Shiva Nageswara Rao
-
సుక్కు... సౌండ్ బాగుంది
‘‘శివనాగేశ్వరరావుగారు ‘వన్స్ మోర్’ అని యూట్యూబ్ చానల్ పెట్టి, తన అనుభవాలను అబద్ధం లేకుండా చెబుతున్నారు. నేను ఆయనకు ఫ్యాన్’’ అన్నారు దర్శకుడు సుకుమార్. ప్రణవ చంద్ర, మాళవిక సతీషన్, అజయ్‌ఘోష్, బిత్తిరి సత్తి ప్రధాన పాత్రల్లో శివ నాగేశ్వరరావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దోచేవారెవరురా’. బొడ్డు కోటేశ్వరరావు నిర్మాత. రోహిత్ వర్ధన్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘సుక్కు.. సుక్కు ....’ అంటూ సాగే పాటని సుకుమార్ విడుదల చేసి, మాట్లాడుతూ – ‘‘సుక్కు.. సౌండ్ బాగుంది. నా పేరుతో వచ్చే ఈ పాటకు అజయ్ ఘోష్‌తో డాన్స్ చేయించాలనే ఆలోచన శివ నాగేశ్వర రావుగారికి రావడం హ్యాట్సాఫ్’’ అన్నారు. ఈ పాటను సిరాశ్రీ రాశారు. ‘‘సుక్కు..’ పాటని విడుదల చేయగలరా? అని సుకుమార్‌కి మెసేజ్ పెట్టాను.. ఓకే అని పది నిమిషాల్లోనే రిప్లయ్ వచ్చింది’’ అన్నారు శివ నాగేశ్వరరావు. ఈ సినిమాకి కెమెరా: ఆర్లి గణేష్, లైన్ ప్రొడ్యూసర్: శామ్ సన్. -
జక్కన్న విడుదల చేసిన 'దోచేవారెవరురా'.. ఆసక్తిగా టీజర్..
SS Rajamouli Launches Dochevarevarura Teaser: ''నేను శివ నాగేశ్వరరావు సినిమాల్లోని కామెడీని బాగా ఎంజాయ్ చేస్తాను. ఇప్పుడు ఆయన నుంచి వస్తున్న 'దోచేవారెవరురా' సినిమా కూడా అంతే వినోదాత్మకంగా ఉంటుదని నమ్ముతున్నా'' అని తెలిపారు దర్శక ధీరుడు రాజమౌళి. 'మనీ', 'మనీ మనీ', 'సిసింద్రీ', 'హ్యాండ్సప్', 'మొండి మొగుడు పెంకీ పెళ్లాం', 'లక్కీ ఛాన్స్', 'పట్టుకోండి చూద్దాం' వంటి చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన డైరెక్టర్ శివ నాగేశ్వర రావు. తాజాగా ఆయన దర్శకత్వంలో మాళవిక సతీశన్, అజయ్ ఘోష్, ప్రణవ చంద్ర తదితరులు కీలక పాత్రలుగా పోషించిన చిత్రం 'దోచేవారెవరురా'. ఈ సినిమా టీజర్‌ను శుక్రవారం (జులై 29) దర్శక ధీరుడు రాజమౌళి విడుదల చేశారు. ఈ సందర్భంగా మూవీ యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. ఓ ఆసక్తికర కథాంశంతో తెరకెక్కిన చిత్రమని, అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఆగస్టులో విడుదల చేస్తామని చిత్రబృందం తెలిపింది. ఈ సినిమాకు బొడ్డు కోటేశ్వరరావు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. -
పల్లెటూరి కథ
అన్నపూర్ణమ్మ నాయనమ్మగా, మాస్టర్ రవితేజ మనవడిగా నటించిన చిత్రం ‘అన్నపూర్ణమ్మ గారి మనవడు’. బాలాదిత్య, అర్చన హీరో హీరోయిన్లుగా నటించారు. యం.ఎన్.ఆర్ చౌదరి నిర్మించిన ఈ చిత్రానికి నర్రా శివ నాగేశ్వరరావు(శివ నాగు) దర్శకుడు. శుక్రవారం ఈ సినిమా థియేటర్లలో విడుదల కానున్న సందర్భంగా శివనాగు మాట్లాడుతూ– ‘‘ప్రతిఒక్కరి జీవితానికి అన్వయించుకునే కథ ఇది. పల్లెటూరి నేపథ్యంలో సినిమా ఉంటుంది. మిర్యాలగూడ అమ్మాయి అమృత ప్రేమకథ కూడా ఈ సినిమాలో మిళితమై ఉంటుంది. అమ్మాయి ప్రేమ వివాహాన్ని తండ్రి అంగీకరించని నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. కరోనా కారణంగా థియేటర్లు మూత పడటంతో ఈ చిత్రాన్ని ఓవర్సీస్లో అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదల చేశాం. ఇప్పుడు థియేటర్లు ఓపెన్ అవ్వటంతో ఇక్కడ విడుదల చేస్తున్నాం. కెరీర్ పరంగా ఇది నా పదకొండవ సినిమా. ఈ చిత్రం తర్వాత నేను తీసిన ‘దేవినేని’ కూడా విడుదలకు సిద్ధంగా ఉంది’’ అన్నారు. -
ఖైదీ తర్వాత దొంగ ఏంటి?
‘‘ఊపిరి’ సినిమాలో కార్తీ నటన అద్భుతం. తన గురించి చెప్పాలంటే వెయ్యిలో ఒక్కడు. మూడు సార్లు బెస్ట్ యాక్టర్‌గా ఫిలిం ఫేర్ అవార్డ్ గెలుచుకున్నారు. జీతూ చాలా తెలివైన డైరెక్టర్. ‘ఖైదీ’ కంటే ‘దొంగ’ చిత్రం పెద్ద హిట్ అవ్వాలి’’ అని సీనియర్ దర్శకులు శివనాగేశ్వర రావు అన్నారు. కార్తీ హీరోగా ‘దృశ్యం’ ఫేమ్ జీతు జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దొంగ’. వయాకామ్ 18 స్టూడియోస్, ప్యారలల్ మైండ్స్ పతాకాలపై నిర్మించిన ఈ సినిమా ఈ నెల 20న విడుదలవుతోంది. ఈ చిత్రాన్ని తెలుగులో హర్షిత మూవీస్ పతాకంపై రావూరి వి. శ్రీనివాస్ రిలీజ్ చేస్తున్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో కార్తీ మాట్లాడుతూ– ‘‘ఖైదీ’ తర్వాత ‘దొంగ’ ఏంటి? అని అందరూ అడుగుతున్నారు. రెండూ చిరంజీవిగారికి పెద్ద హిట్ ఇచ్చిన టైటిల్సే. స్క్రిప్ట్‌కి తగ్గట్టే ఈ రెండు పేర్లు పెట్టాం. ‘దొంగ’ కథ వినేటప్పుడు చాలా థ్రిల్లింగ్‌గా అనిపించింది. అక్కాతమ్ముడు రిలేషన్షిప్ ఇంట్రెస్టింగ్గా, ఎమోషనల్‌గా అనిపించింది. మా నాన్న క్యారెక్టర్ సత్యరాజ్‌గారు చేశారు. మా మూడు పాత్రలు సినిమాకి పిల్లర్స్ లాంటివి. ‘నా పేరు శివ, ఊపిరి’ కలిపితే వచ్చిన వైవిధ్యమైన సినిమాలా ‘దొంగ’ ఉంటుంది’’ అన్నారు. ‘‘దృశ్యం’ సినిమా తెలుగులో రీమేక్ అయి పెద్ద విజయం సాధించినప్పుడే తెలుగు ఇండస్ట్రీలో కూడా ఓ సినిమా చేయాలనుకున్నా. ఇప్పుడు ‘దొంగ’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో ఒక భాగం అయినందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు జీతూ జోసెఫ్. నటుడు సత్యరాజ్, డైలాగ్ రైటర్ హనుమా¯Œ చౌదరి, హీరోయి¯Œ నిఖిలా విమల్ తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్ జగన్‌కే మా మద్దతు: ఆర్పీఐ
విజయవాడ: వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డికి మా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఏపీ అండ్ తెలంగాణా) కన్వీనర్ పేరం శివ నాగేశ్వరరావు తెలిపారు. విజయవాడలో పేరం శివ నాగేశ్వరరావు మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా కన్నా ప్రత్యేక ప్యాకేజీయే ముద్దు అన్న వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. వైఎస్ జగన్ ప్రత్యేక హోదా విషయంలో ముందు నుంచి ఒకే మాట మీద నిలబడ్డారని కొనియాడారు. పోలవరం, రాజధానికి కేంద్రం నిధులు ఇస్తే చంద్రబాబు వాటికి లెక్కచూపటం లేదని మండిపడ్డారు. వైఎస్ జగన్‌ను దోషిగా చూపించాలని చంద్రబాబు ప్రతీ పసుపు కార్యకర్తను పురమాయించాడని ఆరోపించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ముద్దాయిగా చూపడానికి వీరేమైనా న్యాయమూర్తులా అని ప్రశ్నించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఉన్న కేసులలో నేరం నిరూపణ కాలేదని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా విషయంలో వైఎస్ జగన్‌కు కేసీఆర్ మద్ధతు ఇస్తే చంద్రబాబు నాయుడికి ఉలుకు ఎందుకని ప్రశ్నించారు. చంద్రబాబు కేజ్రీవాల్, మమతా బెనర్జీల మద్దతు తీసుకోలేదా అని అడిగారు. రాష్ట్రంలో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చేలా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఏపీలో తాము పోటీ చేస్తున్నా కూడా వైఎస్సార్సీపీకే మద్దతు తెలుపుతున్నామని చెప్పారు. -
మా ఇంటి కత్తిపీట...
నేల మీద నీరు మీద బ్రతకగల ఏకైక ప్రాణి కప్ప. అందుకే దానిని ఉభయ చరము అంటాం. అదే విధంగా మాంసాహారుల్ని, శాకాహారుల్ని సంతృప్తి పరచగల ఏకైక తెలుగువారి వంటకం!! మామిడికాయ పచ్చడి. దీనికున్న ప్రాముఖ్యం అంతా ఇంతా కాదు. ముద్దపప్పు, మామిడికాయ, నెయ్యి ఈ మూడింటి కాంబినేషన్‌కి మరో ప్రత్యామ్నాయం లేదంటే నమ్మండి. మందు కొట్టిన వాడికి మంచింగ్లో కొరకటానికి, అన్నం తినేటప్పుడు పెరుగన్నంలో నంజుకీ ఉపయోగపడే బహుళార్ధకసాధకం మామిడికాయ పచ్చడి.నా చిన్నప్పుడు మా అమ్మమ్మగారి ఊరు నుండి మామిడి కాయలు వచ్చేవి. వాటిని కడిగి, శుభ్రంగా గుడ్డతో తుడిచి కత్తిపీట కిందపెట్టి, పైన కత్తిని వుంచి, పిడి మీద ఒక గుద్దు గుద్దితే, ఆకాయ రెండు ముక్కలైపోయేది, మరల ఆ రెండు ముక్కల్ని నాలుగు ముక్కులు, ఆ తర్వాత 8 ముక్కలు... ఇలా చేస్తే ఒకకాయకి 16 ముక్కలు వచ్చేవి, ఈలోపు పిల్లలు అటుగావచ్చి ఒక ముక్క, ఇటుగా వచ్చి ఒక ముక్క తీసుకునే వాళ్ళం. కొరికితే పుల్లగా వుండేవి.... అయినా ఇష్టంగా తినేవాళ్ళం... తర్వాత ఆవపిండి కలిపి, నునెలో వేసి జాడీలలోకి పట్టి, వాటిని మచ్చు (అటక) మీద పెట్టి రెండు నెలల తర్వాత తీస్తే, ముక్కలు బాగా నూనె పీల్చుకుని, పెళ్ళీడు కొచ్చిన ఆడపిల్లల్లా తయారయ్యేవి. ఇక పోతే ఆ కత్తి కింద మామిడి ముక్కల్ని కొడితే అది సిక్సర్ కోసం పరిగెత్తే బంతిలా వెళ్లి అటుగా వస్తున్న మా మావయ్య కణతకి తగిలిందొకసారి.... లక్ష్మణస్వామి మూర్చిల్లినట్టుగా అయింది మావయ్య పని. ఆయనకి ఫస్ట్‌ఎయిడ్ చేసి, మరల ఆయన్ని మామూలు మనిషిని చేసేసరికి తలప్రాణం తోకకు వచ్చింది. ఈ కత్తి పీట చాలా ప్రత్యేకమైనది, చాలా పడుచుగా ఉంటుంది. పొరపాటున వ్రేలు దానికింద పడితే వేలు కట్ అయిన సంఘటనలు కూడా నాకు తెలుసు. ఎవరు మామిడికాయ పచ్చడి పెట్టుకోవాలన్నా కత్తిపీట మాదే... ఇంట్లో అందరూ తలా ఒకరికి మాట ఇస్తే, తేడాలు వస్తున్నాయని, ఆ బాధ్యత మా నాయనమ్మకి అప్పగించారు. ఆమె ఎవరికి ఏ రోజు ఇస్తానని మాట ఇచ్చిందో, దానిని క్యాలెండర్ మీద రాసుకునేది... అంటే ఇప్పుడు హీరోయిన్ కాల్షీట్లు చూసే మేనేజర్‌లాగా అన్నమాట... ఒక రోజు మా స్కూల్లో వేసే నాటకానికి ఒక చైల్డ్ ఆర్టిస్ట్ కావాల్సివచ్చింది. ఉత్సాహంగా పేర్లు ఇచ్చాం చాలామంది. అందర్నీ స్క్రూటినీ చేసి ఇద్దరి ఫైనల్స్‌కి వచ్చాం. నేనూ... ఇంకో ఫ్రెండ్...నా దురదృష్టం, ఆ రోజు వాడింట్లో మామిడికాయ పచ్చడి పట్టారు. వాడు వాళ్ల అమ్మని, నాన్నని తీసుకుని రాత్రికి రాత్రే మాస్టారి ఇంటికి వెళ్ళి మామిడికాయ జాడీ మాస్టారికి ఇచ్చారు. అంతే రెండో రోజు స్కూల్లో ఆ వేషానికి వాడిని తీసుకుంటున్నట్టు అధికారికంగా ప్రకటించాడు. తర్వాత తెలిసింది నాకు ఇదంతా మామిడికాయ పచ్చడి మహత్యం అని... అదీ నాకు తెలిసిన మామిడికాయ పచ్చడి గురించిన జ్ఞాపకాలు... - శివ నాగేశ్వరరావు -
ఆ ఒక్కటీ అడిగెయ్...
అప్పట్లో ఈవీవీ సత్యనారాయణ ‘ఆ ఒక్కటీ అడక్కు’ అన్నారు. ఇప్పుడేమో శివనాగేశ్వరరావు ‘ఆ ఒక్కటీ అడిగెయ్’ అంటున్నారు. కొంత విరామం తర్వాత శివనాగేశ్వరరావు దర్శకత్వంలో రూపొందనున్న చిత్రానికి ఈ టైటిల్ ఖరారు చేశారు. రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందనున్న ఈ సినిమాకు ఇప్పటికే కథ సిద్ధమైంది. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడమే లక్ష్యంగా శివనాగేశ్వరరావు గత కొన్నాళ్లుగా కసరత్తులు చేసి పక్కాగా స్క్రిప్టు తయారు చేసుకున్నారు. ప్రస్తుతం తారాగణం ఎంపికలో ఆయన బిజీగా ఉన్నారు. ఇతర వివరాలు త్వరలోనే అధికారికంగా తెలుస్తాయి.