తున్న ఈ ఎకో ఫ్రెండ్లీ పెన్నును కేవలం రూ.20కే కొనుగోలు చేయవచ్చు. గురువారం గుంటూరు నగరంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి శిక్షణ కార్యక్రమానికి వచ్చిన ఉపాధ్యాయులకు ఎకో ఫ్రెండ్లీ పెన్నులను విద్యాశాఖ అధికారులు పంపిణీ చేశారు. -
అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్.. ఇక అన్నింటికీ ఆ సర్టిఫికెటే ఆధారం!
విద్యా సంస్థల్లో అడ్మిషన్ల దగ్గర నుంచి ఆధార్ కార్డ్ వరకు ఇక అన్నింటికీ జనన ధ్రువీకరణ పత్రమే (Birth Certificate) ఆధారం కానుంది. అన్ని రకాల అవసరాలకూ బర్త్ సర్టిఫికెట్‌ను సింగిల్ డాక్యుమెంట్‌గా పరిగణించబోతోంది కేంద్ర ప్రభుత్వం. స్కూళ్లు, కాలేజీల్లో అడ్మిషన్లు, డ్రైవింగ్ లైసెన్సు, ఆధార్ కార్డ్ (Aadhaar Card), వోటర్ కార్డులకు దరఖాస్తు, మ్యారేజ్ రిజిస్ట్రేషన్‌తో సహా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అన్ని రకాల పనులకు బర్త్ సర్టిఫికెట్‌ను ఏకైక ధ్రువీకరణ పత్రంగా ఉపయోగించవచ్చు. ఈమేరకు సవరించిన కొత్త చట్టం అక్టోబర్ 1 నుంచి అమలులోకి రాబోతోంది. జనన మరణాల నమోదు (సవరణ) చట్టం-2023ను పార్లమెంట్ గత వర్షాకాల సమావేశాల్లో ఆమోదించిన సంగతి తెలిసిందే. "జనన మరణాల నమోదు (సవరణ) చట్టం-2023లోని సెక్షన్ 1 సబ్-సెక్షన్ (2) ద్వారా వచ్చిన అధికారాలను ఉపయోగించి, కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబర్ 1 నుంచి దీన్ని అమలు చేస్తోంది" అని కేంద్ర హోం శాఖ తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. బర్త్ సర్టిఫికెట్ ఉంటే చాలు.. జనన,మరణాల నమోదు (సవరణ) చట్టం-2023 అమలులోకి వచ్చిన తేదీ లేదా ఆ తర్వాత జన్మించినవారు పుట్టిన తేదీ, ప్రదేశాన్ని నిరూపించడానికి జనన ధ్రువీకరణ పత్రాన్ని ఒకే పత్రంగా ఉపయోగించడానికి చట్టం అనుమతిస్తుంది. విద్యా సంస్థల్లో ప్రవేశాలు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటరు కార్డు, వివాహ నమోదు, కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వం లేదా స్థానిక సంస్థ లేదా ప్రభుత్వ రంగ సంస్థ లేదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని ఏదైనా చట్టబద్ధమైన లేదా స్వయంప్రతిపత్త సంస్థలో ఉద్యోగ నియామకం కోసం కూడా బర్త్ సర్టిఫికెట్‌ను సింగిల్ డాక్యుమెంట్‌గా సమర్పించవచ్చు. (వాహన డీలర్లకు కీలక ఆదేశాలు.. ఇక ఆ సౌకర్యం కూడా..) ఈ చట్టం ప్రకారం.. నమోదిత జనన, మరణాల జాతీయ డేటాబేస్‌ను నిర్వహించడానికి రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియాకు అధికారం ఉంది. చీఫ్ రిజిస్ట్రార్లు (రాష్ట్రాలచే నియమించిన), రిజిస్ట్రార్లు (స్థానిక ప్రాంతాల్లో రాష్ట్రాలచే నియమించిన) జనన, మరణ డేటాను జాతీయ డేటాబేస్‌తో పంచుకోవడానికి బాధ్యత వహిస్తారు. ప్రతి రాష్ట్రం కూడా రాష్ట్ర స్థాయిలో ఇలాంటి డేటాబేస్‌ను నిర్వహించాల్సి ఉంటుంది. -
ఎల్ఐసీ కొత్త ప్లాన్.. జీవిత బీమా రక్షణతోపాటు పొదుపు కూడా
ముంబై: బీమా దిగ్గజం ఎల్ఐసీ కొత్తగా ‘ధన వృద్ధి’ పేరుతో క్లోజ్ ఎండెడ్ ప్లాన్‌ను ఆవిష్కరించింది. జూన్ 23 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఈ ప్లాన్‌ను విక్రయించనున్నట్టు ప్రకటించింది. ఇది నాన్ లింక్డ్ (ఈక్విటీతో సంబంధం లేని), నాన్ పార్టిసిపేటింగ్ ప్లాన్. పొదుపుతో కూడిన సింగిల్ ప్రీమియం ప్లాన్. జీవిత బీమా రక్షణతోపాటు పొదుపును ఆఫర్ చేస్తుంది. పాలసీదారు దురదృష్టవశాత్తూ మరణానికి గురైతే కుటుంబానికి పరిహారం అందిస్తుంది. గడువు ముగిసే వరకు జీవించి ఉంటే మెచ్యూరిటీ మొత్తం తిరిగి వస్తుంది. ఈ ప్లాన్‌లో రెండు రకాల బీమా ఆప్షన్లు ఉన్నాయి. మరణ పరిహారం చెల్లించే ప్రీమియానికి 1.25 రెట్లు లేదంటే పది రెట్లలో ఒకదాన్ని ఎంపిక చేసుకోవచ్చు. 10, 15, 18 ఏళ్ల కాల వ్యవధిపై తీసుకోవచ్చు. కనీసం రూ.1,25,000 బీమా నుంచి ఎంత మొత్తమైనా ఎంపిక చేసుకోవచ్చు. ప్రతి పాలసీ సంవత్సరం ముగిసిన తర్వాత గ్యారంటీడ్ అడిషన్స్ జమ అవుతాయి. ఈ గ్యారంటీడ్ అడిషన్ అనేది మొదటి ఆప్షన్లో ప్రతి రూ.1,000 సమ్ అష్యూర్డ్‌పై రూ.60–75 మధ్య, రెండో ఆప్షన్లో రూ.25–40 మధ్య ఉంటుంది. ఈ ప్లాన్‌లో మెచ్యూరిటీ లేదా మరణ పరిహారాన్ని కావాలంటే వాయిదాల పద్ధతిలోనూ తీసుకోవచ్చు. పాలసీపై రుణ సదుపాయం కూడా ఉంటుంది. -
లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ
న్యూఢిల్లీ: వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బిజు జనతా దళ్ (బీజేడీ) ఒంటరి పోరాటం చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ స్పష్టం చేశారు. గురువారం ప్రధాని మోదీని కలిసి మంతనాలు జరిపారు. బీజేపీకి, కాంగ్రెస్‌కి సమానదూరం పాటిస్తానని తర్వాత మీడియాతో పట్నాయక్ చెప్పారు. బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడం కోసం బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తాను చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా నవీన్ పట్నాయక్‌ను కలుసుకున్న మర్నాడే ఒంటరిగానే ఎన్నికల బరిలో దిగుతామని తేల్చి చెప్పడం విశేషం. నితీశ్ భువనేశ్వర్‌కు వచ్చి తనను మర్యాదపూర్వకంగానే కలుసుకున్నారని పట్నాయక్ చెప్పారు. 2000 సంవత్సరం నుంచి ఒడిశాలో అధికారంలో ఉన్న నవీన్ పట్నాయక్ అప్పట్నుంచి బీజేపీ, కాంగ్రెస్ మధ్య వచ్చే వివాదాస్పద అంశాల్లో తటస్థ వైఖరి అవలంబిస్తూ వస్తున్నారు. -
చైనా షాకింగ్ నిర్ణయం..పెళ్లి కాకుండానే తల్లి అయ్యేలా..
ఆరు దశాబ్దాల్లో తొలిసారిగా చైనాలో వేగవంతంగా జనాభా క్షీణించడంతో దాన్ని నియంత్రించేలా పలు చర్యలు ఇప్పటికే తీసుకుంది చైనా. ఇప్పుడు ఇంకాస్త ముందడుగు వేసి.. యావత్ ప్రపంచం విస్తుపోయేలా సంచలన నిర్ణయం తీసుకుంది. అవివాహితలు, ఒంటరి మహిళలు ఐవీఎఫ్ ద్వారా పిల్లలను కనే వెసులుబాటుని ఇస్తోంది. పెళ్లైన జంటలకు మాత్రమే ఉండే పిల్లల సబ్సిడీలను అవివాహిత గర్భిణీలు కూడా పొందవచ్చునని చెబుతోంది. అవివాహిత స్త్రీల పిల్లల జనన నమోదును చట్టబద్ధం చేసింది. వారు కూడా వేతనంతో కూడిన ప్రశూతి సెలవులు కూడా తీసుకోవచ్చు అంటూ ఆఫర్లు ఇస్తోంది. ఈ మేరకు చైనాలోని అవివాహిత స్త్రీలు ప్రైవేట్ లేదా పబ్లిక్ ఆస్పత్రుల్లో ఐవీఎఫ్ చికిత్సను పొందవచ్చు. ఈ నేపథ్యంలోనే నైరుతి సిచువాన్ ప్రావిన్స్ రాజధాని చెంగ్డులో విడాకులు తీసుకున్న 33 ఏళ్ల మహిళ దీన్ని ఆశ్రయించే తల్లి కాబోతోంది. ప్రస్తుత ఆమె 10 వారాల గర్భవతి. చాలా మంది ఒంటరి మహిళలు దీన్ని ఆశ్రయిస్తున్నట్లు సమాచారం. దేశ వ్యాప్తంగా ఐవీఎఫ్‌ని సరళీకృతం చేస్తే గనుక ఇదొక పెద్ద మార్కెట్‌గా విస్తరించే అవకాశం ఉందంటున్నారు నిపుణలు. సాధారణ సంతానోత్పత్తి సేవలపై ప్రభావం పడుతుందని, భవిష్యత్తులో ఐవీఎఫ్ చికిత్సకు డిమాండ్ పెరిగే అవకాశం ఉందని ఆసియా పసిఫిక్ వ్యాపార అభివృద్ధి డైరెక్టర్ వైవ్ లిప్పెన్స్ హెచ్చరించారు. ప్రభుత్వాస్పత్రల్లో మహిళలందరికీ ఐవీఎఫ్ చికిత్స అందిస్తారనేది స్పష్టత లేదు. ఇప్పటివరకు ఎంత మంది మహిళలు దీన్ని ఉపయోగించుకున్నారనేది కూడా స్పష్టం కాలేదు. కానీ చాలా మంది మహిళలు ఐవీఎఫ్ సెంటర్లకు క్యూ కడుతున్నట్లు సమాచారం. జాతీయ ఆరోగ్య కేంద్రం మరిన్ని ఐవీఎఫ్ సెంటర్లను అందుబాటులో తీసుకొచ్చే యోచనలో ఉన్నట్లు చైనా వర్గాలు చెబుతున్నాయి. కాగా, ఇంతకు మునుపు చైనా పెళ్లికాని మహిళలకు ఐవీఎఫ్ సేవలను నిషేధించింది. ఎప్పుడైతే జనాభా క్షీణించడం ప్రారంభించిందో అప్పటినుంచి చైనా పిల్లలను కనేలా ప్రజలకు బారీ ఆఫర్లు అందిస్తూ ప్రోత్సహించింది. ఈ క్రమంలో పలు నిబంధనలు ఎత్తి వేసి కొత్త సంస్కరణలు తీసుకొచ్చింది. అందులో భాగంగానే ఈ ఐవీఎఫ్ చికిత్సా విధానం తెరమీదకు వచ్చింది. (చదవండి: ఎయిర్‌పోర్ట్‌లో యాపిల్ జ్యూస్ వివాదం..యువతి అరెస్టు) -
'38 ఏళ్లొచ్చినా గర్ల్‌ఫ్రెండ్ లేదు.. నా కుమారుడి చిప్ దొబ్బింది..!'
బీజింగ్: పిల్లలకు పెళ్లీడు వచ్చిందంటే చాలు తల్లిదండ్రులు హడావిడి చేస్తుంటారు. సంబంధాలు చూసి త్వరగా పెళ్లి చేసేయాలని అనుకుంటారు. ఈ కాలంలో యువత అయితే తల్లిదండ్రులకు పని లేకుండా వారే తమ జీవిత భాగస్వాములను చూసుకుంటున్నారు. అలాంటిది 38 ఏళ్లొచ్చినా తన కొడుకు ఇంకా సింగిల్ గానే ఉంటున్నాడని, ఇప్పటివరకు ఒక్క గర్ల్‌ఫ్రెండ్‌ను కూడా ఇంటికి తీసుకురాలేదని ఓ తల్లి ఆందోళన చెందుతోంది. అంతేకాదు ఇన్నేళ్లు వచ్చినా పెళ్లి మాట ఎత్తకపోవడంతో అతని తలలో ఏదో లోపం ఉన్నట్టుందని ఆమెకు అనుమానం వచ్చింది. దీంతో కుమారుడ్ని ప్రతి ఏటా మానసిక వైద్యుడి దగ్గరకు తీసుకెళ్తోంది. ఈ ఘటన చైనా హెనాన్ రాష్ట్రంలో జరిగింది. 38 ఏళ్లొచ్చినా సింగిల్‌గా ఉంటున్న ఇతని పేరు వాంగ్. ఇతనికి పెళ్లి కావడంలేదని తల్లి దిగులు చెందుతోంది. కుమారుడ్ని మానసిక వైద్యుడి దగ్గరకు తీసుకెళ్తే సమస్య తీరుతుందని భావించింది. దీంతో 2020 నుంచి ప్రతి ఏటా చైనా లూనార్ న్యూ ఇయర్ తర్వాత వాంగ్‌ను ఆస్పత్రికి తీసుకెళ్తోంది. ఈసారి షాక్.. అయితే ఈసారి ఫిబ్రవరి 4న ఆస్పత్రికి వెళ్లిన వాంగ్ తల్లికి వైద్యులు షాక్ ఇచ్చారు. అతను బాగానే ఉన్నాడని ఏలాంటి సమస్యా లేదని స్పష్టం చేశారు. అసలు సమస్య ఆమెలోనే ఉందని, కుమారుడికి పెళ్లి కావడం లేదనే దిగులుతో 'మెంటల్ డిజార్డర్' వచ్చిందని చెప్పారు. దీంతో ఆమె అవాక్కయ్యింది. తల్లి కోసమే.. కేవలం తల్లిని బాధపెట్టొద్దనే ఉద్దేశంతోనే తాను ఆస్పత్రికి వెళ్తున్నట్లు వాంగ్ చెప్పాడు. 10 ఏళ్లుగా తాను ఉద్యోగం చేస్తూ తీరక లేకుండా ఉన్నానని, గర్ల్‌ఫ్రెండ్ గురించి ఆలోచనే తనకు రాలేదన్నాడు. సమయం వచ్చినప్పుడు సరైన వ్యక్తి తన జీవితంలోకి వస్తుందేమేనని ఆశిస్తున్నట్లు చెప్పాడు. అయినా ఇళ్లు కొనేందుకు డౌన్‌పేమెంట్‌కు డబ్బులు కూడా లేని తనను ఏ అమ్మాయి పెళ్లి చేసుకుంటుందని ప్రశ్నించాడు. తాను సిటీలో 'సూపర్ ఓల్డ్ సింగిల్ మ్యాన్' అంటూ ముసిముసి నవ్వులు నవ్వాడు. చైనా మీడియాలో వాంగ్ కథనం ప్రసారం కాగా.. యువకులు పెద్ద చర్చకు తెరలేపారు. పెళ్లి చేసుకోకపోతే ఈ సమాజం తాము ఏదో పాపం చేసినట్లుగా చూస్తోందని, ఇది సబబేనా అని ఓ నెటిజన్ స్పందించాడు. మరో యువకుడు స్పందిస్తూ అసలు పెళ్లి చేసుకున్న వాళ్లే మానసిక సమస్యలతో బాధపడుతున్నారని అసహనం వ్యక్తం చేశాడు. చదవండి: అందంగా కన్పించాలని ముక్కుకు ప్లాస్టిక్ సర్జరీ.. ఆ తర్వాత గంటల్లోనే.. -
సోలో బ్రతుకే సో 'బెటరు'
ప్రపంచవ్యాప్తంగా ఏక్ నిరంజన్ల సంఖ్య ఏటా పెరుగుతోంది. మన రాష్ట్రంలోనూ ఇదే ట్రెండ్ కనిపిస్తోంది. రాష్ట్ర జనాభాలో 6 శాతానికి పైగా ఒంటరులే ఉన్నట్టు తేలింది. రాష్ట్రంలో మొత్తంగా 31,20,499 మంది ఒంటరి జీవితం సాగిస్తున్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2019లో వలంటీర్ల ద్వారా నిర్వహించిన కుటుంబ సర్వేలో రాష్ట్రంలో 1.66 కోట్ల కుటుంబాలు ఉన్నట్టు నిర్ధారణ కాగా.. అందులో 31.20 లక్షల మంది ఏక్ నిరంజన్లేనని తేలింది. సాక్షి, అమరావతి: తాత నాయనమ్మ.. అమ్మానాన్న.. అన్నా చెల్లెళ్లు.. బాబాయ్ చిన్నమ్మ కలిసి ఉండే ఉమ్మడి కుటుంబాలకు సుమారు 30–35 ఏళ్ల క్రితమే కాలం చెల్లింది. అమ్మానాన్న.. అన్నదమ్ములు.. అక్క చెల్లెమ్మలు వరకే పరిమితమైన కుటుంబాలకు పూర్తిగా అలవాటు పడిపోయాం. వాళ్లలో ఎవరికైనా పెళ్లయిందంటే.. వెంటనే వేరు కాపురం పెట్టే పరిస్థితికి వచ్చేశాం. ఇప్పుడు ఆ రోజులు కూడా మారిపోతున్నాయి. ప్రస్తుతం ఒంటరిగా నివాసం ఉండాలనుకునే వారి సంఖ్య పెరుగుతోంది. ఆడ, మగ అనే తేడా లేకుండా కొందరు పెళ్లి చేసుకోకుండా ఒంటరి జీవనం సాగిస్తుంటే.. భార్య లేదా భర్తను కోల్పోయి ఒంటరిగా మిగిలిపోతున్నారు.. కొందరైతే పిల్లలున్నా విదేశాలు లేదా దూరప్రాంతాల్లో ఉండటం వల్ల ఒంటరి జీవనం సాగిస్తున్నారు. అమెరికాలో సగం మందికి పైనే ఒంటరి జీవులు వ్యక్తిగత ఆదాయాల పరంగా.. దేశ ఆర్థిక పరిస్థితి పరంగా ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశంగా వెలుగొందుతున్న అమెరికాలో అయితే 18 ఏళ్లు వయసు దాటిన వారిలో ఎక్కువ మంది ఒంటరి జీవులుగానే మిగిలిపోతున్నట్టు తేలింది. తల్లిదండ్రులతో కలిసి జీవించే వారికంటే తల్లిదండ్రులు లేదా ఇతరులెవరితో సంబంధం లేకుండా జీవనం సాగించే వారి సంఖ్య ఆ దేశంలో ఎక్కువగా ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఆ దేశ 2021 నాటి జనాభా గణాంక అంచనాల ప్రకారం 3.39 కోట్ల మంది తల్లిదండ్రులతోనో లేదంటే ఇతరులతో కలిసి జీవిస్తుంటే.. 3.75 కోట్ల మంది ఒంటరిగా జీవనం సాగిస్తున్నారు. 1965లో అమెరికాలో 15 శాతం మంది మాత్రమే 18 ఏళ్ల తర్వాత తల్లిదండ్రులతో సంబంధం లేకుండా ఒంటరిగా జీవనం సాగించే పరిస్థితి ఉండగా.. ఆ తర్వాత కాలంలో ఏటా ఆ సంఖ్య పెరుగుతూ వచ్చింది. 2013–16 మధ్యకాలంలో తల్లిదండ్రులతో కలిసి జీవించే వారి కంటే ఒంటరి జీవనం సాగించే వారే ఎక్కువ అయ్యారని గణాంకాలు పేర్కొంటున్నాయి. రాష్ట్రంలో 6 శాతానికి పైగా ఒంటరులే మన రాష్ట్రంలో 31,20,499 మంది ఒంటరిగా జీవనం సాగిస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. 2019లో రాష్ట్ర ప్రభుత్వం వలంటీర్ల ద్వారా నిర్వహించిన కుటుంబాల సర్వేలో రాష్ట్రంలో 1.66 కోట్ల కుటుంబాలు ఉన్నట్టు నిర్ధారణ అయింది. అందులో 31.20 లక్షల మంది ఒకే వ్యక్తి ఒక కుటుంబంగా ఉంటూ ఒంటరి జీవితం సాగిస్తున్నట్టు తేలింది. రాష్ట్రంలో 5.21 కోట్ల జనాభా ఉంటుందని అంచనా వేయగా.. వారిలో ఒంటరి జీవనం సాగించే వారి సంఖ్య 6 శాతానికి పైగా ఉన్నట్టు స్పష్టమవుతోంది. -
సింగిల్ షాట్.. సింగిల్ క్యారెక్టర్.. వన్ నాట్ ఫైవ్ మినిట్స్
హన్సిక నటించిన లేటెస్ట్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ 'వన్ నాట్ ఫైవ్ మినిట్స్'. ఈ చిత్రాన్ని దర్శకుడు రాజు దుస్సా సింగిల్ షాట్.. సింగిల్ క్యారక్టర్‌తో తెరకెక్కించారు. త్వరలో ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్‌గా రుద్రాన్ష్ సెల్యూలాయిడ్స్ పతాకంపై బొమ్మక్ శివ నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకి రానుంది. వరల్డ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే తొలి ప్రయత్నంగా సింగిల్ షాట్లో సింగిల్ క్యారెక్టర్‌తో తెరకెక్కించడం సంచలనంగా నిలవనుంది. ప్రపంచంలోనే మొదటి సారిగా హన్సిక నటించిన సినిమా 'వన్ నాట్ ఫైవ్ మినిట్స్'. ఒక గంటా నలభై అయిదు నిముషాల పాటూ సాగే ఉత్కంఠ పెంచే కథను సింగిల్ షాట్లో తెరకెక్కించడం నిజంగా సాహసమే. హాలీవుట్లో సింగిల్ షాట్ టెక్నిక్‌తో తెరకెక్కిన బర్డ్ మన్, 1917 చిత్రాల సరసన 'వన్ నాట్ ఫైవ్ మినిట్స్' నిలవనుంది. ఆ చిత్రాలు సింగిల్ షాట్లో తీసినా చాలా క్యారక్టర్ల చుట్టూ కథ నడుస్తుంది. కానీ 'వన్ నాట్ ఫైవ్ మినిట్స్' ఒకే పాత్రతో రన్ అయ్యే సినిమా. డైలాగులు కూడా చాలా తక్కువగా అవసరమైనంత వరకే పరిమితమైన స్క్రీన్ ప్లేతోనే సినిమా నడుస్తోంది. ఈ వినూత్న ప్రయోగాన్ని భారతదేశంలోనే తొలిసారిగా తెలుగులో చేయడం గొప్ప విషయం. సింగిల్ క్యారక్టర్‌తో సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలోని పాత్రకు హన్సిక చాలా హెల్ప్ అయ్యారు. చిత్రం అంతా సింగిల్ షాట్లో కేవలం తన పాత్ర మీదే నడిచే సినిమా కాబట్టి ఆ పాత్రకు వంద శాతం న్యాయం చేసింది. ఇది హన్సిక కెరీర్లోనే బెస్ట్ ఫిల్మ్ అవుతుంది. సినిమా కూడా అతి త్వరలో ప్రేక్షకుల ముందుకి తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. -
AP: ఒంటరిగా ఉంటున్నారా?.. ఈ ఆప్షన్ మీ కోసమే..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అనర్హత (ఇన్ ఎలిజిబుల్) కారణంగా రైస్ కార్డు కోల్పోయిన వారు దరఖాస్తు చేసుకుంటే ఆరు దశల ధ్రువీకరణ (సిక్స్ స్టెప్ వెరిఫికేషన్) అనంతరం కొత్తకార్డు మంజూరుకు పౌరసరఫరాల శాఖ అవకాశం ఇచ్చింది. ఇందులో భాగంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో స్ప్లిట్ ఆప్షన్ తీసుకొచ్చింది. చదవండి: రేషన్ కార్డుదారులకు కేంద్రం అదిరిపోయే గుడ్ న్యూస్ వీరితోపాటు విడాకులు తీసుకుని సంతానం లేని ఒంటరి వ్యక్తులు సైతం తగిన ధ్రువపత్రాలు సమర్పిస్తే రైస్ కార్డు ఇవ్వనుంది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖతో సమన్వయం చేసుకుంటూ రైస్ కార్డుల దరఖాస్తులను స్వీకరించాలని గ్రామ, వార్డు సచివాలయ శాఖకు సూచించింది. -
నాలాగే ఒంటరిగా ఉండండి!... అంటూ పిలుపునిచ్చిన మంత్రి!
జులై 11 ప్రపంచ జనాభా దినోత్వం సందర్భంగా నాగాలాండ్ మంత్రి టెమ్జెన్ ఇమ్నా అలోంగ్ కుటుంబ నియంత్రణపై అవగాహన పెంపొందించుకోవాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. అంతేకాదు పనిలో పనిగా జనాభా నియంత్రణ కోసం ఒక చిన్న పరిష్కార మార్గాన్ని కూడా సూచించారు. గత నెలలో ఈ శాన్య ప్రజలకు చిన్నకళ్లు ఉంటాయని అందరూ అంటారు గానీ వాటి వల్ల కలిగే ప్రయోజనాల గురించి చెప్పి వార్తల్లో నిలిచారు. మళ్లీ మరోసారి కుటుంబ నియంత్రణ అంశంపై చాలా చమత్కారమైన పరిష్కార మార్గం చెప్పి మరోసారి వార్తలో నిలిచారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే....ఇది చాలా సున్నితమైన విషయం. జనాభా పెరుగుదలను నియంత్రించటం కోసం మనం సరైన మార్గాన్ని ఎంచుకుందాం. లేదా నాలాగే సింగిల్‌గా ఉంటూ...అందరం కలసి స్థిరమైన భవిష్యత్తు కోసం పాటుపడదాం. ఈ రోజు నుంచే సింగిల్ ఉద్యమంలో పాల్గొనండి అని నాగాలాండ్ మంత్రి ట్వీట్ చేశారు. దీంతో నెటిజన్లు నాగాలాండ్ మంత్రికి చక్కటి హాస్య చతురత ఉందంటూ ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. On the occasion of #WorldPopulationDay, let us be sensible towards the issues of population growth and inculcate informed choices on child bearing. Or #StaySingle like me and together we can contribute towards a sustainable future. Come join the singles movement today. pic.twitter.com/geAKZ64bSr — Temjen Imna Along (@AlongImna) July 11, 2022 (చదవండి: రాష్ట్ర సీఎంను ఇలాగే ఆహ్వానిస్తారా?.. బీజేపీపై టీఎంసీ ఆగ్రహం) -
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్: వీటిపైనే నిషేధం
ప్లాస్టిక్ కాలుష్యం నియంత్రణలో భాగంగా.. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై ఇవాళ్టి(జులై1, శుక్రవారం) నుంచి దేశవ్యాప్తంగా నిషేధం అమలులోకి వచ్చింది. ఈ తరుణంలో ఏయే వస్తువులపై నిషేధం విధించారో.. ఉల్లంఘిస్తే పరిణామాలు ఎలా ఉంటాయో చూద్దాం. ఇయర్ బడ్స్(ప్లాస్టిక్ పుల్లలున్నవి), బెలూన్లకు వాడే ప్లాస్టిక్ స్టిక్స్ (ప్లాస్టిక్ పుల్లలతో), ప్లాస్టిక్ జెండాలు, క్యాండీ స్టిక్స్–పిప్పరమెంట్లకు వాడే ప్లాస్టిక్ పుల్లలు, ఐస్‌క్రీమ్ పుల్లలు(ప్లాస్టిక్ పుల్లలతో), అలంకరణ కోసం వాడే థర్మోకోల్, ప్లాస్టిక్ ప్లేట్లు, కప్పులతోపాటు ప్లాస్టిక్ గ్లాసులు, ఫోర్క్‌లు, కత్తులు, స్పూన్లు, స్ట్రాలు.. వేడి పదార్థాలు, స్వీట్ బాక్సుల ప్యాకింగ్‌కు వాడే పల్చటి ప్లాస్టిక్ ఆహ్వానపత్రాలు, సిగరెట్ ప్యాకెట్లు, వంద మైక్రాన్లలోపు ఉండే ప్లాస్టిక్ లేదా పీవీసీ బ్యానర్లు,, ద్రవ పదార్థాలను కలిపేందుకు వాడే పుల్లలు(స్ట్రిరర్స్)లపై నిషేధం అమలులోకి వచ్చింది. ప్రత్యామ్నాయాలుగా.. పేపర్, జూట్, గ్లాస్, చెక్క, బంక, స్టెయిన్లెస్ స్టీల్, వెదురు.. ఇతరత్ర పర్యావరణానికి నష్టం కలిగించని వాటిని ఉపయోగించుకోవచ్చు. ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ అమెండ్మెంట్ రూల్స్ 2021 ప్రకారం.. పైవాటిపై నిషేధం అమలులోకి వచ్చింది. వీటిని ఉల్లంఘిస్తే.. నిబంధనలను ఉల్లంఘిస్తే.. తయారు చేయడం, అమ్మకాలు, దిగుమతి చేసుకోవడం, నిల్వ చేయడం, పంపిణీ చేయడం..వీటిలో ఏదైనా సరే పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 కింద శిక్షార్హమే. ఐదేళ్ల వరకు గరిష్ఠ జైలుశిక్ష, లక్ష రూపాయల దాకా జరిమానా.. రెండూ విధించే అవకాశం ఉంది. ఒకవేళ ఉల్లంఘనలు కొనసాగిస్తే.. అదనంగా ప్రతీ రోజూ ఐదు వేల రూపాయల చొప్పున జరిమానా విధిస్తారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ అమలును పొల్యూషన్ కంట్రోల్ బోర్డులోని నేషనల్ కంట్రోల్ రూమ్ నిరంతరం పర్యవేక్షిస్తుంటుంది. దాని ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. సోషల్ మీడియా క్యాంపెయిన్లతో పాటు పరిశ్రమలు, విద్యాసంస్థలతో పాటు అవగాహన సదస్సులను నిర్వహిస్తారు. -
గుడ్డ సంచీకి వెల్కం
మార్కెట్‌కెళ్తే సామాన్లు క్యారీ బ్యాగుల్లో ఇస్తారు లెమ్మనుకునే రోజులు రేపటితో పోయినట్టే. ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్‌ను కేంద్రం జూలై 1 నుంచి నిషేధించింది? ఇకపై మార్కెట్‌కెళ్తే గుడ్డ సంచీ వెంట ఉండాల్సిందే... ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ (ఎస్యూపీ)వాడకం, తయారీ, అమ్మకం, నిల్వ, పంపిణీ, దిగుమతి తదితరాలన్నింటినీ నిషేధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇది శుక్రవారం నుంచే అమల్లోకి రానుంది. రీ సైక్లింగ్ కష్టమైన అన్ని రకాల ప్లాస్టిక్‌నూ నిషేధిత జాబితాలో చేర్చింది. 75 మైక్రోన్ల కంటే తక్కువ మందమున్న ప్లాస్టిక్‌ను 2021లోనే నిషేధించగా దాన్నిప్పుడు 100 మైక్రోన్లకూ వర్తింపజేసింది. ఇకపై వీటిని ఎవరు తయారు చేసినా, అమ్మినా సంస్థ లైసెన్లు రద్దు చేస్తారు. 120 మైక్రోన్ల కంటే తక్కువ మందమున్న ప్లాస్టిక్ బ్యాగులు, తదితరాలనూ వచ్చే డిసెంబర్ 31 నుంచి నిషేధించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఎందుకీ నిషేధం? ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తిలో ప్రపంచంలో మనది 98వ స్థానం. దేశంలో ఏటా 1.18 కోట్ల టన్నుల సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తవుతోంది. ఇందులో 29 లక్షల టన్నులు ఎగుమతవుతోంది. ఏటా సగటున 56 లక్షల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుంటున్నాయి. అంటే ఒక్కొక్కరు ఏకంగా 4 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తి చేస్తున్నట్టు లెక్క! ప్రపంచవ్యాప్తంత్తేటా 38 కోట్ల టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తవుతోంది. ఇందులో 91% రీ సైక్లింగ్‌కు అవకాశం లేనిదే. ఈ ప్లాస్టిక్ భూమిలో కలిసేందుకు వెయ్యేళ్లకు పైగా పడుతుంది. అందుకే దేశౠలన్నీ ప్లాస్టిక్ నిషేధంపై దృష్టి సారించాయి. హానికారక ప్లాస్టిక్ ఉత్పత్తిని దశలవారీగా ఆపేయాలని భారత్ సహా 124 దేశాలతో కూడిన ఐరాస ఎన్విరాన్మెంట్ అసెంబ్లీ తీర్మానించింది. ఎస్యూపీతో యమ డేంజర్ ఎస్యూపీ అంటే ఒక్కసారి వాడి పారేసే ప్లాస్టిక్. షాంపూ పాకెట్ల నుంచి కరీ పాయింట్లలో కూరలు కట్టిచ్చే కవర్ల దాకా అన్నీ ఈ బాపతే. ఇవి ఆరోగ్యానికి , పర్యావరణానికి అత్యంత హానికరం. ప్రపంచవ్యాప్తంగా తయారయ్యే ప్లాస్టిక్‌లో మూడో వంతు ఎస్యూపీనే. ఇది భూమిలో కలవకపోగా పర్యావరణాన్ని నేరుగా విషతుల్యం చేస్తుంది. 2019లో ప్రపంచవ్యాప్తంగా 13 కోట్ల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను పారేయడం, కాల్చేయడం, కొండ ప్రాంతాల్లో పడేయడం జరిగిందని ఓ స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది. ఎస్యూపీ ఉత్పత్తి ఇలాగే కొనసాగితే 2050 నాటికి పర్యావరణంలో కలిసిపోయే కర్బన ఉద్గారాల్లో 10 శాతం ఇదే ఉంటుందని ఐరాస అంచనా. ఎస్యూపీ బ్యాగుల్లోని ఆహార పదార్థాలను ఏళ్ల తరబడి తింటే రక్తంలోనూ ప్లాస్టిక్ కణాలు కలిసిపోతాయట. ఇది కేన్సర్ సహా పలు ప్రాణాంతక రోగాలకు దారి తీస్తుంది. భూమ్మీద సకల జీవజాలానికీ ప్లాస్టిక్ ముప్పుగానే మారింది. ఇతర దేశాల్లో.. బంగ్లాదేశ్ ప్రపంచంలో తొలిసారి 2002లోనే ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం విధించింది. 2019 జులైలో న్యూజిలాండ్ ఇదే బాట పట్టింది. 68 దేశాలు రకరకాల మందమున్న ప్లాస్టిక్‌ను నిషేధించాయి. 2020లో చైనా దశలవారీగా నిషేధం విధించింది. అమెరికాలో రాష్ట్రాన్ని బట్టి నిషేధముంది. నిషేధిత వస్తువులివే... ► ప్లాస్టిక్ పుల్లలతో కూడిన ఇయర్ బడ్స్ ► బెలూన్లలో వాడే ప్లాస్టిక్ పుల్లలు ► ప్లాస్టిక్ జెండాలు ► చాక్లెట్లు, ఐస్‌క్రీముల్లో వాడే ప్లాస్టిక్ పుల్లలు ► డెకరేషన్‌కు వాడే థర్మోకోల్ ► ప్లేట్లు, కప్పులు, గ్లాసులు, ఫోర్కులు, స్పూన్లు, కత్తులు, స్ట్రా, ట్రేలు ► స్వీటు బాక్సులు, ఇన్విటేషన్ కార్డులు, సిగరెట్ పేకెట్లపై ప్లాస్టిక్ ర్యాపింగ్ ► ద్రవ పదార్థాలను కలపడానికి వాడే ప్లాస్టిక్ స్టిక్స్ ► 100 మైక్రోన్ల కంటే తక్కువ మందమున్న ప్లాస్టిక్ వస్తువులు (వీసీ బ్యానర్లు) – సాక్షి, నేషనల్ డెస్క్ -
అంతా కవరింగే! ఒట్టి మాటలే తప్ప ప్లాస్టిక్ నిషేధం నై
1 జూన్ 2018. జీహెచ్ఎంసీలో సింగిల్‌యూజ్ ప్లాస్టిక్‌ను 2022 లోగా పూర్తిగా నిషేధిస్తామని 2018లో పర్యావరణ వారోత్సవాల్లో భాగంగా జరిగిన సమావేశంలో మున్సిపల్ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. అప్పటి యూఎన్ఈపీ(యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాం) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎరిక్సోలెంతో కలిసి ఆమేరకు ప్రతిజ్ఞ చేశారు. పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తామన్నారు. అందులో భాగంగా జీహెచ్ఎంసీ అధికారుల కోసం ఆరు ఎలక్ట్రిక్ కార్లను లాంఛనంగా ప్రారంభించారు. 4 జూన్ 2022. నిజంగానే గ్రేటర్లో ప్లాస్టిక్ నిషేధం.. ఈపాటికి సింగిల్‌యూజ్ ప్లాస్టిక్ సంపూర్ణ నిషేధం అమలవుతాయనుకున్న వారి అంచనాలు తప్పాయి. ఏదీ జరగలేదు. నిర్ణీత మైక్రాన్లలోపు ప్లాస్టిక్ నిషేధం అమలు కాలేదు. సింగిల్‌యూజ్ ప్లాస్టిక్ సంపూర్ణ నిషేధం సాధ్యం కాలేదు. ప్రారంభించిన ఎలక్ట్రిక్ కార్లు ఏమయ్యాయో తెలియదు. సాక్షి, హైదరాబాద్: నాలుగేళ్లు గడిచిపోయినా నాలుగడుగులు కూడా ముందుకు పడలేదు. సింగిల్‌యూజ్ ప్లాస్టిక్ నిషేధానికి అప్పటి జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్దన్‌రెడ్డి, అనంతరం కమిషనర్‌గా పనిచేసిన దానకిశోర్ అమలు చర్యలు ప్రారంభించి, కొంతకాలం అమలు చేసినప్పటికీ, అనంతరం పూర్తిగా కనుమరుగైంది. చిరువ్యాపారులు, మాంసం దుకాణాల వారు సైతం చాలావరకు ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన పొంది అమలుకు శ్రీకారం చుట్టినప్పటికీ, తదుపరి అధికారుల అశ్రద్ధతో ఆ కార్యక్రమం కుంటుపడింది. ఆదివారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ కథనం. ఆమోదం సై.. అమలు నై ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో గత మార్చిలో మరోసారి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధానికి, 75 మైక్రాన్లలోపు ప్లాస్టిక్ క్యారీబ్యాగుల నిషేధానికి జీహెచ్ఎంసీ సిద్ధమైంది. అందుకు స్టాండింగ్ కమిటీ సైతం ఆమోదం తెలిపింది. కానీ, దానికి సంబంధించి ఇంతవరకు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టలేదు. కేంద్రప్రభుత్వ నిబంధనల మేరకు గత సంవత్సరమే ఈ కార్యక్రమాలు చేపట్టాల్సి ఉండగా, ఇప్పటి వరకు పట్టించుకోలేదు. ఏళ్ల తరబడి.. జీహెచ్ఎంసీలో దాదాపు దశాబ్దం క్రితమే ప్లాస్టిక్ నిషేధచర్యలు ప్రారంభమైనప్పటికీ, రాజకీయ నేతల జోక్యం.. ప్లాస్టిక్ ఉత్పత్తిదారుల ప్రభావంతో ముందుకు సాగలేదు.జనార్దన్‌రెడ్డి, దానకిశోర్‌లు కమిషనర్లుగా వ్యవహరించే సమయంలో కొంతమేర అమలు జరిగినప్పటికీ, ఆ తర్వాత ఆ విషయమే మరిచిపోయారు.అప్పటి నిబంధనల కనుగుణంగా 50 మైక్రాన్లలోపు ప్లాస్టిక్‌పై నిషేధం అమలయ్యేలా తగిన చర్యలు చేపట్టారు. నాలాల్లోనూ ప్లాస్టికే.. జీహెచ్ఎంసీలో రోజుకు సగటున ఆరున్నరవేల మెట్రిక్ టన్నుల వ్యర్థాలు వెలువడుతుండగా, వాటిల్లో దాదాపు600 మెట్రిక్ టన్నులు ప్లాస్టిక్ వ్యర్థాలే.నాలాల్లోని వ్యర్థాల్లో 40 శాతానికి పైగా ప్లాస్టిక్ వ్యర్థాలే. నాలాల్లో వరదనీరు సాఫీగా సాగకుండా ముంపు సమస్యలకు ఇదీ ఓ ముఖ్య కారణమేనని ఇంజినీర్లు పేర్కొన్నారు. నగరంలో ఏటా 73 కోట్ల ప్లాస్టిక్ క్యారీబ్యాగులు వినియోగిస్తున్నట్లు ఒక అంచనా. ప్లాస్టిక్ వ్యర్థాల్లో కేవలం 14 శాతం మాత్రమే రీసైక్లింగ్ అవుతోంది. ప్లాస్టిక్ క్యారీబ్యాగ్నశించేందుకు 500 సంవత్సరాలకు పైగా పడుతుందని నిపుణులు పేర్కొన్నారు. పెనాల్టీల కోసమేనా..? ప్లాస్టిక్ నిషేధంపై జీహెచ్ఎంసీ కొద్దిరోజులు హడావుడి చేయడం.. చిరువ్యాపారులపై పెనాల్టీలు విధించడం.. అనంతరం మరిచిపోవడం పరిపాటిగా మారింది. ఏళ్ల తరబడి ఇదే తంతు. దీని వల్ల అటు వ్యాపారులు, ఇటు ప్రజలు సీరియస్‌గా తీసుకోవడం లేరు. వారికి డబ్బులు అవసరమైనప్పుడు పెనాల్టీల పేరిట వేధిస్తారని భావిస్తున్నారు. అంతేకాదు.. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయ మార్గాలు చూపనిదే ఎంతకాలమైనా అమలు సాధ్యం కాదు. – మహేశ్, గోల్నాక ఉన్నది భూమి ఒక్కటే.. కాపాడుకోవాలి.. ఈ సంవత్సర పర్యావరణ దినోత్సవ థీమ్ ‘ఉన్నది ఒక్కటే భూమి’. దీన్ని పరిరక్షించుకునేందుకు వివిధ అంశాలతోపాటు ప్లాస్టిక్ వినియోగం మానేయాలి. భూమి, నీటిలో సైతం అంతం కాకుండా ఏళ్ల తరబడి ఉండే ప్లాస్టిక్ ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగిస్తుంది. పర్యావరణానికి పెనుముప్పు కలిగిస్తుంది. – అశోక్ చక్రవర్తి, కవి (చదవండి: ‘సన్’ స్ట్రోక్స్! ఆన్లైన్ క్లాస్‌ల పేరిట గేమ్‌లకు బానిసగా...) -
సింగిల్ షాట్ ‘స్పుత్నిక్’కు అత్యవసర అనుమతి
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి నియంత్రణ కోసం అభివృద్ధి చేసిన సింగిల్–డోసు స్పుత్నిక్ లైట్ టీకాకు డ్రగ్స్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) అత్యవసర వినియోగ అనుమతి మంజూరు చేశారు. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా ఆదివారం ట్విటర్లో ప్రకటించారు. స్పుత్నిక్–5 టీకా తరహాలోనే స్పుత్నిక్ లైట్ టీకా పని చేస్తున్నట్లు నిపుణులు గుర్తించారు. దీంతో డ్రగ్ రెగ్యులేటర్‌లోని నిపుణుల కమిటీ శనివారం ఈ మేరకు అనుమతులు జారీ చేసినట్లు సమాచారం. త్వరలో డీసీజీఐ పూర్తి స్థాయిలో తుది అప్రూవల్ ఇవ్వనుందని తెలుస్తోంది. స్పుత్నిక్ లైట్‌తో భారత్‌లో వ్యాక్సిన్ల సంఖ్య 9కి చేరింది. DCGI has granted emergency use permission to Single-dose Sputnik Light COVID-19 vaccine in India. This is the 9th #COVID19 vaccine in the country. This will further strengthen the nation's collective fight against the pandemic. — Dr Mansukh Mandaviya (@mansukhmandviya) February 6, 2022 చదవండి: సూది, నొప్పి లేకుండా కరోనా వ్యాక్సిన్.. మనదేశంలోనే! -
సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధం.. ఎప్పటినుంచంటే..
