తెలుగు జాతి కీర్తిని, తెలుగు భాష ఖ్యాతిని దశదిశలా చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి నందమూరి తారక రామారావు. నోరు తిరగని డైలాగులను కూడా సింగిల్ టేక్‌లో చెప్పే ఈ దివంగత హీరోకు విశ్వ విఖ్యాత నట సార్వభౌముడని బిరుదు కూడా ఉంది. రాముడు, కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రల్లో మెప్పించి తెలుగు వారి గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న ఎన్టీఆర్ బర్త్‌డే నేడు(మే 28). ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఎప్పటి నుంచో వినిపిస్తున్న ఓ డిమాండ్‌ను మరోసారి తెర మీదకు తీసుకొచ్చాడు.
"ప్రముఖ గాయకులు, నవయుగ వైతాళికులు భూపేన్ హజారికాకు మరణానంతరం భారతరత్న ఇచ్చినట్లుగా.. మన తెలుగు తేజం, దేశం గర్వించే నాయకుడు ఎన్టీఆర్‌కు భారత రత్న ఇస్తే అది తెలుగువారందరికీ గర్వ కారణం. వారి 100వ జయంతి దగ్గర పడుతున్న సందర్భంగా ఎన్టీఆర్‌కు ఈ గౌరవం దక్కితే అది తెలుగువారికి దక్కే గౌరవం" అని చిరు ట్వీట్ చేశాడు.
#RememberingTheLegend#BharatRatnaForNTR pic.twitter.com/efN2BIl8w7
— Chiranjeevi Konidela (@KChiruTweets) May 28, 2021
మరణంలేని జననం ఆయనిది..
— MassGodNTRFc (@massgod_ntr_fc) May 28, 2021
అలుపెరగని గమనం ఆయనిది..
అంతేలేని పయనం ఆయనిది..
‘తెలుగు జాతి’కి గర్వకారణం మరియూ
‘తెలుగు పలుకు’లను తన కంఠంతో కొత్తపుంతలు తొక్కించిన అవిశ్రాంతయోధుడు #NTR 🙏#BharatRatnaForNTR #JoharNTR #LegendaryNTRJayanthi @tarak9999 pic.twitter.com/dlPEN9K6WG
Comments
Please login to add a commentAdd a comment