సింగిలే సూపర్! | Being single means more liberating: Monica Bellucci | Sakshi
Sakshi News home page

సింగిలే సూపర్!

Published Sun, Mar 15 2015 11:40 PM | Last Updated on Sat, Sep 2 2017 10:54 PM

సింగిలే సూపర్!

సింగిలే సూపర్!

బాయ్‌ఫ్రెండ్స్... హజ్‌బెండ్స్... లవ్ లైఫ్... మ్యారీడ్ లైఫూ... అన్నీ బోరుకొట్టి విరక్తి పుట్టించినట్టున్నాయి హాలీవుడ్ నటి, మోడల్ మోనిక బెల్లూసీకి! యాభైల్లో పడిన ఈ సుందరి... సింగిల్‌గా ఉంటేనే లైఫ్ సూపరంటోంది. అసలు తోడు కావల్సిందే ఈ వయసులోనే కదా అని ఎవరో అడిగితే... అబ్బే అలాంటిదేమీ లేదనేసింది. పైగా ఏ తోడూ లేకపోతే ఆరోగ్యం కూడా ఎంతో బాగుంటుందని సెలవిచ్చింది.

ప్రస్తుతం తన ఇద్దరు కుమార్తెలతో జీవితం ఎంతో హ్యాపీగా, సాఫీగా సాగిపోతోందని, వాళ్లకు తనంటే ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చింది. మాజీ భర్త విన్సెంట్ కాసెల్‌తో ఇద్దరు కుమార్తెలకు జన్మనిచ్చింది మోనిక. పెద్దమ్మాయి వయసు పదేళ్లు. చిన్నమ్మాయికి ఐదేళ్లు. తాము ముగ్గురం లైఫ్‌ను ఎంతో ఉల్లాసంగా ఆస్వాదిస్తున్నామని చెప్పింది మోనిక!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement