
సీనియర్ నటి అన్నపూర్ణ, మాస్టర్ రవితేజ టైటిల్ పాత్రలు చేసిన చిత్రం ‘అన్నపూర్ణమ్మగారి మనవడు’. బాలాదిత్య, వేద, సీనియర్ నటి జమున మఖ్యపాత్రల్లో నటించారు. నర్రా శివనాగేశ్వరరావు (శివనాగు) దర్శకత్వంలో ఎం.ఎన్.ఆర్. చౌదరి నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. శివనాగు మాట్లాడుతూ– ‘‘ప్రేమానురాగాలకు నిలయమైన స్వచ్ఛమైన పల్లెటూరి కథతో తెరకెక్కిన చిత్రమిది. ఉమ్మడి కుటుంబాలలోని అనుబంధాలు, మానవ సంబంధాలను సమ్మిళతం చేసి తెరకెక్కించాం. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో మా సినిమా విడుదల కానుంది’’ అన్నారు. ‘‘ఓటీటీలో లేదా థియేటర్స్‌లో మా సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు ఎం.ఎన్.ఆర్. చౌదరి.
Comments
Please login to add a commentAdd a comment