
అలనాటి అందాల తార జమున మరణంతో సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. తెలుగు వారి సత్యభామ ఇక లేరనే విషయాన్ని అటు తారలు, ఇటు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. హైదరాబాద్‌లోని స్వగృహంలో శుక్రవారం ఉదయం ఆమె కన్నుమూశారు. సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానుల సందర్శనార్థం ఆమె భౌతిక కాయాన్ని మధ్యాహ్నం 12.30 గంటలకు ఫిలిం ఛాంబర్‌కు తరలించనున్నారు.
మధ్యాహ్నం 3 గంటల తర్వాత మహాప్రస్థానంలో ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి. దాదాపు 200కు పైగా సినిమాలు చేసిన ఆమె పదిహేనేళ్లకే పుట్టిల్లు సినిమాతో రంగప్రవేశం చేశారు. అంతా మనవాళ్లే చిత్రంతో ఆమెకు మంచి గుర్తింపు లభించింది. తర్వాత అగ్ర హీరోలందరితోనూ నటించారు.
చదవండి: ఎన్టీఆర్‌ను జమున కాలితో తన్నడంపై వివాదం
టాలీవుడ్‌లో విషాదం.. సీనియర్ నటి జమున కన్నుమూత
Comments
Please login to add a commentAdd a comment