నేను సింగిల్‌గానే ఉన్నాను | Single Women in Regina | Sakshi
Sakshi News home page

నేను సింగిల్‌గానే ఉన్నాను

Published Sun, Aug 2 2015 3:20 AM | Last Updated on Wed, Apr 3 2019 9:14 PM

నేను సింగిల్‌గానే ఉన్నాను - Sakshi

నేను సింగిల్‌గానే ఉన్నాను

గ్లామర్ కోసమని ప్రత్యేక గణాన్ని నియమించుకున్న నటిని చూశారా? నటి రెజీనా అందంగా కనిపించడం కోసమే కొందరు సహాయకున్ని నియమించుకున్నారట. అయినా అందాలారబోసే అవకాశాలు రావడం లేదని వాపోతున్నారు. తమిళంలో కేడి బిల్లా కిల్లాడి రంగా లాంటి కొన్ని చిత్రాల్లో హీరోయిన్‌గా మెరిసిన రెజీనా ఆ తరువాత ఇక్కడ అవకాశాలు అడుగంటడంతో దుకాణం బంద్ చేసి తెలుగు చిత్ర పరిశ్రమలో మకాం పెట్టింది. అక్కడ తొలుత ఆశాజనకంగానే ఉన్నా ప్రస్తుతం అవకాశాలు అంతంత మాత్రంగానే వస్తున్నాయి. దీంతో అందాలారబోతకు సిద్ధమైందట.
 
 దీని గురించి రెజీనా తెలుపుతూ పక్కింటి అమ్మాయిలా ఉన్నావంటూ చీరకట్టు పాత్రలకే పరిమితం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. అలాంటి పాత్రలు పోషించి బోర్ కొట్టేస్తోంది. మోడ్రన్ డ్రస్సు దూరం అన్నట్లు మాట్లాడుకుంటున్నారని అంది. నిజానికి తనకు గ్లామరస్ పాత్రలన్నా అలాంటి దుస్తులన్నా చాలా ఇష్టం. ఇంటిలో షర్టు, జీన్స్ దుస్తులే ధరిస్తాను. మొదటి నుంచి గ్లామర్‌గా నటిస్తే గ్లామర్ హీరోయిన్‌గా పేరు వచ్చేదంటున్నారని అంది. పాత్రకు తగ్గట్టుగానే నటించాలి కదా! పాత్రకు సంబంధం లేకండా గ్లామరస్ దుస్తులు ధరిస్తానని చెప్పగలనా? అంటోంది. లంగా ఓణి ఇమేజ్ నుంచి బయటపడటానికి ఇటీవల తాను పాల్గొనే సినీ కార్యక్రమాల్లో గ్లామరస్ దుస్తులనే ధరిస్తున్నాను.
 
  ఇందుకోసం ప్రత్యేకంగా మేకప్‌మన్‌లను నియమించుకున్నానని చెప్పింది. ఇకపోతే కథా పాత్రలు గాని, దుస్తుల ఎంపికల్లో గాని తుది నిర్ణయం తనదేనని తెలిపింది. ఎవరినైనా ప్రేమించారా? అని అడుగుతున్నారని నిజం చెప్పాలంటే తాను తొమ్మిదవ తరగతి చదువుతున్న పక్కింటి కుర్రాడి ప్రేమలో పడ్డానని ఆ ప్రేమ కొన్నేళ్లు వరకు సాగిందని చెప్పింది. ఈ విషయం గురించి దాచాల్సిన అవసరం లేదు. అయితే అతను తనను విడిచి విదేశాలకు పారిపోయాడని ప్రస్తుతం తాను సింగిల్‌గానే ఉంటున్నట్లు రెజీనా చెప్పింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement