Launched
-
హోండా కొత్త బైక్.. మార్కెట్లోకి ఎన్ఎక్స్200
దేశంలో అడ్వెంచర్ టూరర్ మార్కెట్ వృద్ధి చెందుతోంది. హై సెట్ బైక్‌లకు పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా కంపెనీలు సరికొత్త లాంచ్‌లతో ముందుకువస్తున్నాయి. ఈ క్రమంలోనే హోండా కొత్త ఎన్ఎక్స్ 200 (Honda Nx200)ను మార్కెట్లో లాంచ్ చేసింది. దీని ధర రూ. 1.68 లక్షలుగా (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) కంపెనీ నిర్ణయించింది. ఎన్ఎక్స్ 200 అనేది రీబ్రాండెడ్ సీబీ200ఎక్స్.ఈ కొత్త చేరికతో హోండా భారత్‌లో విక్రయించే ఎన్ఎక్స్ శ్రేణి బైక్‌లు రెండుకు చేరతాయి. ఈ రేంజ్లో ఎన్ఎక్స్500ను ఇప్పటికే హోండా ఇక్కడ విక్రయిస్తోంది. భారత్‌లో ఎన్ఎక్స్కు మెరుగైన బ్రాండ్ రీకాల్, విలువ ఉన్న నేపథ్యంలో సీబీ200ఎక్స్‌ను ఎన్ఎక్స్200గా రీబ్రాండ్ చేయాలని హోండా నిర్ణయించినట్లు కనిపిస్తోంది.స్టైలింగ్ పరంగా ఎన్ఎక్స్200 కొన్ని చిన్న డిజైన్ జోడింపులు చేశారు. అయితే మొత్తంగా స్టైలింగ్‌లో పెద్దగా మార్పులు లేవు. కానీ మోటార్‌సైకిల్‌పై కొన్ని ప్రధాన ఫీచర్ అప్గ్రేడ్లు కనిపిస్తున్నాయి. అందులో డ్యూయల్-ఛానల్ ఏబీఎస్, బ్లూటూత్ ఇంటిగ్రేషన్‌తో టీఎఫ్టీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ప్రధానంగా ఉన్నాయి.ఎన్ఎక్స్200 అదే 184సీసీ సింగిల్-సిలిండర్ ఇంజిన్‌తో వచ్చింది. కానీ ఇప్పుడు ఓబీడీ2బీ కాంప్లియన్స్తో వచ్చింది. ఇది 17 ps శక్తిని, 16.1 nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కాకుండా స్లిప్పర్ క్లచ్‌తో 5 స్పీడ్ గేర్‌బాక్స్‌ను ఈ బైక్‌లో జత చేశారు. హోండా ఎన్ఎక్స్200ను కంపెనీ ప్రీమియం డీలర్‌షిప్‌ల ద్వారా విక్రయిస్తారు. ఇది మూడు రంగుల్లో లభిస్తుంది. బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. మార్చి నుండి డెలివరీలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. -
'కలర్స్ హెల్త్ కేర్'లో ఐశ్వర్య రాజేష్ సందడి
-
కొత్త కారును ఆవిష్కరించిన టెస్లా (ఫొటోలు)
-
రియల్మీ కొత్త ఫోన్లు.. అదిరిపోయే కలర్ ఛేంజింగ్ ఫీచర్‌తో..
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్మీ 14 సిరీస్‌లో రెండు కొత్త మోడల్ ఫోన్లను లాంచ్ చేసింది. రియల్మీ 14 ప్రో (Realme 14 Pro) 5G, రియల్మీ 14 ప్రో ప్లస్ (Realme 14 Pro+) 5G పేరుతో తాజాగా భారత్ మార్కెట్లో అందుబాటులోకి తెచ్చింది. ఈ రెండు హ్యాండ్సెట్లు మూడు రంగులలో, అదిరిపోయే కలర్ చేంజింగ్ ఫీచర్‌తో లభ్యమవుతున్నాయి.రియల్మీ 14 ప్రో ప్లస్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్3 (Snapdragon 7s Gen 3) చిప్సెట్తో నడుస్తుంది. ఇక రియల్మీ 14 ప్రోలో మీడియాటెక్ (MediaTek) డైమెన్సిటీ 7300 ఎనర్జీ 5G చిప్సెట్ ఉంది. ఖరీదైన ప్రో+ మోడల్లో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సోనీ IMX896 సెన్సార్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్ ఉంది. రియల్మీ 14 ప్రో సిరీస్‌లోని రెండు హ్యాండ్సెట్లు 80W వరకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000mAh బ్యాటరీ యూనిట్లను కలిగి ఉన్నాయి.ధరలివే..భారత్‌లో రియల్మీ 14 ప్రో 5G ప్రారంభ ధర 8GB+128GB మోడల్‌కు రూ.24,999, 8GB+256GB వేరియంట్‌కు రూ. 26,999. ఇది జైపూర్ పింక్, పెరల్ వైట్, స్వెడ్ గ్రే ఫినిషింగ్‌లలో లభిస్తుంది. ఇక రియల్మీ 14 ప్రో ప్లస్ 5G 8GB+128GB వెర్షన్ ధర రూ.29,999, 8GB+256GB ధర రూ. 31,999లుగా కంపెనీ పేర్కొంది. అదే 12GB+256GB స్టోరేజ్ మోడల్ రూ.34,999కి అందుబాటులో ఉంటుంది. ఇది బికనెర్ పర్పుల్, పెరల్ వైట్, స్వెడ్ గ్రే రంగులలో లభ్యమవుతుంది.ఈ ఫోన్ల కొనుగోలుపై అర్హత కలిగిన బ్యాంక్ కార్డ్ డిస్కౌంట్లను ఉపయోగించడం ద్వారా వినియోగదారులు రూ.4,000 వరకు తగ్గింపులను పొందవచ్చు. రియల్మీ 14 ప్రో సిరీస్ కోసం ప్రీ-బుకింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. జనవరి 23 మధ్యాహ్నం 12 గంటల నుండి ఫ్లిప్‌కార్ట్ (Flipkart), రియల్మీ ఆన్లైన్ స్టోర్, ఆఫ్‌లైన్ రిటైల్ ఛానెల్‌ల ద్వారా విక్రయాలు మొదలవుతాయి.రియల్మీ 14 ప్రో ప్లస్ 5G స్పెసిఫికేషన్లు⇒ 120Hz రిఫ్రెష్ రేట్, 3840Hz డిమ్మింగ్, 1500 నిట్స్ బ్రైట్‌నెస్‌తో 6.83-అంగుళాల 1.5K (1,272×2,800 పిక్సెల్స్) AMOLED డిస్ప్లే.⇒ స్నాప్‌డ్రాగన్ 7S జెన్ 3 చిప్సెట్⇒ గరిష్టంగా 12GB ర్యామ్, 256GB స్టోరేజ్⇒ 50-మెగాపిక్సెల్ 1/1.56-అంగుళాల సోనీ IMX896 ప్రైమరీ సెన్సార్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్. 32-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా⇒ 5G, 4G LTE, Wi-Fi 6, బ్లూటూత్ 5.2, GPS, Glonass, BeiDou, Galileo, QZSS, USB టైప్-సి కనెక్టివిటీ⇒ బయోమెట్రిక్ ప్రమాణీకరణ కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్⇒ 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000mAh టైటాన్ బ్యాటరీరియల్మీ 14 ప్రో 5G స్పెసిఫికేషన్స్⇒ వనిల్లా మోడల్లో 120Hz రిఫ్రెష్ రేట్, 4,500 నిట్స్ గరిష్ట ప్రకాశంతో 6.77-అంగుళాల AMOLED డిస్ప్లే⇒ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ 5G చిప్సెట్⇒ GB ర్యామ్, 256GB వరకు స్టోరేజ్⇒ 50-మెగాపిక్సెల్ సోనీ IMX882 రియర్ కెమెరా, 16-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాహై-రెస్ సర్టిఫికేషన్‌తో డ్యూయల్ స్పీకర్లుఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్⇒ 45W ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000mAh బ్యాటరీకలర్ చేంజింగ్ ఫీచర్ఉష్ణోగ్రత మార్పులకు ప్రతిస్పందించే కోల్డ్-సెన్సిటివ్ కలర్-ఛేంజ్ టెక్నాలజీని రియల్మీ 14 ప్రో ప్లస్ 5G, రియల్మీ 14 ప్రో 5G ఫోన్లలో పెరల్ వైట్ వేరియంట్లలో రియల్మీ వినియోగించింది. ఇది ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్ కంటే తగ్గినప్పుడు ఫోన్ వెనుక కవర్ పెరల్ వైట్ నుండి బ్లూకు మారుతుంది. తిరిగి ఉష్ణోగ్రత పెరిగినప్పుడు అసలు రంగుకు వస్తుంది. -
Year Ender 2024: కొత్తగా పట్టాలెక్కిన ‘వందేభారత్’లివే..
భారతీయ రైల్వే అనునిత్యం లక్షలాదిమంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరుస్తుంటుంది. 2024లో రైల్వే అనేక ఆధునిక మార్పులను సంతరించుకుంది. ఈ ఏడాది పలు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రారంభమయ్యాయి. ఫలితంగా దేశంలోని పలు నగరాలకు వేగవంతమైన ప్రయాణ సౌకర్యం ఏర్పడింది. 2024లో కొత్తగా ప్రారంభమైన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఇవే..ఢిల్లీ-పట్నా ఢిల్లీ-పట్నా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ అక్టోబర్ 30న ప్రారంభమయ్యింది. ఈ రైలు న్యూఢిల్లీ- పట్నాలను అనుసంధానం చేస్తుంది. ఫలితంగా దేశ రాజధాని ఢిల్లీ-బీహార్ మధ్య ప్రయాణ సమయం తగ్గుతుంది. ఈ ఆధునిక రైలులో ఆన్‌బోర్డ్ వైఫై, జీపీఎస్ ఆధారిత సమాచార ప్రదర్శనలు, సౌకర్యవంతమైన ఏటవాలు సీట్లు వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి.మీరట్-లక్నో మీరట్-లక్నో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ఆగస్టు 31న ప్రారంభించారు. ఈ రైలును ప్రారంభించిన దరిమిలా ఈ రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం చాలా మేరకు తగ్గింది. భద్రతతో పాటు వేగాన్ని దృష్టిలో పెట్టుకుని వందేభారత్ రైళ్లను రైల్వేశాఖ తీసుకువచ్చింది.మదురై-బెంగళూరుమదురై-బెంగళూరు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను తమిళనాడులోని మదురైని కర్ణాటకలోని బెంగళూరుతో కలిపేందుకు ఆగస్ట్ 31న ప్రారంభించారు. రెండు నగరాల మధ్య వేగవంతమైన ప్రయాణాన్ని అందించడానికి ఈ రైలు పట్టాలెక్కింది. పర్యాటకులకు ఈ రైలు ఎంతో అనువైనదని చెబుతున్నారు.చెన్నై-నాగర్కోయిల్తమిళనాడులో రైలు కనెక్టివిటీని మెరుగుపరచడానికి చెన్నై-నాగర్‌కోయిల్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ఆగస్ట్ 31న ప్రారంభించారు. ఈ రైలు చెన్నైని నాగర్‌కోయిల్‌తో కలుపుతుంది. ఈ రైలు ప్రయాణం ప్రయాణికులకు మంచి అనుభూతిని అందిస్తుంది.టాటానగర్-పట్నా టాటానగర్-పాట్నా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ జార్ఖండ్‌లోని టాటానగర్ను బీహార్‌లోని పట్నాను కలుపుతుంది. సెప్టెంబర్ 15న దీనిని ప్రారంభించారు. ఈ రైలు రద్దీగా ఉండే మార్గంలో ప్రయాణించేవారికి వరంలా మారింది.భాగల్పూర్-హౌరాభాగల్పూర్-హౌరా వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను 2024 సెప్టెంబర్ 15న బీహార్‌లోని భాగల్పూర్ను హౌరాతో కనెక్ట్ చేయడానికి ప్రారంభించారు. రైలు ప్రారంభంతో ఈ రెండు నగరాల మధ్య ప్రయాణించే ప్రయాణికులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణ ఎంపికను అందిస్తుంది.బ్రహ్మపూర్-టాటానగర్బ్రహ్మపూర్-టాటానగర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సెప్టెంబర్ 15న ప్రారంభించారు. ఇది ఒడిశాలోని బ్రహ్మపూర్ను టాటానగర్తో కలుపుతుంది. ఈ రెండు పారిశ్రామిక, సాంస్కృతిక కేంద్రాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి ఈ రైలు ఉపయోగపడుతుంది. అలాగే వ్యాపార, పర్యాటకరంగ వృద్ధికి తోడ్పాటునందిస్తుంది.ఇది కూడా చదవండి: Year Ender 2024: నూతన రామాలయం మొదలు వయనాడ్ విలయం వరకూ.. -
‘వన్ డే వన్ జినోమ్’ లక్ష్యం ఏంటంటే..
న్యూఢిల్లీ: మానవ ఆరోగ్యంతోపాటు వ్యవసాయం, పర్యావరణ రంగాల్లోనూ ఎన్నోవిధాలుగా ఉపయోగపడే సూక్ష్మజీవి ప్రపంచాన్ని అర్థం చేసుకునేందుకు ఇంకో గొప్ప ప్రయత్నం మొదలైంది. కేంద్ర ప్రభుత్వ బయోటెక్నాలజీ విభాగం, బయోటెక్నాలజీ రీసెర్చ్ అండ్ ఇన్నొవేషన్ కౌన్సిల్ (బ్రిక్)లు సంయుక్తంగా ఈ పనిని చేపట్టాయి. ‘వన్ డే వన్ జినోమ్’ పేరుతో న్యూఢిల్లీలో మొదలైన ఈ కార్యక్రమంలో భాగంగా బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ తదితర సూక్ష్మజీవులపై విసృ్తతస్థాయిలో పరిశోధనలు చేపట్టనున్నారు. వాటి జన్యుక్రమాలను నమోదు చేయడమే కాకుండా.. విశ్లేషించనున్నారు. తద్వారా దేశంలోని వైవిధ్యభరితమైన సూక్ష్మజీవులను మన ప్రయోజనాలకు ఉపయోగించుకోనున్నారు. ఈ నెల తొమ్మిదిన న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీలో ఈ ‘వన్ డే వన్ జినోమ్’ కార్యక్రమం మొదలైంది. నీతీఆయోగ్ మాజీ సీఈవో జీ20 షేర్పా అమితాబ్ కాంత్ తదితరులు పాల్గొన్నారు. జీవావరణ వ్యవస్థలో మైక్రోఆర్గానిజమ్స్ లేదా సూక్ష్మజీవులు చాలా కీలకం. మట్టి ఏర్పాటు మొదలుకొని ఖనిజాల శుద్ధీకరణ వరకూ బోలెడన్ని పనులు చేస్తూంటాయి ఇవి. వ్యవసాయం విషయానికి వస్తే నేలలో పోషకాలను రీసైకిల్ చేయడం, నైట్రోజన్‌ను మట్టిలోకి చేర్చడం, చీడపీడల నియంత్రణ, వంటి పనులన్నింటికీ బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులే కారణం. అంతేకాదు.. ఈ సూక్ష్మజీవులు మొక్కలతో కలసిమెలిసి ఉంటూ నీరు పోషకాలు సక్రమంగా అందేలా చేస్తాయి. మానవ శరీరంలో కొన్ని లక్షల కోట్ల బ్యాక్టీరియా ఉన్నాయంటేనే వాటి ప్రాధాన్యత ఏమిటన్నది అర్థమవుతుంది. తిన్న ఆహారం జీర్ణం చేయడంలో, శరీరానికి పోషకాలు అందించడంలో కీలకపాత్ర పోషిస్తూంటాయి. అలాగే మనకొచ్చే ఇన్ఫెక్షన్లకూ ఈ సూక్ష్మజీవుల్లోని కొన్ని కారణమవుతుంటాన్నది మనకు తెలుసు. ఇంతటి ప్రాముఖ్యం ఉన్నది కాబట్టే వీటి గురించి మరింత విసృ్తత స్థాయిలో అధ్యయనం చేయాల్సిన అవసరమం ఉందంటోంది ‘వన్ డే వన్ జినోమ్’!అయితే ఇప్పటివరకూ సూక్ష్మజీవి ప్రపంచాన్ని అర్థం చేసుకున్నది చాలా తక్కువే. అందుకే వేర్వేరు బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ల జన్యుక్రమాన్ని విశ్లేషించే లక్ష్యంతో వన్ డే వన్ జినోమ్ కార్యక్రమం మొదలైంది. తద్వారా ఏ సూక్ష్మజీవుల ద్వారా ముఖ్యమైన ఎంజైమ్‌లు లభిస్తున్నాయి? రోగాలకు చెక్‌పెట్టేందుకు ఉపయోగపడే రసాయనాలు ఉన్నాయన్న విషయం తెలుస్తుంది. వ్యవసాయంలోనూ మొక్కకు మేలు చేయగల, దిగుబడి పెంచగల సూక్ష్మజీవులను గుర్తించే వీలేర్పడుతుంది. బ్రిక్తోపాటు బయోమెడికల్ జినోమిక్స్ కూడా చురుకుగా పాల్గొంటున్న ఈ కార్యక్రమం ద్వారా ఏ ప్రాంతంలో ఏ రకమైన బ్యాక్టీరియా అందుబాటులో ఉందో? వాటి లక్షణాలేమిటో తెలుసుకోవచ్చు. ఇది కూడా చదవండి: అణ్వాయుధ దాడికి పుతిన్ ఆదేశం.. ప్రపంచదేశాల ఆందోళన -
వివో నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్..
స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ వివో తాజాగా వై300 (Vivo Y300 5G)ను ఆవిష్కరించింది. దీని ధర రూ. 21,999 నుంచి ప్రారంభమవుతుంది. 8 జీబీ+128 జీబీ అలాగే 8 జీబీ+256 జీబీ వేరియంట్లలో లభిస్తుంది. 6.67 అంగుళాల డిస్ప్లే, 50 ఎంపీ సోనీ ఐఎంఎక్స్882 మెయిన్ కెమెరా, 32 ఎంపీ ఫ్రంట్ పోర్ర్టెయిట్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లు ఇందులో ఉంటాయి.వివో వై300 టైటానియం సిల్వర్, ఎమరాల్డ్ గ్రీన్, ఫాంటమ్ పర్పుల్ అనే మూడు రంగులలో లభిస్తుంది. ఈ పరికరం 8GB+128GB వేరియంట్ ధర రూ. 21,999 కాగా 8GB+256GB వేరియంట్ ధర రూ.23,999. ఈ ఫోన్‌కి సంబంధించిన ప్రీ-ఆర్డర్లు నవంబర్ 21 నుండి ప్రారంభమవుతాయి.నవంబర్ 26 నుంచి వివో ఇండియా ఈ–స్టోర్‌తో పాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ తదితర ఈకామర్స్ సైట్ల ద్వారా కూడా కొనుగోలు చేయొచ్చు. ఎస్బీఐ కార్డ్, బీవోబీ కార్డ్ మొదలైన వాటిపై రూ. 2,000 వరకు క్యాష్‌బ్యాక్ వంటివి ఆఫర్లు పొందవచ్చు. తమ వై సిరీస్ స్మార్ట్ఫోన్లకు బాలీవుడ్ నటి సుహానా ఖాన్ ప్రచారకర్తగా వ్యవహరిస్తారని సంస్థ తెలిపింది. -
సెలూన్ ఓపెనింగ్‌లో బిగ్ బాస్ సెలబ్రిటీల సందడి (ఫొటోలు)
-
మహీంద్రా వాణిజ్యవాహనం ‘వీరో’
న్యూఢిల్లీ: మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం) సంస్థ తాజాగా 3.5 టన్నుల లోపు తేలికపాటి వాణిజ్య వాహన (ఎల్సీవీ) విభాగంలో ’వీరో’ను ప్రవేశపెట్టింది. దీని ధర రూ. 7.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో డీజిల్ వెర్షన్ లీటరుకు 18.4 కి.మీ., సీఎన్జీ వేరియంట్ కేజీకి 19.2 కి.మీ. మైలేజీనిస్తుంది.ఎల్సీవీ విభాగంలో తమ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని సంస్థ ఆటోమోటివ్ డివిజన్ ప్రెసిడెంట్ విజయ్ నక్రా తెలిపారు. రూ. 900 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన కొత్త అర్బన్ ప్రాస్పర్ ప్లాట్‌ఫాంపై దీన్ని రూపొందించినట్లు ఆయన చెప్పారు. త్వరలోనే ఎలక్ట్రిక్ వెర్షన్‌ను కూడా ప్రవేశపెడతామని వివరించారు. తమకు 3.5 టన్నుల లోపు ఎల్సీవీ సెగ్మెంట్లో 51 శాతం, 2–3.5 టన్నుల సెగ్మెంట్లో 63 శాతం వాటా ఉందని నక్రా చెప్పారు.దీన్ని మరింత పెంచుకునేందుకు వీరో సహాయపడుతుందని చెప్పారు. గతేడాదితో పోలిస్తే ఈసారి 2–3.5 టన్నుల విభాగంలో స్వల్పంగా అమ్మకాలు క్షీణించాయని, 2 టన్నుల లోపు సెగ్మెంట్లో 12 శాతం క్షీణత నమోదైందని ఆయన పేర్కొన్నారు. అయితే, ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాల అమ్మకాలు పుంజుకోవడం ప్రారంభమైందని, ఈ సానుకూలత చిన్న వాణిజ్య వాహనాల విభాగంలో కూడా కనిపించవచ్చని నక్రా చెప్పారు. -
భారత్ అమ్ముల పొదిలో ‘అరిఘాత్’
సాక్షి, విశాఖపట్నం: భారత్ అమ్ముల పొదిలో మరో అణు జలాంతర్గామి ‘అరిఘాత్’చేరింది. అరిహంత్ క్లాస్‌లో రెండోదైన ఈ అణు జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిఘాత్‌ను విశాఖ నేవల్ డాక్‌యార్డులో గురువారం జరిగిన కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ నేవీలోకి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మన త్రివిధ దళాలు అణుశక్తిని సముపార్జించుకుని మరింత బలోపేతమయ్యాయని తెలిపారు. అణుత్రయాన్ని బలోపేతం చేసుకుంటూ వ్యూహాత్మక సమతుల్యత, శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పడంలో భారత్ కీలకంగా మారుతోందన్నారు.దేశ భద్రత విషయంలో మోదీ ప్రభుత్వం రాజీలేని పోరాటం చేస్తోందని, సైనికులకు అత్యాధునిక, నాణ్యమైన ఆయుధాలు, మౌలిక సదుపాయాలు, ఇతర పరికరాల్ని సమకూర్చేందుకు మిషన్ మోడ్‌లో పనిచేస్తోందని చెప్పారు. దేశాన్ని అగ్ర రాజ్యాలతో సమానంగా నిలబెట్టిన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి రాజకీయ సంకల్పాన్ని దేశం ఎప్పటికీ మరవదన్నారు. నేటి భౌగోళిక, రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రక్షణ సహా ప్రతి రంగంలోనూ వేగంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు.అరిఘాత్ ప్రత్యేకతలు..పొడవు: 111.6 మీటర్లు వెడల్పు: 11 మీటర్లు డ్రాఫ్ట్: 9.5 మీటర్లు బరువు: 6,000 టన్నులు సామర్థ్యం: ఉపరితలంలో గంటకు 22–24 కి.మీ. (12–15 నాటికల్ మైళ్లు).. సాగర గర్భంలో గంటకు 24 నాటికల్ మైళ్లు నిర్మాణం: విశాఖలోని నేవీ షిప్ బిల్డింగ్ సెంటర్ సెన్సార్ సిస్టమ్, ఇతర ప్రత్యేకతలు: సోనార్ కమ్యూనికేషన్ వ్యవస్థ, టార్పెడోలు, సబ్‌మెరైన్ లాంచ్డ్ బాలిస్టిక్ మిసైల్స్, పంచేంద్రియ యూనిఫైడ్ సోనార్ సబ్‌మెరైన్, సముద్ర జలాల్లోనూ కమ్యూనికేషన్ వ్యవస్థ, కంట్రోల్ సిస్టమ్. మిస్సైల్ రేంజ్ : 750 కిలోమీటర్లు -
రెస్ట్రో బార్‌పై కోహ్లీ సిక్స్..
సాక్షి, సిటీబ్యూరో: సెలబ్రిటీలు వ్యాపార రంగంలోకి రావడం కొత్తేమీ కాదు.. కానీ వారి వ్యాపారాలకు హైదరాబాద్ నగరాన్ని వేదిక చేసుకోవడం ఈ మధ్య విరివిగా జరుగుతోంది. నగరంలో బాలీవుడ్ హీరోలు మొదలు మనీష్ మల్హోత్రా వంటి ఫ్యాషన్ ఐకాన్స్ నుంచి ప్రముఖ భారతీయ క్రీడాకారుల వరకూ సొంత వ్యాపారాలను ప్రారంభించిన వారే. విభిన్న సంస్కృతులతో పాటు సామాజికంగా, ఆర్థికంగా అన్ని వర్గాల ప్రజలను సమ్మిళితం చేసేలా నగర జీవనం కొనసాగించడం ఒక కారణం. ఐతే నగరంలో ప్రముఖ ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సైతం సొంతంగా వన్–8 కమ్యూన్ అనే సరికొత్త రెస్ట్రో బార్‌ను ఏర్పాటు చేశారు. ఇక్కడ కోహ్లీ ఫేవరెట్ ఫుడ్ మష్రూమ్ గూగ్లీ డిమ్ సమ్ వంటి పసందైన వంటకాలు ఆహార ప్రియులకు నోరూరిస్తున్నాయి.విలాసవంతమైన ఆహారం, బ్రేవరేజస్తో పాటు, అధునాతన జీవన శైలికి అద్ధం పట్టే అద్భుతమైన ఇంటీరియర్ ఫ్యాషన్ లుక్ నేటి రెస్టారెంట్ కల్చర్‌లో భాగమైపోయింది. అయితే నగర వాసుల నుంచి సెలబ్రిటీల వరకూ అందరినీ ఆకర్షించేందుకు ఎవరికి వారు తమ సొంత స్టైల్లో యునీక్ యాంబియన్స్ కోసం తాపత్రయపడుతున్నారు. అలాంటి వినూత్న అనుభూతిని అందించటం వన్–8 కమ్యూన్ ప్రత్యేకత. రిచ్ ఫుడ్.. వింటేజ్ లుక్.. ఇటీవలే హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ నడి»ొడ్డున ప్రారంభించిన వన్–8 కమ్యూన్ నగరానికున్న రాజసాన్ని, రిచ్ ఫ్లేవర్‌ను ప్రతిబింబిస్తుంది. ఇందులోని కిచెన్.. పాక ప్రపంచానికి నూతన హంగులు అద్దిందని ఫుడ్ లవర్స్ చెబుతున్నారు. వన్–8 కమ్యూన్ బ్రాండ్ ఎథోస్‌కు కట్టుబడి, రెస్టారెంట్ డిజైన్ అందంగా, ఆహ్లాదంగా తీర్చిదిద్దారు. ముఖ్యంగా ఇక్కడి వింటేజ్ లుక్స్ నగరవాసులను విశేషంగా ఆకర్షిస్తుంది. జుహు, బెంగుళూరు, గుర్గావ్లలో ఇప్పటికే ఆదరణ పొందుతున్న ఈ రెస్ట్రో బార్ నగరానికి చేరుకోవడంతో ఫుడ్ లవర్స్‌తో పాటు క్రికెట్ ప్రియులు సైతం ఆసక్తిగా విచ్చేస్తున్నారు. రెస్ట్రో బార్లో భాగంగా రిచ్ ఫుడ్ డిషెస్‌తో పాటు బ్రేవరేజస్ అందుబాటులో ఉండటంతో అన్ని వర్గాల వారికీ హాట్ స్పాట్‌గా మారింది.కోహ్లీ ఫేవరెట్ ఫుడ్ ఇక్కడే..ఈ స్పాట్ రాయల్ లుక్ ఇంటీరియర్‌తో పాటు కోహ్లీకి అత్యంత ఇష్టమైన కార్న్ బార్లీ రిసోట్టో, మష్రూమ్ గూగ్లీ డిమ్ సమ్, టార్టేర్ టాప్డ్ అవకాడో వంటి పలు వంటకాలను ప్రత్యేకంగా వండి వడ్డిస్తున్నారు. కోహ్లీ అభిమానులు ఈ వంటకాలను రుచి చూడటానికి ప్రత్యేకంగా ఇక్కడికి రావడం విశేషం. స్థానికంగా ఆదరణ పొందుతున్న ఫుడ్ రెసిపీలతో పాటు దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన విభిన్న మోడ్రన్ రుచులును తయారు చేస్తున్నారు. అంతే కాకుండా మద్యాన్ని ఇష్టపడే వారికి టలిస్కర్, గ్లెన్లివెట్, గ్లెన్ మెరంగే, గ్లెన్ ఫిడిచ్, క్రాగన్మోర్ వంటి విభిన్న టాప్ బ్రాండ్లు కొలువుదీరాయి. ఇవన్నీ దాదాపు పది–పన్నెండేళ్ల సరుకు కావడం విశేషం.సెలబ్ స్పాట్...హైటెక్ సిటీ వేదికగా కొలువుదీరిన ఈ రెస్టారెంట్ నగరంలోని సెలబ్రిటీలకు మంచి స్పాట్‌గా మారింది. దీని ప్రారం¿ోత్సవాలు ముగియకముందే మంచు మనోజ్ వంటి సినీతారల పుట్టినరోజు వేడుకలు ఇక్కడ నిర్వహించడం మరింత ఆసక్తి పెంచింది. వన్–8 కమ్యూన్ను ఇప్పటికే సినీ ప్రముఖులు మంచు లక్షి్మ, నాని, అడివి శేష్, నిఖిల్, తేజ సజ్జ, సు«దీర్ బాబు, సందీప్ కిషన్, ఆకాష్ పూరి, అభిరామ్ వంటి టాలీవుడ్ నటులు సందర్శించారు.సామాజిక, సాంస్కృతిక అనుసంధాన వేదిక..ఎల్లప్పుడూ ఆహారంతో పాటుగా సామాజికంగా ప్రజలందరినీ ఒకచోట చేర్చే స్థలాన్ని సృష్టించడం వన్–8 కమ్యూన్ ప్రధాన లక్ష్యం. స్థానికంగానే కాకుండా దేశ విదేశాలకు చెందిన ప్రముఖ సంస్థలు, వ్యక్తులను ఆహారంతో అనుసంధానం చేసే కేంద్రంగా వన్–8 నిలుస్తుంది. స్థానిక ఫుడ్‌తో పాటు కాంటినెంటల్ ఫుడ్‌ను సైతం హైదరాబాద్ నగరం ఆహా్వనించింది, ఆస్వాదిస్తోంది. ఈ ఆదరణకు మెచ్చే విరాట్ కోహ్లీ ఈ రెస్ట్రో బార్‌ను ఏర్పాటు చేశారు. ఎప్పటిలాగే ఈ నగరం, ప్రజలు సరికొత్త రుచులను ఆస్వాదించాలని ఆశిస్తున్నాను. – వర్తిక్ తిహారా, వన్–8 కమ్యూన్ కో–ఫౌండర్ -
ఓలా నుంచి తొలి ఎలక్ట్రిక్ బైక్
ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ రోడ్‌స్టర్ అనే పేరుతో తమ తొలి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్ల శ్రేణిని ప్రకటించింది. రోడ్‌స్టర్ ప్రో , రోడ్‌స్టర్, రోడ్‌స్టర్ ఎక్స్ అనే మూడు వేరియంట్లను గురువారం తమ వార్షిక ఈవెంట్ “సంకల్ప్” సందర్భంగా లాంచ్ చేసింది. వీటి ధరలు రూ. 74,999 నుంచి రూ. 2,49,999 మధ్య ఉండనున్నాయి. మూడు మోడల్స్‌కు రిజిస్ట్రేషన్స్ కూడా ప్రారంభమయ్యాయి.చౌకైన రోడ్‌స్టర్ ఎక్స్, రోడ్‌స్టర్ మోడల్‌లు 2.5 KwH నుంచి 6 Kwh బ్యాటరీ బ్యాక్‌లతో వస్తాయి. 2025 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో వీటి డెలివరీలు ప్రారంభమవుతాయి. అలాగే ప్రీమియం రోడ్‌స్టర్ ప్రో 8 KwH, 16 KwH వేరియంట్లలో 2025 నవంబర్ నాటికి అందుబాటులో ఉంటుందని ఓలా వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ తెలిపారు.ఓలా రోడ్‌స్టర్ ఎక్స్రోడ్స్టర్ ఎక్స్ 11 kW గరిష్ట మోటార్ అవుట్‌పుట్‌ను కలిగి ఉంది. 3 బ్యాటరీ ప్యాక్ ఎంపికలు- 2.5 kWh, 3.5 kWh, 4.5 kWh ఉన్నాయి. వీటిలో టాప్ వేరియంట్ 124 కి.మీ గరిష్ట వేగం, 200 కి.మీ. రేంజ్‌ని అందిస్తుంది. కాంబి బ్రేకింగ్ సిస్టమ్ (CBS) తోపాటు 4.3-అంగుళాల ఎల్సీడీ డిస్ప్లే, ఓలా మ్యాప్స్ నావిగేషన్ వంటి అనేక రకాల డిజిటల్ టెక్ ఫీచర్లను అందిస్తుంది. ఓలా ఎలక్ట్రిక్ యాప్ కనెక్టివిటీతో వస్తుంది. 2.5 kWh వేరియంట్ ధర రూ. 74,999, 3.5 kWh రూ. 84,999, 4.5 kWh మోడల్ ధర రూ. 99,999.ఓలా రోడ్స్టర్రోడ్స్టర్ 13 kW మోటారుతో ఆధారితమైనది. ఇందులో 3.5 kWh, 4.5 kWh, 6 kWh బ్యాటరీ వేరియంట్లు ఉన్నాయి. టాప్ వేరియంట్ గరిష్టంగా 126 కి.మీ గరిష్ట వేగం, 248 కి.మీ. రేంజ్‌ని అందిస్తుంది. 6.8-అంగుళాల టీఎఫ్టీ టచ్‌స్క్రీన్, ప్రాక్సిమిటీ అన్‌లాక్, క్రూయిజ్ కంట్రోల్, పార్టీ మోడ్, ట్యాంపర్ అలర్ట్ వంటి స్మార్ట్ ఫీచర్లతో పాటు కృత్రిమ్ అసిస్టెంట్, స్మార్ట్‌వాచ్ యాప్, రోడ్ వంటి ఏఐ- పవర్డ్ ఫీచర్లతో వస్తుంది. మోటార్‌సైకిల్ ముందు, వెనుక వైపున డిస్క్ బ్రేక్‌లు, ఏబీఎస్ బ్రేకింగ్ సిస్టమ్ ఉన్నాయి. 3.5 kWh మోడల్ ధర రూ. 1,04,999, 4.5 kWh రూ.1,19,999, 6 kWh ధర రూ.1,39,999.ఓలా రోడ్‌స్టర్ ప్రోఈ శ్రేణి మోటర్ సైకిళ్లు 52 kW గరిష్ట పవర్ అవుట్‌పుట్, 105 Nm టార్క్‌తో కూడిన మోటారుతో వస్తాయి. 16 kWh వేరియంట్ 194 kmph గరిష్ట వేగాన్ని అందుకుంటుంది. 579 కిమీ రేంజ్‌ను ఇస్తుంది. ఇది సెగ్మెంట్లో అత్యంత వేగవంతమైనది మాత్రమే కాకుండా అత్యంత సమర్థవంతమైన మోటార్‌సైకిల్‌గా కూడా నిలిచింది. రోడ్‌స్టర్ ప్రోలో 10-అంగుళాల TFT టచ్‌స్క్రీన్, USD (అప్‌సైడ్ డౌన్) ఫోర్క్‌లు, ముందు, వెనుక డిస్క్ బ్రేక్‌లకు ఏబీఎస్ సిస్టమ్ ఇచ్చారు. ఇందులో 8 kWh వేరియంట్ ధర రూ. 1,99,999, 16 kWh వేరియంట్ ధరను రూ. 2,49,999 లుగా కంపెనీ పేర్కొంది. -
Hyderabad: క్రియాలో.. శ్రియ! కేపీహెచ్బీలో క్రియా జ్యువెల్లర్స్ ప్రారంభం!
సాక్షి, సిటీబ్యూరో: లక్షణమైన దక్షిణాది అమ్మాయిలా ముస్తాబు కావడం ఎంతో ఇష్టమని ప్రముఖ సినీతార శ్రియ శరన్ తెలిపారు. కేపీహెచ్‌బీ రోడ్ నంబర్–1లో నూతనంగా ఏర్పాటు చేసిన క్రియా జ్యువెల్స్‌ను బుధవారం ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అందరు మగువల్లానే తనకూ బంగారు ఆభరణాలు ఎంతో ఇష్టమన్నారు. ఆభరణాలు మగువలకు మరింత సౌందర్యాన్ని పెంచుతాయని పేర్కొన్నారు. క్రియా ఆధ్వర్యంలోని లైట్ వెయిట్ ఆభరణాలు వినూత్నంగా ఉన్నాయని చెప్పారు. సినిమాల గురించి మాట్లాడుతూ.. తెలుగులో తేజా సజ్జా సినిమాలో, తమిళ్లో సూర్యతో మరో సినిమాలో నటిస్తున్నానని తెలిపారు. వారసత్వం, సంప్రదాయ ఆవిష్కరణలో భాగంగా క్రియా జ్యువెల్లరీని ప్రారంభించామని నిర్వాహకులు కొణిజేటి వెంకట మహేష్ గుప్తా అన్నారు. వజ్రాభరణాలతో పాటు ప్రత్యేకంగా విక్టోరియన్ కలెక్షన్ అందుబాటులో ఉన్నాయన్నారు. మరికొద్ది రోజుల్లో మరిన్ని స్టోర్లను ప్రారంభించను న్నామని ఆయన తెలిపారు. -
రాయల్ ఎన్ఫీల్డ్ గెరిల్లా 450.. కొత్త బండి గురూ!! (ఫోటోలు)
-
Realme 12 సిరీస్ 5G ను అన్ బాక్స్ చేసిన సంయుక్త మీనన్ (ఫొటోలు)
-
భూసార పరిరక్షణకు విద్యార్థి సైన్యం
సాక్షి, అమరావతి: ఎరువులు, పురుగు మందుల్ని మితిమీరి వినియోగించడం వల్ల దిగుబడులు రాక రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. ఈ పరిస్థితికి చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున భూసార పరీక్షలు చేయిస్తూ ప్రతి రైతుకు సాయిల్ హెల్త్ కార్డులను అందజేస్తోంది. శాస్త్రవేత్తల సిఫార్సుల మేరకు తగిన మోతాదులో ఎరువులు, మందులు వాడేలా ఆర్బీకే స్థాయిలో అవగాహన కల్పిస్తోంది. తాజాగా మరో అడుగు ముందుకేసి భవిష్యత్ తరాలకు భూసార పరిరక్షణపై అవగాహన కల్పించేలా ‘స్కూల్ సాయిల్ హెల్త్ ప్రాజెక్ట్’ చేపట్టింది. భవిష్యత్ తరాలకు భూసార పరిరక్షణపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టింది. విద్యార్థుల్లో ప్రకృతిపై ఆరాధన భావం పెంపొందించడం, వ్యవసాయంపై ఆసక్తి, ఉత్సుకత, రైతుల కష్టంపై చిన్ననాటి నుంచే అవగాహన కల్పించడం, వారిపట్ల బాధ్యతాయుత ప్రేమ, సాగుపై ఆలోచనా విధానంలో మార్పు తీసుకురావడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్ట్ అమలు చేస్తోంది. 6–12వ తరగతి విద్యార్థులకు అవగాహన తొలి దశలో రాష్ట్రంలోని 29 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలు, 13 జవహర్ నవోదయ పాఠశాలలతో పాటు 8 కేంద్రీయ విద్యాలయాల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా దీనిని చేçపడుతున్నారు. విద్యాశాఖ సమన్వయంతో వ్యవసాయ శాఖ ఈ కార్యక్రమం అమలు చేస్తోంది. ఎంపిక చేసిన పాఠశాలల్లో 6 నుంచి 12వ తరగతి విద్యార్థులకు భూసార పరిరక్షణ–చేపట్టాల్సిన కార్యక్రమాలపై కేవీకే శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులతో అవగాహన కల్పిస్తారు. విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులకు కూడా మట్టి నమూనాల సేకరణ, రసాయనిక విశ్లేషణ, యాప్ ద్వారా ఫలితాల నమోదు, సాయిల్ హెల్త్ కార్డుల పంపిణీపై ఎస్‌హెచ్‌సీ మొబైల్ యాప్ ద్వారా శిక్షణ ఇస్తారు. ఇందుకు అవసరమైన సాయిల్ టెస్టింగ్ పరికరాలను పాఠశాలలకు సరఫరా చేస్తున్నారు. మట్టి నమూనాల సేకరణ, పరీక్ష, విశ్లేషణ కోసం ప్రత్యేకంగా మొబైల్ యాప్‌ను అభివృద్ధి చేస్తున్నారు. ప్రతి పాఠశాల పరిధిలో 50 నమూనాలు ప్రతి పాఠశాల పరిధిలోని గ్రామంలో సీజన్‌కు 25 చొప్పున ఖరీఫ్, రబీ సీజన్లలో కనీసం 50 శాంపిల్స్‌కు తక్కువ కాకుండా సేకరించనున్నారు. వీటిని పాఠశాలకు అందజేసిన సాయిల్ టెస్టింగ్ కిట్ ద్వారా విశ్లేషించి ఫలితాలను మొబైల్ యాప్‌లో అప్లోడ్ చేస్తారు. ఈ ప్రక్రియ ఏప్రిల్ 24వ తేదీలోగా పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. జూన్ 15న ఆయా పాఠశాలల పరిధిలోని గ్రామాల్లో సభలు నిర్వహించి రైతులకు సాయిల్ హెల్త్ కార్డులు జారీ చేస్తారు. భూమిలో ఉండే పోషక లోపాలను వివరిస్తూ, కోల్పోయిన భూసారం తిరిగి పొందాలంటే భూమికి ఎలాంటి పోషకాలు అందించాలి, సాగువేళ ఏ పంటకు ఎంత మోతాదులో ఎరువులు, పురుగుల మందులు వినియోగించాలి, ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలనే అంశాలపై గ్రామసభల్లో శాస్త్రవేత్తలతో రైతులకు అవగాహన కల్పిస్తారు. విద్యార్థి దశ నుంచే ఆసక్తి విద్యార్థి దశ నుంచే సాగు, రైతులపై గౌరవభావం పెంపొందించడం, భూసారం పట్ల ఆసక్తి కల్పించాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ చేపట్టింది. పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైతే అన్ని పాఠశాలలకు విస్తరిస్తాం. ఈ ప్రాజెక్ట్ కింద విద్యార్థులే స్వయంగా మట్టి నమూనాలు సేకరించి, పాఠశాలకు అందించిన కిట్ ద్వారా భూసార పరీక్షలు చేస్తారు. మట్టిలో ఏ లోపం ఉందో గుర్తిస్తారు. దీనివల్ల భూసార పరిరక్షణపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో విద్యార్థులకు అవగాహన కలుగుతుంది. – చేవూరు హరికిరణ్, స్పెషల్ కమిషనర్, వ్యవసాయ శాఖ -
రేపు జీఎస్ఎల్వీ ఎఫ్–14 ప్రయోగం
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): స్థానిక భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) షార్ కేంద్రంలోని రెండో ప్రయోగ వేదిక నుంచి శనివారం సాయంత్రం 5.35 గంటలకు జీఎస్ఎల్వీ ఎఫ్–14 రాకెట్‌ను ప్రయోగించనున్నారు. షార్‌లోని బ్రహ్మప్రకాష్ హాలులో గురువారం మిషన్ రెడీనెస్ రివ్యూ (ఎంఆర్ఆర్) సమావేశం నిర్వహించిన తర్వాత ప్రయో గ పనులను లాంచ్ ఆథరైజేషన్ బోర్డు (ల్యా బ్) వారికి అప్పగించారు. అనంతరం లాంచ్ ఆథరైజేషన్ బోర్డు చైర్మన్ ఆర్ముగం రాజ రాజన్ ఆధ్వర్యంలో మరోసారి ల్యాబ్ సమావేశం నిర్వహించారు.శుక్రవా రం మధ్యాహ్నం 2.05 గంటల నుంచి 27.30 గంటల కౌంట్‌డౌన్ అనంతరం జీఎస్ఎల్వీ ఎఫ్–14 రాకెట్‌ను ప్రయోగిస్తారు. మొత్తం 2,272 కిలోలు బరువు కలిగిన ఇన్శాట్–3డీఎస్ ఉపగ్రహాన్ని భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తులోని భూస్థిర కక్ష్యలో ప్రవేశపెట్టేలా ఇస్రో శాస్త్రవేత్తలు ఈ ప్రయోగాన్ని డిజైన్ చేశారు. ఇది షార్ కేంద్రం నుంచి 92వ ప్రయోగం కాగా, జీఎస్ఎల్వీ సిరీస్‌లో 16వ ప్రయోగం పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో క్రయోజనిక్ ఇంజిన్లు తయారు చేసుకుని చేస్తున్న 10వ ప్రయోగం కావడం విశేషం. -
సాక్షి లైఫ్.. మీ ఆరోగ్య నేస్తం
వైద్య రంగంలో విశ్వసనీయమైన సమాచారా న్ని అందించేందుకు ‘సాక్షి లైఫ్’ను తీసుకొచ్చింది సాక్షి మీడియా గ్రూప్. సమస్త ఆరోగ్య సమచారాన్ని సమగ్రంగా ఆర్టికల్స్, వీడియోల రూపంలో తీర్చిదిద్దింది. ఆరోగ్యం పట్ల అవగాహన పెంచేందుకు నిష్ణాతులైన డాక్టర్ల సూచనలు, సలహాలతో పాటు ఆహారం, వ్యాయామాల గురించి వివరంగా ఇందులో నిక్షిప్తం చేసింది. life.sakshi.com పేరుతో వచ్చిన ఈ వెబ్సైట్లో వైద్యరంగానికి సంబంధించిన అన్ని అప్డేట్స్ను అందుబాటులోకి తెచ్చింది. వివిధ విభాగాలకు సంబంధించి ప్రముఖ వైద్యు ల ఇంటర్వ్యూలు, నిపుణుల సలహాలను వీడియోల రూపంలో యూట్యూబ్‌లో sakshi life ఛానల్లో అప్లోడ్ చేసింది. ‘సాక్షి‘ ఇద్దరి స్పూర్తితో ఈ ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. వైద్యరంగం నుంచి వచ్చి రాజకీయ నాయకుడిగా ఎదిగి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను పరిపాలించిన మహానేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఒకరు. రూపాయికే వైద్యం అందించి ప్రజల గుండెల్లో చిరకాలం నిలిచిపోయిన వైఎస్సార్.. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆరోగ్యశ్రీ ని తీసుకొచ్చి ఎంతోమంది ప్రాణాలు కాపాడారు. మరొకరు డాక్టర్ ఈ.సీ.గంగిరెడ్డి. నిస్వార్థ వైద్య సేవలకు మారుపేరుగా నిలిచి ప్రజల గుండెల్లో కొలువైన డాక్టర్ ఈసీ గంగిరెడ్డి వైద్యం వృత్తి కాదు,ప్రాణం అని నమ్మారు. ఈ ఇద్దరి మహనీయుల స్ఫూర్తితో ‘సాక్షి లైఫ్ ‘ తెలుగు ప్రజల ముందుకు వస్తోంది. ఆరోగ్య సమాచారాన్ని సులువుగా తెలుగు వారందరికీ అందించాలన్నదే ‘సాక్షి’ లక్ష్యం. ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్, శ్రీమతి వై.ఎస్.భారతి రెడ్డి ‘సాక్షి లైఫ్’ వెబ్సైట్ తో పాటు యూట్యూబ్ ఛానెల్ ను లాంఛనంగా ఆవిష్కరించారు. సాక్షి లైఫ్ ప్రజలందరి ఆరోగ్య నేస్తం. అందుబాటులో ఉన్న వేర్వేరు వైద్య విధానాల గురించి చెప్పడమే కాదు, అసలు వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తల గురించి కూడా తెలియజేస్తుంది. life.sakshi.com https://www.youtube.com/@life.sakshi సాక్షి లైఫ్ప్రారంభం సందర్భంగా ప్రముఖ డాక్టర్లు ఏమన్నారంటే... ‘హెల్త్ కు సంబంధించిన విశ్వసనీయమైన సమాచారం సాక్షి లైఫ్‌లో ఉంది. ఇది సమాజానికి చాలా అవసరం.’ – డా.డి.నాగేశ్వర్ రెడ్డి, పద్మభూషణ్ అవార్డు గ్రహీత ‘ప్రస్తుతం నమ్మకమైన వైద్య సమాచారం అందుబాటులో లేదు, ఆ లోటును సాక్షి లైఫ్ భర్తీ చేస్తుందనుకుంటున్నాను’ . – డా. మంజుల అనగాని, ప్రముఖ గైనకాలజిస్ట్ ‘వైద్యరంగంలో పరిశోధనలు, వాటి విశేషాలను ప్రతిఒక్కరూ తెలుసుకోవాలి. వ్యాధుల గురించి ప్రజలకు అవగాహన కల్పించేలా సాక్షి లైఫ్‌ను తీర్చిదిద్దారు’. – డా. చిన్నబాబు సుంకవల్లి, రోబోటిక్ సర్జికల్ ఆంకాలజిస్ట్ ‘ప్రతీ ఒక్కరికి గుండె కీలకం, అది ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలన్నది సాక్షి లైఫ్‌లో విపులంగా చె΄్పారు’. – డా. ఎమ్.ఎస్.ఎస్. ముఖర్జీ, సీనియర్ ఇంటర్ వెన్షనల్ కార్డియాలజిస్ట్ ‘జీవనశైలిలో మార్పులే రోగాలకు కారణం, ఈ విషయంపై సాక్షి లైఫ్‌లో నిపుణుల సలహాలున్నాయి.’ – డా.గోపీ చంద్ మన్నం, చీఫ్ కార్డియో థొరాసిక్ సర్జన్ ‘ఆరోగ్య రంగానికి సంబంధించిన సరైన సమాచారాన్ని నిపుణులైన వైద్యుల ద్వారా అందుబాటులోకి తెచ్చిన ‘సాక్షి లైఫ్‘ కు వెల్కమ్’ – డా.కోనేటి నాగేశ్వరరావు, పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ ‘మానసిక సమస్యలు పైకి చెప్పుకోలేని వారికి సాక్షి లైఫ్‌లో నిపుణుల ఇంటర్వ్యూల ద్వారా మంచి అవగాహన కలుగుతుంది, ఆల్ ది బెస్ట్’ – డా. పూర్ణిమ నాగరాజు, సైకియాట్రిస్ట్ ‘ఆర్థరైటిస్ సమస్యలు తలెత్తడా నికి కారణాలు.. ముందుగా తెలుసుకుంటే అవి రాకుండా జాగ్రత్త పడొచ్చు.. ఇలాంటి సమా చారాన్ని సాక్షి లైఫ్ ద్వారా అందిస్తున్నారు.’ – డా.కె. జె.రెడ్డి, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ -
ముఖ్య గమనిక మంచి థ్రిల్లర్ అనిపిస్తోంది
‘‘ముఖ్య గమనిక’ టీజర్ చూశాను. మంచి థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన సినిమా అనిపిస్తోంది. కానిస్టేబుల్‌గా విరాన్ క్యారెక్టర్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ సినిమా టీమ్ మొత్తానికి బూస్టప్ ఇస్తుందని ఆశిస్తున్నాను’’ అని దర్శకుడు మారుతి అన్నారు. హీరో అల్లు అర్జున్ కజిన్ విరాన్ ముత్తం శెట్టి హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘ముఖ్య గమనిక’. సీనియర్ సినిమాటోగ్రాఫర్ వేణు మురళీధర్ని దర్శకుడిగా పరిచయం చేస్తూ శివిన్ప్రోడక్షన్స్ పతాకంపై రాజశేఖర్, సాయికృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో లావణ్య హీరోయిన్. ఈ చిత్రం టీజర్‌ను దర్శకుడు మారుతి రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా విరాన్ ముత్తంశెట్టి మాట్లాడుతూ– ‘‘ఫిబ్రవరిలో ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు. ‘‘థ్రిల్లింగ్ అంశాలతో ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమాను రూపొందించాం. విరాన్ చక్కగా నటించారు’’ అన్నారు వేణు మురళీధర్. ‘‘మా బేనర్ నుంచి వస్తున్న తొలి చిత్రమిది’’ అన్నారు రాజశేఖర్. -
తిరుపతిలో షాపింగ్ మాల్ ప్రారంభించిన అనసూయ (ఫొటోలు)
-
Krithi Shetty: నెల్లూరులో షాపింగ్ మాల్ ప్రారంభించిన ఉప్పెన భామ కృతిశెట్టి (ఫొటోలు)
-
రూ.7,499లకే సరికొత్త స్మార్ట్‌ఫోన్..
లేటెస్ట్ ఫీచర్లు ఉన్న మంచి స్మార్ట్ ఫోన్‌ను తక్కువ ధరకు కొనాలనుకుంటున్నవారికి గుడ్‌న్యూస్. చౌక ధరలో స్మార్ట్ఫోన్లు అందించే చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ పోకో.. పోకో సీ65 (Poco C65) పేరుతో భారత్‌లో సరికొత్త మోడల్ స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది. ఈ ఫోన్లు డిసెంబర్ 18 నుంచి కొనుగోలుదారులకు అందుబాటులోకి రానున్నాయి. పోకో సీ65 స్మార్ట్ఫోన్లు ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయానికి రానున్నాయి. వీటి సేల్ డిసెంబర్ 18న మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రారంభ వేరియంట్‌ను రూ.7,499 లకే కొనుగోలు చేయవచ్చు. మిగిలిన వేరియంట్లు కూడా రూ. 10,000 లోపే లభిస్తాయి. పోకో సీ65 మూడు వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. 4జీబీ/128జీబీ వేరియంట్‌కు రూ. 8,499, 6జీబీ/128జీబీ వేరియంట్‌కు రూ. 9,499, 8+256GB 8జీబీ/256జీబీ వేరియంట్‌కు రూ. 10,999 ధరను కంపెనీ నిర్ణయించింది. అయితే స్పెషల్ సేల్ డే రోజున ఐసీఐసీఐ డెబిట్/క్రెడిట్ కార్డ్‌లు/ఈఎంఐ లావాదేవీలను ఉపయోగించి రూ. 1,000 తగ్గింపు, ఎక్సేంజ్ ఆఫర్ ద్వారా వీటిని వరుసగా రూ.7,499, రూ. 8,499, రూ. 9,999లకే సొంతం చేసుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్లు పాస్టెల్ బ్లూ, మాట్టే బ్లాక్ అనే రెండు రంగుల్లో లభ్యమవుతాయి.ప్రత్యేక మైక్రో ఎస్డీ కార్డ్ ద్వారా ఈ ఫోన్ మెమొరీని 1టీబీ వరకు పెంచుకోవచ్చు. పోకో సీ65 ఫీచర్లు, స్పెసిఫికేషన్లు 6.74 అంగుళాల HD+ 90Hz డిస్ప్లే MediaTek Helio G85 ప్రాసెసర్ సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ 8MP ఫ్రంట్ కెమెరా, 2MP మాక్రో లెన్స్, 50MP AI ట్రిపుల్ రియర్ కెమెరా 5000mAh బ్యాటరీ 18W ఫాస్ట్ ఛార్జింగ్ 10 వాట్ C-టైప్ ఛార్జర్ సపోర్ట్ -
Kajal Aggarwal : కూకట్‌పల్లిలో సందడి చేసిన కాజల్ అగర్వాల్ (ఫొటోలు)
-
మహాలక్ష్మీ పథకం.. మహిళలకు ఉచిత ప్రయాణం (ఫొటోలు)
-
కొత్త క్యారెక్టర్‌కి క్లాప్
హీరో రవితేజ కెరీర్లో కొత్త చిత్రం ప్రారంభమైంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మించనున్నారు. వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కనున్న ఈ సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి అన్మోల్ శర్మ కెమెరా స్విచాన్ చేయగా, దర్శకుడు వీవీ వినాయక్ క్లాప్ ఇచ్చారు. దర్శకుడు కె. రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించగా, నిర్మాత అల్లు అరవింద్ మేకర్స్‌కు స్క్రిప్ట్‌ను అందించారు. ‘‘ఒక పవర్ఫుల్ కథాంశంతో రూపొందించనున్న ఈ చిత్రంలో ఇప్పటివరకూ చూడని ఒక కొత్త పాత్రలో ప్రేక్షకులు రవితేజను చూస్తారు’’ అని యూనిట్ పేర్కొంది. సెల్వ రాఘవన్, ఇందూజ రవి చంద్రన్ కీ రోల్స్ చేయనున్న ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: జీకే విష్ణు. -
Nani's New Movie: హీరో నాని కొత్త చిత్రం షురూ (ఫొటోలు)
-
Jayasudha : బెనకా గోల్డ్ కంపెనీని ప్రారంభించిన సహజనటి జయసుధ (ఫొటోలు)
-
హైదరాబాద్ లో ఘనంగా తనిష్క్ కాకతీయ కలెక్షన్స్ ప్రారంభం (ఫోటోలు)
-
స్పెషల్ఫీచర్తో డైసన్ హెడ్‌ఫోన్స్ వచ్చేశాయ్..యాపిల్‌కు కష్టమే!
Dyson Zone headphones: టెక్నాలజీ సంస్థ డైసన్ ఎట్టకేలకు తనప్రీమియం హెడ్ ఫోన్లను తీసుకొచ్చింది. తద్వారా ఆడియో విభాగంలోకి ప్రవేశించింది. డైసన్ జోన్ పేరుతో వాటిని లాంచ్ చేసింది. దాదాపు యాపిల్ ప్రీమియంహెడ్ఫోన్లు AirPods Max ధర లోనే డైసన్ నాయిస్ క్యాన్సిలింగ్ హెడ్‌ఫోన్స్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. 50 గంటల వరకు ప్లేబ్యాక్, 3 గంటల్లోనే 100 శాతం చార్జింగ్, యూఎస్బీ-సీ చార్జింగ్ సిస్టం, లిథియం అయాన్ బ్యాటరీలు, 11 మైక్రోఫోన్లు మొదలైన ప్రత్యేకతలు వీటిలో ఉన్నాయి. మైడైసన్ యాప్‌తో ఈ హెడ్‌ఫోన్స్‌ను నియంత్రించవచ్చు. స్వచ్ఛమైన గాలిని అందించే కార్బన్ ఫిల్టర్లను కూడా వీటికి అమర్చుకోవచ్చు. మోడల్‌ను బట్టి హెడ్‌ఫోన్స్ ధర రూ. 59,900 - రూ. 64,900 వరకు ఉంటుంది. (కష్టాల్లో కాఫీ డే: రూ.434 కోట్ల చెల్లింపుల వైఫల్యం) New Dyson Zone Absolute+ air purifying noise-cancelling headphones🎧 pic.twitter.com/XS7j3pbq7s — Milez (@MilezGrey) May 8, 2023 -
దశాబ్దాల స్వప్నం సాకారమైంది!
సాక్షి, సిద్దిపేట: సిద్దిపేట ప్రజల దశాబ్దాల కల సాకారమైంది. సిద్దిపేట– సికింద్రా బాద్ రైలును నిజామాబాద్ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా మంగళవారం సాయంత్రం 4:20 గంటలకు ప్రారంభించారు. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు మంత్రి హరీశ్‌రావు జెండా ఊపి ప్రారంభించి.. అనంతరం రైలులో ప్రయా ణించారు. కొండపాక మండలం దుద్దెడ స్టేషన్లో దిగి కొండపాక మండలంలో ప లు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అదే రైలులో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు గజ్వేల్ వరకు ప్రయాణించారు. బీఆర్ఎస్, బీజేపీ పోటా పోటీ నినాదాలు.. రైలు ప్రారంభోత్సవం సందర్భంగా సిద్ది పేట రైల్వే స్టేషన్‌కు బీఆర్ఎస్, బీజేపీ కార్య కర్తలు భారీగా చేరుకున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు వల్లే సిద్దిపేటకు రైలు వచ్చిందని, బీజేపీ కార్యకర్తలు మోదీ వలనే సిద్దిపేటకు రైలు వచ్చిందని పోటాపోటీగా నినాదాలు చేశారు. ప్ల కార్డులు, తమ పార్టీకి చెందిన జెండాలు పట్టుకుని నినాదాలతో హోరెత్తించారు. ఈ క్రమంలోనే మంత్రి హరీశ్‌రావు రైలు ప్రారంభించేందుకు అక్కడకు చేరుకున్నారు. ప్లెక్సీలో సీఎం కేసీఆర్, స్థానిక ఎంపీ ఫొటోలను ఏర్పాటు చేయకపోవడంతో రైల్వే అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అహసనం వ్యక్తం చేస్తూ మోదీ చిత్రాలను ప్రదర్శిస్తున్న ఎల్ఈడీ టీవీని పక్కన పెట్టించారు. అప్పటికే బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల పోటాపోటీ నినాదాలతో ఉద్రి క్తత నెలకొంది. స్టేజీ పైన మోదీ చిత్రంతో ఏర్పాటు చేసిన ప్లెక్సీని చింపేశారు. దీంతో కార్యకర్తలు పరస్పరం బాహాబాహీకి దిగారు. కుర్చీలు, పార్టీల జెండాలను విసురుకోవడంతో బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి తదితరులకు స్వల్పంగా గాయాలయ్యాయి. రైల్వే పోలీసు చంద్రశేఖర్‌కు తలకు కూడా గాయమైంది. సొమ్ము ఒకడిది...సోకు ఒకడిది: హరీశ్ సిద్దిపేటకు రైల్వే లైన్ కోసం రూ. 310 కోట్ల వ్య యంతో 2,508 ఎకరాల భూమిని సేకరించి రైల్వే శాఖకు ఇచ్చామని, రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద రూ.330 కోట్లను చెల్లించామని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. ఇంత కష్టపడితే కనీసం సీఎం ఫొటోను పెట్టకపోవడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. దుద్దెడ రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత కొండపాక ఐవోసీ బిల్డింగ్‌లో విలేకరులతో ఆయన మాట్లాడారు. బీజేపీ వాళ్లు రైలు వాళ్ల వల్లే వచ్చిందని చెప్పుకోవడం సిగ్గు చేటని విమర్శించారు. -
హెచ్‌సీయూలో కొలువుదీరిన కొత్త భవనాలు
రాయదుర్గం, శంషాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో నూతనంగా నిర్మాణం చేసిన అయిదు భవనాలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ జాతికి అంకితం చేశారు. రూ.81.27 కోట్ల వ్యయంతో నిర్మించిన స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, స్కూల్ ఆఫ్ మేథమెటిక్స్ అండ్ స్టాటస్టిక్స్, స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్, సరోజినీ నాయు డు స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కమ్యూనికేషన్(అనుబంధం)కు భవనాలతో పాటు లెక్చర్ హాల్ కాంప్లెక్స్–3 భవనాన్ని ఆదివారం మహబూబ్‌నగర్ నుంచి వర్చువల్‌గా పీఎం ప్రారంభించారు. కేంద్ర విద్యాశాఖ, యూజీసీ మంజూరు చేసిన నిధులతో వీటి నిర్మాణం పూర్తి చేశారు. ఈ భవనాల నిర్మాణంతో ఆయా విభాగాల విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు అందుబాటులోకి రావడమే కాకుండా సమావేశాల నిర్వహణ, తరగతుల నిర్వహణకు అవసరమైన లెక్చర్ హాల్–3 కూడా అందుబాటులోకి వచ్చింది. -
మోదీ మార్క్ శంఖారావం!
(మహబూబ్‌నగర్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి) : రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో పాలమూరులో ప్రధాని నరేంద్ర మోదీ తనదైన శైలిలో బీజేపీ ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించారు. అటు అధికారిక కార్యక్రమాలతో అభివృద్ధి మంత్రం పఠిస్తూనే.. ఇటు బహిరంగ సభ వేదికగా బీఆర్ఎస్పై విమర్శలతో రాజకీయ ప్రసంగం చేసి.. ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. చాలాకాలం నుంచి ఉన్న డిమాండ్లను తీరుస్తూ పసుపుబోర్డు, గిరిజన వర్సిటీలను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించడం ద్వారా.. తెలంగాణకు బీజేపీ మేలు చేస్తోంది అన్నట్టుగా సంకేతాలు పంపారు. తెలంగాణప్రజలు మార్పు కోరుకుంటున్నారంటూనే.. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఆశీర్వదించాలని, తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలు తీరుస్తామని చెప్పారు. మహిళా బిల్లును ఆమోదించడం, హైవేల నిర్మాణంతో ప్రయోజనాలు, కేంద్ర ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పడం ద్వారా ఆయా వర్గాలకు మేలు చేస్తున్నట్టుగా వివరించే ప్రయత్నం చేశారు. సభ సాంతం.. మోదీ నామస్మరణతో.. అధికారిక కార్యక్రమం, ఊరేగింపు, సభా వేదికపై ప్రసంగం సమయంలో సభా ప్రాంగణమంతా మో దీ.. మోదీ.. అంటూ నినాదాలతో హోరెత్తిపోయింది. అభిమానులు, పార్టీ కార్యకర్తలు అరుపులు, కేకలతోపాటు చప్పట్లు కొడుతూ కనిపించారు. ఇది చూసిన మోదీ.. ‘మీ ప్రేమాభిమానాలు, ఆదరణకు నేను ధన్యుడిని అయ్యాను. ఇంత ప్రేమను చూసి ముగ్దుడిని అయ్యాను. మీరు, మేము కలసి తెలంగాణను అభివృద్ధిపథంలోకి తీసుకెళదాం. ఈ సభ విజయవంతం కావడం, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని మద్దతు తెలపడాన్ని వరుణదేవుడు కూడా హర్షాన్ని వెలిబుచ్చి వర్షాన్ని కురిపించాడు. (ప్రసంగం సాగుతున్నపుడు వర్షం పడుతుండటాన్ని ప్రస్తావిస్తూ..). తెలంగాణ ప్రజలను కలసిన నా జీవితం ధన్యమైంది..’’అని పేర్కొన్నారు. సభలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రసంగిస్తూ.. గిరిజన వర్సిటీ, పసుపు బోర్డు ప్రకటన నేపథ్యంలో అంతా లేచి మోదీకి గౌరవసూచకంగా చప్పట్లు కొట్టాలని కోరారు. దీనితో వేదికపై ఆసీనులైన నేతలు, సభికులు లేచి ‘మోదీ నాయకత్వం వరి్ధల్లాలి’అంటూ నినాదాలు చేశారు. దీనికి ప్రతిగా మోదీ రెండు చేతులు జోడించి, వంగి సభికులకు సమస్కారం చేశారు. సభలో ప్రసంగిస్తున్న సమయంలో ఓ చిన్నారి జోష్ చూసి మోదీ సంతోషం వ్యక్తం చేశారు. చి న్నారికి తన ఆశీస్సులు అందిస్తున్నట్టు చెప్పారు. పది నిమిషాల్లో మనసు విప్పుతా..! తొలుత అధికారిక కార్యక్రమ వేదికపై సుమారు 12 నిమిషాలు ప్రసంగించిన మోదీ అభివృద్ధి అంశాలనే ప్రస్తావించారు. చివరిలో మాత్రం.. ‘‘ఇప్పుడు అధికారిక కార్యక్రమంలో ఉన్నాను. కొన్ని అంశాలపై నన్ను నేను నియంత్రించుకున్నాను. ఓ పది నిమిషాల్లో మైదానంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటున్నా.. అక్కడ మనసు విప్పి మాట్లాడుతా.. నేను మీకు మాటిస్తున్నా.. నేను ఏం మాట్లాడినా తెలంగాణ ప్రజల గుండెచప్పుడుగా మాట్లాడుతా..’’అని పేర్కొనడం గమనార్హం. ఓపెన్ టాప్ జీప్‌లో ఊరేగిస్తూ.. పూలు చల్లుతూ.. తొలుత ఒక వేదికపై అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసి మాట్లాడిన ప్రధాని మోదీ.. తర్వాత కాస్త దూరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదిక వద్దకు ఓపెన్ టాప్ జీపులో వెళ్లారు. బంజారా మహిళల నృత్యాలతో, పూలు చల్లుతూ బీజేపీ కార్యకర్తలు, ప్రజలు మోదీకి ఆవ్వనం పలికారు. ఈ సమయంలో ఓ యువతి మోదీ చిత్రపటాన్ని ఆయనకు అందజేయగా.. మోదీ దానిని తీసుకుని, తన ఆటోగ్రాఫ్ చేసి తిరిగి ఆ యువతికి అందించారు. సభా వేదికపైకి చేరుకునే వరకు మోదీ రెండు చేతులతో విజయ సంకేతాలు (వీ చిహ్నాలు) చూపుతూ, అభివాదం చేస్తూ సాగారు. ఓపెన్ టాప్ జీప్‌లో ఊరేగిస్తూ.. పూలు చల్లుతూ.. తొలుత ఒక వేదికపై అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసి మాట్లాడిన ప్రధాని మోదీ.. తర్వాత కాస్త దూరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదిక వద్దకు ఓపెన్ టాప్ జీపులో వెళ్లారు. బంజారా మహిళల నృత్యాలతో, పూలు చల్లుతూ బీజేపీ కార్యకర్తలు, ప్రజలు మోదీకి ఆవ్వనం పలికారు. ఈ సమయంలో ఓ యువతి మోదీ చిత్రపటాన్ని ఆయనకు అందజేయగా.. మోదీ దానిని తీసుకుని, తన ఆటోగ్రాఫ్ చేసి తిరిగి ఆ యువతికి అందించారు. సభా వేదికపైకి చేరుకునే వరకు మోదీ రెండు చేతులతో విజయ సంకేతాలు (వీ చిహ్నాలు) చూపుతూ, అభివాదం చేస్తూ సాగారు. -
హోండా యాక్టీవా లిమిటెడ్ ఎడిషన్.. రూ.80 వేలకే!
ఏదైనా స్కూటర్ తక్కువ ధరలో కొనాలనుకుంటున్నవారికి శుభవార్త ఇది. దేశంలో స్కూటర్లలో ప్రముఖంగా పేరొందిన హోండా యాక్టీవా (Honda Activa) లిమిటెడ్ ఎడిషన్ తాజాగా మార్కెట్లో లాంచ్ అయింది. హోండా యాక్టీవా లిమిటెడ్ ఎడిషన్ (Honda Activa Limited Edition) ఎక్స్ షోరూమ్ ధర రూ.80,734 మాత్రమే. ఇది డీఎల్ఎక్స్ ట్రిమ్ మోడల్ ధర. ఇక స్మార్ట్ ట్రిమ్ మోడల్ ఎక్స్ షోరూమ్ ధర రూ.82,734. లిమిటెడ్ ఎడిషన్ కాబట్టి తక్కువ యూనిట్స్ అందుబాటులో ఉంటాయి. కావాలనుకున్నవారు దేశవ్యాప్తంగా ఉన్న హోండా రెడ్ వింగ్ డీలర్‌షిప్‌ల వద్ద వీటిని బుక్ చేసుకోవచ్చు. ఈ పరిమిత ఎడిషన్ స్కూటర్లో రెండు కలర్ ఆప్షన్లు ఉన్నాయి. మ్యాట్ స్టీల్ బ్లాక్ మెటాలిక్, పెరల్ సైరన్ బ్లూ రంగుల్లో ఇది లభ్యమవుతుంది. ఇందులో డార్క్ కలర్ థీమ్, బ్లాక్ క్రోమ్ ఎలిమెంట్లు ఉంటాయి. DLX వేరియంట్లో అల్లాయ్ వీల్స్ ఉండగా, స్మార్ట్ వేరియంట్లో హోండా స్మార్ట్ కీ ఫీచర్ ఉంటుంది. -
పట్టాలెక్కిన యశ్వంతపూర్ వందేభారత్
సాక్షి, హైదరాబాద్/కాచిగూడ: తెలంగాణకు మూడో వందేభారత్ రైలుగా కేటాయించిన కాచిగూడ–యశ్వంతపూర్ వందేభారత్ రైలు పట్టాలెక్కింది. ఆదివారం దేశవ్యాప్తంగా ఒకేసారి 9 వందేభారత్ రైళ్లను ప్రారంభించే కార్యక్రమంలో భాగంగా, ప్రధానమంత్రి నరేంద్రమోదీ వీడియోకాన్ఫరెన్సు ద్వారా జెండా ఊపి దాన్ని ప్రారంభించారు. మధ్యాహ్నం 12.30 గంటలకు కాచిగూడ స్టేషన్ నుంచి బెంగళూరులోని యశ్వంతపూర్ స్టేషన్‌కు బయలుదేరింది. కాచిగూడ స్టేషన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్ జైన్, హైదరాబాద్ డీఆర్ఎం లోకేష్ విష్ణోయ్, ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేంద్రం రూ.9 లక్షల కోట్లు ఇచ్చింది.. ప్రధానిగా మోదీ బాధ్యతలు తీసుకున్నాక తొమ్మిదేళ్లలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో రూ.9 లక్షల కోట్లు ఖర్చుచేసిందని కిషన్‌రెడ్డి అన్నారు. వందేభారత్ రైలు ప్రారంబోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి రైల్వే ప్రాజెక్టుల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతూ వచ్చిందని, మోదీ దీన్ని గుర్తించి తెలంగాణకు న్యాయం చేస్తున్నారన్నారు. సంవత్సరానికి 55 కి.మీ. చొప్పున కొత్త లైన్లు ఏర్పాటు చేస్తుండగా, ప్రస్తుతం రూ.31,221 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు రాష్ట్రంలో జరుగుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలోని రైల్వే స్టేషన్లను రూ.2,300 కోట్ల వ్యయంతో ఆధునీకరిస్తున్నామని, త్వరలో మరిన్ని ప్రాజెక్టు పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. కాజిపేటలో వ్యాగన్ తయారీ కర్మాగారం అందుబాటులోకి వస్తోందని, అక్కడ భవిష్యత్తులో రైల్వేకు అవసరమైన ఇతర పరికరాలు కూడా తయారవుతాయని వివరించారు. మంగళవారం ఉదయం నుంచి.. సాధారణ ప్రయాణికులు లేకుండా తొలిరోజు బెంగుళూరు వెళ్లిన రైలు, సోమవారం మధ్యాహ్నం 2.45 గంటలకు అక్కడి నుంచి ప్రయాణికులతో హైదరాబాద్‌కు బయల్దేరనుంది. మంగళవారం ఉదయం 5.30 గంటలకు కాచిగూడ నుంచి ప్రయాణికులతో బెంగళూరు బయల్దేరనుంది. -
ప్రజల కోసం బ్రహ్మాండమైన ప్యాకేజీ
సాక్షి, హైదరాబాద్/దుండిగల్: ఎంతో కాలం అధికారంలో ఉన్నా ఏమీ చేయని వాళ్లు.. చేసింది చెప్పుకోవ డానికి ఏమీ లేనివాళ్లు ఇప్పుడు తమ కు అవకాశమిస్తే ఎన్నో చేస్తామని కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారని, వారి మాటలు నమ్మొద్దని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు ప్రజలను హెచ్చరించా రు. సంక్రాంతి ముందు గంగిరెద్దుల వాళ్లు వచ్చినట్లు ఎన్నికల ముందు వచ్చేవాళ్ల మాటలతో మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ, బెంగళూరుల నుంచి వచ్చేవారు ఎన్నో ప్యాకేజీలు ప్రకటిస్తున్నారని, వాళ్లు చెప్పిన దానికంటే ఎక్కువ సంక్షేమ కార్యక్ర మాలు, బ్రహ్మాండమైన ప్యాకేజీ ఇచ్చే ఆలోచన బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఉందని, ఆ విషయాల్ని ఆయనే త్వరలో ప్రకటిస్తారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీ స్కీముల్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దుండిగల్‌లో నిర్మించిన 1,800 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాలను కేటీఆర్ గురువారం లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘డబుల్’ లబ్ధిదారుల్లో బీజేపీ, కాంగ్రెస్ నేతలు పేదలు, రైతులపై కేసీఆర్కున్న ప్రేమ దేశంలో మరెవ్వరికీ లేదని కేటీఆర్ చెప్పారు. ప్రగతి రథ చక్రాన్ని ఆపేందుకు ఇష్టమొచ్చినట్లుగా హామీలిస్తు న్న వారి మాటలు నమ్మి మోసపోవద్దని, పనిచేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన వారిని ఎలాంటి పక్షపాతం లేకుండా ఆన్లైన్ లాటరీ ద్వారా ఎంపిక చేశామని తెలిపారు. జగద్గిరిగుట్ట డివిజన్లోని కాంగ్రెస్ మహిళా అధ్యక్షు రాలు కౌసల్యకు, బీజేపీ నాయకురాలు సునీతకు కూడా ఇళ్లు వచ్చాయని చెప్పారు. తొలిదశలో అర్హులకు లక్ష ఇళ్లు ఇస్తుండగా, అర్హులైన మిగతా మూడున్నర లక్షల మందికి కూడా ఇచ్చే బాధ్యత తమదేనని అన్నారు. ఈ రోజుతో 30 వేల ఇళ్ల పంపిణీ పూర్తవుతుండగా, త్వరలోనే మిగతా 70 వేల ఇళ్లు కూడా అందజేస్తామన్నారు. లక్ష ఇళ్ల నిర్మాణా నికి ప్రభుత్వానికైన ఖర్చు దాదాపు రూ.10 వేల కోట్లయితే, మార్కెట్ రేటు ప్రకారం దాదాపు రూ. 50 వేల కోట్ల నుంచి రూ.60 వేల కోట్ల విలువైన ఆస్తిని పేదల చేతుల్లో పెడుతున్న ప్రభుత్వం తమదని కేటీఆర్ పేర్కొన్నారు. దుండిగల్‌కు త్వరలోనే కొత్త పరిశ్రమ రానుందని తెలిపారు. ఇలాంటి ఇళ్లు ఇంకెక్కడైనా ఉన్నాయా ? మన రాష్ట్రం కాక దేశంలో ఉన్న మరో 27 రాష్ట్రాల్లో, కాంగ్రెస్, బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఎక్కడైనా ఇలాంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఉన్నాయేమో చూపిస్తారా? అంటూ బీజేపీ, కాంగ్రెస్ నేతలకు కేటీఆర్ సవాల్ విసిరారు. పేదలకు ఇలాంటి ఇళ్లు ఇస్తున్న రాష్ట్రం దేశంలోనే ఎక్కడా లేవని చెప్పారు. ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు.. అని పెద్దలు అంటారని, నిరుపేద ప్రజలకు ఇళ్లు కట్టించి, పెళ్లి చేయించి ముఖ్యమంత్రి కేసీఆర్ వారికి మేనమామగా నిలిచారని పేర్కొన్నారు. చాయ్ అమ్ముకో.. దేశాన్ని మోసం చేయొద్దు ఇంటి పట్టా అందుకున్న ఒక మహిళను కేటీఆర్ ఏం చేస్తావంటూ ప్రశ్నించారు. ఆమె తాను చా య్ అమ్ముతానని చెప్పడంతో ‘చాయ్ అమ్ము కోవాలి.. కానీ దేశాన్ని మోసం చేయొద్దు’ అని అన్నారు. ఏమీ అర్థం కాక ఆమె తెల్లముఖం వేయడంతో.. ‘నీ గురించి కాదులే.. వేరేవా ళ్లు ఉన్నారు.. వారి గురించి చెబుతున్నా’ అంటూ పరోక్షంగా ప్రధాని మోదీని ప్రస్తావించారు. -
వాస్తవ ఘటనలతో...
నికిత శ్రీ, పృథ్వీరాజ్ (పెళ్లి), థర్టీ ఇయర్స్ పృథ్వీ, నాగమహేష్, జయవాణి కీలక పాత్రల్లో టీవీ రవి నారాయణన్ దర్శకత్వంలో ‘భ్రమర’ సినిమా షురూ అయింది. జి. మురళీ కృష్ణ నిర్మిస్తున్నారు. తొలి సీన్‌కి తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ చైర్మన్ అనిల్ కూర్మాచలం కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత బెక్కం వేణు గోపాల్ క్లాప్ ఇచ్చారు. నిర్మాత టి. రామసత్యనారాయణ గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘వాస్తవ ఘటనల ఆధారంగా థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం ‘భ్రమర’’ అన్నారు టీవీ రవి నారాయణన్. ఈ చిత్రానికి సహనిర్మాత: కల్యాణ్ చక్రవర్తి. -
లగ్జరీ కార్ ఫీచర్లతో టాటా నెక్సాన్ ఈవీ కొత్త వెర్షన్
న్యూఢిల్లీ: టాటా మోటార్స్ తాజాగా తమ నెక్సాన్ వాహనానికి సంబంధించి కొత్త వెర్షన్స్ ఆవిష్కరించింది. నెక్సాన్ ఈవీలో కొత్త వెర్షన్ ధర రూ. 14.74–19.94 లక్షలు (ఎక్స్ షోరూమ్)గా ఉంటుంది. ఇది ఒకసారి చార్జి చేస్తే గరిష్టంగా 465 కిలోమీటర్ల రేంజి ఇస్తుంది. అలాగే, నెక్సాన్‌లో పెట్రోల్, డీజిల్‌కు సంబంధించి కొత్త వెర్షన్లను టాటా మోటర్స్ ప్రవేశపెట్టింది. (ఎస్బీఐ మాజీ చైర్మన్ రజనీష్ సంపాదన ఎంతో తెలిస్తే!) వీటి రేటు రూ. 8.09 లక్షల (ఎక్స్–షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాల కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రత్యేక నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు సంస్థ ఎండీ (ప్యాసింజర్ వెహికల్స్ విభాగం) శైలేష్ చంద్ర తెలిపారు. ప్రస్తుతం టాటా మోటర్స్ ఎలక్ట్రిక్ వాహనాల పోర్ట్‌ఫోలియోలో నెక్సాన్, టియాగో, టిగోర్, ఎక్స్‌ప్రెస్–టీ ఈవీ ఉన్నాయి. -
మాది స్లోగన్ సర్కార్ కాదు.. సొల్యూషన్ సర్కార్
లక్డీకాపూల్: మాది స్లోగన్ సర్కార్ కాదు.. సొల్యూషన్ సర్కార్ అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బీజేపీలు కేవలం నినాదాల పార్లు .. బీఆర్ఎస్ మాత్రమే నినాదాలను నిజం చేసే పార్టీ అని పేర్కొన్నారు. గురువారం –నిమ్స్‌లో ఏర్పాటు చేసిన ఆయుష్ ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్‌ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. నకిలీ హామీలు, వెకిలి చేష్టలతో ఆ రెండు పార్లు ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నాయని విమర్శించారు. అమిత్ షా, ఖర్గేలు పర్యాటకుల్లా వచ్చి.. అవగాహన లేమితో ఇక్కడి నేతలు రాసిచ్చిన స్క్రిప్ట్ చదివి వెళ్లిపోయారన్నారు. గుజరాత్లో బీజేపీ గుడ్డి పాలనను దారిలో పెట్టడం చేతగాని అమిత్ షా ఇక్కడికి వచ్చి అర్థం పర్థం లేని ఆరోపణలు చేసి వెళితే ఎవరు నమ్ముతారని ఎద్దేవా చేశారు. కర్ణాటకలో మూడు నెలలకే కాంగ్రెస్ తీరేమిటో తేలిపోయిందని, ముందుగా ఖర్గే తన సొంత రాష్ట్రాన్ని చక్కదిద్ది ఇక్కడ కొచ్చి మాట్లాడాలని సూచించారు. వివిధ పార్టీల డిక్లరేషన్లు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని..బీఆర్ఎస్కు మూడోసారి అధికారం ఇవ్వాలని ఎపుడో సెల్ఫ్ డిక్లరేషన్ చేసుకున్నారని మంత్రి పేర్కొన్నారు. నిమ్స్‌లో ఆయుష్ ఏర్పాటు రాష్ట్రంలోనే తొలిసారి నిమ్స్‌లో ఆయుష్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్‌ను ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందంటూ.. ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపిన సీఎస్ శాంతి కుమారికి హరీశ్‌రావు అభినందనలు తెలిపారు. ఈ తరహా వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేసుకోవడం రాష్ట్రంలోనే తొలిసారన్నారు. ఆయుర్వేదం, యునాని, హోమియోపతి, సిద్ధ, ప్రకృతి వైద్యం.. అన్ని వైద్య విధానాలు ఇక్కడ ఒకే వేదికగా అందుబాటులో ఉంటాయని చెప్పారు. వికారాబాద్, భూపాలపల్లి, సిద్ధిపేటల్లో 50 పడకల కొత్త ఆయుష్ ఆసుపత్రుల నిర్మాణాలు జరుగుతున్నాయని చెప్పారు. వచ్చే నెల రెండో వారంలో మరో 9 మెడికల్ కాలేజీల్లో తరగతులు ప్రారంభం కానున్నాయని మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. దీంతో కొత్తగా 900 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వస్తాయని వివరించారు. త్వరలో మరో 8 మెడికల్ కాలేజీలు ప్రారంభించి.. ప్రతి జిల్లాకూ ఒక మెడికల్ కాలేజీ ఉన్న రాష్ట్రంగా తెలంగాణ రికార్డ్ సృష్టించబోతుందని హరీశ్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎంపీ నామా నాగేశ్వరరావు, నిమ్స్ సంచాలకులు నగరి బీరప్ప, ఆయుష్ సెంటర్ కోఆర్డినేటర్ డాక్టర్ నాగలక్ష్మి పాల్గొన్నారు. -
థాయ్‌లాండ్‌లో డబుల్
‘ఇస్మార్ట్ శంకర్’ (2019) వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత హీరో రామ్ పొతినేని, డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. పూరి కనెక్ట్స్‌పై పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్ నిర్మిస్తున్న ఈ సినిమా రెండో షెడ్యూల్ థాయిలాండ్లోప్రారంభమైంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను విడుదల చేశారు మేకర్స్. ‘‘హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. రెండో షెడ్యూల్ థాయిలాండ్లోప్రారంభించాం. ఈ షెడ్యూల్లో రామ్, నటుడు సంజయ్ దత్‌పై కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాం. ‘ఇస్మార్ట్ శంకర్’ కి సీక్వెల్‌గా రూపొందుతున్న ‘డబుల్ ఇస్మార్ట్’ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో 2024 మార్చి 8న మహా శివరాత్రికి విడుదలవుతుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సీఈఓ: విషు రెడ్డి, కెమెరా: జియాని గియాన్నెల్లి. -
Chandrayaan 3: విజయవంతంగా భూ కక్ష్యలోకి చంద్రయాన్-3 (ఫొటోలు)
-
మారుతి మరో సూపర్ కారు వచ్చేసింది..ధర, ఫీచర్ల వివరాలు
దేశీయ కార్ల దిగ్గజం మారుతి సుజుకి చెందిన మోస్ట్ ప్రీమియం కారు వచ్చేసింది. అదిరిపోయే ఫీచర్స్‌తో మల్టీ-పర్పస్ వెహికల్ ఇన్విక్టోను లాంచ్ చేసింది. ధరలు రూ. 24.79 లక్షల నుండి ప్రారంభం. మారుతి ఇన్విక్టో 2.0-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను హైబ్రిడ్ మోటార్‌తో జత చేసింది. ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్‌లను పొందిన తొలి మారుతీ కారు ఇన్విక్టో అని మారుతి సుజుకి ఇండియా తెలిపింది. భారతదేశంలో అత్యంత ఖరీదైన కారుగా భావిస్తున్న ఇన్విక్టో ప్రాథమికంగా గత సంవత్సరం విడుదల చేసిన టయోటా ఇన్నోవా హైక్రాస్ ఎమ్‌పివికి రీబ్యాడ్జ్ చేసిన వెర్షన్. 2016లో ప్రారంభమై 2019లో లాంఛన ప్రాయమైన మారుతి , టయోటా కిర్లోస్కర్ భాగస్వామ్యం తర్వాత ఇది సెకండ్ ప్రొడక్షన్. Zeta+ (7 సీటర్), Zeta+ (8 సీటర్) , Aplha+ (7 సీటర్)అనే మూడు వేరియంట్లలో వీటి ధర రూ. 24.79 లక్షల మొదలై టాప్ వేరియంట్ రూ. 28.42 లక్షల వరకు ఉంటుంది. మిడ్ వేరియంట్ ధర రూ. 24.84 లక్షలు. ఇది నెక్సా బ్లూ , మిస్టిక్ వైట్‌తో సహా నాలుగు రంగులలో అందుబాటులో ఉంటుంది. ఇది నెక్సా లైనప్‌లో ఎనిమిదోది . 2.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ హైబ్రిడ్ మోటార్ 172బిహెచ్పి పవర్, 188ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయవచ్చని అంచనా. ఇన్నోవా హైక్రాస్ ప్రీమియం ఫీచర్లతో లాంచ్ అయింది. హైక్రాస్‌తో పోలిస్తే, జేబీఎల్ సౌండ్ సిస్టమ్, సెకండ్ రో ఒట్టోమన్ సీట్లు తప్ప దాదాపు మిగిలిన ఫీచర్లున్నాయి. డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, పవర్-అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు కోసం మెమరీ సెట్టింగ్స్, 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. అలాగే పనోరమిక్ సన్‌రూఫ్, 7-అంగుళాల TFT MIDతో కూడిన సెమీ-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు , ఆరుఎయిర్ బాగ్స్, లెదర్ అప్హోల్స్టరీతో కూడా వస్తుంది. -
మెర్సిడెస్ టాప్ ఎండ్ రైడ్.. రూ.2.35 కోట్ల కారు విడుదల
ముంబై: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న జర్మనీ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ రూ.1 కోటి కంటే అధిక ధర కలిగిన టాప్ ఎండ్ మోడళ్లను భారత్‌కు తీసుకురానుంది. మెట్రోయేతర నగరాల నుండి కూడా డిమాండ్ వేగంగా పెరుగుతుండడం ఇందుకు కారణమని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ సంతోష్ అయ్యర్ తెలిపారు. టాప్ ఎండ్ వెహికల్స్ (టీఈవీ) వాటా సంస్థ మొత్తం విక్రయాల్లో 25 శాతం ఉందన్నారు. ఏఎంజీ ఎస్ఎల్55 4మేటిక్ ప్లస్ రోడ్‌స్టర్ విడుదల సందర్భంగా మీడియాతో మాట్లాడారు. దీని ధర ఎక్స్‌షోరూంలో రూ.2.35 కోట్లు. -
మోటరోలా ఎన్విజన్ఎక్స్ 4కే టీవీ
బెంగళూరు: ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల సంస్థ మోటరోలా ‘ఎన్విజన్ ఎక్స్’ పేరుతో 4కే క్యూఎల్ఈడీ గూగుల్ టీవీని విడుదల చేసింది. ఫ్లిప్‌కార్ట్ ప్లాట్‌ఫామ్‌పై దీన్ని ఆవిష్కరించింది. ఫ్యూచరిస్టిక్ డిజైన్, మెరుగైన ఆడియో, వీడియో, గేమింగ్ సామర్థ్యాలతో అందుబాటు ధరలకే దీన్ని తీసుకొచ్చినట్టు మోటరోలా తెలిపింది. ఎన్విజన్ ఎక్స్ కింద 55 అంగుళాలు, 65 అంగుళాల స్క్రీన్ సైజులతో రెండు మోడళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. 55 అంగుళాల ధర రూ. 30,999 కాగా, 65 అంగుళాల ధర రూ. 39,999. ఆరంభ ఆఫర్ కింద 55 అంగుళాల టీవీపై రూ.5,000, 65 అంగుళాల టీవీపై రూ. 10,000 వరకు తగ్గింపు ఇస్తున్నట్టు మోటరోలా ప్రకటించింది. క్యూఎల్ఈడీ డిస్ప్లే క్వాంటమ్ గ్లో టెక్నాలజీతో ఉంటుందని, రంగులను అద్భుతంగా చూపిస్తుందని, దృశ్యాలు సహజంగా అనిపిస్తాయని తెలిపింది. 3డీ సరౌండ్ సౌండ్, డాల్బీ అట్మాస్ టెక్నాలజీతో వస్తుందని పేర్కొంది. -
స్వచ్ఛ సంకల్పం.. ఈ-ఆటోలను ప్రారంభించిన సీఎం జగన్ (ఫొటోలు)
-
మారుతీ జిమ్నీ వచ్చేసింది.. చవకైన 4X4 కారు ఇదే..
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మారుతి సుజుకీ జిమ్నీ ఎట్టకేలకు వచ్చేసింది. భారత్‌లో రూ. 12.7 లక్షల (ఎక్స్ షోరూమ్) ప్రారంభ ధరతో అడుగుపెట్టింది. ఈ ఎస్యూవీ జీటా, ఆల్ఫా అనే రెండు వేరియంట్లలో లభ్యమవుతుంది. డ్యూయల్ టోన్ కలర్ స్కీమ్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో కూడిన ఆల్ఫా వేరియంట్లో టాప్ ధర రూ. 15.05 లక్షలు (ఎక్స్ షోరూమ్). మారుతి సుజుకి జిమ్నీ 5-డోర్ ఎస్‌యూవీని భారత్‌లో నెక్సా షోరూమ్‌ల ద్వారా కస్టమర్లు రూ. 11,000 చెల్లించి బుకింగ్ చేసుకున్నారు. కొత్త జిమ్నీ 103 హార్స్పవర్, 134 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేసే 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. కస్టమర్లు తమకు కావాల్సిన విధంగా 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, 4-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ మధ్య ఎంచుకునే అవకాశాన్ని కంపెనీ కల్పించింది. మారుతి సుజుకి జిమ్నీ 5-డోర్ ఎస్‌యూవీకి పోటీగా మహీంద్రా 5-డోర్ థార్‌ను రంగంలోకి దించుతోన్న విషయం తెలిసిందే. కొన్ని నెలల క్రితం గ్రేటర్ నోయిడాలో జరిగిన ఆటో ఎక్స్పో 2023లో దీన్ని పరిచయం చేసింది.మారుతి సుజుకి కొత్త జిమ్నీ ఇప్పటికే 30,000 కంటే ఎక్కువ బుకింగ్‌లు సాధించింది. ఇప్పటి వరకు జిమ్నీ 3-డోర్ వెర్షన్‌ను ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో విక్రయించారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3.2 మిలియన్ యూనిట్ల జిమ్నీని విక్రయించినట్లు కంపెనీ పేర్కొంది. కొత్త 5-డోర్ వెర్షన్‌తో మారుతి సుజుకి భారతీయ ఎస్యూవీ మార్కెట్లో అగ్రస్థానాన్ని అందుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. చవకైన 4X4 కారు మారుతి సుజుకి జిమ్నీ భారత్‌లో చవకైన 4X4 కారుగా అవతరించింది. లుక్స్ పరంగా మారుతి సుజుకి జిమ్నీ 5-డోర్.. 3-డోర్ జిమ్నీని పోలి ఉంటుంది. రౌండ్ హెడ్‌ల్యాంప్‌లు, బ్లాక్ అవుట్ గ్రిల్స్ దానిలాగే ఉంటాయి. కారు వెనుక భాగం కూడా అలాగే ఉంటుంది. పొడవైన వీల్‌బేస్ కారణంగా రెండు వైపులా గుర్తించదగిన మార్పు కన్పిస్తుంది. క్యాబిన్ విషయానికి వస్తే ఇందులో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, క్లైమేట్ కంట్రోల్, USB-C పోర్ట్‌లు, వైర్లెస్ ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, సన్‌రూఫ్ తదితర ఫీచర్లు ఉన్నాయి. భద్రత పరంగా మారుతి సుజుకి జిమ్నీ 5-డోర్లో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఈఎస్పీ, హిల్-హోల్డ్ అసిస్ట్, వెనుక ప్రయాణికులకు మూడు పాయింట్ సీట్‌బెల్ట్‌లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఆల్ వీల్ డిస్క్ బ్రేక్‌లు, హిల్ డిసెంట్ కంట్రోల్ వంటివి ఉన్నాయి. ఇదీ చదవండి: హోండా ఎలివేట్ వచ్చేసింది.. 2030కల్లా 5 ఎస్‌యూవీలు -
కొత్త వ్యాపారం ప్రారంభించిన బజాజ్
ముంబై: మ్యూచువల్ ఫండ్స్ వ్యాపారంలోకి బజాజ్ ఫిన్సర్వ్ అడుగు పెట్టింది. వచ్చే కొన్నేళ్లలో పెద్ద సంస్థగా అవతరించాలనే లక్ష్యంతో ఉన్నట్టు ప్రకటించింది. ఈ నెలాఖరులోపు లిక్విడ్, మనీ మార్కెట్ తదితర మూడు ఫిక్స్డ్ ఇన్కమ్ (స్థిరాదాయ/డెట్) పథకాలను ప్రారంభించనున్నట్టు తెలిపింది. ఆ తర్వాత కొన్ని రోజులకు నియంత్రణ సంస్థ అనుమతితో మరో 4 కొత్త పథకాలను తీసుకురానున్నట్టు గ్రూప్ చైర్మన్, ఎండీ సంజీవ్ బజాజ్ ప్రకటించారు. ఇప్పటికే మ్యూచువల్ ఫండ్ పరిశ్రమలో 42 సంస్థలు ఉన్నాయి. తమ గ్రూపు పరిధిలో ఎనిమిది సబ్సిడరీలు ఉన్నాయని, 7 కోట్ల మంది కస్టమర్లకు ఆర్థిక ఉత్పత్తులను అందిస్తున్నట్టు సంజీవ్ చెప్పారు. -
హోండా ఎలివేట్ వచ్చేసింది.. 2030కల్లా 5 ఎస్‌యూవీలు
న్యూఢిల్లీ: వాహన తయారీలో ఉన్న జపాన్ సంస్థ హోండా.. భారత మార్కెట్లో 2030 నాటికి అయిదు కొత్త ఎస్‌యూవీలను పరిచయం చేయనుంది. వీటిలో ఎలివేట్ ఎలక్ట్రిక్ మోడల్ సైతం ఉందని హోండా కార్స్ ఇండియా ప్రెసిడెంట్, సీఈవో టకుయా సుమురా తెలిపారు. మధ్యస్థాయి ఎస్యూవీ ఎలివేట్‌ను విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘ఎలివేట్ సాయంతో కంపెనీ తన స్థానాన్ని మరింత బలపర్చుకోవాలని భావిస్తోంది. ప్రస్తుతం సిటీ, అమేజ్ సెడాన్లను భారత్‌లో విక్రయిస్తున్నాం. మొత్తం ప్యాసింజర్ వాహన విభాగంలో సెడాన్ల వాటా 10 శాతమే. ఈ విభాగంలోనే కంపెనీ పోటీపడుతోంది. అలాగే ఈ మోడళ్లు మెరుగైన ప్రతిభ కనబరుస్తున్నాయి. ఎలివేట్‌ను తొలిసారిగా భారత్‌లో ప్రవేశపెట్టాం. రానున్న రోజుల్లో ఈ మోడల్ ప్రధాన ఉత్పాదనగా ఉంటుంది. కొత్తగా వచ్చే మోడళ్లు ప్రీమియం సెగ్మెంట్లో పోటీ పడతాయి. ఎలివేట్ ఎగుమతి కేంద్రంగా భారత్‌ను తీర్చిదిద్దుతాం. ఇక 2022–23లో 1.2 లక్షల యూనిట్లను ఉత్పత్తి చేశాం. 2024–25లో దీనిని 1.7 లక్షల యూనిట్లకు చేరుస్తాం’ అని వివరించారు. 2040 నాటికి బ్యాటరీ ఎలక్ట్రిక్, ఫ్యూయల్ సెల్ వాహనాలను మాత్రమే విక్రయిస్తామని హోండా మోటార్ కో ఆసియా హెడ్ తోషియో కువహర తెలిపారు. -
ఇదేదో బాగుందే.. వట్టి చేతులు చాలు! పేమెంట్ ఈజీ
చైనీస్ ఇంటర్నెట్, టెక్ దిగ్గజం టెన్సెంట్ తన వుయ్‌చాట్ పే సేవ కోసం పామ్ రికగ్నేషన్ సర్వీస్‌ను ఇటీవల ప్రారంభించింది. ఇది మెట్రో ప్రయాణికులు స్కానర్‌పై అరచేతిని చూపి చెల్లించడానికి వీలు కల్పిస్తుంది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం.. వినియోగదారులు మెట్రో స్టేషన్ టర్న్స్టైల్స్లో స్కానర్‌పై చేతులు పెట్టి రాజధానిలోని డాక్సింగ్ ఎయిర్పోర్ట్ ఎక్స్‌ప్రెస్ లైన్లో రైడ్ల కోసం చెల్లించవచ్చు. ప్రత్యేకమైన పామ్ ప్రింట్ రికగ్నేషన్ యూజర్ వుయ్‌చాట్ అకౌంట్ ద్వారా ఆటోమేటిక్ చెల్లింపును ప్రేరేపిస్తుందని నివేదిక పేర్కొంది. టెన్సెంట్ ప్రకారం.. ఈ పేమెంట్ సర్వీస్ కోసం మెట్రో స్టేషన్‌లోని నిర్దేశిత యంత్రం వద్ద ప్రయాణికులు తమ అరచేతి ముద్రలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ సాంకేతికత ఉపరితల స్థాయి అరచేతి ముద్రలు, చేతి సిరలు రెండింటినీ గుర్తించడంపై ఆధారపడి ఉంటుంది. కంపెనీకి చెందిన యూటూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ ఈ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. టెన్సెంట్ త్వరలో కార్యాలయాలు, క్యాంపస్‌లు, రిటైల్ అవుట్లెట్లు, రెస్టారెంట్లలో పామ్ పేమెంట్లను ప్రారంభించనుంది. అలీబాబా గ్రూప్ హోల్డింగ్ కూడా తన అలిపే సేవ కోసం ఇలాంటి టెక్నాలజీపై పని చేస్తోంది. యూఎస్‌లో అమెజాన్ 2020లో ఆఫ్‌లైన్ స్టోర్లలో అమెజాన్ వన్ అనే తన సొంత హ్యాండ్ స్కాన్ టెక్నాలజీని ప్రారంభించింది. -
టెక్నో కామన్ 20 సిరీస్ ఫోన్ల విడుదల.. కెమెరానే ప్రత్యేకం!
చైనీస్ టెక్ బ్రాండ్ టెక్నో (Tecno) భారతదేశంలో కొత్త స్మార్ట్ఫోన్లను విడుదల చేసింది. టెక్నో కామన్ 20 (Tecno Camon 20) సిరీస్ పేరుతో మూడు సరికొత్త స్మార్ట్ఫోన్లను తీసుకొచ్చింది. లెదర్ ఫినిషింగ్, రిఫ్లెక్టివ్ డ్యూయల్ అపియరెన్స్ బ్యాక్ ప్యానెల్‌ను కలిగిన టెక్నో కామన్ 20, టెక్నో కామన్ 20 ప్రో స్మార్ట్ఫోన్లను కంపెనీ అధికారికంగా లాంచ్ చేసింది. ఈ ఫోన్లు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. అయితే ఈ సిరీస్‌లో రావాల్సిన కామన్ 20 ప్రీమియర్ 5జీ (Camon 20 Premier 5G)ని మాత్రం ఇంకా ఆవిష్కరించలేదు. జూన్ నెలాఖరున ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. కాగా కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం.. టెక్నో కామన్ 20 సిరీస్ ఫోన్లలో కెమెరానే ప్రత్యేకతగా తెలుస్తోంది. ఈ కొత్త కెమెరా-సెంట్రిక్ స్మార్ట్ఫోన్లు అధునాతన పోర్ట్రెయిట్, వీడియో సామర్థ్యాలతో యూజర్లకు వినూత్న ఇమేజింగ్ అందిస్తాయని టెక్నో మొబైల్ ఇండియా సీఈవో తెలిపారు. అందుబాటు ధరలోనే.. టెక్నో కామన్ 20 16జీబీ ర్యామ్, 256 జీబీ రోమ్ వేరియంట్ ధర రూ.14,999. ప్రీడాన్ బ్లాక్, గ్లేసియర్ గ్లో, సెరెనిటీ బ్లూ రంగుల్లో ఈ ఫోన్ లభిస్తుంది. అమ్మకాలు మే 29 నుంచి ప్రారంభమవుతాయి. టెక్నో కామన్ 20 ప్రో 16జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వర్షన్ ధర రూ.19,999. 16జీబీ ర్యామ్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.21,999. ఈ మోడళ్లు డార్క్ వెల్కిన్, సెరెనిటీ బ్లూ కలర్స్‌లో వస్తున్నాయి. జూన్ రెండో వారంలో అందుబాటులోకి రానున్నాయి. డిజైన్, స్పెసిఫికేషన్లు ప్రత్యేకమైన కామన్ పజిల్ డిజైన్ 6.67 అంగుళాల AMOLED డాట్ ఇన్ డిస్ప్లే, ఫుల్ HD+ రిజల్యూషన్, 100 శాతం DCI-P3 వైడ్ కలర్ గామట్‌కు సపోర్ట్ 99.8 శాతం గుర్తింపు ఖచ్చితత్వం, 0.35 సెకన్ల వేగవంతమైన అన్‌లాక్‌తో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ వనిల్లా కామన్ 20 వేరియంట్ మీడియాటెక్ హీలియో G85 చిప్సెట్తో పాటు ఆర్మ్ మాలి-G52 యూనిట్ సపోర్ట్ 8జీబీ ర్యామ్ (మెమొరీ ఫ్యూజన్‌తో 16జీబీ) 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ప్రో మోడల్లో డైమెన్సిటీ 8050 ప్రాసెసర్ 256 జీబీ స్టోరేజ్ తక్కువ కాంతి పరిస్థితులలో సహాయపడే RGBW ప్రో టెక్నాలజీ, పోర్ట్రెయిట్ మాస్టర్, ఇన్-బాడీ స్టెబిలైజేషన్ సెన్సార్ షిఫ్ట్ OIS యాంటీ షేకింగ్ టెక్నాలజీ కామన్ 20లో 64MP+2MP+AI లెన్స్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ప్రో వేరియంట్లో 64MP+2MP+2MP ట్రిపుల్ కెమెరా మాడ్యూల్, 4K వీడియో రికార్డింగ్ 45W వరకు ఫ్లాష్ ఛార్జింగ్‌తో పాటు 5000mAh బ్యాటరీ యూనిట్ ఇదీ చదవండి: లేటెస్ట్ స్మార్ట్ఫోన్లు.. ధర రూ.10 వేల లోపే.. ఫీచర్స్ అదుర్స్! -
మెర్సిడెస్ కొత్త వర్షన్స్ భారత్‌కు వచ్చేశాయ్! ధరలు ఇవే..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న మెర్సిడెస్ బెంజ్ 2023 వర్షన్ ఎంట్రీ లెవెల్ సెడాన్ అయిన ఏ–క్లాస్ లిమోసిన్‌ను రూ.45.80 లక్షల ధరలో ప్రవేశపెట్టింది. ఎనిమిదేళ్ల వారంటీ ఉంది. 10.25 అంగుళాల ఎంబీయూఎక్స్ డిజిటల్ డిస్ప్లే, 17 అంగుళాల 5 స్పోక్ అలాయ్ వీల్స్, కొత్త ఎల్ఈడీ టెయిల్ లైట్స్, 7 ఎయిర్‌బ్యాగ్స్ పొందుపరిచారు. అలాగే ఎంట్రీ లెవెల్ పెర్ఫార్మెన్స్ హ్యాచ్‌బ్యాక్ ఏ 45 ఎస్ ఏఎంజీ 4మేటిక్ ప్లస్‌ను రూ.92.5 లక్షల ధరలో పరిచయం చేసింది. 2.0 లీటర్ 4 సిలిండర్ టర్బోచార్జ్డ్ ఏఎంజీ పెట్రోల్ ఇంజన్‌తో తయారైంది. గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 3.9 సెకన్లలో అందుకుంటుంది. ఇదీ చదవండి: ర్యాపిడో బైక్ కెప్టెన్లకు గుడ్ న్యూస్.. ఇకపై మరింత ఆదాయం -
Oppo F23 5G కొత్త ఫీచర్స్ ఇవే
-
మార్కెట్లోకి మరో ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒక్కసారి చార్జి చేస్తే 140 కిలోమీటర్లు..
న్యూఢిల్లీ: విద్యుత్ వాహనాల తయారీ సంస్థ ఈ–స్ప్రింటో కొత్తగా ఎమెరీ పేరిట ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ప్రవేశపెట్టింది. ఇది ఒక్కసారి చార్జి చేస్తే 140 కిలోమీటర్ల రేంజి (మైలేజీ) ఇస్తుంది. 6 సెకన్ల వ్యవధిలోనే గంటకు 0–40 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదని, గరిష్టంగా గంటకు 65 కి.మీ. వేగంతో ప్రయాణించగలదని సంస్థ తెలిపింది. ఇదీ చదవండి: Uber Green: ఉబర్‌లో సరికొత్త సేవలు.. తొలుత ఆ మూడు నగరాల్లో ప్రారంభం ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లో 20–35 ఏళ్ల వయస్సు గల చోదకులు లక్ష్యంగా దీన్ని రూపొందించామని పేర్కొంది. ఇందులో రిమోట్ కంట్రోల్ లాక్, యాంటీ–థెఫ్ట్ అలారం, మొబైల్ చార్జింగ్ సాకెట్ తదితర ఫీచర్లు ఉంటాయని సంస్థ సహ వ్యవస్థాపకుడు అతుల్ గుప్తా తెలిపారు. దీని ప్రారంభ ధర రూ. 1,29,999 (ఎక్స్ షోరూం)గా ఉంటుంది. ఇదీ చదవండి: భారీగా పడిపోయిన ఎలక్ట్రిక్ టూవీలర్ల అమ్మకాలు.. కారణం ఇదే.. -
జగనన్నకు చెబుదాం వెబ్ సైట్ లాంచ్
-
మార్కెట్లోకి దూసుకొస్తున్న మరో మహీంద్ర బొలెరో మాక్స్ పికప్
-
ఎగిరే కారు వచ్చేసిందండోయ్! రూ. 6.5 లక్షలతో ఇంటికి తీసుకెళ్లొచ్చు..
గత కొంతకాలంగా ఎగిరే కార్లు వినియోగంలోకి వస్తాయన్న చాలామంది కలలు కంటూనే ఉన్నారు. అయితే ఈ కల ఎట్టకేలకు ఇప్పుడు నిజమయ్యింది. స్వీడన్ స్టార్టప్ కంపెనీ 'జెట్సన్ వన్' అనే ఫ్లైయింగ్ కారుని విడుదల చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. డ్రోన్ మాదిరిగా గాలిలో ఎగిరే ఈ ఎలక్ట్రిక్ కారు ధర రూ. 98,000 డాలర్లు (సుమారు 80.19 లక్షల రూపాయలు). అయితే కస్టమర్ ఇప్పుడు కేవలం 8,000 డాలర్లు (దాదాపు 6.5 లక్షల రూపాయలు) చెల్లించి ఈ కారును ఇంటికి తీసుకెళ్లొచ్చు. ఇది చూడటానికి హెలికాఫ్టర్ మాదిరిగా ఉంటుంది. చూడటానికి హెలికాఫ్టర్ మాదిరిగా ఉన్నప్పటికీ ఒక డ్రోన్ మోడల్ ఆధారంగా తయారైంది. ఈ ఎలక్ట్రిక్ ఫ్లైయింగ్ కారు టేకాఫ్, ల్యాండింగ్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి గాలిలో ఎగురుతూ సురక్షితంగా ప్రయాణిస్తుంది. అయితే ఈ కారుని నడపడానికి ఎలాంటి డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు. దీని బరువు 86 కేజీలు మాత్రమే ఉంటుంది. ఇది eVTOL అల్ట్రాలైట్ వాహనాల కోసం US ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ నిబంధనలకు అనుగుణంగా ఉండటం వల్ల ఆపరేట్ చేయడానికి లైసెన్స్ అవసరం లేదు. ఈ నియమాలు కేవలం అమెరికాలో మాత్రమే వర్తిస్తాయి. (ఇదీ చదవండి: డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేని కొత్త ఎలక్ట్రిక్ బైక్ - ధర రూ. 55,555 మాత్రమే!) జెట్సన్ వన్ అనే ఫ్లైయింగ్ కారు ఉపయోగించడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇందులోని కాక్‌పిట్‌లో రెండు జాయ్‌స్టిక్‌లు ఉంటాయి. ఒకటి ఎత్తుని కంట్రోల్ చేయడానికి కాగా, మరొకటి దిశను నియంత్రించడానికి ఉపయోగపడుతుంది. కొత్త వారు కూడా చాలా తక్కువ సమయంలో ఆపరేటింగ్ నేర్చుకోవచ్చని కంపెనీ తెలిపింది. జెట్సన్ వన్ 88 కేజీల బ్యాటరీ కలిగి సుమారు 1,500 అడుగుల ఎత్తులో ఎగురుతుంది. ఇందులో ఉన్న ప్రొపెల్లర్లు గంటకు 101 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడానికి అనుమతిస్తాయి. ల్యాండింగ్ చేయడానికి సెన్సర్లను ఉపయోగించి సులభంగా ల్యాండ్ చేయవచ్చు. ఈ కారు ఫుల్ ఛార్జ్ కావడానికి పట్టే సమయాన్ని గురించి కంపెనీ వెల్లడించలేదు. (ఇదీ చదవండి: రూ. 5వేలు పెట్టుబడితో రూ. 750 కోట్ల వ్యాపార సామ్రాజ్యం - తయారైందిలా..!) మార్కెట్లో విడుదలైన కొత్త జెట్సన్ వన్ ఆధునిక సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది. ఇందులో పారాచూట్ వంటివి అందుబాటులో ఉంటాయి. అత్యవసర పరిస్థితుల్లో ఇవి చాలా ఉపయోగపడతాయి. అంతే కాకుండా ఇందులో హ్యాండ్స్-ఫ్రీ హోవర్ ఫంక్షన్లు ఉండటం వల్ల మోటార్ చెడిపోయినప్పుడు కూడా సురక్షితంగా ఎగురుతూ ఉంటుందని చెబుతున్నారు. (ఇదీ చదవండి: స్మార్ట్‌ఫోన్‌లో ఇవి గమనించారా? లేకుంటే పేలిపోతాయ్..) ఈ ఎలక్ట్రిక్ ఫ్లైయింగ్ కారు కావాలనుకున్న వారు కంపెనీ అధికారిక వెబ్సైట్లో బుక్ చేసుకోవచ్చు. డెలివరీలో త్వరలోనే ప్రారంభమవుతాయి. టెస్టింగ్ దశలో ఉన్న ఈ కారు ఇప్పటికే వందల సంఖ్యలో బుకింగ్స్ స్వీకరించినట్లు కంపెనీ తెలిపింది. అంతే కాకుండా ఇది కేవలం యుఎస్ మార్కెట్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. -
ఈ స్మార్ట్ వాచ్ సూపర్! 12 రోజుల బ్యాటరీ బ్యాకప్..
కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ ఐటెల్ భారతదేశంలో తన ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించింది. తాజగా ఐటెల్ స్మార్ట్‌వాచ్ 2ఈఎస్ (Itel 2ES)ను విడుదల చేసింది. ధర రూ. 1,699లే. బ్లూటూత్ వెర్షన్ 5.3తో వచ్చే ఈ స్మార్ట్ వాచ్ 12 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ కలిగి ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఇదీ చదవండి: ట్రూకాలర్‌లో అదిరిపోయే ఫీచర్.. ఆ మెసేజ్‌లను పసిగట్టేస్తుంది! ఈ స్మార్ట్ వాచ్ ఇంకా మరెన్నో కళ్లుచెదిరే ఫీచర్లు ఉన్నాయి. ఇందులో ఇన్‌బిల్ట్‌గా ఉన్న మైక్రోఫోన్ సహాయంతో నేరుగా కాల్స్ చేయవచ్చు. ఈ స్మార్ట్‌వాచ్‌లో 1.8 అంగుళాల IPS HD డిస్ప్లే ఉంటుంది. ఐటెల్ 2ES స్మార్ట్ వాచ్ ఆకర్షణీయమైన సిటీ బ్లూ, రెడ్, గ్రీన్, వాటర్ గ్రీన్ రంగుల్లో లభిస్తుంది. ఐటెల్ స్మార్ట్‌వాచ్‌లో AI వాయిస్ అసిస్టెంట్ ఉంటుంది. దీంతో యూజర్లు కాల్స్ చేయవచ్చు. మెసేజ్‌లు పంపవచ్చు. వాయిస్ ఆదేశాలను ఉపయోగించి ఇతర స్మార్ట్ గ్యాడ్జెట్లను నియంత్రించవచ్చు. కాల్ ఎనీటైమ్, ఎనీవేర్ ఫీచర్‌తో పాటు, హార్ట్ రేట్ మానిటర్, బ్లడ్ ఆక్సిజన్ మానిటర్ కూడా ఈ స్మార్ట్ వాచ్‌లో ఉన్నాయి. మ్యూజిక్, కెమెరా కంట్రోల్ ఉంటాయి. ఎస్సెమ్సెస్‌లు, సోషల్ మీడియా నోటిఫికేషన్లు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి స్మార్ట్ నోటిఫికేషన్ ఆప్షన్ కూడా ఉంది. ఇతర స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే IP68 వాటర్ రెసిస్టెంట్, 1.8 అంగుళాల స్క్రీన్, 90 శాతం స్క్రీన్ టు బాడీ రేషియో, 500 నిట్స్ వరకు బ్రైట్నెస్ వంటివి ఉన్నాయి. ఇక 250mAh బ్యాటరీతో ఈ స్మార్ట్ వాచ్ గరిష్టంగా 12 రోజుల బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది. ఇది మాగ్నెటిక్ ఛార్జింగ్‌ని కలిగి ఉంటుంది. ఇదీ చదవండి: బిర్యానీ అమ్ముతూ రోజుకు రూ.37 లక్షలు సంపాదిస్తున్నాడు.. ఫుడీ ఐఐటీయన్! -
రియల్మీ సి–55.. ఎంట్రీ లెవెల్ విభాగంలో సంచలనం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్స్ బ్రాండ్ రియల్మీ భారత మార్కెట్లో సి–55 మోడల్‌ను విడుదల చేసింది. 16 జీబీ డైనమిక్ ర్యామ్‌తో 8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ మెమరీ, 33 వాట్స్ సూపర్‌వూక్ చార్జింగ్, 90 హెట్జ్ ఎఫ్‌హెచ్‌డీ ప్లస్ 6.72 అంగుళాల డిస్ప్లే ఏర్పాటు ఉంది. (మోటరోలా జీ13 వచ్చేసింది.. ధర తక్కువే!) సెగ్మెంట్లో అత్యధికంగా 64 ఎంపీ కెమెరా పొందుపరిచారు. చార్జింగ్ ఎంత మేరకు ఉంది, డేటా వినియోగం, నడిచిన దూరం తెలిపే నోటిఫికేషన్స్ స్క్రీన్‌పై దర్శనమిస్తాయి. ధర రూ.9,999 నుంచి ప్రారంభం. ఎంట్రీ లెవెల్ విభాగంలో ఈ మోడల్ సంచలనం సృష్టిస్తుందని రియల్మీ గ్లోబల్ ప్రొడక్ట్ మేనేజర్ శ్రీహరి మీడియాకు తెలిపారు. (మారుతీ సుజుకీ రికార్డ్.. విదేశాలకు 25 లక్షల కార్లు..) -
నోకియా సీ12 ప్రో: అల్ట్రా-ఎఫర్డబుల్ స్మార్ట్‌ఫోన్
సాక్షి, ముంబై: దేశీయ మార్కెట్లో హెచ్ఎండీ గ్లోబల్ మరో బడ్జెట్ స్మార్ట్ ఫోన్ నోకియా సీ12 ప్రో (Nokia C12 Pro) లాంచ్ అయింది. పలు కీలక ఫీచర్లతో, అందుబాటులో ధరలోఈ మొబైల్‌ను తీసు కొచ్చింది. నోకియా సీ12 లాంచ్ చేసిన వారం రోజుకే ప్రో వెర్షన్‌ను తీసుకు రావడం విశేషం.ఒక్టాకోర్ ప్రాసెసర్, 2జీబీ వర్చువల్ రామ్ సపోర్ట్‌తో క్లీన్ ఆపరేటింగ్ సిస్టమ్ లాంటి ఫీచర్లున్నాయి. నోకియా సీ 12 ప్రో ధర భారతదేశంలో నోకియా సీ 12 ప్రో ధర బేస్ 2జీబీ ర్యామ్/64 జీబీ స్టోరేజ్ మోడల్ కోసం రూ.6,999 గా ఉంది. అదనంగా, 3జీబీ ర్యామ్/64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 7,499 చార్కోల్, డార్క్ క్యాన్ కలర్స్‌లో లభ్యం. ఇది నేరుగా నోకియా ఇండియా, ఇతర ఆన్లైన్, ఆఫ్‌లైన్ రిటైన్ ఛానెల్‌ల ద్వారా కొనుగోలు చేయవచ్చు నోకియా సీ12 ప్రో స్పెసిఫికేషన్స్ 6.3-అంగుళాల HD+ LCD ప్యానెల్ ఆండ్రాయిడ్ 12 (గో ఎడిషన్) 8 ఎంపీ రియర్ కెమెరా విత్ LED ఫ్లాష్ 5 ఎంపీ సెల్ఫీ కెమెరా 4,000 mAh బ్యాటరీ -
భారత్‌లో మారుతి బ్రెజ్జా సిఎన్జి లాంచ్.. పూర్తి వివరాలు
సిఎన్జి విభాగంలో జోరుగా ముందుకు సాగుతున్న మారుతి సుజుకి ఎట్టకేలకు భారతీయ మార్కెట్లో తన 'బ్రెజ్జా సిఎన్జి' విడుదల చేసింది. కంపెనీ ఇప్పటికే దీని కోసం బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. బుకింగ్స్ & ధరలు: మారుతి సుజుకి బ్రెజ్జా సిఎన్జి కోసం రూ. 25,000తో బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. కాగా ఈ కొత్త మోడల్ ప్రారంభ ధర రూ. 9.14 లక్షలు, కాగా టాప్ వేరియంట్ ధర రూ. 11.90 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ ధరలు ఇప్పటికే అమ్మకానికి ఉన్న పెట్రోల్ వేరియంట్స్ కంటే రూ. 95,000 ఎక్కువ. వేరియంట్స్: మారుతి బ్రెజ్జా సిఎన్జి మూడు వేరియంట్స్‌లో లభిస్తుంది. అవి LXi, VXi, ZXi. వీటి ధరలు వరుసగా రూ. 9.14 లక్షలు, రూ. 10.50 లక్షలు, రూ. 11.90 లక్షలు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా). టాప్ వేరియంట్ అయిన జెడ్ఎక్స్ఐ డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్లో కూడా లభిస్తుంది. దీని కోసం రూ. 16,000 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. డిజైన్ & ఫీచర్స్: బ్రెజ్జా సిఎన్జి డిజైన్ పరంగా దాదాపు దాని మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటుంది. అయితే ఇందులో బూట్ స్పేస్ చాలా తక్కువగా ఉంటుంది. దీనికి కారణం బూట్ స్పేస్‌లో సిఎన్జి ట్యాంక్ అమర్చబడి ఉండటమే. ఇంటీరియర్ చాలా వరకు బ్లాక్ కలర్లో ఉంటుంది. ఇందులో 7.0 ఇంచెస్ టచ్‌స్క్రీన్, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో/యాపిల్ కార్ప్లే, స్టార్ట్/స్టాప్ బటన్, సన్‌రూఫ్, క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్స్ లభిస్తాయి. (ఇదీ చదవండి: 2023 కియా కారెన్స్ విడుదల చేసిన కియా మోటార్స్ - పూర్తి వివరాలు) పవర్‌ట్రెయిన్: కొత్త మారుతి బ్రెజ్జా సిఎన్జి అదే 1.5-లీటర్ K15C డ్యూయల్‌జెట్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఇది పెట్రోల్ మోడ్‌లో 101 హెచ్‌పి పవర్, 136 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. సిఎన్జి మోడ్‌లో 88 హెచ్‌పి పవర్, 121.5 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడుతుంది. ఇది 25.51 కిమీ/కేజీ మైలేజ్ అందిస్తుందని కంపెనీ తెలిపింది. (ఇదీ చదవండి: ఒకటి తగ్గింది.. మరొకటి పెరిగింది: ఇదీ టయోటా హైలెక్స్ ధరల వరుస!) ప్రత్యర్థులు: మారుతి సిఎన్జి దేశీయ విఫణిలో హ్యుందాయ్ వెన్యూ, టాటా నెక్సాన్, రెనాల్ట్ కిగర్, కియా సోనెట్, నిస్సాన్ మాగ్నైట్, రాబోయే మారుతి ఫ్రాంక్స్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. ఇక్కడ తెలుసుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే కాంపాక్ట్ SUV విభాగంలో సిఎన్జి పవర్‌ట్రెయిన్ పొందిన మొదటి కారు మారుతి బ్రెజ్జా. -
సుచిత్రలో నిహారిక, నేహా శెట్టి సందడి (ఫొటోలు)
-
హైటెక్స్‌లో ఈ-మోటార్ షోను ప్రారంభించిన మంత్రి కేటీఆర్ (ఫొటోలు)
-
ఏపీ సర్కార్ మరో ముందడుగు..
సాక్షి, విశాఖపట్నం: పేదల కడుపు నింపే కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా లబ్ధి దారులకు ఇప్పటి వరకూ బియ్యం, చక్కెర, కందిపప్పు సరఫరా చేస్తోన్న పౌరసర ఫరాల శాఖ బుధవారం నుంచి గోధుమ పిండి కూడా అందిస్తోంది. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఈ కార్యక్రమాన్ని విశాఖ పట్టణంలో ప్రారంభించారు. నగరంలోని లబ్దిదారులకు గోధుమ పిండి ప్యాకెట్ లను పంపిణీ చేశారు. గోధుమ పిండి కిలో ప్యాకెట్ ధర 16 రూపాయలుగా నిర్ణయించారు. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ పట్నం, మన్యం, అనకాపల్లి మునిసిపాలిటీ పట్టణ ప్రాంతాల్లో సబ్సిడీ పై గోధుమ పిండి అందించనున్నారు. బహిరంగ మార్కెట్లో కిలో రూ.40గా ఉంది. విశాఖపట్నం అర్బన్ ఏరియా వార్డ్ నెంబర్ 24, సీతమ్మధారలో రేషన్ షాపు నెంబర్ 205 పరిధిలో రేషన్ కార్డు దారులకు ఎండియూ వాహనం ద్వారా గోధుమ పిండి పంపిణీ చేశారు. చదవండి: సీఎం జగన్ స్పష్టమైన సంకేతం.. ఇక తగ్గేదేలే! -
Saindhav Movie: ఘనంగా ప్రారంభమైన వెంకటేష్ 75వ చిత్రం (ఫొటోలు)
-
జనవరి 26 నుంచి ముక్కుతో నేరుగా తీసుకునే వ్యాక్సిన్ ప్రారంభం
స్వదేశీ వ్యాక్సిన్ తయారీ సంస్థ భారత్ బయోటక్ తోలిసారిగా జనవరి 26 నుంచి ముక్కుతో నేరుగా తీసుకునే ఇంట్రానాసల్ కోవిడ్-19 వ్యాక్సిన్‌ను ప్రారంభించనున్నట్లు పేర్కొంది. ఈ విషయాన్ని ఆ కంపెనీ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ ఎల్లా శనివారం తెలిపారు. మౌలానా ఆజాద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో నిర్వహించిన ఐఐఎస్ఎఫ్ ఫేస్ టు ఫేస్ విత్ న్యూ ఫ్రాంటియర్స్ ఇన్ సైన్స్ విభాగంలో పాల్గొన్న కృష్ణ ముక్కుతో నేరుగా తీసుకునే ఈవ్యాక్సిన్ని రిపబ్లిక్ డే రోజున అధికారికంగా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. అంతేగాదు ఈ ఇంట్రానాసల్ కోవిడ్-19 వ్యాక్సిన్‌ను ప్రభుత్వానికి ఒక్కో వ్యాక్సిన్‌కి రూ. 325లకి, ప్రైవేట్ కేంద్రాలకి రూ. 800లకి విక్రయించనున్నట్లు పేర్కొంది. అలాగే ఆయన బోఫాల్‌లో జరిగి ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్లో విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యి పశువులలో వచ్చే లంపి ప్రోవాక్ఇండ్కు సంబంధించిన వ్యాక్సిన్‌ను కూడా వచ్చే నెలలో ప్రారంభించే అవకాశం ఉందని చెప్పారు. (చదవండి: అండమాన్‌లో 21 దీవులకు పరమవీర చక్ర అవార్డు గ్రహీతల పేర్లు) -
టెక్నో కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ లాంచ్; ధర వింటే..!
సాక్షి,ముంబై: టెక్నో కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. తన స్పార్క్ సిరీస్‌ను రిఫ్రెష్ చేస్తూ టెక్నో స్పార్క్ గో 2023ని Tecno ఆవిష్కరించింది. త్వరలోనే ఇండియాలోకూడా ఇది లాంచ్ కానుంది. ఎంట్రీ-లెవల్ ఫోన్ పోకో సీ50, రెడ్మిఏ1 లాంటి వాటికి గట్టి పోటీ ఇస్తుందని అంచనా. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 25 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్‌ను ఫోన్ ఆఫర్ చేస్తుందని కంపెనీ తెలిపింది. ప్రస్తుతం ఉన్న మోడల్ కాస్త అప్గ్రేడ్చేసి దీన్ని తీసుకొచ్చింది. స్పార్క్ గో 2023 మూడు స్టోరేజ్ ఆప్షన్లతో లాంచ్ అయింది. 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ బేస్ మోడల్ ధర రూ.6,999గా నిర్ణయించింది. అలాగే 3జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్, 4జీబీ, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్లలో కూడా అందుబాటులో ఉంటుంది. ఎండ్లెస్ బ్లాక్, ఉయుని బ్లూనెబ్యులా పర్పుల్‌లో లభ్యం. టెక్నో స్పార్క్ గో 2023 ఫీచర్లు 6.56-అంగుళాల IPS LCD MediaTek Helio A22 SoC Android 12 HiOS 12.0 రియర్ డ్యూయల్ కెమెరా f/1.85 ఎపర్చర్‌తో 13ఎంపీ ప్రైమరీ కెమెరా QVGA సెన్సార్ , LED ఫ్లాష్ 5 ఎంపీ సెల్ఫీ కెమెరా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ -
వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను వర్చువల్ గా ప్రారంభించిన మోడీ
-
గిరిజన ప్రాంత అభివృద్ధి పై సీఎం జగన్ కు ప్రత్యేక శ్రద్ద : మంత్రి రోజా
-
లగ్జరీ ఎస్యూవీ బీఎండబ్ల్యూ ఎక్స్ఎం వచ్చేసింది..ధర తెలిస్తే!
సాక్షి, ముంబై: జర్మన్‌కు చెందిన లగ్జరీకారు మేకర్ బీఎండబ్ల్యూ మరో హైబ్రిడ్ కారును భారత మార్కెట్లో లాంచ్ చేసింది. బీఎండబ్ల్యూ ఎక్స్ఎం పేరుతో ఫ్లాగ్షిప్ ఎస్‌యూవీని తీసుకొచ్చింది. భారతదేశంలో దీని ధరను రూ. 2.60 కోట్ల (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది. (ఉద్యోగాల ఊచకోత: ఇంటెల్ కూడా..వేలాదిమందికి) బవేరియన్ కార్‌మేకర్ ఎం బ్రాండ్ నుంచి వచ్చిన రెండో లగ్జరీ కారుగాను, ఎం బ్యాడ్జ్‌తో వచ్చిన తొలి ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనంగా ఇది నిలుస్తోంది. సెప్టెంబర్ ప్రారంభంలో ఎక్స్ఎం ప్లగ్-ఇన్హైబ్రిడ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ఆవిష్కరించింది. అమెరికాలోని స్పార్టాన్స్బర్గ్ ఫ్యాక్టరీలో ఉత్పత్తి ఇప్పటికే ప్రారంభమైంది. బీఎండబ్ల్యూ ఎక్స్ఎం ఇంజీన్, ఫీచర్లు ఇందులో అమర్చిన ట్విన్-టర్బోఛార్జ్డ్ 4.4లీటర్ పెట్రోల్ ఇంజీన్ 653బీహెచచ్పీ పవర్‌ను, 800ఎన్ఎం పీక్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. లగ్జరీ ఎస్యూవీ కేవలం 4.3 సెకన్లలోనే 0-100 కి.మీ వేగాన్ని అందుకోగలదు. అలాగే EV మోడ్‌లో గంటకు 140 కిమీ వేగంతో 88 కిమీ వరకు దూసుకెళుతుందని కంపెనీ పేర్కొంది. ఈ మాసివ్ ఎస్‌యూవీలోని కిడ్నీ షేప్డ్ ఫ్రంట్ గ్రిల్ , LED స్పిట్ హెడ్లైట్లు, 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇంకా 23-అంగుళాల అల్లాయ్ వీల్స్, క్వాడ్-టిప్ ఎగ్జాస్ట్ ద్వారా డిజైన్‌ను ఆకర్షణీయంగా మార్చింది.రియర్‌లో వర్టికల్లీ స్టాకెడ్ ఎక్సాస్ట్ ఔట్లెట్స్,అడాప్టివ్ ఎం సస్పెన్షన్, ఎలక్ట్రానికల్లీ కంట్రోల్డ్ డ్యాంపర్స్, కొత్త 48వీ సిస్టెమ్ ఉన్నాయి. ఇక ఇంటీరియర్‌గా హెడ్స్-అప్ డిస్ప్లే (HUD), 15,000 వాట్ బోవర్స్ అండ్ విల్కిన్స్ సరౌండ్ సౌండ్ సిస్టమ్, 12.3 ఇంచ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 14.9 ఇంచెస్ టచ్‌స్క్రీన్, ఐడ్రైవ్ 8 సాప్ట్వేర్, ఏడీఏఎస్ టెక్, యాంబియంట్ లైటింగ్, 4 జోన్ ఆటోమెటిక్ కంట్రోల్ లాంటి ఇతర ఫీచర్లున్నాయి. దీంతోపాటు బీఎండబ్ల్యూ ఎక్స్ 7 ఫేస్ లిఫ్ట్, బీఎండబ్ల్యూ ఎం 340ఐ ఎక్స్ డ్రైవ్‌ని కూడా లాంచ్ చేసింది. తద్వారా దేశంలో తన ఉత్పత్తి శ్రేణిని మరింత విస్తరిస్తోంది. BMW M340i xDrive ధర రూ. 69.20 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. -
డిజిటల్ రూపాయిని లాంచ్ చేసిన RBI
-
లంబోర్గినీ సూపర్ ఎస్యూవీ వచ్చేసింది: కళ్లు చెదిరేలా!
హైదరాబాద్: ఇటాలియన్ సూపర్ స్పోర్ట్స్ కార్ల తయారీ దిగ్గజం లంబోర్గినీ తాజాగా భారత్‌లో ఊరూస్ పెర్ఫార్మెంటే ఎస్‌యూవీని పరిచయం చేసింది. ప్రారంభ ధర ఎక్స్‌షోరూంలో రూ.4.22 కోట్లునుంచి ప్రారంభం. స్టాండర్ట్ ఎస్యూవీ కంటే దాదాపు రూ. 1.12 కోట్లు ఎక్కువ. గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 3.3 సెకన్లలోనే చేరుకోవడం దీని ప్రత్యేకత. గరిష్ట వేగం గంటకు 306 కిలోమీటర్లు. భారత్‌లో బ్రాండ్ వృద్ధిని పెంచడంలో, కొత్త మార్కెట్లను తెరవడంలో ఊరూస్ కీలకపాత్ర పోషించిందని లంబోర్గినీ ఇండియా హెడ్ అగర్వాల్ తెలిపారు. -
మారుతి స్విఫ్ట్ ఎస్-సీఎన్జీ వచ్చేసింది, ఫీచర్లు చూసి వావ్ అనాల్సిందే!
సాక్షి,ముంబై: మారుతి సుజుకి తన పాపులర్ మోడల్ స్విఫ్ట్‌లో S-CNG వెర్షన్‌ను దేశంలో విడుదల చేసింది. హ్యాచ్‌బ్యాక్ కారు రెండు (VXi , ZXi) వేరియంట్లలో అందుబాటులో ఉంది. అంతేకాదు కిలోకి 30.90 కిలోమీటర్లతో మోస్ట్పవర్ఫుల్, అద్భుతమైన ఇంధన సామర్థ్యమున్న హ్యాచ్‌బ్యాక్ కార్ అని కంపెనీ చెబుతోంది. మారుతి కొత్త స్విఫ్ట్ వెర్షన్ ధరలు రూ. 7.77 లక్షల (ఎక్స్-షోరూమ్)నుండి ప్రారంభం. అలాగే నెలవారీ సబ్స్క్రిప్షన్ రుసుముతో రూ. 16,499తో (అన్ని కలుపుకొని) ఈ కారును సొంతం చేసుకోవచ్చని మారుతి వెల్లడించింది. కొత్త మారుతి సుజుకి స్విఫ్ట్ ఎస్-సీఎన్జీ 1.2L K-సిరీస్ డ్యూయల్ జెట్, డ్యూయల్ VVT ఇంజన్‌తో 6,000rpm వద్ద 76bhp, 4,300rpm వద్ద 98Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ యూనిట్‌తో మాత్రమే వచ్చింది. 2022 మారుతి సుజుకి స్విఫ్ట్ S-CNGలో డ్యూయల్ ఇంటర్ డిపెండెంట్ ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్స్, (ECU) ఇంటెలిజెంట్ ఇంజెక్షన్ సిస్టమ్‌ను జోడించింది. తుప్పు ఎలాంటి లీకేజీ లేకుండాస్టెయిన్లెస్ స్టీల్ పైపులు, జాయింట్లతో ఈ మోడల్ మరింత సేఫ్టీగా ఉంటుందని కంపెనీ మారుతీ సుజుకి ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) శశాంక్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. -
'నయా భారత్ కా సప్నా' ప్రచారాన్ని ప్రారంభించిన కరణ్ జోహార్
Karan Johar Launches Naye Bharat Ka Sapna Campaign: 'నయా భారత్ కా సప్నా' పేరిట స్వాతంత్ర్య దినోత్సవ ప్రచారాన్ని బాలీవుడ్ ప్రముఖ చిత్ర నిర్మాత కరణ్ జోహర్ ప్రారంభించారు. 'కూ యాప్' ద్వారా వాతావరణ మార్పులపై పోరాటం చేద్దామనే తీర్మానాన్ని ఆమోదించేలా వినియోగదారులను ప్రోత్సహించేందుకు కరణ్ జోహార్ ఈ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ నయా భారత్ కా స్వప్నా అనే కార్యక్రమం సరికొత్త భారతదేశం కోసం సమిష్టి మార్పును తీసుకురావడానికి ఒక తీర్మానాన్ని ఆమోదించేలా వినియోగదారులను ప్రేరేపిస్తుంది. భారతదేశంలో తయారైన ఉత్పత్తులను ఉపయోగించడం ద్వారా వినియోగదారులు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను దూరంగా ఉంచడం, పునర్వినియోగం, తగ్గించడం, రీసైకిల్ చేయడం వంటి అలవాట్లను అవలంబించడం ద్వారా వాతావరణ మార్పులపై పోరాడతామని ప్రతిజ్ఞ చేస్తూ కరణ్ జోహార్ ఈ ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ ప్రచారం ద్వారా స్వతంత్ర భారతదేశపు 75 వ వార్షికోత్సవాన్ని మరింత సంతోషంగా జరుపుకోవడానికి వినియోగదారులను సన్నద్ధం చేస్తోంది. ఆగస్టు 1 నుంచి 15 రోజుల పాటు సాగే ఈ ప్రచారంలో సమాజ సంక్షేమం కోసం ప్రతిరోజూ కృషి చేసే వైద్యులు ఆరోగ్య కార్యకర్తలతో సహా భారతదేశ సాయుధ దళాలకు, కోవిడ్ యోధులకు సెల్యూట్ చేయమని ప్రజలను ప్రోత్సహిస్తుంది. 'కూ యాప్ ప్రగతిశీల మార్పులు అలవర్చుకునేలా ప్రజలను ప్రేరేపిస్తోందని' ఆ యాప్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ సునీల్ కామత్ వెల్లడించారు. అలాగే ఫైట్ క్లైమేట్ చేంజ్ గురించి కరణ్ జోహార్ మాట్లాడుతూ, “ఈ వాతావరణ మార్పుల విషయంలో మనలో ప్రతి ఒక్కరికీ పాత్ర ఉంది. ఈ నయా భారత్ కా సప్నా లో పాల్గొని, కూ యాప్ ద్వారా బహుభాషా వినియోగదారులతో సంభాషిస్తూ సమస్య గురించి అవగాహన కల్పించడానికి నా వంతు కృషి చేస్తాను. ఈ స్వాతంత్య్ర సంబురాల సమయంలో మనమందరం చేయి చేయి కలుపుదాం. మన భూమి, మన దేశం, మన ప్రజల కోసం మన వంతు కృషి చేద్దాం. అని పేర్కొన్నారు. Koo App One step for the nation. #nayebharatkasapna #swatantratasankalp View attached media content - Karan Johar (@karanjohar) 1 Aug 2022 -
100 గ్రాముల కళ్ల జోడు..100 నిమిషాల వీడియోల్ని రికార్డ్ చేస్తుంది!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షావోమీ టెక్నాలజీ విభాగంలో మరో అడుగు ముందుకు వేసింది. అగ్మెంటెడ్ రియాలిటీతో 'మిజియా ఏఆర్ గ్లాసెస్ కెమెరా ' స్మార్ట్ గ్లాస్‌ను విడుదల చేసింది. షావీమీ 'మిజియా ఏఆర్ స్మార్ట్ గ్లాస్‌ను చైనాలో విడుదల చేయగా.. గ్లోబల్ మార్కెట్లో ఎప్పుడు విడుదల చేస్తున్నారనే అంశంపై షావోమీ స్పందించింది. తాము విడుదల చేసిన ఈ ఏఆర్ స్మార్ట్ గ్లాస్‌ను భారత్ మార్కెట్లో త్వరలోనే అందుబాటులోకి తెస్తామని తెలిపింది. ఆ తర్వాత డిమాండ్‌ను బట్టి ఇతర దేశాల మార్కెట్లకు పరిచయం చేస్తామని పేర్కొంది. మిజియా ఏఆర్ గ్లాసెస్ ఫీచర్లు రూ.29,030 విలువైన మిజియా ఏఆర్ గ్లాసెస్‌లో డ్యుయల్ కెమెరా సెటప్, 50 మెగా పిక్సెల్ క్వాడ్ బేయర్ సెన్సార్లు, 8మెగా పిక్సెల్ పెరిస్కోపిక్ టెలిఫోటో కెమెరా, ఐఓఎస్ ఆప్టికల్ స్టెబిలైజేన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 5ఎక్స్ ఆప్టికల్ జూమ్ సపోర్ట్ చేస్తుండగా 15ఎక్స్ హైబ్రిడ్ వరకు జూమ్ చేసుకోవచ్చని షావోమీ ప్రతినిధులు వెల్లడించారు. పనితనం అంటే ఇదే మరి కేవలం 100గ్రాముల బరువు ఉండే ఈ స్మార్ట్ గ్లాస్ పనితీరులో అమోఘమని షావోమీ అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ గ్లాస్లో ఉన్న కెమెరాలు ఫోటోల్ని తీయడం, షేర్ చేయడం సెకన్లలో జరిగిపోతాయని స్పష్టం చేసింది. ఈ గ్లాస్లో మరో ప్రత్యేకత ఏంటంటే 100 నిమిషాల వీడియో పుటేజీని నాన్ స్టాప్‌గా రికార్డ్ చేస్తుందని షావోమీ సీఈవో లీ జూన్ చెప్పారు. స్టోరేజీ ఎంతంటే స్నాప్ డ్రాగన్ 8చిప్ సెట్‌తో వస్తున్న ఈ స్మార్ట్ గ్లాస్లో 3జీబీ ర్యామ్ 32జీబీ స్టోరేజ్ సౌకర్యం ఉంది. 1,020 ఎంఏహెచ్ బ్యాటరీ, 10డబ్ల్యూ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్, 30నిమిషాల్లో 80శాతం బ్యాటరీ ఛార్జింగ్ ఎక్కే సామర్ధ్యం ఉంది. 3,000 నిట్స్ పీక్స్ బ్రైట్‌నెస్‌తో ఓఎల్ఈడీ స్క్రీన్‌తో వస్తుండగా.. ఈ స్మార్ట్ గ్లాసెస్ డిజిటల్ అసిస్టెంట్‌గా పనిచేస్తాయని విడుదల సందర్భంగా షావోమీ వెల్లడించింది. -
జక్కన్న విడుదల చేసిన 'దోచేవారెవరురా'.. ఆసక్తిగా టీజర్..
SS Rajamouli Launches Dochevarevarura Teaser: ''నేను శివ నాగేశ్వరరావు సినిమాల్లోని కామెడీని బాగా ఎంజాయ్ చేస్తాను. ఇప్పుడు ఆయన నుంచి వస్తున్న 'దోచేవారెవరురా' సినిమా కూడా అంతే వినోదాత్మకంగా ఉంటుదని నమ్ముతున్నా'' అని తెలిపారు దర్శక ధీరుడు రాజమౌళి. 'మనీ', 'మనీ మనీ', 'సిసింద్రీ', 'హ్యాండ్సప్', 'మొండి మొగుడు పెంకీ పెళ్లాం', 'లక్కీ ఛాన్స్', 'పట్టుకోండి చూద్దాం' వంటి చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన డైరెక్టర్ శివ నాగేశ్వర రావు. తాజాగా ఆయన దర్శకత్వంలో మాళవిక సతీశన్, అజయ్ ఘోష్, ప్రణవ చంద్ర తదితరులు కీలక పాత్రలుగా పోషించిన చిత్రం 'దోచేవారెవరురా'. ఈ సినిమా టీజర్‌ను శుక్రవారం (జులై 29) దర్శక ధీరుడు రాజమౌళి విడుదల చేశారు. ఈ సందర్భంగా మూవీ యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. ఓ ఆసక్తికర కథాంశంతో తెరకెక్కిన చిత్రమని, అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఆగస్టులో విడుదల చేస్తామని చిత్రబృందం తెలిపింది. ఈ సినిమాకు బొడ్డు కోటేశ్వరరావు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. -
గూగుల్ గుడ్ న్యూస్: ‘స్ట్రీట్ వ్యూ’ని ఎంజాయ్ చేయండి!
న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం గూగుల్ తాజాగా తమ గూగుల్ మ్యాప్స్‌లో ’స్ట్రీట్ వ్యూ’ ఫీచర్‌ను భారత మార్కెట్లో మరోసారి తీసుకొచ్చింది. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, ముంబై తదితర 10 నగరాల్లో 1,50,000 కి.మీ. విస్తీర్ణంలో ఇది బుధవారం నుండి అందుబాటులోకి వచ్చింది. ఇందుకోసం జెనెసిస్ ఇంటర్నేషనల్, టెక్ మహీంద్రాతో జట్టు కట్టినట్లు పేర్కొంది. స్థానిక సంస్థల భాగస్వామ్యంతో స్ట్రీట్ వ్యూను అందుబాటులోకి తేవడం ఇదే తొలిసారని వివరించింది. 2022 ఆఖరు నాటికి ఈ ఫీచర్‌ను 50 నగరాలకు విస్తరించే ప్రణాళికలు ఉన్నట్లు గూగుల్ పేర్కొంది. ఏదైనా ప్రాంతం ఇమేజీని 360 డిగ్రీల కోణంలో చూసేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. గతంలోనే దేశీయంగా ప్రవేశపెట్టినప్పటికీ భద్రతా కారణాల రీత్యా పూర్తి స్థాయిలో విస్తరించేందుకు కేంద్రం అనుమతించలేదు. మరోవైపు, ట్రాఫిక్ సిగ్నల్ టైమింగ్‌లను మెరుగుపర్చేందుకు బెంగళూరు ట్రాఫిక్ పోలీస్ విభాగంతో కూడా జట్టు కట్టినట్లు గూగుల్ వివరించింది. త్వరలో హైదరాబాద్, కోల్‌కతాలోని స్థానిక ట్రాఫిక్ విభాగంతో కూడా ఈ తరహా ఒప్పందాలు కుదుర్చుకోనున్నట్లు గూగుల్ మ్యాప్స్ ఎక్స్పీరియెన్సెస్ వైస్ ప్రెసిడెంట్ మిరియం కార్తీక డేనియల్ తెలిపారు. -
ఎట్టకేలకు ‘సిట్రోయెన్ సీ3’ లాంచ్, ధర, ఫీచర్ల వివరాలివిగో!
సాక్షి, ముంబై: ఫ్రెంచ్ కార్ మేకర్ సిట్రోయెన్ సీ 3 కార్లను ఎట్టకేలకు భారత మార్కెట్లో లాంచ్ చేసింది. కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మంట్లో వీటిని సరికొత్తగా తీసుకొచ్చింది. ఈ కార్ ధరను రూ. 5.70 లక్షల (ఎక్స్-షోరూమ్, పరిచయ ధర) గా కంపెనీ నిర్ణయించింది. భారతీయ మార్కెట్లో సిట్రోయెన్ హౌస్ నుండి వచ్చిన తొలి చిన్న ఎస్యూవీ ఇది. మొత్తం ఆరు వేరియంట్లలో, పది రంగుల్లో సిట్రోయెన్ సీ3 లభిస్తుంది. ఈ ఫైవ్ సీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీని పూర్తిగా ఇండియా కస్టమర్లకోసం లాంచ్ చేయడం విశేషం. ఇంజన్, ఫీచర్లు రెండు ఇంజిన్ ఆప్షన్స్‌లో లభ్యం. 5 స్పీడ్ మాన్యువల్, 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ 5,750 ఆర్పీఎం వద్ద 81 బీహెచ్పీ, 115 టార్క్‌ను అందిస్తుంది. 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ మోటార్ 5,750 ఆర్పీఎం వద్ద, 108 బీహెచ్పీని, 1150 ఆర్పీఎం వద్ద 190 ఎన్ఎం టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఫంకీ డిజైన్, V-ఆకారంలో LED డేటైమ్ రన్నింగ్ లైట్లు, హెడ్‌ల్యాంప్స్ అమర్చింది. డ్యూయల్-టోన్ ఎక్ట్సీరియర్, చుట్టూ బ్లాక్ ప్లాస్టిక్ క్లాడింగ్, డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్‌తో సిట్రోయెన్ సీ3 ముస్తాబైంది. డ్యూయల్-టోన్ డాష్ బోర్డ్ 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లే కనెక్టివిటీ,డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇంటీరియర్ ఫీచర్లుగా ఉన్నాయి. సిట్రోయెన్ సీ3 ధరలు లైవ్: రూ. 5,70,500 ఫీల్: రూ. 6,62,500 ఫీల్ వైబ్ ప్యాక్: రూ. 6,77,500 ఫీల్ డ్యూయల్ టోన్: రూ. 6,77,500 ఫీల్ డ్యూయల్ టోన్ వైబ్ ప్యాక్: రూ. 6,92,500 టర్బో ఫీల్ డ్యూయల్ టోన్ వైబ్ ప్యాక్: రూ. 8,05,500 దేశవ్యాప్తంగా ఉన్న అన్ని లా మైసన్ సిట్రోయెన్ ఫిజిటల్ షోరూమ్‌లలో వినియోగదారులకు కొత్త సీ3 డెలివరీలు నేటి (జూలై 20) నుండి ప్రారంభం. ఢిల్లీ, గుర్గావ్, ముంబై, పూణే, అహ్మదాబాద్, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్, కొచ్చి, చెన్నై, చండీగఢ్, జైపూర్, లక్నో, భువనేశ్వర్ వంటి 19 నగరాల్లోని లా మైసన్ సిట్రోయెన్ ఫైజిటల్ షోరూమ్‌లలో కొత్త సిట్రోయెన్ సీ3 రిటైల్‌గా అందుబాటులో ఉంది. -
అదిరిపోయే ఫీచర్లతో నథింగ్ ఫోన్ (1).. ధర ఎంతంటే!
ఎట్టకేలకు నథింగ్ ఫోన్ (1) స్మార్ట్ ఫోన్ భారత్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో విడుదలైంది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ ఫోన్ ఎలా ఉంది. ఫోన్ ధరెంత? ఫీచర్లు ఎలా ఉన్నాయనే విషయాల గురించి తెలుసుకుందాం. దేశీయ మార్కెట్లో శాంసంగ్, షావోమీ, రియల్ మీ స్మార్ట్ ఫోన్లకు గట్టి పోటీ ఇస్తూ విడుదలైన నథింగ్ ఫోన్ (1) ధర రూ.32,999గా ఉంది. వన్ ప్లస్ కో- ఫౌండర్ కార్ల్ పీ సొంతంగా స్మార్ట్ ఫోన్ నథింగ్‌ను విడుదల చేశారు. విడుదలైన ఈ ఫోన్ వన్ ప్లస్‌కు చెందిన 'వన్ ప్లస్ నార్డ్ 2టీ' కంటే నథింగ్ ఫోన్ (1) ఫోన్ బాగుంటుందని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నథింగ్ ఫోన్ (1)ఫీచర్లు నథింగ్ ఫోన్ (1) ఫోన్ 6.55 అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ ప్లస్, 4,500ఎంఏహెచ్ బ్యాటరీ, 33డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్, 15డబ్ల్యూ క్యూఐ వైర్లెస్ ఛార్జింగ్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌తో 10-బిట్ ఓఎల్ఈడీ డిస్ప్లే ప్యానల్, హెచ్డీఆర్10 ప్లస్ సపోర్ట్, 402పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 1200 నిట్స్ పీక్ బ్రైట్ నెస్, 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 240హెచ్ జెడ్ టచ్ శాంప్లింగ్ సదుపాయం ఉంది. దీంతో పాటు ఈ ఫోన్లో క్వాల్కం స్నాప్ డ్రాగన్ 778జీ ప్లస్ చిప్ సెట్, 12జీబీ ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256జీబీ యూఎఫ్ఎస్ 3.1స్టోరేజ్ సపోర్ట్ ఉంది. ఈ ఫోన్లో డ్యూయల్ కెమెరా సెటప్, 50 ఎంపీ సోనీ ఐఎంఎక్స్ 766 సెన్సార్ (ఓఐఎస్ ప్లస్ ఈఐఎస్),50 ఎంపీ శాంసంగ్ జేఎన్1 ఆల్ట్రా వైడ్ సెన్సార్(ఈఐఎస్)16 ఎంపీ సోని ఐఎంఎక్స్ 471 ఫ్రంట్ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి. వన్ ప్లస్ నార్డ్2 టీ వర్సెస్ నథింగ్ ఫోన్ (1) ధరలు మనదేశంలో నథింగ్ ఫోన్ (1), వన్ ప్లస్ నార్డ్2 మధ్య వ్యత్యాసం ఎలా ఉందో చెక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. నథింగ్ ఫోన్ మూడు స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. 8జీబీ ర్యామ్ ..128జీబీ స్టోరేజ్ ఫోన్ ధర రూ. 32,999, 8జీబీ ర్యామ్..256జీబీ ఫోన్ ధర రూ. 35,999, 12జీబీ ర్యామ్.. 256 జీబీ స్టోరేజ్ ఫోన్ ధర రూ.38,999గా ఉంది. ఇక వన్ ప్లస్ నార్డ్2 టీలో కేవలం రెండు వేరియంట్ స్టోరేజ్ సదుపాయం ఉంది. 8జీబీ ర్యామ్ 128జీబీ (రూ. 28,999), 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ మాత్రమే ఉంది. ఈ వేరియంట్ స్టోరేజ్ ఫోన్ ధర (రూ. 33,999).గా ఉంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
విడుదలైన పియాజియో ఆపే నెక్ట్స్‌ప్లస్, ధర ఎంతంటే!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన రంగంలో ఉన్న ఇటలీ సంస్థ పియాజియో భారత మార్కెట్లో ప్యాసింజర్ విభాగంలో ఆపే నెక్ట్స్ ప్లస్ త్రిచక్ర వాహనం ప్రవేశపెట్టింది. పరిచయ ఆఫర్లో ఎక్స్‌షోరూం ధర రూ.2.35 లక్షలు. పెట్రోల్, సీఎన్జీ, ఎల్పీజీ వేరియంట్లలో ఈ మోడల్‌ను రూపొందించారు. సీఎన్జీ వేరియంట్ కేజీకి 50 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇస్తుందని కంపెనీ ప్రకటించింది. ట్యూబ్‌లెస్ టైర్స్, విశాలమైన కూర్చునే స్థలం, డ్యూయల్ టోన్ సీట్స్, పారదర్శక కిటికీలు వంటి హంగులు ఉన్నాయి. కంపెనీ విక్రయిస్తున్న మోత్తం యూనిట్లలో సీఎన్జీ వాటా ఏకంగా 50 శాతముంది. డీజిల్ మోడళ్లకు మహమ్మారి ముందస్తు స్థాయిలో 20 శాతం లోపే డిమాండ్ ఉందని కంపెనీ తెలిపింది. -
ఆల్ న్యూ మారుతి బ్రెజా వచ్చేసింది, ధర ఎంతంటే?
సాక్షి,ముంబై: మారుతి సుజుకి కొత్త వెర్షన్ ఎస్యూవీ బ్రెజాను గురువారం లాంచ్ చేసింది. కంపెనీ చరిత్రలో తొలిసారిగా బ్రెజా 2022 మోడల్లో 6 ఎయిర్‌బ్యాగ్‌లను అందిస్తోంది. అలాగే మొదటిసారిగా ప్యాడిల్ షిఫ్టర్లను కూడా జోడించింది. మొత్తం 10 వేరియంట్లు, ఇందులో 7 మాన్యువల్ ట్రిమ్లుగా, 3 ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వేరియంట్లు అందుబాటులో ఉంటాయి.మూడు డ్యూయల్-టోన్ షేడ్స్‌తో సహా బ్రెజా తొమ్మిది రంగుల్లో తీసుకొచ్చింది. కొత్త మారుతి సుజుకి బ్రెజా కొత్త గ్రిల్, హెడ్లైట్లు, టెయిల్ లైట్లతో సహా ఎక్ట్సీరియర్‌లో డిజైన్‌లో అనేక మార్పులను పొందింది. 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్, వైర్లెస్ ఛార్జింగ్ డాక్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, పరిసర లైటింగ్, హెడ్ అప్ డిస్ప్లేస్, 360 డిగ్రీ కెమెరా ఇతర ఫీచర్లుగా ఉన్నాయి. ప్రీ-బుకింగ్‌లను ప్రారంభించిన 8 రోజుల్లోనే 45 వేలకుపైగా ఆర్డర్లను సాధించినట్టు కంపెనీ వెల్లడించింది. భారతదేశంలో సరికొత్త మారుతి సుజుకి బ్రెజా రూ. 7.99 లక్షల ప్రారంభ ధర (ఎక్స్-షోరూమ్)గా, హై ఎండ్ మోడల్ ధర రూ. 13.96 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. -
రాకింగ్ రాకేష్ హీరోగా 'ఊ అంటావా మావా ఊఊ అంటావా మావ'..
Oo Antava Mava Oo Oo Antava Mava Movie Title Launch: యశ్వంత్, రాకింగ్ రాకేష్, అనన్య, హిందోలా చక్రవర్తి, పూజ, సిమ్రాన్ ముఖ్య తారలుగా రేలంగి నరసింహా రావు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఊ అంటావా మావా ఊఊ అంటావా మావ’. తుమ్మల ప్రసన్న కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తి చేసుకుంది. ‘ఫిల్మ్ ఛాంబర్’ అధ్యక్షుడు కొల్లి రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి దామోదర్ ప్రసాద్‌లు ఈ చిత్రం టైటిల్‌ను అనౌన్స్ చేశారు. రేలంగి నరసింహారావు మాట్లాడుతూ–‘‘కామెడీతో కూడుకున్న హారర్ సినిమా ఇది. జూలై చివరి వారంలో సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘76 సూపర్ హిట్స్ ఇచ్చిన రేలంగి నరసింహారావు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా కూడా హిట్ అవుతుంది’’ అన్నారు తుమ్మల ప్రసన్నకుమార్. చిత్రానికి సంగీతం: సాబు వర్గీస్, కెమెరా: కంతేటి శంకర్. చదవండి:👇 నెట్టింట రకుల్ డ్యాన్స్ వీడియో వైరల్.. బాయ్‌ఫ్రెండ్ కామెంట్ ఏంటంటే ? వెనక్కి తగ్గిన నాగ చైతన్య.. 'థ్యాంక్యూ' రిలీజ్లో మార్పు అనసూయ కొత్త చిత్రం 'అరి'.. టైటిల్ లోగో ఆవిష్కరణ.. ఓటీటీలోనూ రికార్డులు క్రియేట్ చేస్తున్న 'ఆర్ఆర్ఆర్'..