
మాళవిక సతీశన్, అజయ్ ఘోష్, ప్రణవ చంద్ర తదితరులు కీలక పాత్రలుగా పోషించిన చిత్రం 'దోచేవారెవరురా'. ఈ సినిమా టీజర్‌ను శుక్రవారం (జులై 29) దర్శక ధీరుడు రాజమౌళి విడుదల చేశారు. ఈ సందర్భంగా మూవీ యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు.
SS Rajamouli Launches Dochevarevarura Teaser: ''నేను శివ నాగేశ్వరరావు సినిమాల్లోని కామెడీని బాగా ఎంజాయ్ చేస్తాను. ఇప్పుడు ఆయన నుంచి వస్తున్న 'దోచేవారెవరురా' సినిమా కూడా అంతే వినోదాత్మకంగా ఉంటుదని నమ్ముతున్నా'' అని తెలిపారు దర్శక ధీరుడు రాజమౌళి. 'మనీ', 'మనీ మనీ', 'సిసింద్రీ', 'హ్యాండ్సప్', 'మొండి మొగుడు పెంకీ పెళ్లాం', 'లక్కీ ఛాన్స్', 'పట్టుకోండి చూద్దాం' వంటి చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన డైరెక్టర్ శివ నాగేశ్వర రావు.
తాజాగా ఆయన దర్శకత్వంలో మాళవిక సతీశన్, అజయ్ ఘోష్, ప్రణవ చంద్ర తదితరులు కీలక పాత్రలుగా పోషించిన చిత్రం 'దోచేవారెవరురా'. ఈ సినిమా టీజర్‌ను శుక్రవారం (జులై 29) దర్శక ధీరుడు రాజమౌళి విడుదల చేశారు. ఈ సందర్భంగా మూవీ యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. ఓ ఆసక్తికర కథాంశంతో తెరకెక్కిన చిత్రమని, అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఆగస్టులో విడుదల చేస్తామని చిత్రబృందం తెలిపింది. ఈ సినిమాకు బొడ్డు కోటేశ్వరరావు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.