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా వచ్చే ఏడాది జూలై 1 నుంచి వివిధ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు, ఉత్పత్తులపై నిషేధం అమల్లోకి రానుంది. గతంలో 50 మైక్రాన్ల కంటే తక్కువ మందమున్న ప్లాస్టిక్ కవర్లు, బ్యాగ్‌ల వంటి వాటిపైనే నిషేధం ఉండగా..ఇప్పుడు దీని పరిధిలోకి వచ్చే వస్తువుల జాబితాపై స్పష్టత వచ్చింది. ఇప్పటికే రాష్ట్రాలకు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) నోటిఫికేషన్ రూపంలో దీనిపై ఆదేశాలు జారీచేసింది. నిషేధం అమల్లోకి వచ్చేలోగా.. ప్రజల్లో అవగాహన కల్పనకు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీపీసీబీ) చర్యలు ప్రారంభించింది. అలాగే ప్రత్యామ్నాయ వస్తువుల వాడకంపై ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టింది. నిషేధం వీటిపైనే.. ► ఒకసారి వాడి పారవేసే ప్లాస్టిక్ వస్తువుల తయారీ, ఉత్పత్తి, దిగుమతి, స్టాక్ పెట్టుకోవడం, అమ్మకం, సరఫరా, పంపిణీ, వినియోగం తదితరాలు.. ► ఇయర్ బడ్స్, బెలూన్లు, ప్లాస్టిక్ జెండాలు, ఐస్‌క్రీం, క్యాండీలకు ఉపయోగించే ప్లాస్టిక్ స్టిక్స్ ► అలంకరణకు ఉపయోగించే థర్మకోల్ ► ప్లేట్లు, గ్లాసులు, ఫోర్క్‌లు, స్పూన్లు, కత్తులు, స్ట్రాలు, ట్రేల వంటి సామగ్రి ► స్వీట్‌బాక్స్‌లు ప్యాకింగ్ చేసే ఫిల్మ్, ఇన్విటేషన్ కార్డులు, సిగరెట్ ప్యాకెట్లు ► వంద మైక్రాన్ల కంటే తక్కువ మందమున్న ప్లాస్టిక్/ పీవీసీ బ్యానర్లు ఉల్లంఘనులపై జరిమానాలు... ఈ నిషేధ ఉత్తర్వులను ఉల్లంఘించే వారి నుంచి జరిమానాలు వసూలు చేయాలని సీపీసీబీ నిర్ణయించింది. అయితే దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశాన్ని రాష్ట్రాల పీసీబీలు లేదా కాలుష్య నియంత్రణ కమిటీలకు కల్పించింది. రిటైల్ వ్యాపారులు, అమ్మకందారులు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగదారులపై జీహెచ్ఎంసీ, ఇతర మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు జరిమానాలు విధించవచ్చు. ఉల్లంఘనలకు పాల్పడినవారిపై రూ.500, పారిశ్రామిక వ్యర్థాలకు కారణమయ్యే వారికి రూ.5 వేల చొప్పున జరిమానా వేయొచ్చు. ప్రత్యామ్నాయాలివే... ► పత్తి/ ఉన్ని/వెదురుతో తయారు చేసిన బ్యాగ్‌లు ► స్పూన్లు, స్ట్రాలు, ఇతర ప్లాస్టిక్ వస్తువుల స్థానంలో వెదురు లేదా ఇతర పదార్థాలతో తయారు చేసే వస్తువులను ఉపయోగించవచ్చు ► వేడి పానీయాలు, ఇతర అవసరాల నిమిత్తం మట్టిపాత్రల వంటివి వాడొచ్చు. -
ఇంకెన్నాళ్లు డిసైడ్ చేస్తారు..స్త్రీని స్వేచ్ఛగా ఎదగనివ్వండి
గతంలో సినిమాల్లో ‘ఆధునిక మహిళ’ అనగానే కబ్బుల్లో ఉంటారని చూపించేవారు. వాళ్లు మోడర్న్ దుస్తులు ధరిస్తారు... స్మోక్ చేస్తారు.. కాపురాలు పట్టించుకోరు.. ఇప్పుడు కర్నాటకకు చెందిన ఒక మినిస్టరు ‘వారు పెళ్లి చేసుకోవడానికి పిల్లల్ని కనడానికి ఇష్టపడటం లేదు’ అన్నాడు. మహిళ ఆధునికం కావడం అంటే అభివృద్ధిలో, ఉత్పత్తిలో, ఉపాధిలో భాగం కావడం. వారిని ‘స్టీరియోటైప్’ చేయడం ఎన్నాళ్లు? వారిని చూసి భయపడటం ఎందుకు? ఆధునిక పురుషుడికి లేని విమర్శ మహిళకు ఎందుకు? మొదట ఆధునిక పురుషుడు ఏం చేస్తాడో చూద్దాం. అతడు రాజకీయవేత్త అవుతాడు. వ్యాపారవేత్త అవుతాడు. సిఇఓ, సినిమా స్టార్ అవుతాడు. సూట్ వేసుకుంటాడు. విరామంలో గోల్ఫ్ ఆడతాడు. చిన్న షార్ట్స్ వేసుకుని సముద్రంలో ఈత కొడతాడు. సరదాగా ఫ్రెండ్స్‌తో డ్రింక్ చేస్తాడు. బిజినెస్ ట్రిప్‌లకు వెళతాడు. సంపాదిస్తాడు. ఖర్చు పెడతాడు. వీటన్నింటికి సమాజం నుంచి ఆమోదం ఉంది. ఎందుకు? అతడు మగాడు. స్త్రీలు? వారూ చదువుతారు. సిఇఓలు అవుతారు. వ్యాపార సామ్రాజ్యాలను నిర్మిస్తారు. స్పోర్ట్స్ ఆడతారు. మెడల్స్ తెస్తారు. కారు డ్రైవ్ చేస్తారు. ఆఫీస్ పనుల మీద టూర్లు వెళతారు. కాని వీటికి విమర్శ వస్తుంది. ‘సంసారాన్ని వదిలేసి అలా ఎలా తిరుగుతుంది’. పశువు మెడలో తాడు కట్టేసి ఆ తాడును ఎంత దూరం వదిలినా ఆ పశువు తిరిగి తిరిగి మళ్లీ గుంజ దగ్గరకు చేరాలి అన్నట్టుగా భారతీయ సమాజం స్త్రీ ఎంత దూరం వెళ్లినా, ఎంత ఉన్నతి సాధించినా తిరిగి ‘సంసారం’, ‘మాతృత్వం’ వంటి ప్రాథమిక బాధ్యతల వద్దకే తిరిగి రావాలని భావిస్తుంది. స్త్రీని సంసారం నుంచి ‘ఆధునికత’ విముక్తం చేస్తుందనే భయం ఉంది– అందుకు ఏ రకమైన అధ్యయనం, ఆధారం లేకపోయినా. స్త్రీలు ఇల్లు కదలడం, చదువుకోవడం, మొదట స్టెనోలుగానో, టైపిస్ట్లుగానో చిన్న చిన్న ఉద్యోగాలు చేయడం, తమ కోసం మహిళా సంఘాలు పెట్టుకోవడం మొదలెట్టినప్పటి నుంచి వారిని ‘కేరికేచర్లుగా’ చూపిస్తూ, హేళన చేయదగ్గ స్త్రీలుగా చూపిస్తూ సమాజం వారిని అదుపు చేయాలని చూసింది. చూస్తోంది. పాత సినిమాల్లో ఆధునిక స్త్రీ అంటే విగ్గులు పెట్టేసి, చేతికి హ్యాండ్‌బ్యాగు వేలాడదీసి, క్లబ్బులో పేకముక్కలు చేతికి ఇచ్చేవారు. ఇప్పుడు పబ్బుల్లో చూపిస్తున్నారు. ఇవాళ బాగా చదువుకున్న ప్రతి స్త్రీ, ఉద్యోగ, ఉపాధి, వ్యాపార రంగాల్లో ఉన్న ప్రతి స్త్రీ ఆధునిక స్త్రీనే. ఆ చదువుకున్న స్త్రీ గృహిణిగా ఉంటున్నా ఆధునిక స్త్రీనే. అయితే ఛాందస వాదుల నిందలు, విమర్శలు ఏమంటే ‘వీరు కుటుంబాన్ని (భర్తను, పిల్లలను) నిర్లక్ష్యం చేస్తారు’ అని. అలా అని చెప్పి వీరి మీద ఒక ఒత్తిడి తెస్తారు. నిజానికి పురుషుడు ఎంత ఎదిగినా ఎలా కుటుంబంలోకి వస్తున్నాడో స్త్రీలు కూడా ఎంత ఎదిగినా కుటుంబంలోకి వస్తారు. వారికి తల్లిగా, భార్యగా ఇంటిని ఎలా నిర్వహించుకోవాలో