Baladitya
-
బూట్ కట్ బాలరాజు బ్లాక్ బస్టర్ అవుతుంది..!
-
‘మా ఊరి పొలిమేర 2’ థ్యాంక్స్ మీట్ (ఫొటోలు)
-
Maa Oori Polimera 2 Review: ‘మా ఊరి పొలిమేర 2’ రివ్యూ
టైటిల్: మా ఊరి పొలిమెర2 నటీనటులు: సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్ల, బాలాదిత్య, రాకేందు మౌళి, గెటప్ శ్రీను, సాహితి దాసరి తదితరులు నిర్మాతలు: గౌరీ కృష్ణ దర్శకత్వం: డాక్టర్ అనిల్ విశ్వనాథ్ సంగీతం: జ్ఞాని సినిమాటోగ్రఫీ: ఖుషేందర్ రమేష్ రెడ్డి ఎడిటింగ్ : శ్రీ వర విడుదల తేది: నవంబర్ 3, 2023 రెండేళ్ల క్రితం ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో రిలీజైన ‘మా ఊరి పొలిమేర’ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. నేరుగా ఓటీటీలో రిలీజ్ అయినప్పటికీ.. ఊహించని విజయం సాధించడమే కాకుండా..సీక్వెల్‌పై ఆసక్తిని పెంచింది. అందుకే ‘మా ఊరి పొలిమేర 2’పై ముందు నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పార్ట్ 1కి వచ్చిన రెస్పాన్స్ చూసి ఈ సీక్వెల్‌ని థియేటర్స్‌లో రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు మేకర్స్. అందుకు తగ్గట్టే భారీ స్థాయిలో ప్రమోషన్స్‌ని నిర్వహించారు. దానికి తోడు ఇటీవల రిలీజైన ట్రైలర్ సినిమాపై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(నవంబర్ 3)థియేటర్స్‌లో రిలీజైన ‘మా ఊరి పొలిమేర 2’ప్రేక్షకులను ఏ మేరకు భయపెట్టింది? రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. ‘మా ఊరి పొలిమెర’ మూవీ క్లైమాక్స్‌లో కొమురయ్య అలియాస్ కొమిరి(సత్యం రాజేశ్) బతికి ఉన్నట్లు చూపించారు. అంతేకాదు అతను చేతబడి చేసి చంపిన గర్భవతి కవిత(రమ్య) కూడా బతికున్నట్లు, కొమిరితో కలిసి వెళ్లినట్లు చూపిస్తూ ముగించారు. అక్కడ నుంచి పార్ట్ 2 కథ ప్రారంభం అవుతుంది. చేతబడి చేస్తూ ఊరి సర్పంచ్, అతని కూతురు చావులను కారణమైన కొమురయ్యను పట్టుకునేందుకు వెళ్లిన అతని తమ్ముడు, కానిస్టేబుల్ జంగయ్య(బాలాదిత్య) కనిపించకుండా పోతాడు. జంగయ్య మిస్సింగ్ కేసు కొత్తగా వచ్చిన ఎస్సై(రాకేందు మౌళి) చేతికి వెళ్తుంది. అతను కొమురయ్య భార్య లక్ష్మీ(కామాక్షి భాస్కర్ల), స్నేహితుడు బలిజ(గెటప్ శ్రీను)లను అనుమానిస్తాడు. ఓ సారి శబరి వెళ్లిన బలిజకు కొమిరి కనిపిస్తాడు. అతన్ని ఫాలో అవుతూ అడవిలోకి వెళ్తాడు. అసలు ఏం జరిగిందనే విషయాన్ని బలిజకు వివరిస్తాడు కొమురయ్య. అసలు కొమురయ్య ఎందుకు కేరళ వెళ్లాడు? చనిపోయిన రమ్య మళ్లీ ఎలా బతికొచ్చింది? బలిజ భార్య రాముల(సాహితి దాసరి) ఇంటి నుంచి ఎందుకు వెళ్లిపోయింది? ఆ ఊరిలో ఉన్న గుడి వందేళ్ల కిత్రం ఎందుకు మూసేశారు? ఆ గుడికి కొమిరి చేతబడులకు ఉన్న సంబంధం ఏంటి? అన్న కోసం వెళ్లిన జంగయ్య ఎలా మిస్ అయ్యాడు? భర్త కొమురయ్య గురించి లక్ష్మీ తెలుసుకున్న నిజాలేంటి? చివరకు ఏం జరిగింది? అనేది తెలియాలంటే.. థియేటర్స్‌లో ‘మా ఊరి పొలిమేర 2’చూడాల్సిందే. ఎలా ఉందంటే.. మర్డర్ మిస్టరీకి బ్లాక్ మ్యాజిక్(చేతబడి) అంశాన్ని జోడించి తెరకెక్కించిన ‘మా ఊరి పొలిమేర’ అందరిని భయపెట్టింది. ఆ చిత్రానికి సీక్వెల్ అంటే.. అంతకు మించిన ట్విస్టులు, భయపెట్టే సీన్స్ ఉంటాయని అంత భావించారు. కానీ అలాంటి అంచనాలతో వెళ్లిన ఆడియన్స్‌ని ‘మా ఊరి పొలిమేర 2’ అంతగా ఆకట్టుకోదు. మొదటి భాగానికి వచ్చిన హైప్ వల్ల దర్శకుడిపై ఒత్తిడి పెరిగినట్లు అనిపించింది. ఆడియన్స్‌కి ఊహించని ట్విస్టులు ఇవ్వాలనుకొని కథ, కథనంపై ఎక్కువ ఫోకస్ పెట్టలేదు. చేతబడి సీన్స్ బాగున్నప్పటికీ.. పార్ట్ 1లోలాగా కన్విన్సింగ్‌గా అనిపించవు. పైగా కొన్ని సీన్స్‌కి అయితే లాజిక్కే ఉండదు. ప్రేక్షకుడిని థ్రిల్‌కి గురి చేయాలనుకొనే..టిస్టులను రాసుకున్నాడు కానీ అవి కథకు ఏ మేరకు అవసరమనేది పట్టించుకోలేదు. స్క్రీన్‌ప్లే విషయంలో కూడా జాగ్రత్త వహించాల్సింది. ప్రతిసారి ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌ని చూపించడం కారణంగా..ఏది గతం, ఏది ప్రస్తుతం అనే కన్యూఫ్యూజన్ ఏర్పడుతుంది. అయితే పార్ట్ 1 చూడకపోయినా.. పార్ట్ 2 చూసే విధంగా కథను తీర్చి దిద్దాడు దర్శకుడు. ఈ విషయంలో అతన్ని అభినందించాల్సిందే. పార్ట్ 1 మొత్తాన్ని ఓ నాలుగు నిమిషాల్లో చూపించి పార్ట్ 2ని ప్రారంభించాడు. ఆ తర్వాత కేరళలో ఉన్న కొమురయ్యను చూపించి.. కథను అతని భార్య వద్దకు తీసుకెళ్లాడు. కొత్తగా వచ్చిన ఎస్సై ఇన్వెస్టిగేషన్ ప్రారంభించినప్పటి నుంచి కథలో వేగం పెరుగుతుంది. కేరళ అడవుల్లో కొమురయ్య చేసే పూజలు కొంతవరకు భయపెడతాయి. ఆ తర్వాత కథ అక్కడక్కడే సాగినట్లు అనిపిస్తుంది. కొమురయ్య, బలిజ కలిశాక వచ్చే ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్ కథపై ఆసక్తిని పెంచుతాయి. అసలు కవిత ఎలా బతికొచ్చింది? ఎందుకు చేతబడి చేయాల్సి వచ్చింది? అతని కలలోకి ఊర్లో ఉన్న గుడి రహస్యాలు ఎందుకు వస్తున్నాయి? అనే సన్నివేశాలను ఆసక్తికరంగా చూపించాడు. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. అయితే ద్వితియార్థంలో కూడా కథ రొటీన్‌గా రొటీన్‌గా సాగుతుంది. కానీ చివర్లో వచ్చే కొన్ని ట్విస్టుల మాత్రం ఊహించని విధంగా ఉంటాయి. గుడిలో కొమురయ్య చేసే పూజకు సంబంధించిన సీన్ భయపెడుతుంది. పార్ట్ వన్‌లో మర్డర్ మిస్టరికీ చేతబడిని యాడ్ చేస్తే.. ఇందులో గుప్త నిధుల అనే పాయింట్‌ని జత చేశారు. దీంతో కథ కాస్త ‘కార్తికేయ’ చిత్రాన్ని గుర్తు చేస్తుంది. పార్ట్ 1లో లాగే పార్ట్ 2లో కూడా పలు ప్రశ్నలు లేవనెత్తి.. వాటిని సమాధానం పార్ట్ 3లో ఉంటుందని ముగించేశాడు. ఎవరెలా చేశారంటే.. కొమురయ్య పాత్రలో సత్యం రాజేశ్ ఒదిగిపోయాడు. పార్ట్ 1లో నటించిన అనుభవం ఉంది కాబట్టి.. ఇందులో ఈజీగా నటించేశాడు. కొన్ని చోట్ల అతని ఎక్స్ప్రెషన్స్ భయపెడతాయి. కొమిరి భార్య లక్ష్మీ పాత్రలో కామాక్షి భాస్కర్ల చక్కగా నటించింది. పార్ట్ 1తో పోలిస్తే ఇందులో ఆమెకు బలమైన సన్నివేశాలు ఉన్నాయి. క్లైమాక్స్‌లో ఆమె ఇచ్చిన ట్విస్ట్ అదిరిపోతుంది. ఇక జంగయ్యగా నటించిన బాలాదిత్య తన పాత్ర పరిధిమేర నటించాడు. అయితే పార్ట్ 1తో పోలిస్తే.. ఇందుతో అతని పాత్ర నిడివి చాలా తక్కువ. బలిజ పాత్రలో గెటప్ శ్రీను జీవించేశాడు. ఎస్సైగా రాకేందు మౌళి, సర్పంచ్‌గా రవివర్మతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. ఈ సినిమాకు ప్రధాన బలం జ్ఞాని నేపథ్య సంగీతం. తనదైన బీజీఎంతో కొన్ని చోట్ల భయపెట్టాడు. ఖుషేందర్ రమేష్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ పనితీరు పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
'Maa Oori Polimera 2': ‘మా ఊరి పొలిమేర -2’ ప్రీరిలీజ్ వేడుక (ఫొటోలు)
-
బిగ్‌బాస్‌లో అతనొక్కడే నాకు తెలుసు.. ఎందుకంటే?: బాలాదిత్య కామెంట్స్!
