Jamuna
-
Jamuna: కళాభారతికి నీరాజనం
'వంశీ ఇంటర్నేషనల్ అండ్ శ్రీ సాంస్కృతిక కళాసారథి' సింగపూర్ సంస్ధల సంయుక్త ఆధ్వర్యంలో ప్రజానటి కళాభారతి డాక్టర్ జమున రమణారావు నటించిన సినిమాలలో ఆమె నటనా వైదుష్యంపై విశ్లేషణా ప్రసంగాలతో ‘‘మీరజాలగలడా నా యానతి’’ కార్యక్రమం అంతర్జాల వేదికపై శనివారం ఘనంగా నిర్వహించబడింది. భారత్, సింగపూర్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, మలేషియా, హాంకాంగ్, ఖతార్, యుగాండా, కెనడా, అమెరికా దేశాల నుండి 35 మంది ప్రఖ్యాత రచయితలు ఈ కార్యక్రమంలో పాల్గొని జమున నటించిన చిత్రరాజాల నుండి 35 ఆణిముత్యాలు అయిన సినిమాలను ఎంపిక చేసుకొని, వాటిలో ఆమె కనబరిచిన నటనా ప్రావీణ్యం, వివిధ రకాల పాత్రలలో ఆమె ఇమిడిపోయిన తీరు గురించి విశ్లేషిస్తూ అద్భుతమైన ప్రసంగాలను చేశారు. ముఖ్యఅతిథిగా చెన్నై నుండి ప్రముఖ సినీ రచయిత భువనచంద్ర పాల్గొని జమున నటనా ప్రభావ విశేషాలను గూర్చి, నిజ జీవితంలో ఆమె కనబరిచిన ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని గూర్చి ప్రసంగించారు. జమున కుమారులు, అమెరికా వాస్తవ్యులైన డా. వంశీ కృష్ణ ఈ కార్యక్రమంలో ప్రత్యేక అతిధిగా పాల్గొని తన మాతృమూర్తి చిత్రపటం ముందు జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సుమారు 7 గంటల పాటు జరిగిన ఈ కార్యక్రమాన్ని ఆసాంతం వీక్షించి, అందరి ప్రసంగాలను విని ఇంతటి బృహత్ కార్యక్రమాన్ని చేపట్టినందుకు వంశీ -సింగపూర్ సంస్థలకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. విదేశాల వారితోపాటు హైదరాబాద్ నుండి ప్రముఖ రచయితలైన ఆచార్య టీ గౌరీ శంకర్, హాస్యబ్రహ్మ శంకరనారాయణ, డాక్టర్ కె వి కృష్ణకుమారి, డాక్టర్ తిరునగిరి దేవకీదేవి లు ప్రసంగవ్యాసాలను అందించడం విశేషం. "తాము కార్యక్రమం ఉద్దేశాన్ని తెలియపరచగానే పది దేశాల నుంచి స్పందించి 35మంది రచయితలు ముందుకొచ్చి విశ్లేషణ వ్యాసాలను అందించడం చాలా సంతోషకరంగా ఉందని, త్వరలో ఈ వ్యాసాలు అన్నింటితో వంశీ ప్రచురణగా, పుస్తకాన్ని ప్రచురిస్తామని" కార్యక్రమ ముఖ్య నిర్వాహకులు, వంశీ వ్యవస్థాపకులు డాక్టర్ వంశీ రామరాజు, శ్రీ సాంస్కృతిక కళాసారథి వ్యవస్థాపకులు కవుటూరు రత్నకుమార్ తెలియజేశారు. రచయిత్రి రాధిక మంగిపుడి సభా నిర్వహణ గావించగా అలనాటి మేటి చిత్రాలైన మిస్సమ్మ, శ్రీకృష్ణతులాభారం, గుండమ్మ కథ, అప్పుచేసి పప్పుకూడు, యశోదా కృష్ణ, మంగమ్మ శపథం, మూగమనసులు, చిరంజీవులు, బంగారు తల్లి.. వంటి చిత్రాలలో జమున నటించిన వైవిధ్యభరితమైన పాత్రల ఔచిత్యాన్ని చక్కగా రచయితలు అభివర్ణించారు. సినిమాలతో పాటు జమున గారితో వీరందరికీ ఉన్న ప్రత్యక్ష అనుబంధాన్ని గూర్చి కూడా తలచుకుంటూ ఆమెకు నివాళులు అర్పించారు. వంశీ అధ్యక్షురాలు డా తెన్నేటి సుధా దేవి, మేనేజింగ్ ట్రస్టీ శైలజా సుంకరపల్లి నిర్వహణా సహకారం అందించారు. ఇవి చదవండి: అను వైద్యనాథన్: సాహసాల నుంచి నవ్వుల వరకు -
నాతో ఎందుకు పాడించరు అని డైరెక్ట్ గా అడిగా
-
తెలుగులో నాకు అంత పేరు రాకపోవడానికి కారణం
-
నేను పాడితే వంకలు పెట్టేవారు వాలు..!
-
నేను వచ్చిన తర్వాత ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయి
-
అప్పుడు సింగర్స్ అంటే రేడియో లో పనిచేసేవాళ్ళే
-
సింగర్స్ పడే అవమానాలు: సింగర్ జామున
-
ఇప్పటివరకు నా జీవితం చాలా సంతోషంగా గడిపాను: జమున
-
నాది సత్యభామాది క్యారెక్టర్ ఒకటే అనిపించి ఆ రోల్ చేశాను
-
పెద్ద హీరోలు అన్నమాటే కానీ అహంకారం ఎక్కువ..!
-
మా తరం వాళ్ళం అదృష్టవంతులం..
-
నా అందానికి చాలా జాగ్రత్తలు పాటించేదాన్ని
-
జామున అందంగా ఉంటుంది.. పొగరెక్కువ అనుకునేవారు..
-
కనీసం ఆ పిల్లల కోసమైనా మద్యం తాగడం మానేయ్ అని కోపడ్డాను..
-
ఈటల రాజేందర్ హత్యకు కుట్ర జరుగుతోంది: జమున
-
ఈటల భద్రతపై కేటీఆర్ ఆరా..
సాక్షి, హైదరాబాద్: బీజేపీ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హత్యకు కుట్ర జరుగుతోందంటూ ఆయన భార్య జమున సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు జమున.. ఈటలను హత్య చేసేందుకు రూ. 20 కోట్లు ఖర్చు చేస్తానని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అన్నాడని ఆమె తెలిపారు. కేసీఆర్ ప్రోత్సాహంతోనే కౌశిక్‌రెడ్డి చెలరేగిపోతున్నాడు. మహిళలపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే చెప్పుల దండ వేస్తారని కౌశిక్‌పై ఈటల జమున మండిపడ్డారు. మరోవైపు ఈ వ్యవహారంపై మంత్రి కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. దీంతో, ఈటల రాజేందర్ భద్రతపై మంత్రి కేటీఆర్ ఆరా తీశారు. తనను చంపేందుకు కుట్ర జరుగుతోందన్న ఈటల వ్యాఖ్యల నేపథ్యంలో కేటీఆర్.. తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్‌కు ఫోన్ చేశారు. ఈటల భద్రతపై సీనియర్ ఐపీఎస్‌తో వెరిఫై చేయాలని సూచించినట్టు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం సెక్యూరిటీ పెంపు వార్తల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫునే సెక్యూరిటీ ఇవ్వాలని కేటీఆర్ చెప్పినట్టు సమాచారం. ఈ క్రమంలో ఈటల రాజేందర్‌కు భద్రత పెంపుపై డీజీపీ అంజనీ కుమార్ సమీక్ష చేయనున్నారు. దీంతో, సీనియర్ ఐపీఎస్ కాసేపట్లో ఈటల ఇంటికి వెళ్లనున్నారు. ఇదిలా ఉండగా.. ఈటల జమున కామెంట్స్‌పై ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి స్పందించారు. ఈటల రాజేందర్ దంపతులు చేసిన వ్యాఖ్యలు నిజాలు కావని తెలిపారు. రూ. 20 కోట్లు ఇచ్చి తాను ఈటలను హత్య చేయిస్తాననేది పచ్చి అబద్దమని పేర్కొన్నారు. ఈటల రాజేందర్ చేసే అన్ని ఆరోపణలపై తాను బహిరంగ చర్చకు నేను సిద్ధమని సవాల్ విసిరారు. హత్యా రాజకీయాలను ఈటల కంటే గొప్పగా ఎవరూ చేయలేరని విమర్శించారు. ఎక్కడ హుజురాబాద్‌లో ఒడిపోతాడనే భయంతో తనను హత్య చేస్తాడేమోననిపిస్తుందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే తాను రాజకీయాల్లోకి వచ్చిందే ఈటల రాజేందర్‌ను ఓడించేందుకని స్పష్టం చేశారు. ఆయన్ను ఓడిస్తేనే నాకు సంతృత్తి ఉంటుందంటూ హాట్ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: ఎమ్మెల్యే రాజయ్యపై సర్పంచ్ నవ్య ఆరోపణలు.. కడియం కీలక వ్యాఖ్యలు -
ఈటల భార్య జమున సంచలన ఆరోపణలు
సాక్షి, హైదరాబాద్: బీజేపీ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ భార్య జమున సంచలన ఆరోపణలకు దిగారు. తన భర్త హత్యకు కుట్ర జరుగుతోందంటూ ఆమె మీడియా ముందుకు వచ్చారు. ఈటలను హత్య చేసేందుకు రూ. 20 కోట్లు ఖర్చు చేస్తానని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అన్నాడని ఆమె ఆరోపించారు. కేసీఆర్ ప్రోత్సాహంతోనే కౌశిక్‌రెడ్డి చెలరేగిపోతున్నాడు. మహిళలపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే చెప్పుల దండ వేస్తారని కౌశిక్‌పై ఈటల జమున మండిపడ్డారు. అలాగే.. తెలంగాణ సీఎం కేసీఆర్ ఆర్థికంగా తమను ఇబ్బంది పెడుతున్నారని ఆమె ఆరోపించారు. ఇదీ చదవండి: కేసీఆర్‌కో హఠావో.. తెలంగాణకో బచావో -
జనగామ మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్‌పై అవిశ్వాస నోటీసులు
జనగామ: జనగామ మున్సిపల్ చైర్పర్స పోకల జమున, వైస్ చైర్మన్ మేకల రాంప్రసాద్పై అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ సభ్యులు శుక్రవారం అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్‌కి అవిశ్వాస నోటీసులు అందజేశారు. తొమ్మిది రోజులపాటు క్యాంపు రాజకీయం నడిపించిన అధికార పక్షం ఆ ఇద్దరిని తొలగించాలని కోరుతూ 11 మంది బీఆర్ఎస్, 8 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు వేర్వేరుగా అవిశ్వాస నోటీసులు ఇచ్చారు. ఫ్లోర్‌లీడర్ మారబోయిన పాండును తొలగించాలని అధిష్టానాన్ని కోరినట్లు బీఆర్ఎస్ కౌన్సిలర్లు తెలిపారు. కాంట్రాక్టర్లు, ఇళ్లనిర్మాణ అనుమతులకు కమీషన్లు వసూలు చేస్తూ పార్టీని అప్రతిష్టపాలు చేస్తుండటంతో అవిశ్వాసం నోటీసులు ఇచ్చినట్లు చైర్పర్సన్ రేసులో ఉన్న 19వ వార్డు సభ్యురాలు బండ పద్మ తెలిపారు. కాగా, నలుగురు బీజేపీ సభ్యులు కూడా తమతో టచ్‌లో ఉన్నారని ఆమె చెప్పారు. -
రాజమండ్రి ఎంపీగా జమున రాజకీయ ప్రస్థానం
సీటీఆర్ఐ(రాజమ హేంద్రవరం)/అమలాపు రం టౌన్/సామర్లకోట/కొవ్వూరు: గోదారీ గట్టుంది.. గట్టుమీన సెట్టుంది.. సెట్టుకొమ్మన పిట్టుంది.. పిట్ట మనసులో ఏముంది..ఈ పాట వినగానే ఠక్కున గుర్తుకు వచ్చేది గలగల పారే గోదావరి మాత్రమే కాదు..అమాయకత్వాన్ని..అందాన్ని..అభినయాన్ని మూటగట్టుకున్న అలనాటి సినీనటి జమున..గోదావరిని..ఆ నదీమతల్లి పేరును తెరకు బలంగా పరిచయం చేసిన ఆమె మూగ మగమనసులు ఎప్పటికీ చిరస్మరణీయం ..రాజమహేంద్రవరానికి చెందిన దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు తాను అమితంగా ప్రేమించే గోదావరిని 1964లో ఈ చిత్రం ద్వారా తెరకెక్కించారు. గోదారి గట్టుంది పాటకు తన అభినయంతో జమున ప్రాణం పోశారు. శుక్రవారం ఉదయం జమున కన్నుమూశారని తెలియగానే జిల్లా ప్రజానీకం కంటతడి పెట్టింది. ఈ అందాల తారతో తమ గోదారి ప్రాంతానికి ఉన్న అనుబంధాన్ని నెమరు వేసుకుంది. చాలామంది ఈమెను గోదావరి జిల్లా వాసిగా భావిస్తారు. కర్నాటక హంపీలో పుట్టినా ఈమె మన జిల్లాతో మమతానురాగాలను పెనవేసుకున్నారు. అందుకే ఇక్కడి ప్రజలు కూడా ఆమెను తమ ఆడపడుచుగా ఆదరించారు. గలగల పారుతున్న గోదారిలా.. 1953లో జమున పుట్టిల్లు సినిమాతో తెరంగేట్రం చేసినా అంత గుర్తింపు రాలేదు. 1964లో ఆదుర్తి దర్శకత్వంలో నిర్మించిన మూగమనసులు చిత్రంలో ఈమె గౌరమ్మ పాత్ర పోషించారు. ఈ చిత్రం ద్వారా జమున ప్రేక్షకుల గుండెల్లో స్థిరమైన స్థానం సంపాదించుకున్నారు. అదే సినీమా హిందీలో మిలన్గా రీమేక్ చేస్తే అందులో కూడా నటించి మెప్పించారు. ఉత్తమ సహాయనటిగా ఫిల్మిఫేర్ అవార్డు అందుకున్నారు. సఖినేటిపల్లి–నర్సాపురం మధ్య వశిష్ట గోదావరి గట్ల పైన..పడవలపైన ఈమెతో తీసిన ‘గోదారి గట్టుంది.. పాట ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ‘నా పాట నీ నోట పలకాలా చిలకా’ పాట కూడా గోదావరి అందాల బ్యాక్ డ్రాప్లోనే చిత్రీకరించారు. గోదావరికీ జమునకు విడదీయరాని బంధముందేమో. 1974లో చిత్రీకరించిన గౌరి సిమిమాలో ‘గల గల పారుతున్న గోదారిలా’ పాటలో కృష్ణతో ఇక్కడి గోదావరి పాయల్లోనే నర్తించారు. 2014లో జరిగిన గోదావరి పుష్కరాలకు ఆమె పనిగట్టుకుని మరీ వచ్చారు.‘గోదారి గట్టుంది’ పాట తాను జీవించి ఉన్నంత కాలం గుర్తుంటుందని చెప్పడం విశేషం పెద్ద మనసున్న నటి 1977లో సంభవించిన దివిసీమ ఉప్పెనతో కనివీని ఎరుగని నష్టం వాటిల్లింది. ఆ క్లిష్ట సమయంలో బాధితులకు అండగా ఎనీ్టఆర్, ఏఎన్ఆర్ వంటి అగ్రతారలతో కలిసి జమున జోలె పట్టి చందాలు వసూలు చేశారు. ఇక్కడి ప్రజలు తమ ఆడపడుచు వచ్చినట్లుగా భావించి స్పందించారు. వంద రూపాయలిస్తే షేక్‌హ్యాండ్ ఇస్తానని సరదాగా అనడంతో అభిమానులు ఎగబడి ఆమెకు కరచాలనం చేసి విరివిగా విరాళాలు అందజేశారు. రాజమండ్రి ఎంపీగా.. ఇందిరాగాంధీ మీద ఉన్న అభిమానంతో జమున రాజకీయాలలో అడుగుపెట్టారు. తనను సినీరంగంలో ఆదరించిన రాజమండ్రి నుంచి 1989లో పోటీ చేశారు. లోక్‌సభ సభ్యురాలిగా 1991 వరకూ కొనసాగారు. తెలుగు ఆర్టిస్ట్ ల అసోసియేషన్‌ను ప్రారంభించారు. రంగ స్థల వృత్తి కళాకారుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్న తరుణంలో సామర్లకోట మండలం మాధవపట్నం శివారున ఉన్న తోలుబొమ్మ కళాకారుల జీవన పరిస్థితులు చూసి చలించిపోయారు. అప్పటి కలెక్టర్‌తో వారి ఇళ్ల స్థలాల గురించి మాట్లాడారు. గ్రామ సమీపంలో సుమారు 10 ఎకరాలను ప్రభుత్వంతో కొనుగోలు చేయించి మూడేసి సెంట్లు వంతున 176 మంది కళాకారులకు ఇళ్ల స్థలాలుగా అందజేశారు. ఎంపీగా ఉన్నప్పుడు తమ వద్దకు వచ్చి యోగ క్షేమాలు అడిగే వారని ఈ కళాకారుల సంఘ నాయకులు తోట బాలకృష్ణ, తోట గణపతి, రాష్ట్ర బొందిలిల కార్పోరేషన్ డైరెక్టర్ తోట సత్తిబాబులు గుర్తు చేసుకున్నారు. అందుకే మాధవపట్నం శివారు ప్రాంతాన్ని జమునానగర్గా వ్యవహరిస్తున్నారు. ♦ఎంపీ హోదాలో జమున రాజమహేంద్రవరంలో 1991 ఏప్రిల్ 5న ఇందిరాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. కొవ్వూరు మండలం నందమూరులో అంబేడ్కర్ విగ్రహాన్ని కూడా ఆవిష్కరించిన వైనాన్ని గ్రామస్తులు గుర్తు చేసుకున్నారు. ♦ 1989లో కొవ్వూరు అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసిన రఫీయుల్లా బేగ్ తరఫున జమున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కాపవరంలో రఫీ మోటారు బైకు ఎక్కి ఆమె ప్రధాన వీధుల్లో తిరిగి ఓట్లు అభ్యర్థించారు. రాజమహేంద్రి ఆడపడుచు జమున: ఎంపీ భరత్ రాజమహేంద్రవరం రూరల్: జమున మృతికి వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్, ఎంపీ మార్గాని భరత్‌రామ్ ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆమె నటన తెలుగు ప్రజల గుండెల్లో ఎప్పటికీ సజీవమేనన్నారు. అగ్ర కథానాయకుల చెంత దీటుగా నటించి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. సత్యభామ పాత్రలో ఆమె జీవించారన్నారు. 70 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఎన్నో విజయాలు అందుకున్నారన్నారు. రాజమండ్రి నుంచి ఎంపీగా విజయం సాధించి ఈ ప్రాంత ఆడపడుచుగా పేరొందారని నివాళులరి్పంచారు. జెట్ మిత్ర రండి... జమున రాజమహేంద్రవరం నగరానికి ఎప్పుడు వచ్చినా జెట్ మిత్ర రండి అని నన్ను పిలిచేవారు. మేడమే నా పేరు జిత్ మోహన్ మిత్ర అని చెబితే మీరు పిలవగానే జెట్ స్పీడ్‌తో వస్తారు కదా ..అందుకే జెట్ మిత్ర అని పిలుస్తున్నాను అనేవారు. అమె ఎంపీగా పోటీ చేసినప్పుడు అమె దగ్గర ఉండి తోడ్పాటు అందించాను. పెద్ద తార అయినప్పటికీ భేషజం చూపించేవారు కాదు. – శ్రీపాద జిత్‌మోహన్‌మిత్ర, సినీయర్ నటుడు ఆమె ఆత్మకు శాంతి కలగాలి... 2016 శ్రీమహాలక్ష్మీ సమేత చినవేంకటేశ్వర స్వామి పీఠం బ్రహ్మోత్సవాలలో సర్వేజనా సుఖినోభవంతు చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో జమునకు కళాతపస్విని అనే బిరుదును ప్రదానం చేశాం. రాజమహేంద్రవరం ఆడపడుచుగా ఆమెను సత్కరించుకున్నాం. ఆమె ఆత్మకు భగవంతుడు శాంతిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. – డాక్టర్ శ్రీమాన్ చిన్న వెంకన్నబాబు స్వామిజీ -
జమున చాలా పొగరుబోతు, ఇంట్లోకి కూడా రానివ్వదు అనుకునేవారట!
తెలుగువారి తొలి గ్లామర్ స్టార్ కాంచన మాల. తర్వాతి గ్లామర్ స్టార్ జమున. ఎవరి పక్కనైనా అందంగా సరిపోయే స్టార్‌గా జమున తెలుగు సినిమా పరిశ్రమలో దాదాపు 25 ఏళ్లు ఏలింది. హరనాథ్‌తో ‘లేత మనసులు’ పెద్ద హిట్ సాధించింది. అందులోని ‘హలో మేడమ్ సత్యభామా’, ‘అందాల ఓ చిలుకా అందుకో నా లేఖ’ పాటల్లో జమున జాంపండులా ఉందని ప్రేక్షకులు మురిసిపోయారు. ఒక సీనియర్ హీరోయిన్ అయి ఉండి, పెద్ద స్టార్ అయి ఉండి చలంతో ‘మట్టిలో మాణిక్యాలు’ హిట్ కొట్టింది జమున. అందులో ‘నా మాటే నీ మాటై చదవాలి’ పాట అతి మధురం. ముచ్చటం. ఫీల్డ్‌కు వచ్చిన కొత్తల్లో జమునను ‘హంపీ సుందరి’ అని, ‘ఆంధ్రా నర్గిస్’ అని పిలిచేవారు. చిత్రంగా నర్గిస్‌కు చిరఖ్యాతి తెచ్చి పెట్టిన ‘మదర్ ఇండియా’ను జమునే తెలుగులో చేసింది. ఆ సినిమా పేరు ‘బంగారు తల్లి’. పొగరుబోతు అనే పేరు ఎందుకు? ఇండస్ట్రీలో మరింత మెరుగ్గా రాణించే క్రమంలో మద్రాస్‌కు మకాం మార్చారు జమున కుటుంబ సభ్యులు. అయితే ఓ సినిమాలో జమునకు అవకాశం ఇస్తామన్నట్లుగా ఆమె తండ్రి శ్రీనివాసరావును కొందరు అజ్ఞాతవ్యక్తులు కారులో తీసుకుని వెళ్లారు. కొంతదూరం ప్రయాణించిన తర్వాత వారిపై ఆయనకు అనుమానం రావడంతో సిగరెట్ల సాకుతో వారి నుంచి ఎలాగో తప్పించుకున్నారు. అదే సమయంలో ఇంట్లో ఉన్న తన కుటుంబసభ్యులకు ఏమైనా ఆపద కలిగిందా? అని చాలా కంగారుపడ్డారట జమున తండ్రి. ఈ ఘటన తర్వాత తాను ఇంట్లో లేనప్పుడు ఇంటికి ఎవరొచ్చినా తలుపు తెరవొద్దని, అవసరమైతే కీటికీలోనుంచి చూసి, తెలిసిన వారైతేనే తలుపు తీయమని, ముఖ్యంగా తెలియనివారైతే తాను ఇంట్లో ఉన్నప్పుడే రమ్మని చెప్పాలన్నట్లుగా కుటుంబసభ్యులకు చెప్పారట శ్రీనివాసరావు. దీంతో తండ్రి చెప్పినట్లే చేశారట జమున. ఈ కారణంగా కొందరు దర్శక–నిర్మాతలు జమున ఇంటి వరకు వచ్చీ.. ఆమెను కలవకుండానే వెళ్లిపోవాల్సి వచ్చేది. అయితే అసలు విషయం తెలియని కొందరు దర్శక–నిర్మాతలు ‘జమున చాలా పొగరుబోతు.. ఇంట్లోకి కూడా రానివ్వదు’ అని చెప్పుకునేవారట. తమిళ్‌తో అనుబంధం కథానాయికగా జమున తెలుగు సినిమా ద్వారా పరిచయమైనప్పటికీ తమిళ సినిమాకూ ఎనలేని సేవలు అందించారు. దివంగత మహానటులు ఎంజీఆర్, శివాజీ గణేశన్ , జెమినీ గణేశన్ వంటి వారితో జమున నటించి ఆకట్టుకున్నారు. ‘పణం పడత్తుం పాడు’ (1954) చిత్రంతో కోలీవుడ్‌కి పరిచయం అయ్యారు జమున. ‘మిస్సియమ్మ (మిస్సమ్మ), తెనాలి రామన్, తంగమలై రహస్యం, తిరుట్టు రామన్, నాళయ తీర్పు వంటి పలు విజయవంతమైన చిత్రాలు జమున ఖాతాలో ఉన్నాయి. ఇక క్యారెక్టర్ నటిగా ‘తూంగాదే తంబి తూంగాదే’ చిత్రంలో కమల్‌హాసన్‌కు తల్లిగా నటించారామె. అప్పట్లో తమిళ పరిశ్రమలో హీరోలకు సమానంగా పారితోషకం పొందిన సావిత్రి తర్వాత ఆ స్థాయిలో అందుకున్న నటి జమున కావడం విశేషం. చదవండి: జమున బయోపిక్‌లో తమన్నా భాటియా? కూతుర్ని హీరోయిన్గా చూడాలనుకున్న జమున -
జమున బయోపిక్‌లో స్టార్ హీరోయిన్!
దివంగత ప్రఖ్యాత నటీమణి జమున బయోపిక్‌లో మిల్కీబ్యూటీ తమన్న నటించనున్నారా? అన్న ప్రశ్నకు కోలీవుడ్‌లో అలాంటి అవకాశం ఉందనే సమాధానం వస్తోంది. ప్రఖ్యాత నటీమణుల జీవిత చరిత్రతో చిత్రాలు తెరకెక్కించడం సాధారణ విషయమే. ఇంతకుముందు నటి సావిత్రి జీవిత చరిత్రతో రూపొందిన మహానటి చిత్రంలో కీర్తిసురేశ్ టైటిల్ పాత్రను పోషించారు. సావిత్రి పాత్ర పోషించిన కీర్తీసురేశ్‌కు సినీ ప్రముఖుల అభినందనలు దక్కడంతో పాటు జాతీయ ఉత్తమ నటి అవార్డును అందుకున్నారు. అదేవిధంగా ప్రముఖ శృంగార తార సిల్క్‌స్మిత బయోపిక్ హిందీలో ది డర్టీ పిక్చర్స్ పేరుతో రూపొందించారు. సిల్క్‌స్మిత పాత్రలో విద్యాబాలన్ నటించి ప్రశంసలు అందుకున్నారు. ఇకపోతే ప్రఖ్యాత నటి, దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్రతో రూపొందిన తలైవి చిత్రంలో బాలీవుడ్ సంచలన నటి కంగనారనౌత్ టైటిల్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. తాజాగా ప్రఖ్యాత నటీమణి జమున జీవిత చరిత్రను తమిళం, తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. నటి జమున తెలుగు, తమిళం, కన్నడం, హిందీ భాషల్లో 190 చిత్రాలకు పైగా నటించారు. ఈ బయోపిక్‌లో హీరోయిన్ తమన్నా జమున పాత్రను పోషించనుందట. కథ విన్న వెంటనే ఆమె అంగీకరించినట్లు ఓ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అయితే దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. చదవండి: కూతుర్ని హీరోయిన్గా చూడాలనుకున్న జమున -
కూతుర్ని హీరోయిన్గా చూడాలనుకున్న జమున, కానీ..
తెలుగువారి సత్యభామగా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసిన జమున (86) ఇకలేరు. వయోభారం, అనారోగ్య కారణాలతో హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని తన స్వగృహంలో శుక్రవారం ఉదయం 7.30 ని‘‘లకు తుదిశ్వాస విడిచారామె. అమెరికాలో ఉంటున్న కుమారుడు వంశీకృష్ణ హైదరాబాద్ చేరడానికి ఆలస్యం కావడంతో కుమార్తె స్రవంతి తల్లికి అంత్యక్రియలు నిర్వహించారు. నిప్పాణి శ్రీనివాసరావు, కౌసల్యాదేవి దంపతులకు 1936 ఆగస్ట్ 30న హంపిలో జన్మించారు జమున. తండ్రికి గుంటూరులో పొగాకు, పసుపు వ్యాపారాలుండేవి. శ్రీనివాసరావు వ్యాపార రీత్యా జమున బాల్యమంతా గుంటూరు జిల్లాలోని దుగ్గిరాలలో గడిచింది. చక్కని సంగీత విద్వాంసురాలు అయిన కౌసల్యాదేవి జమునకి శాస్త్రీయ సంగీతం, హార్మోనియంలలో శిక్షణ ఇప్పించారు. దుగ్గిరాల గ్రామస్తులు వేసిన ‘ఛలో ఢిల్లీ’ నాటకంలో తొలిసారి వసుంధర అనే పాత్ర వేశారు జమున. ఆ తర్వాత ‘మా భూమి, ఖిల్జీ రాజ్యపతనం..’ ఇలా పలు నాటకాలు వేశారు జమున. దుగ్గిరాలకు చెందిన శ్రీమన్నారాయణమూర్తి అనే నటుడు జమున గురించి నిర్మాత బీవీ రామానందంకు (‘వరూధిని’ సినిమా తీశారు) చెప్పారు. దీంతో ఆయన నిర్మిస్తున్న తర్వాతి చిత్రం ‘జై వీర భేతాళ’(1952 మార్చిలో స్టార్ట్ అయింది) అనే సినిమాలో హీరోయిన్గా జమునకు అవకాశం ఇచ్చారు. ఈ చిత్రంలో గుమ్మడి హీరోగా ఎంపికయ్యారు. అయితే ఆ సినిమా ఎందుకో ఆగిపోయింది. ఆ తర్వాత గరికపాటి రాజారావు దర్శకత్వం వహించిన ‘పుట్టిల్లు’ (1953) సినిమా ద్వారా హీరోయిన్గా పరిచయమయ్యారు జమున. ఆ తర్వాత ఎన్టీఆర్, ఏఎన్ఆర్, జగ్గయ్య వంటి అగ్రహీరోల సరసన కథానాయికగా నటించారు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళంతో పాటు పలు హిందీ సినిమాల్లో నటించి భేష్ అనిపించుకున్నారామె. దాదాపు 200 సినిమాల్లో ఎన్నో పాత్రల్లో జమున నటించినా బాగా పేరు తెచ్చినవాటిలో సత్యభామ పాత్రని ప్రముఖంగా చెప్పుకోవాలి. ఆ పాత్రలో ఆమెను తప్ప ఎవర్నీ ఊహించుకోలేం అన్నట్టుగా జీవించారు జమున. ‘సంతోషం, మిస్సమ్మ, చిరంజీవులు, తెనాలి రామకృష్ణుడు, దొంగరాముడు, బంగారు పాప, వద్దంటే డబ్బు, చింతామణి, భూకైలాస్, భాగ్యరేఖ, గుండమ్మకథ’ వంటి పలు హిట్ చిత్రాల్లో నటించారు జమున. ‘తెలుగు ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ అనే సంస్థ నెలకొల్పి 25 సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారామె. లెక్చరర్‌తో పెళ్లి... హీరోయిన్లు సినిమా ఇండస్ట్రీలోని వారిని కాకుండా ఇతర రంగంలోని వారిని వివాహం చేసుకోవడం నటి పద్మినీతో ఆరంభమైంది. అలా వివాహం చేసుకున్న రెండో హీరోయిన్ జమున. దూరపు బంధువైన రమణారావుతో 1965లో జమున వివాహం తిరుపతిలో జరిగింది. రమణారావు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయంలో పీహెచ్డీ చేస్తూ, జువాలజీ లెక్చరర్‌గా చేసేవారు. డాక్టరేట్ అందుకున్న తర్వాత ఉస్మానియా విశ్వ విద్యాలయానికి బదిలీ అయ్యారాయన.. దీంతో కాపురాన్ని హైదరాబాద్‌కి మార్చారు. జమున కూడా మద్రాసు (చెన్నై) నుంచి హైదరాబాద్‌కి వచ్చేశారు. 1976లో బంజారాహిల్స్‌లో సొంత ఇల్లు కట్టుకుని స్థిరపడ్డారామె. రమణారావు–జమునలకు వంశీకృష్ణ, స్రవంతి సంతానం. తొలి సంతానం వంశీకృష్ణ పుట్టిన తర్వాత కూడా పదేళ్లపాటు హీరోయిన్గా బిజీగానే కొనసాగారు జమున. వంశీకృష్ణ శాన్ఫ్రాన్సిస్కో విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పని చేస్తూ అక్కడే స్థిరపడ్డారు. బర్కిలీలోని స్టెయిన్డ్ గ్లాస్ గార్డెన్లో గ్లాస్ పెయింటింగ్‌లో శిక్షణ పొంది, అదే రంగంలో స్రవంతి స్థిరపడ్డారు. స్రవంతిని హీరోయిన్ చేయాలనుకున్నారు జమున. అయితే ఇండస్ట్రీలో వచ్చిన మార్పులతో ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారామె. కాగా ఓ నవల ఆధారంగా సినిమా తీయాలని, దానికి తనే దర్శకత్వం వహించాలని సంకల్పించారు జమున. నాలుగు పాటలు రికార్డు చేసిన తర్వాత ఈ సినిమా ఆగిపోయింది. అయితే దర్శకత్వంపై తనకున్న మమకారంతో ‘డాక్టర్ మమత’ అనే సీరియల్‌ని తెరకెక్కించారామె. దూరదర్శన్‌లో 15 ఎపిసోడ్స్‌గా ఆ సీరియల్ ప్రసారం అయింది కూడా! రాజకీయ రంగంలో... 1980లలో నాటి ప్రధాని రాజీవ్ గాంధీ ప్రోత్సాహంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు జమున. పార్టీ కార్యవర్గ సభ్యురాలిగా ఎన్నికై 1983లో ఆ పార్టీ తరఫున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రచారం చేశారామె. తర్వాత రాజీవ్ గాంధీ సపోర్ట్‌తో 1989లో రాజమండ్రి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు జమున. ఆ తర్వాత వచ్చిన మధ్యంతర ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కొన్నాళ్లు చేసిన ఆమె ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి బయటికొచ్చేశారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి వ్యవహార శైలి నచ్చి భారతీయ జనతా పార్టీలో చేరారు.. 1990వ దశకంలో ఆ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం చేశారు. ఆ తర్వాత ‘రంగస్థల వృత్తి కళాకారుల సమాఖ్య’ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టి రాష్ట్రంలో పర్యటించి, పదివేల మంది కళాకారుల వివరాలు సేకరించారామె. అంతేకాదు.. ‘రంగస్థల వృత్తి కళాకారుల సమాఖ్య’కు 26 శాఖలు ఏర్పాటు చేశారు. నిరుపేద కళాకారులకు ఇళ్ల స్థలాలు, గృహ రుణాలు, పెన్షన్లు మంజూరు చేయించి పెద్ద మనసు చాటుకున్నారు జమున. అవార్డులు... 1964లో విడుదలైన ‘మూగమనసులు’ (తెలుగు), 1968లో రిలీజైన ‘మిలన్’ (హిందీ) చిత్రాలకు ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, 2008లో ‘ఎన్టీఆర్ జాతీయ పురస్కారం’ అందుకున్నారామె. అలాగే 2021 సంవత్సరానికిగాను ‘సాక్షి’ మీడియా గ్రూప్ ఎక్స్‌లెన్స్ అవార్డుల్లో భాగంగా ‘జీవిత సాఫల్య పురస్కారం’ అందుకున్నారు జమున. దాదాపు ఏడు దశాబ్దాల కెరీర్లో అద్వితీయమైన పాత్రలు చేసిన జమునకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే‘పద్మ’ పురస్కారం వరించలేదు. అయినా అవార్డులకు అతీతంగా ‘సత్యభామ’గా ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్రవేసిన ఈ అద్భుత నటి చరిత్ర ఎప్పటికీ నిలిచిపోతుంది. కూతురే కుమారుడై... 2014 నవంబరు 10న జమున భర్త రమణారావు గుండెపోటుతో మృతి చెందారు. అప్పటినుంచి కుమార్తె స్రవంతి దగ్గరే ఉంటున్నారు జమున. తల్లికి అన్నీ తానయ్యారు స్రవంతి. శుక్రవారం ఉదయం జమున మరణించగా, మధ్యాహ్నం ఆమె పార్థివ∙దేహాన్ని ఫిలిం చాంబర్లో అభిమానుల సందర్శనార్థం ఉంచారు. ఆ సాయంత్రం 4.30 గంటలకు ఫిలిం చాంబర్ నుంచి జమున అంతిమ యాత్ర మహాప్రస్థానానికి చేరింది. అమెరికాలో ఉంటున్న కుమారుడు వంశీకృష్ణ నేడు (శనివారం) హైదరాబాద్ చేరుకుంటారు. దాంతో అన్నీ తానై అశ్రునయనాల మధ్య తల్లికి స్రవంతి అంత్యక్రియలు నిర్వహించారు. సినీ ప్రముఖులు, కుటుంబసభ్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖామంత్రి ఆర్కే రోజాతోపాటు పలువురు పాల్గొని అశ్రునివాళులు అర్పించారు. గాయం చేసిన లేత మనసులు... ‘లేత మనసులు’ సినిమా తమిళ వెర్షన్ చేస్తుండగా జరిగిన ఓ ప్రమాదం వల్ల జమున మెడ బాగా దెబ్బతింది. ‘అందాల ఓ చిలుకా..’ పాట తమిళంలో తీస్తున్నారు. హీరో గడ్డిమేట మీద నుంచి జారుకుంటూ వచ్చి జమున పక్కన చేరాలి. అయితే కొత్తవాడైన ఆ చిత్ర హీరో జయశంకర్.. సీనియర్ హీరోయిన్ జమునతో చేస్తున్నాననే కంగారుతో అడ్డదిడ్డంగా వచ్చి జమున తలపై పడ్డారు.. దీంతో ఆమె మెడ విరిగినంత పనయింది. షూటింగ్ నిలిచిపోయింది. సున్నితమైన మెడ నరాలు దెబ్బతినడంతో కొన్నాళ్లు చికిత్స తర్వాత మళ్లీ షూటింగ్లో పాల్గొన్నారు జమున. అయితే కొన్నేళ్ల తర్వాత ఆ సమస్య మళ్లీ మొదటికొచ్చింది.. దీంతో ఆమె మెడ ఎక్కువగా ఊగిపోయేది. ‘రాజపుత్ర రహస్యం’ సినిమాలో ఈ ఇబ్బంది ఆమెలో బాగా కనిపించేది. ఎన్ని చికిత్సలు తీసుకున్నా తల ఊగడం తగ్గలేదు. 1978లో విడుదలైన ‘శ్రీరామ పట్టాభిషేకం’ తర్వాత సినిమాల నుంచి గౌరవంగా తప్పుకున్నారు జమున. ఆ తర్వాత ‘బంగారు కొడుకు’(1982), ‘జల్సా రాయుడు’(1983), ‘రాజకీయ చదరంగం’(1989) వంచి చిత్రాల్లో ముఖ్యమైన పాత్రలు చేశారు. కాగా ఆమె నటించిన చివరి చిత్రం ‘అన్నపూర్ణమ్మగారి మనవడు’ 2021 జనవరి 29న విడుదలైంది. నటి జమునతో తన అనుబంధాన్ని ‘సాక్షి’తో నటి కాంచన ప్రత్యేకంగా పంచుకున్నారు. నన్ను ఏడిపించేశావ్ కాంచీ అన్నారు – కాంచన ► వారానికి మూడు నాలుగు సార్లు జమున అక్క, నేను మాట్లాడుకునేవాళ్లం. అయితే ఈ నెల నాకు తీరిక లేకపోవడం, అక్క కూడా ఫోన్ చేయకపోవడంతో మాట్లాడుకోలేదు. మామూలుగా ఫోన్ చేసి, అప్పటి సినిమాల గురించి మాట్లాడుకుంటుంటాం. ‘భోజనం చేశావా.. వంట ఏంటి?’.. ఇవన్నీ కూడా చెప్పుకునేవాళ్లం. ► జమున అక్క నా సీనియర్. నేను కాలేజీ డేస్ నుంచే సీనియర్లతో జూనియర్లు మాట్లాడకూడదా అనుకునేదాన్ని. ఆ ఫీలింగ్‌తో సీనియర్లతో కూడా బాగా మాట్లాడేదాన్ని. సినిమాల్లోకి వచ్చాక కూడా అంతే. పైగా మేం చిన్నవాళ్లం అనే ఫీలింగ్ ఏమీ పెట్టుకోకుండా జమునక్క, సావిత్రక్క బాగా మాట్లాడేవారు. ► ఇక దసరా వచ్చిందంటే చాలు... బొమ్మల కొలువు సందడి ఉండేది. ఒకరింటికి ఒకరు వెళ్లడం.. సుండల్ (శెనగలు) తినడం... అంతా బాగుండేది. పైగా జమున అక్క భలే డ్రెస్ చేసుకునేవారు. ఆవిడకు బాగా రెడీ అవ్వడం అంటే ఇష్టం. నా డ్రెస్సింగ్ డిఫరెంట్‌గా ఉండేది. సింపుల్‌గా రెడీ అయ్యేదాన్ని. బాగున్నావని మెచ్చుకునేవారు. ► అట్లతద్దిని అయితే ఎప్పటికీ మరచిపోలేను. అప్పట్లో అందరం మదరాసు (చెన్నై)లో ఉండేవాళ్లం కదా. అట్లతద్ది నాడు ఒకళ్లు అట్లు వేసేవాళ్లం. ఇంకొకరు చట్నీ చేసేవాళ్లం. ఇంకొకరు పులుసు.. జమున అక్క, నేను అందరం మెరీనా బీచ్‌కి వెళ్లిపోయేవాళ్లం. అక్కడ ఉయ్యాల కుదరదు కదా. పరుగు పందేలు పెట్టుకుని, చాలా హ్యాపీగా గడిపేవాళ్లం. ► ఆ మధ్య ఒకసారి జమున అక్క ఫోన్ చేసి, ‘నన్ను ఇవాళ బాగా ఏడిపించేశావ్..’ అంటే, నాకేం అర్థం కాలేదు. ‘నేనేం ఏడిపించాను అక్కా...’ అంటే... నువ్వు యాక్ట్ చేసిన ‘కల్యాణ మంటపం’ సినిమా చూశాను. ‘ఎంత బ్రహ్మాండంగా యాక్ట్ చేశావ్. ఎమోషనల్ సీన్స్‌లో ఏడిపించావ్’ అంటే నాకు పట్టరానంత ఆనందం కలిగింది. ► జమునక్క యాక్ట్ చేసినవాటిలో నాకు ‘మూగ మనసులు’ చాలా ఇష్టం. ఇక ‘మిస్సమ్మ’లో ‘బృందావనమది అందరిదీ..’ పాటకి ఎంతో నాజూకుగా డ్యాన్స్ చేసింది. మనకు ఏమీ తెలియనప్పుడు టీచర్ చెప్పింది చెప్పినట్లు చేస్తాం... ఆ సినిమాలో డ్యాన్స్ నేర్చుకునే స్టూడెంట్‌గా టీచర్ చెప్పింది చెప్పినట్లు చేసే క్యారెక్టర్ని అక్క అద్భుతంగా చేసింది. ► మేం కలిసి నాటకాలు కూడా వేసేవాళ్లం. ముఖ్యంగా ‘శ్రీకృష్ణ తులాభారం’ నాటకం చాలాసార్లు వేశాం. అందరూ ఆడవాళ్లే నటించాలన్నది అక్క ఆశ. అలానే ఆడవాళ్లందరం కలిసి నటించాం. సినిమాలో కృష్ణుడిగా ఎన్టీఆర్ నటించారు. నాటకంలో ఆ పాత్ర నాది. సత్యభామగా జమున అక్క నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. అలాంటిది కృష్ణుడిగా నా నటనను మెచ్చుకునేది. ► మేమంతా సత్య సాయిబాబా భక్తులం. జీవితం అనేది పోరాటం. ఈ పోరాటంలో గెలిచి నిలబడటం చాలా కష్టమైన విషయం. జమున అక్క నిలబడింది. ఈ గెలుపు కన్నా కూడా బతికున్నంతవరకూ పోరాటం చేసే మనిషి పోయేటప్పుడు ప్రశాంతంగా పోవడమనేది ముఖ్యం. ఆ ప్రశాంతత అక్కకు దక్కింది. ‘దేవుడా.. ఆస్పత్రిపాలు కాకుండా ప్రశాంతంగా తీసుకెళ్లు’ అని కోరుకుంటాం. ఆ సత్య సాయిబాబా ఆశీస్సులతో అక్క ఎలాంటి ఇబ్బంది పడకుండా వెళ్లిపోయింది. ఆ జీవుడు చివరి నిమిషంలో ఎలాంటి బాధ పడకుండా నిష్క్రమించింది. ప్రశాంతమైన మనిషికి ప్రశాంతమైన నిష్క్రమణ దక్కింది. ఇది కదా కావాల్సింది (గద్గద కంఠంతో..) పేరు మారిందిలా... జమున పేరు వెనక ఓ విశేషం ఉంది. ఆమె తల్లిదండ్రులు తీర్థయాత్రలు చేస్తూ, పండరీపురంలోని పాండురంగని దర్శనం చేసుకున్న తర్వాతే కౌసల్య కడుపులో పడ్డారట జమున. ఈ కారణం చేత ‘జనాబాయి’ అని పేరు పెట్టుకోవాలనుకున్నారు జమున తల్లిదండ్రులు. కానీ జన్మరాశి ప్రకారం ఏదైనా నది పేరు రావాలని పెద్దలు చెప్పడంతో ‘జ’కి ‘న’కు మధ్యలో ‘ము’ అక్షరాన్ని చేర్చి ‘జనాబాయి’ పేరును ‘జమున’గా మార్చారు. ఉత్తరాదిలో ‘యుమున’ నదిని ‘జమున’ అంటారు. ‘ఇంత నాజుకైన పేరు పెట్టి సినిమారంగం కోసం మళ్లీ పేరు మార్చుకునే అవసరం లేకుండా చేసిన మా అమ్మను నిజంగా అభినందించాల్సిందే’ అని పలు సందర్భాల్లో జమున గుర్తుచేసుకుని హ్యాపీ ఫీలయ్యేవారు. సావిత్రితో ప్రత్యేక అనుబంధం ‘మిస్సమ్మ’, ‘దొంగరాముడు’, ‘అప్పుచేసి పప్పుకూడు’, ‘గుండమ్మకథ’ వంటి చిత్రాల్లో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న సావిత్రి, జమునల మధ్య మంచి అనుబంధం ఉంది. అక్కాచెల్లెళ్లుగా అన్ని విషయాలను అరమరికలు లేకుండా చర్చించుకునేవారు. అయితే కొందరు వ్యక్తులు కావాలని వీరిద్దరి మధ్యలో తగువులు పెట్టడంతో ఏడాది పాటు సావిత్రి, జమున మాట్లాడుకోలేదు. ఆ తర్వాత అసలు విషయం గ్రహించి మునుపటిలానే ఉండసాగారు. ఈ విషయాన్ని జమున ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అంతేకాదు.. తన కొడుకు బారసాల వేడుకకు సావిత్రి వచ్చారని, ఆ సమయంలో ఆమె (సావిత్రి) జీవితం సజావుగా సాగనందుకు చాలా బాధపడి ఏడ్చారని, అప్పుడు తానే సావిత్రిని ఓదార్చినట్లుగా కూడా జమున ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. అలాగే ఒకానొక స్థితిలో సావిత్రి పరిస్థితిని చూసి తనకు చాలా బాధకలిగిందని కూడా జమున పేర్కొన్నారు. నటన–డైరెక్షన్–మ్యూజిక్: జమున! చిన్నతనం నుంచే జమునకు కళల పట్ల మక్కువ ఎక్కువ. అందుకే తొమ్మిదేళ్లు వచ్చేలోపే నాటకాల్లో నటించారు. ప్రజా నాట్యమండలి ఆధ్వర్యంలో తిరునగరి రామాంజనేయులు, బుర్రకథ పితామహుడు నాజర్ తదితరుల నాయకత్వంలో ‘మా భూమి’, ‘ముందడుగు’ ‘దిల్లీ’, ‘ఛలో’, ‘విందు’ వంటి నాటకాల్లో నటించారు జమున. ముఖ్యంగా ‘మా భూమి’ నాటికలోని జమున నటనకు మంచి మార్కులు పడ్డాయి. మరో విశేషం ఏంటంటే... ‘విందు’ అనే నాటికలో యశోదగా నటించడమే కాదు.. ఆ నాటికకు దర్శకత్వం వహించడంతో పాటు, మ్యూజిక్‌ను కూడా కంపోజ్ చేశారట జమున. ఇలా నటనలో ఎదగడానికి సరిపడా ఓనమాలు నేర్చుకున్నది నాటక రంగం నుంచేనని చెబుతారు జమున. ఆ తర్వాత ‘ఖిల్జీ రాజ్యపతనం’ నాటకంతో జమున పేరు మరింత ప్రాచుర్యంలోకి వచ్చి, తొలి సినిమా ‘పుట్టిల్లు’లో అవకాశం వచ్చేలా చేసింది. ఎస్వీరంగారావు సలహా సినిమా ఇండస్ట్రీలో బాగా రాణిస్తున్న సమయంలో ఓ హీరోను పెళ్లి చేసుకోవాలనుకున్నారట జమున. కానీ ఓ సందర్భంలో అప్పటి సీనియర్ నటులు ఎస్వీ రంగారావు జీవితం గురించి కొన్ని విషయాలు చెప్పి, అన్నీ ఆలోచించుకుని ముందడుగు వేయాలన్నట్లుగా హితబోధ చేశారట. దీంతో అప్పటి ఆ హీరోతో వివాహాన్ని వద్దనుకున్నారట జమున. ఆ తర్వాత రమణారావును పెళ్లి చేసుకున్నారు జమున. తల్లి స్ఫూర్తితో... ఇండస్ట్రీలో జమున చాలా ధైర్యంగా, ఆత్మాభిమానంతో ఉండేవారు. ఈ లక్షణాలతో పాటుగా ఆత్మవిశ్వాసం, వ్యక్తితాన్ని నిలబెట్టుకోవడం వంటి వాటిని తన తల్లి కౌసల్యాదేవి నుంచే అలవరచుకున్నారట జమున. విశేషం ఏంటంటే.. జమున తల్లి స్వాతంత్య్రోద్యమంలో పాల్గొని రెండు రోజులు జైల్లోనే ఉన్నారట. ప్రముఖుల నివాళి జమున మృతికి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ విచారం వ్యక్తం చేశారు. 70ఏళ్ల నట జీవితంలో ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించిన ఆమె చిరస్మరణీయంగా నిలిచిపోతారన్నారు. జమున కుటుంబ సభ్యులకు గవర్నర్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారని రాజ్‌భవన్ వర్గాలు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపాయి. తెలుగు చలన చిత్ర పరిశ్రమ మొదటి తరం నటీమణుల్లో అగ్రనాయికగా వెలుగొందిన సీనియర్ నటి జమున తెలుగు వారి హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొనియాడారు. ఆమె మృతి తెలుగు చలన చిత్ర పరిశ్రమకు తీరని లోటని పేర్కొన్నారు. ఆమె కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్టుగా ట్విట్టర్ ద్వారా సీఎం వైఎస్ జగన్ తన సంతాపాన్ని తెలియజేశారు. నటి జమున మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ , ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు వేర్వేరు ప్రకటనల్లో సంతాపం వ్యక్తం చేశారు. జమున మరణం సినీ పరిశ్రమకు తీరని లోటని సీఎం కేసీఆర్ అన్నారు. తొలి తరం నటిగా వందలాది చిత్రాల్లో నటించి, తెలుగువారి అభిమాన తారగా వెలుగొందిన జమున జ్జాపకాలను సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు. తెలుగు, తమిళం, కన్నడంలోనే కాకుండా హిందీ సినిమాల్లోనూ నటించి ప్రేక్షకుల అభిమానాన్ని పొందిన జమున, నటిగా కళా సేవనే కాకుండా పార్లమెంటు సభ్యురాలిగా ప్రజాసేవ చేయడం గొప్ప విషయమన్నారు. ఈ సందర్భంగా జమున కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సీనియర్ హీరోయిన్ జమునగారు స్వర్గస్తులయ్యారనే వార్త విచారకరం. ఆవిడ బహుభాషా నటి. మాతృభాష కన్నడం అయినా ఎన్నో విజయవంతమైన చిత్రాలతో తెలుగువారి మనసుల్లో చెరగని ముద్రవేశారు. మహానటి సావిత్రిగారితో జమునగారి అనుబంధం ఎంతో గొప్పది. ఆమె కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. – చిరంజీవి అల్లరి పిల్లగా, ఉక్రోషంతో ఊగిపోయే మరదలిగా, ఉత్తమ ఇల్లాలిగా, అన్నిటికీ మించి తెలుగువారి సత్యభామగా మనల్ని ఎంతో మెప్పించారు జమునగారు. చిన్ననాటి నుంచే నాటకాల అనుభవం ఉండటంతో నటనకే ఆభరణంగా మారారామె. కేవలం దక్షిణాది సినిమాలకే పరిమితం కాకుండా ఆ రోజుల్లోనే హిందీ సినిమాల్లోనూ నటించి ఔరా అనిపించి అందరి ప్రశంసలు పొందిన బహుముఖ ప్రజ్ఞాశాలి జమునగారు. – బాలకృష్ణ జమునగారు మహానటి. ఆవిడతో కలిసి నేను ఆర్టిస్ట్‌గా పని చేశాను. ఆ మహానటి మరణం నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. నాకు సన్నిహితురాలు. మేం కలిసినప్పుడు ఎంతో ఆప్యాయంగా, ప్రేమగా మాట్లాడేవారు. ఆవిడ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. – మంచు మోహన్‌బాబు భారతీయ సినీ పరిశ్రమకు జమునగారి మరణం తీరని లోటు. సినిమా ఇండస్ట్రీలో ఆమె ఒక మహానటి. ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎంజీఆర్, శివాజీగణేశన్.. వంటి ఎంతోమంది మహానటులతో నటించి మెప్పించారామె. అన్ని భాషల్లో ఆమె ఒక సూపర్ స్టార్. కళాకారులకు పెన్షన్ ఇవ్వాలని పోరాడారు. జమునగారికి కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డు ప్రకటించాలని కోరుతున్నాను. – ఆర్. నారాయణమూర్తి జమునగారు దివంగతులు కావడం బాధాకరం. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అలనాటి తరానికి ప్రతినిధిగా ఉన్నారామె. వెండితెరపై విభిన్న పాత్రలు పోషించిన జమునగారు తెలుగు ప్రేక్షకులకు సత్యభామగానే గుర్తుండిపోయారు. ఆ పౌరాణిక పాత్రకు జీవం పోశారామె. ఠీవి, గడుసు పాత్రల్లోనే కాకుండా అమాయకత్వం ఉట్టిపడే పాత్రల్లోనూ ప్రేక్షకుల మెప్పు పొందారు. ప్రజా జీవితంలో లోక్‌సభ సభ్యురాలిగా సేవలందించారు. – పవన్ కల్యాణ్ జమునగారి మరణవార్త విని తీవ్రంగా కలత చెందాను. సినీ పరిశ్రమకు ఆమె చేసిన సేవలు, పోషించిన వైవిధ్యమైన పాత్రలతో ఎప్పటికీ గుర్తుండిపోతారు. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. – మహేశ్‌బాబు దాదాపు 30 సంవత్సరాలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మహారాణిగా కొనసాగారు జమునగారు. ‘గుండమ్మకథ’, ‘మిస్సమ్మ’లాంటి ఎన్నో మరపురాని చిత్రాలు, మరెన్నో వైవిధ్యమైన పాత్రలతో మా మనసుల్లో చెరపలేని ముద్ర వేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి. – ఎన్టీఆర్ జమునగారి మరణవార్త విని నా హృదయం ముక్కలైంది. క్లాసికల్ తెలుగు సినిమాకు ఆమె సేవలు మరువలేనివి. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నాను. – అల్లు అర్జున్ జమునగారు లేరనే విషయాన్ని నమ్మలేకపోతున్నాను. కొంతకాలంగా ఆమె క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ‘మూగమనసులు’ సినిమాలో ఆమె నటన అద్భుతం. సినిమాలతోపాటుగా రాజకీయాల్లోనూ ముందున్నారామె. జమునగారి అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరిగి ఉంటే బాగుండేది. – అలీ -
Veteran actor Jamuna: నివాళి: అలిగితివా సత్యభామ
తెలుగు అలక నీవే.. తెలుగు మొలక నీవే వాల్జడను విసిరి వలపు చూపును దూసేది నీవే అతిశయము నీవే.. స్వాతిశయము నీవే కనుచూపులో ధిక్కరింపు దుడుకువు నీవే నీవు సత్యభామవు.. నీవే సతీ అనసూయవు నీవే రాణి మాలినీదేవివి.. నీవే కలెక్టర్ జానకివి. పాతికేళ్లపాటు తెలుగు తెరను ఏలావు. నీ మార్గము నీదయ్యి నీ దుర్గము నీకు నిలిచింది. ప్రజల అభిమానమే నీకు పద్మభూషణ్. ప్రేక్షకుల ఆరాధనే రఘుపతి వెంకయ్య. నీకు అలంకారమైన అలకతో మా నుంచి వీడ్కోలు తీసుకున్నావని సర్ది చెప్పుకుంటున్నాము. మరోసారి దుగ్గిరాల నుంచి పద్యమై పలుకు. మరోసారి అపర సత్యభామవై మువ్వల సడి చెయ్యి. అలక తీరాక తిరిగి వస్తావు కదూ! సత్రాజిత్తు కుమార్తె సత్యభామ. తప్పు. నిప్పాణి శ్రీనివాసరావు కుమార్తె సత్యభామ. ఒప్పు. తెలుగువారికి సంబంధించినంత వరకు సత్యభామది దుగ్గిరాల. ‘అమ్మా... కాఫీ’... బంగారు బుగ్గలతో, మెరిసే కళ్లతో, గారాబంగా పెరిగి, పెంకిగా మారి, కాలు నేలన పెట్టకుండా, నిద్ర కళ్లతో లేచి కాఫీ అడిగే గారాల పట్టి ఎవరు? ఇంకెవరు జమున. ‘గుండమ్మ కథ’లో ఆ పాత్రను జమునే చేయాలి. కానీ... ‘గుండమ్మ కథ’ సినిమా తీయబోయే ముందు. నిర్మాత చక్రపాణి ఇంట్లో పంచాయితీ. ఒక గదిలో ఎన్.టి.ఆర్, ఏ.ఎన్.ఆర్. మరో గదిలో జమున, ఆమె తండ్రి నిప్పాణి శ్రీనివాసరావు. ‘క్షమాపణ పత్రం రాసివ్వమనండి సరిపోతుంది... జమునతో కలిసి పని చేస్తాం’ అని ఎన్.టి.ఆర్, ఏ.ఎన్.ఆర్ల గది నుంచి ప్రతిపాదన వచ్చింది. ‘క్షమాపణ రాసేది లేదు. నా తప్పేమిటో చెప్పమనండి’ జమున నుంచి జవాబు. ఈ తగాదా తీర్చకపోతే గుండమ్మ కథ పట్టాలెక్కదు. చక్రపాణి రెండు గదుల వైపు మార్చి మార్చి చూశాడు. ‘భూకైలాస్’ క్లయిమాక్స్ సీన్. మద్రాసు సముద్ర ఒడ్డున తీస్తున్నారు. ఆత్మలింగం చేజార్చుకున్న రావణుడు అంతకంతకూ పెరిగి పెద్దదవుతున్న ఆ లింగాన్ని మోయలేక, తనతో తీసుకెళ్లలేక, దానికి తల కొట్టుకుని ఆత్మత్యాగం చేయబోతున్న దృశ్యం అది. ఎన్.టి.ఆర్ మీద తీస్తున్నారు. ఆ సమయంలో నారదుడైన అక్కినేని పరిగెత్తుకొని రావాలి. మండోదరి పాత్ర పోషిస్తున్న జమున కూడా పరిగెత్తుకుని రావాలి. ఎండ మండిపోతోంది. అప్పటికే జమున షూటింగ్‌కి ఆలస్యంగా వస్తున్నదని అక్కినేనికి అభ్యంతరం ఉంది. కాలు మీద కాలు వేసుకుని కూచుంటున్నదని ఎన్.టి.ఆర్కు అసౌకర్యం ఉంది. జమునకు ఇవన్నీ తెలియవు. ఆ ఎండలో ఇంకా రాని జమున కోసం ఎదురు చూస్తూ అక్కినేని, ఎన్.టి.ఆర్ ఒక నిర్ణయం తీసుకున్నారు. మరునాడు ఇండస్ట్రీ అంతా ఆ నిర్ణయం విని హాహాకారాలు చేసింది. అచ్చొచ్చోలు విడిచింది. ఇక మీదట ఎన్.టి.ఆర్, ఏ.ఎన్.ఆర్లు జమునతో నటించబోవడం లేదు. బాయ్‌కాట్ ట్రెండ్ ఇటీవల మొదలైంది. కాని తెలుగులో బాయ్‌కాట్ చూసిన తొలి హీరోయిన్ జమున. ఊ... అంటావా మావా ఉహూ అంటావా మావా. కొత్త పాట. విశేషం ఏముంది? ఊ అను ఉఊ అను ఔనను ఔనవునను... జమున పాట. ఏనాడో జమున ఉఊ అంది. ఔనవునని అనలేకపోయింది. పెద్ద హీరోలు బాయ్‌కాట్ చేస్తే ఏంటి? తానొక నటి. తనకు సామర్థ్యం ఉంది. తను పని చేయగలదు. ఎన్.టి.ఆర్, ఏ.ఎన్.ఆర్లు లేకపోతే ఇక హీరోలే లేరా? అయినా తెర మీద జమున ఉంటే ఇక ఆవిడే ఒక హీరో లెక్క. 1959, 60, 61... దాదాపు మూడేళ్ల పాటు అక్కినేని, ఎన్.టి.ఆర్ జమునతో పని చేయలేదు. జమున ఆగిందా... ఆగలేదు. హిందీకి వెళ్లింది. జూబ్లీ హీరో రాజేంద్ర కుమార్‌తో ‘హమ్రాహీ’ చేసి హిట్ కొట్టింది. అందులో ‘ముజ్ కో అప్ నే గలే లగాలో’ పాటకు ముబారక్ బేగం, ‘మన్రే తూహీ బతా క్యా గావూ’ పాటకు లతా మంగేష్కర్ జమునకు ప్లేబ్యాక్ ఇచ్చారు. ‘మూగ మనసులు’ హిందీ రీమేక్ మిలన్లో అదే గౌరి పాత్రను వేసి ఫిల్మ్‌ఫేర్ అవార్డు సాధించింది. ‘బేటి బేటె’ సినిమాలో సునీల్ దత్‌కు హీరోయిన్గా చేసింది. తెలుగులో జగ్గయ్య, జె.వి.రమణమూర్తి, కృష్ణ, శ్రీధర్, హరనాథ్ వీరితో పని చేసింది. ఈలోపు జమున లాంటి గ్లామర్ స్టార్ లేక కొన్ని సినిమాలు ఏ.ఎన్.ఆర్, ఎన్.టి.ఆర్లవి వెలవెలబోయాయి. ఎన్.టి.ఆర్, ఏ.ఎన్.ఆర్లు లేక జమున పెద్ద సినిమాలు చేయలేకపోయింది. ఇరు పక్షాలా నష్టం. ఈ నష్టాన్ని నివారించి అందరినీ కలిపి ‘గుండమ్మ కథ’ తీయాలని చక్రపాణి నిశ్చయం. ‘సార్. క్షమాపణలు వద్దు ఏమొద్దు. వాళ్లనూ కూచోబెట్టండి. నన్నూ కూచోబెట్టండి. కావాలంటే నన్ను నాలుగు చివాట్లు పెట్టండి. ఏదో తెలియని రోజుల్లో తెలియని ప్రవర్తన. ఇక మీదట జాగ్రత్తగా ఉంటాను’ అంది జమున, చక్రపాణితో. ‘ఏమయ్యా రామారావు, నాగేశ్వరరావూ. ఈ బాయ్‌కాట్ వల్ల భవిష్యత్తు తరాలకు మీరో తప్పు మార్గం చూపిస్తున్నారు. ఇలా వద్దు. అంతా కలిసి పని చేయండి. నా గుండమ్మ ఇప్పటికే ఆలస్యమై ఏడుస్తోంది’ అన్నాడు చక్రపాణి. సమస్య సద్దుమణిగింది. జమున గెలవకపోయి ఉండవచ్చు. కాని ఓడలేదు. గుంటూరు జిల్లాలో పక్కపక్క ఊళ్ల నుంచి ఇద్దరు హీరోయిన్లు వచ్చారు. సావిత్రి, జమున. కృష్ణా జిల్లాలో పక్క పక్క ఊళ్ల నుంచి ఇద్దరు హీరోలు వచ్చారు. అక్కినేని, ఎన్.టి.ఆర్. ఈ నలుగురు తెలుగు సినిమాలకు ‘స్వర్ణచతుష్టయం’. ఆ స్వర్ణ చతుష్టయం నటించి సూపర్‌హిట్ కొట్టిన సినిమా గుండమ్మ కథ. జమున తండ్రి నిప్పాణి శ్రీనివాసరావు మధ్వ బ్రాహ్మణులు. కన్నడిగులు. జమున తల్లి కౌసల్యాదేవి వైశ్యులు. తెలుగు. వ్యాపారం నిమిత్తం శ్రీనివాసరావు హంపిలో ఉండగా పెద్ద కూతురుగా జమున పుట్టింది. ఆమెకు ఆరేడేళ్లు ఉండగా శ్రీనివాసరావు పసుపు, పొగాకు వ్యాపారానికి వీలుగా ఉంటుందని కాపురాన్ని ‘దుగ్గిరాల’కు మార్చాడు. అలా దుగ్గిరాల జమునకు రెండో జన్మస్థలం అయ్యింది. జమున తల్లికి హరికథలు చెప్పడం వచ్చు. ఆమె కచ్చేరీల్లో మధ్య మధ్య చిన్నారి జమునను స్టేజీ ఎక్కించి పాట పాడించేది. దుగ్గిరాలలో చదువుతూ స్కూల్లో కూడా జమున ఆడేది, పాడేది. నాటకాల వాళ్లు విని బాలనటిగా బతిమిలాడి తీసుకెళ్లేవారు. ‘ఢిల్లీ చలో’, ‘మా భూమి’, ‘ఖిల్జీ రాజ్య పతనం’... వీటిలో జమున బాలనటి. మండూరులో ‘ఖిల్జీ రాజ్యపతనం’ నాటకం వేయాలని ఒక తెలుగు మాస్టారు వచ్చి జమునను తీసుకెళ్లాడు. రైలు దిగి పొలాల మీద నడుస్తూ మండూరు చేరుకోవాల్సి ఉంటే జమున నడవలేక మారాము చేసింది. పాపం... ఆ తెలుగు మాస్టారు జమునను ఎత్తుకొని అంతదూరమూ నడిచి వెళ్లాడు. ఇది జరిగిన కొన్నాళ్లకు ఒక సినిమాలో జమున– అనురాగము విరిసేనా ఓ రేరాజా అనుతాపము తీరేనా... అనే పాటకు అభినయించింది. ఆ రోజు ఆమెను భుజాల మీద ఎత్తుకుని నడిచిన తెలుగు మాస్టారు ఆ పాటలో పడక్కుర్చీలో కూచుని ఆస్వాదిస్తుంటాడు. అతని పేరు జగ్గయ్య. గరికపాటి రాజారావు నటించి, నిర్మించి, దర్శకత్వం వహించిన ‘పుట్టిల్లు’ జమున మొదటి సినిమా. షాపుకారు జానకి, కృష్ణకుమారి, జమున... వీరు మాత్రమే స్ట్రయిట్‌గా హీరోయిన్ వేషాలతో చిత్ర ప్రవేశం చేశారు. మిగిలిన వారు చిన్న పాత్రలు వేసి, ఎదిగి, హీరోయిన్లు అయ్యారు. 16 ఏళ్ల వయసులో జమున ‘పుట్టిల్లు’ లో చాలా మెచ్యూరిటీ ప్రదర్శించాల్సిన పాత్రను పోషించింది. కాని గరికపాటి, జమునల జంటను ప్రేక్షకులు మెచ్చలేదు. ‘పతియే ప్రత్యక్షదైవమే’ థీమ్‌తో సినిమాలు వస్తున్న ఆ రోజుల్లో ‘పుట్టిల్లు’ సినిమా వ్యసనపరుడైన భర్తను నిరాకరించి తనకు తాను నిలబడే భార్య పాత్రను చూపించేసరికి జనం హడలెత్తి తెరను చింపేస్తామన్నారు. మూడ్రోజుల్లో బాక్సులు తిరిగొచ్చేసరికి క్లయిమాక్స్ మార్చి తీసి మళ్లీ అతికించినా ఫలితం రాలేదు. ఆ తర్వాత జమున నటించిన రెండు మూడు సినిమాలు ఆడలేదు. వెనక్కు వెళ్లిపోదామనుకుంటూ ఉండగా ‘మిస్సమ్మ’ సినిమాలో మెరిసి నిలబడింది. ఆ సినిమా నాటికే స్టార్లుగా మారిన అక్కినేని, ఎన్.టి.ఆర్, సావిత్రిల సరసకు అతి త్వరగా చేరింది. అయితే ప్రతి నటికి ఒక సిగ్నేచర్ కేరెక్టర్ దొరకాలి. అలాంటి కేరెక్టర్ జమునకు దొరికింది. ఆ పాత్రే సత్యభామ. సత్యభామ పాత్రంటే తెలుగు నాటకాల్లో పాపులర్. స్థానం నరసింహారావు ఆ పాత్రను పోషిస్తూ పాత్ర ఆంగిక, అభినయ, ఆహార్యాలను స్థిరపరిచేశాడు. ప్రేక్షకులు ఎవరైనా ఆయనతో పోల్చి వెండితెర సత్యభామను అంచనా కడతారు. జమున సత్యభామ పాత్రను మొదట తెలిసీ తెలియని వయసులో ‘వినాయక చవితి’ చిత్రంలో పోషించింది. అసలైన సత్యభామగా ఎన్.టి.ఆర్తో ‘శ్రీ కృష్ణ తులాభారం’లో నటించింది. స్థానం నాటకాల్లో పాపులర్ చేసిన ‘మీరజాల గలడా నా యానతి’ పాటను అంతకు దీటుగా అభినయించింది. పెంకితనం, మొండితనం, స్వాతిశయం వీటితో పాటు తెలియని అమాయకత్వాన్ని సత్యభామకు జోడించడంతో జమున సత్యభామ అయ్యింది. సత్యభామ జమున అయ్యింది. కృష్ణుడి వేషంలో ఉన్నా ఎన్.టి.ఆర్ అంతటి వాడి కిరీటాన్ని కాలితో తన్నాలి. జమున ధైర్యంగా తన్నగలిగింది. అలాంటి షాట్ చేశాక సీనియర్ ఆర్టిస్ట్‌కు ‘సారీ’ చెప్పాలన్న పరిణితి అప్పటికే ఆమెకు వచ్చేసింది. ‘సారీ సార్’ అని ఎన్.టి.ఆర్తో అంటే ‘ఇట్స్ ఆల్రైట్... యాక్టింగే కదా’ అని ఆయన ఈజీగా తీసుకున్నారు. తెలుగువారికి కృష్ణుడు ఎన్.టి.ఆర్. సత్యభామ జమునే. తెలుగువారి తొలి గ్లామర్ స్టార్ కాంచన మాల. తర్వాతి గ్లామర్ స్టార్ జమున. భానుమతి, సావిత్రి, అంజలి... వీరంతా పెర్ఫార్మర్లు. వీరి పక్కన అందరూ సరిపోరు. కాని ఎవరి పక్కనైనా అందంగా సరిపోయే స్టార్‌గా జమున తెలుగు సినిమా పరిశ్రమలో దాదాపు 25 ఏళ్లు ఏలింది. హరనాథ్‌తో ‘లేత మనసులు’ పెద్ద హిట్ సాధించింది. అందులోని ‘హలో మేడమ్ సత్యభామా’, ‘అందాల ఓ చిలుకా అందుకో నా లేఖ’ పాటల్లో జమున జాంపండులా ఉందని ప్రేక్షకులు మురిసిపోయారు. ఒక సీనియర్ హీరోయిన్ అయి ఉండి, పెద్ద స్టార్ అయి ఉండి చలంతో ‘మట్టిలో మాణిక్యాలు’ హిట్ కొట్టింది జమున. అందులో ‘నా మాటే నీ మాటై చదవాలి’ పాట అతి మధురం. ముచ్చటం. ఫీల్డ్‌కు వచ్చిన కొత్తల్లో జమునను ‘హంపీ సుందరి’ అని, ‘ఆంధ్రా నర్గిస్’ అని పిలిచేవారు. చిత్రంగా నర్గిస్‌కు చిరఖ్యాతి తెచ్చి పెట్టిన ‘మదర్ ఇండియా’ను జమునే తెలుగులో చేసింది. ఆ సినిమా పేరు ‘బంగారు తల్లి’. సినిమా వాళ్లు సినిమా వాళ్లనే చేసుకుంటున్న రోజుల్లో ఆ ఆనవాయితీని తప్పించి లెక్చరర్‌ను వివాహం చేసుకుంది జమున. కొడుకు పుడితే అక్కినేని భార్య అన్నపూర్ణ వచ్చి ‘సిజేరియన్ అటగదా. ఇన్నాళ్లూ నువ్వొక్కదానివే సన్నగా ఉన్నావనుకున్నాను. ఇకపై లావెక్కిపోతావు’ అని నిట్టూర్చి వెళ్లింది. కాని జమున మారలేదు. కొడుకు పుట్టిన తర్వాత కూడా పదేళ్ల పాటు హీరోయిన్గా కొనసాగింది. సగటు ప్రేక్షకుడి డ్రీమ్ గర్ల్గానే ఉంది. ఒక ఔత్సాహికుడికి జీవితంలో ఒకసారైనా జమున పక్కన నటించి ఆమెతో ఒక డ్యూయెట్ పాడాలని కోరిక. అందుకోసం ఆ ఔత్సాహికుడు భారీ డబ్బు ఖర్చు పెట్టి, పెద్ద తారాగణంతో సినిమా తీశాడు. జమునకు వారితో వీరితో రికమండేషన్ చేయించి తన పక్కన నటించేలా ఒప్పించాడు. ఆమె ఆకర్షణ అలా ఉండేది. అన్నట్టు ఆ సినిమా పేరు ‘బొబ్బిలి యుద్ధం’. ఆ ఔత్సాహికుడు సీతారామ్. మురిపించే అందాలే అవి నన్నే చెందాలే... ‘మిస్సమ్మ’, ‘చిరంజీవులు’, ‘సతీ అనసూయ’, ‘గులే బకావళి కథ’, ‘మంగమ్మ శపథం’, ‘రాముడు భీముడు’, ‘మూగనోము’.... జమున హిట్లు ఎన్నో ఉన్నాయి. ‘మూగ మనసులు’ స్క్రిప్ట్ మొత్తం తయారయ్యాక సావిత్రి విని ఇందులో గౌరి పాత్ర నేను వేస్తాను... రాధ పాత్రను జమునకు ఇవ్వండి. గౌరి పాత్ర చాలా బాగుంది’ అన్నదట. ‘గౌరిగా నువ్వు బాగోవు. అది జమునకే కరెక్ట్’ అని అక్కినేని సర్దిచెప్పారట. ‘మూగ మనసులు’ సినిమాలో జమున విశ్వరూపం చూపింది. గోదారి గట్టు మీద తన పాద ముద్రలను శాశ్వతంగా విడిచింది. రాయీ రప్పా కాని మామూలు మనుషులను కదిలించింది. కొత్త తరం వచ్చాక తన ప్రాభవాన్ని కాపాడుకుంటూ పక్కకు తప్పుకుంది జమున. చిల్లర మల్లర క్యారెక్టర్లు వేయలేదు. ఆమె వేసే క్యారెక్టర్ ‘పండంటి కాపురం’లో రాణి మాలినీ దేవిలా ఉండాలి. అంత పవర్‌ఫుల్‌గా ఉండాలి. ఉంది. పండంటి కాపురం సూపర్ హిట్ కావడంలో జమున పాత్ర ఒక ముఖ్య కారణం. జమున తాను రిటైరై పోయినా ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొంటూ ప్రేక్షకులకు దగ్గరగానే ఉంది. చివరి నిమిషం వరకూ గ్లామర్‌తోనే కనిపించింది. తెల్లజుట్టు జమునను ఎవరూ చూడలేదు. ఉత్సాహం లేని జమునను ఎవరూ చూడలేదు. స్వాతిశయం తప్పిన జమునను ఎవరూ చూడలేదు. సినిమా రంగంలో ఎన్నో ప్రతికూలతలు దాటి, ఎదురు నిలిచి, తన స్థానాన్ని పొందింది జమున. ఆమె రాకతో ఒక వెన్నెల వచ్చింది. ఆమె వీడ్కోలుతో ఆ వెన్నెల జ్ఞాపకాల్లోనే మిగిలింది. పగలే వెన్నెల... జగమే ఊయల కదలే ఊహలకే కన్నులుంటే... జమున హిట్ సాంగ్స్‌లో కొన్ని.. 1. గౌరమ్మా నీ మొగుడెవరమ్మా... (మూగ మనసులు) 2. నీ మది చల్లగా స్వామీ నిదురపో... (ధనమా దైవమా) 3. ఎవరికి తెలియదులే ఇంతుల సంగతి... (దొరికితే దొంగలు) 4. అంతగా నను చూడకు.. ఇంతగా గురి చూడకు... (మంచి మనిషి) 5. ఈ వేళ నాలో ఎందుకో ఆశలు... (మూగనోము) 6. తెలిసిందిలే తెలిసిందిలే నెలరాజ నీ గుట్టు తెలిసిందిలే... (రాముడు భీముడు) 7. మళ్లీ మళ్లీ పాడాలి ఈ పాట... (మట్టిలో మాణిక్యం) 8. వసంత గాలికి వలపులు రేగ... (శ్రీకాకుళాంధ్ర మహావిష్ణు కథ) 9. నన్ను దోచుకొందువటే... (గులేబకావళి కథ) 10. బులి బులి ఎర్రని బుగ్గల దానా... (శ్రీమంతుడు) 11. మనసా కవ్వించకే నన్నిలా... (పండంటి కాపురం) 12. రివ్వున సాగే రెపరెపలాడే... (మంగమ్మ శపథం) 13. పచ్చని చెట్టు ఒకటి వెచ్చని చిలుకలు రెండు .. (రాము) 14. బృందావనమది అందరిదీ గోవిందుడు అందరివాడేలే... (మిస్సమ్మ) 15. ప్రేమ యాత్రలకు బృందావనమూ నందనవనమూ ఏలనో.. (గుండమ్మ కథ) 16. నువ్వూ నేనూ నడిచేది ఒకే బాట... ఒకే మాట (డబ్బుకు లోకం దాసోహం) ఖదీర్ -
మహాప్రస్థానంలో ముగిసిన జమున అంత్యక్రియలు (ఫొటోలు)
-
జమునను పద్మ అవార్డుతో సత్కరించాలి: నారాయణమూర్తి
సీనియర్ నటి జమున శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచింది. ఆమె మరణంపై సినీప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆర్ నారాయణమూర్తి మాట్లాడుతూ.. 'సినీ ఇండస్ట్రీలో జమున ఒక మహానటి. అగ్రహీరోలతో ఆమె నటించి మెప్పించారు. యావత్ భారతీయ సినీపరిశ్రమకు ఆమె మరణం తీరని లోటు. మూగమనసు సినిమాలో ఆమె నటన అద్భుతం. సినిమా మొత్తం ఆమెతోనే నడుస్తుంది. ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎంజీఆర్, శివాజీ గణేశన్ సహా ఎంతోమంది నటులతో ఆమె నటించారు. అన్ని భాషల్లో ఆమె ఒక సూపర్ స్టార్. కళాకారులకు పెన్షన్ ఇవ్వాలని తను ఎంతగానో పోరాడింది. ప్రభుత్వ లాంఛనాలతో జమున అంత్యక్రియలు జరపాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విజ్ఞప్తి చేస్తున్నా. అలాగే కేంద్రం ఆమెకు పద్మ అవార్డ్ ఇవ్వాలని కోరుకుంటున్నా' అన్నారు నారాయణమూర్తి. చదవండి: ఎన్టీఆర్‌ను జమున కాలితో తన్నడంపై వివాదం తెలుగు సినీ ఇండస్ట్రీ మహారాణి.. జమున మరణంపై సెలబ్రిటీల సంతాపం -
మహాప్రస్థానంలో జమున అంత్యక్రియలు పూర్తి
అలనాటి అందాల తార జమున అంత్యక్రియలు ముగిశాయి. అశ్రునయనాల మధ్య జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఆమె కూతురు స్రవంతి జమునకు దహన సంస్కారాలు నిర్వహించింది. జమున మరణంతో ఇండస్ట్రీలో టాలీవుడ్ శోక సంద్రంలో మునిగిపోయింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జమున ఈరోజు ఉదయం హైదరాబాద్‌లోని స్వగృహంలో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆమెను కడసారి చూసేందుకు పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఫిల్మ్‌ఛాంబర్‌లోని ఆమె భౌతిక కాయానికి సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. లక్ష్మీ పార్వతి, తమ్మా రెడ్డి భరద్వాజ, మురళి మోహన్, కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సునీత రావు తదితరులు నివాళులు అర్పించారు. -
జమునని బాయ్‌కాట్ చేసిన ఎన్టీఆర్-ఏఎన్నార్.. అయినా లెక్కచేయని నటి
గడుసుతనం కలబోసిన సౌందర్యానికి పెట్టింది పేరు జమున. వెండితెర సత్యభామగా ప్రేక్షకుల మనసులో నిలిచిపోయిన జమున సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక ముద్రను వేసుకున్నారు. పొగరు, భక్తి, విలనిజం ఇలా నవరసాలు పలకించగలిగే అరుదైన నటిగా పేరు సంపాదించుకున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. ఆమె కోసమే కొన్ని పాత్రలు పుట్టాయేమో అనేంతలా నటించి మెప్పించారు. ఆనాటి స్టార్ హీరోలందరితో జతకట్టిన జమున కెరీర్ సాఫీగా సాగుతున్న దశలోనే ఎన్టీఆర్, ఏఎన్నార్‌తో విభేదాలు అప్పట్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఇకపై జమునతో నటించమని ఈ ఇద్దరు స్టార్ హీరోలు బాయ్‌కాట్ కూడా విధించారు. దీంతో ఇక జమున కెరీర్ ముగిసిపోతుందేమో అనుకున్నారంతా. అయినా సరే చేయని తప్పుకు సారీ చెప్పేది లేదంటూ భీష్మించుకున్న తీరు ఆమె ఆత్మాభిమానానికి అద్దం పడుతుంది. అగ్రస్థాయి హీరోలు పక్కన పెట్టినా లెక్కచేయకుండా హరనాథ్, జగ్గయ్య వంటి హీరోలతో నటించి వరుస విజయాలు అందుకున్నారు. ఆ తర్వాత గుండమ్మ కథ సినిమా కోసం అప్పటి నిర్మాత చక్రపాణి జోక్యం చేసుకొని స్టార్ హీరో,హీరోయిన్ల మధ్య విభేదాలు సరైనవి కావని కాంప్రమైజ్ చేయడంతో జమున గుండమ్మ కథలో నటించారు. ఎన్టీఆర్‌కు జోడీగా సావిత్రి, ఏఎన్నార్ సరసన జమున అలరించారు. సావిత్రి సౌమ్యంగా నటించిన తీరు, జమున కొంటెతనంతో పలికించిన సంభాషణలు ప్రేక్షకుల గుండెల్లో ఇప్పటికీ చిరస్మరణీయమే. -
మహాప్రస్థానంలో జమున అంత్యక్రియలు
అలనాటి అందాల తార జమున మరణంతో సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. తెలుగు వారి సత్యభామ ఇక లేరనే విషయాన్ని అటు తారలు, ఇటు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. హైదరాబాద్‌లోని స్వగృహంలో శుక్రవారం ఉదయం ఆమె కన్నుమూశారు. సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానుల సందర్శనార్థం ఆమె భౌతిక కాయాన్ని మధ్యాహ్నం 12.30 గంటలకు ఫిలిం ఛాంబర్‌కు తరలించనున్నారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత మహాప్రస్థానంలో ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి. దాదాపు 200కు పైగా సినిమాలు చేసిన ఆమె పదిహేనేళ్లకే పుట్టిల్లు సినిమాతో రంగప్రవేశం చేశారు. అంతా మనవాళ్లే చిత్రంతో ఆమెకు మంచి గుర్తింపు లభించింది. తర్వాత అగ్ర హీరోలందరితోనూ నటించారు. చదవండి: ఎన్టీఆర్‌ను జమున కాలితో తన్నడంపై వివాదం టాలీవుడ్లో విషాదం.. సీనియర్ నటి జమున కన్నుమూత -
తెలుగు సినీ ఇండస్ట్రీ మహారాణి, నటనకే ఆభరణం జమున
తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్రకథానాయికగా వెలుగు వెలిగిన తార జమున. స్టార్ హీరోలతో జత కట్టి తెలుగు తెరకు బోలెడు హిట్స్ అందించిన ఆమె లేడీ ఓరియంటెడ్ సినిమాలతోనూ కలెక్షన్లు కురిపించారు. సినీపుస్తకంలో తనకంటూ ప్రత్యేక పాఠం లిఖించుకున్న జమున శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఆమె మరణవార్తతో అటు సినీఇండస్ట్రీ, ఇటు అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీలు నివాళులు అర్పిస్తున్నారు. సీనియర్ హీరోయిన్ జమున స్వర్గస్తులయ్యారనే వార్త ఎంతో విచారకరం. ఆవిడ బహుభాషా నటి. మాతృభాష కన్నడం అయినా ఎన్నెన్నో విజయవంతమైన చిత్రాలతో తెలుగు వారి మనసుల్లో చెరగని ముద్ర వేశారు. మహానటి సావిత్రి గారితో ఆవిడ అనుబంధం ఎంతో గొప్పది. ఆవిడ కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం - చిరంజీవి అల్లరి పిల్లగా, ఉక్రోషంతో ఊగిపోయే మరదలిగా, ఉత్తమ ఇల్లాలిగా, అన్నిటికీ మించి తెలుగువారి సత్యభామగా మనల్ని ఎంతో మెప్పించారు. చిన్ననాటి నుంచే నాటకాలలో అనుభవం ఉండటంతో నటనకే ఆభరణంగా మారారు. 195 పైగా సినిమాలలో నటించి నవరసనటనా సామర్ధ్యం కనబరిచారు జమున గారు. కేవలం దక్షిణాది సినిమాలకే పరిమితం కాకుండా ఆ రోజుల్లోనే పలు హిందీ సినిమాల్లోనూ నటించి ఔరా అనిపించి అందరి ప్రశంసలు పొందిన బహుముఖ ప్రజ్ఞాశాలి జమున. నాన్నగారు అన్నట్లుగా కళకు కళాకారులకు మరణం ఉండదు. ఈ రోజున జమున గారు భౌతికంగా మన మధ్యలో లేనప్పటికీ వారి మధుర స్మృతులు ఎల్లప్పుడూ మన మదిలో మెదులుతూనే ఉంటాయి. వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నాను. -నందమూరి బాలకృష్ణ దాదాపు 30 సంవత్సరాలు తెలుగు సినీ ఇండస్ట్రీలో మహారాణిలా కొనసాగారు. గుండమ్మ కథ, మిస్సమ్మ లాంటి ఎన్నో మరుపురాని చిత్రాలు, మరెన్నో వైవిధ్యమైన పాత్రలతో మా మనసుల్లో చెరపలేని ముద్ర వేసారు. మీ ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. జమున గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి - జూనియర్ ఎన్టీఆర్ సుప్రసిద్ధ బహుభాషా నటీమణి, లోక్ సభ మాజీ సభ్యురాలు జమున మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ఆమె మరణ వార్త తెలిసి ఎంతో చింతించాను. వెండి తెరపై సత్యభామ అంటే జమున గారు అనేలా గుర్తుండిపోయారు. ఎన్నో పౌరాణిక పాత్రలకు జీవం పోశారు. ప్రేక్షకలోకంలో స్థిర కీర్తిని సముపార్జించుకున్నారు. లోక్ సభ సభ్యురాలిగా ప్రజలకు ఎన్నో సేవలందించారు. కళాపీఠం తరఫున ఆమెను సమున్నతంగా సత్కరించుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. - డా. టి. సుబ్బరామిరెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యులు జమున తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో దాదాపు 200 సినిమాల్లో నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా 1989లో రాజమండ్రి ఎంపీగా ప్రజల మన్ననలు అందుకున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్థున్నాను - అనిల్ కుర్మాచలం, తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర, టీవీ, థియేటర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ Saddened to hear about the demise of #Jamuna garu. Will fondly remember her for all her iconic roles and her immense contribution to the industry. My condolences to her family and loved ones 🙏 — Mahesh Babu (@urstrulyMahesh) January 27, 2023 సీనియర్ హీరోయిన్ జమున గారు స్వర్గస్తులయ్యారనే వార్త ఎంతో విచారకరం. ఆవిడ బహుభాషా నటి.మాతృభాష కన్నడం అయినా ఎన్నెన్నో విజయవంతమైన చిత్రాలతో తెలుగు వారి మనసుల్లో చెరగని ముద్ర వేశారు.మహానటి సావిత్రి గారితో ఆవిడ అనుబంధం ఎంతో గొప్పది.ఆవిడ కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలియచేసుకుంటున్నాను — Chiranjeevi Konidela (@KChiruTweets) January 27, 2023 దాదాపు గా 30 సంవత్సరాలు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మహారాణి లా కొనసాగారు. గుండమ్మ కథ, మిస్సమ్మ లాంటి ఎన్నో మరుపురాని చిత్రాలు, మరెన్నో వైవిధ్యమైన పాత్రలతో మా మనసుల్లో చెరపలేని ముద్ర వేసారు. మీ ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. జమున గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. pic.twitter.com/ImmYbmBFl0 — Jr NTR (@tarak9999) January 27, 2023 చదవండి: లావైపోయింది అని సత్యభామగా వద్దన్నారు -
ఎన్టీఆర్‌ను జమున కాలితో తన్నడంపై వివాదం..
అలనాటి స్టార్ హీరోలందరితోనూ ఆడిపాడిన హీరోయిన్ జమున ఇక సెలవంటూ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. దాదాపు ముప్పై ఏళ్లపాటు హీరోయిన్గా రాణించిన ఆమె ఆనాటి అగ్ర కథానాయకులందరితోనూ నటించారు. నందమూరి తారకరామారావుతో మిస్సమ్మ, భూకైలాస్, గుండమ్మ కథ, గులేబకావళి కథ, శ్రీకృష్ణ తులాభారం.. ఇలా పలు విజయవంతమైన చిత్రాల్లో నటించారు. అయితే శ్రీకృష్ణ తులాభారం సినిమాలో ఎన్టీఆర్ కృష్ణుడిగా నటిస్తే జమున సత్యభామగా యాక్ట్ చేశారు. ఈ చిత్రంలో జమున కృష్ణుడిని కాలితో తన్నే సీన్ ఉంటుంది. ఈ సన్నివేశంపై ఎన్టీఆర్ అభిమానుల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. అయితే తన పాత్ర కోసమే అలా చేయాల్సి వచ్చిందని నటి వివరణ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. కానీ అప్పటికీ ఇప్పటికీ తెలుగువాళ్లకు సత్యభామ అంటే జమునే గుర్తొస్తుంది. చదవండి: అందాల చందమామ.. తెలుగు తెర సత్యభామ సీనియర్ నటి జమున కన్నుమూత -
Jamuna Death: లావైపోయింది..‘సత్యభామ’గా వద్దన్నారు
సీనియర్ నటి జమున(86) ఇక లేరనే వార్తను తెలుగు ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆమె నటించిన సినిమాలు.. పోషించిన పాత్రలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనవుతున్నారు. ముఖ్యంగా ఆమె నటించిన సత్యభామ పాత్ర గురించి అందరూ చర్చించుకుంటున్నారు. వినాయ చవితి, శ్రీకృష్ణ తులాభారం, శ్రీకృష్ణ విజయం సినిమాల్లో ఆమె సత్యభామ పాత్రని పోషించి, తనదైన నటనతో అందరిని ఆకట్టుకుంది. (చదవండి: టాలీవుడ్లో విషాదం.. సీనియర్ నటి జమున కన్నుమూత) అయితే రెండోసారి సత్యభామ పాత్రలో నటిస్తున్నానంటే.. చాలా మంది ఆమెకు వద్దని చెప్పారట. మరికొంత మంది అయితే ‘లావైపోయింది..సత్యభామగా ఆమె ఏం బాగుంటుంది’ అని అన్నారట. అయినా కూడా అవేవి పట్టించుకోకుండా ‘సత్యభామ’గా నటించి ఆ పాత్రను నేనే కరెక్ట్ అని అనిపించుకున్నానని ఓ ఇంటర్వ్యూలో జమున అన్నారు. (చదవండి: అందాల చందమామ.. తెలుగు తెర ‘సత్యభామ’) సత్యభామ పాత్ర గురించి ఆమె మాట్లాడుతూ..‘వినాయక చవితి’ సినిమాలో అమాయకత్వం నిండిన సత్యభామగా చేశాను. నాకు పెళ్లి అవ్వక ముందు చేసిన సినిమా అది. ఆ తర్వాత పెళ్లయిన కొత్తలో ‘శ్రీకృష్ణ తులాభారం’లో సత్యభామగా చేసే అవకాశం వచ్చింది. ‘పెళ్లయింది కదా. లావయ్యుంటుంది. ఏం బాగుంటుంది’ అని కొంతమంది అన్నారు. ‘ఏం పెళ్లయితే లావైపోతామా?’ అనుకున్నాను. చెప్పాలంటే పెళ్లి తర్వాత ఇంకా పరిణతి వచ్చి, నా అందం రెట్టింపు అయింది. అప్పుడు సత్యభామగా నన్ను చూసి, అందరూ భేష్ అన్నారు. మూడోసారి ‘శ్రీకృష్ణ విజయం’లో ఆ పాత్ర చేసినప్పుడు బిడ్డల తల్లిని. అయినా నా అందం, ఆహార్యం చెక్కు చెదరలేదు. అలా సత్యభామగా నేనే కరెక్ట్ అనే పేరు తెచ్చుకోగలిగాను’ అని అన్నారు. -
నటి జమున మృతి పట్ల సీఎం జగన్ సంతాపం
సాక్షి, తాడేపల్లి: ప్రముఖ సీనియర్ నటి జమున(86) శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. హైదరాబాద్‌లోని స్వగృహంలోనే శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆమె మృతి పట్ల పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇక, సినీ నటి, మాజీ ఎంపీ జమున మృతిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆమె మృతితో తెలుగు చిత్రసీమలో స్వర్ణ యుగానికి తెరపడినట్లు అయ్యిందన్నారు. జమున కుటుంబ సభ్యులకు సీఎం వైఎస్ జగన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమ మొదటితరం నటీమణులలో అగ్రకథానాయకిగా వెలుగొంది తెలుగు వారి హృదయాల్లో చెరగని ముద్రవేసుకున్న జమున గారు మృతి చెందడం బాధాకరం. ఆవిడ మృతి తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు. జమున గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. pic.twitter.com/nDePyrPGri — YS Jagan Mohan Reddy (@ysjagan) January 27, 2023 -
సీనియర్ నటి జమున (ఫొటోలు)
-
మహానటి సావిత్రి కారణంగానే సినిమాల్లోకి వచ్చిన జమున
సీనియర్ నటి జమున(86) ఇకలేరు. అనారోగ్య సమస్యలతో కొంతకాలంగా బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని తన నివాసంలో కన్నూమూశారు. జమున స్వస్థలం కర్ణాటక అయినా ఆమె పెరిగింది మాత్రం ఆంధ్రప్రదేశ్‌లోనే. జమున తల్లిదండ్రులది కులాంతర వివాహం. తండ్రి వ్యాపారవేత్త కావడంతో గుంటూరు జిల్లా దుగ్గిరాలకు వలస వచ్చారు. దీంతో ఏడేళ్ల వయసు నుంచి ఆమె దుగ్గిరాలలో పెరిగారు. మహానటి సావిత్రి నాటకాలు వేసే సమయంలో ఓసారి దుగ్గిరాలకు వచ్చారు. ఆమెతో మాట్లాడుతున్నప్పుడు సినిమాలపై ఆసక్తిని గమనించిన సావిత్రి స్వయంగా జమునను చిత్ర పరిశ్రమలోకి ఆహ్వానించారు. అలా 15ఏళ్ల వయసులోనే జమున సినీరంగ ప్రవేశం చేశారు. జమున నటించిన తొలిచిత్రం 'పుట్టిల్లు'. మొదటి సినిమాతోనే ఆకట్టుకున్న జమున ఎన్టీఆర్, ఏఎన్నార్, జగ్గయ్య వంటి అగ్రహీరోలతో జతకట్టారు. 200కు పైగా సినిమాల్లో నటించి ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారామె. జమున ఇక లేరనే వార్త సినీ వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
Jamuna Death: అందాల చందమామ.. తెలుగు తెర ‘సత్యభామ’
తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్లుగా రాణించినవాళ్లు చాలా మందే ఉన్నారు. అందులో కొంతమంది మాత్రమే తమదైన నటనా ప్రతిభతో ప్రేక్షకుల మనసులో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. అలాంటి వారిలో సీనియర్ హీరోయిన్ జమున ఒకరు. ఆమె మాతృభాష తెలుగు కాకపోయినప్పటికీ.. తెలుగింటి అమ్మాయిగా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. దాదాపు 30 ఏళ్ల పాటు హీరోయిన్గా రాణించిన జమున..వందలాది పాత్రలు పోషించింది. కానీ ‘వినాయకచవితి’ చిత్రంలో పోషించిన సత్యభామ పాత్రే జమునకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. ‘శ్రీకృష్ణ తులాభారం’లో కూడా ఆమె అదే పాత్ర పోషించి మెప్పించింది. ఇప్పటికీ తెలుగు వాళ్లకి సత్యభామ అంటే జమునే. అలా తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్న జమున(86)..నేడు(జనవరి 27) ఈ లోకాన్ని విడిచి వెళ్లింది. ఆమె మరణ వార్త విన్న అభిమానులు శోక సంద్రంలో మునిగిపోయారు. ► 1937లో కర్నాటక రాష్ట్రంలోని హంపీలో జమున జన్మించింది. ఆమె తల్లితండ్రులు నిప్పని శ్రీనివాసరావు, కౌసల్యాదేవి. తండ్రి ఒక వ్యాపారవేత్త. ఆమె బాల్యంలోనే ఫ్యామిలీ ఆంధ్రప్రదేశ్‌కు తరలివచ్చింది. జమున బాల్యం గుంటూరు జిల్లా దుగ్గిరాలలో గడిచింది. జమున అసలు పేరు జనాబాయి. కానీ జన్మనక్షత్రం రీత్యా ఏదైనా నదిపేరు ఉండాలని జ్యోతిష్కులు చెప్పడంతో.. ఆమె పేరు మధ్యలో ‘ము’ అక్షరం చేర్చడం జరిగింది. అలా ఆ విధంగా ఆమె పేరు జమునగా మారింది. ► జమునకు చిన్నప్పటి నుంచే నాటకాలు అంటే చాలా ఇష్టం. స్కూల్లో చుదువుకునే సమయంలో నాటకాల్లో నటించింది. తెనాలీ సమీపంలోని మండూరు గ్రామంలో ఖిల్జీరాజ్యపతనం అనే నాటిక ప్రదర్శనకోసం నటుడు జగ్గయ్య ప్రత్యేకంగా జమునను ఎంపికచేసి తీసుకెళ్లారు.అలా ఆమె ఓ నాటక ప్రదర్శనలో దర్శకుడు గరికపాటి రాజారావు ఆమెను చూశారు. తన సినిమాలో ఆమెకి కథానాయికగా అవకాశం ఇచ్చారు. అలా ‘పుట్టిల్లు’ సినిమాతో కథానాయికగా జమున సినీరంగ ప్రవేశం చేశారు. ► తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత అక్కినేని, ఎన్టీఆర్, జగ్గయ్యలతోబాటు ఇతర ప్రముఖ నటులతో కలిసి వందలాది చిత్రాల్లో హీరోయిన్గా నటించింది. అయితే ఆమె పోషించిన సత్యభామ పాత్రే ఆమెను మరింతగా పేరుప్రఖ్యాతలు వచ్చేలా చేసింది. సత్యభామ పాత్రను ఆ స్థాయిలో పోషించినవారెవరూ లేరు .. ఆ పాత్రలో ఆమెను తప్ప మరొకరిని ఊహించుకోవడం కూడా కష్టమే. ► తెలుగులోనే కాదు.. తమిళం, హిందీ భాషల సినిమాల్లో కూడా నటించింది. ఆ చిత్రాలు కూడా ఘనవిజయాలనే అందుకున్నాయి. ఆమె నటించిన మిస్సమ్మ, ఇల్లరికం, ఇలవేల్పు, లేతమనసులు, గుండమ్మ కథ చిత్రాలు విజయవంతమయ్యి రజతొత్సవం జరుపుకున్నాయి. ► 1965లో జూలూరి రమణరావును వివాహం చేసుకున్నారు జమున. ఆయన శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో జువాలజీ ప్రొఫెసర్ గా పనిచేశారు. 2014 నవంబరు 10లో గుండెపోటుతో మరణించారు ఆయన. వారి కుమారుడు వంశీకృష్ణ, కూతురు స్రవంతి. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
టాలీవుడ్లో విషాదం.. సీనియర్ నటి జమున కన్నుమూత
టాలీవుడ్లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్ నటి జమున(86)కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. హైదరాబాద్‌లోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఉదయం 11 గంటలకు ఫిల్మ్ చాంబర్‌కు జమున భౌతికకాయాన్ని తీసుకురానున్నారు. 1936 ఆగస్టు 30న హంపీలో జన్మించిన జమున 1953లో 'పుట్టిల్లు' అనే సినిమాతో తెరంగేట్రం చేశారు. సక్సెస్ఫుల్ హీరోయిన్గా ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించారు. ఆమె పోషించిన సత్యభామ పాత్ర జమునకు మంచి పేరు తీసుకువచ్చింది. 'సినిమా సత్యభామ'గా జమునకు పేరుంది. మిస్సమ్మ సినిమా జమున కెరీర్లో మైలురాయిగా నిలిచింది. తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, హిందీ సినిమాల్లో నటించారు. అలనాటి అగ్రనటులు అందరితోనూ నటించారామె. గుండమ్మ కథ, మిస్సమ్మ ఇల్లరికం, ఇలవేల్పు, లేత మనసులు సహా సుమారు 200కు పైగా సినిమాల్లో నటించారు. 1964, 1968లో ఉత్తమ సహాయ నటిగా జమునకు ఫిల్మ్ ఫేర్‌అవార్డులు అందుకున్న జమునకు 2008లో ఎన్టీఆర్ జాతీయ పురస్కారం దక్కింది. వైవిధ్యమైన పాత్రలతో అలరించిన జమున మృతి టాలీవుడ్లో తీవ్ర విషాదాన్ని నింపింది.ఇక పొలిటికల్ కెరీర్ విషయానికి వస్తే.. 1989లో రాజమండ్రి నుంచి కాంగ్రెస్ ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత కొంతకాలానికే ఆమె రాజకీయాల నుంచి తప్పుకున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
తానా ఆధ్వర్యంలో సినీ ప్రముఖులకు పురస్కారాలు
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) చైతన్య స్రవంతి కార్యక్రమాల్లో భాగంగా డిసెంబర్ 16వ తేదీన హైదరాబాద్ శిల్పకళావేదికలో కళారాధన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా తెలుగు సినిమా రంగానికి విశేష సేవలందించిన ప్రముఖులకు పురష్కారాలు అందిస్తున్నట్లు చెప్పారు. పద్మభూషణ్ సుశీల, పద్మభూషణ్ సరోజా దేవి, పద్మశ్రీ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత విశ్వనాధ్, పద్మశ్రీ కోట శ్రీనివాసరావు, సీనియర్ నటులు కృష్ణవేణి, జమున, లక్ష్మి, మురళీ మోహన్, గిరిబాబు ప్రముఖ రచయిత డాక్టర్ పరుచూరి గోపాలకృష్ణ తదితరులను తానా పురస్కారాలతో సన్మానిస్తున్నట్లు తానా 23వ మహాసభల కన్వీనర్ పొట్లూరి రవి తానా చైతన్య స్రవంతి కోఆర్డినేటర్ పాంత్రా సునీల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పద్మశ్రీ శోభారాజు అన్నమాచార్య భవన వాహిని, గురు రామాచారి లిటిల్ మ్యూజిషియన్స్, సిద్ధేంద్ర కూచిపూడి అకాడమీ, అమెరికాకు చెందిన 300కు పైగా విద్యార్థుల ప్రదర్శనలు ఉంటాయని పేర్కొన్నారు. -
‘టీచరమ్మ’గా వెండితెరపై బెత్తం పట్టి అలరించిన హీరోయిన్లు
‘ఈ టీచర్ చాలా స్ట్రిక్ట్’ అనిపించుకుంది సావిత్రి ‘మిస్సమ్మ’లో. ‘ఈ టీచర్ భలే చక్కగా పాఠాలు చెబుతుంది’ అని మెచ్చుకోలు పొందింది జమున ‘మట్టిలో మాణిక్యం’లో. ‘పంతులమ్మ’ సినిమాలో లక్ష్మి పిల్లల పాఠాలే కాదు కథానాయకుని జీవితాన్ని కూడా చక్కదిద్దింది. ‘రేపటి పౌరులు’, ‘ప్రతిఘటన’ దగ్గరి నుంచి నిన్న మొన్నటి ‘సరిలేరు నీకెవ్వరు’ వరకు టీచర్ అంటే విజయశాంతే. ‘లేడీస్ టైలర్’లో రాజేంద్ర ప్రసాద్ వంటి అల్లరి స్టూడెంట్‌ని బెత్తం దెబ్బలు కొట్టి సరి చేయలేదూ అర్చన. టీచర్ పాత్రకు గ్లామర్ ఉండకపోవచ్చు గాని ప్రాముఖ్యత ఉంటుంది. అలాంటి ప్రాముఖ్యత కొందరు హీరోయిన్లకే దక్కింది. అదిగో చాక్‌పీస్ ఒక చేత్తో బెత్తం మరో చేత్తో పట్టుకుని వాళ్లిటు నడిచొస్తున్నారు చూడండి. శిశువుకు అమ్మ తొలి టీచర్. స్కూల్లో ‘టీచరమ్మే’ తొలి టీచర్. నర్సరీల్లో, ఐదు లోపల తరగతుల్లో పిల్లలకు తొలిగా పరిచయం అయ్యేది ఎక్కువగా టీచర్లే. వీరే పిల్లలకు తొలుత ఆత్మీయులవుతారు. బడి పట్ల, పాఠాల పట్ల ఆసక్తి కలిగిస్తారు. ఈమె కూడా అమ్మలాంటిదే కాబట్టి భయం లేకుండా వెళ్లొచ్చు అని పిల్లలకు నమ్మకం కలిగిస్తారు. అయినా సరే ‘గురు దేవా’ అంటే మగ గురువు గుర్తుకొస్తాడు. స్త్రీల వాటా ఈ విషయంలో సమానం అయినప్పటికీ. సినిమాల్లో కూడా హీరోలు వేసిన టీచర్ పాత్రలు ఎక్కువ ఉన్నాయి. హీరోయిన్లకు తక్కువగా ఈ చాన్స్ వచ్చింది. ‘గ్లామర్’ సినిమా కమర్షియల్ సినిమా వచ్చాక ‘టీచర్’ పాత్రలో హీరోయిన్ను గ్లామరస్‌గా చూపించలేము అనే భావనతో నిర్మాత, దర్శకులు హీరోయిన్ను ‘ఒక ఆడి పాడే బొమ్మ’ స్థాయికే కుదించి పెట్టారు. అయితే అప్పుడప్పుడు మంచి టీచర్ పాత్రలు సత్తా ఉన్న నటీమణుల చేతుల్లో పడి మెరిశాయి. వాళ్లు తెర మీద ఉంటే ప్రేక్షకులు బుద్ధిగా చూసే విద్యార్థులయ్యారు. రిజల్ట్ వందకు వంద వచ్చింది. మీకు మీరే మాకు మేమే: సినిమాల్లో హీరోను చూసి హీరోయిన్ జంకడం ఆనవాయితీ. కాని ‘మిస్సమ్మ’లో సావిత్రిని చూసి రామారావు జంకుతుంటాడు. దానికి కారణం ఆమె నిజాయితీ, టీచర్‌గా సిన్సియారిటీ. స్కూల్లో పిల్లలకు పాఠాలతో పాటు జమిందారు గారి కుతురికి సంగీతం పాఠాలు కూడా చెప్తుంది సావిత్రి. అంతేనా? కొంచెం నాన్ సీరియస్‌గా ఉన్న ఎన్.టి.ఆర్ తనను అందుకునేంతగా ఎదిగేలా చేసి ఒక రేవుకు చేరుస్తుంది. ‘రావోయి చందమామా మా వింతగాధ వినుమా’... ఆ రోజుల్లో టీచర్లు పాటలు పాడే పాటలు ఇంత శుభ్రంగా వినసొంపుగా ఉండేది. నా మాటే నీ మాటై చదవాలి: ‘మట్టిలో మాణిక్యం’ లో చలం అమాయకుడు. పౌరుషంతో పట్నం వస్తే టీచరైన జమున పరిచయం అవుతుంది. ప్రేమిస్తుంది. మామూలు చదువే కాదు లౌక్యంగా ఉండటానికి అవసరమైన చదువు కూడా చెబుతుంది. పాఠాలను పాటగా మార్చి ఆమె పాడే ‘నా మాటే నీ మాటై చదవాలి నేనంటే నువ్వంటూ రాయాలి’ పాట బాగుంటుంది. ఆ తర్వాతి రోజుల్లో సింగీతం శ్రీనివాసరావు హీరోయిన్ లక్ష్మితో ‘పంతులమ్మ’ సినిమా తీశాడు. ‘పంతులమ్మ’ టైటిల్‌తో ఒక సినిమా వచ్చి హిట్ కావడం విశేషం. భార్య మరణించిన వ్యక్తి జీవితంలోకి వచ్చిన ఒక పంతులమ్మ అతని పిల్లలకు పాఠాలు చెబుతూ అతనిలోని ఒక అపోహను తొలగించడం కథ. ‘ఎడారిలో కోయిల’ పాట ఒయాసిస్ లా ఉంటుంది. ఆ తర్వాత ‘శుభలేఖ’ సినిమాలో సుమలత టీచర్‌గా నటించింది. కట్నం అడగడాన్ని ఎదిరించిందని ఆమె ఉద్యోగం పోతుంది. కాని ఆమె వెరవదు. ఈ దుర్యోధన దుశ్శాసన క్లాసులోని రౌడీ పిల్లాణ్ణి సరి చేయడం టీచర్ బాధ్యత. మరి సమాజంలో ఉన్న రౌడీ పిల్లాణ్ణి దండించడం? చట్టం, న్యాయం, వ్యవస్థ విఫలమైతే ఆ బాధ్యత కూడా టీచరే తీసుకుంటుంది. ‘ప్రతిఘటన’లో లెక్చరర్ అయిన విజయశాంతి ఊళ్లో అనేక ఫతుకాలకు కారణం అవుతున్న రౌడీని అంతిమంగా తెగ నరికి నిర్మలిస్తుంది. చాక్‌పీస్ పట్టిన చేతులు గొడ్డలి కూడా పట్టగలవు అని హెచ్చరిస్తుంది. ఈ టీచర్ పాత్ర తెలుగులో వచ్చిన అన్ని టీచర్ పాత్రల కంటే శక్తిమంతమైనది. క్లాసురమ్లో పిచ్చి జోకులు, లెక్చరర్ల మీద పంచ్‌లకు తావు ఇచ్చే పాత్ర కాదు ఇది. ఈ పాత్రను చూడగానే మహా మహా పోకిరి స్టూడెంట్లు కూడా సైలెంటైపోవాల్సిందే. ‘ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో’ అని విజయశాంతి పాడుతుంటే ఆ వేదనా శక్తి చసే ప్రతి విద్యార్థిలో పరివర్తన తెస్తుంది. విజయశాంతి ఆ తర్వాత ‘రేపటి పౌరులు’, ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాల్లో కూడా టీచర్‌గా నటించింది. అరె ఏమైంది ఒక మనసుకు రెక్కలొచ్చి: అతను బెస్తపల్లెలో రౌడీ. ఆమె క్రైస్తవ విశ్వాసాలు కలిగిన టీచర్. అతను హింస. ఆమె దయ. హింసను వీడి దయ వరకూ చేసే ప్రయాణాన్ని ఆ టీచర్ ఆ రౌడీలో ప్రేరేపిస్తుంది. అతని పాపాలన్నీ స్వీయ రక్తంతో ప్రక్షాళనం అవుతాయి. చివరకు అతను ఆమె ప్రేమను పొందుతాడు. రౌడీగా చిరంజీవి, టీచర్‌గా సుహాసిని ‘ఆరాధన’లో నటించారు. ‘అరె ఏమైంది’ పాట ఇప్పటికీ హిట్ ప్రేమమ్ మరికొన్ని: ఇటీవలి కాలంలో ఈ కాలపు హీరోయిన్లు కూడా టీచర్లుగా నటించారు. ‘ఘర్షణ’లో అసిన్, ‘గోల్కొండ హైస్కల్’లో కలర్స్ స్వాతి, ‘హ్యాపీ డేస్’లో కమలిని ముఖర్జీ, ‘రాక్షసుడు’లో అనుపమ పరమేశ్వరన్ టీచర్లుగా కనిపిస్తారు. మన సాయి పల్లవి మలయాళ ‘ప్రేమమ్’లో టీచర్‌గా నటించే పెద్ద క్రేజ్ సాధించింది. ఆ పాత్రను తెలుగులో శృతిహాసన్ చేసింది. -
ఉద్యమాల పురిటిగడ్డకు వారసులొస్తున్నారు.. ఎమ్మెల్యే రేసులో నేతల పిల్లలు
సాక్షి, కరీంనగర్: రాష్ట్ర రాజకీయాల్లోనే ఉమ్మడి కరీంనగర్ జిల్లాది ప్రత్యేక స్థానం. ఉద్యమాల పురిటిగడ్డగా పేరొందిన జిల్లా.. మొదటి నుంచీ రాజకీయంగా ఎంతో చైతన్యం కలిగి ఉంది. రాజకీయ వారసత్వాలు ఈ జిల్లాకు కొత్తేంకాదు. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం పనిచేస్తున్న ఎమ్మెల్యేల్లో మంథని, సిరిసిల్ల, హుస్నాబాద్ స్థానాల్లో ఉన్నవారు ఈ తరహాలోనే రాజకీయాల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. రాబోయే ఎన్నికల్లోనూ తమ వారసులను బరిలో దింపేందుకు చాలామంది సీనియర్ నేతలు ఇప్పటినుంచే పావులు కదుపుతున్నారు. కొందరు కుమారులను, కుటుంబసభ్యులను బరిలో దించే యోచనలో ఉండగా.. మరికొందరు తమ రాజకీయ వారసత్వాన్ని మూడోతరానికి అందించే ప్రయత్నాల్లో తలమునకలయ్యాయి. ‘బంధువులు రుతువుల్లాంటి వారు. వస్తారు.. పోతారు.. కానీ, వారసులు చెట్లలాంటివారు.. వస్తే పాతుకుపోతారు’ అంటూ ఓ సినిమాలోని డైలాగు ప్రస్తుతం జిల్లా రాజకీయాలకు సరిగ్గా సరిపోతోంది. మొత్తానికి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాలన్నీ తమ కుటుంబ సభ్యులను, మనవళ్లను రాజకీయ యవనికపైకి తీసుకొస్తుండటం ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకన్న తనయుడు శ్రీరాం ఇందుర్తి నియోజకవర్గం నుంచి 1999లో ఎమ్మెల్యేగా గెలిచిన బొమ్మ వెంకన్న తనయుడు బొమ్మ శ్రీరాం చక్రవర్తి ఈసారి హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. హుస్నాబాద్ కాంగ్రెస్ ఇన్‌చార్జీగా కొనసాగుతున్న శ్రీరాం.. నియోజకవర్గంలో పార్టీ చేపట్టే కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ తనదైన శైలిలో ముందుకు దూసుకెళ్తున్నారు. ఈటల రాజేందర్ సతీమణి జమునారెడ్డి ఈసారి తాను హుజూరాబాద్ కాకుండా గజ్వేల్‌లో సీఎం కేసీఆర్‌పై పోటీ చేస్తానని ఈటల రాజేందర్ ప్రకటించిన నేపథ్యంలో ఈసారి జమునారెడ్డిని రంగంలోకి దించుతారన్న ప్రచారం జోరందుకుంది. ఇప్పటిదాకా హుజూరాబాద్ నుంచి మొత్తం ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఈటల గెలిచారు. ప్రతిసారీ డమ్మీ అభ్యర్థిగా జమునారెడ్డి నామినేషన్ వేస్తూ వచ్చారు. నియోజకవర్గపు వ్యవహారాలన్నీ తెలిసి ఉండటం ఆమెకు కలిసి వస్తుందంటున్నారు. కోరుట్లలో కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు కుమారుడు సంజయ్ వయోభారం కారణంగా విద్యాసాగర్‌రావు తన కుమారుడు సంజయ్‌ని ఈసారి తన స్థానంలో పోటీ చేయిస్తారని సమాచారం. విద్యాసాగర్‌రావుకు ఉన్న అనుభవం, సంజయ్.. కేటీఆర్ కలిసి చదువుకోవడం కలిసి వచ్చే అంశాలని స్థానికులు విశ్లేషిస్తున్నారు. ఇటీవల డబుల్ బెడ్ ఇళ్ల ప్రారంభోత్సవం సమయంలో మంత్రి కేటీఆర్ పదే పదే సంజయ్ పేరును పలకడాన్ని కూడా ఉదాహరిస్తున్నారు. విద్యాసాగర్‌రావు కుమారుడు వికాస్ విద్యాసాగర్‌రావు కుమారుడు వికాస్.. కొంతకాలంగా వేములవాడ నియోజకవర్గంలో వైద్యశిబిరాలు నిర్వహిస్తూ స్థానికంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆయన కుటుంబ నేపథ్యంతో బీజేపీ నుంచి ఈసారి వేములవాడ నుంచి బరిలో దిగుతారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఎమ్మెస్సార్ మనవడు మెన్నేని రోహిత్‌రావు మూడుసార్లు ఎంపీగా.. ఆర్టీసీ చైర్మన్‌గా.. రాష్ట్ర మంత్రిగా.. పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసి.. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎదిగి.. కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం పని చేసిన దివంగత నేత ఎం.సత్యనారాయణరావు (ఎమ్మెస్సార్) మనవడు మెన్నేని రోహిత్‌రావు రానున్న ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ మేరకు నియోజకవర్గంలో పార్టీ అధ్వర్యంలో జరిగే కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. తాత ఎమ్మెస్సార్ చేసిన సేవలు, అభివృద్ధి తనకు కలసి వస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి గంగుల కుమారుడు హరిహరణ్ మంత్రి గంగుల కమలాకర్ కుమారుడు గంగుల హరిహరణ్ రాజకీయ ప్రవేశం ఖాయమని ప్రచారం జోరందుకుంది. ఇటీవల హరిహరణ్ జన్మదిన వేడుకల సమయంలో గంగుల వారసుడిగా హరిహరణ్ వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్‌గా పోటీ చేస్తారని అనుచరులు హడావుడి చేయడం త్వరలోనే ఆయన రాజకీయాల్లోకి వస్తారన్న సంకేతాలు కేడర్‌కు వెళ్లినట్లయింది. జువ్వాడి చొక్కారావు మనవడు నిఖిల్ చక్రవర్తి తెలంగాణ సమరయోధుడు, మాజీ ఎంపీ జువ్వాడి చొక్కారావు మనువడు నిఖిల్ చక్రవర్తి కూడా ఈసారి కరీంనగర్ నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్‌పై కన్నేశారు. యూత్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న నిఖిల్ చక్రవర్తి తాత వారసత్వం తనకు అన్నివిధాలా కలిసి వస్తుందని ధీమాగా ఉన్నారు. -
విషాదం: పైసా పైసా కూడబెట్టి.. కలల గూడు కట్టుకుంటే..
సాక్షి, మంచిర్యాల క్రైం: పైసా పైసా కూడబెట్టి, బ్యాంకులో అప్పు చేసి కలల గూడు కట్టుకుని ఆనందంగా జీవిస్తున్నారు. ఇటీవలి భారీ వర్షాలకు వరద నీరు ఇంటిని ముంచెత్తింది. ముంపు నష్టాన్ని తట్టుకోలేక మహిళ ఉరేసుకుని చనిపోయింది. ఈ ఘటన మంచిర్యాలలో బుధవారం జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. బాలాజీనగర్‌కు చెందిన సిద్ది వీరయ్య, జమున(55) దంపతులు మంచిర్యాల మార్కెట్లో చిరువ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నారు. వారికి ముగ్గురు కొడుకులు. పెద్ద కుమారుడు సురేష్ రబ్బర్ స్టాంపులు తయారు చేస్తూ హైదరాబాద్‌లో స్థిరపడ్డాడు. మిగతా ఇద్దరు కుమారులు నవీన్, జగదీష్ మంచిర్యాలలోని కూరగాయల మార్కెట్ లోనే దుకాణాలు నిర్వహిస్తున్నారు. సొంతిల్లు లేకపోవడంతో ఏడాది కిందట ఇంటి నిర్మాణం చేపట్టారు. అందుకు బ్యాంకులో రూ.4 లక్షలు రుణం తీసుకున్నారు. ఇంటికి ఇంకా చిన్నచిన్న పనులు చేయించాల్సి ఉన్నా.. 15రోజుల కిందట గృహ ప్రవేశం చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు జిల్లా కేంద్రంలోని పలు కాలనీలు ముంపునకు గురయ్యాయి. సుమారు వెయ్యి కుటుంబాల పరిస్థితి అగమ్య గోచరమైంది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వీరయ్య ను పెద్ద కుమారుడు సురేష్ వరదలకు ముందే హైదరాబాద్‌కు తీసుకెళ్లాడు. వరదలు ఇంటిని ముంచెత్తడంతో జమునను ఒక స్నేహితుని ఇంట్లో ఉంచి, నవీన్, జగదీష్‌లు మరో స్నేహితుని ఇంట్లో తలదాచుకున్నారు. అప్పటివరకు ఒకేచోట ఉన్న కుటుంబం చెల్లాచెదురైంది. కొత్త ఇల్లు కట్టుకున్నామనే ఆనందం వరదలతో ఆవిరైంది. ఓ వైపు బ్యాంకు రుణం, రూ.4 లక్షల విలువైన ఇల్లు వరదలో పాడైపోవడం, వీటన్నింటికి తోడు భర్త అనారోగ్యంతో జమున మనస్తాపం చెందింది. ఇంట్లోనే ఉరేసుకుంది. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ అంజన్న తెలిపారు. -
జమునా హేచరీస్ భూములు బాధిత రైతులకు పంపిణీ
మెదక్ జోన్/ వెల్దుర్తి: మెదక్ జిల్లా మాసాయిపేట, చిన్నశంకరంపేట మండలాల్లోని వివాదాస్పద అసైన్డ్ భూములను అధికారులు బుధవారం బాధిత రైతులకు అప్పగించారు. తమ భూములను కాజేశారంటూ ఆయా మండలాల్లోని అచ్చంపేట, హకీంపేట, దరిపల్లి గ్రామాల రైతులు ప్రస్తుత బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (జమునా హేచరీస్)పై గతేడాది ఏప్రిల్‌లో సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కాగా ప్రభుత్వ ఆదేశంతో సర్వే చేయించిన కలెక్టర్ హరీశ్ 66 ఎకరాల అసైన్డ్ భూములు కబ్జాకు గురై నట్లుగా ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక అందించారు. దీనిపై జమునా హేచరీస్ కోర్టును ఆశ్రయిం చగా, 2021 నవంబర్‌లో మరో సర్వే చేశారు. 85 ఎకరాల 19 గుంటల భూమి కబ్జాకు గురైనట్టు గుర్తించి నివేదిక అందించారు. దీంతో ఈ భూమిని తిరిగి బాధితులకు అప్పగించాలని ఆదేశిస్తూ ప్రభుత్వం ప్రత్యేక జీఓ విడుదల చేసింది. దీంతో బుధవారం రెవెన్యూ అధికారులు మూడు సర్వే బృందాలను ఏర్పాటు చేసి బాధిత రైతులకు ఆయా సర్వే నంబర్లలో డివిజన్ల వారీగా హద్దులు చూపెట్టారు. ఈ ప్రక్రియ పరిశీలించడానికి వచ్చిన మెదక్ ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి బాధిత లబ్ధిదారులకు ఆ మేరకు పట్టా సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. మాసాయిపేట మండ లం అచ్చంపేట శివారులోని 77, 78, 79, 80, 81, 82 సర్వే నంబర్లలో 62 మంది బాధితులకు 84 ఎకరాల 19 గుంటలు, హకీంపేట శివారులో సర్వే నంబరు 97లో ముగ్గురు రైతులకు ఎకరం భూమికి సంబంధించి పట్టాలు అందజేశారు. పట్టాలు సరే.. నిర్మాణాల సంగతేంటి? ప్రభుత్వం పంపిణీ చేసిన పట్టాలతో రైతులు హర్షం వ్యక్తం చేయగా, కొందరు మాత్రం అయోమయంలో ఉన్నారు. వారికి చూపించిన హద్దుల్లో హేచరీస్‌కు చెందిన శాశ్వత కట్టడాలు ఉండటంతో వాటిని ఎవరు..ఎప్పుడు తొలగిస్తారు అందులో తామెలా వ్యవసాయం చేసుకునేదని పలువురు వాపోతున్నారు. ఇదిలా ఉండగా..పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని బీజేపీ నాయకులు అడ్డుకుం టారేమోనని తూప్రాన్ డీఎస్పీ యాదగిరిరెడ్డి ఆధ్వ ర్యంలో పోలీసులు జమునా హేచరీస్ ముందు మోహరించారు. ఎవరైనా ఆందోళనలు చేస్తే అరెస్టు లు చేసి అక్కడి నుంచి తరలించేందుకు వీలుగా ప్రైవేట్ బస్సులు, డీసీఎంలను ఏర్పాటు చేశారు. -
‘గుండమ్మ కథ’కు షష్టిపూర్తి: అలనాటి నటి జమునకు సత్కారం
సాక్షి, బంజారాహిల్స్: తెలుగు సినిమా రంగంలో 60వ దశకంలో చరిత్ర సృష్టించిన గుండమ్మ కథ చిత్రం 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ చిత్ర కథానాయిక అలనాటి అందాల నటి జమునకు అభినందన, ఆత్మీయ సత్కారం బుధవారం బంజారాహిల్స్‌లోని ఆమె నివాసంలో జరిగింది. ఎమ్మెల్సీ ఎస్.మధుసూదనాచారి ఆకృతి సుధాకర్‌తో కలిసి జమునను ప్రత్యేకంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘గుండమ్మ కథ’ వచ్చి 60 ఏళ్లు గడిచినా ఇప్పటికీ ఇంటిల్లిపాది టీవీల్లో ఈ చిత్రాన్ని ఉత్సాహంగా చూస్తున్నారన్నారు. అగ్రనటుల కలయికలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించిందన్నారు. ఇందులో నటించి జీవించి ఉన్న ఒకరిద్దరిలో జమున ఒకరన్నారు. ఆమె చిరకాలం సంతోషంగా జీవించాలని వీలైయితే సినిమాల్లో నటించి తనలాంటి అభిమానులను అలరించాలని ఆయన అభిప్రాయపడ్డారు. జమున మాట్లాడుతూ.. అప్పటి నటుల మధ్య ఆత్మీయ భావాలు ఉండేవన్నారు. గయ్యాళిగా కనిపించే ‘గుండమ్మ’ పాత్రధారి సూర్యకాంతం ఎంతో మంచివారని, షూటింగ్ సమయంలో క్యారేజీలు తెచ్చి నటీనటులందరికీ తానే వడ్డించేవారన్నారు. కార్యక్రమంలో జమున కూతురు కళాకారిణి స్రవంతి పాల్గొన్నారు. చదవండి: ముడతలు కనిపిస్తున్నాయ్.. గ్లో తగ్గింది.. అనసూయపై కామెంట్లు వీరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ -
జమున హేచరీస్ భూకబ్జాకు ఆధారాలివిగో: మెదక్ కలెక్టర్
మెదక్ రూరల్: మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కుటుంబ సభ్యులకు చెందిన జమునా హేచరీస్ 70.33 ఎకరాల అసైన్డ్, సీలింగ్ భూములను ఆక్రమించడం ముమ్మాటికీ వాస్తవమేనని మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్ పునరుద్ఘాటించారు. ఆయా భూముల్లో చేపట్టిన రీ సర్వే వివరాలను సోమవారం విలేకరుల సమావేశంలో కలెక్టర్ వెల్లడించగా దాన్ని ఈటల సతీమణి జమున తప్పుబట్టడం తెలిసిందే. కలెక్టర్ టీఆర్ఎస్ కార్యకర్తలా వ్యవహరించారంటూ ఆమె ఆరోపణలు గుప్పించిన నేపథ్యంలో ఆయన ఈ అంశంపై వివరణ ఇస్తూ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈటల టీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఆ భూమిని ప్రైవేటుదిగా చూపి ఇప్పుడు ప్రభుత్వ భూమిగా తాము చూపుతున్నట్లు ఈటల జమున చేసిన ఆరోపణల్లో ఎంతమాత్రం నిజం లేదన్నారు. జమున హేచరీస్ భూఆక్రమణలకు సంబంధించిన వివరాలను విడుదల చేశారు. అచ్చంపేటలోని సర్వే నంబర్ 130కి సంబంధించిన వాస్తవాలివీ.. ►అచ్చంపేట గ్రామంలోని సర్వే నంబర్ 130లో ఉన్న మొత్తం 18.35 ఎకరాలను ప్రభుత్వం సీసీ నంబర్ 1491/ఎండీకే/75 పేరిట 11–07–1990లోనే సీలింగ్ మిగులు భూమిగా ప్రకటించిందని, అప్పుడే ఫోడీ తయారైందని కలెక్టర్ తెలిపారు. ►ప్రభుత్వ మెమో 27703/ఎల్.ఆర్‌ఈవీ./2006–08 ప్రకారం 17–12–2007 నుంచే ఆయా భూములను రిజిస్ట్రేషన్ల నుంచి నిషేధించారని కలెక్టర్ తెలిపారు. ►జమున హేచరీస్ 1590/2019 డాక్యుమెంట్ పేరిట 25–03–2019లో చట్టవిరుద్ధంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న 3 ఎకరాల భూమి సహా సర్వే నంబర్ 130లోని మొత్తం భూమి 11 మంది పేదలకు అసైన్ అయిందని వివరించారు. ఈ సర్వే నంబర్లో అసలు పట్టా భూమే లేదన్నారు. అయినా ఈటల రాజేందర్ సతీమణి ఈటల జమున సర్వే నంబర్ 130లోని 3 ఎకరాల అసైన్డ్ భూమిని ఎలాంటి హక్కు లేని రామారావు అనే వ్యక్తి నుంచి కొనుగోలు చేశారని, కాబట్టి ఈ రిజిస్ట్రేషన్ చట్టవిరుద్ధమైనదని స్పష్టం చేశారు. ►సర్వే నంబర్ 130లోని అసైన్డ్ భూమిని ప్రభుత్వం చాకలి యాదయ్య, చాకలి సత్తయ్య, చాకలి మాణయ్య, చాకలి లింగయ్య, చాకలి బిక్షపతి, చాకలి చంద్రయ్య, కత్తెర యాదయ్య, చాకలి పెద్ద వెంకయ్య, చాకలి చిన్న రాములు, ఎరుకల లచ్చయ్య, దాసరి అంజయ్య అసైన్ చేసినట్లు కలెక్టర్ వివరించారు. కానీ ఈ భూములను జమున హేచరీస్ తెల్ల కాగితం ద్వారా అక్రమంగా కొనుగోలు చేసిందన్నారు. ఈ రికార్డులు తమ వద్ద ఉన్నాయన్నారు. అచ్చంపేట గ్రామంలోని సర్వేనంబర్ 81 గురించి సంక్షిప్త వాస్తవాలు ఇలా.. ►అచ్చంపేట గ్రామంలోని సర్వే నెంబర్ 81లో మొత్తం విస్తీర్ణం 16.91 ఎకరాలని కలెక్టర్ హరీశ్ వివరించారు. ఇందులో 14 ఎకరాల 05 గుంటలను ప్రభుత్వం సీసీ నం.1491/ఎండీకే/75, 11–07–1990, సీసీ నం. 919/డీ/75, 03–03–1991లోనే మిగులు భూమిగా ప్రకటించిందని, అప్పుడే ఫోడీ తయారైందన్నారు. ఆ భూమిని ఏడుగురు నిరుపేదలకు వెల్దుర్తి తహసీల్దార్ అసైన్ చేశారన్నారు. ►సర్వే నంబర్ 81లో ఈటల జమున కొనుగోలు చేసిన 5 ఎకరాల 36 గుంటల భూమి చట్టవిరుద్ధమైనదన్నారు. అది అసైన్డ్ భూమి అయినప్పటికీ భూమిపై ఎలాంటి హక్కు లేని రామారావు నుంచి కొనుగోలు చేశారన్నారు. ►సర్వే నంబర్ 81లోని భూమిని ప్రభుత్వం బి/1901/2010, 19–12–2011 నోటిఫికేషన్ కింద స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ పరిధిలోని నిషేధిత ఆస్తుల జాబితాలో చేర్చిందన్నారు. అయినప్పటికీ ఆ భూమిని 07–02–2020లో జమున హేచరీస్ చట్టవిరుద్ధంగా కొనుగోలు చేసిందన్నారు. ►సర్వే నంబర్ 81లోని అసైనీలకు చెందిన భూమిలో జమున హేచరీస్ పిల్లర్ స్ట్రక్చర్లు, రోడ్లు వేయడం ద్వారా సర్వే నంబర్ 81లోని మొత్తం 14 ఎకరాల 05 గుంటలను ఆక్రమించిందని కలెక్టర్ వివరించారు. ►మొత్తంగా అచ్చంపేటలోని సర్వే నంబర్లు 77, 78, 79, 80, 81, 82, 130తోపాటు హకీంపేట గ్రామంలోని సర్వే నంబర్ 97తో కలిపి 70.33 ఎకరాలను జమున హేచరీస్ ఆక్రమించినట్లు తూప్రాన్ ఆర్డీవో సమగ్ర నివేదికలో వివరించారని కలెక్టర్ పేర్కొన్నారు. -
కలెక్టర్ ఆరోపణలు అసత్యం: ఈటల జమున
సాక్షి, హైదరాబాద్: ధరణిలో నమోదైన తర్వాతే భూములు కొన్నామని ఈటల రాజేందర్ సతీమణి ఈటల జమున అన్నారు. రాజకీయ అక్కసుతోనే ఆయనపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఈటల భూ వ్యవహారంపై మెదక్ జిల్లా కలెక్టర్ ప్రెస్‌మీట్‌పై ఆమె స్పందిస్తూ.. న్యాయ సలహా తీసుకున్న తర్వాతే భూములు కొన్నామని పేర్కొన్నారు. భూములకు సంబంధించిన అంశం కోర్టు పరిధిలో ఉంది. ప్రెస్‌మీట్ ఎలా పెడతారు. ప్రెస్‌మీట్ పెట్టడానికే కలెక్టర్లు ఉన్నారా అని ఈటల జమున ప్రశ్నించారు. చదవండి: గోవాలో ఎంజాయ్ చేస్తున్న ఖమ్మం ఎమ్మెల్సీ ఓటర్లు, వీడియో వైరల్ ‘‘సర్వే నెంబర్ 81లో మాకు ఉన్నది 5 ఎకరాల 30 గుంటలే. సర్వే నెంబర్ 130లో మూడు ఎకరాలు ఉంది.. కానీ కలెక్టర్ మాత్రం 70 ఎకరాలు ఆక్రమించారని అసత్యాలు చెబుతున్నారు. మేము ఎవరి దగ్గర భూమి గుంజుకుని రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. టీఆర్ఎస్ కండువా కప్పుకొని కలెక్టర్లు పని చేస్తున్నారని ఆమె దుయ్యబట్టారు. ‘‘2018లో మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. దీనికి సంబంధించిన వివరాలు ఉన్నాయి. అన్ని రకాల అనుమతులు వచ్చాకే షెడ్స్ నిర్మించాం. మొన్నటి వరకు ధరణిలో ఉన్న భూమిని ఇప్పుడు ప్రైవేటు భూమిగా చూపిస్తున్నారు. చాలా మంది రాజకీయ నాయకులకు హ్యాచరీస్ ఉన్నాయి. మరి వాటి దగ్గర పొల్యూషన్ రాదా. పొల్యూషన్ సర్టిఫికెట్ కావాలని ఇప్పుడు అడుగుతున్నారు. ఈటల రాజేందర్‌ను రోడ్డు మీద వేసేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ రాజకీయ కక్ష సాధింపు మానుకోవాలని ఈటల జమున హితవు పలికారు. -
శోభన్ ‘బాబు’ను చేసిన తాసిల్దారు గారి అమ్మాయి
‘అవకాశం వస్తే, మీ నాన్న గారి సినిమాల్లో ఏది రీమేక్ చేస్తారు?’ ‘ప్రేమనగర్’ లాంటి సూపర్ హిట్లు తీసిన దర్శకుడు కె.ఎస్. ప్రకాశరావు గురించి, కమర్షియల్ విజయాలలో తండ్రిని మించిన తనయుడిగా ఎదిగిన దర్శకుడు కె. రాఘవేంద్రరావును కొన్నేళ్ళ క్రితం అడిగాం. దానికి, రాఘవేంద్రరావు ఊహకందని జవాబిచ్చారు. ‘‘ఏయన్నార్ నటించిన ‘ప్రేమనగర్’ (1971 సెప్టెంబర్ 24)ను ఇవాళ మారిన టెక్నాలజీతో బ్రహ్మాండంగా తీసే అవకాశం ఉన్నా... ఆ కథను మా నాన్న గారు తీసినదాని కన్నా గొప్పగా ఎవరూ తీయలేరు. గతంలో ఆ చిత్రాన్ని రీమేక్ చేయాలని నేను, హీరో నాగార్జున, నిర్మాత రామానాయుడు గారు అనుకున్నా, మళ్ళీ వదిలేశాం. అయితే, నాన్న గారు తీసిన ‘తాసిల్దారు గారి అమ్మాయి’ చాలా మంచి స్క్రిప్టు. వీలుంటే, అది రీమేక్ చేయాలని ఉంది’’ – ఇదీ ‘అడవి రాముడు’ లాంటి అనేక ఇండస్ట్రీ హిట్స్ తీసిన రాఘవేంద్రుడి ‘సాక్షి’కి చెప్పిన మనసులో మాట. తండ్రి కె.ఎస్. ప్రకాశరావు దర్శకత్వంలో, తనయుడు కె. రాఘవేంద్రరావు సహాయ దర్శకుడిగా పనిచేసిన అలనాటి శతదినోత్సవ చిత్రం ‘తాసిల్దారు గారి అమ్మాయి’ (రిలీజ్ 1971 నవంబర్ 12). ఆ చిత్రానికి ఇప్పుడు 50 వసంతాలు. ఇంతకీ, శోభన్‌బాబు వర్ధమాన నటుడిగా ఉన్న రోజుల్లో, జమున టైటిల్ రోల్ పోషించిన ‘తాసిల్దారు గారి అమ్మాయి’లో అంత ప్రత్యేకత ఏముంది? చరిత్ర తరచి చూస్తే – చాలానే ఉంది. సోలో హీరోగా... కెరీర్‌కు కొత్త మలుపు! శోభన్‌బాబు సినీరంగానికి వచ్చి అప్పటికి పుష్కరకాలం. చిన్న వేషాల నుంచి పెద్ద వేషాలు, కథానాయక పాత్రల దాకా ఆ పన్నెండేళ్ళలో 70కి పైగా సినిమాల్లో చేశారు. ఎన్టీఆర్, ఏయన్నార్ లాంటి స్టార్ల పక్కన, సమకాలీన హీరో కృష్ణతోనూ కలసి నటిస్తున్నారు. ‘వీరాభిమన్యు’ (1965), విడిగా ‘మనుషులు మారాలి’ (1969), ‘కల్యాణమంటపం’ (1971) లాంటి హిట్లొచ్చినా, సోలో హీరోగా నిలదొక్కుకోలేదు. అలాంటి పెద్ద బ్రేక్ కోసం ఈ అందగాడు నిరీక్షిస్తున్నారు. సరిగ్గా అప్పుడు శోభన్ కెరీర్లో 80వ సినిమాగా రిలీజైన ‘తాసిల్దారు గారి అమ్మాయి’తో ఆ నిరీక్షణ ఫలించింది. వెనక్కి తిరిగి చూసుకోకుండా, సింగిల్ హీరోగా నిలబెట్టేసింది. ‘తాసిల్దారు..’లో తండ్రి – కండక్టర్. కొడుకు – కలెక్టర్. తండ్రీకొడుకులుగా శోభన్ ద్విపాత్రధారణ ప్రజలకు నచ్చింది. చిత్ర విజయానికి కారణమైంది. ఒకేసారి తెరపై రెండు విభిన్న పాత్రల్ని సమర్థంగా చేయడం... నటుడిగా ఆయనలో ఆత్మవిశ్వాసం పెంచింది. జమున – చంద్రకళ హీరోయిన్లుగా మెప్పించారు. నాగభూషణం, రావికొండలరావు, సాక్షి రంగారావు, హాస్యపాత్రలో రాజబాబు అలరించారు. వయసు 34... పాత్ర 64... శోభన్ తన కెరీర్లో పలుమార్లు ద్విపాత్రాభినయం చేశారు. కానీ, ఆయన ద్విపాత్రాభినయానికీ, విభిన్న పాత్రపోషణకూ మొట్టమొదట గుర్తింపు తెచ్చింది ‘తాసిల్దారు...’ చిత్రమే! నిజానికి, అంతకు అయిదేళ్ళ ముందే కమెడియన్ పద్మనాభం నిర్మించిన ‘పొట్టి ప్లీడరు’ (1966)లో అన్నదమ్ములుగా తొలిసారి రెండు రోల్స్ పోషించారు శోభన్. కానీ, పెద్ద వయసు తండ్రి ప్రసాదరావుగా – కుర్రకారు కొడుకు వాసుగా రెండు భిన్న వయసు పాత్రలు... అదీ కథకు కీలకమైన కథానాయక పాత్రలు పూర్తిస్థాయిలో పోషించి, మెప్పించారీ చిత్రంలో! మనిషి తీరు, మాట, నడక – అన్నీ వేర్వేరైన ఆ పాత్రలను ఏకకాలంలో తెరపై రక్తికట్టించేందుకు శారీరకంగా, మానసికంగా చాలానే కష్టపడ్డారు. ముఖ్యంగా – తండ్రీ కొడుకులు పాత్రలు పరస్పరం సంభాషించుకొనే ఘట్టాలలో! ఒక రోజునైతే... ఒక పూటంతా శ్రమపడ్డా ఒక్క షాట్ కూడా ఓకే కాలేదు. ఇక ఆ రోజు చేయలేనని వెళ్ళిపోయి, రాత్రంతా రిహార్సల్ చేసుకున్నారు. మరునాడు వెళ్ళీ వెళ్ళడంతోనే ఫస్ట్ టేక్ ఓకే చేశారు. అదీ ఆయన పట్టుదల. అలా 34 ఏళ్ళ నిజజీవిత ప్రాయంలో చత్వారపు కళ్ళజోడు, చేతిలో కర్రతోడు ఉన్న అరవై ఏళ్ళు దాటిన ముసలి తండ్రి పాత్రలోనూ జనాన్ని మెప్పించారు. దటీజ్ శోభన్! కాలేజీ కలలరాణి సరసనే హీరోగా... కాలేజీ రోజుల నుంచి శోభన్ పిచ్చిగా ప్రేమించి, ఆరాధించి, అభిమానిగా జవాబు రాని ఉత్తరాలెన్నో రాసి, నిద్ర పట్టని కలలతో మద్రాసు వాహినీ స్టూడియోలో అష్టకష్టాలు పడి ‘ఇల్లరికం’ (1959) సెట్స్‌లో దగ్గర నుంచి చూసిన ఆనాటి స్టార్ హీరోయిన్ జమున. హృదయరాణి జమున సరసన జంటగా నటించాలని తపించిన ఆయనకు తొలిసారిగా ఆమెతో నటించే అదృష్టం వరించింది ‘తాసిల్దారు గారి అమ్మాయి’లోనే. నిర్మాతలు కొత్తవాళ్ళయినా, పేరున్న దర్శకుడు ప్రకాశరావు అడగడంతో వర్ధమాన హీరో శోభన్ పక్కన నటించేందుకు జమున కాదనలేకపోయారు. అలా తెరపై తొలిసారే ఆమెకు భర్తగా, కొడుకుగా రెండు పాత్రలు పోషించే అవకాశం శోభన్‌కు దక్కింది. 1971 మార్చి 15న మద్రాసు వాహినీ స్టూడియోలో ప్రసిద్ధ నిర్మాత బి. నాగిరెడ్డి క్లాప్ ఇవ్వగా, పంపిణీదారులు ‘లక్ష్మీఫిలిమ్స్’ అధినేత బి. శివరామయ్య కెమెరా స్విచ్ ఆన్ చేయగా, జమున మీద మొదటి షాట్‌తో చిత్రీకరణ మొదలైంది. సెట్స్‌లో మొదట ఒకటి రెండు సీన్లకు భయపడ్డా, జమున సహకారంతో శోభన్∙విజృంభించారు. భర్తను అనుమానించి, బంధానికి దూరంగా బతికిన భార్యగా, కష్టపడి కొడుకును ప్రయోజకుడిగా పెంచే తల్లిగా బరువైన మధుమతి పాత్రను జమున రక్తి కట్టించారు. జనం మెచ్చిన ఈ జంట అభినయంతో సినిమా దిగ్విజయం... సభలు– సమావేశాలు... శతదినోత్సవాలు. కానీ, మారిన సినిమా గ్లామర్, గ్రామర్‌తో ఆ తరువాత ఆరేళ్ళకు కానీ వారిద్దరి కాంబినేషన్లో మరో సినిమా (‘గడుసు పిల్లోడు’– 1977) రాకపోవడం విచిత్రం! శోభన్ – జమున కాంబినేషన్లో ఆఖరి సినిమా కూడా అదే! తండ్రి శిక్షణలో... రాటుదేలిన రాఘవేంద్రుడు! యాభై ఏళ్ళ క్రితం... ఈ సినిమా తీస్తున్ననాటికి... రాఘవేంద్రరావు ఇంకా దర్శకుడు కాలేదు. దర్శకులు పి. పుల్లయ్య, కమలాకర కామేశ్వరరావు, వి. మధుసూదనరావు లాంటి వారి వద్ద పనిచేసి, కన్నతండ్రి వద్ద ఆయన దర్శకత్వ పాఠాలు నేర్చుకుంటున్న రోజులవి. ఆ సమయంలో ‘తాసిల్దారు గారి అమ్మాయి’ సెట్స్‌లో కె.ఎస్. ప్రకాశరావు కొన్ని సన్నివేశాల చిత్రీకరణ బాధ్యతను కుమారుడికి అప్పగించి, తాను దూరంగా కుర్చీలో కూర్చొని పరిశీలిస్తూ, ప్రాక్టికల్ శిక్షణనిచ్చారు. అలా దర్శకుడు కాక ముందే రాఘవేంద్రరావు కొన్ని సీన్లకు దర్శకత్వ బాధ్యత వహించారీ చిత్రానికి. ఆ రకంగా ఈ చిత్రం ఆయన కెరీర్లో ఓ మధుర జ్ఞాపకం. ఆ తరువాత సరిగ్గా ఆరేళ్ళలో అదే ‘సత్యచిత్ర’ పతాకంపై, అదే నిర్మాతలు సత్యనారాయణ, సూర్యనారాయణలకు అగ్ర హీరో ఎన్టీఆర్‌తో ‘అడవి రాముడు’ లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ రూపొందించే స్థాయికి రాఘవేంద్రరావు ఎదగడం విశేషం. ఆ మాటకొస్తే, ఇవాళ శతాధిక చిత్ర దర్శకుడైన ఆయనను అసలు డైరెక్టర్ని చేసిన తొలి చిత్రం ‘బాబు’ (1975)కు ఛాన్స్ ఇచ్చింది శోభన్‌బాబే! అప్పటికే నూటికి పైగా సినిమాల్లో నటించి, వరుస విజయాలతో స్టార్ హీరోగా వెలుగుతున్నారు శోభన్. కలవడానికి కూడా భయపడుతూ, తండ్రి ప్రకాశరావు ప్రోద్బలంతో వచ్చిన రాఘవేంద్రరావు భుజం తట్టి, తొలి చిత్రంలో నటించడానికి వెంటనే అంగీకరించిన పెద్దమనసు శోభన్‌బాబుది. అలా ఇన్నేళ్ళ దర్శకేంద్రుడి కెరీర్‌కు అప్పట్లో కొబ్బరికాయ కొట్టిన హీరో ఈ ఆంధ్రుల అందాల నటుడు. రెండు నవలలు – రెండూ హిట్టే! ఒక వైపు ‘ప్రేమనగర్’, మరోవైపు ‘తాసిల్దారు గారి అమ్మాయి’ – రెండు చిత్రాలనూ ఏకకాలంలో, ఏకాగ్రతతో తీర్చిదిద్దారు దర్శకుడు కె.ఎస్. ప్రకాశరావు. రెండూ నవలా చిత్రాలే! రెండు నవలలూ ‘ఆంధ్రప్రభ’ వీక్లీలో హిట్ సీరియల్సే! మొదటిది – కోడూరి కౌసల్యాదేవి ‘ప్రేమనగర్’. రెండోది – కావిలిపాటి విజయలక్ష్మి ‘విధి విన్యాసాలు’. ‘కండక్టరు కొడుకు కలెక్టరవుతాడా?’ అనే ఆసక్తికరమైన ప్రశ్న ఉపశీర్షికగా ‘విధి విన్యాసాలు’ వారం వారం పాఠకులను పట్టువిడవకుండా చదివించింది. కమర్షియల్ ఎలిమెంట్లున్న ఆ నవల హక్కులు కొనుక్కొని, సినిమా తీద్దామని వచ్చారు నిర్మాతలు. దర్శకుడు ప్రకాశరావు వారికి అండగా నిలిచారు. వెండితెరకు కావాల్సిన పాత్రోచిత మార్పులతో స్క్రీన్‌ప్లే సిద్ధం చేశారు. అందుకు తోడ్పడ్డ నవలా – నాటక రచయిత ఎన్.ఆర్. నందిని మాటల రచయితగా పెట్టుకున్నారు. ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో కండక్టర్ కొడుకైన హీరో చివరకు అసామాన్యుడైన కలెక్టర్‌గా ఎదిగి, తండ్రి ఆశ నెరవేర్చడమనే ఇతివృత్తం ఆ తరంలో చిగురిస్తున్న ఆశలకు తగ్గట్టు, మధ్యతరగతి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అనుమానించి, అహంకారంతో అవమానించి, భర్తకు దూరమైన ఇల్లాలి జీవితం – చివరకు తన తప్పును తెలుసుకొన్న ‘తాసిల్దారు గారి అమ్మాయి’గా టైటిల్ రోల్లో జమున అభినయం మహిళా ప్రేక్షకులకు పట్టేసింది. వెరసి, సినిమా విజయవంతమైంది. భార్యాభర్తల మధ్య అపోహలు – అపార్థాలు, కన్నబిడ్డ పెరిగి పెద్దయ్యాక చాలా ఏళ్ళకు వారు తిరిగి కలుసుకోవడం అనే ఈ సెంటిమెంటల్ ఫ్యామిలీ కమర్షియల్ కథాంశం ఆ తరువాత మరిన్ని సినిమాలకు స్ఫూర్తినిచ్చింది. పాపులర్ పాటల అదే కాంబినేషన్! ‘ప్రేమనగర్’ కలిసొచ్చిన దర్శక – సంగీత దర్శక – గీత రచయితల త్రయమే (ప్రకాశరావు – కె.వి. మహదేవన్ – ఆత్రేయ) ‘తాసిల్దారు...’కీ పనిచేసింది. ‘ప్రేమనగర్’ రిలీజైన సరిగ్గా 50వ రోజున ‘తాసిల్దారు...’ జనం ముందుకు వచ్చింది. కలర్ సినిమాల హవా మొదలైపోయిన ఆ రోజుల్లో అన్ని రకాల కలర్‌ఫుల్ ‘ప్రేమనగర్’ సంగీతపరంగానూ అపూర్వ విజయం సాధించింది. ఏటికి ఎదురీది బ్లాక్ అండ్ వైట్‌లో తీసిన ‘తాసిల్దారు...’ అంత మ్యూజికల్ హిట్ కాలేదు. అయితేనేం, శతదినోత్సవ చిత్రమై, కొన్ని పాపులర్ పాటలను అందించింది. పెద్ద శోభన్‌బాబుపై వచ్చే ‘కనబడని చెయ్యేదో నడుపుతోంది నాటకం...’ (గానం కె.బి.కె. మోహనరాజు) తాత్త్విక రీతిలో సాగుతూ, తరచూ రేడియోలో వినిపించేది. అలాగే, పెద్ద శోభన్‌బాబు – జమునలపై వచ్చే యుగళగీతం ‘నీకున్నది నేననీ – నాకున్నది నీవనీ...’ పాట ‘కలసిపోయాము ఈనాడు, కలసి ఉంటాము ఏనాడు’ అనే క్యాచీ లైన్‌తో ఇవాళ్టికీ ఆకర్షిస్తుంది. చిన్న శోభన్‌బాబు – చంద్రకళ జంటపై వచ్చే డ్యూయట్ ‘అల్లరి చేసే వయసుండాలి – ఆశలు రేపే మనసుండాలి...’ (గానం పి. సుశీల, జేవీ రాఘవులు) ఆనాటి కుర్రకారు పాట. తొలి తెలుగు లేడీ ఆర్ట్ డైరెక్టర్‌తోనే..! సినీరంగంలో కెమేరా, కళ లాంటి కొన్ని శాఖల్లో ఆడవాళ్ళు ఇవాళ్టికీ చాలా అరుదు. అలాంటిది – 50 ఏళ్ళ క్రితమే ఓ తెలుగు మహిళ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేసిన సినిమా ‘తాసిల్దారు గారి అమ్మాయి’. శ్రీమతి మోహన ఆ సినిమాకు కళా దర్శకురాలు. ఆమె కె.ఎస్. ప్రకాశరావుకు దూరపు బంధువు. మేనకోడలు వరుస. అంతేకాదు... తెలుగు సినీ చరిత్రలో తొలి లేడీ ఆర్ట్ డైరెక్టర్ కూడా ఆవిడే! మద్రాస్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌లో డిప్లమో పట్టా సాధించిన మోహన తన విద్యార్థి దశలోనే సినిమాల్లో ఆర్ట్ డైరెక్టర్ కావడం చెప్పుకోదగ్గ విషయం. కె.ఎస్. ప్రకాశరావు రూపొందించిన ‘రేణుకాదేవి మహాత్మ్యం’ (1960)తో ఆమె కళాదర్శకురాలయ్యారు. ఆ తరువాత ప్రకాశరావు, జి. వరలక్ష్మిల తమిళ చిత్రం ‘హరిశ్చంద్ర’కూ, అలాగే మహానటి సావిత్రి దర్శకత్వం వహించిన ‘చిన్నారిపాపలు’, ‘ప్రాప్తమ్’ (ఏయన్నార్ ‘మూగ మనసులు’కు తమిళ రీమేక్) చిత్రాలకూ కళాదర్శకురాలిగా పనిచేశారు. ఆ రోజుల్లో వివిధ మ్యాగజైన్లకు బొమ్మలు కూడా వేసిన మోహన, ప్రముఖ కమెడియన్ – మెజీషియన్ అయిన రమణారెడ్డికి మేజిక్ ప్రదర్శనల్లో సహాయకురాలిగానూ వ్యవహరించేవారు. తమిళ నటుడు టి.ఎస్. బాలయ్య కుమారుణ్ణి ఆమె వివాహమాడారు. దురదృష్టవశాత్తూ, చిన్న వయసులోనే అనారోగ్యంతో ఆమె కన్నుమూశారు. తొలి తెలుగు లేడీ ఆర్ట్ డైరెక్టర్ ప్రస్థానం అలా అర్ధంతరంగా ముగిసిపోయింది. ఉత్తమ నటుడిగా... తొలి గుర్తింపు! కలర్ సినిమాలు జోరందుకుంటున్న ఆ రోజుల్లో బ్లాక్ అండ్ వైట్‌లోనే చేసిన సాహసం ‘తాసిల్దారు..’. ఈ సెంటిమెంటల్ కుటుంబ కథాచిత్రం అప్పట్లో 29 కేంద్రాల్లో రిలీజైంది. 5 (విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, నెల్లూరు) కేంద్రాల్లో డైరెక్టుగా, మరో కేంద్రం (హైదరాబాద్)లో షిఫ్టుతో – మొత్తం 6 కేంద్రాల్లో ఈ చిత్రం వంద రోజులు ఆడింది. విశేష మహిళాదరణతో విజయవాడ విజయా టాకీస్‌లో, గుంటూరు లిబర్టీలో, రాజమండ్రి వీరభద్ర పిక్చర్ ప్యాలెస్‌లో అత్యధికంగా 105 రోజులు ఆడింది. ఆరు కేంద్రాలలో వందరోజులు ఆడిన సందర్భంగా, రాజమండ్రిలోని నవభారతి గురుకులం ఆవరణలో 1972 ఫిబ్రవరి 19న చిత్ర తారాగణం, సాంకేతిక వర్గం, పంపిణీదారులు, థియేటర్ యజమానుల మధ్య ఘనంగా శతదినోత్సవం జరిపారు. స్టార్ హీరో అక్కినేని ఆ సభకు అధ్యక్షుడిగా రావడం విశేషం. రివార్డులే కాదు అవార్డులూ ‘తాసిల్దారు గారి అమ్మాయి’కి దక్కాయి. ప్రసిద్ధ జాతీయ సినీ పత్రిక ‘ఫిల్మ్‌ఫేర్’ ఆ ఏడాది తెలుగులో ఉత్తమ చిత్రం అవార్డుకు ఈ సినిమానే ఎంపిక చేసింది. అలాగే, ఈ చిత్రం అందాల నటుడు శోభన్‌బాబు అభినయానికీ గుర్తింపునిచ్చింది. అవార్డులు తెచ్చింది. ఫిలిమ్ ఫ్యాన్స్ అసోసియేషన్ నుంచి ఉత్తమ నటుడిగా ఆయన అవార్డు అందుకున్నారు. బెస్ట్ యాక్టర్‌గా ఆయన అందుకున్న తొలి అవార్డు అదే. ఈ చిత్ర నిర్మాతలు ఆ తర్వాత అయిదేళ్ళకు మళ్ళీ శోభన్‌బాబుతోనే తమ ‘సత్యచిత్ర’ బ్యానర్‌పై, కె. విశ్వనాథ్ దర్శకత్వంలో ‘ప్రేమబంధం’ (1976) అనే కలర్ సినిమా తీయడం గమనార్హం. ముందు శోభన్‌బాబు... తర్వాత చిరంజీవి – నిజమైన ఆ జోస్యం! అప్పట్లో అక్కినేని, వర్ధమాన హీరో శోభన్‌బాబును మెచ్చుకుంటూ ‘హి ఈజ్ ఎ గుడ్ యాక్టర్. ఫ్యూచర్ హోప్ ఆఫ్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ’ అన్నారు. ఆ జోస్యం ఫలించింది. ఒక్క 1971లోనే ఏకంగా 16 చిత్రాల్లో నటించిన శోభన్‌బాబుకు సోలో హీరోగా దశ తిరిగింది – ‘తాసిల్దారు...’తోనే. ఆ వెంటనే కె. విశ్వనాథ్ ‘చెల్లెలి కాపురం’ (1971), మరుసటేడు ‘సంపూర్ణ రామాయణం’, ‘మానవుడు – దానవుడు’ – ఇలా వరుస హిట్లతో వెనక్కి తిరిగి చూసుకోలేదు. స్టార్ హీరో అయ్యారు. దశాబ్దిన్నర పైగా ఆ హోదాలో అలరించారు. ‘తాసిల్దారు...’ విడుదలైన సరిగ్గా పదేళ్ళకు... 1981లో లక్ష్మి – చిరంజీవి అక్కాతమ్ముళ్ళుగా ‘చట్టానికి కళ్ళు లేవు’ రిలీజైంది. హైదరాబాద్‌లో ఆ సినిమా హండ్రెడ్ డేస్ ఫంక్షన్. మద్రాసు నుంచి ముఖ్య అతిథిగా వచ్చిన శోభన్‌బాబు నోట యాదృచ్ఛికంగా సరిగ్గా పదేళ్ళ క్రితం అక్కినేని అన్న మాటే వచ్చింది. ‘ఫ్యూచర్ హోప్ ఆఫ్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ చిరంజీవి’ అన్నారు ఆంధ్రుల అందాల అభిమాన కథానాయకుడు. శోభన్ మనస్ఫూర్తిగా అన్న ఆ మాటే నిజమైంది. వర్ధమాన నటుడు చిరంజీవిని సోలో హీరోగా ‘చట్టానికి కళ్ళు లేవు’ నిలబెట్టింది. ఆయన దశ తిరిగింది. బ్లాక్‌బస్టర్ ‘ఖైదీ’ (1983) మీదుగా ఆయన మెగాస్టార్ దాకా ఎదిగారు. సినిమా చరిత్రలో ఊహకందని ‘విధి విన్యాసాలు’ అలానే ఉంటాయి మరి! – రెంటాల జయదేవ -
Huzurabad Bypoll: ఈటల జమున నామినేషన్ విత్ డ్రా
సాక్షి, కరీంనగర్: హుజురాబాద్ ఉప ఎన్నికలో భాగంగా ఇటీవల నామినేషన్ పలువురు నాయుకులు విత్ డ్రా చేసుకున్నారు. మాజీ మంత్రి ఈటల రాజేంద్రర్ సతీమణి ఈటల జమున, హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థి ఒంటెల లింగారెడ్డి, ఇండిపెండెంట్ అభ్యర్థి రాజ్ కుమార్ తమ నామినేషన్లను విత్ డ్రా చేసుకున్నారు. మొత్తం ఇప్పటి వరకూ 42మంది బరిలో ఉండగా ముగ్గురు విత్ డ్రా చేసుకున్నారు. చదవండి: Huzurabad Bypoll: బజాజ్ చేతక్ స్కూటర్లంటే సెంటిమెంట్ ‘ఈటల’ స్కూటర్లు ఏమైనట్టు..? ఇంకా బరిలో 39మంది అభ్యర్థులు 31మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు, ఐదుగురు వివిధ పార్టీల అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అభ్యర్థుల ఆధారంగా ఈవీఎంల ఏర్పాటుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఒక్కో ఈవీఎంలో 15మంది అభ్యర్థులు, 1నోటా కలిపి 16మందికి అవకాశం ఉండనుంది. ఇండిపెండెంట్ అభ్యర్థుల పేర్లు, నెంబర్లతో అక్షరక్రమంలో సింబల్స్ కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
హుజురాబాద్ ఉప ఎన్నిక: టాప్‌లో జమున, ఆ తర్వాత రాజేందర్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికను ప్రభుత్వం, ప్రతిపక్షాలు సవాలుగా తీసుకుంటుండటంతో రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఈ ఎన్నికలో విజయం సాధించేందుకు ఎంత డబ్బు అయినా ఖర్చ పెట్టి తమ అభ్యర్థిని గెలిపించుకోవాలని ఆయాపార్టీలు వ్యూహాలు పన్నుతున్నాయి. తెలంగాణలో ఇప్పటివరకు రూ.వందల కోట్లు ఖర్చుపెట్టిన ఎన్నికగా హుజూరాబాద్ చరిత్ర తిరగరాయనుందనే ప్రచారం కూడా జరుగుతోంది. (చదవండి: అంతర్జాతీయ మారథాన్లలో వరంగల్ ‘జ్యోతి’ ) అధికార, ప్రతిపక్షపార్టీలు ఖర్చుకు వెనుకాడకుండా ముందడుగు వేస్తున్నాయి. ప్రధానపార్టీల తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో ఈటల దంపతులు అత్యధిక ధనవంతులుగా గుర్తింపు పొందారు. ఉపఎన్నిక నామినేషన్లో ఇచ్చిన అఫిడవిట్ ప్రకారం మొదటి స్థానంలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ సతీమణి జమున ఉండగా, ఆ తర్వాత స్థానంలో రాజేందరే ఉన్నారు. తర్వాతి స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బల్మూరి వెంకట్, చివరిస్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్ నిలిచారు. అయితే, ప్రతి ఎన్నికలో ఈటల జమున సెంటిమెంట్ కోసం తన భర్త రాజేందర్ కంటే ముందు నామినేషన్ వేస్తుంటారు. రాజేందర్ బీజేపీ అభ్యర్థిగా పోటీలో నిలుస్తుండటంతో జమున నామినేషన్‌ను విత్‌డ్రా చేసుకోనున్నారు. జమున నామినేషన్ విత్‌డ్రా చేసుకుంటే ఈటల రాజేందర్ రూ.16.12 కోట్ల ఆస్తులతో హుజురాబాద్ నియోజకవర్గంలో పోటీచేస్తున్న అభ్యర్థుల్లో అత్యంత ధనవంతుడిగా నిలువనున్నారు. ధన ప్రవాహంతో జరగనున్న ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేది ఈ నెల 30 తర్వాత తేలనుంది. (చదవండి: వారి వయసంతా 25 లోపే.. అన్నీ హైస్పీడ్ స్పోర్ట్స్ బైక్‌లే) -
హుజురాబాద్ ఉపఎన్నిక: సమరభేరిలో సకుటుంబం..
సాక్షి, కరీంనగర్: హుజూరాబాద్ ఉపపోరు క్రమంగా ఊపందుకుంటోంది. తొలుత గెల్లు శ్రీనివాస్ యాదవ్ (టీఆర్ఎస్), తరువాత బల్మూరి వెంకట్ (కాంగ్రెస్), తాజాగా ఈటల రాజేందర్ (బీజేపీ) ప్రధాన పార్టీల అభ్యర్థులుగా ఉపపోరు బరిలో దిగారు. ప్రధానపార్టీల నుంచి అభ్యర్థుల ఎంపిక ఖరారైంది. ఈలోపే అభ్యర్థులు తమ వ్యూహాలకు పదును పెట్టారు. మరికొందరు ఏకంగా అమలు చేసేస్తున్నారు. ఈ ముగ్గురు కూడా తమ ఇంటి మద్దతుతో ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. వారి భార్యలు, తల్లులు మద్దతుగా ప్రచారంలోకి రానున్నారు. ఈటల రాజేందర్ రాజీనామా నుంచి ఇప్పటి దాకా ఆయన సతీమణి ఈటల జమున ఆయన వెంటే ఉన్నారు. ఒకదశలో ఈటలకు మోకాలి నొప్పి తీవ్రమైన సమయంలో ఆయనకు వీలుకాని పక్షంలో తానే రంగంలోకి దిగాలనుకున్నారు. చదవండి: హుజురాబాద్ ఉపఎన్నిక: రెండో డోసు సర్టిఫికెట్ ఉంటేనే రండి! ఈలోపు రాజేందర్ కోలుకోవడంతో ఆయనకు మద్దతుగా జమున ప్రచారం ప్రారంభించారు. గెల్లు శ్రీనివాస్‌యాదవ్ అభ్యర్థిత్వం ఆగస్టులోనే ఖరారైంది. కొన్నిరోజులుగా ఆయన భార్య గెల్లు శ్వేత కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. తన భర్తను గెలిపించాలని ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. ఇక అందరి కంటే ఆఖరుగా కాంగ్రెస్ ప్రకటించిన బల్మూరి వెంకట్ తల్లి బల్మూరి పద్మ కూడా ప్రచారబరిలోకి త్వరలోనే రానున్నారు. ఉప ఎన్నిక సమరభేరికి వెళ్లే కుమారునికి ఓ తల్లి, తమ భర్తలకు భార్యలు వీరతిలకం దిద్దారు. ఎన్నికల ప్రచార పోరులోనూ భాగస్వాములవుతూ మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు ముందుకు సాగుతున్నారు. చదవండి: హుజూరాబాద్ ఉప ఎన్నిక: ఉత్సాహవంతులకు ఊహించని దెబ్బ గెల్లు ఉద్యమం కొనసాగుతుంది 20 ఏళ్లుగా నా భర్త విద్యార్థి నాయకుడిగా తెలంగాణ కోసం పోరాడాడు. ఏనాడూ ఏ పదవీ ఆశించలేదు. పేదింటి ఉద్యమకారుడు, నిజాయితీగా పనిచేయడమే తెలుసు. అందుకే.. సీఎం ఇక్కడ పోటీ చేసే అవకాశం కల్పించారు. గతంలో రాష్ట్ర సాధన కోసం పోరాడిన నా భర్త, భవిష్యత్తులో కేసీఆర్ అండదండలతో నియోజకవర్గ అభివృద్ధికి అదే సంకల్పంతో పోరాటం చేస్తాడు. – గెల్లు శ్వేత యాదవ్ హుజూరాబాద్ ప్రజలు చైతన్యవంతులు హుజూరాబాద్ ప్రజలు చాలా చైతన్యవంతులు. డబ్బుకు అమ్ముడు పోయేవారు కాదు. దళిత కాలనీలలో రూ.10 లక్షలు కాదు ఉద్యోగం కావాలని అడుగుతున్నారు. ట్రాక్టర్లు, కార్లు ఇస్తే చదువుకున్న వాళ్లు వాటికి డ్రైవర్లుగా పనిచేయాలా అని నిలదీస్తున్నారు. హుజూరాబాద్‌కు వస్తున్న ప్రతీ పథకం ఈటల రాజేందర్ రాజీనామా వల్లనే. తమ్ముడు తమ్ముడు అని కేసీఆర్ తడిగుడ్డతో గొంతుకోశారు. అందుకే.. రాజేందర్‌ను గెలిపించాలి. – ఈటల జమునప్రభుత్వ వైఖరిని ఎండగడతా ఈనెల 8వ తేదీ నుంచి నేను ప్రచారంలో పాల్గొంటా. రాష్ట్రంలో ఉద్యోగాలు రాకుండా బాధ పడుతున్న అయోమయంలో పడేసింది. ప్రభుత్వ వైఖరిని ప్రతీ తల్లికి తండ్రికి తెలిసేలా అందరినీ ఏకం చేస్తూ ప్రచారంలో ముందుకు వెళతాం. నా బిడ్డ విజయానికి నా వంతుగా కృషి చేస్తా. – బల్మూరి పద్మ -
‘సాక్షి’ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది: జమున
Sakshi Excellence Awards: హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ హాలులో ‘సాక్షి మీడియా 2019 ఎక్స్‌లెన్స్ అవార్డుల కార్యక్రమం సెప్టెంబర్ 17న అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా.. నటి జమునకు జీవిత సాఫల్య పురస్కారం దక్కింది. ఈ పురస్కారంపై ఆమె స్పందిస్తూ.. ‘‘సాక్షి’వారి జీవిత సాఫల్య పురస్కారం అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. ‘సాక్షి’ టీవీకి చాలాసార్లు నా ఇంటర్వ్యూలు ఇవ్వడం కూడా జరిగింది. సీనియర్ ఆర్టిస్టుగా ఎన్నో అవార్డులు అందుకున్నాను. కానీ ‘సాక్షి’ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ అవార్డుకు నన్ను ఎంపిక చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతాభివందనాలు’ అని అన్నారు. -
వర్చువల్‌గా కళాభారతి జమున 85వ జన్మదిన వేడుకలు
ప్రజానటి కళాభారతి డాక్టర్ జమునా రమణారావు ఎనభై ఐదవ (85)వ జన్మదినోత్సవం సందర్భంగా జరిగిన వర్చువల్‌గా సమావేశంలో చాలా మంది ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పింగళి వెంకయ్య కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మీ గారు ఆశీర్వదిస్తూ నేను జమున గారి అభిమానిని ఆ రోజుల్లో జమున గారి సినిమా వస్తుందంటే చాలు ఎదురు చూసి మరీ రాగానే వెళ్ళిపోయేదాన్ని. జమున గారి కట్టు బొట్టు ఎంత సంప్రదాయికంగా ఉండేవో అభినయం అంత అద్భుతంగా ఉంటుంది. అందుకే నాకు నూరు సంవత్సరాల వయసులో జమున గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పే అవకాశం రావడం నిజంగా నాకు చాల సంతోషంగా ఉంది. అష్ట ఐశ్వర్యాలతో నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని ఆశీర్వదించారు. జమున గారు ప్రతిగా అంత పెద్దావిడ వచ్చి తనను ఆశీర్వదిస్తుంటే స్వయంగా పింగళి వెంకయ్య గారే వచ్చి ఆశీర్వదించినంత ఆనందంగా ఉంది అని తన సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా డాక్టర్ ఆళ్ళ శ్రీనివాసరెడ్డి(USA) జమున గారికి డాక్టర్ సీ నారాయణరెడ్డి స్వర్ణ కంకణ జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రకటించారు. దర్శకులు కె. విశ్వనాధ్ గారు ఆశీర్వదిస్తూ జమునా, నీకు 85వ పుట్టినరోజంటే నమ్మలేకుండా ఉన్నాం. ఇప్పుడే, నిన్నగాక మొన్న పెద్దమనిషివై నటనలో సత్యభామ లాగా ఇంకా మా కళ్ళ ముందర కనిపిస్తున్నావు. నీకు ఇంత తొందరగా వయస్సు వచ్చిందంటే ఆశ్చర్యంగా ఉంది. నా శుభాకాంక్షలు నీకు ఎప్పుడు కూడా ఉంటాయి. క్షేమంగా ఉండి, ఇంకా ఒక యాభై ఏళ్ళు హాయిగా ఉండాలని కోరుకుంటున్నాను, సెలవు అంటూ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజానటి కళాభారతి డాక్టర్ జమునా రమణారావు ఎనభై ఐదవ(85)వ జన్మ దినోత్సవం అంతర్జాలంలో ఐదు(5) ఖండాలలోని ముప్పై(30) కళాసమితుల సహకారంతో వంశీ గ్లోబల్ అవార్డ్స్ ఇండియా మరియు తెలుగు కళా సమితి ఖతార్ కలిసి పదహారు(16) గంటలుఅత్యంత అద్భుతంగా జరిగింది. వంశీ రామరాజు మాట్లాడుతూ జమునకు డిసెంబర్ నెలలో హైదరాబాద్ లో కనకాభిషేకం చెయ్యబోతున్నట్టు ఆ సందర్భంగా అమెరికా గాన కోకిల శారద ఆకునూరి మెగా సంగీత విభావరి సమర్పించనున్నారని తెలిపారు. పదహారు (16) గంటల సేపు జరిగిన ఈ కార్యక్రమంలో 30 దేశాల నించి 200 మందికి పైగా కవులు కళాకారులు పాల్గొని జమున నటించిన చిత్రాలలోని పాటలు ఎంచుకుని ఆట పాటలతో కార్యక్రమం ఆసాంతం రక్తి కట్టించారు. ఈ కార్యక్రమాన్ని తాతాజీ ఉసిరికల నిర్వహించారు. -
Huzurabad Bypoll: పోటీ నుంచి ఈటల తప్పుకున్నట్టేనా?
-
ఈటల రాజేందర్ సతీమణి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: హుజురాబాద్ ఎన్నికలపై ఈటల రాజేందర్ సతీమణి ఈటల జమున సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజురాబాద్ పోటీలో తాను ఉన్నట్లు స్పష్టం చేశారు. ఈటల రాజేందర్ పోటీ చేసినా, తాను పోటీ చేసినా ఒక్కటేనని ఆమె వెల్లడించారు. ఈటల రాజేందర్ పోటీకి దూరంగా ఉంటారని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. తెలంగాణ ఉద్యమంలో కూడా తన భర్త ఈటల రాజేందర్‌ను వెనకుండి నడిపించానని గుర్తుచేశారు. ప్రతి ఎన్నికల్లో ఈటల ముందుండి ప్రచారం చేశానని చెప్పారు. తమ ఇద్దరిలో ఎవరికి అవకాశం వస్తే వాళ్లు పోటీ చేస్తారని ఆమె స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన సతీమణి చేసిన తాజా వ్యాఖ్యలతో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఇక హుజూరాబాద్‌లోని పలు వార్డుల్లో శనివారం ఈటల రాజేందర్ సతీమణి జమున ప్రచారం నిర్వహించారు. ఈటల రాజేందర్ చేసిన అభివృద్ధి పనులను వివరిస్తూ ఇంటింటా ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా మామిండ్లవాడలో ఓ ఇంటికి వెళ్లి ఓటు అభ్యర్థిస్తుండగా శ్రీనివాస్ అనే వ్యక్తి జమునను నిలదీశారు. తన కుమారుడు ప్రమాదంలో మృతి చెందగా, అప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ రూ.5 లక్షలు ఆర్థిక సాయం చేస్తానని, ఒకరికి ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చి పట్టించుకోలేదని అన్నారు. -
ఈటల సతీమణికి షాక్: నిలదీసిన బాధితుడు
సాక్షి, కరీంనగర్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ సతీమణి జమునకు చుక్కెదురైంది. హుజురాబాద్ పర్యటనలో ఉండగా ఓ బాధితుడు ఆమె ముందరనే గడియారం పగటలగొట్టి నిరసన వ్యక్తం చేశాడు. ఈ ఘటనతో ఆమె అవాక్కయ్యారు. తన భర్త ఈటల తీరును బాధితుడు ఎండగట్టాడు. అనుకోని ఘటనతో ఆమెతో పాటు ఈటల అనుచరులు ఉలిక్కిపడ్డారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. హుజురాబాద్‌లోని మామిళ్లవాడలో ఈటల సతీమణి జమున శనివారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సమయంలో కాలనీకి చెందిన శ్రీను అనే వ్యక్తి ఎదురుపడ్డాడు. తన కుమారుడు క్రీడా పోటీలకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతిచెందగా ఈటల రూ.5 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారని తెలిపాడు. అందులో రూ.లక్ష మాత్రమే ఇచ్చారని మిగిలిన రూ.4 లక్షలు ఇప్పటివరకు ఇవ్వలేదని వాపోయాడు. ఈ విషయమై జమునను శ్రీను నిలదీశాడు. ప్రచారంలో ఈటల రాజేందర్ ఫొటోతో ఉన్న గడియారాన్ని కింద పడేసి రభస చేశాడు. అయితే శ్రీను భార్యకు సాంఘిక సంక్షేమ వసతిగృహంలో ఓ ఉద్యోగం కూడా కల్పించారు. డబ్బుల కోసమే శ్రీను నిలదీశాడని తెలుస్తోంది. -
Etela Rajender: జమున హ్యాచరీస్‌కు అటవీశాఖ నోటీసులు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: మాజీమంత్రి ఈటల రాజేందర్ భూవివాదం నేపథ్యంలో విచారణ చేపట్టిన అటవీశాఖ జమున హ్యాచరీస్‌కు నోటీసులు జారీ చేసింది. హ్యాచరీస్ పరిశ్రమ కోసం రోడ్డు నిర్మిస్తున్న క్రమంలో మొత్తం 237 చెట్లు (పందిరి గుంజల సైజు) తొలగించినట్లు గుర్తించింది. ఈ మేరకు వాల్టా చట్టం కింద ఎందుకు కేసు నమోదు చేయకూడదో మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని మెదక్ జిల్లా రామాయంపేట్ రేంజ్ ఆఫీసర్ కార్యాలయం నుంచి నోటీసులు పంపించారు. ఈ భూవివాదంపై రెవెన్యూ, విజిలెన్స్, ఏసీబీలతోపాటు అటవీశాఖ కూడా వారం రోజులుగా విచారణ చేస్తున్న విషయం విదితమే. జమునా హ్యాచరీస్ ఇచ్చే వివరణను బట్టి కేసు నమోదు చేస్తామని అటవీశాఖ ఉన్నతాధికారులు తెలిపారు. వాల్టా చట్టం ప్రకారం.. నిబంధనలకు విరుద్ధంగా చెట్లు తొలగిస్తే ఆ మేరకు రెట్టింపు సంఖ్యలో, నిర్ణీత సమయంలో మొక్కలు నాటాలి. ఒక్కో మొక్క కోసం నిర్ణీత మొత్తంలో డబ్బును అటవీశాఖకు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అటవీ భూముల ఆక్రమణల్లేవు జమున హ్యాచరీస్ పరిశ్రమకు కేవలం 100 మీటర్ల దూరంలోనే రిజర్వు ఫారెస్టు భూములున్నాయి. అయితే తమ భూములేమీ ఆక్రమణకు గురికాలేదని మెదక్ జిల్లా అటవీ శాఖాధికారి జ్ఞానేశ్వర్ ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు. చదవండి: Etela Rajender:రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయాలనుకుంటున్నారు -
కమర్షియల్ విప్లవనాదం.. మనుషులంతా ఒక్కటే
‘ఎవడిదిరా ఈ భూమి? ఎవ్వడురా భూస్వామి?దున్నేవాడిదె భూమి... పండించేవాడే ఆసామి’. తీవ్రమైన ఆ ప్రశ్నలు... తెగువతో కవి కలం ఇచ్చిన ఆ బలమైన ఆ సమాధానాలు వింటే – ఇప్పుడంటే మాదాల రంగారావు, ఆర్. నారాయణమూర్తి తరహా ఎర్ర సినిమాలు గుర్తొస్తాయి. కానీ, వాటికన్నా ముందే ఓ స్టార్ సినిమా... వెండితెరపై విప్లవం పండించిందని తెలుసా? ఎన్టీ రామారావు లాంటి స్టార్ హీరో, వరుస విజయాల మీదున్న దాసరి నారాయణరావు లాంటి దర్శకుడు కలసి నాలుగున్నర దశాబ్దాల క్రితమే చేసిన సమసమాజ నినాదం ‘మనుషులంతా ఒక్కటే’ (1976 ఏప్రిల్ 7). ఆ సినిమాకు 45 వసంతాలు. ఆనాటి పరిస్థితులే... అలా తెరపై... వ్యవసాయ ఆధారితమైన మన దేశంలో స్వాతంత్య్రం వచ్చిన వెంటనే భూ సంస్కరణలు మొదలయ్యాయి. 1950లోనే జమీందారీ వ్యవస్థ రద్దు బిల్లు వచ్చింది. 1956లో అనేక ప్రాంతాలు ఆ బిల్లును చట్టం చేశాయి. ఆర్థిక అసమానతలెన్నో ఉన్న మన దేశానికి కమ్యూనిజమ్, సోషలిజమ్ తారక మంత్రాలయ్యాయి. నెహ్రూ, శాస్త్రి తర్వాత ప్రధాని అయిన ఇందిరా గాంధీ 1970లో రాజభరణాలను రద్దు చేశారు. 1971 ఎన్నికల్లో ‘గరీబీ హఠావో’ నినాదం మారుమోగించారు. ఆ సామాజిక పరిస్థితుల్లో, జనంలో బలపడుతున్న భావాలతో తెరకెక్కిన కథ – ‘మనుషులంతా ఒక్కటే’. బ్రిటీషు కాలం నాటి పెత్తందారీ జమీందారీ వ్యవస్థనూ, సమకాలీన సామ్య వాద భావనలనూ అనుసంధానిస్తూ తీసిన చిత్రం ఇది. తాతను మార్చే మనుమడి కథ కథ చెప్పాలంటే... జమీందారు సర్వారాయుడు (కైకాల సత్యనారాయణ), ఆయన కొడుకు రాజేంద్రబాబు (ఎన్టీఆర్) పేదలను ఈసడించే పెత్తందార్లు. కానీ, పేదింటి రైతు పిల్ల రాధ (జమున) వల్ల పెద్ద ఎన్టీఆర్ మారతాడు. ఆమెను పెళ్ళాడతాడు. పేదల పక్షాన నిలిచి, న్యాయం కోసం పోరా డతాడు. ప్రాణాలు కూడా కోల్పోతాడు. కానీ, ఆ పేదింటి అమ్మాయికీ, అతనికీ పుట్టిన రాము (రెండో ఎన్టీఆర్) పెరిగి పెద్దవాడై, జమీందారు తాతకు బుద్ధి చెబుతాడు. వర్గ భేదాలు, వర్ణ భేదాలు లేకుండా మనుషులంతా ఒక్కటే అని వాణిజ్యపంథాలో చెప్పడంలో సూపర్ హిట్టయిందీ చిత్రం. విప్లవ కథాచిత్రాలకు కమర్షియల్ మూలం కళాదర్శకుడు– పబ్లిసిటీ డిజైనింగ్ ‘స్టూడియో రూప్ కళా’ ఓనరైన వి.వి. రాజేంద్ర కుమార్ కు సినిమా చేస్తానంటూ అప్పటికి చాలా కాలం ముందే ఎన్టీఆర్ మాటిచ్చారు. మాటకు కట్టుబడి, డేట్లిచ్చారు. పౌరాణికం తీయాలని రాజేంద్ర కుమార్ మొదట అనుకున్నారు. చివరకు ఎన్టీఆర్ – దాసరి కాంబినేషన్‌కు శ్రీకారం చుడుతూ, సాంఘికం ‘మనుషులంతా ఒక్కటే’ తీశారు. రాజేంద్ర కుమార్ సమర్పణలో, ఆయన సోదరుడు – కథా, నవలా రచయిత వి. మహేశ్, గుంటూరుకు చెందిన దుడ్డు వెంకటేశ్వరరావు నిర్మాతలుగా ఈ సినిమా నిర్మాణమైంది. ‘మనుషులంతా ఒక్కటే’ అనే పేరు, ‘దున్నేవాడిదే భూమి’ లాంటి అంశాలు అచ్చంగా వామపక్ష భావజాలంతో కూడిన సినిమాల్లో కనిపిస్తాయి. కానీ ప్రజాపోరాటంతో పాటు, పెద్ద కుటుంబానికి చెందిన హీరో తక్కువ కులపు పేదింటి అమ్మాయిని పెళ్ళాడడం లాంటివన్నీ ఈ కమర్షియల్ చిత్రంలో ఉన్నాయి. అలా చూస్తే ‘భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం’ అనే విప్లవ భావాలతో వచ్చిన తర్వాతి సినిమాలకు ఒక రకంగా ‘మనుషులంతా ఒక్కటే’ మూలమనేవారు దాసరి. అంతకు మునుపు కూడా పెత్తందార్లపై, రైతు సమస్యలపై సినిమాలు వచ్చినా, అవన్నీ పూర్తిగా గ్రామీణ నేపథ్యంలోవే! బ్లాక్ అండ్ వైటే!! ఇలా కమర్షియల్, కలర్ చిత్రాలు కావనేది గమనార్హం. కథ వెనుక కథేమిటంటే... దాసరి రచయితగా, దర్శకత్వ శాఖలో సహాయకుడిగా ఉన్నప్పటి నుంచి ఎన్టీఆర్‌కు తెలుసు. ‘ఒకే కుటుంబం’ (1970 డిసెంబర్ 25)తో సెట్స్‌పై దాసరి దర్శకత్వ ప్రతిభ కూడా ఎన్టీఆర్‌కు తెలిసింది. మరో హిందీ షూటింగుతో క్లాష్ వచ్చి, దర్శకుడు ఎ. భీమ్‌సింగ్ అందుబాటులో లేనప్పుడు కొద్దిరోజులు ‘ఒకే కుటుంబం’ షూటింగ్ చేసింది ఆ చిత్రానికి సహ రచయిత, అసోసియేట్ డైరెక్టరైన దాసరే! అంతకు ముందు రచయితగానూ దాసరి ఒకటి రెండు కథలతో ఎన్టీఆర్ దగ్గరకు వెళ్ళినా, రకరకాల కారణాలతో అవేవీ సెట్స్ పైకి రాలేదు. ఈ ‘మనుషులంతా ఒక్కటే’కు దాసరి ముందు అనుకున్న మూలకథ కూడా వేరే ఎన్టీఆర్ నిర్మాతల దగ్గరకు వెళ్ళిందట! ఎన్టీఆర్, జమునలతో తీయాలనేది ప్లాన్. కానీ, అప్పటికే వచ్చిన ‘మంగమ్మశపథం’(1965)తో పోలికలున్నాయంటూ, ఆ నిర్మాత వెనక్కి తగ్గారట! ఆ తరువాత చాలాకాలానికి దాసరి దర్శకుడయ్యాక ఆ మూల కథే మళ్ళీ ఎన్టీఆర్, జమునలతోనే తెరకెక్కడం విచిత్రం. ‘మనుషులంతా ఒక్కటే’ నిర్మాతల్లో ఒకరైన నవలా రచయిత వి. మహేశ్ గతంలో దాసరి దగ్గర పలు చిత్రాలకు అసిస్టెంట్ స్టోరీ రైటర్. చాలాకాలం క్రితం తాను అనుకున్న కథలో మహేశ్, ఆర్కే ధర్మరాజు సహకారంతో మార్పులు, చేర్పులు చేశారు దాసరి. దాంతో, ఈ కథ నేపథ్యమే మారింది. దున్నేవాడిదే భూమి, జమీందారీ వ్యవస్థ, తాతకు మనుమడు బుద్ధి చెప్పడం లాంటి అంశాలతో కథ కొత్త హంగులు దిద్దుకుంది. నిర్మాత మహేశ్, ఆర్కే ధర్మరాజులకే కథారచన క్రెడిట్ ఇచ్చి, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, దర్శకత్వ బాధ్యతల క్రెడిట్ తీసుకున్నారు దాసరి. ఈ సినిమాలో తెరపై రెండో ఎన్టీఆర్‌ను హోటల్ రిసెప్షన్ దగ్గర పలకరించే చిరువేషంలోనూ మెరిశారు మహేశ్. సమాజానికి మంచి చెప్పే ఈ కథతో ఆ ఏటి ద్వితీయ ఉత్తమ కథారచయితగా మహేశ్ రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డు అందుకున్నారు. క్రేజీ కాంబినేషన్! దాసరి కొడుకుకు ఎన్టీఆర్ పేరు!! దర్శకుడిగా దాసరికి ఇది 12వ సినిమా. అంతకు ముందు 11 సినిమాల్లో ‘సంసారం – సాగరం’, ‘రాధమ్మ పెళ్ళి’, ‘తిరపతి’, యావరేజ్ ‘యవ్వనం కాటేసింది’ పోగా మిగతా 7 సక్సెస్. ఆ మాటకొస్తే ‘మనుషులంతా ఒక్కటే’ రిలీజైన 1976కు ముందు సంవత్సరం 1975లో రిలీజైన దాసరి చిత్రాలు నాలుగూ శతదినోత్సవ చిత్రాలే. దాసరి మంచి క్రేజు మీదున్నారు. అయితే, శోభన్‌బాబు ‘బలిపీఠం’ మినహా అప్పటి దాకా ఆయన తీసిన సినిమాలన్నీ బ్లాక్ అండ్ వైటే! స్టార్ల కన్నా కథకే ప్రాధాన్యమున్న లోబడ్జెట్ చిత్రాలే! ఆ టైములో ఎన్టీఆర్ లాంటి టాప్ స్టార్‌తో, కలర్లో, ఔట్‌డోర్‌లో, భారీ బడ్జెట్‌తో తొలిసారిగా దర్శకత్వం వహించే ఛాన్స్ రాగానే దాసరి రెట్టించిన ఉత్సాహంతో పనిచేశారు. 1975 నాటికి శోభన్‌బాబు జోరు మీదున్నారు. టాప్ స్టార్‌గా ఎన్టీఆర్ కెరీర్ కొనసాగుతోంది. అప్పట్లో ఎన్టీఆర్ సెంటిమెంటల్ క్రైమ్ కథ ‘అన్నదమ్ముల అనుబంధం’ (1975 జూలై 4), ప్రయోగాత్మక ‘తీర్పు’(1975 అక్టోబర్ 1), మాస్‌ఫార్ములా ‘ఎదురులేని మనిషి’ (1975 డిసెంబర్ 12), విభిన్నమైన క్లాస్ ప్రేమకథ ‘ఆరాధన’ (1976 మార్చి 12) చిత్రాలతో 9 నెలల కాలంలో 4 హిట్లు, చారిత్రక కథా చిత్రం ‘వేములవాడ భీమకవి’ (1976 జనవరి 8) తర్వాత ‘మనుషులంతా ఒక్కటే’తో జనం ముందుకొ చ్చారు. జమీందారీ కథకు తగ్గట్టు రాతి కట్టడంతో కోటలా కనిపించే బెంగళూరులోని మైసూర్ మహారాజా ప్యాలెస్‌లో షూటింగ్ చేసిన తొలి తెలుగు చిత్రమూ ఇదే. అంతకు ముందొచ్చిన ‘దేవుడు చేసిన మనుషులు’ (1973) లాంటివన్నీ తెల్లగా, పాలరాతితో చేసినట్టు తోచే మైసూరులోని లలితమహల్ ప్యాలెస్‌లో తీసినవి. చిత్రమేమిటంటే, ఏ.వి.ఎం స్టూడియోలో ‘మనుషులంతా ఒక్కటే’ షూటింగ్ ప్రారంభమైనరోజునే దాసరికి అబ్బాయి పుట్టాడు. ఆ సంతోష వార్త తెలియగానే ఎన్టీఆర్‌తో పంచుకున్న దాసరి, ‘తారక రామారావు అనే మీ పేరు కలిసొచ్చేలా మా తొలి సంతానానికి నామకరణం చేస్తున్నాం’ అని చెప్పారు. కొడుకుకి‘తారక హరిహర ప్రభు’ అని పేరు పెట్టారు. ఎస్పీబీ గాత్రానికి ఓ కొత్త ఊపు ఇద్దరు ఎన్టీఆర్‌లు, ఇద్దరు హీరోయిన్లున్నా – ‘మనుషులంతా...’లో ఎన్టీఆర్‌కు ఒక్క డ్యుయెటైనా ఉండదు. బాపు సూపర్ హిట్ ‘ముత్యాల ముగ్గు’ సహా అక్కినేని ‘సెక్రటరీ’, కృష్ణంరాజు ‘భక్త కన్నప్ప’ తదితర చిత్రాల ఆడియోలతో గాయకుడు రామకృష్ణ హవా నడుస్తున్న రోజులవి. ఆ పరిస్థితుల్లో అప్పటికి ఇంకా వర్ధమాన గాయకుడైన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ‘మనుషులంతా ఒక్కటే’లోని సోలో పాటలన్నీ ఎస్. రాజేశ్వరరావు స్వరసారథ్యంలో పాడి, ఆకట్టుకున్నారు. ‘అను భవించు రాజా..’, ‘తాతా బాగున్నావా..’, ‘ఎవడిదిరా ఈ భూమి..’ (రచన సినారె), ‘కాలం కాదు కర్మా కాదు..’ (ఆత్రేయ) – ఇలా ఆ సోలో సాంగ్స్ అన్నీ పాపులరే. ఇక, ‘ముత్యాలు వస్తావా...’ డ్యూయట్లో అచ్చంగా అల్లు రామలింగయ్యే పాడారేమో అనేట్టుగా ఎస్పీబీ తన గళంతో మాయాజాలం చేయడం మరో విశేషం. అలా ఆయన కెరీర్‌కు ఈ చిత్రం ఓ కొత్త ఊపు. హాస్యనటి రమాప్రభ ఈ సినిమాలో అల్లు రామలింగయ్య, నాగేశ్‌ల సరసన ద్విపాత్రాభినయం చేయడం ఓ గమ్మత్తు! అల్లుతో రమాప్రభకు ‘ముత్యాలు వస్తావా... అడిగింది ఇస్తావా...’ అంటూ డ్యూయెట్ పెట్టడం మరో గమ్మత్తు!! రాజేశ్ ఖన్నా, షర్మిలా టాగోర్ నటించిన హిందీ సినిమా ‘ఆరాధన’ (1969 సెప్టెంబర్ 27)లో ఎస్.డి. బర్మన్ బాణీకి ఆయన కుమారుడు ఆర్.డి. బర్మన్ హంగులు చేర్చగా, దేశమంతటినీ ఊపేసిన పాపులర్ శృంగారగీతం ‘రూప్ తేరా మస్తానా.’ సరిగ్గా ఆ బాణీనే అనుసరిస్తూ, కొసరాజు రాసిన ‘ముత్యాలు వస్తావా..’ అప్పట్లో రేడియోలో మారుమోగింది. ఇప్పటికీ ఎమోషనల్‌గా... ఆ బుర్రకథలు ఇదే సినిమాలో ఇంటర్వెల్‌కు ముందు పెద్ద ఎన్టీఆర్ పాత్ర ఒంటరిగా దుండగుల చేతిలో చనిపోయే ఉద్విగ్నభరిత ఘట్టం ఉంటుంది. ఆ సందర్భానికి తగ్గట్టు మహాభారతంలోని అభిమన్యుడి బుర్రకథను సినారె ప్రత్యేకంగా రాశారు. ప్రసిద్ధ బుర్రకథకుడు నాజర్ బృందంతో ఈ బుర్రకథ తీయాలనుకున్నారు. అయితే, ఆయన వయోభారం అడ్డమైంది. దాంతో, సినారె సూచనతో హైదరాబాద్‌కు చెందిన మరో ప్రముఖ బుర్రకథకుడు పి. బెనర్జీ బృందంతో ఆ బుర్రకథ తీశారు. ఆ బుర్రకథ, తెరపై దాని చిత్రీకరణ ఓ ఎమోషనల్ ఎక్స్పీరియన్స్. నాలుగున్నరేళ్ళ తర్వాత ఎన్టీఆర్ –దాసరి కాంబినేషన్లోనే వచ్చిన ‘సర్దార్ పాపారాయుడు’ లోనూ ఇంటర్వెల్ ముందు ఇదే బెనర్జీ బృందంతో శ్రీశ్రీ రాసిన అల్లూరి సీతారామరాజు బుర్రకథ పెట్టడం విశేషం. యాభైకే... 100 రోజుల వసూళ్ళు తరువాతి కాలంలో దర్శకులైన కె. దుర్గానాగేశ్వరరావు ‘మనుషులంతా ఒక్కటే’కు కో–డైరెక్టరైతే, శతచిత్ర దర్శకుడైన కోడి రామకృష్ణ అప్పట్లో అసిస్టెంట్ డైరెక్టర్. దాసరి శిష్యుడు – ఇప్పటి విప్లవ చిత్రాలకు చిరునామాగా మారిన ఆర్. నారాయణమూర్తి కూడా ఈ విప్లవాత్మక కథాచిత్రంలో క్లైమాక్స్‌లో ఒక చిన్న డైలాగు వేషంలో కనిపిస్తారు. తమిళనాడులోని మద్రాసు, కర్ణాటకలోని బెంగళూరు, నందీహిల్స్, ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు పరిసరాల్లో – ఇలా 3 రాష్ట్రాల్లో భారీ వ్యయంతో ఈ సినిమా చిత్రీకరణ సాగింది. 33 ప్రింట్లతో 50 థియేటర్లలో రిలీజైన ఈ కలర్ చిత్రం అప్పట్లో దాదాపు అన్ని కేంద్రాలలో 50 రోజులు ఆడింది. నాలుగు కేంద్రాల్లో శతదినోత్సవం చేసుకుంది. విజయవాడ లక్ష్మీ టాకీస్‌లో అత్యధికంగా 128 రోజులు ప్రదర్శితమైంది. ఇక, హైదరాబాద్ కేంద్రంలో షిఫ్టింగులతో, సంయుక్త రజతోత్సవం మాత్రం జరుపుకొంది. క్లైమాక్స్ చిత్రీకరణ సాగిన నెల్లూరులో విపరీతంగా ఆదరణ లభించింది. అలా నెల్లూరు, గుంటూరు లాంటి కొన్ని కేంద్రాలలో సర్వసాధారణంగా ఒక సినిమాకు వందరోజులకు వచ్చే వసూళ్ళను ‘మనుషులంతా ఒక్కటే’ కేవలం యాభై రోజులకే సాధించడం అప్పట్లో చర్చ రేపింది. ఆ ఏడాది జూలై 26న మద్రాస్ తాజ్ కోరమాండల్ హోటల్లో దర్శకుడు పి. పుల్లయ్య, నిర్మాత డి.వి.ఎస్ రాజు ముఖ్య అతిథులుగా సినిమా వంద రోజుల వేడుక ఘనంగా చేశారు. అప్పట్లో ఎమ్జీఆర్తో తమిళంలో ఈ సినిమాను రీమేక్ తీయాలనుకున్నారు. కానీ, ఆ వెంటనే జరిగిన ఎన్నికల్లో ఆయన ముఖ్యమంత్రి కావడంతో అది కుదరలేదు. ఏది ఎలా ఉన్నా, మనుషులంతా ఒక్కటే అనే సార్వకాలిక సత్యాన్ని జనరంజకంగా చెప్పిన చిత్రంగా ‘మనుషులంతా ఒక్కటే’ ఎప్పటికీ గుర్తుంటుంది. ఎన్టీఆర్ సహకారంతో... ‘మనుషులంతా...’ తరువాత రాజేంద్ర కుమార్‌కు ఎన్టీఆర్ ఇంకో సినిమా చేశారు. ‘రక్తసంబంధం’ ఫక్కీలోని ఆ అన్నాచెల్లెళ్ళ సెంటిమెంట్ చిత్రం – ‘మహాపురుషుడు’. ‘ఆబాలగోపాలుడు’ టైటిల్ మధ్యలో అనుకొని, చివరకు ‘మహాపురుషుడు’ (1981 నవంబర్ 21)గానే రిలీజైందా సినిమా. నిర్మాణం సగంలో ఉండగానే రాజేంద్ర కుమార్ హఠాత్తుగా కన్నుమూశారు.చిత్ర నిర్మాణం సందిగ్ధంలో పడి, ఆలస్యమైంది. ఎన్టీఆర్ సహకరించి, సినిమా పూర్తి చేయించి, రిలీజ్ చేయించడం విశేషం. పబ్లిసిటీలో... పేరు వివాదం! ‘మనుషులంతా ఒక్కటే’తో మొదలైన ఎన్టీఆర్ – దాసరి కాంబినేషన్లో ఆ తరువాత మరో 4 సినిమాలు వచ్చాయి. ఈ సినిమా తీసేనాటికే ప్రింట్, పోస్టర్ పబ్లిసిటీలో దర్శకుడిగా దాసరి పేరు సినిమా టైటిల్ కన్నా పైన మేఘాలకు ఎక్కింది. కానీ, ఎన్టీఆర్‌తో తొలిసారి తీస్తున్న ‘మనుషులంతా ఒక్కటే’ ప్రిరిలీజ్ పబ్లిసిటీకి దాసరి తన పేరును సినిమా టైటిల్ కన్నా కిందే వేసుకున్నారు. ఆ పైన తమ కాంబినేషన్లో రెండో సినిమా ‘సర్కస్ రాముడు’ (1980 మార్చి 1)కు మాత్రం ఎందుకనో టైటిల్ పైన తన పేరు వేసుకున్నారు దాసరి. అది చూసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ దాసరి దగ్గర పంచాయతీ పెట్టారు. దాంతో, ఇకపై ప్రధాన పబ్లిసిటీలో ముందుగా పైన ఎన్టీఆర్ నటించిన అని పేరు వేసి, ఆ తరువాతే మరోవైపు తన పేరు మేఘాలలో వేయడానికి దాసరి రాజీ కొచ్చారు. ఒప్పుకున్నట్టే, ఆ తరువాత తీసిన ‘సర్దార్ పాపారాయుడు’ (1980 అక్టోబర్ 30), ‘విశ్వరూపం’ (1981 జూలై 25) ప్రధాన పబ్లిసిటీకి ఆ పద్ధతే అనుసరించారు. ఆఖరుగా వచ్చిన ‘బొబ్బిలిపులి’ (1982 జూలై 9)కి సైతం ‘‘నవరస నాయకుడు నటరత్న యన్.టి.ఆర్. నటనా వైభవం’’ అని ముందు వేసి, ఆ తరువాతే మేఘాలలో తన పేరు పబ్లిసిటీలో కనిపించేలా చూశారు. పబ్లిసిటీలో పేరెక్కడ ఉండాలనే ఈ వివాదం సినీప్రియుల్లో అప్పట్లో ఓ ఇంట్రెస్టింగ్ టాపిక్ అయింది. నాగభూషణం లాస్... సత్యనారాయణకు గెయిన్! ఈ సినిమాలో కీలకమైనది – మనుమడైన రెండో ఎన్టీఆర్ ఢీ కొట్టే తాత పాత్ర. అహంకారం నిండిన జమీందారుగా ఆ విలనీ తాత పాత్ర, ఆ గెటప్ అప్పట్లో నటుడు నాగభూషణం ట్రేడ్ మార్క్. నిజానికి, ఎన్టీఆర్ కూడా ఆయన పేరే సూచించారట. కానీ, నాగభూషణం సమర్పించిన ‘ఒకే కుటుంబం’కి పనిచేసిన దాసరి ఆ మాట వినలేదు. ‘తాత – మనవడు’లో నాగభూషణం బదులు గుమ్మడితో వేషం వేయించిన దాసరి ఈసారీ వ్యక్తిగత కారణాల రీత్యా నాగభూషణాన్ని వద్దనే అనుకొన్నారు. సత్యనారాయణ పేరు పైకి తెచ్చారు. అదేమంటే, ‘నన్ను నమ్మండి. ఆయన అద్భుతంగా చేస్తారని నిరూపిస్తా’ అని వాదించి మరీ ఒప్పించారు. నిరూపించారు. ‘ఎన్టీఆర్‌కు తాతగా మహామహులు చేయాల్సింది నేను చేయడమేమిట’ని సత్యనారాయణ సైతం భయపడ్డారు. కానీ, తాత పాత్రకు ప్రాణం పోశారు. ఆయన అభినయం, ‘తాతా బాగున్నావా’ లాంటి పాటలతో నేటికీ ఆ పాత్ర చిరస్మరణీయమైంది. ‘కర్ణ’ ఛాన్స్ ఇచ్చిన... జమున కెమేరా అందం పెద్ద ఎన్టీఆర్‌కు భార్యగా, చిన్న ఎన్టీఆర్‌కు తల్లిగా, ఆత్మాభిమానం ఉన్న పేదింటి రైతుబిడ్డగా జమునది క్లిష్టమైన పాత్ర. ఆ పాత్రను ఆమె అభినయంతో మెప్పించారు. నలభై ఏళ్ళ వయసులోనూ జమున లంగా, ఓణీలతో సినిమా ఫస్టాఫ్‌లో ఆకర్షణీయంగా, చలాకీగా కనిపిస్తారు. ఆ వయసులోనూ, ఆ కాస్ట్యూమ్స్‌తో ఆమెను అందంగా, హుందాగా చూపడంలో కెమేరామ్యాన్ కన్నప్ప ప్రతిభ కూడా ఉంది. ఆ పనితనం ఎన్టీఆర్‌కు బాగా నచ్చింది. ఆ వెంటనే ఎన్టీఆర్ తన 54వ ఏట స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తూ, త్రిపాత్రాభినయం చేస్తున్న పౌరాణిక చిత్రం ‘దాన వీర శూర కర్ణ’ (1977 జనవరి 14)కు కన్నప్పనే కెమేరామ్యాన్‌గా తీసుకున్నారు. కర్ణుడు, సుయోధనుడు, శ్రీకృష్ణుడు – ఈ మూడు పాత్రల్లోనూ తెరపై అందంగా కనువిందు చేశారు. ఆ పాట... అలా స్పెషల్! ఇదే సినిమాలో దాసరి చేసిన మరో మ్యాజిక్ – సినిమాల టైటిల్స్‌తోనే ఏకంగా ఓ పాటంతా రాసి, మెప్పించడం! ‘నిన్నే పెళ్ళాడుతా... రాముడూ భీముడూ...’ అంటూ ఆ పాట అంతా ఎన్టీఆర్ నటించిన సినిమాల టైటిల్స్‌తోనే సాగుతుంది. పి. సుశీల గానంలో హీరోయిన్ మంజుల స్టేజీపై నర్తిస్తుండగా, ఎన్టీఆర్ మీదే దాన్ని చిత్రీకరించడం విశేషం. అంతకు ముందు ‘ఒకే కుటుంబం’ లాంటి సినిమాల్లో గీతరచన చేసినా, దర్శకుడయ్యాక దాసరికి ఇదే ఫస్ట్ సాంగ్. ఈ సినిమాలో ఈ సందర్భం కోసం మొదట వేరే పాట అనుకున్నారు. ఎన్టీఆర్ పౌరాణిక గెటప్పుల్లో కనిపించేలా సినారె రాశారు. అయితే, ఆఖరి నిమిషంలో ఆ గెటప్పుల ప్రతిపాదన విరమించుకొని, ఆపద్ధర్మంగా దాసరి ఈ సినిమా టైటిల్స్పాట రాశారు. సినీటైటిల్స్తోనే ఓ పాట రావడం తెలుగులో అదే తొలిసారి. అప్పటికే ఎన్టీఆర్ దాదాపు 250 సినిమాల్లో నటించారు. అందులోని 34 టైటిల్స్ ఈ పాటలో ఉన్నాయి. అలా ఒక హీరోపై ఆయన సినీటైటిల్స్తోనే ఓ పాట రాసి, ఆయనపైనే చిత్రీకరించడం తెలుగులో ఇదొక్కసారే జరిగింది. తర్వాత ‘మరోచరిత్ర’ లాంటి సినిమాల్లో వేర్వేరు సినిమాల టైటిల్స్ తోనే పాటంతా రాయడమనే ధోరణి కొనసాగింది. - రెంటాల జయదేవ -
ఈ సినిమా నా కెరీర్లో ఓ మైలురాయి
సీనియర్ నటి అన్నపూర్ణ, మాస్టర్ రవితేజ టైటిల్ పాత్రలు పోషించిన చిత్రం ‘అన్నపూర్ణమ్మగారి మనవడు’. బాలాదిత్య, అర్చన జంటగా, సీనియర్ నటి జమున ముఖ్య పాత్రలో నటించారు. జాతీయ అవార్డుగ్రహీత నర్రా శివనాగేశ్వరరావు (శివనాగు) దర్శకత్వం వహించారు. ఎం.ఎన్.ఆర్. చౌదరి నిర్మించిన ఈ సినిమా ఓవర్సీస్లో అమెజాన్ ప్రైమ్ ద్వారా ఇటీవల విడుదలైంది. థియేటర్స్ ప్రారంభించగానే ఇండియాలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో అన్నపూర్ణ మాట్లాడుతూ– ‘‘45 ఏళ్ల కెరీర్లో ఎన్నో చక్కటి పాత్రలు పోషించాను. అయితే నా పేరుతో కూడిన టైటిల్ పాత్రను ఇంతవరకు చేయలేదు. ‘అన్నపూర్ణమ్మగారి మనవడు’ నా కెరీర్లో ఓ మైలురాయిలా నిలిచిపోతుంది’’ అన్నారు. ‘‘సీనియర్ నటీనటులతో కలసి నటించడం ఆనందంగా ఉంది’’ అన్నారు మాస్టర్ రవితేజ. ‘‘హృదయాలను కదిలించే సన్నివేశాలతో పాటు భావోద్వేగాలున్న పాత్ర నాది’’ అన్నారు అర్చన. ‘‘అమెరికాతో పాటు ఓవర్సీస్లో విడుదలైన మా సినిమా విజయం సాధించడం ఆనందంగా ఉంది’’ అన్నారు శివనాగు. ‘‘మా చిత్రం దక్షిణాది ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు ఎం.ఎన్.ఆర్.చౌదరి. ఈ కార్యక్రమంలో నిర్మాతల మండలి కార్యదర్శి టి. ప్రసన్నకుమార్, నిర్మాత ఆచంట గోపీనాథ్, దర్శకుడు వి. సముద్ర, విలన్ పాత్రధారి శ్రీహర్ష, అమెజాన్ ప్రతినిధి రాజీవ్ తదితరులు పాల్గొన్నారు. -
అన్నపూర్ణమ్మగారి మనవడు రెడీ
సీనియర్ నటి అన్నపూర్ణమ్మ, మాస్టర్ రవితేజ లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ‘అన్నపూర్ణమ్మగారి మనవడు’. మరో సీనియర్ నటి జమున ప్రధాన పాత్రలో నటించగా బాలాదిత్య, అర్చన జంటగా నటించారు. జాతీయ అవార్డుగ్రహీత నర్రా శివనాగేశ్వరరావు (శివనాగు) దర్శకత్వం వహించారు. ఎం.ఎన్.ఆర్. ఫిలిమ్స్ పతాకంపై ఎం.ఎన్.ఆర్. చౌదరి నిర్మించిన ఈ సినిమా ఆదివారం (అక్టోబర్ 25న) ఓవర్సీస్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శివనాగు మాట్లాడుతూ– ‘‘తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఓ చిన్న సినిమా ఒకేసారి ఓవర్సీస్లో విడుదల కానుండటం ఇదే మొదటిసారి. అమేజాన్ ప్రైమ్‌లో విడుదలవుతున్న మా సినిమాని ఇండియాలో మాత్రం థియేటర్లు ప్రారంభించాక విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘మంచి అభిరుచిగల దర్శకుడు శివనాగు ఈ చిత్రాన్ని ఎంతో బాగా మలిచారు. పాటలు చాలా బావున్నాయి’’ అని అతిథిగా విచ్చేసిన సంగీత దర్శకుడు కోటి అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: రాజ్ కిరణ్, కెమెరా: గిరికుమార్. -
పల్లెటూరి కథ
సీనియర్ నటి అన్నపూర్ణ, మాస్టర్ రవితేజ టైటిల్ పాత్రలు చేసిన చిత్రం ‘అన్నపూర్ణమ్మగారి మనవడు’. బాలాదిత్య, వేద, సీనియర్ నటి జమున మఖ్యపాత్రల్లో నటించారు. నర్రా శివనాగేశ్వరరావు (శివనాగు) దర్శకత్వంలో ఎం.ఎన్.ఆర్. చౌదరి నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. శివనాగు మాట్లాడుతూ– ‘‘ప్రేమానురాగాలకు నిలయమైన స్వచ్ఛమైన పల్లెటూరి కథతో తెరకెక్కిన చిత్రమిది. ఉమ్మడి కుటుంబాలలోని అనుబంధాలు, మానవ సంబంధాలను సమ్మిళతం చేసి తెరకెక్కించాం. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో మా సినిమా విడుదల కానుంది’’ అన్నారు. ‘‘ఓటీటీలో లేదా థియేటర్స్‌లో మా సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు ఎం.ఎన్.ఆర్. చౌదరి. -
‘జమున పద్ధతి’ రాగి దుబ్బుకు 39 పిలకలు!
అవును మీరు చదివింది నిజమే. గత కొన్ని సంవత్సరాలుగా ‘గులి రాగి’ పద్ధతిలో రాగి నారు పోసి మొక్కలు నాటి సాగు చేయడం ద్వారా ఉత్తరాంధ్ర, తూ.గో జిల్లాలోని కొండ ప్రాంతాల్లో గిరిజన రైతులు మెరుగైన దిగుబడి సాధిస్తున్నారు. అయితే, గత ఏడాది వర్షాధారంగా జమున అనే గిరిజన మహిళా రైతు కొత్త పద్ధతిని ఆచరణలోకి తెచ్చారు. గులి రాగి పద్ధతిలో కొన్ని మార్పులు చేసి మరింత అధిక దిగుబడి సాధించారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో వర్షాధారంగా జమున సాగు చేసిన రాగి దుబ్బుకు 28 నుంచి 39 పిలకలు వచ్చాయి. అందుకే ఈ సాగు విధానాన్ని ‘జమున పద్ధతి’ అని పిలుస్తున్నారు. గిరిజన మహిళా రైతు జమున. ఆమె విశాఖపట్నం జిల్లా మంచింగిపుట్టు మండలం హంసబండ గ్రామంలో కుటుంబంతో జీవిస్తూ వర్షాధారంగా వినూత్న పద్ధతిలో దేశవాళీ రాగులను సాగు చేస్తున్నారు. 2019లో మొదటి సారిగా ప్రయోగాత్మకంగా జమున ఈ పద్ధతిలో రాగి పంటను పండించారు. ఆశ్చర్యంగా ప్రతి దుబ్బుకు 28 నుండి 39 పిలకలు వచ్చాయి. మొదటిసారి ఆమె ఈ పద్ధతి ద్వారా ఎకరానికి 12.2 క్వింటళ్ల రాగుల దిగుబడి పొందారు. ఈ ఏడాది మరింత ఎక్కువ దిగుబడి వస్తుందని భావిస్తున్నారు. ఈ విధానంలో పనులు చాలా వరకు ‘గులి రాగి’ పద్ధతిని పోలి ఉంటాయి. కానీ నాటే పద్ధతి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. జమున పద్ధతిలో ప్రయోజనాలను గుర్తించిన ‘సంజీవిని’ స్వచ్ఛంద సంస్థ సారధులు దేవుళ్ళు, అమ్మాజీ ఈ పద్ధతిని ఈ ఏడాది మరింత ప్రచుర్యంలోకి తీసుకువచ్చారు. ఉత్తరాంధ్ర, తూర్పు గోదావరి గిరిజన కొండ వాలు ప్రాంతాల్లో గులి రాగి ఈ ఏడాది 3,500 ఎకరాలకు విస్తరించగా, జమున పద్ధతిలో రాగి సాగును 144 మంది రైతులు చేపట్టారని ఎన్టీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలక మండలి సభ్యులు కూడా అయిన దేవుళ్లు (9849205469) తెలిపారు. ‘జమున’ సాగు పద్ధతి వివరాలు: ∙జమున సాగు పద్ధతిలో వర్షాధారంగా పొడి దుక్కులతో రాగి, మెట్ట వరి పంటలను పండించవచ్చు. వాలు భూములు, లోతు తక్కవగా ఉన్న ఇసుక నేలలు అనుకూలం. నీరు నిలువ ఉంటే కలుపు సమస్య ఎక్కువ అవుతుంది. దేశవాళి రాగి, వరి రకాల పంట ఎదుగుదలకూ అంత అనుకూలం కాదు. ♦వేసవిలో అంటే ఏప్రిల్‌లో మూడు సార్లు పొడి దుక్కులు చేయాలి. చివరి దుక్కిలో ఎకరానికి 5 టన్నుల పశువుల (గెత్తం) ఎరువు లేదా టైపు–2 ఘన జీవామృతం వేయాలి. ♦మే నెలలో విత్తుకోవటానికి అనుకూలం. వర్షాలకు ముందే విత్తుకుంటే కలుపు మొక్కలు తగ్గి, పంట ఎదుగుదల బాగుంటుంది. ♦దేశవాళి రాగి రకాలు చిన్న చోడి, పెద్ద చోడి అనుకూలం. దేశవాళీ వరి రకాలు కుంటికులియా, కలమోరి, కొండగిరిలను ఎన్నుకోవాలి. విత్తనాలను బీజామృతంతో విత్తన శుద్ధి చేయాలి. ♦విత్తుకోవడానికి ముందు నేలను చదును చేయాలి. మొక్కకు మొక్కకు మధ్య , వరుసల మధ్య అడుగు దూరం ఉండాలి. పొలానికి ఇరువైపులా తాళ్ళ సహాయంతో గానీ లేదా మార్కర్ల సహాయంతో గానీ ఒక అడుగు దూరంతో గీతలు గీయాలి. ♦రెండు గీతలు కలిసే చోట సూమారు రెండు అంగుళాల గుంత తీయాలి. గుంతలో కొద్దిగా టైపు–1 ఘన జీవామృతం వేయాలి. తర్వాత 2–3 విత్తనాలను (రాగి లేదా వరి) గుంతలో వేసి మట్టితో పూడ్చాలి. అయితే విత్తనాలు లోతుగా పడకుండా జాగ్రత్త పడాలి. ఒకవేళ విత్తనాలు గుంతలో లోతుగా పడితే అవి మొలకెత్తవు. ♦మొలకెత్తిన నెల రోజుల్లోగా ఎక్కువగా ఉన్న చోట్ల మొక్కలు కొన్ని పీకి మొలకెత్తని గుంతల్లో నాటు వేయాలి. ఈ విధంగా ప్రతి గుంతకు 2–3 పిలకలు ఉండేలా చేయాలి. ♦జమున పద్ధతి గులి రాగితో పోలికలు ఉంటాయి. రెండింటికీ మధ్య ముఖ్యమైన తేడా ఉంది. గులి రాగి పద్ధతిలో ప్రతి గుంతలో 12–21 రోజుల నారును నాటుతారు. జమున పద్ధతిలో నారుకు బదులుగా విత్తనాలను వేస్తారు. అయితే, మెట్ట వరి పంటకు సంబంధించి ఇది ఒక నూతన ఒరవడిగా చెప్పుకోవచ్చు. ♦విత్తిన 30 రోజుల తర్వాత మొదటి కలుపును వీడర్ల సహాయంతో తీయాలి. కూలీలతో కూడా చేయించవచ్చు లేదా ఎద్దుల సహాయంతో దంతె/ గొర్రు వాడవచ్చు. తర్వాత 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు కలుపు తీయాలి. అంటే, మొత్తం 3 సార్లు అంతర సేద్యం చేయాలి. ♦కలుపు తీసిన ప్రతిసారీ ఎకరానికి 200 లీటర్ల ద్రవ జీవామృతం పోయాలి. ప్రతి మొక్క మొదళ్లలో సుమారు 100 మీ. లీ. పోయాలి. ♦కలుపు తీయడానికి, ద్రవ జీవామృతం పోయడానికి స్థానికంగా లభ్యమయ్యే యంత్రాలను వాడవచ్చు. నాలుగు వరుసలకు ఒకేసారి కలుపు తీయడానికి అలాగే నాలుగు వరుసలలో ఉన్న మొక్కలకు ద్రవ జీవామృతం పోయడానికి ఒకే యంత్రం పనిచేస్తుంది (ట్రాక్టర్ తో పని లేకుండా మనుషులు లాగవచ్చు). ♦గులి రాగి పద్ధతి మాదిరిగానే జమున పద్ధతిలో రాగి పంటలో లేత మొక్కలపై కర్ర దుంగను లాగాలి. ఎక్కువ పిలకలు రావటం కోసం కర్ర దుంగను లాగుతారు. మొలకెత్తిన 15 రోజుల నుంచి 45 రోజుల మధ్య 15 రోజుల వ్యవధిలో 2–3 సార్లు కర్ర దుంగను లాగాలి. అయితే, జమున పద్ధతిలోని మెట్ట వరి పంటకు కర్ర దుంగను లాగనవసరం లేదు. ♦పంట చుట్టూ బంతి, మొక్కజొన్న, కంది మొక్కలను రక్షక పంటలుగా, ఎర పంటలుగా వేయాలి. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సస్య రక్షణ చర్యలు చేపట్టాలి. అవసరమైతేనే కషాయాలను ఉపయోగించాలి. ♦గిరిజన ప్రాంతాల్లో అంతరించిన మెట్ట వరి సాగును కూడా ఈ ఏడాది నుంచి పునరుద్ధరించామని దేవుళ్లు చెప్పారు. కుంటి గులియ, కొండగిరి, చుపర్ ధాన్యం దేశవాళీ వరి రకాలను 480 ఎకరాల్లో సాగు చేస్తున్నారని ఆయన వివరించారు. ఏప్రిల్, మే నెలలో మొదటి వర్షాలకు చల్లుతారు. కందులు, బొబ్బర్లు కలిపి చల్లుతారు. వరి సెప్టెంబర్– అక్టోబర్ కల్లా మెట్ట ధాన్యం కోస్తారు. ఈ బియ్యం బలవర్ధకమని, రుచికరమని దేవుళ్లు అంటున్నారు. ♦సేంద్రియ గులి రాగి ఎకరానికి గత ఏడాది అత్యధికంగా 18.25 కిలోల దిగుబడి వచ్చినట్లు శాస్త్రవేత్తలు నమోదు చేశారు. ఈ ఏడాది గులి రాగిలో అంతర పంటల సాగునూ ప్రారంభించటం విశేషం. 5 వరుసలు రాగి, 2 కొర్రలు, 2 కంది వేశారు. -
84 ఏళ్ల వయస్సులోనూ అదే ఉత్సాహం
-
స్వచ్ఛమైన ప్రేమ
స్వచ్ఛమైన పల్లెటూరి ప్రేమలను, ఉమ్మడి కుటుంబాలలో ఉన్న అనుబంధాలను, మానవ సంబంధాలను మిళితం చేసి తెరకెక్కించిన చిత్రం ‘అన్నపూర్ణమ్మ గారి మనవడు’. టైటిల్ రోల్స్‌లో సీనియర్ నటి అన్న పూర్ణమ్మ, మాస్టర్ రవితేజ నటించగా, సీనియర్ నటి జమున ఒక కీలక పాత్రలో బాలదిత్య, అర్చన హీరో, హీరోయిన్లుగా నటించారు. నర్రా శివనాగేశ్వరరావు దర్శకత్వంలో ఎం.ఎన్.ఆర్. చౌదరి నిర్మించారు. ‘‘ఈ చిత్రాన్ని శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 21న విడుదల చేయబోతున్నాం. కొంతమంది మిత్రుల, శ్రేయోభిలాషుల సలహా మేరకు ఈ చిత్రాన్ని అమృత, ప్రణయ్‌లకు అంకితం ఇస్తున్నాం’’ అన్నారు ఎం.ఎన్.ఆర్. చౌదరి. శివనాగేశ్వరరావు మాట్లాడుతూ – ‘‘ఇందులో వైకుంఠపురం అనే గ్రామానికి చెందిన జమిందారిణి అక్కినేని అన్నపూర్ణమ్మగా అన్న పూర్ణమ్మ నటన హైలైట్. మనవడి పాత్రకు మాస్టర్ రవితేజ ప్రాణం పోశాడు. అక్కినేని అనసూయమ్మగా జమున అలరిస్తారు. ఇక మిర్యాలగూడలో వాస్తవంగా జరిగిన అమృత, ప్రణయ్ ప్రేమకథలో బాలాదిత్య, అర్చనలు నటించారు. సంగీత దర్శకుడు రాజ్ కిరణ్ మ్యూజిక్ ఈ చిత్రానికి ఓ హైలైట్’’ అన్నారు. -
‘ఈ రోజు నా జీవితంలో ఎంతో విషాదాన్ని నింపింది’
సాక్షి, హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి, సినీ నటుడు ఎన్టీఆర్ 24వ వర్ధంతి కార్యక్రమం ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం జరిగింది. రవీంద్ర భారతిలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ లలిత కళా పురస్కారాన్ని హాస్యనటుడు బ్రహ్మానందం అందుకున్నారు. ఈ సందర్భంగా లక్ష్మీ పార్వతీ మాట్లాడుతూ.. ఈ రోజు తన జీవితంలో ఎంతో విషాదాన్ని నిపిందని.. అది తలుచుకుంటేనే మాటలు రావడం లేదన్నారు. ఎన్టీఆర్ ఓ మహానుభావుడని ఆమె అన్నారు. ఎన్టీఆర్‌పై అభిమానంతో ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతీ ఒక్కరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఎన్టీఆర్ లలిత కళా పురస్కారం అందుకుంటున్న బ్రహ్మానందానికి లక్ష్మీ పార్వతీ అభినందనలు తెలియజేశారు. ఎన్టీఆర్ లలిత కళా పురస్కారాన్ని అందుకున్న అనంతరం బ్రహ్మానందం మాట్లాడుతూ.. ఎన్టీఆర్ ఓ మహానుభావుడని, ఎన్టీఆర్ లలిత కళా పురస్కారానికి తనను ఎంపిక చేశారని తెలిసినప్పుడు భయం వేసిందన్నారు. ఎన్టీఆర్‌తో కలిసి మేజర్ చంద్రకాంత్ సినిమా చేయడం తన పూర్వ జన్మ సుకృతమని ఆనందం వ్యక్తం చేశారు. తనకు ఈ అవార్డు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఆయన లక్ష్మీ పార్వతికి ధన్యవాదాలు తెలిపారు. సీనియర్‌నటీ జమున మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌కు సంతానం ఉన్నా వారు చేయాల్సిన కార్యక్రమాన్ని లక్ష్మీ పార్వతి నిర్వహించడం గొప్ప విషయమన్నారు. ఎన్టీఆర్ లలితకళా పురస్కారం అందుకున్న బ్రహ్మానందంకు ఆమె అభినందనలు తెలిపారు. ఎన్టీఆర్ కష్టకాలంలో ఉన్న సమయంలో అండగా ఉండి.. ఎన్టీఆర్‌పై తనకున్న పతిభక్తిని చాటుకున్న లక్ష్మీ పార్వతి అంటే తనకు ఎంతో అభిమానమని అన్నారు. ఎన్టీఆర్ ఓ నటచక్రవర్తి అని, ఆయన పక్కన నటించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఎన్టీఆర్ అంటే ఓ మహానుభావుడని.. కృష్ణుడు సత్యభామ అంటే ఎన్టీఆర్, తానే గుర్తుకు వచ్చేలా నటించామన్నారు. ఎన్టీఆర్ సీఎం అయ్యాక ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారన్నారు. బ్రహ్మానందంకు ఈ అవార్డు ఇవ్వడం తామందరికి గర్వకారణమని అన్నారు. కేవీ రమణాచారి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ నటుడిగా ఎంత గొప్పవారో సీఎంగా కూడా అంతే గొప్పవారని గుర్తు చేశారు. ఎంతో మంది నటుల్ని ఎన్టీఆర్ ప్రోత్సహించారని తెలిపారు. మనుషులు ఎంతో మంది ఉంటారు కానీ, తోటివారి బాగుకోరుకునే కొద్దిమంది మంచివారిలో ఎన్టీఆర్ ఒకరని రమణాచారి అన్నారు. ఎన్టీఆర్ ఓ దైవాంశ సంభూతుడని.. ఎన్టీఆర్ ఆశీస్సులు ఉన్నాయి కాబట్టే ఇవాళ ఈ అవార్డును బ్రహ్మానందం అందుకున్నారని పేర్కొన్నారు. తెలుగు భాష పట్ల ఎంతో అభిమానం ఉన్న వ్యక్తి బ్రహ్మానందమని చెప్పారు. లక్ష్మీ పార్వతి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఎన్టీఆర్ కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉన్న ఏకైక వ్యక్తి లక్ష్మీ పార్వతి అని ఆర్టీఏ మాజీ కమీషనర్ విజయబాబు అన్నారు. పార్వతికి ఏపీ తెలుగు అకాడమీ చైర్మన్‌గా బాధ్యతలు అప్పగించినందకు ఏపీ ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తెలుగులో నేడు ఎంత పెద్ద హీరో సినిమా అయినా బ్రహ్మానందం ఉండాల్సిందేనని.. ఏ పాత్రనైనా అలవోకగా నటించే సత్తా ఉన్న వ్యక్తి బ్రహ్మానందమని విజయబాబు కొనియాడారు. -
అమ్మ నటి.. నేను పెయింటర్
సినిమా కుటుంబాలు రెండు రకాలు. పిల్లలను తిరిగి సినిమాల్లోనే ప్రవేశపెట్టే కుటుంబాలు కొన్ని. సంతానాన్ని కొత్త దారుల్లో నడిపించే కుటుంబాలు కొన్ని. సినిమాల్లో కొనసాగుతున్నవారు ఎలాగూ తెలుస్తారు. పరిశ్రమకు దూరంగా ఉన్నవారు ఏం చేస్తున్నారో తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది. అలనాటి సూపర్‌స్టార్ జమున పిల్లలు ఏం చేస్తున్నారు? కుమారుడు వంశీకృష్ణ శాన్ఫ్రాన్సిస్కోలో ఉంటున్నారు. కుమార్తె స్రవంతి హైదరాబాద్‌లో తల్లితో కలిసి ఉంటున్నారు. ఆమె తన జీవితం గురించి, తల్లితో అనుబంధం గురించి ‘సాక్షి’కి వివరించారు. ఆ విశేషాలు ఆమె మాటల్లో... నా చిన్నప్పుడు అమ్మ నటిగా, ఎంపీగా, సోషల్ యాక్టివిస్ట్‌గా చాలా బిజీగా ఉండటం వల్ల ఎక్కువ సమయం గడపలేకపోయాను. ఆమె ఆ పనుల నుంచి కొద్దిగా విశ్రాంతి తీసుకోవడం మొదలుపెట్టాకే ఆమెతో ఎక్కువ సమయం గడుపుతున్నాను. ఆమె నన్ను ఒక సెలబ్రిటీ కూతురులా కాకుండా సాధారణమైన అమ్మాయిగానే పెంచింది. టైమ్ మేనేజ్మెంట్, డిసిప్లిన్, స్వేచ్ఛ అన్నీ అలవాటు చేసింది. నేను ఫలానా వాళ్ల అమ్మాయినని చెప్పుకుని ప్రయోజనాలు పొందకూడదు అనేది. తప్పు చేయొద్దని, పనులన్నీ సొంతంగా చేసుకోవాలని చెప్పేది. ప్రోగ్రెస్ కార్డు వచ్చిన రోజు దెబ్బలే... నా చిన్నప్పుడు సినిమా వాళ్ల పిల్లలు సినిమా తారలు అవుతారు అనుకునేదాన్ని. స్కూల్లో టీచర్లు కూడా ‘నువ్వు చదువుకోకపోయినా పరవాలేదు, మీ అమ్మగారు పెద్ద హీరోయిన్ కదా, నువ్వు కూడా హీరోయిన్‌వి అయిపోతావు’ అనేవారు. నేను అదే నిజం అనుకున్నాను. చదువు మీద పెద్దగా శ్రద్ధ ఉండేది కాదు. కాని అమ్మ ఊరుకునేది కాదు. తక్కువ మార్కులు వస్తే బెత్తం అందుకునేది. అందుకని నా రిపోర్టు కార్డు నాన్న స్వయంగా తీసుకునేవారు. ఆ టైమ్‌లో అమ్మకు కనపడకుండా పారిపోవడానికి ప్రయత్నించేదాన్ని. ఒక్కోసారి చెట్టు ఎక్కేసేదాన్ని. అమ్మ చేతికి చిక్కగానే రెండు దెబ్బలు పడేవి. నాకు ఇంగ్లీషు, సైన్స్ సబ్జెక్ట్స్ మాత్రమే ఇష్టం. నెమ్మదిగా చదువు మీద శ్రద్ధ పెట్టి, బి.ఏ. పూర్తి చేశాను. అమ్మ ఎంత బిజీగా ఉన్నా నేను స్కూల్లో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్‌కి నా చేత సత్యభామ వేషం వేయించి, తనే కొత్త డ్రెస్ కుట్టించి, మేకప్ చేసి, పద్యాలు నేర్పించేది. మా స్కూల్‌కి వచ్చేది. అమ్మని ప్రత్యేక అతిథిగా వేదిక మీదకు ఆహ్వానించేవారు. తెలుగుతో సూర్యోదయం... తెల్లవారుజామున ఇంకా చీకటిగా ఉండగానే అమ్మ నిద్ర లేచి నాకు హిందీ, తెలుగు నేర్పించేది. ఎంత ఆధునికంగా ఉన్నా, సంప్రదాయాన్ని విడిచిపెట్టకూడదని, పెద్దల పట్ల గౌరవంగా ఉండాలని అమ్మనాన్న ఇద్దరూ చెప్పేవారు. పూజ, మడి, ప్రసాదం తయారు చేయడం, నైవేద్యం పెట్టడం... అన్నీ నేర్పింది. అందరితో కలసిమెలసి ఉండాలని చెప్పేది, కలవనిచ్చేది. ఒత్తులు సరిగా పలక్కపోతే ఒప్పుకునేది కాదు. మా అబ్బాయికి కూడా అమ్మే తెలుగు నేర్పిస్తూ, తెలుగులో మాట్లాడాలని చెబుతుంది. మా చిన్నతనం నుంచి అమ్మానాన్నల్లో ఎవరో ఒకరు మా విషయాలు పట్టించుకునేవారు. పాటలు – పాత్రలు... అమ్మకి జ్ఞాపకం బాగా ఎక్కువ. ఏ సినిమా ఎప్పుడు ఎక్కడ షూటింగ్ జరిగిందీ, అక్కడ సెట్లో వాళ్లు ఏ ముచ్చట్లు మాట్లాడుకున్నారో అన్నీ నాకు చెప్పేది. నేను, నాన్న ‘మీరజాలగలనా’ పాటను పాడుతూ అమ్మను ఆట పట్టించేవాళ్లం. అమ్మ నటించిన ‘గుండమ్మ కథ’ నా ఫస్ట్ ఫేవరేట్. అందులో అమ్మ వేసిన సరోజ పాత్రలో నన్ను నేను చూసుకుంటాను. నేను కూడా ఆ సినిమాలోలాగే నిద్ర మంచం మీద నుంచే ‘అమ్మా! కాఫీ’ అనేదాన్ని. ‘కిందకి వచ్చి తాగు’ అని అమ్మ గట్టిగా అనేది. ఈ సినిమాలో రెండోభాగంలో ఒక సామాన్యుడి భార్యగా అమ్మని చూడటం నాకు నచ్చేది కాదు. ఒక సినిమాలో అంత వేరియేషన్ రావడం ఆ తరవాతి రోజుల్లో నాకు బాగా నచ్చింది. పరిశ్రమలో వేరెవ్వరికీ ఇటువంటి పాత్రలు లేవేమో అనుకుంటాను. అమ్మ వేసిన పాత్రలలో ‘మూగమనసులు’ చిత్రంలోని గౌరి కూడా నాకు ఇష్టం. ఆ చిత్రంలో అమ్మని ముసలిగా చూడలేకపోయేదాన్ని. చిన్నప్పుడు ఈ సినిమా అమ్మతో కూర్చుని చూశాను. అమ్మ నటించిన ‘మూగనోము’ చిత్రాన్ని చూస్తూ, నాన్న ఏడ్చేవారు. నేను ఆ సినిమా చూడలేదు. ‘ఉండమ్మా బొట్టు పెడతా’లో మహిళాశక్తి, స్త్రీ త్యాగం చూపారు. హిందీలో ‘మిలన్’, ‘మిస్ మేరీ’ సినిమాల్లో అమ్మ బాగా చేసింది. ఆధ్యాత్మిక పాత్రలు, ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించే పాత్రలు, పౌరాణికాలు... ఇన్ని విలక్షణమైన పాత్రలు చేసినది బహుశ అమ్మ ఒక్కరేనేమో. అమ్మ సినిమా జీవితంలో పడిన కష్టాలు విని ఆశ్చర్యపోయాను. అమ్మను సినిమా షూటింగ్లో ఎప్పుడూ చూడలేదు. తీసుకెళ్లేది కాదు. దసరా బొమ్మల కొలువు... అమ్మ తన బాల్యం నుంచి ఇప్పటివరకు దసరాకు బొమ్మల కొలువు పెడుతూనే ఉంది. వందేళ్లనాటి మా అమ్మమ్మ ఆడుకున్న బొమ్మలు ఇప్పటికీ ఉన్నాయి. అమ్మ పెట్టే బొమ్మల అమరికలో చాలా పర్ఫెక్షన్ ఉంటుంది. అమ్మమ్మ... అమ్మ... నేను... మా అబ్బాయి... పరంపర కొనసాగుతోంది. ఆ సంవత్సరం గృహిణిగా... నాకు 16 సంవత్సరాలు వచ్చేవరకు అమ్మని ఎన్నడూ కిచెన్‌లో చూడలేదు. ఒకసారి ఒక సంవత్సరం పాటు వంట మనిషి దొరకలేదు. దానితో ఏడాదిపాటు అమ్మ తన పనులన్నీ మానేసి, కెరీర్‌కి సెలవు పెట్టేసింది. వంటల పుస్తకాలు తెప్పించుకుని, చదివి, చేసేది. అమ్మ చేసిన వాటిలో క్యాలీఫ్లవర్ బజ్జీ, వెజిటబుల్ అగ్రెట్టా (ఇటాలియన్) నాకు బాగా ఇష్టం. ప్రతిరోజూ నా బాక్స్‌లో లంచ్ నా స్నేహితులు తీసుకుని తినేసేవారు. ఇంటికి వచ్చాక అమ్మ, ‘ఈ రోజు లంచ్ ఎలా ఉంది’ అని అడిగితే, నేను సమాధానం చెప్పలేకపోయేదాన్ని. ఆ ఏడాది అమ్మని అచ్చమైన గృహిణిగా చూశాను. వ్యక్తిత్వం నిలబెట్టుకుంది... సినిమా రంగంలో వ్యక్తిత్వం నిలబెట్టుకున్న అమ్మ దగ్గర ఎవ్వరూ వెకిలి జోకులు వేసేవారు కాదు. అలా నిలదొక్కుకోవడం చాలా కష్టమని చెప్పేది. మా అబ్బాయితో రెజ్లింగ్ చేస్తుంది. అమ్మ డైట్ చాలా డిసిప్లిన్డ్గా ఉంటుంది. ఇప్పటికీ మాకు ఆహారపు అలవాట్ల గురించి క్లాసు పీకుతుంది. అమ్మ నుంచి జెనెటిక్‌గా నాకు మంచి ఆరోగ్యం వచ్చింది. అమ్మకు కోపం ఎంత త్వరగా వస్తుందో, అంత త్వరగా పోతుంది. పర్ఫెక్షన్ కోసమే అమ్మకి కోపం వస్తుంది. అన్నయ్య, నేను సినిమాలలోకి వెళ్లకపోయినా, మనవడైనా సినిమాలలోకి ప్రవేశించి, తన పేరు నిలబెట్టాలని కోరుకుంటోంది అమ్మ. – సంభాషణ:డా. వైజయంతి పురాణపండ ఫొటోలు: శివ మల్లాల గ్లాస్ పెయింటర్ని... బి.ఏ. పూర్తయ్యాక కొంతకాలం శాన్ఫ్రాన్సిస్కోలో అన్నయ్య దగ్గరున్నాను. ఆ సమయంలోనే బర్కిలీలో గ్లాస్ ఆర్ట్ మీద కోర్సు చేశాను. ఇదే నా కెరీర్ అని అర్థం చేసుకుని, పెయింటింగ్స్ మీద దృష్టి పెట్టాను. గ్లాస్ పెయింటింగ్ వర్క్ అర్ధరాత్రి వరకు చేస్తుండేదాన్ని. చేతులు కోసుకుపోతుండేవి. నా చేతులు చూసి, అమ్మ గోరుముద్దలు తినిపించేది. నవ రసాల మీద తొమ్మిది పెయింటింగులు వేసి, ‘త్వమేవాహమ్’ పేరు పెట్టాను. ‘నిత్య విద్యార్థి’లా ఉండాలని అమ్మ ఎప్పుడూ చెబుతుంది. అమ్మ తనను తాను అలాగే అనుకుంటుంది. – స్రవంతి -
పల్లెటూరి అనుబంధాలు
సీనియర్ నటి అన్నపూర్ణ, జమున, మాస్టర్ రవితేజ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘అన్నపూర్ణమ్మగారి మనవడు’. నర్రా శివనాగేశ్వరరావు(శివనాగు) దర్శకత్వంలో ఎమ్ఎన్ఆర్ చౌదరి నిర్మించారు. ఈ చిత్రం పాటలను దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ విడుదల చేయగా, తొలి సీడీని నిర్మాత కేఎల్.దామోదర్ ప్రసాద్ అందుకున్నారు. ఈ చిత్రం టీజర్‌ను ఆదిత్యా మ్యూజిక్ ప్రతినిధి మాధవ్ విడుదల చేశారు. తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ– ‘‘ఆర్టిస్టు కావాలనుకున్న శివనాగు దర్శకుడిగా మారారు. ఈ చిత్రం టైటిల్, సన్నివేశాలు, పాటలు చూస్తుంటే పల్లెటూరి వాతావరణ ం కనిపిస్తోంది’’ అన్నారు. ‘‘కుటుంబ అనుబంధాలు, ఆప్యాయతలతో తెరకెక్కిన చిత్రమిది’’ అన్నారు దామోదర్ ప్రసాద్. ‘‘మంచి టైటిల్‌తో ఇలాంటి కుటుంబ చిత్రాన్ని తీయడం అభినందనీయం’’ అన్నారు దర్శకులు సాగర్. ‘‘కథకు ప్రాధాన్యం ఇచ్చి తీసిన చిత్రం ఇది’’ అన్నారు అన్నపూర్ణమ్మ. ‘‘ఈ పాత్రను పోషించడం సంతోషంగా ఉంది’’ అన్నారు మాస్టర్ రవితేజ. ‘‘పల్లెటూరి ప్రేమలను, వాతావరణాన్ని ప్రతిబింబించాల్సిన చిత్రాలు ఇంకా రావాల్సి ఉంది’’ అన్నారు శివనాగు. ఓ మంచి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించాలనే సంకల్పంతో ఈ సినిమా తీశాం’’ అన్నారు ఎమ్ఎన్ఆర్ చౌదరి. నటుడు బెనర్జీ, సంగీత దర్శకుడు రాజ్‌కిరణ్, సింగర్స్ పసల, బేబి, నటుడు గోవిందరాజుల చక్రధర్ తదితరులు పాల్గొన్నారు. -
పసిడి పోరుకు మంజు రాణి
ఉలన్ ఉడే (రష్యా): ఆడుతున్న తొలి ప్రపంచ ఛాంపియన్ షిప్ లోనే భారత యువ మహిళా బాక్సర్ మంజు రాణి అదరగొట్టింది. 2001లో మేరీకోమ్ తర్వాత బరిలోకి దిగిన తొలి ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనే ఫైనల్‌కు చేరిన తొలి భారత బాక్సర్‌గా గుర్తింపు పొందింది. శనివారం జరిగిన 48 కేజీల సెమీఫైనల్లో మంజు 4–1తో చుఠామట్ రక్సత్ (థాయ్‌లాండ్)పై ఘన విజయం సాధించింది. నేడు జరిగే ఫైనల్లో్ల ఎకతెరీనా పల్త్‌సెవా (రష్యా)తో మంజు రాణి తలపడుతుంది. మేరీకోమ్‌కు షాక్... రికార్డు స్థాయిలో ఏడో పసిడి పతకంపై గురిపెట్టిన భారత దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ తన పోరాటాన్ని సెమీస్‌తో ముగించింది. దీంతో ఆమె ఈసారి కాంస్యంతో సరిపెట్టుకుంది. 51 కేజీల విభాగంలో జరిగిన సెమీస్ బౌట్లో ఆమె 1–4తో రెండో సీడ్ బుసెంజ కకిరోగ్లు (టర్కీ) చేతిలో ఓడింది. 54 కేజీల విభాగంలో జమునా బోరో 0–5తో టాప్‌సీడ్ హుయాంగ్ హ్సియావో వెన్ (చైనీస్ తైపీ) చేతిలో, లవ్లీనా 2–3తో యాంగ్ లియు (చైనా) చేతిలో ఓడి కాంస్యాలతో సంతృప్తి చెందారు. -
నిజమైన ప్రేమకోసం...
