premium
-
పాలసీ జారీ తర్వాతే ప్రీమియం వసూలు
కొత్తగా బీమా పాలసీలు తీసుకునే వారి సౌలభ్యం కోసం బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (IRDAI) కీలక ఆదేశాలు జారీ చేసింది. పాలసీ జారీ చేసిన తర్వాతే అందుకు సంబంధించి ప్రీమియం వసూలు చేసుకునేందుకు వీలుగా.. బీమా–ఏఎస్బీఏ(Bima-Applications Supported by Blocked Amount) సదుపాయాన్ని అందించాలంటూ అన్ని బీమా సంస్థలను ఆదేశించింది.ఇదీ చదవండి: విద్యుత్ రంగంలో రూ.60 లక్షల కోట్ల పెట్టుబడులుపాలసీ జారీ అయ్యేంత వరకు ప్రీమియంకు సరిపడా మొత్తం కస్టమర్ బ్యాంక్ ఖాతాలో బ్లాక్ అయి ఉంటుంది. ప్రస్తుతం ఐపీవోలకు ఈ విధానం అమల్లో ఉంది. దీన్ని అప్లికేషన్ సపోర్టెడ్ బై బ్లాక్డ్ అమౌంట్ (ఏఎస్బీఏ) సదుపాయంగా చెబుతారు. ఇదే మాదిరి బీమా–ఏఎస్బీఏ విధానాన్ని బీమా పాలసీలకు అమలు చేయాలని ఐఆర్డీఏఐ సూచించింది. మార్చి 1 నాటికి ఈ సదుపాయాన్ని అమల్లోకి తీసుకురావాలని ఐఆర్డీఏఐ తెలిపింది. ఈ విధానంలో ప్రపోజల్‌ను ఆమోదిస్తున్నట్టు బీమా సంస్థ కస్టమర్‌కు తెలియజేసిన తర్వాతే, ప్రీమియం చెల్లించాల్సి ఉంటుందని ఐఆర్డీఏఐ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. -
రిలయన్స్ ‘కేజీ’ చమురుకు ప్రీమియం ధర
కేజీ బేసిన్లో ఉత్పత్తి చేసే ముడిచమురుకు ప్రీమియం ధరను డిమాండ్ చేస్తూ రిలయన్స్ ఇండస్ట్రీస్(Reliance) బిడ్లను ఆహ్వానించింది. దీనికి సంబంధించిన టెండర్ ప్రకారం బిడ్డర్లు అంతర్జాతీయ బెంచ్‌మార్క్‌కన్నా కనీసం 3.5 డాలర్లు (Barrel) అధికంగా కోట్ చేయాల్సి ఉంటుంది. 2025 జనవరి 24 నాటికి బిడ్లను దాఖలు చేయాల్సి ఉంటుంది.ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాలోని గాడిమొగ నుంచి ఈ ఆయిల్‌ను రిలయన్స్ సరఫరా చేస్తుంది. ప్రధానంగా గ్యాస్ క్షేత్రమైన కేజీ–డీ6(KG Basin) బ్లాక్‌లో రిలయన్స్‌కు 66.67 శాతం, బీపీ ఎక్స్‌ప్లొరేషన్‌కు (ఆల్ఫా) 33.33 శాతం వాటాలు ఉన్నాయి. ఇందులో కొంత మొత్తం ముడి చమురు కూడా ఉత్పత్తి అవుతుంది. 2025 ఏప్రిల్ నుంచి 2026 ఫిబ్రవరి వరకు ప్రతి నెలా ఉత్పత్తి చేసే 17,600 బ్యారెళ్ల ఆయిల్ విక్రయం కోసం తాజాగా బిడ్లను ఆహ్వానించారు. ప్రస్తుతం ప్రామాణికంగా తీసుకుంటున్న నైజీరియన్ బోనీ లైట్ గ్రేడ్ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 73.5 డాలర్లుగా ఉంది. టెండరు ప్రకటన ప్రకారం దీనికి 1.5 డాలర్ల ప్రీమియంతో పాటు బ్యారెల్‌కు కనీసం 2 డాలర్లు అధికంగా బిడ్డర్లు కోట్ చేయాల్సి ఉంటుంది.ఇదీ చదవండి: ఆర్టీజీఎస్, నెఫ్ట్ లావాదేవీల పొరపాట్లకు చెక్పెట్రోల్, డీజిల్‌పై రూ.5 వరకు తగ్గింపు: నయారాప్రైవేటు రంగ చమురు సంస్థ నయారా ఎనర్జీ పండుగల సందర్భంగా వాహన యజమానుల కోసం ఆఫర్ ప్రకటించింది. డిజిటల్ పేమెంట్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ఇంధనం నింపుకుంటే లీటర్ పెట్రోల్(Petrol), డీజిల్‌పై రూ.5 వరకు తగ్గింపు ఇస్తున్నట్లు తెలిపింది. ‘సబ్ కీ జీత్ గ్యారంటీడ్ 2024’ పథకం కింద పట్టణ, గ్రామీణ ప్రాంత బంకుల్లోనూ పెట్రోల్, డీజిల్‌పై ఈ ఆఫర్ అమలవుతుందని పేర్కొంది. ‘కస్టమర్లు కేవలం డబ్బును ఆదా చేసుకోవడమే కాకుండా డిజిటల్ లావాదేవీలు ప్రోత్సహించేందుకు ఈ పథకాన్ని ప్రారంభించాము’ అని నయారా ఎనర్జీ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ మాధుర్ తనేజా వెల్లడించారు. జనవరి 31 వరకు ఆఫర్ అమల్లో ఉంటుంది. -
బీమా ప్రీమియం వసూళ్లు ఎలా ఉన్నాయంటే..
బీమా ప్రీమియం వసూళ్లు నవంబర్ నెలలో తగ్గినట్లు లైఫ్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ గణాంకాలు వెల్లడించింది. 2023 నవంబర్‌లో వసూలైన రూ.26,494 కోట్లతో పోలిస్తే ఈ ఏడాది అదే సమయంలో బీమా ప్రీమియం రూ.25,306 కోట్లుగా నమోదైంది. గతంలో పోలిస్తే ఇది 4.5% తక్కువగా ఉంది. బీమా రంగంలో ప్రముఖంగా సేవలందిస్తున్న లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) ప్రీమియం వసూళ్లు ఈసారి తగ్గుముఖం పట్టాయి. దానివల్లే ఈ పరిస్థితి నెలకొందని కౌన్సిల్ అభిప్రాయపడింది.ఎల్ఐసీ ప్రీమియం తగ్గుముఖం పడుతుంటే ప్రైవేట్ సంస్థల ప్రీమియంలో మాత్రం గతంలో కంటే 31 శాతం వృద్ధి కనబడింది. నవంబర్‌లో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ రూ.3,222 కోట్లు, మ్యాక్స్ లైఫ్ రూ.748.76 కోట్లు, హెచ్డీఎఫ్సీ లైఫ్ రూ.2,159 కోట్లు, ఎస్బీఐ లైఫ్ రూ.2,381 కోట్ల వరకు ప్రీమియం వసూలు చేశాయని గణాంకాలు తెలియజేస్తున్నాయి. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి పరిగణనలోకి తీసుకుంటే మాత్రం జీవిత బీమా ప్రీమియం వసూళ్లలో 16% వృద్ధి కనిపించింది. ఎల్ఐసీ కూడా అదే మొత్తంలో వృద్ధి నమోదు చేసింది.ఇదీ చదవండి: తక్కువ మొత్తంలో జమ చేస్తారు.. ఆపై దోచేస్తారు!జీవిత బీమా సాధనాల్లో టర్మ్ ఇన్సూరెన్స్ ఎంతో కీలకమైంది. తక్కువ ప్రీమియానికే ఎక్కువ కవరేజీనిస్తుంది. కుటుంబానికి ఆధారమైన వారు, సంపాదించే శక్తి కలిగిన వారు టర్మ్ ఇన్సూరెన్స్‌తో తమవారికి తగినంత రక్షణ కల్పించుకోవచ్చు. మన చుట్టూ ఉన్న వారిలో ఇప్పటికీ చాలా మందికి టర్మ్ బీమా ప్లాన్లు లేవు. ఏదైనా జరగరానిది జరిగితే కుటుంబ సభ్యులకు ఆర్థికంగా ఆసరాగా ఇవ్వగలిగేది టర్మ్ ఇన్సూరెన్స్ అని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికీ దీన్ని తీసుకోని వారు నిపుణుల సలహాతో మంచి పాలసీను ఎంచుకోవాలి. -
ప్రీమియం చెల్లించకపోతే పంటల బీమాకు అనర్హులు
సాక్షి, అమరావతి: నిర్దేశించిన గడువులోగా ప్రీమియం చెల్లించకపోతే తాము సాగు చేసే పంటలకు బీమా పొందేందుకు రైతులు అర్హత కోల్పోతారని వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్ స్పష్టం చేశారు. ఐదేళ్లుగా అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకం స్థానంలో ఈ ఏడాది నుంచి రైతులను భాగస్వామ్యం చేస్తూ స్వచ్ఛంద నమోదు పద్ధతిన పంటల బీమా అమలు చేస్తున్నట్లు చెప్పారు. పంటల బీమా ప్రచార వారోత్సవాలను మంగళవారం ఆయన గుంటూరు జిల్లా మంగళగిరి వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఆ శాఖ డైరెక్టర్ సేనాపతి ఢిల్లీరావుతో కలిసి ప్రారంభించారు. ఇన్సూరెన్సు కంపెనీలు తయారు చేసిన వాల్‌పోస్టర్లు, కరపత్రాలను ఆవిష్కరించారు. మీడియాతో రాజశేఖర్ మాట్లాడుతూ..పంట రుణం పొందిన సందర్భంలో సంబంధిత బ్యాంక్ వారే ప్రీమియం వసూలు చేసి సదరు బీమా కంపెనీకి నేరుగా చెల్లిస్తారని చెప్పారు. బీమా వద్దనుకుంటే ప్రీమియం తగ్గింపు నిలిపివేయాలని రాతపూర్వకంగా బ్యాంక్‌కు సమరి్పంచాలన్నారు. రుణం తీసుకోని రైతులు తమ వాటా ప్రీమియం మొత్తాన్ని ఆన్లైన్లో చెల్లించి సచివాలయాలు, పీఏసీఎస్‌లు, పోస్టాఫీస్‌లు, కామన్ సర్వీస్ సెంటర్స్ (సీఎస్సీ)ల్లో నమోదు చేసుకోవాలన్నారు.దళారీలను నమ్మి మోసపోవద్దనన్నారు. రబీ సీజన్‌కు సంబంధించి ఇతర పంటలకు ఈ నెల 15గానూ, వరికి 31 లోగా ప్రీమియం చెల్లించాలని, లేకుంటే బీమా పొందేందుకు ఏమాత్రం అవకాశం ఉండదన్నారు. స్వచ్ఛంద నమోదు పద్ధతిపై గ్రామ స్థాయిలో రైతులకు అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలకు కేటాయించిన ఇన్సూ్యరెన్స్ కంపెనీలు, ఆయా జిల్లాలో నోటిఫై చేసిన పంటల వివరాలు, పంటల వారీగా కట్టాల్సిన ప్రీమియం శాతం, రైతులు చెల్లించాల్సిన వాటా, నమోదు చేయడానికి గడువు, తదితరాలపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. వ్యవసాయ శాఖ డైరక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ ఖరీఫ్ పంటలకు 2శాతం, రబీ పంటలకు 1.5 శాతం, వాణిజ్య పంటలకు 5 శాతం చొప్పున రైతులు తమ వాటా ప్రీమియం సొమ్ము చెల్లించాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వ భూ రికార్డులు, సీసీఆర్సీలు పొందిన రైతుల డేటాను జాతీయ పంటల బీమా పోర్టల్‌తో అనుసంధానం చేశామన్నారు. -
బీమా ప్రీమియంపై జీఎస్టీ మినహాయింపు..?
ఆరోగ్యబీమా ప్రీమియంపై జీఎస్టీ మినహాయింపు అంశానికి సంబంధించి త్వరలో కీలక ప్రకటన వెలువడనుంది. ఈ నెల 9వ తేదీన జరగబోయే జీఎస్టీ కౌన్సిల్లో ఈమేరకు నిర్ణయం తీసుకోనున్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఒకవేళ అనుకున్న విధంగానే ఆరోగ్య బీమా ప్రీమియంపై జీఎస్టీ మినహాయిస్తే రూ.650 కోట్ల నుంచి రూ.3,500 కోట్లు వరకు కేంద్ర ఖజానాపై భారం పడనుంది.దేశంలో చాలామంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల ఖర్చు ఏటా పెరుగుతోంది. కొన్ని సర్వేల ప్రకారం వైద్య ఖర్చులు ఏటా 30-40 శాతం మేర అధికమవుతున్నాయి. దాంతో చాలామంది ఆరోగ్య బీమా తీసుకుంటున్నారు. అయితే ప్రతివ్యక్తి ఎప్పుడో ఒకప్పుడు ఈ సదుపాయాన్ని ఉపయోగిస్తున్నాడు. కాబట్టి పాలసీదారులకు అండగా నిలిచేలా ప్రభుత్వం తాము చెల్లిస్తున్న బీమా ప్రీమియంపై జీఎస్టీని మినహాయించాలనే ప్రతిపాదనలు ఉన్నాయి.ఇదీ చదవండి: ప్రపంచంలోనే అత్యంత బలమైన బ్రాండ్గతంలో జరిగిన పార్లమెంట్ సమావేశంలోనూ ప్రతిపక్ష నేతలు, నితిన్ గడ్కరీ వంటి పాలకపక్ష నేతలు ఆరోగ్య బీమా ప్రీమియంపై జీఎస్టీను తొలగించాలని ఆర్థికశాఖకు సిఫార్సు చేశారు. దాంతో త్వరలో జరగబోయే సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకుంటారనే ఊహాగానాలు వస్తున్నాయి. ప్రీమియంపై జీఎస్టీ మినహాయిస్తే బీమా కంపెనీలు మరింత ఎక్కువగా పాలసీలు జారీ చేసే అవకాశం ఉంది. దాంతో ఆయా కంపెనీల రెవెన్యూ పెరుగుతుందని మార్కెట్ భావిస్తోంది. ప్రస్తుతం ఆరోగ్య బీమా ప్రీమియంపై 18 శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నారు. ఇదిలాఉండగా, జీఎస్టీని పూర్తిగా మినహాయించకుండా కొన్ని షరతులతో పన్ను తగ్గించే అవకాశం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. -
ఎయిర్ ఇండియా ప్రీమియం ఎకానమీ క్లాస్
ముంబై: విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ప్రీమియం ఎకానమీ క్లాస్‌ను పరిచయం చేస్తోంది. దేశీయంగా ఎంపిక చేసిన రూట్లతోపాటు స్వల్ప దూర అంతర్జాతీయ మార్గాల్లో వచ్చే నెల నుంచి ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయని సంస్థ ప్రకటించింది.ప్రస్తుతం దేశీయంగా విస్తారా మాత్రమే ప్రీమియం ఎకానమీ క్లాస్ ప్రయాణాన్ని ఆఫర్ చేస్తోంది. ఎయిర్ ఇండియా ఏ320 నియో ఎయిర్‌క్రాఫ్ట్‌లో బిజినెస్ క్లాస్‌లో 8 సీట్లు, ప్రీమియం ఎకానమీ 24, ఎకానమీ విభాగంలో 132 సీట్లను కేటాయించింది.తొలుత ఢిల్లీ–బెంగళూరు–ఢిల్లీ, ఢిల్లీ–చండీఘఢ్–ఢిల్లీ రూట్లలో ప్రీమియం ఎకానమీ క్లాస్ అందుబాటులోకి వస్తుంది. వచ్చే ఏడాదిలో ఎయిర్ ఇండియా తన పూర్తి స్థాయి నారో-బాడీ ఫ్లీట్ కు త్రీ-క్లాస్ కాన్ఫిగరేషన్ ను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది.. -
ప్రీమియంను మరింత పెంచనున్న బీమా సంస్థలు
ఆరోగ్య బీమా రంగ సంస్థలు పాలసీదారులకు షాకివ్వబోతున్నాయి. గతేడాదిగా పాలసీ ప్రీమియంను దాదాపు 50 శాతం వరకు పెంచిన సంస్థలు..మరోసారి పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. బీమా నియంత్రణ మండలి ఐఆర్డీఏఐ తీసుకున్న కొన్ని నిర్ణయాలతో ప్రీమియం ఛార్జీలు పెంచకతప్పడం లేదని ఇండస్ట్రీ వర్గాలు వెల్లడించాయి.గడిచిన ఆర్థిక సంవత్సరంలో ప్రీమియం 25 శాతం నుంచి 50 శాతం వరకు పెరగగా..వచ్చే కొన్ని నెలల్లో మరో 10 శాతం నుంచి 15 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని లోకల్‌సర్కిల్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఈ సర్వేలో 11 వేల మంది పాల్గొన్నారు. వీరిలో 21 శాతం మంది ప్రీమియం 50 శాతం వరకు పెరిగినట్లు వెల్లడించగా..31 శాతం మంది 25-50 శాతం వరకు పెరిగాయని తెలిపారు.ప్రీమియం అధికమవడంతో సామాన్యులు ఆరోగ్య పాలసీ తీసుకోవడానికి ఆసక్తి చూపడంలేదు. 2022లో 62 శాతంగా ఉన్న పాలసీదారులు 2023లో 52 శాతానికి తగ్గారు. మరోవైపు, గత ఆర్థిక సంవత్సరంలో ఆరోగ్య బీమా కంపెనీలు రికార్డు స్థాయిలో లాభాలు పొందుతున్నాయి. వాటి సరాసరి వార్షిక వృద్ధిరేటు 20 శాతంగా నమోదవుతుంది. కరోనాతో ఆరోగ్య బీమా పాలసీలు తీసుకునే వారి సంఖ్య గణనీయంగా పెరిగినప్పటికీ, క్రమంగా తగ్గుతోంది. -
ఐదేళ్లు ప్రీమియం.. జీవితాంతం ఆదాయం
న్యూఢిల్లీ: జీవిత బీమా సంస్థ ఎల్ఐసీ ‘జీవన్ ఉత్సవ్’ పేరుతో ప్రత్యేక బీమా పథకాన్ని ఆవిష్కరింంది. ఇది నాన్ లింక్డ్ (ఈక్విటీయేతర), నాన్ పార్టిసిపేటింగ్, మనీ బ్యాక్ లైఫ్ ఇన్సూరెన్స్ పథకం. ఈ ప్లాన్‌లో నిర్ణీత కాలం తర్వాత నుం ఏటా 10 శాతం చొప్పున (సమ్ అష్యూర్డ్‌లో) వెనక్కి వస్తుంది. కనీస బీమా ర.5,00,000. గరిష్ట బీవ కవరేజీకి పరిమితి లేదు. 5–16 ఏళ్ల వరకు ప్రీమియం చెల్లింపుల కాలాన్ని ఎంపిక చేసుకోవచ్చు. గరిష్టంగా 65 ఏళ్ల వరకు ఈ పథకంలో చేరేందుకు అర్హులు. రెగ్యులర్ ఇన్కమ్ లేదా ఫ్లెక్సీ ఇన్కమ్లో ఒక ఆప్షన్ ఎంపిక చేసుకోవచ్చు. పాలసీ చెల్లింపుల కాలంలో మరణింనట్టయితే సమ్ అష్యూర్డ్‌కు తోడు, గ్యారంటీడ్ అడిషన్స్ కలిపి చెల్లిస్తారు. ప్రతి వెయ్యి రపాయలకు ఏటా ర.40 చొప్పున గ్యారంటీడ్ అడిషన్ లభిస్తుంది. ఇలా ప్రీమియం చెల్లింపుల కాలం వరకు ఏటా జమ అవుతుంది. ప్రీమియంను సకాలంలో చెల్లించడంలో విఫలమైతే గ్యారంటీడ్ అడిషన్స్‌ను దాని కింద సర్దుబాటు చేస్తారు. రెగ్యులర్ ఇన్కమ్ ఆప్షన్లో ప్రీమియం చెల్లింపుల కాల వ్యవధి ముగిసిన మూడేళ్లు లేదా ఆరేళ్ల తర్వాత నుం ఏటా 10% ఆదాయం లభిస్తుంది. ఉదాహరణకు 5 ఏళ్లు ఎంపిక చేసుకుంటే 8 ఏళ్లు లేదా 11వ ఏట నుంచి ఏటా 10% ఆదాయం అందుకోవచ్చు. పదేళ్ల ప్రీమియం చెల్లింపుల కాలం ఎంపిక చేసుకుంటే 13వ ఏట నుంచి ఆదాయం వస్తుంది. ఫ్లెక్సీ ఇన్కమ్ ఆప్షన్లోనూ ఏటా 10% ఆదాయం అందుకోవచ్చు. -
ఎల్ఐసీ పాలసీ దారులకు శుభవార్త!
లైఫ్ ఇండియా ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. ల్యాప్స్ అయిన పాలసీలను పునరుద్దరించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 1న ప్రారంభమైన ఈ క్యాంపెయిన్ అక్టోబర్ 31,2023 వరకు కొనసాగనుంది. పాలసీ ల్యాప్స్ ఎప్పుడు అవుతుంది? ఎల్ఐసీ పాలసీ హోల్డర్లు సాధారణ గడువు తేదీ లోపల ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అన్వేక కారణాల వల్ల గడువు తేదీలోగా చెల్లించకపోతే మరో 15 రోజుల నుంచి 30 రోజుల లోపు (గ్రేస్ పీరియడ్) కట్టే అవకాశం ఉంది. అప్పటికీ ప్రీమియం చెల్లించకపోతే పాలసీ రద్దవుతుంది. అయితే, పాలసీదారులకు భరోసా కల్పించేలా ల్యాప్స్ అయిన పాలసీల పునరుద్ధరణ కోసం, ఎల్ఐసీ ఎప్పటికప్పుడు ప్రత్యేక కార్యాక్రమాల్ని నిర్వహిస్తుంది. తాజాగా, ఎల్ఐసీ రీవైవల్ క్యాంపెయిన్ని అందుబాటులోకి తెచ్చింది. LIC's Special Revival Campaign - An opportunity for policyholders to revive their lapsed policies. To know more, contact your nearest LIC Branch/Agent or visit https://t.co/jbk4JUmIi9#LIC #SpecialRevivalCampaign pic.twitter.com/xHfZzyrMkD — LIC India Forever (@LICIndiaForever) September 26, 2023 ఖాతాదారులకు ప్రత్యేక రాయితీలు ఈ క్యాంపెయిన్‌లో పాలసీదారులు రద్దయిన పాలసీలను పునరుద్దరించుకోవచ్చు. ఉదాహరణకు పాలసీదారు లక్ష రూపాయిల ప్రీమియం చెల్లించాలంటే ఈ రీవైవల్ క్యాంపెయిన్‌లో 30 శాతం వరకు రాయితీ పొందవచ్చు. లేట్ ఫీ ఛార్జీల కింద రూ.3,000 రాయితీ పొందే అవకాశాన్ని ఎల్ఐసీ కల్పిస్తుంది. అదే ప్రీమియం రూ.లక్ష నుంచి రూ.3లక్షల వరకు చెల్లించాలంటే 30 శాతంతో అంటే రూ.3,500 వరకు రాయితీ పొందవచ్చు. ప్రీమియం 3లక్షలు చెల్లించాలంటే అదనపు ఛార్జీలలో 30 శాతం కన్సెషన్తో రూ.4,000 రాయితీని పొందవచ్చని ఎల్ఐసీ తెలిపింది. పాలసీ ల్యాప్స్ అయిందా? లేదా అని తెలుసుకోవాలంటే? ♦ ఎల్ఐసీ పోర్ట్‌ల్‌ను ఓపెన్ చేయాలి ♦ అందులో రిజిస్టర్ యూజర్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ♦ సంబంధిత వివరాల్ని ఎంటర్ చేసి లాగిన్ అవ్వొచ్చు. ♦ లాగిన్ తర్వాత పాలసీ స్టేటస్ క్లిక్ చేయాలి ♦ స్టేటస్ క్లిక్ చేస్తే మీ పాలసీ ల్యాప్స్ అయ్యిందా? లేదా అనేది తెలుసుకోవచ్చు -
స్పెషల్ఫీచర్తో డైసన్ హెడ్‌ఫోన్స్ వచ్చేశాయ్..యాపిల్‌కు కష్టమే!
Dyson Zone headphones: టెక్నాలజీ సంస్థ డైసన్ ఎట్టకేలకు తనప్రీమియం హెడ్ ఫోన్లను తీసుకొచ్చింది. తద్వారా ఆడియో విభాగంలోకి ప్రవేశించింది. డైసన్ జోన్ పేరుతో వాటిని లాంచ్ చేసింది. దాదాపు యాపిల్ ప్రీమియంహెడ్ఫోన్లు AirPods Max ధర లోనే డైసన్ నాయిస్ క్యాన్సిలింగ్ హెడ్‌ఫోన్స్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. 50 గంటల వరకు ప్లేబ్యాక్, 3 గంటల్లోనే 100 శాతం చార్జింగ్, యూఎస్బీ-సీ చార్జింగ్ సిస్టం, లిథియం అయాన్ బ్యాటరీలు, 11 మైక్రోఫోన్లు మొదలైన ప్రత్యేకతలు వీటిలో ఉన్నాయి. మైడైసన్ యాప్‌తో ఈ హెడ్‌ఫోన్స్‌ను నియంత్రించవచ్చు. స్వచ్ఛమైన గాలిని అందించే కార్బన్ ఫిల్టర్లను కూడా వీటికి అమర్చుకోవచ్చు. మోడల్‌ను బట్టి హెడ్‌ఫోన్స్ ధర రూ. 59,900 - రూ. 64,900 వరకు ఉంటుంది. (కష్టాల్లో కాఫీ డే: రూ.434 కోట్ల చెల్లింపుల వైఫల్యం) New Dyson Zone Absolute+ air purifying noise-cancelling headphones🎧 pic.twitter.com/XS7j3pbq7s — Milez (@MilezGrey) May 8, 2023 -
వీ గార్డ్ నుంచి ప్రీమియం బీఎల్డీసీ ఫ్యాన్లు
ముంబై: ప్రముఖ కన్జూమర్ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీ సంస్థ వీ–గార్డ్ ‘ఇన్సైట్ –జీ’ పేరుతో ప్రీమియం బీఎల్డీసీ ఫ్యాన్లు ఆవిష్కరించింది. వీటిలో ఆర్ఎంపీ 370 హై స్పీడ్ మోటార్ ఉంది. 5 స్టార్ రేటింగ్‌తో ఐదేళ్ల వారెంటీ కలిగి ఉన్నాయి. కనీసం 35 వాట్ల కంటే తక్కువ విద్యుత్‌ను వినియోగించుకుంటూ వార్షికంగా రూ.1518 ఆదా చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. డస్ట్ రిప్లెంట్ కోటింగ్, రివర్స్ మోడ్ ఆపరేషన్, వినియోగానికి అనుకూలమైన రిమోట్ కంట్రోల్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. బూస్ట్ మోడ్, బ్రీజ్ మోడ్, స్లీప్ మోడ్, స్టాండర్ మోడ్, కస్టమ్ మోడ్‌తో సహా పలు ఆపరేషన్ మోడ్‌లను కూడా అందిస్తుంది. భారతీయ గృహాలకు అనుగుణంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ ఫ్యాన్లు తయారు చేశామని కంపెనీ ఎండీ రామచంద్రన్ తెలిపారు. -
గడువు ముగియనున్న ఎల్ఐసీ సింగిల్ ప్రీమియం పాలసీ
ప్రముఖ బీమా సంస్థ లైఫ్ ఇన్య్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) కీలక సింగిల్ ప్రీమియం పాలసీ ‘ధన వృద్థి’ (LIC Dhan Vriddhi) గడువు సెప్టెంబర్ 30తో ముగియనుంది. ఆసక్తిఉన్నవారు గడువు లోపు దీన్ని కొనుగోలు చేసుకోవాలని ఆ సంస్థ తెలిపింది. గత జూన్‌లో ప్రారంభించిన ఈ ప్లాన్ పరిమిత ఆఫర్ గడువు ఈ నెలాఖరుతో ముగుస్తుందని వెల్లడించింది. మెరుగైన పొదుపుతో పాటు బీమా కవరేజీ కూడా కావాలనుకునే వారు ఈ పాలసీని తీసుకోవచ్చు. ధన వృద్థి పాలసీ ఆన్‌లైన్‌లోనూ లభ్యం అవుతుందని ఎల్ఐసీ పేర్కొంది. ఈ పాలసీ టెన్యూర్‌లో పాలసీదారు మరణిస్తే కుటుంబ సభ్యులకు ఆర్థికంగా సాయం అందిస్తుంది. మెచ్యూరిటీ సమయం ముగిసిన తర్వాత గ్యారంటీ రిటర్న్స్ అందజేస్తుంది. 32 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు వారు ఈ పాలసీ తీసుకోవచ్చు. -
ప్రీమియం హోటళ్లలో జోరుగా బుకింగ్‌లు
న్యూఢిల్లీ: ప్రీమియం హోటళ్లలో బుకింగ్‌లకు మంచి డిమాండ్ కనిపిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2023–24) అక్యుపెన్సీ రేషియో (భర్తీ రేటు) దశాబ్దం గరిష్ట స్థాయి అయిన 70–72 శాతానికి చేరుకుంటుందని, సగటు రూమ్ రేటు రూ.6,000–6,200 మధ్య ఉండొచ్చని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఆక్యుపెన్సీ రేటు 68–70 శాతం మధ్య ఉంది. ద్రవ్యోల్బణం అధిక స్థాయిలో ఉన్నప్పటికీ, వినియోగ సెంటిమెంట్ స్థిరంగా మెరుగుపడుతున్నట్టు తెలిపింది. కార్పొరేట్ల స్థిరమైన పనితీరు, దేశీ ప్రయాణికుల రద్దీ కరోనా ముందు నాటి స్థాయిని అధిగమించడం రవాణా, హోటల్ పరిశ్రమలకు డిమాండ్‌ను తీసుకొస్తున్నట్టు వివరించింది. ఈ మేరకు ఇక్రా ఓ నివేదికను విడుదల చేసింది. భారత హోటల్ పరిశ్రమ ఆదాయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 13–15 శాతం వృద్ధిని చూస్తుందని అంచనా వేసింది. ఒక రూమ్ నుంచి వచ్చే సగటు ఆదాయం ఇప్పటికీ 2007–08 నాటి గరిష్ట స్థాయితో పోలిస్తే 20–25 శాతం తక్కువగా ఉంటుందని పేర్కొంది. ఢిల్లీ, ముంబైలో ఎక్కువ డిమాండ్ ఢిల్లీ, ముంబై పట్టికలో ఎగువ భాగాన ఉన్నాయని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇక్కడి హోటళ్లలో ఆక్యుపెన్సీ రేషియో 75 శాతంగా ఉటుందని ఇక్రా వైస్ ప్రెసిడెంట్ వినుత ఎస్ తెలిపారు. ఇతర అన్ని పట్టణాల్లోనూ డిమాండ్ ఆరోగ్యకరంగా ఉంటుందని, బెంగళూరు, పుణెలో మాత్రం బలహీనంగా ఉండొచ్చన్నారు. ముఖ్యంగా జీ20 సమావేశాలు ఉండడం, ఆర్థిక వ్యవస్థ మెరుగుపడడంతో వ్యాపార సమావేశాల ఫలితంగా పట్టణాల్లో హోటళ్లకు డిమాండ్ ఉంటుందని ఇక్రా పేర్కొంది. అలాగే విహార యాత్రలు, సదస్సులు, ఎగ్జిబిషన్లు, వ్యాపార ప్రయాణాలు, విదేశీ ప్రయాణికుల రాక డిమాండ్‌కు సానుకూలిస్తాయని వివరించింది. మధ్యస్థాయి హోటళ్లలోనూ భర్తీ రేటు పుంజుకుంటున్నట్టు తెలిపింది. వీటిల్లోనూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మెరుగైన రేటు నమోదు కావచ్చని అంచనా వేసింది. డిమాండ్ పుంజుకోవడంతో గత 12–15 నెలల్లో వాయిదా పడిన ప్రాజెక్టులను ప్రారంభించడం, కొత్త ప్రాజెక్టుల ప్రారంభం ఉండొచ్చని పేర్కొంది. ప్రీమియం విభాగంలో కొత్త హోటళ్ల ప్రారంభం ఎంపిక చేసిన మార్కెట్లలోనే ఉండొచ్చని తెలిపింది. కొత్తగా రానున్న హోటళ్లలో ఎక్కువగా బెంగళూరు, ముంబై మార్కెట్ల నుంచే ఉంటాయని వెల్లడించింది. ‘‘కొత్త హోటల్ వసతుల సరఫరా ఏటా 3.5–4 శాతం కాంపౌండెడ్ వృద్ధి రేటు ప్రకారం ఉండొచ్చు. ప్రీమియం విభాగంలో దేశవ్యాప్తంగా 15,000–16,000 రూమ్‌ల లభ్యత పెరుగుతుంది’’అని ఇక్రా వివరించింది. -
నెలవారీ ప్రీమియంలలో హెల్త్ ఇన్సూరెన్స్.. రూ.1 కోటి వరకు బీమా కవరేజ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇప్పటి వరకు దేశంలో ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవాలంటే ఏడాది ప్రీమియం ఒకేసారి చెల్లించాల్సిందే. ఇక నుంచి సులభంగా నెల వాయిదాల్లో హెల్త్ పాలసీ తీసుకోవచ్చు. డిజిటల్ పేమెంట్స్ దిగ్గజం ఫోన్‌పే భారత్‌లో తొలిసారిగా ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇందుకోసం ఆరోగ్య బీమా సంస్థలతో ఫోన్‌పే ఇన్సూరెన్స్ బ్రోకింగ్ సర్వీసెస్ చేతులు కలిపింది. ‘రూ.1 కోటి వరకు బీమా కవరేజ్ ఉంది. ఎటువంటి పరిమితి లేకుండా ఆసుపత్రిలో గదిని ఎంచుకోవచ్చు. క్లెయిమ్ చేయనట్టయితే ఏడాదికి బేస్ కవర్ మొత్తం మీద ఏడింతల వరకు బోనస్ కవర్ పొందవచ్చు’ అని ఫోన్‌పే ప్రకటించింది. ఇదీ చదవండి ➤ IT Dept clarification on PAN: పనిచేయని పాన్ కార్డులపై ఐటీ శాఖ క్లారిఫికేషన్ ప్రస్తుతానికి ఫోన్‌పే వేదికగా కేర్ హెల్త్, నివా బూపా నెల వాయిదాల్లో ఆరోగ్య బీమా పాలసీలను ఆఫర్ చేస్తున్నాయి. కాగా, ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 56 లక్షలకుపైగా పాలసీలను విక్రయించినట్టు ఫోన్‌పే తెలిపింది. ఇక ఫోన్‌పే యూజర్ల సంఖ్య 47 కోట్లకుపైమాటే. -
ప్రీమియం రిసార్ట్స్ విభాగంలోకి ఓయో.. కొత్త బ్రాండ్ ఆవిష్కరణ
న్యూఢిల్లీ: హాస్పిటాలిటీ టెక్నాలజీ సంస్థ ఓయో తాజాగా ప్రీమియం రిసార్టులు, హోటల్స్ విభాగంలోకి ప్రవేశించింది. పాలెట్ పేరిట కొత్త బ్రాండ్‌ను ఆవిష్కరించింది. ప్రస్తుతానికి హైదరాబాద్‌తో పాటు ముంబై, చెన్నై తదితర నగరాల్లో 10 రిసార్టులతో ఈ బ్రాండును ప్రారంభించినట్లు సంస్థ చీఫ్ మర్చంట్ ఆఫీసర్ అనుజ్ తేజ్‌పాల్ తెలిపారు. రెండో త్రైమాసికంలో దీని కింద మరో 40 రిసార్టులను చేర్చుకోనున్నట్లు వివరించారు. ప్రస్తుతం పర్యాటకులు మరింత విలాసవంతమైన పర్యటనల వైపు మొగ్గు చూపుతున్న నేపథ్యంలో పాలెట్ బ్రాండుకు మంచి ఆదరణ లభించగలదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఓయోలో ప్రస్తుతం టౌన్హౌస్ ఓక్, ఓయో టౌన్హౌస్, కలెక్షన్ ఓ, క్యాపిటల్ ఓ పేరిట పలు బ్రాండ్స్ ఉన్నాయి. 2023 ఆఖరు నాటికి తమ ప్రీమియం పోర్ట్‌ఫోలియోలోకి మొత్తం 1,800 ప్రాపర్టీలను చేర్చుకోవాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. -
కొత్త పాలసీల ప్రీమియంలో కనిపించని వృద్ధి
ముంబై: జీవిత బీమా కంపెనీలు కొత్త పాలసీల ప్రీమియం రూపంలో జూన్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో రూ.73,005 కోట్లను సమకూర్చుకున్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో వచి్చన ప్రీమియం ఆదాయం రూ.73,674 కోట్లతో పోల్చి చూస్తే నికరంగా 0.9 శాతం మేర క్షీణించింది. జీవిత బీమా రంగంలోనే దిగ్గజ సంస్థ అయిన ఎల్ఐసీపై ఎక్కువ ప్రభావం పడింది. క్రితం ఏడాది జూన్ త్రైమాసికంలో జీవిత బీమా కంపెనీల నూతన పాలసీల ప్రీమియం ఆదాయం 40 శాతం వృద్ధి చెందడం గమనార్హం. జూన్ క్వార్టర్లో ఎల్ఐసీ న్యూ బిజినెస్ ప్రీమియం ఆదాయం 7 శాతం క్షీణించి రూ.44,837 కోట్లకు పరిమితమైంది.(ఎస్బీఐ ఖాతాదారులకు అదిరిపోయే వార్త!) ఇండివిడ్యువల్ (వ్యక్తుల) సింగిల్ ప్రీమియం ఆదాయం 1.4 శాతం తగ్గి రూ.4,568 కోట్లుగా ఉంది. కానీ, క్రితం ఏడాది ఇదే కాలంలో ఎల్ఐసీ ఈ విభాగంలో 38 శాతం ప్రీమియం ఆదాయ వృద్ధిని నమోదు చేసింది. ఇండివిడ్యువల్ నాన్ సింగిల్ ప్రీమియం ఆదాయం 6.6 శాతం తగ్గి రూ.5,871 కోట్లుగా ఉంది. గ్రూప్ సింగిల్ ప్రీమియం 7.4 శాతం తగ్గి రూ.33,465 కోట్లుగా నమోదైంది. జూన్ త్రైమాసికం చివరి నెలలో మాత్రం ఎల్ఐసీ తొలి ఏడాది ప్రీమియం ఆదాయంలో 18.3 శాతం వృద్ధిని చూపించింది. మే నెలలో 4.1 శాతం క్షీణతతో పోలిస్తే మెరుగైన పనితీరు చూపించింది. ఇక ప్రైవేటు జీవిత బీమా సంస్థలు అన్నింటి నూతన ప్రీమియం ఆదాయం జూన్ క్వార్టర్లో 10.6 శాతం పెరిగి రూ.28,168 కోట్లుగా నమోదైంది. (నిజంగా భయంకరమే..! రేణూ దేశాయ్ అద్భుతమైన పిక్స్ వైరల్!) -
మారుతి మరో సూపర్ కారు వచ్చేసింది..ధర, ఫీచర్ల వివరాలు
దేశీయ కార్ల దిగ్గజం మారుతి సుజుకి చెందిన మోస్ట్ ప్రీమియం కారు వచ్చేసింది. అదిరిపోయే ఫీచర్స్‌తో మల్టీ-పర్పస్ వెహికల్ ఇన్విక్టోను లాంచ్ చేసింది. ధరలు రూ. 24.79 లక్షల నుండి ప్రారంభం. మారుతి ఇన్విక్టో 2.0-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను హైబ్రిడ్ మోటార్‌తో జత చేసింది. ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్‌లను పొందిన తొలి మారుతీ కారు ఇన్విక్టో అని మారుతి సుజుకి ఇండియా తెలిపింది. భారతదేశంలో అత్యంత ఖరీదైన కారుగా భావిస్తున్న ఇన్విక్టో ప్రాథమికంగా గత సంవత్సరం విడుదల చేసిన టయోటా ఇన్నోవా హైక్రాస్ ఎమ్‌పివికి రీబ్యాడ్జ్ చేసిన వెర్షన్. 2016లో ప్రారంభమై 2019లో లాంఛన ప్రాయమైన మారుతి , టయోటా కిర్లోస్కర్ భాగస్వామ్యం తర్వాత ఇది సెకండ్ ప్రొడక్షన్. Zeta+ (7 సీటర్), Zeta+ (8 సీటర్) , Aplha+ (7 సీటర్)అనే మూడు వేరియంట్లలో వీటి ధర రూ. 24.79 లక్షల మొదలై టాప్ వేరియంట్ రూ. 28.42 లక్షల వరకు ఉంటుంది. మిడ్ వేరియంట్ ధర రూ. 24.84 లక్షలు. ఇది నెక్సా బ్లూ , మిస్టిక్ వైట్‌తో సహా నాలుగు రంగులలో అందుబాటులో ఉంటుంది. ఇది నెక్సా లైనప్‌లో ఎనిమిదోది . 2.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ హైబ్రిడ్ మోటార్ 172బిహెచ్పి పవర్, 188ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయవచ్చని అంచనా. ఇన్నోవా హైక్రాస్ ప్రీమియం ఫీచర్లతో లాంచ్ అయింది. హైక్రాస్‌తో పోలిస్తే, జేబీఎల్ సౌండ్ సిస్టమ్, సెకండ్ రో ఒట్టోమన్ సీట్లు తప్ప దాదాపు మిగిలిన ఫీచర్లున్నాయి. డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, పవర్-అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు కోసం మెమరీ సెట్టింగ్స్, 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. అలాగే పనోరమిక్ సన్‌రూఫ్, 7-అంగుళాల TFT MIDతో కూడిన సెమీ-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు , ఆరుఎయిర్ బాగ్స్, లెదర్ అప్హోల్స్టరీతో కూడా వస్తుంది. -
ఎల్ఐసీ కొత్త ప్లాన్.. జీవిత బీమా రక్షణతోపాటు పొదుపు కూడా
ముంబై: బీమా దిగ్గజం ఎల్ఐసీ కొత్తగా ‘ధన వృద్ధి’ పేరుతో క్లోజ్ ఎండెడ్ ప్లాన్‌ను ఆవిష్కరించింది. జూన్ 23 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఈ ప్లాన్‌ను విక్రయించనున్నట్టు ప్రకటించింది. ఇది నాన్ లింక్డ్ (ఈక్విటీతో సంబంధం లేని), నాన్ పార్టిసిపేటింగ్ ప్లాన్. పొదుపుతో కూడిన సింగిల్ ప్రీమియం ప్లాన్. జీవిత బీమా రక్షణతోపాటు పొదుపును ఆఫర్ చేస్తుంది. పాలసీదారు దురదృష్టవశాత్తూ మరణానికి గురైతే కుటుంబానికి పరిహారం అందిస్తుంది. గడువు ముగిసే వరకు జీవించి ఉంటే మెచ్యూరిటీ మొత్తం తిరిగి వస్తుంది. ఈ ప్లాన్‌లో రెండు రకాల బీమా ఆప్షన్లు ఉన్నాయి. మరణ పరిహారం చెల్లించే ప్రీమియానికి 1.25 రెట్లు లేదంటే పది రెట్లలో ఒకదాన్ని ఎంపిక చేసుకోవచ్చు. 10, 15, 18 ఏళ్ల కాల వ్యవధిపై తీసుకోవచ్చు. కనీసం రూ.1,25,000 బీమా నుంచి ఎంత మొత్తమైనా ఎంపిక చేసుకోవచ్చు. ప్రతి పాలసీ సంవత్సరం ముగిసిన తర్వాత గ్యారంటీడ్ అడిషన్స్ జమ అవుతాయి. ఈ గ్యారంటీడ్ అడిషన్ అనేది మొదటి ఆప్షన్లో ప్రతి రూ.1,000 సమ్ అష్యూర్డ్‌పై రూ.60–75 మధ్య, రెండో ఆప్షన్లో రూ.25–40 మధ్య ఉంటుంది. ఈ ప్లాన్‌లో మెచ్యూరిటీ లేదా మరణ పరిహారాన్ని కావాలంటే వాయిదాల పద్ధతిలోనూ తీసుకోవచ్చు. పాలసీపై రుణ సదుపాయం కూడా ఉంటుంది. -
రూ 456 కడితే రూ 2 లక్షల బెనిఫ్ట్..!
-
జియో ప్రీమియం డీజిల్.. అన్నింటి కంటే తక్కువ ధరకే!
Jio-bp premium diesel: ప్రపంచంలోనే అతిపెద్ద రిఫైనింగ్ కాంప్లెక్స్‌ను నడుపుతున్న భారతీయ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. రాష్ట్ర ఇంధన హోల్సేలర్ల కంటే తక్కువ ధరకే డీజిల్‌ను విక్రయిస్తోంది. ఇదీ చదవండి: SEBI on Adani: అదానీ గ్రూప్‌పై సెబీ కీలక వివరణ! సుప్రీం కోర్టుకు రిజాయిండర్ అఫిడవిట్ జియో-బీపీ (Jio-bp) ప్రీమియం డీజిల్‌ను తాజాగా ప్రారంభించింది. జియో-బీపీ అనేది రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, యూకేకి చెందిన బీపీ అనే ఇంధన సంస్థల జాయింట్ రిటైలింగ్ వెంచర్. జియో-బీపీ ప్రారంభించిన ఈ ప్రీమియం డీజిల్ ధర ఇతర ప్రభుత్వ రంగ ఇంధన సంస్థలు విక్రయస్తున్న సాధారణ డీజిల్ కంటే తక్కువగా ఉంది. భారతీయ వినియోగదారుల కోసం డీజిల్ ప్రమాణాలను పెంచడానికి యాక్టివ్ టెక్నాలజీతో కూడిన డీజిల్‌ను విడుదల చేస్తున్నట్లు జియో-బీపీ ప్రకటించింది. భారీగా ఇంధన ఆదా కొత్తగా లాంచ్ చేసిన డీజిల్ కంపెనీ నెట్వర్క్ పరిధిలోని అన్ని అవుట్లెట్లలోనూ అందుబాటులో ఉంటుందని, 4.3 శాతం మెరుగైన ఇంధన వ్యవస్థ కారణంగా ట్రక్కుల యజమానులకు ఒక్కో వాహనంపై సంవత్సరానికి రూ. 1.1 లక్షల వరకు ఆదా అవుతుందని జియో-బీపీ ఒక ప్రకటనలో తెలిపింది. ముంబైలోని జియో-బీపీ అవుట్‌లెట్‌లో కొత్త ప్రీమియం డీజిల్‌ను లీటర్‌కు రూ. 91.30కి విక్రయిస్తున్నారు. అయితే ఇక్కడ ఇతర ప్రభుత్వ రంగ పెట్రోల్ పంపుల వద్ద సాధారణ డీజిల్ ధర రూ. 92.28 ఉంది. ఇదీ చదవండి: Motorola Edge 40: మోటరోలా ఎడ్జ్ 40 లాంచ్‌కు రెడీ.. ఫీచర్లు, స్పెసిఫికేషన్లు భలే ఉన్నాయే! -
జియో సినిమా షాకిచ్చిందిగా: ప్రీమియం సబ్స్క్రిప్షన్ ప్లాన్ షురూ
సాక్షి, ముంబై: జియో సినిమా వినియోగదారులకు షాకిచ్చింది. ఊహించినట్టుగానే ఇప్పటిదాకా వినియోగదారులకు ఉచిత సబ్స్క్రిప్షన్లను అందిస్తున్న జియో సినిమా తాజాగా పెయిడ్ సబ్స్క్రిప్షన్ ప్లాన్‌ను ప్రకటించింది, దేశీయ మార్కెట్లో నెట్‌ఫ్లిక్స్ , డిస్నీ వంటి ప్రపంచ ప్రత్యర్థులతో పోరాడేందుకు ఉచిత కంటెంట్ మోడల్ నుండి వైదొలిగింది. (మైనర్ల పేరుతో మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు: నిబంధనలు మారాయి) దీని ప్రకారం జియో సినిమా ప్రీమియం సబ్స్క్రిప్షన్ ప్లాన్ సంవత్సరానికి రూ. 999గా ఉంది. ఇది ఏకకాలంలో నాలుగు పరికరాల్లో కూడా పని చేస్తుంది. ప్రీమియం సబ్స్క్రిప్షన్ సేవల ద్వారా HBO, మ్యాక్స్ ఒరిజినల్, Warner Bros ప్రత్యేకమైన కంటెంట్‌ను ఆస్వాదించవచ్చు. ప్రస్తుతానికి ఏడాది ప్లాన్ మాత్రమే అందుబాటులో ఉంది . త్వరలోనే నెలవారీ ప్లాన్లు ప్రారంభించనుందని తెలుస్తోంది. జియో సినిమా, ఆండ్రాయిడ్, ఐఓఎస్ రెండింటిలోనూ డౌన్లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంది. రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ నేతృత్వంలోని ప్లాట్‌పాం జియోసినిమా పేరుతో ఓటీటీలో కూడా దూసుకొచ్చింది.మొదట్లో టెలికాం సేవలను ఉచితంగా అందించిన జియో, ఆ తరువాత పెయిడ్ సేవలను మొదలు పెట్టింది. అచ్చంగా ఆలాగే జియో సినిమా మొదట తన సేవలను ఉచితంగానే కస్టమర్లకు అందించింది. ముఖ్యంగా FIFA వరల్డ్ కప్ , IPL 2023ని ఉచితంగా స్ట్రీమింగ్‌తో మరింత ఆదరణ పొందింది. (18 ఏళ్లకే లంబోర్ఘినీ కారు, 22 ఏళ్లకే రిటైర్మెంట్) కాగా జియో దెబ్బకు డిస్నీ ఏకంగా 84 లక్షల మంది సబ్స్క్రైబర్లను కోల్పోయింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో మొత్తం సబ్‌స్క్రైబర్ బేస్‌లో 2శాతం క్షీణతను నమోదు చేసింది. మరోవైపు ప్రత్యర్థులతో ధీటుగా కంటెంట్ అందించేందకు జియో సినిమా a వివిధ ప్రొడక్షన్ స్టూడియోలతో చర్చలు జరుపుతోందనీ, రాబోయే నెలల్లో డజన్ల కొద్దీ టీవీ షోలు, మూవీలను హిందీ , తదితర భాషలలో పరిచయం చేయాలని యోచిస్తోందని రాయిటర్స్ గత నెలలో నివేదించింది. -
లేస్ గౌర్మెట్ చిప్స్: పెప్సికో ఇండియా మార్కెటింగ్ డైరెక్టర్ శైలజా జోషి ఏమన్నారంటే!
పెప్సికో 2022లో లేస్ గౌర్మెట్‌తో ప్రీమియం పొటాటో చిప్స్లోకి ప్రవేశించింది.ఈ కేటగిరీలో వినియోగదారులు మరిన్ని ప్రీమియం అనుభవాల కోసం చూస్తున్నారంటున్నారు పెప్సి కో ఇండియా మార్కెటింగ్ డైరెక్టర్ శైలజా జోషి. కేటగిరీ ప్రీమియమైజేషన్ గురించి, రూ.20 రేంజ్లో అందించే కొత్త ప్లాన్..తదితర వివరాలు ఆమె మాటల్లోనే.. ఆగస్టు 2022లో లే గౌర్మెట్ను ప్రారంభించాం. వీటికి మంచి స్పందన వచ్చింది. వినియోగదారుల గురించి, అవుట్లెట్ల గురించి తెలుసుకున్నాము. స్పందన బాగుంది. జీవితంలో మంచి విషయాలను ఆస్వాదించేవారు గౌర్మెట్ను ఆనందిస్తారు. ఈ స్నాక్ అందించే అనుభూతులు మరింత ఆనందంగా ఉంటాయి. ప్రతీ ఒక్కరు చక్కటి స్నాక్స్‌తో ట్రీట్ చేసుకోవాలనుకుంటుంటారు. లేస్ గౌర్మెట్‌కు వచ్చిన విశేష ఆదరణ దృష్ట్యా దానిని మరింత విస్తరించాలని భావిస్తున్నాం. అందువల్ల, మరింత మందికి లేస్‌ను చేరువచేసే లక్క్ష్యంతో రూ.20 ప్యాకెట్లను విడుదల చేస్తున్నాము. రిటైల్, వినియోగదారుల దృక్కోణం నుండి ఈ ధర అంశం చాలా ముఖ్యమైనది. రూ.20 ప్యాక్‌లు త్వరలో మార్కెట్లో లభింస్తాయి. మరింత విస్తృతంగా పంపిణీ చేయనున్నాం. లేస్ కన్సూమర్తో పోలిస్తే గౌర్మెట్ కొనేవాళ్లు భిన్నమని మీరు భావిస్తున్నారా? ఈ తేడాను జనాభా పరంగా చూడలేం, అప్పటికప్పుడు పుట్టుకొచ్చే అవసరం లేదా సందర్భం కావొచ్చు. ఒక వినియోగదారు ఒక సారి లేస్‌ను తినాలనుకోవచ్చు, ఎందుకంటే అతను/ఆమె స్నేహితులతో సరదాగా గడపాలని కోరుకుంటారు, ఇదొక సంబరం, ఇలాంటి నోరూరించే చిరుతిళ్లతో స్నేహితుల భేటీ సరదాగా ఉంటుంది. వేరే మూడ్‌లో లేదా వేరే సందర్భంలో ఉన్న ఒకే రకమైన వినియోగదారులు లేస్ గౌర్మెట్‌కు కూడా వినియోగదారుగా ఉండవచ్చు. అలాగే, కోవిడ్ తర్వాత, ప్రజలు మరింత కొత్త రుచుల కోసం ఎలా వెతుకుతున్నారో కూడా మేము గమనించాము. లే యొక్క గౌర్మెట్‌తో, చాలా మంది వినియోగదారులు స్నాకింగ్లోకి రావడాన్ని మేము ఖచ్చితంగా చూస్తాము, ఎందుకంటే వారు స్నాకింగ్‌లో చక్కని అనుభవాన్ని కోరుకుంటారు. Q. Not just cooked, crafted. ఈ లైన్ వినగానే సైఫ్ అలీ ఖాన్, ఆయన రాజవంశం గుర్తుకొస్తుంది. అప్పుడు లేస్ ప్రోడక్ట్ ప్రమోషన్లో ఈ వ్యాక్యం వాడారు. ఇప్పుడదే వ్యాక్యాన్ని అలాగే సైఫ్‌ను మళ్లీ ఇప్పుడు ఎంపిక చేసుకున్నారు. ఎలా చూడవచ్చు? సైఫ్ అలీ ఖాన్‌తో మా అనుబంధం చాలా గొప్పది. ఆయనతో చేసిన ప్రయాణం అద్భుతం అందుకే లేస్ గౌర్మెట్ కోసం సైఫ్‌నే మళ్లీ ఎంచుకున్నాం. లేస్ గౌర్మెట్ చిప్స్ బ్రాండ్‌కు అతడే సరైన ఎంపిక. మంచి రుచి, క్రమబద్ధత కలిగిన ఉత్పత్తులకు ప్రాతినిధ్యం వహించారు కాబట్టి సైఫ్‌ను ఎంపిక చేసుకున్నాం. బ్రాండ్ అంబాసిడర్ అవసరం ఎందుకు వచ్చింది? పెప్సీకో కింద ఎన్నో బ్రాండ్లు, ప్రోడక్టులున్నాయి. సైఫ్ అంశాన్ని బ్రాండ్ అంబాసిడర్ అవసరంగా చూడకూడదు. మా బ్రాండ్ ఇమేజ్‌కు మరింత ప్రయోజనం లభిస్తుందని భావించినప్పుడు మేము బ్రాండ్ అంబాసిడర్లతో కలిసి పని చేస్తాము. అలాగే బ్రాండ్ , అంబాసిడర్ రెండూ పరస్పర సంబంధం కలిగి ఉండాలి, రెండూ కలిసి వెళ్లాలి. మా బ్రాండ్‌కు ఉన్న గుర్తింపు, చక్కటి రుచి గురించి ఆలోచిస్తున్నప్పుడు, సైఫ్ అలీ ఖాన్ చాలా విలువను జోడించగలడని మా నమ్మకం. గౌర్మెట్‌తో కలిసి సైఫ్ నడవడం వల్ల ఆ ప్రయాణం మరింత అద్భుతంగా కనిపిస్తుంది. బ్రాండ్ ఇమేజ్ మరింత ఉన్నతమవుతుంది. అసలు సైఫ్‌ను తీసుకురావడం వెనక మా ఆలోచన ఇదే. చాలా ప్రీమియం బ్రాండ్ల ధరలు రూ.100 వరకు ఉన్నాయి. వాటితో పోలిస్తే గౌర్మెట్ ధర చాలా తక్కువగా ఉంది. ఇది గౌర్మెట్‌కు ఎలా సహాయపడుతుంది? రూ.30, రూ.50ల ఉత్పత్తుల విభాగంలో మీ వాటా వాటా ఎంత? ప్రపంచవ్యాప్తంగా పొటాటో చిప్స్ విభాగంలో అగ్రగామిగా ఉన్నాము. ఒక ఉత్పత్తిని తీసుకొస్తున్నప్పుడు మా నైపుణ్యాన్ని, మా అభ్యాసాలను కేవలం భారతీయ మార్కెట్‌కు పరిమితం చేయాలనుకోవడం లేదు. మార్కెట్‌పై మాకు ఉన్న అవగాహన మాకు గౌర్మెట్ సెగ్మెంట్ ధరల గురించి స్పష్టమైన ఆలోచనన ఇచ్చింది. చాన్నాళ్లుగా మేము మార్కెట్లో ఉన్నాం.ఇది కూడా సత్పలితాలను ఇస్తున్నట్టు కనిపిస్తోంది. ఇక మార్కెట్లో ఉన్న రూ.30 ప్యాక్ ఉత్పత్తులు ఎక్కువగా సాంప్రదాయ వినియోగదారులు కొంటున్నారు. మా వాటా కూడా దీంట్లోనే ఎక్కువ. అలాగే రూ.50 ప్యాక్ ఉత్పత్తులకు ఇ-కామర్స్‌లో డిమాండ్ ఎక్కువ. లేస్ గౌర్మెట్ చిప్స్ మూడు ఫ్లేవర్లలో ఉన్నాయి. లైమ్ అండ్ క్రాక్డ్ పెప్పర్, థాయ్ స్వీట్ చిల్లీ మరియు వింటేజ్ చీజ్ & పెప్రికా. వీటిలో ఎక్కువ అమ్ముడవుతున్న ఫ్లేవర్ ఏది? మరిన్ని ఫ్లేవర్లు తెచ్చే ఆలోచన ఉందా? థాయ్ స్వీట్ చిల్లీకి మంచి స్పందన వచ్చింది. ఎక్కువ మంది ఏది ఇష్టపడితే అదే ఫ్లేవర్ అవుతుంది. నిజానికి మూడు ఫ్లేవర్ల అమ్మకాల మధ్య పెద్ద తేడా ఏమీ లేదు. మేము కూడా ఎక్కువ ఉత్పత్తులను ప్రయత్నించే దశలో ఉన్నాము. వినియోగదారుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇప్పటికైతే ఎక్కువ మందికి ఈ రుచులు చేరాలని, వినియోగదారుల సంఖ్య పెరగాలని భావిస్తున్నాం. మా దగ్గర మరిన్ని ఆలోచనలున్నాయి. మార్కెట్ అవసరాలను బట్టి ఎప్పటికప్పుడు వాటిని అభివృద్ధి చేస్తాం. ప్రస్తుతానికయితే ఈ మూడు ఫ్లేవర్లతో మా వ్యాపారాన్ని పెంచుతాం. -
ఎల్ఐసీ ప్రీమియంలో 17 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: బీమా రంగ దిగ్గజం, ప్రభుత్వరంగ ఎల్ఐసీ ప్రీమియం ఆదాయం గడిచిన ఆర్థిక సంవత్సరంలో (2022–23) 17 శాతం వృద్ధితో రూ.2.32 లక్షల కోట్లకు చేరింది. 2021–22 సంవత్సరానికి ప్రీమియం ఆదాయం రూ.1.99 లక్షల కోట్లుగా ఉంది. ప్రీమియం వసూలు పరంగా చూస్తే జీవిత బీమా మార్కెట్లో 2023 మార్చి నాటికి 62.58 మార్కెట్ వాటా కలిగి ఉన్నట్టు ఎల్ఐసీ తెలిపింది. లిస్టెడ్ జీవిత బీమా కంపెనీల్లో ప్రీమియం వృద్ధి పరంగా ఎల్ఐసీ రెండో స్థానంలో ఉంది. హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ 18.83 శాతం మేర ప్రీమియం ఆదాయంలో వృద్ధిని చూపించి మొదటి స్థానంలో ఉంటే, ఎస్బీఐ లైఫ్ ప్రీమియం ఆదాయం 16.22 శాతం పెరిగి మూడో స్థానంలో ఉంది. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రీమియం ఆదాయం 12.55 శాతం మేర పెరిగింది. ఎల్ఐసీకి సంబంధించి ఇండివిడ్యువల్ సింగిల్ ప్రీమియం పాలసీల ప్రీమియం ఆదాయం 3.30 శాతం పెరగ్గా, ఇండివిడ్యువల్ నాన్ సింగిల్ ప్రీమియం ఆదాయం 10 శాతం, గ్రూప్ సింగిల్ ప్రీమియం ఆదాయం 21.76 శాతం, చొప్పున పెరిగాయి. -
వ్యూ నుంచి ప్రీమియం ఫీచర్లతో టీవీలు
హైదరాబాద్: వ్యూ టెలివిజన్స్ 2023 ఎడిషన్ ప్రీమియం టీవీలను మార్కెట్లోకి విడుదల చేసింది. అధునాతన ఫీచర్లతో, బ్రైట్ డిస్ ప్లేతో, చక్కని సౌండ్ పరిజ్ఞానంతో, మంచి వీక్షణ అనుభవాన్నిస్తాయని సంస్థ ప్రకటించింది. 43 అంగుళాలు, 55 అంగుళాల సైజులో టీవీలను తీసుకొచ్చింది. (ఇదీ చదవండి: 7 నెలల పసికూన: దిగ్గజాలను ఢీకొంటోంది!) వీటిల్లో ఏప్లస్ గ్రేడ్ 400 నిట్స్ అధిక బ్రైట్‌నెస్‌తో కూడిన ఐపీఎస్ డిస్ప్లే ఉంటుందని తెలిపింది. గూగుట్ టీవీ ఓఎస్‌తో, 50 వాట్ ఇన్‌బిల్ట్ సౌండ్‌బార్‌తో వస్తుందని పేర్కొంది. 43 అంగుళాల ధర రూ.23,999, 55 అంగుళాల టీవీ ధర రూ.32,999. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, వూటీవీస్ డాట్ కామ్ స్టోర్ నుంచి కొనుగోలు చేసుకోవచ్చని కంపెనీ ప్రకటించింది. (జాక్ మా రిటర్న్స్: చిగురిస్తున్న కొత్త ఆశలు, షేర్లు జూమ్) -
ప్రీమియం హోటళ్లకు డిమాండ్
ముంబై: ప్రీమియం హోటళ్లకు డిమాండ్ సానుకూలంగా ఉన్నట్టు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదా యం 80 శాతం పెరుగుతుందని క్రిసిల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెలిపింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2023–24) 15–20 శాతం మేర ఆదాయం పెరగొచ్చని అంచనా వేసింది. విహార, కార్పొరేట్, సమావేశాలు, సదస్సులు, ఎగ్జిబిషన్లు, అంతర్జాతీయ ప్రయాణాలతో హోటళ్ల బుకింగ్‌లు అధికంగా ఉన్నాయని, ప్రమీఇయం హోటళ్లకు దశాబ్దంలోనే గరిష్ట అక్యుపెన్సీకి చేరుకున్నట్టు ఈ నివేదిక వెల్లడించింది. అధిక డిమాండ్, రూమ్ రేట్లు పెరగడం, ఉద్యోగుల క్రమబద్ధీకరణ ఇవన్నీ కలసి, ప్రస్తుత, వచ్చే ఆర్థిక సంవత్సరాల్లో ఆదాయ వృద్ధిని నడిపిస్తాయని తెలిపింది. సగటు రూమ్ ధరలు కరోనా ముందు నాటి స్థాయికి చేరాయని, ఆపరేటింగ్ మార్జిన్లు రికార్డు స్థాయికి చేరుకున్నాయని, రూమ్‌ల వారీ ఉద్యోగుల రేషియో తగ్గ డం ఇందుకు మద్దతుగా నిలుస్తోందని వివరించింది. రూమ్ ధరల పెరుగుదల ‘‘ప్రీమియం హోటళ్లలో సగటు రూమ్ ధరలు (ఏపీఆర్) 2021–22లో 13 శాతం పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 19–21 శాతం మేర పెరిగి దశాబ్ద గరిష్ట స్థాయి అయిన రూ.7,500– 10,000కు చేరాయి. అక్యుపెన్సీ (రూముల భర్తీ) 2021–22లో 50 శాతంగా ఉంటే, అది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దశాబ్ద గరిష్టమైన 67–72 శాతానికి ఎగిసింది’’అని క్రిసిల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ పుషన్ శర్మ తెలిపారు. అయితే, ప్రీమియం హోటళ్లకు డిమాండ్ పెరిగినప్పటికీ, విదేశీ పర్యాటకుల రాక కరోనా ముందు నాటి స్థాయికి ఇంకా చేరుకోలేదని ఈ నివేదిక పేర్కొంది. పర్యాటక శాఖ గణాంకాల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో 54 లక్షల మంది విదేశీ పర్యాటకులు భారత్‌ను సందర్శించడం గమనార్హం. కరోనా ముందున్న సంఖ్యతో పోలిస్తే ఇది 70 శాతమే. బడ్జెట్ హోటళ్లు.. బడ్జెట్ హోటళ్లలో సగటు రూమ్ ధరలు (ఏఆర్ఆర్) కరోనా ముందున్న నాటి కంటే 20 శాతం పెరిగినట్టు క్రిసిల్ నివేదిక తెలిపింది. ప్రీమియం హోటళ్ల వ్యాప్తంగా వృద్ధి రేటు ఒకే మాదిరిగా లేదని, విహార పర్యటనలకు సంబంధించి అక్యుపెన్సీ 70–75 శాతంగా ఉందని, అలా కాకుండా వ్యాపార పర్యటనల అక్యుపెన్సీ 65–70గా ఉన్నట్టు తెలిపింది. 2020–22 మధ్య హోటళ్లలో రూమ్ వారీ ఉద్యోగుల రేషియో 20–30 శాతానికి తగ్గినట్టు, డిమాండ్ పెరిగినప్పటికీ వ్యయాల సర్దుబాటును హోటళ్లు కొనసాగిస్తున్నట్టు పేర్కొంది. -
ఆఫ్‌లైన్‌లోనే ప్రీమియం ఎలక్ట్రానిక్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా 2022లో 15–16 కోట్ల స్మార్ట్‌ఫోన్స్ అమ్ముడయ్యాయి. ఇందులో ఆన్లైన్ వాటా ఏకంగా 53 శాతం కైవసం చేసుకుంది. ఆఫ్‌లైన్‌ను మించి ఆన్లైన్ విభాగం దూసుకెళ్తున్నప్పటికీ ఎలక్ట్రానిక్స్ కంపెనీలు 2023లో ఎక్స్‌పీరియెన్స్ జోన్స్, స్టోర్ల ఏర్పాటుపై ఫోకస్ చేశాయి. ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులకు డిమాండ్ మందగించడంతో తయారీ సంస్థలు ప్రీమియం ఉపకరణాలపై దృష్టిసారించాయి. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని అధిక సామర్థ్యం, వినూత్న సాంకేతికతతో తయారైన ప్రొడక్ట్స్‌కు డిమాండ్ పెరిగిందని ఎల్జీ చెబుతోంది. కొనుగోలు నిర్ణయాలు తీసుకునే ముందు వినియోగదారులు ఇలాంటి ప్రీమియం ఉత్పత్తులను స్వయంగా పరీక్షించి, అనుభూతి చెందాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎక్స్‌పీరియెన్స్ జోన్స్, ఔట్లెట్స్ ఏర్పాటు తప్పనిసరి అని కంపెనీలు నిర్ణయానికి వచ్చాయి. స్మార్ట్‌ఫోన్స్, స్మార్ట్ ఉపకరణాల తయారీతోపాటు కంజ్యూమర్ ఎలక్ట్రానిక్స్ రంగంలో ఉన్న సంస్థలు ఆఫ్‌లైన్‌లో విస్తరణకు వరుస కట్టాయి. ఒకదాని వెంట ఒకటి.. దక్షిణ కొరియాకు చెందిన శామ్సంగ్ ప్రీమియం ఉపకరణాలను ప్రదర్శించేందుకు అతిపెద్ద ఎక్స్‌పీరియెన్స్ కేంద్రాన్ని గత నెలలో న్యూఢిల్లీలో ప్రారంభించింది. అలాగే బెంగళూరులోని శామ్సంగ్ ఓపెరా హౌజ్ స్టోర్‌లో కొత్త గేమింగ్, స్మార్ట్ హోమ్ ఎక్స్‌పీరియెన్స్ జోన్‌ను ఏర్పాటు చేసింది. పర్సనల్ కంప్యూటర్ల తయారీ దిగ్గజం హెచ్‌పీ ఈ నెలలోనే ఏడు ప్రధాన నగరాల్లో గేమింగ్ స్టోర్స్‌ను తెరిచింది. పీసీలు, యాక్సెసరీస్ అందుబాటులో ఉంచడమేగాక కస్టమర్లు గేమ్స్ ఆడుకోవడానికి ఇక్కడ ఏర్పాట్లు ఉన్నాయి. 2023లో ఇటువంటివి 40 కేంద్రాలు తెరవాలన్నది హెచ్‌పీ ఆలోచన. వన్‌ప్లస్, ఆసస్, రియల్మీ సైతం ఔట్లెట్లను స్థాపించాలని భావిస్తున్నాయి. మూడవ ఎక్స్‌పీరియెన్స్ కేంద్రాన్ని గత నెల ఢిల్లీలో ఆసస్ ప్రారంభించింది. ఈ ఏడాది తొలి అర్ధ భాగంలో యాపిల్ స్టోర్లు ప్రారంభం అయ్యే చాన్స్ ఉంది. ప్రీమియం వైపునకు మార్కెట్.. దేశంలో ప్రీమియం స్మార్ట్‌ఫోన్స్, టీవీలు, రిఫ్రిజిరేటర్స్, వాటర్ ప్యూరిఫయర్స్ అమ్మకాలు 2022లో విలువ పరంగా తొమ్మిది రెట్లు మెరుగ్గా నమోదయ్యాయి. ధరలు దూసుకెళ్తున్నప్పటికీ ఉన్నత మధ్య తరగతి, సంపన్న వర్గాలు ఖరీదైన ఉత్పత్తుల కొనుగోళ్లు కొనసాగిస్తున్నారు. విలువ పరంగా గతేడాది స్మార్ట్ఫోన్ల అమ్మకాల్లో 35 శాతం వృద్ధి నమోదైంది. రూ.30 వేలు ఆపైన ఖరీదు చేసే స్మార్ట్ఫోన్ల మొత్తం విక్రయాలు ఏకంగా 94 శాతం వృద్ధి సాధించాయి. టీవీ పరిశ్రమ 11 శాతం వృద్ధి చెందితే.. 55 అంగుళాలు, ఆపైన సైజులో ఉండే ప్రీమియం టీవీ మోడళ్లు 95 శాతం ఎగశాయి. రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, ఎయిర్ కండీషనర్ల అమ్మకాలు 29 శాతం పెరిగాయి. ప్రీమియం విభాగంలో ఇవి 45 శాతం అధికం అవడం విశేషం. ప్రీమియం విభాగం పరిశ్రమ వృద్ధిని నడిపిస్తోందని ఎల్జీ ఇండియా వైస్ ప్రెసిడెంట్ దీపక్ బన్సాల్ తెలిపారు. (ఇదీ చదవండి: హైడ్రోజన్‌తో నడిచే బస్.. త్వరలో భారత్ రోడ్ల పైకి) -
లగ్జరీ ఫీచర్లతో ఆడి క్యూ3 స్పోర్ట్‌బ్యాక్: బుకింగ్స్ షురూ!
