Nandamuri Taraka Rama Rao
-
టెన్నీస్ ఆడి పాతాళభైరవి సినిమాకు సెలక్టైన ఎన్టీఆర్..!
పాతాళ భైరవి.. 1951లో రిలీజై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన తొలి తెలుగు సినిమా. అప్పట్లో 28 కేంద్రాలలో హండ్రెడ్ డేస్ పూర్తి చేసుకొన్న మూవీ. కేవీ రెడ్డి డైరక్షన్లో ఎన్టీ రామారావు, ఎస్వీ రంగారావులు పోటీ పడి మరీ నటించారు. ఉజ్జయిని రాజకుమారిని ప్రేమించిన తోటరాముడు సర్వ సంపన్నుడు కావడానికి నేపాల మాంత్రికుణ్ణి ఆశ్రయిస్తాడు. ఐతే తోటరాముణ్ణి బలిచ్చి పాతాళభైరవి అనుగ్రహాన్ని పొందాలన్నది మాంత్రికుడి ఆలోచన. చివరకు మాంత్రికుడ్ని తోటరాముడు ఎలా మట్టుబెట్టాడన్నదే కథ. (చదవండి: తెలుగింటి హీరో... పక్కింటి దర్శకుడు)మధిర సుబ్బన్న దీక్షితులు రాసిన కాశీ మజిలీ కథల్లోని ఓ కథ ఇది. బ్లాక్ అండ్ వైట్ రోజుల్లోనే ఎలాంటి టెక్నాలజీ అందుబాటులో లేనప్పుడే ఇలాంటి పాంటసీ ఫిలిం చేయాలనే ఆలోచన రావడం.. అనుకున్నదాన్ని అత్యద్భుతంగా తీసి.. చరిత్రలో నిలిచిపోయేలా చేయడం నిజంగా సాహసమనే చెప్పాలి.పాతాళభైరవిలో తోటరాముడి రోల్‌కు తొలుత అక్కినేని నాగేశ్వరరావుని, మాంత్రికుడి పాత్రకు గోవిందరాజుల సుబ్బారావు లేదా ముక్కామలను అనుకున్నారట డైరక్టర్. ఓ రోజు వాహినీ స్టూడియో ప్రెమిసెస్‌లో ఎన్టీఆర్, ఏయన్నార్‌లు టెన్నిస్ ఆడుతుంటే కేవీరెడ్డి అక్కడికొచ్చారు. ఇద్దరు హీరోలూ ఆటలో లీనమైపోయారు. రెండు మూడు సార్లు బాల్ రాకెట్‌కు తగలకపోవడంతో ఎన్టీఆర్‌కు కోపమొచ్చి నెక్ట్స్ బాల్‌ను బలంగా బాదారట. దాంతో అది అడ్రస్ లేకుండా పోయింది. అప్పుడు ఎన్టీఆర్ రాకెట్‌ను పట్టుకున్న విధానం డైరక్టర్ కేవీ రెడ్డికి బాగా నచ్చేయడంతో తోటరాముడి రోల్‌కు ఆయన్ను సెలక్ట్ చేసుకున్నారట. హీరోగా పెద్దగా ఇమేజీ లేని యాక్టర్‌ను తీసుకోవడంతో విలన్‌ను కూడా ముక్కామల కాకుండా కొత్తవాడై ఉండాలని ఎస్వీఆర్ను తీసుకున్నారట. అంటే అప్పటికి ఎన్టీఆర్, ఎస్వీఆర్‌లు ఇద్దరూ కూడా పెద్దగా పేరున్న నటులు కాదన్నమాట.(చదవండి: టీమిండియా జట్టు వరకు పాకిన 'పుష్ప' క్రేజ్)అప్పట్లో సినిమాలకు డూప్‌లుండేవారు కారు. పాతాళభైరవిలోనూ ఎక్కడా డూప్‌లను పెట్టలేదు. ప్రతిదీ నేర్చుకోవాలన్న ఉత్సాహం అప్పటి నటుల్లో ఉండేది. తెల్లవారుజామున 4.30గంలకే ఎస్వీఆర్, ఎన్టీఆర్‌లు వాహిని స్టూడియోకు వచ్చి అక్కడ ఏర్పాటు చేసిన సాండ్ కోర్టులో ఫైట్స్ రిహార్సిల్స్ చేసేవారు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ తీసుకున్న రెమ్యునరేషన్ 250 రూపాయలట. అంతేకాదు విజయా సంస్థ కోసం రెండేళ్లలో నాలుగు సినిమాలు చేయాలని ఒప్పందం కూడా జరిగిపోయింది. ఘంటసాల పాటలు ఎవర్ గ్రీన్, మార్కస్ బార్ట్లే కెమెరా మాయాజాలం సినిమాకు ప్రాణం పోశాయి.1952 జనవరిలో గోవాలో జరిగిన తొలి భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో దక్షిణ భారత్ నుంచి ప్రాతినిధ్యం పొందిన ఏకైక సినిమా పాతాళ భైరవే. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఒకే హీరోతో నిర్మాణం జరుపుకొన్న తొలి ద్విభాషా సినిమా కూడా ఇదే. తెలుగులో 1951 మార్చి 15న రిలీజైతే, తమిళంలో అదే ఏడాది మే 17న విడుదలైంది. 1980లో జితేంద్ర హీరోగా ఇదే సినిమాను సూపర్‌స్టార్ కృష్ణ హిందీలో కలర్లో తీశారు. ఈ సినిమాలోని సాహసం సేయరా డింభకా.. రాకుమారి దక్కునురా.. అనే డైలాగ్ ఇప్పటికీ వినిపిస్తూ ఉంటుంది. - అలిపిరి సురేష్ -
ఘనంగా ‘కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్’ కార్యక్రమం (ఫోటోలు)
-
అది నా అదృష్టం – వైవీఎస్ చౌదరి
‘‘నా కెరీర్లో ఎంతోమంది కొత్తవారిని పరిచయం చేశాను. ‘దేవదాసు’ మూవీతో రామ్‌ని, ‘రేయ్’ చిత్రంతో సాయిధరమ్ తేజ్‌ని హీరోలుగా పరిచయం చేశాను. ఇప్పుడు నందమూరి కుటుంబంలో నాలుగో తరానికి చెందిన తారక రామారావుని ప్రపంచానికి పరిచయం చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను’’ అని డైరెక్టర్ వైవీఎస్ చౌదరి అన్నారు. దివంగత హరికృష్ణ కుమారుడు దివంగత జానకి రామ్(ఎన్టీఆర్ సోదరుడు) తనయుడు తారక రామారావును హీరోగా పరిచయం చేస్తూ కొత్త సినిమాని ప్రకటించారు వైవీఎస్ చౌదరి. న్యూ టాలెంట్ రోర్స్ బ్యానర్‌పై యలమంచిలి గీత ఈ సినిమాని నిర్మించనున్నారు. సోమవారం నిర్వహించిన ప్రెస్మీట్లో వైవీఎస్ చౌదరి మాట్లాడుతూ–‘‘శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి’ మూవీతో దర్శకునిగా నాకు తొలి అవకాశం ఇచ్చిన నాగార్జునగారికి రుణపడి ఉంటాను. తొలి సినిమాకే నాగేశ్వరరావుగారితో పని చేసే అవకాశం రావడం గొప్ప అదృష్టం. తాజాగా నా కొత్త సినిమాకి హీరోగా ఎవర్ని తీసుకోవాలి? అనుకుంటున్న సమయంలో తమ్ముల ప్రసన్న కుమార్‌గారు తారక రామారావుని చూపించారు. తనని చూడగానే జానకి రామ్ కలని నెరవేర్చుతాడనిపించింది. ఈ మూవీ ద్వారా తెలుగమ్మాయిని కథానాయికగా పరిచయం చేస్తున్నాం. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తా’’ అన్నారు. ‘‘మా స్నేహితులు, సన్నిహితుల అండదండలతో న్యూ టాలెంట్ రోర్స్ బ్యానర్‌పై ఫస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ చేయబోతున్నాం. అందరి ఆశీస్సులు ఉంటాయని నమ్ముతున్నాం’’ అన్నారు యలమంచిలి గీత. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రమేష్ అత్తిలి. -
ఎన్టీఆర్ స్మరణలో కుటుంబ సభ్యులు.. 101 జయంతికి ఘాట్ వద్ద నివాళులు (ఫొటోలు)
-
మహోన్నత వ్యక్తిత్వం... మేరునగ ధీరత్వం!
‘న నిశ్చితాత్ విరమంతి ధీరాః’ అని భర్తృహరి చెప్పినట్లు... తలపెట్టిన కార్యాన్ని సాధించే వరకు ధీరులు తమ ప్రయత్నాలను ఎన్ని ఇబ్బందులెదురైనా నిలబడి సాధిస్తారు. వెనక్కు తగ్గరు. అందుకు ఉదాహరణ ఎన్టీఆర్. ఆశయం లేని అడుగులు బురద గుంటలో ప్రయాణం లాంటివనీ, గమ్యం చేరవనీ నమ్మి ఆచరించిన వ్యక్తుల్లో ఎన్టీఆర్ అగ్రస్థానంలో నిలుస్తారు. గొప్ప మనసున్న తండ్రి ఆయన. భార్యను ప్రేమించి గౌరవించే మహోన్నత సంస్కారం ఆయనది. పేద ప్రజల్ని కన్న బిడ్డల్లాగా పరిపాలించారు. అవినీతి రహితమైన సమాజాన్ని ఏర్పరచటానికి చిత్తశుద్ధితో పాటుపడ్డారు. అందుకే – మరణించిన తరువాత కూడా ఆ మహోన్నత వ్యక్తి నేటికీ జీవించే ఉన్నారు.తెలుగు రాష్ట్రంలో కృష్ణా జిల్లా నిమ్మకూరు గ్రామంలో 1923 మే 28న జన్మించిన మహానేత ఎన్టీఆర్ గారికి నేటికి 101 సంవత్సరాలు. అయినా ఇప్పటికీ ఆయన దివ్య తేజస్సు తగ్గలేదు. మరణించి 28 సంవత్సరాలు అయినా ఎన్టీఆర్ పేరు అభిమానుల గుండెల్లో మారుమ్రోగుతూనే వుంది. ఆ రూపం అలరిస్తూనే ఉంది. ఆయన సినిమాలు, రాజకీయ జీవితంలో మాదిరిగానే ఆయన వ్యక్తిత్వంలోనూ అనేకానేక విశేషాంశాలు ఇమిడి ఉన్నాయి. ఎన్టీఆర్ గారిలో మొదటి నుండి కూడా ఇచ్చిన మాటకు కట్టుబడటం, అనుకున్నది సాధించేవరకు వెనుకడుగు వేయకపోవటం అనేవి ప్రత్యేక గుణాలు. ఇవే ఆయనను సినీ, రాజకీయ రంగాల్లో విజయపథం వైపు నడిపించాయి. ‘న నిశ్చితాత్ విరమంతి ధీరాః’ అని భర్తృహరి చెప్పినట్లు... తలపెట్టిన కార్యాన్ని సాధించే వరకు ధీరులు తమ ప్రయత్నాలను ఎన్ని ఇబ్బందులెదురైనా నిలబడి సాధిస్తారు. వెనక్కు తగ్గరు. ఆ లక్షణం ఎన్టీఆర్ తర్వాత మళ్లీ ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డిలో చూశాను. ముక్కుసూటిగా పోయే ఇలాంటి నాయకులకు శత్రువులు కూడా ఎక్కువే అనడటానికి వీరిద్దరూ ఎదుర్కొన్న సంఘటనలే సాక్ష్యం. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా – ఆయన భార్యగా అత్యంత సన్నిహితంగా మెలిగిన వ్యక్తిని కనుక ఆయన వ్యక్తిత్వాన్ని తెలియచేసే ప్రధానమైన రెండు మూడు సంఘటనలు వివరిస్తాను. ఒక్క మా పెళ్లి విషయంలోనే తీసుకుంటే పెళ్లికి ముందు– తర్వాత ఎన్టీఆర్ ఎన్నో రకాల సమస్యల్ని ఎదుర్కొన్నారు. తిరుపతిలో జరిగిన ‘మేజర్ చంద్రకాంత్’ సినిమా వేడుకల్లో ఎన్టీఆర్ మా వివాహ ప్రకటన చేయగానే చంద్రబాబు ఆ ప్రకటన ప్రజల్లోకి వెళ్లకూడదని మైకులాపించి, లైట్లు ఆర్పించారు. అయినా ఆయన మరుసటి రోజు ఇంట్లోనే మీడియా సమావేశం ఏర్పాటు చేసి మా పెళ్లిని ప్రకటించి మరీ వివాహం చేసుకున్నారు. అక్కడ నుండి నన్ను ప్రజల్లోకి తీసుకెళ్లకుండా చేయటానికి చంద్రబాబు, కుటుంబ సభ్యులు కలిసి ఎన్నో పన్నాగాలు పన్నారు. ఎన్టీఆర్ ధైర్యంగా నన్ను అందరి ముందుకు తీసుకెళ్లి నా స్థానం ఏమిటో సగర్వంగా ప్రకటించారు. ప్రతి అవమానంలో అండగా నిలబడి మాకు కీడు చేస్తున్న వారందరినీ ఎదిరించారు. చీకటి రాజకీయాలకు అలవాటు పడ్డ చంద్రబాబు లాంటి వ్యక్తికి ఆయనొక సవాలుగా నిలబడ్డారు. పెద్ద వయస్సులో ఒంటరితనంతో బాధపడుతున్న ఎంతోమందికి మా వివాహం ఒక మార్గం చూపించింది. దాని మీద కొన్ని ఆర్గనైజేషన్స్ ఏర్పడటం కూడా ఒక విశేషమే! మరో సంఘటన – 1994 ఎన్నికల ప్రచారంలో నన్ను ఇంట్లో ఉంచమని అనేకమంది ద్వారా చెప్పించారు. ఎన్.వి రమణ లాంటి అన్యాయవాదుల్ని ఇంటికి పంపి ఈ పెళ్లి చెల్లదని కూడా వాదించేటట్లు చేశారు. ఎన్టీఆర్ దేనికీ చలించలేదు. తన ఆలోచన మార్చుకోలేదు. నన్ను తీసుకునే ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. స్వయంగా 216 స్థానాలు, మిత్ర పక్షాలకు మరో 34 స్థానాలు సంపాదించి రాజకీయరంగంలో ఒక రికార్డు సాధించారు. మళ్లీ ఆ స్థాయి రికార్డును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తిరగరాశారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి పదవిని తమ అధికార దాహంతో లాగేయాలని కుట్రలు పన్నిన రామోజీ, చంద్రబాబు అందుకు నన్నే కారకురాలిగా చూపించారు. ఒక రాజ్యాంగేతర శక్తిగా నా ప్రాతను చిత్రీకరించి, నన్ను విడిచి పెడితేనే తిరిగి పదవి ఇస్తామని ప్రలోభపెట్టారు. ఇక్కడే ఎన్టీఆర్ గొప్ప వ్యక్తిత్వం మేరు పర్వతం లాగా కనిపిస్తుంది. ముఖ్యమంత్రి పదవిని వదులుకోవటానికి సిద్ధపడ్డారు కానీ భార్యను మాత్రం వదులుకోలేదు. పైగా వారికో సవాల్ విసిరారు. ‘‘నా పార్టీ, నేను సాధించుకున్న పదవి నాకు తిరిగి ఇవ్వటమేమిటి? ధర్మబద్ధంగా వివాహం చేసుకున్న స్త్రీని బయటకు పంపించటం ఏమిటి? మీ భార్యల్ని అలా వదిలేస్తారా? నా భార్య తప్పు చేసిందని నిరూపించండి. బహిరంగంగా ఆమెను శిక్షిస్తాను’’ అన్నారు. ఈ మాటలు ఆయన ఆత్మవిశ్వాసాన్ని, తనపై నమ్మకాన్ని నిలబెట్టాయి. ఎప్పటికప్పుడు వారి నిందల నుండి నన్ను గుండెల్లో పొదువుకొని కాపాడుకున్నారు ఆయన. ఒక సందర్భంలో ఎన్టీఆర్ విలేకర్లతో మాట్లాడుతూ– ‘‘రాజ్యం కోసం ఆ రాముడు తన భార్యను అడవులకు పంపేశాడు. కానీ ఈ రాముడు తన భార్య గౌరవం కోసం అధికారాన్నే వదులుకున్నాడు’’ అన్నారు. ఇలాంటి నిశ్చితాభిప్రాయాలు ఎంతమంది మగవాళ్లలో ఉంటాయి?! చాలా తక్కువ మంది మాత్రమే కనిపిస్తారు. ఎన్టీఆర్ గారి సదభిప్రాయాలను, ఆశయాలను అర్థం చేసుకోకపోగా అపార్థం చేసుకుని కుటుంబ సభ్యులు ఎంతో బాధించారు– వేధించారు– అవమానాల పాలు చేశారు. అయినా చివరి క్షణం వరకు ఆయన తన కుటుంబాన్ని ప్రేమిస్తూనే ఉన్నారు. ప్రతిరోజూ వాళ్ల ఇంటికి స్వీట్లూ, ఫ్రూట్లూ పంపిస్తూనే వచ్చారు. వాళ్లు అప్పుడప్పుడూ వచ్చి డబ్బు పట్టుకుని పోతూ ఉండేవారు. మళ్లీ బయట మాత్రం వాళ్లంతా చంద్రబాబుతో చేతులు కలపడం! ఏది ఏమయినా గొప్ప మనసున్న తండ్రి ఎన్టీఆర్. భార్యను ప్రేమించి గౌరవించే మహోన్నత సంస్కారం ఆయనది. పేద ప్రజల్ని కన్న బిడ్డల్లాగా పాలించినవారు. అవినీతి రహితమైన సమాజాన్ని ఏర్పరచటానికి ప్రయత్నించి భంగపడ్డ ధీరుడు.ఎన్ని రకాలుగా చంద్రబాబు, రామోజీలు కుట్రలు పన్ని అవమానించినా, పదవి లాగేసినా తల వంచకుండా తన చివరి క్షణం వరకు ఆయన తన పోరాటాన్ని కొనసాగించారే తప్ప ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. ‘‘స్థిరత్వం, ధీరత్వం, ఉచితజ్ఞతా, ప్రియ వక్తృత్వం– చత్వారో సహజాగుణాః అభ్యాసే న లభ్యంతే’’ అని పెద్దలు చెప్పినట్లు ఈ లక్షణాలు ఆయన పుట్టుకతోనే వచ్చాయి. చివరి వరకు ఆ గుణాలు నిలబెట్టుకున్న ధీర గంభీరుడు ఎన్టీఆర్. నిబద్ధత లేని జీవితం ముళ్ల చెట్టు లాంటిది. ఎవరికీ ఉపయోగం ఉండదు. ఆశయం లేని అడుగులు బురద గుంటలో ప్రయాణం లాంటివి. గమ్యం చేరవు. ఇది నమ్మి ఆచరించిన వ్యక్తుల్లో ఎన్టీఆర్ అగ్రస్థానంలో నిలుస్తారు. అందుకే మరణించి కూడా నేటికీ మన మధ్య జీవించే ఉన్నారు. డాక్టర్ నందమూరి లక్ష్మీపార్వతి వ్యాసకర్త ఎన్టీఆర్ సతీమణి -
Jr NTR HD Stills: ఎన్టీఆర్ 'దేవర' ఫియర్ సాంగ్ ఫోటోలు వైరల్
-
Jr NTR Unseen Photos: ఎన్టీఆర్ జీవితంలో ప్రత్యేకమైన ఫోటోలు
-
చేతకాని చిన్నమ్మ.. దద్దమ్మ టీడీపీ
నటనతోనే కాదు.. తెలుగుజాతి ఔన్నత్యాన్ని ప్రపంచ నలుమూలలా చాటి, తెలుగుజాతి ఆత్మగౌరవ ప్రతీకగా తెలుగుదేశం పార్టీని స్థాపించి.. ముఖ్యమంత్రిగా ఏడేళ్లు రాష్ట్రాన్ని పాలించి ప్రజల మన్ననలు అందుకున్న వ్యక్తికి భారతరత్న అనే దేశ అత్యున్నత గౌరవం ఇప్పటిదాకా దక్కలేదు. కేంద్రం గుర్తించడం లేదా? లేకుంటే కావాలనే ఎవరైనా అడ్డుకుంటున్నారా?.. ఈ విషయంలో నారా-నందమూరి కుటుంబాలపై ఆయన అభిమానుల కోపం సరైందేనా?.. ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలనే డిమాండ్ కొత్తదేం కాదు కదా. ఆయన అభిమానులు ఎప్పటి నుంచో భారత రత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కానీ ఆయన స్థాపించిన తెలుగు దేశం పార్టీ.. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆ విషయంలో మొదటి నుంచి శ్రద్ధ పెట్టలేదు. ఇటు రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న నందమూరి కుటుంబం ఆ విషయాన్ని పట్టించుకోలేదు. దీంతో.. ఆటోమేటిక్‌గా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలనే డిమాండ్‌ను సీరియస్‌గా పరిశీలించలేదు. కాబట్టి దీనిపైన చర్చ జరిగిన దాఖలాలు కూడా లేవు. కానీ.. ►నిరుడు నందమూరి తారక రామారావు శతజయంతోత్సవాల టైంలో జరిగిన హడావిడి అంతా ఇంతా కాదు. మునుపెన్నడూ లేనివిధంగా టీడీపీ ఎన్టీఆర్‌పై ప్రేమను ఒలకబోస్తూ.. భారతరత్న డిమాండ్‌తో రోడ్డెక్కింది. సరిగ్గా అదే సమయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అతిథిగా ఎన్టీఆర్ వంద రూపాయల కాయిన్ రిలీజ్ చేయించారు. బీజేపీలో కీలక నేతగా ఉన్న ఎన్టీఆర్ వారసులు దగ్గుబాటి పురంధేశ్వరి ఆ కార్యక్రమాన్ని ముందుండి నడిపించారు. అక్కడా నారావారి రాజకీయాన్ని తెలుగు ప్రజలు చూసిందే. అయితే ఆ వెంటనే ఆమె బీజేపీ ఏపీ చీఫ్ కావడంతో ఎన్టీఆర్ భారతరత్నకు లైన్ క్లియర్ అయినట్లేనని అంతా భావించారు. కట్ చేస్తే.. ►కేంద్రం తాజాగా బీహార్ మాజీ ముఖ్యమంత్రి, జన్ నాయక్ కర్పూరి ఠాకూర్ దక్కింది. ఆయన శతజయంతి వేళ కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నతో గౌరవించింది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌తో పాటు ఆర్జేడీ చీఫ్ లాలూకు.. అలాగే పలువురు రాజకీయ దిగ్గజాలకు కర్పూరి ఠాకూర్ రాజకీయ గురువు. ఇక్కడ ఎన్టీఆర్‌తో ఠాకూర్‌కు పోలికలు అప్రస్తుతం. కానీ, ఈ ఇద్దరికీ దేశ అత్యున్నత పురస్కారం ఇవ్వాలనే డిమాండ్ చాలాకాలం నుంచే ఉంది. పైగా నితీశ్‌కు బీజేపీకి కటీఫ్ అయ్యి చాలా కాలమే అవుతోంది. రాజకీయంగానూ నిత్యం ఈ రెండు పార్టీల మధ్య విమర్శలు కొనసాగుతుంటాయి. అలాంటిది ఠాకూర్‌కు పురస్కారం ఇవ్వడంలో కేంద్రం తనదైన రాజకీయం ప్రదర్శించిందనుకున్నా.. ఎన్టీఆర్ విషయంలో ఇవతల నుంచి సరైన ఒత్తిడి కేంద్రంపైకి వెళ్లలేదనే విమర్శే ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తోంది. బీజేపీకి పెద్దగా అభ్యంతరాల్లేవ్ ఇటీవలికాలంలో జాతీయ పురస్కారాల గ్రహీతలను పరిశీలిస్తే.. సమాజానికి వాళ్లు పెద్దగా తెలియకపోయినా.. వాళ్లు చేస్తున్న సేవ ఆధారంగా ఎంపిక జరిగినట్లు అర్థమవుతుంది. అదే సమయంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ అనుకూలురకే ఎక్కువ పురస్కారాలు దక్కుతున్నాయని..అందులోనూ కేంద్రం రాజకీయం ప్రదర్శిస్తోందన్న విమర్శలు ఉన్నాయి. ఉదాహరణకు.. 2019లో బెంగాల్ రాజకీయాల నేపథ్యంలో మాజీ రాష్ట్ర పతి ప్రణబ్ ముఖర్జీకి భారత రత్న ఇచ్చారనే అభిప్రాయం వ్యక్తం అయ్యింది. ఒకవేళ ఇప్పుడు.. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని బీజేపీ భావిస్తే అడ్డుకునేవారెవరూ ఉండరు. ఎందుకంటే అది బీజేపీకే మైలేజ్ ఇచ్చే అంశం. ఎన్టీఆర్ కు భారతరత్న ఇస్తే తెలుగు రాష్ట్రాల్లో ఒక సామాజిక వర్గానికి బీజేపీ దగ్గరయ్యేందుకు అవకాశం కలుగుతుంది. అంతేకాక.. చంద్రబాబు చేయలేని పని తాము చేశామని చెప్పుకోవచ్చు. అప్పుడు టీడీపీని ఇరుకున పెట్టొచ్చు. ఎన్నికల వేళ ఏపీలో బలపడాలని భావిస్తున్న బీజేపీకి మంచి అవకాశమే కదా. చిత్తశుద్ధిలేని శివపూజ లేలరా? ఎన్టీఆర్ తనయ.. కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి. సుష్మాస్వరాజ్ తర్వాత చిన్నమ్మగా ఆమెకంటూ ఓ ట్యాగ్ లైన్ క్రియేట్ అయ్యింది. కాంగ్రెస్ హయాంలో.. కేంద్ర మంత్రిగా ఉన్న టైంలోనూ ఆయన రాజకీయాలు అర్థవంతంగా ఉండేవి. అయితే ఇప్పుడు ఆమె రాజకీయాలను తల్చుకుంటే జాలేస్తోంది. పురంధేశ్వరి బీజేపీలో చేరి తొమ్మిదేళ్లు అవుతోంది. బీజేపీ ఏపీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించి ఆరు నెలలు పూర్తి కావొస్తోంది. ఈ 9 ఏళ్లు, పోనీ చీఫ్‌గా 6 నెలల కాలంలో ఆమె బీజేపీకి విజ్ఞప్తులు చేసినా.. ఆఖరికి ఒత్తిడి చేసినా తన తండ్రికి ఎన్టీఆర్‌కు భారతరత్న ఇచ్చే అంశాన్ని కేంద్రం పరిశీలించేదేమో. కానీ, ఆమె ఆ విషయంపై మాత్రం ఎందుకనో శ్రద్ధ పెట్టలేదనే అనిపిస్తోంది. మొక్కుబడి ప్రకటనలకు తప్ప.. ఏనాడూ ఆమె మనసు పెట్టింది లేదనేది స్పష్టం అవుతోంది. ఆమె చేతకానితనం వెనుక మరిది చంద్రబాబు హస్తం ఉన్నట్లు అనుమానాలు బలపడుతున్నాయి. టీడీపీ దద్దమ్మ.. ఇది తెలిసిందే! ఎన్టీఆర్ కు భారతరత్న ఇప్పించుకోవడంలో ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీ విఫలమైంది. ఎన్టీఆర్ మరణానంతరం.. చంద్రబాబు ఆయన్ను పట్టించుకోలేదు. అందుకే ఆయనకు భారతరత్న రాలేదనే ఆరోపణలూ ఉన్నాయి. లేకుంటే జాతీయ స్థాయిలో చంద్రబాబు చక్రం తిప్పిన రోజుల్లో ఎన్టీఆర్ కు భారతరత్న ఇప్పించుకోవడం పెద్ద సమస్య కాదు కదా. ఇక.. గతంలో వాజ్‌పేయి హయాంలో బీజేపీ ప్రభుత్వం ఎన్టీఆర్‌కు భారతరత్న అంశాన్ని పరిశీలించింది. అయితే ఆ సమయంలో చంద్రబాబు వల్లే కేంద్రం వెనక్కి తగ్గిందనే చర్చ నడిచింది. ఒకవేళ ఎన్టీఆర్‌కు ఇప్పిస్తే.. తెలుగుదేశం పార్టీ తన సొంతంది కాదనేది .. ఎన్టీఆర్‌కు పొడిచిన వెన్నుపోటు రాజకీయం దేశానికి తెలిసిపోతుందన్న భయం ఆయనలో ఉండొచ్చు. అందుకే నందమూరి కుటుంబాన్ని కూడా మొదటి నుంచి తన గుప్పిట ఉంచుకుని అణగదొక్కుతూ వస్తున్నాడు. ఏదైతేనేం.. ఎన్టీఆర్‌కు భారతరత్న రాకపోవడంలో చంద్రబాబే ప్రధాన భూమిక పోషించాడనేది తేటతెల్లం అవుతోంది. మరి ఈ పరిస్థితుల్లో నారా-నందమూరి కుటుంబాలపై ఎన్టీఆర్ అభిమానుల కోపం సరైంది కాదంటారా? ‘‘ఎన్నికల సమయంలో ఎన్టీఆర్‌ను వాడుకుంటున్నారు. కేంద్రం భారతరత్న ఇస్తాను అంటే పురంధరేశ్వరి అడ్డుకుంది. భువనేశ్వరి, పురంధరేశ్వరి ఇద్దరూ తండ్రికి ద్రోహం చేశారు.. మళ్లీ పురంధేశ్వరి, చంద్రబాబు ఏకమైపోయారు. కానీ, నాకంటే ఎక్కువ అవమానానికి పురంధరేశ్వరి గురవుతారు. ఎన్టీఆర్‌కు రావాల్సిన భారతరత్న రాకుండా చేశారు. బీజెపీకి చెబుతున్నా.. పురందేశ్వరి టీడీపీ ఏజెంట్ గా పనిచేస్తోంది. పురందేశ్వరి కుట్రలు అర్ధం చేసుకోండి.. ’’ దివంగత నందమూరి తారకరామారావు పేరు మీద 100 రూపాయల స్మారక నాణేం విడుదల కార్యక్రమ సమయంలో ఆయన సతీమణి లక్ష్మీపార్వతి చెప్పిన మాటలు.. ::లోకీ, సాక్షి డిజిటల్ పొలిటికల్ డెస్క్ -
ఆ ఇద్దరూ నాకు దైవసమానులు: చిరంజీవి
నందమూరి తారకరామారావు, అక్కినేని నాగేశ్వరరావు నాకు దైవసమానులు, వారితో కలిసి పని చేయడం అదృష్టం అంటున్నాడు మెగాస్టార్ చిరంజీవి. ఎన్టీఆర్ 28వ వర్ధంతి, ఏఎన్నార్ శతజయంతి సందర్భంగా విశాపట్నంలో లోక్ నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సాహిత్య పురస్కారం, జీవన సాఫల్య పురస్కారాల అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. దీనికి చిరంజీవి, సీనియర్ హైకోర్టు న్యాయమూర్తి ఆకుల శేష సాయి, వైఎస్సార్సీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఎన్నో మంచి సలహాలిచ్చారు ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తనకు చిరకాల మిత్రుడని, అందరినీ ఆకట్టుకునే తత్వం తనదని తెలిపారు. ఈ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొనడం ఒక మంచి అవకాశమన్నారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ ఇద్దరూ సినీపరిశ్రమకు రెండు కళ్లువంటి వారని వీరిద్దరూ తనకు జీవితంలో ఎన్నో మంచి సలహాలు ఇచ్చారని పేర్కొన్నారు. హైకోర్టు న్యాయమూర్తి శేషసాయి మాట్లాడుతూ.. 'యండమూరి వీరేంద్రనాథ్ నవలల వల్ల యువతకు ఆలోచన, జ్ఞాపక శక్తి పెరుగుతాయి. ఈ సాహిత్య సభకు పెద్ద ఎత్తున ప్రజలు రావడం సంతోషం. సాహిత్య కారులతో పులకించిన నేల ఉత్తరాంధ్ర.. తెలుగు జాతికి నిలువెత్తు నిదర్శనం ఎన్టీఆర్, ఏఎన్నార్' అని చెప్పుకొచ్చారు. నిజమైన వారసుడు చిరంజీవి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ.. 'లోక్ నాయక్ ఫౌండేషన్ కార్యక్రమంలో చిరంజీవితో కలిసి పాల్గొనడం సంతోషంగా ఉంది. ఎన్టీఆర్, ఏఎన్నార్‌కు నిజమైన వారసుడు చిరంజీవి. చిరంజీవి తెలుగు సినిమాకు ఎంతో పేరు ప్రఖ్యతలు తెచ్చారు. చిరంజీవి కష్టపడి ఉన్నత స్థానానికి చేరుకున్నారు' అని వ్యాఖ్యానించారు. చదవండి: ప్రియుడితో ప్రేమలో టాలీవుడ్ హీరోయిన్.. ఫిబ్రవరిలోనే పెళ్లి! -
ఆనాడు సీఐడీ ఆఫీసర్‌గా NTR.. చంద్రబాబును ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
'నీ పాపం పండెను నేడు.. నీ భరతం పడతా చూడు..' ఇది సినిమా పాటే అయినా ప్రస్తుత పరిస్థితులకు చక్కగా సరిపోతుంది. దొంగగడ్డి మేసే గొడ్డయినా కట్టుకొయ్య వద్దకు రాక తప్పదు అన్నట్లు దొంగపనులు, పాపాలు చేసిన చంద్రబాబు ఆ పాపాలకు మూల్యం చెల్లించుకోకా తప్పదు. దొరికినకాడికి దోచుకున్న బాబు ఇటీవలే కటకటాలపాలైన సంగతి తెలిసిందే! నేడు(సెప్టెంబర్ 23న) ఆయన సీఐడీ విచారణకు హాజరయ్యాడు. ఇక్కడ ఓ ఆసక్తికర విషయం చెప్పుకోవాలి. అన్యాయాన్ని చీల్చి చెండాడే ఆఫీసర్‌గా ఎన్టీఆర్ సరిగ్గా 58 ఏళ్ల కిందట ఇదే రోజు C.I.D. సినిమా విడుదలైంది. ఈ సినిమాలో హీరోగా నటించింది ఎవరనుకుంటున్నారు? ఎన్టీ రామారావు. తాపి చాణక్య డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ సీఐడీ ఆఫీసర్ రవి పాత్ర పోషించారు. తండ్రి చలపతిగా గుమ్మడి వెంకటేశ్వరరావు నటించారు. అన్యాయాన్ని సహించలేని తత్వం హీరోదైతే, దురలవాట్లు, అక్రమాలతో అడ్డదారిలో డబ్బు సంపాదించి జల్సా చేసే తత్వం ఆయన తండ్రిది. C.I.D కథ ఇదీ.. ఈ క్రమంలోనే ఓ వ్యక్తిని చంపి అజ్ఞాతంలోకి వెళ్లిపోతాడు చలపతి. తాను చనిపోయినట్లు నమ్మించి తర్వాత బాబా అవతారమెత్తి మరెన్నో తప్పులు చేస్తాడు. మరోవైపు అతడి కొడుకు రవి పెద్ద చదువులు చదివి సీఐడీ ఆఫీసర్‌గా మారతాడు. బ్యాంకుకు కన్నం వేసిన బాబా గ్యాంగ్‌ను పట్టుకునేందుకు వేట మొదలుపెడతాడు. చట్టం కళ్లు తప్పి ఎవరూ తప్పించుకోలేరన్నట్లు చివరకు కొడుకు చేతిలోనే అరెస్ట్ అవుతాడు చలపతి. ఇదీ సీఐడీ సినిమా కథ! అప్పుడు సీఐడీ రిలీజ్.. ఇప్పుడు సీఐడీ విచారణలో బాబు వెనక్కు తిరిగి చూసుకుంటే లెక్కలేనన్ని తప్పులు చేసిన చంద్రబాబు సైతం చివరకు అరెస్ట్ అవక తప్పలేదు. నేడు, రేపు సీఐడీ బృందం చంద్రబాబును విచారించనుంది. ఎన్టీఆర్ సీఐడీ సినిమా రిలీజైన రోజే చంద్రబాబు సైతం సీఐడీ విచారణకు హాజరవడం యాధృచ్చికమే అయినా పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో దీని గురించి పోస్టులు పెడుతున్నారు. వెన్నుపోటు పాపం ఊరికే పోలేదంటూ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: బాలయ్య ఇవన్నీ మరిచిపోయావా..? -
షూటింగ్ గ్యాప్‌లో మందు తాగినందుకు చిరంజీవి తిట్టాడు: కోట
కామెడీ, విలనిజం.. వేర్వేరుగా, అవసరమైతే రెండింటినీ ఏకకాలంలో పండించగల సమర్థుడు కోట శ్రీనివాసరావు. వైవిధ్యమైన పాత్రలు ఎన్నో పోషించిన ఆయన నటప్రస్థానం ప్రాణం ఖరీదు చిత్రంతో మొదలైంది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో వందలకొద్దీ చిత్రాల్లో నటించిన ఆయన ఇప్పుడు వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో ఆనాటి కొన్ని ముఖ్య సంఘటనలను గుర్తు చేసుకున్నారు. 'ఒకసారి ఏమైందంటే సెట్‌కు వెళ్లాక మధ్యాహ్నం వరకు షూటింగ్ లేదన్నారు. ఎమ్మెస్ నారాయణ.. ఏంటి అన్నాయ్, ఇంకా చాలా టైముందిగా అని బయటకు వెళ్దాం అన్నాడు. ఇద్దరం కలిసి మందు తాగాం. అనుకోకుండా షూటింగ్‌కు రమ్మని కబురొచ్చింది. సెట్‌కు వెళ్తే అక్కడ చిరంజీవి ఉన్నాడు. నన్ను చూడగానే నాపై కేకలేశాడు. ఏమయ్యా, బుద్ధుందా? మంచి కెరీర్ ఉన్నవాడివి పట్టపగలు తాగి రావడమేంటి? పది మంది చెప్పుకుంటే ఎంత అసహ్యంగా ఉంటుంది? అని తిట్టాడు. కానీ నా మంచి కోసం, నా బాగోగులు కోరే అతడు నన్ను హెచ్చరించాడు. ఇకపోతే మండలాధీశుడులో ఎన్టీఆర్ పాత్ర ఆఫర్ చేశారు. అప్పటికే ఈ రోల్ చేయాలా? వద్దా? అని ఆలోచిస్తున్నాను. సూపర్ స్టార్ కృష్ణగారు చేయమని ప్రోత్సాహించారు. నాకేమో ఫ్యాన్స్ ఎలా తీసుకుంటారోనని భయంగా ఉంది. అప్పుడు నాకు బ్యాంకులో ఉద్యోగం వచ్చింది. సినిమా సక్సెస్ అయితే ఇండస్ట్రీలో ఉందాం, లేదంటే ఉద్యోగంలో చేరిపోదాం అనుకున్నా. మండలాధీశుడు మంచి విజయం సాధించింది. కానీ చాలామంది మనోభావాలు దెబ్బతిన్నాయి. ఓసారి నా కూతుర్ని చూసేందుకు విజయవాడ వెళ్లాను. అక్కడ రైలు దిగగానే ఎన్టీఆర్ ఫ్యాన్స్ నన్ను తిడుతూ, కొట్టారు. ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాను' అని చెప్పుకొచ్చారు కోట శ్రీనివాసరావు. చదవండి: సుమతో విబేధాలు? రాజీవ్ కనకాల ఏమన్నాడంటే? సమంతను ఫాలో అవుతున్న విష్ణుప్రియ -
ఆ ఘనత ఎన్టీఆర్కే చెల్లింది: రాజేంద్ర ప్రసాద్
రాజకీయాల్లో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టిన ఘనత ఎన్టీ రామారావు సొంతమని ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ అన్నారు. ఈ రోజున దేశవ్యాప్తంగా పలు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలకు బీజం వేసిన ప్రజా నాయకుడిగా ఆయన పేరు చరిత్రలో చిర స్థాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. ఎన్టీఆర్ శత జయంతిని పురస్కరించుకుని... "కలయిక ఫౌండేషన్" అంతర్జాతీయ స్థాయిలో ఎన్టీఆర్ క్యారికేచర్, కవితల పోటీలు నిర్వహించింది. ఈ పోటీలో విజేతలుగా నిలిచినవారికి రాజేంద్రప్రసాద్ చేతుల మీదుగా నగదు బహుమతులు ప్రదానం చేసింది. రెండు విభాగాల్లో ప్రథములుగా నిలిచినవారికి లక్ష రూపాయల చొప్పున బహూకరించి, మిగతా విజేతలకు సుమారు అయిదు లక్షల రూపాయల నగదు బహుమతులు అందించారు. మాజీ ఐ.ఎ.ఎస్. అధికారి - విశ్రాంత హోమ్ సెక్రటరీ కె.పద్మనాభయ్య, ఆదాయపన్ను కమిషనర్ జీవన్ లాల్ లవాడియ, గజల్ శ్రీనివాస్, బృహస్పతి టెక్నాలజీస్ ఎమ్.డి రాజశేఖర్, సిఎస్.బి. ఐ.ఎ.ఎస్ అకాడమి డైరెక్టర్ బాల లత అతిధులుగా పాల్గొని... "కలయిక ఫౌండేషన్" అధినేత చేరాల నారాయణను అభినందించారు. ఈ సందర్భంగా చేరాల నారాయణ అతిథులకు కృతజ్ఞతలు తెలుపుతూ విజేతలకు అభినందనలు తెలిపారు. చదవండి: నా శరీరంలో మార్పులు వస్తున్నాయి: రాకేశ్ మాస్టర్ వీడియో వైరల్ -
NTR ఫ్యామిలీలో ఒకే ఒక్క మగాడు తారక్: ఆర్జీవీ
సాక్షి, విజయవాడ: నందమూరి తారక రామారావును చంపినవాళ్లే ఇప్పుడు రక్తం తుడుచుకుని వచ్చి అభిషేకాలు చేస్తుంటే అంతకన్నా పెద్ద జోక్ మరొకటి లేదన్నాడు దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. ఆదివారంనాడు విజయవాడలో ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్, దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న ఆర్జీవీ మాట్లాడుతూ.. 'మీకు ఒక సీరియస్ జోక్ చెప్పడానికి వచ్చాను. ఎవరూ నవ్వలేని ఆ జోక్ ప్రస్తుతం రాజమండ్రిలో జరుగుతోంది. అది ఎంత పెద్ద జోక్ అంటే స్వర్గంలో ఉన్న ఎన్టీ రామారావుగారు నవ్వాలో, ఏడ్వాలో తెలియని జోక్. ఇక్కడ ఇంటి అల్లుడు అయిన వ్యక్తి(చంద్రబాబు) ఎన్టీఆర్‌ను దారుణంగా టార్చర్ చేసి ఏడిపించి ఏడిపించి చంపారు. మళ్లీ ఇప్పుడు ఆయనే దండలు వేయడం జోక్. ఎన్టీఆర్ చివరి రోజుల్లో లక్ష్మీపార్వతి ఆయనకు సేవలు చేశారు. అయినా సరే చాలామంది ఎన్టీఆర్.. లక్ష్మీపార్వతి మాయలో పడ్డారంటున్నారు.. అంటే ఆయనకు అవగాహన లేదా? అలాంటప్పుడు ఆయనకు ఎందుకు దండలు వేస్తున్నారు? రజనీకాంత్ కూడా చంద్రబాబు పక్కన కూర్చుని వాళ్లను పొగడటం అంటే ఆయన కూడా ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచినట్లే! నందమూరి తారకరామారావుగారి ఫ్యామిలీలో ఉన్న ఒకే ఒక్క మగాడు జూనియర్ ఎన్టీఆర్. తారక్ ఒక్కడే తాతమీదున్న గౌరవంతో వాళ్లతో పాటు వేదిక పంచుకోలేదు. అందుకు తారక్‌కు నేను థ్యాంక్స్ చెప్తున్నా' అన్నాడు రామ్‌గోపాల్ వర్మ. చదవండి: చంద్రబాబు వల్ల ఎన్టీఆర్‌కు 3 సార్లు గుండెపోటు అప్పుడు వరకట్నం కేసు పెట్టి, ఇప్పుడేమో మాజీ భర్తతో చెట్టాపట్టాల్ -
తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది: జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్
హీరోలు పాత్రల్లో నటిస్తారు. కానీ కొందరు నటిస్తే ఆ పాత్రలే పరిపూర్ణమవుతాయి. ఆయా పాత్రల్లో వారిని తప్ప మరొకరిని ఊహించుకోలేము. అలాంటి దిగ్గజ దివంగత నటుడే నందమూరి తారక రామారావు. 'మన దేశం'తో మొదలైన ఆయన ప్రయాణం 'మేజర్ చంద్రకాంత్' వరకు సాగింది. ఈ ప్రయాణంలో దాదాపు 300 చిత్రాల్లో నటించిన ఎన్టీఆర్ చారిత్రకాలు, జానపదాలు, సాంఘికాలు, పౌరాణిక చిత్రాలు చేసి తెలుగు తెరపై తన పేరు సువర్ణాక్షరాలతో లిఖించుకున్నారు. నేడు(మే 28) ఆయన శతజయంతి . ఈ సందర్భంగా తాతను తలుచుకుంటూ జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్ చేశాడు. 'మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది. మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది. పెద్దమనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెను మరొక్కసారి తాకిపో తాతా.. సదా మీ ప్రేమకు బానిసను' అంటూ చివర్లో తన సంతకాన్ని జత చేశాడు. మా గుండెలను మరొక్కసారి తాకిపోండి తాతా అంటూ చేతులు జోడించి నమస్కరిస్తున్న ఎమోజీని తన ట్వీట్లో యాడ్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మా గుండెలను మరొక్కసారి తాకి పోండి తాతా 🙏🏻 pic.twitter.com/veKcoCWamx — Jr NTR (@tarak9999) May 28, 2023 చదవండి: ఆరు పడవల ప్రయాణం.. దటీజ్ ఎన్టీఆర్ -
NTR Birth Anniversary: దటీజ్ ఎన్టీఆర్.. రెండుసార్లు ఫ్రాక్చర్ అయినా..
శ్రీకృష్ణుడు, దుర్యోధనుడు, కీచకుడు, అర్జునుడు, భీముడు.... ‘శ్రీమద్విరాట పర్వము’లో ఈ ఐదు భిన్న పాత్రల్లో ఎన్టీఆర్ అభినయం చూసి, తెలుగు ప్రేక్షకులు ఆనందించారు.. నటన మాత్రమే కాదు... తెరపై ఆ అందగాడిని చూసి ఆనందించారు. అదే అందగాడు కురూపిగా కనిపించినా ఆనందించారు.. ఆ నటన అలాంటిది. 44ఏళ్ల సినీ కెరీర్లో ప్రేక్షకులకు ఆనందాన్నిచ్చిన నటుడు ‘నటనానంద తారకరాముడు’ (ఎన్.టి.ఆర్). ఈ తారక దేశంలోనే వంద చిత్రాలు పూర్తి చేసిన తొలి ఘనుడు.. ఆ తర్వాత ఎనిమిదేళ్లల్లో 200 సినిమాలు పూర్తి చేసి, రాష్ట్రంలో రెండొందల సినిమా మార్క్ చేరుకున్న నటుడు. 300 మార్కు కూడా ఈ నటుడి సొంతమే. 13 చారిత్రకాలు, 55 జానపదాలు, 186 సాంఘికాలు, 44 పౌరాణిక చిత్రాలు చేసి, తెలుగు తెరపై చెరగని ముద్ర వేశారు ఎన్టీఆర్. తొలి చిత్రం ‘మనదేశం’తో మొదలుకొని, చివరి చిత్రం ‘మేజర్ చంద్రకాంత్ ’ వరకూ దాదాపు 300 చిత్రాల్లో నటించారు. వాటిలో 140 వందరోజుల చిత్రాలు కాగా, 33 రజతోత్సవ చిత్రాలు కావడం విశేషం. ఈ ‘నటనానంద తారక’ ‘శత జయంతి’ నేడు. ఈ సందర్భంగా నందమూరి తారక రామారావు సినీ జీవిత విశేషాల్లో కొన్ని ఈ విధంగా... పౌరాణికం శ్రీకృష్ణుడు, శ్రీరాముడు, దుర్యోధనుడు, భీముడు, యముడు, రావణాసరుడు... ఎలా ఉంటారు? ‘ఇలా ఉంటారు?’ అని ఎన్టీఆర్ తన పాత్రలతో చూపించారు. పౌరాణిక చిత్రాలకు పెట్టింది పేరు ఎన్టీఆర్. ఆయన నటించిన పౌరాణిక చిత్రాల్లో ఎప్పటికీ ప్రధానంగా చెప్పుకోవాల్సిన చిత్రం ‘దాన వీర శూర కర్ణ’ (1977). ఎన్టీఆర్ ఆరు పడవల ప్రయాణం ఈ సినిమా. అంటే..నటన, దర్శకత్వం, నిర్మాణం.. ఈ మూడు బాధ్యతలతో పాటు కృష్ణుడు, కర్ణుడు, దుర్యోధనుడు... మూడు పాత్రలను చేయడం అంటే ఆరు పడవల ప్రయాణమే కదా. మేకప్ వేయడానికి మూడు గంటలు, తీయడానికి రెండు గంటలు పట్టేదట. మూడు పాత్రల అభినయానికి, దర్శకుడిగా తీసిన విధానానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అయితే ఈ సినిమాలో శ్రీకృష్ణుడు పాత్ర కోసం అక్కినేని నాగేశ్వర రావుని సంప్రదిస్తే.. ‘కృష్ణుడిగా ఎన్టీఆర్‌ని చూసిన కళ్లతో ప్రేక్షకులు నన్ను చూడలేరు’ అంటూ చేయనని చెప్పారట. దీంతో కర్ణుడి పాత్ర అయినా చేయమని కోరితే.. ‘ఆ పాత్రకి నా ఆహార్యం సరిపోదు’ అంటూ సున్నితంగా తిరస్కరించారట ఏఎన్ఆర్. శ్రీకృష్ణుడు అంటే ఎన్టీఆర్ అనుకునేలా ఆ పాత్రకు వన్నె తెచ్చారు. ‘ఇద్దరు పెళ్లాలు’ (1954) చిత్రంలో ఎన్టీఆర్ తొలిసారి కృష్ణునిగా కనిపించారు. ఆ తర్వాత ‘మాయాబజార్’ (1957), ‘వినాయకచవితి’ (1957), ‘దీపావళి’ (1960), ‘శ్రీకృష్ణార్జున యుద్ధం’ (1963), ‘శ్రీకృష్ణ తులాభారం’ (1966) ఇలా... పలు చిత్రాల్లో శ్రీకృష్ణుడి పాత్ర పోషించిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుంది. ఆయన్ని అపర శ్రీకృష్ణునిగా నిలిపిన చిత్రం ‘మాయాబజార్’. ఈ చిత్రంలో తెలుగు, తమిళ భాషల్లో ఎన్టీఆరే శ్రీకృష్ణునిగా నటించి, తనదైన శైలిలో ప్రేక్షకులను అలరించారు. ఇక ‘శ్రీకృష్ణ తులాభారం’లో మరోమారు కృష్ణుని పాత్రలో జీవించారు. ఈ చిత్రంలో శ్రీకృష్ణుని పాత్రధారి అయిన ఎన్టీఆర్‌ని సత్యభామ పాత్రధారి జమున కాలితో తన్నే సన్నివేశం ఉంటుంది. అంత పెద్ద స్టార్ హీరో అయినా భేషజాలకు పోకుండా, అభిమానులు, ప్రేక్షకులు ఏమనుకుంటారో? అని ఆలోచించకుండా కథకి అవసరం మేరకు ఆ సన్నివేశంలో నటించి, ‘దట్ ఈజ్ ఎన్టీఆర్’ అనిపించుకున్నారు. శ్రీకృష్ణుడిగా ఒదిగిపోయిన ఎన్టీఆర్.. శ్రీరామునిగానూ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ‘చరణదాసి’ (1956) చిత్రంలో తొలిసారి శ్రీరామునిగా కనిపించారు. ఆ తర్వాత ‘సంపూర్ణ రామాయణం’ (1958)లో తొలిసారి పూర్తి స్థాయిలో శ్రీరామునిగా నటించారాయన. ‘లవకుశ’ (1963) చిత్రంలో శ్రీరాముని పాత్రలో ఎన్టీఆర్ జీవించారు. ఆ తర్వాత ‘శ్రీరామ పట్టాభిషేకం’ (1978)తో పాటు మరికొన్ని చిత్రాల్లో శ్రీరామునిగా ప్రేక్షకులను అలరించారు. సౌమ్యుడైన శ్రీరాముడు పాత్రకు పూర్తి వ్యతిరేకమైన రావణాసురుడి పాత్రలోనూ ఎన్టీఆర్ ఒదిగిపోయిన వైనం అద్భుతం. ‘భూకైలాస్’ (1958) చిత్రంలో ఎన్టీఆర్ తొలిసారి రావణబ్రహ్మ పాత్రలో నటించి, మెప్పించారు. ఆ తర్వాత ‘సీతారామ కళ్యాణం’ (1961), ‘శ్రీరామపట్టాభిషేకం’ (1978) వంటి పలు సినిమాల్లో రావణబ్రహ్మగా శభాష్ అనిపించుకున్నారు. అదే విధంగా ‘శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం’ (1960)లో తొలిసారి వెంకటేశ్వర స్వామి పాత్ర చేశారు ఎన్టీఆర్. అలాగే ‘పాండవ వనవాసము’ (1965)లో భీమునిగా, ‘ఉమ్మడి కుటుంబం’ (1967)లో తొలిసారి ‘యముడి’ పాత్రలో ఆకట్టుకున్నారాయన. ఇక ‘నర్తనశాల’ (1963)లో బృహన్నల పాత్రలో తన నటనా ప్రతిభను మరోసారి చూపించారు ఎన్టీఆర్. ఇలా పౌరాణిక పాత్రల్లో ఎన్టీఆర్ చెరగని ముద్ర వేశారు. జానపదం ఎన్టీఆర్ నటించిన తొలి జానపద చిత్రం ‘పల్లెటూరి పిల్ల’ (1950). ఈ చిత్రంలో క్రూరమైన ఎద్దుతో ఎన్టీఆర్ పోరాడే యాక్షన్ సీన్ ఉంది. చిత్రదర్శకుడు బీఏ సుబ్బారావు ఎద్దు కొమ్ములను పట్టుకుంటే చాలని ఎన్టీఆర్‌తో అన్నారు. కానీ, ఎన్టీఆర్ ఆ ఎద్దుతో నిజంగానే పోరాడారు. ఆ యాక్షన్ సీన్ అప్పుడు రెండుసార్లు ఫ్రాక్చరయింది. డాక్లర్టు విశ్రాంతి సూచించినా ‘నో’ అన్నారు ఎన్టీఆర్. కట్టు కనిపించకుండా పొడవు చేతుల చొక్కా ధరించి, నటించారు. ‘పల్లెటూరి పిల్ల’ విడుదలైన మరుసటి సంవత్సరం ‘పాతాల భైరవి’ (1951)లో చేసిన తోటరాముడి పాత్ర గురించి కూడా చెప్పుకోవాలి. ఈ పాత్రకు ఎన్టీఆర్‌ని తీసుకోవాలని నిర్మాతలు నాగిరెడ్డి–చక్రపాణి అనుకుంటే... పెద్దగా ఇమేజ్ లేని నటుణ్ణి అంత పెద్ద పాత్రకా? అనుకున్నారు దర్శకుడు కేవీ రెడ్డి. సరిగ్గా అదే టైమ్‌కి టెన్నిస్ ఆడుతున్న ఎన్టీఆర్ రెండు పాయింట్లు కోల్పోవడంతో బంతిని విసిరి కొట్టారు. అంతే.. జానపద నాయకుడి లక్షణం ఉందని తోటరాముడిగా ఎన్టీఆర్‌ని ఫిక్స్ చేశారు కేవీ రెడ్డి. ఈ పాత్రలో ఎన్టీఆర్ రెచ్చిపోయి నటించారు. ఇంకా ‘గులేబకావళి కథ’, ‘జగదేకవీరుని కథ’, ‘అలీబాబా నలభై దొంగలు’, ‘చిక్కడు దొరకడు’, ‘మంగమ్మ శపథం’, ‘గండికోట రహస్యం’... ఇలా దాదాపు యాభై జానపద చిత్రాల్లో నటించారు ఎన్టీఆర్. సాంఘికం హీరోగా పట్టుమని పది సినిమాలు పూర్తి చేయకుండానే సందేశాత్మక సినిమాలు చేయాలనుకున్నారు ఎన్టీఆర్. వరకట్నం తీసుకోవడం సరైంది కాదని, యువతలో చైతన్యం నింపేలా, అభ్యుదయ భావాలు రేకెత్తించేలా ‘పెళ్లి చేసి చూడు’ (1952)ను ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. ఆ తర్వాత 1970లో స్వీయ దర్శకత్వంలో వరకట్నం ప్రధానాంశంగానే ‘వరకట్నం’ సినిమా తెరకెక్కించి, నటించారాయన. ఇక అప్పటి సాంఘిక దురాచారాల్లో ప్రముఖంగా వినిపించే మరో అంశం ‘కన్యాశుల్కం’. ఈ విషయంలో ప్రజల ఆలోచనా సరళిలో మార్పు రావాలనే ఉద్దేశ్యంతో ‘కన్యాశుల్కం’లో గిరీశంగా కనిపించి, మెప్పించారు ఎన్టీఆర్. ఈ చిత్రంలో గిరీశంగా ఎన్టీఆర్ చేసిన అభినయానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ చిత్రాలే కాదు.. ఉమ్మడి కుటుంబాల ప్రాముఖ్యతను తెలియజేసేలా, ‘ఉమ్మడి కుటుంబం’, కుటుంబ సంబంధాలకు అద్దంపట్టేలా ‘తల్లా? పెళ్లామా?’ చిత్రం, ఈ కోవలోనే ‘కోడలు దిద్దిన కాపురం’, ‘తాతమ్మ కల’, ‘ఇంటిగుట్టు’ సినిమాలు చేశారు ఎన్టీఆర్. ముఖ్యంగా 1969–1970 దశకంలో ఎన్టీఆర్ నుంచి ఎక్కువగా సాంఘిక చిత్రాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ‘వరకట్నం, తల్లా? పెళ్లామా?, కొడుకులు దిద్దిన కాపురం’ సినిమాల్లో నటించి, స్వీయ దర్శకత్వం వహించారు ఎన్టీఆర్. ఈ చిత్రాలే కాదు.. వ్యవసాయంలో కొత్త ప్రయోగాలు చేయాలని గ్రామీణ యువకులను ప్రోత్సహించే విధంగా ‘పల్లెటూరు’, ‘రైతుబిడ్డ’ వంటి వ్యవసాయ ఆధారిత సినిమాల్లో నటించారు. అలాగే వ్యవసాయ రంగంలో పెత్తందార్లను ప్రశ్నించేలా ‘పెత్తందార్లు’లో నటించారు. ఇంకా సమాజంలోని అసమానతను తెలిపేలా ‘రాజూ పేద’, మహిళలకు సమాజంలో దక్కాల్సిన గౌరవాన్ని గుర్తు చేసేలా ‘నాదీ ఆడ జన్మే’, ‘స్త్రీ జన్మ’ వంటి సినిమాలను ప్రేక్షకుల ముందుకు తెచ్చారు ఎన్టీఆర్. అలాగే దేశభక్తిని చాటేలా ‘బొబ్బిలిపులి’, ‘నా దేశం’, ‘జస్టిస్ చౌదరి, ‘మేజర్ చంద్రకాంత్’, కులమతాలకు అతీతంగా ‘ఒకే కుటుంబం’ వంటి సినిమాలు కూడా ఉన్నాయి. ప్రయోగాత్మకం ‘పిచ్చి పుల్లయ్య’ (1953), ‘బండరాముడు’ (1959), ‘తిక్క శంకరయ్య’ (1968).. ఇవన్నీ ఎన్టీఆర్ హీరోగా నటించిన సినిమాల టైటిల్సే. వీటిని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎన్టీఆర్‌కు కథ నచ్చితే ఎలాంటి సాహసానికైనా సై అంటారని. అందుకే 31ఏళ్ల వయసులోనే ‘తోడుదొంగలు’ (1954)లో వృద్ధ పాత్రకి ఓకే అన్నారు. అలాగే నాలుగుపదుల వయసు దాట కుండానే ‘భీష్మ’ (1962) చిత్రంలో కురు వృద్ధుడైన భీష్మ పాత్ర చేశారు. అదే విధంగా ‘కులగౌరవం’లో కుటుంబ పెద్దగా వృద్ధ పాత్రలో మరోసారి ఆడియన్స్‌తో క్లాప్స్ కొట్టించారు. ‘తోడు దొంగలు’ వచ్చిన ఏడాదే ‘రాజూ పేద’ చిత్రంలో ఎన్టీఆర్ పూర్తి డీ గ్లామరస్ రోల్ చేస్తే ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారు. అదే ఏడాది రిలీజైన మరో చిత్రం ‘పరివర్తన’లో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఎన్టీఆర్ అభినయిస్తే ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారే కానీ నెగటివ్‌గా తీసుకోలేదు. ఇంకా ‘పిచ్చి పుల్లయ్య’లో మానసిక పరిస్థితి బాగాలేని పుల్లయ్యగా, ‘తిక్క శంకరయ్య’లో శంకరయ్యగా.. ‘కలిసి ఉంటే కలదు సుఖం’, ‘ఆరాధన’ వంటి చిత్రాల్లో దివ్యాంగుడిగా ఎన్టీఆర్ ఒదిగిపోయారు. ఇవే కాదు.. ‘దాసి’లో జట్కా బండి రామయ్యగా... చెప్పుకుంటూ పోతే... ‘బడిపంతులు, ఆత్మ బంధువు, గుడిగంటలు’... ఇలా పలు చిత్రాల్లో ఎన్టీఆర్ కథలోని పాత్రలకే ప్రాధాన్యం ఇచ్చారు. చారిత్రకం ‘నందామయ.. గురుడ నందామయ..’ స్క్రీన్ మీద కాలజ్ఞాని వీరబ్రహ్మేంద్ర స్వామిగా సాత్వికంగా కనిపించారు ఎన్టీఆర్. ఒక యాక్షన్ హీరో అంత సాఫ్ట్ క్యారెక్టర్ చేయాలనుకోవడం ఓ సాహసం. ఎన్టీఆర్‌కి సాహసాలు ఇష్టం. అందుకే బ్రహ్మంగారి కథతో ‘శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర’ తీయాలనుకున్నారు. ఎన్టీఆర్ ఈ సినిమా తీయాలనుకోవడానికి ఓ కారణం ఉంది. అదేంటంటే... ఓసారి ఎన్టీఆర్ కడప జిల్లా సిద్ధవటంలోని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆశ్రమానికి వెళ్లారు. అక్కడ ఈ కాలజ్ఞాని చెప్పిన విషయాలు ఆయన్ను ఆకర్షించాయి. అందుకే వీరబ్రహ్మం పాత్ర చేయాలనుకున్నారు... దర్శకత్వం–నిర్మాణం కూడా ఎన్టీఆరే. షూటింగ్ సమయంలో కొన్ని ఆటుపోట్లు ఎదురయితే, పూర్తయ్యాక కొన్ని కారణాలతో మూడేళ్ల పాటు సెన్సార్ అనుమతి లభించలేదు. చివరికి ఆ సమస్య పరిష్కారమై 1984 నవంబరు 29న విడుదలై, ఘనవిజయం సాధించింది. ఎన్టీఆర్ చేసిన చారిత్రాత్మక చిత్రాల్లో ఈ చిత్రానిది ప్రముఖ స్థానం కాగా, ఈ సినిమాకన్నా దాదాపు ముప్పై ఏళ్ల ముందు చేసిన చారిత్రాత్మక చిత్రం ‘తెనాలి రామ కృష్ణ’ (1956)లో శ్రీకృష్ణ దేవరాయలుగా రాజసం చూపించారు ఎన్టీఆర్. కొంచెం తారాగణం మార్పుతో తెలుగు, తమిళ (‘తెనాలి రామన్’) భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందించారు. తమిళంలోనూ శ్రీకృష్ణ దేవరాయలు పాత్రను ఎన్టీఆర్ చేయగా, తెనాలి రామకృష్ణగా శివాజీ గణేశన్ నటించారు. తెలుగులో ఈ పాత్రను ఏఎన్నార్ చేశారు. రాజదర్బారులో న్యాయమైన తీర్పు ఇచ్చిన దేవరాయలుకి ప్రేక్షకులు కూడా మంచి తీర్పు ఇచ్చి, ఈ చిత్రాన్ని సూపర్ హిట్ చేశారు. అన్నట్లు ‘మహా మంత్రి తిమ్మరసు’లోనూ శ్రీకృష్ణ దేవరాయలుగా మెప్పించారు. ఇంకా ‘అక్బర్ సలీం అనార్కలి’లో అక్బర్ పాత్రలో ఒదిగిపోయారు. ఎన్టీఆర్ ఇష్టపడి చేసిన పాత్రల్లో అశోకుడు ఒకటి. ‘సామ్రాట్ అశోక్’తో అది నెరవేర్చుకున్నారు. ఇంకా ‘చాణక్య చంద్రగుప్త’ (చంద్రగుప్తుడు పాత్ర), ‘శ్రీనాథ కవి సార్వభౌముడు’ (శ్రీనాథుడు పాత్ర)... ఇలా ఎన్టీఆర్ చేసిన చారిత్రాత్మక చిత్రాల్లో చరిత్రలో నిలిచిపోయినవి చాలా ఉన్నాయి. -
టిఫిన్‌లో చికెన్.. ఎన్టీఆర్ నాకు ఆప్యాయంగా వడ్డించారు: రామ్‌చరణ్
నందమూరి తారక రామారావు.. తెలుగు సినిమాకు దిక్సూచి. తన నటనతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసిన ఆయన వారి గుండెల్లో తన స్థానాన్ని పదిలపరుచుకున్నారు. గత కొద్దిరోజులుగా ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శనివారం హైదరాబాద్‌లో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు నందమూరి బాలకృష్ణ, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు విచ్చేశారు. ఈ సందర్భంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాట్లాడుతూ.. 'ఎక్కడ మొదలు పెట్టాలో తెలియటం లేదు. ఏ స్థాయి గురించి మాట్లాడినా ఆ స్థాయిలన్నింటినీ మించిన పెద్ద పేరు, పెద్ద వ్యక్తి నందమూరి తారక రామారావుగారు. ఇలాంటి గొప్ప వ్యక్తులు వేసిన దారుల్లో నడుస్తూ వారిని గుర్తు చేసుకుంటే వచ్చే ఆనందం అంతా ఇంతా కాదు. సినిమా సెట్లో నాతో సహా ప్రతి ఆర్టిస్ట్ ఎన్టీఆర్ పేరును గుర్తు తెచ్చుకోకుండా ఉండరు. తెలుగు సినీ ఇండస్ట్రీ ఖ్యాతిని చాటిచెప్పిన ఏకైక వ్యక్తి ఎన్టీరామారావు. అలాంటి వ్యక్తి పని చేసిన చిత్రపరిశ్రమలో మనందరం పని చేస్తున్నామంటే అంతకంటే గర్వకారణం ఇంకేముంటుంది. నేను ఎన్టీఆర్‌ను ఒకే ఒకసారి మాత్రమే కలిశాను. నేను, పురందేశ్వరిగారి అబ్బాయి రితేష్ కలిసి స్కేటింగ్ క్లాసులకు వెళ్లే వాళ్లం. పొద్దున్నే ఐదున్నర, ఆరు గంటలకంతా క్లాసులు అయిపోయేవి. ఓ రోజు మా తాతయ్య గారి ఇంటికి వెళదామా? అని రితేష్ అన్నాడు. అప్పుడాయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయనకు పెద్ద సెక్యూరిటీ ఉంటుంది. అక్కడకు వెళ్లగలమా? లేదా? అని చెప్పే అవగాహన నాకు లేదు. నేను సరేనని చెప్పాను. ఇద్దరం స్కేటింగ్ చేసుకుంటూ పురందేశ్వరి ఇంటి నుంచి రామారావు గారి ఇంటికి వెళ్లాం. అప్పుడు ఉదయం ఆరున్నర గంటలు అవుతుంది. ఎన్టీఆర్‌గారిని కలిసి వెళ్లిపోదామనుకున్నా. అయితే ఆయన అప్పటికే నిద్రలేచి రెడీ అయిపోయి టిఫిన్‌కి కూర్చున్నారు. అందరికీ తెలిసినట్లే ఆ వయసులోనూ ఉదయాన్నే చికెన్ తింటున్నారు. నేను వెళ్లగానే నన్ను కూడా కూర్చోపెట్టి నాకు కూడా టిఫిన్ పెట్టారు. అది నాకు కలిగిన అదృష్టం. ఆయనతో కలిసి టిఫిన్ తిన్న క్షణాలను జీవితాంతం నేను మర్చిపోలేను. తెలుగు ఇండస్ట్రీ బ్రతికున్నంత వరకు ఆయన పేరు బతికే ఉంటుంది. జై ఎన్టీఆర్’ అంటూ స్పీచ్ ముగించాడు చెర్రీ. చదవండి: వెన్నెల కిశోర్ ఇంట్లో కుప్పలుగా రూ.2000 నోట్ల కట్టలు -
నందమూరి ఫ్యామిలీ నుంచి కొత్త హీరో.. బ్రీత్ ఫస్ట్ లుక్ రిలీజ్
నందమూరి కుటుంబం నుంచి మరో వారసుడు ఇండస్ట్రీకి హీరోగా పరిచయం కానున్నాడు. నందమూరి తారకరామారావు పెద్ద కొడుకు జయకృష్ణ కుమారుడు చైతన్య కృష్ణ హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వం వహిస్తున్న సినిమాలో కథానాయకుడిగా నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్‌ను కళ్యాణ్‌రామ్ రిలీజ్ చేశాడు. బ్రీత్: అంతిమ పోరాటం అని టైటిల్ ఫిక్స్ చేశారు. టైటిల్ పోస్టర్లో చైతన్య వర్షంలో గొడుగు పట్టుకుని నిలబడి ఏదో సీరియస్‌గా ఆలోచిస్తున్నట్లుగా ఉన్నాడు. బసవతారకం క్రియేషన్స్ బ్యానర్‌పై నందమూరి జయకృష్ణ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. Here's a glimpse from the Launch of #BreatheFirstLookLaunch by @NANDAMURIKALYAN ❤️🔥#BREATHE 🎬🌟ing #NandamuriChaitanyaKrishna Directed by @VKrishnaakellaMore Updates Loading Soon 💥 #NandamuriJayaKrishna @BTRcreations pic.twitter.com/WWo2BGktRg— Basavatarakarama Creations (@BTRcreations) March 5, 2023 Here's the First Look & Title of @BTRCreations Prod No.1 💥Presenting You all #NandamuriChaitanyaKrishna in a Breathtaking Avatar from #BREATHE ❤️🔥A film by @VKrishnaakella#BreatheFirstLook Launched by @NANDAMURIKALYAN 😍More Details Soon! pic.twitter.com/Yy9cUyOGRd— Basavatarakarama Creations (@BTRcreations) March 5, 2023 -
ఎన్టీఆర్‌ను జమున కాలితో తన్నడంపై వివాదం..
అలనాటి స్టార్ హీరోలందరితోనూ ఆడిపాడిన హీరోయిన్ జమున ఇక సెలవంటూ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. దాదాపు ముప్పై ఏళ్లపాటు హీరోయిన్గా రాణించిన ఆమె ఆనాటి అగ్ర కథానాయకులందరితోనూ నటించారు. నందమూరి తారకరామారావుతో మిస్సమ్మ, భూకైలాస్, గుండమ్మ కథ, గులేబకావళి కథ, శ్రీకృష్ణ తులాభారం.. ఇలా పలు విజయవంతమైన చిత్రాల్లో నటించారు. అయితే శ్రీకృష్ణ తులాభారం సినిమాలో ఎన్టీఆర్ కృష్ణుడిగా నటిస్తే జమున సత్యభామగా యాక్ట్ చేశారు. ఈ చిత్రంలో జమున కృష్ణుడిని కాలితో తన్నే సీన్ ఉంటుంది. ఈ సన్నివేశంపై ఎన్టీఆర్ అభిమానుల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. అయితే తన పాత్ర కోసమే అలా చేయాల్సి వచ్చిందని నటి వివరణ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. కానీ అప్పటికీ ఇప్పటికీ తెలుగువాళ్లకు సత్యభామ అంటే జమునే గుర్తొస్తుంది. చదవండి: అందాల చందమామ.. తెలుగు తెర సత్యభామ సీనియర్ నటి జమున కన్నుమూత -
బాలయ్య అనుచిత వ్యాఖ్యలు, ట్రెండింగ్‌లో ‘మెంటల్ బాలకృష్ణ’ హ్యాష్ ట్యాగ్!
సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ మరోసారి వివాదంలో నిలిచారు. ఆయన లేటెస్ట్ మూవీ వీర సింహారెడ్డి మూవీ సక్సెస్ మీట్ సినీ దిగ్గజాలను కించపరుస్తూ చేసిన ఆయన కామెంట్స్ ప్రస్తుతం ఇండస్ట్రీతో పాటు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమయ్యాయి. సినీ దిగ్గజం, నట సామ్రాట్ దివంగత అక్కినేని నాగేశ్వరరావుపై బాలయ్య అనుచిత వ్యాఖ్యలు చేసిని సంగతి తెలిసిందే. దీంతో అక్కినేని ఫ్యాన్స్ ఆయనపై మండిపడుతున్నారు. ఇటవల జరిగిన వీర సింహారెడ్డి మూవీ సక్సెస్ మీట్లో బాలయ్య మాట్లాడుతూ ‘అక్కినేని.. తొక్కినేని’ అని వ్యాఖ్యానించడం సరికాదని, ఇందుకు ఆయన క్షమాపణలు చెప్పాలని అక్కినేని అభిమాన సంఘాలు, కాపునాడు సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో బాలయ్య చేసిన కామెంట్స్‌ను తీవ్రంగా ఖండిస్తున్న ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఆయనను టార్గెట్ చేస్తున్నారు. ఈ మేరకు మెంటల్ బాలయ్య అని పేర్కొంటూ హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్న అక్కినేని ఫ్యాన్స్. మెంటల్ హ్యాష్‌ట్యాగ్ ‘‘అక్కినేని నాగేశ్వరరావుపై బాలకృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదు’’ అంటూ సోషల్ మీడియా వేదికగా వివిధ ప్రాంతాల నుంచి అక్కినేని అభిమానులు స్పందించారు. దీంతో ‘మెంటల్ బాలకృష్ణ, ముద్దుల మామయ్య కాదు.. మెంటల్ మామయ్య’ అనే హ్యాష్‌ట్యాగ్స్ ట్విటర్ వేదికగా ట్రెండింగ్‌లోకి వచ్చాయి. అలాగే వివిధ సందర్భాల్లో బాలకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలు, అభ్యంతరకర ప్రవర్తనలకు సంబంధించిన వీడియోలను అక్కినేని ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ‘ఈ మెంటల్‌కి సర్టిఫికెట్ రెన్యూవల్ చేయలేదా?.. మళ్ళీ పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు.. ఎస్వీ రంగారావుగారు, అక్కినేని నాగేశ్వర రావుగారి గురించి మాట్లాడే స్థాయి నీకు ఉందా అసలు?’ అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. ‘‘బహిరంగ సభల్లో మాట్లాడకుండా బాలకృష్ణపై నిషేధం విధించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నాను. వివిధ కారణాల వల్ల ఆయన నాలుకకు అడ్డూ అదుపు ఉండటం లేదు’ అంటూ ఓ ఫ్యాన్ ట్వీట్ చేశారు. ఇటు ఎస్వీ రంగారావు అభిమానులు కూడా బాలకృష్ణ వైఖరిని తప్పుపడుతూ సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించారు. Ma mental balakrishna ni kutha pagal degai la Unaru 🤣 Andhukai mata matladai mundhu alochinchi matladali... Adhi yavar ina sare.... #MentalBalaKrishna pic.twitter.com/rvD6oVOlEV — AK Badri (@AKBadri6848) January 25, 2023 సినిమాల్లో డైలాగ్స్ ఏముంది బొచ్చడు చెప్పుకోవచ్చు కానీ బైట అలా ఉండదు #VeeraSimhaReddy#MentalBalaKrishna pic.twitter.com/sf31KY3Y2e — Mahesh (@Norito_DON) January 23, 2023 చివరి రోజుల్లో ఎన్టీఆర్‌కు పట్టెడన్నం కూడా పెట్టని నందమూరి వారసులు రామారావుగారి చివరి రోజుల్లో ఆయనకు పట్టెడన్నం కూడా నందమూరి వారసులు పెట్టలేదన్న విషయం నందమూరి బాలకృష్ణగారు గ్రహించాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా స్వర్గీయ వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డిగారు ఉన్న సమయంలో బాలకృష్ణగారి ఇంట్లో కాల్పులు జరిగినప్పుడు ఏ విధంగా ఆ కేసు నుంచి బాలకృష్ణగారు బయటపడ్డారనే నిజం ఆయనకే (బాలకృష్ణ) తెలియాలి. ఈ కేసు విషయాలను బాలకృష్ణగారు బయటపెడితే మేం కూడా స్వాగతిస్తాం. ఇకనైనా బాలకృష్ణగారు సీనియర్ నటులను గౌరవించడాన్ని నేర్చుకోవాలి. అక్కినేని నాగేశ్వరరావుగారిపై ఇకపై ఏ నటుడైనా విమర్శలు చేస్తే అభిమానులు కూడా ప్రతి విమర్శలు చేస్తారు’’ అంటూ కడప జిల్లా నాగార్జున యువశక్తి అధ్యక్షుడు ఓ వీడియో షేర్ చేశారు. ఇంకా ఆ వీడియోలో ఆయన మాట్లాడుతూ.. ‘‘అక్కినేని నాగేశ్వరరావుగారికి ఎన్నో అవార్డులు రాకుండా చేసింది ఎవరో అందరికీ తెలుసు. సినీ ఇండస్ట్రీ హైదరాబాద్‌కు రావడానికి ముఖ్య కారకులు నాగేశ్వరరావుగారు. అలాంటి నటుడిపై బాలకృష్ణ విమర్శలు చేయడం దారుణం. సొంతంగా స్పందించిన డబ్బుతో అక్కినేని నాగేశ్వరరావుగారు అన్నపూర్ణ స్టూడియోను నిర్మించాలనుకుంటే ఆ స్థలాన్ని కూడా నందమూరి రామారావుగారు కబ్జా చేయాలని చూస్తే, కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది. అయినప్పటికీ తన చివరి రోజుల్లో కూడా రామారావుగారు అక్కినేని నాగేశ్వరరావుగారిని బ్రదర్ అంటూ పిలిచారు. తన తండ్రి వయసుగల అక్కినేని నాగేశ్వరరావుగారిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇకనైనా మానుకోవాలి’’ అన్నారు. ‘‘బాలకృష్ణ గారు వాళ్ల నాన్నగారి ముందు వీళ్లంతా ఎవరూ అక్కినేని, తొక్కినేని అంటూ అసభ్యకర పదజాలంతో మాట్లాడటం అహంకారపూరిత అవలక్షణంగా భావించాల్సి వస్తోంది’’ అంటూ అక్కినేని ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్. సర్వేశ్వరరావు ఓ ప్రెస్‌నోట్ విడుదల చేశారు. ‘‘తెలుగు సినిమా ఇండస్ట్రీ కళాకారులను మదరాసులోనే అంతం అవకుండా మొట్టమొదట హైదరాబాద్‌కు తీసుకువచ్చి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఎంతో సేవలు చేసేలా చేసి, తన నటనతో, సేవాభావంతో ఎంతోమందికి, ఆర్టిస్ట్‌లకు అవకాశాలు కల్పిస్తూ ఎంతో ఉన్నత స్థాయికి చేరుకున్న స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు గారిని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన నందమూరి బాలకృష్ణగారి అహంకారపు మాటలను ఖండిస్తున్నాం. మీ (బాలకృష్ణని ఉద్దేశించి) నాన్నకు అన్యాయం చేసి అధికారం లాక్కుంటే, మీ నాన్న మాటల్లో ఆ నీచుడిని చంపి నా దగ్గరికి రా బాలయ్య అంటూ ఆ రోజు మీ నాన్న నీకు చెప్తే ఈ రోజుకీ ఒక కొడుకుగా నెరవేర్చలేని నీ హీరోయిజం ఏ మాత్రానికి అని మేం ప్రశ్నించవచ్చు. కానీ మా అక్కినేని ఫ్యాన్స్‌కు ఆ సంస్కారం ఉంది. ఇక మీద మీ అహంకార కుల మత్తు మాటలు కట్టిపెట్టి అక్కినేని కుటుంబానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే అక్కినేని ఫ్యాన్స్ అసోసియేషన్ వారు చేసే విభిన్న కార్యక్రమాలకు మీరు చాలా బాధపడాల్సి వస్తుందని అక్కినేని ఫ్యాన్స్ అసోసియేషన్ హెచ్చరిస్తూ ఉంది’’ అని ప్రెస్‌నోట్‌లో పేర్కొన్నారు. పవన్ స్పందించాలి ఎప్పుడూ ఇండస్ట్రీకి ఏదో మేలు చేసే వ్యక్తిలా మాట్లాడే పవన్ కల్యాణ్ ఇప్పుడు ‘అక్కినేని నాగేశ్వరరావుగారి’పై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై స్పందించాలని ఓ అక్కినేని ఫ్యాన్ ట్వీట్ చేశారు. ఇక పవన్ కల్యాణ్ ఎవరో తనకు తెలియదని బాలకృష్ణ ఓ సందర్భంలో పేర్కొన్నారు. కానీ బాలకృష్ణ వ్యాఖ్యాతగా ‘ఆహా’ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతున్న ‘అన్ స్టాపబుల్’ టాక్ షో సెకండ్ సీజన్‌లోని ఓ ఎపిసోడ్‌కు పవన్ గెస్ట్‌గా వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ ఎపిసోడ్ త్వరలోనే స్ట్రీమింగ్ కానుంది. ఇటీవలే క్షమాపణలు చెప్పిన బాలకృష్ణ దేవబ్రాహ్మణులకు నాయకుడు రావణబ్రహ్మ అంటూ ఇటీవల బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. దీంతో తన పొరపాటును మన్నించాల్సిందిగా కోరుతూ బాలకృష్ణ ఓ లేఖను విడుదల చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. -
టికెట్ ధరలు అలా ఉంటేనే ఇండస్ట్రీకి మంచిది: బాలకృష్ణ
సినిమా టికెట్ ధరలు అందరికీ అందుబాటులో ఉంటేనే చిత్రపరిశ్రమకు మంచిదని హీరో నందమూరి బాలకృష్ణ అన్నారు. హైదరాబాద్‌లో కాచిగూడలో తారకరామ థియేటర్‌ను ఆయన పునః ప్రారంభించారు. లెజెండరీ ఫిలిం పర్సనాలిటీ నారాయణ్ కె దాస్ నారంగ్, ఆయన కుమారులు సునీల్ నారంగ్, భరత్ నారంగ్, నందమూరి తారక రామారావుపై అభిమానంతో 'ఏషియన్ తారకరామ' థియేటర్‌ను పునరుద్ధరించారు. ఇవాళ 'ఏషియన్ తారకరామ' థియేటర్‌ను బాలకృష్ణతో పాటు ప్రొడ్యూసర్ శిరీష్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. ' మీ అందరి గుండెల్లో శాశ్వతంగా పెద్దాయన ప్రతిరూపంగా నిలిచారు. విశ్వ విఖ్యాత నట సార్వభౌముడైన ఆ కారణజన్ముడికి ఈ శత జయంతి సందర్భంగా నా అభినందనలు. తారకరామ థియేటర్‌కు ఎంతో గొప్ప చరిత్ర ఉంది. నాన్నగారు ఏది చేసిన చరిత్రలో నిలిచిపోయేలా చేస్తారు. అలాగే ఈ తారకరామ థియేటర్ వుండేది. 1978లో 'అక్బర్ సలీం అనర్కాలి'తో ఈ థియేటర్ ప్రారంభించడం జరిగింది. సునీల్ నారంగ్ అందరికీ అందుబాటు ధరలో టికెట్ రేట్లు ఉంటాయని చెప్పారు. ఇది ఇండస్ట్రీకి చాలా ఆరోగ్యకరమైన విషయం. ఓటీటీ రూపంలో సినిమా ఇండస్ట్రీకి ఒక కాంపిటేషన్ ఉంది. పాన్ ఇండియా స్థాయికి మన తెలుగు చిత్ర పరిశ్రమ ఎదిగింది.' అని అన్నారు సునీల్ నారంగ్ మాట్లాడుతూ.. 'మహనీయుడు ఎన్టీఆర్ పేరు మీద ఈ థియేటర్ ఉంది. బాలకృష్ణ థియేటర్ ప్రారంభించడం చాలా సంతోషంగా వుంది. సరి కొత్త టెక్నాలజీతో థియేటర్ అద్భుతంగా నిర్మించాం. 600 సీట్లు ఏర్పాటు చేశాం. రేట్లు కూడా రిజనబుల్గానే పెట్టాం. మా నాన్న, ఎన్టీఆర్ చాలా మంచి స్నేహితులు. నందమూరి కుటుంబంతో మా అనుబంధం చాలా గొప్పది. భవిష్యత్‌లో ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నా.' అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నందమూరి మోహన్ కృష్ణ, నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్న, శిరీష్, సదానంద్ గౌడ్, భరత్ నారంగ్, డైరెక్టర్ వైవీఎస్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. -
‘అమ్మాయిల పిచ్చి రూమర్’పై స్పందించిన కాంతారావు కూతురు
టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రనటుడిగా ఓ వెలుగు వెలిగాడు కాంతారావు. హీరోగా, సహాయ నటుడిగా ఎన్నోరకాల పాత్రలు పోషించి విశేష పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఆయన ఎంతగానో ఆస్తులు పోగేశాడు. కానీ తర్వాతి కాలంలో నిర్మాతగా మారి ఆస్తులు పోగొట్టుకున్నాడు. ఈ క్రమంలో 400 ఎకరాలను పోగొట్టుకున్నాడు. కాంతారావు కూతురు సుశీల రావు మాట్లాడుతూ.. 'నాన్నగారి చిన్నతనంలోనే తాతయ్య చనిపోయాడు. దీంతొ నానమ్మ నాన్నను గారాబంగా పెంచింది. ఎవ్వరు ఏం చెప్పినా తనకు నచ్చిందే చేసేవాడు. నిర్మాణ రంగం వైపు వెళ్లొద్దని ఎన్టీ రామారావు గారు చెప్పారు, కానీ ఆయన వినిపించుకోలేదు. సినిమాల కోసం 400 ఎకరాలు అమ్మేశారు. అలా సినిమాలు నిర్మించి చాలా నష్టపోయారు. నష్టపోయిన తర్వాత మాత్రమే ఎన్టీఆర్ మాట వినుంటే బాగుండేదని అనుకున్నారు. అప్పుడు కృష్ణ- విజయనిర్మలగారు మా ప్రతి సినిమాలో కాంతారావుకు ఓ వేషం ఇప్పిస్తామన్నారు. ఆ మాట నిలబెట్టుకున్నారు. నా పెళ్లి కోసం కృష్ణగారు రూ.10 వేల ఆర్థిక సాయం చేశారు. నాన్నకు సినిమా తప్ప వేరే ప్రపంచం తెలియదు. చచ్చేదాకా నటిస్తూ ఉండాలన్నదే ఆయన కోరిక. కాంతారావుకు ఆడవాళ్ల పిచ్చి ఉంది, దానివల్లే ఉన్నదంతా పోగొట్టుకున్నారని ఓ రూమర్ ఉంది. అది పూర్తిగా అవాస్తవం. ఆయనకు సినిమాలు, ఇల్లు ఈ రెండే తెలుసు. ఏ హీరోయిన్‌కూ డబ్బులివ్వలేదు' అని క్లారిటీ ఇచ్చింది సుశీల. -
కృష్ణ సినిమాల్లోకి రావడానికి ఆ హీరోనే కారణం!
మంచితనానికి నిలువెత్తు నిదర్శనం సూపర్ స్టార్ కృష్ణ. నటుడిగానే కాకుండా రాజకీయ నేతగా కూడా రాణించారాయన. గతంలో ఆయన సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలను బయటపెట్టారు. మరి ఆయన ఏమని మాట్లాడారో ఓసారి చూద్దాం.. 'పౌరాణికం, జానపదం, సాంఘికం, హారర్, విప్లవం.. ఇలా అన్నిరకాల సినిమాలు చేశాను. అందుకు సంతృప్తిగా ఉంది. అల్లూరి సీతారామరాజు, ఈనాడు వంటి సినిమాల్లో పోషించిన పాత్రలు నాకెంతో ఇష్టం. నేను సినిమాల్లోకి రావడానికి అక్కినేని నాగేశ్వరరావు స్ఫూర్తి. నిజానికి నేను నందమూరి తారకరామారావు అభిమానిని. కానీ స్టూడెంట్‌గా ఉన్నప్పుడు ఆయనను ఎప్పుడూ నేరుగా చూడలేదు. అయితే నాగేశ్వరరావును మాత్రం నాలుగుసార్లు చూశాను. అప్పుడు సినిమా ఆర్టిస్టులకున్న క్రేజ్ చూసి నేనూ ఆర్టిస్ట్ అవుదామనుకున్నా! అలా మొదటిసారి తేనె మనసులు చిత్రంలో నటించా. ఏడు సంవత్సరాలలోనే వంద సినిమాలు చేశాను' అని చెప్పుకొచ్చారు కృష్ణ. చదవండి: కృష్ణ చివరి చిత్రం ఏంటో తెలుసా? ఆయన లేరన్న వార్త విని గుండె పగలింది: రామ్‌చరణ్ -
ఆ మర్డర్ వెనుక నువ్వు, రామోజీ లేరా?: లక్ష్మీపార్వతి
సాక్షి, తాడేపల్లి: అధికార దాహంతో చంద్రబాబునాయుడు ఎల్లోమీడియాలో తనపై పిచ్చి కూతలు రాయిస్తున్నారంటూ తెలుగు అకాడమీ చైర్మన్ లక్ష్మీపార్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఎలాంటి స్వార్థం కోసం ఎన్టీఆర్ జీవితంలోకి రాలేదని స్పష్టం చేశారు. ఎన్టీఆర్‌పై తనకున్న అభిమానం గురించి అందరికీ తెలుసన్నారు. ఏరోజూ పార్టీ విషయాల్లో జోక్యం చేసుకోలేదని తెలిపారు. అల్లుళ్ల కొట్లాట వల్లే 1989లో ఓడిపోయామని ఎన్టీఆర్ ఆనాడు చెప్పారని గుర్తు చేశారు. ఎన్టీఆర్ జీవితంలోకి ఆమె ప్రవేశించాక టీడీపీ ఘనవిజయం సాధించిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గతంలో ఎన్టీఆర్ మాట్లాడిన వీడియోని లక్ష్మీ పార్వతి ప్రదర్శించారు. 'చంద్రబాబు అధికార వ్యామోహాన్ని పక్కదారి పట్టించేందుకు ఇప్పుడు నాపై దుష్ప్రచారం చేస్తున్నారు. నాకు అధికార దాహం ఉంటే ఆనాడు చంద్రబాబుకు రెండు పదవులు వచ్చేవా?. చంద్రబాబు నమ్మించి గొంతుకోస్తాడని ఎన్టీఆర్ నాతో చాలాసార్లు చెప్పారు. అయితే ఎన్టీఆర్‌కు ద్రోహం చేయబోనని చంద్రబాబు నాకు ప్రమాణం చేశారు. పాముకు పాలుపోస్తున్నావని చంద్రబాబు గురించి ఎన్టీఆర్ ఆనాడే అన్నారు. చంద్రబాబు రోజుకో అబద్ధం మాట్లాడతాడు. ఈ రోజు తండ్రి గురించి మాట్లాడుతున్న కుటుంబ సభ్యులు సిగ్గుపడాలి. ఇప్పటికైనా పశ్చాత్తాప పడరా?. చంద్రబాబు కుట్రలో భాగంగానే ఈటీవీని లాంచ్ చేశారు. రామోజీ పిచ్చి రాతలపై అప్పట్లోనే ఎన్టీఆర్ స్పందించారు. ఎన్టీఆర్‌పై ఈనాడులో పిచ్చిపిచ్చి కార్టూన్లు వేశారు. ఎల్లోమీడియా ఎన్టీఆర్ వ్యక్తిత్వాన్ని కించపరిచింది. తప్పుడు ప్రచారంతో ఎమ్మెల్యేల్లో భయాందోళన సృష్టించారు. అప్పటి స్పీకర్ యనమల వెన్నుపోటులో భాగమయ్యాడు. వైశ్రాయ్ హోటల్ దగ్గర చెప్పులు వేయించిన సంగతి గుర్తులేదా?. రామోజీరావు, చంద్రబాబు, రాధాకృష్ణ కలిసే కుట్ర చేశారు. ఎన్టీఆర్ ప్రధాని అవుతారన్న భయంతోనే కుట్ర చేశారు. ఎన్టీఆర్‌ను చంపిన హంతకులు గురించి అందరికీ తెలియాలి. అధికారంలో ఉన్న ఏరోజైనా ఎన్టీఆర్ పేరు పెట్టావా చంద్రబాబూ?. ఎన్టీఆర్ పేరు తీసేయాలని రాధాకృష్ణ, నువ్వు మాట్లాడుకోలేదా?. ఎన్టీఆర్‌ది హత్యా? కాదా?. ఆ హత్య వెనుక నువ్వు, రామోజీ లేరా? అని లక్ష్మీపార్వతి ప్రశ్నించారు. -
ఇదీ చరిత్ర.. ఇవీ నిజాలు: ఎన్టీఆర్.. చంద్రబాబు.. అలనాటి నగ్నసత్యాలు
ఎన్టీఆర్.. గత మూడు రోజులుగా చంద్రబాబు, ఇప్పటి తెలుగుదేశం పార్టీ నేతలు వల్లిస్తున్న పేరు. అర్జంట్‌గా ఎన్టీఆర్ పేరును తలకెక్కించుకున్న వీరు.. గతంలో ఎన్టీఆర్‌కు ఏం చేశారో తెలియాలంటే కచ్చితంగా వెనక్కి తిరిగి చూడాల్సిందే. ఎన్టీఆర్, చంద్రబాబు.. మామ అల్లుళ్ల సంబంధం. తన కుమార్తెను చంద్రబాబుకు కానుకగా ఇచ్చి ఎన్టీఆర్ పెళ్లి చేస్తే.. చంద్రబాబు తన మామకు వెన్నుపోటును రిటర్న్ గిఫ్ట్‌గా ఇచ్చారు. అందుకే బాబుని ఎన్టీఆర్ దశమ గ్రహంగానూ, ఔరంగజేబుగానూ పోల్చారు. అనుక్షణం చంద్రబాబు అండ్ కో పెట్టిన మానసిక క్షోభతోనే ఎన్టీఆర్ కన్నుమూశారన్నది ఎవరైనా చరిత్ర తెలిసిన వారు చెప్పే విషయం. ఇంత చేసిన తర్వాత కూడా అదే ఎన్టీఆర్‌ను తమ సొంత ప్రాపర్టీగా ప్రచారం చేసుకుంటారు చంద్రబాబు. దశమ గ్రహమై ఎన్టీఆర్‌కు విద్రోహం తలపెట్టిన చంద్రబాబు.. ఆయనపై చెప్పులు వేయించి తమాషా చూశారు. పార్టీని చెరబట్టి సైకిల్ గుర్తును సొంతం చేసుకున్నారు. అనుక్షణం మానసిక క్షోభకు గురిచేసి ఆయన మరణానికి చంద్రబాబు నాయుడు అండ్ కోనే కారణమయ్యారన్న విమర్శలున్నాయి. తెలుగు సినీ రంగానికి మకుటం లేని మహారాజుగా వెలుగు వెలిగారు నందమూరి తారకరామారావు. అభిమాన ధనుడిగా పేరు గడించిన ఎన్టీఆర్ తెలుగువాడి ఆత్మగౌరవానికి ప్రతీకగా రాజకీయాల్లోకి వచ్చారు. అటు సినిమాల్లోనూ ఇటు రాజకీయాల్లోనూ కూడా తనదైన శైలితో వెలిగారు ఎన్టీఆర్. ప్రపంచమంతా గౌరవించే ఎన్టీయార్ తన జీవిత చరమాంకంలో చిత్రంగా తన సొంత మనుషులు అనుకున్న వాళ్ల చేతుల్లోనే ఘోరమైన అవమానాలు పొందారు. కంట తడి పెట్టుకున్నారు. గుండెలనిండా మనస్తాపంతో తీవ్ర మానసిక క్షోభకు గురయ్యారు. ఆ క్షోభలోనే అంతిమ శ్వాస విడిచి ఈ లోకానికి గుడ్ బై చెప్పారు. చదవండి: (అందుకే హెల్త్ యూనివర్శిటికీ వైఎస్సార్ పేరు.. వాస్తవాలివిగో..) ఎన్టీఆర్‌ను అవమానించింది ఆయన రాజకీయ ప్రత్యర్ధులు కాదు. తాను పెట్టిన తెలుగుదేశం పార్టీలో చేరి తాను ఇచ్చిన పదవులు అనుభవించి రాజకీయంగా బలిసిన వాళ్లే ఎన్టీఆర్‌ను ఘోరంగా అవమానించారు. ఈ మొత్తం విద్రోహానికి అల్లుడు చంద్రబాబు నాయుడే సారధ్యం వహించారు. 1994 ఎన్నికల్లో ఘన విజయం సాధించి ముఖ్యమంత్రి అయిన ఎన్టీఆర్‌కు చంద్రబాబు నాయుడే వెన్నుపోటు పొడిచారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను ట్రాప్‌లో పడేసి తన వెన్నుపోటు ప్రహసనంలో పావులుగా వాడుకున్నారు. ఎన్టీఆర్‌ను పదవి నుండి తప్పించారు. ఈ తిరుగుబాటులో ఎమ్మెల్యేలంతా చంద్రబాబు నాయుడి మాయలో పడ్డారని భావించిన ఎన్టీఆర్ పార్టీ ఎమ్మెల్యేలను ఒప్పించడానికి వైస్రాయ్ హోటల్‌కు వెళ్తే చంద్రబాబు నాయుడు దగ్గరుండి ఎన్టీఆర్‌పై చెప్పులు వేయించి దాడి చేశారు. ఈ ఘోరమైన అవమానాన్ని ఎన్టీఆర్ తట్టుకోలేకపోయారు. ఆత్మ గౌరవానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చే ఎన్టీఆర్ తనకు జరిగిన అవమానంతో కృంగిపోయారు. ఆ క్షణమే తాను చచ్చిపోయినట్లు లెక్క అని కంటతడి పెట్టి ఆక్రోశించారు. ఈ విద్రోహంలో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులంతా చంద్రబాబు వెన్నంటే ఉండడం అతి పెద్ద విషాదం. తన ఆత్మబంధువులు అనుకున్నవారు.. తాను రాజకీయ భిక్ష పెట్టిన వారు కూడా తనకు ద్రోహం తలపెట్టడాన్ని ఎన్టీఆర్ జీర్ణించుకోలేకపోయారు. ఈ బాధలో ఉండగానే ఆయన బ్యాంకు ఖాతాను చంద్రబాబు నాయుడు ఫ్రీజ్ చేయించారు. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ గుర్తు సైకిల్‌ను తన సొంతం చేసుకున్నారు. ఎన్టీఆర్ కుర్చీని కబ్జా చేసిన చంద్రబాబు అసెంబ్లీలోనూ ఎన్టీఆర్‌ను అవమానించారు. టీడీఎల్పీ నాయకుడినైన తనను బీఏసీ సమావేశాలకు పిలవలేదని ఎన్టీఆర్ మొర పెట్టుకుంటే టిడిపి సభ్యులు ఆహా ఓహో అంటూ వెటకారాలాడి వెక్కిరించి ఎన్టీఆర్‌ను బాధపెట్టారు. ఆయన కంటతడి పెట్టుకుంటే తమాషా చూశారు. అసెంబ్లీలో తన వాదన వినిపించాలని ప్రయత్నిస్తే ఎన్టీఆర్‌కు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు. తనకు జరిగిన అన్యాయానికి గుండెలు పగిలేలా కుమిలిపోయిన ఎన్టీఆర్ న్యాయం కోసం ఎదురు చూస్తోన్న వేళ చంద్రబాబు నాయుడు మరో క్షుద్ర క్రీడకు తెరతీశారు. తన వెన్నుపోటుకు అండగా నిలిచిన ఎల్లో మీడియాలో ఎన్టీఆర్‌ను ఘోరంగా అవమానించేలా కార్టూన్లు వేయించి పైశాచిక ఆనందం పొందారు. పార్టీలో దుష్టశక్తులు ఉన్నాయని ఎన్టీఆర్ అంటే ఆ దుష్టశక్తులు ఎన్టీఆర్ లక్ష్మీపార్వతులే అన్నట్లు ఓ కార్టూనే వేయించారు. ఆయన బట్టలు ఊడదీసినట్లు మరో కార్టూన్ వేయించారు. ఇలా కాకులు పొడిచినట్లు ఎన్టీఆర్‌ను అవమానాలపై అవమానాలు చేస్తూ హింస పెట్టారు. పదవి కోసం తనకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబును ఔరంగ జేబుతో పోల్చారు ఎన్టీఆర్. జామాతా దశమగ్రహం పేరిట ఓ క్యాసెట్ రిలీజ్ చేశారు. అందులో చంద్రబాబుపై నిప్పులు చెరిగారు ఎన్టీఆర్. ఈ వరుస అవమానాలతో ఎన్టీఆర్ మానసికంగా చితికి పోయారు. అంతులేని బాధను అన్నగారి గుండె తట్టుకోలేకపోయింది. ఆ క్షోభలోనే ఎన్టీఆర్ కన్నుమూశారు. ఎన్టీఆర్ మరణానంతరం ఆయన ఆనవాళ్లు లేకుండా చేసే చంద్రబాబు నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్టీఆర్ తెచ్చిన మద్య నిషేధాన్ని ఎత్తి వేశారు. రెండు రూపాయల బియ్యం పథకాన్ని ఎత్తివేశారు. రైతులకు నీటి రాయితీకి గుడ్ బై చెప్పారు. అటు పార్టీలోనూ ఎన్టీఆర్ జ్ఞాపకాలు లేకుండా చెరుపుకుంటూ పోయారు. నిజానికి వెన్నుపోటుకు చాలా ముందుగానే స్కెచ్ గీసుకున్నారు చంద్రబాబు. ఎన్టీఆర్ ఉన్నంత వరకు తాను ముఖ్యమంత్రిని కాలేనని తెలుసుకున్న చంద్రబాబు ఎన్టీఆర్‌నే ఆ కుర్చీలోంచి గెంటేయాలని వ్యూహరచన చేశారు. దానికి ఈనాడు అధినేత రామోజీ మద్దతు ఉందని అంటారు. తన రాజకీయ వారసుడిగా తన పెద్ద కొడుకు హరికృష్ణను తీర్చిదిద్దాలని ఎన్టీఆర్ అనుకునేవారు. తెలుగుదేశం పార్టీ పెట్టిన క్షణం నుంచి ఎన్టీఆర్ చైతన్య రథానికి సారధిగా హరికృష్ణే వ్యవహరించారు. హరికృష్ణను తెలివిగా తప్పించారు చంద్రబాబు. ముఖ్యమంత్రి అయిన తర్వాత పార్టీ మేనిఫెస్టోలో ఎన్టీఆర్ ఫోటో లేకుండా జాగ్రత్తలు పడ్డారు ఎన్టీఆర్. అయితే అదే చంద్రబాబు నాయుడు ఎన్నికలు వస్తే మాత్రం అదే ఎన్టీఆర్ బొమ్మలు అవసరం అయ్యేవి. ఏడాదికోసారి జయంతి, వర్ధంతి వచ్చినపుడు మాత్రమే చంద్రబాబు నాయుడు అండ్ కో ఎన్టీఆర్ విగ్రహాలకు ఓ దండ వేసి దండం పెట్టి ఊరుకుంటున్నారు. ఎన్టీఆర్‌నే కాదు ఆయన వర్గీయులుగా ముద్రపడ్డ వారికీ పార్టీలోనూ ప్రభుత్వంలోనూ పదవులు ఇవ్వకపోవడం ద్వారా ఎన్టీఆర్‌పై తనకున్న ద్వేషాన్ని బాహాటంగానే చాటుకున్నారు చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్‌కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచిన సమయంలో కొందరు టిడిపి ఎమ్మెల్యేలు మాత్రం ఎన్టీఆర్తోనే ఉండిపోయారు. వారు చంద్రబాబుకు మద్దతు ఇవ్వలేదు. అయితే ఎన్టీఆర్ మరణానంతరం మారిన రాజకీయ సమీకరణల్లో భాగంగా అందులో కొందరు తిరిగి టిడిపిలో చేరారు. పార్టీ ఆవిర్బావం నుంచి ఉన్న ఆ నాయకులను చంద్రబాబు తీవ్రంగా అవమానించారు. తనకంటే సీనియర్లు అయిన ఎన్టీఆర్ వర్గీయులైన దాడి వీరభద్రరావు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, గాలి ముద్దు కృష్ణమనాయుడు వంటి నేతలకు తన ప్రభుత్వంలో ఎన్నడూ మంత్రి పదవులు ఇవ్వలేదు చంద్రబాబు. ఇక ఆ తర్వాత ఎన్టీఆర్ సిద్ధాంతాలకు ఆలోచనలకు ఆశయాలకు తిలోదకాలిచ్చారు చంద్రబాబు. ఇలా ఎన్టీఆర్‌ను అడుగడుగునా అవమానాలకు గురి చేస్తూ అనుక్షణం క్షోభ పెడుతూ మోసపూరిత కుట్రలతో మనస్తాపానికి గురి చేసిన చంద్రబాబు నాయుడు అండ్ కో ఇపుడు ఎన్టీఆర్ మా వాడే అంటూ నాటకాలాడే ప్రయత్నం చేస్తోంటే జనం ఫక్కున నవ్వుకుంటున్నారు. ఎన్టీఆర్‌ను ఇప్పటికీ ద్వేషిస్తూనే వస్తున్నారు చంద్రబాబు నాయుడు. గత ఎన్నికలకు ముందు ఎన్టీఆర్ పేరుతో ఉన్న పథకం పేరును మార్చేస్తానని ఆంధ్రజ్యోతి ఎండీతో చంద్రబాబు నాయుడు చెప్పిన విషయాలు బహిర్గతం కావడంతో అన్నగారి అభిమానులే కాదు తెలుగు ప్రజలంతా బాబు అండ్ ఎల్లోమీడియాలపై ఖాండ్రించి ఉమ్మేసినంత పని చేశారు. జీవించి ఉన్నంత కాలం ఎన్టీఆర్‌ను క్షోభపెడుతూ వచ్చిన చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ మరణించిన తర్వాత కూడా ఆయన్ను వదిలిపెట్టకుండా అవమానిస్తున్నారని పాతతరం టిడిపి నేతలు నిప్పులు చెరుగుతున్నారు. ఎన్టీఆర్‌కు భారతరత్న అవార్డు విషయంలోనూ ఇదే తీరు. తాను తీసుకురాకపోవడం ఒక ఎత్తయితే అటల్ బిహారీ వాజ్ పేయ్ ప్రధానిగా ఉండగా ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వడానికి కేంద్రం అంతా సిద్దం చేస్తూ ఉండగా చివరి నిమిషంలో ఆ అవార్డు ఎన్టీఆర్‌కు రాకుండా ఆగిపోయింది. అది ఎవరి కుట్ర వల్ల జరిగిందా అని ఆరా తీస్తే చంద్రబాబు నాయుడే ఆ అవార్డు ఎన్టీఆర్‌కు ఇవ్వద్దని వాజ్ పేయ్పై ఒత్తిడి తెచ్చారని తేలింది. -
నందమూరి ఫ్యామిలీకి కలిసిరాని ఆగస్టు, విషాదాలన్నీ ఈ నెలలోనే..
దివంగత నటుడు, మాజీ సీఎం ఎన్టీఆర్ చిన్న కూతురు(నాలుగో కుమార్తె) కంఠమనేని ఉమామహేశ్వరి(57) మృతితో నందమూరి ఇంట విషాదం నెలకొంంది. సోమవారం(ఆగస్ట్ 1న) ఆమె ఆత్మహత్య చేసుకున్న సంగతి విధితమే. దీంతో ఆమెను కడసారి చూసేందుకు నందమూరి హీరోలు, బంధువులు జుబ్లీహిల్స్‌లోని ఆమె ఇంటికి వస్తున్నారు. రేపు మహా ప్రస్థానంలో ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం నందమూరి కుటుంబానికి సంబంధించిన ఓ ఆసక్తికర అంశం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. చదవండి: అప్పుడే ఓటీటీకి ‘థ్యాంక్యూ’?, స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే! గత కొంతకాలంగా నందమూరి ఇంట వరుస విషాదాలు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. 2019 హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం ఇప్పుడు తాజాగా ఉమామహేశ్వరి బలవన్మరానినకి పాల్పడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. దీంతో ఈ ఆగష్టు నెల నందమూరి ఇంటికి కలిసి రావడం లేదని, విషాదలన్ని ఈ నెలలో చోటుచేసుకుంటున్నాయంటూ చర్చించుకుంటున్నారు. కాగా హరికృష్ణ ఓ పెళ్లికి వెళుతూ నెల్లూరు సమీపంలో ఆగష్టు 29, 2019లో రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందారు. చదవండి: ‘కార్తీకేయ 2’ ప్రమోషన్స్‌కి అనుపమ డుమ్మా.. నిఖిల్ షాకింగ్ కామెంట్స్! ఇప్పుడు ఆగష్టు నెలలోనే ఉమామహేశ్వరి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అంతేకాదు రాజకీయ పరంగానే ఎన్టీఆర్‌కు ఈ ఆగస్ట్ నెల కలిసిరాలేదంటున్నారు. రాజకీయ పరంగా నాదేండ్ల భాస్కర్ మోసం, ఆయన అల్లుడు నారా చంద్రబాబు నాయుడు వెన్నుపోటు ఈ ఆగస్ట్ నెలలో చోటుచేసుకోవడం గమనార్హం. అయితే 2014 డిసెంబర్ 6న హరికృష్ణ పెద్ద కుమారుడు జానకి రామ్ రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఇలా వరుస విషాదాలు నందమూరి ఇంట చోటుచేసుకోవడంతో అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. -
తల్లి మరణంపై కీలక విషయాలు వెల్లడించిన ఉమామహేశ్వరి కుమార్తె
-
అమ్మ ఆత్మహత్య చేసుకుంది: దీక్షిత
దివంగత నటుడు నందమూరి తారకరామారావు చిన్నకూతురు ఉమా మహేశ్వరి ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు విడిచారు. ఈ విషయాన్ని ఆమె కూతురు దీక్షిత పోలీసులకు వెల్లడించింది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ఆమె గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుందని, ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిందని తెలిపింది. దీంతో మధ్యాహ్నం రెండున్నర గంటలకు దీక్షిత పోలీసులకు సమాచారం అందించింది. వెంటనే జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి చేరుకున్న పోలీసులు మూడు గంటలకు ఆమె గదిలోకి వెళ్లారు. అప్పుడు ఆమె ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించారు. కాగా అనారోగ్య సమస్యలతోనే ఆమె ఆత్మహత్య చేసుకుందని దీక్షిత పేర్కొంది. ఆత్మహత్య చేసుకున్న సమయంలో ఇంట్లో నలుగురమే ఉన్నట్లు తెలిపింది. దీక్షిత ఫిర్యాదు మేరకు పోలీసులు సెక్షన్ 174 కింద అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. కాగా సీనియర్ ఎన్టీఆర్ నాలుగో కూతురే ఉమా మహేశ్వరి. ఆమెకు ఇద్దరు కూతుళ్లు విశాల, దీక్షిత. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com చదవండి: నందమూరి ఇంట విషాదం, ఉమా మహేశ్వరి ఆత్మహత్య నాపై విష ప్రచారం, బాధగా ఉంది.. అమీర్ ఖాన్ ఆవేదన -
ఎన్టీఆర్ కుమార్తె ఉమామహేశ్వరి హఠాన్మరణం
-
నందమూరి ఇంట విషాదం, ఉమా మహేశ్వరి ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: దివంగత సీఎం, టీడీపీ వ్యవస్థాప కుడు నందమూరి తారక రామారావు చిన్న (నాలుగో) కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి(57) సోమవారం ఆత్మహత్య చేసుకున్నారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసు కుని బలవన్మరణానికి పాల్పడ్డారు. కొంతకాలంగా ఆమె అనారోగ్య సమస్యలతో పాటు మానసిక ఒత్తిడితో బాధ పడుతున్నట్లు కుటుంబసభ్యులు చెప్పారు. ఆ కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు పేర్కొన్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బేకరీ వ్యాపారంలో ఉమామహేశ్వరి.. బేకరీ ఉత్పత్తుల వ్యాపారం చేసే ఉమా మహే శ్వరి జూబ్లీహిల్స్ రోడ్ నం.9 లోని ప్లాట్ నం.73లో తన భర్త శ్రీనివాస్ ప్రసాద్‌తో కలిసి నివా సం ఉంటున్నారు. శ్రీనివాస్ ప్రసాద్ వ్యాపారి కావడంతో మూడురోజుల క్రితం పనుల నిమి త్తం బయట రాష్ట్రానికి వెళ్లారు. వారికి ఇద్దరు కుమార్తెలు కాగా పెద్ద కుమార్తె విశాల అమెరికాలో ఉంటున్నారు. చిన్న కుమా ర్తె దీక్షిత నగరంలోనే భర్త రాహుల్ చౌదరితో కలిసి ఉంటున్నారు. వంట చేయమని చెప్పి గదిలోకి వెళ్లి.. సోమవారం ఉదయం 10.30 గంటలకు బాచుపల్లిలో ఉండే దీక్షిత, ఆమె భర్త, ఉమా మహేశ్వరి ఆడపడుచు నిరుపమ ఆమె ఇంటికి వచ్చారు. వీరికి వంట చేయమని వంట మనిషికి చెప్పిన ఉమా మహేశ్వరి మధ్యాహ్నం 12 గంటలకు తన గదిలోకి వెళ్ళారు. 12.30కి పనిమనిషి బీబీ వెళ్లి డోర్ కొట్టినా ఎంతకూ తలుపులు తీయలేదు. గదిలోకి వెళ్ళిన తల్లి లోపలి నుంచి గడియ పెట్టుకోవడమే కాకుండా భోజనం సమయం అయినప్పటికీ బయటకు రాకపోవడంతో దీక్షితకు అనుమానం వచి్చంది. దీంతో ఆమె వెళ్ళి గది తలుపు కొట్టారు. ఎంతకూ తీయకపోవడంతో మిగిలిన వారి సాయంతో తలుపులు బలవంతంగా తెరిచి లోపలికి వెళ్ళి చూశారు. 2.30కి పోలీసులకు సమాచారం ఆ గదిలో ఉమా మహేశ్వరి ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించారు. అప్పటికే మృతి చెందడంతో కిందకు దింపిన కుటుంబీకులు మధ్యాహ్నం 2.30 గంటలకు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు అన్ని కోణాల్లోనూ పరిశీలించి ఆత్మహత్యగా నిర్ధారించారు. అయితే ఈ విషయం పోస్టుమార్టం సహా ఇతర పరీక్షల్లో నిర్ధారణ కావాల్సి ఉండటంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఉస్మానియాలో పోస్టుమార్టం.. నేత్ర దానం ఉమా మహేశ్వరి మరణంపై సమాచారం అందుకున్న ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకే‹Ù, బాలకృష్ణ, పురందేశ్వరి, భువనేశ్వరి, సోదరుడు రామకృష్ణ, సమీప బంధువులతో పాటు తీగల కృష్ణారెడ్డి, కంభంపాటి రామ్మోహ¯న్‌రావు ఆమె ఇంటికి చేరుకున్నారు. భార్య మృతి విషయం తెలియడంతో మధ్యాహ్నం 3 గంటల సమయంలో శ్రీనివాస్ ప్రసాద్ తన ఇంటికి చేరుకున్నారు. ఉమా మహేశ్వరి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఫోరెన్సిక్ వైద్య నిపుణుడు అభిజిత్, టకియుద్దీన్, రమణమూర్తి నేతృత్వంలోని వైద్యుల బృందం పోస్టుమార్టం నిర్వహించింది. ఆ సమయంలో బాలకృష్ణ, రామకృష్ణ, లోకేశ్, శ్రీనివాస్ మార్చురీ వద్దే ఉన్నారు. ఉమా మహేశ్వరి నేత్రాలను కుటుంబీకులు దానం చేయడంతో వాటిని వైద్యులు సేకరించారు. రెండు మూడురోజుల వరకు మృతదేహం పాడవకుండా చర్యలు తీసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని తిరిగి జూబ్లీహిల్స్ నివాసానికి తరలించారు. రేపు అంత్యక్రియలు.. ఉమా మహేశ్వరి ఇటీవలే తన చిన్న కుమార్తె దీక్షిత వివాహం అంగరంగ వైభవంగా నిర్వహించగా ఇంతలోనే ఈ విషాదం చోటు చేసుకుంది. కాగా ఈ నెల 3న ఉమా మహేశ్వరి మృతదేహానికి అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు వెల్లడించారు. తన తల్లి చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోందని, ఆ కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు దీక్షిత మీడియాకు వెల్లడించారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com చదవండి: షూటింగ్స్ బంద్‌పై సుమన్ షాకింగ్ కామెంట్స్ -
అప్పుడు నిమ్మకూరు గుర్తుకు రాలేదా? బాలకృష్ణకు మంత్రి రోజా కౌంటర్
సాక్షి, తిరుపతి: ఎమ్మెల్యే బాలకృష్ణకు మంత్రి ఆర్కే రోజా స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. బాలకృష్ణను చూస్తే బాధకరంగా ఉందని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు నిమ్మకూరు గుర్తుకు రాలేదా?.. ఇప్పుడు నిమ్మకూరులో ఎన్టీఆర్ విగ్రహం పెడుతానంటున్నారని విమర్శించారు. నిమ్మకూరులో ఎన్టీఆర్ విగ్రహం పెట్టి అభివృద్ధి చేస్తామని..సీఎం జగన్, కొడాలి నాని ముందే చెప్పారని గుర్తు చేశారు. ఇప్పటికైనా చంద్రబాబు స్క్రిప్ట్‌లు మానేసి.. ఎన్టీఆర్ కొడుకుగా ఒక డైనమిక్ లీడర్‌గా ముందుకొచ్చి టీడీపీ కార్యకర్తలను కాపాడండని అన్నారు. ఈ మేరకు తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో రోజా శనివారం మాట్లాడుతూ.. ‘తండ్రికి తగ్గ తనయుడిగా ఉండి ఉంటే, ఎన్టీఆర్‌గారు చనిపోయినప్పుడు బాలకృష్ణగారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ ఎన్టీఆర్ కుటుంబసభ్యుల అమాయకత్వాన్ని వాడుకుని, చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక, వాళ్లను ఏ విధంగా బయటపడేశారో రాష్ట్ర ప్రజలంతా చూశారు. అధికారంలోకి వచ్చాక, ఎన్టీఆర్ కుటుంబాన్ని దూరంగా ఉంచిన చంద్రబాబు, మళ్లీ తన అధికారం కోసం ఎన్టీఆర్ కుటుంబాన్ని దగ్గరకు తీసుకోవడం కూడా చూశాం. చంద్రబాబు 14ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు గుర్తురాని నిమ్మకూరు అభివృద్ధి, ఈరోజు బాలకృష్ణ అక్కడకు వెళ్ళి, ఆ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా మార్చుతామని, ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రతిష్టామని చెప్పడం అమాయకమా? మరొకటా అనేది అర్థం కావడం లేదు. గత టీడీపీ ప్రభుత్వంలో 5 ఏళ్ళు కూడా బాలకృష్ణగారు ఎమ్మెల్యేగా ఉన్నారు. అప్పుడు ఎన్టీఆర్ గారి విగ్రహం పెట్టాలని ఎందుకు గుర్తుకు రాలేదు. ఎన్టీఆర్‌ను గౌరవిస్తామని సీఎం జగన్ ప్రతి సమావేశంలోనూ చెప్పేవారు. అందుకు నిదర్శనంగా కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరును పెట్టడం జరిగింది. అందుకు ముందుగా ఎన్టీఆర్ కుటుంబం వైఎస్ జగన్‌కు థ్యాంక్స్ చెప్పాలి’ అని మంత్రి రోజా అన్నారు. చదవండి: మహానాడు కాదు.. ఏడుపునాడు.. నరసరావుపేట సభలో మంత్రులు -
NTR Jayanthi: ఈ గుండెని ఒక్కసారి తాకిపో తాతా.. ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్
విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు 100వ జయంతి నేడు(మే 28). ఈ సందర్భంగా పలువురు సీనీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు నివాళులర్పించారు. ‘తెలుగు వారి హృదయాలలో అచిరకాలం కొలువయ్యే యుగ పురుషుడు,నవరస నటనా సార్వభౌముడు , తెలుగు వారి ఆత్మ గౌరవం, తెలుగు జాతి కీర్తి కిరీటం, శ్రీ నందమూరి తారక రామారావు గారు.ఆ మహానుభావుడి శత జయంతి సందర్భంగా ఇదే నా ఘన నివాళి’అని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశాడు. (చదవండి: పదే పదే తలచు తెలుగుజాతి) ఇక రామరావు జయంతి సందర్భంగా తాతను స్మరించుకుంటూ ఎమోషనల్ ట్వీట్ చేశాడు జూనియర్ ఎన్టీఆర్. ‘మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోందని, మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోందని, పెద్దమనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెను మరొక్కసారి తాకిపో తాతా’ అంటూ ఎన్టీఆర్ ట్విటర్లో ఓ పోస్ట్ పెట్టాడు. వీరితో పాటు పలువురు సినీ ప్రముఖులు సైతం ఎన్టీఆర్‌ను స్మరించుకుంటూ పోస్టులు పెట్టారు. తెలుగు వారి హృదయాలలో అచిరకాలం కొలువయ్యే యుగ పురుషుడు,నవరస నటనా సార్వభౌముడు , తెలుగు వారి ఆత్మ గౌరవం, తెలుగు జాతి కీర్తి కిరీటం, శ్రీ నందమూరి తారక రామారావు గారు.ఆ మహానుభావుడి శత జయంతి సందర్భంగా ఇదే నా ఘన నివాళి! #100YearsOfNTR — Chiranjeevi Konidela (@KChiruTweets) May 28, 2022 సదా మిమ్మల్ని స్మరించుకుంటూ… pic.twitter.com/svo2SUQSlP — Jr NTR (@tarak9999) May 28, 2022 కారణ జననానికి వందేళ్ళు !! నటుడిగా అలరించి, అబ్బుర పరచి.. అఖండ ఖ్యాతినార్జించారు! నాయకుడిగా అండనిచ్చి, అభివృద్ధినందించి.. ఆదర్శప్రాయుడయ్యారు!! వ్యక్తిగా ఆత్మగౌరవానికి నిలువెత్తురూపంగా నిలిచారు!! తెలుగువారి గుండెల్లో మీ స్థానం.. సుస్థిరం.. సమున్నతం.. శాశ్వతం!!#100YearsOfNTR pic.twitter.com/f5ErLiNpJE — Sreenu Vaitla (@SreenuVaitla) May 28, 2022 Some saw him as an ordinary man..Some saw him as a God..but,in the end everybody realised that he was a Man sent by God! The Pride of every Telugu soul! 🙏❤️ #100YearsOfNTR Love..#RAPO pic.twitter.com/tl0WzA8Qsp — RAm POthineni (@ramsayz) May 28, 2022 The man of the people and for the people. #NTR garu's good deeds and service will never be forgotten on and off the screen. We are forever grateful to this legend! Let us come together and celebrate his achievements and greatness!https://t.co/GdiBeUh89M pic.twitter.com/eBgLuTyvex — Vyjayanthi Movies (@VyjayanthiFilms) May 26, 2022 Johar NTR. #100YearsOfNTR pic.twitter.com/uRRpsRbHzV — Raghavendra Rao K (@Ragavendraraoba) May 28, 2022 -
Sr.NTR Satha Jayanthi:శతదినోత్సవ రాముడికి శతజయంతి కానుక..
ఒక నటుడు కష్టపడితే హీరో కావచ్చు. ఒక హీరో సిన్సియర్‌గా శ్రమిస్తే జనాదరణ పొందవచ్చు, బాక్సాఫీస్ హిట్లు సాధించవచ్చు. బాక్సాఫీస్ హిట్లు వచ్చిన తారలు చాలామందే ఉండవచ్చు. కానీ, ఎదిగే తన ప్రయాణంలో తాను నమ్ముకొని వచ్చిన పరిశ్రమను కూడా శిఖరాయమాన స్థాయికి తీసుకెళ్లిన మహానటులు నూటికో కోటికో ఒక్కరే ఉంటారు. తెలుగు సినీ పరిశ్రమలో అలాంటి ధ్రువతారక- ఎన్టీఆర్‌గా జనం గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు నందమూరి తారక రామారావు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో తెలుగు తెరకు దక్కిన కోహినూర్ – ఎన్టీఆర్. రావడం రావడమే ఆయన హీరోగా వచ్చారు, క్లిక్ అయ్యారు. అయిదారు సినిమాలకే స్టారయ్యారు. దాదాపు 33 ఏళ్ల సినిమా కెరీర్లో 298 సినిమాలు చేశారు. సినీరంగం వదిలేసి, రాజకీయాల్లోకి వెళ్లాక తన కళాతృష్ణను తీర్చుకొనేందుకు మరో 4 సినిమాలు చేశారు. మొత్తం 302 సినిమాల్లో ఆయన చేసినన్ని విభిన్న సినిమాలు, వేసినన్ని వైవిధ్యమైన పాత్రలు, నట –దర్శక– నిర్మాతగా పండించినన్ని ప్రయోగాలు న భూతో న భవిష్యతి. శ్రమతో... పరిశ్రమను పెంచిన శిఖరం ఎన్టీఆర్ సినీరంగానికి వచ్చేసరికి తెలుగు సినీపరిశ్రమ ఏటా సగటున 10 చిత్రాలు ఉత్పత్తి చేస్తోంది. ఆయన హీరోగా సినీరంగాన్ని వదిలే నాటికి అది సగటున 100 సినిమాల స్థాయికి వచ్చింది. తెలుగు సినీ సీమ ఆ స్థాయిలో పరిపుష్టం కావడంలో ఎన్టీఆర్‌ది కీలక పాత్ర. తక్కువ సినిమాలతో ఎక్కువ సంపాదన అనే నేటి సూత్రాలకు భిన్నంగా ఆయన ఒళ్లు దాచుకోకుండా కష్టపడ్డారు. వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేస్తూ, వేలాది మంది ఉపాధికీ, నిర్మాణ, పంపిణీ, ప్రదర్శక శాఖలన్నిటా పరిశ్రమ సర్వతోముఖ పురోగతికీ తోడ్పడ్డారు. మొదటి 20 ఏళ్ల కెరీర్లో ఆయన దాదాపు 200 సినిమాలు చేశారు. ఆ కాలంలో ప్రతి ఏటా తెలుగులో రిలీజైన సినిమాల్లో కనీసం సగం నుంచి సగం పైనే ఆయన సినిమాలున్న సంవత్సరాలే ఎక్కువ. మచ్చుకు 1964లో తెలుగు పరిశ్రమ 24 సినిమాలు తీస్తే, అందులో 16 సినిమాలు, అంటే మూడింట రెండొంతులు ఎన్టీఆర్వే. అలా రాజకీయాల్లోకి రాకముందే సినిమాల్లోనూ మూడింట రెండొంతుల మెజారిటీ సాధించారు. 90 ఏళ్ల తెలుగు టాకీ చిత్రాల చరిత్రలో ఇలా ఒక ఏడాది మూడింట రెండొంతుల సినిమాలు ఒక హీరో చేయడం అప్పటికీ, ఇప్పటికీ రికార్డు. పొరుగున తమిళ సినీ స్టార్ల చరిత్రలోనూ ఇలాంటి హీరో మరొకరు కనిపించరు. తెలుగు సినిమా ఎదుగుదలలో ఆయన అవిస్మరణీయ కృషికి ఇది నిలువుటద్దం. అలాగే, 1962 నాటికే వంద సినిమాలు (గుండమ్మకథ), 1970కే రెండొందల సినిమాలు (కోడలు దిద్దిన కాపురం) చేశారు ఎన్టీఆర్. భారతదేశంలో ఈ రెండు మైలురాళ్లనూ చేరుకున్న మొదటి హీరో – ఎన్టీఆరే! జానర్ ఏదైనా... జనాదరణే! అన్ని తరహా చిత్రాల్లోనూ అద్వితీయ నటనతో అలరించడం హీరోగా ఎన్టీఆర్కే సాధ్యమైంది. ఒకే ఏడాది (1962) పరస్పర విరుద్ధమైన నాలుగు విభిన్న కోవల చిత్రాలు (పౌరాణికం – భీష్మ, జానపదం – గులేబకావళి కథ, చారిత్రకం – మహామంత్రి తిమ్మరసు, సాంఘికం – రక్తసంబంధం, ఆత్మబంధువు, వగైరా) ఆయన చేస్తే, ఆ నాలుగు కోవల చిత్రాలూ శతదినోత్సవ హిట్లే. ఒక నటుడిగా దటీజ్ నందమూరి. ఒకే ఏడాదిలో... ఒకే ఒక్కడు! ఒక ఏడాది చేసిన సినిమాలన్నీ సక్సెసై, జనాదరణతో జేజేలు కొట్టించుకోవడం ఎంతటి స్టార్‌కైనా అరుదు. కానీ, అదీ ఎన్టీఆర్ చేసి చూపెట్టారు. 1965లో ఈ సినీ తారకరాముడు 12 సినిమాలు చేస్తే, అందులో 8 సెంచరీ హిట్లు. తొమ్మిదో చిత్రం 92 రోజులాడింది. మిగిలిన మూడూ 9 – 10 వారాల వంతున ప్రదర్శితమైన సక్సెస్ఫుల్ సినిమాలు. అదీ ఎన్టీఆర్ ఇమేజ్ చేసిన మ్యాజిక్. ఒకే ఏడాది (1977)లో ఏకంగా 3 డబుల్ సెంచరీ హిట్లు (దానవీరశూర కర్ణ, అడవి రాముడు, యమగోల) సాధించడం ఎన్టీఆర్ స్టార్ స్టామినాకు మచ్చుతునక. అప్పటికి తెలుగులో మరి ఏ హీరోకూ ఏకంగా సినీజీవితం మొత్తంలోనే 3 డబుల్ సెంచరీ హిట్లు లేవు. అలా తెలుగు చిత్రసీమలో ఎన్టీఆర్ ఓ చరిత్ర సృష్టించారు. విన్ అయినా... రిపీట్ రన్ అయినా... ఎన్టీఆర్ నటించిన త్రిశతాధిక చిత్రాల్లో అధిక భాగం బాక్సాఫీస్ హిట్లు. ఆయన చిత్రాల్లో శతదినోత్సవ హిట్లు 160. అందులో 115 నేరుగా సెంచరీ ఆడినవే! రజతోత్సవ హిట్లు 40. వాటిలో దాదాపు 20 డైరెక్ట్ సిల్వర్ జూబ్లీ. ఇక, 5 చిత్రాలు ఏడాది పాటు ఆడిన స్వర్ణోత్సవ హిట్లు. ఇలాంటి బాక్సాఫీస్ రికార్డుల్లోనూ అగ్రతాంబూలం ఎన్టీఆర్‌దే అన్నది జగమెరిగిన సత్యం. ప్రపంచ సినీ చరిత్రలో రెండోసారి, మూడోసారి విడుదలై కూడా సినిమాలు బాక్సాఫీస్ వద్ద బాగా ఆడడం తెలుగు, తమిళ సినీ రంగాల్లోనే ఎక్కువ. తర్వాత కొంత కన్నడంలో రిపీట్ రన్స్ కనిపిస్తాయి. మన తెలుగు సినీచరిత్ర మొత్తంలో రిపీట్ రన్స్‌లో శతదినోత్సవం చేసుకున్న చిత్రాలు 16. అందులో ఏకంగా 14 చిత్రాలు ఈ బాక్సాఫీస్ రాముడివే! ప్రేక్షకులకూ, ఎన్టీఆర్‌కూ ఉన్న అనుపమానమైన అనుబంధానికి ఇది ఓ మచ్చుతునక. చరిత మరువని ఘనత పౌరాణికం, జానపదం, చారిత్రకం, సాంఘికం.. ఇలా అన్ని కోవలలోనూ ఆయనకు ఆయనే సాటి. ఈ నందమూరి అందగాడు వేసినన్ని పాత్రలూ, చేసినన్ని రకాల పాత్రలూ మరే హీరో చేయలేదు. కనీసం ఆయన దరిదాపులో కూడా ఎవరూ లేరు. ఇది చరిత్ర చెప్పిన సత్యం. 57 జానపదాలు, 48 పౌరాణికాలు, 18 చారిత్రకాలు – ఇలా మూడు కోవల్లోనూ హీరోగా ఆయనదే రికార్డు. ఈ మూడూ కలిపితే, మొత్తం 123 సాంఘికేతర చిత్రాల్లో (అంటే కాస్ట్యూమ్ చిత్రాల్లో) హీరోగా నటించింది ప్రపంచంలో ఎన్టీఆర్ ఒక్కరే! ముఖ్యంగా పౌరాణిక పాత్రలతో ప్రజల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకొని, తెలుగువారి ఆరాధ్యదైవమయ్యారు ఎన్టీఆర్. ఆ సినిమాలు, ఆ పాత్రలే 23 ఏళ్ల పాటు మద్రాసులోని ఆయన నివాసాన్ని ఒక తీర్థయాత్రా స్థలిగా మార్చాయి. ఎన్టీఆర్‌లా కేవలం 9 నెలల్లో రాజకీయ పార్టీ స్థాపించి, ఎన్నికలలో ఘన విజయం సాధించిన మరొకరు ప్రపంచ రాజకీయ చరిత్రలో కనిపించరంటే అదే కారణం. అలా రాజకీయ సౌధానికి కూడా సినీ రంగంలో మూడు దశాబ్దాలకు పైగా ఆయన చూపిన ప్రత్యేకత, సంపాదించుకున్న ప్రజాదరణే పునాది. ఇలాంటి చరిత మరువని ఘనతలెన్నో తెలుగు సినీరంగానికి కట్టబెట్టిన ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా ఇంకా మిగిలే ఉంటుంది. ఈ ఆరాధ్యుడే ఆద్యుడు తెలుగు సినీరంగంలో అనేక తొలి ఘనతలు ఎన్టీఆర్ చిత్రాలే. ఆ ఘనకీర్తి జాబితా సుదీర్ఘమైనది. అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైన తొలి సినిమా (పాతాళ భైరవి), విదేశాల్లో ప్రదర్శించిన తొలి సినిమా (మల్లీశ్వరి), తొలి పూర్తి రంగుల చిత్రం (లవకుశ), విదేశాల్లో చిత్రీకరించిన తొలి చిత్రం (సాహసవంతుడు), తొలి సైన్స్ ఫిక్షన్ – అపరాధ పరిశోధక చిత్రం (దొరికితే దొంగలు), ఫస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ (లక్షాధికారి), ఫస్ట్ సోషియో– ఫ్యాంటసీ (దేవాంతకుడు), ఫస్ట్ మాస్ మసాలా మూవీ (అగ్గిరాముడు) – ఇలా అనేక కోవల చిత్రాలకు ఎన్టీఆర్ ఆద్యుడు. – కొమ్మినేని వెంకటేశ్వరరావు -
ఎన్టిఆర్ శతజయంతి: పదే పదే తలచు తెలుగుజాతి
ఒక్క బాణాన్ని సంధించి ఏడు తాటిచెట్లను కూల్చిన శ్రీరామచంద్రుణ్ణి విని ఉంది తెలుగుజాతి. నూరు తప్పులను కాచి సుదర్శనాన్ని విడిచి శిశుపాలుని వధించిన కృష్ణలీల తెలుసు తెలుగుజాతికి. ఉగ్రరూపం దాల్చి రుద్ర తాండవమాడిన శివుడి జటాజూటాలు ఎలా ఉంటాయో ఊహకే పరిమితమాయె. పది శిరస్సుల రావణుడి రుధిర నేత్రాల తీక్షణత– చూడతరమా! గాండీవం చేబూనిన పార్థుడు– గదాధారి భీముడు– పంచభర్తృకకు తొడను చూపి ఆసీనురాలు కమ్మని సైగ చేసిన సుయోధనుడు... వినీ వినీ ఉన్నారు. అప్సరసలు కూడా వివశులయ్యే అందాల రాకుమారుడు– రాకుమారిని తెగించి వరించే తోట రాముడు– అష్టదిగ్గజాలతో పదములల్లే దేవరాయడు– పల్నాట బ్రహ్మనాయుడు... పొరుగునే పాండురంగడు... విన్నారయ్యా విన్నారు.. చూసేదెప్పుడు? వారి ఎదురుచూపు ఫలించింది. తెలుగు తెర వరము పొంది మురిపాల నటుడిని ప్రసవించింది. ఇదిగో ఇతడే నందమూరి తారక రామారావు అని పోస్టర్లేసి ప్రకటించింది. తదాదిగా తెలుగుజాతికి వినే బాధ తప్పింది. వారు ప్రతి పురాణాన్ని చూశారు. ప్రతి వేల్పును తిలకించారు. ప్రతి కథకు పరవశించారు. మరో వెయ్యేళ్లు ఈ అపురూపాన్ని దర్శిస్తారు. తెలుగు తెరకే ఇది సొంతం. తెలుగు నేలదే ఈ భాగ్యం. నేడు ఎన్టిఆర్ శతజయంతి వేడుకల ప్రారంభం సందర్భంగా ప్రత్యేక కథనం. విజయా స్టూడియో అధినేత నాగిరెడ్డి దగ్గరకు ఆ స్టూడియోలో జీతానికి పని చేసే ఆర్టిస్టులు ధైర్యంగా వచ్చి మాట్లాడరు. కాని నెలకు 500 రూపాయల జీతం, సినిమాకు ఐదు వేల రూపాయల పారితోషికం కాంట్రాక్టు మీద కొలువుకు చేరిన కొత్త నటుడు ఎన్.టి. రామారావు ఆ రోజు ఆయన దగ్గరకు వచ్చి నిలుచున్నారు. ‘ఏంటి రామారావ్’ అన్నారు నాగిరెడ్డి. ‘సార్.. క్యాంటిన్లో మీరు నాకు ఇవ్వమని అలాట్ చేసిన టిఫిన్ సరిపోవడం లేదు. పెంచాలి’. నాగిరెడ్డి ఒక్క క్షణం సర్దుకున్నారు. సాధారణంగా ఆ స్టూడియోలో ఆర్టిస్టులకు ఇంత టిఫిన్, టెక్నిషియన్లకు ఇంత టిఫిన్ అని నిర్దేశించారు. ఎన్.టి. రామారావుకు కూడా అంతే ఇస్తున్నారు. ఒడ్డు పొడవు ఉండి, రోజూ కసరత్తు చేస్తూ, రాళ్లు తిని కూడా అరాయించుకునే ఆరోగ్యంతో ఉన్న రామారావు గురించి చిన్న ఏమరపాటు జరిగిందని ఆయనకు అర్థమైంది. వెంటనే క్యాంటిన్‌కు కొత్త ఆదేశాలు వెళ్లాయి. ఆ రోజు ఆకలి గురించి కొట్లాడిన ఎన్.టి. రామారావు ఆ తర్వాత తెలుగువారి తొలి సినిమా రంగ ముఖ్యమంత్రి అయ్యి ఆకలిగొన్న వారందరికీ కిలో రెండు రూపాయల బియ్యం ఇవ్వడం చరిత్ర. ‘మాయాబజార్’ తర్వాత ఎన్.టి. రామారావుతో ‘లవకుశ’ తీయాలని నిశ్చయించుకున్నారు నాగిరెడ్డి, చక్రపాణి. దర్శకుడు బి.ఎన్. రెడ్డి. అడ్వర్టైజ్మెంట్ కూడా ఇచ్చారు. బి.ఎన్. రెడ్డి అంటే ‘మల్లీశ్వరి’ తీసి సినిమాకు ‘కళాఖండం’ అని ఉపమానం ఇచ్చినవారు. బి.ఎన్. రెడ్డి, రచయిత పాలగుమ్మి పద్మరాజు బెంగళూరు వెళ్లి 20 రోజులు ఉండి ఒక వరుస కథ రాసుకొని వచ్చారు ‘లవకుశ’ కోసం. చక్రపాణిని కూచోబెట్టి బి.ఎన్. నెరేషన్ ఇస్తున్నారు. ‘సీత శోకంలో ఉంది. రాముడి వీపు మాత్రమే కనిపిస్తూ ఉంది. తనను అడవులపాలు చేసినందుకు సీత రాముణ్ణి నిందిస్తూ ఉంది. రెండో సీను... రాముడి వీపునే చూపిస్తూ సీత శోకం. మూడో సీను..’ చక్రపాణి లేచి నిలబడ్డారు. ‘అందమైన ఎన్.టి. రామారావును పెట్టుకుని వీపు చూపిస్తూ రెండు సీన్లా. ఈ సినిమా ఆడినట్టే’ స్క్రిప్ట్ మూల పడేశారు. ఎన్.టి. రామారావు సినిమాలో ఉంటే మొదటి సీను నుంచి చివరి సీను వరకూ చూసుకోవడమే ప్రేక్షకుల పని. ఆ తర్వాత కొన్నేళ్లకు సి. పుల్లయ్య దర్శకత్వంలో ‘లవకుశ’ వచ్చింది. సీత శోకం చూడాలా రాముడి ఆవేదన చూడాలా... పల్లె జనాలు ఎడ్లబండ్లు వేసుకొని వచ్చి చెట్ల కింద పడుకుని సినిమా చూసి వెళ్లేవారు. 500 రోజులు ఆడిన తొలి తెలుగు సినిమా అది. రాముడి గొప్పతనమో... తారక రాముని నటనావైదుష్యమో. ‘బేడకు సినిమా’ అనేవారు ఆ రోజుల్లో. అంటే రెండు అణాలకు సినిమా. ఆ రెండు అణాలు ఇచ్చి సినిమా చూడటానికి కూడా జనం దగ్గర డబ్బులు ఉండేవి కాదు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన కొత్త. అప్పటికి పదేళ్లకు కాస్త అటు ఇటుగా తెలుగు సినిమాలు మొదలయ్యాయి. మద్రాసుకు కళాకారులు చేరుకున్నారు. ‘ఆర్టిస్టు’ను గుర్తు పట్టి సినిమాలు చూడటం అనేది సీనియర్ శ్రీరంజని (జూ. శ్రీరంజని అక్క)తో మొదలయ్యింది. నాటకాల్లో మాదిరే ‘పాడి నటించేవారికి’ డిమాండ్ కనుక చిత్తూరు నాగయ్య, బళ్లారి రాఘవ, సి.ఎస్.ఆర్. ఆంజనేయులు సింగింగ్ స్టార్స్ అయ్యారు. బెరుకు లేకుండా స్లీవ్‌లెస్ జాకెట్ వేసిన కాంచన మాల, భానుమతి క్యాలెండర్ స్టార్లుగా వెలిగారు. సీహెచ్ నారాయణరావు సుకుమార సౌందర్యం గల తొలి తెలుగు హీరో. అప్పుడు అక్కినేని రంగప్రవేశం చేసి ‘బాలరాజు’తో జాక్‌పాట్ కొట్టారు. కాని భారతీయ ఆత్మను, ఇతిహాసాన్ని, పౌరాణిక ఘనతను, చారిత్రక ఘటనలను, భక్తి ఉద్యమాలను, జానపద సంపదను, సాంఘిక జీవనాన్ని, కార్మిక కర్షకుల ప్రాతినిధ్యాన్ని, కుటుంబ భావోద్వేగాలను చూపే ఒక నాయకుడు, ఆ నాయకుడి చరిష్మా అవసరమయ్యింది. అది ఎన్.టి. రామారావు రూపంలో సంభవించింది. ఎంటైర్ సౌత్‌లో ఎం.జి.ఆర్, శివాజీ గణేశన్, రాజ్ కుమార్, ప్రేమ్ నజీర్... వీరందరూ గొప్ప జనాకర్షణ కలిగిన సినీ నాయకులే అయినా ఎన్.టి.ఆర్ చేసినవన్నీ చేయలేదు. ఎన్.టి.ఆర్ చేసినంత చేయలేదు. ఉత్తరాదిన ముగ్గురు సూపర్స్టార్లలో రాజ్‌కపూర్, దేవ్ ఆనంద్ ప్రధానంగా మెట్రో మనుషుల రిప్రెజెంటేటివ్స్. దిలీప్ కుమార్ మాత్రమే ఫోక్లోర్, హిస్టారికల్ (మొఘల్ ఏ ఆజమ్) చేశాడు. కాని మైథాలజీ వీరి ముగ్గురి పరిధిలో లేదు. రాజ్ కపూర్ దర్శకుడుగా గొప్పవాడు. సుదీర్ఘమైన సినిమా ‘మేరా నామ్ జోకర్’ (4 గంటల 13 నిమిషాలు) తీశాడు. దాని ఫలితం నిరాశ కలిగించింది. ఎన్.టి.ఆర్ కూడా దర్శకుడిగా సుదీర్ఘమైన సినిమా ‘దాన వీర శూర కర్ణ’ (4 గంటల 8 నిమిషాలు) తీశారు. 43 రోజుల్లో తీసిన ఈ సినిమా కలెక్షన్లలో వీర సినిమా. రికార్డులలో శూర సినిమా. పిల్లలకు నచ్చాలి ఫస్ట్. జేమ్స్‌బాండ్ సినిమాలు ఎందుకు నిలుస్తాయంటే, సూపర్‌మేన్, స్పైడర్‌మేన్ వంటి సూపర్ హీరోలు ఇన్నేళ్లయినా ఎందుకు ఉన్నారంటే వాళ్లు పిల్లలకు నచ్చుతారు. తమకు నచ్చినవారిని పిల్లలు పెద్దయినా వృద్ధులైపోయినా అభిమానిస్తూనే ఉంటారు. ‘పాతాళభైరవి’ అక్కినేనితో తీయాలా, ఎన్.టి.ఆర్తో తీయాలా అనే సందేహం వచ్చింది విజయా వారికి. కె.వి. రెడ్డి మనసు అక్కినేని మీద ఉంది. నాగిరెడ్డి–చక్రపాణి ఎంపిక ఎన్.టి.ఆర్ మీద ఉంది. నీ మాట వద్దు నా మాట వద్దు అని మరో నటుణ్ణి వెతుకుదాం అని కూడా అనుకున్నారు (తుపాకుల రాజారెడ్డి అనే నటుడితో రెండు రీళ్లు తీశారని ఒక కథనం). చివరకు ఒకరోజు అక్కినేని, ఎన్.టి.ఆర్ స్టూడియో కోర్టులో టెన్నిస్ ఆడుతూ ఉంటే ఎన్.టి.ఆర్ బంతిని బాదుతున్న స్టయిల్, క్రీడాగ్రహం చూసి ‘ఇతనే కరెక్ట్’ అనుకున్నారు కె.వి. రెడ్డి. అలా తోట రాముడుగా ఎన్.టి.ఆర్ సాహసం చేశారు. ప్రేమ కోసం వలలో పడ్డారు. నేపాళ మాంత్రికుడి తల నరికి పాతాళ భైరవి కరుణతో పాటు ప్రేక్షకుల కాసులు పొందారు. ఇది పెద్దలతో పాటు పిల్లలకు నచ్చింది. వారికి ఒక హీరో దొరికాడు. ఆ తర్వాత ఈ పిల్లలే ‘మాయాబజార్’ చూశారు. ఊరికే అలా చేతిని గాలిలో కదిపి అందరినీ తన ఆధీనంలోకి తెచ్చుకుంటున్న కృష్ణుడు. మహా బలసంపన్నుడైన ఘటోత్కచుడే ముసలి వేషంలో ఉన్న కృష్ణుడి రెక్క పట్టుకు లేపలేకపోతాడు. ఆ కృష్ణబలం ఎన్.టి.ఆర్‌దే. ఇక ఆ పిల్లలు ఎన్.టి.ఆర్ని వదల్లేదు. ఎన్.టి.ఆర్ కూడా చందమామ పత్రికలో కనిపించే జానపదాలు, భట్టి విక్రమార్క కథలు, భక్తుల కథలు, వ్రత కథలు, అరేబియన్ నైట్స్ చేస్తూనే వెళ్లారు. గులే బకావళి కథ, ఆలీబాబా నలభై దొంగలు, బాగ్దాద్ గజదొంగ... అరేబియన్ నైట్స్ ఆధారితాలే. తెలుగు పిల్లల బ్రూస్లీ ఎన్టీఆరే (యుగ పురుషుడు). సూపర్‌మేన్ ఆయనే (సూపర్ మేన్). టార్జాన్ ఆయనే (రాజపుత్ర రహస్యం). ఎల్విస్ ప్రెస్లీ ఆయనే (ఆటగాడు). ఒక కళాకారుడికి ఎంతో నిర్మలత్వం, అమాయకత్వం ఉంటే తప్ప ఇలాంటి పాత్రలు చేయడు. ఎన్.టి.ఆర్ చేశారు. ఆ నిర్మలత్వమే పిల్లలకు నచ్చుతుంది. అందుకే పిల్లల వినోద సామ్రాజ్యానికి అధిపతి ఎన్.టి.ఆర్. ఎన్.టి.ఆర్కు ద్రవిడ స్పృహ ఉంది. ప్రాంతీయ చైతన్యం ఉంది. ‘టెక్ట్స్’ను పరుల కంటితో కాక స్వీయ దృష్టితో అర్థం చేసుకునే జ్ఞానం ఉంది. జనంకు ఏదైనా చెప్పడానికే ఆయన ‘నేషనల్ ఆర్ట్స్ థియేటర్’ అనే నాటక సంస్థను బెజవాడలో స్థాపించారు. నిర్మాతగా మారాక కూడా ‘తోడు దొంగలు’ వంటి సందేశాత్మక సినిమాయే తీశారు. ‘పాతాళ భైరవి’, ‘మల్లీశ్వరి’ వంటి సూపర్‌హిట్స్ ఇచ్చిన హీరో ఆ వెంటనే ‘రాజూ పేద’లో కన్న కొడుకును అడుక్కు రమ్మని పంపే పోలిగాడి పాత్రను చేస్తాడా? ‘డ్రైవర్ రాముడు’ వంటి మాస్ హిట్ ఇచ్చి ఆ వెంటనే భార్య లేచిపోయిన భర్తగా ‘మావారి మంచితనం’లో నటిస్తాడా? ఆయన ప్రయోగశీలి. అందుకే ‘హీరోగా చేయడానికి’ ఏమీ లేకపోయినా తెలుగువారి రెండు విశిష్ట నాటకాలు ‘కన్యాశుల్కం’, ‘చింతామణి’లో ఆయన నటించాడు. తన పేరు మీద టైటిల్ లేకపోయినా ‘తెనాలి రామకృష్ణ’, ‘మహామంత్రి తిమ్మరుసు’ లో శ్రీ కృష్ణ దేవరాయలుగా నటించాడు. అలాగే ఆయనకు పురాణాలను దర్శించే పద్ధతి వేరేగా ఉండేది. ‘రావణుని పాత్రను చేస్తాను... డైరెక్ట్ చేయండి’ అని కె.వి. రెడ్డి దగ్గరకు వెళితే ‘కృష్ణుడిగా చూపించిన నేను రావణుడిగా చూపించలేను. జనం చూడరు’ అన్నారు. కాని ఎన్.టి.ఆర్ ‘సీతారామ కల్యాణం’ లో రావణుడి పాత్ర వేసి మెప్పించి, ఘన విజయం సాధించారు. తెలుగువారు ‘దుష్ట చతుష్టయం’గా చెప్పుకునే వారిలో ఇద్దరు గూర్చిన దృష్టిని సమూలంగా మార్చాడాయన. భారతంలో దుర్యోధనుడి పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి ఉంది అని పదేపదే చెప్పారు. ఎయిర్‌పోర్ట్‌లో కనిపించిన రావి కొండలరావుతో ఎన్.టి.ఆర్ ‘బ్రదర్... దుర్యోధనుడికి డ్యూయెట్ పెడతారా ఎవరైనా’ అని అడిగారు. రావి కొండలరావుకు ఈ ప్రశ్న నేపథ్యం ఏ మాత్రం తెలియదు. ఆయన రామారావును మెప్పిద్దామని ‘ఎవడు పెడతాడు సార్ బుద్ధి లేకపోతే గాని’ అన్నాడు. ‘మేం పెడుతున్నాం బ్రదర్ దాన వీర శూర కర్ణలో’ అన్నారు ఎన్.టి.ఆర్ ఆ తర్వాత కొన్ని రోజుల పాటు రావి కొండలరావు ఎన్టీఆర్ ఎదుట పడితే ఒట్టు. ఎన్.టి.ఆర్ దుర్యోధనునికి డ్యూయెట్ పెట్టి ‘చిత్రం... భళారే విచిత్రం’ అనిపించారు. ఇక ఎన్.టి.ఆర్కు కర్ణుడి మీద సానుభూతి దృష్టి రావడానికి తమిళ ‘కర్ణన్’ కారణం. శివాజీ తమిళంలో చేసిన ‘కర్ణన్’ కర్ణుడు ఎంత గొప్పవాడో వర్ణదృష్టితో చెబుతుంది. ఆ సినిమాలో కృష్ణుడిగా నటించిన ఎన్టీఆర్‌కు ఇది నచ్చింది. ఆ సినిమాకు మాటలు రాసింది శక్తి కృష్ణసామి. ఈ రచయితే ‘వీరపాండ్య కట్టబొమ్మన్’కు మాటలు రాసి తమిళంలో ఉధృత డైలాగ్ ఒరవడిని సృష్టించాడు. ఆ స్థాయిలో డైలాగ్స్ ఉండాలని కొండవీటి వెంకటకవిని ఒప్పించి రాయించారు ఎన్.టి.ఆర్. అసలు దానవీర శూర కర్ణ ఒక రకంగా శబ్ద చిత్రం. కేవలం మాటలు విన్నా చాలు. ఆ మాటలు ఒక్క ఎన్.టి.ఆరే చెప్పగలరు. హితుడా... ఆగాగు ఏమంటివి ఏమంటివి... నటుడికి ధారణశక్తి, ఉచ్ఛారణ శక్తి, వాచక ఔన్నత్యం ఉండాలి. ఏ కాలంలో అయినా నటుడు అనే వాడికి ఎన్.టి.ఆర్ వదిలి వెళ్లిన సిలబస్, పరీక్ష పేపర్ ఈ డైలాగ్. ప్రదర్శించడం మాత్రమే కళ కాదు. కొనసాగడమే కళ. అంటే కొనసాగేందుకు ఎప్పటికప్పుడు సృజన సామర్థ్యాలను కల్పించుకోవడమే కళ. తెలుగు నాట ఎన్.టి.ఆర్, అక్కినేని... ఇద్దరూ సుదీర్ఘంగా కొనసాగేందుకు కంకణబద్ధులై ఎప్పటికప్పుడు తమను తాము తీర్చిదిద్దుకుంటూ వెళ్లారు. ఎన్.టి.ఆర్కు ‘పాతాళభైరవి’లాగా అక్కినేనికి ‘దేవదాసు’ ఒక పెద్ద మైలురాయిగా మారింది. మిడిల్ క్లాస్, ఎలైట్ సెక్షన్స్‌తో పాటు మహిళా ప్రేక్షకుల బలంతో అక్కినేని కొనసాగితే ఆబాల గోపాలాన్ని మెస్మరైజ్ చేస్తూ ఎన్.టి.ఆర్ కొనసాగారు. తమాషా ఏమిటంటే ‘దొంగ రాముడు’, ‘భలే రాముడు’, ‘అందాల రాముడు’ అక్కినేని చేసినా ‘రాముడు’ టైటిల్‌కు పేటెంట్ ఎన్.టి.ఆర్ పరమే అయ్యింది. అక్కినేని ‘అనార్కలి’ చేస్తే ఎన్.టి.ఆర్ ‘అక్బర్ సలీంఅనార్కలి’ చేశారు. అక్కినేని క్షేత్రయ్య చేస్తే ఎన్.టి.ఆర్ వేములవాడ భీమకవి చేశారు. అక్కినేని మహాకవి కాళిదాసు. ఎన్.టి.ఆర్ శ్రీనాథ కవిసార్వభౌమ. ఈ సన్నిహితాలకు సామీప్యాలకు అంతే లేదు. కాని వీరిరువురూ కలిసి నటించిన సినిమాలలో ‘మిస్సమ్మ, మాయాబజార్’ చిన్న రసాలు.. పెద్ద రసాలు. నిజం చెప్పాలంటే ఎన్.టి.ఆర్కు కె.వి. రెడ్డి తర్వాత గట్టి దర్శకుల బలం లేదు. అక్కినేనికి ముందు నుంచి భరణి రామకృష్ణ, ఆదుర్తి సుబ్బారావు, విక్టరీ మధుసూదనరావు, వి.బి. రాజేంద్ర ప్రసాద్ తదితరులు కొనసాగారు. తర్వాతి తరం కృష్ణ, శోభన్‌బాబు వచ్చాక కొత్త దర్శకులు వీరితో సినిమాలు చేయసాగారు. అయినా సరే ఎన్.టి.ఆర్ తన దారిన తాను ప్రయోగాలు చేస్తూనే వెళ్లారు. బాలీవుడ్లో స్టార్ల సినిమాలకు తెలుగులో ఎన్.టి.ఆరే సూట్ అయ్యారు. అమితాబ్ ‘జంజీర్’– ‘నిప్పులాంటి మనిషి’గా, ‘డాన్’ – ‘యుగంధర్’గా, రాజేష్ ఖన్నా ‘రోటి’– ‘నేరం నాది కాదు ఆకలిది’గా, ధర్మేంద్ర ‘యాదోంకి బారాత్’– ‘అన్నదమ్ముల అనుబంధం’గా ఆయన నటించారు. 39 ఏట ‘భీష్మ’లో, 49 ఏట ‘బడి పంతులు’ లో పూర్తి వృద్ధ పాత్రల్లో చేయడం ఆయనకే చెల్లింది. కృష్ణ, రజనీకాంత్, చిరంజీవిలతో మల్టీస్టారర్స్ చేశారు. కాని దాసరి రావడంతో అక్కినేనికి బలం దొరికినట్టు కె. రాఘవేంద్రరావు రావడంతో ఎన్.టి.ఆర్కు బలం దొరికింది. కె. రాఘవేంద్రరావు ఎన్.టి.ఆర్‌ను ఒక దర్శకుడిగా కాక ఒక అభిమానిగా డైరెక్ట్ చేశారు. అభిమానులు ఎలా చూడాలనుకుంటారో అలా చూపిస్తూ తీసిన ‘అడవి రాముడు’ సినిమా సగటు ప్రేక్షకుడికి ఇచ్చే ఎంటర్టైన్మెంట్ ఎలా ఉండాలో చూపింది. ఆ తర్వాత వారిద్దరూ కలిసి ‘వేటగాడు’, ‘గజదొంగ’, ‘డ్రైవర్ రాముడు’, ‘కొండవీటి సింహం’, ‘జస్టిస్ చౌదరి’ వంటి భారీ హిట్స్ ఇవ్వడం ఎన్.టి.ఆర్‌ను లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్‌కు చేర్చింది. అదే సమయంలో దాసరి ‘సర్దార్ పాపారాయుడు’, ‘బొబ్బిలిపులి’ తీసి ఎన్.టి.ఆర్ కెరీర్‌ని పతాక స్థితికి తీసుకెళ్లారు. ఇక సినిమాల్లో చేయాల్సింది ఏమీ మిగల్లేదు అని అనిపించే స్థితి. ఎన్.టి.ఆర్ జనం గురించి ఆలోచించిన సమయం. ఆయన రాజకీయ ప్రవేశంతో తెలుగు తెర పగటి తీక్షణతను, రాత్రి వెన్నెలను ఒక మేరకు కోల్పోయింది. కాని మహా నటులకు కూడా పరాజయాలు ఉంటాయి. వాటిని దాటి రావడమే కళాకారులు చేయవలసిన పని అని ఎన్.టి.ఆర్ కెరీర్ చూసినా అర్థమవుతుంది. ఎన్.టి.ఆర్ నటించిన ‘చంద్రహారం’, ‘కాడెద్దులు – ఎకరం నేల’, ‘చిన్ననాటి స్నేహితులు’, ‘శ్రీకృష్ణాంజనేయ యుద్ధం’, ‘పల్లెటూరి చిన్నోడు’, ‘అమ్మాయి పెళ్లి’, ‘అక్బర్ సలీం అనార్కలి’, ‘సతీ సావిత్రి’, ‘శ్రీరామ పట్టాభిషేకం’, ‘రాజపుత్ర రహస్యం’, ‘సామ్రాట్ అశోక’, ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ వంటి భారీ అపజయాలు ఉన్నాయి. కాని ఈ అపజయాలు చూసిన ఎన్.టి.ఆర్ సినిమా కథ గ్రామర్‌లో ఇమడని ‘బ్రహ్మంగారి చరిత్ర’ను సినిమాగా తీసి సూపర్‌హిట్ సాధించడం మరచిపోరాదు. ‘నర్తనశాల’ లో బృహన్నలగా వేసి మెప్పించడమూ సామాన్యం కాదు. అయితే ఎన్.టి.ఆర్‌లోని నిజమైన ఆర్టిస్టును పట్టుకున్న సినిమాలు ఆయనకు దొరికినట్టేనా? ఆయన తనలోని నటుడిని పరిపూర్ణంగా ప్రదర్శించగలిగాడా? చెప్పలేము. కమర్షియల్ సినిమా ఆయన ప్రతిభకు పరిమితులు విధించిందనే చెప్పాలి. ఎన్.టి.ఆర్ చూడగానే సంతోషం వేసే నటుడు. ఆయన రిక్షా వెనుక బొమ్మగా ఉన్నాడు. పూజగదిలో దేవుని క్యాలెండర్‌గా కూడా ఉన్నాడు. దశాబ్దాల పాటు కోట్లాది మంది కష్టాలను కొన్ని గంటల పాటు మరిపించగలిగాడాయన. ఆయన పేరును తెలుగుజాతి పదే పదే తలుస్తుంది. గౌరవంతో కొలుస్తుంది. ఎన్.టి.ఆర్ అమరుడు. -
మేకవన్నె పులి బాబూ!
దుర్మార్గుడు... మేకవన్నె పులి... ప్రజాస్వామ్య హంతకుడు... గుండెల్లో చిచ్చు పెట్టిన వాడు... గూడుపుఠాణీకి గురువు... మోసానికి మూలస్తంభం... ఇవన్నీ దివంగత నందమూరి తారక రామారావు నోటి నుంచి వెలువడ్డ శిలాక్షరాలు. చంద్రబాబునాయుడు ‘విశ్వరూపాన్ని’ కళ్లారా చూసి ఆయనే స్వయంగా అనుగ్రహించిన బిరుదరాజాలు. అల్లుడని నమ్మినవాని చేతిలోనే అడ్డంగా వెన్నుపోటుకు గురైన ఆక్రోశం నుంచి పుట్టుకొచ్చిన శాపనార్థాలు. ఎన్టీఆర్ తన చివరి దశలో కనీసం చంద్రబాబు పేరును ఉచ్చరించేందుకు కూడా ఇష్టపడలేదు. కానీ మళ్లీ అధికారంలోకి రావడం కోసం ఎన్టీఆర్ నామభజన చేస్తున్నారు చంద్రబాబు. రేపటి నుంచి ఎన్టీఆర్ శత జయంతి సంవత్సరం ప్రారంభం కానుంది. టీడీపీ వాళ్లు మహానాడు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ వివిధ సందర్భాల్లో తమ పార్టీ కార్యకర్తలతో చంద్రబాబు గురించి మాట్లాడిన మాటలు గుర్తు చేస్తున్నాం. తమ్ముళ్లారా! చెల్లెళ్లారా! ఇదిగో మీ అన్నను మాట్లాడుతున్నాను. శ్రద్ధగా వినండి. మీ బుద్ధితో ఆలోచించండి. మీ నిర్ణయంతో నన్ను ఆదేశించండి. మీరు చెప్పేదే న్యాయం. చేసేదే ధర్మం. నాటి నుంచి నేటి వరకూ జరిగిన చరిత్రను మీ ముందు, అంటే ప్రజాన్యాయస్థానం ముందుంచుతున్నాను. మంచేదో చెడేదో; నిజమేదో అబద్ధమేదో; ఆశయ మేదో ఆశేదో మీకు తెలియాలనే ఈ ప్రయత్నం. నీతికీ అవినీతికీ మధ్య జరుగుతున్న ఈ పోరా టంలో న్యాయనిర్ణేతలు మీరే. ఎవరు విజేతలో తేల్చాల్సింది కూడా మీరే. బాబు ఒక చిన్న మిడత 224 సీట్లతో అధికారం చేపట్టిన తెలుగుదేశం ప్రాభవాన్ని ప్రతిఘటించడం చేతకాని వ్యతిరేక శక్తులు కొంతమంది, (1995లో) లోలోన గూడు పుఠాణీ ఆరంభించారు. దీనికి గురువు, ఈ కుట్రకు కొలువు, మోసానికి మూలస్తంభం, ఈ పద్మవ్యూహానికి కేంద్రబిందువు చంద్రబాబు నాయుడు! నా అల్లుడనబడుతున్నవాడే నా గుండెల్లో చిచ్చు పెట్టాడు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించడానికి ముందు అతనేమిటో మీ అందరికీ తెలుసు. కాంగ్రెస్‌లో ఉంటూ, మంత్రులపై కూడా పోటీ చేస్తానంటూ ప్రగల్భాలు పలికి, చివరకు తెలుగు దేశం మహా ప్రభంజనంలో కొట్టుకుపోయిన ఓ చిన్నమిడత. తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక, అతను పార్టీలో చేరతానని వస్తే, చేర్చుకోవద్దని కొందరు హితవు చెప్పారు. అయినప్పటికీ పశ్చా త్తాపాన్ని ప్రకటించాడు కదా అని ఔదార్యంతో చేర్చుకున్నాను. తర్వాత పార్టీలో ముఖ్యమైన పదవులన్నీ ఇచ్చాను. అయితే అతడు ప్రజాసేవ కోసం కాక పదవి కోసమే పార్టీలో చేరాడన్న దుర్మార్గాన్ని నేను కనిపెట్టలేకపోయాను. అతడు కడుతున్న ముఠాల గురించీ, చేరదీస్తున్న గ్రూపుల గురించీ పట్టించుకోలేదు. అతడిలో పదవీ కాంక్ష ఇంతగా గూడుకట్టుకుంటుందనీ, అతడి వల్ల ప్రజలచేత ఎన్నుకున్న ప్రభుత్వం తప్పుకోవాల్సి వస్తుందనీ, అతని వల్ల ప్రజాభీష్టమే వ్యర్థమై పోతుందనీ, ప్రజాస్వామ్యం పట్టపగలే హత్యకు గురౌతుందనీ, అధికారం కోసం ఆ పెద్దమనిషి ఇంతటి అల్పమైన నీచమైన దారుణమైన వెన్ను పోటుకు కూడా సిద్ధపడతాడనీ నేనూహించలేక పోయాను. నామీద ఒక అభియోగం సృష్టించాడు. కార్యకర్తలకేదో అన్యాయం జరిగిందట. ఏమిటా అన్యాయం? ఎవరికా అన్యాయం? పార్టీపట్ల శ్రద్ధా భక్తులతో, అంకితభావంతో పనిచేసి ప్రజల విశ్వాసం చూరగొన్న ఏ నా కార్యకర్తలకూ ఏ నా తెలుగు తమ్ముళ్లకూ అన్యాయం జరగలేదు. ఒకవేళ ఏదైనా లోటు జరిగితే అది అవకాశవాదులకు మాత్రమే జరిగింది! చంద్రబాబు... ఆ పెద్ద మనిషి.... ఆ మేకవన్నె పులి... ఆ తేనెపూసిన కత్తి తయారుచేసిన కుట్రదారులకే జరిగింది! అతడి పక్కన చేరి, కుహనా కార్యకర్తలుగా చలామణై, దళారీలుగా ఉన్నవారికే జరిగింది! పేరు చెప్పేందుకూ అనర్హుడే ఇవాళ నేను మాట్లాడుతున్న వ్యక్తి ఓడిపోయి తెలుగుదేశంలోకి వచ్చాడు. నా విధానాలకు పూర్తిగా అంకితమవుతానని మాటిచ్చాడు. కానీ అతని మనసులో ఉన్న దురాశ మాత్రం పోలేదు. నేనిన్ని పదవులిచ్చాను. కానీ ఆయన మాత్రం తన కంటూ ఓ గుంపును తయారు చేసుకున్నాడు. అది నేను గమనించలేదు. ఎవరూ ఊహించని విధంగా (1994 ఎన్నికల్లో) మాకు 214 సీట్లు వచ్చాయి. ఆ తర్వాత పార్టీలో చేరిన వారితో చూసుకుంటే 224 సీట్లు! కాబట్టి వాళ్లేం చేయలేకపోయారు. అదే ఏ 130, 140 సీట్లో వచ్చుంటే వాళ్లేమైనా చేసి ఉండే వాళ్లు. మాకిది కావాలి, అది కావాలంటూ కోరే వారు. ఎందుకంటే అంతకు ముందే రంగం ఏర్పాటై ఉంది. అందరికీ డబ్బిచ్చాడు ఈయన. ఆయన పేరు చెçప్పడం కూడా నాకిష్టంలేదు. పేరు చెప్పేందుకు కూడా ఆయన అర్హుడు కాదు. అంద రికీ 5లక్షలు, 10 లక్షలు డబ్బులిచ్చి ‘ఇదిగో ఎన్ని కల కోసం మీ అందరికీ డబ్బిస్తున్నాను. మీరంతా నా మనుషులుగా ఉండాలి’ అంటూ ఏర్పాటు చేసుకున్నాడు. ఇక ఎప్పుడైతే 224 సీట్లు టీడీపీకి వచ్చాయో ఆయన ఆటలు సాగలేదు. తప్పనిసరిగా ఎన్టీఆర్‌నే నాయకుడిగా ఎన్నుకోవాల్సి వచ్చింది. కానీ ఎలాగైనా ముఖ్యమంత్రి కావాలన్న ఆశ మాత్రం ఆయన మనసులో చావలేదు. ఆ ఆశతోనే తన గ్రూపును తయారు చేశాడు. ఇట్స్ ఏ ప్లాన్డ్ ట్రెచెరీ! తెలుగు జాతి దురదృష్టం చరిత్రను చూస్తే... తండ్రిని జైల్లో పెట్టిన సమ్రాట్లు న్నారు. రాజ్యాధికారం కోసం అన్నల్ని చంపిన సోదరుడున్నాడు... ఔరంగజేబు. అలాంటి దుర దృష్టకరమైన విధానం మళ్లీ ఇన్ని వందల ఏళ్ల తర్వాత తెలుగు జాతి చరిత్రలో మన రాష్ట్రంలో ఈనాడు తిరిగి జరిగింది. అది మన దురదృష్టం. అలాంటి చిన్నబుచ్చేతనాన్ని మన జాతి అనుభ వించడం అనేది కేవలం నేను చేసుకున్న పాపం. ఎందుకంటే నా వాళ్లుగా ఉంటూ ఈనాడు జాతికే ద్రోహం చేసి మాయని మచ్చను తెచ్చారు. ప్రజా స్వామ్యానికిది చిన్నతనం. (1995 ఆగస్టు 23 నాటి వెన్నుపోటుకు కొద్ది రోజుల ముందు) నేను శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం వెళ్లిన ప్పుడు అక్కడ కూడా ఈ మహానుభావుడే, ఎవరైతే ఈనాడు జాతికే చిన్నతనం తెచ్చారో... అవమానకరంగా వ్యవహరించారో... తెలుగు జాతిని కించపరిచారో... ఆ మహానుభావుడే, ‘రామారావు గారు లేకపోతే మా పార్టీ (తెలుగు దేశం) లేదు. ఆయన వల్లే పార్టీ నడుస్తోంది. మేమాయన వెనకాల ఉంటున్నాం. ఈ ఖ్యాతి, గౌరవం అంతా ఆయనదే. రామారావే మా నాయ కుడు’ అన్నాడు. అలా చెప్పినవాడే 23వ తేదీ సాయంత్రానికల్లా ఎందుకు మారారంటారు? ఆదర్శాలకు వెన్నుపోటు ఈ వెన్నుపోటు జరిగింది నాకొక్కడికి మాత్రమే కాదు. ప్రజలకు, మీకు, మీరు వేసిన ఓటుకు. మీరు నమ్మిన ప్రజాస్వామ్యానికి, మీరు విశ్వసించిన ఆశయాలకు, ఆదర్శాలకు ఇది వెన్నుపోటు! ఇంత నీచానికి ఒడిగట్టిన చంద్రబాబు... ఎన్టీఆర్ లాగే ఆయన విధానాలే కొనసాగిస్తామని చెబుతుంటే ఎలా ఉందో తెలుసా? చేతులు జోడించి, నమ స్కారం చేసి, తుపాకీ పేల్చి గాంధీ మహాత్ముడ్ని పొట్టనబెట్టుకున్న గాడ్సేనే మించిపోయాడు అనిపిస్తోంది. ఇది సిగ్గుచేటు. క్షమించరాని నేరం. వీళ్లంతా ఇలా ఎందుకు చేశారు? ఎందుకు వెన్నుపోటు పొడి చారు? ఏమిటి, ఏమిటి ఎన్టీఆర్ చేసిన తప్పు? ఏమిటి, ఏమిటి ఎన్టీఆర్ చేసిన నేరం? బాబును చరిత్ర క్షమించదు అయామ్ ద లయన్. నేనే సింహాన్ని. ఎందుకంటే సింహం మృగరాజు. ఏ అవమానాన్నీ సహించదు. కాబట్టి నాకెలా అవమానం జరిగింది, నా వాళు,్ల నా అన్నవాళ్లు నన్నే విధంగా మోసం చేశారో ప్రజలకు తెలుసు. అయినా నేను చెప్పడం నా ధర్మం. నా కర్తవ్యం. ప్రజల ప్రతినిధిని నేను. నాకేం జరిగినా ప్రజలకు తెలియజెప్పడం నా బాధ్యత. దేవుడు సహా ఎవరూ క్షమించలేని ఘాతుకానికి బాబు ఒడి గట్టాడు. దీన్ని జాతి, చరిత్ర ఎప్పటికీ క్షమించదు. మీకు ఏ విధమైన రాజకీయం కావాలి? ఏ విధంగా ప్రజాస్వామ్యం ఉండాలి? అది నిర్ణయించుకోవా ల్సింది మీరే. అదే ప్రజాస్వామ్యం. కాబట్టి ఏ పార్టీ అయితే ప్రజాస్వామ్యాన్ని ఉద్ధరిస్తుందో, ఏ పార్టీ అయితే మనం తెచ్చుకున్న స్వాతంత్య్రానికి ఓ చక్కని రూపం దిద్దగలుగుతుందో, అలాంటి పార్టీకే మీరు నిర్భయంగా ఓటేయండి. ఓటు మీ జన్మ హక్కు. దాన్ని నిరుపయోగం చేయకండి. పిరికి తనంతో దాన్ని మరోరకంగా ఉపయోగించకండి... ఇది ‘అన్న’ మాట. -
ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు.. ఘనంగా ఏర్పాట్లు
తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం ఏర్పరుచుకున్న నటుడు నందమూరి తారక రామారావు. తెలుగు భాషపై.. తెలుగు నేలపై ఆయన ముద్ర అజరామరం. సినిమా రంగమైనా,రాజకీయ వేదిక అయినా అన్ని చోట్ల కోట్లాది మంది మనసులో నిలిచిపోయిన యుగ పురుషుడు నందమూరి తారక రామారావు.ఈ ఏడాది మే 28 నుంచి ఆయన శత జయంతి వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఆయన స్వగ్రామం నిమ్మకూరులో బాలకృష్ణ చేతుల మీదుగా ఈ వేడుకలు ఘనంగా ప్రారంభం కాన్నునాయి. దీనికి సంబంధించి ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. స్వర్గీయ తారక రామారావుశత జయంతి వేడుకలకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. -
‘ఆయన చేయలేనిది సీఎం జగన్ చేస్తున్నాడని బాబుకి కడుపు మంట’
సాక్షి, తాడేపల్లి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మీటింగుల్లో స్ట్రాటజీ ఉండదని, అర్థం లేకుండా మాట్లాడుతుంటాడని చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. ఎన్టీఆర్ జిల్లా పేరు పెట్టడంపై ఏమీ పాలుపోక విమర్శలకు దిగుతున్నారని మండిపడ్డారు. దివంగత ఎన్టీఆర్‌పై అంత ప్రేమ ఉన్న వ్యక్తి తాను అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు పేరు పెట్టలేదని ప్రశ్నించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి కృష్ణా జిల్లా వాసులకు ఇచ్చిన మాట ప్రకారం ఎన్టీఆర్ పేరు పెట్టారని స్పష్టం చేశారు. దాన్ని కూడా రాజకీయం చేయాలని చంద్రబాబు చూస్తున్నాడని గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: కొత్త జిల్లాల ప్రకటనపై స్పందించిన ఎమ్మెల్యే బాలకృష్ణ ఎన్టీఆర్, అన్నమయ్య, సత్యసాయి లాంటి వారు ఒక్క ప్రాంతానికి పరిమితమైన వారు కాదని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా వారికి గుర్తింపు ఉందని, వారిని గౌరవించుకోడానికే ప్రభుత్వం ఆ పేర్లు పెట్టిందని తెలిపారు. దాంట్లోనూ చంద్రబాబు రెచ్చగొట్టే ధోరణి విడనాడలేదని, ఏదన్నా తాను చేయలేనిది సీఎం జగన్ చేస్తున్నాడని బాబుకి కడుపు మంటగా ఉందని దుయ్యబట్టారు. ఒక్కసారి ఆయన గురించి ఎన్టీఆర్ ఏమన్నాడో చంద్రబాబు వీడియోలు చూసుకోవాలని హితవు పలికారు. చంద్రబాబు వంటి ద్రోహి ఎవ్వరూ లేరని స్పష్టంగా చెప్పారని గుర్తు చేశారు. చదవండి: మహారాష్ట్ర 12 మంది బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు అదే విధంగా ఉద్యోగుల సమస్యకు, జిల్లాల పునర్వవస్తీకరణకు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. చంద్రబాబు ఎప్పుడూ రెచ్చగొట్టే ప్రయత్నాలే చేస్తారని, ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమని తాము చెప్తూనే ఉన్నామని పేర్కొన్నారు. చర్చల కోసం ఉద్యోగులు రాకపోతున్నా కమిటీ సభ్యులు వేచి చూస్తున్నారని, సమస్య ఏదైనా చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. అలాంటిది ఉద్యోగుల సమస్య పక్కదోవ పట్టించాల్సిన అవసరం ఏముందని నిలదీశారు. -
సీఎం జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా : వైవీఎస్ చౌదరి
విజయవాడ కేంద్రంగా కొత్తగా ఏర్పడబోతున్న జిల్లాకు ఎన్టీఆర్ జిల్లాగా పేరు పెట్టాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రముఖ దర్శక, నిర్మాత వైవీఎస్ చౌదరి స్వాగతించారు. తెలుగు ప్రజల అభిమతం, అకాంక్షలకు అనుగుణంగా నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం జగన్ పంథాలోనే తెలంగాణ ప్రభుత్వం కూడా త్వరలోనే ఓ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలని కోరారు. అలాగే ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎన్టీఆర్‌కు ‘భారతరత్న’అవార్డు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కాగా, జిల్లాల పునర్వ్యవస్థీకరణలో విజయవాడ కేంద్రంగా కొత్తగా ఏర్పడబోతున్న జిల్లాకు ఎన్టీఆర్ జిల్లాగా పేరును రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి గెజిట్ కూడా విడుదలైంది. పాదయాత్ర సందర్భంగా నాడు వైఎస్ జగన్ ఇచ్చిన మాటను తు.చ. తప్పకుండా నిలబెట్టుకున్నారంటూ కృష్ణా జిల్లా వాసులు, ఎన్టీఆర్ అభిమానులు ఎంతగానో సంబరపడుతున్నారు. -
CM YS Jagan: చెప్పాడంటే.. చేస్తాడంతే!
సాక్షి, అమరావతి: సాధారణంగా రాజకీయ నాయకులు ఇచ్చిన వాగ్దానాలు నీటి మూటలవుతుంటాయి. అందుకే ప్రజలు అలాంటి నాయకులిచ్చే హామీలు అమలవుతాయని పెద్దగా ఆశలు పెట్టుకోరు. కానీ మాట తప్పని, మడమ తిప్పని నైజం.. మాటిచ్చారంటే ఎన్ని కష్టాలు, అవరోధాలు ఎదురైనా వెన్ను చూపని విలక్షణంతో.. ఇచ్చిన మాట నిలబెట్టుకునే అత్యంత అరుదైన నాయకుడిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఇప్పటికే జనం మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు. చెప్పాడంటే.. చేస్తాడంతే! అనే పేరును తెచ్చుకున్నారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణలో విజయవాడ కేంద్రంగా కొత్తగా ఏర్పడబోతున్న జిల్లాకు ఎన్టీఆర్ జిల్లాగా పేరును ఖరారు చేశారు. నాటి హామీ ఇలా.. వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్రలో భాగంగా 2018 ఏప్రిల్ 30న దివంగత ఎన్టీ రామారావు స్వస్థలం కృష్ణా జిల్లా నిమ్మకూరు చేరుకున్నారు. ఆ గ్రామంలో నీరు–చెట్టు పథకంలో తవ్విన చెరువు పనుల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయన్న గ్రామస్తుల ఫిర్యాదుతో ఆ చెరువును పరిశీలించారు. గ్రామంలో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతోనూ ముచ్చటించారు. అనంతరం జగన్ మాట్లాడుతూ ‘వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక కృష్ణా జిల్లాను నందమూరి తారక రామారావు జిల్లాగా పేరు మారుస్తాను. ఈ ఊరును, ఈ జిల్లాను అభివృద్ధి పరుస్తాను’అని ప్రకటించారు. ఆ రోజు తానిచ్చిన ఆ హామీని అమలు చేస్తూ కొత్తగా ఏర్పాటవుతున్న విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ జిల్లా పేరిట గెజిట్ విడుదల చేశారు. దీంతో నాడు జగన్ ఇచ్చిన మాటను తు.చ. తప్పకుండా నిలబెట్టుకున్నారంటూ కృష్ణా జిల్లా వాసులు, ఎన్టీఆర్ అభిమానులు ఎంతగానో సంబరపడుతున్నారు. నిమ్మకూరులోని నందమూరి కుటుంబీకులూ ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. విలువలు, విశ్వసనీయతకు మారుపేరైన నాయకుడు జగనే అంటూ కొనియాడుతున్నారు. చదవండి: (ఎచ్చెర్ల యథాతథంతో.. టీడీపీ ఎత్తులు చిత్తు) అసాధారణ నిర్ణయం.. ఎన్టీ రామారావు వైఎస్సార్సీపీ నేత కాదు.. ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీతోనే ఇప్పుడు వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ ఢీకొడుతున్నారు. అయినప్పటికీ కృష్ణా జిల్లాలో పుట్టిన ఎన్టీఆర్ సినీ రంగంలోను, రాజకీయాల్లోనూ వెలుగొందారు. అందుకే రాజకీయాలకతీతంగా జిల్లాకు ఆయన పేరు పెట్టడం సముచితమని భావించి అప్పట్లో జగన్ ఆ ప్రకటన చేశారు.. ఇప్పుడు అమలు చేశారు. మూడుసార్లు ముఖ్యమంత్రి పదవిలో వెలుగొందిన ఎన్టీఆర్ సొంత అల్లుడు చంద్రబాబు చేయలేని పనిని జగన్ చేసి చూపించారు. ఆశ్చర్యపరిచింది.. వైఎస్ జగన్ 2018 పాదయాత్రలో నిమ్మకూరు వచ్చినప్పుడు అధికారంలోకి వచ్చాక కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతానని హామీ ఇచ్చినప్పుడు నమ్మలేకపోయాం. ఇప్పుడు మాట నిలబెట్టుకోవడం మా అందరినీ ఆశ్చర్యపరచింది. ఇది మా నందమూరి కుటుంబీకులకే కాదు.. మా గ్రామ, జిల్లా వాసులకు ఆనందాన్ని కలిగిస్తోంది. గతంలో ఏ నేత చేయలేని పనిని సీఎం జగన్ చేసి చూపించారు. – నందమూరి పెద వేంకటేశ్వరరావు, నిమ్మకూరు వాడుకుని వదిలేశారు నిమ్మకూరులో పుట్టి పెరిగి చలన చిత్ర రంగంలోను, రాజకీయాల్లోనూ రారాజుగా వెలుగొందిన నేత ఎన్టీఆర్. ఆయన పేరిట జిల్లా ఏర్పడటం చెప్పలేనంత సంతోషాన్ని కలిగిస్తోంది. టీడీపీ ప్రభుత్వంలో ఎన్టీఆర్ పేరును వాడుకున్నారే తప్ప ఆయన గురించి పట్టించుకున్న వారు లేరు. సీఎం జగన్ విజయవాడకు ఎన్టీఆర్ జిల్లాగా పేరు పెట్టి ఎన్టీఆర్ పేరు చిరస్థాయిలో నిలిచిపోయేలా చేశారు. – నందమూరి మన్మథరావు, నిమ్మకూరు అభిమానుల్లో ఆనందం విజయవాడ కేంద్రంగా ఏర్పడే జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడం చెప్పలేనంత సంతోషంగా ఉంది. మన జిల్లాలో పుట్టిన ఆయన, సినీ రంగంతో పాటు, రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు. ఆయన పేరు ఎప్పుడో పెట్టి ఉంటే బాగుండేది. ఇన్నాళ్ల తర్వాత కార్యరూపం దాల్చడం అభినందనీయం. సీఎం వైఎస్ జగన్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఎన్టీఆర్ అభిమానులుగా మేమందరం హర్షిస్తున్నాం. – ఎం. కుటుంబరావు, సామాజికవేత్త, విజయవాడ -
కొత్త జిల్లాకు ఎన్టీఆర్ పేరు.. స్పందించిన పురందేశ్వరి
Purandeswari welcomed the decision of YS Jagan: మహనీయుడు నందమూరి తారక రామారావు పుట్టిన జిల్లాకు ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టడాన్ని ఆయన బిడ్డగా తాను స్వాగతిస్తున్నట్టు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుపాటి పురందేశ్వరి తెలిపారు. ప్రజాభీష్టం ఈ నాటికి నెరవేరిందని బుధవారం ఆమె ట్వీట్లో పేర్కొన్నారు. కాగా, జిల్లాల పునర్వ్యవస్థీకరణలో విజయవాడ కేంద్రంగా కొత్తగా ఏర్పడబోతున్న జిల్లాకు ఎన్టీఆర్ జిల్లాగా పేరును రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి గెజిట్ కూడా విడుదలైంది. పాదయాత్ర సందర్భంగా నాడు వైఎస్ జగన్ ఇచ్చిన మాటను తు.చ. తప్పకుండా నిలబెట్టుకున్నారంటూ కృష్ణా జిల్లా వాసులు, ఎన్టీఆర్ అభిమానులు ఎంతగానో సంబరపడుతున్నారు. నిమ్మకూరులోని నందమూరి కుటుంబీకులూ ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. విలువలు, విశ్వసనీయతకు మారుపేరైన నాయకుడు జగనే అంటూ కొనియాడుతున్నారు. ఆ మహనీయుడు నందమూరి తారక రామారావు గారు పుట్టిన జిల్లాకి ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టడం, ఆయన బిడ్డగా నేను స్వాగతిస్తున్నాను. ప్రజాభీష్టం ఈ నాటికీ నెరవేరింది. జై ఎన్టీఆర్!!! pic.twitter.com/r4pbKKrled — Daggubati Purandeswari 🇮🇳 (@PurandeswariBJP) January 26, 2022 చదవండి: (కనుల ముందు కలల జిల్లాలు) -
ఎన్టీఆర్ ఆత్మతో మాట్లాడాను: లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు
-
చంద్రబాబు మంగమ్మ శపథాలను ఎవరూ నమ్మరు: కొడాలి నాని
సాక్షి, అమరావతి: అసెంబ్లీలో చంద్రబాబు పూర్తిస్థాయి డ్రామాతో రక్తి కట్టించారని మంత్రి కొడాలి నాని అన్నారు. ఈ మేరకు శాసనసభ సమావేశం అనంతరం నాని మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు పూర్తి స్థాయి నటుడు. ఆయన ఏడ్వటం దొంగనాటకం. చంద్రబాబు గ్లిజరిన్ సరిగా వేసుకున్నట్లు లేదు. కనీసం కన్నీళ్లు కూడా రావడం లేదు. సానుభూతి కోసం బాబు తన కుటుంబ సభ్యులను కూడా రోడ్డుకీడుస్తారు. చివరకు భార్యను సైతం రాజకీయాల కోసం వాడుకున్నారు. చంద్రబాబు మంగమ్మ శపథాలను ఎవరూ నమ్మరు. సీఎం పదవి కోసం చంద్రబాబు భార్యను కూడా రోడ్డు మీదకు తెచ్చారు. చదవండి: (విధి ఎవర్నీ వదిలిపెట్టదు.. అందరి సరదా తీర్చేస్తుంది: ఆర్కే రోజా) రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారు. అసెంబ్లీ హాల్లో కానీ, బయటకానీ ఏడ్వని చంద్రబాబు మీడియా ముందుకు రాగానే ఏడ్వడం మొదలెట్టారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు పూర్తిస్థాయి డ్రామా రక్తికట్టించారు. అసెంబ్లీలో ఏ ఒక్కరూ చంద్రబాబు కుటుంబ సభ్యులను గాని, ఆయన భార్యను గురించి కానీ మాట్లాడలేదు. ఇప్పటిదాకా బాబు కూడా కుటుంబ సభ్యుల గురించి మాట్లాడారు అంటున్నాడు కానీ ఎవరు మాట్లాడారో మాత్రం ఎక్కడా చెప్పడం లేదు. నా భార్యను అన్నారు అంటూ భార్యను కూడా రాజకీయం కోసం వాడుకునేస్థాయికి దిగజారిపోయిన వ్యక్తి చంద్రబాబు. బాబు డ్రామాల్ని, న్యూసెన్స్‌ని ప్రజలెవరూ పట్టించుకోరు. చదవండి: (బాబు నిన్న చర్చించాడు.. నేడు అమలు చేశాడు: కొడాలి నాని) రామారావు గతంలోనే చంద్రబాబు నన్ను మించిన ఆర్టిస్ట్ అనేవారు. 72 ఏళ్ల వయసులో ఎన్టీఆర్ దగ్గర నుంచి పార్టీని దొంగలించిన వ్యక్తి చంద్రబాబు. ఆయన ముఖ్యమంత్రి పదవిని లాక్కున్నటువంటి దుర్మార్గుడు చంద్రబాబు. ఎన్టీఆర్‌కు ఆత్మాభిమానం ఉంది కాబట్టి అంత జరిగినా మీడియా ముందుకు వచ్చి ఏడ్వలేదు. నాపార్టీని, నా పదవిని.. చివరకు నా కుటుంబాన్ని కూడా నాకు దూరం చేశాడని ఎన్టీఆర్ ఆ రోజు ఎంతగానో కుమిలిపోయాడు తప్ప బాబులా డ్రామాలు రక్తికట్టించలేదు. ఎన్టీఆర్ విషయంలో చేసిన పాపాలు, ప్రజల్ని నమ్మించి మోసం చేసిన పాపాలు బాబును అంత త్వరగా వదిలిపెట్టవు. ఈ మధ్యజరిగిన పంచాయతీ, పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో కానీ కుప్పంలో కానీ ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించారు కాబట్టి రాజకీయ మనుగడ కోసమే ఈ డ్రామాలన్నీ. రాజకీయ అవసరాల కోసం భార్యను ఈ స్థాయిలో వాడుకున్న వ్యక్తిగా చంద్రబాబు చరిత్రలో నిలిచిపోతారని మంత్రి కొడాలి నాని అన్నారు. -
జూనియర్ ఎన్టీఆర్‌కు 9 సెంటిమెంట్ నిజమేనా?
సాధారణంగా మన సినిమా తారలు కొత్త కార్లంటే తెగ మోజు పడుతుంటారు. అందులోనూ స్టార్ హీరోలు ఈ వరుసలో ముందుంటారు. తెలుగు ఇండస్ట్రీలో కార్లపై ఇంట్రస్ట్ అందరికంటే ఎక్కువగా ఉన్న హీరో చిరంజీవి. మార్కెట్లోకి కొత్త కారు వచ్చిందంటే చాలు వాళ్ళ కంపౌండ్‌లోకి తెచ్చుకుంటారు మన మెగాస్టార్. ఇక ఈ జనరేషన్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ లిస్ట్‌లో ఒకరు. ఇప్పటికే ఎన్టీఆర్ గ్యారేజ్‌లో పదికి పైగా కార్లు ఉండగా.. ఇటీవల అత్యంత విలాసవంతమైన లంబోర్ఘిని ఉరస్ గ్రాఫైట్ క్యాప్సూల్ మోడల్ కారును కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఆ కారును మొన్నటికి మొన్న రూ.5 కోట్లకు పైగా ఖర్చు చేసి ప్రత్యేకంగా ఫారెన్ నుంచి తెప్పించుకున్నారు. అయితే ఆసక్తికర విషయం ఏంటంటే తారక్ దగ్గర ఉన్న కార్లన్నిటికీ 9999 నెంబరే ఉంటుంది. అదేంటి అన్ని కార్లకి ఒకే నంబర్ అనుకుంటున్నారా? దీనికి సమాధానంగా తన సన్నిహితులు కొందరు తారక్‌కి ఆ నంబర్ అంటే సెంటిమెంట్ అని అంటుంటారు. కానీ నిజానికి ఎన్టీఆర్‌కు మాత్రం అలాంటి సెంటిమెంట్స్ ఏమీ లేవట. మరెందుకు ఒకే నంబర్‌ను తన అన్ని కార్లకు వాడుతున్నాడనేగా మీ సందేహం..? దానికి ఓ కారణం ఉంది. ఎన్టీఆర్‌కు 9 అనే అంకె అంటే ఇష్టమట. అలాగే తన తాతయ్య స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి కారు నెంబర్ 9999 అనీ.. ఆ తర్వాత తన తండ్రి స్వర్గీయ హరికృష్ట కూడా అదే నంబర్‌ను వాడారని అందుకే తనకు ఆ నంబర్ అంటే ఇష్టమని ఇటీవల ఓ సందర్బంలో ఎన్టీఆర్ చెప్పాడు. అందువల్ల మరో ఆలోచన లేకుండా తన ప్రతి కారుకు అదే నంబర్ కంటిన్యూ అవుతుందని చెప్పుకొచ్చాడు తారక్. తను ఏ కారు తీసుకొచ్చినా కూడా 9999 మాత్రమే ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు. అంతే కాని అది సెంటిమెంట్ కాదని ఎన్టీఆర్ స్పష్టం చేశాడు. తనకు ఎంతో ఇష్టమైన తన తాత నందమూరి తారక రామారావు, తన తండ్రి హరికృష్ట ఇద్దరూ ఆ నెంబర్ వాడడంతో అదే తాను కూడా కంటిన్యూ చేస్తున్నానని ఎన్టీఆర్ తెలిపాడు. అయితే ఇక్కడ మరో విశేషం ఏంటంటే కారు నంబర్‌తో పాటు ఎన్టీఆర్ ట్విటర్ ఖాతా కూడా @tarak9999 అని ఉంటుంది. ఇక తన సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్‌తో కలిసి దర్శకుడు రాజమౌళి డైరెక్షన్లో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్నారు. ఇటీవలే ఆ సినిమాకు రాజమౌళి గుమ్మడికాయ కొట్టేశారు. ఇక మరోవైపు ఎన్టీఆర్ తన తదుపరి చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్న విషయం తెలిసిందే. -
‘బింబిసార’గా కల్యాణ్ రామ్.. ఇది మరో ప్రయోగం
Nandamuri Kalyan Ram: హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా వైవిధ్యమైన చిత్రాల్లో నటించి టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకన్నాడు నందమూరి కల్యాణ్ రామ్. ఇప్పటివరకు రొమాంటిక్, మాస్ సినిమాల్లో నటించి మెప్పించిన ఈ నందమూరి హీరో.. ఇప్పుడు ఓ సరికొత్త పాత్రలో కనిపించబోతున్నారు. తన తాత నందమూరి తారకరామారావు జయంతి సందర్భంగా శుక్రవారం తన కొత్తసినిమా టైటిల్‌ని ప్రకటించాడు. మగధ సామ్రాజ్యంలోని హర్యంకా రాజవంశ రాజైన బింబిసారుడు జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి ‘బింబిసార’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో ‘బింబిసార’ మోషన్ పోస్టర్ని చిత్రబృందం షేర్ చేసింది. కత్తిని పట్టుకుని కల్యాణ్ రామ్ సరికొత్త లుక్ లో, గెటప్ లో కన్పించి అభిమానులను సర్ప్రైజ్ చేశాడు. మృతదేహాల సమూహంపై కూర్చుని ఉన్న కల్యాణ్ రామ్ లుక్ అందరికి ఆకట్టుకుంటుంది. వశిష్ట్ దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాలో కేథరిన్ ట్రెసా, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎన్టిఆర్ ఆర్ట్స్ బ్యానర్ క్రింద హరికృష్ణ కె ‘బింబిసారా’నిర్మిస్తున్నారు. చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నాడు. -
బాలయ్య నోట శ్రీరామ దండకం.. వీడియో వైరల్
బాలయ్య నోట శ్రీరామ దండకం.. వీడియో వైరల్ విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారకరామారావు(ఎన్టీఆర్) జయంతి నేడు(మే 28). ఈ సందర్భంగా తారకరామారావుకు ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ గాత్ర నివాళులర్పించారు. ఎన్టీఆర్‌ను స్మరించుకుంటూ బాలకృష్ణ శ్రీరామ దండకాన్ని స్వయంగా ఆలపించారు. బాలయ్య నిర్మాణ సంస్థ నందమూరి బాలకృష్ణ ఫిల్మ్స్ ఈ వీడియోని తమ ట్విటర్లో విడుదల చేయగా, ఇది అభిమానులని ఎంతగానో అలరిస్తుంది. ఎంతో కష్టతరమైన సంస్కృత పదాలను ఈజీగా పలికేశారు బాలయ్య. సాహిత్యం పట్ల ఆయనకున్న అభిరుచికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇక గతేడాది అత్యంత ‘శివ శంకరి ..’ పాడి, తన అభిమానులకు విందుగా విడుదల చేసిన విషయం తెలిసిందే. చదవండి : గుండె తల్లడిల్లిపోతోంది తాతా: ఎన్టీఆర్ ఎమోషనల్ ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి: చిరంజీవి డిమాండ్ -
గుండె తల్లడిల్లిపోతోంది తాతా: ఎన్టీఆర్ ఎమోషనల్
విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఆయనను గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యాడు బాలకృష్ణ. తండ్రి ప్రతిభను, కీర్తిని చాటిచెప్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. మహానుభావులు యుగానికి ఒక్కరే పుడతారని వారి ప్రస్తావనే ప్రపంచాన్ని ప్రకంపింపజేస్తుందన్నాడు. వారి ఆలోచనలే అనంతమైన ఆనందాన్ని అనుభూతిలోకి తెస్తుందని చెప్పాడు. వారి విజయగాథలు వేరొక లోకంలోకి వెంట తీసుకెళ్తాయని, అలాంటి అరుదైన కోవకు చెందిన మహానుభావుడు మన తారకరాముడు అని నొక్కి చెప్పాడు. "గల్లీల్లో తిరిగి పాలు పోసినవాడు ఢిల్లీకి దడ పుట్టించడం.. రంగులేసుకునేవాడు రాజ్యాలు ఏలటం.. గ్రీకు శిల్పంలాంటి రూపంతో పురాణ పాత్రల్లో జీవించడం.. అన్నా అన్నా అని ఆర్తిగా కోట్లమందితో పిలిపించుకోవడం.. తరాలు మారుతున్నా తరగని కీర్తిని ఆర్జించడం.. తోట రాముడిగా మొదలయ్యి కోట రాముడిగా ఎదగడం.. కలలోనే సాధ్యమయ్యే పనులను ఇలలో చేసి చూపించడం.. ఒక్క తారకరాముడికే చెల్లింది. ఆ చరిత్రకారుడు, యుగపురుషుడు నందమూరి తారకరాముని 98వ జయంతి రోజున వారి దివ్య స్మృతిలో అనుక్షణం స్మరిస్తూనే ఉంటాము' అని బాలయ్య రాసుకొచ్చాడు. ఇక తండ్రి జయంతిని పురస్కరించుకుని బాలకృష్ణ శ్రీరామ దండకం చదివాడు. మా గుండెలను మరొక్కసారి తాకి పోండి తాతా 🙏🏻 pic.twitter.com/a3wAJeN6XR — Jr NTR (@tarak9999) May 28, 2021 మరోవైపు తాతకు తగ్గ మనవడుగా సినిమాల్లో రాణిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియాలో భావోద్వేగానికి లోనయ్యాడు. మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోందని, మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోందన్నాడు. పెద్ద మనసుతో ఈ ధరిత్రిని, మా గుండెలను మరొక్కసారి తాకిపో తాతా అని రాసుకొచ్చాడు. ఎంతోమంది మనసులను హత్తుకుంటున్న ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. #NandamuriBalakrishna via FACEBOOK ❤️#NTRJayanthi #JoharNTR pic.twitter.com/Mr6m7cOxQi — Nandamuri Balakrishna™ (@NBK_Unofficial) May 28, 2021 నాటికీ - నేటికీ - ఏనాటికీ ఎదురులేని మనిషి!https://t.co/70i6s4GTjP#VintageVyjayanthi #LegendaryNTRJayanthi https://t.co/3flkEtJ329 — Vyjayanthi Movies (@VyjayanthiFilms) May 28, 2021 చదవండి: ప్రముఖ తెలుగు యాంకర్‌పై సోనూసూద్ ప్రశంసలు.. కారణమిదే.. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇస్తే తెలుగువారికే గౌరవం: చిరంజీవి -
ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి: చిరంజీవి డిమాండ్
తెలుగు జాతి కీర్తిని, తెలుగు భాష ఖ్యాతిని దశదిశలా చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి నందమూరి తారక రామారావు. నోరు తిరగని డైలాగులను కూడా సింగిల్ టేక్‌లో చెప్పే ఈ దివంగత హీరోకు విశ్వ విఖ్యాత నట సార్వభౌముడని బిరుదు కూడా ఉంది. రాముడు, కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రల్లో మెప్పించి తెలుగు వారి గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న ఎన్టీఆర్ బర్త్‌డే నేడు(మే 28). ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఎప్పటి నుంచో వినిపిస్తున్న ఓ డిమాండ్‌ను మరోసారి తెర మీదకు తీసుకొచ్చాడు. "ప్రముఖ గాయకులు, నవయుగ వైతాళికులు భూపేన్ హజారికాకు మరణానంతరం భారతరత్న ఇచ్చినట్లుగా.. మన తెలుగు తేజం, దేశం గర్వించే నాయకుడు ఎన్టీఆర్‌కు భారత రత్న ఇస్తే అది తెలుగువారందరికీ గర్వ కారణం. వారి 100వ జయంతి దగ్గర పడుతున్న సందర్భంగా ఎన్టీఆర్‌కు ఈ గౌరవం దక్కితే అది తెలుగువారికి దక్కే గౌరవం" అని చిరు ట్వీట్ చేశాడు. #RememberingTheLegend#BharatRatnaForNTR pic.twitter.com/efN2BIl8w7 — Chiranjeevi Konidela (@KChiruTweets) May 28, 2021 మరణంలేని జననం ఆయనిది.. అలుపెరగని గమనం ఆయనిది.. అంతేలేని పయనం ఆయనిది.. ‘తెలుగు జాతి’కి గర్వకారణం మరియూ ‘తెలుగు పలుకు’లను తన కంఠంతో కొత్తపుంతలు తొక్కించిన అవిశ్రాంతయోధుడు #NTR 🙏#BharatRatnaForNTR #JoharNTR #LegendaryNTRJayanthi @tarak9999 pic.twitter.com/dlPEN9K6WG — MassGodNTRFc (@massgod_ntr_fc) May 28, 2021 చదవండి: బాహుబలి, రేసుగుర్రం బాలనటుడు హీరోగా 'బ్యాచ్' మూవీ -
నందమూరి ఫ్యాన్స్‌కి బాలయ్య బాబు అదిరిపోయే అప్డేట్
నందమూరి అభిమానులకు సర్ప్రైజ్ ఇవ్వడానికి సిద్దమయ్యాడు బాలకృష్ణ. ఈ మేరకు రేపు (మే 27) ఉదయం 8.45 గంటలకు ఓ చిన్న సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాం బాలకృష్ణకు సంబంధించిన నిర్మాణ సంస్థ ఎన్బీకే ఫిల్మ్స్ నుంచి ఓ ప్రకటన వెలువడింది. అందులో ఎన్టీఆర్ ఫోటో ఉంచడంతో ఆ సర్ప్రైజ్ ఏమై ఉంటుందా అని నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే బాలయ్య ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ’అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే 80 శాతం వరకూ పూర్తైంది. ప్రస్తుతం కరోనా ప్రభావం కారణంగా చిత్రీకరణను నిలిపివేశారు. 'సింహా', 'లెజెండ్' వంటి భారీ హిట్ల తర్వాత రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా మే 28న ‘అఖండ’నుంచి ఓ పాట విడుదల కాబోతుందని ప్రచారం కూడా జరుగుతోంది. దానికి సంబంధించిన వివరాలనే రేపు వెల్లడిస్తాడని అభిమానులు చర్చించుకుంటున్నారు. మరోవైపు ఎన్టీఆర్ 99వ జయంతి సందర్భంగా బాలకృష్ణ తండ్రికి నివాళిగా తన గానంతో ‘శ్రీరామదండకం’విడుదల చేయనున్నాడని, దానికి సంబంధించిన అధికారిక ప్రకటన రేపు ఉదయం 8.45కి రాబోతోందనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. మరి బాలయ్య బాబు ఇచ్చే సర్ప్రైజ్ ఏంటో తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే. A surprise at 8:45AM tomorrow. Stay Tuned.#NandamuriTarakaRamaRao #NandamuriBalaKrishna@NBKFilms_ pic.twitter.com/NtJkF4cuc9 — NBK FILMS (@NBKFilms_) May 26, 2021 -
యుగ పురుషుడు ఎన్టీఆర్: కొడాలి నాని
సాక్షి, తాడేపల్లి : సాధారణ కుటుంబంలో పుట్టి ఉన్నత స్థానానికి చేరుకున్న మహా వ్యక్తి నందమూరి తారక రామారావు అని ఏపీ మంత్రి కొడాలి నాని కొనియాడారు. మహానుభావుడు, యుగ పురుషుడు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయనకు తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించారు. వెన్నుపోటుదారుడు, కుట్రదారుడు అయిన చంద్రబాబు పిల్లనిచ్చిన మామను పార్టీ నుంచి మెడపట్టి గెంటేశాడని మండిపడ్డారు. పార్టీని తస్కరించిన దొంగ.. ఎన్టీఆర్ వర్ధంతి నాడు ఆయనకు దండ వేయడం ఆశ్చర్యం వేస్తోందన్నారు. ఎన్టీఆర్ ఎలా చనిపోయాడో, దానికి కారణమైన వారెవరో అందరికీ తెలుసన్నారు. ముఖాన ఉమ్మి వేస్తారనే సిగ్గు శరం లేకుండా చంద్రబాబు మాట్లాడుతున్నాడని దుయ్యబట్టారు. ఇంకా పాతికేళ్లు ఉన్నా ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలని బాబు డిమాండ్ చేస్తూనే ఉంటాడు కానీ ఢిల్లీలో చక్రం తిప్పినప్పుడు భారతరత్న ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వడం చంద్రబాబుకు ఇష్టం లేదని చంద్రబాబు బతికుండగా ఎన్టీఆర్‌కు భారతరత్న రాదని పేర్కొన్నారు. చంద్రబాబుకు ప్రపంచ రత్న ఇవ్వాలి ‘ఎన్టీఆర్ తెర మీద నటుడైతే... చంద్రబాబు నిజ జీవితంలో నటుడు. చంద్రబాబుకు వెన్నుపోటులో ప్రపంచ రత్న అవార్డు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నా. రామారావు బొబ్బిలిపులి అయితే నువ్వు పిల్లివి. ఎన్టీఆర్ ఆస్తులు ధ్వంసం చేసావంటున్న కాంగ్రెస్‌తో ఎందుకు జత కట్టావు. ఇద్దరే ఇద్దరు వ్యక్తులు మాత్రమే టీడీపీని నాశనం చేయగలరు .వాళ్ళు చంద్రబాబు, పప్పు నాయుడు . పాపం ఆడపిల్ల అఖిల ప్రియ గురించి ఒక్కమాట కూడా మాట్లాడటం లేదు. ఇదే ఏపీలో ఆమెను అరెస్ట్ చేస్తే గోల గోల చేసేవాడు. ఎన్టీఆర్ గొప్పతనం గురించి ఏ పార్టీలోనూ రెండో ఒపీనియన్ లేదు. మా పార్టీలో కూడా లేదు. ఎన్టీఆర్ ఆశీస్సులు మాకు, మా జగన్మోహన్రెడ్డికే ఉంటాయి. ఒక మారుమూల దేవాలయాలను ధ్వంసం చేస్తారు. స్పెషల్ ఫ్లైట్ వేసుకుని ఉదయాన్నే దిగిపోతారు. సీఎం, హోమ్ మినిస్టర్, డీజీపీ క్రిస్టియన్ అంటూ ఆరోపణలు చేస్తారు. డీజీపీ స్పష్టంగా 9 కేసుల్లో టీడీపీ వారు ఉన్నట్లు తేలింది. మా పేర్లు చెప్పడానికి వీలేదంటూ ఒక రాష్ట్ర డీజీపీని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అప్పట్లో సీపీగా ఉన్న గౌతమ్ సవాంగ్ కాల్ మనీ సెక్స్ రాకెట్లో టీడీపీ వారిని అరెస్టు చేశారు. ఈ రోజు నువ్వు దొంగలాగా దొరికిపోయి డీజీపీని భయపెట్టాలని చూస్తున్నారు. ఈ రాష్ట్ర డీజీపీకి, పోలీసు వ్యవస్థను మా ప్రభుత్వం అండగా ఉంటుంది. మీరు ఎవర్నీ వదలాల్సిన అవసరం లేదు. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. అవసరమైతే చంద్రబాబులాంటి వ్యక్తినైనా లాక్కొచ్చి లోపలేయవచ్చు. మా నాయకుడు పక్కా మానవత్వవాది. ఎక్కడికి వెళ్లిన అక్కడి విశ్వాసాలను అవగాహన చేసుకుని పూజిస్తాడు. పక్కా రాజకీయ వ్యభిచారి చంద్రబాబు. నువ్వు చేసే ఆరోపణలు దేనికీ పనికిరావు. ఈ రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి వెన్నుపోటు పొడిచే నీచుడిని బంగాళాఖాతంలో కలపాలి. ఎన్టీఆర్ బొమ్మను తాకే అర్హత కూడా చంద్రబాబుకి లేదు. రాష్ట్రంలో 70 వేల దేవాలయాలు ఉన్నాయి. అన్ని చోట్లా సీసీ కెమెరాలు లేవు. అలా లేని చోట్లను ఎంచుకుని చంద్రబాబు దాడులు చేస్తున్నాడు. ఎన్టీఆర్ అభిమానులు చంద్రబాబును వెంబడించి రాష్ట్రం నుంచి తరిమేయాలి.’ చంద్రబాబుపై అని కొడాలి నాని ధ్వజమెత్తారు. -
ఎన్టీఆర్ కీర్తి అజరామరం: చిరంజీవి
సాక్షి, హైదరాబాద్: టీడీపీ వ్యవస్థాపకుడు, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి నేడు. ఈ సందర్భంగా హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు శ్రద్దాంజలి ఘటించారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌లు నేడు ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వెళ్లకూడదని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఎన్టీఆర్ జయంతి పురస్కరించుకుని పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు నివాళులర్పించారు. మెగాస్టార్ చిరంజీవి స్వర్గీయ ఎన్టీఆర్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ‘తెలుగు జాతి పౌరుషం, తెలుగు వారి ఆత్మగౌరవం.. తెలుగు నేల గుండెల్లో ఎన్నటికీ చెదరని జ్ఞాపకం.. నందమూరి తారక రామారావుగారి కీర్తి అజరామరం.. వారితో కలిసి నటించడం నా అదృష్టం.. పుట్టినరోజునాడు ఆ మహానుభావుని స్మరించుకుంటూ..’ అంటూ ఎన్టీఆర్‌తో కలిసి దిగిన ఆనాటి ఫోటోను కూడా ట్విటర్లో షేర్ చేశారు. 1981లో చిరంజీవి, ఎన్టీఆర్‌లు కలిసి ‘తిరుగులేని మనిషి’ అనే చిత్రంలో నటించిన విషయం తెలసిందే. (ఎన్టీఆర్ ఘాట్ వద్ద బాలకృష్ణ నివాళి) ‘మీరు లేని లోటు తీరనిది’ అని పేర్కొంటూ ‘మీ పాదం మోపక తెలుగ ధరిత్రి చిన్నబోతోంది.. మీ రూపు కానుక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది. పెద్ద మనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా సదా మీ ప్రేమకు బానిసను’ అంటూ యంగ్‌టైగర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. వీరితో పాటు నందమూరి కళ్యాణ్‌రామ్, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, తదితర టాలీవుడ్ ప్రముఖులు ట్విటర్ వేదికగా ఎన్టీఆర్ ఘన నివాళులర్పించారు. (అక్కడకు వెళ్లకూడదని నిర్ణయం..) తెలుగు జాతి పౌరుషం, తెలుగు వారి ఆత్మగౌరవం తెలుగు నేల గుండెల్లో ఎన్నటికీ చెదరని జ్ఞాపకం నందమూరి తారక రామారావుగారి కీర్తి అజరామరం. వారితో కలిసి నటించడం నా అదృష్టం. పుట్టినరోజునాడు ఆ మహానుభావుని స్మరించుకుంటూ... pic.twitter.com/LgSKsItxdO — Chiranjeevi Konidela (@KChiruTweets) May 28, 2020 My cinematic journey has had numerous highs! But the biggest honour, even greater than accolades and awards is surely having had the opportunity to work with the legendary NTR garu. I will forever cherish this and consider it my biggest achievement. 🙏🏻🙏🏻 #JoharNTR pic.twitter.com/Wnqo4h71D4 — Raghavendra Rao K (@Ragavendraraoba) May 28, 2020 మీరు లేని లోటు తీరనిది... pic.twitter.com/FA1uyWaWoS — Jr NTR (@tarak9999) May 28, 2020 -
ఎన్టీఆర్ ఘాట్ వద్ద బాలకృష్ణ నివాళి
సాక్షి, హైదరాబాద్ : నేడు టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామరావు 97వ జయంతి సందర్భంగా ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ నివాళులర్పించారు. గురువారం ఉదయం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకున్న బాలకృష్ణ.. పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. బాలకృష్ణతో పాటుగా ఆయన సతీమణి వసుంధర, నందమూరి రామకృష్ణ, సుహాసిని.. ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి ఎన్టీఆర్ అని గుర్తుచేసుకున్నారు. ఎన్టీఆర్ నటించిన సినిమాలు చరిత్రలో నిలిచిపోతాయని తెలిపారు. ఎన్టీఆర్‌ను స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్లాలని అన్నారు. (చదవండి : ఎన్టీఆర్ ఘాట్‌కు వెళ్లకూడదని నిర్ణయం..) మరోవైపు ఎన్టీఆర్ మనవళ్లు జూనియర్ ఎన్టీఆర్, నందమూరి కల్యాణ్‌రామ్‌లు కూడా ట్విటర్ వేదికగా ఆయనను గుర్తుచేసుకుని.. నివాళులర్పించారు. ‘మీరు లేని లోటు తీరనిది. మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది. మీ రూపు కానక గుండె తల్లడిల్లిపోతోంది. పెద్దమనసుతో ఈ ధరిత్రని, ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా.. సదా మీ ప్రేమకు బానిసను’ అని ఎన్టీఆర్ పేర్కొన్నారు. ‘మా ఖ్యాతి మీరే, మా కీర్తి మీరే.. ఓ విశ్వవిఖ్యాత, అందుకో మా జ్యోత’ అని కల్యాణ్‌రామ్ పోస్ట్ చేశారు. కాగా, కరోనా పరిస్థితుల నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌లు నేడు ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వెళ్లకూడదని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. -
అక్కడకు వెళ్లకూడదని నిర్ణయం..
హైదరాబాద్ : టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు జయంతి(మే 28) సందర్భంగా ప్రతి ఏడాది కుటుంబ సభ్యులు, అభిమానులు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయనకు నివాళులర్పిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఆయన మనవళ్లు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌లు గురువారం ఎన్టీఆర్ ఘాట్‌కు వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు. పెద్ద ఎత్తున జనాలు అక్కడికి చేరుకుంటే కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇంట్లోనే ఉండి ఆ మహానుభావుడికి నివాళులర్పించనున్నట్టు ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌లు తెలిపారు. -
ఎన్టీఆర్ గొప్ప నటుడు
హైదరాబాద్ : నందమూరి తారకరామారావు గొప్ప నటుడని తమిళనాడు మాజీ గవర్నర్ డాక్టర్ కె.రోశయ్య అన్నారు. మంగళవారం ఎన్టీఆర్ విజ్ఞాన్ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలను రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ అస్సామీ రచయిత, మాజీ పార్లమెంటు సభ్యుడు డాక్టర్ నగేన్ సాకియాకు ఎన్టీఆర్ జాతీయ సాహితీ పురస్కారం–2019 ప్రదానం చేశారు. అనంతరం రోశయ్య మాట్లాడుతూ, రాజకీయంగా వైరుధ్యం ఉన్నప్పటికి నటుడిగా ఎన్టీఆర్‌ను ఎంతో అభిమానించానని అన్నారు. ప్రభుత్వ సలహాదారులు డాక్టర్ కె.వి.రమణాచారి మాట్లాడుతూ, రాజకీయం విడదీస్తుందని.. సాహిత్యం మాత్రం అందరినీ కలుపుకుపోతుందని అన్నారు. ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్ చైర్పర్సన్ ఎన్.లక్ష్మీపార్వతి మాట్లాడుతూ ఎన్టీఆర్ పేరిట సేవచేయడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఈ సందర్భంగా నృత్య గురువు ఇందిరా ముస్నూరి శిష్యబృందం చేసిన కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీనటి జీవిత రాజశేఖర్, ఆర్టీఐ మాజీ కమిషనర్ పి.విజయ్‌బాబు, ప్రముఖ రచయిత్రి డాక్టర్ అనంతలక్ష్మి, చింత కిరణ్‌కుమార్, యువ కళావాహిని అధ్యక్షులు వై.కె.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ నుంచి ‘వాడి’ పేరు తీసేస్తా
సాక్షి, అమరావతి : తెలుగుదేశం వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు పేరు ఎక్కడా కనిపించకుండా చేసేందుకు చంద్రబాబు పన్నిన కుట్ర బట్టబయలైంది. తెలుగుదేశం వ్యవస్థాపకుడు, అన్న నందమూరి తారకరామారావు పేరును ఏ ప్రభుత్వ పథకానికీ లేకుండా చేసేందుకు చంద్రబాబు, తోకపత్రిక యజమాని రాధాకృష్ణతో కలసి ఎన్టీఆర్‌ను దూషించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి అధికారాన్ని చేజిక్కించుకోవడమే కాకుండా.. అసలు ఆయన పేరే ఎక్కడా కన్పించకుండా చేసేందుకు ఇద్దరూ కలసి పన్నిన కుట్రపై ఎన్టీఆర్ అభిమానుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీని పేరు ఇంకా ఎందుకు మార్చలేదు అన్న తోకపత్రిక ఎండీ రాధాకృష్ణతో.. తెలుగుదేశం వ్యవస్థాపకుడు అన్న ఎన్టీ రామారావును ఉద్దేశించి ‘‘వాణ్ణి అనవసరంగా క్యారీ చేస్తున్నాం.. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీలోంచి వాడి పేరు ఎత్తేసి మన మీడియాలో ఫుల్ పబ్లిసిటీ ఇద్దాం. ఆరు నెలల తర్వాత ఇక చూసుకో..’’ అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. ఎన్టీఆర్ పేరుతో ఉన్న ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్ వైద్య భరోసా)ను పేరు మార్చడంతోపాటు ఆరు నెలల తర్వాత పూర్తిగా దీనిని ఎత్తి వేయాలని వారు పథకం వేశారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ, చంద్రబాబు మధ్య ఈ కుట్రకు సంబంధించి జరిగిన సంభాషణల వీడియో ‘సాక్షి’కి లభించింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. టీవీ లైవ్ ప్రోగాంకు ముందు వీరిద్దరూ మాట్లాడుకున్న మాటలు వీరి కుట్రను బట్టబయలు చేశాయి. వారు తలచుకుంటే ఎంత విష ప్రచారమైనా చేయగలరని, దేనినైనా తారుమారు చేసే కుట్రలకు బీజాలు వేస్తారని మరోమారు రూఢీ అయింది. ఆరోగ్యశ్రీకి ఎన్టీఆర్ వైద్య భరోసా అనే పేరు మార్చిన విషయం విదితమే. ఇందులో ఎన్టీఆర్ పేరును తొలగించే విషయం రాధాకృష్ణ చంద్రబాబు మధ్య చర్చకు వచ్చింది. పేరు తొలగిద్దామనగానే తీసేయండి అని రాధాకృష్ణ సలహా ఇచ్చేశారు. ఈ సందర్భంగా వారి మధ్య జరిగిన సంభాషణ ఇలా ఉంది... వాడి పనైపోయింది చంద్రబాబు : అప్పుడా టెక్నాలజీ లేదు. ఇప్పుడు వినియోగిస్తున్నాం. అదో టెక్నాలజీ. ఉద్యోగాలు, గిద్యోగాలు పోవడం..కరువు వచ్చినప్పుడు చేయకుండా పోవడం, ఉద్యోగస్తులను తిట్టడం.... రాధాకృష్ణ : అప్పుడు మీరు చేసినంత ఫుడ్‌ఫర్ వర్క్ ఎవరూ చేయలేదు. చంద్రబాబు : దానిని మిస్ యూజ్ చేశారు. రాధాకృష్ణ : ఫస్ట్ వైజాగ్, తర్వాత తిరుపతి, చివరకు విజయవాడ లైవ్‌లోకి తీసుకోండి. ఏబీఎన్ లైవ్‌కు యూట్యూబ్‌లో హైయ్యెస్ట్ లైక్స్ రావాలి. రాధాకృష్ణ : యూట్యూబ్‌లో మనది టాప్. చంద్రబాబు : వ్యూయర్షిప్లో మనది ఎంత? రాధాకృష్ణ : మనది మూడు లేదా నాలుగో స్థానం టెక్నికల్ టీమ్: (చంద్రబాబుతో) వైజాగ్ ఇంకో సిటీని కలిపాం సార్ చంద్రబాబు : ఇప్పటివరకు ఎన్ని ఉన్నాయి? రెండూ కలిపితే లక్షా ఇరవై వేలు ఉంటాయా? నేను చెప్పినప్పుడు నీవు వస్తావా? రాధాకృష్ణ : వచ్చినా నష్టంలేదు. చంద్రబాబు : నేను అడిగినప్పుడు నీవు ఆపరేట్ చేయి. రాధాకృష్ణ : ప్యాకేజీ ఇంకా మొదలు కాలేదుగా. వేరే వ్యక్తి : మొదలు కాలేదు సర్. రాధాకృష్ణ :ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అనే ఉందా పేరు? చంద్రబాబు : వాడి పేరు మార్చాలి.. మారుస్తున్నా.. రాధాకృష్ణ : మొన్న చెప్పింది ఇదే. దాన్ని టోటల్‌గా రీవ్యాంప్ చేయాలి. దానికి భారీగా మన మీడియాలో పబ్లిసిటీ ఇచ్చేద్దాం. చంద్రబాబు : మార్చేస్తున్నా. వేరే పేరు మార్చేస్తున్నా. వాడి పనై పోయింది (ఎన్టీఆర్‌ను ఉద్దేశించి) రాధాకృష్ణ : ఆ ఓకే. చంద్రబాబు : ఎన్టీఆర్... పేరు మార్చాలి. రాధాకృష్ణ : దానిని వేరే పేరు మార్చాలి. దానిని యూనివర్సల్ హెల్త్ స్కీమ్ చేస్తున్నారు కదా. పేరు మార్చేద్దాం. పబ్లిసిటీ బాగా ఇద్దాం. రీవ్యాంప్ చేద్దాం. ఈలోగా టెక్నికల్ వారితో సంభాషణ ఏ సబ్జెక్టులు ఉన్నాయి. వైజాగ్‌లో ఏమి పెట్టారు. వైజాగ్‌లో ఎల్ఈడీ...తదితర అంశాలున్నాయి. -
ఇరవై తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ..
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు ఆపద్ధర్మ సీఎం హోదాలో తొలిసారి తెలంగాణలో 1985లో నల్లగొండ నుంచి అసెంబ్లీకి పోటీచేసి గెలిచారు. అప్పుడు హిందూపురం, గుడివాడ నుంచి కూడా ఆయన ఎన్నికయ్యారు. వెంటనే నల్లగొండ, గుడివాడ సీట్లకు ఎన్టీఆర్ రాజీనామా చేసి హిందూపురం శాసనసభ్యునిగా కొనసాగారు. ఐదేళ్లకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో (1989 డిసెంబర్) ఆయన హిందూపురంతో పాటు మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి నుంచి కూడా పోటీచేశారు. ఈ తెలంగాణ సీటులో కాంగ్రెస్ అభ్యర్థి జక్కుల చిత్తరంజన్‌దాస్ చేతిలో ఎన్టీఆర్ ఓటమి పాలయ్యారు. మళ్లీ ఆయన తెలంగాణ నుంచి అసెంబ్లీకి పోటీ చేయలేదు. 1989 తర్వాత 29 ఏళ్లకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యురాలు (మనవరాలు) సుహాసిని పోటీ చేస్తుండటం విశేషం. హైదరాబాద్ నగరంలోని కూకట్పల్లి నుంచి టీడీపీ టికెట్‌పై ఆమె పోటీచేయడం ద్వారా తాత తర్వాత తెలంగాణ నుంచి అసెంబ్లీకి ఎన్నికల రంగంలోకి దిగిన నందమూరి కుటుంబసభ్యురాలిగా గుర్తింపు పొందారు. తొలి తరమంతా.. మహామహులే! నగర రాజకీయాల్లోని తొలితరం నాయకులంతా ఉన్నత విద్యావంతులే. ఆయా రంగాల్లో నిష్ణాతులుగా పేరొందిన వారే నాడు రాజకీయాల్లోకి వచ్చి నిస్వార్థ ప్రజాసేవకు పూనుకున్నారు. హైదరాబాద్ స్టేట్‌కు 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో ముషీరాబాద్ నుంచి ప్రముఖ వైద్యులు, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి గోల్డ్‌మెడల్ సాధించిన జీఎస్ మెల్కొటే విజయం సాధించగా, చాదర్‌ఘాట్ నుంచి ప్రముఖ న్యాయ కోవిదుడు గోపాలరావు ఎక్బోటే ఎన్నికయ్యారు. అనంతరం.. ఎగ్బోటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా కూడా బాధ్యతలు నిర్వహించారు. బేగంబజారు నుంచి ప్రముఖ న్యాయవాది కాశీనాథ్‌రావు వైద్య విజయం సాధించగా, సోమాజిగూడ నుంచి నిజాం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో కీలక బాధ్యతలు చూసిన మెహిదీ నవాజ్ జంగ్ విజయం సాధించారు. ఫత్తర్‌గట్టి నుంచి సంఘసేవకురాలు మాసుమా బేగం తొలి ఎన్నికలోనే భారీ మెజారిటీతో గెలుపొంది శాసనసభలో అడుగుపెట్టారు. ఉమ్మడి ఏపీలో కూడా వీరిలో కొందరు వివిధ మంత్రివర్గాల్లోనూ పనిచేశారు. కమలానికి కలిసొచ్చిన స్థానం పూర్వపు హిమాయత్‌నగర్ స్థానానికి 1983లో జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఆలె నరేంద్ర గెలిచారు. మళ్లీ 1985 సాధారణ ఎన్నికల్లో టీడీపీ మిత్రపక్షాల మద్దతుతో ఆయన గెలుపొందారు. 1989 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి వి.హనుమంతరావు చేతిలో ఓడిపోయారు. 1992 ఉప ఎన్నికలో ఇక్కడి నుంచే మళ్లీ నరేంద్ర ఎన్నికయ్యారు. తర్వాత 1994, 99 ఎన్నికల్లో టీడీపీ టికెట్‌పై సి.కృష్ణాయాదవ్ గెలిచారు. 2004లో టీడీపీ మద్దతుతో బీజేపీ అభ్యర్థిగా జి.కిషన్‌రెడ్డి గెలిచారు. 2008 పునర్విభజనతో ఇది అంబర్‌పేటగా మారింది. వరుసగా 2009, 2014లో కిషన్‌రెడ్డి (బీజేపీ) గెలుపొందారు. మళ్లీ అంబర్‌పేట నుంచి కిషన్‌రెడ్డి, కాలేరు వెంకటేశ్ (టీఆర్ఎస్) పోటీచేస్తున్నారు. -
తెలుగునాట 1983 ఎన్నికలు చరిత్రాత్మకం
1983 ఈ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్‌తోపాటు జాతీయ రాజకీయాల్లోనూ చరిత్రాత్మకంగా నిలిచిపోయాయి. ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించినప్పటినుంచి అప్రతిహతంగా 26 ఏళ్ల పాటు ఎదురులేకుండా దూసుకెళ్తున్న కాంగ్రెస్‌కు తెలుగుగడ్డపై నందమూరి తారక రామారావు బ్రేకులు వేశారు. కాంగ్రెస్ వ్యతిరేక నినాదంతో 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ స్థాపించారు. ఆ తర్వాత కేవలం 9 నెలల వ్యవధిలో.. 1983లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్టీఆర్ ప్రభంజనం సృష్టించారు. 294 స్థానాల్లో 202 సీట్లు సాధించి చరిత్ర సృష్టించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 60 సీట్లకే పరిమితం కాగా.. ఇందులో తెలంగాణలోనే 42 (107 సీట్లలో) స్థానాలు సంపాదించుకుంది. కాంగ్రెస్ హేమాహేమీలు.. సైకిల్ గుర్తుపై పోటీచేసిన అనామకుల చేతుల్లో దారుణంగా ఓడిపోయారు. ఎన్టీఆర్‌తో పొత్తుకోసం చివరి నిమిషం వరకు ప్రయత్నించిన ఉభయ కమ్యూనిస్టులు, జనతాపార్టీ, లోక్‌దళ్, బీజేపీ పార్టీలు కూడా తక్కువ సీట్లకే పరిమితమయ్యాయి. 1982లో ఇందిరతో విభేదించి సొంతపార్టీ (రాష్ట్రీయ సంజయ్ మంచ్) పెట్టుకున్న చిన్న కోడలు మేనకా గాంధీ ఎన్టీఆర్‌తో చేతులు కలిపారు. శూన్యత పూరించిన ఎన్టీఆర్ ఏపీ అవతరణ తర్వాత కాంగ్రెస్ కాస్తో, కూస్తో పోటీగా భావించిన కామ్రేడ్లు 1957, 62 ఎన్నికల్లో మినహా గట్టిపోటీని ఇవ్వలేకపోయారు. మిగిలిన జాతీయ పార్టీలు కూడా ఆంధ్రప్రదేశ్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. ఈ నేపథ్యంలో తెలుగుగడ్డపై ఏర్పడిన రాజకీయ శూన్యతను ఎన్టీఆర్ పూరించారు. 1978లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ (ఐ)లో మిగిలిన పార్టీల ఎమ్మెల్యేలు చేరడంతో ఈ సంఖ్య 250 దాటింది. అయినా ఆ పార్టీ సుస్థిర పాలనను అందించలేకపోయింది. అవినీతి, అసమ్మతి, అంతర్గత పోరుతో కాంగ్రెస్ ప్రజాదరణ కోల్పోయింది. అప్పటికే హైదరాబాద్‌లో స్థిరపడిన ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ప్రారంభిస్తున్నట్టు ప్రకటించి సంచలనం సృష్టించారు. అయితే.. టీడీపీ తొలి ర్యాలీకి జనం పెద్దగా హాజరుకాలేదు. కానీ.. చైతన్యరథం ద్వారా ఎన్టీఆర్ రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించడంతో ఆ పార్టీకి జనాదరణ మొదలైంది. ఆర్నెల్లలోపే ఈ గాలి ప్రభంజనంగా మారుతున్నట్లు కనిపించడంతో ఇందిర అసెంబ్లీని మూడునెలల ముందే రద్దుచేసి ఎన్నికలు జరిపించారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేనాటికి.. ఎన్టీఆర్ తెలంగాణలోని అన్ని జిల్లాల్లో పర్యటన పూర్తిచేయలేదు. దీంతో కోస్తా, రాయలసీమతో పోలిస్తే తెలంగాణలో టీడీపీకి తక్కువసీట్లు వచ్చాయి. గతంలో కాంగ్రెస్ మంత్రులుగా ఉన్న నాదెండ్ల భాస్కరరావు, నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, వసంత నాగేశ్వరరావు, ఎన్.యతిరాజారావు, పి.మహేంద్రనాథ్, టీఎన్ సదాలక్ష్మి వంటి నేతలు తెలుగుదేశంలో చేరారు. అంతేగాక, అసలు రాజకీయాల్లో పెద్దగా అనుభవం లేని వారు కూడా టీడీపీలో చేరి విజయం సాధించారు. తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతోపాటు రెండు రూపాయలకే కిలో రేషన్ బియ్యం, బడుగు వర్గాల సంక్షేమానికి చేసిన హామీలు ఎన్టీఆర్ ప్రభంజనానికి కారణాలు. కుదేలైన కాంగ్రెస్! కేవలం సినీ గ్లామర్‌తో ఎన్టీఆర్ ఈ ఎన్నికల్లో విజయం సాధించలేరని.. కాంగ్రెస్ నేతలు వేసిన అంచనాలు తప్పయ్యాయి. ఇందిరతోపాటు, రాజీవ్ గాంధీ స్వయంగా ప్రచారం చేసినా ఎన్టీఆర్ జోరు ముందు పనిచేయలేదు. సొంత జిల్లా కృష్ణాలోని గుడివాడ, చిత్తూరు జిల్లా తిరుపతి నుంచి పోటీ చేసిన ఎన్టీఆర్ రెండు చోట్లా ఘనవిజయం సాధించారు. చంద్రగిరి నుంచి రెండోసారి కాంగ్రెస్ టికెట్ తీసుకొని పోటీచేసిన ఆయన అల్లుడు, సహాయ మంత్రి నారా చంద్రబాబు నాయుడు టీడీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. తెలుగుదేశం 149 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 50%కు పైగా ఓట్లు సంపాదించడం విశేషం. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీకి 46.3% ఓట్లు పోలయ్యాయి. హైదరాబాద్ నగరంలో అప్పటివరకు రెండు సీట్లకే పరిమితమైన ఎంఐఎం.. ఈసారి తన సంఖ్యను ఐదుకు పెంచుకుంది. కాంగ్రెస్ పరువు కాపాడిన తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన 60 సీట్లలో అత్యధికంగా 42 స్థానాలు తెలంగాణ ప్రాంతంలోనే దక్కాయి. తెలుగుదేశం పార్టీకి కూడా బలహీనంగా ఉందనుకున్న తెలంగాణలోని మొత్తం 107 సీట్లలో 42 సీట్లు కైవసం కావడం విశేషం. తెలంగాణ జిల్లాల్లో ఆంధ్రప్రాంత సెటిలర్లు గణనీయ సంఖ్యలో ఉన్న నిజామాబాద్ జిల్లాలో టీడీపీ అత్యధిక సీట్లు (6/9) గెలుచుకోగలిగింది. అలాగే పూర్వపు ఆంధ్రరాష్ట్ర జిల్లాల మూలాలున్న జనం చెప్పుకోదగ్గ సంఖ్యలో నివసించే హైదరాబాద్ నగరంలో కూడా తెలుగు దేశం పార్టీకి ఎక్కువ సీట్లు కైవసమయ్యాయి. ఇక్కడ ఏడు సీట్లు (హిమాయత్‌నగర్, ముషీరాబాద్, సనత్‌నగర్, సికింద్రాబాద్, ఖైరతాబాద్, సికింద్రాబాద్ కంటోన్మెంట్) టీడీపీ గెలుచుకుంది. ఇంకా జిల్లాల వారీగా చూస్తే మహబూబ్‌నగర్‌లో 6/13, మెదక్‌లో 3/10, ఆదిలాబాద్‌లో 4/9, కరీంనగర్లో 6/13, వరంగల్‌లో 4/13, నల్లగొండలో 4/12, ఖమ్మంలో 1/9 స్థానాల్లో ఎన్టీఆర్ పార్టీ విజయం సాధించింది. బరిలో తొలిసారి... సిద్ధిపేట నుంచి టీడీపీ తరఫున పోటీచేసిన కేసీఆర్.. సీనియర్ కాంగ్రెస్ నేత మదన్మోహన్ చేతిలో కేవలం 877 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అసెంబ్లీ రద్దు కారణంగా రెండేళ్లకే జరిగిన మధ్యంతర ఎన్నికల్లో (1985) సమీప కాంగ్రెస్ అభ్యర్థి టి.మహేందర్‌రెడ్డిపై 16 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో కేసీఆర్ గెలుపొందారు. సికింద్రాబాద్‌లో కాంగ్రెస్ మంత్రి కె.కేశవరావును తెలుగుదేశం అభ్యర్థి మాచినేని కిషన్‌రావు ఓడించారు. కార్మిక నేత, జనతాపార్టీ అభ్యర్థి నాయిని నరసింహారెడ్డి తెలుగుదేశం అభ్యర్థి శ్రీపతి రాజేశ్వరరావు చేతిలో పరాజయం పాలయ్యారు. మాజీ హోంమంత్రి కె.ప్రభాకరరెడ్డిని బీజేపీ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి మలక్‌పేటలో ఓడించారు. చాంద్రాయణగుట్ట నుంచి పోటీచేసిన బీజేపీ నేత ఆలె నరేంద్రను ఎంఐఎం నేత అమానుల్లా ఖాన్ ఓడించారు. జగిత్యాలలో కాంగ్రెస్ నేత జువ్వాడి రత్నాకరరావును.. టీడీపీ అభ్యర్థి టి.జీవన్ రెడ్డి ఓడించారు. తొలిసారి ఈవీఎంలు ఈవీఎంలు ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన షాద్‌నగర్‌లో తొలిసారి పోటీచేసిన కాకా అల్లుడు శంకరరావు గెలుపొందారు. డీకే సమర సింహారెడ్డి(కాంగ్రెస్) గద్వాల నుంచి, మంత్రి ఎం.మాణిక్‌రావు తాండూరులో గెలిచారు.చార్మినార్ నుంచి ఎంఐఎం నేత సలావుద్దీన్ ఒవైసీ అసెంబ్లీకి చివరిసారి పోటీచేసి బీజేపీ అభ్యర్థి సి.అశోక్‌కుమార్‌ను ఓడించారు. మాజీ సీఎం అంజయ్య(రామాయంపేట), సీపీఐ నేత గూండా మల్లేష్ (ఆసిఫాబాద్), దుద్దిళ్ల శ్రీపాదరావు (మంథని) నుంచి గెలిచారు.అచ్చంపేటలో టీడీపీ టికెట్‌పై పోటీచేసిన పి.మహేంద్రనాథ్ విజయం సాధించారు. మెదక్ నుంచి గెలిచిన ఇందిర కేంద్రంలో జనతాపార్టీ ప్రభుత్వ పతనం తర్వాత 1980లో లోక్‌సభకు జరిగిన మధ్యంతర ఎన్నికల్లో కాంగ్రెస్ (ఐ) ఘన విజయం సాధించింది. మొత్తం 42 ఎంపీ స్థానాల్లో 41 సీట్లను (పార్వతీపురం–ఎస్టీ) నుంచి గెలుపొందిన కిశోర్ చంద్రదేవ్ (కాంగ్రెస్ అర్స్–యూ) మినహా ఇందిరా కాంగ్రెస్ కైవసం చేసుకుంది. తెలంగాణ ప్రాంతంలోని మొత్తం 15 సీట్లను ఆ పార్టీ చేజిక్కించుకుని పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఈ ఎన్నికల్లో మెదక్ నుంచి మాజీ ప్రధాని ఇందిర 2,19,124 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు. తెలంగాణ నుంచి గెలిచిన ఇతర ప్రముఖులు గెలిచిన ముఖ్యనేతల్లో మాజీ సీఎం పీవీ నరసింహారావు (హన్మకొండ), పి.శివశంకర్ (సికింద్రాబాద్), ఎం. మల్లిఖార్జున్ (పాలమూరు), మల్లు అనంతరాములు (నాగర్‌కర్నూల్–ఎస్సీ), కమాలుద్దీన్ అహ్మద్ (వరంగల్), ఎం.సత్యనారాయణరావు (కరీంనగర్), నంది ఎల్లయ్య (సిద్దిపేట–ఎస్సీ), కోదాటి రాజమల్లు (పెద్దపల్లి–ఎస్సీ), కె.సత్యనారాయణ (హైదరాబాద్) ఉన్నారు. -(సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
చంద్రబాబు ఉంటే ప్రత్యేక హోదా రానేరాదు
-
ఆత్మను అమ్ముకొని బతికే నీచుడు చంద్రబాబు
-
ఎన్టీఆర్‌పై చంద్రబాబు కపట ప్రేమ
-
దేశం గర్వించదగ్గ నటుడు ఎన్టీఆర్
సాక్షి, హైదరాబాద్: నందమూరి తారక రామారావు దేశం గర్వించదగ్గ నటుడని తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య అన్నారు. ఎన్టీఆర్ గొప్ప గొప్ప పాత్రల్లో నటించి, జీవించి తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. సోమవారం ఇక్కడి రవీంద్రభారతిలో ద్రవిడ విశ్వవిద్యాలయం మాజీ వైస్ చాన్సలర్ డాక్టర్ రవ్వా శ్రీహరికి ఎన్టీఆర్ జాతీయ సాహితీ పురస్కారం ప్రదానం చేశారు. ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. రోశయ్య మాట్లాడుతూ అంతమంచి నటనాకౌశలం ఉన్న నటుడిని ఇక చూడబోమన్నారు. సినీ వినీలాకాశంలో అంతటి గొప్ప వ్యక్తి పేరుతో ఇచ్చే పురస్కారాన్ని భాషాసాహిత్యంలో శిఖరసమానుడు, మహామహోపాధ్యాయడు ఆచార్య రవ్వా శ్రీహరికి ఇవ్వటం సముచితంగా ఉందని పేర్కొన్నారు. రాజకీయాల్లో ఎన్టీఆర్ ధోరణి, తన ధోరణి వేర్వేరైనా ఎప్పుడైనా, ఎక్కడైనా చర్చకు వస్తే ఎన్టీఆర్ గురించి గొప్పగా చెప్పేవాడినన్నారు. విశిష్ట అతిథి ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకరరావు మాట్లాడుతూ మన దేశ సంస్కృతి, సంప్రదాయాలు, సాహిత్య ప్రభావాలు చాలా విశిష్టమైనవని, వాటిని మనం గుర్తించలేకపోతున్నామని అన్నారు. వ్యక్తిత్వంలో ఎన్టీఆర్ భగవంతుడి స్వరూపమన్నారు. గౌరవ అతిథి, ప్రముఖ నటి డాక్టర్ జమున మాట్లాడుతూ ఎన్టీఆర్‌ను మించిన నటుడు మరొకరు లేరని, ఆయనతో కలసి నటించటం తన అదృష్టమని అన్నారు. ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి మాట్లాడుతూ ఎన్టీఆర్ ఎంతోమందికి రాజకీయ జీవితాలు కల్పించిన మహావ్యక్తి అని కొనియాడారు. ట్రస్టు చైర్పర్సన్ ఎన్.లక్ష్మీపార్వతి మాట్లాడుతూ ఎన్టీఆర్‌కు తాను భార్య కావటం ఎన్నో జన్మల అదృష్టమన్నారు. శ్రీహరి మాట్లాడుతూ ఎన్టీఆర్ సాహితీ పురస్కారాన్ని అందుకోవడం సంతోషంగా ఉందని, ఇది తనకు ప్రత్యేకమైనదని అన్నారు. కార్యక్రమంలో ఏపీ సమాచార హక్కు చట్టం పూర్వ కమీషనర్ పి.విజయబాబు, అవార్డు కమిటీ సభ్యులు డాక్టర్ అనుమాండ్ల భూమయ్య, డాక్టర్ ముక్తేవి భారతి, డాక్టర్ సూర్య ధనంజయ్, వైకే నాగేశ్వరరావు, నటి దివ్యవాణి తదితరులు పాల్గొన్నారు. -
కథానాయకుడు
-
ఎన్టీఆర్ జయంతి కుటుంబసభ్యులు నివాళులు
-
అన్న సిద్ధాంతం ఇదేనా?
-
మరో ఎన్టీఆర్ బయోపిక్: ఆత్మఘోష
సాక్షి, హైదరాబాద్: దివంగత మాజీ ముఖ్యమంత్రి, ఆంధ్రుల అందాల నటుడు నందమూరి తారక రామారావు జీవితకథ ఆధారంగా వరుసగా సినిమాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఎన్టీఆర్ తనయుడు నందమూరి బాలకృష్ణ తాను ప్రధానపాత్రలో బయోపిక్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. తేజ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఎన్టీఆర్ బయోపిక్ కోసం ఇప్పటికే షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైంది. ఇక ప్రముఖ దర్శకుడు నట్టికుమార్ కూడా ఎన్టీఆర్‌పై బయోపిక్ తీయనున్నట్టు ప్రకటించారు. ‘నందమూరి తారక రామారావు ఆత్మఘోష’ పేరిట ఈ సినిమాను తెరకెక్కిస్తానని, వైస్రాయ్ హోటల్ ఘటన నుంచి 2019 ఎన్నికల వరకు అన్ని నిజాలే చూపిస్తానని దర్శకుడు నట్టికుమార్ అంటున్నారు. చంద్రబాబు మామ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి.. ఆయనను గద్దె నుంచి దింపిన ఉదంతంలో వైస్రాయ్ ఘటన కీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. మీరు ఎవరు? కే రాఘవేంద్రరావు, అశ్వినీ దత్, జెమిని కిరణ్, కేఎల్ నారాయణ ఇటీవల చంద్రబాబును కలసి సినిమా పరిశ్రమ మద్దతు ఉంటుందని చెప్పారని, చిత్ర పరిశ్రమ మొత్తం మద్దతు టీడీపీకి ఉంటుందని చెప్పడానికి వారు ఎవరని నట్టికుమార్ ప్రశ్నించారు. ఎంపీ టికెట్లు, లాబీయింగ్ వంటి స్వప్రయోజనాల కోసం వారు చంద్రబాబును కలిశారని, అలాంటప్పుడు చిత్ర పరిశ్రమ పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించడానికి వారు ఎవరని నిలదీశారు. ఢిల్లీలో వైఎస్సార్సీపీ ఎంపీలు చేసిన నిరాహార దీక్షకుగానీ, ఇతరుల ఆందోళనలకుగానీ వారు ఎందుకు మద్దతు తెలపలేదని మండిపడ్డారు. సినీ పరిశ్రమలో మొత్తం లక్షమంది ఉన్నారని, వారందరి మద్దతు తెలుగుదేశం పార్టీకి లేదని తేల్చిచెప్పారు. నటి శ్రీరెడ్డి విషయంలో అర్జెంట్‌గా ప్రెస్‌మీట్ పెట్టిన సినీ పెద్దలు.. ప్రత్యేక హోదా కోసం ఎందుకు మీడియా సమావేశం పెట్టి మాట్లాడలేదని ప్రశ్నించారు. సినీ పరిశ్రమ మొత్తం ఒక్క రోజు షూటింగ్‌లు ఆపి హోదాకు మద్దతు తెలుపాలని నట్టికుమార్ సూచించారు. -
ఎన్టీఆర్ బయోపిక్ : వర్మ కాదు.. ఆయన శిష్యుడు
నందమూరి తారక రామారావు బయోపిక్ పై రోజుకో వార్త టాలీవుడ్ సర్కిల్స్ లో హల్ చల్ చేస్తోంది. బాలకృష్ణ ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా సినిమా తెరకెక్కించనున్నట్టుగా ప్రకటించారు. అప్పటి నుంచే వివాదాలు మొదలయ్యాయి. అదే సమయంలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కిస్తున్నట్టుగా ప్రకటించటం మరింత ఆసక్తి కలిగేలా చేసింది. తాజాగా మరో ఆసక్తికరమైన వార్త టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. నేనే రాజు నేనే మంత్రి సినిమాతో పొలిటికల్ థ్రిల్లర్ లను కూడా తెరకెక్కించగలనని ప్రూవ్ చేసుకున్న దర్శకుడు తేజ. ఎన్టీఆర్ బయోపిక్ కు దర్శకత్వం వహించే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. ఈ విషయంపై దర్శకుడు తేజ స్పందించారు. తాను బాలకృష్ణతో ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో చర్చించిన విషయం నిజమేనన్న తేజ, తాను దర్శకత్వం వహించేది లేనిది త్వరలోనే ప్రకటిస్తానని తెలిపారు. వర్మ మాత్రం తన స్టైల్ లో ఎన్టీఆర్ బయోపిక్ తో వివాదాలు సృష్టిస్తున్నారు. ఇప్పటికే లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే టైటిల్ తో ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేసిన వర్మ, వచ్చే ఏడాది చివరకు సినిమాను రిలీజ్ చేస్తానని తెలిపారు. -
రామారావుగారి బయోపిక్‌లో బాలకృష్ణ
స్వర్గీయ నందమూరి తారక రామారావుగారి జీవిత చరిత్రపై ఇప్పటివరకూ సినిమా రాలేదు. ఇప్పుడాయన తనయుడు బాలకృష్ణ తండ్రి కథతో సినిమా చేయాలనుకుంటున్నారు. సోమవారం ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరు వెళ్లిన బాలకృష్ణ ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ బయోపిక్‌లో తండ్రీకొడుకులు ఎన్టీఆర్, బాలకృష్ణ పాత్రలు రెండిటినీ బాలకృష్ణే చేయనున్నారట! ఈ సినిమా గురించి ఆయన మాట్లాడుతూ – ‘‘నాన్నగారి జీవితంలోని అన్ని కోణాలు ఈ చిత్రంలో స్పృశించనున్నాం. ప్రస్తుతం కథపై పరిశోధన జరుగుతోంది. మా కుటుంబ సభ్యులు, నాన్నగారి సన్నిహితులను కలసి ఆయన విశేషాలను తెలుసుకుంటున్నాం. నాన్నగారి జీవితం గురించి అందరికీ తెలిసిన విషయాలతో పాటు ఎవ్వరికీ తెలియని విషయాలు కూడా సినిమాలో ఉంటాయి. దర్శక– నిర్మాతల వివరాలను త్వరలో ప్రకటిస్తాం’’ అన్నారు. -
ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి : సీఎం
పేదల కోసం వినూత్న పథకాలు తెచ్చిన ఘనత ఎన్టీఆర్దేనని వెల్లడి సాక్షి ప్రతినిధి, విజయవాడ: దివంగత నందమూరి తారకరామారావుకు భారతరత్న పురస్కారం ఇవ్వాలని ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ 20వ వర్ధంతి సందర్భంగా విజయవాడలోని ఏ-కన్వెన్షన్ హాలులో జరిగిన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వడం ద్వారా దేశంలో మనల్ని మనం గౌరవించుకున్నట్లు అవుతుందన్నారు. రూ.2కే కిలో బియ్యం, పేదలకు పక్కా భవనాలు, పేద విద్యార్థుల కోసం రెసిడెన్షియల్ పాఠశాలలు, రైతులకు రూ.50కే విద్యుత్ వంటి వినూత్న పథకాలు ఇచ్చిన ఘనత ఎన్టీఆర్దేనన్నారు. కమ్యూనిజం, క్యాపిటలిజం, సోషలిజం వంటి సిద్ధాంతాలు చెప్పుకోవడానికే పనికొస్తున్నాయన్నారు. ఎన్టీఆర్ మాత్రం సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అంటూ సిద్ధాంతాన్ని చెప్పి అమలు చేశారన్నారు. రాష్ట్రం విడిపోయినప్పుడు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందడం కష్టమని తానూ అనుకున్నానని, 19 నెలల కాలంలో అన్నీ సాధ్యమేనని అర్థమైందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 200 ప్రాంతాల్లో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపులు సోమవారం నిర్వహించినట్లు చెప్పారు. -
తాతకు తగ్గ మనవళ్లు అనిపించుకుంటారు!
నటవిఖ్యాత నందమూరి తారక రామారావు నటించిన ‘దానవీరశూరకర్ణ’ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు మర్చిపోలేరు. అదే పేరుతో ఓ బాలల చిత్రం రానుంది. ఇందులో నందమూరి జానకిరామ్ తనయులు మాస్టర్ ఎన్టీఆర్ శ్రీకృష్ణునిగా, మరో కుమారుడు సౌమిత్రి సహదేవునిగా నటించారు. శ్రీ సాయి జగపతి పిక్చర్స్ సంతోష్ ప్రొడక్షన్స్ పతాకంపై చలసాని వెంకటేశ్వరరావు, జె.బాలరాజు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి జేవీఆర్ దర్శకుడు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. దర్శకుడు మాట్లాడుతూ -‘‘మేము అనుకున్న దానికన్నా బాల నటీనటులు బాగా నటించారు. సింగిల్ షెడ్యూల్లో ఈ చిత్రాన్ని పూర్తి చేశాం. మాస్టర్ ఎన్టీఆర్, సౌమిత్రి తాతకు తగ్గ మనవళ్లు అనిపించుకుంటారు’’ అని చె ప్పారు. ‘‘నాటి ‘దానవీరశూరకర్ణ ’కు పని చేసిన సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి కూడా పనిచేయడం విశేషం. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని జె.బాలరాజు తెలిపారు. ఈ చిత్రానికి ఎడిటర్: నందమూరి హరి, కళాదర్శకులు: ఎస్.ఆర్.కె.శర్మ. -
దేశం గర్వించదగ్గ నాయకుడు ఎన్టీఆర్
కేంద్ర మంత్రి దత్తాత్రేయ సాక్షి, హైదరాబాద్: దివంగత సీఎం నందమూరి తారక రామారావు మహానటుడే కాదు, దేశం గర్వించదగ్గ గొప్ప ప్రజానాయకుడని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అభిప్రాయపడ్డారు. ఎన్టీఆర్ 19వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం రవీంద్రభారతిలో ఎన్టీఆర్ లలితకళ, ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ ఎన్టీఆర్ ప్రాంతీయ పార్టీ పెట్టి, దేశ రాజకీయాలు నడిపారన్నారు. జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డాక్టర్ సి.నారాయణ రెడ్డి మాట్లాడుతూ ఎన్టీఆర్‌లాంటి మహనీయుల వర్ధంతులు కూడా జయంతులేనన్నారు. తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి మాట్లాడుతూ సాహిత్యంలో సి.నా.రె., నటనలో ఎన్టీఆర్‌లు ప్రజా హృదయాల్లో నిలిచిపోయారన్నారు. మహానటి జమున మాట్లాడుతూ ఎన్టీఆర్‌తో తనకున్న జ్ఞాపకాలను గుర్తు చేసుకొన్నారు. ఎన్టీఆర్ విజ్ఞాన ట్రస్ట్ చైర్పర్సన్, ఎన్టీఆర్ సతీమణి ఎన్. లక్ష్మీపార్వతి మాట్లాడుతూ ప్రజల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకొన్న మహానటుడు ఎన్టీఆర్ అని, ప్రజల ఆశీర్వాదం తనకు ఇచ్చి వెళ్లారన్నారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ చేతుల మీదుగా ఎన్టీఆర్ లలితకళా పురస్కారాన్ని ప్రఖ్యాత సినీ గేయరచయిత చంద్రబోస్‌కి, ఎన్టీఆర్ ప్రతిభా పురస్కారాన్ని వంశీ రామరాజుకు అందజేశారు. అంతకముందు గాయనీగాయకులు చంద్రతేజ, గీతాంజలి నిర్వహించిన ఎన్టీఆర్ చిత్ర గీతాల సంగీత విభావరి ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ సుద్దాల అశోక్‌తేజ, రచయిత్రి డాక్టర్ కె.వి. కృష్ణకుమారి, వ్యాఖ్యాత లంక లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. పాటపాడిన దత్తన్న ఈ సందర్భంగా దత్తాత్రేయ పాట పాడి అలరించారు. తనకు నచ్చిన పాట అంటూ చంద్రబోస్ రాసిన మౌనంగానే ఎదగమని.. పాటను పాడి ఉత్సాహాన్ని నింపారు. -
ఇక ‘ఎన్టీఆర్ ఆరోగ్య సేవ’
పథకం పరిధిలోకి 1,038 జబ్బులు సాక్షి, హైదరాబాద్: పేద రోగుల జీవితానికి భరోసానిచ్చిన ‘రాజీవ్ ఆరోగ్యశ్రీ’ పథకం పేరు మారింది. దీన్ని ‘డాక్టర్ నందమూరి తారకరామారావు ఆరోగ్య సేవ’గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్చింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం శనివారం ఉత్తర్వులు జారీచేశారు. ఆంధ్రప్రదేశ్‌లో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ఇకపై డాక్టర్ నందమూరి తారకరామారావు ఆరోగ్య సేవగా ఉంటుందన్నారు. రాష్ట్ర విభజన తరువాత ఆరోగ్యశ్రీ బోర్డును పునర్నిర్మాణం చేయాల్సి వచ్చిందన్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన ఆరోగ్య శ్రీ పథకం ప్రపంచంలోనే అత్యున్నత ఆరోగ్య బీమా పథకంగా గుర్తింపు పొందింది. ఇప్పటివరకూ 26 లక్షల మంది పేద రోగులకు పథకం కింద ఉచితంగా శస్త్రచికిత్సలు చేశారు.ఈ పథకాన్ని 2007 ఏప్రిల్ 1న వైఎస్సార్ ప్రారంభించారు. పథకంలో మరో 100 జబ్బులు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో ప్రస్తుతం 938 జబ్బులకు సేవలందుతున్నాయి. పథకం డాక్టర్ నందమూరి తారకరామావు ఆరోగ్యసేవగా మారిన నేపథ్యంలో మరో 100 జబ్బులకు కూడా వర్తిస్తుంది. ఇకపై 1038 జబ్బులకు ఉచిత ఆరోగ్యసేవలు అందుతారుు. రూ.2.50 లక్షలకు పెంపు: ఆరోగ్యశ్రీ పథకంలో రూ.2 లక్షల వరకు చికిత్స కవరేజీ ఉంది. ఇకపై 1038 జబ్బులకు వర్తించేలా ఒక్కో కుటుంబానికి ఏడాదికి రూ.2.50 లక్షలువర్తింప చేస్తామని పేర్కొన్నారు. నెట్వర్క్ ఆస్పత్రుల్లో నగదు రహిత వైద్య సేవలు అందుతాయని తెలిపారు. -
ఎన్టీఆర్‌కు ‘భారతరత్న’ ఈసారీ లేనట్టే!
