అలనాటి స్టార్ హీరోలందరితోనూ ఆడిపాడిన హీరోయిన్ జమున ఇక సెలవంటూ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. దాదాపు ముప్పై ఏళ్లపాటు హీరోయిన్‌గా రాణించిన ఆమె ఆనాటి అగ్ర కథానాయకులందరితోనూ నటించారు. నందమూరి తారకరామారావుతో మిస్సమ్మ, భూకైలాస్, గుండమ్మ కథ, గులేబకావళి కథ, శ్రీకృష్ణ తులాభారం.. ఇలా పలు విజయవంతమైన చిత్రాల్లో నటించారు.
అయితే శ్రీకృష్ణ తులాభారం సినిమాలో ఎన్టీఆర్ కృష్ణుడిగా నటిస్తే జమున సత్యభామగా యాక్ట్ చేశారు. ఈ చిత్రంలో జమున కృష్ణుడిని కాలితో తన్నే సీన్ ఉంటుంది. ఈ సన్నివేశంపై ఎన్టీఆర్ అభిమానుల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. అయితే తన పాత్ర కోసమే అలా చేయాల్సి వచ్చిందని నటి వివరణ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. కానీ అప్పటికీ ఇప్పటికీ తెలుగువాళ్లకు సత్యభామ అంటే జమునే గుర్తొస్తుంది.
చదవండి: అందాల చందమామ.. తెలుగు తెర సత్యభామ
సీనియర్ నటి జమున కన్నుమూత
Comments
Please login to add a commentAdd a comment