జీపీఎస్, కపిలాక్షి మల్హోత్రా, సోనాక్షి వర్మ, మౌని, మమతశ్రీ చౌదరి ప్రధానపాత్రల్లో, సుమన్ కీలకపాత్రలో నటించిన చిత్రం ‘ప్రేమ పిపాసి’. ‘సెర్చింగ్ ఫర్ ట్రూ లవ్’ అనేది ఉపశీర్షిక. మురళి రామస్వామిని దర్శకత్వంలో ఎస్ఎస్ ఆర్ట్ ప్రొడక్షన్స్‌పై రాహుల్ బాయ్ మీడియా అండ్ దుర్గశ్రీ ఫిలింస్‌తో కలిసి పి.ఎస్.రామకృష్ణ (ఆర్.కె) నిర్మించారు. ఈ సినిమా మోషన్ పోస్టర్ని సీనియర్ నటి జమున, సహజ నటి జయసుధ, నటుడు బాబూమోహన్, నిర్మాతలు సి.కళ్యాణ్, అంబటి రామకృష్ణ విడుదల చేశారు. మురళి రామస్వామి మాట్లాడుతూ– ‘‘మంచి లవ్, రొమాన్స్, కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. ప్రతి పాత్ర కనెక్టయ్యేలా ఉంటుంది’’ అన్నారు. ‘‘రీ రికార్డింగ్ జరుగుతోంది. త్వరలో ఆడియోతో పాటు టీజర్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు పి.ఎస్.రామకృష్ణ. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: రాహుల్ పండిట్, జియస్ రావ్, వై. వెంకటలక్ష్మి. -
నలభయ్యేళ్ల తర్వాత వేదిక పంచుకున్నాం
‘‘పండంటి కాపురం’ చిత్రంలో జయసుధ నా కూతురిగా నటించింది. ఆమెకి కూడా అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది. అలాగే నాకు ఈ లైఫ్‌టైమ్ ఎచీవ్మెంట్ అవార్డు రావడం ఆనందంగా ఉంది’’ అని సీనియర్ నటి జమున అన్నారు. వీబీ ఎంటర్టైన్మెంట్స్పై ఆరేళ్లుగా బుల్లి తెర అవార్డులను అందిస్తున్న విష్ణు బొప్పన గత రెండేళ్లుగా వెండి తెర అవార్డులను కూడా అందిస్తున్నారు. ఈ ఏడాది జమునకు లైఫ్ టైమ్ ఎచీవ్మెంట్ అవార్టు, జయసుధకు లెజెండరీ అవార్డుతో పాటు పలువురు కళాకారులకు అవార్డులను అందజేశారు. జయసుధ మాట్లాడుతూ– ‘‘గతంలో ‘పండంటి కాపురం’లో జమునమ్మకు కూతురిగా నటించాను. నలభై ఏళ్ల తర్వాత ఆమె, నేను ఒకే వేదిక మీద కలిసి అవార్డును తీసుకోవడం గర్వంగా ఉంది’’ అన్నారు. ‘‘నాకు సపోర్ట్ అందిస్తున్న శతాబ్ధిటౌన్ షిప్ ప్రైవేట్ లిమిటెడ్‌కి ధన్యవాదాలు. వారు తోడుగా ఉన్నారు కాబట్టే ఈ కార్యక్రమాలు చేస్తున్నాను’’ అన్నారు విష్ణు బొప్పన. ‘‘నాకు ఆల్ రౌండర్ అవార్డు ఇవ్వడం ఆనందంగా ఉంది’’ అన్నారు బాబూమోహన్. ‘‘బెస్ట్ డైలాగ్ అవార్డు ఇచ్చినందుకు ధన్యవాదాలు’’ అన్నారు సంపూర్ణేష్ బాబు. ఫ్యామిలీ మూవీగా ‘సమ్మోహనం’ చిత్రానికి వీకే నరేశ్, ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రానికి బ్యూటీ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఇషా రెబ్బా, ‘ఎఫ్ 2’కి కమెడియన్‌గా రఘుబాబు ఇలా పలువురు తారలకు అవార్డులను ప్రదానం చేశారు. -
ఆ వీడియో వైరల్ అయింది.. ఎంజాయ్ చేశాను
వినాయక చవితి రోజున గణేశుడిని సభక్తితోపూజిస్తారు జమున. వినాయకుడి చరిత్ర మీద వచ్చిన తొలి సినిమాలో ఆమె సత్యభామ. అప్పటి నుంచి ఇప్పటివరకూ తెలుగువాళ్లకు... సత్యభామ అంటే జమునే. ఆమె శ్రీకృష్ణుడి భక్తురాలు. రోజూ కృష్ణుడిని కొలుస్తారు. ఆమె కోరుకున్నవన్నీ ఆ కృష్ణుడు ఇచ్చాడు. సహస్ర చంద్రదర్శనం చేసిన జమున ఇప్పుడు... కృష్ణుడిని ఏం కోరుకుంటున్నారు? కుడుములు తింటూ.. జమున ఇంటర్వ్యూ చదవండి. ♦ ఆగస్ట్ 30తో 83 ఏళ్లు పూర్తి చేసుకుని, 84లోకి అడుగుపెట్టారు. 83 ఏళ్లు దాటిన వారిని సహస్రచంద్ర దర్శనం (జీవితకాలంలో వెయ్యి పున్నములను చూస్తారని ఆ లెక్క) చేశారంటారు. బర్త్‌డే నాడు తులాభారం ఇచ్చినట్లున్నారు.. అవును. నా బరువంత బియ్యం, బెల్లం, నెయ్యి ఇచ్చాం. వంశీ రామరాజుగారి ఆధ్వర్యంలో వాటి పంపిణీ జరిగింది. ఇన్నేళ్ల జీవితం ఆనందంగా గడిచినందుకు ఆ కృష్ణుడికే కృతజ్ఞతలు చెప్పాలి. ♦ పుట్టిన రోజు నాడు చక్కగా పట్టుచీర కట్టుకుని, వడ్డాణం పెట్టుకుని భలేగా ఉన్నారు.. సినిమా తారలు పబ్లిక్‌లోకి వచ్చినప్పుడు అందంగా, హుందాగా కనపడాలి. ఎందుకంటే ప్రేక్షకుల హృదయాల్లో మా అందమైన రూపం నిలిచిపోతుంది. అందుకే నేను పట్టుచీరలే కట్టుకుంటాను. నగలు కూడా బాగానే పెట్టుకుంటాను. అయితే మొన్న పుట్టినరోజుకి అమ్మాయి పెట్టుకోమంటే వడ్డాణం కూడా పెట్టుకున్నాను. అరవంకీలు ఉన్నాయి కానీ, బరువు అనిపించి పెట్టుకోలేదు. ♦ ఈ రోజు వినాయక చవితి. చిన్నప్పుడు ఈ పండగను ఎలా చేసుకునేవారు? మేం దుగ్గిరాలలో ఉండేవాళ్లం. ఉదయం నిద్రలేచి, తలస్నానం చేసి పత్రి అవీ తీసుకురావడానికి కాలువ దగ్గరికెళ్లేవాళ్లం. ఎవరైనా ముందుకు తోస్తే చెట్టెక్కేదాన్ని. పత్రి కోసేదాన్ని. చంద్రుడిని చూడక ముందే కథ చదవాలి...లేకపోతే నిందలకు గురవుతాం అంటారు... అవును.. ఈ రోజు గణేశుడిని పూజించ కుండా చంద్రుడ్ని చూస్తే నీలాపనిందలకు గురవుతాం అంటారు. కానీ ఇప్పుడు ఏం నీలాపనిందలు వస్తాయో చూద్దామని కథ వినడానికి కుదరకపోయినా కావాలని చంద్రుడ్ని చూస్తున్నాను (నవ్వుతూ). ♦ అంటే.. ఇలాంటి వాటి మీద నమ్మకం లేదా? నమ్మకం లేక కాదు. ఏదో సరదాగా అన్నాను. అయితే నాకు మూఢనమ్మకాలు లేవు. దెయ్యాలున్నాయని పూజల చేయడం వంటి వాటిని నమ్మను. ఒకప్పుడు నేను షూటింగ్ పూర్తి చేసుకుని, ఇంటికి వచ్చిన వెంటనే.. అది రాత్రి పది అవ్వనివ్వండి... అర్ధరాత్రి అవ్వనివ్వండి.. మా అమ్మగారు దిష్టి తీశాకే లోపలికి రానిచ్చేవారు. మొన్న బర్త్‌డేని నా కూతురు స్రవంతి బాగా గ్రాండ్‌గా చేసింది. ఈ వేడుకలో ‘మీర జాలగలడా..’ పాటకు డ్యాన్స్ చేశాను. ఆ వీడియో వైరల్ అయింది. ఎక్కడెక్కడినుంచో ఫోన్లు చేశారు. చాలా చురుకుగా ఉన్నారని చెప్పారు. నేనేమీ దిష్టి తగులుతుందనుకోలేదు. కాంప్లిమెంట్స్‌ని బాగా ఎంజాయ్ చేశాను. ♦ ఇప్పుడు మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది? ప్రతి రోజూ ఉదయం 6 గంటలకు నిద్ర లేస్తాను. బ్రష్ చేసుకుని కాఫీ తాగుతాను. తర్వాత స్నానం చేసి, పూజ చేసుకుంటాను. ఇంతకుముందు అయితే పూజ చేశాకే టిఫిన్ తినేదాన్ని. ఇప్పుడు ఆకలికి ఆగలేకపోతున్నాను. పైగా ఆకలితో పూజ చేస్తే ఏకాగ్రత కుదరదు. దేవుడు కూడా ఆకలితో పూజ చేయమని చెప్పలేదు. అందుకే ఇప్పుడు టిఫిన్ తిన్నాకే పూజ చేస్తున్నా. పేపర్లు చదవడం, టీవీ చూడటం, ఇంటికొచ్చేవాళ్లతో మాట్లాడటం... రోజంతా బాగా గడిచిపోతుంది. ♦ ఆహారం విషయంలో నియమాలేమైనా? నేను ప్యూర్ వెజిటేరియన్. శాకాహారంలో అన్నీ తింటాను. ఒకప్పుడు నెయ్యి బాగా తినేదాన్ని. ఇప్పుడు తగ్గించేశాను. మా అమ్మగారు చిన్నప్పుడు కృష్ణుడి దగ్గర ‘కృష్ణా... రాత్రంతా చల్లగా కాపాడావు. పగలంతా కూడా చల్లగా కాపాడు’ అని పూజించమనేవారు. ఇప్పుడు రోజూ అలానే చేస్తున్నా. ♦ మీ చీరల ఎంపిక బాగుంటుంది.. షాపింగ్ ఎవరు చేస్తారు? స్వయంగా వెళ్లి కొనుక్కోను. చెప్పాలంటే నాకు పెట్టుడు చీరలు ఎక్కువ. పట్టు చీరలు, కాటన్ చీరలు అవీ పెడుతుంటారు. ఎవరు పెట్టినా కట్టుకుంటాను. అది కాటన్ చీర అయినా సరే కట్టుకుని ఓ గంట సేపు ఉంటాను. అప్పుడే ఇచ్చినవాళ్లకు కూడా తృప్తిగా ఉంటుంది. నాకు మొదట్నుంచీ నైలాన్ చీరలు పెద్దగా నచ్చవు. అవి జారిపోతూ అసౌకర్యంగా ఉంటాయి. అందుకే పట్టు చీరలకు లేదా మంచి కాటన్ చీరలకు ప్రాధాన్యం ఇస్తాను. ♦ మీకు కుడుములు చేయడం వచ్చా? అస్సలు రాదు. మా అమ్మగారు చేసేవారు. ఇప్పుడు ఎవరో ఒకరు చేసి పెడతారు. పండగ రోజంతా కుడుములు తింటూ ఉంటాను. ముఖ్యంగా కొబ్బరి లౌజు పెట్టి కుడుములు చేస్తారు కదా.. అవి చాలా ఇష్టం. వినాయకుడి పేరు చెప్పి ఫుల్లుగా తింటాను (నవ్వులు). ♦ వినాయక వ్రత కల్పములో నిజమేంటో తెలుసుకుని సత్రాజిత్తు తన కుమార్తె సత్యభామను శ్రీకృష్ణుడికిచ్చి పెళ్లి చేయడం అనేది ముఖ్యమైన అంశం. 1957లో విడుదలైన ‘వినాయక చవితి’ సినిమాలో మీరు సత్యభామగా చేశారు. ఆ సినిమాని గుర్తు చేసుకుంటారా? ఆ సినిమాకి సముద్రాల రాఘవచార్యగారు దర్శకులు. గొప్ప దర్శకుడాయన. అందులో పాటలన్నీ బాగుంటాయి. బోలెడన్ని శ్లోకాలు, పద్యాలు, పాటలు ఉంటాయి. నేను ఫస్ట్ సత్యభామగా చేసింది ఆ సినిమాలోనే. ఆ తర్వాత ‘శ్రీకృష్ణ తులాభారం’లో సత్యభామ పాత్ర చేశాను. ‘శ్రీకృష్ణ విజయం’లోనూ ఆ పాత్ర చేశాను. మొత్తం మూడుసార్లు సత్యభామగా కనిపించాను. ♦ సత్యభామ పాత్ర అంటే మీరే చేయాలనేంతగా పేరు తెచ్చుకున్నారు. దాని గురించి? ‘వినాయక చవితి’ సినిమాలో అమాయకత్వం నిండిన సత్యభామగా చేశాను. నాకు పెళ్లి అవ్వక ముందు చేసిన సినిమా అది. ఆ తర్వాత పెళ్లయిన కొత్తలో ‘శ్రీకృష్ణ తులాభారం’లో సత్యభామగా చేసే అవకాశం వచ్చింది. ‘పెళ్లయింది కదా. లావయ్యుంటుంది. ఏం బాగుంటుంది’ అని కొంతమంది అన్నారు. ‘ఏం పెళ్లయితే లావైపోతామా?’ అనుకున్నాను. చెప్పాలంటే పెళ్లి తర్వాత ఇంకా పరిణతి వచ్చి, నా అందం రెట్టింపు అయింది. అప్పుడు సత్యభామగా నన్ను చూసి, అందరూ భేష్ అన్నారు. మూడోసారి ‘శ్రీకృష్ణ విజయం’లో ఆ పాత్ర చేసినప్పుడు బిడ్డల తల్లిని. అయినా నా అందం, ఆహార్యం చెక్కు చెదరలేదు. అలా సత్యభామగా నేనే కరెక్ట్ అనే పేరు తెచ్చుకోగలిగాను. కుమార్తె స్రవంతి, మనవడు అవిష్తో... ♦ కృష్ణుడి పత్నిగా సినిమాల్లో నటించారు. నిజజీవితంలో మీరు కృష్ణుడి భక్తురాలేనా? ఏ దైవాన్ని ఎక్కువగా పూజిస్తారు? నా చిన్నప్పుడు మా ఇంట్లో ఓ కృష్ణుడి ఫొటో ఉండేది. చేత్తో రామచిలక, నెమలి íపింఛం పట్టుకుని చక్కగా నవ్వుతూ కనిపించే ఫొటో అది. నాకా ఫోటో అంటే ఇష్టం. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం మా అమ్మగారు పూజలు చేసేవారు. నేను మాత్రం స్కూల్‌కి వెళ్లే ముందో, సాయంత్రం వచ్చాకో అగరబత్తీలు వెలిగించి, కృష్ణుడి పటానికి గుచ్చేదాన్ని. ఆ అద్దం అంతా నల్లగా అయిపోయిందనుకోండి (నవ్వుతూ). ‘కృష్ణా.. నన్ను పెద్ద ఫిలిం స్టార్‌ని చెయ్యి’ అని కోరుకునేదాన్ని. నా కోరికను మన్నించాడు. ♦ మరి.. హీరోయిన్ అయ్యాక కృష్ణుడ్ని ఏం కోరుకున్నారు? నేను నా జీవితాంతం ఆ కృష్ణ భగవానుడిని ఏదో ఒకటి అడుగుతూనే ఉన్నాను. హీరోయిన్ అయ్యాక ‘గౌరవమర్యాదలతో ఉండేలా చెయ్యి కృష్ణా. నా ప్రతిష్టకు ఏ భంగం రాకూడదు’ అని కోరుకున్నాను. అలాగే నిందలు వచ్చినప్పుడు ‘కృష్ణా.. ఇవన్నీ తట్టుకుని స్వాభిమానంతో నిలబడే శక్తిని ఇవ్వు’ అని దండం పెట్టుకున్నా. అలానే దీవించాడు. ♦ ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు? ‘కృష్ణా.. ఇంత అద్భుతమైన జీవితం ఇచ్చావు. మంచి అమ్మానాన్న, దేవుడిలాంటి భర్త, వరాల్లాంటి ఇద్దరు (కుమార్తె స్రవంతి, కుమారుడు వంశీకృష్ణ) పిల్లలను ఇచ్చావు. మళ్లీ జన్మ అంటూ ఉంటే.. ఇలాగే గౌరవంగా, హుందాగా బతికే వరం ఇవ్వు. లేకపోతే నీలో ఐక్యం చేసుకో’ అని కోరుకుంటున్నాను. ఇప్పటివరకూ కృష్ణుడు నేను ఏం కోరుకుంటే అది ఇచ్చాడు. మళ్లీ జన్మంటూ ఉంటే ఈ జన్మలో బతికినంత హుందాగా బతికిస్తాడని నమ్ముతున్నాను. ఒకప్పుడు శక్తి కోసం కోరుకున్నాను. ఇప్పుడు ముక్తి కోసం ప్రార్థిస్తున్నాను.– డి.జి. భవాని -
30 ఏళ్ల తర్వాత నటిస్తున్నా
నందమూరి తారకరత్న హీరోగా నటిస్తున్న చిత్రం ‘దేవినేని’. ‘బెజవాడ సింహం’ అన్నది ఉపశీర్షిక. దేవినేని నెహ్రూ బయోపిక్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తారకరత్న టైటిల్ రోల్ పోషిస్తున్నారు. నర్రా శివ నాగేశ్వరరావు (శివనాగు) దర్శకత్వంలో ఆర్.టి.ఆర్ ఫిలింస్ పతాకంపై రాము రాథోడ్ నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. సీనియర్ నటి జమున కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత సి.కళ్యాణ్ క్లాప్ ఇచ్చారు. సీనియర్ పాత్రికేయులు వినాయకరావు ఫస్ట్ షాట్‌కి దర్శకత్వం వహించారు. జమున మాట్లాడుతూ– ‘‘నేను సినిమారంగం నుంచి తప్పుకుని 30 ఏళ్లు అయింది. రిటైర్ అయిన నన్ను మళ్లీ కెమెరా ముందు నిలబెట్టి సినిమా రంగులు వేసి నటించేలా చేశారు శివనాగు. ఇది కాకుండా అన్నపూర్ణమ్మగారి సినిమాలో నేను ఒక రాణి పాత్ర చేస్తున్నాను’’ అన్నారు. శివనాగు మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా చేయాలనుకునే ముందు విజయవాడ మొత్తం తిరిగి వివరాలు తెలుసుకున్నాను. 1977లోని కథ ఇది. మే 10 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. సింగిల్ షెడ్యూల్లో చిత్రీకరణ పూర్తి చేసి, దసరాకి సినిమా విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ‘‘మా ఫ్యామిలీకి ఎంతో సన్నిహితులైన వ్యక్తి, పెదనాన్నలాంటివారు నెహ్రూగారు. ఆయన పాత్ర పోషించడం చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు తారకరత్న. ‘‘దేవినేని చిత్రాన్ని నిర్మిస్తుండటం నా అదృష్టం’’ అన్నారు రాము రాథోడ్. -
జమునకు జీవితసాఫల్య పురస్కారం
డల్లాస్, టెక్సాస్: పద్మవిభూషణ్, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, నట సామ్రాట్, డా. అక్కినేని నాగేశ్వర రావు 95వ జయంతి (సెప్టెంబర్ 20) సందర్భంగా డల్లాస్‌లో అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా(ఏఎఫ్ఏ) బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశం లో ఏఎఫ్ఏ ప్రస్తుత అధ్యక్షులు రావు కల్వల మాట్లాడుతూ..1992, 2012 లో అక్కినేని నాగేశ్వరరావును డల్లాస్‌కు ఆహ్వానించి తీసుకువచ్చిన డా. ప్రసాద్ తోటకూర నాయకత్వంలోనే 2014 లో ఏఎఫ్ఏ సంస్థను ఏర్పాటు చేశామని తెలియజేశారు. అప్పటినుండి ఇప్పటికివరకు నాలుగు అక్కినేని అంతర్జాతీయ పురస్కార ప్రదానోత్సవాలు జరుపుకున్నామని, ఈ సంవత్సరం డిసెంబర్ 22న సాయంత్రం 4 నుండి 7:30 గంటల వరకు కరీంనగర్ లో ప్రతిమా మల్టీప్లెక్స్ లో ఐదవ అక్కినేని అంతర్జాతీయ పురస్కార ప్రదానోత్సవాన్ని జరుపుతున్నట్లు ప్రకటించి అందరూ హాజరు కావలసిందిగా ఆహ్వానం పలికారు. వ్యవస్థాపక అధ్యక్షుడు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ డా. అక్కినేనిని ఒక ప్రముఖ సినిమా నటుడిగా మాత్రమే గాక, గొప్ప వ్యక్తిత్వం కలిగిన మనిషిగా గుర్తించి, ఆయన అంతిమ శ్వాస వరకు అత్యంత సన్నిహితంగా గడిపిన కొంతమంది మిత్రులం కలిసి అమెరికాలో “అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా” అనే సంస్థను ఏర్పాటుజేశామని తెలిపారు. డా. అక్కినేని కృష్ణా జిల్లాలో, ఒక కుగ్రామంలో, అతిసాధారణ కుటుంబంలో జన్మించినా కేవలం కృషి, పట్టుదల, ఆత్మ స్తైర్యం, దూరదృష్టి లాంటి లక్షణాలతో అద్భుత విజయాలు సాధించడం అనన్య సామాన్యమని, ఈ లక్షణాలు అందరికి ఆదర్శనీయం కావాలనే ఉద్దేశ్యంతోనే ప్రతి సంవత్సరం తెలుగుగడ్డ పై అక్కినేని అంతర్జాతీయ పురస్కార ప్రదానోత్సవాలను జరుపుతున్నామని పేర్కొన్నారు. ఏఎఫ్ఏ సంస్థకు డా. ప్రసాద్ తోటకూర (వ్యవస్థాపక అధ్యక్షులు) , రావు కల్వల (అధ్యక్షులు), శారద అకునూరి (ఉపాధ్యక్షులు), చలపతి రావు కొండ్రకుంట ( కార్యదర్శి), ధామా భక్తవత్సలు (కోశాధికారి), డా. సి.ఆర్. రావు, రవి కొండబోలు, డా. శ్రీనివాసరెడ్డి ఆళ్ల, మురళి వెన్నం బోర్డు అఫ్ డైరెక్టర్స్ గా వ్యవహరిస్తున్నారు. అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా 2018 పురస్కార గ్రహీతలు : జీవిత సాఫల్య పురస్కారం : అనేక సాంఘిక, పౌరాణిక చిత్రాలలో అద్వితీయమైన పాత్రలను పోషించి అందరి అభిమానాన్ని చూరగొన్న కథానాయకి, పూర్వ లోకసభ సభ్యురాలు, ‘కళాభారతి’ జమున. విద్యా రత్న: ఉస్మానియా విశ్వవిద్యాలయ పూర్వ ఆచార్యులు, పూర్వ శాసనమండలి సభ్యులు, ప్రస్తుత రాజకీయాలపై తన నిష్పక్షపాత వైఖరితో కూడిన రాజకీయ విశ్లేషణ చేస్తున్న ప్రొఫెసర్ కె. నాగేశ్వర్. సినీ రత్న: సినీ రంగంలో అద్భుతమైన గీతాలు రాస్తూ గీత రచయితగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని జాతీయ స్థాయిలో ఉత్తమ గేయ రచయిత గా పురస్కారం అందుకున్న డా. సుద్దాల అశోక్ తేజ. విశిష్ట వ్యాపార రత్న: పారిశ్రామిక రంగంలో ముఖ్యంగా పవర్ రంగంలో ‘పవర్ మెక్’ కంపెనీ ద్వార అద్భుత విజయాలు సాధించి, తన ప్రగతిని కేవలం లాభాల్లోనే లేక్కవేసుకోకుండా సామాజిక స్పృహతో విద్యా, వైద్య రంగాల్లో తనవంతు సహాయం చేస్తున్న పారిశ్రామికవేత్త సజ్జా కిషోర్ బాబు. రంగస్థల రత్న : ఆదిభట్ల నారాయణదాసు శిష్య పరంపరలో హరికథల్లో శిక్షణ తీసుకుని ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఎస్.వి. సంగీత, నృత్య కళాశాలలో హరికథా విభాగంలో అధ్యాపకునిగా పనిచేస్తూ, హరికథా రంగంలో అగ్రగణ్యులైన డా. ముప్పవరపు సింహాచల శాస్త్రి. వైద్య రత్న : కరీంనగర్ లోని ‘ప్రతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (పిమ్స్)’ ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆసరాగా అత్యుత్తమ వైద్య సేవలందిస్తున్న బి. శ్రీనివాసరావు. సేవా రత్న: ‘వృక్షో రక్షతి రక్షతః’ అనే నినాదంతో తన జీవితాన్ని చెట్ల పెంపకానికి అంకితం చేసి లక్షలాది మొక్కలను నాటుతున్న వనజీవి పద్మశ్రీ ‘దారిపెల్లి జానకి రామయ్య’. వినూత్న రత్న: తన అద్భుతమైన కళాదృష్టితో వ్యర్ధ పదార్దాల నుండి కూడా అద్భుతమైన కళాఖండాలను తయారుజేసి తన ఇంటినే మ్యుజియం గా మార్చిన చిత్రకారిణి డా. కమలా ప్రసాద రావు -
గోల్డెన్ బయోపిక్స్ ఇవి వస్తే బాగుండు!
భారతీయ సినిమాకు ఆద్యుడైన ‘దాదాసాహెబ్ ఫాల్కే’ 1913లో మొదటి ఫీచర్ ఫిల్మ్‌గా ‘రాజా హరిశ్చంద్ర’ను తెరకెక్కించాడు. హరిశ్చంద్రుడు నిజ జీవితంలో ఎన్ని కష్టాలు పడ్డాడో ఈ సినిమా తీయడానికి దాదా సాహెబ్ ఫాల్కే కూడా అన్ని కష్టాలు పడ్డాడు. ఆయన ‘రాజా హరిశ్చంద్ర’ను తీయడం వెనుక పడిన కష్టాన్ని, తపనని, జీవితాన్ని ఆధారం చేసుకొని మరాఠీలో ‘హరిశ్చంద్రచి ఫ్యాక్టరీ’ అనే సినిమా తీశారు 2010లో. మనకు సినిమా ఇచ్చిన మహనీయునికి సినిమా ద్వారా ప్రకటించగలిగిన నివాళి అది. కాని తెలుగులో అలాంటి నివాళి మరో ఎనిమిదేళ్లు గడిస్తే తప్ప రాలేదు. సావిత్రి పై తెరకెక్కించిన ‘మహానటి’ తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి తొలి బయోపిక్. అయితే సావిత్రి గురించి మాత్రమే బయోపిక్ తీస్తే సరిపోతుందా? నిజానికి మన ఇండస్ట్రీ ఎందరి బయోపిక్లకో బాకీ పడి ఉంది. అవన్నీ నిజరూపు దాలిస్తే తెలుగు ప్రేక్షకులకు మించి ఆనందపడేవారు మరొకరు ఉండరు. బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తున్న నేపథ్యంలో అసలు ఎందరి బయోపిక్‌లు ఇంకా తీయవలసి ఉందో ఒకసారి చూద్దాం. వీళ్ల జీవితం వెండితెర మీద ఎందుకు ఆసక్తికరమో కూడా పరిశీలిద్దాం. చిత్తూరు నాగయ్య ఒకరి జీవితం ఎప్పుడు ఆసక్తిగా ఉంటుందంటే ఆ జీవితంలో నాటకీయ పరిణామాలున్నప్పుడు. చిత్తూరు నాగయ్య తెలుగువారికి సంబంధించి చాలా పెద్ద సింగింగ్ స్టార్. ఇంకా చెప్పాలంటే సింగింగ్ స్టార్ల తరానికి ఆయన ఆఖరు ప్రతినిధి. ఆయన చూసిన స్టార్డమ్ అంతకు ముందు ఎవరూ చూడలేదు. సంగీత దర్శకుడిగా, గాయకుడిగా ఆయన అద్భుతమైన గీతాలను, సంగీతాన్ని తెలుగువారికి ఇచ్చారు. ఇక ఆయన దానధర్మాల గురించి చాలా కథలే ఉన్నాయి. అంత ఐశ్వర్యం చూసి ఆ తర్వాత దెబ్బ తినడం, కార్లు బంగళాలు పోగొట్టుకోవడం, తన తర్వాత వచ్చిన వారు స్టార్డమ్కు చేరుకున్నా కేరెక్టర్ ఆర్టిస్టుగా ఎంతో హుందాతనంతో గొప్ప గొప్ప పాత్రల్లో నటించడం ఇవన్నీ ఒక మంచి బయోపిక్కు విలువైన సరంజామా అవుతుంది. నాగయ్య బయోపిక్ వల్ల తొలినాటి తెలుగు సినిమా చరిత్ర కూడా చెప్పినట్టవుతుంది. కె.వి.రెడ్డి తెలుగు దర్శకులలో ఎవరి గురించైనా మొదటి బయోపిక్ తీయదలిస్తే కె.వి.రెడ్డే అందరి ఎంపిక అవుతారనేది వాస్తవం. జనాకర్షక సినిమా ఫార్ములాను కనిపెట్టి సూపర్‌డూపర్ హిట్స్ తీసిన కె.వి.రెడ్డి ఎన్.టి.ఆర్ కెరీర్‌ని ‘పాతాళభైరవి’, ‘మాయాబజార్’ చిత్రాలతో మలుపు తిప్పారు. రాయలసీమ నుంచి వచ్చి మద్రాసులో స్థిరపడి నాగిరెడ్డి, చక్రపాణి వంటి ఉద్దండులతో కలిసి పని చేస్తూ భావితరాలకు ఆదర్శప్రాయంగా నిలిచిన కె.వి.రెడ్డి బయోపిక్ చాలా విలువైనది అవుతుంది. అసలు ఆయన ‘మాయాబజార్’ ఎలా తీసి ఉంటాడు అన్న ఒక్క అంశాన్ని తీసుకొని కూడా ఒక బయోపిక్ తీస్తే ఎంతో బాగుంటుందని అభిమానులు అనుకుంటే అందులో కాదనేమాట ఏమైనా ఉంటుందా? అదే జరిగితే పింగళి నాగేంద్రరావు, మార్కస్బాట్లే, ఆర్ట్ డైరెక్టర్ గోఖలే... వీళ్లను కూడా తెర మీద చూడొచ్చు. అక్కినేని నాగేశ్వరరావు ఎన్.టి.ఆర్ బయోపిక్ తయారవు తున్న సందర్భంగా నాగార్జునను అక్కినేని బయోపిక్ గురించి ప్రశ్నించినప్పుడు ‘అంత డ్రమెటిక్ సంఘటనలు ఏమున్నాయని నాన్నగారి జీవితంలో బయోపిక్ తీయడానికి’ అన్నారు. నిజానికి అక్కినేని జీవితంలో ఉన్న డ్రమెటిక్ సంఘటనలు మరొకరి జీవితంలో లేవు. ఆయనకు చదువు లేదు. నాటకాలలో స్త్రీ పాత్రలు పోషించి పోషించి బాడీ లాంగ్వేజ్ ప్రభావితం అయి ఉంది. మద్రాసు చేరుకున్నాక ముందు జానపద హీరోగా మారి ఆ తర్వాత సోషల్ హీరోగా స్థిరపడడానికి చాలా స్ట్రగుల్ చేయాల్సి వచ్చింది. గొంతు విషయంలో, పర్సనాలిటీ విషయంలో ఉన్న పరిమితులను జయించడానికి మరెంతో స్ట్రగుల్ చేశాడాయన. మరోవైపు గొప్ప కంఠం, పర్సనాలిటీ ఉన్న ఎన్.టి.ఆర్తో సరిసాటిగా నిలవడానికి, ఆత్మవిశ్వాసంతో పోరాడటానికి ఆయన చేసిన కఠోర శ్రమ ఎంతో స్ఫూర్తిదాయకమైనది. హైదరాబాద్‌కు వలస రావడం, స్టూ్టడియో కట్టడం, కెరీర్ పీక్‌లో ఉండగా మసూచి రావడం, గుండె ఆపరేషన్ వల్ల కెరీర్‌కే దూరమవ్వాల్సిన పరిస్థితులు ఏర్పడటం, వీటన్నింటిని జయించి పెద్ద హీరోగా కొనసాగగలగడం... ఇవన్నీ బయోపిక్ తీయడానికి ఎంతో సరిపోతాయి. జమున దక్షిణాది వారికి యమున తెలుసు. కానీ ఉత్తరాది పేరు జమునతో పాపులర్ అయిన అచ్చ తెలుగు స్టార్ జమున. తెలుగువారి తొలి లాంగ్ స్టాండింగ్ గ్లామర్స్టార్గా ఈమెను చెప్పుకోవచ్చు. భానుమతి, సావిత్రి, బి.సరోజ, రాజశ్రీ వంటి బొద్దు హీరోయిన్ల నడుమ సన్నగా, లావణ్యంగా ఉంటూ గ్లామర్‌ను మెయిన్‌టెయిన్ చేశారామె. పురాణాల్లో సత్యభామ కన్నా సినిమాల్లోని ఈ సత్యభామే తెలుగువారికి ఎంతో ప్రియం అంటే జమున ఆ పాత్రను ఎంత గొప్పగా పోషించారో తెలుస్తుంది. సత్యభామ తీరుకు తగినట్టుగానే జమునలో కూడా ఆత్మాభిమానం, ఆత్మగౌరవం మెండు. కొన్ని స్పర్థల వల్ల ఏ.ఎన్.ఆర్, ఎన్.టి.ఆర్ వంటి సూపర్స్టార్లు తమ సినిమాల నుంచి ఆమెను దూరంగా పెట్టినప్పుడు చెదరకుండా, కంగారుపడి రాజీ కుదుర్చుకోకుండా స్థిరంగా నిలబడి పోరాడిన వనిత ఆమె. ఆ సమయంలో హిందీలో కూడా నటించి అక్కడా పేరు గడించారు. హరనాథ్‌ను తెలుగువారి ఆల్టర్నేట్ స్టార్‌గా ఎస్టాబ్లిష్ చేయడంలో జమున పాత్ర ఎంతో ఉంది. రాజకీయాలలో కూడా సక్సెస్ అయిన జమున జీవితం ఒక మంచి బయోపిక్. రాజబాబు చార్లిచాప్లిన్ కథకు రాజబాబు కథకు అట్టే తేడా లేదు. ఒక కమెడియన్‌గా రాజబాబు సాధించినంత క్రేజ్ ఎవరూ సాధించలేదు. రాజబాబు పోస్టర్ మీద ఉంటే ఆ సినిమాలు ఆడేవి. రాజబాబు సినిమాలో ఉంటే డిస్ట్రిబ్యూషన్ చాలా సులువైపోయేది. మద్రాసులో అవకాశాలు రాక ముందు రాజబాబు ట్యూషన్లు చెప్పారు. పస్తులు పడుకున్నారు. తాను గొప్ప స్టార్ అయ్యాక ఖరీదైన కారు కొన్నాక ఏ పేవ్మెంట్ మీద పడుకున్నారో ఆ పేవ్మెంట్ దగ్గరకు వెళ్లి నిలుచునేవాడాయన. పేదల అవస్థలు అనుభవించినవాడు కనుక పేదలకు విపరీతమైన దాన ధర్మాలు చేసేవాడు. ఆయన ఉంటే తమను చూడరు అని పెద్ద పెద్ద హీరోలు కూడా తమ సినిమాల్లో రాజబాబును పెట్టుకోవడానికి జంకేవారు. రాజబాబు కమెడియన్‌గా ఎంత దుడుకు హాస్యం చేసినా నిజ జీవితంలో తాత్వికుడు. హాస్యనటుడైన కిశోర్ కుమార్ గంభీరమైన సినిమాలు తీసినట్టే తెలుగులో రాజబాబు ‘మనిషి రోడ్డున పడ్డాడు’ వంటి గంభీరమైన సినిమాలు తీశారు. మద్యపానం ఆయనను 48 ఏళ్ల వయసుకే మృత్యువును చేరువ చేసింది. రాజబాబు బయోపిక్ తీయడం అంటే పరోక్షంగా రమాప్రభ బయోపిక్ తీయడమే. ఒక గొప్ప హాస్యజంటను వెండితెర మీద నిక్షిప్తం చేయవచ్చు ఈ సినిమా తీస్తే. సూర్యకాంతం ఒక గయ్యాళి ప్రేక్షకులకు ఇంత అభిమానమైన వ్యక్తిగా మారగలదా? ఒక గయ్యాళి పేరును భావి తరాలలో ఎవరికీ పెట్టలేని స్థాయిలో ఆమె ముద్ర వేయగలిగిందా? ఒక నటి పేరే ఒక స్వభావం పేరుగా మారడం వెనుక ఆ నటి చేసిన ప్రయాణం ఏమిటి? సూర్యకాంతం కథ చెప్పుకోవడం అంటే తెలుగు సినిమాలో స్త్రీ సహాయక పాత్రల చరిత్ర చెప్పుకోవడమే. నాటి సినిమాలలోనే కాదు నేటి సీరియల్స్‌లో కూడా కథ నడవడానికి సూర్యకాంతం పాత్రే కీలకం అని గ్రహిస్తే ఆమె ఎన్ని సినిమాలను ప్రభావితం చేసి ఉంటుందో ఊహించవచ్చు. తెర జీవితానికి నిజ జీవితానికి పోలిక లేని ఈ నటి బయోపిక్ ఎంతో ఆసక్తికరంగా ఉంటుందని చెప్పడంలో సంశయం లేదు. సూర్యకాంతం బయోపిక్ తీయడం అంటే రేలంగి, రమణారెడ్డి, అల్లు రామలింగయ్య, పద్మనాభంల బయోపిక్‌ను పరోక్షంగా తీయడమే. ఈమె సినిమా తీయడం కష్టం కాకపోవచ్చు. కానీ ఈమె పాత్రను పోషించే నటిని వెతికి తేవడం మాత్రం కష్టం. ఎందుకంటే సూర్యకాంతం లాంటి సూర్యకాంతం మళ్లీ పుట్టలేదు కనుక. ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బాలూ బయోపిక్ అంటే తెలుగు సినిమా సంగీత ప్రయాణాన్ని వెండితెర మీద చూడటమే. ఘంటసాల వంటి లెజండ్ మార్కెట్లో ఉన్నప్పుడు గాయకుడిగా నిలదొక్కుకోవడానికి బాలూ ఎంతో ఆత్మవిశ్వాసంతో, కఠోర శ్రమతో ప్రయత్నించారు. సంగీత దర్శకుడు ఎస్.పి.కోదండపాణి ఆయనను దగ్గరకు తీయడం, వారిద్దరి మధ్య అనుబంధం ఈ బయోపిక్‌లో ఒక ఎమోషనల్ పార్ట్ అవుతుంది. బాలూ పెళ్లి నాటకీయ పరిణామాల మధ్య జరిగింది. అదీ ఆసక్తికరమైన మలుపు అవుతుంది కథలో. సూపర్ స్టార్ కృష్ణతో స్పర్థ ఒక ముఖ్య ఘట్టం. రామకృష్ణ విజృంభిస్తున్న రోజుల్లో ఏ.ఎన్.ఆర్కు పాడటానికి ఆయన ధోరణిని అనుకరించి హిట్ కొట్టడం, నెమ్మదిగా తమిళ, కన్నడ, హిందీ భాషల్లోకి ఆయన ప్రతిభ పరివ్యాప్తం కావడం ఎన్ని గంటల సినిమాకైనా ముడిసరుకే. బాలూ బయోపిక్‌లో తప్పనిసరిగా కనిపించే ఇతర పాత్రలు పి.సుశీల, ఎస్.జానకి, సంగీత దర్శకుడు చక్రవర్తి. బాలూ క్లోజ్‌ఫ్రెండ్, ఆయనకు సుదీర్ఘంగా సెక్రటరీగా పనిచేసిన విఠల్ కూడా ఒక ముఖ్య పాత్రధారి. బాలూకు అన్ని భాషల్లో అభిమానులు ఉన్నారు. కనుక ఆయన సినిమా అన్ని భాషలలో హిట్టయ్యే అవకాశం ఉంటుంది. వీరు మాత్రమే కాదు... ఎస్.వి.రంగారావు, ఘంటసాల, కత్తి వీరుడు కాంతారావు, బాపు–రమణ, సాలూరు రాజేశ్వరరావు, వాణిశ్రీ, హరనాథ్, దాసరి నారాయణరావు... వీరందరి బయోపిక్‌లు తీయదగ్గవే. కానీ బయోపిక్‌లు తీయడం కత్తిమీద సాము. గతంలో మణిరత్నం వంటి దర్శకులు కూడా ఎం.జి.ఆర్, కరుణానిధిలపై తీసిన బయోపిక్ ‘ఇద్దరు’ ప్రతికూల ఫలితాన్ని ఇచ్చింది. హిందీలో అజారుద్దీన్ పై తీసిన బయోపిక్ సఫలం కాలేదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏవో కాంట్రవర్సీలు, ఎత్తి చూపదగ్గ అంశాలు ఉంటాయి. వాటిని కూడా ఒప్పించి బయోపిక్‌లు తీయగలిగితే కథలు లేని ఈ కాలాన వీటికి మించిన కథలు ఉండవు. -
హాస్యానికి చిరునామా బ్రహ్మానందం
నాంపల్లి : శ్రీ ప్రఖ్య ఆర్ట్స్ (సంగీత సుధా వేదిక), అభినయ కూచిపూడి కళాక్షేత్రం సంస్థ 18వ వార్షికోత్సవాలను బుధవారం రవీంద్ర భారతి ప్రధాన వేదికపై నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ ప్రఖ్య ఆర్ట్స్ లలిత కళా పురస్కారాన్ని ప్రఖ్యాత హాస్యనటుడు డాక్టర్ బ్రహ్మానందంకు అందజేశారు. ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు డాక్టర్ నందమూరి లక్ష్మీపార్వతి అధ్యక్షతన జరిగిన సభకు ముఖ్య అతిథిగా నటి జమున హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ బ్రహ్మానందాన్ని పురస్కారంతో సత్కరించి ప్రసంగిం చారు. బ్రహ్మానందం హాస్యం.. బ్రహ్మాండంగా ఉంటుందని కొనియాడారు. కార్యక్రమంలో సినీ పరిశోధకులు, సంగమం సంస్థ వ్యవస్థాపకులు సంజయ్ కిషోర్, ప్రఖ్య ఆర్ట్స్ కార్యదర్శి జయశ్రీ పాల్గొన్నారు. సభా ప్రారంభంలో జయశ్రీ శిష్య బృందం నిర్వహించిన స్వర మాధురి అలరించింది. -
భగీరథ విలక్షణమైన రచయిత
‘‘జర్నలిస్ట్ భగీరథలో ఓ విలక్షణమైన రచయిత ఉన్నాడు. ఆయన రచించిన ‘భగీరథ పథం’ చదివితే ఆ విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన ఎంత మంచి జర్నలిస్టో, అంతకు మించిన రచయిత కూడా. ఆయన నుంచి మరిన్ని పుస్తకాలు రావాలని కోరుకుంటున్నా’’ అని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపా నందేంద్ర సరస్వతి మహాస్వామి అన్నారు. సీనియర్ జర్నలిస్ట్ భగీరథ రచించిన ‘భగీరథ పథం’ పుస్తకాన్ని హైదరాబాద్‌లో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీనియర్ నటి జమున మాట్లాడుతూ –‘‘నా జీవితాన్ని ‘జమునాతీరం’ పేరుతో భగీరథ రచించారు. ఆ పుస్తకం నాకెంతో పేరు తెచ్చిపెట్టింది. ‘భగీరథ పథం’ పుస్తకంలో చాలా విషయాలను నిష్పక్ష పాతం గా రాశారు. ఎన్టీ రామారావు జాతీయ అవార్డు నాకు రావడానికి భగీరథే కారణం’’ అన్నారు. ‘‘స్వరూపా నందేంద్ర స్వామివారి చేతుల మీదుగా నా ‘భగీరథ పథం’ పుస్తకావిష్కరణ జరగడం చాలా ఆనందంగా ఉంది. ఇదే స్ఫూర్తితో మరిన్ని రచనలు చేస్తా’’ అన్నారు భగీరథ. నిర్మాత రమేష్ ప్రసాద్, దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత కె. అచ్చిరెడ్డి, రచయిత సాయినాథ్, రచయిత్రి పల్లవి, సీనియర్ జర్నలిస్ట్, శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం కార్యదర్శి టి. ఉదయవర్లు పాల్గొన్నారు. -
‘టిఫినీ’లు చేశారా?
సాక్షి, బంజారాహిల్స్ : పిజ్జా దోశ.. చాక్లెట్ దోశ.. డ్రై ఫ్రూట్ దోశ.. వీటిని రుచి చూడాలనిపిస్తోందా..? జూబ్లీహిల్స్ రోడ్ నెం.36లో గురువారం ప్రారంభమైన టిఫినీ రెస్టారెంట్లో వెజ్, నాన్‌వెజ్‌లతో వివిధ రకాల టిఫిన్లు అల్పాహార ప్రియులను ఆకట్టుకునేందుకు రెడీగా ఉన్నాయి. ఇక్కడ ఏర్పాటు చేసిన టిఫినీ రెస్టారెంట్‌ను మాజీ గవర్నర్ రోశయ్య, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, సినీ గేయ రచయిత అనంత శ్రీరాం, కేవీ రమణాచారి, చక్రపాణి, డాక్టర్ బీవీ పట్టాభిరామ్‌తో పాటు అలనాటి నటి జమున ప్రారంభించారు. ఇక్కడి టిఫిన్లను రుచి చూశారు. 80 మంది ఒకేసారి కూర్చునే విధంగా ఇక్కడ రెస్టారెంట్‌ను సంప్రదాయ రీతిలో రూపొందించినట్లు నిర్వాహకులు వెంకట్రామ్, నవీన్ వెల్లడించారు. ఇక్కడ కీమ దోశ, బొమ్మిడాల పులుసు, రొయ్యల ఇగురు, నాటుకోడి కర్రీ కూడా ప్రత్యేకంగా ఆకట్టుకోనున్నాయని వారు తెలిపారు. -
రంగస్త్రీలం
పాత్రలోకి వచ్చాక తమను తాము మర్చిపోయినవారే నటులుపాత్రలో పాత్ర కనపడుతుందిపాత్ర వెనక జీవితంలో ఉన్న కష్టం కప్పి పుచ్చుతుందిఆడుతున్న గుండె మీద బంగారపు పూత పూసినట్టు గుండె పగిలిపోతున్నా ధగధగమని మెరవవలసిందేపూత అన్నం పెట్టింది... పాత్ర కీర్తినిచ్చిందికానీ గర్భం ఇంకా దుఃఖస్మృతులతో కన్నీరు పెడుతూనే ఉందిపాత్రను చూసి చప్పట్లు కొట్టేవాళ్లు ప్రేక్షకులైతే జమునారాయల జీవితం చూసి చప్పట్లు కొట్టేవాళ్లం మన మందరం. ఆమె తాను పుట్టిన 21వ రోజునే ఊయలలో కృష్ణుడి వేషంతో రంగస్థల ప్రవేశం చేశారు.ఎనిమిది సంవత్సరాల వయసుకే ఇంటికి ఆధారం అయ్యారు.వయసు వచ్చాక, అందమైన అమ్మాయి ఎదుర్కొనే సమస్యలన్నీ ఎదుర్కొన్నారు.తెర ముందు నారదుడి వేషం వేస్తూనే తెర వెనుక పసిబిడ్డకు పాలిచ్చారు.నాటకాలు వేస్తూనే తల్లి అయ్యారు... ఇద్దరు పిల్లలను పోగొట్టుకున్నారు.పురుషాధిక్యంతో ఎంతో నష్టపోయారు. అయినా దీక్ష విడిచిపెట్టలేదు.ఆమె సురభి జమునా రాయలుహైదరాబాద్లో ఇటీవల శ్రీకృష్ణుడు, సత్యభామ అర్ధనారీశ్వర వేషం వేసిన సందర్భంగా సాక్షితో పంచుకున్న అనుభవాలు ఆమె మాటలలోనే.‘‘సురభిలో కుటుంబంలో పుట్టిన ప్రతివారు అన్ని రకాల పాత్రలు పోషిస్తారు. కృష్ణుడిని తట్టలో పెట్టుకుని వసుదేవుడు గోకులానికి బయలుదేరిన సీన్లో నేను బాలకృష్ణుడిగా రంగ ప్రవేశం చేశాను. అప్పుడు నా వయసు 21 రోజులు. ఆ తరవాత చాలా బాల వేషాలు వేశాను. నాన్నగారి దగ్గర హరికథలు నేర్చుకున్నాను. పద్నాలుగు సంవత్సరాలకే వివాహం కావడంతో ‘గజపతి నాట్య కళా సమితి’ కుటుంబంలో ఐదవ కోడలిగా అడుగు పెట్టాను. ఇరవై రెండు సంవత్సరాలు వచ్చేసరికి ఐదుగురు పిల్లలు పుట్టుకొచ్చారు. కాని మిగిలింది ఇద్దరు మాత్రమే’’. దవడ వాచిపోయింది... ‘‘ఒకసారి నారద పాత్ర పోషిస్తున్న సమయంలో, పసిపిల్లకు పాలివ్వడం కోసం లోపలకు, బయటకు తిరిగాను. ఆ హడావుడిలో ఒక చిడత ఎక్కడో వదిలేశాను. ఒక్క చిడత మాత్రమే ఉంది. రెండో చిడత వెతుక్కుని రంగస్థలం మీదకు కొంచెం ఆలస్యంగా వచ్చాను. వేదిక అని కూడా చూడకుండా మా పెద్దవాళ్లు నా చెంప ఛెళ్లుమనిపించారు. వాచిన బుగ్గతోనే నారదుడి పాత్ర వేశాను. నాటకాల పట్ల నిబద్ధత పెరగడానికి ఇలాంటి క్రమశిక్షణ కారణం’’ దుస్తులు తడిసిపోయాయి... ‘‘నేను నాటకాలలో అన్నీ పురుష పాత్రలే ధరించేదాన్ని. అందువల్ల స్త్రీ సహజ లక్షణాలు కనపడకుండా వస్త్రాలు బాగా బిగించి ధరించేదాన్ని. ఆరోజు నేను మగ పాత్ర వేయాలి. మేకప్ వేసుకోవడానికి ముందే మా చిన్నమ్మాయికి పాలిచ్చాను. మేకప్ వేసుకుని, రంగస్థలం మీదకు వచ్చాను. చాలాసేపటి వరకు లోపలకు వెళ్లలేకపోయాను. ఆకలికి పసిపాప గుక్క పెట్టి ఏడుస్తోంది. మాతృ సహజమైన మమకారం లోపల నుంచి పొంగుకొచ్చింది. నా దుస్తులన్నీ క్షీరధారలతో నిండిపోయాయి. బిడ్డ ఆకలిని తీర్చలేకపోతున్నందుకు నేను ఎంత నరకం అనుభవించానో. నాటకం చూస్తున్న ప్రేక్షకులలో నుంచి ఒకరు, ‘అమ్మా! మీరు లోపలకు వెళ్లండి, పసిబిడ్డ ఏడుస్తోంది, ఆ బిడ్డకు పాలిచ్చి రండి’ అన్నారు. మేం నమ్ముకున్న వృత్తి కోసం ఎంత బాధపడతామో, ఎంత కష్టపడతామో తెలియచెప్పడానికే ఈ విషయం చెబుతున్నాను. ఎన్ని చేదు అనుభవాలో... ‘‘అప్పుడు నిండు చూలాలిని. స్టేజ్ మీద మన్మధుడి వేషం వేస్తున్నాను. మన్మధుడి పాత్ర అంటే రంజింపచేయాలి. ఒకవైపు నొప్పులు వస్తున్నాయి. కళ్లలో నుంచి చుక్క నీరు కూడా రావడానికి వీలులేదు. నన్ను లోపలకు పిలిచి ఏదో కషాయం ఇచ్చారు. తాగుతానే నొప్పులు ఆగిపోయాయి. అలాంటి కష్టమైన సమయాల్లో కూడా నటించాను. మరో సంఘటన – ఒక వారం రోజులు వరుసగా నాటకాలు ఒప్పుకున్నాను. అప్పటికే నన్ను నమ్ముకుని లక్షరూపాయల టికెట్లు అమ్మారు. నాటకం ఇంకా మూడు రోజులుందనగా మూడో పాప యాక్సిడెంట్లో మరణించింది. తల్లిగా నా హృదయం రోదించింది. నాటకం వేసి తీరాలి. మనసు బండరాయిగా మార్చుకున్నాను. బాధను కడుపులోనే మింగి వరుసగా నాటకాలు ప్రదర్శించాను. అవి కూడా సతీసావిత్రి, వర విక్రయం, సత్యహరిశ్చంద్ర నాటకాలు. మూడు నాటకాలలోనూ మరణ సన్నివేశాలున్నాయి. ఆ సన్నివేశాలలో నా పాప గుర్తుకొచ్చి ఎంత ఏడ్చానో చెప్పలేను’’ సహించలేకపోయారు... నేను నమ్ముకున్న వృత్తి నాటకం. కృష్ణుడి పడక సీన్ నుంచి రాయబారం వరకు అన్ని వేషాలు వేశాను. ద్రౌపది పాత్ర పోషించి, అందరి ప్రశంసలు అందుకున్నాను. కాని బయటి నాటక సమాజాలు నాకు వేషం ఇవ్వలేదు. ఇటువంటి ఎన్నో చేదు అనుభవాలు ఉన్నాయి. స్త్రీలను ప్రోత్సహించిన సురభి... 130 సంవత్సరాల చరిత్ర కలిగిన సురభి నాటక సంస్థ స్త్రీ అభ్యుదయానికి, అభ్యున్నతికి, స్త్రీ స్వేచ్ఛకి పెట్టింది పేరు. స్త్రీని ఉన్నతంగా చూపారు. స్త్రీ పాత్రలు స్త్రీలే వేయాలని, కుటుంబ స్త్రీలు బయటకు రావాలన్నారు. నేడు మాత్రం ఆడవారు ప్రశంసలు పొందితే, పురుషులు సహించలేకపోతున్నారు. వెనక్కు లాగే చేతులు ఉంటాయి. ముందుకు వెళ్లాలి మనం. అందుకే నేను ఈ రంగంలో విజయం సాధించగలిగాను. విలక్షణ ప్రయోగం... నాటకరంగ చరిత్రలో ఎవ్వరూ చేయని ప్రయోగం చేశాను. ఒక పక్క సత్యభామ, మరోపక్క కృష్ణుడు... రెండు పాత్రలను నేనే గంటసేపు నటించాను. డ్రెస్సింగ్, మేకప్, అన్నీ నేనే. అందరూ మెచ్చుకున్నారు, ఒప్పుకున్నారు. కాలేజీలలో డెమో ఇవ్వాలనుకున్నాను. ఏ యూనివర్సిటీలవారు నాకు అవకాశం ఇవ్వకపోవడంతో నిరాశ చెందాను. నా జీవితమే నా చదువు... ‘‘డిగ్రీలు చదవకపోయినా, జీవితాన్ని బాగా చదివాను. జీవితం నుంచి నేర్చుకున్నదే పాత్రలుగా మలుచుకున్నాను. కాని నాటకం అన్నిసార్లు అన్నం పెట్టలేదు. సురభి కంపెనీ మూసేశాక పిల్లలు, భర్తతో బయటకు వచ్చేసి, నా దగ్గర ఉన్న బంగారం అమ్మి, నా భర్తకు ఆటో కొని ఇచ్చాను. కాని లాభం లేకపోయింది. అటువంటి పరిస్థితిలో నేను ఇతర కంపెనీలలో ఔత్సాహిక కళాకారులతో పనిచేయడం ప్రారంభించాను. అక్కడ కూడా ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నాను. – సంభాషణ: డా. పురాణపండ వైజయంతి -
మార్చాలి.. మారకూడదు – జమున
వ్యవస్థ తప్పు చేస్తూ ఉంటే దానికి అనుగుణంగా మనం మారుతూపోతే, చివరకు మనమే ఉండం. మన ఉనికే ఉండదు. మన వ్యక్తిత్వం ఉండదు. మనల్ని మనం గుర్తించలేనంతగా మారిపోతాం. మారడం కంటే వ్యవస్థనే మార్చాలి. మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటే వ్యవస్థ నీ కాళ్ల దగ్గర మోకరిల్లుతుంది. సినీ రంగంలోకి వచ్చిన వారికి ఇబ్బందులు ఎదురు కావడం సహజం. ఏదోరకంగా ఆడవారిని అణగదొక్కాలని ప్రయత్నిస్తారు. నేను, భానుమతి లాంటి కొందరు మాత్రం అన్నింటినీ తట్టుకుని నిలబడ్డాం. షూటింగ్లో నా హద్దుల్లో నేను ఉండేదాన్ని. మేకప్ వేసుకోవడం, నటించడం...ప్యాకప్ చెప్పగానే ఇంటికి వెళ్లిపోవడం... అంతవరకే. అనవసరంగా ఎవరోఒకరితో మాటలు కలపడం నాకు ఇష్టం ఉండేది కాదు. ‘నా ఆత్మాభిమానం నేనే కాపాడుకోవాలి’ అని నాకు నేనుగా అనుకున్నాను. ఆత్మాభిమానాన్ని చంపుకుని ఏ పనీ చేయక్కర్లేదు అని ప్రతివారు అనుకుంటే ఏ రంగంలోనైనా వ్యక్తిత్వంతో నిలబడగలుగుతారని నా అభిప్రాయం. వ్యక్తిత్వానికి ఆటంకం కలిగేలా ఉంటే, కెరీర్‌ను వదులుకోవడానికి కూడా నేను సిద్ధంగా ఉండేదాన్ని. నేను సెట్లో ఉంటే అందరూ జాగ్రత్తగా ఉండేవారు... నాకు చిన్నప్పటి నుంచి క్రమశిక్షణ అలవాటు చేశారు నాన్నగారు. సెట్లో అనవసరంగా నవ్వితే ఆయన ఊరుకునేవారు కాదు. మర్యాదగా ప్రవర్తిస్తూ, షూటింగ్ పూర్తి చేసుకుని రావాలనే నేర్పారు. అది నా మంచికే అని తెలిసింది. ఇంట్లో మాత్రం అందరం సరదాగా నవ్వుతూ తుళ్లుతూ ఉండేవాళ్లం. నా వ్యక్తిత్వానికి భంగం కలిగేలా ఉంటే నేను సహించలేను. పెద్ద పెద్ద్ద హీరోలు కూడా నేను షూటింగ్లో ఉంటే చాలా మర్యాదగా ప్రవర్తించేవారు. ఒక రోజు షూటింగ్లో నేను లేననుకుని, ఒక పెద్ద హీరో మద్యం సేవించి వచ్చారు. సాధారణంగా సినిమాలో హీరో తప్పించి, మిగిలిన పాత్రలతో ఎలా నటించినా మద్యం వాసన మనకు తెలియదు, కాని హీరోలతో కొన్ని సీన్స్‌లో చాలా క్లోజ్‌గా నటించాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో వారి నోటి నుంచి వచ్చే మద్యం వాసన భరించడం ఎవరికైనా కష్టమే. అందుకే ఆ రోజు నేను షూటింగ్ చేయనని చెప్పేశాను. అప్పటికే ఒక అమ్మాయిని పట్టుకుని, కౌగిలించుకుని, ముద్దు పెట్టుకున్నారుట ఆ హీరో. ఆ సందర్భంలో నేను ఉండి ఉంటే, పరిస్థితి వేరేలా ఉండేదని సెట్లో అందరూ నాతో అన్నారు. ఆ మాటలకు నాకు సంతోషంగా అనిపించింది. నేను ఉండటం వల్ల సెట్లో క్రమశిక్షణ ఉంటుంది అని అందరూ అనుకోవడం నాకు గర్వకారణమే కదా. వాస్తవానికి నేను – ఆ హీరో కాంబినేషన్ చాలా బావుంటుందని అందరూ అనుకునేవారు. మాది హిట్ పెయిర్ కూడా. నాన్నగారికి కోపం వచ్చింది... ఎన్టిఆర్, ఏయన్నార్... మూడేళ్లు నాతో నటించకుండా నన్ను బాయ్‌కాట్ చేశారు. అందుకు వాళ్లు చెప్పిన కారణాలు విన్నాక నాకు నవ్వు వచ్చింది. నేను కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటానని, నిర్మాతలను ఇబ్బంది పెడతానని, టైమ్‌కి సెట్స్‌లోకి రానని ప్రచారం చేశారు. నేను కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడంలో తప్పేమిటో అర్థం కాలేదు. అంటే ఒక హీరోయిన్ అలా కూర్చోకూడదనా వాళ్ల ఉద్దేశం. అంత పెద్ద హీరోలకి ఆడవాళ్ల మీద అలాంటి అభిప్రాయం ఉండటం సరికాదు. వాళ్లు అన్నమాటలే నిజం అయి ఉంటే, ప్రతి కంపెనీలోను ఆరు సినిమాలు ఎలా చేయగలుగుతాను. అంతేనా నేను నటించిన సినిమాలు ఏడాదికి ఆరు విడుదలయ్యేవి. నిజంగానే నేను పొగరుగా ఉండి, టైమ్‌కి షూటింగ్‌కి రాకపోతే ఇన్ని సినిమాలు చేయగలిగేదానినా! పరిశ్రమ ఎంతో మారిపోయింది... అప్పట్లో నిర్మాతలు విలువలు పాటించేవారు. వ్యాపార దృక్పథంతో పాటు కంపెనీ నిలబడి బెస్ట్‌గా ఉండాలి అనుకునేవారు. అన్నపూర్ణ, జగపతి, సురేశ్... అందరూ ఉద్దండులే. ప్రస్తుతం సినీరంగంలో ‘నిర్మాతలు’ అని చెప్పుకునేవారికి, మా తరం నిర్మాతలకి పొంతన లేదు. ఈ తరం నిర్మాతలు ‘ఫలానా హీరోయిన్ అయితే బావుంటుంది’ అనుకుంటున్నారు. ఓపెనింగ్లకి హీరోయిన్లను పిలిచి మీద చేయి వేస్తున్నారు. అంత బలహీనంగా ఉంది వారి తత్త్వం. ఆ రోజులతో పోలిస్తే ఇప్పుడు లైంగిక వేధింపు ఎక్కువగా ఉందేమో అనిపిస్తోంది. నేను శక్తిని... నేను సినిమాలలో శక్తిస్వరూపిణిగా కత్తి దూసి యుద్ధం చేశాను కనుక ‘జమున శక్తి స్వరూపం’ అని నాకు పేరు. నేను శక్తిని అనుకోవడం ప్రతి స్త్రీకి చాలా అవసరం. ప్రస్తుతం అమ్మాయిలు బాగా చదువుకుంటున్నారు. వారిని ప్రభుత్వం కూడా ప్రోత్సహించాలి. జీవితం అంటే పెళ్లి కాదు, మొగుడి చేతిలో బానిసలా ఉండక్కర్లేదు. చక్కగా చదువుకున్నవారు తగిన ఉద్యోగం చేయొచ్చు, చదువురానివారు రెండు గేదెలను లేదా ఆవులను కొనుక్కుని పాల వ్యాపారం చేసుకుంటూ హుందాగా బతకొచ్చు. అంతేకాని ఆత్మాభిమానం చంపుకుని బతకవలసిన అవసరం లేదని నా అభిప్రాయం. అమ్మ పెంపకంలో.... మా అమ్మ చాలా ధైర్యవంతురాలు. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొని, రెండు రోజులు జైలుకి కూడా వెళ్లింది. ధైర్యంగా ఉండటం ఆవిడ దగ్గర నుంచే నేర్చుకున్నాను. ఆత్మవిశ్వాసం, వ్యక్తిత్వం కాపాడుకోవడం కూడా అమ్మ దగ్గర నుంచే నేర్చుకున్నాను. అందుకే అందరూ నాకు అన్నీ అమ్మ బుద్ధులే వచ్చాయి అనేవారు. మా అమ్మ∙సాక్షాత్తు దేవత. ఆవిడ పెంపకంలోనే ఆత్మగౌరవం నిలబెట్టుకోవడం, ఎటువంటి సమస్యలు ఎదురైనా తట్టుకోవడం వచ్చాయేమో అనిపిస్తుంది. ఇంటర్వ్యూ: వైజయంతి -
జమునకు కీర్తిసురేశ్ జవాబు..
తమిళసినిమా: నాకా అర్హత ఉంది అంటోంది యువ నటి కీర్తిసురేశ్. నట వారసురాలిగా రంగప్రవేశం చేసిన ఈ ముద్దుగుమ్మకు కోలీవుడ్‌లో తొలిచిత్రం నిరాశపరచినా, మలి చిత్రం రజనీమురుగన్ నుంచే విజయాలు ముంగిట వరించాయి. అంతే కాదు ఇలయదళపతి విజయ్, సూర్య వంటి స్టార్ హీరోలతో నటించే అవకాశాలను తక్కువ కాలంలోనే అందిపుచ్చుకున్న కీర్తిసురేశ్. ఇక మహానటి సావిత్రి జీవిత చరిత్రతో తెరకెక్కుతున్న ద్విభాషా చిత్రం (తమిళం, తెలుగు) నడిగైయార్ తిలగం చిత్రంలో సావిత్రిగా నటించే అవకాశం కీర్తినే వరించింది. అయితే ఈ చిత్రానికే ఈ యువ నటి విమర్శలను ఎదుర్కొంటోంది. నడిగైయార్ తిలగం చిత్రం దాదాపు చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ఇందులో కీర్తిసురేశ్‌తో పాటు, సమంత, దుల్కర్సల్మాన్, విజయ్‌దేవరకొండ నటిస్తున్నారు. ఈ చిత్రంలో సావిత్రి పాత్రలో కీర్తిసురేశ్ నటించడాన్ని సీనియర్ నటి జమున ఆక్షేపణ వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఒక భేటీలో సావిత్రి పాత్రలో నటించే అర్హత కీర్తిసురేశ్‌కు లేదని అన్నారు. దీనికి కాస్త ఆలస్యంగానే కీర్తిసురేశ్ స్పందించింది. తను పేర్కొంటూ సావిత్రి పాత్రలో నటించడానికి తాను అర్హురాలినేనని పేర్కొంది. తాను ఏమీ ఆలోచించకుండా సావిత్రి పాత్రలో నటించడానికి అంగీకరించలేదని, ఆమె గురించి క్షణంగా తెలుసుకున్న తరువాతనే ఆమెలా నటించడానికి అంగీకరించానని చెప్పింది.అందుకు చాలా శిక్షణ పొందానని చెప్పింది. ముందుగా సావిత్రికి సంబంధించిన పుస్తకాలను చదివానని, ఆ తరువాత సావిత్రి కూతురు ఛాముండేశ్వరిని కలిసి సావిత్రి మేనరిజం గురించి అడిగి తెలుసుకున్నానని చెప్పింది. అప్పుడు ఛాముండేశ్వరి తనకు చాలా విషయాలను చెప్పారని అంది. అదే విధంగా సావిత్రి నటించిన పలు చిత్రాలు చూశానని చెప్పింది. ఆ తరువాత ఆమెలా నటించడంలో శిక్షణ పొందానని, ఇవన్నీ దర్శక నిర్మాతలకు సంతృప్తిని కలిగించిన తరువాతనే ఆ పాత్రలో నటించడం ప్రారంభించానని తెలిపింది. మరో విషయం ఏమిటంటే సావిత్రి అమ్మకు తనకు చాలా విషయాల్లో సాపిత్యం ఉందని సావిత్రి అమ్మకు క్రికెట్ క్రీడ అన్నా, స్మిమ్మింగ్, డ్రైవింగ్ అన్నా చాలా ఆసక్తి అని, తనకూ అవంటే చాలా ఆసక్తి అని కీర్తి చెప్పింది. అంతే కాదు చిత్రం విడుదలైన తరువాత తన నటన గురించి విమర్శించడం సబబుగా ఉంటుందని అంది. -
జమునా దేవి ఆలయమే.. జామా మసీదు!?
సాక్షి, న్యూఢిల్లీ : మందిర్-మసీదు, తాజ్ మహల్ వివాదం మంటలు పుట్టిస్తున్న సమయంలో తాజాగా బీజేపీ ఎంపీ వినయ్ కతియార్ తాజాగా మరో సంచలన ఆరోపణలు చేశారు. న్యూఢిల్లీలోని జామా మసీదుపై అసలు జమునా దేవి ఆలయం అంటూ.. గురువారం అతిపెద్ద బాంబే పేల్చారు. ఒక్క జామ్ మసీదేకాకుండా.. దేశంలోని ఆరు వేల ప్రార్థనాలయాలను మొఘల్ రాజులు కూలగొట్టి.. మసీదులుగా మార్చారని మరో సంచలన ఆరోపణ చేశారు. దేశంలో మొఘలలు అడుగు పెట్టకముందు వరకూ జామా మసీదు, జమునా దేవి ఆలయంగా ఉండేదన్నారు. క్రీ.శ 17 శతాబ్దంలో షాజహాన్ ఆలయాన్ని ధ్వంసం చేసి మసీదు కట్టారని ఆయన పేర్కొన్నారు. మొఘలుల కాలంలో దేశంలో ప్రఖ్యాంతిగాంచిన ఆరు వేల ఆలయాలను ధ్వంసం చేసి మసీదులు నిర్మించారని ఆయన తెలిపారు. తేజే మహాలయాన్ని తాజ్‌మహల్‌గా మార్చినట్టే.. జమునా దేవి ఆలయాన్ని జామా మసీదుగా మార్చారని వినయ్ కతియార్ చెప్పారు. రెండు నెలల కిందట ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన టూరిజం కరపత్రంలో తాజ్‌మహల్‌ను పక్కన పెట్టడంతో వివాదం మొదలైంది. అదే సమయంలో తాజ్ మహల్, తేజో మహాలయమంటూ వినయ్ కతియార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా.. దశాబ్దాలుగా మండుతున్న బాబ్రీ-రామజన్మభూమి కేసు విచారణను సుప్రీంకోర్టు చేపట్టింది. అయితే వచ్చే ఏడాది ఫిబ్రవరి 8కి విచారణ వాయిదా వేసింది. -
టైటిల్స్... తెలుగు మరచిపోయేలా ఉంటున్నాయి!
‘‘ఒకప్పుడు తెలుగు చిత్రాలు చూసేవాణ్ణి. విలువలతో కూడిన ఆ చిత్రాల ప్రభావం సమాజంపై ఉండేది. ఇప్పటి చిత్రాల టైటిల్స్ తెలుగుని మరచిపోయేలా చేస్తున్నాయి. ఈ చిత్రానికి తెలుగులో టైటిల్ పెట్టడం నాకు నచ్చింది.’’ అన్నారు తమిళనాడు మాజీ గవర్నర్ కె. రోశయ్య. దినేశ్, మియా జార్జ్, నివేథా పేతురాజ్, రిత్విక ముఖ్యతారలుగా నెల్సన్ వెంకటేశన్ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘ఒరు నాల్ కొత్తు’. తెలుగులో ‘పెళ్లిరోజు’ పేరుతో బల్లా సురేశ్, మృదుల మంగిశెట్టి, ప్రవీణ్ మంగిశెట్టి విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం పాటల్ని రోశయ్య, లోగోను సీనియర్ నటి జమున ఆవిష్కరించారు. ‘‘యాభై ఏళ్ల క్రితం ‘పెళ్లిరోజు’ అనే చిత్రంలో నటించాను’’ అన్నారు జమున. ‘‘పెళ్లికోసం ఆరాటపడే ముగ్గురు యువతుల కథే ఈ సినిమా. కొన్ని మార్పులతో తెలుగులో విడుదల చేస్తున్నాం’’ అన్నారు వెంకటేశన్. -
జమునకు ‘నవరస నట కళావాణి’ బిరుదు
‘‘ప్రతి ఏడాది నా పుట్టినరోజు నాడు ఆధ్యాత్మిక ప్రముఖులను, కళాకారులను సత్కరించడం ఆనవాయితీగా వస్తోంది. అదే విధంగా ఈ ఏడాది సర్వమత గురువులను సన్మానించనున్నాం. జమునగారిని ‘నవసర నట కళావాణి’ బిరుదుతో సత్కరిస్తాం’’ అన్నారు కళాబంధు టి. సుబ్బరామిరెడ్డి. ఈ నెల 17న ఆయన బర్త్‌డే. ఈ సందర్భంగా విశాఖలో టి.ఎస్.ఆర్. లలితకళా పరిషత్ ఆధ్వర్యంలో ఈ నెల 16న ఆధ్యాత్మిక, 17న సాంస్కృతిక సినీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు సోమవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలిపారు. ‘‘1978లో ‘30 ఏళ్లు ఏకధాటిగా మీరు కథానాయికగా నటించారు’ అని సిల్వర్ జూబ్లీ వేడుక నిర్వహించారు. ఇప్పుడీ అవార్డుతో సత్కరిస్తున్నట్టు చెప్పారు. చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు జమున. రచయితలు పరుచూరి బ్రదర్స్, జమున కుమార్తె స్రవంతి పాల్గొన్నారు. -
భిక్షమెత్తుకుంటున్న కళాకారిణికి విశాల్ ఆపన్నహస్తం
ఒకప్పుడు నృత్య కళాకారిణిగా వెలిగిన జమున ప్రస్తుతం పేదరికంలో ఆర్థిక ఇబ్బందులతో స్థానిక వడపళణిలోని కుమారస్వామి ఆలయం ముందు భిక్షమెత్తుకుని జీవిస్తున్నారు. ఈమె అప్పట్లో ప్రఖ్యాత నటీమణి సరోజా దేవి, భానుమతి వంటి వారితో పలు చిత్రాల్లో నృత్యం చేశారు. అదే విధంగా కర్ణన్, తోళవయ్యార్ వంటి ఉత్తమ చిత్రాల్లో నటించారు. అదే విధంగా శివాజీగణేశన్, ఎంజీఆర్, శివకుమార్ వంటి నటులతో కలసి నటించారు. ఆమె భర్త మేకప్ కళాకారుడు. భర్త మృతిచెందడం, బిడ్డలు లేకపోవడం, ఆర్థికిబ్బందులతో కొన్ని రోజుల కిందట జమున వడపళనిలో కుమారస్వామి ఆలయం ముందు భిక్షాటన చేస్తున్న దృశ్యం సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న విశాల్ వెంటనే తన కార్య నిర్వాహకుడు మురుగదాస్, తన అభిమాన సంఘం సభ్యుడు హరికృష్ణన్‌ను జమున వద్దకు పంపి ఆమెకు సాయం చేయాల్సిందిగా సూచించారు. దీంతో వారు జమునను కలిసి అనాథాశ్రమానికి పంపిస్తామని తెలపగా అందుకు ఆమె నిరాకరించింది. తనకు నెలకు కొంత పైకాన్ని అందించేలా చూడాలని కోరింది. ఈ విషయం విశాల్‌కు చెప్పగా ఆయన తన దేవి ట్రస్ట్ నుంచి నెలకు రూ.2వేలు అందించేలా ఏర్పాటు చేశారు. -
ఐఏఎస్ అధికారిని ప్రశ్నిస్తున్న పోలీసులు
హైదరాబాద్ : యూసుఫ్‌గూడలో దారుణ హత్యకు గురైన కారు డ్రైవర్ హత్యకేసులో పోలీసులు పురోగతి సాధించారు. వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు, ఐఏఎస్ అధికారి వెంకటేశ్వరరావును జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు పిలిపించి పోలీసులు ప్రశ్నిస్తున్నారు. డ్రైవర్ నాగరాజు మృతదేహాన్ని తరలించేందుకు కుమారుడికి సహకరించారన్న అనుమానంపై ఆయనను విచారణ జరుపుతున్నారు. అయితే ఈ కేసులో ఐఏఎస్ ప్రమేయం కూడా ఉందా అనే కోణంలోనూ విచారణ జరుపుతున్నారు. ఈ కేసుపై వెస్ట్ జోన్ డీసీపీ మాట్లాడుతూ సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నిందితులు ఎంతటివారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. కాగా ఈ కేసులో ఐఏఎస్ కుమారుడు వెంకటేష్ ఈ హత్య చేసినట్లు పోలీసులు నిర్థారణకు వచ్చారు. మరోవైపు తన భర్త హత్యకు వెంకటేషే కారణమని మృతుడి భార్య జమున ఆరోపిస్తుంది. -
‘నా భర్త హత్యకేసులో మరో మహిళ ప్రమేయం’
హైదరాబాద్ : యుసుఫ్‌గూడలో దారుణ హత్యకు గురైన కారు డ్రైవర్ నాగరాజు భార్య జమున తన భర్త మృతిపై అనుమానాలు వ్యక్తం చేసింది. ఈ హత్యకు సంబంధించి మరో మహిళ ప్రమేయం ఉందని ఆమె ఆరోపణలు చేసింది. ఐఏఎస్ కుమారుడు వెంకట్ ఈ హత్య చేయించి ఉంటాడని జమున తెలిపింది. మరోవైపు సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. మృతుడి భార్య నుంచి వివరాలు సేకరిస్తున్నారు. కాగా సూర్యాపేట సమీపంలోని దుబ్బతండాకు చెందిన కారు డ్రైవర్ భూక్యా నాగరాజు (40)... భార్య జమున, తన ఇద్దరు పిల్లలతో రహమత్‌నగర్‌లోని జవహర్ నగర్లో ఉంటున్నాడు. శుక్రవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో నాగరాజు ఓ యువకుడితో కలసి యూసుఫ్‌గూడలోని సాయికల్యాణ్ అపార్ట్మెంట్ పైకి వెళ్లాడు. రాత్రి 10 గంటల ప్రాంతంలో నాగరాజుతో వెళ్లిన వ్యక్తి మాత్రమే కిందకు దిగి వెళ్లిపోయాడు. శనివారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో అదే వ్యక్తి సదరు అపార్ట్మెంట్ పైకెళ్లి... ఓ మూటను కిందకు తీసుకొస్తుండగా చప్పుడయింది. ఈ అలికిడికి అప్రమత్తమైన అపార్ట్మెంట్లోని ఓ వృద్ధుడు... ఎవరు నువ్వు... ఇక్కడేం చేస్తున్నావంటూ ప్రశ్నించాడు. దీంతో సదరు వ్యక్తి మూట వదిలేసి అక్కడి నుంచి పరారయ్యాడు. దాంతో ఆ వృద్ధుడు జూబ్లీహిల్స్ పోలీసులకు సమాచారం అందించాడు. ఆ మూటలో యువకుడి మృతదేహం కనుగొన్న పోలీసులు అతడిని నాగరాజుగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు. కాగా హత్యకు గల కారణాలు తెలియరాలేదు. -
జమునగా సమంత?
సమంత సీనియర్ నటి జమునగా మారనున్నారా? అవుననే అంటున్నారు సినీ వర్గాలు. ఈ కథేంటో చూద్దామా ‘మహానటి సావిత్రి జీవిత కథ వెండితెర రూపం దాల్చనున్న విషయం తలిసిందే. ఇండియన్ సినిమా మరువలేని, మరపురాని మహానటి సావిత్రి. ఆమె సినీ జీవితం నేటి నటీమణులకు స్ఫూర్తి అయితే వ్యక్తిగత జీవితం ఒక పాఠం. అలాంటి పలు ఆసక్తికరమైన సావిత్రి జీవితకథను మహానటి పేరుతో తెలుగులోనూ, నడిగైయన్ తిలగం పేరుతో తమిళంలోనూ ఏక కాలంలో తెరకెక్కనుంది. యువ దర్శకుడు నాగఅశ్వన్ దర్శకత్వం వహించనున్న ఇందులో మహానటి సావిత్రి పాత్రలో యువ క్రేజీ నటి కీర్తీసురేశ్ నటించనున్నారు. ఈ పాత్ర కోసం ఈ బ్యూటీ తనను సావిత్రి రూపంలోకి మలచుకోవడానికి కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం. ఇందులో చెన్నై చిన్నది సమంత కూడా ఒక ప్రధాన పాత్రను పోషించడానికి సిద్ధం అవుతున్నారు. ఆమె పాత్ర ఏమటన్నదానికి కోలీవుడ్‌లో వినిపిస్తున్న మాట నటి సావిత్రి సమకాలీన నటి జమున. ఆ పాత్రగా నటి సమంత మారనున్నారని సమాచారం. జమున కూడా తన అసాధారణ నటనతో తమిళం, తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్రవేసుకున్న గొప్పనటి. అయితే మహానటి సావిత్రి జీవిత కథా చిత్రంలో నటి జమున పాత్ర ఏమిటన్నది ఆసక్తికరమైన అంశం. సావిత్రి, జమున మంచి స్నేహితురాళ్లు, ఒక సమయంలో ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయని అంటారు. అలాంటి అంశాలను దర్శకుడు ఈ చిత్రంలో చూపించనున్నారా? అదే విధంగా నటి సావిత్రి జీవితంలో నటుడు, ఆమె భర్త జెమినీగణేశన్ ది కీలక పాత్ర. ఈ చిత్రంలో ఆయన పాత్రను ఎవరు పోషించనున్నారన్న విషయంపై ఆసక్తి నెలకొంది. త్వరలో సెట్‌పైకి వెళ్లనున్న నడిగైయన్ తిలగం(మహానటి) చిత్రంపై చిత్ర పరిశ్రమలో కుతూహలం నెలకొందన్నది మాత్రం నిజం. -
భావోద్వేగాలతో...కబడ్డీ కబడ్డీ
గయ్యాళి తల్లి సూర్యకాంతం వర్సెస్ సవతి కూతురు సావిత్రి! గారాబాల చెల్లెలు జమున వర్సెస్ పనిమనిషి లాంటి సావిత్రి! రోడ్ రోలర్ లాంటి సూర్యకాంతం వర్సెస్ ఆర్మీ ట్యాంక్ లాంటి ఛాయాదేవి! స్మార్ట్ లవర్ బాయ్ అక్కినేని వర్సెస్ ఇన్నోసెంట్ ప్రేమికుడు ఎన్టీవోడు! పెళ్లి చెడగొట్టే డర్టీ ఫెలో రమణారెడ్డి వర్సెస్ కథ నడిపించే పెద్దమనిషి ఎస్వీ రంగారావు! ఇన్ని ఎమోషన్స్‌తో కబడ్డీ... కబడ్డీ...! గుండెలను కరిగించే కథ! పరివర్తన తెచ్చే కథ! కుటుంబాలను కలిపే కథ! ఇప్పటికీ నచ్చే కథ! మళ్లీ చూడండి రామ్, ఎడిటర్, ఫీచర్స్ ఒక రాక్షసుడు ఉండేవాడు. బండెడు అన్నం, రోజుకో మనిషి వాడి డైట్. అదీ సరిపోయేది కాదు. నిద్రపట్టక దొర్లేవాడు. అర్ధాకలి మరి! మళ్లీ ఎప్పుడు వేళవుతుందా... ఎప్పుడు బండెడు అన్నం తిందమా అని ఎదురు చూసేవాడు. రోజుకొక మనిషన్నది కూడా ఆ రాక్షసుడి నియమం కాదు. అది మనుషులు పెట్టిన రేషనింగ్. లేకపోతే ఊరి మీద పడి దొరికినవాళ్లని దొరికినట్టు నోట్లో వేసుకుని చప్పరించేస్తాడు కదా. అంత స్టామినా వాడిది. సూర్యకాంతం నటనలో అంతకు రెండింతల స్టామినా ఉంటుంది. స్టామినా కాదు, రాక్షసత్వం. రోల్ ఏదైనా రోస్ట్ చేసేస్తుంది. కారాలు మిరియాలు అద్దుకుని మరీ కరకర న మిలేస్తుంది. కళ్లమ్మటి నీళ్లు వచ్చేస్తాయి. అమెక్కాదు. ఆమె దబాయించే మనిషికి. అంతటి మనిషిని ‘గుండమ్మ కథ’లో పస్తులుంచేశారు చక్రపాణి! అందులో సూర్యకాంతం గయ్యాళి. ఈ గయ్యాళి పాత్రను ఆయన షేక్స్పియర్ నవల ‘టేమింగ్ ఆఫ్ ది ష్రూ’ నుంచి కొంత, కన్నడ సినిమా ‘మనె తుంబిద హెణ్ణు’ నుంచి కొంత తీసుకుని శిల్పంలా చెక్కారు. అయితే సావిత్రిపై విసుక్కోవడం, చికాకు పడడం తప్ప సూర్యకాంతంలో వేరే గయ్యాళితనం కనిపించదు గుండమ్మ కథలో. ‘బాబోయ్... గుండమ్మా!’ అని తక్కిన పాత్రలు మాత్రం బెదిరిపోయి పారిపోవడం తప్ప. ఎన్టీఆర్, ఏఎన్నార్... అప్పటికే సూపర్స్టార్లు. ఒకరిని మించిన వారొకరు. ఎవరి ఫ్యాన్స్ వారికి ఉన్నారు. ఎవరి ఫాలోయింగ్ వారికి ఉంది. రోల్ ఏదైనా వాళ్లు హీరోల్లానే కనిపించాలి. మరోలా కనిపిస్తే బాక్సులు కాకుండా వేరే ఏవైనా బద్దలైపోతాయి. అలాంటిది.. కథ కోసమే అయినా, కామెడీ కోసమే అయినా ఎన్టీఆర్‌ని పనిమనిషి అంజిగాడిగా, ఏయన్నార్‌ని కొంటె కోణంగిగా చూపించడం పెద్ద సాహసం. పెపైచ్చు సినిమా టైటిల్ కూడా వారిని ఇండికేట్ చేసేలా లేదు. కథా వాళ్లిద్దరి చుట్టూ అల్లింది కాదు. అయినా అంత పెద్ద సాహసాన్ని అలవోకగా చేసేశారు చక్రపాణి-నాగిరెడ్డి... విత్ ది హెల్ప్ ఆఫ్ కమలాకర కామేశ్వరరావు. గుండమ్మ కథ మొత్తం ఇలాగే ఉంటుంది. వైవిధ్యంగా! రమణారెడ్డి ఉంటాడు. డేంజరస్ విలన్! పెళ్లిళ్లు చెడగొట్టడాన్ని మించిన డేంజరస్ విలనీ ఏముంటుంది చెప్పండి!! కానీ అంత డేంజరస్‌గా అనిపించడు. తెరపై కనిపించినప్పుడల్లా నవ్వించి పోతుంటాడు. పోయి, మళ్లీ నవ్వించడానికే వస్తున్నట్లు ఉంటాడు. ఈ మధ్యలో చేసే పనంతా చేస్తుంటాడు. ఇక గుండమ్మ సొంత కూతురు జమున పెంకి పిల్ల. సినిమాలో మరీ అంత పెంకితనం ఏమీ కనిపించదు. సవతి కూతురు సావిత్రి తెల్లారకుండానే లేచి ఇంటిపనులు మొదలు పెడితే, ఈ అమ్మాయికి ఎప్పటికో గానీ తెల్లారదు. బారెడు పొద్దెక్కాక ఒళ్లు విరుచుకుంటూ బాల్కనీలోకి వచ్చి ‘అమ్మా... కాఫీ’ అని అడుగుతుంటుంది. అతి గారాబం. ఇక్కడికి ఈ వైపు క్యారెక్టర్లు అయిపోయాయి. సూర్యకాంతం, సావిత్రి, జమున, కొడుకు హరనాథ్, వాళ్లింటికి వచ్చిపోతుండే రమణారెడ్డి. అటువైపు ఎస్వీరంగారావు. ఆయన పెద్దకొడుకు ఎన్టీఆర్, చిన్న కొడుకు ఏఎన్నార్. వీళ్లతోపాటు కథ అవసరాన్ని బట్టి ఛాయాదేవి (హరనాథ్ ప్రేమించిన ఎల్.విజయలక్ష్మి మేనత్త), రమణారెడ్డి కొడుకు రాజనాల ఎంట్రీ ఇచ్చి వెళుతుంటారు. వీళ్లంతా పాత్రకు తగ్గ ఎమోషన్స్‌ని పలికిస్తుంటారు కానీ, ఆ పాత్రల స్వభావాలను ఎస్టాబ్లిష్ చేసే సన్నివేశాలు పదే పదే సినిమాలో కనిపించవు. సూర్యకాంతం ఏమిటో చెప్పడానికి ఆమె ఫేస్‌వ్యాల్యూ ఒక్కటి చాలదా! చక్రపాణి కూడా ఇదే అభిప్రాయానికి వచ్చి ఆమెను అలా వదిలేశారు సహజసిద్ధంగా. ఆమెను దారిలో పెట్టడానికి అంతే ఫేస్‌వ్యాల్యూ ఉన్న ఛాయాదేవిని బాణంలా వదిలారు. ఇక ఆ తర్వాతి సీన్లు ఎలా నడవాలన్నది వాళ్లిద్దరి ఇష్టం. సూర్యకాంతం, ఛాయాదేవి కలిస్తే ఇంకేముందీ.. డెరైక్టర్ని కూడా మధ్యలోకి రానివ్వరు. గుండమ్మ కథలోనూ అలాగే జరిగింది. సినిమా హిట్ అయింది. ఎవరి వల్ల హిట్ అయిందంటే మాత్రం ఒక పేరు చెప్పలేం. సినిమా చూడాల్సిందే. గుండమ్మ కథలోని ప్రతి ఆర్టిస్టూ సినిమా చూపించారు. సంప్రదాయ నటనకు భిన్నంగా (ప్రోగ్రెసివ్ అనాలేమో) నటుల చేత యాక్ట్ చేయించి, కథను నడిపించిన చక్రపాణిని కూడా ఇందులోని హిట్ క్యారెక్టర్‌గానే చెప్పుకోవాలి. కథేమిటి? సూర్యకాంతం వితంతువు. కూతుళ్లు సావిత్రి, జమున. కొడుకు హరనాథ్. సంపన్న కుటుంబం. ఎస్వీరంగారావుకు ఇద్దరు కొడుకులు. పెద్దవాడు ఎన్టీఆర్, చిన్నవాడు ఏఎన్నార్. అది మరీ సంపన్న కుటుంబం. కొడుకులిద్దరికి మంచి సంబంధాల కోసం వెదుకుతుంటాడు ఎస్వీరంగారావు. ఇక్కడ సూర్యకాంతానికీ అదే పని. అయితే సొంత కూతురికి మాత్రమే సంబంధాలు చూస్తుంటుంది. సావిత్రిని ఎవడో తలమాసిన వాడికి ఇచ్చేస్తే సరిపోతుందని ఆమె ఉద్దేశం. ఎస్వీఆర్ గురించి సూర్యకాంతానికి తెలుస్తుంది. మధ్యవర్తిని పంపి జమున విషయం చెప్పిస్తుంది. ఈ సూర్యకాంతం ఎవరో కాదు, చనిపోయిన తన స్నేహితుడి భార్యేనని ఎస్వీఆర్‌కి తెలుస్తుంది. ఎన్టీఆర్, ఏయన్నార్లకు... సావిత్రి, జమునల్ని ఇచ్చి చేస్తే స్నేహితుడి ఆత్మ శాంతిస్తుందని భావిస్తాడు. అలాగే గయ్యాళి సూర్యకాంతంలో, ఆమె పెంకి కూతురు జమునలో మార్పుతేవాలని అనుకుంటాడు. ఆ సంగతిని కొడుకులిద్దరికీ చెప్పి చిన్న నాటకం ఆడమంటాడు. ఎన్టీఆర్ పనిమనిషిలా సూర్యకాంతం ఇంట్లోకి ప్రవేశిస్తాడు. మొదట ఆమెను బుట్టలో వేసుకుంటారు. తర్వాత ఆ ఇంట్లో స్థానం సంపాదిస్తాడు. ఆ తర్వాత సావిత్రి హృద యాన్ని గెలుచుకుంటాడు. ఇక ఏఎన్నార్. జమునను వలలో వేసుకుని ఆమె ప్రేమను పొందుతాడు. సంపన్నుడైన ఎస్వీరంగారావు కొడుగ్గానే పరిచయం చేసుకుంటాడు. అలా ఇటు ఎన్టీఆర్, అటు ఏయన్నార్... సూర్యకాంతం కుటుంబానికి బాగా దగ్గరవుతారు. మొదట ఎన్టీఆర్, సావిత్రిల పెళ్లి జరుగుతుంది. తర్వాత చిన్న అవరోధంతో ఏయన్నార్, జమునలు దంపతులవుతారు. అక్కడి నుంచి కథ ఊపు అందుకుంటుంది. ఎన్టీఆర్ సావిత్రిని తన ఇంటికి తీసుకెళ్లి సర్ప్రైజ్ చేస్తాడు. ఏయన్నార్ మరోలా సర్ప్రైజ్ చేసి (తను ఎస్వీఆర్ కొడుకును కాదన్న అబద్ధంతో) జమునను తనతో పాటు తీసుకెళ్లి అష్టకష్టాలు పడనిచ్చి చివర్లో అసలు విషయం చెప్తాడు. సూర్యకాంతం కూడా ఎస్వీఆర్ ఇంటికి వచ్చేస్తుంది. కథ సుఖాంతం. ఈ మధ్యలో కొన్ని మలుపులు, కొన్ని మెరుపులు... కథలో బలం ఉన్నప్పుడు పాత్రల స్వభావాలను పట్టిపట్టి ఎలివేట్ చేయల్సిన పనిలేదని నిరూపించిన చిత్రం... గుండమ్మ కథ. నిరూపించిన నిర్మాత చక్రపాణి. మళ్లీ చూడవలసిన సినిమా. మన పిల్లలకూ చూపించవలసిన సినిమా. మోడర్న్ అమ్మలకీ, నాన్నలకీ కథలు రావు. ఏంత రాకున్నా ఒక కథ మాత్రం వారు చెప్పగలరు. అదే... ఏడు చేపల కథ. అందుకే ఆ కథ ప్రతి తరానికీ అందుతోంది. సరిగ్గా అలాంటి కథే గుండమ్మ కథ. మన సంస్కృతిలో ఒక భాగం అయిపోయిన కథ. - సాక్షి ఫ్యామిలీ కొన్ని విశేషాలు - ఎన్టీఆర్‌కిది 100వ సినిమా. ఏయన్నార్‌కు 99వ చిత్రం. - గుండమ్మకథకు మూడేళ్ల ముందు ఎన్టీఆర్, ఏయన్నార్‌లతో జమునకు మనస్పర్థలు వచ్చాయి. దాంతో ఆ మూడేళ్లు వాళ్ల పక్కన జమున నటించలేదు. ఈ సినిమా కోసం నాగిరెడ్డి-చక్రపాణి గట్టిగా జోక్యం చేసుకుని ముగ్గురినీ కలిపారు. - ఈ సినిమాలో అందరూ బిజీ ఆర్టిస్టులే కావడంతో ఎవరి డేట్స్ దొరికితే వాళ్లతో సీన్లు తీసేశారు. ‘కోలో కోలో యన్న కోలో’ పాటలో ఎన్టీఆర్, సావిత్రి, ఏయన్నార్, జమున కలిసి పాడతారు కదా. నిజానికి షూటింగ్లో నలుగురూ కలిసిందే లేదు. ఇద్దరొకసారి, మరో ఇద్దరు ఇంకోసారి పాట పూర్తి చేసి నలుగురూ కలిసి పాడారన్న ఎఫెక్ట్ తీసుకొచ్చారు. - మరో ప్రఖ్యాత దర్శకుడు కె.వి.రెడ్డికి ఈ కథ నచ్చలేదు. హిట్టయిన తర్వాత కూడా ఇది ఎందుకు అంత పెద్ద విజయం సాధించిందో తనకు అర్థం కాలేదని అన్నారట! లేచింది, నిద్ర లేచింది మహిళా లోకం మౌనముగా నీ మనసు పాడిన కనులు మూసినా నీవాయే... కోలోకోలోయన్న కోలో నా సామి ఎంత హాయి ఈ రేయి వేషము మార్చెను, భాషను మార్చెను అలిగిన వేళనే చూడాలి ప్రేమయాత్రలకు బృందావనము -
దివంగత సినీనటులకు జమున పిండప్రదానం
రాజమండ్రి: పుష్కరాల్లో తమ పూర్వీకులకు పిండప్రదానం చేయడం సంప్రదాయంగా భావిస్తుంటారు. కానీ సీనియర్ నటీమణి జమున మాత్రం సినీరంగంలో తన ఉనికికి, ఉన్నతికి కారణమైన కొందరు దివంగత నటులకు పిండప్రదానం చేసి వారితో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. శుక్రవారం రాజమండ్రిలోని వీఐపీ పుష్కర ఘాట్ లో స్నానమాచరించిన అనంతరం దివంగత సినీనటులు కన్నాంబ, భానుమతి, సావిత్రి, సూర్యకాంతం, ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, రేలంగి, రాజబాబు, పద్మనాభం తదితరులకు జమున శాస్త్రోక్తంగా పిండప్రదానం చేశారు. క్రతువు అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ చనిపోయిన తన సమకాలీన నటులకు గోదావరి పుష్కరాల్లో పిండప్రదానం చేసి తనవంతు కర్తవ్యం నిర్వర్తించడం ఎంతో తృప్తిగా ఉందన్నారు. మూగమనసులు సినిమా షూటింగ్ గోదావరి పరిసరాల్లోనే జరిగిందని, దాదాపు 50 ఏళ్ల కిందట కోటిపల్లి, సఖినేటిపల్లి తదితర ప్రాంతాల్లో గోదావరి గట్లపై నటించినప్పుడు గోదావరి అందాలు చూసి ఎంతో మురిసిపోయేదానినని గుర్తు చేసుకున్నారు. తాను రాజమండ్రి ఎంపీగా ఉన్న సమయంలో 1991 పుష్కరాల పనులకు ఎంపీ నిధుల నుంచి రూ.11 కోట్లు కేటాయించానని చెప్పారు. తెలంగాణలో గోదావరి ఉన్నప్పటికీ తాను నటించిన రాజమండ్రివద్ద గోదావరిని మరోసారి చూడాలనే తలంపుతో ఇక్కడకు వచ్చానన్నారు. -
‘వేతన బకాయిలను తీసుకోండి’
హైదరాబాద్: ఓయూలో పని చేసి 1996 నుంచి 2013 వరకు ఉద్యోగ విరమణ చేసిన అధ్యాపకులు వేతన బకాయిలను తీసుకోవాలని రిజిస్ట్రార్ ప్రొ.సురేశ్ కుమార్ కోరారు. సీనియర్ సినీనటి జమున భర్త దివంగత ప్రొ.జూలూరి రమణరావుకు రావాల్సిన వేతన బకాయి రూ. 11.87 లక్షల చెక్‌ను రిజిస్ట్రార్ మంగళవారం తన కార్యాలయంలో జమునకు అందజేశారు. ఆమెతో పాటు ప్రొ.బిలిలోలికర్సింగ్ రూ.12 లక్షల చెక్‌ను అందుకున్నారు. -
మంత్రి గారింటి మహాలక్ష్మి బడ్జెట్
కేంద్ర బడ్జెట్ పద్దులు తెలిసిపోయాయి. ఇక మిగిలింది రెండు తెలుగు రాష్ట్రాల బడ్జెట్లే! తెలంగాణలో ఆ భారమంతా ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్‌కి వదిలేసి, వాళ్లింట్లో ఆర్థిక వ్యవహారాలను చక్కబెట్టే ఆయన సతీమణి జమునా రాజేందర్‌ను కదిలిద్దాం. ఇంటి పద్దులను ఆమె ఎలా ప్లాన్ చేసుకుంటారు? గృహిణిగా, వ్యాపారవేత్తగా... ఆర్థిక సమస్యల్ని, సంక్షోభాలను ఎలా పరిష్కరించుకుంటారు? అసలు ఆమె నిర్వహణ ఎలా ఉంటుంది? ఈ విషయాలన్నీ ఈటెల వారి ఇంటి ఫైనాన్స్ మినిష్టర్ మాటల్లోనే తెలుసుకుందాం. మాది ప్రేమ వివాహం కావడంతో అటు నుంచి, ఇటు నుంచి, ఎటు నుంచీ ఆసరా లేదు. కాబట్టి ఆర్థికంగా నిలదొక్కుకోవాలని అప్పుడే నిర్ణయించుకున్నాం. మా లక్ష్యమూ అదే! దానికనుగుణంగానే మా జీవన శైలిని మలచుకున్నాం. మా ఇంటి బడ్జెట్టూ అట్లాగే ఉండేది.. ఉంటోంది.. ఉంటుంది కూడా! గృహ నిర్వహణ, వ్యాపార నిర్వహణ రెండూ ఒకేసారి నేర్చుకున్నా. 1 అవసరాలకే ప్రాధాన్యం ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నామంటే కారణం కచ్చితమైన ప్రణాళిక. మొదట్లో డబ్బుకి చాలా ఇబ్బందిగా ఉండేది. ఆ సమయంలోనే వ్యాపార అభివృద్ధి గురించి రకరకాల ఆలోచనలుండేవి ఆయనకు. ఇంట్లో ఏ లోటూ రాకుండా చూసుకోవాలి, అదే సమయంలో వ్యాపారంలో ఆయనకు నైతిక మద్దతుగా ఉండాలి. ఈ రెండింటినీ సమన్వయం చేసుకోవాలంటే కచ్చితమైన ప్రణాళిక ఉండాలి కదా. అందుకే విలాసాలకన్నా, అవసరాలకే ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చేదాన్ని. బంగారు నగలు కావాలని నేనెప్పుడూ పట్టుబట్టలేదు. ఇప్పటికీ ఆభరణాల మీద ఆసక్తి తక్కువే. నిశ్చలంగా ఉండిపోయే వేటి మీదా డబ్బు మదుపు చేయడం నాకు ఇష్టం ఉండదు. ఇంట్లో అయినా, వ్యాపారంలో అయినా ఇదే సూత్రం ఫాలో అవుతాను. అలాగే అవసరాలకు తగ్గట్టు డబ్బు సర్దుబాటు కానప్పుడు డబ్బుకు తగ్గట్టే అవసరాల ప్రాధాన్యతా క్రమాన్ని నిర్ణయించుకుంటాను. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు (ఇప్పుడు అబ్బాయి నితిన్ బీబీఏ గ్రాడ్యుయేట్, అమ్మాయి నేహ మెడికో) డబ్బు ఇబ్బంది ఉంటే వాళ్ల పుట్టినరోజులకు పదిమందిని పిలిచి ఘనంగా వేడుక చేసేవాళ్లం కాదు. చక్కగా ఇంట్లోవాళ్ల మధ్యే కేక్ కట్ చేయించి, ఆనందాన్ని పంచుకునేవాళ్లం. అలాగే ఇప్పటికీ హోటళ్లలో పార్టీలంటే అంతా దూరంగా ఉంటాం. ఎంతమంది వచ్చినా ఇంటికే పిలిచి వాళ్లకు నచ్చిన వంటలను వండి వడ్డిస్తాను. దీని వల్ల ఇటు ఆరోగ్యం, అటు పొదుపు! అంతేకాదు, ఇంటికి వచ్చిన అతిథులూ తమకు సాదర గౌరవం దొరికిందని ఫీలవుతారు. వండి పెట్టడమనే శ్రమను ఓర్చుకుంటే ఇంత ఆనందాన్ని సొంతం చేసుకోవచ్చు. 2. చదువు, ఆరోగ్యాల కోసం.. మాకు వచ్చే ఆదాయంలో పిల్లల చదువు, ఆరోగ్యం, అత్యవసర ఖర్చులకు ఎప్పుడూ వాటా ఉండేది. ఆదాయంలో చదువుకి కచ్చితంగా ఐదు శాతం పక్కన పెట్టేదాన్ని. అరోగ్యం, ఇతర అత్యవసర ఖర్చులకూ ఐదు శాతానికి అటూ ఇటూగా దాచేదాన్ని. వీటిని మినహాయించిన తర్వాత మిగిలే డబ్బులనే ఇతర అవసరాలకు వాడేదాన్ని. ఇంటికి సంబంధించిన అవసరాలకు మించి దేనిమీద ఖర్చుపెట్టినా వృథాగానే భావిస్తాన్నేను. అందుకే షాపింగ్లాంటి అలవాట్లకు చాలా దూరంగా ఉంటాను. మా పిల్లలకూ అదే నేర్పాను. చిన్నప్పటి నుంచి మా వ్యాపార విషయాలను, ఆర్థిక వ్యవహారాలను, దానికనుగుణంగా ఉన్న మా జీవనశైలిని వాళ్లకు కథల రూపంలో చెప్పేదాన్ని. దీనివల్ల మా ఇంటి పరిస్థితులను వాళ్లు చాలా తేలిగ్గా అర్థం చేసుకున్నారు. అందుకే ఎప్పుడైనా వాళ్లు ఏదైనా కావాలి అని అడిగినప్పుడు నేను వద్దు అంటే మారాం చేయకుండా ఊరుకునేవారు. ఎందుకు వద్దంటున్నానో అర్థంచేసుకునేవాళ్లు. అలా వాళ్లూ చిన్నప్పటి నుంచే డబ్బు విలువని తెలుసుకున్నారు. పాకెట్ మనీని వేస్ట్ చేసేవాళ్లు కాదు. 3 అప్పు ఇంటికి చేటు... ఇంటికి, వ్యాపారానికి సంబంధించి గడ్డు రోజుల్ని కూడా చూశాం. కానీ ఎప్పుడూ డీలా పడలేదు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఈ పరిస్థితి ఎప్పుడూ ఇలాగే ఉండదు అనే నమ్మకం ఉండేది. డబ్బు బాగా ఉన్నప్పుడు కూడా సంయమన శక్తి ఉండేది. ఈ రెండింటినీ మావారి నుంచే నేర్చుకున్నాను. ఒక విషయాన్ని మాత్రం కచ్చితంగా ఫాలో అయ్యాను. ఇంటికి సంబంధించి ‘అప్పు’ అనే ఊబిలో ఎప్పుడూ పడలేదు. ఇంటి అవసరాల కోసం అప్పు చేయడమనే తప్పు నేనెప్పుడూ చేయలేదు. ఉన్నదాంట్లోనే సర్దుకుపోవడమంత ఉత్తమం ఇంకోటి లేదు. ఒక్కసారి అప్పు చేస్తే అది అలవాటుగా మారుతుంది. ఇంటి బడ్జెట్ మిగులు లేకపోయినా పరవాలేదు కానీ లోటులో పడకూడదని అంటాను. అప్పులు ఆ లోటును పెంచుతాయి. అందుకే ఎవరమైనా అప్పులకు సాధ్యమైనంత దూరంలో ఉండాలి. అయితే వ్యాపారానికి ఈ సూత్రాన్ని కొంచెం మార్చుకోవచ్చు. బిజినెస్‌లో అప్పుతోనే అభివృద్ధి. అదీ ఎప్పుడు, ఎంత అనే విషయాల మీద ఆధారపడి ఉంటుంది. చేస్తున్న వ్యాపారం ఇంకా పుంజుకునే అవకాశం ఉండీ సరిపడా డబ్బులేనప్పుడు అప్పు చేసయినా దాన్ని నిలబెట్టుకోవాలి. అదీ మన దగ్గర 70 శాతం పెట్టుబడి ఉన్నప్పుడు మిగిలిన 30 శాతాన్ని అప్పుతెచ్చుకోవచ్చు. ఈ 30 శాతాన్ని అత్యవసర పరిస్థితుల్లో 50 శాతానికి పెంచుకోవచ్చు. అంతే.. అంతకంటే ఎక్కువ అప్పు చేసి వ్యాపారంలో పెట్టినా వృథానే! 4. డెడ్ ఇన్వెస్ట్మెంట్.. ఇందాక చెప్పినట్టు కదలని మెదలని వాటిమీద మేమెప్పుడూ డబ్బుని మదుపు చేయలేదు. వ్యాపారంలో వచ్చిన లాభాన్ని భూమ్మీద ఇన్వెస్ట్ చేశాం. ఉన్న వ్యాపారాన్నే అభివృద్ధి చేసుకునేందుకు ఖర్చుపెట్టాం. అంతే తప్ప ఇంటి నిర్మాణం కోసమైతే పెట్టలేదు. పిల్లలకు ఐదారేళ్లు వచ్చేటప్పటికే కారు కొనుక్కున్నాం కానీ ఇల్లు కట్టుకోలేదు. కారు ఖర్చు కాదా అంటారేమో.. కానీ ఆ ఖర్చుని టైమ్‌తో లెక్కేసుకున్నప్పుడు ఆ పెట్టుబడి వృథా కాదు. ఎందుకంటే అప్పుడు మాకు టైమ్ చాలా ముఖ్యం. ఇంటి నిర్మాణం మీద డబ్బు పెట్టడమనేది నా దృష్టిలో డెడ్ ఇన్వెస్ట్మెంట్ కిందే లెక్క. ఇప్పుడు పిల్లలు పెళ్లీడుకొచ్చారు అని ఈ మధ్యే ప్లాన్ చేసి ఇల్లు మొదలుపెట్టాం. నేను చెప్పేది ఒకటే.. గృహిణి గుడ్ మేనేజర్. ఇంట్లో లేమి భర్తకు కూడా తెలియకుండా నెట్టుకొస్తుందంటే ఆమె ఎంత గొప్ప మేనేజర్ అయి ఉంటుంది! బయటకి వెళ్లి సంపాదించే అవకాశం లేకపోయినా ఇంట్లో ఖర్చులను నియంత్రించుకుంటూ ఉంటే చాలు.. అది ఆదాయం కిందే! ఆ నైపుణ్యం స్త్రీ సొంతం. చదువుకున్న మహిళలు హోమ్ ట్యూషన్స్ చెప్పుకోవచ్చు. వీలుకాకపోతే తమ పిల్లలకు చెబితే.. ట్యూషన్ ఖర్చు ఆదా అయినట్టే కదా. కుట్టుపనిలో ఆసక్తి ఉన్నవాళ్లు బ్లవుజులు కుట్టొచ్చు. బయటివాళ్లకు కుట్టడం ఇష్టంలేకపోతే ఇంట్లోవాళ్లవే కుట్టొచ్చు. అదీ ఆదా కిందే జమ అవుతుంది. ఇంట్లో ఉన్న కొద్ది స్థలంలోనే కూరగాయల మొక్కలేసుకోవచ్చు. ఇంటిల్లిపాదికీ తాజా కూరల భోజనమూ దొరుకుతుంది.. కూరగాయల ఖర్చూ మిగులుతుంది. ఆలోచిస్తే మార్గాలెన్నో.. మనసు లగ్నం చేస్తే చాలు! మన బడ్జెట్ ఎప్పుడూ మిగులే! -
తారా కారు!
సినీ వినీలాకాశంలో ఒక వెలుగు వెలిగిన కాలంలో తారలు వాడిన కార్లు ఇవి. ప్రస్తుతం గ్యారేజీలకు మాత్రమే పరిమితమైన ఈ వాహనాలు అలనాటి తారావైభవానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. * ఈ షెవర్లే కారులోనే అలనాటి అందాల తార జమున అప్పట్లో షికారు చేసేవారు. ఇప్పుడిది వాడుకలో లేదు. అయినా ఈ వాహనంపై జమునకు ప్రత్యేకమైన అభిమానం. అందుకే, ఇప్పటికీ దానిని అమూల్యంగా చూసుకుంటున్నారు. * ఇక ఈ అంబాసిడర్ కారు ‘అన్నగారు’ ఎన్టీఆర్ వాడినది. తాతగారి జ్ఞాపకంగా కళ్యాణ్‌రామ్ తన ఇంట్లో దీనిని అపురూపంగా భద్రపరచుకున్నారు. * టొయోటా కారేమో మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ తొలినాళ్లలో ముచ్చటపడి కొనుక్కున్న వాహనం. దీనికి ఏరికోరి ఫ్యాన్సీ నంబర్ ‘1’ ఎంచుకున్నారు. దానికి తగ్గట్టే చిరంజీవి కూడా అనతికాలంలోనే టాలీవుడ్లో నంబర్ 1 స్థానానికి ఎదిగారు. -
గంగ, జమున...మిస్టర్ ఇండియా!
-
గంగ, జమున...మిస్టర్ ఇండియా!
వారిద్దరూ తమ జీవితంలో ఎన్నో కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అవిభక్త కవలలు, అసహజ రూపం కావటంతో అనేక అవమానాలు, ఛీత్కారాలు చవిచూశారు. దేవుడి శాపం వల్లే ఇలా నాలుగు చేతులు, మూడు కాళ్లు, ఒకే ఉదరంతో జన్మించారని కన్నవాళ్లు కూడా వదిలేశారు. దీంతో పొట్ట కూటికోసం ఓ ట్రావెలింగ్ సర్కస్‌లో చేరారు. 45 ఏళ్లు వచ్చేవరకు ఏ తోడూ లేకండా ఒంటరిగానే గడిపారు. కానీ, ఏడు నెలల క్రితం ఓ రోజు ఇద్దరూ ప్రేమలో పడ్డారు. స్కూల్ టీచర్‌గా పనిచేస్తున్న జసీముద్దీన్ అహ్మద్ ను చూడగానే ఇద్దరూ మనసు మనసు పారేసుకున్నారు. ఇద్దరి పరిస్థితిని చూసిన అహ్మద్ కూడా చలించిపోయాడు. వారికి అండగా నిలవాలని నిర్ణయం తీసుకున్నాడు. అప్పటి నుంచి ముగ్గురూ కలిసే ఉంటున్నారు. అహ్మద్ కూడా అదే సర్కస్ కంపెనీలో సౌండ్ ఇంజనీర్‌గా పార్ట్‌టైం జాబ్‌లో చేరాడు. గంగ, జమునలు ప్రస్తుతం ఎంతో సంతోషంగా ఉన్నారు. అహ్మద్ చాలా మంచి వ్యక్తి అని, తమను ఎంతో బాగా చూసుకుంటున్నాడని, అతడిని తాము మిస్టర్ ఇండియా అని పిలుస్తామని గంగ వెల్లడించింది. జీవితాంతం అతడి అండ ఉంటే, ఇక తమకు ఏమీ అక్కర్లేదని చెబుతోంది. ప్రస్తుతం తాము చాలా సంతోషంగా ఉన్నామని ఈ అవిభక్త కవలలు చెబుతున్నారు. అహ్మద్ కూడా వారిని ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడని చెబుతున్నారు. వారి బాధలు తన బాధలుగా భావిస్తూ అన్నింటా అండగా నిలబడుతున్నాడని గంగ, జమునా మురిసిపోతున్నారు. -
‘తూర్పు’న తారల తళుకులు
ఎన్నికల రణరంగంలో సినీ తారల తళుకులు తూర్పు గోదావరి జిల్లా రాజకీయ చరి త్రకు ఓ ప్రత్యేకతను సంతరించి పెడుతున్నాయి. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పోటీ చేసి, విజయాన్ని సొంతం చేసుకున్న తారలు ఉన్నారు. గోదావరి వాసులు కళాకారులను ఆదరిస్తారనడానికి ఆ విజయాలే తార్కాణం. కాగా ఇక్కడి నుంచి బరిలో నిలిచి అదష్టాన్ని పరీక్షించుకోవాలని ఆశ పడ్డ వారిలో నిరాశే మిగిలిన వారూ ఉన్నారు. గతంలో జరిగిన ఎన్నికల్లో జిల్లాలోని వివిధ నియోజక వర్గాల నుంచి బరిలో ఉండి గెలిచిన వారు, ఓడిన వారు, అదష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్న వారి వివరాలు జమున సినీ తారల తళుకు బెళుకులతో సీట్లు సాధించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ 1989 ఎన్నికల్లో రాజమండ్రి పార్లమెంటు స్థానం నుంచి ప్రముఖ నటి జూలూరి జమునను బరిలోకి దింపింది. ఆ ఎన్నికల్లో విజయం సాధించిన జమున 1989 నుంచి 1991 వరకూ ఎంపీగా కొనసాగారు. 1991లో పోటీచేసి ఓడిపోయారు. కృష్ణంరాజు పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరుకు చెందిన కృష్ణంరాజు బీజేపీ నుంచి 1998లో కాకినాడ ఎంపీగా గెలిచి, విదేశీ వ్యవహారాల సహాయమంత్రిగా కొనసాగారు. 1999లో ఓడిపోయారు. 2004లో నర్సాపురం నుంచి ఎంపీగా నెగ్గారు. 2009లో పీఆర్పీ తరఫున రాజమండ్రి ఎంపీగా పోటీ పడి ఓడిపోయారు. మురళీమోహన్ రాజమండ్రి లోక్‌సభ స్థానానికి మురళీమోహన్ స్థానికుడు కాకపోయినా 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ను సినీ గ్లామర్‌తో ఎదుర్కోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయనను అభ్యర్థిగా నిలుపగా ఓటమి పాలయ్యారు. 2014 ఎన్నికల్లో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నారు. జయప్రద పై నటులందరూ స్థానికేతరులుగా ఉండి ఈ ప్రాంతంలో బరిలో నిలిచారు. కానీ రాజమండ్రి ఆడపడుచు జయప్రద మరో రాష్ట్రంలో ఎన్నికల గోదాలో దిగి విజయాలు సాధించారు. 1962లో రాజమండ్రిలో పుట్టిన జయప్రద చిన్ననాడే నగరం వదిలి వెళ్లి పోయారు. 1994లో టీడీపీలో చేరిన జయప్రద ఎన్టీఆర్ మరణానంతరం పార్టీని వీడారు. తర్వాత ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాంపూర్ పార్లమెంటు నియోజక వర్గం నుంచి 2004, 2009 ఎన్నికల్లో విజయం సాధించారు. అక్కడ వ్యక్తిగత, రాజకీయపరమైన ప్రతిష్టను దెబ్బతీసే విధంగా పలు విమర్శలు ముప్పిరిగొన్నా తట్టుకుని నిలబడ్డారు. బాబూమోహన్ ఎన్టీఆర్ టీడీపీ స్థాపించిన తర్వాత పార్టీలో చేరి మెదక్ జిల్లా ఆంధోల్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ప్రముఖ హాస్యనటుడు బాబూమోహన్ ఎన్టీఆర్ మరణానంతరం లక్ష్మీ పార్వతి నాయకత్వంలోని ఎన్టీఆర్ టీడీపీలో చేరారు. 1996 ఎన్నికల్లో అమలాపురం ఎస్సీ రిజర్వుడు స్థానం నుంచి పార్లమెంటు స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో టీడీపీ ఓట్లు చీల్చి, ఆ పార్టీ అభ్యర్థి బాలయోగి పరాజయానికి కారకులయ్యారని ప్రచారం సాగింది. బాబూమోహన్ 1.43 లక్షల ఓట్లు పొంది మూడోస్థానంలో నిలిచారు. 1998లో ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలోనూ పోటీ చేసిన బాబూ మోహన్ అప్పుడూ ఓటమినే చవి చూశారు. హేమ సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి హేమ ఈ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. విభిన్న పాత్రలతో ప్రేక్షకులను మెప్పించిన ఆమె పొలిటికల్ పాత్రలోకి ప్రవేశిస్తున్నారు. తన సొంత జిల్లా తూర్పుగోదావరి నుంచి జై సమైక్యాంధ్ర పార్టీ తరపున ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఈ ఎన్నికల్లో మండపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి హేమ పోటీ చేస్తున్నారు. -
నన్ను పెళ్లికూతురిని చేసింది సావిత్రే
హైదరాబాద్: తనను పెళ్లి కూతురిగా అలంకరించింది మహానటి సావిత్రి అక్కేనని ప్రముఖ సినీనటి జమున గుర్తు చేసుకున్నారు. సావిత్రి పేరుతో ఏర్పాటు చేసిన అవార్డును అందుకునే మొదటి అర్హత తనకే ఉందన్నారు. శ్రుతిలయ ఆర్ట్స్ అకాడమి ఆధ్వర్యంలో గురువారం రాత్రి రవీద్రభారతిలో ప్రజానటి జమునను ‘మహానటి సావిత్రి ఆత్మీయ పురస్కారం’తో సత్కరించారు. ఈ సందర్భంగా జమున మాట్లాడుతూ.. జీవితం మన చేతుల్లో లేదని, ఎలా కలుస్తామో.. ఎలా విడిపోతామో తెలియదన్నారు. సావిత్రి సమస్యల వలయంలోకి చిక్కుకోవటం బాధాకరమన్నారు. ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు మాట్లాడుతూ.. రవీంద్రభారతి అద్దె పెంపుపై కళా సంస్థల నిర్వాహకులు కలిసివస్తే సీఎంతో మాట్లాడించి తగ్గించే ప్రయత్నం చేస్తానన్నారు. రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్ పి.విజయబాబు మాట్లాడుతూ అభినయానికి నిదర్శనం సావిత్రి, జమునలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సమాజ్‌వాది పార్టీ మహిళా అధ్యక్షురాలు జి.నాగలక్ష్మికి ‘సేవా శిరోమణి పురస్కారం’ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆమని పాడిన పాటలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో శృతిలయ చైర్మన్ ఆర్.ఎన్.సింగ్, వ్యవస్థాపక కార్యదర్శి ఆమని తదితరులు పాల్గొన్నారు. -
ప్రియనేస్తాలు...
అపురూపం సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా అందరికీ పెంపుడు జంతువులంటే ఇష్టం! ముఖ్యంగా కుక్కలన్నా, వాటి పెంపకమన్నా ఎంతో ఇష్టం. ఎందుకంటే... అవి ఇంటిలో ఉంటే ఓ అందం సందడిగా తిరుగుతుంటే ఇల్లు కళ కళ! వాటి పెంపకం ఓ స్టేటస్ సింబల్! అన్నింటికీ మించి విశ్వాసానికి కేరాఫ్ అడ్రస్! నాటి నుండి నేటి వరకు సెలబ్రెటీలకు పెంపుడు జంతువులు ఓ ప్రియనేస్తాలు! కారణం తమ డబ్బు, కీర్తి, స్టేటస్ వారికి అవసరం లేదు గనుక! అందుకే ఉన్న కాస్త ఖాళీ టైమ్‌లో పెంపుడు జంతువులతో కాలక్షేపం చేయటానికి ఇష్టపడతారు మన సెలబ్రిటీలు. అందానికి పొమరేనియన్లు, స్టేటకి, కాపలాకి ఆల్సెషన్లు, డాబర్మెన్లు, ఇంకా రకరకాల పెంపుడు జంతువులను పెంచిన, పెంచుతున్న సెలబ్రిటీలు ఎందరో! నాటి సినీనటి జమున ఇంట్లో ఇప్పటికీ ఓ అరడజను కుక్కలుండాల్సిందే. వాటిని తమ సొంతబిడ్డల్లా చూసుకుంటారామె! ఆ రోజుల్లో తను పెంచుతున్న పొమరేనియన్ కుక్కలతో జమున దిగిన స్టిల్ చూడండి. అలాగే ఠీవికి మారుపేరైన ఎస్.వి.రంగారావు చెంత అంతే ఠీవిగా కూర్చుని ఉన్న ఆల్సెషన్ కనిపిస్తుంది. ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తాను సినీనటిగా ఉన్న రోజుల్లో తన పెంపుడు పొమరేనియన్తో ఆడుకుంటున్న దృశ్యాన్నీ వీక్షించండి. ఈ ప్రియనేస్తాలకు ఎన్నో ముద్దుపేర్లు పెడతాం. అవి బాధపడితే మనం బాధపడతాం. అవి చనిపోతే అయినవాళ్లు పోయినంత దుఃఖిస్తాం. ఎందుకంటే... అవి ప్రేమను చూపిస్తాయి. విశ్వాసంగా ఉంటాయి. ఎదురు చెప్పవు. ఎదురు తిరగవు. చెప్పిన మాట వింటాయి. చెప్పుడు మాటలు వినవు. ఒక్క మాటలో చెప్పాలంటే... మనకోసం జీవిస్తాయి! చనిపోయినా మనలోనే జీవిస్తాయి!! నిర్వహణ: సంజయ్ కిషోర్ -
పోలీసు కస్టడీకి సీపీఎం నేతలు
సాక్షి, నిజామాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఇందల్వాయి ఎఫ్ఆర్ఓ (ఫారెస్టు రేంజ్ అధికారి) రొడ్డ గంగయ్య హత్య కేసు దర్యాప్తులో ఓ అడుగు ముందుకు పడింది. కోర్టులో లొంగిపోయిన నిందితుడు సీపీఎం జిల్లా కార్యదర్శి పెద్ది వెంకట్రాములు, ఆ పార్టీ మహిళా నాయకురాలు జమునను పోలీసులు రెండురోజుల కస్టడీకి తీసుకున్నారు. వీరిని ప్రశ్నిం చేందుకు పది రోజులు కస్టడీకి ఇవ్వాలని జిల్లా రెండో అదనపు మేజిస్ట్రేట్ కోర్టుకు విజ్ఞప్తి చేయగా, కోర్టు రెండు రోజుల కస్టడీకి అనుమతించింది. గత నెల 15న అటవీ భూ ఆక్రమణదారుల చేతుల్లో గంగయ్య దారుణ హత్యకు గురయ్యారు. పథకం ప్రకారం ఆయనను కిరాతకంగా దాడి చేసి హతమార్చారు. ఈ ఘటనను రాష్ట్ర సర్కారు తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటనలో మొత్తం 36 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇందులో 33 మందిని అరెస్టు చేసిన పోలీసులు పెద్ది వెంకట్రాములుతో పాటు, జమున పరారీలో ఉన్నారని ప్రకటించారు. ఎట్టకేలకు వీరిద్దరు నెల రోజుల అనంతరం ఈనెల 15న కోర్టులో లొంగిపోయారు. కోర్టు 15 రోజుల జుడీషియల్ కస్టడీకి ఆదేశించినట్లు వీరిని జిల్లా జైలుకు తరలించారు. సోమవా రం జిల్లా పోలీసులు కస్టడీలోకి తీసుకున్నా రు. ఇంకా ఈ కేసులో ట్రాక్టర్ డ్రైవర్ రాజు పరారీలోనే ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. రాజు మినహా ఈ దారుణ ఘట నలో ప్రమేయం ఉన్న పాత్రదారులందరిని అరెస్టు చేసిన పోలీసులు.. సూత్ర దారులెవరో గుర్తించే పనిలో పడ్డారు. హత్యకు పథ క రచన చేసిందెవరో పరిశోధిస్తున్నారు. పెద్ది వెంకట్రాములు, జమునను అన్ని కోణాల్లో ప్రశ్నిస్తామని ఎస్పీ కేవీ మోహన్రావ్ ‘సాక్షి’తో పేర్కొన్నారు. వారి స్టేట్మెంట్ను రికార్డు చేస్తామన్నారు. ఇంకా అందని పోస్టుమార్టం రిపోర్టు గంగయ్య హత్య కేసుకు సంబంధించి వైద్యులు ఇచ్చే పోస్టుమార్టం నివేదిక ఇంకా తమకు అందలేదని కేసు దర్యాప్తు అధికారి, నిజామాబాద్ డీఎస్పీ అనిల్‌కుమార్ తెలి పారు. మరణించిన గంగయ్యతో పాటు, స్వల్ప గాయాలపాలైన మరో ఆరుగురు అటవీశాఖ సిబ్బందికి సంబంధించిన పోస్టుమార్టం నివేదిక కూడా పోలీసులకు అందాల్సి ఉంది. హత్యకు వినియోగించిన గొడ్డలి, కర్ర తదితర ఆయుధాలను స్వాధీ నం చేసుకున్న పోలీసులు వాటిని ఫొరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. -
సినిమా పరిశ్రమ కొనఊపిరితో ఉంది!
నవ్వు అనేక రోగాలను దూరం చేసే మంచి టానిక్. కామెడీ రూపంలో ఆ టానిక్ని ప్రేక్షకులకు అందిస్తున్న ధర్మవరపు సుబ్రహ్మణ్యంని ‘నవ్వుల డాక్టర్’ అంటే అతిశయోక్తి కాదు. హాస్య నటుడిగా, కేరక్టర్ నటుడిగా ఆయన స్కోర్ ఏడువందల యాభై సినిమాలు. ఇక, ఆయన వ్యక్తిగత స్కోర్‌కి వస్తే... నేటితో 60వ పడిలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా ధర్మవరపుతో ‘సాక్షి’ జరిపిన ఇంటర్వ్యూ... *** 60 ఏళ్ల ఈ జీవన ప్రయాణం మీకెలా అనిపిస్తోంది? వ్యక్తిగతంగానే కాదు... వృత్తిపరమైన ప్రయాణం కూడా సంతృప్తికరంగానే ఉంది. *** 750 చిత్రాల్లో నటించారు కదా.. ఇంకా ఫలానా పాత్ర చేయాలనే కోరికేమైనా ఉందా? తీరని కోరికలు తీరే సమయం కాదిది. సినిమా పరిశ్రమ ఊహకందని వేగంగా వెళుతోంది. రేపు ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావడంలేదు. ఇలాంటి పరిస్థితిలో ఫలానాది చేయాలనే కోరికలు పెట్టుకోవడం సరికాదు. *** పరభాషల నటీనటులను తెలుగుకి తీసుకురావడం పట్ల మీ అభిప్రాయం? కచ్చితంగా బాధాకరమే. నాలాంటి ఓ ఆరేడు మందికి అవకాశాలకు కొదవ లేదు. కానీ, అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్నవారి సంఖ్య చాలానే ఉంది. అలాంటప్పుడు మనవాళ్లకి అవకాశం కల్పించకుండా ఎక్కడో బాలీవుడ్ నుంచో మరో భాష నుంచో తారలను తీసుకురావడం ఎంతవరకు సమంజసం? కళకు భాషతో సంబంధం లేకపోయినా ఇతర భాషలవాళ్లు ఇక్కడికి రావడంవల్ల మనవాళ్లు ఇబ్బందులకు లోనవుతున్నారు కదా. ఇప్పుడసలు హీరోయిన్ అంటే.. మన తెలుగమ్మాయి ఎక్కడ కనిపిస్తోంది. అంతా బాలీవుడ్వాళ్లే. అంజలీదేవి, జమునలాంటి నటీమణులు జనహృదయాల్లో నిలిచిపోయారు. ఇప్పటి హీరోయిన్లు ఎప్పటికీ మనసుల్లో నిలవరు. *** పరభాషల నుంచి మీకు అవకాశాలు వచ్చినప్పుడు చేశారు కదా? రెండు, మూడు తమిళ చిత్రాల్లోనూ రెండు కన్నడ సినిమాల్లోనూ చేశాను. అది కూడా పెద్ద దర్శకులు అడగడంతో చేశాను. మనకి ఇక్కడ బాగున్నప్పుడు అంత దూరం వెళ్లి సినిమాలు చేయాల్సిన అవసరం ఏంటి? అనిపించింది. *** రాష్ర్టంలో నెలకొన్న రాజకీయాల కారణంగా ఫ్యూచర్లో సినిమా పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుందేమో... సినిమా అనేది మంచి వినోద సాధనం. దానిపై రాజకీయాల ప్రభావం పడటం బాధ కలిగించే విషయం. నిర్మాతలు, పంపిణీదారులు.. ఇలా చాలామంది నష్టాలపాలవుతున్నారు. ఆస్తులు అమ్ముకుంటున్నారు. అసలే జయాపజయాలతో పరిశ్రమ కుంటుతోంది. కుంటుతూ నడుస్తున్న పరిశ్రమపై ఉద్యమాలు పడుతున్నాయి. ఈ కారణంగా పరిశ్రమ కొన ఊపిరితో ఉందనిపిస్తోంది. భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉంది. *** గతంలో ‘తోకలేని పిట్ట’ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆ తర్వాత మళ్లీ డెరైక్షన్ చేయకపోవడానికి కారణం? ఆ సినిమా అనుకున్నంత విజయాన్ని సాధించలేదు. ఒక సినిమాకి దర్శకత్వం వహిస్తే, నటుడిగా పది సినిమాలు వదులుకోవాల్సి వచ్చింది. అవి వదులుకోవడం ఇష్టం లేక డెరైక్షన్ వదిలేశా. *** ప్రస్తుతం మీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ఆ మధ్య కాస్త అనారోగ్యంపాలయ్యాను. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నా. రెండు నెలల్లో పూర్తిగా కోలుకుంటా. *** ‘సాక్షి’ టీవీకి ‘డిండ్ డాంగ్’ షో చేస్తున్నారు కదా? అది చాలా ఇష్టపడి చేస్తున్న ప్రోగ్రామ్. అప్పట్లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డిగారు ‘గో ఎ హెడ్’ అన్నారు. ఎవర్నీ కించపరచకుండా అందర్నీ హాయిగా నవ్వించే కార్యక్రమం ఇది. జాతీయ స్థాయిలో బెస్ట్ న్యూస్ ప్రోగ్రామ్‌గా అవార్డులొచ్చాయి. అందుకే ఆ ప్రోగ్రామ్ చేస్తున్నాను. రోజు రోజుకీ ‘డింగ్ డాంగ్’ మీద ఇంకా మోజు పెరుగుతోంది. -
తెలుగు సినిమా ప్రగతి
తన కెరీర్లో రాసిన పలు వ్యాసాలన్నింటినీ కలిపి సినీ పాత్రికేయుడు భగీరథ రూపొందిన గ్రంథం ‘తెలుగు సినిమా ప్రగతి’. వందేళ్ల భారతీయ సినిమా సంబరాలను పురస్కరించుకొని హైదరాబాద్‌లో సినీ ప్రముఖుల సమక్షంలో ఆయన ఈ పుస్తకాన్ని ఆవిష్కరింపజేశారు. సీనియర్ నటి జమున తొలి పుస్తకాన్ని ఆవిష్కరించి నిర్మాత వి.బి.రాజేంద్రప్రసాద్‌కి అందించారు. వీరితో పాటు డా.డి.రామానాయుడు, కె.వి.రమణాచారి, డా.ఎస్.వరదాచారి, అల్లాణి శ్రీధర్ ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరై భగీరథ ప్రయత్నాన్ని అభినందించారు. భగీరథ మాట్లాడుతూ -‘‘నేను రాసిన వ్యాసాల్లో ముఖ్యమైన వాటిని ఎంపిక చేసి, ప్రస్తుత చిత్రపరిశ్రమ స్థితిగతుల్ని ప్రస్తావిస్తూ ఈ పుస్తకాన్ని రూపొందించాను. సినిమాపై నాకున్న అపారమైన అభిమానమే ఈ పుస్తకం రచనకు ప్రేరణ’’ అన్నారు. -
పదకొండు భాషల తారలతో సంతోషంగా అవార్డుల వేడుక
11 భాషలకు చెందిన సినీ ప్రముఖుల ఆగమనంతో హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియం కళకళలాడింది. ‘సంతోషం’ సినీ వారపత్రిక 11వ వార్షికోత్సవ వేడుక ఈ తారల ఆగమనానికి వేదిక అయ్యింది. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ‘సంతోషం ఫిలిం అవార్డు వేడుక’ను ఆ పత్రిక సంపాదకుడు, నిర్మాత సురేష్ కొండేటి ఘనంగా నిర్వహించారు. రెండేళ్ల క్రితం వరకూ తెలుగు సినిమాకే పరిమితమైన ఈ అవార్డు వేడుకను... గత ఏడాదితో దక్షిణభారతానికి చెందిన అన్ని భాషలకూ విస్తరింపజేశారు సురేష్. అయితే... ఈ ఏడాది అంతకంటే ఘనంగా... దేశంలోని 11 భాషల చిత్రాలకు ఈ అవార్డులను అందించారు సురేష్. 2012వ సంవత్సరానికి సంబంధించిన ఈ అవార్డు వేడుకలో తెలుగు సినిమాకు గాను ఉత్తమనటునిగా మహేష్‌బాబు (బిజినెస్‌మేన్), ఉత్తమనటిగా సమంత(ఈగ) అవార్డులను గెలుచుకున్నారు. ఇంకా వివిధ భాషల్లోని పలువురు సినీ ప్రముఖులకు సంతోషం అవార్డులు వరించాయి. దాసరి నారాయణరావు, డి.రామానాయుడు, కృష్ణ, కృష్ణంరాజు, జమున, వాణిశ్రీ, విజయనిర్మల, జయంతి, వెంకటేష్, రవిచంద్రన్, డా.రాజేంద్రప్రసాద్, రామ్‌చరణ్, రానా, ఆర్.నారాయణమూర్తి, గీతాంజలి, రోజారమణి, రావు బాలసరస్వతి, తార, మమతామోహన్‌దాస్, హన్సిక, నిఖిషాపటేల్ తదితర సినీ ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు. చార్మి, అక్ష, రేష్మ, అభినయల నాట్యం ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలువగా... కృష్ణంరాజు, వాణిశ్రీ కూడా ఈ వేడుకపై కలిసి స్టెప్పులేయడం విశేషం. -
గీత స్మరణం
పల్లవి : అతడు: నా సరి నీవని నీ గురి నేనని ఇపుడే తెలిసెనులే తెలిసినదేమో తలచినకొలదీ పులకలు కలిగెనులే ఆమె: నీకూ నాకూ వ్రాసివున్నదని ఎపుడో తెలిసెనులే తెలిసినదేమో తలచినకొలదీ కలవరమాయెనులే ॥ చరణం : 1 అ: నా హృదయమునే వీణజేసుకొని ప్రేమను గానము చేతువనీ (2) నా గానము నా చెవి సోకగనే నా మది నీదై పోవుననీ ఆ: నీకూ నాకూ వ్రాసి వున్నదని ఎపుడో తెలిసెనులే చరణం : 2 ఆ: నను నీ చెంతకు ఆకర్షించే గుణమే నీలో ఉన్నదనీ (2) ఏ మాత్రము నీ అలికిడి ఐనా నా ఎద దడదడలాడుననీ ఏ మాత్రము నీ అలికిడి ఐనా నా ఎద దడదడలాడుననీ అ: నా సరి నీవని నీ గురి నేనని ఇపుడే తెలిసెనులే ఆ: తెలిసినదేమో తలచిన కొలదీ కలవరమాయెనులే ॥సరి॥ పల్లవి : అతడు: నా మనసూ నీ మనసూ ఒకటై మనమొకటిగా ఎలా ఏకమౌదుమో ఎలా కలిసిపోదుమో (2) ఆమె: నా తనువూ నీ తనువూ వేరు వేరు వేరైనా పాలు నీరు కలియునటులె కలసిమెలసి పోదము (2) చరణం : 1 అ: నీ హక్కులు నా హక్కులు వేరు వేరు వేరైనా కీచులాట లేకుండా మచ్చికతో ఉందమా (2) ॥మనసూ॥ చరణం : 2 ఆ: నీ ప్రాణము నా ప్రాణము ఒకటి ఒకటి ఒకటైనా (2) నీవంటే నీవనుచూ... నీవంటే నీవనుచూ కీచులాడుకొందమా ॥తనువూ॥ చిత్రం: సి.ఐ.డి. (1965) రచన: పింగళి నాగేంద్రరావు సంగీతం: ఘంటసాల గానం: ఘంటసాల, పి.సుశీల