టాలీవుడ్ నటుడు బాలాదిత్య గురించి పరిచయం అక్కర్లేదు. చంటిగాడు సినిమాతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. గతేడాది బిగ్‌బాస్ సీజన్లో పాల్గొన్న బాలా.. గతంలో మా ఊరి పొలిమేర చిత్రంతో ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం ఈ ఏడాదిలో ఈ సినిమాకు మా ఊరి పొలిమేర -2 పేరుతో సీక్వెల్ రాబోతోంది. బాలాదిత్యతో పాటు సత్యం రాజేష్, గెటప్ శ్రీను, కామాక్షి భాస్కర్ల, అక్షత ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం నవంబర్ 3న ప్రేక్షకులను అలరించనుంది. గతేడాది బిగ్‌బాస్ రియాలిటీ షోతో మరింత గుర్తింపు తెచ్చుకున్న బాలాదిత్య తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ప్రస్తుత సీజన్లో బిగ్‌బాస్ గురించి తన అభిప్రాయాలను పంచుకున్నారు. బాలాదిత్యా మాట్లాడుతూ.. 'బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నవారిలో అంబటి అర్జున్ నాకు బాగా తెలుసు. ఎందుకంటే నేను, అతను జిమ్ మేట్స్. అర్జున్ బాగా స్మార్ట్‌గా ఆడుతున్నాడు. బిగ్‌బాస్ నాకు చాలా నేర్పించింది. ఈ రియాలిటీ షో అనేది ఓ గేమ్. ఇందులో కొంతమంది ఫేక్లానే అనిపిస్తారు. కొందరు జెన్యూన్లా కనిపిస్తారు. హౌస్‌లో ఎంత తెలివిగా ఆడుతున్నామనేదే మనకు ముఖ్యం. పల్లవి ప్రశాంత్, రతిక గురించి తెలుసు. హౌస్‌లో మన ఫర్మామెన్స్ మాత్రమే ఆడియన్స్ చూస్తారు. నువ్వు ఎంత లాజిక్‌గా ఆడుతున్నావనేదే ఆడియన్స్ గుర్తిస్తారు. ఐదు వారాలా తర్వాత వచ్చినవారికి కాస్తా అడ్వాంటేజ్ ఉంటుంది. అదే సమయంలో డిస్ అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్‌ను మీరు ఎంత బాగా ఆడుతున్నారనేదే ముఖ్యం ' అని చెప్పుకొచ్చారు. -
పొలిమేరలో...
సత్యం రాజేష్, డా. కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, బాలాదిత్య, రవి వర్మ, చిత్రం శ్రీను, అక్షత శ్రీనివాస్ ముఖ్య పాత్రల్లో ఓ చిత్రం రూ΄పొందింది. ‘మా ఊరి పొలిమేర’ చిత్రానికి సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. డా. అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో గౌరు గణబాబు సమర్పణలో గౌరికృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. పల్లెటూరి నేపథ్యంలో, ఊరి పొలిమేర చుట్టూ సాగే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించారు. సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్రానికి సంగీతం: గ్యాని, కెమెరా: ఖుషేందర్ రమేష్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎ న్ .సి. సతీష్ కుమార్. -
బయటకు వచ్చాక గీతూ తల్లికి ఫోన్ చేశాను: బాలాదిత్య
బిగ్‌బాస్ షోలో మిస్టర్ పర్ఫెక్ట్గా పేరు తెచ్చుకున్నాడు బాలాదిత్య. కానీ ఒక్క సిగరెట్ కోసం ఏడ్చి, నానా రభస చేసి, గీతూపై నోరు జారి పెద్ద తప్పే చేశాడు. అయినా సరే అప్పటికే మంచి పేరు ఉండటంతో బాలాదిత్య ఆఫ్ట్రాల్ సిగరెట్ కోసం అంత గొడవపడ్డా అతడికే మద్దతు పలికారు ఫ్యాన్స్. బదులుగా అతడిని ఎమోషనల్‌గా బ్లాక్మెయిల్ చేసిన గీతూను బయటకు పంపించి తగిన బుద్ధి చెప్పారు. తాజాగా అతడు సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. 'నేను బిగ్‌బాస్ షో గెలవలేకపోవచ్చు. కానీ మన ఇంట్లో ఇలాంటి మనిషి ఉండాలని ఎంతోమంది కోరుకున్నారు. అది చాలు.. నన్ను పెంచిన తల్లిదండ్రులు, గురువుల వల్లే నాకు అంతటి పేరొచ్చింది. ఇకపోతే నాకు సిగరెట్ వీక్నెస్ కాదు. కానీ బయటకు అది నెగెటివ్‌గా వెళ్తుందని అర్థమై సిగరెట్లు తాగడమే మానేశాను. సిగరెట్ల విషయంలో గీతూను తిట్టినందుకు ఆమె తల్లికి ఫోన్ చేసి సారీ చెప్పాను' అని చెప్పాడు బాలాదిత్య. చదవండి: టాప్ 10లో నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ ఎవరంటే? శ్రీహాన్.. మస్తు షేడ్స్ ఉన్నయ్‌రా నీలో.. ఆట్ కమల్ హాసన్ -
బిగ్ బాస్ 6 కంటెస్టెంట్ బాలాదిత్య తో " స్పెషల్ చిట్ చాట్ "
-
Bigg Boss: బాలాదిత్య, వాసంతి పారితోషికం ఎంతో తెలుసా?
ఎప్పుడైతే బిగ్‌బాస్ గేట్లు ఎత్తాడో అప్పటినుంచి షో కాస్త ఇంట్రస్టింగ్‌గా మారింది. ఆమాత్రం కోపం చూపించకపోయుంటే కంటెస్టెంట్లలో ఈ మాత్రం ఫైర్ కూడా ఉండేది కాదు. కానీ షో మొదలై పది వారాలు కావస్తున్నా ఇప్పటికీ తుప్పాస్ కారణాలతో నామినేట్ చేసుకుంటూనే ఉన్నారు. అలా కొందరు సిల్లీ రీజన్స్‌తో నామినేషన్లోకి రావడం, ఎలిమినేట్ కావడమూ చకచకా జరిగిపోయాయి. ఇకపోతే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ దెబ్బకు బాలాదిత్య, వాసంతి ఇద్దరూ హౌస్‌ను వీడారు. అయితే ఏమాత్రం నెగెటివిటీ లేకుండా బయటకు రావడం విశేషమనే చెప్పాలి. కాగా వీరికి పది వారాలకుగానూకి ఎంత పారితోషికం ముట్టింది? అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం బాలాదిత్య పది వారాలకుగానూ రూ. 6.5 లక్షలు తీసుకున్నాడట. బాలనటుడిగా కెరీర్ మొదలుపెట్టి సినిమాల్లో, సీరియల్స్‌లో నటుడిగా రాణించి గుర్తింపు తెచ్చుకున్న అతడికి ఆ మాత్రం పారితోషికం ఇవ్వడంలో తప్పేం లేదంటున్నారు అభిమానులు. ఇకపోతే వాసంతి హౌస్‌కు వచ్చేవరకు ఆమె పెద్దగా ఎవరికీ తెలియదు. షో ద్వారా పాపులారిటీ సంపాదించుకోవాలనుకుంది. అన్నట్లుగానే తన అందంతో అందరినీ పడేసింది. పదివారాలకు ఆమె దాదాపు మూడు లక్షలకు అటూఇటుగా పారితోషికం అందుకున్నట్లు తెలుస్తోంది. అంటే బిగ్‌బాస్ టీమ్ ఆమెకు వారానికి పాతికవేల నుంచి ముప్పై వేల వరకు లెక్క సెట్ చేసినట్లు సమాచారం. చదవండి: ఆ ఇద్దరే టార్గెట్, నామినేషన్స్‌లో ఎవరున్నారంటే? ప్రేమకు కండీషన్స్ పెట్టారు, సూసైడ్ అటెంప్ట్ చేశా: ఆర్జే సూర్య -
గీతూ ఎలిమినేషన్‌కు కారణం నేను కాదు: బాలాదిత్య
బిగ్‌బాస్ హౌస్‌లో అందరివాడుగా పేరుతెచ్చుకున్నాడు బాలాదిత్య. కాకపోతే అతి మంచితనం, అతి స్పీచులు ఎక్కువవడంతో మిగతా హౌస్మేట్స్ ఆయన ఏం చెప్పినా సోదిగా ఫీలయ్యేవారు. గీతూ అయితే అతడు మాట్లాడుతుంటే మధ్యలోనే కట్ చేసేది. అతడి నోరు మూయించేందుకు ఇమ్మెచ్యూర్ అని పెద్ద మాటే అనేసింది. కొన్ని క్షణాల పాటు బాలాదిత్య హర్టయినా తనకు తెలీక ఆ మాట అనేసిందేమోనని లైట్ తీసుకున్నాడు. కానీ ఓ టాస్క్‌లో గీతూ తన సిగరెట్లు దాచి వీక్నెస్ మీద దెబ్బ కొట్టడాన్ని తీసుకోలేకపోయాడు. కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక సిగ్గుందా? మనిషివేనా? అని నానామాటలు అన్నాడు. అయినా గీతూ దాన్ని పెద్ద రాద్ధాంతం చేయకుండా ఒంటరిగా కంటనీరు పెట్టుకుంది. తాజాగా యాంకర్ శివ ఇదే విషయాన్ని బాలాదిత్యను అడిగాడు. షో నుంచి బయటకు వచ్చేసిన ఆదిత్య బిగ్‌బాస్ కెఫె ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా శివ.. నేషనల్ టెలివిజన్‌లో ఒక అమ్మాయిని సిగ్గుందా? అనడం కరెక్టా? అని అడిగాడు. దీనికి అతడు ఆ మాట తప్పు కానీ నా బాధ తప్పు కాదని సమాధానమిచ్చాడు. ఆఫ్టరాల్ ఒక్క సిగరెట్ అన్న నువ్వు అంత సీన్ చేయడం అవసరమా? మీ వల్లే గీతూ వెళ్లిపోయిందని శివ పేర్కొన్నాడు. దీన్ని అంగీకరించని బాలాదిత్య ఎవరు చేసిన పనికి వాళ్లే బాధ్యులు అని స్పష్టం చేశాడు. చదవండి: రాజకీయాల్లోకి వస్తా: గీతూ రాయల్ ఎలాంటి మరక లేకుండా మంచి పేరుతో బయటకు వచ్చిన బాలాదిత్య -
చివరి నిమిషంలో ట్విస్ట్! బాలాదిత్యతో పాటు వాసంతి అవుట్!
Bigg Boss Telugu 6, Episode 70: బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్లో వరుసగా ఊహించని కంటెస్టెంట్లు ఎలిమినేట్ అవుతూ వస్తున్నారు. గీతూ ఎలిమినేషన్ మరవకముందే బాలాదిత్య ఎలిమినేట్ అయ్యాడు. దీంతో షాక్‌లోకి వెళ్లిపోయాడు ఆది. తాను స్ట్రాంగ్ అనుకున్న కంటెస్టెంట్లు అవుట్ అవుతున్నారేంటని అయోమయానికి లోనయ్యాడు. మరి వెళ్లేముందు బాలాదిత్య హౌస్‌మేట్స్‌కు ఎలాంటి సూచనలిచ్చాడో చూద్దాం.. మొన్నటి కెప్టెన్సీ టాస్క్‌ను ప్రస్తావించిన నాగార్జున.. ఆ టాస్క్‌లో రేవంత్ సంచాలక్‌గా వ్యవహరించాడని చెప్పాడు. అటు ఇనయ కోపంలో ఏది పడితే అది అనేస్తుందని సీరియస్ అయ్యాడు. నామినేషన్స్‌లో ఫైమాను అడల్ట్ కామెడీ స్టార్ అన్నావు, అది తప్పని హెచ్చరించడంతో ఆమె సారీ చెప్పింది. అనంతరం హౌస్‌మేట్స్‌తో డాక్టర్- పేషెంట్ గేమ్ ఆడించాడు నాగ్. కొన్ని జబ్బుల పేర్లున్న కార్డులు పంపించి అది ఎవరికి సూటవుతుందో వారి మెడలో వేయాలన్నాడు నాగ్. అంతేకాకుండా ఆ జబ్బుకు తగ్గట్లు మందు ఇవ్వాలన్నాడు. ముందుగా శ్రీసత్య.. రేవంత్‌కు మొండితనం ఎక్కువని చెప్పి నిమ్మరసం తాగించింది. ఇనయ.. వాసంతికి ఇమ్మెచ్యురిటీ ఎక్కువని, మనిషి ఎదిగినా తన బ్రెయిన్ ఎదగలేదంటూ ఉసిరి రసం ట్రీట్మెంట్ ఇచ్చింది. రాజ్.. ఇనయ వితండవాదం చేస్తుందని కాకరకాయ రసం తాగించాడు. ఫైమా.. ఇనయకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువంటూ ఆమెకు నిమ్మరసం అందించింది. నమ్మకద్రోహం చేసిందంటూ వాసంతితో ఉసిరి రసం తాగించింది మెరీనా. ఇనయ ఇగోతో గేమ్ ఆడుతుందన్నాడు ఆదిరెడ్డి. శ్రీసత్యకు కక్కుర్తి ఎక్కువన్నాడు రేవంత్. ఇనయకు తలపొగరు ఎక్కువని చెప్పాడు రోహిత్. శ్రీసత్యకు ఇగో ఎక్కువంది కీర్తి. ఫైమాకు స్వార్థమెక్కువని బాలాదిత్య, రేవంత్‌కు స్వార్థమెక్కువని శ్రీహాన్ అభిప్రాయపడ్డారు. శ్రీసత్య మానిప్యులేటర్ అని వాసంతి అనగా అది నేనూ ఒప్పుకుంటానన్నాడు నాగ్. అనంతరం బాలాదిత్య ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు. దీంతో అందరూ షాకయ్యారు. స్టేజీపైకి వచ్చిన బాలాదిత్య హౌస్‌మేట్స్‌కు విలువైన సూచనలు చేశాడు. ఆదిరెడ్డిని గట్టిగా అరవకుండా కాన్ఫిడెంట్‌గా మాట్లాడమన్నాడు. స్ట్రాటజీలు ఫెయిరా? అన్ఫెయిరా? కాస్త చూసుకొని ఆడమని ఫైమాకు సలహా ఇచ్చాడు. రాజ్.. ఏదైనా క్లారిటీగా చెప్పాలన్నాడు. రోహిత్‌ను టెంపర్ లూజవ్వద్దని సూచించాడు. మెరీనా ఇండిపెండెంట్‌గా ఆడాలన్నాడు. గీతూ తర్వాత ఎక్కువ కనెక్ట్ అయింది సత్యకే అంటూ కోపంలో మాటలు వదిలేయొద్దని కోరాడు. శ్రీహాన్ తెలివైనవాడని, కాబట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకోమన్నాడు. రేవంత్ రౌద్రంగా కనిపించే పసిపిల్లాడని చెప్పాడు. అగ్రెషన్ ఒక్కటి తగ్గించుకోవాలని సూచించాడు. ఇనయకు ఏదైనా చెప్పే ధైర్యం ఉంది, కానీ చెప్పే విధానం సరిగా లేదంటూ దాన్ని సరిచేసుకోమన్నాడు. కీర్తిని ఎక్కువ ఆలోచించొద్దన్నాడు. వాసంతిని ఓటమి నుంచి మోటివేట్ అయి గేమ్ ఆడాలని పేర్కొన్నాడు. ఇక హౌస్‌లో ఏ నెగెటివిటీ మూటగట్టుకోకుండా స్వచ్ఛమైన మనసుతో మంచివాడన్న బిరుదుతోనే బయటకు వచ్చేశాడు బాలాదిత్య. రేపటి ఎపిసోడ్లో మెరీనాకు బదులుగా వాసంతి ఎలిమినేట్ కానున్నట్లు తెలుస్తోంది. చదవండి: ఓడిపోతే బూతులు మాట్లాడతావా: ఇనయపై నాగ్ ఫైర్ టాప్ 5లో శ్రీహాన్ డౌటే, ఇనయ లేకపోతే బిగ్‌బాసే లేదు: గీతూ -
నేనిక్కడే ఉంటా బిగ్‌బాస్.. గుండె పగిలేలా ఏడ్చిన గీతూ
Bigg Boss 6 Telugu, Episode 64: గెలుపు కోసం తాపత్రయపడింది, ఎలాగైనా గెలిచి తీరాలనుకుంది. తనమన బేధాలు చూడకుండా గేమ్ ఆడింది. కలలో కూడా బిగ్‌బాస్‌నే కలవరించింది. అందరికీ ఆదర్శంగా నిలవాలనుకుంది. ఎవ్వరేమన్నా లెక్క చేయకుండా ముందుకు వెళ్లింది. భుజబలం కంటే బుద్ధి బలాన్నే ఎక్కువగా వాడుతూ తొమ్మిది వారాలు హౌస్‌లో కొనసాగింది. కళ్లు మూసినా, తెరిచినా కప్పు అందుకున్నట్లే అని పగటి కలలు కంది. కానీ చివరికి అది నిజంగానే పగటి కలగా మిగిలిపోయింది. ఊహించని ఎలిమినేషన్‌తో ఆమె గుండె ముక్కలయ్యింది. మరి ఆమె హౌస్ నుంచి వెళ్లిపోయే చివరి క్షణాల్లో ఏం మాట్లాడిందో తెలియాలంటే నేటి ఎపిసోడ్ హైలైట్స్ చదివేయాల్సిందే! నాగార్జున రావడంతోనే హౌస్‌మేట్స్‌తో ఓ గేమ్ ఆడించాడు. మీ గేమ్‌లో పాములా కాటేసేది ఎవరు? నిచ్చెనలా సాయపడేది ఎవరని అడిగాడు. దీనికి కంటెస్టెంట్లు ఏమని సమాధానమిచ్చారంటే.. ముందుగా బాలాదిత్య.. గీతూ పాము, ఆదిరెడ్డి నిచ్చెన అని చెప్పాడు. ఆదిరెడ్డి.. శ్రీహాన్ పాము, గీతూ నిచ్చెన గీతూ.. బాలాదిత్య పాము, ఆది నిచ్చెన ఫైమా.. ఇనయ పాము, గీతూ నిచ్చెన ఇనయ.. ఆది పాము, గీతూ నిచ్చెన రాజ్.. ఆది పాము, ఫైమా నిచ్చెన రోహిత్.. గీతూ పాము, మెరీనా నిచ్చెన శ్రీహాన్.. ఇనయ పాము, రేవంత్ నిచ్చెన రేవంత్.. వాసంతి పాము, శ్రీహాన్ నిచ్చెన వాసంతి.. శ్రీహాన్ పాము, ఆది నిచ్చెన కీర్తి.. శ్రీహాన్ పాము, మెరీనా నిచ్చెన మెరీనా.. గీతూ పాము, ఆది నిచ్చెన శ్రీసత్య.. ఫైమా పాము, గీతూ నిచ్చెన అని చెప్పుకొచ్చారు. ఇక ఇనయను ప్రాంక్ చేశాడు నాగ్. నువ్వు ఎవరి కోసం ఎదురుచూస్తున్నావో తెలుసు అంటూ సీక్రెట్ రూమ్ ఓపెన్ చేయమన్నాడు. దీంతో ఆమె పరుగెత్తుకుంటూ వెళ్లగా అక్కడ సూర్య ఫొటో మాత్రమే ఉంది. దానికి ముద్దులు పెట్టి ఎమోషనలైంది. నువ్వు అనుకుంటున్నట్లు సూర్య సీక్రెట్ రూమ్‌లో లేడని, ఇంట్లో బుజ్జమ్మతో ఉన్నాడని గాలి తీశాడు. ముందు నీ గేమ్ మీద ఫోకస్ చేయమని హితవు పలికాడు. నాగ్ నామినేషన్లో ఉన్న అందరినీ సేవ్ చేసుకుంటూ రాగా చివర్లో సత్య, గీతూ ఇద్దరూ మిగిలారు. గీతూ యూ ఆర్ ఎలిమినేటెడ్ అనగానే రాయలక్క ఆ మాట వినలేక చెవులు మూసుకుంది. నెక్స్ట్ వీక్ కెప్టెన్ అవుదామనుకుంటే పంపించేస్తున్నారేంటి బిగ్‌బాస్ అని ఏడ్చేసింది. నేను బాధపెట్టి ఉంటే ఐయామ్ సారీ అని వెక్కి వెక్కి ఏడ్చింది గీతూ. నువ్వు నాకు బిగ్‌బాస్ ఇచ్చిన గిఫ్ట్ అని ఆదిని పట్టుకుని ఎమోషనలైంది. ఐ లవ్ యూ బిగ్‌బాస్, నీకు జీవితాంతం రుణపడి ఉంటాను. నాకు పోవాలని లేదు, వెళ్లను అని బోరుమని ఏడ్చింది. ఆమె వెళ్లిపోతుంటే రేవంత్, ఫైమా, సత్య, శ్రీహాన్, బాలాదిత్య, ఆదిరెడ్డి అందరూ దుఃఖం ఆపుకోలేకపోయారు. ప్రతి నిమిషం ప్రాణం పెట్టి ఆడాను. నిద్రలో కూడా బిగ్‌బాస్ షో గెలవాలనే అనుకున్నా. కానీ ఇంత త్వరగా ఎలిమినేట్ అవుతానని కలలో కూడా అనుకోలేదంటూ నాగార్జున ముందు కన్నీరు పెట్టుకుంది గీతూ. ఆమెను ఓదారుస్తూ షో బ్రేకర్స్ ఎవరు? షో మేకర్స్ ఎవరు? అనే గేమ్ ఆడించాడు నాగ్. అందులో భాగంగా గీతూ.. ఆది, రేవంత్, సత్య, ఫైమా, శ్రీహాన్‌ల వల్ల షో ఇంట్రస్టింగ్‌గా ఉంటుందని చెప్పింది. ఆదిరెడ్డి అంత మంచోడిని నేనెప్పుడూ చూడలేదని, ఫైమాకు చాలా తెలివితేటలు ఉన్నాయంది. తనకు తెలియకుండానే ఆమెను ఇష్టపడ్డానంది. ఇనయ, మెరీనా, రోహిత్, రాజ్, కీర్తిల గేమ్ తక్కువగా ఉందనిపించిందని చెప్పుకొచ్చింది. తర్వాత ఆది మాట్లాడుతూ.. గీతూ ఒక యునిక్ కంటెస్టెంట్, 24 గంటలు గేమ్ గురించే ఆలోచించి, గేమ్‌లో రిలేషన్స్ కూడా చూడని ఆ కంటెస్టెంట్‌ను బిగ్‌బాస్ హౌస్ బయట చూడటం బాధగా ఉందని ఎమోషనలయ్యాడు. చివరగా రేవంత్.. వాలుకనుల దానా నీ విలువ చెప్పు మైనా.. అంటూ గీతూకోసం పాటందుకోవడంతో ఆమె వెక్కి వెక్కి ఏడ్చింది. నేనిక్కడి నుంచి పోను, ఇక్కడే ఉంటానని వేడుకుంది. కానీ ఒక్కసారి ఎలిమినేట్ అయ్యాక తనను బయటకు పంపించడం తప్ప మరో మార్గం లేదన్నట్లుగా అలాగే నిల్చుండిపోయాడు నాగ్. చదవండి: గీతూ ఎలిమినేషన్‌కు కారణాలివే! గీతూ కోసం ఏడ్చేసిన శ్రీహాన్, ఫైమా -
అడ్డంగా దొరికిన శ్రీహాన్, ఇనయ.. గీతూ వల్ల అతడికి పనిష్మెంట్!
Bigg Boss Telugu 6, Episode 63: ఈ వారం జరిగిన కెప్టెన్సీ కంటెండర్ టాస్క్‌లో రెడ్, బ్లూ టీమ్ మెంబర్స్‌కు ర్యాంకులివ్వమని గీతూ, ఆదిరెడ్డిలను ఆదేశించాడు నాగ్. బ్లూ టీమ్ లీడర్ ఆది రెడ్డి.. రాజ్ ఫస్ట్, ఇనయ సెకండ్ అని చెప్పి మెరీనా, వాసంతి, బాలాదిత్య, రోహిత్‌లకు వరుసగా మూడు, నాలుగు, ఐదు, ఆరు ర్యాంకులిచ్చాడు. తనకు ఏడో ర్యాంకు ఇచ్చుకున్నాడు ఆది. ఈ సందర్భంగా నాగ్.. సిగరెట్ల కోసం గీతూను నానామాటలు అన్నావు, సిగరెట్ తాగగానే సారీ చెప్పావు అంటూ బాలాదిత్య మీద వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. దీంతో అతడు కన్నీళ్లు పెట్టుకుంటూ ఇక మీదట సిగరెట్ ముట్టుకోనని శపథం చేశాడు. ఆట అయిపోయాక బాలాదిత్య బలహీనత మీద ఆడుకోవడం కరెక్ట్ కాదని గీతూకు కూడా హితవు కలిపాడు నాగ్. రెడ్ టీమ్ లీడర్ గీతూ.. శ్రీహాన్‌కు ఫస్ట్, ఫైమాకు సెకండ్, శ్రీసత్య, రేవంత్, కీర్తిలకు మూడు, నాలుగు, ఆరో ర్యాంకులిచ్చింది. తనకు తాను మాత్రం ఐదో ర్యాంకిచ్చుకుంది. రేవంత్ ఉన్మాదిలా ఆడిన వీడియోను చూపించాడు నాగ్. అందులో అతడు ఇనయను బలంగా నెట్టేశాడు. నువ్వు ఇంకా నీ కోపాన్ని తగ్గించుకోవాలని వార్నింగ్ ఇచ్చాడు. తర్వాత శ్రీహాన్‌ను.. కెప్టెన్సీలో నువ్వేం పొడిచావో చెప్పమని అడగడంతో అతడు నీళ్లు నమిలాడు. లాస్ట్ వీక్ గీతూకు వాష్‌రూమ్స్ కడగాలని ఇచ్చిన పనిష్మెంట్ ఎందుకు తగ్గించావని ప్రశ్నించాడు. ఆదిరెడ్డి సాయం చేస్తుంటే చూస్తూ కూర్చున్నావెందుకని నిలదీశాడు. వీడియో వేసి మరీ చూపించడంతో అడ్డంగా దొరికిపోయిన శ్రీహాన్ తప్పు తనదేనని ఒప్పుకున్నాడు. తప్పు చేసినందుకు ఫలితంగా నెక్స్ట్ వీక్ కెప్టెన్సీకి పోటీపడే అర్హత కోల్పోయావన్నాడు నాగ్. అనంతరం బ్లూ టీమ్‌లో ఆది, రెడ్ టీమ్‌లో గీతూకు వరస్ట్ పర్ఫామర్ ట్యాగిచ్చాడు. తర్వాత ఆది, కీర్తి, రేవంత్ సేఫ్ అయినట్లు ప్రకటించాడు. ఇక బిగ్‌బాస్ ఇంటి విషయాల గురించి నాగ్ మాట్లాడుతూ.. ఇంట్లో ఫుడ్ సరిపోవట్లేదంటున్నారు. ఆల్రెడీ మీకు కావాల్సినంత ఫుడ్ బిగ్‌బాస్ పంపిస్తూనే ఉన్నాడు. అయినా ఎందుకా సమస్య తలెత్తుతోందని హౌస్‌మేట్స్‌ను అడిగాడు. వేస్ట్ చేసిన ఫుడ్ వీడియోను చూపించి తప్పు మీ దగ్గరే ఉందని నిందించాడు. తనను టార్గెట్ చేస్తున్నారని పదే పదే వాదిస్తున్న ఇనయ తనకు ఏదైనా కావాలంటే ముందుగా కెప్టెన్‌కు చెప్పమని సూచించాడు. అందరూ రెండుసార్లు టీ తాగినంత మాత్రాన నీకు రెండుసార్లు పాలు ఇవ్వడం ఎలా కుదురుతుందని ప్రశ్నించాడు. ఇకపోతే శ్రీహాన్‌ను నువ్వెక్కడ పడుకుంటున్నావో చూస్తున్నా అనడం తప్పని స్పష్టం చేశాడు. దానికి ఇనయ తాను వేరే ఇంటెన్షన్‌తో అన్నానని ఆన్సరివ్వగా కెమెరాలు చూస్తున్నాయి, ఎంత కవర్ చేసినా దొరుకుతావు ఇనయ.. అని గద్దించాడు. దీంతో ఆమె కిమ్మనకుండా సైలెంట్ అయిపోయింది. ఇదిలా ఉంటే రేపటి ఎపిసోడ్లో గీతూ ఎలిమినేట్ అవగా నేను వెళ్లనంటూ ఏడుపందుకుందట. ఆ విశేషాలు రేపటి ఎపిసోడ్లో చూద్దాం.. The weekend heat is on 🔥 @iamnagarjuna confronts the housemates on this week's happenings! Don't miss tonight's exciting episode of #BiggBossTelugu6 on @StarMaa & @DisneyPlusHSTel.#BBLiveOnHotstar #StarMaa #DisneyPlusHotstar pic.twitter.com/NjDGUcR07T — Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) November 5, 2022 చదవండి: షాకింగ్ ఎలిమినేషన్, గీతూ రాయల్ అవుట్ ఇనయపై సూర్య ప్రతీకారం? ఆ పోస్ట్‌తో క్లారిటీ! -
బాలాదిత్య అన్న ఒకే ఒక్క మాటతో నా గుండె పగిలింది: గీతూ
బిగ్‌బాస్ షోలో ఏ బంధమైనా తనకు ఆట తర్వాతే అంది గీతూ. అందుకే ఈ వారం కెప్టెన్సీ కంటెండర్ టాస్క్‌లో బిగ్‌బాస్ భుజబలమే కాదు బుద్ధి బలం కూడా వాడొచ్చు.. అన్న ఒక్క పాయింట్‌ను పట్టుకుని గేమ్‌ను ఎన్నో మలుపులు తిప్పింది. మొదటగా బాలాదిత్య వీక్నెస్ అయిన సిగరెట్లను దాచేసి అతడిని నానా హింసించింది. గేమ్‌లోనూ, గేమ్ అయిపోయాక కూడా సిగరెట్లు ఇచ్చేదేలేదని మొండికేసింది. ఈ గొడవను వీకెండ్లో లేవనెత్తాడు నాగ్. ముందుగా బ్లూ టీమ్ లీడర్‌ను తన టీమ్ మెంబర్స్‌కు ర్యాంకులివ్వమన్నాడు. ఆదిరెడ్డి.. బాలాదిత్యకు 5వ ర్యాంకిచ్చాడు. దీంతో నాగ్.. నీకేసిన నంబర్ కూడా సిగ్గుపడి వెనక్కు తిరిగిందని బాలాదిత్య పరువు తీశాడు. సిగ్గుండాలి, మనిషివేనా, ప్రేమతో ఆడుకుంటావా? ఇంగిత జ్ఞానం ఉందా?... ఆఫ్టరాల్ సిగరెట్ కోసం ఇన్ని మాటలు అనాలా? అని అడిగాడు నాగ్. అవన్నీ కోపంలో అనలేదని, బాధతో అలా మాట్లాడానని సంజాయిషీ ఇచ్చుకున్నాడు బాలాదిత్య. అటు గీతూ మాత్రం.. 'ఎన్ని మాటలన్నా ఫీలవలేదని, కానీ.. ఇన్నిరోజులు నువ్వు నటిస్తున్నావంటే నేను నమ్మలేదు, ఇప్పుడు నమ్మాలనిపిస్తోంది అన్న ఒక్క మాటకు నా గుండె పగిలిపోయింది సర్' అని ఆన్సరిచ్చింది. ఆటలో సిగరెట్లు దాచడం కరెక్టే, కానీ ఆట అయిపోయాక కూడా అతడి బలహీనత మీద ఆడుకోవడం సరికాదని చెప్పాడు నాగ్. చదవండి: ఇనయపై సూర్య ప్రతీకారం, ఆ పోస్టులతో క్లారిటీ! గీతూ రాయల్ ఎలిమినేట్ -
గీతూ చెత్త సంచాలక్, బాలాదిత్య చేతులెత్తి మొక్కినా..
Bigg Boss 6 Telugu, Episode 60: బిగ్‌బాస్ అంటే మైండ్ గేమ్ అని కొందరు, కాదు ఫిజికల్ గేమ్ అని మరికొందరు, ఆ రెండింటికన్నా వ్యక్తిత్వం ఇంపార్టెంట్ బ్రదరూ అనేవాళ్లూ ఉన్నారు. కానీ కంటెస్టెంట్లలో కచ్చితంగా ఈ మూడు క్వాలిటీస్ ఉండాల్సిందే! దురదృష్టం కొద్దీ ఆ విషయాన్ని గాలికొదిలేస్తున్నారు హౌస్మేట్స్. ఫిజికల్ గేమ్ వచ్చినప్పుడు మైండ్ గేమ్, మైండ్ గేమ్ వచ్చినప్పుడు ఫిజికల్ గేమ్ ఆడుతున్నారు. మరీ ముఖ్యంగా ఏదైనా టాస్క్ రాగానే వారి బలహీనతల మీద దెబ్బ కొట్టి రెచ్చగొట్టి పెంట చేస్తున్నారు. దీంతో గేమ్ స్పిరిట్ కంటే గొడవలే ఎక్కువైపోతున్నాయి. ఈరోజు ఎపిసోడ్లో కూడా అదే జరిగింది. మిషన్ పాజిబుల్ టాస్క్‌లో భాగంగా ఇతర స్క్వాడ్‌లోని సభ్యులను చంపేందుకు క్యాప్చర్ ద వార్ అనే ఛాలెంజ్ ఇచ్చాడు బిగ్‌బాస్. అయితే గ్రనైట్ రెడ్ స్క్వాట్ ఆధీనంలో ఉండటంతో ఎవరెవరు పోటీపడాలి? సంచాలకులుగా ఎవరు ఉండాలనేది రెడ్ టీమ్ ఎంపిక చేయొచ్చని ట్విస్ట్ ఇచ్చాడు. ఇంకేముంది, గీతూ సంచాలక్ అయింది. బ్లూ టీమ్‌లో వీక్‌గా ఉన్నారనుకున్న ఇనయ, వాసంతి, మెరీనాలు.. రేవంత్, శ్రీహాన్, ఫైమాతో పోటీపడాలని నిర్ణయించారు. గేమ్ మొదలు కాకముందే ఎప్పటిలా కొత్త రూల్స్ పెట్టింది గీతూ. గోడ మీద నుంచి రెండు కాళ్లు కింద పెడితే అవుట్ అని చెప్పింది. గేమ్ ప్రారంభం కాగానే ముగ్గురు ఆడాళ్లు సివంగుల్లా పోట్లాడారు. వెక్కిరిస్తూ వెకిలి చేష్టలు చేసిన రేవంత్‌ను అవుట్ చేసింది వాసంతి. శ్రీహాన్ ఇనయను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తూ.. నామినేషన్లో తప్ప కంటెంట్ లేనిదానివి నువ్వు మట్లాడుతున్నావు అని విమర్శించాడు. దీనికి ఇనయ.. నువ్వూ ఈ మధ్య కంటెంట్ బాగా ఇస్తున్నావ్లే, ఎక్కడ వెళ్లి పడుకుంటున్నావో చూస్తున్నా అంది. ఇక ఇనయ నెట్టేసే క్రమంలో శ్రీహాన్ రెండు కాళ్లు కింద పెట్టినా గీతూ మాత్రం తాను చూడలేదని మాట్లాడింది. ఎవ్వరు చెప్పినా ఆమె పట్టించుకున్న పాపాన పోలేదు. ఈ మొదటి మిషన్‌లో రెడ్ స్క్వాడ్ గెలవగా వారు బ్లూ స్క్వాడ్‌లో రోహిత్‌ను చంపారు. తర్వాత శ్రీహాన్.. ఇనయ దగ్గరకు వెళ్లి నా క్యారెక్టర్ గురించి ఏదో నోరు జారుతున్నావేంటి అంటూ అగ్గి మీద గుగ్గిలమయ్యాడు. మా రిలేషన్‌కు ఓ పేరుంది, లిమిట్ ఉంది అని ఎగబడ్డారు శ్రీసత్య, శ్రీహాన్. దానికి ఇనయ మీరు కింద పడుకోవడం చూశానని ఆన్సరిచ్చింది. మరోపక్క బాలాదిత్య సిగరెట్ల కోసం అల్లాడిపోయాడు. చేసింది చాలు, తప్పు చేయకు, నా మనసు విరిగిపోయింది అని సిగరెట్లు అడగ్గా గీతూ మాత్రం ఇవ్వనంటూ మొండికేసింది. నా స్టూడెంట్స్‌కు నేను సిగరెట్లు తాగడం తెలియొద్దనుకున్నా, కానీ తెలిసిపోయింది. అమ్మ చూస్తే బాధపడుతుంది అంటూ చిన్న పిల్లాడిలా ఏడ్చేశాడు ఆదిత్య. ఆదిరెడ్డి సహా అందరూ బతిమాలడంతో చివరాఖరికి సిగరెట్లు ఇచ్చేసి ఏడ్చేసింది గీతూ. దీంతో ఆవేశంలో సిగ్గులేదు అన్నందుకు తనను క్షమించమని చేతులెత్తి వేడుకున్నాడు బాలాదిత్య. గీతూ మాత్రం అతడిని క్షమించే ప్రసక్తే లేదన్నట్లు ప్రవర్తించింది. తెల్లారి బాలాదిత్య సిగరెట్లు తాగుదామనుకునేలోపు లైటర్ కనిపించకుండా పోయింది. దీంతో ఆదిరెడ్డి.. బిగ్‌బాస్.. వీక్నెస్తో ఆడుకోమన్నాడని చెప్పి మీ బలాన్ని ప్రయోగించరా? అని కరెక్ట్ పాయింట్ లాగాడు. అటు గీతూ మాత్రం.. నేను దొంగ, వెధవెన్నర వెధవ.. జాగ్రత్తగా దాచుకోవాలని చెప్పి కాసేపు సతాయించి తర్వాత లైటర్ ఇచ్చేసింది. రాత్రి నిద్రపోయేటప్పుడు ఇనయ సూర్య జ్ఞాపకాలతో తడిసి ముద్దైంది. నీ షర్ట్ వేసుకునే గేమ్ ఆడాను. ఎందుకింత గుర్తొస్తున్నావంటూ సూర్యను తలుచుకుని ముసిముసి నవ్వులు నవ్వింది. అటు శ్రీసత్య మాత్రం ఎవరు ఏ పాయింట్లో ట్రిగ్గర్ అవుతారో నాకు తెలుసు. కాబట్టి రేపు ఎదుటివాళ్లను రెచ్చగొట్టి గేమ్ ఆడదామని రేవంత్‌తో చెప్పుకొచ్చింది. మరుసటి రోజు ఆదిరెడ్డిని కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచిన బిగ్‌బాస్ అతడికి సీక్రెట్ మిషన్ ఇచ్చాడు. వాష్‌రూమ్‌ను పూర్తిగా అశుభ్రపరిచి ఆ నింద రెడ్ స్క్వాడ్‌లో ఒకరి మీద వేయాలన్నాడు. ఈ మిషన్ కంప్లీట్ చేస్తే బ్లూ టీమ్‌లో ఒకరిని బతికించొచ్చన్నాడు. మరి ఆ సీక్రెట్ మిషన్ పాజిబులా? ఇంపాజిబులా? అనేది తెలియాలంటే రేపటి ఎపిసోడ్ కోసం వెయిట్ చేయాల్సిందే! చదవండి: ఆత్మహత్య తప్ప మరో దిక్కు లేదు: పావలా శ్యామల అందరికీ రుణపడి ఉంటా: రంభ వీడియో వైరల్ -
బాలాదిత్యపై కక్ష, ఎలిమినేషన్ జోన్లో బిగ్‌బాస్ ముద్దుబిడ్డ!
బిగ్‌బాస్ షోను బుల్లితెర హిట్ షోగా పిలుచుకుంటారు. ఈ షో వస్తుందంటే చాలు జనాలు టీవీలకు అతుక్కుపోతుంటారు. ఇక షోలో పాల్గొనే కంటెస్టెంట్లు కూడా ప్రేక్షకులను అలరించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తుంటారు. అయితే దాదాపు ప్రతి సీజన్లో కంటెస్టెంట్లు గొడవలు పడి గేమ్ తర్వాత కలిసిపోతుంటారు. ఎంత తిట్టుకున్నా, ఎంత కొట్టుకున్నా అది గేమ్, నామినేషన్స్ వరకు మాత్రమే! కానీ ఈసారి ఏంటో గేమ్ కన్నా కూడా గొడవలకే ఎక్కువ ప్రాధాన్యతిస్తున్నారు. ఈ సీజన్లో ఒకరినొకరు టార్గెట్ చేసుకోవడం పరిపాటిగా మారింది. మొన్నటివరకు అన్న అంటూ బాలాదిత్యతో బంధం కలుపుకున్న గీతూ ఆయన్నే టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. మొన్న చేపల చెరువు టాస్క్‌లో కావాలని బాలాదిత్య టీమ్‌ను గేమ్ నుంచి సైడ్ చేసింది. ఇప్పుడేమో అతడి బలహీనత అయిన సిగరెట్లను దాచి కక్ష సాధిస్తోంది. మిషన్ పాజిబుల్ అనే కెప్టెన్సీ కంటెండర్ టాస్క్‌లో భుజబలంతో పాటు బుద్ధి బలం కూడా వాడమన్నాడు బిగ్‌బాస్. ఇంకే, ఆ ఒక్క పాయింట్‌ను పట్టుకుని సిగరెట్లు, లైటర్ దాచేసింది గీతూ. గేమ్ అయిపోయినా, తనకు సిగరెట్లు కావాలని అతడు ఏడుస్తున్నా కూడా ఆమె మనసు కరగడం లేదు. మరోవైపు ఇనయ వల్లే సూర్య ఎలిమినేట్ అయ్యాడని నామినేషన్లో అరిచి మరీ చెప్పారు శ్రీహాన్, శ్రీసత్య. కానీ గేమ్‌లో కూడా పదే పదే అదే పాయింట్ లేవనెత్తి ఆమెను వెక్కిరిస్తూ వెకిలి చేష్టలు చేయడం అవసరమా? అని అసహనం వ్యక్తం చేస్తున్నారు ప్రేక్షకులు. అందరికంటే గీతక్క ఎక్కువ రోత పుట్టిస్తుందని, ముందుగా ఆమెను ఎలిమినేట్ చేయాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. బాలాదిత్యను ఇలాగే ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తే గీతూ ఈ వారమే బయటకు వెళ్లడం ఖాయమంటున్నారు. ప్రస్తుతానికైతే ఓటింగ్‌లో రేవంత్, బాలాదిత్య టాప్‌లో ఉండగా గీతూ చివరి స్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: నిందలు తట్టుకోలేక బాత్రూమ్లోకి ఇనయ క్యాసినో కింగ్ చీకోటితో ఆర్జీవీ -
హే, పో.. అంటూ కుండ దాచుకున్న ఆది, లాస్ట్ పంచ్ అదిరింది!