మరోసారి టీడీపీ సర్కారు మొండిచేయి... అవార్డు కోసం కేంద్రానికి ఎన్టీఆర్ పేరును సిఫారసు చేయని వైనం గత ఎన్డీఏ హయాంలోనే ఇస్తామన్నా బాబు విముఖత! పద్మ అవార్డులకు మురళీమోహన్, గల్లా రామచంద్రనాయుడు, బాపు పేర్లు సిఫారసు హైదరాబాద్: ప్రతిష్టాత్మక పద్మ అవార్డుల కోసం ఆంధ్రప్రదేశ్ సర్కారు పంపిన సిఫారసు జాబితాలో.. ప్రఖ్యాత తెలుగు నటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు పేరుకు చోటు దక్కలేదు. దివంగత ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలంటూ ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు గతంలో పార్టీ మహానాడులో తీర్మానం చేయడంతోపాటు.. పలుమార్లు డిమాండ్ కూడా చేశారు. ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నేతృత్వంలోని సర్కారు.. తాజాగా పద్మ అవార్డుల కోసం పలువురి పేర్లు సిఫారసు చేస్తూ కేంద్ర హోంశాఖకు పంపిన జాబితాలో ఎన్టీఆర్ పేరును భారతరత్నకు సిఫారసు చేయలేదు. ప్రతీ ఏడాది గణతంత్ర దినోత్సవ ఉత్సవాల్లో ఇచ్చే పద్మ అవార్డుల కోసం రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారు, సమాజానికి ఆయా రంగాల ద్వారా సేవలందించిన వ్యక్తుల పేర్లను సిఫారసు చేస్తాయి. గతంలో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఎన్టీఆర్‌కు భారతరత్న ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చినా అప్పట్లో చంద్రబాబు అడ్డుపుల్ల వేశారన్న వార్తలు వచ్చాయి. ఎన్టీఆర్‌కు భారతరత్న అవార్డు ఇస్తే ఆ అవార్డును నిబంధనల మేరకు ఆయన భార్య లక్ష్మీపార్వతి అందుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మళ్లీ ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని సిఫారసు చేసే అవకాశం వచ్చినప్పటికీ చంద్రబాబు అలా సిఫారసు చేయకపోవడంపై టీడీపీ నేతల్లో విస్మయం వ్యక్తమవుతోంది. ఇప్పుడు పంపిన సిఫారసుల్లో ఎన్టీఆర్ పేరు లేదని, అయితే విమర్శలు వస్తే తరువాత అయినా లేఖ రాసే అవకాశం ఉంటుందని అధికార వర్గాలు వ్యాఖ్యానించాయి. 25 మంది పేర్లు సిఫారసు... పద్మ అవార్డుల కోసం రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 25 మంది పేర్లను సిఫారసు చేసింది. ఇందులో టీడీపీ ఎంపీ, సినీ నటుడు మురళీమోహన్ పేరును పద్మభూషణ్ అవార్డుకు సిఫారసు చేశారు. అలాగే గల్లా రామచంద్రనాయుడు పేరును పద్మశ్రీ అవార్డుకు సిఫారసు చేశారు. ఐటీ రంగంలో నిష్ణాతుడైన రాజిరెడ్డి, ప్రముఖ డాక్టర్ నోరి దత్తాత్రేయుడు, ఇటీవలే మరణించిన సినీ, కళారంగ ప్రముఖుడు బాపు, డాక్టర్ నాగేశ్వరరెడ్డిలకు పద్మవిభూషణ్; చాగంటి కోటేశ్వరరావు, నేదునూరి కృష్ణమూర్తిలకు పద్మభూషణ్ అవార్డులు ఇవ్వాలని సిఫారసు చేసిన ప్రభుత్వం.. మరికొందరి పేర్లను కూడా పద్మ అవార్డుల కోసం సిఫారసు చేసింది. -
ఎన్టీఆర్ వారసులకు మొండిచేయే...
బావ తీరుపై హరి కారాలు మిరియాలు సాక్షి, విజయవాడ : తెలుగుదేశం పార్టీని స్థాపించిన నందమూరి తారకరామారావు సొంత జిల్లాలోని గుడివాడతో పాటు హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. పార్టీ పెట్టిన తొలినాళ్లలో రెండు పర్యాయాలు ఆయన గుడివాడ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఎన్టీఆర్ మరణంతో చంద్రబాబుపై కోపంతో హరికృష్ణ అన్న తెలుగుదేశం పార్టీని పెట్టి గుడివాడ నుంచి పోటీ చేసి ఓటమి చవిచూశారు. అటు తరువాత ఎన్టీఆర్ వారసులు ఎవరూ జిల్లా నుంచి పోటీ చేయలేదు. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఎన్టీఆర్ వారసులు జిల్లా నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపించారు. జిల్లా వదిలి.. హిందూపురంతో సరి.. బావ ఆదేశిస్తే ఎక్కడి నుంచి పోటీ చేసేందుకైనా సిద్ధమేనని తొడకొట్టిన బాలయ్య చివరకు హిందూపురం అసెంబ్లీ టిక్కెట్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆయన జిల్లాలోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని అనుకున్నారు. దీనికితోడు పెనమలూరులో మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్‌కు వర్గపోరుతో చిరాకు వచ్చిన ప్రతిసారి అవసరమైతే బాలకృష్ణను, లేకుంటే లోకేష్‌ను పోటీకి తీసుకొస్తానని ప్రకటించేవారు. గన్నవరంలో సిట్టింగ్ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధనరావు సైతం వంశీతో వర్గపోరు నేపథ్యంలో బాలకృష్ణను పోటీకి తీసుకొస్తానని రాజకీయ వేడి రగిల్చేవారు. గుడివాడ నుంచి కూడా బాలకృష్ణ పోటీకి దిగుతారన్న ప్రచారం జరిగింది. ఈసారి ఏదోక చోట నుంచి బాలకృష్ణ పోటీ చేసేందుకు ఉత్సాహం చూపడంతో ఆయన అనుయాయులు పెనమలూరు, నూజివీడు, గుడివాడ నియోజకవర్గాల్లో సర్వే కూడా చేయించుకున్నారు. పెనమలూరు, నూజివీడులో రెబల్స్ బెడద తీవ్రంగా ఉండటం, గుడివాడలో కొడాలి నాని గాలి ఎక్కువగా ఉండటంతో ఆయా నియోజకవర్గాల్లో పోటీకి బాలకృష్ణ ఆసక్తి చూపలేదని చెబుతున్నారు. ఓటమి భయమో, వర్గపోరు ప్రభావమో, మరేదైనా కారణమో కానీ బాలకృష్ణ జిల్లాను వదిలి హిందూపురం టిక్కెట్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. బాలయ్యను ఉసిగొల్పి బాబు రాజకీయం.. ప్రచారం, పర్యటన, ఎన్నికలు ఏదైనా జిల్లాలో జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణలకు బాలకృష్ణతో చంద్రబాబు చెక్ పెట్టించి రాజకీయం నెరపడంపై ఎన్టీఆర్ అభిమానుల్లో ఆగ్రహం పెరుగుతోంది. వస్తున్నా మీకోసం అంటూ జిల్లాలో యాత్రకు వచ్చిన చంద్రబాబు పామర్రు, గుడివాడ నియోజకవర్గాల్లో బాలకృష్ణను ప్రయోగించారు. అప్పట్లో బాబు యాత్ర సందర్భంగా రెండు రోజులు ఇక్కడే ఉన్న బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించేలా కేడర్‌కు ఆదేశాలు ఇవ్వడంపై విమర్శలు రేగాయి. బాబు, బాలయ్య తీరుపై ఎన్టీఆర్ అభిమానులు పెద్ద దుమారమే లేపారు. తాజాగా హరికృష్ణకు సీటు ఇవ్వకుండా చంద్రబాబు చెక్ పెట్టి బాలకృష్ణకు ఇచ్చి ఎన్టీఆర్ కుటుంబంలో కొత్త చిచ్చు రాజేశారు. కారాలు మిరియాలు నూరుతున్న హరికృష్ణ... హరికృష్ణ నోటికి జడిసి పైకి ఆయనకు ప్రాధాన్యత ఇచ్చినట్టు నటించే చంద్రబాబు అవకాశం ఉన్న ప్రతిసారి ఆయన్ను అణగదొక్కేందుకే ప్రయత్నాలు చేస్తారని తెలుగు తమ్ముళ్లు చెబుతుంటారు. సమైక్యాంధ్ర కోసం అందరూ పదవులకు రాజీనామాలు చేసినా అంతగా పట్టించుకోకపోయినా, హరికృష్ణ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఆగమేఘాలపై ఆమోదించేలా చేశారు. సమైక్యాంధ్ర కోసం తన తండ్రి ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరు నుంచి యాత్ర చేపడతానని హరికృష్ణ ప్రకటించడంతో అందుకు చంద్రబాబు అడ్డుచక్రం వేశారు. ఈసారి హిందూపురం కాకుంటే జిల్లాలో టిక్కెట్ ఇస్తారని హరికృష్ణ ఆశలు పెట్టుకున్నారు. తీరా బాలకృష్ణకు సీటిచ్చిన బాబు హరికృష్ణకు మాత్రం హ్యాండిచ్చారు. దీంతో బావ తీరుపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్న హరికృష్ణ తనకు జిల్లాలో టిక్కెట్ ఇస్తారని ఆశించానని, అది కూడా ఇవ్వకపోవడం దారుణమని కారాలు మిరియాలు నూరుతుండటం కొసమెరుపు. -
అన్నగారి ఆత్మక్షోభ
-
హైదరాబాద్ కాంగ్రెస్ ఖాళీ
కాంగ్రెస్ కంచుకోటకు నగరంలో క్రమక్రమంగా బీటలు వారుతున్న నేపథ్యమది.. గత సార్వత్రిక ఎన్నికల నాటికే కాంగ్రెస్ జోరుకు బ్రేకులు పడగా ప్రముఖ సినీ నటుడు నందమూరి తారక రామారావు కొత్త పార్టీని పెట్టి రాజకీయాల్లోకి రావడంతో కాంగ్రెస్ మొత్తంగా ఖాళీ అయిపోయింది. ఈ ఎన్నికల్లో రాష్ట్ర రాజధానిలో తెలుగుదేశం పార్టీ హవా కొనసాగింది. మొత్తం 13 స్థానాలుండగా టీడీపీ బలపరిచిన స్వతంత్ర అభ్యర్థులు ఏకంగా ఏడు చోట్ల జయకేతనం ఎగురవేశారు. బీజేపీ అభ్యర్థి ఒక చోట గెలుపొందగా మరో ఐదు స్థానాల్లో ఎంఐఎం బలపరిచిన స్వతంత్ర అభ్యర్థులు గెలిచారు. చాలా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ మూడోస్థానానికి పడిపోవడం గమనార్హం. అత్యధికంగా చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో 81.3 శాతం పోలింగ్ జరిగింది. అత్యల్పంగా హిమాయత్‌నగర్ నియోజకవర్గంలో 48.13 శాతం ఓట్లు పోలయ్యాయి. - సాక్షి, సిటీబ్యూరో నెల రోజుల మంత్రి రామస్వామి 1983 ఎన్నికల్లో మహరాజ్‌గంజ్ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించిన రామస్వామి... నాదెండ్ల భాస్కరరావు మంత్రివర్గంలో సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా నెల రోజుల పాటు పనిచేశారు. తెలుగుదేశం పార్టీ సంక్షోభంలో రామస్వామి ఎన్టీఆర్‌ను వదిలి భాస్కరరావు వర్గంలో చేరారు. అయితే భాస్కరరావు ప్రభుత్వం కేవలం నెల రోజుల మాత్రమే ఉండటంతో నగరంలో అనేక మంది రామస్వామిని ‘నెల రోజుల మంత్రి’గా పిలవడం మొదలుపెట్టారు. విజయానందంతో.. హఠాణ్మరణం 1983 ఎన్నికల్లో హిమాయత్‌నగర్ శాసనసభ స్థానం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసిన నారాయణరావు గౌడ్ విజయం సాధించినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించిన కొన్ని గంటలకే మరణించారు. ఊహించని తన విజయాన్ని అభిమానులు, కార్యకర్తలతో రోజంతా పంచుకున్న నారాయణరావు గౌడ్ అదే రోజు రాత్రి హఠాణ్మరణం పాలైయ్యారు. అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ తరఫున పి.ఉపేంద్ర, బీజేపీ తరఫున ఎ.నరేంద్ర పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో నరేంద్ర విజయం సాధించారు. ముషీరాబాద్ ఈ నియోజకవర్గంలో టీడీపీ బలపరిచిన స్వతంత్ర అభ్యర్థి ఎస్.రాజేశ్వర్ 19,609 ఓట్లు సాధించి గెలుపొందారు. జనతాపార్టీ అభ్యర్థి నాయిని నర్సింహారెడ్డి 19,302 ఓట్లతో ద్వితీయస్థానంలో నిలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి ఎస్.యాదగిరి 15,292 ఓట్లతో తృతీయస్థానంలో నిలిచారు. నమోదైన పోలింగ్ శాతం 53.64. హిమాయత్‌నగర్ ఈ నియోజకవర్గంలో టీడీపీ బలపరిచిన స్వతంత్ర అభ్యర్థి జి.నారాయణరావు గౌడ్ 17,861 ఓట్లు సాధించి గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి బి.దామోదర్ 15,975 ఓట్లతో ద్వితీయస్థానంలో నిలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి టి.లక్ష్మీకాంతమ్మ 11,922 ఓట్లతో తృతీయస్థానంలో నిలిచారు. స్వతంత్ర అభ్యర్థి అఫ్జల్‌ఖాన్‌కు 8,099 ఓట్లు దక్కాయి. నమోదైన పోలింగ్ శాతం 48.13. సనత్‌నగర్ ఈ నియోజకవర్గంలో టీడీపీ బలపరిచిన స్వతంత్ర అభ్యర్థి కాట్రగడ్డ ప్రసూన 32,638 ఓట్లు సాధించి గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి ఎస్.రాందాస్ 19,470 ఓట్లతో ద్వితీయస్థానంలో నిలిచారు. బీజేపీ అభ్యర్థి శంకరయ్య యాదవ్ 8,095 ఓట్లతో తృతీయ స్థానంలో నిలిచారు. సీపీఎం అభ్యర్థి ఎన్.వి.భాస్కర్‌రావు 4,037 ఓట్లతో నాలుగోస్థానంలో నిలిచారు. నమోదైన పోలింగ్ శాతం 56.98. సికింద్రాబాద్ ఈ నియోజకవర్గంలో టీడీపీ బలపరిచిన స్వతంత్ర అభ్యర్థి మాచినేని కృష్ణారావు 33,069 ఓట్లు సాధించి గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి కె.కేశవరావు 15,128 ఓట్లతో ద్వితీయ స్థానంలో నిలిచారు. బీజేపీ అభ్యర్థి ఎం.సత్యనారాయణ 7,256 ఓట్లతో తృతీయస్థానంలో నిలిచారు. పోలైన ఓట్ల శాతం 52.19. ఖైరతాబాద్ ఈ నియోజకవర్గంలో టీడీపీ బలపరిచిన స్వతంత్ర అభ్యర్థి ఎం.రాంచందర్‌రావు 36,188 ఓట్లు సాధించి గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి పి.జనార్దన్‌రెడ్డి 23,476 ఓట్లతో ద్వితీయస్థానంలో నిలిచారు. బీజేపీ అభ్యర్థి సీ.హెచ్.హనుమంతరావు 16,367 ఓట్లతో తృతీయ స్థానానికి పరిమితమయ్యారు. నమోదైన పోలింగ్ శాతం 57.05. చార్మినార్ స్వతంత్ర అభ్యర్థి సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ 50,724 ఓట్లు సాధించి గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి సి.అశోక్‌కుమార్ 18,218 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి బాల పోచయ్య 6,704 ఓట్లతో తృతీయస్థానానికే పరిమితమయ్యారు. నమోదయిన పోలింగ్ శాతం 65.22. చాంద్రాయణగుట్ట ఈ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి మహ్మద్ అమానుల్లాఖాన్ 43,822 ఓట్లు సాధించి గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి ఆలె నరేంద్ర 40,241 ఓట్లతో ద్వితీయస్థానంలో నిలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి జి.నిరంజన్ 4,176 ఓట్లతో తృతీయ స్థానంలో నిలిచారు. నమోదైన పోలింగ్ శాతం 81.3. కంటోన్మెంట్ ఈ నియోజకవర్గంలో టీడీపీ బలపరిచిన స్వతంత్ర అభ్యర్థి డాక్టర్ ఎన్.ఏ.కృష్ణ 25,847 ఓట్లు సాధించి గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి బి.మచ్చేందర్‌రావు 16,808 ఓట్లతో ద్వితీయస్థానంలో నిలిచారు. బీజేపీ అభ్యర్థి బంగారు లక్ష్మణ్ 14,457 ఓట్లతో తృతీయ స్థానంలో నిలిచారు. నమోదైన పోలింగ్ శాతం 50.91. మలక్‌పేట్ ఈ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ఎన్.ఇంద్రసేనారెడ్డి 21,397 ఓట్లు సాధించి గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి కందాల ప్రభాకర్‌రెడ్డి 19,340 ఓట్లతో ద్వితీయ స్థానంలో నిలిచారు. స్వతంత్ర అభ్యర్థి మీర్జా మహబూబ్ అలీ బేగ్‌కు 14,726 ఓట్లు లభించాయి. 59.70 శాతం పోలింగ్ జరిగింది. ఆసిఫ్‌నగర్ ఎంఐఎం బలపరిచిన స్వతంత్ర అభ్యర్థి అఫ్జల్ షరీఫ్ 28,948 ఓట్లు సాధించి గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి బి.కృష్ణన్ 14,521 ఓట్లతో ద్వితీయస్థానంలో నిలిచారు. స్వతంత్ర అభ్యర్థి సి.గంగాభవాని 12,547 ఓట్లతో తృతీయస్థానంలో నిలిచారు. బీజేపీ అభ్యర్థి తులసీరాం 5,761 ఓట్లతో నాలుగో స్థానానికి పరిమితమయ్యారు. నమోదైన పోలింగ్ శాతం 55.22. మహరాజ్‌గంజ్ ఈ నియోజకవర్గంలో టీడీపీ బలపరిచిన స్వతంత్ర అభ్యర్థి పి.రామస్వామి 17,835 ఓట్లు సాధించి గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి శివప్రసాద్ 14,303 ఓట్లతో ద్వితీయ స్థానంలో నిలిచారు. బీజేపీ అభ్యర్థి గంగా శంకర్ వ్యాస్ 12,531 ఓట్లతో తృతీయస్థానానికే పరిమితమయ్యారు. పోలింగ్ శాతం 54.08. కార్వాన్ ఈ నియోజకవర్గంలో ఎంఐఎం బలపరిచిన స్వతంత్ర అభ్యర్థిబాకర్ ఆగా 32,380 ఓట్లు సాధించి గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి నందకిషోర్ 22,767 ఓట్లతో ద్వితీయస్థానంలో నిలిచారు. స్వతంత్ర అభ్యర్థి కె.గోపాల్ 8,574 ఓట్లు సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి ఖలీలుల్లా 6,914 ఓట్లు దక్కించుకున్నారు. నమోదైన పోలింగ్ శాతం 64.8. యాకుత్‌పురా ఈ నియోజకవర్గంలో ఎంఐఎం బలపరిచిన అభ్యర్థి ఖాజా అబు సయిద్ 46,127 ఓట్లు సాధించి ఘన విజయం సాధించారు. స్వతంత్ర అభ్యర్థి సయిద్ సర్ఫరాజ్ అలీ 6,491 ఓట్లతో ద్వితీయస్థానంలో నిలిచారు. నమోదయిన పోలింగ్ శాతం 58.42. ప్రతి సారీ ఓటేస్తున్నా హీరో తరుణ్ ఏ దేశానికెళ్లినా.. మీది ఏ దేశం అని అడుగుతారు. కానీ ఏ రాష్టం అని అడగరు. నా వరకూ నేను భారతీయుడ్ని మాత్రమే. హక్కులు అనేవి ప్రజాస్వామ్యంలో అందరికీ ఉంటాయి. వాటిని సద్వినియోగం చేసుకోవాలంటే ముందు ఓటు హక్కును ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వినియోగించుకోవాలి. మనం ఓటు వేసే వ్యక్తి మనకు జవాబుదారిగా ఉండాలి. ప్రతి ఒక్క పార్టీకీ ఓ ఎజెండా ఉంటుంది. నచ్చిన ఎజెండాను ఎంచుకుని ఆ పార్టీకి ఓటు వేయడం శ్రేయస్కరం. నేను మాత్రం ప్రతిసారీ ఓటు హక్కును వినియోగించుకుంటాను. నా మిత్రులందరికీ కచ్చితంగా ఓటు వేయమని చెబుతా. మన ఓటు వల్ల మంచి నాయకత్వం వస్తుంది. నిత్యవార్త సత్య వాక్కు హైదరాబాద్ అభివృద్ధి చేసింది నేనే... పవన్ ఓటు వేయమని చెప్పింది నాకే... - చంద్రబాబు కొత్తకోడి కూసిందంటే బాబు కోసమే... పాత పకోడి వేగిందంటే బాబు పుణ్యమే... సెల్లుఫోన్ మోత నుంచి సెల్యులాయిడ్ కూత దాకా... ‘హైటెక్కి’న సిటీ నుంచి హీటెక్కిన ఇరానీ‘టీ’ దాకా... కాదేదీ వాడుకునేందుకనర్హం... కాకమ్మకథలే బాబుకున్న అస్త్రం..! ప్రజారాజ్యాన్ని విలీనం చేస్తే ప్రజలకు మేలనుకున్నా - పవన్‌కళ్యాణ్ తానొకటి తలిస్తే.. దైవమొకటి తలచింది.. తమ్ముడొకటి ఆశిస్తే అన్నకొకటి అందింది.. ప్రజోపయోగం అనుకుంటే.. పదవీయోగం పట్టింది.. గుండె దిటవు చేసుకోరాదా.. గుండెల్లోని అన్నను ‘గుట్టు’గా చూసుకోరాదా..! - ఎస్. సత్యబాబు -
తపాలా: ఎవరి బాణీ వారిదే!
తెలుగువారికి అత్యంత అభిమానపాత్రులైన నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావులపై 2014 ఫిబ్రవరి 2 ‘ఫన్డే’ సంచికలో ‘మన ఇద్దరు’ పేరిట ఓ వ్యాసం ప్రచురితమయింది. అయితే అందులో ఆ మహానటులను పోలుస్తూ వ్యాసకర్త తనకు నచ్చిన రీతిలో రాసుకుంటూపోయారు. ఒకరిపై అభిమానంతో మరొకరిని కించపరచడం ఎంతవరకు సబబు? ఎన్టీఆర్, ఏయన్నార్‌లతో సమానంగా అంతకాలం స్టార్‌డమ్‌ను చూసినవారు అటు ఉత్తరాదిన కానీ, ఇటు దక్షిణాదిన కానీ మరొకరు కానరారు. అందుకేనేమో ఈ ఇద్దరినీ ‘తెలుగు సినిమా తల్లి’ రెండు కళ్లుగా కీర్తిస్తూ ఉంటారు. ఎన్టీఆర్, ఏయన్నార్ ఇద్దరూ మహానటులే. ఎవరి బాణీ వారిది. ఎన్టీఆర్ శరీర సౌష్టవం, అందం, చందం పలు పాత్రలకు సరిపోతుంది కనుక ఆయన విభిన్న పాత్రలు పోషించి మెప్పించారు. ‘స్వీయలోపంబెరుగుట పెద్ద విద్య’ అన్న సత్యాన్ని పాటిస్తూ ఏయన్నార్ తన కెరీర్‌ను మలుచుకున్నారు. ఇవన్నీ జగద్విదితాలు. వారు సాధించిన విజయాలు, వారి వ్యక్తిగత విషయాల గురించి తెలియనివారు అరుదనే చెప్పాలి. తమిళనాట యమ్జీఆర్, కరుణానిధి కథల ఆధారంగా ‘ఇద్దరు’ తీశారు. వారిద్దరూ చిత్రసీమ, రాజకీయ రంగాలతో అనుబంధం ఉన్నవారు కాబట్టి అలా తీసి ఉండవచ్చు. కానీ ఎన్టీఆర్, ఏయన్నార్లవి భిన్న రీతులు. ఎన్టీఆర్ లాగా ఏయన్నార్ దర్శకత్వ బాధ్యతలు చేపట్టలేదు. రాజకీయాలకు ఏయన్నార్ అసలే ఆమడదూరం. మరి ఇలాంటి ఇద్దరిని పోల్చి, ‘మన ఇద్దరు’ అనే అంశాన్ని తీసుకోవడమే పొరపాటు. అందులోనూ ఒకరిని హెచ్చిస్తూ, మరొకరిని తగ్గిస్తూ సాగడం మరింత పొరపాటు. ఎవరు ఏమనుకున్నా ‘ఎన్టీఆర్ ఎన్టీఆరే’ అన్నది తెలుగునాటనే కాదు, యావద్భారతంలోనూ అధిక సంఖ్యాకులు అంగీకరించే అంశం. ఉత్తరాదివారు ‘మదరాసీలు’గా పిలుస్తున్న తెలుగువారికి ఓ ప్రత్యేక అస్తిత్వం ఉందని జగతికి చాటిన ఘనత ఎన్టీఆర్ సొంతం. అటువంటి మహానటుణ్ణి వ్యాసంలో అక్కడక్కడా తక్కువ చేస్తూ రాయడం తీవ్ర మనస్తాపం కలిగించింది. దయచేసి మరోసారి ఇలాంటి వాటికి తావు లేకుండా జాగ్రత్త వహించాలని మనవి. - కొమ్మినేని వెంకటేశ్వరరావు -
ఎన్టీఆర్ లేనందునే రాష్ట్రానికి ఈ దుస్థితి
-
ఎన్టీఆర్ లేనందునే రాష్ట్రానికి ఈ దుస్థితి
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, నట సార్వభౌమ నందమూరి తారక రామారావు లేకపోవడంతో రాష్ట్రానికి ఈ దుస్థితి పట్టిందని ఆయన భార్య నందమూరి లక్ష్మీ పార్వతి ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ 18వ వర్ధంతి సందర్బంగా ఆమె శనివారం నక్లెస్ రోడ్డులోని ఆయన సమాధి వద్ద పుష్పగుచ్చం ఉంచి శ్రద్దాంజలి ఘటించారు. అనంతరం మీడియాతో ఆమె మాట్లాడారు. నటనలోనే కాదు రాజకీయ రంగంలోనూ ఎన్టీఆర్ ఆయనకు ఆయనే సాటి అని నిరూపించారని లక్ష్మీ పార్వతి వెల్లడించారు. ఆ మహనీయుడు ప్రస్తుత తరుణంలో జీవించి ఉంటే తెలుగువారంతా ఒక్క తాటిపైనే ఉండేవారిని అన్నారు. ఎన్టీఆర్ పాలన ప్రజారంజకంగా సాగిందని గుర్తు చేశారు. ఎన్టీఆర్ పాలనకన్నా మెరుగ్గా పాలన చేయగలమని ఊహించుకుని కొంత మంది స్వార్థంతో, కుట్రతో ఆయన నుంచి అధికారాన్ని లాక్కుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేశారని లక్ష్మీ పార్వతి తీవ్ర ఆవేదన చెందారు. -
ఎన్టీఆర్‌కు భారతరత్న ప్రకటించాలి: చంద్రబాబు
సాక్షి, హైదరాబాద్: టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్‌కు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నను వెంటనే ప్రకటించాలని ఆపార్టీ అధ్యక్షుడు చంద్రబాబు డిమాండ్ చేశారు. తెలంగాణలో పటే ల్, పట్వారీ వ్యవస్థను రద్దుచేసి బలహీనవర్గాలకు ఆరాధ్యదైవంగా మారారని ఎన్టీఆర్‌ను కొనియాడారు. పలు సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిన ఆయనకు వెంటనే భారతరత్న ప్రకటించాలని ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. -
తెలుగుజాతి ద్రోహి చంద్రబాబు : జోగి
పెనమలూరు, న్యూస్‌లైన్ : నందమూరి తారక రామారావు తెలుగుజాతి ఖ్యాతి కోసం తెలుగుదేశం పార్టీని పెడితే చంద్రబాబు నాయుడు తెలుగుజాతి విచ్ఛిన్నానికి కుట్రపన్నాడని మైలవరం నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే జోగిరమేష్ ఆరోపించారు. పెనమలూరు సెంటర్లో సమైక్యాంధ్రకు మద్దతుగా పార్టీ జిల్లా మహిళా విభాగం కన్వీనర్ తాతినేని పద్మావతి చేస్తున్న 72 గంటల దీక్షకు మద్దతుగా మంగళవారం దీక్షా శిబిరాన్ని ఆయన సందర్శించి ప్రసంగించారు. తెలుగుజాతి గుండెలపై తన్ని... తెలంగాణాకు అనుకూలంగా లేఖ ఇచ్చి చంద్రబాబు తీరని ద్రోహం చేశారన్నారు. సీడబ్ల్యూసీ తెలంగాణ ప్రకటించగానే చంద్రబాబు కొత్త రాజధానికి రూ 4 లక్షల కోట్లు ఇవ్వాలని ప్రకటించటం విడ్డూరంగా ఉందని,తెలుగుజాతిని అవమానపర్చేలా వ్యవహరించారని విమర్శించారు. నేడు సీమాంధ్ర భగభగమంటుంటే కాంగ్రెస్, టీడీపీ మంత్రులు, ఎంపీలు,ఎమ్మెల్యేలు పదవులు పట్టుకుని వేలాడుతున్నారని ఇంతకన్నా సిగ్గు చేటైన విషయం మరొకటి లేదన్నారు. వైఎస్.జగన్మోహనరెడ్డి సమైక్యాంధ్రకు మద్దతుగా జైల్లో ఆమరణదీక్ష చేశారని, ఇప్పుడు రెండోసారి దీక్ష చేపట్టినందున ఆయన సమైక్య నాయకుడని రుజువు చేసు కున్నారని చెప్పారు. జిల్లా మహిళా విభాగం కన్వీనర్ తాతినేని పద్మావతి మాట్లాడుతూ చంద్రబాబు తన వాదనేమిటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌తో చేతులు కలిపిన చంద్రబాబు చరిత్రహీనుడవుతాడని హెచ్చరించారు. వంగవీటి శ్రీనివాసప్రసాద్ ,కాకర్లవెంకటరత్నం, మాదు వసంతరావు , చంద్రమోహన్, వంగూరుబాబి, చింతావెంకటేశ్వరరావు, మరీదువిజయ్, నందేటికమల్రాజ్,వరదీష్,సొంటిరాంబాబు పాల్గొన్నారు. నేడు దీక్ష విరమణ... కాగా తాతినే ని పద్మావతి చేపట్టిన 72 గంటల దీక్ష బుధవారం ఉదయంతో ముగుస్తుంది. ఇప్పటికే ఆమెకు బీపీ,షుగర్ లెవల్స్ తగ్గాయని వైద్యులు చెప్పారు. ముగింపు సభలో రాష్ట్రస్థాయి, జిల్లాకు చెందిన ప్రముఖ నేతలు పాల్గొంటారని పద్మావతి తెలిపారు. -
వైఎస్సే.. మా లీడర్
విద్యార్థులు ఏర్పాటుచేసిన స్టాల్లో వైఎస్సార్ ఫోటోతో ఉన్న బోర్డు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ద్వారా దివంగత ముఖ్యమంత్రివైఎస్ రాజశేఖరరెడ్డి తమ హృదయాల్లో సుస్థిరస్థానం సంపాదించుకున్నారని పలు కళాశాలల విద్యార్థుల వెల్లడించారు. ఎపికీ తమ అభిమాన రాజకీయ నాయకుడు ఆయనేనని ఓటు ద్వారా స్పష్టం చేశారు. వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా మేడ్చల్ మండలం మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో శుక్ర, శనివారాల్లో ‘ఎక్స్బెరంజా 2కే13’ పేరుతో జాతీయ స్థార టెక్నో ఫెస్ట్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ టెక్నో ఫెస్ట్ రాష్ట్రంలోని సుమారు 50 కళాశాలలకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్ధులు తాము రూపొందించిన ఎగ్జిబిట్స్ను ఇందులో ప్రదర్శిస్తున్నారు. అయితే ఎప్పడూ విభిన్నంగా ఆలోచించే విద్యార్థులు టెక్నోఫెస్ట్‌లో ఏర్పాటు చేసిన ఓ స్టాల్ అందరినీ ఆకట్టుకుంది. ఒక బోర్డపై వైఎస్ రాజశేఖరరెడ్డి, నందమూరి తారక రామారావు, కేసీఆర్చిత్ర పటాలను ఏర్పాటు చేసి.. మీ అభిమాన నాయకుడికి ఓటు వేయాలంటూ ఫెస్ట్‌కు వచ్చిన విద్యార్థలకు ఓటింగ్ పెట్టారు. వెయ్యి మందికిపైగా విద్యార్థులు ఈ ఓటింగ్‌లో పాలొన్నారు. ఇందులో వైఎస్సార్‌కు 635 ఓట్లు రాగా, ఎన్టీఆర్‌కు 325, కేసీఆర్‌కు 150 ఓట్లు వచ్చాయి. తమ కోసం ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఏర్పాటు చేసి ఉన్నత చదువులు అభ్యసించడానికి వైఎస్సార్ కృషి చేశారని ఈ సందర్భంగా పలువురు విద్యార్థలు పేర్కొన్నారు. -
వెన్నుపోటు యాత్రగా పేరు పెట్టుకోండి
సాక్షి, హైదరాబాద్: చంద్రబాబునాయుడు తన మామ ఎన్టీ రామారావుకు వెన్నుపోటుపొడిచి ముఖ్యమంత్రి సీటును ఆక్రమించిన సెప్టెంబర్ 1వ తేదీనే బస్సు యాత్ర ప్రారంభిస్తున్నారని, అందువల్ల ఆత్మగౌరవ యాత్రకన్నా ‘వెన్నుపోటు యాత్ర’ అని పేరు పెట్టుకుంటే బాగుంటుందని వైఎస్ఆర్సీపీ నేత శోభానాగిరెడ్డి సూచించారు. కడప పార్లమెంట్ సభ్యుడు, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరాహార దీక్ష చేస్తున్న నిమ్స్ వద్దకు వచ్చిన వైఎస్ఆర్సీపీ నేతలు శోభానాగిరెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటుకోసం కేంద్ర ప్రభుత్వానికి బ్లాంక్ చెక్‌లాగా లేఖ అందించిన చంద్రబాబునాయుడు ఇప్పుడు ఏ ముఖంతో సీమాంధ్రలో అడుగుపెడతారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకున్న తరువాతే సీమాంధ్రలో అడుగుపెట్టాలన్నారు. తెలంగాణకు అనుకూలంగా ఉన్నట్లు మళ్లీ ప్రకటించిన చంద్రబాబు ఇప్పుడు యాత్రల పేరుతో ప్రజలని మోసం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలన అనుభవం రాష్ట్ర విభజన చేయడానికి పనికొచ్చిందా? అని ప్రశ్నించారు. చంద్రబాబుతోపాటు ఆ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన తరువాతే సీమాంధ్రలో అడుగుపెట్టాలని డిమాండ్ చేశారు. మాయమాటల ద్వారా యాత్రకు వచ్చే చంద్రబాబు నిలదీసేందుకు సీమాంధ్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. గతంలో చంద్రబాబు దీక్ష చేసిన సమయంలో చురుగ్గా స్పందించిన కాంగ్రెస్ ప్రభుత్వం జగన్ దీక్ష విషయంలో మొండి పట్టుదలగా, నిరంకుశంగా వ్యవహరించిందని ధ్వజమెత్తారు. జగన్ ఆరోగ్యం బాగా క్షీణించిన నేపథ్యంలో మానవతా దృక్పథంతోనైనా స్పందించివుంటే బాగుండేదన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి దయవల్లే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయనే విషయం గుర్తెరగాలని వారు స్పష్టంచేశారు.