ముంబై: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ ‘ఆడి’ తన నూతన స్పోర్ట్‌బ్యాక్ కారు ‘ఆడిక్యూ3’ స్పోర్ట్‌బ్యాక్ బుకింగ్‌లను మంగళవారం ప్రారంభించింది. రూ.2 లక్షలతో బుకింగ్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. 2.0లీటర్ల టీఎఫ్ఎస్ఐ పెట్రోల్ ఇంజన్‌తో ఈ కారు ఉంటుంది. మంచి పనితీరు, అద్భుతమైన డిజైన్‌తో రోజువారీ వినియోగానికి కారు కోరుకునే వారు ఆడిక్యూ3 స్పోర్ట్‌బ్యాక్‌ను ఎంతో ఇష్టపడతారని ఆడి ఇండియా హెడ్ బల్బీర్‌సింగ్ దిల్లాన్ పేర్కొన్నారు. 2022లో భారత్‌లో 27 శాతం మేర విక్రయాల వృద్ధిని నమోదు చేశామని, 2023లోనూ విక్రయాలు ఇదే విధంగా ఉండొచ్చన్నారు. -
ఇన్సూరెన్స్ కంపెనీలకు షాకిచ్చిన నిర్మలాజీ, రూ. 5 లక్షలు దాటితే బాదుడే!
సాక్షి,ముంబై: యూనియన్ బడ్జెట్లో వేతన జీవులకు, పన్ను చెల్లింపు దారులకు ఊరట కల్పించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన బీమా కంపెనీలకు మాత్రం భారీ షాక్ఇచ్చింది. ఆదాయంపై పన్ను మినహాయింపులను పరిమితం చేయాలని ప్రతిపాదించారు. దీంతో బీమా కంపెనీలకు డిమాండ్ తగ్గపోతుందనే ఆందోళన ఇన్వెస్టర్లను అమ్మకాలవైపు మళ్లించింది. దీంతో బుధవారం నాటి మార్కెట్లో బీమా కంపెనీల షేర్లు భారీగా పతనమైనాయి. సాంప్రదాయ బీమా ప్లాన్లపై పన్ను బాదుడుకు సీతారామన్ ప్రతిపాదించారు.పాలసీల మొత్తం ప్రీమియం ఏడాదికి 5 లక్షల రూపాయల కంటే ఎక్కువగా ఉంటే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఏప్రిల్ 1, 2023న లేదా ఆ తర్వాత జారీ చేసే జీవిత బీమా పాలసీల మెచ్యూరిటీపై (ULIPలు మినహాయించి) మొత్తం రాబడిపై పన్ను విధించాలని పేర్కొన్నారు. ప్రీమియం మొత్తం రూ. 5 లక్షల కంటే ఎక్కువగా ఉంటే, మొత్తం ప్రీమియం ఉన్న పాలసీల నుండి మాత్రమే ఆదాయం పొందాలని ప్రతిపాదించారు. దీని ప్రకారం అంటే రూ. 5 లక్షలవరకు, 31 మార్చి, 2023 వరకు జారీ చేయబడిన బీమా పాలసీలను కూడా ప్రభావితం చేయదు. అలాగే బీమా చేయబడిన వ్యక్తి మరణించినప్పుడు పొందే మొత్తానికి అందించే పన్ను మినహాయింపులో ఎలాంటి మార్పు ఉండదు. కొత్త ప్రతిపాదన యూనిట్-లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్లపై పన్నును ప్రభావితం చేయదు. ఈ ప్రకటన ఫలితంగా హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కో, లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ ఇండియా, జనరల్ ఇన్సూరెన్స్ కార్ప్, మ్యాక్స్ ఫైనాన్షియల్ 4.5 -11శాతం మధ్య నష్టపోయాయి. అయితే, ఇది అధిక విలువ కలిగిన సాంప్రదాయ బీమాలను కొనుగోలు చేయడానికి వ్యక్తుల ఆసక్తిని తగ్గించి, ఇది టర్మ్ ప్లాన్లు, రిస్క్ కవర్లపై దృష్టిని పెరగడమే మంచి పరిణామమే అయినప్పటికీ పూర్తిగా పెట్టుబడి ఆధారిత యూనిట్ లింక్ ఇన్సూరెన్స్‌ల వైపు గణనీయమైన మార్పుకు దారితీస్తే ఆందోళనకరమని సెక్యూర్‌నౌ ఇన్సూరెన్స్ బ్రోకర్ సహ వ్యవస్థాపకుడు కపిల్ మెహతా చెప్పారు. అంటే, ఎండోమెంట్ ప్లాన్లు, మనీ బ్యాక్ ప్లాన్లు వంటి సాంప్రదాయ బీమా ప్లాన్లపై పాలసీదారుల ఇంట్రస్ట్ తగ్గిపోతుందన్నారు. అంతిమంగా ఇది బీమా కంపెనీలకు నష్టమని భావిస్తున్నారు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5371520960.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
రిజిస్ట్రేషన్లూ ఆన్లైన్లోనే.. కర్నూలుకు ప్రీమియం రిజిస్ట్రేషన్ సెంటర్
ఆస్తుల క్రయ, విక్రయాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఓ పెద్ద ప్రహసనం. అడుగడుగునా అవినీతి. డాక్యుమెంట్ రైటర్లు, మధ్యవర్తుల ప్రమేయమూ ఎక్కువే. వీటన్నింటికీ చెక్ పెడుతూ ప్రజలకు సులభంగా.. అత్యాధునిక పద్ధతుల్లో రిజిస్ట్రేషన్ సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అందులో భాగంగా ప్రీమియం రిరిజిస్ట్రేషన్ సర్వీసు సెంటర్లను అందుబాటులోకి తెస్తోంది. వినియోగదారులకు ఎటువంటి ఆటంకాలు కలుగకుండా పాసుపోర్టు సేవా కేంద్రాల తరహాలో కార్పొరేట్ స్థాయి హంగులతో సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. సాక్షి, కర్నూలు(సెంట్రల్): రాష్ట్రంలో మొత్తం 9 ప్రీమియం రిజిస్ట్రేషన్ సెంటర్లను ఏర్పాటు చేయాలని రిజిస్ట్రేషన్ అండ్‌స్టాంప్స్ శాఖ నిర్ణయించింది. ఇందులో విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయవాడ, గుంటూరు, కాకినాడ, నెల్లూరు, తిరుపతి, కర్నూలు, వైఎస్సార్ కడప జిల్లాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పైలట్ ప్రాజెక్టుగా మొదట విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో ప్రీమియం రిజస్ట్రేషన్ సెంటర్లను ఏర్పాటు చేశారు. అక్కడ సేవలు విజయవంతం కావడంతో మిగిలిన ఏడు చోట్ల ప్రీమి యం రిజిస్ట్రేషన్ సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అందులో భాగంగా కర్నూలులో ప్రీమియం రిజిస్ట్రేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దీంతో రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ అధికారులు కర్నూలు నగరంలో ప్రజలకు అనువైన ప్రాంతం, 1,000 చదరపు అడుగుల భవనం కోసం అన్వేషణ చేస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే జనవరి నుంచి ప్రీమియం రిజిస్ట్రేషన్ సెంటర్‌ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్లు.. ప్రీమియం రిజిస్ట్రేషన్ సెంటర్ ఫ్రంట్ ఎండ్‌లో అవుట్సోర్సింగ్ సిబ్బంది, డేటా ఎంట్రీ అపరేటర్లు ఉంటారు. బ్యాక్ ఎండ్‌లో సబ్ రిజిస్ట్రార్, ఇతర సిబ్బంది ఉండి పనిచేస్తారు. మొదట కొద్ది రోజులు ఆఫ్‌లైన్ సేవలు అందించినా.. తర్వాత అన్ని ఆన్లైన్ సేవలే ప్రజలకు అందుబాటులో ఉండేలా రూపకల్పన చేశారు. అంతేకాక ఆన్లైన్లో స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని ప్రకారం సెంటర్‌కు వెళ్లి సింగిల్‌విండో కింద రిక్వెస్టు పెడితే ఆన్లైన్లో సంబంధిత సేవా ప్రక్రియ మొదలవుతుంది. వినయోగదారులే తమ సమాచారాన్ని నమోదు చేసుకోవచ్చు. అప్పుడు ఆన్లైన్లోనే సబ్ రిజిస్ట్రార్‌కి వెళ్తుంది. సబ్ రిజిస్ట్రార్ పరిశీలించి ఆధార్ వెరిఫికేషన్ చేస్తారు. అనంతరం ఆస్తుల వివరాలను పరిశీలించి సక్రమంగా ఉంటే రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేస్తారు. ఇక్కడ డాక్యుమెంట్ రైటర్ల ప్రమేయం ఏ మాత్రం ఉండదు. రిజిస్ట్రేషన్ అయిన వెంటనే చేయించుకున్న వారికి పూర్తయినట్లు మెస్సేజ్ వెళ్తుంది. రిజిస్ట్రేషన్లు, మార్కెట్ విలువ మదింపు, ఈసీలు, సీసీలు, స్టాంపుల అమ్మకాలన్నీ ఇక్కడే జరుగుతాయి. అవినీతికి తావుండదు అవినీతి రహిత రిజిస్ట్రేషన్ సేవలు అందించడమే ప్రీమియం సెంటర్ల ముఖ్య ఉద్దేశం. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సులభంగా రిజిస్ట్రేషన్ సేవలు అందుతాయి. మధ్యవర్తుల ప్రమేయం ఉండదు. – కల్యాణి, డీఐజీ, రిజిస్ట్రేషన్ అండ్‌స్టాంప్స్ -
ఎల్ఐసీ పాలసీ దారులకు ముఖ్య గమనిక
ప్రముఖ లైఫ్ ఇన్స్యూరెన్స్ ఇండియా కార్పొరేషన్ (ఎల్ఐసీ) జీవర్ అమర్, టెక్ టర్మ్ పాలసీలను విరమించుకుంటున్నట్లు ప్రకటించింది. నవంబర్ 23 నుంచి ఆ రెండు పాలసీలు వినియోగంలో ఉండవని ఎల్ఐసీ విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. ఎల్ఐసీ 2019 ఆగస్ట్‌లో జీవన్ అమర్ ప్లాన్‌ను, అదే ఏడాది సెప్టెంబర్‌లో ఎల్ఐసీ టెక్ టర్మ్ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది.అయితే తాజాగా ఆ ప్లాన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు ఎల్ఐసీ పేర్కొంది. అందుకు కారణం రీ ఇన్స్యూరెన్స్ ప్రీమియం ధరలు పెరగడమే కారణమని తెలుస్తోంది. కాగా, త్వరలో ఆ రెండు పాలసీలను మార్పులు చేసి మళ్లీ అందుబాటులోకి తెస్తామని సంస్థ చెబుతోంది. అర్హతలు 10 నుంచి 40 సంవత్సరాల కాలపరిమితితో పాలసీ దారుడు ఎల్ఐసీ జీవన్ అమర్ ప్లాన్‌ను కనీసం రూ.25 లక్షలు, ఎల్ఐసీ టెక్ టర్మ్ ప్లాన్ కనీసం రూ. 50 లక్షలు హామీ మొత్తంతో కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ రెండు ప్లాన్లలో పాలసీ కట్టే సమయంలో పాలసీదారుడు మరణిస్తే హామీ మొత్తాన్ని నామినీకి అందుతుంది. ప్లాన్ తీసుకొని ఉంటే పాలసీదారులు ఇప్పటికే ఈ రెండు ప్లాన్లను కొనుగోలు చేస్తే.. ఆ పాలసీలు అలాగే కొనసాగుతాయని ఎల్ఐసీ ప్రతనిధులు తెలిపారు. కొత్తగా పాలసీ తీసుకునేవారికి మాత్రం అందుబాటులో ఉండవు. -
బ్యాంక్ ఆఫ్ బరోడా కొత్త డెబిట్ కార్డులు: రివార్డులు, ఆఫర్లు
హైదరాబాద్: ప్రభుత్వరంగ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ), వీసా భాగస్వామ్యంతో తన ఖాతాదారుల కోసం కొత్తగా రెండు ప్రీమియం డెబిట్ కార్డులను విడుదల చేసింది. ‘బీవోబీ వరల్డ్ ఒపులెన్స్’అన్నది సూపర్ ప్రీమియం వీసా ఇన్ఫినైట్ డెబిట్ కార్డు కాగా, మరొకటి, ‘బీవోబీ వరల్డ్ సాఫైర్’. క్రెడిట్ కార్డుల మాదిరే వీటిపై రివార్డులు, ప్రయోజనాలను ఆఫర్ చేస్తోంది. (Elon Musk సంచలనం: పరాగ్ అగర్వాల్‌కు మరో షాక్!) బోవోబీ వరల్డ్ ఒపులెన్స్ వీసా ఇన్ఫినైట్ కార్డుపై కాంప్లిమెంటరీ ఎయిర్పోర్ట్ పికప్, డ్రాప్ సేవ, అపరిమితంగా ఇంటర్నేషనల్, డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంజ్ సందర్శనలు, క్లబ్ మారియట్ సభ్యత్వం, హెల్త్, వెల్నెస్, డైనింగ్ ప్రయోజనాలను అందిస్తోంది. ఆరంభంలో జాయినింగ్ ఫీజు కింద రూ.9,500, ఆ తర్వాత ఏటా రూ.9,500 కస్టమర్లు ఈ కార్డు కోసం చెల్లించుకోవాలి. ఇలాంటి ప్రయోజనాలే కలిగిన బీవోబీ వరల్డ్ సాఫైర్ జాయినింగ్ ఫీజు రూ.750. ఏటా రూ.750 ఫీజు ఉంటుంది. -
యూజర్లకు బంపరాఫర్.. రూ.10కే మూడు నెలల సబ్స్క్రిప్షన్!
యూట్యూబ్(Youtube).. అటు ఆన్లైన్ ఇటు ఆఫ్‌లైన్ ఎక్కడ విన్నా ఈ పేరే వినపడుతోంది. విభిన్నమైన కంటెంట్లతో పాటు తమలోని టాలెంట్‌ని ప్రదర్శించేందుకు అనువైన వేదికగా మారింది యూట్యూబ్. అందుకే పిల్లలు, టీనేజర్లు అనే తేడాలు లేకుండా అన్ని వర్గాల ప్రజలను తన వైపు తిప్పుకున్న అతిపెద్ద వీడియో ప్లాట్‌ఫాంగా అవతరించింది. ప్రస్తుతం ఈ ప్రముఖ సంస్థ తన యూజర్ల కోసం వెల్కమ్ ప్రోగ్రామ్‌ను అందిస్తోంది. అది కూడా కేవలం పది రూపాయలకే యూట్యూబ్ ప్రీమియం మూడు నెలల సబ్‌స్క్రిప్షన్‌ను ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఆఫర్ ఎంతకాలం అందుబాటులో ఉంటుందో కంపెనీ వెల్లడించలేదు. దీంతో ఈ ఆఫర్ పరిమిత కాలానికి మాత్రమే అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. రూ.10కే మూడు నెలల సబ్స్క్రిప్షన్ యూట్యూబ్‌లో మనకి కావాల్సిన వీడియోలను వీటితో పాటు పలు సర్వీస్‌లు కూడా ఉచితంగా చూసే వెసలుబాటు కల్పిస్తోంది. కానీ యూట్యూబ్ ప్రీమియం (YouTube Premium) అనేది సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే నగదు చెల్లిస్తేనే ఈ సేవలను పొందగలం. ఇందులో యాడ్-ఫ్రీ వీడియో ఎక్స్ ఫీరియన్స్, వీడియోలను డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీడియోలను ఆఫ్‌లైన్‌లో ప్లే చేయడం, బ్యాక్‌గ్రౌండ్‌లో వీడియోలను ప్లే చేయడం, YouTube Musicకు మెంబర్షిప్ వంటి అనేక ఇతర ఫీచర్లను YouTube Kids యాప్‌పై అందిస్తుంది. ప్రస్తుతం యూట్యూబ్ ప్రకటించిన ఆఫర్ ప్రకారం ఈ సేవలన్నీ కేవలం పది రూపాయలకే మూడు నెలల పాటు పొందచ్చు. అయితే ఇక్కడ గమనించాల్సిన ఇంకో విషయం ఏమిటంటే, YouTube తీసుకొచ్చిన ఈ ఆఫర్ మొదటిసారిగా యూట్యూబ్ రెడ్ (YouTube Red), మ్యూజిక్ ప్రీమియం (Music Premium), యూట్యూబ్ ప్రీమియం (YouTube Premium), గూగుల్ ప్లే (Google Play) సబ్స్క్రైబర్లకు మాత్రమే చెల్లుబాటు అవుతుందని పేర్కొంది. ఈ ఆఫర్ కాలం పూర్తయిన తర్వాత యూట్యూబ్ ప్రీమియం ఫీచర్లను పొందాలంటే నెలకు రూ.129 చెల్లించాలి. మరో విషయం ఏమిటంటే రూ.10 ఆఫర్ ముగియడానికి 7 రోజుల ముందు సబ్‌స్క్రైబర్‌కు YouTube గుర్తుచేస్తుంది, తద్వారా వారు సభ్యత్వాన్ని కొనసాగిస్తారా లేదా నిలిపివేస్తారా అనేది వారే నిర్ణయించుకోవచ్చు. చదవండి: భారత్‌లో తొలిసారి, కొత్త వాషింగ్ మెషీన్ వచ్చిందోచ్.. నోటితో చెప్తే ఉతికేస్తుంది! -
ఇదో రకం బాదుడు, యూట్యూబ్ తరహాలో వాట్సాప్ ప్రీమియం సర్వీస్.. పైసలు కట్టాల్సిందే!
వాట్సాప్‌లో(WhatsApp) కూడా యూట్యూబ్ తరహాలో త్వరలో ప్రీమియం అకౌంట్ సర్వీసును అందించనుంది. అంటే ఈ ప్రత్యేక సర్వీస్‌ను పొందాలంటే సబ్స్క్రిప్షన్ తప్పనిసరి చేయనుంది. ప్రస్తుతం పలువురు బీటా వినియోగదారులతో ఈ కొత్త వెర్షన్‌ను టెస్ట్ చేస్తోంది. ఈ కొత్త సర్వీస్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకునే వాళ్లకు ప్రీమియం మెనూ, అదనపు ఫీచర్లుంటాయని తెలిపింది. అయితే సాధారణ యూజర్లు కంగారుపడాల్సిన అవసరం లేదని ఈ కొత్త WhatsApp ప్రీమియం సబ్స్క్రిప్షన్ కేవలం వాట్సాప్ బిజినెస్ వెర్షన్ కోసం విడుదల చేయనున్నట్లు తెలిపింది. వాళ్ల కోసమే ప్రీమియం సర్వీస్ కొత్తగా రాబోతోన్న ఈ సర్వీస్‌లో ప్రత్యేక నేమ్‌తో వాట్సాప్ కాంటాక్ట్ లిస్టునూ క్రియేట్ చేసుకుని అందరికీ షేర్ చేసుకోవచ్చు. అంతేకాక ఏకకాలంలో 10 డివైజ్‌లలో లాగిన్ అయ్యే ఆప్షన్ కూడా ఉంటుంది. ప్రీమియం వెర్షన్లో 32 మందితో వీడియో కాల్ మాట్లాడవచ్చ. వీటికి ఎంత వరకు ఛార్జ్ చేస్తారు అనేది తెలియాల్సి ఉంది. కాగా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫాంల ద్వారా మెటా ఇప్పటికే చాలా ఆదాయాన్ని పొందుతుంది. ఎలాంటి ప్రకటనలు లేదా సబ్స్క్రిప్షన్ ప్లాన్లు వంటి ఆదాయ వనరులు లేకుండా సంస్థ కస్టమర్లకు ఉచితంగా అందిస్తున్న ఏకైక సేవ WhatsApp మాత్రమే. అందుకే దీని నుంచి కూడా ఆదాయాన్ని ఆర్జించాలని సంస్థ భావిస్తోంది. అందుకోసమే నిర్దిష్ట వ్యాపారాల కోసం ప్రీమియం సబ్స్క్రిప్షన్ ప్లాన్లను తీసుకురాబోతందని తెలిపింది. వాట్సాప్‌లో కొత్తగా రాబోతున్న ప్రీమియం వర్షన్ ఐచ్ఛికం మాత్రమేనని తప్పనిసరిగా సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదని కంపెనీ వెల్లడించింది. చదవండి: టాటా టియాగో ఈవీకి రెస్పాన్స్ అదిరింది.. రికార్డ్ బుకింగ్స్‌తో షాకైన కంపెనీ! -
యూజర్లకు భారీ షాకిచ్చిన యూట్యూబ్.. డబ్బులు చెల్లించాల్సిందేనా!
యూట్యూబ్ ఈ పేరుకి పరిచయం అక్కర్లేదు. యువతతో పాటు అన్ని వర్గాల ప్రజలను తన వైపు తిప్పుకుని అతిపెద్ద వీడియో ప్లాట్‌ఫాంగా అవతరించింది యూట్యూబ్. ప్రస్తుతం ఆదాయం పెంచుకునేందుకు అనేక మార్గాలలో ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో యూజర్లపై భారం మోపుతోంది. తాజాగా యూట్యూబ్ మరో బాదుడికి సిద్ధమైన్నట్లు తెలుస్తోంది. యూజర్లు ఇకపై యూట్యూబ్‌లోని హై క్వాలిటీ వీడియోలు చూడాలంటే పైసలు చెల్లించాల్సి వచ్చేలా ఉంది. ఎలా అని ఓ లుక్కేద్దాం! సమాచారం ప్రకారం.. యూట్యూబ్‌లో 4K రెజుల్యూషన్ వీడియోలను యూజర్లు చూసేందుకు ప్రీమియం సబ్స్క్రిప్షన్ తప్పనిసరి చేసే ప్లాన్‌లో ఉందట. ప్రసుత్తం యూట్యూబ్‌లో యాడ్స్ లేకుండా వీడియోలు చూసేందుకు ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఉండాలి. ఇందుకోసం నెలకు రూ.129, మూడు నెలలకు రూ. 399, సంవత్సరానికి ₹1290 వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరహాలోనే 4k వీడియోలు చూడాలంటే కూడా ప్రీమియం తప్పనిసరి చేయనున్నారని సమాచారం. ప్రస్తుతానికైతే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాకపోయినా, యూజర్లలో దీనిపై చర్చ మాత్రం జరుగుతోంది. 4కే వీడియోలు చూడాలంటే యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రైబ్ చేసుకోవాలని తమకు నోటిఫికేషన్స్ వస్తున్నట్టు కొందరు యూజర్లు రెడిట్ ప్లాట్‌ఫాంలో వివరించారు. కొందరు యూజర్లు అందుకు సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేశారు. దీని బట్టి చూస్తే త్వరలో యూట్యూబ్‌లో 4కే వీడియోలు ఉచితంగా చూడటం సాధ్యం కాకపోవచ్చు. హై క్వాలిటీ వీడియోలు చూడాలంటే యూట్యూబ్ ప్రీమియం మెంబర్షిప్ తీసుకోవాల్సి వచ్చేలా ఉంది. So, after testing up to 12 ads on YouTube for non-Premium users, now some users reported that they also have to get a Premium account just to watch videos in 4K. pic.twitter.com/jJodoAxeDp — Alvin (@sondesix) October 1, 2022 చదవండి: ఫ్రెషర్స్‌కి భారీ షాక్.. ఐటీలో ఏం జరుగుతోంది, ఆఫర్ లెటర్స్ ఇచ్చిన తర్వాత క్యాన్సిల్! -
టర్మ్ ఇన్సూరెన్స్.. తక్కువ ప్రీమీయం ఎక్కువ లాభం
-
ఇన్ఫినిక్స్ నుంచి తొలి 55 ఇంచెస్ టీవీ.. తక్కువ ధరకే వావ్ అనిపించే ఫీచర్లు!
కొంత కాలంగా బడ్జెట్ టీవీల మార్కెట్లో దూసుకుపోయిన స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఇన్ఫినిక్స్ తాజాగా ప్రీమియం ఆండ్రాయిడ్ టీవీ విభాగంలోకి ప్రవేశించింది. టెలివిజన్ మార్కెట్లో తమ మార్కెట్‌ని అన్ని విభాగంలో విస్తరిస్తూ, ఇన్ఫినిక్స్ 50 ఇంచెస్, 55 ఇంచెస్ జీరో సిరీస్‌ను లాంచ్ చేసింది. ప్రత్యేకంగా ఇన్ఫినిక్స్ జీరో (Infinix Zero 55 Inch QLED 4K) స్మార్ట్ టీవీని అదిరిపోయే ఫీచర్లతో కస్టమర్ల ముందుకు తీసుకువచ్చింది. ఇందులో డాల్బీ విజన్, డాల్బీ అట్మోస్, హెచ్డీఆర్ 10+ సపోర్ట్‌తో వంటి ఫీచర్లు ఉన్నాయి. అంతేకాకుండా ఈ స్మార్ట్ టీవీలో అద్భుతమైన క్వాంటమ్ డాట్ టెక్నాలజీని అమర్చారు. జీరో సిరీస్‌లోని ZERO 55-inch QLED 4K TV రూ. 34,990 గా ఉంది. ప్రస్తుతం ఉన్న X3 సిరీస్ క్రింద ప్రారంభించిన ఇతర ఇన్ఫినిక్స్ 50 ఇంచెస్ 4K TV ధర కేవలం రూ. 24,990. ఈ రెండు ఆండ్రాయిడ్ టీవీలు సెప్టెంబర్ 24 నుంచి సేల్స్ చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. మైండ్‌బ్లోయింగ్ ఫీచర్లు ఇవే.. మీకు ఇష్టమైన టీవీ షోలు, స్పోర్ట్స్ మ్యాచ్‌లు, సినిమాల ఫ్రేమ్ రేట్‌ను పెంచేందుకు డాల్బీ విజన్, హెచ్డీఆర్( HDR 10+) సపోర్ట్ , బెజెల్ లెస్ డిజైన్ దీని ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. పిక్చర్ క్వాలిటీ మెరుగ్గా ఉండేలా క్వాంటమ్ డాట్ డిస్ప్లేను ఇస్తున్నట్టు ఇన్ఫినిక్స్ పేర్కొంది. మీడియా టెక్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ సీఏ55 ప్రాసెసర్‌పై ఈ స్మార్ట్ టీవీ రన్ అవుతుంది. 2జీబీ ర్యామ్, 16జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. పీక్ బ్రైట్నెస్ 400 నిట్స్ వరకు ఉంటుంది. ఆండ్రాయిడ్ 11 టీవీ ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తోంది. వైర్లెస్ కనెక్టివిటీ కోసం డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ ఫీచర్లు ఉన్నాయి. ఈ QLED స్మార్ట్ టీవీకి మూడు HDMI పోర్ట్‌లు, రెండు USB పోర్ట్‌లు, హెడ్‌ఫోన్ పోర్ట్, డ్యూయల్ బ్యాండ్ వైఫై పోర్ట్‌లు ఉన్నాయి. ఇందులో డాల్బీ డిజిటల్ ఆడియోతో కూడిన రెండు పవర్‌పుల్ ఇన్నర్ బిల్ట్ 36వాట్స్ బాక్స్ స్పీకర్లు, 8K నుండి 20K Hz వరకు సౌండ్ క్వాలిటీని పెంచే 2 ట్వీటర్లు ఉన్నాయి. ఈ ప్రీమియం టీవీ సిరీస్ గురించి మాట్లాడుతూ, ఇన్ఫినిక్స్ ఇండియా సీఈఓ అనీష్ కపూర్, మాట్లాడుతూ.. మా ఫ్లాగ్షిప్ క్వాంటం డాట్ టెక్నాలజీతో తయారుచేసిన సరికొత్త 55 ఇంచెస్ QLED 4K TV భవిష్యత్తులో గేమ్-ఛేంజర్ గా మారుతుందన్నారు. చదవండి: బీఎస్ఎన్ఎల్ చవకైన ప్లాన్.. రూ.275 ప్లాన్‌తో 3300జీబీ.. ఆఫర్ లాస్ట్ డేట్ ఇదే! -
ఈ ఫోన్లు కొంటే..షావోమీ బంపర్ ఆఫర్
సాక్షి, ముంబై: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మేకర్ షావోమీ ప్రపంచంలోనే అతిపెద్ద వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ యూట్యూబ్ వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. దేశీయంగా మూడు నెలల యూట్యూబ్ ప్రీమియం సభ్యత్వాన్ని ఉచితంగా అందిస్తోంది. అయితే ఇందులో ఒక కండిషన్ ఉంది. అదేమిటంటే.. ఎంపిక చేసిన షావోమీ, రెడ్మి స్మార్ట్ఫోన్ల కొనుగోలుపై మొదటి మూడు నెలలు ఈ అవకాశం అందుబాటులో ఉంది. ఈ మేరకు షావోమి ఇండియా ఒక ప్రకటన జారీ చేసింది. షావోమి ఇలాంటి ఆఫర్ ప్రకటించడం ఇదే తొలిసారి కాదు. ఇంతకుముందు తన సబ్-బ్రాండ్లలో ఒకటైన పోకో కూడా ఇదే ఆఫర్‌ను వినియోగదారులకు అందిస్తోంది. సో..యూట్యూబ్ ప్రీమియం ఉచిత ఆఫర్‌ను ఇప్పటికే పొందినట్లయితే, షావోమీ ఫోన్ కొనుగోలుపై ఫ్రీ ఆఫర్‌ను పొందేందుకు అర్హుల కారు అనేది గమనించాలి. షావోమి 11, షావోమీ 12 ప్రో, షావోమీ 11టి,11 ఐ కొనుగోలుపై మూడు నెలలు, అలాగే రెడ్మి నోట్ 11, నోట్ 11 ఎస్ లాంటి కొన్ని స్మార్ట్ఫోన్లపై రెండు నెలల యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్ర్రిప్షన్ ఉచితం. ఈ ప్రమోషనల్ ఆఫర్ జనవరి 31, 2023 వరకు అందుబాటులో ఉంటుంది. కాగా యూట్యూబ్ ప్రీమియం నెలకు రూ.129. ప్రస్తుతం భారతీయ మార్కెట్లో ఉన్న ఇతర ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల కంటే ఇదే చౌకగా లభిస్తోంది. -
యూజర్లకు నెట్‌ఫ్లిక్స్ భారీ షాక్! అది ఏంటంటే?
ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ యూజర్లకు నెట్‌ఫ్లిక్స్ భారీ షాకిచ్చింది. ప్రీమియం యూజర్లు అకౌంట్ డీటెయిల్స్ వారి కుటుంబ సభ్యులకు,లేదంటే స్నేహితులకు ఫార్వడ్ చేస్తే.. అదనంగా కొంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందని నెట్‌ఫ్లిక్స్ తెలిపింది. ఇటీవల ఉక్రెయిన్‌పై చేస్తున్న రష్యా యుద్ధాన్ని నెట్‌ఫ్లిక్స్ వ్యతిరేకించింది. రష్యాలో నెట్‌ఫ్లిక్స్ సేవల్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఆ ప్రకటనతో నెట్‌ఫ్లిక్స్ ఆదాయం భారీగా పడిపోయింది. ఈ నేపథ్యంలో నెట్‌ఫ్లిక్స్ కీలక నిర్ణయం తీసుకుంది. యూజర్ల నుంచి అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నట్లు ఆ సంస్థ ప్రొడక్ట్ ఇన్నోవేషన్ డైరెక్టర్ చెంగి లాంగ్ తెలిపారు. సాధారణంగా ఇప్పటి వరకు నెట్‌ఫ్లిక్స్ యూజర్ తమ ప్రీమియం అకౌంట్ లను ఫ్రీగా షేర్ చేసే అవకాశం ఉండేది. దీంతో ఒక్క అకౌంట్‌ను యూజర్ తో పాటు కుటుంబసభ్యులు చూసేవారు. కానీ ఇకపై అలా ప్రీమియం అకౌంట్లను షేర్ చేస్తే 2 డాలర్ల నుంచి 3 డాలర్ల వరకు చెల్లించాల్సి వస్తుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఫీచర్‌పై వర్క్ చేస్తున్నామని చెంగిలాంగ్ చెప్పారు. ఎవరైతే ప్రీమియం అకౌంట్‌ను షేర్ చేస్తారో..కన్ఫర్మేషన్ కోసం కోడ్ ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తరువాత పైన చెప్పినట్లుగా 2 నుంచి 3 డాలర్లు అదనంగా చెల్లించాలని చెంగిలాంగ్ స్పష్టం చేశారు. చదవండి: భారీగా పెరిగిన నెట్‌ప్లిక్స్ సబ్స్క్రిప్షన్ ధరలు! ఎక్కడంటే! -
ఎల్ఐసీ బంపరాఫర్, మరికొన్ని రోజులే..ఈ ఆఫర్ అస్సలు మిస్ చేసుకోవద్దు!
పాలసీ దారులకు ఎల్ఐసీ బంపరాఫర్ ఇచ్చింది. కోవిడ్‌తో పాటు ఆర్ధిక కారణాల వల్ల కట్టలేని పాలసీలను పునరుద్ధరించుకునే అవకాశాన్ని కల్పిచ్చింది. ఆలస్య రుసుము చెల్లించడం ద్వారా ఆగిపోయిన పాలసీలు మళ్లీ పునరుద్ధరించుకోవచ్చని ఇప్పటికే ఎల్ఐసీ అధికారిక ప్రకటన చేసింది. అయితే మరో వారం రోజుల్లో ఎల్ఐసీ ఇచ్చిన అవకాశం ముగియనుండడంతో.. పాలసీ దారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎల్ఐసీ కోరింది. కోవిడ్-19 మహమ్మారి లైఫ్ ఇన్సూరెన్స్ అవసరాల్ని గుర్తు చేసింది. అందుకే సకాలంలో బీమా చెల్లించలేని కుటుంబాలకు ఆర్ధిక ప్రయోజనాల్ని కల్పించే దిశగా కీలక నిర్ణయం తీసుకున్నాం. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 25లోపు పాలసీదారులు ల్యాప్స్ అయిన పాలసీలను పునరుద్దరించుకునే అవకాశం కల్పిస్తున్నాం' అంటూ ఎల్ఐసీ ప్రకటనలో పేర్కొంది. అయితే ఇచ్చిన గడువు మరో వారం రోజుల్లో ముగుస్తుండగా, అందుకే పాలసీ దారులు పాలసీలను పునరుద్దరించుకోవాలని ఎల్ఐసీ అధికారిక వర్గాలు కోరుతున్నాయి. Press Release - Special Revival Campaign pic.twitter.com/uHIl8YF6OD — LIC India Forever (@LICIndiaForever) February 7, 2022 నిబంధనలకు మేరకు మొదటి చెల్లించని ప్రీమియం తేదీ నుండి ఐదేళ్లలోపు నిర్దిష్ట అర్హత గల ప్లాన్ల పాలసీలను పునరుద్ధరించవచ్చని స్పష్టం చేసింది. చెల్లించే మొత్తం ప్రీమియంలను బట్టి టర్మ్ అస్యూరెన్స్, హై-రిస్క్ ప్లాన్లు కాకుండా ఇతర ఆలస్య రుసుములలో రాయితీలు పొందవచ్చు. వైద్య అవసరాలపై ఎలాంటి రాయితీలు లేవు. అర్హత కలిగిన ఆరోగ్య, సూక్ష్మ-బీమా ప్లాన్లు కూడా ఆలస్య రుసుముతో రాయితీకి అర్హత పొందగలరని పేర్కొంది. రూ.లక్ష వరకు స్వీకరించదగిన మొత్తం ప్రీమియంతో సంప్రదాయ, ఆరోగ్య పాలసీలను ఎల్ఐసీ గరిష్ట పరిమితి రూ.2,000తో ఆలస్య రుసుముతో 20 శాతం రాయితీని అందిస్తోంది. అదేవిధంగా రూ.3 లక్షల కంటే ఎక్కువ ప్రీమియం మొత్తానికి, రూ.3,000 పరిమితితో 30 శాతం రాయితీ అందించబడుతుంది. మైక్రో ఇన్సూరెన్స్ ప్లాన్ల కోసం ఎల్ఐసీ ఆలస్య రుసుములలో పూర్తి రాయితీని అందిస్తోంది. చదవండి: మే 12వరకూ ఎల్ఐసీకి గడువు -
ఇన్‌స్టా యూజర్లకు షాక్: ఉచితం లేదు..డబ్బులు చెల్లించాల్సిందే..!
Instagram Subscription: ఇన్ స్టాగ్రామ్ యూజర్లకు షాక్. ఇప్పటి వరకు ఇన్‌స్టాలో క్రియేటర్లు అందించే కంటెంట్‌ను ఉచితంగా వీక్షించాం. కానీ ఇకపై ఆ సౌకర్యం లేదు. ఇన్ స్టాగ్రామ్ అందించే ఎక్స్ క్లూజివ్ కంటెంట్‌ను వీక్షించాలంటే కొంత మొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది. ఇండియాలో నెంబర్ వన్ స్టాటిస్టా ఏప్రిల్ 2021 లెక్కల ప్రకారం..ఫోటో షేరింగ్ యాప్ ఇన్ స్టాగ్రామ్ 180 మిలియన్ల మంది యూజర్లతో భారత్‌లో అగ్రస్థానంలో ఉంది. అమెరికాలో 170 మిలియన్లు, బ్రెజిల్లో 110 మిలియన్లు, ఇండోనేషియాలో 93 మిలియన్ యూజర్లు ఉన్నారు. అయితే భారత్‌లో ఇన్ స్టాగ్రామ్ క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు ఆ సంస్థ హెడ్ ఆడమ్ మోస్సేరి సబ్స్క్రిప్షన్ మోడల్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు తెలుస్తోంది. ఇన్ స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ ఎంత చెల్లించాలంటే ఇకపై ఎక్స్ క్లూజివ్ క్రియేటర్లు, ఇన్ స్టాగ్రామ్ ఇన్ఫ్లూయన్సర్లు, ప్రముఖులకు సంబంధించిన కంటెంట్‌ను వీక్షించాలంటే భారత్‌లో నెలవారీ సబ్స్క్రిప్షన్ రూ.89 నుంచి రూ.449వరకు చెల్లించాల్సి ఉంటుంది. గతంలో ప్రీమియం ఆప్షన్‌పై జూన్‌లో జరిగిన క్రియేటర్ వీక్‌లో ఇన్స్టాగ్రామ్ హెడ్ మాట్లాడుతూ..క్రియేటర్లు మూడు రకాలుగా ఎలా మనీ ఎర్న్ చేయొచ్చనే విషయంపై చర్చించారు. అదే సమయంలో ఇన్ స్టాగ్రామ్‌లో తెచ్చే సబ్స్క్రిప్షన్ మోడల్ క్రియేటర్లు,ఇన్ఫ్లూయన్సర్లు, ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ అందించే వారికి అదనంగా మనీ ఎర్న్ చేసుకునే సదుపాయం ఉండనుందని తెలిపారు. అధికారంగా ప్రకటించలేదు ప్రస్తుతం ఈ సబ్ స్క్రిప్షన్ మోడల్‌పై ఇన్ స్టాగ్రామ్ ఎటాంటి ప్రకటన చేయలేదు. అయితే వెలుగులోకి వస్తున్న తాజా రిపోర్ట్‌ల ప్రకారం..అమెరికా యూజర్లు నెల వారి సబ్స్క్రిప్షన్ $0.99 నుండి $4.99 వరకు, భారత యూజర్లు రూ.89 నుంచి రూ.449వరకు చెల్లించాల్సి ఉంటుంది. టిక్ టాక్ బ్యాన్ దెబ్బకు చైనా షార్ట్ వీడియో యాప్ టిక్ టాక్ బ్యాన్‌తో భారత్‌లో ఇన్ స్టాగ్రామ్‌ను వినియోగించే వారి సంఖ్య భారీగా పెరిగింది. దీంతో ఇన్ స్టాగ్రామ్ హెడ్ ఆడమ్ మోస్సేరి కొత్త కంటెంట్ క్రియేటర్లను ప్రోత్సహించేందుకు సబ్స్క్రిప్షన్ మోడల్‌ను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నామంటూ గతంలో పలుమార్లు వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఆ సబ్‌స్కిప్షన్ ఆప్షన్ ఎనేబుల్ చేసినట్లు టెక్ క్రంచ్ ఆధారలతో సహా రిపోర్ట్‌ను విడుదల చేసింది. చదవండి: భూమ్మీద కాదు, అంతరిక్షంపై ఆదిపత్యం కోసం పోటా పోటీ పడుతున్నారు -
ఈ సబ్బు ఖరీదు తెలిస్తే మూర్చపోతారు!.. రూ. 2.7 లక్షలట!!
సాధారణంగా స్నానం చేసే సబ్బు ఖరీదు ఎంత ఉంటుంది. మహా అయితే రూ. 30, 40 ఉంటుంది. మరీ ఖరీదైంది ఐతే వంద రూపాయలు ఉంటుంది. ఐతే ఈ సబ్బు ఖరీదు వందలు కాదు వేలు అస్సలే కాదు ఏకంగా లక్షల్లో ఉంటుందట. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సబ్బట కూడా! స్నానం చేసే సబ్బే కదా.. ఏమైనా బంగారంతో తయారు చేశారా? ఎందుకంత ఖరీదని అనుకుంటున్నారా! అవును.. ఇది మామూలు సబ్బు కాదు.. నిజంగానే బంగారంతో తయారు చేస్తారు. ఆ విశేషాలు తెలుసుకుందాం.. ఎక్కడా తయారు చేస్తారంటే.. లెబానోన్లోని ట్రిపోలీకి చెందిన ఒక కుటుంబం నడిపే సబ్బుల ఫ్యాక్టరీలో ఈ విధమైన సబ్బులు తయారవుతున్నాయి. 15వ శతాబ్ధం నుంచి ఈ విధమైన సబ్బులు వడకంలో ఉన్నట్లు చరిత్ర చెబుతోంది. ఐతే 2013 లో ఈ ఖరీదైన సబ్బులను మొదట తయారు చేశారు. దీనిని ఖతార్ అధ్యక్షుడి భార్యకు బహుమతిగా ఇచ్చినట్లు మీడియా నివేదికలు తెలుపుతున్నాయి. ఈ లగ్జరీ సబ్బు పేరు ‘ఖాన్ అల్ సబౌన్’ సోస్. బాడర్ హసీన్ అండ్ సన్స్ కంపెనీ కేవలం చేతులతోనే ఈ సబ్బులను తయారు చేస్తుందట. ప్రత్యేకమైన నూనెలు, సహజ సువాసనలతో కూడిన చర్మ సంరక్షణ ఉత్పత్తులను తయారు చేయడంలో ఈ కంపెనీ ప్రసిద్ధి. ఈ కంపెనీ ఉత్పత్తులు కేవలం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని కొన్ని ప్రత్యేక షాపుల్లో మాత్రమే అమ్ముతారు. చదవండి: ఇదే అతి పె..ద్ద.. గోల్డ్ మైనింగ్! ఏటా లక్షల కిలోల బంగారం తవ్వుతారట! బంగారం, వజ్రాల పొడితో తయారీ.. ఈ ఖరీదైన సబ్బుకు మరొక ప్రత్యేకత కూడా ఉంది. ఒక ఖాన్ అల్ సబౌన్ సబ్బు తయారీకి 17 గ్రాముల 24 క్యారెట్ల బంగారం, 3 గ్రాముల వజ్రాల పౌడర్‌లో సహజమైన నూనెలు, సహజసిద్ధమైన తేనె, ఖర్జూరం కలిపి తయారు చేస్తారట. చూడ్డానికి అచ్చం జున్ను ముక్కలా ఉంటుందీ లగ్జరీ సబ్బు. దీని ధర కూడా చుక్కల్లో ఉంటుంది. ఒక సబ్బు ఖరీదు అక్షరాల 2 లక్షల 7 వేల రూపాయలు. ఈ సబ్బు ప్రత్యేకత అదే.. ఈ సబ్బు వాడిన వారికి ఆధ్యాత్మిక, మానసిక ప్రశాంతత కలుగుతుందనే నమ్మకం ప్రచారంలో ఉంది. ఐతే దీనిని రుజువుచేసే ఆధారాలేవీ లేవు. అంత ఖరీదైన సబ్బు వాడేవారు కూడా ఉంటారా? అని అనుకుంటే పొరపాటే. ముఖ్యమైన విఐపీలు, సెలబ్రెటీలు మాత్రమే వీటిని వాడుతారట. ముఖ్యంగా దుబాయ్‌లో నివసించే సంపన్న కుటుంబాలు ఎక్కువగా ఈ సబ్బులను వాడుతారు. ఆ మధ్య ఖరీదైన వాటర్ బాటిల్ ధర రూ. 45 లక్షల రూపాయలని విన్నాం. ఇప్పుడు రెండున్నర లక్షల స్నానం సబ్బు.. రోజూ వాడే మామూలు వస్తువులకు కూడా ఇంత ధర పలుకుతుందంటే నమ్మలేకపోతున్నాం కదా! చదవండి: Viral Video: కొ.. కొ.. కోబ్రా! లగెత్తండ్రోయ్!!.. ఆగండి..! -
బంపర్ టూ బంపర్ ఇన్సురెన్సు, అదనంగా ఎంత ప్రీమియం చెల్లించాలి?
వాహనదారుల సంక్షేమాన్ని కోరుతూ బంపర్ టూ బంపర్ ఇన్సురెన్సు తప్పనిసరి చేస్తూ మద్రాసు హై కోర్టు తీర్పు వెలువరించింది. ఈ తీర్పు అమల్లోకి వస్తే వాహనం కొనుగోలు చేసేప్పుడు ఎంత ఆర్థిక భారం పడుతుంది. అమలు విధానం ఎలా ఉండవచచ్చు, కోర్టు తీర్పుపై ఇటు వాహన తయారీ సంస్థలు, అటు ఇన్సురెన్సు కంపెనీలు ఏమనుకుంటున్నాయి ? బంపర్ టూ బంపర్ లక్షలు ఖర్చు పెట్టి వాహనం కొనుగోలు చేసే సందర్భంలో ఇన్సెరెన్సు ప్రీమియం కట్డడంలో చాలా మంది వెనుకాముందు ఆలోచిస్తారు. ప్రీమియం తగ్గించుకునేందుకు రకరకాల ప్లాన్లు వేస్తారు. దీనికి తగ్గట్టే ఇన్సెరెన్సు సంస్థలు, వాటి ఏజెంట్లు అతి తక్కువ ప్రీమియం ఉండే థర్డ్ పార్టీ ఇన్సురెన్సు ప్లాన్లనే చెబుతుంటారు. ఇప్పటి వరకు ఈ తరహా పద్దతే ఎక్కువగా చెల్లుబాటు అవుతూ వస్తోంది. అయితే వాహనం కొనుగోలు చేసిన తర్వాత మొదటి ఐదేళ్ల పాటు బంపర్ టూ బంపర్ ఇన్సురెన్సును తప్పనిసరి చేసింది మద్రాసు హై కోర్టు. అంటే వాహనానికి ఏదైనా ప్రమాదం వాటిలినప్పుడు ఆ వాహనంతో పాటు దాని యజమాని లేదా డ్రైవరు, అందులో ప్రయాణించే వ్యక్తులందరికీ నష్టపరిహారం పొందే హక్కు ఉంటుంది. ప్రీమియం ఎంత పెరుగుతుంది? కొత్త వాహనాలకు కొనుగోలు చేసేప్పుడు నూటికి తొంభైశాతం మంది బంపర్ టూ బంపర్ ఇన్సురెన్సునే చేయిస్తున్నారు. ఆ తర్వాత రెన్యువల్ చేయించేప్పుడే థర్డ్ పార్టీ ఇన్సురెన్సులకు వెళ్తున్నారు. ప్రస్తుతం వాహన నెట్ప్రైస్లో 3 శాతం మొత్తాన్ని ఒక ఏడాది పాటు బంపర్ టూ బంపర్ ఇన్సురెన్సు ప్రీమియంగా చెల్లిస్తున్నారు. ఇప్పుడు ఈ కాలాన్ని ఐదేళ్లకు పొడిగించాలని కోర్టు సూచించింది. ఆ లెక్కన వాహనం ధరలో 3 శాతం మొత్తాన్ని ఐదేళ్లకు పెంచితే మార్కెట్‌వాల్యూ, తరుగుదల ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుంటే ఇన్సురెన్సు ప్రీమియం దాదాపు మూడింతలు పెరిగిపోతుంది. ఆర్థిక భారం ఎంతంటే ? ఐదేళ్ల కాలానికి బంపర్ టూ బంపర్ ఇన్సురెన్సును లెక్కించందుకు హ్యుందాయ్ కంపెనీకి చెంది వెన్యూ కారును పరిగణలోకి తీసుకుంటే.. ఇప్పుడు ఒక ఏడాది బంపర్ టూ బంపర్ ఇన్సురెన్స్కి రూ. 38,900 ప్రీమియంగా ఉంది. ఇదే ఇన్సురెన్సును ఐదేళ్ల కాలానికి తీసుకుంటే ప్రీమియం మొత్తం ఒకేసారి రూ. 1,26,690కి చేరుతుంది. అంటే వినియోగదారుడు ప్రస్తుతం చెల్లిస్తుదానికి అదనంగా రూ. 87,790లు చెల్లించాల్సి వస్తుంది. వివిధ మోడళ్లను బట్టి ఈ ప్రీమియం మారుతుంది. వాహన తయారీ సంస్థలు ఏమంటున్నాయి ? కరోనా సంక్షోభం తర్వాత ఇప్పుడిప్పుడే ఆటో మొబైల్ పరిశ్రమ కొలుకుంటోంది. కొనుగోలుదారులను ఆకట్టుకునేందుకు వాహన తయారీ సంస్థలు ధరల తగ్గింపు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఒకసారి ఐదేళ్లకు బంపర్ టూ బంపర్ ఇన్సురెన్స్‌ని కోర్టు తప్పనిసరి చేసింది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే వాహనాల ధరలు పెరిగిపోతాయని, ఫలితంగా అమ్మకాలపై ప్రభావం పడుతుందని వాహన తయారీ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఉదాహరణకి హ్యుందాయ్ వెన్యూ వాహనానికి సంబంధించి ఒక ఏడాది బంపర్ టూ బంపర్ రెండేళ్లు థర్డ్ పార్టీ ఇన్సురెన్సుతో కలిసి నెట్ప్రైస్ రూ. 9,96,310 ఉంది. ఇప్పుడు కోర్టు తీర్పు ప్రకారం ఐదేళ్ల ఇన్సునెన్సు ప్రీమియం చెల్లించాలంటే రూ.10,84,295 చెల్లించాల్సి వస్తుంది. అదే మారుతి బ్రెజా విషయానికి వస్తే ఈ మొత్తం రూ.9,86,199 నుంచి రూ. 10,76,180కి చేరుకుంటుంది. ఇన్సురెన్సు కంపెనీ స్పందన ఏంటీ ? ఏ తరహా పాలసీ తీసుకోవాలి, ప్రీమియం ఎంత చెల్లించాలనే అంశంపై వాహన కొనుగోలుదారులను తాము ఒత్తిడి చేసేది ఏమీ ఉండదని ఇన్సురెన్సు కంపెనీలు చెబుతున్నాయి. మోటారు వాహన చట్టాలను లోబడి వాహన కొనుగోలుదారుడి ఇష్టాఇష్టాలకు అనుగుణంగానే పాలసీలు చేయిస్తామని చెబుతున్నాయి. వాహనం కొనుగోలు చేసేప్పుడు చాలా మంది మొదటి ఏడాదికి బంపర్ టూ బంపర్ ఇన్సురెన్స్ చేయిస్తారని, ఆ తర్వాత వాహనం వాడే విధానం, రిస్క్ ఆధారంగా థర్డ్‌పార్టీ లేదా బంపర్ టూ బంపర్ ఇన్సురెన్సులు తీసుకుంటారని ఇన్సురెన్సు కంపెనీ ఏజెంట్లు వెల్లడిస్తున్నారు. చదవండి : బంపర్ టూ బంపర్ ఇన్సురెన్స్ తప్పనిసరి..మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు -
ఈ ఇయర్ ఫోన్స్ ధర తెలిస్తే షాకవ్వాల్సిందే?
ప్రముఖ జర్మన్-ఆడియో బ్రాండ్ సెన్‌హెయిసర్ భారతదేశంలో ఇప్పటి వరకు విడుదల చేయని అత్యంత ఖరీదైన ఇయర్ ఫోన్లను లాంచ్ చేసింది. వీటిని ప్రత్యేకంగా ప్రొఫెషనల్ డ్యాన్సర్స్, డిజే ఆపరేటర్స్ కోసం ఐఈ 900 ఇయర్ ఫోన్లను తీసుకొచ్చినట్లు పేర్కొంది. కంపెనీ ఐఈ 900లో సెన్ హీసర్ కొత్త సృజనాత్మక ఎక్స్ 3ఆర్ టెక్నాలజీని ప్రవేశ పెట్టింది. ఈ టెక్నాలజీ వల్ల స్వచ్ఛమైన, సహజ ధ్వనిని ఆస్వాదించవచ్చు. మెరుగైన స్థిరత్వం కొరకు గోల్డ్ ప్లేటెడ్ ఎమ్ ఎమ్ సీఎక్స్ కనెక్టర్లతో సహ ఫీచర్స్ తో ఈ ఇయర్ ఫోన్లు వస్తాయి. సెన్ హీసర్ ఐఈ 900 ఇయర్ ఫోన్ల ధర వచ్చేసి రూ.1,29,900. భారతదేశంలో ఇప్పటి వరకు లాంఛ్ చేసిన అత్యంత ఖరీదైన ఇయర్ ఫోన్లు ఇవే. అయితే, ఈ ఇయర్ ఫోన్లను సెన్ హీసర్ వెబ్ షాప్ లో వీటిని ముందస్తుగా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. పెద్ద హెడ్ ఫోన్లలో కనిపించే పొందికైన, కళాఖండం లేని "సెన్హీసర్ సౌండ్"ను అందించే ఐఈ 900లో సెన్ హీసర్ తన కొత్త ఎక్స్ 3ఆర్ వ్యవస్థను ప్రవేశపెట్టినట్లు కంపెనీ తెలిపింది. కంపెనీ సిలికాన్ ఇయర్ అడాప్టర్లను, మూడు ఎలాస్టిక్ ఫోమ్ ఇయర్ అడాప్టర్ సెట్లను మూడు విభిన్న సైజుల్లో బండిల్ చేసింది. ఈ ఇయర్ ఫోన్ లు 7 మిమీ ట్రూ రెస్పాన్స్ ట్రాన్స్ డ్యూసర్ ని కలిగి ఉంటాయి. ఇయర్ ఫోన్ లు సింగిల్ డ్రైవర్ సిస్టమ్ తో వస్తాయి. అలాగే ఇందులో అల్యూమినియం చాసిస్‌ను ఉపయోగించారు. సెన్‌హెయిసర్ ఇప్పటికే డీజే హెడ్‌ఫోన్స్, హెచ్డీ 25 మానిటరింగ్‌ను ఇండియాలో విడుదల చేసింది. -
హోండా ప్రీమియం బైక్స్ : ధర ఎంతంటే
సాక్షి, ముంబై: హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా మంగళవారం రెండు ప్రీమియం బైకులను భారత మార్కెట్లో విడుల చేసింది. ఇందులో ఒకటి సీబీఆర్650ఆర్ కాగా, మరోకటి సీబీ650ఆర్ బైక్. ఇది 649 సీసీ మోటర్ సైకిల్ అప్డేట్ ఎడిషన్‌గా వస్తుంది. ఈ బైకుల ధరలు వరుసగా రూ.8.88 లక్షలు, రూ.8.67 లక్షలుగా ఉన్నాయి. వీటిని విదేశాల నుంచి కంప్లీట్లీ నాక్డ్ డౌన్ యూనిట్ (సీకేబీ) రూపంలో దిగుమతి చేసుకుంటామని కంపెనీ తెలిపింది. భారత మార్కెట్లో ప్రీమియం మోటర్‌సైకిళ్ల విస్తరణ ప్రణాళికల్లో భాగంగా ఈ బైకులను విడుదల చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. హైదరాబాద్ సహా, గురుగ్రామ్ (హర్యానా), ముంబై (మహారాష్ట్ర), బెంగళూరు (కర్ణాటక), ఇండోర్ (మధ్యప్రదేశ్), కొచ్చి (కేరళ)లోని బిగ్ వింగ్ టాప్ లైన్ డీలర్‌షిప్‌లలో బుకింగ్స్ప్రారంభం. -
స్కూల్ ఫీజులూ.. సులభ వాయిదాల్లో...
న్యూఢిల్లీ: భారీ విలువ చేసే లావాదేవీలకు చెల్లించే మొత్తాన్ని నేరుగా కస్టమర్లే ఆన్లైన్లో ఈఎంఐల (నెలవారీ వాయిదాలు) కింద మార్చుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ వెల్లడించింది. ఎంపిక చేసిన సేవింగ్స్ అకౌంట్స్ ఖాతాదారులు .. తమ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫాం ద్వారా బీమా ప్రీమియంలు మొదలుకుని స్కూలు ఫీజుల దాకా వివిధ రకాల చెల్లింపులను ఈఎంఐల కింద చెల్లించవచ్చని తెలిపింది. దీనితో భారీ మొత్తాన్ని సులభ వాయి దాల్లో చెల్లించుకునేందుకు వీలవు తుందని పేర్కొంది. రూ. 50,000కు పైబడి రూ. 5 లక్షల దాకా విలువ చేసే లావాదేవీలకు ఇది వర్తిస్తుందని తెలిపింది. వీటిని 3,6,9,12 నెలల కాల వ్యవధికి ఈఎంఐల కింద మార్చుకోవచ్చని, ఇందుకోసం అదనపు చార్జీలేమీ ఉండవని బ్యాంకు తెలిపింది. ’ఈఎంఐ @ ఇంటర్నెట్ బ్యాంకింగ్’ పేరిట ఈ సదుపాయం అందు బాటులో ఉంటుందని వివరించింది. ఇందు కోసం బిల్‌డెస్క్, రేజర్‌పే అనే ఆన్లైన్ పేమెంట్ గేట్వేలతో పాటు 1,000కి పైగా వ్యాపార సంస్థలతో జట్టు కట్టినట్లు బ్యాంక్ వివరించింది. -
ఇంటర్ ఫెయిల్.. భద్రమ్ సినిమా చూసి దారుణం
పేద కుటుంబాలే టార్గెట్. ప్రాణాంతక వ్యాధులతో మృత్యుముఖంలోకి వెళుతున్న వారిని గుర్తించడం.. ఎలాగూ పోయేవాడే కదా నాలుగు రోజుల ముందే ఆయువు తీస్తే తప్పేముందని, డబ్బు ఆశ చూపి కుటుంబీకులను ఒప్పించడం. వారి పేరిట భారీ మొత్తానికి పాలసీ చేయించడం. ఆపై చంపేసి రోడ్డు ప్రమాదాలుగా చిత్రీకరించి.. బీమా క్లెయిమ్ చేసుకొని డబ్బులు పంచుకోవడం. ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా పకడ్బందీగా ప్లాన్ అమలు. ఇదంతా సినిమాటిక్‌గా అనిపిస్తోంది కదా? ఇది సినిమా కథే. చిత్రం పేరు ‘భద్రమ్’. దాని నుంచే ప్రేరణ పొందాడు నల్లగొండ ఇన్సూరెన్స్ కుంభకోణం నిందితుడు రాజు. అమల్లో పెట్టేశాడు. ఇంటర్ ఫెయిల్ అయినా.. నేరాల్లో మాస్టర్ మైండ్. డబ్బు యావతో ఐదుగురి ప్రాణాలను తీసేశాడు. సాక్షి, హైదరాబాద్/నల్లగొండ: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఇన్సూరెన్స్ కుంభకోణంలో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇంటర్ ఫెయిలైన రాజు ఇన్సూరెన్స్ డబ్బుల కోసం నేరాలు చేసిన విధానం, ఆ డబ్బును పంచుకున్న తీరు, ఈ క్రమంలో ఎక్కడా ఇటు పోలీసులకుగానీ, అటు వైద్యులకు గానీ చిక్కకుండా తప్పించుకున్న విధానం చూసి పోలీసు ఉన్నతాధికారులు సైతం ఆశ్చర్యపోతున్నారు. వాస్తవానికి నిందితుడు రాజు ఇంటర్ ఫెయిల్ కానీ, నేరాలు చేయడంలో ఆరితేరాడు. గతంలో ఫైనాన్స్ సంస్థలో పనిచేసేవాడు. క్రైం సీరియళ్లు, సినిమాలు చూసి నేరప్రవృత్తిని వంటబట్టించుకున్నాడు. ప్రాణాంతక వ్యాధులతో మరణానికి చేరువవుతున్న వారిని గుర్తించడం, వారి కుటుంబసభ్యులతో ముందే ఒప్పందం చేసుకోవడం తెలుసుకుని పోలీసులే అవాక్కయ్యారు. సాధారణ పాలసీలు అయితే చాలాకాలం వేచి చూడాలి. పైగా క్లెయిమ్ చేసుకునే సమయంలో సవాలక్ష సమాధానాలు చెప్పాలి. అదే యాక్సిడెంటల్ డెత్ పాలసీ అయితే, కేవలం ఒక ప్రీమియం కట్టేసి... మనిషిని లేపేసి డబ్బులు జేబులో వేసుకోవచ్చన్న దుష్టాలోచనతో అడుగులేశాడు. చట్టాల్లోని చిన్న చిన్న లోపాలను బాగా అధ్యయనం చేసి... వాటిని వాడుకొని మనుషుల ప్రాణాలను తీసి, అక్రమంగా ఎదిగేందుకు ప్రణాళికలు రచించాడు. తక్కువ ప్రీమియంతో... భారీగా డబ్బు 2013లో సూర్యాపేట జిల్లా శూన్యపహాడ్‌కు చెందిన సపావత్ సక్రియా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమీప బంధువులే కావడంతో సక్రియా కుటుంబాన్ని నిందితుడు ధీరావత్ రాజు సంప్రదించాడు. చనిపోయిన వ్యక్తి బతికున్నట్లుగా పంచాయతీ కార్యదర్శి సాయంతో పత్రాలు సృష్టించి, ఆ తరువాత డెత్ సర్టిఫికెట్ తీసుకుని చనిపోయాడని రూ.1.4 లక్షల బీమా క్లెయిమ్ చేసుకున్నాడు. ఆ పథకం విజయవంతంగా అమలైంది. అది మొదలు రాజులో దుర్భుద్ధి పుట్టింది. కానీ, ఎలా ముందుకు వెళ్లాలో అర్థం కాలేదు. 2014లో తొలి బీమా హత్య చేసే వరకు అతను దాదాపు 6 నుంచి 10 నెలలపాటు ఖాళీగా ఉన్నాడు. ఈ క్రమంలో ఏం చేశాడు? అన్నదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. 2014లో విడుదలైన తమిళ డబ్బింగ్ సినిమా ‘భద్రమ్’ను నిందితుడు చూశాడు. యాక్సిడెంట్ పాలసీ చేయించి, అమాయకులను చంపి, రోడ్డు ప్రమాదాలుగా చిత్రించి, బీమా డబ్బులను క్లెయిమ్ చేసుకునే రాకెట్ నేపథ్యంతో సాగే కథ ఇది. ఇలాంటి నేపథ్యాలతో సాగిన సినిమాలతోనే నిందితుడు రాజు ప్రేరణ పొందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఎందుకంటే సాధారణ బీమా చేయిస్తే.. అది అంత త్వరగా వర్తించదు. అదే యాక్సిడెంటల్ డెత్ పాలసీ తీసుకుంటే తీసుకున్న మరునాడే మరణించినా.. పూర్తిస్థాయి డబ్బులు వస్తాయి. ఏడాది కాలానికే వర్తించే యాక్సిడెంటల్ డెత్ పాలసీల్లో తక్కువ ప్రీమియంతో (కట్టిన ప్రీమియం వెనక్కిరాదు) ఎక్కువ రిస్క్ కవరేజి ఉంటుంది. ఇక్కడే రాజు తన తెలివితేటలు ప్రదర్శించాడు. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ (ఐఆర్డీఏ) కొత్త నిబంధన ప్రకారం.. భార్య, రక్త సంబంధీకులకు తప్ప ఇతరులకు బీమా క్లెయిమ్ చేసుకునే అవకాశం లేదు. అందుకే నామినీగా పెట్టేవారితో (కుటుంబీకులతో) రాజు ముందే ఒప్పందం చేసుకునే వాడు. బీమా డబ్బు రాగానే అనుకున్న ప్రకారం వాటాలు పంచుకునేవాడు. నాగార్జునసాగర్‌లో మరో కుంభకోణం నల్లగొండలో ఈ ఇన్సూరెన్స్ హత్యల దర్యాప్తు సాగుతుండగానే.. మరో బీమా కుంభకోణాన్ని నల్లగొండ పోలీసులు ఛేదించారు. నాగార్జునసాగర్‌లో ఆరేళ్ల క్రితం మామను యాక్సిడెంట్ పాలసీ చేయించి చంపిన అల్లుడి దుష్టపన్నాగం ఇది. ఇందులో నిందితుడు తన మామ పేరిట మూడు భారీ వాహనాలు కొనుగోలు చేయించాడు. ఆ మూడింటికి యజమాని మరణిస్తే.. నెలనెలా వాయిదాలు కట్టకుండా రద్దయిపోయేలా బీమా చేయించాడు. ఆ తరువాత మామకు భారీ మొత్తానికి యాక్సిడెంట్ పాలసీ చేయించాడు. అనంతరం ఇంకో అడుగు ముందుకేశాడు. ఇంకా తెలివిగా ఓ ప్రముఖ బ్యాంకులో మామకు ఖాతా తెరిపించాడు. ఈ బ్యాంకు నిబంధనల ప్రకారం.. ఖాతాదారులకు యాక్సిడెంటల్ పాలసీని వర్తింపజేస్తారు. ఆ తరువాత ఎవరికీ అనుమానం రాకుండా మామను హతమార్చి ప్రమాదంగా చిత్రీకరించాడు. ఈ కేసులో అల్లుడు యాక్సిడెంట్ పాలసీ కింద భారీ మొత్తాన్ని రాబట్టుకున్నాడు. పైగా మూడు భారీ వాహనాలకు నెల వాయిదాలు రద్దు అయ్యాయి. మరోవైపు బ్యాంకు వాళ్లు తమ ఖాతాదారుడు చనిపోయాడని బీమా సొమ్ము అందజేశారు. ఈ విధంగా ఐదు పాలసీల నుంచి లబ్ది పొందాడు. చదవండి: (దారుణం: బీమా చేయించారు.. 8 మందిని చంపేశారు) ఐఐబీకి రంగనాథ్ లేఖ ఈ వ్యవహారంలో మరిన్ని అక్రమాలు దాగి ఉన్నాయన్న అనుమానంతో వాటిపై కూపీలాగేందుకు నల్లగొండ ఎస్పీ, డీఐజీ ఏవీ రంగనాథ్ నడుం బిగించారు. గత పదేళ్లలో నల్లగొండ జిల్లాలో బీమా చేసిన ఏడాదిలోగా క్లెయిమ్ అయిన పాలసీల వివరాలు వెల్లడించాలని కోరుతూ హైదరాబాద్‌లోని ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (ఐఐబీ)కి లేఖ రాశారు. ఈ సంస్థ అందించే వివరాల ఆధారంగా అనుమానాస్పద కేసులను తవ్వి తీయాలని నిర్ణయించారు. గత కేసుల సమయంలో పోలీసులు, వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారా? లేక నిందితులతో సంబంధాలున్నాయా? అన్న విషయంలోనూ సమగ్ర దర్యాప్తు చేయనున్నారు. నిందితుడు ధీరావత్ రాజు ఇంటర్ ఫెయిలైనా.. క్రిమినల్ మైండ్‌లో మాత్రం మాస్టర్ అని, అతను ఇవి కాకుండా ఇంకా కొన్ని నేరాలు చేశాడా? లేక ఇతని సలహాలు, సూచనలతో ఇలాంటి నేరాలు ఉమ్మడి జిల్లాలో ఇంకా ఎక్కడైనా జరిగాయా? అన్న కోణంలోనూ డీఐజీ కూపీ లాగుతున్నారు. మొత్తంగా ఈ ముఠా ఇప్పటిదాకా ఐదుగురిని హతమార్చి, చనిపోయిన ఇద్దరి శవాలను తీసుకెళ్లి రోడ్డు ప్రమాదాలుగా చిత్రీకరించి బీమా డబ్బులు తీసుకుంది. మరో ఇద్దరిని చంపేందుకు ప్లాన్ చేసింది. వీరి నుంచి మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉంది. ఏపీలో రెండుసార్లు విఫలం... రెండేళ్లు జైలులో నిందితుడు రాజు పోలీసులకు విచారణలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించినట్లు సమాచారం. 2017లోనే దేవిరెడ్డి కోటిరెడ్డి హత్యకు ప్లాన్ చేశాడు. ఈ మేరకు అతని భార్యను సంప్రదించి ఒప్పించాడు. అదే సమయంలో అతని స్నేహితులు ఏపీలోని ప్రకాశం జిల్లాలో అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి విషయంలోనూ ఇలాగే ఇన్సూరెన్స్ చేయించి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలని కోరారు. ఆ క్రమంలో అనారోగ్యంతో మరణించిన వ్యక్తి శవాన్ని తీసుకెళ్లి రోడ్డు ప్రమాదమని నమ్మబలికేందుకు రాజు యత్నించాడు. కానీ, వైద్యులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారమివ్వడంతో రాజు జైలుకెళ్లాడు. ఆ తరువాత గుంటూరు జిల్లా దాచేపల్లిలోనూ మృతదేహాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే క్రమంలోనూ విఫలమయ్యాడు. దీంతో దాదాపు రెండేళ్ల పాటు జైలులో ఉండాల్సి వచ్చింది. విడుదలయ్యాక తిరిగి దామరచర్లకు వచ్చాడు. ఈలోపు కరోనా కారణంగా లాక్డౌన్ విధించడంతో కోటిరెడ్డి హత్యలో మరింత జాప్యం జరిగింది. లాక్డౌన్ ఎత్తివేయగానే తిరిగి కోటిరెడ్డి పేరిట పలు ప్రైవేటు బీమా కంపెనీల నుంచి రూ.1.20 కోట్ల ఇన్సూరెన్సులు తీసుకున్నాడు. మొత్తానికి, కోటిరెడ్డిని చంపేందుకు 2017లోనే అవగాహన కుదిరినా.. దాన్ని అమలు చేసేందుకు 2021 వరకు సమయం పట్టిందని సమాచారం. ఈ అన్ని కేసులను రాజు క్షుణ్నంగా అధ్యయనం చేయడం గమనార్హం. వ్యక్తిని చంపాక పోలీసులు ఘటనాస్థలానికి రావడం, పంచనామా సమయంలో ఏయే ఆధారాలను నోట్ చేసుకుంటున్నారు? ఏయే అంశాల ఆధారంగా రోడ్ యాక్సిడెంట్ అని నమ్ముతున్నారు అన్న విషయాలను పోలీసుల పక్కనే ఉండి నిందితుడు అధ్యయనం చేసినట్లు విచారణలో వెల్లడించడంతో పోలీసులు విస్మయం చెందారు. అందుకే, వ్యక్తులను చంపాక.. ఒకటికి రెండుసార్లు వాహనాలను వారి శరీరాలపై ఎక్కించడం, టైర్మార్కులు, వాహనం వచ్చిన డైరెక్షన్.. తదితర అంశాలను కచ్చితంగా పాటించి చూడగానే అది యాక్సిడెంట్ అనిపించేలా పకడ్బందీగా వ్యవహరించాడని తెలిసింది. -
హ్యాపీయెస్ట్ మైండ్స్ బ్లాక్‌బస్టర్ లిస్టింగ్
సాఫ్ట్వేర్ సేవల మధ్యస్థాయి కంపెనీ హ్యాపీయెస్ట్ మైండ్స్ స్టాక్ ఎక్స్ఛేంజీలలో బంపర్ లిస్టింగ్‌ను సాధించింది. ఇష్యూ ధర రూ. 166 కాగా.. ఎన్ఎస్ఈలో ఏకంగా రూ. 351 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. ఇది రూ. 185(111 శాతం) లాభం కాగా.. ప్రస్తుతం రూ. 366 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 395 వద్ద గరిష్టాన్ని, రూ. 350 వద్ద కనిష్టాన్నీ తాకింది. హ్యాపీయెస్ట్ మైండ్స్ ఐపీవో ఇటీవల ఎరుగని విధంగా 151 రెట్లు అధిక సబ్‌స్క్రిప్షన్‌ను సాధించిన సంగతి తెలిసిందే . ఇటీవల చేపట్టిన పబ్లిక్ ఇష్యూలో భాగంగా కంపెనీ 2.33 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచగా.. 351 కోట్ల షేర్ల కోసం దరఖాస్తులు వెల్తువెత్తాయి. ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 702 కోట్లు సమీకరించింది. రిటైల్ విభాగంలోనే 71 రెట్లు అధికంగా బిడ్స్ దాఖాలు కావడం విశేషం! బ్యాక్‌గ్రౌండ్.. దేశీ సాఫ్ట్వేర్ రంగంలో అత్యంత అనుభవశాలి అయిన అశోక్ సూతా 2011లో హ్యాపీయెస్ట్ మైండ్స్‌ను ఏర్పాటు చేశారు. 2000లో పబ్లిక్ ఇష్యూకి వచ్చిన సాఫ్ట్వేర్ సేవల మధ్యస్థాయి కంపెనీ మైండ్‌ట్రీకి సైతం సూతా సహవ్యవస్థాపకుడుగా వ్యవహరించారు. ఐటీ దిగ్గజం విప్రోలో 1984-99 మధ్య కాలంలో పలు హోదాలలో సేవలందించారు. క్లౌడ్, సెక్యూరిటీ, అనలిటిక్స్ విభాగాలలో సాఫ్ట్వేర్ సేవలు అందిస్తున్న హ్యాపీయెస్ట్ మైండ్స్ గత ఆర్థిక సంవత్సరం(2019-20)లో రూ. 714 కోట్ల ఆదాయం ఆర్జించింది. గత మూడేళ్లలో సగటున 20.8 శాతం వార్షిక వృద్ధిని సాధించింది. డిజిటల్ టెక్నాలజీస్ ద్వారానే 97 శాతం ఆదాయం ఆర్జిస్తున్నట్లు సూతా పేర్కొన్నారు. డిజిటల్ బిజినెస్ సర్వీసెస్, ప్రొడక్ట్ ఇంజినీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ అండ్ సెక్యూరిటీ సర్వీసుల పేరుతో మూడు ప్రధాన విభాగాలను కంపెనీ నిర్వహిస్తోంది. -
కాస్ట్లీ చుక్క.. ఎంచక్కా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రీమియం బ్రాండ్ మద్యం విక్రయాల మోత మోగుతోంది. ఆర్థిక మాంద్యానికి కూడా వెరవకుండా మద్యపాన ప్రియులు ఖరీదైన మందు తెగ తాగేస్తున్నారని ఎక్సైజ్ గణాంకాలు చెబుతున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు 9శాతం మేర కాస్ట్లీ లిక్కర్ అమ్మకాలు పెరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా జరిగే మద్యం అమ్మకాల్లో 25–30 శాతం వర కు ఖరీదైన బ్రాండ్ల వాటా ఉంటుందని అంచ నా వేస్తుండగా, రాష్ట్ర రాజధాని హైదరాబాద్ జిల్లాలో అయితే అది ఏకంగా 50 శాతం దాటింది. మొత్తం మద్యం విక్రయాల్లో ప్రీమి యం బ్రాండ్ హైదరాబాద్‌లో సగానికి పైగా అమ్ముడవుతోందన్నమాట. అందుబాటులో ఆ 13 బ్రాండ్లు.. ప్రీమియం బ్రాండ్ మద్యం అమ్మకాలను పరి శీలిస్తే.. రాష్ట్ర వ్యాప్తం గా 8–9 శాతం అమ్మకాలు పెరిగాయని ఎక్సైజ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు హైదరాబాద్ జిల్లాలో 12.11 లక్షల కేసులు అమ్ముడయ్యాయి. అన్ని రకాల మద్యం కలిపి 23.11 లక్షల కేసులు అమ్ముడుపోగా, 50 శాతానికి పైగా ఖరీదైన మద్యం బాటిళ్లు విక్రయించడం గమనార్హం. గత ఏడాది ఇదే సమయంలో 11.08 లక్షల కేసుల ప్రీ మియం బ్రాండ్ లిక్కర్ అమ్ముడయింది. మరో విశేషమేమిటంటే ఈ జిల్లాలో చీప్ లిక్కర్, సాధారణ మద్యం విక్రయాలు గతేడాది కంటే తగ్గాయి. గత ఏడాది చీప్‌లిక్కర్ 3.5 లక్షల కేసులు విక్రయించగా, ఈ ఏడాది 3.2 లక్షల కేసులు అమ్మారు. సాధారణ మద్యం విషయానికి వస్తే గత ఏడాది రూ.7.8 లక్షల కేసులు అమ్ముడయితే, ఈ ఏడాది 7.7 లక్షల కేసులు అమ్ముడయ్యాయి. ఇక బీర్ల విషయానికొస్తే స్వల్పంగా విక్రయాలు పెరిగాయి. గత ఏడాది ఈ ఏడు నెలల కాలంలో 32 లక్షల కేసులు బీర్లు అమ్మ గా, ఈ ఏడాది 3 శాతం అదనంగా 33 లక్షల కేసులకు పైగా అమ్ముడయ్యాయి. ప్రీమియం బ్రాండ్ల విషయానికి వస్తే 13 రకాల ఖరీదైన మద్యం అందుబాటులో ఉన్నాయి. సిగ్నేచర్, బ్లెండర్స్ ప్రైడ్, యాంటిక్విటీ, బ్లాక్‌డాగ్, 100 పైపర్స్, టీచర్స్ (ఫిఫ్టీ), టీచర్స్ (ఐలాండ్), జానీవాకర్ బ్లాక్‌లేబుల్, రెడ్ లేబుల్, బ్లూలేబుల్,చివాస్రీగల్, గ్లెన్‌ఫిడిచ్, రెడ్‌సెల్యూట్ బ్రాండ్లు రాష్ట్ర మార్కెట్లలో అందుబాటులో ఉన్నాయని అంటున్నాయి. వీటితో పాటు మరికొన్ని బ్రాండ్లు కూడా అందుబాటులోకి వస్తుండగా, ప్రీమియం బ్రాండ్ల అమ్మకాల్లో పెరుగుదల నమోదు కావడం ఎౖMð్సజ్ వర్గాలకు ఊరట కలిగిస్తోంది. -
డిపాజిటర్లకు మరింత ధీ(బీ)మా!
న్యూఢిల్లీ: బ్యాంకుల్లో డిపాజిట్లకు మరింత రక్షణ కలిపించే రోజులు కనుచూపుమేరలోనే ఉన్నాయి. ప్రస్తుతం ఒక వ్యక్తి ఒక బ్యాంకు పరిధిలో ఎంత మేర డిపాజిట్ చేసినా కానీ, ఆ బ్యాంకు సంక్షోభం బారిన పడితే గరిష్టంగా రూ.లక్ష వరకే పొందే అవకాశం ఉంది. డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) స్కీమ్ కింద బ్యాంకులు ఈమేరకు బీమాను అందిస్తున్నాయి. కానీ, గత 25 ఏళ్లుగా ఈ బీమా కవరేజీ రూ.లక్ష దగ్గరే ఉండిపోయింది. మారుతున్న పరిస్థితులతోపాటు బీమా కూడా పెరగాల్సి ఉన్నప్పటికీ అది ఆచరణ దాల్చలేదు. ఇటీవలి పీఎంసీ బ్యాంకు సంక్షోభం డిపాజిట్ ఇన్యూరెన్స్ మొత్తాన్ని పెంచాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది. 25 ఏళ్ల క్రితం గరిష్టంగా రూ.లక్ష బీమాను నిర్ణయించడం, నాటి రోజులకు అనుగుణంగానే ఉన్నది. కానీ, ఆర్జనా శక్తి పెరిగి, బ్యాంకుల్లో అధిక మొత్తంలో నిధులను ఉంచుతున్న నేటి పరిస్థితుల్లో ఈ బీమా ఏ మాత్రం చాలదు. దీన్ని పెంచాలన్న డిమాండ్లు బలంగా వినిపిస్తున్నాయి. దీంతో ఈ అంశాన్ని డీఐసీజీసీ పరిగణనలోకి తీసుకుంది. దీనిపై త్వరలో కేంద్ర ఆర్థిక శాఖకు ఓ నివేదిక సమ్పరించనుంది. 25 ఏళ్లుగా రూ.లక్ష వద్దే.. డిపాజిట్ ఇన్సూరెన్స్‌ను చివరిగా 1993లో సవరించారు. అప్పటి వరకు గరిష్ట బీమా రూ.30,000కే ఉండగా, రూ.లక్షకు పెంచారు. నాటి నుంచి సవరణ జోలికి వెళ్లలేదు. 2018–19 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 2,098 బ్యాంకులు డీఐసీజీసీ స్కీమ్ పరిధిలో నమోదై ఉన్నాయి. వీటిల్లో 157 వాణిజ్య బ్యాంకులు కాగా, 1,941 కోపరేటివ్ బ్యాంకులు. డీఐసీజీసీ ఆర్బీఐ అనుబంధ సంస్థ. బ్యాంకుల్లో డిపాజిట్లకు బీమా అందించేందుకు ఏర్పాటు చేశారు. బీమా కవరేజీ కోసం బ్యాంకులు డీఐసీజీసీకి ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. 2018–19లో డిపాజిట్ల ఇన్సూరెన్స్ ప్రీమియం కింద బ్యాంకుల నుంచి రూ.12,043 కోట్లను డీఐసీజీసీ వసూలు చేసింది. వచ్చిన క్లెయిమ్‌లు రూ.37 కోట్లుగా ఉన్నాయి. ఇటీవలి పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోపరేటివ్ బ్యాంకు (పీఎంసీ బ్యాంకు) సంక్షోభం మరోసారి దేశంలోని బ్యాంకు డిపాజిట్ల బీమాపై ప్రశ్నలకు దారితీసిందని ఎస్బీఐ పరిశోధన నివేదిక ఇటీవలే పేర్కొంది. ‘‘మొత్తం అంచనా వేయతగిన డిపాజిట్లలో బీమా కవరేజీ ఉన్న డిపాజిట్లు 1981–82లో 75%గా ఉంటే, 2017–18 నాటికి అది 28%కి తగ్గిపోయింది. దీంతో బ్యాంకు డిపాజిట్లపై బీమా కవరేజీని సమీక్షించాల్సిన అవసరం ఎంతో ఉంది’’ అని ఎస్బీఐ గ్రూపు ముఖ్య ఆరి్థక సలహాదారు సౌమ్యకాంతిఘోష్ అన్నారు. పరిశీలనలో కొత్త విధానం బ్యాంకుల్లో ప్రతీ రూ.100 డిపాజిట్‌కు ప్రీమియం కింద ఫ్లాట్‌గా 10పైసలను వసూలు చేస్తుండగా, నూతన విధానానికి మళ్లడం ఆచరణ సాధ్యమా అన్న దానిపై డీఐసీజీసీ ప్రస్తుతం దృష్టి పెట్టినట్టు ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ‘‘సవరించిన పథకానికి ఆర్బీఐ, కేంద్ర ఆరి్థక శాఖ ఆమోదం తెలిపితే.. అప్పుడు పర్సనల్, ఇనిస్టిట్యూషనల్ అని రెండు రకాల డిపాజిట్ దారులు ఉంటారు. పర్సనల్ కేటగిరీలోకి రిటైల్, చిన్న వ్యాపారుల డిపాజిట్లు వస్తాయి. ఇనిస్టిట్యూషనల్ విభాగంలోకి పెద్ద కార్పొరేట్లు, ట్రస్ట్‌లు, ప్రభుత్వ ఏజెన్సీల డిపాజిట్లు వస్తాయి. ఒకేసారి కాకుండా క్రమంగా బీమా మొత్తాన్ని రూ.3 లక్షలకు పెంచే అవకాశం ఉన్నట్టు ఆరి్థక శాఖ వర్గాలు పేర్కొన్నాయి. రూ.5 లక్షలకు పెంచాలి! బ్యాంకుల్లో డిపాజిట్ ఇన్సూరెన్స్ గరిష్ట పరిమితిని రూ.5లక్షలకు పెంచాలని బ్యాంకు సేవలపై సూచనల కోసం ఆర్బీఐ నియమించిన ఎం.దామోదరన్ కమిటీ 2011లోనే సిఫారసు చేసింది. కానీ, నాటి యూపీఏ సర్కారు దీన్ని ఆచరణలోకి తీసుకురాలేకపోయింది. కొంత కాలంగా ఆరి్థక శాఖ డిపాజిట్ ఇన్సూరెన్స్ పెంపును పరిశీలిస్తోంది. తాజాగా పీఎంసీ బ్యాంకు సంక్షోభం ఈ అవసరాన్ని మళ్లీ గుర్తు చేసింది. దీంతో డీఐసీజీసీ 50 ఏళ్ల నాటి డిపాజిట్ ఇన్సూరెన్స్ పథకాన్ని సమీక్షిస్తోంది. ‘డీఐసీజీసీ బోర్డు ఈ ప్రక్రియను ఆరంభించింది. నివేదికను ఆరి్థక శాఖకు సమరి్పస్తుంది. తదుపరి ఆర్బీఐ సెంట్రల్ బోర్డు సమావేశంలో దీనిపై నిర్ణయం ఉంటుంది’ అని ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. -
మార్కెట్లోకి మరో సూపర్ టీవీ వచ్చేసింది
సాక్షి, ముంబై: దేశీయ టీవీ మార్కెట్లో సూపర్ టీవీ లాంచ్ చేసింది. ప్రపంచంలోనే తొలి 100 అంగుళాల 4కే ఎల్ఈడీ టీవీ భారత మార్కెట్లోకి లాంచ్ చేసిన వూ కంపెనీ దీనికి అప్‌గ్రేడెడ్‌గా వు 100 సూపర్ టీవీ పేరుతో మరో కొత్త టీవీని లాంచ్ చేసింది. ఆండ్రాయిడ్, విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా ఈ టీవీలను తీసుకొచ్చింది. ఈ టీవీ వచ్చే వారం నుండి భారతీయ వినియోగదారుల కోసం కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఈ 100 అంగుళాల 4 కె సూపర్ టీవీ ధర అక్షరాలా రూ. 8 లక్షలు. వు 100 సూపర్ టీవీ ఫీచర్లు 100 అంగుళాల 4కె డిస్ప్లే ఆండ్రాయిడ్, విండోస్ 10 ఆధారం ఇంటెల్ కోర్ ఐ 3 , కోర్ ఐ 5 ప్రాసెసర్ ఆప్షన్స్ 4జీబీ డిడిఆర్ ర్యామ్/ 120జీబీ ఆన్‌బోర్ట్ స్టోరేజ్ టీవీ ట్యూనర్ టెక్నాలజీన, స్కైప్ కాల్స్, వైర్లెస్ క్వార్ట్లీ కీబోర్డ్, ఎయిర్ మౌస్, రిమోట్ కంట్రోల్, డాల్బీ, డిటిఎస్ ఆడియో సపోర్ట్, ఇన్‌బిల్ట్ వూఫర్, 2,000 వాట్ల సౌండ్ అవుట్‌పుట్‌తో జెబీఎల్ స్పీకర్లు లాంటివి ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి. మెరుగైన మల్టీమీడియా అనుభవాన్ని అందించే ఈ సూపర్ టీవీ కనెక్టివిటీ పరంగా, మూడు యుఎస్బి పోర్ట్‌లు, బ్లూటూత్ వి 5.0, హెచ్డిఎంఐ,ఎవి, వైపిబిపిఆర్,ఆర్ఎఫ్ సపోర్ట్‌లతో పనిచేస్తుంది. లగ్జరీ, టెక్నాలజీ చాలా సాధారణంగా మారిన ప్రస్తుత తరుణంలో భారతదేశంలో ప్రీమియం టీవీ విభాగంలో లీడర్‌గా వుండటం గర్వంగా ఉందని వు టెలివిజన్ ఛైర్మన్ దేవితా సరాఫ్ తెలిపారు. అంతేకాదు దేశవ్యాప్తంగా ఉన్న తమ వినియోగదారులకు అధిక నాణ్యత, విలాసవంతమైన వీక్షణ అనుభవాలను అందించడం కొనసాగించాలని ఆశిస్తున్నామన్నారు. కాగా వూ టెలివిజన్ ఇటీవల తన అల్ట్రా ఆండ్రాయిడ్ టీవీని భారతదేశంలో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ టీవీ సిరీస్ అమెజాన్ ఇండియా ద్వారా అందుబాటులో ఉంది. ఇవి మూడు వేర్వేరు స్క్రీన్ పరిమాణాలలో(32 అంగుళాల మోడల్ రూ.11,499కు, 40 అంగుళాల టీవీ రూ.18,999కు లభిస్తుంది. 43 అంగుళాల టీవీ రూ .20,999) లభిస్తుంది. -
చాలా మిస్సవుతున్నా.. ఈ నెంబర్‌కు కాల్ చెయ్!
సాక్షి, సిటీబ్యూరో: ‘ఒంటరిగా ఫీల్ అవుతున్నా. నిన్ను చాలా మిస్ అవుతున్నా. మీ గొంతు వినకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేను. ఈ నెంబర్‌కు కాల్ చెయ్యి’ అంటూ ఎస్సెమ్మెస్‘హలో హలో మీరు మాట్లాడుతోంది నాకు వినిపించట్లేదు. నేను చెప్పేది వినిపిస్తోందా? దయచేసి నాకు కాల్ బ్యాక్ చేయండి’ అంటూ మహిళల గొంతుతో హిందీలో ఫోన్కాల్స్వీటితో పాటు ఉక్రెయిన్, అజార్బైజాన్ తదితర దేశాల నంబర్లతో అర్ధరాత్రి వేళల్లో మిస్డ్కాల్స్ ఇటీవల కాలంలో పెరిగిపోయాయి. ఎవరైనా స్పందించి ఆయా నెంబర్లను సంప్రదిస్తే నిండా మునిగినట్లే. ఫోన్‌కాల్స్ బిల్లు భారీగా వస్తుంది. స్నేహం, ప్రేమ, డేటింగ్ పేరుతో వర్చువల్ నెంబర్లతో వల వేసి నిలువునా ముంచే ‘ప్రీమియం కాల్స్’ బెడద ఇటీవల పెరిగిందని సైబర్ క్రైమ్ నిపుణులు చెబుతున్నారు. యువతులు పేర్లతో బల్క్ ఎస్సెమ్మెస్‌లు పంపడం, ఫోన్లు చేయడం, మిస్డ్ కాల్స్ ఇవ్వడంతో పాటు ఎదుటి వారి బలహీనతలను ఆసరాగా చేసుకుని ఆన్లైన్లో దోచుకునే ఈ వ్యవహరంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. వర్చువల్ నంబర్లు ఎంపిక చేసుకుని... మెట్రో నగరాల్లో ఉంటున్న కొందరు ‘ప్రీమియం గాళ్లు’ తాము టార్గెట్‌గా చేసుకున్న వారికి పంపడానికి వర్చువల్ నంబర్లను వాడుతున్నారు. ఇంటర్నెట్లోని అనేక వెబ్సైట్లు ఈ ఫోన్ నెంబర్లను నిర్ణీత కాలానికి అద్దెకు ఇస్తుంటాయి. ఆయా సైట్లలో ప్రపంచంలోని అన్ని దేశాలకు చెందిన, వివిధ సర్వీసు ప్రొవైడర్లు అందించే కొన్ని నంబర్లు డిస్ప్లే అవుతుంటాయి. వీటిలో తమకు కావాల్సిన దేశానికి చెందిన వాటిని ఎంపిక చేసుకోవచ్చు. ఇందుకుఆ సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుంది. ఈ నంబర్లు ఇంటర్నెట్ కాలింగ్ ద్వారా పని చేస్తాయి. ఇలా వర్చువల్ నంబర్ పొందే వారు వాటిని బల్క్ ఎస్సెమ్మెస్ రూపంలో స్నేహం, ప్రేమ, డేటింగ్ అంటూ సదరు నంబర్‌ను ప్రచారం చేస్తారు. ఇవి ప్రీమియం నంబర్లు కావడంతో అసలు చార్జికి కొన్ని రెట్లు ఎక్కువ పడుతుంది. వివిధ టీవీ ఛానళ్లు నిర్వహించే ఎస్సెమ్మెస్ కాంటెస్ట్‌లు, ఫోన్ కాంటెస్టులకూ ఇలాంటి ప్రీమియం నంబర్లనే వాడతారు. ఎస్ఎంఎస్కు రూ.5, కాల్‌కు నిమిషానికి రూ.18 వరకు చార్జ్ పడుతుంది. ‘ప్రీమియంగాళ్లు’ వాడేవి ఇంటర్నేషనల్ రూటింగ్ కాల్స్ కావడంతో ఈ చార్జీలు మరింత ఎక్కువగా ఉంటాయి. ఇంటర్నేషనల్ క్యారియర్లతో ఒప్పందాలు... వినియోగదారుడు ఏ సర్వీసు ప్రొవైడర్‌కు చెందిన సిమ్ వాడితే బిల్లు వారికే చెల్లిస్తారు. అయితే సదరు సర్వీసు ప్రొవైడర్ ప్రతి కాల్‌కు కొంత మొత్తాన్ని బీఎస్ఎన్ఎల్కు చెల్లించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ కాల్ వెళ్లడానికి అవసరమైన శాటిలైట్ స్పేస్‌ను సర్వీసు ప్రొవైడర్ బీఎస్ఎన్ఎల్ నుంచే అద్దెకు తీసుకోవాలి. ఇలా బీఎస్ఎన్ఎల్ పరిధి జాతీయ స్థాయిలో మాత్రమే ఉంటుంది. ఇంటర్నేషనల్ కాల్స్‌కు సంబంధించి ఆ సంస్థ కూడా ఇంటర్నేషనల్ క్యారియర్స్‌తో ఒప్పందాలు చేసుకుంటుంది. వీరు దేశం దాటే కాల్స్‌ను ఆయా దేశాలకు ఎన్‌రూట్ చేస్తారు. దీని నిమిత్తం బీఎస్ఎన్ఎల్ సంస్థ కూడా వారికి నిర్ణీత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ‘ప్రీమియం’ ఒప్పందాలు... బల్క్ ఎస్సెమ్మెస్‌లు పంపే ‘ప్రీమియంగాళ్లు’ ఆ నెంబర్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకునే వెబ్సైట్లకు ఇలాంటి ఇంటర్నేషనల్ క్యారియర్లతో ఒప్పందాలు ఉంటాయి. సంక్షిప్త సందేశానికి ఆకర్షితుడై ఎవరైనా ఫోన్ చేస్తే... మాట్లాడటానికి కొందరు యువతులను ఏర్పాటు చేసుకుంటారు. ఈ కాల్స్ అన్నీ ఇంటర్నేషనల్ రూటింగ్ ద్వారా వస్తాయి. వీరు సంభాషణను వీలైనంత పొడిగించేందుకు ప్రయత్నం చేస్తుంటారు. దీంతో భారీగా పడే ప్రీమియం చార్జీలు ఫోన్ చేసిన వ్యక్తి (బాధితుడి) సర్వీసు ప్రొవైడర్‌కు... అక్కడ నుంచి బీఎస్ఎన్ఎల్ ద్వారా ఇంటర్నేషనల్ క్యారియర్‌కు చేరతాయి. తన రాబడి పెంచినందుకు ఇంటర్నేషనల్ క్యారియర్ నుంచి కొంత కమిషన్ వెబ్సైట్ నిర్వాహకుడిని చేరుతుంది. ఇందుకుగాను ‘ప్రీమియంగాళ్ళ’కు వెబ్సైట్ నిర్వాహకులు కమీషన్ చెల్లిస్తారు. ఈ చెల్లింపులు రోజు, వారం, పక్షం, నెలకు ఒకసారి చొప్పున ఉంటాయి. ఇవన్నీ ఆన్లైన్లోనే జరిగిపోతాయి. ఇలా ఇంటర్నేషనల్ కాల్ ట్రాఫిక్ జనరేషన్ కోసం, ధనార్జన కోసం అమాయకులకు సంక్షిప్త సందేశాలు పంపుతుంటారు. కట్టడి అంత తేలిక కాదు ఈ తరహా ప్రీమియం నంబర్ల బాధితులు ఇటీవల పెరుగుతున్నారు. తమకు న్యాయం చేయమంటూ సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్లను ఆశ్రయిస్తున్నారు. అయితే వర్చువల్‌గా ఉండే ఈ నెంబర్ల మూలాలు కనుక్కోవడం, కట్టడి చేయడం అత్యంత కష్టసాధ్యం. ఆయా వెబ్సైట్లకు సంబంధించిన సర్వర్లు విదేశాల్లో ఉండటమే దీనికి కారణం. వీటి బారినడపకుండా జాగ్రత్తగా ఉండటమే ఉత్తమం. అపరిచిత నంబర్ల నుంచి స్నేహం, ప్రేమ, డేటింగ్ అంటూ వచ్చే సంక్షిప్త సందేశాలకు స్పందించకూడదు. వినియోగదారుల బలహీనతలే పెట్టుబడిగా ఈ ముఠాలు పని చేస్తుంటాయని మర్చిపోవద్దు.– సైబర్ క్రైమ్ అధికారి -
5శాతం ప్రీమియం : ఇండోస్టార్ డెబ్యూ లిస్టింగ్
సాక్షి,ముంబై: ఐపీవోలో అదరగొట్టిన ఎన్బీఎఫ్సీ సంస్థ ఇండోస్టార్ కేపిటల్ ఫైనాన్స్ లిస్టింగ్‌లో ప్రీమియంతో డెబ్యూలో శుభారంభాన్నిచ్చింది. సోమవారం స్టాక్ ఎక్స్ఛేంజీలలో దాదాపు 5 శాతం ప్రీమియంతో లిస్టయ్యింది. ఇష్యూ ధర రూ. 572 కాగా.. బీఎస్ఈలో రూ. 28 లాభంతో రూ. 600 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. . ప్రస్తుతం 3.7 శాతం బలపడి రూ. 593 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 606 వద్ద గరిష్టాని నమోదు చేసింది. ఇటీవల ఐపీవోకు దాదాపు 7 రెట్లు ఆదరణతో రూ. 1844 కోట్లను సమీకరించింది. ఇండోస్టార్ క్యాపిటల్ ఫైనాన్స్ ఐపీవోకు భారీ స్పందన లభించింది. మొత్తం రూ.1844 కోట్లు విలువ చేసే ఐపీవో ఏడురెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. ఇష్యూకి ముందురోజు యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి నిధులను సమీకరించింది. 24 యాంకర్ సంస్థలకు 96.7 లక్షల షేర్లను కేటాయించింది. షేరుకి రూ. 572 ధరలో వాటాను కేటాయించడం ద్వారా రూ. 553 కోట్లను సమకూర్చుకుంది. ఆఫర్లో భాగంగా రూ.700 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయడంతో పాటు, ప్రస్తుత వాటాదారులకు చెందిన 30 శాతం వాటాకు సమానమైన 2 కోట్ల షేర్లను సైతం విక్రయానికి ఉంచింది. కాగా.. ఇన్వెస్ట్ చేసిన యాంకర్ సంస్థలలో ఎస్బీఐ ఎంఎఫ్, హెచ్డీఎఫ్సీ ఎంఎఫ్, ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ ఎంఎఫ్, ఐసీఐసీఐ లంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ తదితరాలున్నాయి. ప్రధానంగా కార్పొరేట్ రుణాలు, వాహన రుణాల వ్యాపారంలో ఉన్నఇండోస్టార్ క్యాపిటల్ మొత్తం విలువ రూ.5,200 కోట్లుగా అంచనా. ఈ ఐపీవోకు మోతీలాల్ ఓస్వాల్, మోర్గాన్ స్టాన్లీ, నొమోరాలు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లుగా వ్యవహరిస్తున్నాయి. -
సుజుకీ జీఎస్ఎక్స్–ఎస్750@ రూ.7.45 లక్షలు
సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా తొలి 750 సీసీ సూపర్ బైక్‌ను మార్కెట్లోకి తెచ్చింది. జీఎస్ఎక్స్–ఎస్750 పేరుతో అందిస్తున్న ఈ బైక్ ధర రూ.7.45 లక్షలు(ఎక్స్‌షోరూమ్, ఢిల్లీ) అని కంపెనీ తెలిపింది. భారత మార్కెట్ కోసం ప్రతి ఏడాది కొత్త బైక్‌లను, ప్రీమియమ్ బైక్‌లను అందించే కట్టుబడిలో భాగంగా ఈ సూపర్ బైక్‌ను మార్కెట్లోకి తెచ్చామని సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా ఎండీ, సతోషి యుచిడా పేర్కొన్నారు. ఈ కొత్త ఆర్థిక సంవత్సరంలో తామందిస్తున్న తొలి కొత్త బైక్ ఇదని, అంతేకాకుండా 1,000 సీసీ కంటే తక్కువగా ఉండే కేటగిరీలో కూడా ఇదే తొలి మోటార్‌సైకిల్ అని వివరించారు. ఈ బైక్‌ను 749 సీసీ ఫోర్ సిలిండర్ ఫ్యూయల్–ఇంజెక్షన్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌తో రూపొందించామని తెలిపారు. యాంటీ–లాక్ బ్రేక్స్‌తో కూడిన డిస్క్ బ్రేక్‌లు, ఎల్ఈడీ టెయిల్‌ల్యాంప్స్ తదితర ఫీచర్లున్నాయని పేర్కొన్నారు. ఈ బైక్ గరిష్ట వేగం గంటకు 320 కి.మీ. కాగా, మైలేజీ లీటర్‌కు 20 కి.మీ. ఇస్తుందని అంచనా. ఈ బైక్ కవాసకి జెడ్900, ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్, అప్రిలియా షివర్ 900 తదితర సూపర్ బైక్‌లకు గట్టి పోటీనిస్తుందని పరిశ్రమ వర్గాలంటున్నాయి. -
లిస్టింగ్‌లో అదరగొట్టిన బంధన్ బ్యాంక్
సాక్షి,ముంబై: కోలకతాకు చెందిన ప్రయివేట్ రంగ సంస్థ బంధన్ బ్యాంక్ లిస్టింగ్‌లో అదరగొట్టింది. డెబ్యూ లిస్టింగ్‌లో 33శాతం ప్రీమియం లాభాలతో లిస్ట్ అయింది. అయ్యింది. ఇష్యూ ధర రూ. 375 కాగా.. బీఎస్ఈలో 499 వద్ద గరిష్టాన్ని తాకింది. మార్చి 19న ముగిసిన ఇష్యూ బ్యాంక్ స్టాక్ ఎక్స్ఛేంజీలలో లాభాలతో లిస్టయ్యింది. గత వారం దాదాపు 15 రెట్లు అధికంగా సబ్స్క్యయిబ్ అయింది. రూ. 375 ధరలో చేపట్టిన ఐపీవో ద్వారా బ్యాంకు రూ. 4,473 కోట్లు సమీకరించింది. ఇష్యూలో భాగంగా బ్యాంకు 8.35 కోట్ల షేర్లను అమ్మకానికి ఉంచగా.. దాదాపు 122 కోట్ల షేర్ల కోసం బిడ్స్ దాఖలైన సంగతి తెలిసిందే. ఇష్యూ ముందు రోజు యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి బంధన్ బ్యాంకు రూ. 1342 కోట్లను సమీకరించింది. షేరుకి రూ. 375 ధరలో 65 యాంకర్ సంస్థలకు దాదాపు 3.58 కోట్ల షేర్లను విక్రయించింది. కాగా బంధన్ బ్యాంకు ప్రధానంగా పశ్చిమ బెంగాల్, అసోం, బీహార్ తదితర తూర్పు, ఈశాన్య రాష్టాలలో కార్యకాలాపాలు విస్తరించింది. గత ఏడాది డిసెంబర్ 31 నాటికి మొత్తం 887 బ్రాంచీలలో 58 శాతం శాఖలను ఈ ప్రాంతాలలోనే ఏర్పాటు చేసింది. మొత్తం430 ఏటీఎంలను ఏర్పాటు చేసింది. మైక్రో ఫైనాన్సింగ్ బిజినెస్‌లో పట్టుసాధించిన సంస్థ తదుపరి సాధారణ బ్యాంకింగ్ సర్వీసులు అందించేందుకు లైసెన్సింగ్‌ను పొందింది. దాదాపు 2.13 మిలియన్లకుపైగా ఖాతాదారులను కలిగి ఉంది. -
అతి ఖరీదైన కారు లాంచ్..
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత విలువైన కార్లకు పెట్టింది పేరైన లగ్జరీ కార్ మేకర్ రోల్స్ రాయిస్ పాంథమ్ కొత్త ప్రీమియం మోడల్స్‌ను లాంచ్ చేసింది. పాంథమ్ ఎనిమిదో ఎడిషన్‌గా రెండు వేరియంట్లను నార్త్ ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. స్టాండర్డ్ మోడల్ ఎక్స్ షోరూం ధర రూ. 9.5 కోట్లుగా నిర్ణయించింది. ఎక్స్‌టెండెండ్ వీల్ బేస్ వెర్షన్ మోడల్ ధర రూ.11.35 కోట్లుగా నిర్ణయించింది. సురక్షితమైన ప్రయాణ అనుభవాన్ని కస్టమర్లకు అందించేలా హెడ్లైట్లు (లేజర్ లైట్ టెక్నాలజీన) రాత్రిపూట 600 మీటర్ల వెలుతురును అందిస్తాయని కంపెని చెబుతోంది. ఈ కొత్త జనరేషన్ పాంథమ్‌ను అల్యూమినియం స్పేస్ ఫ్రేమ్ ప్లాట్‌ఫాంతో రూపొందించారు. గత మోడల్ కంటే ఇది తేలిగ్గా ఉంటుందట. 6.75 లీటర్ల ట్విన్ టర్బో చార్జ్డ్ వీ 12 ఇంజీన్ రూపొందించిన కారు కేవలం 5.3 సెకన్లలోనే 100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. విండ్‌స్క్రీన్‌తో అనుసంధానమైన 'ఫ్లాగ్ బేరర్' తో కూడిన స్టీరియో కెమెరా సిస్టమ్ రోడ్డును చూసి, దానికనుగునంగా సస్పెన్షన్ సర్దుబాటు చేస్తుంది. స్టార్ లైట్ రూఫ్, డోర్లను క్లోజ్ చేసే బటన్లు తదితర ఫీచర్లు ప్రధానంగా ఉండనున్నాయయి. బిజినెస్ క్లాస్ కస్టమర్లకు అద్భుతమైన రైడింగ్ అనుభవం అందించనుంది. అంతేకాదు ఈ కార్ల కొనుగోలుపై లాంచింగ్ ఆఫర్‌గా 24 గంటల రోడ్ సైడ్ సపోర్ట్ , రీజనల్ వారంటీతోపాటు నాలుగేళ్లపాటు సర్వీస్‌ను ఉచితంగా అందించనుంది. జనాభా ఇతర దేశాల కన్నా ఎక్కువ పెరుగుతుండటం , ప్రామాణికమైన, బెస్పోక్ లగ్జరీ కార్లపై ఆసక్తి కారణాల రీత్యా ఇండియాలో తమకు ఆకర్షణీయమైన మార్కెట్ నిలుస్తోందని రోల్స్ రాయ్స్ మోటార్ కార్స్, ఆసియా పసిఫిక్ రీజినల్ డైరెక్టర్ పాల్ హారిస్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని సెలెక్ట్ కార్స్ ప్రయివేట్ లిమిటెడ్ ఏకైక అధికార డీలర్‌గా రోల్స్ రాయిస్ ఎంచుకుంది. -
టర్మ్ ప్లాన్‌తో మరింత ధీమా!!
సొంతిల్లు లేదా వాహనం కొనుక్కోవడం, పిల్లల చదువులు.. పెళ్లిళ్లు మొదలైన లక్ష్యాలకు అవసరమైన నిధులు సమకూర్చుకునేందుకు మనం ఎంతగానో ఆలోచిస్తాం. భవిష్యత్ ఆర్థిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని పొదుపు.. పెట్టుబడుల కోసం మనం ఫిక్స్డ్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్స్, పోస్టల్ స్కీమ్స్ లాంటి అనేక సాధనాలు ఎంచుకుంటూ ఉంటాం. వీటితో పాటు జీవిత బీమా కూడా కీలకమైనదే. ఇంటిల్లిపాదీ ఆధారపడిన ఇంటిపెద్దకు అనుకోనిదేదైనా జరిగినా.. కుటుంబం ఆర్థిక సంక్షోభంలో పడకుండా బీమా భరోసానిస్తుంది. జీవిత బీమాకు సంబంధించి అత్యంత తక్కువ ప్రీమియంతో అత్యధిక కవరేజీని అందించేవి టర్మ్ ప్లాన్లు. వీటి గురించి అవగాహన కల్పించేదే ఈ కథనం.. ఓ రూ. 10 లక్షలు పెట్టి ఒక కొత్త కారు కొన్నామనుకోండి. దానికేమీ కాకుండా ముందుగా తగినంత కవరేజీ ఉండేలా వాహన బీమా తీసుకోవాలని ఆలోచిస్తాం. ఇందుకోసం ఏటా రూ. 25,000 నుంచి రూ. 30,000 దాకా ప్రీమియం కడతాం. వాహనం గురించే ఇంతగా ఆలోచిస్తున్నప్పుడు ఎంతో విలువైన మన జీవితం గురించి, మనమీద ఆధారపడిన కుటుంబ సభ్యుల గురించి ఇంకెంత ఆలోచించాల్సి ఉంటుంది. కారు భద్రత కోసం భారీ ప్రీమియం కట్టేందుకు సిద్ధపడే మనం .. అంతకన్నా ఎక్కువ విలువైన జీవితానికి బీమా తప్పకుండా తీసుకోవాల్సిందే. ఇందుకోసం తోడ్పడే టర్మ్ పాలసీలు చాలా చౌకైనవి.. అత్యంత విలువైన మన జీవితాలకు, మనం ఎంతగానో ప్రేమించే కుటుంబానికీ భరోసానిచ్చే వి. వీటితో ఏటా అత్యంత తక్కువగా రూ. 8,000 నుంచి రూ. 10,000 దాకా ప్రీమియంతో ఏకంగా రూ. 1 కోటి దాకా కవరేజీని పొందవచ్చు (సిగరెట్ అలవాటు లేని ముప్పయ్ ఏళ్ల వ్యక్తికి). కవరేజీ లెక్క ఇలా.. సరే.. టర్మ్ పాలసీ తీసుకోవాలనుకుంటే ఎంత కవరేజీ ఉండేలా చూసుకోవాలన్న ప్రశ్న కూడా తలెత్తుతుంది. ప్రధానంగా మూడు అంశాలు ఈ విషయానికి సంబంధించి పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అవేంటంటే.. ♦ బేస్ లైఫ్ కవర్: సుమారు 40 ఏళ్ల దాకా వయస్సు ఉన్న వేతన జీవులు తమ వార్షికాదాయానికి కనీసం 20–30 రెట్లు సమానమైన కవరేజీ ఉండేలా చూసుకోవడం మంచిది. ఇక నలభైలలో ఉన్నవారు వార్షికాదాయానికి 10–20 రెట్లు, యాభైలలో ఉన్న వారు 5–10 రెట్లు కవరేజీ ఉండేలా చూసుకోవాలి. టర్మ్ లైఫ్ కవరేజీ.. పదవీ విరమణ చేసే దాకా కొనసాగేలా ఉండాలి. ♦ రుణాలు: ఇతరత్రా చెల్లించాల్సిన రుణాలు మొదలైనవేమైనా ఉంటే టర్మ్ ప్లాన్ తీసుకునేటప్పుడు... బేస్ లైఫ్ కవరేజీకి ఆ మొత్తాన్ని కూడా జోడించి లెక్కేయాలి. ఒకవేళ పాలసీదారుకు అర్ధంతరంగా ఏదైనా జరిగినా.. రుణభారంతో వారి కుటుంబం ఇబ్బందుల పాలు కాకుండా ఇది ఆదుకుంటుంది. ♦ క్రిటికల్ ఇల్నెస్ ప్రయోజనం: మన జీవన విధానాలు ఒక్కోసారి తీవ్ర అనారోగ్యాలకు దారి తీసే ప్రమాదముంది. కనుక క్రిటికల్ ఇల్నెస్ ప్రయోజనాలు కూడా అందించే టర్మ్ ప్లాన్‌ను ఎంచుకోవడం మంచిది. ఒకవేళ పాలసీదారు.. ప్లాన్‌లో పేర్కొన్న తీవ్రమైన అనారోగ్యాల బారిన పడిన పక్షంలో బీమా మొత్తాన్ని ఒకేసారి అందుకునే వీలు ఉంటుంది. పాలసీ తీసుకునేటప్పుడు వాస్తవాలు దాచిపెట్టొద్దు .. జీవిత బీమా పాలసీ తీసుకునేటప్పుడు బీమా సంస్థకు తప్పనిసరిగా కొన్ని వివరాలు తెలియజేయాలి. ముఖ్యంగా జీవన విధానాలు, వ్యక్తిగత.. కుటుంబ ఆరోగ్యం తదితర అంశాల్లో ఏదీ దాచిపెట్టే ప్రయత్నం చేయకపోవడమే మంచిది. ఇక పాలసీదారు ఆరోగ్యాన్ని మదింపు చేయడానికి బీమా సంస్థ వైద్య పరీక్షల నివేదికలను కోరే అవకాశంఉంది. కస్టమర్‌కి ఎంత మేర కవరేజీ ఇవ్వొచ్చన్నది అంచనా వేసుకునేందుకు బీమా సంస్థకు ఇవి ఉపయోగపడతాయి. ఏ విషయంలోనూ తప్పుడు సమాచారం ఇవ్వడం లేదా.. వాస్తవాలను తొక్కిపెట్టి ఉంచడం లాంటిది చేస్తే క్లెయిమ్ సమయంలో సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. - ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ,లైఫ్ ఇన్సూరెన్స్ -
తక్కువ ప్రీమియంతో విద్యార్థికి బీమా భరోసా
పశ్చిమగోదావరి, నిడమర్రు : జిల్లాలో అన్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అతి తక్కువ ప్రీమియంతో విద్యార్థి బీమా భద్రత పాలసీ జిల్లా పరిషత్ ఆధీనంలో అమలవుతుంది. ప్రతీ ఏటా ఫిబ్రవరి నెలలో ఈ ప్రీమియం చెల్లింపు కార్యక్రమం జరుగుతుంది. ఈ పాలసీ బేసిక్ ప్రీమియం రూ.5.900లను జిల్లా పరిషత్ నుంచి చెల్లిస్తారు. ఈ బీమాకు సంబంధించి కొత్త/ రెన్యూవల్ ప్రీమియంను నగదు రూపంలో ఈ నెల 26వ తేదీలోపు సంబంధిత బీమా కంపెనీకి చెల్లించాలని జిల్లా విద్యాశాఖాధికారిణి సీవీ రేణుక పాఠశాలల ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. ఆ వివరాలు తెలుసుకుందాం. రూ.5 ప్రీమియం జిల్లాలోని జెడ్పీ స్కూళ్లలో 6 నుంచి 10వ తరగతి వరకూ చదువుతున్న ప్రతీ విద్యార్థి ఈ భద్రత బీమా పాలసీ పథకానికి అర్హులు. ఆయా పాఠశాలల హెచ్ఎంల ద్వారా ఒక విద్యార్థి ఏడాదికి రూ.5 చొప్పున మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. కవరేజ్ కాలపరిమితి ఈ బీమా పాలసీ కవరేజ్ ఒక్కో విద్యార్థికి ఏడాది కాలానికి వర్తించును. పాలసీ కాల పరిమితి 2018 ఫిబ్రవరి 27వ తేదీ నుంచి 2019 ఫిబ్రవరి 26వ తేదీ వరకు ఉంటుంది. ఈ మధ్యకాలంలో విద్యార్థికి జరిగిన ప్రమాదాన్ని నిర్ధారణ చేసుకుని బీమా కంపెనీ సూచించిన బీమా సొమ్మును అతి తక్కువ సమయంలో చెల్లిస్తారు. జాబితా రూపంలో.. జిల్లాలోని అన్ని పాఠశాలల హెచ్ఎంలు ఈ నెల 26వ తేదీలోపు ఒక విద్యార్థికి రూ.5 చొప్పున జాబితా రూపంలో తయారు చేసి అందించాలి. విద్యార్థి పేరు, తరగతి, తండ్రి పేరు, అడ్మిషన్ నెంబరు, పుట్టిన తేదీ, ప్రీమియం సొమ్ము తదితర వివరాలు 2 స్టేట్మెంట్లు తయారు చేసుకుని చెల్లించాల్సిన మొత్తం ప్రీమియం సొమ్మును నేరుగా డీడీ రూపంలో యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, ఏలూరు వారికి ఈ నెల 26వ తేదీలోపు పంపించాలి. జిల్లా విద్యార్థులకే జిల్లాలోని జెడ్పీ స్కూల్ విద్యార్థులకు ఈ బీమా సౌకర్యం ప్రత్యేకం. రాష్ట్రంలోని ఏ జిల్లాలో లేని ఈ బీమా పథకం ఈ జిల్లాలో మాత్రమే జెడ్పీ సహకారంతో అమలవుతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులు ఉండటం వల్ల, వారి తల్లిదండ్రులకు ఈ బీమా ఉపయోగకరంగా ఉంది. – సీవీ రేణుక, జిల్లా విద్యాశాఖాధికారిణి, ఏలూరు -
శనగ ప్రీమియం చెల్లింపు గడువు పొడిగించండి
సాక్షి, వేముల : రబీలో సాగు చేసిన శనగపంటకు ప్రీమియం చెల్లింపు గడువు పొడిగించాలని కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్‌సింగ్, కార్యదర్శి ఎఫ్ఎం పట్నాయక్‌లకు బుధవారం లేఖ రాశారు. బీమా చెల్లింపు గడువు పెంచాలని పట్నాయక్‌తో ఫోన్లో మాట్లాడారు. వైఎస్సార్ జిల్లాలో 80 వేల హెక్టార్లలో రబీలో శనగ పంట సాగైందని, 50 వేల మందికి పైగానే రైతులు ప్రీమియం చెల్లించేందుకు ఎదురుచూస్తున్నారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందన్నారు. ప్రీమియం చెల్లించేందుకు మూడు రోజులే గడువుందని, రైతులందరూ గడువులోగా చెల్లించేందుకు ఇబ్బందులు పడుతున్నారన్నారు. తీవ్ర వర్షాభావం, తెగుళ్లతో పంటలు దెబ్బతింటే ఫసల్ బీమా వర్తిస్తుందన్న ఉద్దేశంతో రైతులు పంటకు ప్రీమియం చెల్లించేందుకు వారం నుంచి ఎదురుచూస్తున్నారన్నారు. ప్రీమియం మీసేవ ద్వారా చెల్లించేందుకు వెళ్లగా వెబ్సైట్ తెరుచుకోలేదన్నారు. బ్యాంక్‌లలో డీడీల రూపంలో ప్రీమియం చెల్లించాలని వ్యవసాయశాఖకు ఆదేశాలు అందాయని తెలిపారు. మూడు రోజుల వ్యవధిలో వేలమంది బ్యాంక్‌లలో డీడీలు తీయాలంటే సాధ్యమయ్యే పనికాదని లేఖలో పేర్కొన్నారు. రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రీమియం చెల్లించేందుకు మరో వారం గడువు ఇవ్వాలని కోరారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే శనగ పంటకు ప్రీమియం చెల్లించడంలో ఆలస్యమైందని, చర్యలు తీసుకోవాలని అవినాశ్‌రెడ్డి డిమాండ్ చేశారు. -
ఎల్జీ సిగ్నేచర్ ఎడిషన్ ధర ఎంతో తెలిస్తే..
ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ ఎల్జీ సెరామిక్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్లో ఎంట్రీ ఇచ్చింది. 'సిగ్నేచర్ ఎడిషన్' పేరుతో నూతన స్మార్ట్‌ఫోన్ ను తీసుకొస్తోంది. అత్యంత ఖరీదైన ప్రీమియం మెటీరియల్స్‌తో తయారు చేసిన ఈ డివైస్ ధర కూడా అంతే ఖరీదైనదిగా ఉంది. సుమారు రూ.1,18,800గా ఉండనుంది. జిర్కోనియం సెరామిక్ బ్యాక్ కవర్ పై ఎలాంటి ఎలాంటి గీతలు పడవట. ఇది ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెంట్ కూడా. అంతేకాదు ఈ డివైస్ బ్యాక్ కవర్‌పై ఔత్సాహిక కస్టమర్లు తమ సిగ్నేచర్‌ను ఎన్గ్రేవ్ చేయించుకోవచ్చు. ఇక ఫీచర్ల విషయానికి వస్తే... వైర్లెస్ చార్జర్, రెండు పవర్ ఫుల్ రియర్ కెమెరాలతో ఇది లభ్యం కానుంది. ప్రారంభ కొనుగోలుదారులు ఆకర్షించడానికిఎల్జీ కేవలం 300 యూనిట్లను మాత్రమే అందుబాటులో ఉంచుతున్నట్టు ప్రకటించింది. అయితే షావోమి ఆల్ సెరామిక్ వెర్షన్లో ఎంఐ మిక్స్ 2 , వచ్చే వారం ఇండియాలోకి రానున్న వన్ ప్లస్ 5టి స్టార్ వార్స్ ఎడిషన్ కూడా సెరామిక్ బిల్డ్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ మోడలే. ఎల్జీ సిగ్నేచర్ ఎడిషన్ ఫీచర్లు 6 ఇంచ్ భారీ ఫుల్ విజన్ డిస్ప్లే 1440x2880 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, 6 జీబీ ర్యామ్ 256 జీబీ స్టోరేజ్ 2 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ 16, 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా 5 ఎంపీ సెల్ఫీ కెమెరా, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ -
మాస్ ఫైనాన్షియల్ బ్లాక్ బస్టర్ లిస్టింగ్
సాక్షి, ముంబై: గత వారం పబ్లిక్ ఇష్యూ పూర్తిచేసుకున్న ఎంఏఎస్ ఫైనాన్షియల్ లిస్టింగ్‌లో కూడా అదరగొట్టింది. మంగళవారం స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టయిన ఎంఏఎస్ భారీ ప్రీమియంతో లాభాలను సాధిస్తోంది. ఇష్యూ ధర రూ. 459కాగా.. బీఎస్ఈలో రూ. 660 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. ఒకదశలో ఇంట్రాడేలో రూ. 668 వరకూ ఎగసింది. ప్రస్తుతం 48 శాతం వృద్ధితో ట్రేడవుతోంది. ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 460 కోట్లను సమకూర్చుకుంది. అక్టోబర్ 6-10 నుంచి కంపెనీకి చెందిన 460 కోట్ల ఆరంభ పబ్లిక్ ఆఫర్ (ఐపిఓ) 128 రెట్లు అధిగమించింది. సంస్థాగత భాగంలో 148 సార్లు , అధిక నికర-విలువ కలిగిన సంస్థాగత వర్గీకరణ వర్గం ద్వారా 378 సార్లు, రిటైల్ పెట్టుబడిదారుల విభాగంలో 16రెట్లు సబ్ స్క్రైబ్ అయింది. ఇష్యూలో భాగంగా కంపెనీ యాంకర్ ఇన్వస్టర్ల నుంచి సైతం రూ. 136 కోట్లు సమకూర్చుకున్న సంగతి తెలిసిందే. కాగా మాస్ ఫైనాన్షియల్ గుజరాత్లో గత రెండు దశాబ్దాలకు పైగా వ్యాపార కార్యకలాపాలలను నిర్వహిస్తోంది. ప్రధానంగా సూక్ష్మ, మధ్యతరహా సంస్థలతోపాటు మధ్య, తక్కువ ఆదాయ వర్గాలకు రుణాలను అందించడంపై దృష్టి కేంద్రీకరించింది. టూ వీలర్ లోన్స్ రుణాలు, వాణిజ్య వాహన రుణాలు , గృహ రుణాలతో కూడిన ఐదు కేటగిరీల్లో వీటిని అందించనుంది. తాజా ఇష్యూ ద్వారా సాధించిన నికర ఆదాయాన్ని భవిష్యత్ అవసరాలకు, మూలధన వృద్ధికి ఉపయోగించనుంది. -
బెంగళూరులో ఆవాస్ ప్రాజెక్ట్
సాక్షి, హైదరాబాద్: బాలాజీ డెవలపర్స్ సంస్థ బెంగళూరులో ప్రీమియం నివాస సముదాయానికి శ్రీకారం చుట్టింది. వైట్‌ఫీల్డ్‌లో ఇప్పటికే 4 ప్రాజెక్ట్‌లలో కలిపి సుమారు 600 ఫ్లాట్లను పూర్తిచేసిన ఈ సంస్థ.. ఇప్పుడు ఆవాస్ పేరిట నివాస సముదాయాన్ని నిర్మిస్తో్తంది. 1.80 లక్షల చ.అ.ల్లో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో 125 ఫ్లాట్లుంటాయని కంపెనీ ఎండీ అరవింద్ రెడ్డి తెలిపారు. ⇔ ప్రాజెక్ట్‌లో 44 యూనిట్లు 2 బీహెచ్‌కే, మిగిలినవి 3 బీహెచ్‌కే యూనిట్లుంటాయి. 1,245 నుంచి 1,770 మధ్య ఫ్లాట్ల విస్తీర్ణాలుంటాయి. ప్రస్తుతం శ్లాబ్, బ్రిక్ వర్క్ నడుస్తోంది. ధర చ.అ.కు రూ.5 వేలు. ఇదే ప్రాంతంలో ఈ ఏడాది ముగింపులోగా మరో ప్రాజెక్ట్‌ను ప్రారంభిం చనున్నాం. 2 ఎకరాల్లో 200 యూనిట్లు వస్తాయి. నిర్మాణ అనుమతుల దశలో ఉంది. -
చౌక పాలసీకి ఆన్లైన్ మార్గం!
తక్కువ ప్రీమియానికే అధిక కవరేజీ ⇒ ఆన్లైన్లో 10 శాతం తక్కువకే ఇవ్వాలన్న ప్రభుత్వం నచ్చిన వస్తువును ఆన్లైన్లో ఒక్క క్లిక్‌తో కొనేస్తున్న రోజులివి. కాలు బయటపెట్టకుండా... చౌకగా స్మార్ట్‌ఫోన్ నుంచే కొనే వెసులుబాటుంటే ఎవరాగుతారు చెప్పండి? మరి బీమా పాలసీలను సైతం ఇదే విధంగా ఆన్లైన్లో తీసుకోవచ్చని ఎప్పుడైనా ఆలోచించారా? భౌతికంగా పత్రాల రూపంలో, బీమా ఏజెంట్ సాయంతో తీసుకునే పాలసీలతో పోలిస్తే ఆన్లైన్ పాలసీలు తక్కువ ప్రీమియానికే అందుబాటులో ఉంటాయని గమనించారా? నిజం!! ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ఫలితంగా ఇప్పుడు ఈ పాలసీలు ఇంకాస్త చౌకగా మారాయి. ఆ వివరాలే ఈ కథనం.. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించాలన్న సంకల్పంతో... ప్రభుత్వ రంగంలోని ఎల్ఐసీ ద్వారా తీసుకునే జీవిత బీమా పాలసీలు, నాలుగు సాధారణ బీమా కంపెనీల నుంచి తీసుకునే మోటారు, ఆరోగ్య బీమా, ఇతర పాలసీలను 8 నుంచి 10 శాతం తక్కువకే అందించాలని కేంద్రం ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. అంటే ఏటా రూ.10,000 ప్రీమియం కట్టే చోట ఆన్లైన్ పాలసీ అయితే, రూ.వెయ్యి వరకు ఆదా చేసుకునేందుకు ప్రభుత్వ నిర్ణయం వీలు కల్పించింది. కనుక పాలసీ తీసుకునే ముందు ఆన్లైన్లో ఎల్ఐసీ, ఓరియెంటల్ ఇన్సూరెన్స్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్, నేషనల్ ఇన్సూరెన్స్, న్యూ ఇండియా అష్యూరెన్స్ సంస్థల సైట్లను ఆశ్రయించడం ద్వారా చౌకగా పాలసీలు ఏవైనా లభిస్తున్నాయేమో చూసుకోవాలి. ఆన్లైన్లో ఎందుకు చౌక? ఆన్లైన్ మాధ్యమంలో పాలసీల జారీ వల్ల కంపెనీలకు వ్యయాలు ఆదా అవుతాయి. మధ్యవర్తులు ఎవరూ ఉండరు. నేరుగా పాలసీదారుడు, కంపెనీకి మధ్య వ్యవహారాలు నడుస్తాయి. దాంతో పరిపాలనా, ఇతర కమీషన్ల వ్యయాలు కంపెనీలకు మిగులుతాయి. ఇలా మిగిలే మొత్తంలో కొంత శాతాన్ని ప్రీమియం తగ్గింపు ద్వారా పాలసీదారులకు బదిలీ చేస్తాయి. జీవిత బీమాల్లో టర్మ్ పాలసీలు, సాధారణ బీమాలో మోటారు, ఆరోగ్య, పర్యాటక బీమా పాలసీలు ఇలా పోటాపోటీగా చౌక ప్రీమియానికే లభించే పరిస్థితి ఉంది. ప్రీమియం వ్యవధి బట్టి రాయితీ ప్రీమియం తగ్గింపు అన్నది ఎన్నో అంశాలపై ఆధారపడి ఉంటుంది. బీమా కవరేజీ అధికంగా ఎంచుకుంటే తగ్గింపు ఎక్కువ లభిస్తుంది. ఎందుకంటే ఆ స్థాయిలో కంపెనీలకు వ్యయాలు మిగులుతాయి మరి. అలాగే, ప్రీమియం చెల్లింపు ఏడాదికోసారి అయితే రాయితీ ఎక్కువ లభిస్తుంది. అదే ఆరు నెలలకోసారి అయితే రాయితీ తగ్గుతుంది. నిజానికి ఆన్లైన్ విభాగంలో పాలసీల అమ్మకాలు తక్కువే. అందులోనూ సాధారణ బీమా కంపెనీల పాలసీల్లో ఇది మరింత తక్కువగా ఉందనేది ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ ఉన్నతాధికారి గుంజన్ ఘాయ్ మాట. అధిక శాతం సాధారణ బీమా కంపెనీలు ఆన్లైన్, ఆఫ్‌లైన్ కోసం వేర్వేరు పాలసీలను నిర్వహించడం లేదని ఆయన చెప్పారు. కానీ, జీవిత బీమా పాలసీల్లో ఈ పరిస్థితి లేదు. కంపెనీలు టర్మ్ పాలసీల్లో అయితే పోటాపోటీగా తక్కువ ప్రీమియంకే పాలసీలు ఆఫర్ చేస్తున్నాయి. ఎల్ఐసీలో రెండు పాలసీలే... ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ ఎల్ఐసీ... ఆన్లైన్ ద్వారా రెండు రకాల పాలసీలనే అందిస్తోంది. అవి టర్మ్ పాలసీలు, ఇమిడియెట్ యాన్యుటీ ప్లాన్స్. టర్మ్ పాలసీలను రూ.25 లక్షలు అంతకుమించిన కవరేజీతోనే అందిస్తోంది. రూ.50 లక్షలకు టర్మ్ పాలసీని 30 ఏళ్ల వ్యక్తి 30 ఏళ్ల కాలానికి ఎంచుకుంటే ఆన్లైన్ పాలసీలో ప్రీమియం సుమారు రూ.7,300 వరకు ఉంటోంది. ఇదే పాలసీని ఆఫ్‌లైన్‌లో బీమా కార్యాలయం నుంచి తీసుకుంటే ప్రీమియం రూ.11,600గా ఉంది. దీనికి సేవారుసుం అదనం. ఇక ఇమిడియట్ యాన్యుటీ పాలసీల్లో (పాలసీ తీసుకున్న తర్వాత నుంచి నెలవారీ, వార్షికంగా చెల్లింపులు చేసేవి/పెన్షన్ ప్లాన్లు). ఈ విభాగంలో ఎల్ఐసీ ఆన్లైన్లో తీసుకునే పాలసీల్లో ఒక శాతం అధిక రాబడులను అందిస్తోంది. ప్రోత్సాహకం ఏదీ...? ఆన్లైన్లో కొనుగోలు చేసే పాలసీలపై 8 నుంచి 10 శాతం వరకు తగ్గింపు లభిస్తుందని కేంద్ర ప్రభుత్వం డీమోనిటైజేషన్ తర్వాత ప్రకటించినప్పటికీ ప్రభుత్వ రంగంలోని నాలుగు సాధారణ బీమా కంపెనీలు ఇంత వరకు ఒక్క ఆన్లైన్ పాలసీనీ ప్రత్యేకంగా ప్రారంభించలేదు. ఎల్ఐసీ మాత్రం ప్రస్తుతం అందిస్తున్న పాలసీలకు... తొలి ఏడాది ప్రీమియంను 8 శాతం వరకూ తగ్గిస్తోంది. అయినప్పటికీ ప్రైవేటు రంగ బీమా కంపెనీలతో పోలిస్తే ఎల్ఐసీలో పాలసీ ప్రీమియంలు అధికమేనని చెప్పొచ్చు. ఉదాహరణకు ఎల్ఐసీ అన్మోల్ జీవన్ పాలసీలో 30 ఏళ్ల వ్యక్తి 15 ఏళ్ల కాలానికి రూ.15 లక్షల కవరేజీకి గాను ప్రీమియం రూ.4,571 (పన్నులతో కలుపుకుని). దీనిపై 8 శాతం తగ్గింపు అంటే రూ.365 పోను ప్రీమియం రూ.4,205గా ఉంటుందనుకోవచ్చు. కానీ, ఇంతే మొత్తం బీమా కవరేజీని ప్రైవేటు కంపెనీలు రూ.3,000 నుంచి రూ.3,500కే అందిస్తుండటం గమనార్హం. -
బీరాల బీమా !
ఏలూరు (మెట్రో) : ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన చంద్రన్న బీమా పథకం జిల్లాలో బీరాల బీమాగా మారింది. ఆచరణలో చతికిల పడింది. లబ్ధిదారుల ప్రీమియం జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థలో జమ కాకపోవడంతో 94,620 మంది బీమాకు దూరమయ్యే దుస్థితి నెలకొంది. ఈ పథకంలో ప్రీమియం మొత్తంలో రూ.270 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లిస్తాయి. లబ్ధిదారులు కేవలం రూ.15 చెల్లిస్తే సరిపోతుంది. అయితే అధికారుల అశ్రద్ధ, లబ్ధిదారులకు అవగాహన కల్పించడంలో నిర్లక్ష్యం వల్ల 94వేల 620 మంది చెల్లించాల్సిన బీమా ప్రీమియం జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థకు జమ కాలేదు. నమోదు ఘనం జిల్లా వ్యాప్తంగా తొలుత చంద్రన్న బీమా పథకానికి 14లక్షల 21వేల 322 మంది పేర్లను నమోదు చేసినట్టు అధికారులు ఘనంగా ప్రకటించారు. వీరంతా తమ వాటా ప్రీమియం రూ.15 చొప్పున చెల్లిస్తే రూ.2 కోట్ల 13లక్షల 19వేల 830 గ్రామీణాభివృద్ధి సంస్థకు జమ కావాలి. కానీ రూ. కోటి 99లక్షల 527 మాత్రమే జమ అయిందని అధికారులు చెబుతున్నారు. అంటే ఇంకా 14లక్షల 19వేల 303 రావాల్సి ఉంది. ఈలెక్కన 94వేల 620 మంది నుంచి ప్రీమియం రాలేదన్నమాట. ప్రీమియం కట్టారా.. మాయమయ్యాయా! ప్రీమియం జమ కాకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి స్మార్ట్‌పల్స్ సర్వే చేసిన సమయంలోనే ప్రీమియం మొత్తాలను లబ్ధిదారుల వద్ద నుంచి సర్వే సిబ్బంది వసూలు చేశారు. ఇప్పటివరకూ జమైన ప్రీమియం సొమ్ములు కూడా ఇలా వచ్చినవే. అయితే ఎప్పుడో వసూలు చేసిన ఈ డబ్బులు ఇంకా జమకాకపోవడం, అధికారికంగా లబ్ధిదారులకు బీమా పత్రాలు అందిచకపోవడం చూస్తుంటే నిజంగా వారి వద్ద నుంచి వసూలు కాలేదా, లేక వసూలు అయినా జమకాలేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రీమియం సొమ్మును సర్వే సిబ్బందికి అప్పగించడం, దీనిని పర్యవేక్షించే నాథుడు లేకపోవడం వల్లే ఈ దుస్థితి తలెత్తినట్టు తెలుస్తోంది. 30 వరకే గడువు ఈ పథకానికి బీమా ప్రీమియం చెల్లించే గడువు ఈ నెల 30 లోగా పూర్తికానుంది. దీంతో 94వేల మంది ప్రీమియం సొమ్ములు జమ కాకపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. 30లోగా అవి జమ కాకపోతే వారంతా బీమాకు దూరమయ్యే పరిస్థితి. ఉపయోగాలివీ.. చంద్రన్న బీమా పథకం ప్రకారం.. బీమాదారులు సహజంగా మరణిస్తే రూ.15వేలు, ప్రమాదవశాత్తూ మరణించినా, శాస్వత వైకల్యం పొందినా రూ.5లక్షలు, పాక్షిక వైకల్యం కలిగితే రూ.3.6లక్షలు ఆ వ్యక్తి కుటుంబానికి ప్రభుత్వం చెల్లిస్తుంది. బీమాదారుల పిల్లలకు ఏడాదికి రూ.1200 ఉపకార వేతనంగా తొమ్మిదోతరగతి నుంచి ఇంటరీ్మడియెట్ వరకూ చెల్లించనున్నారు. క్లెయిమ్‌ల పరిష్కారం ఇలా.. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 2వేల 438 మంది వివిధ ప్రమాదాల వల్ల బీమా పరిష్కారానికి క్లెయిమ్చేశారు. వారిలో 2వేల 122 మందికి క్లెయిమ్‌లు పరిష్కారమయ్యాయి. ఇంకా 316 మంది క్లెయిమ్‌లు పరిష్కారం కావాల్సి ఉంది. రూ.50 కోట్లు చాలదు ఆయిల్‌పామ్ అభివృద్ధికి రాష్ట్ర బడ్జెట్లో కేటాయించిన రూ.50కోట్లు సరిపోవు. జిల్లాలో ఎక్కువ విస్తీర్ణంలో ఆయిల్‌పామ్ తోటలు ఉన్నాయి. టన్నుకు కనీసం రూ.9వేల పైబడి ధర వస్తేనే గిట్టుబాటవుతుంది. ఎరువులపై సబ్సిడీ పెంచాలి. గెలల ధరను స్థిరీకరించాలి. – గడ్డమణుగు సత్యనారాయణ, ఆయిల్‌పామ్ రైతు -
చరిత్ర సృష్టించిన బీఎస్ఈ
న్యూఢిల్లీ : ఆసియాలోనే అత్యంత పురాతన ఎక్స్చేంజ్, దేశంలోనే రెండో అతిపెద్ద స్టాక్ ఎక్స్చేంజ్ బీఎస్ఈ శుక్రవారం చరిత్ర సృష్టించింది. తన ప్రత్యర్థి ఎన్ఎస్ఈలో బ్లాక్‌బస్టర్ హిట్‌తో లిస్టు అయింది. ఇష్యూ ధర రూ.806కు 34.62 శాతం ప్రీమియంతో షేర్లు రూ.1,085కు జంప్ అయ్యాయి. భారత్‌లో లిస్టవుతున్న మొట్టమొదటి స్టాక్ ఎక్స్చేంజ్ ఇదే. 5-15 శాతం ప్రీమియంతో బీఎస్ఈ స్టాక్ లిస్టవుతుందని విశ్లేషకులు అంచనావేశారు. జనవరి 23న మొట్టమొదటిసారి ఐపీఓకు వచ్చిన బీఎస్ఈకి మూడు రోజుల బిడ్డింగ్‌లో ఆఖరి రోజు బంపర్ డిమాండ్ వచ్చిన సంగతి తెలిసిందే. 51 రెట్ల సబ్‌స్క్రిప్షన్‌తో అదరగొట్టేసింది. అదేమాదిరి ఇప్పుడు కూడా బ్లాక్‌బస్టర్ హిట్‌తో మార్కెట్లో లిస్టు అయింది. అన్ని సెగ్మెంట్లో బీఎస్ఈకి 1,440 యునిక్ మెంబర్లున్నారు. ఆసియాలో పురాతనమైన ఎక్స్చేంజ్ అయిన బీఎస్ఈ 1875 జూలై 9న ఏర్పాటైంది. 2016 జూలై 30కు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఎక్స్చేంజ్ల్లో ఒకటిగా నిలిచింది. మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం ఇది ప్రపంచంలో 11వ అతిపెద్ద ఎక్స్చేంజ్. లిస్టెడ్ కంపెనీలతో దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ 1.52 ట్రిలియన్ డాలర్లు. -
బీమా చెల్లింపునకు రైతుల క్యూ
సింహాద్రిపురం: ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద పంటల బీమా ప్రీమియం చెల్లించేందుకు శనివారం రైతులు క్యూ కట్టారు. శనివారం పైడిపాలెం, చవ్వారిపల్లె, తెలికి గ్రామాలకు చెందిన రైతులు వెలుగు కార్యాలయం వద్ద ప్రీమియం చెల్లించారు. సోమవారం రావులకొలను, సుంకేసుల, నంద్యాలంపల్లె గ్రామాల రైతులు వెలుగు కార్యాలయం వద్ద ప్రీమియం చెల్లించవచ్చని ఏపీవో వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. -
ఈ ఏడాది లక్ష్యం రూ.4,200 కోట్లు
• పాత పాలసీల పునరుద్ధరణ గడువు 15తో పూర్తి • ప్రీమియంపై ఎల్ఐసీ సౌత్ సెంట్రల్ జోన్ వెల్లడి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 4,200 కోట్ల మేర కొత్త ప్రీమియం వసూళ్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు లైఫ్ ఇన్సూరెన్స కార్పొరేషన్ (ఎల్ఐసీ) సౌత్ సెంట్రల్ జోన్ మేనేజర్ టీసీ సుశీల్ కుమార్ తెలిపారు. ఇప్పటికే ఇందులో రూ.1,300 కోట్ల మేర వసూలరుుందని, గత ఆర్థిక సంవత్సరం ఈ వ్యవధితో పోలిస్తే ఇది సుమారు 51 శాతం అధికమని ఆయన వివరించారు. 2015-16లో కొత్త ప్రీమియం వసూళ్లు దాదాపు రూ. 3,307 కోట్లు. సంస్థ వజ్రోత్సవ వేడుకల సందర్భంగా గురువారమిక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సుశీల్ కుమార్ ఈ విషయాలు చెప్పారు. కార్యకలాపాల విస్తరణకు సంబంధించి గతేడాది మూడు శాఖలు ప్రారంభించగా, ఈ ఏడాది కొత్తగా విజయవాడలో ఇ-శాటిలైట్ కార్యాలయాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. సౌత్ సెంట్రల్ జోన్లో (ఆంధ్రప్రదేశ్, తెలం గాణ, కర్ణాటక) ప్రస్తుతం 17,924 మంది సిబ్బంది, 1.56 లక్షల పైచిలుకు ఏజెంట్లు, 314 శాఖలు, 190 శాటిలైట్ కార్యాలయాలు ఉన్నట్లు సుశీల్ తెలియజేశారు. జోన్లో మొత్తం 4.42 కోట్ల పాలసీదారులకు సేవలు అందిస్తున్నామని చెప్పారాయన. 2015-16లో దాదాపు రూ. 10,582 కోట్లు విలువ చేసే 24.90 లక్షల క్లెరుుములను సెటిల్ చేశామని.. డెత్ క్లెరుుమ్స్ విషయంలో 99.78 శాతం, మెచ్యూరిటీ క్లెరుుమ్స్‌లో 99.79 శాతం పరిష్కరించామని వివరించారు. పాత పాలసీల పునరుద్ధరణ కార్యక్రమం ఈ నెల 15తో ముగియనుందన్నారు. కొత్తగా మరో 3-4 పాలసీలు ప్రవేశపెట్టేందుకు ఐఆర్డీఏఐ ఆమోద ముద్ర కోసం ఎదురుచూస్తున్నామని, త్వరలోనే ఒక పాలసీని తేగలమని సుశీల్ తెలియజేశారు. ఇక, వజ్రోతోత్సవ వేడుకల్లో భాగంగా జోన్‌లోని 17 గ్రామాలను దత్తత తీసుకుని, వాటిలో తాగు నీరు వంటి మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెడుతున్నామని తెలిపారు. ఒక్కో గ్రామానికి రూ. 50,000 మేర వ్యయం చేయనున్నట్లు చెప్పారు. అలాగే, 314 పాఠశాలలను దత్తత తీసుకుని, ఒక్కోదానిలో రూ. 25,000 బడ్జెట్‌తో ఫ్యాన్లూ, వాటర్ కూలర్లు మొదలైనవి సమకూరుస్తున్నట్లు పేర్కొన్నారు. -
పసల్ భీమాకు 31 చివరితేది
ఫసల్ బీమాను సద్వినియోగం చేసుకోండి మొయినాబాద్: ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద పంటలకు బీమా చేయించడానికి ఈ నెల 31 చివరీ తేదీ అని మండల వ్యవసాయాధికారి రాగమ్మ తెలిపారు. బ్యాంకు రుణం పొందే రైతులు రుణం తీసుకునే సమయంలోనే ఫసల్ బీమాకు ప్రీమియం చెల్లించాలన్నారు. రుణం తీసుకోని రైతులు డీడీల రూపంలో ప్రీమియం చెల్లించాల్సి ఉంటుందన్నారు. మొక్కజొన్న పంటకు గ్రామం యూనిట్‌గా, ఇతర పంటలకు మండలం యూనిట్‌గా పరిగణిస్తామన్నారు. వరికి ఎకరాకు రూ.364, మొక్కజొన్న ఎకరాకు రూ.400, కంది ఎకరాకు రూ.260, జొన్న ఎకరాకు రూ.200, పెసర ఎకరాకు రూ. 200 చొప్పున ప్రీమియం చెల్లించాలన్నారు. డీడీలు యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ హైదరాబాద్ పేరుతో తీయాలన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. ఈ నెల 31లోపు డీడీలు తీసి మండల వ్యవసాయాధికారులకు ఇవ్వాలన్నారు. ఇతర వివరాలకు సెల్: 7288894656 నంబర్లో సంప్రదించాలన్నారు. -
అంతర్జాతీయ ఫండ్స్.. పన్ను భారం ఎంత?
నేను హెచ్డీఎఫ్సీ ఎస్ఎల్ యంగ్ స్టార్ సూపర్ టూ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను తీసుకున్నాను. ఏడాదికి రూ.40,000 ప్రీమియమ్ చొప్పున ఐదేళ్లు చెల్లించాను. ఈ పాలసీలో కొనసాగమంటారా? లేక వైదొలగమంటారా? - స్పందన, విజయవాడ హెచ్డీఎఫ్సీ ఎస్ఎల్ యంగ్ స్టార్ సూపర్ టూ అనేది యూనిట్ లింక్డ్ ప్లాన్. ఈ తరహా ప్లాన్‌ల్లో మీరు చెల్లించే ప్రీమియం నుంచి సదరు మ్యూచువల్ ఫండ్ సంస్థ వివిధ చార్జీలను(మోర్టాలిటీ చార్జీలు, నిర్వహణ వ్యయాలు, ఫండ్ మేనేజ్మెంట్ చార్జీలు... తదితర చార్జీలు) మినహాయించుకొని మిగిలిన మొత్తాన్ని ఇన్వెస్ట్ చేస్తుంది. ఇలాంటి వ్యయాల కారణంగా మీరు ఎక్కువ ప్రీమియం చెల్లించినప్పటికీ, నికరంగా ఇన్వెస్ట్ చేసే మొత్తం తక్కువగా ఉంటుంది. ఫలితంగా మీరు పెద్ద మొత్తంలో ప్రీమియం చెల్లించినప్పటికీ, మీకు వచ్చే రాబడులు తక్కువగా ఉంటాయి. మార్కెట్ మంచి ఊపుమీద ఉన్నప్పటికీ, ఈ వ్యయాల కారణంగా మీరు స్వల్ప రాబడులతోనే సరిపెట్టుకోవలసి వస్తుంది. అయితే ఈ పాలసీలను విక్రయిస్తే ఏజెంట్లకు భారీగా కమీషన్లు వస్తాయి. ఈ కమీషన్ల కోసం ఏజెంట్లు ఈ పాలసీల గురించి అతిగా చెప్పి ఇన్వెస్టర్లకు అంటగడతారు. ఇక మీ విషయానికొస్తే, ఈ పాలసీ పరంగా మీకు ఎదురయ్యే భవిష్యత్ నష్టాలను తగ్గించుకోవడానికి ఈ ప్లాన్‌ను సరెండర్ చేయడమే సరైన పని. ఈ ప్లాన్‌కు లాక్-ఇన్-పీరియడ్ ఐదేళ్లుగా ఉంది. మీ ప్లాన్ తీసుకొని ఐదేళ్లు పూర్తయింది. కాబట్టి, ఈ ప్లాన్‌ను సరెండర్ చేసినా, మీరు ఎలాంటి సరెండర్ చార్జీలు చెల్లించాల్సిన పనిలేదు. మీరు సరెండర్ చేసే సమయానికి ఈ ఫండ్ విలువ ఎంత ఉంటుందో, అదే సరెండర్ విలువగా మీరు పొందవచ్చు. ఇక భవిష్యత్ ఇన్వెస్ట్మెంట్స్ విషయానికొస్తే, బీమా, ఇన్వెస్ట్మెంట్ కలగలసిన ఈ తరహా ప్లాన్‌ల్లో ఎప్పుడూ ఇన్వెస్ట్ చేయకండి. ఇవి తగిన బీమాను, ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే రాబడులను కూడా ఇవ్వలేవు. జీవిత బీమా కోసం పూర్తిగా టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను తీసుకోండి. వీటికి బీమా కవర్ అధికంగానూ, చెల్లించాల్సిన ప్రీమియమ్‌లు తక్కువగానూ ఉంటాయి. పిల్లల ఉన్నత విద్యాభ్యాసం, స్వగృహం ఏర్పాటు చేసుకోవడం.. తదితర దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం మంచి బ్యాలెన్స్డ్ లేదా ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి. ఏ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసినా సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానాన్ని అనుసరించడం మరచిపోకండి. సాధారణంగా పలు బీమా సంస్థలు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకునే కవరేజ్ ఉన్న ఆరోగ్య బీమా పాలసీలను ఆఫర్ చేస్తాయి. అయితే డొమిసిలియరీ వ్యయాల(ఇంటి వద్ద ట్రీట్మెంట్ తీసుకుంటే అయ్యే ఖర్చులు) కవరేజ్ ఉన్న ఆరోగ్య బీమా పాలసీలను ఏయే సంస్థలు ఆఫర్ చేస్తున్నాయి? వీటి వివరాలను వెల్లడించండి. - మహేందర్, హైదరాబాద్ డొమిసిలియరీ వ్యయాలను కూడా కవర్ చేసే ఆరోగ్య బీమా పాలసీలను పలు సంస్థలు ఆఫర్ చేస్తున్నాయి. మీ అవసరాలను బట్టి అపోలో మ్యూనిక్ ఆప్టిమ రిస్టోర్, రెలిగేర్ హెల్త్ ఇన్సూరెన్స్ కేర్లను పరిశీలించవచ్చు. ఈ ప్లాన్లకు మంచి క్లెయిమ్ రికార్డ్ ఉంది. మీ లైఫ్ స్టైల్, ప్రస్తుత ఆరోగ్య స్థితిగతులు, జబ్బులకు సంబంధించి మీ కుటుంబ చరిత్ర తదితర అంశాలను ఆధారంగా ఎంత మొత్తానికి బీమా తీసుకోవాలో నిర్ణయించుకోండి. మీ వయస్సును బట్టి వివిధ సంస్థలు ఎంత ప్రీమియమ్‌లు వసూలు చేస్తున్నాయో పరిశీలించి, మీకు అనువైన ప్లాన్‌ను ఎంచుకోండి. మీరు పాలసీ తీసుకున్న 30 రోజుల తర్వాతనే పాలసీ అమల్లోకి వస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోండి. పాలసీ తీసుకున్న 30 రోజుల లోపు మీరు ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకున్నా, వాటికి అయిన ఖర్చులు రీయింబర్స్మెంట్ కావు. నేను 2010, జనవరి నుంచి ఫ్రాంక్లిన్ ఏషియన్ ఈక్విటీ ఫండ్‌లో నెలకు రూ.1,000 చొప్పన ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించాను. 2014,జూన్ వరకూ ఇలా ఇన్వెస్ట్ చేశాను. 2014 సెప్టెంబర్ నుంచి ఈ ఫండ్ నుంచి సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్(ఎస్‌డబ్ల్యూపీ) ద్వారా నెలకు రూ.4,500 విత్‌డ్రా చేసుకుంటున్నాను. ఇది కొనసాగుతోంది. ఈ ఇన్వెస్ట్మెంట్స్, విత్డ్రాయల్స్పై మూలధన లాభాల పన్నును ఎలా లెక్కించాలి? దీనికి రెండు పద్దతులున్నాయని మిత్రులు చెబుతున్నారు. ఒకటి ఫస్ట్ఇన్ఫస్ట్ అవుట్(ఫిఫో-మొదటగా ఇన్వెస్ట్ చేసింది మొదటిగా ఉపసంహరించుకోవడం), రెండవది లాస్ట్ఇన్ ఫస్ట్అవుట్(లిఫో-చివర్లో ఇన్వెస్ట్ చేసింది మొదటగా ఉపసంహరించుకోవడం). ఫిఫో పద్ధతిని అనుసరిస్తే నేను ఇన్వెస్ట్ చేసిన సిప్‌లకు ఏడాది దాటింది కాబట్టి నేను ఎలాంటి మూలధన లాభాల పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని భావిస్తున్నాను. ఇక రెండో పద్ధతి(లిఫో)ను అనుసరిస్తే, కొన్ని సిప్‌లకు ఏడాది దాటలేదు కాబట్టి, కొన్నింటికే నేను మూలధన లాభాల పన్నుల చెల్లించాల్సి ఉంటుంది. ఈ విషయమై తగిన సూచనలివ్వండి. - కార్తికేయ, ఈ మెయిల్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌కు సంబంధించి ఫిఫో పద్ధతినే అనుసరిస్తారు. అంటే తొలిసారిగా కొనుగోలు చేసిన యూనిట్లను తొలిసారిగా విక్రయించడం. ఇక మీ ఇన్వెస్ట్మెంట్స్, విత్‌డ్రాయల్స్‌ను పరిశీలిస్తే మీరు కొన్ని విత్‌డ్రాయల్స్‌కు మూలధన లాభాల పన్నును, చాలావాటికి స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను చెల్లంచాల్సి ఉంటుంది. ఫ్రాంక్లిన్ ఏషియన్ ఈక్విటీ ఫండ్ అనేది అంతర్జాతీయ ఫండ్. డెట్ ఫండ్స్‌కు ఎలాంటి పన్ను నియమాలు వర్తిస్తాయో, అవే నియమాలు అంతర్జాతీయ ఫండ్స్‌కు వర్తిస్తాయి. అంటే ఈ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే, ఇలా ఇన్వెస్ట్ చేసిన యూనిట్లను మూడేళ్ల తర్వాత విక్రయిస్తే, దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను, మూడేళ్లలోపు విక్రయిస్తే స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అంతర్జాతీయ ఫండ్స్‌కు దీర్ఘకాల మూలధన లాభాల పన్ను-20 శాతంగా (ఇండేక్సేషన్‌తో కలిపి) ఉంటుంది. స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను-ఆ వ్యక్తి ఆదాయపు పన్ను స్లాబ్‌ననుసరించి ఉంటుంది. మీ విషయానికొస్తే మీరు ఎక్కువ భాగం స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఈ ఫండ్ విక్రయాలపై మీకు వచ్చిన రాబడులను, మీ మొత్తం ఆదాయానికి కలిపి మీ ఆదాయపు పన్ను స్లాబ్ ప్రకారం పన్ను విధిస్తారు. కొన్నింటికి మాత్రమే మీరు దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. - ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
ఇండియన్ రైల్వే భారీ బీమా సౌకర్యం!
న్యూఢిల్లీః ప్రయాణీకుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని భారత రైల్వే ప్రవేశ పెట్టిన కొత్త పథకం అందర్నీ ఆకట్టుకుంటోంది. అతి తక్కువ ఖర్చుతో ప్రయాణాలు చేసేవారు సైతం కేవలం పది రూపాయలు చెల్లించి 10 లక్షలు బీమా పొందే అవకాశానికి రైల్వే కొత్త సంస్కరల్లో చోటు కల్పించనుంది. పది రూపాయలు చెల్లించి పది లక్షలు ఇన్సూరెన్స్ పొందే బంపర్ ఆఫర్ ను ఇండియన్ రైల్వే ప్రయాణీకులకు కల్పించనుంది. వచ్చే రైల్వే బడ్జెట్ లో ఈ కొత్త సౌకర్యాన్ని ప్రవేశ పెట్టేందుకు రైల్వే మంత్రి సురేష్ ప్రభు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించారు. వచ్చే సెప్టెంబర్ నుంచి ముందుగా ఈ-టికెట్ బుక్ చేసుకునేవారికి ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. అనంతరం దేశంలోని అన్ని రిజర్వేషన్ కౌంటర్లలోనూ ఈ బీమా సౌకర్యాన్ని అమల్లోకి తెచ్చే యోచనలో రైల్వే శాఖ ఉన్నట్లు సమాచారం. దీంతో పాటు నెలవారీ సీజన్ టికెట్లు తీసుకునేవారికి కూడ సౌకర్యం వర్తించేట్టు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రయాణంలో జరిగే ప్రమాదాలతో వైకల్యం పొందడం, తీవ్ర గాయాలవ్వడం జరిగితే.. సదరు బాధితులకు కొత్త బీమా సౌకర్యంలో భాగంగా 7.5 లక్షల రూపాయలను రైల్వే శాఖ అందిస్తుంది. తాజా ప్రతిపాదనను అమల్లోకి తెచ్చేందుకు ఇప్పటికే రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం శాఖ (ఐఆర్సీటీసీ) 17 వరకూ బీమా కంపెనీలతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. వాటిలో శుక్రవారం నాటికి మూడు కంపెనీలను ఖరారు చేసే యత్నంలో ఉన్నట్లు సమాచారం. ప్రయాణ సమయం, దూరాన్ని బట్టి ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించేట్లు చర్యలు తీసుకుంటోంది. పది రూపాయల ప్రీమియంతో 10 లక్షల వరకూ ప్రమాద బీమా పొందే అవకాశం ఉంది. అదే బీమా సౌకర్యాన్ని అదనంగా పొందాలనుకున్న ప్రయాణీకులు ప్రీమియంను అదనంగా చెల్లించి, 50 లక్షల రూపాయల వరకూ పొందేట్లు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఓ సీనియర్ రైల్వే అధికారి ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు. -
ప్రీమియం చెల్లించకపోయినా, చార్జీలు తప్పవా?
నేను 2008, మార్చిలో బజాజ్ అలయంజ్ న్యూ ఫ్యామిలీ గెయిన్ పాలసీని తీసుకున్నాను. 2011 మార్చి వరకూ రూ.36,000 ప్రీమియమ్ చెల్లించాను. ఆ తర్వాత ప్రీమియమ్‌లు చెల్లించడం ఆపేశాను. ప్రస్తుతం ఈ ఫండ్ విలువ రూ.27,443గా ఉంది. ఈ పాలసీ 2018 మార్చిలో మెచ్యూర్ అవుతుంది. గత ఏడాది వివిధ చార్జీల కింద రూ.5,013ను ఈ ఫండ్ నుంచి కోత కోశారు. ప్రీమియమ్‌లు చెల్లించడం ఆపేసినప్పటికీ, చార్జీల కోత తప్పదా? ఈ ఫండ్ నుంచి వైదొలగమంటారా? కొనసాగమంటారా ? సలహా ఇవ్వండి. - సర్వేశ్, విశాఖపట్టణం బజాజ్ అలయంజ్-న్యూ ఫ్యామిలీ గెయిన్ అనేది యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్(యూలిప్) పాలసీ. ఈ తరహా ప్లాన్‌ల్లో మీరు చెల్లించిన ప్రీమియమ్ నుంచి మెర్టాలిటీ చార్జీలు, నిర్వహణ వ్యయాలు, ఫండ్ మేనేజ్మెంట్ చార్జీలు,... తదితర చార్జీలను మ్యూచువల్ ఫండ్ సంస్థ మినహాయించుకొని మిగిలిన మొత్తాన్ని ఇన్వెస్ట్ చేస్తుంది. మార్కెట్ బాగా ఉన్నప్పటికీ, ఈ చార్జీల కారణంగా ఈ తరహా యులిప్‌లపై వచ్చే రాబడులు తక్కువగా ఉంటాయి. మీరు ప్రీమియమ్‌లు చెల్లించడం ఆపేసినప్పటికీ, పూర్తి కాలానికి వర్తించే ఫిక్స్డ్ చార్జీలను మీ ఫండ్ నుంచి మినహాయించుకుంటారు. భవిష్యత్తు నష్టాలను తగ్గించుకోవడానికి గాను ఈ ప్లాన్‌ను సరెండర్ చేయండి. మీరు సరెండర్ చేసేటప్పుడు ఫండ్ విలువ ఎంత ఉంటుందో అదే మీ సరెండర్ వాల్యూ అవుతుంది. ఇన్వెస్ట్మెంట్ కోసం ఎప్పుడూ బీమా, ఇన్వెస్ట్మెంట్ కలగలసిన ప్లాన్లను ఎంచుకోవద్దు. బీమా కోసం టర్మ్ పాలసీ తీసుకోవాలి. టర్మ్ పాలసీల్లో ప్రీమియమ్‌లు తక్కువగానూ, బీమా కవరేజ్ అధికంగానూ ఉంటుంది. ఇక దీర్ఘకాల ఆర్థిక లక్ష్యాల కోసం ఏదైనా డైవర్సిఫైడ్ మ్యూచువల్ ఫండ్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేయండి. నా వయస్సు 50 సంవత్సరాలు. ప్రవాస భారతీయుడిని. రూ.3 కోట్లకు టర్మ్ పాలసీని (రూ.3 కోట్ల యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ కవర్ కూడా ఉండాలి) తీసుకోవాలనుకుంటున్నాను. ప్రవాస భారతీయులకు పాలసీలను ఆఫర్ చేస్తున్న భారత కంపెనీల వివరాలను తెలియజేయండి. అలాగే నా అవసరాలను దృష్టిలో పెట్టుకొని సర్వీస్, క్లెయిమ్స్ సెటిల్మెంట్ రేషియా, తదితర అంశాల ఆధారంగా నాకు తగిన టర్మ్ పాలసీని సూచించండి. - ప్రదీప్ జైన్, ఈ మెయిల్ ద్వారా పలు భారత బీమా కంపెనీలు ప్రవాస భారతీయులకు టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలను ఆఫర్ చేస్తున్నాయి. ఈ పాలసీలను తీసుకునే ముందు మీరు రెండు విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. మొదటిది వ్యయం. మీరు ఎంచుకున్న పాలసీ విదేశాల్లో చౌకగా లభించే అవకాశాలున్నాయా? రెండోది. పన్ను వ్యవహారాలు. మీరు నివసిస్తున్న దేశంలో పన్ను చట్టాలు ఎలా ఉన్నాయి. .. ఈ రెండు అంశాలను కూడా పరిగణనలోకి తీసుకొని నిర్ణయం తీసుకోవాలి. ఇక మీరు తీసుకున్న పాలసీకి చెల్లించే ప్రీమియమ్.. అదనపు రైడర్స్‌కు కూడా కవరవుతుందో, లేదో చెక్ చేసుకోవాలి. లేకుంటే అదనపు రైడర్లకు అదనంగా చెల్లించాల్సి ఉంటుందా అన్న విషయం కూడా చెక్ చేసుకోవాలి. మీరు భారత్‌కు వచ్చినప్పుడు టర్మ్ పాలసీ తీసుకుంటే బావుంటుంది. దీని వల్ల విదేశాల్లో వైద్య పరీక్షలు జరిపించుకొని, సంబంధిత రిపోర్టులను బీమా కంపెనీకి పంపించడం కొంచెం వ్యయభరితమైనది. మీరు భారత్‌లోనే ఉన్నప్పుడు టర్మ్ పాలసీ తీసుకుంటే, ఈ వ్యయం మీకు తప్పుతుంది. 50 సంవత్సరాల వయస్సున్న వ్యక్తికి 3 కోట్ల బీమా కవరేజ్‌కు కొన్ని కంపెనీలు వసూలు చేస్తున్న వార్షిక ప్రీమియమ్‌లు, వాటి క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తి(గత ఆర్థిక సంవత్సరం) వివరాలు ఇస్తున్నాం. పరిశీలించి నిర్ణయం తీసుకోండి. మ్యాక్స్‌లైఫ్ వార్షిక ప్రీమియం రూ.54,960గా, క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తి 96.03గా ఉంది. బిర్లా సన్‌లైఫ్ వార్షిక ప్రీమియం రూ.48,262 కాగా క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తి 95.3గా ఉంది. ఇక హెచ్డీఎఫ్సీ లైఫ్ వార్షిక ప్రీమియం రూ.54,025గా ఉండగా, క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తి 90.5గా ఉంది. నేను ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎన్పీఎస్(నేషనల్ పెన్షన్ స్కీమ్) ఖాతాను ప్రారంభించాను. ఈ ఏప్రిల్ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైంది కదా! ఇప్పుడు పెన్షన్ ఫండ్ మేనేజర్‌ను మార్చుకోవచ్చా? అలాంటి వెసులుబాటు లభిస్తుందా? వివరించగలరు. - మాధురి, హైదరాబాద్ ఒక ఆర్థిక సంవత్సరంలో ఒకసారి పెన్షన్ ఫండ్ మేనేజర్ ఎంపికను మార్చుకునే అవకాశం ఎన్‌పీఎస్‌లో ఉంది. అంతేకాకుండా ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్‌ను(యాక్టివ్ నుంచి ఆటో చాయిస్‌కు లేదా ఆటో చాయిస్ నుంచి యాక్టివ్‌కు) కూడా మార్చుకోవచ్చు. ప్రస్తుతానికి మీరు మీ ఎన్పీఎస్ ఖాతాకు సంబంధించి ఎనిమిది పెన్షన్ ఫండ్స్ నుంచి ఒకదానిని ఎంచుకోవచ్చు. ఆ ఎనిమిది పెన్షన్ ఫండ్స్ఏమంటే-ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ పెన్షన్ ఫండ్, ఎల్ఐసీ పెన్షన్ ఫండ్, కోటక్ మహీంద్రా పెన్షన్ ఫండ్, రిలయన్స్ క్యాపిటల్ పెన్షన్ ఫండ్, ఎస్బీఐ పెన్షన్ ఫండ్, యూటీఐ రిటైర్మెంట్ సొల్యూషన్స్ పెన్షన్ ఫండ్, హెచ్డీఎఫ్సీ పెన్షన్ మేనేజ్మెంట్ కంపెనీ, డీఎస్పీ బ్లాక్‌రాక్ పెన్షన్ ఫండ్ మేనేజర్స్.. ఈ ఎనిమిది పెన్షన్ ఫండ్స్ నుంచి ఏదో ఒక దానిని మీరు ఎంచుకోవచ్చు. గతంలో ఎంచుకున్నదానిని మార్చుకోవచ్చు. ఈ మార్పును సూచిస్తూ ఒక దరఖాస్తును సమర్పించాల్సి ఉంటుంది. మీ దరఖాస్తు ప్రాసెస్కాగానే సెంట్రల్ రికార్డ్‌కీపింగ్ ఏజెన్సీ(సీఆర్ఏ) సిస్టమ్ నుంచి మీ నమోదిత ఈమెయిల్ ఐడీకి ఒక ఈ మెయిల్ వస్తుంది. - ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
యాప్ ఆధారిత బస్ సేవలపై ఏసీబీ దర్యాప్తు!