నామినేషన్స్‌లో ఫుల్ ఫైర్ మీదున్నారు హౌస్మేట్స్. ఎనిమిదో వారం సూర్య వెళ్లిపోగా అతడు ఎలిమినేట్ అవడానికి ఇనయ కారణం అంటూ ఆమెకు నామినేసన్స్ గుద్దిపడేస్తున్నారు. వారానికో రంగు మార్చే ఊసరవెల్లి నాకు ఊసరవెల్లి ట్యాగ్ ఇచ్చింది.. ఫ్రెండ్షిప్లో నువ్వు పొడిచిన వెన్నుపోట్లు ఎవరూ పొడవరు అంటూ ఇనయను నామినేట్ చేశాడు శ్రీహాన్. సూర్యను ఎక్కడ కొట్టాలో కొట్టావు, దెబ్బకు వెళ్లిపోయాడన్నాడు ఆది. అయితే ఇనయ మాత్రం ఆదిరెడ్డి ఫేక్ ఆడుతున్నాడంటూ కుండను పగలగొట్టేందుకు వెళ్లగా అతడు మాత్రం హే, పో.. కొట్టమాకు అంటూ కుండ దాచేసుకున్నాడు. చమ్కీలకు, గోధుమపిండి, మరమరాలకు అన్నింటికీ నామినేట్ చేస్తావ్ అంటూ ఇనయను ఆడుకున్నాడు ఆది. శ్రీహాన్.. ఈరోజు మనం ఫస్ట్ చెప్పుకోబోయే చాప్టర్ పేరు హ్యుమానిటీ. నువ్వు మా దగ్గర చేపలు లాక్కుంటున్నప్పుడు శ్రీసత్య డ్రెస్ పైకి వెళ్లిపోతుంటే హ్యుమానిటీ గుర్తుకురాలేదా? అని అడిగాడు. దీనికి చిర్రెత్తిన కీర్తి.. నీట్‌గా నిల్చుని మాట్లాడినప్పుడు నీ ఎటకారం ఏంట్రా? అంది. రా.. అనకు అంటూ ఫైర్ అయ్యాడు శ్రీహాన్. నా వెటకారం మోతాదు మించిపోయిందని నామినేట్ చేశావు, నీ మంచితనం మోతాదు మించిపోయింది అంటూ బాలాదిత్యను నామినేట్ చేసింది ఫైమా. మంచితనానికి కూడా నామినేట్ చేస్తారా? అని షాకవుతున్నారు ఆడియన్స్. చివర్లో శ్రీహాన్ పంచ్ మాత్రం అదిరిపోయింది. ఇనయ దగ్గరకు వెళ్తూ.. ఒక్కటి మాత్రం నువ్వు చేయలేవు అంటూ ఈరోజు నన్ను నామినేట్ చేయలేవు అని హ్యాపీగా ఫీలయ్యాడు. చదవండి: నాలో విన్నర్ క్వాలిటీస్, నేనే బిగ్‌బాస్ విన్నర్ సినిమాల జాతర.. థియేటర్, ఓటీటీలో వచ్చే సినిమాలివే! -
నా చేతివంట తిన్నాక నాన్నకు గుండెపోటు వచ్చింది: ఇనయ
Bigg Boss 6 Telugu, Episode 55: ముందుగా అనుకున్నట్లుగానే శ్రీహాన్ కెప్టెన్ అయ్యాడయ్యాడు. అలా కెప్టెన్ అయ్యాడో లేదో ఇలా ఇనయతో గొడవపడ్డాడు. మొన్నటిదాకా కలిసిపోయిన వీళ్లిద్దరి కథ కెప్టెన్సీ టాస్క్‌తో మళ్లీ మొదటికి వచ్చింది. ఇనయ కత్తిపోటు వేయడాన్ని శ్రీహాన్ జీర్ణించుకోలేకపోయాడు. సరైన సమయం వచ్చినప్పుడు తనేంటో చూపిస్తాననడి డిసైడ్ అయ్యాడు. మరి నేటి ఎపిసోడ్లో ఇంకా ఏమేం జరిగాయో చదివేయండి.. సూర్య, ఇనయల ట్రాక్ చూసి జనాలు వీరిని సునయ అని పిలవడం మొదలుపెట్టారు. కానీ నాగార్జున వీకెండ్లో పదేపదే బుజ్జమ్మ పేరు ఎత్తడంతో ఇనయ బాగా హర్టయింది. సూర్యకు గర్ల్‌ఫ్రెండ్ ఉందని అన్నిసార్లు గుర్తు చేసినప్పుడు తను క్లోజ్‌గా ఉండటం తప్పని భావించింది. ఏకంగా అతడి ఫ్రెండ్షిప్నే వద్దంది. సూర్య మీద ద్వేషం పెంచుకుంది. టాప్ 5లో కాదు కదా వీలైనంత వెంటనే బయటకు వెళ్లిపోవాలని రగిలిపోయింది. కానీ ఆ కోపం చప్పున చల్లారిపోయినట్లు కనిపిస్తోంది. నాకు కోపమొస్తే అవతలివారిని బాధపెడతాడనని సూర్యతో చెప్పుకొచ్చింది ఇనయ. నీ బ్రాస్లేట్ రేవంత్ దగ్గర ఉండటం నచ్చలేదు, అందుకే తీసుకున్నానన్నాడు సూర్య. అలా ఇద్దరూ కాసేపు మనసు విప్పి మాట్లాడుకున్నారు. ఆ తర్వాత కెప్టెన్సీ పోటీ కంటిన్యూ అయింది. నిన్న రాజ్, రోహిత్, రేవంత్.. సూర్యకు; బాలాదిత్య, గీతూ.. కీర్తికి కత్తిపోట్లు గుచ్చగా ఇనయ.. శ్రీహాన్‌కు కత్తి గుచ్చింది. నేటి ఎపిసోడ్లో వాసంతి, ఆదిరెడ్డి, మెరీనా, ఫైమా.. కీర్తికి కత్తిపోట్లు గుచ్చారు. తక్కువ కత్తులు దిగిన శ్రీహాన్ కెప్టెన్‌గా అవతరించాడు. మరోవైపు కిచెన్‌లో గీతూ, బాలాదిత్య పంచాయితీకి దిగారు. కూరగాయలు కట్ చేసినప్పుడు దాని తొక్కలు డస్ట్‌బిన్‌లో వేయొచ్చు కదా అని బాలాదిత్య.. నేను ఎందుకు వేస్తా, అంత అవసరమనుకుంటే నువ్వే వేసేయ్ అంటూ గీతూ దెబ్బలాడుకున్నారు. అలా ఇద్దరి గొడవతో ఇంట్లో రగడ జరిగింది. తర్వాత యమహా కాల్ ఆఫ్ ద బ్లూ టాస్క్‌లో రోహిత్ గెలిచి జాకెట్ గెలుచుకున్నాడు. తనను విన్నర్‌గా ప్రకటించకపోవడంతో రేవంత్ చిర్రుబుర్రులాడాడు. అనంతరం వరస్ట్ పర్ఫామర్‌ను ఎంచుకోమని కెప్టెన్ శ్రీహాన్‌ను ఆదేశించాడు బిగ్‌బాస్. దీంతో కెప్టెన్.. బాలాదిత్య ముఖానికి పెయింట్ పూయడంతో అతడు జైలుకు వెళ్లాల్సి వచ్చింది. గీతూ ప్రవర్తన మీద ఓ కన్నేసిన ఆది రెడ్డి తన అభిప్రాయాన్ని ఆమె ముందుంచాడు. గీతక్క నువ్వు రాంగ్ ట్రాక్‌లో వెళ్తున్నావనిపిస్తోందన్నాడు. ఆమె మాత్రం అదేమీ పెద్దగా పట్టించుకోనట్లే కనిపించింది. ఇక ఆది కూతురు హద్విత ఫస్ట్ బర్త్‌డే కావడంతో అతడికి ఫ్యామిలీ వీడియో చూపించాడు బిగ్‌బాస్. ఆ వీడియోలో ఆది భార్య కవిత కూతురికి కేక్ కట్ చేసి తినిపించింది. తన తల్లిని, పెళ్లాంబిడ్డలను చూసి ఆది సంతోషంతో ఉబ్బితబ్బిబ్బైపోయాడు. కెప్టెన్ శ్రీహాన్ ఇంటిసభ్యులకు పనులు అప్పగించేందుకు రెడీ అయిపోయాడు. ఇనయను వంట చేయమని అడిగాడు. దీనికి ఇనయ స్పందిస్తూ.. 'నేను చివరిసారిగా వంట చేసింది మా డాడీకే, నా వంట తిన్నాక ఆయనకు గుండెపోటు వచ్చింది. అప్పటినుంచి వంట ముట్టుకోలేదు, ఇక మీదట చేయను కూడా' అని తెగేసి చెప్పింది. కొందరు అన్నం వదిలేస్తున్నారని శ్రీహాన్ అనగా కూర లేకపోవడంతోనే తాను రైస్ పక్కన పెట్టేశానని మధ్యలో కల్పించుకుని ఆన్సరిచ్చింది ఇనయ. అసలు నీ పేరు ప్రస్తావించనప్పుడు నువ్వెందుకు మధ్యలో వస్తున్నావంటూ ఫైర్ అయ్యాడు కెప్టెన్. అలా ఇద్దరి మధ్య కాసేపు చిన్నపాటి యుద్ధమే జరిగింది. ఏదేమైనా అన్నం పడేస్తే మాత్రం అస్సలు ఊరుకోనన్నాడు శ్రీహాన్. మళ్లీ గొడవలవుతున్నాయని శ్రీహాన్ చిరాకుపడుతుంటే గీతూ మాత్రం.. ఇలా గొడవ జరిగితేనే సీజన్ హిట్టవుతుందని చెప్పుకురావడం విశేషం.. -
ఆదిరెడ్డికి సర్ప్రైజ్, కెప్టెన్‌గా తప్పు చేసిన శ్రీహాన్!?
ఫ్రెండ్ అంటూనే వెన్నుపోటు పొడిచిన ఇనయపై కసి పెంచుకున్నాడు శ్రీహాన్. సమయం వచ్చినప్పుడు తనేంటో చూపిస్తానని డిసైడ్ అయ్యాడు. ఎలాగో అతడు కెప్టెన్ అయిన విషయం బయటకు రానే వచ్చింది. తాజాగా అతడు ఇంటిబాధ్యతలు చక్కదిద్దే పనిలో పడ్డాడు. ఇంట్లో కొందరు అన్నం వదిలేస్తున్నారని శ్రీహాన్ చెప్తుండగా మధ్యలో ఇనయ కల్పించుకుని నాకు కూర సరిపోలేదని అన్నం వదిలేశానని క్లారిటీ ఇచ్చింది. దీంతో శ్రీహాన్ ఫైర్ అవుతూ.. 'నేను మాట్లాడినప్పుడు కాదు, తర్వాత క్లారిటీ ఇచ్చుకో! నేను అందరి పాయింట్స్ చెప్తున్నప్పుడు కామ్‌గా ఉండు, తర్వాత మాట్లాడుకో' అంటూ ఒంటికాలిపై లేచాడు. కర్రీ వేయలేదు కాబట్టే తినలేదని ఇనయ మరోసారి చెప్పగా అన్నానికి నువ్విచ్చే విలువ అదా? నా కళ్ల ముందు ఎవరైనా రైస్ పడేసినట్లు కనిపిస్తే అస్సలు ఊరుకోను అని హెచ్చరించాడు కొత్త కెప్టెన్. ఈరోజు ఆదిరెడ్డి కూతురు బర్త్‌డే కావడంతో బిగ్‌బాస్ అతడి కోసం స్పెషల్ వీడియో ప్లే చేశాడు. అది చూసి ఆదిరెడ్డి ఎమోషనల్ అయ్యాడు. మరోపక్క వరస్ట్ పర్ఫామర్‌గా ఎవరిని సెలక్ట్ చేయాలన్న బాధ్యతను కెప్టెన్ శ్రీహాన్‌కు ఇచ్చాడు బిగ్‌బాస్. అతడు సత్య, గీతూల కోపం అర్థం చేసుకున్నాడో ఏమో కానీ బాలాదిత్యను జైలుకు పంపించినట్లు తెలుస్తోంది. చదవండి: తొక్కలో పంచాయితీ, ఎంత చెప్పినా గీతూ వినదే ఒక్క పోస్ట్‌తో లవ్ కన్ఫర్మ్ చేసిన హీరో సిద్దార్థ్ -
'తొక్క'లో పంచాయితీ.. ఎంత చెప్పినా గీతూ వినదే..!
సీతయ్య.. ఎవ్వరి మాటా వినడు అన్నట్లు ప్రవర్తిస్తోంది గీతూ రాయల్. మొన్నటివరకు బాలాదిత్యను అన్న అని పిలుస్తూ అతడితో సఖ్యతగా మెసులుకున్న గీతూ రానురానూ అతడిని టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. నామినేట్ చేయడం, అతడిని గేమ్ నుంచి తప్పించడం, అసలు అతడేం బాగా ఆడలేదని కావాలని నెగెటివిటీ స్ప్రెడ్ చేయడం చూస్తుంటే అతడి మీద కక్ష పెట్టుకున్నట్లే కనిపిస్తోంది. మరోపక్క బాలాదిత్య మాత్రం ఒక్కసారి చెల్లి అన్నందుకు ఇప్పటికీ అదే బంధుత్వానికి కట్టుబడి ఉన్నట్లున్నాడు. గీతూ కసురుకున్నా, విసుకున్నా, నోరు జారినా అతడు మాత్రం తనకు మంచి చెప్పడానికే ప్రయత్నిస్తున్నాడు. తాజాగా రిలీజైన ప్రోమోలో కూరగాయలు కట్ చేసినప్పుడు అదే చేత్తో తొక్కలు డస్ట్ బిన్లో వేయండి అని గీతూకు చెప్పాడు బాలాదిత్య. ఆమె మాత్రం నేను వేయను అని ముక్కుసూటిగా చెప్పేసింది. వేస్తే మంచిదానివి అవుతావుగా అంటే కూడా నేను మంచిదాన్నే కాదు అని వాదించింది. నీ మాటతీరుతో, చేతలతో పెంట చేసుకుంటున్నావని అతడు హెచ్చరించినా, నేను పెంట చేసుకుంటే నేనే పోతా, హ్యాపీగా ఉండు అని సమాధానమిచ్చింది. నువ్వు పోతే నేను హ్యాపీగా ఉండను, నువ్వు బాగుపడితే సంతోషంగా ఉంటానని కౌంటరిచ్చాడు ఆదిత్య. చదవండి: పూరీ జగన్నాథ్ ఇంటికి పోలీసుల భద్రత రామ్ సినిమాలో ఊర్వశి రౌతేలా? ఇదిగో క్లారిటీ -
లవ్ ట్రాక్ ఎత్తేసిన సునయ, ఇప్పుడు కొత్త డ్రామా!
Bigg Boss 6 Telugu, Episode 44: 'సునయ' లవ్ ట్రాక్ ప్రేక్షకులకు రోత పుడుతుందని అర్థమైనట్లుంది. అందుకే ఇకపై కలిసి ఉండటం కన్నా గొడవలు పెట్టుకోవడం బెటర్ అని ఇనయ, సూర్య డిసైడ్ అయ్యాడు. అనుకున్న ప్లాన్ ప్రకారం అందరిముందు దెబ్బలాడుకున్నారు. అటు సూర్య మాత్రం.. నాకు ఎక్కువ అటెన్షన్ ఇవ్వడం వల్ల ఇనయ గేమ్ దెబ్బతినడం నచ్చట్లేదు. ఆమె గేమ్‌ను నేనే మారుస్తా. మా ఇద్దరి మధ్య నిజంగానే డిష్యుం డిష్యుం జరిగేలా చేస్తా. కానీ ఇనయ అంటే నాకిష్టం. ఇండిపెండెంట్ ఉమెన్ను నేను ఇష్టపడతా అంటూ కెమెరాలతో మనసులో మాట పంచుకున్నాడు సూర్య. అటు గీతూ.. ఇండస్ట్రీలో ఒక్కరంటే ఒక్కరు కూడా తనను ఫ్లర్ట్ చేయలేదని చెప్పింది. ఎందుకక్కా? అని రేవంత్ అడగ్గా బహుశా అందంగా లేనేమోనని బదులిచ్చింది. దానికి ఆది రెడ్డి కంపను తెచ్చుకుని అతికించుకోవడం ఎందుకులే అని ఊరుకున్నారులేనని దిమ్మతిరిగే పంచ్ ఇచ్చాడు. కాసేపటికే బిగ్‌బాస్ ఇంట్లో నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ఫైమా.. వాసంతి, బాలాదిత్యను; రోహిత్.. రేవంత్, శ్రీహాన్‌ను; శ్రీసత్య.. బాలాదిత్య, రేవంత్‌ను; బాలాదిత్య.. రేవంత్, ఫైమాను, ఆది రెడ్డి.. అర్జున్, వాసంతిని; మెరీనా.. రేవంత్; ఆది రెడ్డిని; గీతూ.. వాసంతి, బాలాదిత్యను; రాజ్.. బాలాదిత్య, వాసంతిని; ఇనయ.. బాలాదిత్య, శ్రీహాన్‌ను; అర్జున్.. బాలాదిత్య, ఆది రెడ్డిని; వాసంతి.. రాజ్, రేవంతిని; కీర్తి.. బాలాదిత్య, శ్రీహాన్‌ను; రేవంత్.. మెరీనా, శ్రీసత్యను; సూర్య.. బాలాదిత్య, రేవంత్‌ను నామినేట్ చేశారు. శ్రీహాన్.. డ్రామా క్వీన్ అంటూ ఇనయను నామినేట్ చేశాడు. 23 ఏళ్లుగా స్ట్రాంగ్ అని చెప్పే కీర్తి ఇంట్లో ప్రతిదానికి ఏడుస్తుంది, అంటే ఆమె వీక్ కంటెస్టెంట్ అని చెప్తూ కీర్తిని నామినేట్ చేశాడు. ఇక ఈ ప్రక్రియలో తాను నామినేషన్‌కు భయపడుతున్నానని ఆదిరెడ్డి, రాజ్ అనడంతో వాసంతి చిర్రెత్తిపోయింది. నామినేషన్స్‌కు ఇక్కడ ఎవరూ భయపడట్లేదా? నేనొక్కదాన్నే భయపడుతున్నానా? ఏమైనా అంటే ఇదే కారణం వెతుక్కుంటారని చిటపటలాడింది. తనకు నామినేషన్స్ నథింగ్ అని, హెయిర్ తన జీవితం అయినా అయినా దాన్ని కట్ చేసుకున్నా అని చెప్పుకొచ్చింది. మొత్తంగా ఈ ఏడోవారం రోహిత్, వాసంతి, ఆదిత్య, రేవంత్, శ్రీహాన్, ఆదిరెడ్డి, ఇనయ, అర్జున్, కీర్తి, శ్రీసత్య, మెరీనా, రాజ్, ఫైమా నామినేట్ అయినట్లు ప్రకటించాడు బిగ్‌బాస్. చదవండి: అది ఫేవరెటిజమా?: యాంకర్‌నే నిలదీసిన సుదీప ఆ బిగ్‌బాస్ కంటెస్టెంట్ ఒంటరిగా రమ్మన్నాడు -
ఆ ఇద్దరు తప్ప అందరూ నామినేషన్లోనే!
బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్లో ప్రస్తుతం పదిహేను మంది మిగిలారు. వీరిలో నుంచి ఒకరిని బయటకు పంపించేందుకు నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ఏదైనా టాస్క్ ద్వారా కాకుండా ఇంటిసభ్యులు కారణాలు చెప్పి మిగతావారిని నామినేట్ చేశారు. ఈ క్రమంలో కెప్టెన్ రేవంత్‌కు ఎక్కువ ఓట్లు పడ్డాయి. తన కెప్టెన్సీలో బిగ్‌బాస్ రూల్స్ పక్కనపెట్టి తనే ఆదమరిచి నిద్రపోయాడంటూ నామినేసన్ ఓట్లు గుద్దారు. తను ఫ్రెండ్ అనుకున్న శ్రీసత్య కూడా వేరే ఆప్షన్ లేదంటూ రేవంత్‌నే నామినేట్ చేసింది. ఇనయ బిహేవియర్ నచ్చలేదంటూ ఆమెను నామినేషన్లోకి పంపాడు శ్రీహాన్. నువ్వు మంచివాడిగా ఎలా ఉన్నావో అదే పేరుతో బయటకు వెళ్లిపోతే బాగుందని బాలాదిత్యకు ఓటేసింది గీతూ. సిస్టర్ అనుకున్న గీతూ తను వెళ్లిపోవాలని కోరుకోవడాన్ని జీర్ణించుకోలేకపోయాడు ఆదిత్య. హౌస్ మంచి కోసం తాను పాటుపడుతుంటే తననే పంపించేయాలని చూస్తున్నారని బాధపడ్డాడు. చూస్తుంటే గీతూ, కెప్టెన్ సూర్య మినహా మిగతా అందరూ నామినేషన్లో ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: గీతూ జిడ్డు.. రేవంత్ అయితే.. : సుదీప -
వీడియోతో అడ్డంగా దొరికేసిన గీతూ, రోహిత్ కోసం ఆమె త్యాగం!
బిగ్‌బాస్ హౌస్‌లో అతడు ఇంకా ఎందుకున్నాడు? అన్న జనాల నోటితోనే ఇతడు హౌస్‌లో మరికొన్ని వారాలు ఉండాలి అనేలా చేశాడు రోహిత్. ఒక్క టాస్క్.. ఒకే ఒక్క టాస్క్‌తో తన గ్రాఫ పెంచుకున్నాడు. బ్యాటరీ రీచార్జ్ టాస్క్‌లో ఇంటిసభ్యులందరి కోసం రెండువారాలు నామినేషన్లో ఉండేందుకు సిద్ధపడ్డాడు. కానీ అతడు చేసిన త్యాగానికి హౌస్మేట్స్ ప్రతిఫలంగా వెన్నుపోటు పొడిచారు. ఫ్యామిలీతో మాట్లాడేందుకు వీలు లేకుండా ఒక్క ఫోన్ కాల్ కూడా తనను లిఫ్ట్ చేయనివ్వలేదు. అందుకు రోహిత్ మనసు చివుక్కుమంది. అయితే అతడి త్యాగాన్ని హోస్ట్ నాగార్జున గుర్తించాడు. రోహిత్ మీకోసం అంత పెద్ద త్యాగం చేస్తే మీరందరూ ఎంత స్వార్థం చూపించారని విమర్శించాడు. అతడి కోసం కచ్చితంగా ఎవరో ఒకరు ఏదైనా త్యాగానికి సిద్ధమవ్వాల్సిందేనని కరాఖండిగా తేల్చి చెప్పాడు. ఎవరు త్యాగం చేయాలో రోహిత్ డిసైడ్ చేస్తాడనడంతో అతడు వసంతిని ఎంచుకున్నాడు. బిగ్‌బాస్.. ఆమె జుట్టును భుజంపై వరకు కత్తిరించుకోవాలన్నాడు. తాజా ప్రోమోలో వసంతి అందుకు సిద్ధపడినట్లే కనిపిస్తోంది. మరోవైపు కెప్టెన్ రేవంత్ నిద్రపోయిన వీడియో, బాలాదిత్యకు.. గీతూ బిగ్‌బాస్‌తో మాట్లాడిన ముచ్చటంతా కళ్లకు కట్టినట్లు చూపించారు. మరి ఈ ఎపిసోడ్లో ఇంకా ఏమేం జరగనుందో తెలియాలంటే మరికొద్ది గంటలు ఆగాల్సిందే! చదవండి: లుంగి డ్యాన్స్‌లో రెచ్చిపోయిన కీర్తి ఇనయనే వెనకాల తిరుగుతోంది: సూర్య గర్ల్‌ఫ్రెండ్ -
సిగరెట్లు లేక అల్లాడుతున్న బాలాదిత్య, అతడి భార్య ఏమందంటే?
బిగ్‌బాస్ హౌస్‌లో సాఫ్ట్ అండ్ స్వీట్‌గా నడుచుకునే వ్యక్తి బాలాదిత్య. చైల్డ్ ఆర్టిస్ట్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఇతడు బిగ్‌బాస్ షోతో జనాలకు మరింత దగ్గరవ్వాలనుకున్నాడు. కానీ అతి మంచితనమే అతడికి శత్రువుగా మారింది. ఇది నిజంగా మంచితనమేనా? సేఫ్ గేమ్ ఆడుతున్నాడు, ఫేక్ కంటెస్టెంట్ అని విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఎన్ని విమర్శలు వచ్చినా సరే అతడు మాత్రం ముందు ఎలా ఉన్నాడో ఇప్పుడూ అలానే ఉన్నాడు. ఇకపోతే ఇటీవల బ్యాటరీ రీచార్జ్ టాస్క్‌లో బాలాదిత్య తన సిగరెట్లు త్యాగం చేశాడు. ఒకరకంగా చెప్పాలంటే అతడు సిగరెట్లు మానేలా చేసింది గీతూ. బ్యాటరీ రీచార్జ్ అవ్వాలంటే ఇంటిసభ్యులు చక్కెర త్యాగం చేయాలి, లేదంటే బాలాదిత్య సిగరెట్లు త్యాగం చేయాలని గీతూకు పిలిచి చెప్పాడు బిగ్‌బాస్. దొరికిందే ఛాన్స్ అనుకున్న గీతూ.. ఇంటిసభ్యులు ఫుడ్ మానేయమడా? లేదా బాలాదిత్య సిగరెట్లు త్యాగం చేస్తాడా? తేల్చుకోమని బిగ్‌బాస్ చెప్పాడంది. దీంతో ఆదిత్య ముందుకు వచ్చి పొగ తాగడాన్ని వదిలేశాడు. కానీ ఇప్పటికీ కెమెరాల ముందుకు వచ్చి సిగరెట్లు పంపించమని బతిమిలాడుతూనే ఉన్నాడు. ఈ వ్యవహారంపై బాలాదిత్య భార్య మానస స్పందించింది. 'బాలాదిత్య సిగరెట్లు తాగడం మానేయాలనుకుంటే మానేయగలడు. హనుమాన్ మాల వేసుకున్నప్పుడు 40 రోజులు ఒక్క సిగరెట్ ముట్టుకోలేదు. అయితే గీతూ అందరి ఎదుట సిగరెట్ మానేయాలని చెప్పడం బాగోలేదు. అది తన వీక్నెస్ అని తెలిసి, తనతో ర్యాపో ఉన్నప్పుడు నేరుగా వెళ్లి ఆయనకే చెప్తే బాగుండని ఆదిత్య అనుకున్నాడు. అతడితో స్మోకింగ్ మానిపించాలన్నదే ఆమె ఉద్దేశ్యం. దాన్ని నేను తప్పుపట్టను' అని చెప్పింది. చదవండి: ఇనయనే వెంటపడుతోంది.. సూర్య గర్ల్‌ఫ్రెండ్ లుండీ డ్యాన్స్‌తో రచ్చ లేపిన కీర్తి సురేశ్ -
విన్నర్దాకా పోకు, టాప్ 5లో ఉంటావంతే: గీతూ తండ్రి
బిగ్‌బాస్ షోలో ప్రస్తుతం బ్యాటరీ రీచార్జ్ టాస్క్ నడుస్తోంది. ఈ టాస్క్‌తో ఇంటిసభ్యులకు మంచి బూస్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు బిగ్‌బాస్. ఇప్పటికే ఈ టాస్క్‌లో భాగంగా శ్రీహాన్, ఆది రెడ్డి, సుదీపలు బ్యాటరీలో 95 శాతం వాడుకోవడంతో 5 శాతమే మిగిలింది. తిరిగి బ్యాటరీ రీచార్జ్ చేయాలంటే ఇంట్లోని చక్కెర మొత్తాన్ని త్యాగం చేయాలని లేదంటే బాలాదిత్యను స్మోకింగ్ మానేయమని ఒప్పించాలని ఆదేశించాడు బిగ్‌బాస్. దీంతో గీతూ దొరికిందే ఛాన్సని ఆదిత్యతో పొగ తాగడం మానేలా చేద్దామనుకుంది. వెంటనే ఇంటిసభ్యుల దగ్గరికి వెళ్లి బిగ్‌బాస్ చెప్పింది కాకుండా తనకు నచ్చిన పాయింట్‌ను యాడ్ చేసింది. అందరూ తిండి మానేస్తే 70 శాతం చార్జ్ అవుతుందని, ఒకవేళ బాలాదిత్య సిగరెట్లు త్యాగం చేస్తే 90 శాతం చార్జ్ అవుతుందని చెప్పింది. దీంతో అతడు మారుమాట్లాడకుండా తన వ్యసనమైన సిగరెట్లను త్యాగం చేశాడు. అనంతరం కన్ఫెషన్ రూమ్‌లోకి వెళ్లిన గీతూ ఆడియో కాల్(15) ఎంచుకుంది. తర్వాత అర్జున్.. తనకోసం కాకుండా సత్యకు వీడియో కాల్ ట్రాన్స్ఫర్ చేయండన్నాడు. అది కుదరదని బిగ్‌బాస్ చెప్పడంతో వీడియో మెసేజ్ (35) సెలక్ట్ చేసుకున్నాడు. ఇక గీతూకు తన తండ్రి ఫోన్ చేసి చాలానే మాట్లాడాడు. ఇప్పుడే విన్నర్ అని ఊహించుకోకు. కానీ ప్రస్తుతానికైతే టాప్ 5లో ఉంటావు. కొంచెం యాటిట్యూడ్ మార్చుకో. ప్రతి ఆడపిల్ల కూడా గీతూలా ఉండాలి అనిపించేలా చేయు. కానీ కొన్ని మార్చుకుంటేనే అందరికీ రోల్ మోడల్ అవుతావు అని సూచనలిచ్చాడు ఆమె తండ్రి. తర్వాత అర్జున్ తండ్రి వీడియో మెసేజ్ చూసి ఇంటిసభ్యులంతా ఎమోషనలయ్యారు. మరోపక్క ఇనయ.. తనకు ఫైమాతో ఉంటే అమ్మతో, సూర్యతో ఉంటే నాన్నతో, రాజ్‌తో ఉంటే ఫ్రెండ్స్‌తో ఉన్నట్లు ఉందని చెప్తూ ఎమోషనలైంది. అంతలోనే ఆమెను బిగ్‌బాస్ కన్ఫెషన్ రూమ్‌కు పిలవడంతో ఉన్నదాంట్లో తక్కువైన ఫొటో ఫ్రేమ్(25)ను సెలక్ట్ చేసుకుంది. గీతూ, ఇనయ, అర్జున్ వాడుకోగా మిగిలిన బ్యాటరీ 5 శాతమే ఉండటంతో దాన్ని మళ్లీ రీచార్జ్ చేయడానికి బిగ్‌బాస్ ఓ టాస్క్ ఇచ్చాడు. అందులో భాగంగా ఫైమా ఇంగ్లీష్‌లో సినిమాల గురించి చెప్తుంటే అదేం సినిమానో ఇంటిసభ్యులు గెస్ చేయాలి. ఆ టాస్క్ విజయవంతంగా పూర్తి కావడంతో బ్యాటరీ మళ్లీ రీచార్జ్ అయింది. తర్వాత శ్రీసత్య 35 శాతం ఉన్న వీడియో కాల్ సెలక్ట్ చేసుకుంది. వీడియో కాల్లో తల్లిదండ్రులను చూడగానే సత్య భావోద్వేగానికి లోనైంది. తర్వాత బాలాదిత్య 50 శాతం ఉన్న ఆడియోకాల్ ఎంచుకుని భార్య, కుమార్తెతో తనివితీరా మాట్లాడాడు. అయితే అందరికీ ఛాన్స్ రావాలని తక్కువ రీచార్జ్ ఉన్న ఫుడ్ ఆప్షన్ ఎంచుకుని పేరెంట్స్‌తో మాట్లాడలేకపోయాడు శ్రీహాన్. ఇలా బ్యాటరీ రీచార్జ్ చేసే ఆప్షన్ ఉందని నాకు ముందే ఎందుకు చెప్పలేదంటూ ఓ మూలకెళ్లి కూర్చుని ఒక్కడే ఏడ్చేశాడు. ఇదిలా ఉంటే మెరీనా మైక్ ధరించనప్పుడు, రేవంత్ పడుకున్నప్పుడు కలిపి పది శాతం వరకు చార్జ్ తగ్గిపోయింది. ఈ లెక్కన వీళ్లకు నామినేషన్స్‌లో ఇదే కారణం చెప్పి ఓట్లు గుద్దడం ఖాయంగా కనిపిస్తోంది. చదవండి: బాలాదిత్య సిగరెట్లు త్యాగం చేయాలి మహేశ్‌బాబును అలా చూడటం ఇదే మొదటిసారి