పల్లెటూరి కథ | Annapurnamma Gari Manavadu released on 29 january | Sakshi
Sakshi News home page

పల్లెటూరి కథ

Published Thu, Jan 28 2021 5:23 AM | Last Updated on Thu, Jan 28 2021 5:23 AM

Annapurnamma Gari Manavadu released on 29 january - Sakshi

అన్నపూర్ణమ్మ నాయనమ్మగా, మాస్టర్‌ రవితేజ మనవడిగా నటించిన చిత్రం ‘అన్నపూర్ణమ్మ గారి మనవడు’. బాలాదిత్య, అర్చన హీరో హీరోయిన్లుగా నటించారు. యం.ఎన్‌.ఆర్‌ చౌదరి నిర్మించిన ఈ చిత్రానికి నర్రా శివ నాగేశ్వరరావు(శివ నాగు) దర్శకుడు. శుక్రవారం ఈ సినిమా థియేటర్లలో విడుదల కానున్న సందర్భంగా శివనాగు మాట్లాడుతూ– ‘‘ప్రతిఒక్కరి జీవితానికి అన్వయించుకునే కథ ఇది. పల్లెటూరి నేపథ్యంలో సినిమా ఉంటుంది. మిర్యాలగూడ అమ్మాయి అమృత ప్రేమకథ కూడా ఈ సినిమాలో మిళితమై ఉంటుంది. అమ్మాయి ప్రేమ వివాహాన్ని  తండ్రి అంగీకరించని నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. కరోనా కారణంగా థియేటర్‌లు మూత పడటంతో ఈ చిత్రాన్ని ఓవర్సీస్‌లో అమెజాన్‌ ప్రైమ్‌ ద్వారా విడుదల చేశాం. ఇప్పుడు థియేటర్లు ఓపెన్‌ అవ్వటంతో ఇక్కడ విడుదల చేస్తున్నాం. కెరీర్‌ పరంగా ఇది నా పదకొండవ సినిమా. ఈ చిత్రం తర్వాత నేను తీసిన ‘దేవినేని’ కూడా విడుదలకు సిద్ధంగా ఉంది’’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement