ముంబై: బీమా దిగ్గజం ఎల్‌ఐసీ కొత్తగా ‘ధన వృద్ధి’ పేరుతో క్లోజ్ ఎండెడ్ ప్లాన్‌ను ఆవిష్కరించింది. జూన్ 23 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఈ ప్లాన్‌ను విక్రయించనున్నట్టు ప్రకటించింది. ఇది నాన్ లింక్డ్ (ఈక్విటీతో సంబంధం లేని), నాన్ పార్టిసిపేటింగ్ ప్లాన్. పొదుపుతో కూడిన సింగిల్ ప్రీమియం ప్లాన్. జీవిత బీమా రక్షణతోపాటు పొదుపును ఆఫర్ చేస్తుంది. పాలసీదారు దురదృష్టవశాత్తూ మరణానికి గురైతే కుటుంబానికి పరిహారం అందిస్తుంది.
గడువు ముగిసే వరకు జీవించి ఉంటే మెచ్యూరిటీ మొత్తం తిరిగి వస్తుంది. ఈ ప్లాన్‌లో రెండు రకాల బీమా ఆప్షన్లు ఉన్నాయి. మరణ పరిహారం చెల్లించే ప్రీమియానికి 1.25 రెట్లు లేదంటే పది రెట్లలో ఒకదాన్ని ఎంపిక చేసుకోవచ్చు. 10, 15, 18 ఏళ్ల కాల వ్యవధిపై తీసుకోవచ్చు. కనీసం రూ.1,25,000 బీమా నుంచి ఎంత మొత్తమైనా ఎంపిక చేసుకోవచ్చు. ప్రతి పాలసీ సంవత్సరం ముగిసిన తర్వాత గ్యారంటీడ్ అడిషన్స్ జమ అవుతాయి.
ఈ గ్యారంటీడ్ అడిషన్ అనేది మొదటి ఆప్షన్‌లో ప్రతి రూ.1,000 సమ్ అష్యూర్డ్‌పై రూ.60–75 మధ్య, రెండో ఆప్షన్‌లో రూ.25–40 మధ్య ఉంటుంది. ఈ ప్లాన్‌లో మెచ్యూరిటీ లేదా మరణ పరిహారాన్ని కావాలంటే వాయిదాల పద్ధతిలోనూ తీసుకోవచ్చు. పాలసీపై రుణ సదుపాయం కూడా ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment