
Dyson Zone headphones: టెక్నాలజీ సంస్థ డైసన్ ఎట్టకేలకు తనప్రీమియం హెడ్ ఫోన్‌లను తీసుకొచ్చింది. తద్వారా ఆడియో విభాగంలోకి ప్రవేశించింది. డైసన్ జోన్ పేరుతో వాటిని లాంచ్ చేసింది. దాదాపు యాపిల్ ప్రీమియంహెడ్‌ఫోన్‌లు AirPods Max ధర లోనే డైసన్ నాయిస్ క్యాన్సిలింగ్ హెడ్‌ఫోన్స్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది.
50 గంటల వరకు ప్లేబ్యాక్, 3 గంటల్లోనే 100 శాతం చార్జింగ్, యూఎస్‌బీ-సీ చార్జింగ్ సిస్టం, లిథియం అయాన్ బ్యాటరీలు, 11 మైక్రోఫోన్లు మొదలైన ప్రత్యేకతలు వీటిలో ఉన్నాయి. మైడైసన్ యాప్‌తో ఈ హెడ్‌ఫోన్స్‌ను నియంత్రించవచ్చు. స్వచ్ఛమైన గాలిని అందించే కార్బన్ ఫిల్టర్లను కూడా వీటికి అమర్చుకోవచ్చు. మోడల్‌ను బట్టి హెడ్‌ఫోన్స్ ధర రూ. 59,900 - రూ. 64,900 వరకు ఉంటుంది. (కష్టాల్లో కాఫీ డే: రూ.434 కోట్ల చెల్లింపుల వైఫల్యం)
New Dyson Zone Absolute+ air purifying noise-cancelling headphones🎧 pic.twitter.com/XS7j3pbq7s
— Milez (@MilezGrey) May 8, 2023