తెలుసు. కాని పురుషుడికి ఉండే వెసులుబాటు వారికి ఉండదు. తన కెరీర్ కోసం పురుషుడు ముందు వెళ్లాలంటే స్త్రీ కుటుంబ నిర్వహణ కోసం తనను తాను కుదించుకోవాలి లేదా త్యాగం చేయాలి. ‘ఆధునిక మహిళ’ ఇక్కడ ప్రశ్నను లేవదీస్తుందని, నీకున్న హక్కు నాకు ఎందుకు లేదు అంటుందని, తద్వారా ‘పిల్లల్ని కంటూ ఇంటి దగ్గర పడుండే’ స్త్రీ పాత్ర నుంచి ఆమె విముక్తమవుతుందని సమాజానికి భయం. అందుకే సినిమాల్లో, అడ్వర్టైజ్మెంట్లలో, చవకబారు సాహిత్యంలో, కార్టూన్లలో అలాంటి స్త్రీలను హేళన చేయడం కనిపిస్తూ ఉంటుంది. ‘స్టెనోలందరూ బాస్ ఒళ్లో కూచుని ఉంటారు’ అని ఇప్పటికీ కార్టూన్లు గీస్తూ స్త్రీలను అవమానించే కార్టూనిస్టులు ఉద్యోగాల్లో తమను తాము నిరూపించుకోవాలనుకుంటున్న స్త్రీలకు ఎంత అన్యాయం చేస్తున్నారో ఊహించలేరు. ఇక టీవీ పెట్టగానే వచ్చే అడ్వర్టైజ్మెంట్లు ‘ఉప్పు గురించి’, ‘మసాలా దినుసుల గురించి’, ‘టీ గురించి’, ‘అత్తయ్యకు నచ్చిన హెయిర్ ఆయిల్ గురించి’ మాట్లాడే గృహిణులను చూపి చూపి నీ ఆర్థిక స్తోమత, చదువు ఎంతున్నా నువ్వు ఎంగేజ్ కావాల్సింది ఈ పనుల్లోనే అని కండిషన్ చేస్తూ వస్తుంటాయి. రాజకీయాల్లో ఉండే స్త్రీలను, టీవీ డిబేట్లలో మాట్లాడే స్త్రీలను, ఉద్యమాల్లో ఉండే స్త్రీలను, మేధావులుగా ఉండే స్త్రీలను, ఆత్మవిశ్వాసంతో ఉండే స్త్రీలను, ఫ్యాషన్– గ్లామర్ రంగాల్లో ఉండే స్త్రీలను, ఎన్.జి.ఓ రంగాల్లో ఉండే స్త్రీలను సమాజానికి ఉండే ‘సగటు పురుష స్వభావం’ అంగీరించే పరిస్థితులు నేటికీ కనిపించకపోవడానికి కారణం అలాంటి స్త్రీలు తెల్లారితే గిన్నెలు కడుక్కుంటూ కనిపించరేమోనన్న భయం. పిల్లల్ని బాగా చూసుకుంటూ, కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూ, ఇంటి బయట తాను ఎంచుకున్న కార్యరంగంలో స్త్రీ ఎదగడం మొదలెట్టి చాలా కాలం అయ్యింది. అయినా సరే ఆమెను వేలెత్తి చూపడం మానడం లేదు... కుటుంబ వ్యవస్థ స్థిరీకరణకు స్త్రీతో పాటు పురుషుడు సమాన బాధ్యత వహించాల్సి ఉన్నా. తాజాగా కర్నాటక ఆరోగ్యశాఖా మంత్రి సుధకార్ ‘ఆధునిక స్త్రీ సింగిల్‌గా ఉండటానికి ఇష్టపడుతోంది, ఆమె పిల్లల్ని కనడానికి ఇష్టపడటం లేదు’ అని వ్యాఖ్యానించాడు. నిజానికి స్త్రీకి తన శరీరం మీద హక్కు తనకే ఇంకా దక్కలేదు. పిల్లల్ని కనడం కనకపోవడం గురించి ఆమెకు వైవాహిక వ్యవస్థలో పూర్తిగా స్వేచ్ఛ లేదు. ఆమె ఏం చదవాలో, ఏ ఉద్యోగం చేయాలో కుటుంబమే డిసైడ్ చేస్తూ ఉంటుంది. ఆమె వివక్ష అనుభవిస్తూనే ఎదగాల్సి వస్తోంది. ఇన్ని జరుగుతున్నా ఆమె కుటుంబ చట్రానికి ఆవల వెళుతుందేమోనన్న భయంతో బ్లేమ్ కొనసాగుతూనే ఉంది. ఆధునిక స్త్రీ సమాజ హితం, కుటుంబ హితం కోరుతూనే ఉంది. అయితే దానికి సంబంధించిన రూల్స్ ఆమె మార్చదలుచుకుంటే వాటి మీద కదా చర్చ జరగాలి. అందాక నిందలు, విమర్శలు మానాలని అందరికీ చెబుదాం. పిల్లల్ని బాగా చూసుకుంటూ, కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూ, ఇంటి బయట తాను ఎంచుకున్న కార్యరంగంలో స్త్రీ ఎదగడం మొదలెట్టి చాలా కాలం అయ్యింది. అయినా సరే ఆమెను వేలెత్తి చూపడం మానడం లేదు... కుటుంబ వ్యవస్థ స్థిరీకరణకు స్త్రీతో పాటు పురుషుడు సమాన బాధ్యత వహించాల్సి ఉన్నా. -
నో మోర్ ‘సింగిల్ యూజ్ ప్లాస్టిక్’!
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో 2022 నాటికి సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను పూర్తిగా కట్టడి చేసేందుకు కేంద్రప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు శాఖ ఈనెల 12న ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ సవరణ నియమాలు–2021ను ప్రకటించింది. ఇందులో భాగంగా అధిక చెత్తకు కారణమయ్యే ఒక్కసారి వాడిపారేసే ప్లాస్టిక్ వస్తువులను వచ్చే ఏడాది జూలై నుంచి నిషేధించింది. ‘ప్లాస్టిక్ ఇయర్‌బడ్స్’పై నిషేధం: వచ్చే ఏడాది జూలై 1వ తేదీ నుంచి దేశంలో గుర్తించిన కొన్ని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల తయారీ, దిగుమతి, నిల్వ, పంపిణీ, అమ్మకం, వినియోగాన్ని పూర్తిగా నిషేధించింది. ప్లాస్టిక్ స్టిక్స్‌తో చేసిన ఇయర్ బడ్స్, బెలూన్లకు ప్లాస్టిక్ స్టిక్స్, ప్లాస్టిక్ జెండాలు, క్యాండీస్‌కు వాడే ప్లాస్టిక్ స్టిక్స్, ఐస్ క్రీమ్ స్టిక్స్, డెకరేషన్‌కు వాడే థర్మోకోల్ వస్తువులపై నిషేధం అమలులోకి రానుంది. వీటితోపాటు ప్లేట్లు, కప్పులు, గ్లాసులు, ఫోర్కులు, స్పూన్లు, కత్తులు, స్ట్రాలు, ట్రేలు, స్వీట్ బాక్సులకు వాడే ప్యాకింగ్ పేపర్, ఇన్విటేషన్ కార్డులు, సిగరెట్ ప్యాకెట్లు, 100 మైక్రాన్లకు తక్కువగా ఉండే ప్లాస్టిక్ లేదా పీవీసీ బ్యానర్లను నిషేధిత జాబితాలో చేర్చింది. 120 మైక్రాన్లకు పెంపు ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీ నుంచి దేశంలో ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్‌ల మందాన్ని 50 నుంచి 75 మైక్రాన్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 2022 డిసెంబర్ 31 నుంచి ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్‌ల కనీస మందం 120 మైక్రాన్లకు పెంచింది. ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల మందం పెరిగిన కారణంగా వాటిని తిరిగి ఉపయోగించేందుకు అనుమతించనుంది. రాష్ట్రాలు చీఫ్ సెక్రటరీ స్థాయిలో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసి, నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాలని కోరింది.