
దివంగత నటుడు నందమూరి తారకరామారావు చిన్నకూతురు ఉమా మహేశ్వరి ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు విడిచారు. ఈ విషయాన్ని ఆమె కూతురు దీక్షిత పోలీసులకు వెల్లడించింది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ఆమె గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుందని, ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిందని తెలిపింది. దీంతో మధ్యాహ్నం రెండున్నర గంటలకు దీక్షిత పోలీసులకు సమాచారం అందించింది. వెంటనే జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి చేరుకున్న పోలీసులు మూడు గంటలకు ఆమె గదిలోకి వెళ్లారు. అప్పుడు ఆమె ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించారు.
కాగా అనారోగ్య సమస్యలతోనే ఆమె ఆత్మహత్య చేసుకుందని దీక్షిత పేర్కొంది. ఆత్మహత్య చేసుకున్న సమయంలో ఇంట్లో నలుగురమే ఉన్నట్లు తెలిపింది. దీక్షిత ఫిర్యాదు మేరకు పోలీసులు సెక్షన్ 174 కింద అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. కాగా సీనియర్ ఎన్టీఆర్ నాలుగో కూతురే ఉమా మహేశ్వరి. ఆమెకు ఇద్దరు కూతుళ్లు విశాల, దీక్షిత.
ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి.
ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com
చదవండి: నందమూరి ఇంట విషాదం, ఉమా మహేశ్వరి ఆత్మహత్య
నాపై విష ప్రచారం, బాధగా ఉంది.. అమీర్ ఖాన్ ఆవేదన
Comments
Please login to add a commentAdd a comment