న్యూఢిల్లీః రాజధాని నగరంలో యాప్ ఆధారిత ప్రిమియమ్ బస్ సర్వీసులపై ఏసీబీ దర్యాప్తు ప్రారంభించింది. ఆప్ సర్కార్ ప్రతిపాదించిన బస్ సర్వీసులకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ తిరస్కరించడమే కాక, ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించడంతో, ప్రీమియం బస్ సేవలపై ఏసీబీ దర్యాప్తు ప్రారంభించింది. ఢిల్లీ యాంటీ కరప్షన్ బ్రాంచ్ బుధవారం ఢిల్లీలో ప్రారంభించనున్న యాప్ బేస్డ్ ప్రీమియం బస్ సర్వీసులపై దర్యాప్తు ప్రారంభించింది. యాప్ ఆధారిత బస్సు సేవలపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎమ్మెల్యే విజేందర్ గుప్తా ఫిర్యాదు పటిషన్ దాఖలు చేయడంతో ఏసీబీ దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపింది. అక్రమ ఎల్జీ నోటిఫికేషన్ జారీపై తమకు ఫిర్యాదు అందడంతో వ్యవహారంపై దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఏసీబీ ఛీఫ్ ఎం.కె.మీనా తెలిపారు. బీజేపీ నేత మంగళవారం ఫిర్యాదు దాఖలు చేసినట్లు ఆయన తెలిపారు. ప్రీమియం బస్సుల విషయంలో ఒకే ఒక్క యాగ్రిగేటర్ ను ప్రోత్సహించారన్న వాదంతో పాటు... యాప్ ఆధారిత బస్సుల్లో ఎటువంటి నియమ నిబంధనలు పాటించలేదని, బస్ మార్గాలు, బస్సుల సంఖ్య కూడ నిర్ణయించకపోవడంపై తమకు ఆరోపణలు వచ్చినట్లు మీనా తెలిపారు. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం జూన్ 1 నుంచి రాజధానిలో యాప్ ఆధారిత ప్రీమియం బస్ సేవలు ప్రారంభించనున్నట్లు గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ప్రజలు స్వంత కార్లనుంచి ప్రజా రవాణా వ్యవస్థపై మొగ్గు చూపాలన్న ఉద్దేశ్యంతోనే తాము ఈ సేవలను ప్రోత్సహించామని, ఇందులో ఎటువంటి స్వలాభం లేదని 'ఆప్' ప్రభుత్వం వాదిస్తోంది. -
చీకటి మలుపులో చేతికందే దీపం
ఉమెన్ ఫైనాన్స్ / ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన మన దేశంలో ప్రతి ఒక్కరికీ, మరీ ముఖ్యంగా తక్కువ ఆదాయం కలిగిన వారందరికీ ప్రమాదం కారణంగానే కాకుండా, మరే ఇతర కారణం చేతనైనా మరణం సంభవిస్తే వారి కుటుంబ సభ్యులకు కొంతమేర ఆర్థిక చేయూతను ఇవ్వాలనే సదుద్దేశంతో 2015-16 ఆర్థిక సంవత్సరంలో మన ప్రభుత్వం ‘ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజన’ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం వివరాలను చూద్దాం. ఈ పథకంలో నమోదైన ఖాతాదారులకు ఏ కారణం చేతనైనా మరణం సంభవిస్తే 2 లక్షల రూపాయలను వారి నామినీకి అందజేస్తారు. కనీసం 18 సం. మొదలుకొని, 50 సం. వయసు గల వారి వరకు ఈ పథకంలో చేరడానికి అర్హులు.ఏ బ్యాంకులైతే ఈ పథకాన్ని నిర్వహిస్తారో ఆ బ్యాంకులో.. సేవింగ్స్ ఖాతాను కలిగి ఉండాలి. 330 రూపాయలను ప్రతి సంవత్సరం ఈ పథకానికి ప్రీమియంగా చెల్లించాలి. ఈ పథకం జూన్ 1 మొదలుకొని మే 31 వరకు ఉంటుంది. మళ్లీ తర్వాత సంవత్సరానికి ఈ పథకాన్ని కొనసాగించాలంటే మే 31 లోపల ప్రీమియం చెల్లించవలసి ఉంటుంది. బ్యాంకులు ప్రీమియంను ఆటో-డెబిట్ పద్ధతిలో బ్యాంకు ఖాతాదారుల నుండి తీసుకుంటాయి. కనుక పథకంలో కొనసాగాలనుకునేవారు తమ ఖాతాలో ప్రీమియం సొమ్మును ఉంచవలసి ఉంటుంది. 55 సం. వయసు వరకు మాత్రమే పథకంలో కొనసాగే వెసులుబాటు ఉంటుంది. ఆ తర్వాత పథకాన్ని కొనసాగించినా సొమ్ము ఏమీ రాదు. ఈ పథకంలో చేరిన తర్వాత 55 సం.లకు ముందు ఏ కారణం చేతనైనా మరణం సంభవిస్తే వారి నామినీకి సొమ్ము అందజేస్తారు. బ్యాంకు ఖాతాను మూసి వేసినా, ప్రీమియం సొమ్ముకు సరిపడా మొత్తాన్ని ఖాతాలో ఉంచకపోయినా ఈ పథకం కొనసాగదు. ఒక బ్యాంకు ఖాతాకన్నా ఎక్కువ బ్యాంకు ఖాతాలలో ఈ పథకానికి ప్రీమియం చెల్లించిన ప్పటికీ ఒక ఖాతా ద్వారా మాత్రమే బీమా లభిస్తుంది. మిగతా ఖాతాల ద్వారా చెల్లించిన ప్రీమియంకు బీమా వర్తించదు.ఈ పథకం ప్రారంభించినప్పుడు కాకుండా తర్వాత చేరేవారు; పథకంలో చేరి, కొనసాగకుండా ఉండి, మళ్లీ జాయిన్ కాదలచుకున్నవారు ‘సెల్ఫ్ సర్టిఫికెట్ ఆఫ్ గుడ్ హెల్త్’ని అందజేయవలసి ఉంటుంది. ఈ పథకంలో చేరేవారికి ఆధార్‌ని ప్రధాన పత్రంగా పరిగణిస్తారు. ఖాతాదారులు ఆధార్‌ని తమ బ్యాంకు ఖాతాకు తప్పనిసరిగా అనుసంధానించాలి. ఇది చాలా తక్కువ ప్రీమియంతో అతి సులభంగా ప్రతి ఒక్కరూ తమ కుటుంబానికి తమ మరణానంతరం ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు వీలుకల్పించే ఒక మంచి పథకం. అయితే పథకంలో చేరడం ఎంత ముఖ్యమో, ఆ ఖాతాను కొనసాగించడమూ అంతే ముఖ్యం అని గ్రహించాలి. రజని భీమవరపు ఫైనాన్షియల్ ప్లానర్, ‘జెన్ మనీ’ -
మహిళలు ఎందుకని తక్కువ ప్రీమియం చెల్లిస్తారు?
ఫైనాన్షియల్ బేసిక్స్.. అతని పేరు కృష్ణ. వయస్సు 32 ఏళ్లు. కొత్తగా రెండు బీమా పాలసీలు తీసుకుందామనుకున్నాడు. ఒకటి తనకు. మరొకటి తన భార్యకు. అందుకు తగినట్లే ఇద్దరూ ఒకే రకమైన జీవిత బీమా పాలసీలను ఎంచుకున్నారు. ఇద్దరం ఒకే పాలసీ తీసుకున్నాం కదా.. ప్రీమియం కూడా ఒకేలా ఉంటుందనుకున్నాడు కృష్ణ. కానీ ఇక్కడ ఇద్దరికీ ప్రీమియం వేర్వేరుగా ఉంది. కృష్ణ పాలసీ ప్రీమియం తన భార్య పాలసీ ప్రీమియంతో పోలిస్తే ఎక్కువగా ఉంది. ఇక్కడ కృష్ణ కన్నా అతని భార్య వయసులో పెద్దది. అంటే వయసు పెరిగే కొద్ది ప్రీమియం కూడా పెరుగుతుంది కదా? అయినా కూడా ఇక్కడ అలా జరుగలేదు. పరిస్థితి భిన్నంగా ఉంది. దీనికి ఒక్కటే ప్రధాన కారణం. అది జీవన ప్రమాణం. సాధారణంగా మగవారితో పోలిస్తే మహిళల జీవన ప్రమాణం ఎక్కువగా ఉంటుంది. అంటే వీరు పురుషుల కన్నా ఎక్కువ కాలం జీవిస్తారన్న మాట. అందుకే బీమా కంపెనీలు మహిళలకు సంబంధించిన పాలసీల విషయంలో కొంత తక్కువ ప్రీమియాన్ని వసూలు చేస్తాయి. -
టర్మ్ పాలసీలపై ఐసీఐసీఐ దృష్టి
♦ టర్మ్ పాలసీల నుంచి ఏటా రెట్టింపు ప్రీమియం ఆదాయ లక్ష ్యం ♦ సంప్రదాయ ఎండోమెంట్, మనీ బ్యాక్ పాలసీలకు తగ్గుతున్న డిమాండ్ ♦ ఇన్వెస్ట్మెంట్ కోసం యులిప్‌ల వైపు చూస్తున్న ఇన్వెస్టర్లు ♦ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ సందీప్ బాత్ర హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పాలసీదారుల ఆలోచనలో మార్పువస్తోందని, సంప్రదాయ ఎండోమెంట్ పాలసీల కంటే అధిక బీమా రక్షణ ఇచ్చే టర్మ్ పాలసీలకే మొగ్గు చూపుతున్నట్లు ప్రైవేటు రంగ జీవిత బీమా కంపెనీ ఐసీఐసీఐ ఫ్రుడెన్షియల్ లైఫ్ అంటోంది. గతంలో వలే బీమాను ఇన్వెస్ట్మెంట్గా చూడకుండా ఆర్థిక రక్షణ కల్పించే సాధనంగా చూడటంతో టర్మ్ ఇన్సూరెన్స్‌కి డిమాండ్ పెరుగుతున్నట్లు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ సందీప్ బాత్ర తెలిపారు. ప్రస్తుతం మొత్తం బీమా వ్యాపారంలో టర్మ్ ఇన్సూరెన్స్ వాటా రెండు శాతంగానే ఉందని, కానీ ఈ విభాగం వేగంగా వృద్ధి చెందుతోందన్నారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా బాత్ర ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడుతూ.. 2014లో ఐఆర్డీఏ 37 కొత్త టర్మ్ పాలసీలకు అనుమతిస్తే, ఈ సంఖ్య 2015 నాటికి 97కి చేరిందన్నారు. ఐసీఐసీఐ ఈ మధ్యనే విడుదల చేసిన ఐ ప్రోటక్ట్ స్మార్ట్‌కు మంచి స్పందన వస్తోందన్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియం రూ. 49 కోట్ల నుంచి రూ. 78 కోట్లకు పెరిగిందని వచ్చే ఏడాది ఈ మొత్తం రెట్టింపు అవుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. హోమ్‌లోన్ వంటి దీర్ఘకాలిక రుణాలు తీసుకున్న వారు వాటితో పాటు టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవడం కూడా డిమాండ్ పెరగడానికి ప్రధాన కారణంగా చెపుతున్నారు. గతంతో పోలిస్తే అనేక ఇన్వెస్ట్మెంట్ సాధనాలు అందుబాటులోకి రావడంతో బీమాను ఇన్వెస్ట్మెంట్గా చూసే వారి సంఖ్య క్రమంగా తగ్గుతోందన్నారు. ట్యాక్స్ ప్రయోజనాలు దృష్ట్యా రిటైర్మెంట్ పాలసీలు కూడా అంత ఆకర్షణీయంగా లేకపోవడంతో రిటైర్మెంట్ పాలసీల అమ్మకాలు కూడా తగ్గుతున్నాయన్నారు. కానీ రిస్క్ చేసే సామర్థ్యం ఉన్న వారు మాత్రం యులిప్‌ల్లో ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లు తెలిపారు. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ విషయానికి వస్తే 2013లో మొత్తం అమ్మకాల్లో 45.5 శాతంగా ఉన్న సంప్రదాయ బీమా పాలసీల వాటా ఇప్పుడు 15.4 శాతానికి పడిపోయిందని, ఇదే సమయంలో యులిప్ అమ్మకాలు 54.5 శాతం నుంచి 84.6 శాతానికి చేరిందన్నారు. స్టాక్ మార్కెట్లు పెరగడం కూడా యులిప్స్ అమ్మకాలు పెరగడానికి ఒక కారణంగా ఆయన పేర్కొన్నారు. -
ఈ కారణాలు కూడా చూడాల్సిందే...
చాలామంది మహిళలు ఆశావహ దృక్పథంతో జీవిస్తుంటారు. వీరి భవిష్యత్తు ఆలోచనలు, కోరికలు అన్నీ పాజిటివ్‌గా ఉంటాయి. అందుకనే ‘నేను లేకపోతే’ అన్న ఆలోచన వారి దరిచేరదు. అందుకనే బీమా కొనడమనేది నెగటివ్ అనుకుంటారు. నిజమే... వీరి లోటును జీవిత బీమా పూర్తిగా భర్తీ చేయలేదు. కానీ వీరిపై ఆధారపడ్డ వారికి ఆర్థికంగా కొంత తోడ్పాటును అందించగలదు. అలాగే చాలామంది నేను ఆరోగ్యంగా ఉన్నాను కనక ఇంత ప్రీమియం చెల్లించి బీమా పాలసీ తీసుకోవడం అనవసరమని భావిస్తుంటారు. ఇలాంటి ఆలోచనలన్నీ తప్పుదోవ పట్టించేవేనని చెప్పాలి. మీతో పనిచేస్తూ రిటైర్మెంట్కు దగ్గరలో ఉన్న వారి అనుభవాలను తెలుసుకోండి. బీమాపై మీకు నమ్మకం కలిగేంత వరకు ఆగకుండా... ఉద్యోగంలో చేరిన వెంటనే మీ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్‌ఫోలియోలో దీనికి మొదటి ప్రాధాన్యత ఇవ్వండి. -
ఉద్యోగంతో పాటు బీమా ముఖ్యమే..!
జీవితంలో ప్రతి ఒక్కరికీ బీమా చాలా ముఖ్యం. కానీ చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్న మహిళలు బీమాకి దూరంగా ఉంటున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. నిజానికి చిన్న వయసులో బీమా పాలసీ తీసుకోవడమనేది చాలా ముఖ్యం. ఎందుకంటే వయసుతో పాటు ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. ముఖ్యంగా మహిళల్లో వయస్సు పెరిగే కొద్దీ ఆరోగ్య సమస్యలు పెరుగుతుంటాయి. అందుకే ఆరోగ్యంగా ఉన్నప్పుడు చిన్న వయసులోనే పాలసీని తీసుకోవడం ద్వారా తక్కువ ప్రీమియంతో దీర్ఘకాలం కొనసాగవచ్చు. 30 ఏళ్లలోపున్న ఉద్యోగినులకు బీమా అవసరం గురించి తెలిసినా... ఇప్పుడు మేం బాగానే ఉన్నాం కదా!! అనే ధోరణితో వారి పోర్ట్‌ఫోలియోలో బీమాకు చోటివ్వటం లేదు. వీరు అత్యధికంగా మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ వంటి నష్టభయం ఎక్కువగా ఉండే ఇన్వెస్ట్మెంట్ సాధనాలవైపే చూస్తున్నారు. -
మార్కెట్లోకి మహీంద్రా ఎక్స్‌పీరియో పికప్
-
బీమా.. ఏదీ ధీమా?
కరువులో రైతులకు చేయూతనివ్వని పంటల బీమా * 2014-15 ఖరీఫ్‌లో రాష్ట్ర రైతాంగానికి తీవ్ర అన్యాయం * తీవ్రంగా నష్టపోయినా నామమాత్రంగా పరిహారం * రూ. 1,596 కోట్లకు బీమా చేస్తే.. ఇచ్చింది రూ. 77 కోట్లే * ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న బీమా కంపెనీలు * పరిహారంపై ఏటికేడు రైతుల్లో సన్నగిల్లుతోన్న ఆశలు * బీమా చేయించడమే దండగ అని భావించే పరిస్థితి * ప్రభుత్వపరంగానూ అన్నదాతలకు అందని తోడ్పాటు * ప్రీమియంపై కర్ణాటకలో 90 శాతం రాయితీ... * రాష్ట్రంలో ఇస్తున్నది 10 శాతమే సాక్షి, హైదరాబాద్: కరువు కోరల్లో చిక్కుకుని అల్లాడుతున్న రైతన్నలకు ‘బీమా’ ధీమా కరువైంది. వర్షాభావంతో పంటలు నష్టపోయినా.. కనీస పరిహారం కూడా అందని దుస్థితి నెలకొంది. ఓ వైపు ప్రభుత్వ నిర్లక్ష్యం, మరోవైపు బీమా కంపెనీల తెంపరితనం కలసి అన్నదాతల కడుపుకొడుతున్నాయి. బీమా కంపెనీలు రైతులు భారీగా చెల్లిస్తున్న ప్రీమియం సొమ్మును దండుకుని.. ఏదో కొద్ది మందికి నామమాత్రపు పరిహారాన్ని విదిలిస్తున్నాయి. చివరికి బీమా చేయించడమే దండగ అని రైతులు భావించే పరిస్థితికి కారణమవుతున్నాయి. చివరికి అటు పంటలూ నష్టపోయి, ఇటు అప్పులూ పెరిగిపోయి ఏం చేయాలో తెలియని ఆవేదనలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అందుతున్నది కొంతే: రాష్ట్రంలో పంటల బీమా పథకం రైతులకు ఏమాత్రం చేయూత ఇవ్వడం లేదు. రైతులు చెల్లిస్తున్న ప్రీమియం సొమ్మును మింగేయడానికే బీమా కంపెనీలు ఉన్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైతులు వివిధ పంటలకు వందల కోట్ల రూపాయలకు బీమా చేస్తే... అందుతున్న పరిహారం పదుల కోట్లలోనే ఉండడం గమనార్హం. దీంతో బీమా ప్రీమియం చెల్లించడానికి చాలా మంది రైతులు ముందుకు రావడంలేదు. రైతుకు చేయూత ఏదీ?: రాష్ట్రంలో జాతీయ వ్యవసాయ బీమా పథకం, వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం, మెరుగుపరిచిన జాతీయ వ్యవసాయ పంటల బీమా పథకం అమలవుతున్నాయి. వీటికోసం రైతులు రెండు రకాలుగా ప్రీమియం చెల్లిస్తారు. కొందరు నేరుగా ప్రీమియం చెల్లిస్తే.. మరికొందరు బ్యాంకు రుణం తీసుకున్నప్పుడే ప్రీమియం సొమ్మును బ్యాంకులు మినహాయిస్తాయి. ఈ ప్రీమియంలో ప్రభుత్వం 10 శాతం రాయితీ ఇస్తోంది. అదే కర్ణాటక ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ రైతులకు ప్రీమియంపై 90 శాతం రాయితీ ఇస్తుండడం గమనార్హం. అసలు రాష్ట్రంలో చాలా మంది రైతులు పంటల బీమాకు ప్రీమియం చెల్లిస్తున్నా... పంట నష్టపోయినప్పుడు తగిన స్థాయిలో పరిహారం అందడం లేదు. దీంతో రైతులు బీమా చేయించడంపై ఆసక్తి కోల్పోతున్నారు. రాష్ట్రంలో ఏటా 55 లక్షల మంది వరకు రైతులు పంటలు వేస్తారు. కానీ బీమా ప్రీమియం చెల్లిస్తున్న వారి సంఖ్య ఏడెనిమిది లక్షలకు మించడం లేదు. 2014-15 ఖరీఫ్‌లో 3.87 లక్షల మంది రైతులు రూ. 1,596.94 కోట్లకు బీమా చేశారు. ఆ ఖరీఫ్ సీజన్లో తీవ్రస్థాయిలో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వం ప్రకటించకపోయినా.. కలెక్టర్లు పంపిన నివేదిక ప్రకారం 300 పైగా మండలాల్లో రైతులు భారీగా నష్టపోయారు. కానీ గత ఏడాది బీమా కంపెనీ నుంచి కేవలం 1.21 లక్షల మంది రైతులకు రూ. 77.22 కోట్ల పరిహారం మాత్రమే మంజూరైంది. దారుణమైన విషయం ఏమిటంటే... గత ఏడాది రైతుల నుంచి పెద్ద సంఖ్యలో బీమా దరఖాస్తులు వచ్చినా... సకాలంలో ప్రక్రియ పూర్తి చేయలేక దాదాపు 10 వేల దరఖాస్తులను వెనక్కి పంపారు. ఆ రైతులెవరూ కనీస బీమా సొమ్ముకు నోచుకోలేదు. బీమా కంపెనీల అధికారులు తమ నిర్లక్ష్యాన్ని బయటకు పొక్కనీయకుండా.. ఆ దరఖాస్తులు సరిగా లేవంటూ సాకులు చూపడంపై విమర్శలు వచ్చాయి. ఇదే నిర్లక్ష్యం గత ఖరీఫ్‌లోనూ కనిపించింది. ఏ సంవత్సరం కూడా రైతులకు పూర్తిస్థాయిలో బీమా పరిహారం చెల్లిస్తున్న దాఖలాలు లేవు. రైతుకు భారంగా ప్రీమియం బీమా లెక్కలు చాలా చిత్రంగా ఉంటాయి. గ్రామం, మండలం యూనిట్‌గా వివిధ రకాల బీమాలు ఉన్నాయి. ఒక పంట గ్రామం మొత్తం నష్టపోతేనే పరిహారం ఉంటుంది. మరో పంట మండలం మొత్తం నష్టపోతేనే పరిహారం ఉంటుంది. ఇక బీమా ప్రీమియం కూడా రైతులకు భారంగానే ఉంటోంది. ఉదాహరణకు వరి సాగు చేసే రైతు రబీలో ఎకరాకు రూ. 509 ప్రీమియం చెల్లించాలి. ఒక్కో జిల్లాలో ఇది ఒక్కోరకంగా ఉంటుంది. వరంగల్ జిల్లాలో మిరప సాగు చేసే రైతు ఎకరాకు రూ. 1,804 ప్రీమియం చెల్లించాలి. మరోవైపు ప్రీమియం చెల్లించినా పంట నష్టపోతే పరిహారం దక్కడం లేదన్న ఆందోళన రైతులను వెన్నాడుతోంది. దీంతో 55 లక్షల మంది రైతులు పంటలు వేస్తుంటే... ప్రీమియం చెల్లిస్తున్నవారి సంఖ్య ఏడెనిమిది లక్షలకు మించడం లేదు. ప్రీమియం సొమ్ము చెల్లించడమే దండగగా వారు భావిస్తున్నారు. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటున్న రైతులు కూడా బ్యాంకుల అధికారులను బతిమాలుకుని ప్రీమియం సొమ్మును మినహాయించకుండా చూసుకుంటున్నారు. మరోవైపు ఒకే బీమా కంపెనీకి పంటల బీమా బాధ్యతను అప్పగించడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని అధికారులు అంటున్నారు. ఒకే కంపెనీ కాబట్టి ప్రశ్నించే నాథుడే లేకుండా పోయారని, బీమా కంపెనీ గుత్తాధిపత్యం రైతులకు నష్టం కలిగిస్తోందని ఆరోపణలున్నాయి. ఐదేళ్లలో రైతులు చేసిన బీమా మొత్తం, పొందిన పరిహారం వివరాలు.. ఏడాది రైతులు బీమా మొత్తం పొందిన పరిహారం లబ్ధిపొందిన రైతులు (రూ.కోట్లలో) (రూ.కోట్లలో) 2010-11 8.88 లక్షలు 2,585.37 25.94 1.06 లక్షలు 2011-12 11.99 లక్షలు 3,867.9 252.15 4.56 లక్షలు 2012-13 8.45 లక్షలు 3,810.9 78.99 1.80 లక్షలు 2013-14 8.41 లక్షలు 3,784.66 32 1.28 లక్షలు 2014-15(ఖరీఫ్) 3.87 లక్షలు 1,596.94 77.22 1.21 లక్షలు -
ఇద్దరూ సంపాదిస్తే.. కలిసే బీమా!
భార్యాభర్తల కోసం మార్కెట్లోకి జాయింట్ టర్మ్ పాలసీలు వేర్వేరుగా తీసుకునే పాలసీలకన్నా తక్కువ ప్రీమియంకే లభ్యం సంపాదించే జంటలు పెరుగుతుండటంతో మారుతున్న అవసరాలు భాగస్వాములకు నెలనెలా స్థిర మొత్తం చెల్లించేలా కూడా ఆప్షన్లు బీమాకు సంబంధించి మీరెన్ని పాలసీలు తీసుకున్నా... కుటుంబంలో సంపాదించే వ్యక్తి పేరిట ఓ టర్మ్ పాలసీ ఉండటం మాత్రం తప్పనిసరి. ఒకరకంగా అసలైన బీమా రక్షణ అంటే టర్మ్ పాలసీతోనే సాధ్యం. తక్కువ ప్రీమియంతో అధిక మొత్తానికి బీమా కవరేజీ ఇవ్వటం దీని ప్రత్యేకత. కాకపోతే పాలసీదారు మరణించిన పక్షంలో మాత్రమే కవరేజీ మొత్తం తన కుటుంబానికి అందుతుంది. పాలసీ గడువు తీరిపోయిన తరవాత కూడా పాలసీదారు జీవించి ఉంటే... ఎలాంటి కవరేజీ మొత్తం చేతికి రాదు. సరే! కుటుంబంలో సంపాదించే వ్యక్తి పేరిట టర్మ్ పాలసీ తీసుకుంటాం. అంతవరకూ బాగానే ఉంది. మరి భార్యాభర్తలిద్దరూ సంపాదిస్తుంటే!! ఇద్దరి పేరిటా టర్మ్ పాలసీలు తీసుకోవాలా? తీసుకోక తప్పదు. కాకపోతే ఇద్దరి పేరిటా విడివిడిగా తీసుకుంటే ప్రీమియం కాస్త ఎక్కువ కట్టాల్సి వస్తుంది. అందుకే ఈ మధ్య పీఎన్బీ మెట్‌లైఫ్ సంస్థ జాయింట్ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీని అందుబాటులోకి తెచ్చింది. ఇద్దరి పేరిటా సంయుక్తంగా ఉండే ఈ పాలసీ వల్ల... ఇద్దరిలో ఏ ఒక్కరు మరణించినా మిగిలిన వారికి కవరేజీ మొత్తం అందుతుంది. పైగా జాయింట్ పాలసీ కావటం వల్ల ప్రీమియం కూడా తక్కువ. ఇంకా ఐసెక్యూర్ టర్మ్ ప్లాన్ పేరిట బజాజ్ అలయంజ్, ఐ-స్పౌస్ పేరిట ఏగాన్ రెలిగేర్ కూడా జాయింట్ టర్మ్ పాలసీని అందిస్తున్నాయి. భార్యాభర్తలిద్దరూ సంపాదించే కుటుంబాలు పెరుగుతున్న నేపథ్యంలో... జాయింట్ టర్మ్ పాలసీలిపుడు ప్రాధాన్యాన్ని సంతరించుకుంటున్నాయి. వీటిపై సాక్షి ప్రాఫిట్ ప్లస్ అందిస్తున్న ప్రత్యేక కథనమిది.. ముఖ్యాంశాలు... ప్రయోజనాలు కొన్ని సంస్థలు తొలి క్లెయిమ్ ఆధారంగా కవరేజీ మొత్తాన్ని చెల్లిస్తున్నాయి. అంటే పాలసీదారులిద్దరిలో ఎవరో ఒకరు మరణించిన సందర్భంలో కవరేజీ మొత్తాన్ని మిగిలిన వారికి అందిస్తాయి. అంటే తొలి క్లెయిమ్ ఆధారంగా ఇవి కవరేజీ మొత్తాన్ని చెల్లిస్తాయి. అప్పటితో పాలసీ ముగిసిపోతుంది కూడా. ఒకవేళ ఒకే సందర్భంలో ఇద్దరూ మరణిస్తే... ఆ మొత్తం నామినీకి వెళుతుంది. అప్పటితో పాలసీ ముగిసిపోతుంది. పాలసీ ఒకటే అయినా కొన్ని సంస్థలు ఇద్దరికీ విడివిడి మొత్తాన్ని కవరేజీగా అందిస్తున్నాయి. భార్యాభర్తల్లో ఒకరు మరణించినపుడు మిగిలిన వారికి కవరేజీలో కొంత మొత్తాన్ని చెల్లిస్తాయి. రెండో వ్యక్తి మరణించేదాకా పాలసీ కొనసాగుతుంది. పాలసీ గడువు ముగిసేలోగా రెండో వ్యక్తి కూడా మరణిస్తే అప్పుడు ఆ మొత్తాన్ని నామినీకి అందజేస్తారు. కొన్ని సంస్థలు అదనపు ప్రయోజనాల్ని కూడా అందిస్తున్నాయి. పాలసీ గడువులోపు ఇద్దరిలో ఏ ఒక్కరు మరణించినా మిగిలిన వారికి కొన్నాళ్ల పాటు (కొన్ని సంస్థలు దీన్ని 60 నెలలుగా నిర్ణయించాయి) నెలకు కొంత చొప్పున స్థిర మొత్తాన్ని అందజేస్తున్నాయి. ఈ మొత్తం ఏక మొత్తంగా చెల్లించే కవరేజీకి అదనం. కొన్ని బీమా కంపెనీలు ఈ జాయింట్ టర్మ్ పాలసీకి కొంత అదనపు ప్రీమియంతో క్రిటికల్ ఇల్నెస్ రైడర్‌ను కూడా అందజేస్తున్నాయి. ఇటీవలే పాలసీని ఆవిష్కరించిన కొన్ని సంస్థలైతే ఇన్‌బిల్ట్ ప్రమాద బీమాను, ఇన్‌బిల్ట్ టెర్మినల్ ఇల్నెస్ ప్రయోజనాన్ని అందిస్తున్నాయి. బాగా ముదిరిపోయిన లేక నయం చేయటానికి వీలుకాని వైద్యపరమైన పరిస్థితినే టెర్మినల్ ఇల్నె స్‌గా పరిగణిస్తారు. వీటన్నిటితో పాటు ఈ పాలసీలకు చెల్లించే ప్రీమియానికి ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ, సెక్షన్ 10(10డీ) కింద పన్ను మినహాయింపులు వర్తిస్తాయి. విడివిడిగా తీసుకునే టర్మ్ పాలసీలకు.. జాయింట్ టర్మ్ పాలసీలకు ఉండే తేడాలివీ ఇద్దరికీ ఒకేరకమైన నియమ నిబంధనలతో ఈ పాలసీ వర్తిస్తుంది. విడివిడిగా తీసుకుంటే ఇద్దరికీ వేరువేరు నిబంధనలు వర్తించే అవకాశం ఉంది. {పత్యేకంగా పేర్కొంటే తప్ప సహజంగా జాయింట్ పాలసీల్లో ఒకే కవరేజీ వర్తిస్తుంది. ఒకవేళ పాలసీదారులిద్దరూ ఒకేసారి ప్రమాదంలో మరణిస్తే... ఒకరికి చెల్లించే మొత్తాన్ని మాత్రమే నామినీకిస్తారు. అదే విడివిడి పాలసీలైతే ఇద్దరి కవరేజీలూ వస్తాయి. ఒకరు మరణించాక పాలసీ ముగిసిపోతుంది కనక మిగిలినవారికి ఎలాంటి కవరేజీ ఉండదు. ఆ వయసులో కొత్త పాలసీ తీసుకోవాలంటే చాలా ఖరీదు. దాంతో మిగిలిన జీవితాంతం కవరేజీ లేకుండానే ఉండాలి.చాలా సందర్భాల్లో విడివిడి పాలసీలకన్నా జాయింట్ టర్మ్ పాలసీ ప్రీమియం చాలా తక్కువ. పలు కంపెనీలు ఈ మేరకు ప్రొడక్టులను విక్రయిస్తున్నాయి. భార్యాభర్తలు విడాకులు తీసుకుని విడిపోయిన సందర్భంలో పాలసీ నుంచి ఒకరిని తప్పించటం సాధ్యం కాదు. అయితే కొనసాగించటం, లేకపోతే వదిలేయటం చేయాల్సిందే. ఎవరికి అవసరం? భార్యాభర్తలిద్దరూ సంపాదించే కుటుంబాలు వేగంగా పెరుగుతున్నాయి. ‘‘ఈ కుటుంబాల్లో... తమ జీవన విధానానికి, రుణాలకు, ఇంటి ఖర్చులకు అవసరమైన మొత్తాన్ని ఇద్దరూ ఇస్తుంటారు. ఇలాంటి కుటుంబాల్లో ఏ ఒక్కరు మరణించినా, లేక దెబ్బతిన్నా ఆర్థికంగా వారికి కోలుకోలేని దెబ్బ తగులుతుంది. ఇలాంటి కుటుంబాలకు ఈ కవరేజీ చాలా అవసరం’’ అని బజాజ్ అలయంజ్ జనరల్ ఇన్సూరెన్స్‌లో హెల్త్ ఇన్సూరెన్స్ హెడ్‌గా వ్యవహరిస్తున్న సురేష్ సుగతన్ వ్యాఖ్యానించారు. నిపుణుల సూచనల ప్రకారం... యువ జంటలకు జాయింట్ టర్మ్ పాలసీ అవసరం. ప్రత్యేకించి పిల్లలు చిన్నగా ఉండి, రుణాలు ఎక్కువగా ఉన్నవారికి మరింత అవసరం. ఎందుకంటే వీరికి ఏమైనా జరిగిన పక్షంలో ఆ కుటుంబానికి తగిలే దెబ్బ మామూలుది కాదు. దాంతో పోలిస్తే పాలసీకి చెల్లించే ప్రీమియం చాలా తక్కువనే చెప్పాలి. -
బీమా.. ధీమా!
చివరగా కీలకమైన మరో అంశం...! అనుకోని సంఘటన జరిగి పిల్లలు ఒంటరి అయినా మీ ఆశయం నెరవేరాలి. ఈ విషయంలోనే ఇతర సేవింగ్ పథకాలతో పోలిస్తే పిల్లల చదువుకు బీమా పథకాలు ముందు వరుసలో ఉంటాయి. ప్రీమియం చెల్లించే తల్లిదండ్రులకు ఏమైనా జరిగితే భవిష్యత్తు ప్రీమియంలు చెల్లించకుండానే పాలసీ కొనసాగుతుంది. తద్వారా ఎటువంటి ఆర్థిక ఇబ్బంది లేకుండా కుటుంబసభ్యులు మీ ఆశయాన్ని సులభంగా చేరుకోగలరు.