Sr Ntr
-
టాలీవుడ్లో తీవ్ర విషాదం.. ఎన్టీఆర్‌ను పరిచయం చేసిన నిర్మాత కన్నుమూత
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నటి, నిర్మాత కృష్ణవేణి తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆమె వయసు 102 సంవత్సరాలు కాగా.. వయోభారంతో కన్నుమూశారు. కృష్ణవేణి గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో ఉన్నారు. ఆదివారం ఉదయమే తమ మాతృమూర్తి తుది శ్వాస విడిచినట్లు ఆమె కూమార్తె అనురాధ తెలిపారు.ఎన్టీఆర్‌ను పరిచయం చేసిన కృష్ణవేణి1949 నవంబరు 24వ తేదీన మనదేశం చిత్రం విడుదలైంది. ఆ చిత్రంలో ఎన్టీఆర్ ఓ చిన్న పాత్ర పోషించారు. ఆ తర్వాత తెలుగు చలన చిత్ర చరిత్రలో ఆయన నటన విశ్వరూపంతో ఓ అసమాన చరిత్రను లిఖించాడు. రఘుపతి వెంకయ్య అవార్డు అందుకున్న కృష్ణవేణి నందమూరి తారక రామారావును సినిమా రంగానికి పరిచయం చేశారు.కృష్ణవేణి సినీ ప్రస్థానం..శ్రీమతి కృష్ణవేణి డిసెంబర్ 24, 1924 కృష్ణజిల్లాలోని పంగిడిగూడంలో డా. ఎర్రంశెట్టి లక్ష్మణరావు, నాగరాజమ్మకు జన్మించారు. చిన్నప్పటి నుంచి ఆమెకు నటన అన్నా, నృత్యం అన్నా అభిమానంతో సినిమాల్లోకి అడుగుపెట్టారు. చిన్న వయసులోనే నాటకాలలో నటించటం మొదలుపెట్టారు. ఆమె నటనను చూసిన దర్శకుడు సి. పుల్లయ్య కృష్ణని బాలనటిగా ‘సతీ అనసూయ’ అనే సినిమాలో 1936లో సినిమా రంగానికి పరిచయం చేశారు. ఆ తర్వాత బాల నటిగా కొనసాగుతూనే తెలుగు, తమిళ భాషా చిత్రాలలో నటించారు. కథానాయికగా నటిస్తున్న సమయంలోనే ఆమెకు మీర్జాపురం రాజా వారితో పరిచయమైంది. ఆ చిత్రం తర్వాత మళ్లీ నాటకాల్లో నటించారు. ఆ సమయంలో తండ్రి కృష్ణారావు మృతి చెందడంతో అమ్మమ్మ, బాబాయిల వద్ద పెరిగారు కృష్ణవేణి. ఆ తర్వాత ‘తుకారాం’ (1937) సినిమా కోసం చెన్నైలో అడుగుపెట్టారు. ఆ సినిమా సరిగ్గా ఆడలేదు. కృష్ణవేణి హీరోయిన్గా నటించిన తొలి చిత్రం ‘కచదేవయాని’ (1938) విజయం సాధించడంతో మంచి గుర్తింపు, పేరు వచ్చాయి. ఆ తర్వాత ‘మహానంద’ చిత్రంలో నటించేందుకు చెన్నైలోనే స్థిరపడ్డారు.ఆ సమయంలోనే ప్రముఖ దర్శక–నిర్మాత, మీర్జాపురం రాజాతో (మేకా రంగయ్య) కృష్ణవేణి వివాహం 1940లో విజయవాడలో జరిగింది. వివాహం తర్వాత బయటి సంస్థల్లో పని చేయడం ఇష్టం లేక సొంత ప్రోడక్షన్ జయా పిక్చర్స్–శోభనాచల స్టూడియోస్ నిర్మించిన చిత్రాల్లో నటించారామె. మీర్జాపురం రాజా నిర్మించిన తొలి సాంఘిక చిత్రం ‘జీవన జ్యోతి’లో (1940) హీరోయిన్గా చేశారు. ఆ చిత్రంతో సీహెచ్ నారాయణరావు హీరోగా పరిచయమయ్యారు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించారు కృష్ణవేణి. -
మోహన్ బాబు రిపబ్లిక్ డే విషెస్.. ఆ సాంగ్ వింటే ఇప్పటికీ గూస్ బంప్స్!
టాలీవుడ్ నటుడు మోహన్ బాబు తన అభిమానులకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తాను నటించిన మేజర్ చంద్రకాంత్ మూవీలో సాంగ్‌ను అభిమానులతో పంచుకున్నారు. 1993లో వచ్చిన మేజర్ చంద్రకాంత్ చిత్రంలో సీనియర్ ఎన్టీఆర్ కుమారుడిగా నటించారు.ఈ చిత్రంలోని దేశభక్తి సాంగ్ ఎప్పటికీ భారతీయుల గుండెల్లో నిలిచి ఉంటుంది. 'పుణ్య భూమి నాదేశం నమోనమామి.. ధన్య భూమి నాదేశం సదా స్మరామీ' అంటూ సాగే ఈ పాట దేశభక్తిని చాటి చెబుతుంది. ఈ పాటను జాలాది రాజారావు రాయగా.. ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం ఆలపించారు. ఈ పాటకు ఎంఎం కీరవాణి సంగీతమందించారు. కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన మేజర్ చంద్రకాంత్ అప్పట్లో సూపర్ హిట్‌గా నిలిచింది. Wishing you all a Happy Republic Day!🇮🇳"Major Chandrakanth" (1993): 🎶"Punyabhoomi Naadesam" – A timeless patriotic anthem that resonates deeply with Telugu audiences. With lyrics by Sri. Jaladi Raja Rao, sung soulfully by Sri. S.P. Balasubrahmanyam, and composed masterfully by… pic.twitter.com/xvVqP6Ht66— Mohan Babu M (@themohanbabu) January 26, 2025 -
ఘనంగా ‘కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్’ కార్యక్రమం (ఫోటోలు)
-
Kalki 2898 AD: అప్పుడు ఎన్టీఆర్.. ఇప్పుడు ప్రభాస్!
ప్రతి ఒక్క స్టార్ హీరోకి కొన్ని డ్రీమ్ క్యారెక్టర్స్ ఉంటాయి. అయితే కొంత మందికి మాత్రమే వాటిని నెరవేర్చుకునే అవకాశం వస్తుంది. మరికొంత మందికి అవి డ్రీమ్గానే మిగిలిపోతాయి. కానీ ప్రభాస్ విషయంలో మాత్రం ఇది పూర్తి భిన్నంగా జరుగుతోంది. ఆయన ఏ పాత్ర చేయాలనుకున్నా..అది చేసేస్తున్నాడు. సినిమా ఏదైనా తన పాత్రను నెక్ట్ లెవెల్‌కి తీసుకెళ్తున్నాడు. ఇక పురాణాల పాత్రలను అవలీలగా చేసేస్తున్నాడు.(చదవండి: బాక్సాఫీస్‌ను షేక్ చేసిన కల్కి.. ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?)వెండితెరపై మనకు రాముడైనా..కృష్ణుడైనా ఒకప్పుడు సీనియర్ ఎన్టీఆరే. పౌరాణిక పాత్రలు అంటే ఎన్టీఆర్‌ను మించి ఎవరూ చేయలేరు అంటారు. ఎన్టీఆర్ తర్వాత పౌరాణిక పాత్రలను బాలకృష్ణ పోషించి మెప్పించాడు. ఈ తరంలో మాత్రం ఆ అవకాశాన్ని ప్రభాస్ అందిపుచ్చుకున్నాడు. పురాణ పాత్రలను అవలీలగా పోషిస్తున్నాడు. ఓం రౌత్ తెరకెక్కించిన ఆదిపురుష్ సినిమాలో శ్రీరాముడు పాత్రలో ప్రభాస్ ఒదిగిపోయాడు. సినిమా ఫలితం ఎలా ఉన్నా.. ప్రభాస్ నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి.(చదవండి: 'కల్కి'లో కృష్ణుడి ముఖం అందుకే చూపించలేదా?)ఇప్పుడు ‘కల్కి 2898’లోనూ పౌరాణిక పాత్రలో కనిపించి మెప్పించాడు. సినిమా మొత్తం సాధారణ వ్యక్తి భైరవగా కనిపించినా ప్రభాస్.. చివరల్లో మాత్రం మహాభారతంలోని ఓ కీలక పాత్రలో కనిపించి అందరికి షాకిచ్చాడు. పార్ట్ 2లో ఆ పాత్రతో పాటు మరో పౌరాణిక పాత్రలోనూ కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక మంచు విష్ణు హీరోగా నటిస్తున్న ‘కన్నప్ప’లోనూ ప్రభాస్ పౌరాణిక పాత్రే పోషించినట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తంగా నేటితరం హీరోల్లో పౌరాణిక పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్న ఏకైక హీరో ప్రభాస్ అనే చెప్పాలి. -
ఎన్టీఆర్ ఆశీస్సులతో సీఎం జగన్ ప్రమాణస్వీకారం
-
హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు
-
టీడీపీని చంద్రబాబు హీన స్థితికి తెచ్చాడు: లక్ష్మీపార్వతి
సాక్షి, గుంటూరు: మహానుభావుడు సీనియర్ ఎన్టీఆర్ నాడు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. నేడు, చంద్రబాబు అదే టీడీపీని ప్రతీ వాళ్ల కాళ్ల దగ్గర పడేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ తెలుగు అకాడమీ చైర్మన్ నందమూరి లక్ష్మీపార్వతి. అలాగే, కేసుల భయంతో చంద్రబాబు బీజేపీలో పొత్తులు పెట్టుకోవడానికి తహతహలాడుతున్నాడని విమర్శించారు. కాగా, లక్ష్మీపార్వతి శనివారం గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ..‘చంద్రబాబు ఢిల్లీలో బీజేపీ పెద్దల్ని కలవాలని 25 సార్లు బ్రతిమిలాడుకుంటే ఒక మీడియేటర్ ద్వారా వారిని కలిశారనే ప్రచారం జరుగుతోంది. నాడు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా సీనియర్ ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీని స్థాపించారు. నేడు చంద్రబాబు అదే టీడీపీని ప్రతీ వాళ్ల కాళ్ల దగ్గర పడేస్తున్నాడు. చంద్రబాబు తెలుగుదేశం పార్టీని హీనమైన పరిస్థితి తీసుకువచ్చాడు. ఎంతో మహోన్నతమైన విలువలతో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపిస్తే చంద్రబాబు నాయుడు ఆయనను బహిష్కరించారు. కాంగ్రెస్ వ్యతిరేకంగా టీడీపీని స్థాపిస్తే మొన్న జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు సపోర్ట్ చేసి ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేశాడు. కేసుల భయంతోనే చంద్రబాబు బీజేపీతో పొత్తులు పెట్టుకోవడానికి తహతహలాడుతున్నాడు. బీజేపీకి చంద్రబాబు ఎంత డబ్బు అయినా ఇస్తానంటున్నాడు. అవసరమైతే టీడీపీని పూర్తిగా తీసేసుకుని కేసుల నుంచి బయటపడేమయని పెద్దల్ని వేడుకుంటున్నాడు. నారా లోకేష్ ఓ పనికిమాలిన వ్యక్తి. లోకేష్‌ను తీసుకొచ్చి ప్రజల మీద బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నాడు. చంద్రబాబును ప్రజలు ఎంత అసహ్యించుకుంటున్నారో ఆయన సభలను చూస్తే అర్థమవుతుంది. పచ్చ మీడియా కూడా లోకేష్ మాదిరిగానే మారింది. లోకేష్ చెప్పినట్టు 200 సీట్లు వస్తాయని బాకా ఊదుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారు’ అంటూ కామెంట్స్ చేశారు. -
ఎన్టీఆర్‌కూ ఇచ్చి ఉండాల్సింది: విజయశాంతి
సాక్షి, హైదరాబాద్: ఇటీవల పలువురికి భారతరత్న ఇవ్వడంపై కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి కీలక వ్యాఖ్యలు చేశారు. దివంగత మాజీ సీఎం సీనియర్ ఎన్టీఆర్‌కు కూడా భారతరత్న ఇచ్చి ఉంటే తెలుగుజాతి గౌరవానికి ప్రతీకగా నిలిచేదని ఆమె కామెంట్స్ చేశారు. కాగా, మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించడంపై సినీనటి, కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి స్పందించారు. ఈ క్రమంలో విజయశాంతి ట్విట్టర్ వేదికగా..‘భారతరత్న వంటి అత్యున్నత అవార్డుల విషయంలో రాజకీయాల ప్రమేయం ఉండక పోవచ్చు కానీ, తెలుగుజాతి గౌరవ ప్రతీక పీవీ నరసింహా రావు గారిని వరించిన పురస్కారం మన ఆత్మగౌరవ విజయకేతనమైన పద్మశ్రీ ఎన్టీఆర్ గారికి కూడా ప్రకటించి ఉంటే తెలుగు ప్రజానీకం యావత్తు మరింత పులకించిపోయేదన్నది తిరుగులేని వాస్తవం. భారతరత్న వంటి అత్యున్నత అవార్డుల విషయంలో రాజకీయాల ప్రమేయం ఉండక పోవచ్చు కానీ, తెలుగుజాతి గౌరవ ప్రతీక శ్రీ పీవీ నరసింహా రావు గారిని వరించిన పురస్కారం మన ఆత్మగౌరవ విజయకేతనమైన పద్మశ్రీ ఎన్టీఆర్ గారికి కూడా ప్రకటించిఉంటే తెలుగు ప్రజానీకం యావత్తు మరింత పులకించిపోయేదన్నది తిరుగులేని… pic.twitter.com/Q95K2oFOSC — VIJAYASHANTHI (@vijayashanthi_m) February 9, 2024 ఈ అంశాన్ని జాతీయస్థాయికి తీసుకువెళ్ళగలిగే అవకాశం ఈ రోజున నిండుగా, మెండుగా కనబడుతోంది. ఈ బాధ్యతను భుజాలకెత్తుకుని, అందరి సంకల్పాన్ని సిద్ధింపజేసే ప్రయత్నం తప్పక జరిగి తీరగలదని త్రికరణశుద్ధిగా నమ్ముతున్నాను. అన్ని రాజకీయ పార్టీలూ ఈ అంశాన్ని బలపరుస్తారని కూడా నేను నమ్మడం అతిశయోక్తి కాదన్నది నా నిశ్చితాభిప్రాయం’ అంటూ వ్యాఖ్యలు చేశారు. -
కేశినేని భవన్లో ఎన్టీఆర్‌కు నివాళుల్పరించిన కేశినేని నాని
-
'ఇంద్రబాబు' పాత్రకు మించి వర్మ 'వ్యూహం'లో ఏముంది..?
టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తీసిన 'వ్యూహం' సినిమా నేడు (డిసెంబర్ 29) థియేటర్లలోకి రావాల్సి ఉంది. కానీ సినిమాను విడుదల కాకుండా ఉండేందుకు నారా లోకేష్ కోర్టు మెట్లు ఎక్కాడు. తెలంగాణ కోర్టు సూచనమేరకు వ్యూహం సినిమాకు తాత్కాలిక బ్రేకులు పడ్డాయి. ఏ ప్రాతిపదికన సెన్సార్ ఇచ్చారో తెలుపుతూ ఆ రికార్డులను కోర్టుకు అందించాలని CBFCని కోరింది. జనవరి 11 వరకు కోర్టు సమయం ఇచ్చింది. చినబాబుకు నిద్ర లేకుండా చేస్తున్న వర్మ వ్యూహం సినిమాను అడ్డుకునేందకు కాంగ్రెస్, జనసేన, టీడీపీ శ్రేణులు, నారా లోకేష్, గంటా శ్రీనివాస్, ఎల్లో మీడియా ఇలా ఎందరో వర్మ 'వ్యూహం' సినిమాను అడ్డుకునేందుకు ప్రయత్నాలు జరిగాయి. మొదట సినిమాను అడ్డుకునేందుకు సెన్సార్ బోర్డుకు నారా లోకేష్ ఫిర్యాదు చేశారు. అప్పుడు CBFC కూడా సినిమాను మళ్లీ రివ్యూ చేసి 'యూ' సర్టిఫికెట్ ఇచ్చింది. దీంతో వర్మ దెబ్బకు బయపడిపోయిన లోకేష్ కోర్టుకు వెళ్లాడు.. సినిమా వస్తే ఇంతకాలం బయటకు తెలియని ఎన్నో విషయాలు ప్రపంచానికి తెలుస్తాయనే భయంతో ఆయన కోర్టు మెట్లు ఎక్కాడు. వర్మ వ్యూహానికి చినబాబు లిటిగేషన్ పెట్టాడు. తప్పు చేయని వాడిపై ఎన్ని సినిమాలు తీసినా ఎప్పటికీ భయపడడు కదా..! మరి ఎందుకు చినబాబులో ఇంత భయం. తప్పు చేయకుంటే ఉలుకు ఎందుకు..? చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ ఎవరైనా కానీ గతంలో ఏం చేశారు...? ఉన్నది ఉన్నట్లు ప్రపంచానికి చూపుతాను అని వర్మ అంటున్నాడు. అలా కాకుండా లేనివి ఉన్నట్లు సినిమాలో చూపుతే నిజం ఏంటో టీడీపీ కూడా మరో సినిమా తెరకెక్కించ వచ్చు కదా.. ఎటూ తన వర్గం వారే సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా ఉన్నారు. మరోవైపు ఇప్పటికే ప్యాకేజీ తీసుకుని చంద్రబాబు వెంటే తిరుగుతున్న పవన్ కూడా పచ్చ బ్యాచ్‌లోనే ఉన్నాడు.. డబ్బుకు కొదవ లేదు, డైరెక్టర్లకు కొదవ లేదు, చేతిలో రామోజీ ఫిలిమ్ సిటీ.. ఇలా ఎన్నో చంద్రబాబు గుప్పెట్లోనే ఉన్నాయి. మా నాన్నే ఆంధ్ర రాష్ట్రానికి దేవుడు అని సినిమా తియొచ్చు కదా చినబాబు... గతంలో తమరి రాజకీయ జీవితంలో ఎలాంటి వెన్నుపోట్లు లేకుంటే ఒక్క సినిమా తీసి ప్రజలకు చూపించండి.. అందులో నిజం ఉంటే యాత్ర సినిమా మాదిరి సూపర్ హిట్ చేస్తారు.. లేదంటే తొక్కి పాతరేస్తారు.. ఇప్పుడు వర్మ వ్యూహం సినిమా కూడా అంతే సినిమాలో నిజం ఉంటే ఆదరిస్తారు... లేదంటే వారానికే మరిచిపోతారు... వెన్నుపోటు నుంచి బాబు కథ తెలిసిందే కదా..! వర్మ వ్యూహానికే భయపడిపోయి వ్యవస్థల ద్వారా ఎటాక్ చేసి వ్యూహం సినిమాను అడ్డుకునేందుకు చినబాబు నానాపాట్లు పడుతున్నాడు. సినిమా నచ్చితే చూస్తారు లేదంటే వదిలేస్తారు. మేము సుద్దపూసలం అని చెప్పుకుంటున్న పచ్చ బ్యాచ్ మంద.. వర్మ వ్యూహానికి ఎందుకు వణుకుతున్నారు..? గతంలో ఎలాంటి తప్పులు చేయనప్పుడు ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు..? వెన్నుపోటు రాజకీయం నుంచి ఓటుకు నోటు వరకు బాబు గారి చరిత్ర తెలుగు ప్రజలకు తెలిసిందే కదా.. నారా వారి రాజకీయ చరిత్రే ఇదీ.. ఇందులో వర్మ కొత్తగా చూపించేది ఏముంది..? మహా అయితే కొత్తగా వచ్చిన ప్యాకేజీ స్టార్ పవన్ కల్యాణ్‌ను తెరపైకి తీసుకొస్తాడు. చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్‌ల రాజీకీయ జీవిత కథ మధ్యయుగం నాటిదికాదు కదా.. నిజం ఎంటో ఇప్పుడున్న వారందరికీ తెలుసు కదా.. వర్మ వ్యూహం సినిమాలో తప్పుంటే వెంటనే సోషల్‌మీడియాలో ఉతికేస్తారు.. నిజం ఉంటే మెచ్చుకుంటారు. అసలు సినిమానే వద్దనుకుంటే చూడకుంటే సరిపోయే.. అలాంటి దానికి ఇంత గోల ఎందుకు చినబాబు.. ఉచితంగానే వ్యూహం సినిమాకు పబ్లిసిటీ వస్తుంది కాబట్టి వర్మ కూడా సరిగ్గా ఉపయోగించుకుంటూ ఎంటర్టైన్ చేస్తున్నాడు. వర్మకు కూడా కావాల్సింది ఇదే. ఈ విషయంలో ఆయన భారీగానే సక్సెస్ అయ్యాడు. సీనియర్ ఎన్టీఆర్‌పై సెటైర్ల సినిమా సీనియర్ ఎన్టీఆర్ యుగపురుషుడు, దేవుడు.. అని తెలుగు ప్రజలు అంటారు. అందులో అభ్యంతరం లేదు. అందుకే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడ ఒక జిల్లాకు ఆయన పేరే పెట్టారు. కానీ నారా, నందమూరి, దగ్గుబాటి కుటుంబీకులు ఎన్టీఆర్‌ను ఆయన చరమాంక దశలో ఒంటరిని చేశారు. కనీసం పండగరోజు కాస్త పప్పన్నం పంపించే వాళ్లు కూడా కాదని ప్రచారం ఉండనే ఉంది. ఈ కారణమే ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి ప్రవేశించడానికి అవకాశం కల్పించిందని రాజకీయ పరిశీలకులు ఇప్పటికీ అంటూ ఉంటారు. అలా ఆ వయసులో తనకు సహాయంగా నిలిచిన ఆమెను ఎన్టీఆర్ ప్రేమించాడు. పెళ్లి కూడా చేసుకున్నాడు. అప్పటికే ఆమె మొదటి భర్త నుంచి విడాకులు పొంది ఉంది కాబట్టి ఎన్టీఆర్‌కు భార్య అయ్యింది. రాజకీయంగా కూడా చక్రంతిప్పి ఉండవచ్చు. ఇదే కథతోనే లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం వచ్చింది. చంద్రబాబుపై ఎన్టీఆర్ దుమ్మెత్తిపోయలేదా..? లక్ష్మీస్ ఎన్టీఆర్‌లో వెన్నుపోటు అంకం, ఆ సమయంలో ఎన్టీఆర్ అరణ్యరోదన, అదే మనసును కలిచివేసి ఆయన మరణించడం. చరమాంకంలో చంద్రబాబుపై ఎన్టీఆర్ దుమ్మెత్తిపోయాడం, చంద్రబాబును ఔరంగజేబుతో పోల్చడం, నీతిమాలిన వాడు అని ఆయన దూషించడం, అందుకు ప్రతిగా బాబు కూడా ఎన్టీఆర్‌పై ధ్వజమెత్తడం. ఎన్టీఆర్‌ను విలువల్లేనివాడిగా చిత్రించడం, ఎన్టీఆర్ అవసరం తమకులేదని ప్రకటించడం. వీటికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఇప్పటికీ ఎల్లో మీడియా పేపర్ క్లిప్పింగ్స్‌తో పాటు యూట్యూబ్‌లలో వీడియోలు కూడా ఉన్నాయి. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో కూడా వర్మ ఇదే చూపించాడు.. ఒక్క పచ్చ బ్యాచ్ మాత్రమే సినిమాను తప్పబట్టింది.. మిగిలన ఎవరూ తప్పబట్టలేదు. కానీ ఎన్టీఆర్ అభిమానులు మాత్రం వర్మను అభినందించడం విశేషం. చంద్రబాబు పాత్ర గత సినిమాల్లోనే ఉంది.. వర్మ చూపించేది ఏంటి..? సీనియర్ ఎన్టీఆర్ జీవితం మీద , ఆయన రాజకీయం మీద వ్యంగ్యంగా స్పందిస్తూ వచ్చిన సినిమాలు గతంలో కూడా ఉన్నాయని ప్రత్యేకంగా వివరించనక్కర్లేదు. వాటిల్లో ముఖ్యమైనవి 'నా పిలుపే ప్రభంజనం, మండలాధీశుడు, గండిపేట రహస్యం వంటి చిత్రాలు ఉన్నాయి. ఈ సినిమాలన్నీ యూట్యూబ్‌లో ఉన్నాయి. నేటితరం కూడా వీటిని ఆసక్తితో చూస్తోంది. యూట్యూబ్‌లో వీటికి బాగానే ఉన్నాయి వ్యూస్. ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు, రామోజీరావు.. తదితర నిజజీవిత పాత్రలన్నీ ఈ సినిమాల్లో ఉన్నాయి. అప్పటికి లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ జీవితంలోకి ప్రవేశించలేదు. ఈ సినిమాల్లో కథను ఎంతడేర్గా చూపించారంటే... చంద్రబాబును ఉద్దేశించినట్టుగా అనిపించే 'ఇంద్రబాబు' పాత్రకు వ్యాంపులతో ఎఫైర్‌ను పెట్టేంత సాహసం చేశారు ఆ సినిమాల మేకర్లు. ఈ సినిమాలు అప్పటికి, ఇప్పటికీ చర్చనీయాంశంగా నిలిచాయి. మండలాధీశుడులో నటుడు కోటా శ్రీనివాసరావు ఎన్టీఆర్ పాత్రను పోషిస్తే.. గండిపేట రహస్యంలో థర్టీ ఇయర్స్ పృథ్వీ ఎన్టీఆర్‌గా చేశాడు. ఈ సినిమాలు డైరెక్టుగా ఎన్టీఆర్ మీద సంధించిన అస్త్రాలు. ఈ సినిమాలు వచ్చినప్పుడు ఎన్టీఆరే వాటిని చూసీ చూడనట్టుగా వదిలేశాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఎన్టీఆరే వాటిని లైట్‌గానే తీసుకున్నాడు. ఆ సినిమాల్లో ఎన్టీఆర్ పాత్రలను పోషించిన కోటా, పృథ్వీలపై ఆయా సమయాల్లో దాడులు జరిగాయి. అయితే ఎన్టీఆర్ ఆ దాడులను వారించాడంటారు. -
ఎన్టీఆర్ గారితో యాక్ట్ చేయడం నా అదృష్టం
-
దేవుడితో సమానంగా ఎన్టీఆర్ ని మొక్కుతా..!
-
మా మీద చాలా కక్ష పెంచుకున్నారు ఎందుకంటే..!
-
ఎన్టీఆర్ శిష్యుడిగా కేసీఆర్ హ్యాట్రిక్ కొడతారు: కేటీఆర్ వ్యాఖ్యలు
సాక్షి, ఖమ్మం: కాంగ్రెస్ పార్టీపై సంచలన విమర్శలు చేశారు మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ పార్టీ అంటే గ్యారంటీ కాదని, అది 420 పార్టీ అని మంత్రి కేటీఆర్ విరుచుకుపడ్డారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా కొణిజర్ల మండలం అంజనాపురం వద్ద ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీకి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌పై మండిపడ్డారు. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లా ప్రజలు చాలా చైతన్యవంతులని మంత్రి కేటీఆర్ అన్నారు. వారెంట్ లేని కాంగ్రెస్‌ను వచ్చే ఎన్నికల్లో అడ్రస్ లేకుండా చేయాలనని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ గెలుపు అభివృద్ధికి మలుపు కావాలన్నారు. కాంగ్రెస్ పార్టీకి హామీలు ఇవ్వడం తప్ప నెరవేర్చడం తెలియదన్నారు. వారెంట్ లేని కాంగ్రెస్‌ను వచ్చే ఎన్నికల్లో అడ్రస్ లేకుండా చేయాలనని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ గెలుపు అభివృద్ధికి మలుపు కావాలన్నారు. ఇదే సమయంలో వైరా ఎమ్మెల్యే రాములు నాయక్‌ను మంత్రి కేటీఆర్ పొగడ్తలతో ముంచెత్తారు. బీఆర్ఎస్ పార్టీ కొన్ని కారణాల వల్ల రాములు నాయక్‌కు టికెట్ కేటాయించకపోయినప్పటికీ ఆయన పార్టీకి కట్టుబడి పని చేస్తున్నారని ప్రశంసించారు. మరోవైపు.. ఖమ్మంలోని లకారం ట్యాంక్ బండ్‌పై రూ.1.37 కోట్లతో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ పార్క్ సహా విగ్రహాన్ని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌తో కలిసి కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసిన మహా నాయకుడు ఎన్టీఆర్. రాముడు ఎలా ఉంటాడో తెలియదు.. కృష్ణుడు ఎలా ఉంటాడో తెలియదు.. మాకు రాముడైనా, కృష్ణుడైనా ఆయనే. భారత దేశంలో తెలుగు వారంటూ ఉన్నారని గుర్తించేలా చేసింది ఎన్టీఆరే. చరిత్రలో మహనీయుల స్థానం ఎప్పటికీ చిరస్మరణీయంగా ఉంటుంది. ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం రావడం నా అదృష్టం. నాకు తారక రామారావు పేరు ఉండటం చాలా సంతోషంగా ఉంది. ఎన్టీఆర్ శిష్యుడిగా కేసీఆర్ మూడో సారి హ్యాట్రిక్ కొడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది కూడా చదవండి: బీజేపీకి సోమారపు రాజీనామా! -
చంద్రబాబు అరెస్ట్‌తో ఎన్టీఆర్ ఆత్మ శాంతించింది
-
నన్ను ఎంతో ప్రేమగా పిలిచేవాడు..!
-
ఎన్టీఆర్ ఉన్నప్పుడు ఎలా ఉండే...ఎపుడు ఎలా ఉంది..!
-
సీనియర్ ఎన్టీఆర్ గ్రామం గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
-
చంద్రబాబు గురించి మాట్లాడితే మన పరువు పోతుంది..!
-
లక్ష్మీ పార్వతి వేదిక ఎక్కగానే.. చంద్రబాబు అలా..
దివంగత ముఖ్యమంత్రి, ప్రఖ్యాత సినీ నటుడు ఎన్టీ రామారావు అంటే తెలుగు ప్రజల్లో ఆరాధ్య భావం ఉంటుంది. కృష్ణా జిల్లా నిమ్మకూరులో జన్మించిన నందమూరి తారకరామారావు మొదట సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఎనలేని గుర్తింపు పొందారు.. అదే మాదిరిగా రాజకీయ రంగంలో కూడా చరిత్ర సృష్టించారు. దేశ వ్యాప్తంగా తెలుగువారి ఆత్మగౌరవాన్ని చాటి చెప్పి ఎంతో ఘన చరిత్ర కలిగిన ఎన్టీఆర్.. తన జీవితంలోని చివరి ఘడియల్లో మాత్రం చాలా దారుణ పరిస్థితులు ఎదుర్కొన్నారు. తన సొంత కుటుంబానికే చెందిన వాళ్లే తిరుగుబావుటా ఎగరేసి.. ఎన్టీఆర్‌ను అత్యంత అవమానకర రీతిలో ముఖ్యమంత్రి పదవి నుంచి దించేశారు. ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుడిని చేసేందుకు వారు సాకుగా చూపించిన ఏకైక వ్యక్తి.. లక్ష్మీపార్వతి! ఎన్టీఆర్ చివరి రోజుల్లో ఆయన జీవితంలోకి వచ్చిన లక్ష్మీపార్వతి.. కడవరకూ ఆయన వెన్నంటే ఉన్నారు. లక్ష్మీపార్వతి పేరు లేకుండా ఆయన చరిత్ర గురించి చెప్పడం కష్టమే అనేంతలా ఆయన జీవితంలో ఆమె కీలక పాత్ర పోషించారు. చరిత్రలో స్త్రీ పాత్ర లేకుండా ఎపిసోడ్లు లేవు. అలా ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి ఎలా వచ్చారు..? ఆమెకు ఆయన ఇచ్చిన స్థానం ఎలాంటిది..? ఎన్టీఆర్ చివరి రోజుల్లో అచేతన స్థితిలో ఉంటే లక్ష్మీపార్వతి చేసిన సేవ ఎలాంటిది..? ఎన్టీఆర్‌కు ఎంతో సేవ చేసిన ఆమెపై కుట్రలు పన్నింది ఎవరు..? నాడు ఇవ్వన్నీ ప్రత్యక్షంగా చూసిన ప్రముఖ జర్నలిస్ట్ దాసు కేశవ రావు ఈ వ్యాసం ద్వారా తెలిపారు. ఎన్టీఆర్‌ను లక్ష్మీపార్వతి ఎందుకు కలిశారు? గుంటూరు జిల్లా పచ్చల తాడిపర్రుకు చెందిన లక్ష్మీపార్వతిని మొదటగా వీరగంధం వెంకట సుబ్బారావు వివాహం చేసుకున్నారు. ఆయన హరికథా విద్వాంసుడు. లక్ష్మీపార్వతి కంటే ఆయన 20 ఏళ్లు పెద్దవాడు. ఆమె పెళ్లి నాటికే తెలుగు భాషా పాండిత్యం మీద మంచి పట్టు సాధించి ఉన్నారు. భారత ఇతిహాసాలు, పురాణాల పట్ల లక్ష్మీపార్వతికి మంచి పరిజ్ఞానం ఉంది. ఆప్పట్లో ఆమె పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఒక కళాశాలలో ఉపాధ్యాయురాలిగా కూడా బోధించారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి M. Phil పూర్తి చేసిన ఆమె పీహెచ్డీ కోసం నమోదు చేసుకున్నారు. ఇందులో భాగంగా 'సినిమాలో పౌరాణిక విశేషాలు అంశంపై ఆమె పరిశోధన చేయాలనుకున్నారు. అలా ఆమె మొదటగా ఎన్టీఆర్‌ను కలవాలని అనుకున్నారు. లక్ష్మీపార్వతికి నో చెప్పిన ఎన్టీఆర్ ఆమె తన భర్త వీరగంధం వెంకట సుబ్బారావుతో కలిసి 1985లో న్యూఢిల్లీకి వెళ్లి అక్కడ రామారావును కలుసుకున్నారు. తన రీసర్చ్‌తో పాటు ఎన్టీఆర్ జీవిత చరిత్ర రాయడం కోసం సాకారం ఇవ్వాలని లక్ష్మీపార్వతి కోరడంతో ఆయన కుదరదని చెప్పారు. ప్రస్తుతం తాను చాలా బిజీగా ఉన్నానని లక్ష్మీపార్వతితో ఎన్టీఆర్ చెప్పారు. అలా మొదటిసారి వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆకలితో పడుకున్న ఎన్టీఆర్ 1993-94లో ఏం జరిగిందో జర్నలిస్ట్ దాసు కేశవ రావు ఇలా చెప్పారు. ఆ సమయంలో ఎన్టీఆర్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. ఒకరోజు పర్యటన ముగించుకుని బంజారాహిల్స్‌లోని రోడ్ నంబర్ 13న ఎన్టీఆర్ నివాసానికి తిరిగి వచ్చాం. అప్పుడు ఆయనతో పాటు నేనూ ఉన్నాను. ఇల్లు దాదాపుగా ఖాళీగా ఉంది. అప్పుడు ఇంట్లో ఒకరిద్దరు పనివాళ్లు మినహాయించి ఎవరూ లేరు. ఆ సమయంలో ఆయన ఆకలితో ఉన్నారు.. కానీ అక్కడ తినటానికి ఏం లేదు. ఎన్టీఆర్ ఖాళీ కడుపుతో పడుకోబోతుండగా ఆయన దగ్గర పనిచేస్తున్న ఒకరు ఆ పరిస్థితిని చూసి చలించిపోయి .. ఎన్టీఆర్ స్నేహితుడి ఇంటి వద్దకు వెళ్లి అప్పటికప్పడు భోజనం తయారు చేపించుకుని వచ్చి వడ్డించాడు. ఆయన జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటనలలో ఇది ఒకటి. బడి పంతులు సినిమాలో ఎన్టీఆర్ పాత్రకు సమాంతరంగా నిజ జీవితంలో కూడా ఇలాంటివి ఎన్నో జరిగాయి. కుటుంబ సభ్యులకు దూరం 1984లో తన మొదటి భార్య బసవ తారకం మరణం తర్వాత ఎన్టీఆర్ ఒంటరిగా మిగిలిపోయారు. అప్పటి నుంచి ఆయనకు పనివాళ్లే అన్నం వడ్డించడం వంటివి చేసేవారు. ఆయనకు 7 మంది కుమారులు, నలుగురు కూతుళ్లు ఉన్నా కూడా కుటుంబంతో ఎలాంటి సంబంధం లేదు. వాళ్లూ ఆయన ఉంటున్న ఇంటి వద్దకు వచ్చే వాళ్లు కాదు. ఒంటిరిగానే ఉండేవారు. ఆ సమయంలో అతన్ని దగ్గరుండి చూసుకోవాల్సిన శ్రద్ధగల భాగస్వామి అవసరం. ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో లక్ష్మీపార్వతి 1991-92లో రామారావు జీవితంలోకి ప్రవేశించారు. అప్పటికే ఆమె తన భర్త నుంచి విడిపోయి ఉన్నారు. చాలా రోజుల నుంచి తన రీసెర్చ్, ఆటో బయోగ్రఫీ కోసం ఆమె పదే పదే అభ్యర్థన చేస్తుండటంతో చివరకు ఎన్టీఆర్ అంగీకరించారు. ఆ సమయంలో (1991-92) ఎన్టీఆర్ ప్రతిపక్ష నేతగా ఉండటంతో ఆమె పరిశోధన, జీవిత చరిత్ర గురించి రాసేందుకు మరింత సులభం అయింది. ఆప్పుడు ఎన్టీఆర్‌కు కూడా ఎక్కువ సమయం దొరికింది. పురాణాలు, భారత సంస్కృతిపై లక్ష్మీపార్వతికి ఉన్న పరిజ్ఞానం, విశ్లేషణతో ఎన్టీఆర్ ఆశ్చర్యపోయారు. అలా రోజూ వారిద్దరూ చర్చిస్తుండటంతో వారిని మరింత దగ్గర చేసింది. కానీ అప్పట్లో ఆమె నరసరావుపేట తెలుగు విశ్వవిద్యాలయానికి బస్సులో వెళ్లి రావడం ఇబ్బందిగా ఉండటంతో ఎన్టీఆర్ ఆమెకు ఉద్యోగం ఇవ్వడం జరిగింది. అలా ఎన్టీఆర్ ట్రస్ట్ కార్యాలయంలో ఆమె ఉండేందుకు బస కూడా ఏర్పాటు అయింది. ఆస్పత్రిలో ఎన్టీఆర్ ఉంటే.. ఎన్టీఆర్, లక్ష్మీపార్వతి మధ్య అనుబంధం మరింత బలపడటంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు. అప్పుడు వారిలో ఎన్టీఆర్ పట్ల విపరీతమైన కోపం పెరిగింది. అప్పటికే ఎన్టీఆర్‌కు దూరంగా ఉన్న కుటుంబ సభ్యులు లక్ష్మీపార్వతి ఎంట్రీతో జీర్ణించుకోలేకపోయారు. ఆమెపై ద్వేషం పెంచుకున్నారు. ఒకరోజు రాత్రిపూట ఎన్టీఆర్‌కు రక్తంలో చక్కెర స్థాయిలు పడిపోయాయి. దాదాపు అయన కోమాలోకి వెళ్లిపోయారు. ఆప్పుడు ఎంతో ఆందోళనలో లక్ష్మీపార్వతి ఉన్నారు. ఆయన్ను వెంటనే ఆస్పత్రిలో చేర్పించి వైద్యం అందించారు. అప్పుడు కూడా కుటుంబ సభ్యులు చూసేందుకు వెళ్ల లేదు. ఆస్పత్రిలో ఎన్టీఆర్‌కు ఆమె ఎనలేని సేవ చేయడం జరిగింది. అలా ఆయన మళ్లీ ఆరోగ్యంగా కోలుకున్నారు. 1993 సెప్టెంబర్ 10న ప్రకటన ఎన్టీఆర్, లక్ష్మీపార్వతి మధ్య ఉన్న సంబంధంపై మీడియా, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. వాళ్ల గురించి పుకార్లు కూడా ప్రారంభం అయ్యాయి. కానీ ఎన్టీఆర్ వాటి పట్ల ఎక్కడా స్పందించలేదు. సరిగ్గా అలాంటి సమయంలోనే మేజర్ చంద్రకాంత్ సినిమా 100వ రోజు వేడుక తిరుపతిలో జరుగుతుంది. అక్కడ ఈ టాపిక్‌పై స్పందించాలని ఆయన నిర్ణయించుకున్నారు. అప్పుడు ఆయన్ను ఆపేందుకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు అందురూ ప్రయత్నించారు. కానీ కుదరలేదు. అది 1993 సెప్టెంబర్ 10 తిరుపతిలో సభ... ఎన్టీఆర్ అభిమానులు భారీగా తరలి వచ్చారు. ఆ సమయంలో సభకు దూరంగా కూర్చోని ఉన్న లక్ష్మీ పార్వతిని ఎన్టీఆర్ వేదికపైకి పిలిచారు. దాంతో ఆ సమయంలో అక్కడే ఉన్న నారా చంద్రబాబు నాయుడు హుటాహుటిన కిందకు వెళ్లిపోయారు. ఇవన్నీ ఎన్టీఆర్ లెక్క చేయలేదు. తమ కుటుంబ సభ్యులు లక్ష్మీ పార్వతిని పలు ఇబ్బందులకు గురిచేశారు. ఆమె గురించి తప్పుగా ప్రచారం చేశారు. 'నేను కష్ట సమయంలో ఉన్నప్పుడు కుటుంబ సభ్యులు దూరంగా ఉంటే లక్ష్మీ పార్వతి నాకు అండగా నిలిచింది.' అని ఎన్టీఆర్ అన్నారు. ఆమెను వివాహం చేసుకుంటున్నట్లు ఆయన అక్కడే ప్రకటించారు. అలా ఆమెను తన భార్యగా బహిరంగంగానే చాటిచెప్పారు. అంతేకాకుండా 1994 ఎన్నికల ప్రచారం సమయంలో కూడా ఆమెను తన వెంటే ఉండేలా చేసుకున్నారు. ఎన్నికల ప్రచారం, పార్టీ సమావేశాలలో ఎన్టీఆర్‌తో పాటుగా ఆమె కూడా కీలకంగా పనిచేశారు. 1995 ఎన్టీఆర్ పర్యటనతో పతనం అలా ఎన్నికలు పూర్తి కావడం... తెలుగుదేశం భారీ మెజారిటీతో మళ్లీ అధికారంలోకి రావడం జరిగిపోయాయి. ఆ సమయానికి ఆమె అదృష్టం బాగానే ఉంది. మరోవైపు పార్టీలో చంద్రబాబు నాయుడు పతనం ప్రారంభం అయింది. 1995లో లక్ష్మీ పార్వతితో పాటు ఎన్టీఆర్ UK పర్యటనకు వెళ్లారు. అప్పుడు UK పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రిని కలిసేందుకు వెళ్లారు. కానీ వారిద్దరూ ఇండియాకు తిరిగి రావడం కొంత ఆలస్యం అయింది. అదే ఎన్టీఆర్ పతనానికి దారి తీసింది. పావులు కదిపిన చంద్రబాబు ఇలాంటి సమయం కోసం చంద్రబాబుతో పాటు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు. అప్పుడు చంద్రబాబు వ్యూహాత్మకంగా పావులు కదిపారు. ఆ సమయంలో జరిగిన స్థానిక, పౌర సంస్థల ఎన్నికల్లో టీడీపీకి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అప్పటి వరకు ఎన్టీఆర్‌కు నమ్మకంగా ఉన్న విధేయుల నుంచి తిరుగుబావుట ఎదురైంది. ఇదంతా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఉన్న మెజారిటీ ఎమ్మెల్యేలే నడిపించారు. అలా 1995 ఆగష్టులో రామారావు, లక్ష్మీ పార్వతిలు ఈ సంక్షోభాన్ని పసిగట్టలేకపోయారు. పార్టీ అధ్యక్షుడి పదవి చంద్రబాబు నాయుడుకు చేరింది. తర్వాత ముఖ్యమంత్రి పదవి వరించింది. అక్కడితో ఎన్టీఆర్ చరిత్ర ముగిసిపోయింది. ఆ సమయం నుంచి చంద్రబాబు ఏది చెబితే అదే జరుగుతూ వచ్చింది. ఆ విధంగా, లక్ష్మీ పార్వతి కూడా తన భర్తతో పాటుగా ఉన్నత స్థానం నుంచి కిందకు పడిపోయారు. అలా కొన్ని నెలల తరువాత (1996) ఎన్టీఆర్ మరణించడం జరిగిపోయింది. అలా ఎన్టీఆర్ చివరి రోజులు క్షోభ,వేదనతో ముగిసిపోయాయి. -
‘బాబుకు ఎన్టీఆర్ బొమ్మతో రాజకీయాలు మాత్రమే కావాలి’
సాక్షి, కాకినాడ: చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేశారు మంత్రి సీదిరి అప్పలరాజు. కుప్పంలో దొంగ ఓట్లతోనే చంద్రబాబు గెలుస్తున్నాడని అన్నారు. చంద్రబాబు.. ఎన్టీఆర్ పేరుమీద స్పాన్సర్డ్ కార్యక్రమం పెట్టి బీజేపీ నేతలతో లాబీయింగ్ చేశాడు అని కామెంట్స్ చేశారు. కాగా, మంత్రి సీదిరి అప్పలరాజు మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘కుప్పంలోనే 30-40వేల బోగస్ ఓట్లు ఉన్నాయి. కుప్పంలో దొంగ ఓట్లు పోతాయనే బాబు మొసలికన్నీరు కారుస్తున్నాడు. చాలాసార్లు బీజేపీ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో ఎన్టీఆర్ పేరుమీద స్పాన్సర్డ్ కార్యక్రమం పెట్టి బీజేపీ నేతలతో లాబీయింగ్ చేశాడు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని ఎందుకు అడగలేదు?. ఎన్టీఆర్ బొమ్మతో ఓట్లు లబ్ధి పొందాలనేదే చంద్రబాబు తాపత్రయం. ఎన్టీఆర్‌కు ప్రత్యేక గుర్తింపు కావాలనే ఆలోచన బాబుకు లేదు. ఎన్టీఆర్ బొమ్మతో చంద్రబాబుకు రాజకీయాలు మాత్రమే కావాలి. ఇదే సమయంలో విశాఖ మత్య్సకారుల సమస్యలపై కూడా మంత్రి సీదిరి అప్పలరాజు స్పందించారు. విశాఖలో మత్స్యకారుల సమస్య ఈనాటిది కాదు. గత ముప్పై ఏళ్ల కింద ఇచ్చిన హామీ అమలు కాలేదు. విశాఖ మత్స్యకారుల సమస్య పరిష్కారం కోసం కలెక్టర్‌తో మాట్లాడాను. మత్స్యకారులకు ఇళ్ల స్థలాలు నెరవేర్చేందుకు ప్రయత్నిస్తాం’ అని తెలిపారు. ఇది కూడా చదవండి: బీజేపీ చీఫ్ పురంధేశ్వరిపై పోసాని సీరియస్ కామెంట్స్ -
బాబు.. నీకు సైకిల్ గుర్తు ఎలా వచ్చిందో చెప్పు: మంత్రి అంబటి
సాక్షి, విజయవాడ: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి అంబటి రాంబాబు సంచలన కామెంట్స్ చేశారు. టీడీపీ హయాంలో పోలవరంపై ఏనాడైనా ఆలోచించారా? అని ప్రశ్నించారు. పోలవరంపై చంద్రబాబుకు అసలు చిత్తశుద్ధే లేదన్నారు. పోలవరంపై చంద్రబాబు ఏనాడైనా నిజాలు మాట్లాడారా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. కాగా, మంత్రి అంబటి శనివారం విజయవాడలో పోలవరంపై వీడియో ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ.. చంద్రబాబు జీవితమంతా అబద్ధాలమయమే. టీడీపీ హయాంలో తప్పిదాల వల్లే పోలవరం ఆలస్యమైంది. చంద్రబాబు వస్తే రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది. చంద్రబాబు హయాంలో అన్నీ కరువుకాటకాలే. చంద్రబాబు శనిపాదం అడుగుపెడివతే వర్షాలే కురవవు. ఎల్లోమీడియాతో పోలవరంపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు. ఈ రాష్ట్రానికి పట్టిన శని చంద్రబాబే. బాబు.. నీకు సైకిల్ గుర్తు ఎలా వచ్చిందో చెప్పు.. చంద్రబాబు చిత్తశుద్ధి ప్యాకేజీపైనే తప్పు ప్రాజెక్ట్‌పైన లేదు. రాష్ట్రానికి, పోలవరానికి పట్టిన శని చంద్రబాబు. కేంద్రం పూర్తి చేయాల్సిన ప్రాజెక్ట్‌ను.. నువ్వెందుకు తీసుకున్నావ్?. 2013-14 రేట్లకు ఒప్పుకుని పోలవరాన్ని 2016లో రేట్లకు నవయుగకు ఇచ్చాడు. పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంలా వాడుకున్నారని ప్రధాని మోదీనే అన్నారు. టీడీపీ హయాంలో కమీషన్ల కోసమే తాపత్రయపడ్డారు. చంద్రబాబు నైజం గురించి ప్రధానికి బాగా తెలుసు. ఎన్టీఆర్ అల్లుడు కావడం వల్లే చంద్రబాబు సీఎం అయ్యాడు. బాబు.. నీకు సైకిల్ గుర్తు ఎలా వచ్చిందో చెప్పు. చంద్రబాబు అధికార దాహంతో ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. చంద్రబాబును నేను తిట్టలేనా?.. కానీ నాకు సంస్కారం ఉంది. నాది ఆనందతాండవం.. పవన్‌ది శునకానందం ఇక, ఇదే సమయంలో బ్రో సినిమాలో తనపై పేరడీ సీన్ పేరుతో హేళన చేసిన పవన్‌పై నేరుగానే అంబటి రాంబాబు రియాక్ట్ అయ్యారు. పవన్‌పై విమర్శలు గుప్పించారు. ‘పవన్ సినిమాలో నా క్యారెక్టర్‌ను పెట్టి అవమానించారని విన్నా. పవన్‌ది శునకానందం. నన్ను రాజకీయంగా ఎదుర్కొనలేకే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నాడు. సంక్రాంతికి నేను వేసింది ఆనందతాండవం. ఎమ్మెల్యేగా నెగ్గి.. మంత్రి అయిన ఆనందం. నేను ఎవరి దగ్గరో డబ్బులు తీసుకునో, ప్యాకేజీ తీసుకునో డ్యాన్సులు చేయను. నా డ్యాన్స్ సింక్ అవ్వడానికి నేనేమైనా డ్యాన్స్ మాస్టర్నా?. అసలు రాజకీయాలకు పవన్ సింక్ అవ్వడు అంటూ సెటైరికల్ పంచ్ ఇచ్చారు. ఇది కూడా చదవండి: ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరికి మంత్రి రోజా స్ట్రాంగ్ కౌంటర్ -
ఏ మాత్రం మానవత్వం లేని పశువు వాడు
-
చంద్రబాబు గురించి ఎవరికీ తెలియని నిజాలు
-
అప్పట్లో ఎన్టీఆర్ కి జరిగిన ఘోర అవమానం
-
నా వయసుకు కూడా గౌరవం ఇవ్వలేదు వాడు
-
వైస్రాయ్ హోటల్ లో అసలు ఏం జరిగిందంటే
-
ఒక ఆడదానికి ఇద్దరు మొగుళ్ళు ఉంటారా..... అలాగే చంద్రబాబు..
-
కృష్ణ కుమారి విషయంలో ఎన్టీఆర్ ని నిలదీశారా..?
-
అప్పట్లో చంద్రబాబు అరాచకాలను పూసగుచ్చినట్టు చెప్పిన ఎన్టీఆర్
-
ఆ ఒక్క రోజు ఘటన నేను మర్చిపోలేను...చంద్రబాబు హైదరాబాద్ తీసుకెళ్లి
-
చిన్న ఆర్టిస్టులను బతికించండి: కోటా శ్రీనివాసరావు
ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా తాజాగా హైదరాబాద్‌లో ఎన్టీఆర్ మెమోరియల్ అవార్డ్స్ వేడుకను ఘనంగా నిర్వహించారు. సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు, చంద్రమోహన్, ప్రభ, శివకృష్ణ, రోజా రమని, కవిత, తనికెళ్ల భరణి, బాబు మోహన్, కైకాల నాగేశ్వరరావు, బుర్రా సాయి మాధవ్, కొమ్మినేని వెంకటేశ్వరరావు, గుబ్బా సురేశ్ కుమార్ తదితరులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డా. గారపాటి లోకేశ్వరి,నందమూరి మోహనకృష్ణ,నందమూరి చైతన్యకృష్ణ, గారపాటి శ్రీనివాస్,నందమూరి యశ్వంత్, రిటైర్డ్ ఐ జి మాగంటి కాంతారావు, అంబికా కృష్ణ,తుమ్మల ప్రసన్నకుమార్,అనంతపురం జగన్,‘మా’ ఈ సీ మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు. సన్మానం అనంతరం కోటా శ్రీనివాసరావు మాట్లాడుతూ ‘‘ఇవాళ్ల రేపు సినిమా అనేది లేదు.. అంతా సర్కస్. విషాదకర పాటకు కూడా డాన్స్‌లు వేస్తున్నారు. రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబు కానీ రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నారో తెలుసా? వాళ్లు ఏనాడూ తమ పారితోషికం గురించి బాహాటంగా మాట్లాడలేదు. కానీ ఇప్పుడు హీరోలు రోజుకి 2కోట్లు, 6కోట్లు తీసుకుంటున్నాం అని పబ్లిక్ గా చెపుతున్నారు. ఇది మంచి పద్థతి కాదు. అప్పట్లో ఎన్టీఆర్ శ్రీదేవితో డాన్స్ చేస్తుంటే ఆయన వయసు గురించి ఎవరూ మాట్లాడలేదు. అప్పుడు జనాలు తెరపై ఆ పాత్రలు మాత్రమే కనిపించాయి’’ అని అన్నారు. అలాగే ‘మా’ అసోసియేషన్ గురించి కూడా ఆయన మాట్లాడారు. ‘ఎంతమంది ఆర్టిస్ట్ రెండు పూట్ల కడుపునిండా అన్నం తింటున్నారో ఓసారి దృష్టిసారించండి అని మా అధ్యక్షుడు మంచు విష్ణుని కోరారు. పూర్తిగా తెలుగు ఆర్టిస్ట్‌లు, సాంకేతిక నిపుణులతో ‘పది కోట్లతో సినిమా తీస్తే.. డబ్బు ఇవ్వద్దు.. రాయితీలు ఇవ్వద్దు. ఉభయ రాష్ట్రాల్లో ఎక్కడ షూటింగ్ జరిగినా లొకేషన్ ఉచితంగా ఇస్తుంది అని ప్రకటించమని ప్రభుత్వానికి ఓ లెటర్ రాయండి’అని అన్నారు. ప్రస్తుతం చిన్న ఆర్టిస్టులు బతకలేకపోతున్నారు. ఏదో ప్రకటనలో నటిద్దాం అనుకుంటే.. బాత్రూమ్ క్లీన్ చేసే బ్రష్ నుంచి బంగారం ప్రకటనల వరకు అన్నీ స్టార్ హీరోలే చేస్తున్నారు. ఇక చిన్న ఆర్టిస్టులకు పని ఎక్కడ ఉంది? దయచేసి ‘మా’ సభ్యులు, ప్రభుత్వాలు ఆలోచన చేసి ఆర్టిస్ట్‌లను బతికించండి’అని కోటా శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు.ఈవెంట్ ఆర్గనైజర్ మరియు మా ఈ సీ మెంబర్ విష్ణుబొప్పన మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతిఒక్కరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేశారు. -
బాలకృష్ణ, లోకేష్, బాబుపై కొడాలి నాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్
సాక్షి, తాడేపల్లి: టీడీపీ అధినేత చంద్రబాబుపై మాజీ మంత్రి కొడాలి నాని సీరియస్ కామెంట్స్ చేశారు. ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు నిర్వహించే అర్హత చంద్రబాబు లేదని అన్నారు. ఎన్టీఆర్ శత జయంతి వేడుకల పేరుతో చంద్రబాబును పొగిడించుకుంటున్నారని విమర్శలు చేశారు నాని. కాగా, కొడాలి నాని సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘చంద్రబాబును పొగిడించుకోవడానికే మహానాడు పెట్టారు. చంద్రబాబు.. ఇంద్రుడు చంద్రుడు అని పొగుడుతున్నారు. మహానాడు వేదిక మీద బాలకృష్ణ బొమ్మ ఎందుకు పెట్టలేదు. ఎమ్మెల్యేగా కూడా గెలవని నారా లోకేష్ బొమ్మ ఎలా పెడతారు. ఎన్టీఆర్ పేరుతో నాలుగు ఓట్ల కోసమే ఈ తపనంతా. ప్రశ్నిస్తానంటూ జనసేన పవన్ కల్యాణ్.. చంద్రబాబుకు ఓటేయించారు. టీడీపీ మేనిఫెస్టోలో చెప్పిన ఏ ఒక్క హామీలు చంద్రబాబు నిర్వహించలేదు. అదే వైఎస్సార్ 2004లో ఇచ్చిన ప్రతీ హామీ నిర్వహించారు. మేనిఫెస్టోలో ఇచ్చినవే కాకుండా ఇవ్వని పథకాలు కూడా అమలు చేశారు. 2019లో రైతుల రుణాలు మాఫీ చేస్తామని చంద్రబాబు మాట తప్పారు. డ్వాక్రా రుణాలు మాఫీ అని చెప్పి మాఫీ చేయలేదు. చంద్రబాబు ఐదేళ్లలో పెన్షన్లకు రూ.22వేల కోట్లు ఖర్చు చేశారు. అదే సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.97వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. సెంటు స్థలం ఇస్తే సమాధికి సరిపోదు అంటున్నారు. 14ఏళ్లు అధికారంలో ఉండి చంద్రబాబు పేదలకు ఎందుకు ఇళ్లు ఇవ్వలేదు. బీసీలకు చట్టం తెస్తానని చంద్రబాబు మోసపూరిత హామీ ఇచ్చారు. చంద్రబాబు వెనుక బీసీలెవరూ లేరు. చంద్రబాబు వెంట ఉన్నది.. రామోజీ, రాధాకృష్ణ, బీఆర్ నాయుడు, పవన్ కల్యాణ్. వీళ్లెవరూ బీసీలు కాదు.. అధికారం ఇస్తే బాబుతో పాటు వీళ్లే బాగుపడతారు. చంద్రబాబుకు అధికారం ఇస్తే తన సామాజికవర్గానికే మంత్రి పదవులు ఇస్తారు. చంద్రబాబును ఆల్‌ఫ్రీ బాబు అని వైఎస్సార్ ఆనాడే చెప్పారు. చంద్రబాబు దొంగ, 420, ఔరంగజేబు అని ఎన్టీఆర్ ఆనాడే అన్నారు. చంద్రబాబు ఫీజు రీయింబర్స్మెంట్ ఎంత ఇచ్చాడు?. రాష్ట్రంలో చంద్రబాబు ఎవరికైనా ఉద్యోగం ఇచ్చాడా?. టీడీపీ హయాంలో లోకేష్‌కు తప్ప రాష్ట్రంలో ఒక్కరికీ ఉద్యోగం రాలేదు’ అంటూ సీరియస్ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: విభజన సమస్యలు పరిష్కరించండి: సీఎం వైఎస్ జగన్ -
‘ఎన్టీఆర్ ప్రభుత్వం పడిపోయిన రోజు కళ్ల వెంట నీరొచ్చింది’
సాక్షి, విజయవాడ: నగరంలోని ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్, దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకలకు నందమూరి లక్ష్మీపార్వతి, డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ, ఏపీ మీడియా అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు కొడాలి నాని, పేర్నినాని హాజరయ్యారు. ఈ సందర్బంగా కొమ్మినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఎన్టీఆర్ ప్రభుత్వం పడిపోయిన రోజు తన కళ్ల వెంట నీరొచ్చిందని అప్పటి విషయాలను గుర్తుచేసుకున్నారు. అప్పట్లో ఎన్టీఆర్‌కు జరిగి అవమానాలను తాను ప్రత్యక్షంగా చూసినట్లు చెప్పుకొచ్చారు. చివరికి కొడుకులు కూడా ఆయన్ను అవమానించారని తెలిపారు. ఎన్టీఆర్, వైఎస్ జగన్ పరిపాలనకు చాలా పోలికలున్నాయన్న ఆయన.. పరిపాలన పారదర్శకత, సౌలభ్యం కోసం ఎన్టీఆర్ మండల వ్యవస్థను తెస్తే, జగన్ సచివాలయ వ్యవస్థ తెచ్చారని అన్నారు. -
వాళ్లే ఎన్టీఆర్‌కు నిజమైన వారసులు: లక్ష్మీపార్వతి
సాక్షి, విజయవాడ: నగరంలోని ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్, దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకలకు నందమూరి లక్ష్మీపార్వతి, డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ, కొడాలి నాని, పేర్నినాని హాజరయ్యారు. ఈ సందర్బంగా లక్ష్మీపార్వతి మాట్లాడుతూ.. విజయవాడ నడిబొడ్డున ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు జరగడం చాలా ఆనందంగా ఉంది. ఎన్టీఆర్‌కు జరిగిన అన్యాయంపై పోరాడి పోరాడి అలసిపోయాను. నా ఆవేదనను ఒక్కరు కూడా పట్టించుకోలేదు. ఎన్టీఆర్ వారసులమంటూ ఎవరెవరో డబ్బాలు కొట్టుకుంటున్నారు. కుడుపున పుడితే వారసులు కాదు. ఎన్టీఆర్‌కు చివరి వరకూ అండగా నిలబడిన వారే నిజమైన వారసులు. ఎన్టీఆర్‌కు చివరి క్షణాల్లో అండగా ఉంది దేవినేని నెహ్రూ మాత్రమే. దేవినేని నెహ్రూ మాత్రమే ఎన్టీఆర్‌కు అసలైన వారసుడు. మాట్లాడటం కూడా రాని లోకేష్ కూడా నేనే వారసుడినంటున్నాడు. ఎన్టీఆర్‌ను మోసం చేసిన ఈ దుర్మార్గులు ఎలా వారసులు అవుతారు. చంద్రబాబు అంత నీచుడు మరొకడు లేడు. చంద్రబాబు వెన్నుపోటుపై ఎన్టీఆర్ ఎంతో బాధపడ్డారు. ఎన్టీఆర్‌ను చంద్రబాబు ఎన్నోసార్లు అవమానించాడు. ఎన్టీఆర్ పేరు కానీ.. ఫొటో కానీ.. పెట్టుకునే అర్హత చంద్రబాబుకు లేదు. ఎన్టీఆర్ ఆశయాలను సమాధి చేసిన వ్యక్తి చంద్రబాబు. ఒక జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టిన గొప్ప వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. నా వ్యక్తిత్వాన్ని నిలబెట్టిన సీఎం జగన్‌కు జీవితాంతం రుణపడి ఉంటాను. క్లిష్టసమయంలో డైరెక్టర్ రాం గోపాల్‌వర్మ నాకు ధైర్యానిచ్చారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతో నా పాత్ర గురించి అందరికీ చెప్పారు. నా క్యారెక్టర్‌ను తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం చేసినపుడు నాకు పోసాని కృష్ణమురళీ ఓ సోదరుడిగా అండగా నిలిచారు అని కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: చంద్రబాబు లాంటి నీచుడు ఎక్కడా ఉండడు: లక్ష్మీపార్వతి -
చంద్రబాబు లాంటి నీచుడు ఎక్కడా ఉండడు: లక్ష్మీపార్వతి
సాక్షి, అమరావతి: ఎన్టీఆర్‌ను చంపిన దుర్మార్గుడు చంద్రబాబు అని నందమూరి లక్ష్మీ పార్వతి అన్నారు. చంద్రబాబు ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు చేస్తే ఆయన ఆత్మ క్షోభిస్తోందని ఆమె తెలిపారు. ఎన్టీఆర్ పేరు ఎత్తడానికి కూడా చంద్రబాబుకు అర్హత లేదు.. చివరికి ఆయన కుటుంబాన్ని కూడా దూరం చేశాడని మండిపడ్డారు. చంద్రబాబు, రామోజీరావు కలిసి పార్టీని కూలదోశారు.. వైస్రాయ్ హోటల్ వద్ద చెప్పులు వేయించి ఎన్టీఆర్‌ను తీవ్రంగా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ పేరును జిల్లాకు పెట్టిన మనసున్న వ్యక్తి సీఎం జగన్ అని కొనియాడారు. ఆస్తులు పంచుకున్న కొడుకులు, పార్టీని లాక్కున్న చంద్రబాబు.. ఎన్టీఆర్‌కు వారసులు కాదని.. ఎన్టీఆర్ పేరు ఎత్తడానికి వీళ్లకున్న అర్హత ఏంటని ప్రశ్నించారు. ఎన్టీఆర్ పేరు వాడటానికి కొడుకులకు కూడా నైతిక హక్కు లేదని.. ఎన్నికలొచ్చే సరికి కొడుకులకు తండ్రి గుర్తుకువచ్చాడా అని ప్రశ్నించారు. ఎన్టీఆర్‌కు భారతరత్న కావాలని చంద్రబాబు ఏరోజూ అడగలేదని నాటి ప్రధాని వాజ్‌పేయి తనతో స్వయంగా చెప్పారన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. నిజమైన వారసుడు సీఎం జగన్: దేవినేని అవినాష్ ఎన్టీఆర్ ఆశయాలకు నిజమైన వారసుడు సీఎం జగన్ అని దేవినేని అవినాష్ అన్నారు. కేవలం ఓట్ల కోసమే టీడీపీ ఎన్టీఆర్ పేరును వాడుకుంటోందని మండిపడ్డారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ గుర్తుకురారు.. ప్రతిపక్షంలో ఉంటే మాత్రం ఎన్టీఆర్ గుర్తొస్తారని ఎద్దేవా చేశారు. చదవండి: టీడీపీ మహానాడులో లోకేష్‌కు షాకిచ్చిన కార్యకర్త -
టీడీపీ, ఎల్లో మీడియాకు నిద్రపట్టడం లేదు: దేవినేని అవినాష్
సాక్షి, విజయవాడ: దివంగత ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు విజయవాడలో నిర్వహిస్తాం. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి పాల్గొంటారని విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించనున్నట్టు వెల్లడించారు. కాగా, దేవినేని అవినాష్ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు రేపు ఘనంగా నిర్వహిస్తున్నాం. మేమూ ఎన్టీఆర్ అభిమానులమే. ఎన్టీఆర్‌కు బ్యానర్లు కట్టే హక్కు మాకుంది. ఎన్టీఆర్ సర్కిల్ టీడీపీకి ఎవరూ రాసివ్వలేదు. టీడీపీ నేతలు అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ పేరు కూడా ప్రస్తావన రాకుండా చేసేవారు. ఎన్టీఆర్ పేరు జిల్లాకు పెట్టిన మనసున్న నేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఎన్టీఆర్ పేరును చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోయేలా చేశారు సీఎం జగన్. కనీవినీ ఎరుగని రీతిలో నిన్న అమరావతిలో జరిగిన ఇళ్ల పట్టాల పండుగకు లబ్ధిదారులు తరలివచ్చారు. చంద్రబాబు సభలకు జనం రావాలంటే డబ్బులు, బిర్యానీ ప్యాకెట్లు ఇవ్వాలి. కానీ, సీఎం జగన్ మీటింగ్‌కు సంతోషంతో లబ్ధిదారులు తరలివచ్చారు. టీడీపీ నేతలు మూడేళ్లు పేదలకు ఇళ్లు రాకుండా వ్యవస్థల ద్వారా అడ్డుకున్నారు. అమరావతిలో తన పెట్టుబడిదారులు, రియల్ ఎస్టేట్ వ్యక్తులు మాత్రమే ఉండాలని చంద్రబాబు అనుకున్నాడు. దమ్మున్న నాయకుడిగా సీఎం జగన్ పేదల తరపున పోరాడారు. ఇళ్ల పట్టాల పండుగను చూసి టీడీపీ నేతలకు, ఎల్లో మీడియాకు నిద్రపట్టడం లేదు. పేదల సొంతింటి కల నెరవేరుతుంటే చూసిఓర్వలేకపోతున్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఇళ్ల పట్టాలను రద్దుచేస్తామంటున్న టీడీపీ నేతలకు సిగ్గుందా?. సెంటు స్థలంపై విమర్శలు చేసిన టీడీపీ నేతలు ఇప్పుడు తలలెక్కడ పెట్టుకుంటారు. సీఎం జగన్ సభను చూసిన తర్వాత టీడీపీ నేతలకు దిమ్మతిరిగింది. ఇది కూడా చదవండి: వివేకా కేసు: చంద్రబాబు దుర్మార్గం ఏ స్థాయికి చేరిందంటే.. -
మా సస్పెన్షన్.. కరాటే కల్యాణ్ రియాక్షన్ ఇదే!
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేయడంపై నటి కరాటే కల్యాణి రియాక్ట్ అయ్యారు. సినీ పరిశ్రమ కోసం తాను పడిన కష్టానికి బాగా బుద్ధి చెప్పారని అన్నారు. మా సస్పెండ్ చేయడంతో చాలా బాధపడ్డానని తెలిపారు. మాపై ఎవరు ఎన్ని కుయుక్తులు పన్నినా తన పోరాటం ఆగదని స్పష్టం చేశారు. తన నిజాయితీకి ఇచ్చే బహుమతి ఇదేనా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. (ఇది చదవండి: శ్రీలీలను కొట్టిన బాలకృష్ణ! అసలేం జరిగిందంటే?) కాగా.. ఖమ్మంలోని లకారం ట్యాంక్‌బండ్‌పై సీనియర్ ఎన్టీఆర్ విగ్రహా ఏర్పాటుపై ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో మా చర్యలు చేపట్టింది. ఎన్టీఆర్‌పై చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాల్సిందిగా ‘మా’ షోకాజ్ నోటీసులు కూడా ఇచ్చింది. (ఇది చదవండి: తిరుమలకు నిహారిక భర్త.. మళ్లీ మొదలైన చర్చ!) కరాటే కల్యాణి మాట్లాడుతూ..' 23 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా. ఎవరు, ఎప్పుడు, ఏం మాట్లాడినా నేనే అడ్డుపడినా. పూసుకుని, రాసుకుని నా ఇండస్ట్రీ, నా ఇండస్ట్రీ అనుకుని వెళ్లా. అలా వెళ్లినందుకు నా నిజాయతీకి తగిన బగుమతి దక్కింది. నేను ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టమనే అడిగాను. వ్యతిరేకించట్లేదు. కృష్ణుడి రూపంలో వద్దని చెప్పా. దీనికి నా మీద ఎందుకు కక్ష కడుతున్నారు. నా ఆరోగ్యం బాగోలేక సమాధానం ఇవ్వలేకపోయా. మూడు రోజులు మాత్రమే గడువిచ్చారు. కనీసం వారం రోజులు కావాలని నోటీసు కూడా ఇచ్చా. అందుకే నన్ను సస్పెండ్ చేశారు. నాకు ఎవరిపైనా వ్యక్తిగత ద్వేషం లేదు. మా అసోసియేషన్‌ను కించపరచలేదు. నేను ఏ తప్పూ చేయలేదు. బహుశా ఎవరి ఒత్తిడితోనైనా ఆ నిర్ణయం తీసుకున్నారేమో తెలియదు.' అని చెప్పుకొచ్చారు. -
‘పవన్‌ను బ్లాక్మెయిల్ చేసేందుకు రజినీ రంగంలోకి!’
సాక్షి, కృష్ణా: ఆంధ్రప్రదేశ్‌లో జీరో అయిన రజినీకాంత్.. సిగ్గూ శరం లేకుండా ఇవాళ చంద్రబాబు నాయుడిని పొగుడుతున్నాడని గుడివాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు. ఎన్టీఆర్‌పై ఆనాడు చెప్పులు విసురుతుండగా.. చంద్రబాబుకు రజినీకాంత్ మద్దతు తెలిపారని గుర్తు చేశారాయన. అలాంటి రజినీ ఇవాళ ఎన్టీఆర్ గురించి మాట్లాడడం శోచనీయమన్నారు. ‘‘వెధవలంతా ఒకచోట చేరి ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను చేస్తున్నారు. ప్రజలెవరూ వాళ్లను పట్టించుకోరు. ఎన్టీఆర్ బ్రతికుండగా రజినీకాంత్ ఏం చేశాడు?. అసలు ఇప్పుడెందుకు మాట్లాడుతున్నాడు?. మూడు రోజులు షూటింగ్ చేస్తే.. నాలుగు రోజులు హాస్పిటల్లో ఉండే రజినీకాంత్ తెలుగు ప్రజలకేం చెప్తాడు. ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్‌ను రజినీ చదువుతూ.. మరింత దిగజారిపోతున్నాడు’’ అని కొడాలి మండిపడ్డారు. పవన్ కల్యాణ్‌ను బ్లాక్ మెయిల్ చేసేందుకే.. రజినీని చంద్రబాబు రంగంలోకి దించాడని ఎమ్మెల్యే కొడాలి నాని పేర్కొన్నారు. చంద్రబాబు కుట్ర రాజకీయాల్ని పవన్ ఇకనైనా గ్రహించాలని హితవు పలికారు. ఇదీ చదవండి: రజినీ వ్యాఖ్యలతో ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుంది! -
రజనీకాంత్‌కు మంత్రి రోజా కౌంటర్
సాక్షి, విజయవాడ: సూపర్ స్టార్ రజినీకాంత్ వ్యాఖ్యలకు మంత్రి రోజా కౌంటర్ ఇచ్చారు. రజనీకాంత్‌కు తెలుగు రాష్ట్రం, రాజకీయాలపై అవగాహన లేదని విమర్శలు చేశారు. రజనీకాంత్ వ్యాఖ్యలతో ఎన్టీఆర్ ఆత్మ కూడా బాధపడుతుందన్నారు. కాగా, మంత్రి రోజా శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘రజనీకాంత్‌తో చంద్రబాబు అబద్ధాలు చెప్పించారు. ఎన్టీఆర్ ఏమన్నారో.. రజనీకాంత్‌కు వీడియోలు ఇస్తాను. ఎన్టీఆర్‌పై దారుణంగా కార్టూన్లు వేసి అవమానించిన వ్యక్తి చంద్రబాబు. రజనీకాంత్‌కు తెలుగు రాష్ట్రం, రాజకీయాలపై అవగాహన లేదు. రజనీకాంత్ వ్యాఖ్యలతో ఎన్టీఆర్ ఆత్మ కూడా బాధపడుతుంది. ఎన్టీఆర్ అభిమానులను బాధపట్టేలా రజనీకాంత్ మాట్లాడారు. చంద్రబాబు లేనప్పుడే హైదరాబాద్ అభివృద్ధి చెందింది. విదేశాల్లో తెలుగువారు ఉద్యోగాలు పొందడానికి కారణం వైఎస్సాఆర్. ఇందుకు కారణం చంద్రబాబు కాదని రజనీకాంత్ తెలుసుకోవాలి. ఫీజు రియింబర్స్‌మెంట్ తెచ్చింది వైఎస్సార్.. చంద్రబాబు కాదు. చంద్రబాబు విజన్ 2020 వల్ల టీడీపీ 23 సీట్లకు పరిమితమైంది. విజన్ 2047కి చంద్రబాబు ఏ దశలో ఉంటారో రజనీకాంత్‌కి తెలుసా?. ఇలాంటి వ్యాఖ్యలు చేసి.. రజనీకాంత్‌పై తెలుగు ప్రజలకు ఉన్న గౌరవం తగ్గించుకున్నారు. ఇంతలా మాట్లాడేవారు 27 ఏళ్లలో ఎన్టీఆర్‌కు భారతరత్న ఎందుకు ఇప్పించలేదు. ఎన్టీఆర్ యుగపురుషుడు అన్న వారు ఎందుకు వెన్నుపోటు పొడిచారు?. రజనీకాంత్ చెప్పినట్టు 2024లో చంద్రబాబు సీఎం అయ్యే అవకాశమే లేదు. రజనీకి ఎన్టీఆర్‌ను అసెంబ్లీలో ఎలా అవమానించారో రికార్డులు పంపిస్తాను’ అని కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: స్కిల్ స్కాంలో ఈడీ దూకుడు -
‘చంద్రబాబుకు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు జరిపే హక్కు లేదు’
సాక్షి, సత్తెనపల్లి: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి అంబటి రాంబాబు సీరియస్ కామెంట్స్ చేశారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు జరిపే హక్కు చంద్రబాబు లేదంటూ విమర్శలు చేశారు. చంద్రబాబు షోలు అన్నీ అట్టర్ ఫ్లాప్ అంటూ వ్యాఖ్యలు చేశారు. కాగా, మంత్రి అంబటి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు.. తనను వెన్నుపోటు పొడిచిన దుర్మార్గుడని సీనియర్ ఎన్టీఆరే చెప్పారు. స్వయానా ఎన్టీఆర్.. చంద్రబాబును ఔరంగజేబుతో పోల్చారు. తండ్రిలాంటి మామకు వెన్నుపోటు పొడిచాడని ఎన్టీఆర్ చెప్పారు. అందుకే ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు జరిపే హక్కు చంద్రబాబు లేదు. చంద్రబాబు నిర్వహిస్తున్న మీటింగ్‌లకు జనం రావడం లేదు. చంద్రబాబువన్నీ అట్టర్ ఫ్లాప్ షోలే అంటూ విమర్శలు చేశారు. ఇది కూడా చదవండి: మార్గదర్శి చిట్‌ఫండ్స్ కేసులో సీఐడీ దూకుడు -
ఎన్టీఆర్ ఆస్తి నీకు రాసిచ్చారా?.. చంద్రబాబుపై కొడాలి నాని ఫైర్
సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్‌పై మాజీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. లోకేష్ యాత్రను ప్రజలు పట్టించుకోకపోవడంతో చంద్రబాబుకు పిచ్చిపట్టిందని తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని చంద్రబాబు వ్యక్తిగతంగా దూషిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, కొడాలి నాని శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. మీరు ఇష్టం వచ్చినట్టు వ్యక్తిగతంగా మాట్లాడొచ్చా?. సీఎం వైఎస్ జగన్ డీఎన్ఏ రాయలసీమది.. లోకేష్ డీఎన్ఏ తెలంగాణది. చంద్రబాబు చరిత్ర అందరికీ తెలుసు. తెలంగాణలో పుట్టి, అక్కడే పెరిగి ఇక్కడ యాత్ర చేస్తున్నాడు. ఒక ఎజెండా లేకుండా లోకేష్ యాత్ర చేస్తున్నాడు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజూ ప్రాజెక్టులు నిండలేదు. రాష్ట్రానికి పట్టిన దరిద్రం చంద్రబాబు. నేను బూతులు మాట్లాడతాను అనే వాళ్లకి చంద్రబాబు, లోకేష్ మాట్లాడే మాటలు వినిపించడం లేదా?. చంద్రబాబు దండగ అన్న వ్యవసాయాన్ని సీఎం జగన్ పండగ చేశారు. 2 ఎకరాల నుంచి 2 లక్షల ఎకరాలు ఎలా సంపాదించావు?. ఎన్టీఆర్ వారసులు అందరూ సామాన్యుల్లా బ్రతుకుతున్నారు. ఎన్టీఆర్ ఆస్తి అంతా నీకు పంచి ఇచ్చారా?. రైతులను మోసం చేసి, పేదలను సర్వనాశనం చేసిన 420 చంద్రబాబు. ఓ అవినీతి చక్రవర్తి చంద్రబాబు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన సైకో చంద్రబాబు అంటూ సంచలన విమర్శలు చేశారు. -
ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్ ఏంటి? నీ బాడీ లాంగ్వేజి ఏంటి?
-
‘లోకేష్.. నువ్వు నేర్చుకున్న చదువు ఇదేనా?’
సాక్షి, తాడేపల్లి: తనది ఎన్టీఆర్ గొంతు అని టీడీపీ నేత నారా లోకేష్ అంటున్నాడు. మాట్లాడితే ఎన్టీఆర్ వారసుడిని అంటాడు.. ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్ ఏంటి? నీ బాడీ లాంగ్వేజ్ ఏంటి?. అసలు ఎక్కడైనా పోలిక ఉందా?. తెలుగు వారి ఆత్మగౌరవం అంటూ చేతిని సూటిగా చూపిస్తారు ఎన్టీఆర్. మరి నీ తండ్రి చంద్రబాబు రెండువేళ్లూ ఊపుతూ చూపితే అది ఊళ్ళల్లో చెప్పినట్టు లండన్(బాత్ రూమ్)కు వెళ్లొస్తా అన్నట్లుగా ఉంటుంది. నీ స్థాయి అంత కన్నా కిందికి దిగజారి చేతిని అలా ఇలా అని అసభ్యంగా ఊపుతూ దిక్కుమాలిన సంజ్ఞలు చేయడం చూస్తే జనం ఛీదరించుకుంటున్నారు.. ఏంటీ ఈ వెర్రితనం.. పిచ్చితనం లోకేశ్?. లోకేష్.. నీవు నేర్చుకున్న చదువు ఇదేనా?. నీ తండ్రి బాబు నీకు నేర్పిన సంస్కారం ఇదేనా?. జనం నవ్విపోతారన్న సిగ్గన్నా మీకు లేదా?. డెంగ్యూ అని పలకడం రాక బూతులు పలికే నీవు చదువు గురించి, సంస్కారం గురించి మాట్లాడతావా?. ఆంధ్రప్రదేశ్‌లో లోకేశ్ యువ‘గంగాళం’ అనే ప్రాజెక్టు ఒకటి నడుస్తోంది. ఈ ప్రాజెక్టును పూర్తి చేయడం కోసం, ఒకవైపు టీడీపీ, మరోవైపు ఎల్లోమీడియా జాకీలు పెట్టి మరీ పైకి లేపాలని చూస్తోంది. మీరెంత లేపినా.. యువ‘గంగాళం’ ప్రాజెక్టుపైకి లేవదు. ఎన్నటికీ పూర్తి కానేకాదు. అది అంత అసమర్థ ప్రాజెక్టు అని జనమే తేల్చేశారు. పెయిడ్ ఆర్టిస్టులతో జనాన్ని రప్పించాలని రండి బాబూ రండి.. అని ఎంతగా బతిమాలి బామాలినా పాదయాత్రలో లోకేశ్ వెంట నడవం గాక నడవం అంటూ జనం ఆ యాత్రకు రానే రావడం లేదు. జనం రావడం లేదన్న నిరాశలో ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. నీ పాదయాత్రను పట్టించుకునే వారే లేరన్న నిరాశలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విమర్శలు చేస్తున్నావు. సీఎం జగన్ పాదయాత్ర చూసి కాపీ కొడితే.. పులిని చూసి వాతలు పెట్టుకుంటే అవుతుంది. ‘స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో లోకేష్ నిజంగానే చదివాడా?. అతని క్లాస్‌మెట్స్ పేర్లు చెప్పమంటే ఎందుకు చెప్పటం లేదు?. చంద్రబాబు.. లోకేష్‌కు బూతులు నేర్పించి రోడ్డుపైకి వదిలారు. తండ్రీకొడుకులు ఇద్దరూ ఏ సబ్జెక్ట్‌పైనా 35 మార్కులు తెచ్చుకోలేరు. ఆంధ్రప్రదేశ్ అని రాయడం రాని లోకేష్ కూడా మాట్లాడటం విడ్డూరంగా ఉంది. చంద్రబాబు రెండు వేళ్లతో వెన్నుపోటు అని చూపించడం అందరికీ తెలుసు’ అంటూ కామెంట్స్ చేశారు. -
చరిత్ర అంటే ఏంటో తెలుసా బాలయ్య..?
చరిత్ర అంటే అర్థం తెలియని వారు చరిత్ర గురించి మాట్లాడుతున్నారు. వీర సింహారెడ్డి ప్రీ రిలీజ్ షోలో బాలయ్య మాటలు చరిత్రను వక్రీకరించేలా..? చరిత్ర అంటే 1982 నుంచే ప్రారంభం అయింది అనేలా ఉన్నాయి. అజ్ఞానులు మాత్రమే ఇలా మాట్లాడతారు. "పాఠ్య పుస్తకాల నుంచి చరిత్రను తీసేయాలి" అన్నారు చంద్రబాబు. అప్పుడు ఆయన అవగాహన లేక అన్నారని అనుకున్నాను. కానీ ఆయన మాటలు వెనుక పెద్ద కుట్రే దాగి ఉంది. ఆయన ఆలోచనల వెనుక అతి పెద్ద కుట్ర నక్కి ఉంది. కొన్నేళ్లుగా చంద్రబాబు మాటలను, బాలకృష్ణ ప్రసంగాలను, ఎల్లో మీడియా రాతలను, చర్చలను చూసినట్లైతే విషయం స్పష్టంగా బోధ పడుతుంది. "చరిత్ర అంటే నిజాలను భవిష్యత్తు తరాలకు తెలియజేయడం.. చరిత్ర అంటే గత కాలం నుంచి పాఠాలు నేర్చుకోవడం.. చరిత్ర అంటే గతం నుంచి భవిష్యత్తుకు నిచ్చెనలు వేయడం.. చరిత్ర అంటే భవిష్యత్తుకు నిప్పులాంటి నిజాలతో కూడిన బంగారు బాట వేయడం". కానీ.. చరిత్ర అంటే నందమూరి చరిత్రే అన్నట్లు బాలకృష్ణ మాట్లాడటం హాస్యాస్పదంగా, జుగుప్సాకరంగా ఉంది. భారత దేశంలో 5 వేల ఏళ్ల క్రితమే హరప్పా, మొహంజోదారో నాగరికతలు పురుడు పోసుకున్నాయి. ఈ నాగరికతలు ఈజిప్ట్, రోమ్ చరిత్ర కంటే ప్రాచీనమైనవి. కానీ.. ఈజిప్ట్, రోమ్ కంటే అడ్వాన్స్డ్ నాగరికత హరప్పా, మొహంజోదారో నాగరికతలు. శ్రీకృష్ణుడు 8 వేల ఏళ్ల క్రితమే భరత ఖండంపై నడియాడాడు అని, ద్వారకా అవశేషాలు అరేబియా సముద్రంలో సజీవంగా ఉన్నాయని నాసానే ధ్రువీకరించింది. చరిత్ర అంటే ఇది. అంతకంటే ముందే.. రాముడు అయోధ్యను పాలించాడని చరిత్ర చెబుతుంది. ఇక.. మన తెలుగు నేలకు వచ్చే సరికి శాతవాహనులు, కాకతీయులు, రెడ్డి రాజ్యం, గొల్కొండ నవాబులు, నిజాం నవాబులు, పోలీస్ చర్యతో హైదరాబాద్ సంస్థానాన్ని ఇండియాలో విలీనం చేయడం ఇది చరిత్ర. మద్రాస్ రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోవడం.. కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడటం.. తెలుగు వాళ్లందరూ కలిసి ఉండాలని తెలంగాణతో కలిసి ఆంధ్రప్రదేశ్ ఏర్పడటం ఇదీ చరిత్ర. ఈ చరిత్రలో నందమూరి , నారా వంశాలు ఎక్కడున్నాయి బాలయ్య..?. నందమూరి తారక రామరావు రూ.116 కూలీ తీసుకుని సినిమాల్లో నటించారు. టిఫెన్ సరిపోవడంలేదని ప్రొడక్షన్ మేనేజర్లతో గొడవ పడి ఒక వడ ఎక్కువ వేయించుకునేవాడు ఎన్టీఆర్. సెట్లో నచ్చిన వస్తువులు, నచ్చిన డ్రెస్‌లు తీసుకెళ్లి ఇంట్లో దాచుకునేవాడు. సహజకవి, దర్శక, నిర్మాత మల్లెమాల ఆత్మ కథ చదివితే ఎన్టీఆర్ బుద్ది ఏంటో నేటి తరానికి తెలుస్తుంది. బాలయ్య.. మీ సోదరి భువనేశ్వరి పెళ్లి ఖర్చులు ఎవరూ పెట్టుకున్నారో తెలుసా..? 1970ల్లో హైదరాబాద్ శివారుల్లో నిమ్మతోటకు మొక్కలు తెచ్చి ఇచ్చింది ఎవరో తెలుసా..? దర్శక, నిర్మాత మల్లెమాల. ఆయనకు ఎన్టీఆర్ ఒక్క పైసా కూడా తిరిగి ఇవ్వలేదు. ఇదీ మీ చరిత్ర బాలయ్య. మీ ఇంట్లో కాల్పుల కేసు ఓ సారి గుర్తు తెచ్చుకో బాలయ్య. చరిత్ర అంటే అదీ. మీ ఇంట్లో కాల్పులు నిజమైన చరిత్ర. బెల్లకొండను ఎందుకు కాల్చావో నిజం చెప్పు బాలయ్య..? మీ ఇంట్లో వాచ్మెన్ ఎలా చనిపోయాడో నిజం చెప్పు బాలయ్య..? కాల్పుల కేసులు అప్పటి సీఎం వైఎస్ఆర్ కాపాడారు అని, మీ వంశ పరువును కాపాడారని పబ్లిక్ మీటింగ్‌ల్లో ఎందుకు చెప్పవు బాలయ్య..? నీకు మెంటల్ పర్టిఫికెట్ ఉందని, ఆ సర్టిఫికెట్ కోర్టులో సబ్మిట్ చేసి కాల్పుల కేసు నుంచి బయటపడ్డానని ఎందుకు చెప్పవు బాలయ్య..? బెల్లంకొండ- నీకు మధ్య సినీ, రాజకీయ పెద్దలు రాజీ కుదిర్చారని ఎందుకు మాట్లాడవు బాలయ్య..? వైఎస్ఆర్ మంచి మనసుతో వ్యవహరించకపోతే ఈ రోజున నీ పరిస్థితి ఏంటీ బాలయ్య..? ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పే ధైర్యం నీకుందా బాలయ్య..? 1953 నుంచి 1956 వరకు 1956 నుంచి 1983 వరకు ఆంధ్ర రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్‌ను కాంగ్రెస్ పాలించింది. ఢిల్లీ నుంచి పెత్తనంపై తెలుగు ప్రజలు అప్పటికే కడుపు మండి ఉన్నారు. ఇష్టమొచ్చినట్లు ముఖ్యమంత్రులను మార్చడంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. దీంతో 1983లో ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎన్టీఆర్ సమర్ధ నాయకుడే అయితే.. నాదెండ్ల భాస్కర్ రావు ఎందుకు తిరుగుబాటు చేశారు..? ఎన్టీఆర్ కేబినెట్లో మంత్రులు ఎందుకు తిరుగుబాటు చేశారు..? 1989లో ఎన్టీఆర్ ఘోరంగా ఎందుకు ఓడిపోయారు..? యుగ పురుషుడు, చరిత్ర సృష్టించిన వాడైతే ఎన్టీఆర్ ఓడిపోకూడదు కదా..? ఎన్టీఆర్‌ను 1989లో ప్రజలు ఎందుకు తిరస్కరించారు..? ఈ ప్రశ్నలకు బాలయ్య సమాధానం చెప్పాలి. ఎన్టీఆర్ దైవ సమానుడైతే.. నందమూరి వంశం గొప్పదైతే... ఎన్టీఆర్ ఎందుకు వెన్నుపోటుకు గురయ్యారు..? నారా వంశం.. నందమూరి వంశానికి వెన్నుపోటు పొడుస్తుంటే.. వెన్నుపోటు బావ వైపు ఉన్న నందమూరి వంశీకుల తొడలు కొట్టేది..? చరిత్ర పుస్తకాల్లో ఎన్టీఆర్ నాయకుడే కాదు అని రాస్తారు. నందమూరి వంశం బావకు బానిస వంశం అని భవిష్యత్తు తరాలు చర్చించుకుంటాయి. ఎన్టీఆర్ దగ్గర నుంచి చంద్రబాబు వరకూ పొత్తులు లేకుండా, అలయన్స్ లేకుండా ఎన్నికల్లో పోటీ చేసిన చరిత్ర మీకుందా..? ఈ ప్రశ్నలకు బాలయ్య సమాధానం చెప్పాలి. అన్‌స్టాపబుల్ షోను కూడా రాజకీయాలకు వాడుకుంటున్నారు. బాలయ్య - బాబు రాజకీయ పతివ్రతలమని వారికి వారే సర్టిఫికెట్లు ఇచ్చుకుంటున్నారు. వెన్నుపోటు కాదు ప్రజాస్వామ్యం కోసం తిరుగుబాటు అని చెప్పుకుంటున్నారు. నాదెండ్ల భాస్కర రావు తిరుగుబాటు చేస్తే వెన్నుపోటు, చంద్రబాబు వెన్నుపొటు పొడిస్తే ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమమా..? ఇదేనా మీరు చెప్పే చరిత్ర..? ఇదేనా బాలయ్య నీవు మాట్లాడే చరిత్ర..? ఇదేనా బాలయ్య నీవు సృష్టించిన చరిత్ర..? ఎన్టీఆర్- చంద్రబాబు - బాలయ్య ఒక తానులో ముక్కలే. వైఎస్ఆర్ స్వతహాగా డాక్టర్. పేదల డాక్టర్‌గా, రూపాయి డాక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు. సీఎంగా 108,104, ఆరోగ్య శ్రీ లాంటి విప్లవాత్మక పథకాలు చేపట్టి లక్షల మంది ప్రాణాలు కాపాడి వారి గుండెల్లో నిలిచి పోయారు. ఎన్టీఆర్ వైద్య రంగానికి ఏ సేవలు చేశారు...? బాలయ్య సమాధానం చెప్పాలి..? ఎన్టీఆర్ వర్శిటీకి వైఎస్ఆర్ పేరు పెడితే తప్పేంటో బాలయ్య చెప్పాలి..? ఆ ఒక్క సంతకం మూడున్నరేళ్లలో లక్షల కోట్లు ప్రజలకిచ్చింది. ఆ ఒక్క సంతకం గ్రామ స్వరాజ్యం దిశగా ఆంధ్రప్రదేశ్‌ను అడుగులు వేయిస్తుంది. ఆ ఒక్క సంతకం..దేశంలోనే ఏపీ తల ఎత్తుకుని తిరిగేలా చేస్తుంది. ఎన్టీఆర్, చంద్రబాబు ఎందుకు చేయలేకపోయారు..? మా రక్తం, మా కులం, మా వంశం అని తొడగొట్టడమే కానీ..మీరు పేద ప్రజలకు చేసింది ఏమైనా ఉందా..? తెలుగు దేశం పార్టీ పుట్టిన తరువాతనే ఫ్యాక్షన్ పురుడు పోసుకుంది. వేలాది మంది మీ అధికార దాహంలో తలలు తెగి పడ్డారు. వేలాది మహిళల పుస్తెలు తెగిపడ్డాయి. ఈ పాపం నందమూరి వంశానిది కాదా..? ఈ చరిత్ర గురించి నీవు ఎందుకు మాట్లాడవు బాలయ్య..? వంగవీటి రంగా హత్య గురించి ఎందుకు మాట్లాడవు..? చివరకు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి వైఎస్ జగన్ సీఎం అయిన తరువాతనే బిల్లులు చెల్లించారు. దీని గురించి పబ్లిక్ మీటింగ్‌ల్లో ఎందుకు మాట్లాడవు బాలయ్య..? చరిత్ర గురించి నీవు మాట్లాడటం కాదు బాలయ్య.. చరిత్ర గురించి ప్రజలు మాట్లాడాలి. చరిత్రను మేధావులు, విద్యావేత్తలు, ప్రజలు సర్టిపై చేయాలి. నీ నోట్లోంచే వచ్చింది చరిత్ర అంటే సమాజం ఒప్పుకోదు, హర్షించదు. బాలయ్య నీ చరిత్ర ఏంటో తెలుసా..? వెన్నుపోటు చరిత్ర, ఆడవాళ్ల పట్ల అవమానీయంగా మాట్లాడే చరిత్ర, ఇతర కులాలను నీచంగా చూసే చరిత్ర, మీది కాల్పుల చరిత్ర. ఈ చరిత్ర గురించి మాట్లాడు... కూతురు వయసున్న అమ్మాయిల నడుము గిల్లి, బుగ్గలు గిల్లీ..డాన్స్‌లు వేసే నీకు చరిత్ర గురించి ఏం తెలుస్తుంది బాలయ్య..?!. అది బాలయ్య మీ చరిత్ర.. మీ నందమూరి చరిత్ర. - వెంకటేశ్వర్ పెద్దిరెడ్డి, రాజకీయ, సామాజిక విశ్లేషకులు -
ఎన్టీఆర్ అందుకే వెన్నుపోటుకు గురయ్యారు: వెంకయ్య నాయుడు
సాక్షి, గుంటూరు: దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావుపై మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. సీనియర్ ఎన్టీఆర్ అందుకే వెన్నుపోటుకు గురయ్యారు అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. కాగా, వెంకయ్యనాయుడు శనివారం తెనాలిలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. కుట్రలు, కుతంత్రాలు ఎన్టీఆర్ గమనించలేకపోయారు. రాజకీయాల్లో ఎన్టీఆర్ భోళా మనిషి. అందుకే వెన్నుపోటుకు గురయ్యారు. ఎన్టీఆర్ రాజకీయాల్లో సైలెంట్ విప్లవాన్ని తెచ్చారు. పేదల సంక్షేమానికి అనేక పథకాలు తెచ్చారు అంటూ కామెంట్స్ చేశారు. -
టీడీపీ నేతల్లో కొత్త టెన్షన్.. ఇదేం కర్మరా బాబు?
40 ఏళ్ళ క్రితం ఏర్పడిన టీడీపీకి ఎంత కర్మ పట్టిందంటూ ఆ పార్టీ శ్రేణులు తలలు పట్టుకుంటున్నాయి. అలాగే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే తమ నేతకు ఇదేం కర్మ అంటూ తలలు బాదుకుంటున్నారు. ఇదేం కర్మ అంటూ ప్రారంభించిన ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించడానికి టీడీపీ శ్రేణులు ఎందుకు వెనకాడుతున్నాయి? ఆ టైటిల్‌తో పచ్చ పార్టీ నాయకులకు వచ్చిన ఇబ్బందేంటి? టైటిల్‌తో చంపేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజాందోళన చేపట్టాలనుకుంటున్నా తెలుగుదేశానికి ప్రతిసారీ చుక్కెదురవుతోంది. గత నెలలో చేపట్టిన బాదుడే బాదుడు కార్యక్రమం రివర్సయింది. రాష్ట్రంలో ఎక్కడా ప్రజలు టీడీపీని పట్టించుకోలేదు. ఇప్పుడు ఇదేమి కర్మ అంటూ మరో కొత్త కార్యక్రమాన్ని తెర మీదకు తెచ్చింది. ఈ స్లోగన్‌తో ప్రభుత్వాన్ని విమర్శిస్తూ.. డిసెంబర్ రెండో తేదీ నుంచి ప్రజల్లోకి వెళ్ళాలని పచ్చ పార్టీ శ్రేణుల్ని ప్రజల్లోకి వెళ్ళాలంటూ చంద్రబాబు ఆదేశించారు. అయితే ఇదేం కర్మ అనే టైటిల్‌తో ప్రజల్లోకి వెళ్ళడానికి తెలుగుదేశం నాయకులు వెనకాడుతున్నారు. మాకిదేం కర్మ అంటూ పెదవి విరుస్తున్నారు. ప్రజల్లోకి వెళ్ళేందుకు ఇదేమి కర్మ స్లోగన్ అస్సలు బాగోలేదని..మరొక పేరు నిర్ణయించాలని టీడీపీ నేతలు చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన అనేక కార్యక్రమాలకు, చంద్రబాబు నాయుడు పాదయాత్రకు మంచి పేర్లు ఎంపిక చేసిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. పేరు మార్చకపోతే జనంలోకి వెళ్ళడానికి కష్టంగా ఉంటుందని నాయకులంతా ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సంకుచిత నినాదాలు చంద్రబాబు నాయుడి బ్రెయిన్ చైల్డ్ కార్యక్రమం ఇదేమి కర్మ కార్యక్రమం ప్రారంభం కాకుండానే సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీపై సెటైర్లు మొదలయ్యాయి. చంద్రబాబు ఎంట్రీ ఇవ్వడంతోనే తెలుగుదేశం పార్టీ కర్మ కాలిందని.. నెటిజన్లు టీడీపీని ఆట ఆడుకుంటున్నారు. సీఎం జగన్ బహిరంగ సభల్లో చంద్రబాబును ఉద్దేశించి మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ పాలనే ఒక కర్మని ప్రజలు అనుకుంటున్నారని.. చంద్రబాబు ఇదే టైటిల్ పెట్టడం తమ కర్మ అని సొంత పార్టీ వారే తలపట్టుకునేలా చేస్తున్నారన్నారని వ్యంగాస్త్రాలు సంధిస్తున్నారు. చంద్రబాబును.. కుటుంబంలోనూ, తర్వాత పార్టీలోనూ చేర్చుకున్నందుకు.. మంత్రి పదవి ఇచ్చినందుకు ఆ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ఇదేం కర్మ అని అనుకుని ఉంటారని.. కుప్పంతో సహా రాష్ట్రం అంతటా స్థానిక ఎన్నికల్లో ఓడిపోయినందుకుగాను చంద్రబాబు ఇదేం కర్మ అని తలపట్టుకుని కూర్చున్నాడని సీఎం జగన్ సెటైర్లు వేస్తున్నారు. చంద్రబాబును చూసి సొంత పుత్రుడు, దత్తపుత్రుడు ఇదేం కర్మ అని అనుకుంటున్నారని.. టీడీపీ నేతల ధోరణి చూసి రాష్ట్ర ప్రజలంతా వీళ్ళకి ఏం కర్మ పట్టిందని చర్చించుకుంటున్నారంటూ ఒక రేంజ్లో సీఎం జగన్.. టీడీపీని ఆడేసుకుంటున్నారు. పచ్చ కామెర్ల వాళ్లకు లోకమంతా.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజలంతా ప్రభుత్వానికి సానుకూలంగా ఉన్న తరుణంలో.. టీడీపీ ప్రారంభించబోతున్న ఇదేం కర్మ కార్యక్రమం.. ఆ పార్టీ కర్మకొచ్చిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అటు ముఖ్యమంత్రి, ఇటు మంత్రులు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబు గాలి తీసేస్తున్నారు. ఒక వైపు నెటిజన్లు.. మరోవైపు అధికార పార్టీ వేస్తున్న సెటైర్లతో టీడీపీ నేతలు ఈ టైటిల్‌తో ప్రజల్లోకి వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారు. అయితే చంద్రబాబు మాత్రం.. డిసెంబర్ రెండో తేదీ నుంచి ఇదేం కర్మ టైటిల్ తోనే ప్రజల్లోకి వెళ్లేందుకు నేతలు అంతా సిద్ధంగా ఉండాలని ఆదేశిస్తున్నారు. చంద్రబాబు ఆదేశాలు టీడీపీలో అమలవుతాయా? బాదుడే బాదుడు కార్యక్రమం మాదిరిగా మధ్యలో ఆగిపోతుందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com. -
‘అమ్మాయిల పిచ్చి రూమర్’పై స్పందించిన కాంతారావు కూతురు
టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రనటుడిగా ఓ వెలుగు వెలిగాడు కాంతారావు. హీరోగా, సహాయ నటుడిగా ఎన్నోరకాల పాత్రలు పోషించి విశేష పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఆయన ఎంతగానో ఆస్తులు పోగేశాడు. కానీ తర్వాతి కాలంలో నిర్మాతగా మారి ఆస్తులు పోగొట్టుకున్నాడు. ఈ క్రమంలో 400 ఎకరాలను పోగొట్టుకున్నాడు. కాంతారావు కూతురు సుశీల రావు మాట్లాడుతూ.. 'నాన్నగారి చిన్నతనంలోనే తాతయ్య చనిపోయాడు. దీంతొ నానమ్మ నాన్నను గారాబంగా పెంచింది. ఎవ్వరు ఏం చెప్పినా తనకు నచ్చిందే చేసేవాడు. నిర్మాణ రంగం వైపు వెళ్లొద్దని ఎన్టీ రామారావు గారు చెప్పారు, కానీ ఆయన వినిపించుకోలేదు. సినిమాల కోసం 400 ఎకరాలు అమ్మేశారు. అలా సినిమాలు నిర్మించి చాలా నష్టపోయారు. నష్టపోయిన తర్వాత మాత్రమే ఎన్టీఆర్ మాట వినుంటే బాగుండేదని అనుకున్నారు. అప్పుడు కృష్ణ- విజయనిర్మలగారు మా ప్రతి సినిమాలో కాంతారావుకు ఓ వేషం ఇప్పిస్తామన్నారు. ఆ మాట నిలబెట్టుకున్నారు. నా పెళ్లి కోసం కృష్ణగారు రూ.10 వేల ఆర్థిక సాయం చేశారు. నాన్నకు సినిమా తప్ప వేరే ప్రపంచం తెలియదు. చచ్చేదాకా నటిస్తూ ఉండాలన్నదే ఆయన కోరిక. కాంతారావుకు ఆడవాళ్ల పిచ్చి ఉంది, దానివల్లే ఉన్నదంతా పోగొట్టుకున్నారని ఓ రూమర్ ఉంది. అది పూర్తిగా అవాస్తవం. ఆయనకు సినిమాలు, ఇల్లు ఈ రెండే తెలుసు. ఏ హీరోయిన్‌కూ డబ్బులివ్వలేదు' అని క్లారిటీ ఇచ్చింది సుశీల. -
‘బాలకృష్ణ అసమర్థుడు, అమాయకుడు.. నారా లోకేశ్ హాస్యనటుడులాంటి వ్యక్తి’
సాక్షి, తాడేపల్లి: టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ నేత నారా లోకేశ్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై మంత్రి అంబటి రాంబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుపై సంచలన విమర్శలు సైతం గుప్పించారు. కాగా, మంత్రి అంబటి రాంబాబు శనివారం మీడియాతో మాట్లాడుతూ.. బాలకృష్ణ అసమర్థుడు, అమాయకుడు. కుట్రలు, కుతంత్రాలతో అందలం ఎక్కిన వ్యక్తి చంద్రబాబు. వెన్నుపోటు రక్తపుమరకను తుడుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. టాక్షోతో చంద్రబాబు మరింత దిగజారిపోయారు. టీడీపీ నేత నారా లోకేశ్ హాస్యనటుడులాంటి వ్యక్తి. చంద్రబాబు తన స్వార్థంకోసమే టాక్‌షోకు హాజరయ్యారు. వినకపోతే జుట్టుపట్టుకుని లాగామని చంద్రబాబు అంటే.. అది న్యాయమే, ధర్మమే అని బాలకృష్ణ అంటున్నారు. ఎన్టీఆర్ మరణం కరెక్ట్ అని మీరంటుంటే జనం నమ్మాలా?. లోకకల్యాణం కోసమే ఎన్టీఆర్‌ను దించేశారా?. చంద్రబాబు.. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు అని ప్రశ్నించారు. ఒకవేళ ఎన్టీఆర్.. మరణించకపోయి ఉంటే నీ పరిస్థితి ఏంటి అని ప్రశ్నలు సంధించారు. ఈ క్రమంలోనే అమరావతి పాదయాత్ర గురించి స్పందిస్తూ.. చంద్రబాబు ఫేక్ యాత్రను చూసి ఉత్తరాంధ్ర ప్రజలు చైతన్యవంతమయ్యారు, పోరాటపటిమను పెంచుకుంటున్నారు. టీడీపీ చేసిన తప్పిదాలను ప్రజలు గమనిస్తున్నారని స్పష్టం చేశారు. -
మ్యాగజైన్ స్టోరీ : వెన్నుపోటు తప్పా బావా...?
-
ఎన్టీఆర్ ను క్షోభపెట్టేశారు
-
ఆ హీరోయిన్ను రెండో పెళ్లి చేసుకోవాలనుకున్న సీనియర్ ఎన్టీఆర్
సీనియర్ ఎన్టీఆర్ ఏ పాత్రలో నటించినా ఆ పాత్రకే వన్నె వస్తుందనడంలో అతిశయోక్తి లేదు. ఆయన భగవంతుడిగా వేషం కట్టినప్పుడయితే.. నిజంగానే ఆ దేవుడే ఈయన రూపంలో ఉన్నాడేమో అనేంతగా తేజస్సుతో ఉట్టిపడేవారు. ఎంతోమంది ఆయన్ను దైవంగా కొలిచేవారు కూడా! ఇక సీనియర్ ఎన్టీఆర్ నిజ జీవిత విషయానికి వస్తే ఆయన మొదటి భార్య పేరు బసవతారకం. వీరికి 12 మంది సంతానం. సినిమా షూటింగ్స్ సమయంలో ఎన్టీఆర్ హీరోయిన్ కృష్ణ కుమారితో లవ్‌లో పడ్డారు. ఆమెను పెళ్లి కూడా చేసుకుందామనుకున్నారు. ఆనాటి వారి ప్రేమ విషయాన్ని గతంలో ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది కృష్ణ కుమారి సోదరి, నటి షావుకారు జానకి. 'ఎన్టీఆర్- కృష్ణ కుమారి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారంటూ ఓ టాక్ నడిచింది. కానీ అప్పటికే ఆయనకు 11 మంది పిల్లలు. నిజంగా వీరి పెళ్లి జరిగి ఉంటే నా చెల్లెలికి అంత శ్రేయస్కరంగా ఉండేది కాదేమో! అయితే వీళ్లు విడిపోయారో, గొడవపడ్డారో తెలీదు కానీ, కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలో కృష్ణ కుమారి ఒక్క ఫోన్ కాల్‌తో 17 సినిమాలు క్యాన్సిల్ చేసుకుంది. తర్వాత ఆమె ఓ సీనియర్ జర్నలిస్ట్ అజయ్ మోహన్ కైఠాన్‌ను పెళ్లి చేసుకుంది. కానీ అప్పుడు ఓ బడా నిర్మాత ఫోన్ చేసి కైఠాన్‌తో మీ చెల్లి పెళ్లి ఆపండన్నారు. కానీ నేను ఆ పని చేయనని చెప్పాను' అంటూ ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది షావుకారు జానకి. చదవండి: కార్తికేయ 2 ఈ ఓటీటీలోకే రాబోతోంది! బ్రెయిన్ పని చేయని స్థితిలో కమెడియన్ -
సీనియర్ ఎన్టీఆర్‌గా తారక్‌ను అందుకే తీసుకోలేదు: అశ్వినీదత్
దివంగత నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా మహానటి. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కీర్తి సురేష్ నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమానే కీర్తికి స్టార్ హీరోయిన్ అన్న ఇమేజ్ను తీసుకొచ్చింది. ఓవర్ నైట్ స్టార్డమ్తో కీర్తి కెరీర్లో ది బెస్ట్ మూవీగా నిలిచిందీ సినిమా. అంతేకాకుండా జాతీయ అవార్డును సైతం అందుకుంది ఈ చిత్రం. ఈ చిత్రంలో శివాజీ గణేశన్ పాత్రలో దుల్కర్ సల్మాన్ నటించగా, అక్కినేని నాగేశ్వర రావు పాత్రను ఆయన మనవడు, యంగ్ హీరో నాగ చైతన్య పోషించి మెప్పించిన విషయం తెలిసిందే. కానీ నట సార్వభౌముడు సీనియర్ ఎన్టీఆర్ పాత్రను మాత్రం ఎవరూ చేయలేదు. ముందుగా సీనియర్ ఎన్టీఆర్ రోల్లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించాల్సింది. పలు కారణాల వల్ల అలా కుదరలేదని ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ తాజాగా తెలిపారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ''మహానటి చిత్రంలో ఎన్టీఆర్ పాత్రను తారక్‌తో చేయిద్దామని అనుకున్నాం. కానీ ఈలోగా బాలకృష్ణ గారు ఎన్టీఆర్ బయోపిక్ ప్రకటించారు. దీంతో మా సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ పాత్రలో ఎవరిని పెట్టి తీసినా తప్పుగా భావిస్తారేమో అని అనిపించింది. ఒకవేళ తారక్ చేసినా బాగుండదేమో అని కూడా అనిపించింది. నాగ్ అశ్విన్‌తో చెబితే అసలు ఆయన పాత్ర లేకుండానే తీస్తా అని చెప్పి తెరకెక్కించాడు. ఆయన పాత్రకు రాజేంద్ర ప్రసాద్ డబ్బింగ్ చేప్పారు. మిగతా అంతా మేనేజ్ చేశాం'' అని వెల్లడించారు. చదవండి: హైదరాబాద్ పోలీస్ అకాడమీలో నాజర్‌కు గాయాలు ! నేనేం స్టార్ కిడ్‌ను కాదు, మూడేళ్ల తర్వాత..: పాయల్ రాజ్‌పుత్ సుమారు నాలుగేళ్ల తర్వాత అలా శ్రావణ భార్గవి! -
కార్యశూరుడూ – కామమ్మ మొగుడు
ఎదిగే పిల్లల మధ్య పోలికలు తేవద్దంటారు మానసిక నిపుణులు. ఇది పెంపకానికి సంబంధించిన సూత్రం. ఎంపిక చేసుకోవడానికి సంబంధించిన సూత్రం మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉంటుంది. అది కూరగాయల ఎంపికైనా సరే... ఇంకే కొనుగోలు వ్యవహారమైనా సరే! ఎందుకంటే ‘డబ్బులు ఊరికే రావు కదా’! నిగనిగలాడే బోడిగుండుతో ఒకాయన ప్రతిరోజూ టీవీల్లో కనపడి ఈ విషయంపై హెచ్చరిస్తూనే ఉంటాడు. ఈ ఒక్క క్యాంపెయిన్‌తో ఆయన యాంకర్ సుమతో సమానమైన పాపులారిటీ తెచ్చుకోగలిగారు. తన వ్యాపారాన్ని పెంచుకో గలిగారు. అట్లుంటది మరి పబ్లిసిటీతోటి! బ్రాండింగ్, పబ్లిసిటీ, మార్కెటింగ్‌ల సహకారంతో పుచ్చు కూరలూ, పచ్చళ్లు కూడా అమ్ముకోవచ్చు. అలాగే సొంత మీడియా చేతిలో ఉంటే నాయకుల్ని తయారుచేయవచ్చు, వీలైతే గద్దెపై కూడా కూర్చోబెట్టొచ్చునన్న ఆలోచన నేటి యెల్లో మీడియా ఆద్యులకు ఆనాడే వచ్చింది. ‘ఓన్లీ విమల్’ అనే ఒకే ఒక్క యాడ్ క్యాంపెయిన్ టెక్స్‌టయిల్ సింహాసనంపై నుంచి ‘రేమండ్స్’ను దించేసి, ‘రిలయన్స్’ను కూర్చోబెట్టింది. ఈ దృష్టాంతం వారికి స్ఫూర్తినిచ్చి ఉండవచ్చు. ‘ఓన్లీ ఎన్టీఆర్’ తరహా ప్రచారంతో కాంగ్రెస్ కోటను కూల్చగలిగారు. తెలుగు దేశం పార్టీని అధికారంలోకి తేగలిగారు. ఆయన నిజంగానే ‘ఓన్లీ ఎన్టీఆర్’. ఒన్ అండ్ ఓన్లీ పీస్! పబ్లిసిటీ తోడవగానే కార్యసాధకుడు కాగలిగాడు. ఎన్టీఆర్‌తో తమ సొంత ప్రయోజనాలకు పెద్దగా ఉపయోగం లేదనుకున్న యెల్లో ముఠా ఆయన్ను వదిలించుకొని బాబును గద్దెపై కూర్చోబెట్టడం మనకు తెలిసిన గతం. ప్రత్యామ్నాయ మీడియా లేకపోవడం వల్ల ఏకపక్ష రాతలతో ఈ పరిణామం సాధ్యమైంది. ఈ బాబు స్వతహాగా ఓన్లీ బాబు కాదు, శతకోటి బాబుల్లో చంద్రబాబొకరు! జస్ట్ యావరేజ్. కాకపోతే పాలిటిక్స్‌లో ఇతనిది మాకివెలియన్ స్కూల్. అడ్డదారిలోనైనా లక్ష్యాన్ని చేరాలనే తత్వం. చేతికందిన అధికారాన్ని సొంత ప్రయోజనాల కోసం, ముఠా ప్రయోజనాల కోసం యథేచ్ఛగా వాడుకోగల దూకుడు స్వభావం. ఈ స్వభావం ఫలితంగా బాబుకూ, యెల్లో మీడియా పెద్దలకూ మధ్య ఒక రసాయనిక బంధం ఏర్పడింది. యెల్లో ముఠా పోస్టర్ బాయ్‌గా బాబు అవతరించాడు. చంద్రబాబును ఓన్లీ బాబుగా, ఒన్ అండ్ ఓన్లీ పీస్‌గా భ్రమింపచేయడానికి యెల్లో ముఠా చేయని ప్రయత్నం లేదు. జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో కూడా లాబీయింగ్ చేసి మీడియా మేనేజ్మెంట్కు కూడా దిగజారారు. ఆయన్నొక విజనరీగా చిత్రించడానికి ఆపసోపాలు పడ్డారు. ఈ విజనరీ హయాంలో వ్యవసాయ భూములు బీళ్లుగా మారాయి. పంట పొలాల్లో రైతుల చితిమంటలు వెలిగాయి. లక్షలాదిమంది పేదబిడ్డలు చదువుకొనలేక డ్రాపవుట్లుగా మిగిలిపోయారు. పంతుళ్లకూ, పాఠాలకూ దూరమైన ప్రభుత్వ స్కూళ్లు పాడుబడి పోయాయి. ఆరోగ్యం అంగడి సరుకైంది. రోగం రాకడ... ప్రాణం పోకడగా పేదల పరిస్థితి దిగజారింది. ఇటువంటి వల్లకాటి అధ్వాన్న శకాన్ని బాబు బ్రాండ్ వైభవోజ్జ్వల మహా యుగంగా యెల్లో మీడియా చిత్రించింది. ఈ తరహా చిత్రీకరణ ఇంకా కొనసాగుతూనే ఉన్నది. నిజం చెప్పాలంటే ఆయనొక విఫల ప్రయోగం. ఆ విఫల ప్రయోగాన్ని విజయగాథగా చరిత్రలోకి జొప్పించే కుట్రలు జరుగుతున్నాయి. విధ్వంసకర విధానాల కృతికర్తకు అభివృద్ధి భుజకీర్తులు తగి లించి, ఇంకా స్తోత్రాలు పఠిస్తూనే ఉన్నారు. పళ్లూడి దవడలు జారిన వృద్ధ రంగస్థల నటికి ఊర్వశి వేషం కట్టి లొట్టలేసుకుంటూ చూడాలని ఇంకా ఆర్డర్లు వేస్తూనే ఉన్నారు. నిలువెత్తు స్వార్థ ప్రతిమపై జలతారు మేలిముసుగులు కప్పుతున్నారు. వికృత అవినీతి రూపానికి కాస్మెటిక్ సర్జరీ చేసి సింబల్ ఆఫ్ ఇంటిగ్రిటీగా నమ్మాలని ఆదేశిస్తున్నారు. ‘కామమ్మ మొగుడంటే కామోసు అనుకున్నా’డనే సామెతొ కటి ఉన్నది. పూర్వం ఒక దొంగసాధువు ఒక ఊరి కొచ్చాడట. ఓ గ్రామస్థుడతనికి ఎదురయ్యాడు. చాలాకాలం క్రితం పారి పోయిన కామమ్మ మొగుడి పోలికలు ఆ సాధువులో గ్రామ స్థుడికి కనిపించాయి. ఇంకేముంది ఇదిగో పులి అదిగో తోక! ఆనోటా ఈనోటా అదే మాట. తాను నిజంగానే కామమ్మ మొగుడినని దొంగస్వామి డిసైడై కాపురం చేద్దామని బయల్దే రాడట. సదరు కామమ్మ గట్టిగా నిలదీసేసరికి ‘నాకేం తెలుసు, అందరూ కామమ్మ మొగుడంటుంటే కామోసు అనుకున్నాన’ని వాపోయాడట! చంద్రబాబును ఒక సూపర్ బ్రాండ్‌గా నిలబెట్టడం కోసం గత పాతికేళ్లుగా యెల్లో మీడియా రాసిన కవిత్వమంతా ఆయన మెదళ్లోకి బాగా ఎక్కిపోయింది. అదంతా నిజమేనని నమ్మడం మొదలుపెట్టారు. ఆ భ్రమలోంచే ఆయన అనేక ఆణిముత్యా లను నోటి వెంట తుపుక్కు తుపుక్కుమని పలుమార్లు వెదజల్లారు. ఈ దేశానికి సెల్‌ఫోన్‌ను పరిచయం చేసింది తానేనని చెప్పారు. సత్యా నాదెళ్లను ఐటీలో ప్రోత్సహించింది తానేనని చెప్పారు. పీవీ సింధుకు మోటివేషన్ గురువు తానేనని చెప్పారు. అబ్దుల్ కలామ్‌ను రాష్ట్రపతిని చేసింది తానేనని అనేకసార్లు అన్నారు. బస్సులో కూర్చొని తాను తుపాన్లను కంట్రోల్ చేశానన్నారు. ‘నేను ముఖ్యమంత్రిగా ఉంటే కరోనా వచ్చేదా తమ్ముళ్లూ’ అని ప్రశ్నించి కరోనా కూడా తనను చూసి పారిపోతుందని పరోక్షంగా చెప్పారు. గతంలో తాను రెయిన్‌గన్ చేతబూని, కరువు రక్కసిని తరిమి తరిమి కొట్టానని ప్రకటించుకున్నారు. వేరేవాళ్లెవరైనా ఇటువంటి మాటలు మాట్లాడితే వినేవాళ్లు ఏమనుకుంటారు? పూర్వకాలంలో పండుగలకూ పబ్బాలకూ గ్రామాల్లో అడుక్కోవడానికి పలురకాల వేషాలతో పలువురు యాచకులు వచ్చేవారు. వారిలో పిట్టల దొర పాత్ర ఒకటి. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఈ పాత్రను ‘లత్కోర్ సాబ్’ అని కూడా పిలుస్తారు. ‘మన్నించండి మారాజా ఆలస్యమైంది. ఏం జేస్తాం మారాజా... పొద్దున లేవంగనే పీఎమ్ ఫోన్, సీఎం ఫోన్, ప్రెసిడెంట్ ఫోన్, గవర్నర్ ఫోన్... వాళ్లందరికీ సర్దిచెప్పి, సలహా చెప్పి, ధైర్యం చెప్పేసరికి పొద్దుపోయింది. బయటకొచ్చి చూస్తే విమానం తోలే డ్రైవర్ రాలే, హెలికాప్టర్ టైర్ల గాలి లేదు. అందుకని నడుచుకుంట వచ్చేసరికి లేటైంది మారాజా...’ ఇట్లా ప్రారంభమౌతాయి పిట్టల దొర డైలాగులు. విదూషకుని మాటలు కనుక జనం కూడా నవ్వుకునేవారు. విదూషకుని మాటల్లానే విజనరీ నేతల మాటలు కూడా ఉంటే ఏం చేయాలి? నవ్వాలా... ఏడవాలా? జనానికి ఇదో సందిగ్ధావస్థ. యెల్లో మీడియాకు, దాని అనుంగు కూటమికి ఇప్పుడు చాలా పెద్ద కష్టమొచ్చిపడింది. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల్లో ఎలాగైనా చంద్రబాబును గెలిపించాలి. గెలిపిం చకపోతే దెబ్బకు ఠా దొంగల ముఠా! ఇక యెల్లో ముఠా ఆగడాలకు ముకుతాడు పడినట్లే! అందు కని చావోరేవో తేల్చుకునే పోరుకు తెగించారు. గెలవాలంటే ఏకకాలంలో రెండు పనులు జరగాలి. జావగారిపోతున్న చంద్రబాబు పర్సనాలిటీకి బిగదీసి ప్యాడింగ్ చేయాలి. సకలజన సాధికారత పథకాలతో పెరిగిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇమేజిని డ్యామేజీ చేయాలి. యెల్లోమీడియా, దాని మిత్ర బృందాలు ఈ కర్తవ్య సాధన కోసం కంకణాలు కట్టుకున్నాయి. మూడు షిప్టులూ పనిచేస్తున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిత్యం అసత్యాలను పోగేసి కాకమ్మ కథలను అచ్చేస్తున్నాయి. యెల్లో మీడియా గ్రూప్ లీడరైన ‘ఈనాడు’ రాస్తున్న బేతాళ కథనాలను సాక్ష్యాధారాలతో చీల్చిచెండాడుతూ ‘సాక్షి’ పత్రిక నిజానిజాలను నిగ్గుతేల్చుతున్నది. అయినా సరే, ‘నవ్విపోదురు గాక నాకేటి వెరపు’ అన్నట్లున్నది ‘ఈనాడు’ ధోరణి. సందర్భం ఏదైనా సరే, స్పందనలు ఎలా ఉన్నా సరే.. చంద్రబాబు రైట్. ముఖ్యమంత్రి రాంగ్. ఇదీ యెల్లో మీడియా రూల్ బుక్‌లో మొదటి పాఠం. మొన్నటి గోదావరి వరదల సందర్భాన్నే తీసుకుందాము. ప్రకృతి విపత్తులను ఎదు ర్కోవడం, సహాయ – పునరావాస చర్యల కోసం ‘డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ (డీఆర్ఆర్) పేరుతో ఐక్యరాజ్య సమితి నిర్దిష్టమైన విధివిధానాలను రూపొందించింది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు తమ అవసరాలకు తగ్గట్టుగా ఈ విధానాలను పాటిస్తాయి. అంతర్జాతీయ స్థాయి నిపుణులు రూపొందించిన విధానాలు ఇవి. వరదలు రాగానే ముఖ్యమంత్రి కలెక్టర్ల నేతృత్వంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని రంగంలోకి దించారు. సహాయ – పునరావాసాలకు అవసరమైన అన్ని వనరులనూ వారికి అందుబాటులో ఉంచారు. ఇతర జిల్లాల నుంచి కూడా అవసరమైనంత మేరకు సిబ్బందిని తరలించారు. ముఖ్యమంత్రి రాజధాని కేంద్రంలో నిరంతరం అందుబాటులో ఉండి కార్యక్రమాలను పర్యవేక్షించారు. మొదటిరోజో, రెండోరోజో ముఖ్యనేత ఆ ప్రాంతాలను సందర్శిస్తే ముఖ్యనేత పర్యటన ఏర్పాట్లలో యంత్రాంగం మునిగిపోతుందని, ఇది వాంఛనీయం కాదని నిపుణులు చెబుతారు. పలు దేశాలు ఈ పద్ధతిని పాటిస్తాయి. వైఎస్ జగన్ ఈ పద్ధతిని అనుసరిస్తూనే దీన్ని మరింత సృజనాత్మకం చేశారు. వారం రోజుల తర్వాత తాను వరద ప్రాంతాలను సందర్శి స్తానని, తమకు ప్రభుత్వ సాయం అందలేదనే గొంతు అప్పుడు వినపడకూడదనే షరతును ముఖ్యమంత్రి అధికారులకు విధించారు. దీంతో అధికార యంత్రాంగం అహోరాత్రులు శ్రమించి చరిత్రలో ఎన్నడూ లేనంత సమర్థంగా సహాయ చర్యల్ని చేపట్టింది. వైపరీత్యాల తర్వాత వారం రోజులకు ప్రభుత్వాధినేతలు పర్యటనకు వెళ్లడం మన దేశంలో ఒక సాహసం. సహాయక చర్యలు అందని ప్రజలు తీవ్ర ఆగ్రహా వేశాలతో ఉంటారు. వారిని సముదాయించడం శక్తికి మించిన పనవుతుంది. మొదటి రెండు మూడు రోజుల్లో వెళ్లొస్తే ఈ పరిస్థితులు ఎదురుకావు. కానీ విచిత్రంగా వారం రోజుల తర్వాత పర్యటనకు వెళ్లినా జగన్‌ను బాధితులు ఆత్మబంధువు లాగానే స్వాగతించారు. ఒక్కరంటే ఒక్కరు కూడా తమకు సాయం అందలేదని చెప్పలేదు. ఇందుకు కారణం ముఖ్య మంత్రి అనుసరించిన శాస్త్రీయ కార్యాచరణ. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతిష్ఠను దెబ్బతీసే రాతలు రాయడం, చంద్రబాబు ఇమేజిని పెంచే ప్రచారం చేయడం అనే యెల్లోమీడియా ఎత్తుగడ ఆత్మహత్యాసదృశం కాబోతున్నది. గతించిన కాలం మాదిరిగా యెల్లో మీడియా ఆడింది ఆట పాడింది పాట అనే పరిస్థితులు ఇప్పుడు లేవు. ప్రత్యామ్నాయ మీడియా ఉన్నది. సోషల్ మీడియా ఉన్నది. రకరకాల మార్గాల్లో ప్రజలకు నిజానిజాలు తెలుస్తున్నవి. వైఎస్ జగన్, చంద్ర బాబుల వ్యక్తిత్వాల పట్ల ప్రజలకు స్పష్టమైన అవగాహన ఉన్నది. వ్యక్తిత్వంలోగానీ, విజన్‌లో గానీ, పాలనా సామ ర్థ్యంలోగానీ, పారదర్శకతలో గానీ, సామాజిక దృక్పథంలోగానీ జగన్ ముందు చంద్రబాబు సరితూగలేడు. ప్రజలకిచ్చిన ఒకే ఒక్క మాట కోసం ఆనాడు సర్వ శక్తిమంతురాలైన భారత సామ్రాజ్ఞి హుకుంనామాను ధిక్క రించిన ధీశాలి జగన్. ఆ మార్గంలో వెళితే కష్టాల పాలవుతాననీ, కడగండ్లెదురవుతాయనీ తెలిసినా వెనుకడుగేయని మనో నిబ్బరం జగన్ సొంతం. నమ్మి చేరదీసిన మామను గొంతుకోసి గద్దెనెక్కిన కుటిల స్వభావం చంద్రబాబుది. నిరంతరం కుట్రలూ, కూహకాలలో మునిగితేలుతూ అధికారాన్ని కాపాడుకునే దుర్నీతి బాబుది. అధికారం కోసం అలవిమాలిన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మ్యానిఫెస్టోను మాయం చేసి హామీలను అటకెక్కించే మోసపూరిత నడవడి చంద్రబాబుది. ఆనాడు ‘రైతు రుణమాఫీ హామీ’ ఇవ్వకపోతే ఓడిపోతావని పలువురు హెచ్చరించినా ఓటమికైనా సిద్ధపడ తాను కానీ, నిలబెట్టుకోలేని మాటను ఇవ్వలేనని కుండబద్దలు కొట్టిన స్థిరచిత్తం జగన్‌ది. అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలోనే చేపట్టిన పరిపాలనా సంస్కరణలకు ఈరోజున దేశమంతా జైకొడు తున్నది. కరోనా మహమ్మారిని ఎదుర్కొన్న తీరు జగన్ పరిపాలనా సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది. ప్రపం చంలో ఎన్నిచోట్ల నుండి ఎన్ని ప్రశంసలు వచ్చినా వాటిని ప్రచారంలో పెట్టుకోకపోవడం జగన్మోహన్రెడ్డి వ్యక్తిత్వపు మరో ప్రత్యేకత. మూడేళ్లలో లక్షా అరవై ఐదు వేల కోట్ల రూపా యలను ప్రజలకు డీబీటీ పద్ధతిలో బదిలీ చేయడం, పైసా దుర్వినియోగం కాకపోవడం దేశంలో ఒక రికార్డు. దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలు, మైనారిటీలు, మహిళల సాధికారత కోసం అమలుచేస్తున్న ఆర్థిక, రాజకీయ ఉద్దీపన కార్యక్రమాలు ఈ దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఎన్నడూ కనీవినీ ఉండలేదు. బీసీలకు చట్టసభల్లో కూడా రిజర్వేషన్లుండాలని పార్లమెంట్లో బిల్లు పెట్టిన రాజకీయ పార్టీ ఈ దేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే. కాగా, బీసీలు జడ్జీలుగా పనికిరారని కేంద్రానికి లేఖలు రాసిన చరిత్ర చంద్రబాబుది. ఎస్సీలుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారని ఈసడించుకునే దురహంకారం చంద్రబాబు సొంతం. దళితుల్ని ఉపముఖ్యమంత్రులు, కీలక శాఖల సారథులుగా ఎంపిక చేసుకున్న సౌభ్రాతృత్వం జగన్ నైజం. స్థానిక సంస్థల్లోనూ, నామినేటెడ్ పనుల్లోనూ, పదవుల్లోనూ సగభాగం మహిళలకు కేటాయించి మంత్రివర్గంలో హోమ్ శాఖతో సహా కీలక శాఖలను కట్టబెట్టిన ఘనత జగన్ ప్రభు త్వానిది. ‘కోడలు మగపిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా’ అని మాట్లాడే పురుషాహంభావం చంద్రబాబుది. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో ఇప్పుడు విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వాటి గురించి మాట మాత్రపు ప్రస్తావనైనా లేకుండా అక్కడక్కడ దొర్లే చిన్నచిన్న పొరపాట్లపై భూతద్దాలు వేసే వికృత పాత్రికేయానికి యెల్లో మీడియా పాల్పడుతున్నది. ఎగసిపడుతున్న విప్లవ కెరటాలు దాచేస్తే దాగేవి కావు. ఎల్లో మీడియా కళ్లు మూసుకుంటే లోకం చీకటి కాబోదు! వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
ఉమామహేశ్వరి అంత్యక్రియలు.. సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు
దివంగత నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి (57) అంత్యక్రియలు ముగిశాయి. సోమవారం మృతి చెందిన ఉమకు నేడు మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించారు. తొలుత జూబ్లీహిల్స్‌లోని తన నివాసం నుంచి మహాప్రస్థానం వరకు ఆమె అంతిమయాత్ర జరిగింది. ఈ మేరకు సోదరులు నందమూరి బాలకృష్ణ, రామకృష్ణలు ఉమ పాడె మోసిన దృశ్యం అందరి చేత కంటతడి పెట్టించింది. సంప్రదాయ ప్రకారం ఉమామహేశ్వరి అంత్యక్రియలను నిర్వహించారు. ఆమె చితికి ఆమె భర్త శ్రీనివాస ప్రసాద్ నిప్పటించారు. బంధుమిత్రుల ఆశ్రునయనాల మధ్య ఉమ అంత్యక్రియలు ముగియగా ఆమెను కడసారి చూసేందుకు భారీ సంఖ్యలో నందమూరి అభిమానులు తరలివచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్ సహా ఇతర కుటుంబ సభ్యులు, సినీ రాజకీయ ప్రముఖులు హజరయ్యారు. చదవండి: నందమూరి ఫ్యామిలీకి కలిసిరాని ఆగస్టు, విషాదాలన్నీ ఈ నెలలోనే.. -
నందమూరి ఫ్యామిలీకి కలిసిరాని ఆగస్టు, విషాదాలన్నీ ఈ నెలలోనే..
దివంగత నటుడు, మాజీ సీఎం ఎన్టీఆర్ చిన్న కూతురు(నాలుగో కుమార్తె) కంఠమనేని ఉమామహేశ్వరి(57) మృతితో నందమూరి ఇంట విషాదం నెలకొంంది. సోమవారం(ఆగస్ట్ 1న) ఆమె ఆత్మహత్య చేసుకున్న సంగతి విధితమే. దీంతో ఆమెను కడసారి చూసేందుకు నందమూరి హీరోలు, బంధువులు జుబ్లీహిల్స్‌లోని ఆమె ఇంటికి వస్తున్నారు. రేపు మహా ప్రస్థానంలో ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం నందమూరి కుటుంబానికి సంబంధించిన ఓ ఆసక్తికర అంశం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. చదవండి: అప్పుడే ఓటీటీకి ‘థ్యాంక్యూ’?, స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే! గత కొంతకాలంగా నందమూరి ఇంట వరుస విషాదాలు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. 2019 హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం ఇప్పుడు తాజాగా ఉమామహేశ్వరి బలవన్మరానినకి పాల్పడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. దీంతో ఈ ఆగష్టు నెల నందమూరి ఇంటికి కలిసి రావడం లేదని, విషాదలన్ని ఈ నెలలో చోటుచేసుకుంటున్నాయంటూ చర్చించుకుంటున్నారు. కాగా హరికృష్ణ ఓ పెళ్లికి వెళుతూ నెల్లూరు సమీపంలో ఆగష్టు 29, 2019లో రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందారు. చదవండి: ‘కార్తీకేయ 2’ ప్రమోషన్స్‌కి అనుపమ డుమ్మా.. నిఖిల్ షాకింగ్ కామెంట్స్! ఇప్పుడు ఆగష్టు నెలలోనే ఉమామహేశ్వరి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అంతేకాదు రాజకీయ పరంగానే ఎన్టీఆర్‌కు ఈ ఆగస్ట్ నెల కలిసిరాలేదంటున్నారు. రాజకీయ పరంగా నాదేండ్ల భాస్కర్ మోసం, ఆయన అల్లుడు నారా చంద్రబాబు నాయుడు వెన్నుపోటు ఈ ఆగస్ట్ నెలలో చోటుచేసుకోవడం గమనార్హం. అయితే 2014 డిసెంబర్ 6న హరికృష్ణ పెద్ద కుమారుడు జానకి రామ్ రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఇలా వరుస విషాదాలు నందమూరి ఇంట చోటుచేసుకోవడంతో అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. -
తల్లి మరణంపై కీలక విషయాలు వెల్లడించిన ఉమామహేశ్వరి కుమార్తె
-
అమ్మ ఆత్మహత్య చేసుకుంది: దీక్షిత
దివంగత నటుడు నందమూరి తారకరామారావు చిన్నకూతురు ఉమా మహేశ్వరి ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు విడిచారు. ఈ విషయాన్ని ఆమె కూతురు దీక్షిత పోలీసులకు వెల్లడించింది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ఆమె గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుందని, ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిందని తెలిపింది. దీంతో మధ్యాహ్నం రెండున్నర గంటలకు దీక్షిత పోలీసులకు సమాచారం అందించింది. వెంటనే జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి చేరుకున్న పోలీసులు మూడు గంటలకు ఆమె గదిలోకి వెళ్లారు. అప్పుడు ఆమె ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించారు. కాగా అనారోగ్య సమస్యలతోనే ఆమె ఆత్మహత్య చేసుకుందని దీక్షిత పేర్కొంది. ఆత్మహత్య చేసుకున్న సమయంలో ఇంట్లో నలుగురమే ఉన్నట్లు తెలిపింది. దీక్షిత ఫిర్యాదు మేరకు పోలీసులు సెక్షన్ 174 కింద అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. కాగా సీనియర్ ఎన్టీఆర్ నాలుగో కూతురే ఉమా మహేశ్వరి. ఆమెకు ఇద్దరు కూతుళ్లు విశాల, దీక్షిత. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com చదవండి: నందమూరి ఇంట విషాదం, ఉమా మహేశ్వరి ఆత్మహత్య నాపై విష ప్రచారం, బాధగా ఉంది.. అమీర్ ఖాన్ ఆవేదన -
ఎన్టీఆర్ కుమార్తె ఉమామహేశ్వరి హఠాన్మరణం
-
నందమూరి ఇంట విషాదం, ఉమా మహేశ్వరి ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: దివంగత సీఎం, టీడీపీ వ్యవస్థాప కుడు నందమూరి తారక రామారావు చిన్న (నాలుగో) కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి(57) సోమవారం ఆత్మహత్య చేసుకున్నారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసు కుని బలవన్మరణానికి పాల్పడ్డారు. కొంతకాలంగా ఆమె అనారోగ్య సమస్యలతో పాటు మానసిక ఒత్తిడితో బాధ పడుతున్నట్లు కుటుంబసభ్యులు చెప్పారు. ఆ కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు పేర్కొన్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బేకరీ వ్యాపారంలో ఉమామహేశ్వరి.. బేకరీ ఉత్పత్తుల వ్యాపారం చేసే ఉమా మహే శ్వరి జూబ్లీహిల్స్ రోడ్ నం.9 లోని ప్లాట్ నం.73లో తన భర్త శ్రీనివాస్ ప్రసాద్‌తో కలిసి నివా సం ఉంటున్నారు. శ్రీనివాస్ ప్రసాద్ వ్యాపారి కావడంతో మూడురోజుల క్రితం పనుల నిమి త్తం బయట రాష్ట్రానికి వెళ్లారు. వారికి ఇద్దరు కుమార్తెలు కాగా పెద్ద కుమార్తె విశాల అమెరికాలో ఉంటున్నారు. చిన్న కుమా ర్తె దీక్షిత నగరంలోనే భర్త రాహుల్ చౌదరితో కలిసి ఉంటున్నారు. వంట చేయమని చెప్పి గదిలోకి వెళ్లి.. సోమవారం ఉదయం 10.30 గంటలకు బాచుపల్లిలో ఉండే దీక్షిత, ఆమె భర్త, ఉమా మహేశ్వరి ఆడపడుచు నిరుపమ ఆమె ఇంటికి వచ్చారు. వీరికి వంట చేయమని వంట మనిషికి చెప్పిన ఉమా మహేశ్వరి మధ్యాహ్నం 12 గంటలకు తన గదిలోకి వెళ్ళారు. 12.30కి పనిమనిషి బీబీ వెళ్లి డోర్ కొట్టినా ఎంతకూ తలుపులు తీయలేదు. గదిలోకి వెళ్ళిన తల్లి లోపలి నుంచి గడియ పెట్టుకోవడమే కాకుండా భోజనం సమయం అయినప్పటికీ బయటకు రాకపోవడంతో దీక్షితకు అనుమానం వచి్చంది. దీంతో ఆమె వెళ్ళి గది తలుపు కొట్టారు. ఎంతకూ తీయకపోవడంతో మిగిలిన వారి సాయంతో తలుపులు బలవంతంగా తెరిచి లోపలికి వెళ్ళి చూశారు. 2.30కి పోలీసులకు సమాచారం ఆ గదిలో ఉమా మహేశ్వరి ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించారు. అప్పటికే మృతి చెందడంతో కిందకు దింపిన కుటుంబీకులు మధ్యాహ్నం 2.30 గంటలకు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు అన్ని కోణాల్లోనూ పరిశీలించి ఆత్మహత్యగా నిర్ధారించారు. అయితే ఈ విషయం పోస్టుమార్టం సహా ఇతర పరీక్షల్లో నిర్ధారణ కావాల్సి ఉండటంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఉస్మానియాలో పోస్టుమార్టం.. నేత్ర దానం ఉమా మహేశ్వరి మరణంపై సమాచారం అందుకున్న ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకే‹Ù, బాలకృష్ణ, పురందేశ్వరి, భువనేశ్వరి, సోదరుడు రామకృష్ణ, సమీప బంధువులతో పాటు తీగల కృష్ణారెడ్డి, కంభంపాటి రామ్మోహ¯న్‌రావు ఆమె ఇంటికి చేరుకున్నారు. భార్య మృతి విషయం తెలియడంతో మధ్యాహ్నం 3 గంటల సమయంలో శ్రీనివాస్ ప్రసాద్ తన ఇంటికి చేరుకున్నారు. ఉమా మహేశ్వరి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఫోరెన్సిక్ వైద్య నిపుణుడు అభిజిత్, టకియుద్దీన్, రమణమూర్తి నేతృత్వంలోని వైద్యుల బృందం పోస్టుమార్టం నిర్వహించింది. ఆ సమయంలో బాలకృష్ణ, రామకృష్ణ, లోకేశ్, శ్రీనివాస్ మార్చురీ వద్దే ఉన్నారు. ఉమా మహేశ్వరి నేత్రాలను కుటుంబీకులు దానం చేయడంతో వాటిని వైద్యులు సేకరించారు. రెండు మూడురోజుల వరకు మృతదేహం పాడవకుండా చర్యలు తీసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని తిరిగి జూబ్లీహిల్స్ నివాసానికి తరలించారు. రేపు అంత్యక్రియలు.. ఉమా మహేశ్వరి ఇటీవలే తన చిన్న కుమార్తె దీక్షిత వివాహం అంగరంగ వైభవంగా నిర్వహించగా ఇంతలోనే ఈ విషాదం చోటు చేసుకుంది. కాగా ఈ నెల 3న ఉమా మహేశ్వరి మృతదేహానికి అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు వెల్లడించారు. తన తల్లి చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోందని, ఆ కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు దీక్షిత మీడియాకు వెల్లడించారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com చదవండి: షూటింగ్స్ బంద్‌పై సుమన్ షాకింగ్ కామెంట్స్ -
Sr.NTR Satha Jayanthi:శతదినోత్సవ రాముడికి శతజయంతి కానుక..
ఒక నటుడు కష్టపడితే హీరో కావచ్చు. ఒక హీరో సిన్సియర్‌గా శ్రమిస్తే జనాదరణ పొందవచ్చు, బాక్సాఫీస్ హిట్లు సాధించవచ్చు. బాక్సాఫీస్ హిట్లు వచ్చిన తారలు చాలామందే ఉండవచ్చు. కానీ, ఎదిగే తన ప్రయాణంలో తాను నమ్ముకొని వచ్చిన పరిశ్రమను కూడా శిఖరాయమాన స్థాయికి తీసుకెళ్లిన మహానటులు నూటికో కోటికో ఒక్కరే ఉంటారు. తెలుగు సినీ పరిశ్రమలో అలాంటి ధ్రువతారక- ఎన్టీఆర్‌గా జనం గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు నందమూరి తారక రామారావు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో తెలుగు తెరకు దక్కిన కోహినూర్ – ఎన్టీఆర్. రావడం రావడమే ఆయన హీరోగా వచ్చారు, క్లిక్ అయ్యారు. అయిదారు సినిమాలకే స్టారయ్యారు. దాదాపు 33 ఏళ్ల సినిమా కెరీర్లో 298 సినిమాలు చేశారు. సినీరంగం వదిలేసి, రాజకీయాల్లోకి వెళ్లాక తన కళాతృష్ణను తీర్చుకొనేందుకు మరో 4 సినిమాలు చేశారు. మొత్తం 302 సినిమాల్లో ఆయన చేసినన్ని విభిన్న సినిమాలు, వేసినన్ని వైవిధ్యమైన పాత్రలు, నట –దర్శక– నిర్మాతగా పండించినన్ని ప్రయోగాలు న భూతో న భవిష్యతి. శ్రమతో... పరిశ్రమను పెంచిన శిఖరం ఎన్టీఆర్ సినీరంగానికి వచ్చేసరికి తెలుగు సినీపరిశ్రమ ఏటా సగటున 10 చిత్రాలు ఉత్పత్తి చేస్తోంది. ఆయన హీరోగా సినీరంగాన్ని వదిలే నాటికి అది సగటున 100 సినిమాల స్థాయికి వచ్చింది. తెలుగు సినీ సీమ ఆ స్థాయిలో పరిపుష్టం కావడంలో ఎన్టీఆర్‌ది కీలక పాత్ర. తక్కువ సినిమాలతో ఎక్కువ సంపాదన అనే నేటి సూత్రాలకు భిన్నంగా ఆయన ఒళ్లు దాచుకోకుండా కష్టపడ్డారు. వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేస్తూ, వేలాది మంది ఉపాధికీ, నిర్మాణ, పంపిణీ, ప్రదర్శక శాఖలన్నిటా పరిశ్రమ సర్వతోముఖ పురోగతికీ తోడ్పడ్డారు. మొదటి 20 ఏళ్ల కెరీర్లో ఆయన దాదాపు 200 సినిమాలు చేశారు. ఆ కాలంలో ప్రతి ఏటా తెలుగులో రిలీజైన సినిమాల్లో కనీసం సగం నుంచి సగం పైనే ఆయన సినిమాలున్న సంవత్సరాలే ఎక్కువ. మచ్చుకు 1964లో తెలుగు పరిశ్రమ 24 సినిమాలు తీస్తే, అందులో 16 సినిమాలు, అంటే మూడింట రెండొంతులు ఎన్టీఆర్వే. అలా రాజకీయాల్లోకి రాకముందే సినిమాల్లోనూ మూడింట రెండొంతుల మెజారిటీ సాధించారు. 90 ఏళ్ల తెలుగు టాకీ చిత్రాల చరిత్రలో ఇలా ఒక ఏడాది మూడింట రెండొంతుల సినిమాలు ఒక హీరో చేయడం అప్పటికీ, ఇప్పటికీ రికార్డు. పొరుగున తమిళ సినీ స్టార్ల చరిత్రలోనూ ఇలాంటి హీరో మరొకరు కనిపించరు. తెలుగు సినిమా ఎదుగుదలలో ఆయన అవిస్మరణీయ కృషికి ఇది నిలువుటద్దం. అలాగే, 1962 నాటికే వంద సినిమాలు (గుండమ్మకథ), 1970కే రెండొందల సినిమాలు (కోడలు దిద్దిన కాపురం) చేశారు ఎన్టీఆర్. భారతదేశంలో ఈ రెండు మైలురాళ్లనూ చేరుకున్న మొదటి హీరో – ఎన్టీఆరే! జానర్ ఏదైనా... జనాదరణే! అన్ని తరహా చిత్రాల్లోనూ అద్వితీయ నటనతో అలరించడం హీరోగా ఎన్టీఆర్కే సాధ్యమైంది. ఒకే ఏడాది (1962) పరస్పర విరుద్ధమైన నాలుగు విభిన్న కోవల చిత్రాలు (పౌరాణికం – భీష్మ, జానపదం – గులేబకావళి కథ, చారిత్రకం – మహామంత్రి తిమ్మరసు, సాంఘికం – రక్తసంబంధం, ఆత్మబంధువు, వగైరా) ఆయన చేస్తే, ఆ నాలుగు కోవల చిత్రాలూ శతదినోత్సవ హిట్లే. ఒక నటుడిగా దటీజ్ నందమూరి. ఒకే ఏడాదిలో... ఒకే ఒక్కడు! ఒక ఏడాది చేసిన సినిమాలన్నీ సక్సెసై, జనాదరణతో జేజేలు కొట్టించుకోవడం ఎంతటి స్టార్‌కైనా అరుదు. కానీ, అదీ ఎన్టీఆర్ చేసి చూపెట్టారు. 1965లో ఈ సినీ తారకరాముడు 12 సినిమాలు చేస్తే, అందులో 8 సెంచరీ హిట్లు. తొమ్మిదో చిత్రం 92 రోజులాడింది. మిగిలిన మూడూ 9 – 10 వారాల వంతున ప్రదర్శితమైన సక్సెస్ఫుల్ సినిమాలు. అదీ ఎన్టీఆర్ ఇమేజ్ చేసిన మ్యాజిక్. ఒకే ఏడాది (1977)లో ఏకంగా 3 డబుల్ సెంచరీ హిట్లు (దానవీరశూర కర్ణ, అడవి రాముడు, యమగోల) సాధించడం ఎన్టీఆర్ స్టార్ స్టామినాకు మచ్చుతునక. అప్పటికి తెలుగులో మరి ఏ హీరోకూ ఏకంగా సినీజీవితం మొత్తంలోనే 3 డబుల్ సెంచరీ హిట్లు లేవు. అలా తెలుగు చిత్రసీమలో ఎన్టీఆర్ ఓ చరిత్ర సృష్టించారు. విన్ అయినా... రిపీట్ రన్ అయినా... ఎన్టీఆర్ నటించిన త్రిశతాధిక చిత్రాల్లో అధిక భాగం బాక్సాఫీస్ హిట్లు. ఆయన చిత్రాల్లో శతదినోత్సవ హిట్లు 160. అందులో 115 నేరుగా సెంచరీ ఆడినవే! రజతోత్సవ హిట్లు 40. వాటిలో దాదాపు 20 డైరెక్ట్ సిల్వర్ జూబ్లీ. ఇక, 5 చిత్రాలు ఏడాది పాటు ఆడిన స్వర్ణోత్సవ హిట్లు. ఇలాంటి బాక్సాఫీస్ రికార్డుల్లోనూ అగ్రతాంబూలం ఎన్టీఆర్‌దే అన్నది జగమెరిగిన సత్యం. ప్రపంచ సినీ చరిత్రలో రెండోసారి, మూడోసారి విడుదలై కూడా సినిమాలు బాక్సాఫీస్ వద్ద బాగా ఆడడం తెలుగు, తమిళ సినీ రంగాల్లోనే ఎక్కువ. తర్వాత కొంత కన్నడంలో రిపీట్ రన్స్ కనిపిస్తాయి. మన తెలుగు సినీచరిత్ర మొత్తంలో రిపీట్ రన్స్‌లో శతదినోత్సవం చేసుకున్న చిత్రాలు 16. అందులో ఏకంగా 14 చిత్రాలు ఈ బాక్సాఫీస్ రాముడివే! ప్రేక్షకులకూ, ఎన్టీఆర్‌కూ ఉన్న అనుపమానమైన అనుబంధానికి ఇది ఓ మచ్చుతునక. చరిత మరువని ఘనత పౌరాణికం, జానపదం, చారిత్రకం, సాంఘికం.. ఇలా అన్ని కోవలలోనూ ఆయనకు ఆయనే సాటి. ఈ నందమూరి అందగాడు వేసినన్ని పాత్రలూ, చేసినన్ని రకాల పాత్రలూ మరే హీరో చేయలేదు. కనీసం ఆయన దరిదాపులో కూడా ఎవరూ లేరు. ఇది చరిత్ర చెప్పిన సత్యం. 57 జానపదాలు, 48 పౌరాణికాలు, 18 చారిత్రకాలు – ఇలా మూడు కోవల్లోనూ హీరోగా ఆయనదే రికార్డు. ఈ మూడూ కలిపితే, మొత్తం 123 సాంఘికేతర చిత్రాల్లో (అంటే కాస్ట్యూమ్ చిత్రాల్లో) హీరోగా నటించింది ప్రపంచంలో ఎన్టీఆర్ ఒక్కరే! ముఖ్యంగా పౌరాణిక పాత్రలతో ప్రజల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకొని, తెలుగువారి ఆరాధ్యదైవమయ్యారు ఎన్టీఆర్. ఆ సినిమాలు, ఆ పాత్రలే 23 ఏళ్ల పాటు మద్రాసులోని ఆయన నివాసాన్ని ఒక తీర్థయాత్రా స్థలిగా మార్చాయి. ఎన్టీఆర్‌లా కేవలం 9 నెలల్లో రాజకీయ పార్టీ స్థాపించి, ఎన్నికలలో ఘన విజయం సాధించిన మరొకరు ప్రపంచ రాజకీయ చరిత్రలో కనిపించరంటే అదే కారణం. అలా రాజకీయ సౌధానికి కూడా సినీ రంగంలో మూడు దశాబ్దాలకు పైగా ఆయన చూపిన ప్రత్యేకత, సంపాదించుకున్న ప్రజాదరణే పునాది. ఇలాంటి చరిత మరువని ఘనతలెన్నో తెలుగు సినీరంగానికి కట్టబెట్టిన ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా ఇంకా మిగిలే ఉంటుంది. ఈ ఆరాధ్యుడే ఆద్యుడు తెలుగు సినీరంగంలో అనేక తొలి ఘనతలు ఎన్టీఆర్ చిత్రాలే. ఆ ఘనకీర్తి జాబితా సుదీర్ఘమైనది. అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైన తొలి సినిమా (పాతాళ భైరవి), విదేశాల్లో ప్రదర్శించిన తొలి సినిమా (మల్లీశ్వరి), తొలి పూర్తి రంగుల చిత్రం (లవకుశ), విదేశాల్లో చిత్రీకరించిన తొలి చిత్రం (సాహసవంతుడు), తొలి సైన్స్ ఫిక్షన్ – అపరాధ పరిశోధక చిత్రం (దొరికితే దొంగలు), ఫస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ (లక్షాధికారి), ఫస్ట్ సోషియో– ఫ్యాంటసీ (దేవాంతకుడు), ఫస్ట్ మాస్ మసాలా మూవీ (అగ్గిరాముడు) – ఇలా అనేక కోవల చిత్రాలకు ఎన్టీఆర్ ఆద్యుడు. – కొమ్మినేని వెంకటేశ్వరరావు -
ఎన్టీఆర్-కృష్ణల మధ్య విభేదాలపై మహేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు
Mahesh Babu Comments Over Sr NTR And Krishna: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం హీరోగానే కాకుండా, అన్‌స్టాపబుల్ షోతో వ్యాఖ్యాతగానూ అదరగొకొడుతున్నారు. ఇప్పటికే ఈ షో ఎంతలా సూపర్ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఫినాలే ఎపిసోడ్‌కు సూపర్‌స్టార్ మహేశ్ బాబు గెస్ట్‌గా రావడం మరింత ఆసక్తికరంగా మారింది. ఈ సందర్భంగా బాలయ్య అడిగిన పలు ప్రశ్నలకు మహేశ్ సమాధానమిచ్చారు. కాగా నందమూరి తారకరామారావు- సూపర్‌స్టార్ కృష్ణ మధ్య దశాబ్దాలుగా వైరం ఉందని, ముఖ్యంగా కృష్ణ నటించిన అల్లూరి సీతారామమాజు సినిమా సమయం నుంచి వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని ఇండస్ట్రీలో టాక్. తాజాగా ఈ విషయంపై ఓపెన్ అప్ అయిన మహేశ్ ఎన్టీఆర్- కృష్ణల గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అల్లూరి సీతారామరాజు సినిమా సమయంలో నాన్న(కృష్ణ)గారికి ఎన్టీఆర్ గారితో గొడవలు ఉన్నాయనే మాట అబద్దమని ఆ సినిమా చూసిన తర్వాత.. ఆయన చాలా అభినందించారని నాన్న తరుచూ గుర్తుచేసుకునేవారని మహేశ్ వివరించారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. -
Nandamuri Balakrishna: ఎప్పటికీ వెంటాడే వెన్నుపోటు!
నేటి వర్తమానం రేపటి గతం అవుతుంది. ఆ గతం భవిష్యత్తును శాసిస్తుంది. కాలం అందరినీ ఓ కంట కనిపెడుతుంది. అందుకే ఎల్లవేళలా మనస్సాక్షి ప్రకారం నడుచుకోవాలి. తెలుగు రాజకీయ చరిత్రలో మాయని మచ్చ... తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌కు జరిగిన వెన్నుపోటు ఘట్టం. చంద్రబాబునాయుడు కుట్రలోనో, వ్యూహంలోనో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు భాగమయ్యారన్నది చరిత్ర. అది చెరిపితే చెరిగేది కాదు. కానీ దాన్ని దులుపుకోవడానికి స్వయానా ఎన్టీఆర్ కుమారుడు, నటుడు బాలకృష్ణ విఫలయత్నం చేశారు. తాము తండ్రికి వెన్నుపోటు పొడిచామని అంటున్నారని బాధపడ్డారు. కానీ ఎన్టీఆరే అన్నట్టు– క్రియాశీల రాజకీయాల్లో ఉన్నంతవరకూ చంద్రబాబుతో పాటు ఆయనా ఆ నింద మోయక తప్పదు. తెలుగుదేశం పార్టీ నేతలు ప్రస్తుతం వేదన, రోదన పర్వంలో ఉన్నట్లున్నారు. ఆ మధ్య టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఏదో అంశంపై కంటతడి పెట్టా రంటూ వార్తలొచ్చాయి. గత నవంబర్లోనూ తన భార్యను అవమా నించారని ఆరోపిస్తూ గుక్కపెట్టి రోదించడం ఆశ్చర్యపరచింది. తాజాగా నటుడు, హిందూపూర్ టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాల కృష్ణ కూడా కంటతడి పెట్టడం విస్మయపరచింది. తాము ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచామని అంటున్నారని ఆయన బాధపడ్డారు. ఎన్టీఆర్ మరణానంతరం చంద్రబాబు వ్యూహాత్మకంగా బాల కృష్ణతో వియ్యం అందారని కొందరు నమ్ముతారు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడవలేదన్న అర్థం వచ్చేలా బాలకృష్ణ మాట్లాడారు. చంద్ర బాబును ఉద్దేశించి ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలు వీడియోల రూపంలో సజీవ సాక్ష్యంగా ఉన్నాయి. చంద్రబాబు ఆత్మను అమ్ము కున్నాడనీ, తండ్రి లాంటి తనకు ద్రోహం చేశాడనీ ఆయన వాపోయారు. బహుశా బాలకృష్ణ ఆ వీడియో చూడలేదనుకోవాలి. చూసినా, అదేమీ తెలియనట్లు మాట్లాడుతున్నారనుకోవాలి. 1994 ఎన్నికలలో 250 సీట్లను సాధించిన ఎన్టీఆర్‌ను దించ డంలో ఉద్దేశం పార్టీని కాపాడుకోవడం అని బాలకృష్ణ అన్నారంటే, తండ్రిపై ఎలాంటి అభిప్రాయం ఉందో అర్థం అవుతుంది. నిజానికి రాజకీయ రంగంలో కూడా బాలకృష్ణనే తన వారసుడిగా ఉండాలని ఎన్టీఆర్ కాంక్షించారు. భార్య బసవతారకం కన్నుమూయడంతో ఎన్టీఆర్ వేదనకు గురి అయ్యారు. దానికి తోడు 1989 ఎన్నికలలో అధికారం కోల్పోయారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కుటుంబ సభ్యులు పెద్దగా పట్టించుకోలేదన్న విమర్శ ఉంది. దాంతో జీవిత చరిత్ర రాయడానికి వచ్చిన లక్ష్మీపార్వతి సేవలకు పొంగిపోయి, ఆమెను రెండో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. విషయం తెలిసిన వెంటనే చంద్రబాబు, ఇతర కుటుంబ సభ్యులు ఆ ప్రతిపాదనను విరమింప చేయడానికి యత్నించారు. కానీ ఆయన ఒప్పుకోలేదు. పైగా మేజర్ చంద్రకాంత్ సినిమా బహిరంగ సభలో లక్ష్మీపార్వతిని వేదికపైకి రప్పించి తాను పెళ్లాడబోతున్నట్లు సంచలన ప్రకటన చేశారు. ఆ తర్వాత హైదరాబాద్‌లోని తన ఇంటికి వస్తే సొంత కుటుంబ సభ్యులెవరూ పలకరించలేదు. ఆ తరుణంలో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న గాలి ముద్దుకృష్ణమనాయుడు ఒక ప్రకటన చేసి ఈ రెండో వివాహాన్ని సమర్థించారు. 1994 ఎన్నికలలోపు లక్ష్మీపార్వతిని కూడా ఆయన జనంలో తిప్పారు. ఈ జంటను చూడటానికి జనం విశేష సంఖ్యలో ఎగబడే వారంటే అతిశయోక్తి కాదు. ఆ క్రమంలో తన వర్గానికి ఎక్కువ టిక్కె ట్లను ఇప్పించుకునేందుకు చంద్రబాబు వ్యూహాత్మకంగా తన సాయం కూడా తీసుకున్నారని లక్ష్మీపార్వతి చెబుతుంటారు. టీడీపీ మళ్లీ అధి కారంలోకి వచ్చింది. అక్కడి నుంచి చంద్రబాబు, లక్ష్మీపార్వతి వర్గాల మధ్య రాజకీయం మొద లైంది. లక్ష్మీపార్వతిని తదు పరి వారసురాలిగా ప్రక టిస్తే తమ రాజకీయ భవి ష్యత్తు దెబ్బ తింటుందని చంద్ర బాబు వర్గం భావించింది. అదే సమయంలో లక్ష్మీపార్వతి వర్గానికి చెందిన నేత ఒకరు ఆమె ఉప ముఖ్య మంత్రి కావాలని అంటూ మాట్లాడారు. అది మరింత ఆజ్యం పోసింది. ఉత్తరాంధ్రలో ఎన్టీఆర్ ప్రజల వద్దకు ప్రభుత్వం కార్య క్రమం నిర్వహిస్తున్న తరుణంలో విశాఖలో డాల్ఫిన్‌లో కొందరితో చంద్రబాబు సమావేశం అయ్యారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత చంద్రబాబు టూర్ అర్ధంతరంగా ముగించుకుని హైదరా బాద్ వచ్చేశారు. ఆ పిమ్మట పలువురు టీడీపీ ఎమ్మెల్యేలను కలవడం, అందరూ వైస్రాయి హోటల్లో బస చేయడం, ఒకట్రెండు రోజుల్లో వేగంగా జరిగిపోయింది. తమకు ఎన్టీఆర్‌ను దించుతున్నామన్న సంగతే తెలియదని కొందరు ఎమ్మెల్యేలు స్వయంగా చెప్పారు. ఎన్టీఆర్ కొంత ఆలస్యంగా మేలు కుని చంద్రబాబు, దేవేందర్ గౌడ్, అశోక్ గజపతిరాజు, విద్యాధర రావులను మంత్రి పదవుల నుంచి తొలగించారు. వారిని పార్టీ నుంచి బహిష్కరించినట్లు కూడా ప్రకటించారు. కానీ అప్పటికే డిల్లీలో ఆనాటి పీవీ ప్రభుత్వాన్ని చంద్రబాబు వర్గం మేనేజ్ చేసుకుని, ఎన్టీఆర్ శాసనసభను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఆనాటి గవర్నర్ కృష్ణకాంత్ అమలు చేయకుండా అడ్డుకోగలిగారు. కానీ పార్టీ నుంచి బహిష్కరణకు గురైనవారిని ముఖ్యమంత్రిగా నియమించ వచ్చా అన్న ప్రశ్నకు ఈనాటికీ సమాధానం దొరకలేదు. ఎన్టీఆర్ వైస్రాయి హోటల్ వద్దకు వెళ్లినప్పుడు గేట్లు మూసేసి చంద్రబాబు వర్గం చెప్పులు విసిరింది. అవి ఆయన మీద పడకుండా పరిటాల రవి, దేవినేని నెహ్రూ వంటివారు యత్నించారు. టీడీపీ తమదేనని, ఎన్టీఆర్‌నే పార్టీ అధ్యక్ష పదవినుంచి తప్పించినట్లు చంద్రబాబు వర్గం తీర్మానాలు చేసింది. చివరికి కోర్టు ద్వారా టీడీపీ ఖాతాలో ఉన్న సుమారు 75 లక్షల రూపాయలను ఎన్టీఆర్‌కు దక్క కుండా చంద్రబాబు చేయగలిగారు. ఎన్టీఆర్ సొంతంగా మరో పార్టీ పెట్టుకోవడానికీ, ఎన్నికల గుర్తుగా సింహంను ఎంపిక చేసుకోవడానికీ కూడా సిద్ధమయ్యారు. ఆ సమయంలో కుటుంబ సభ్యులు ఎవరూ ఆయనతో లేరు. మరి దానిని తండ్రి పట్ల కుమారులు చూపించిన గౌరవం అని బాలకృష్ణ చెబుతారేమో. ఆ అవమానాలతో కుంగి పోయిన ఎన్టీఆర్ గుండెపోటుకు గురై మరణించారు. అయినా ఇదంతా వెన్నుపోటు కిందకు రాదని బాలకృష్ణ చెప్పదలిచారా? హరికృష్ణ నేరుగా ఎమ్మెల్యేలతో కలిసి వైస్రాయి హోటల్లో బస చేశారు. ఆ తర్వాత ఆయన ఆరు నెలల మంత్రిగానే మిగిలిపోయి భంగపడ్డారు. తదుపరి సొంతంగా అన్నా టీడీపీ అని పార్టీని పెట్టు కుని ప్రచారం చేశారు. కానీ వ్యూహ లోపం, చంద్రబాబు అధికారం ముందు నిలబడలేకపోయారు. 2009 ఎన్నికల సమయంలో హరి కృష్ణ కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ సేవలను చంద్రబాబు వాడు కున్నారు. అనంతరం తన కుమారుడు లోకేశ్‌కు పోటీ అవుతాడని భావించి, అతనిని పక్కన బెట్టేశారు. ఇలా రాజకీయ వ్యూహాల నండి, మరొకటని అనండి... ఎప్పటికప్పుడు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను వాడుకోవడం, వదలివేయడం జరి గిందని చెబుతారు. అయినా ఆ కుటుంబంలో ఎక్కువ మందిని తనవైపే ఉంచుకోవడంలో చంద్రబాబు కృతకృత్యులయ్యారు. ఇవన్నీ చంద్రబాబు తెలివి తేటలని టీడీపీలో ఆయనను అభిమానించేవారు భావిం చవచ్చు. కానీ చంద్రబాబు ఎవరికైనా వెన్ను పోటు పొడవడానికి వెనుకాడరని ఆయన వ్యతి రేకులు భావిస్తుంటారు. అంతదాకా ఎందుకు, చంద్రబాబుతో ఎంతో సఖ్యతగా ఉండే ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు గతంలో ఒకసారి ఒక మీటింగ్‌లో మాట్లాడుతూ వేదిక మీద తన వెనుక ఎవరూ ఉండవద్దని, వెనుక ఉన్నవారు ఎన్టీఆర్‌ను ఏంచేశారో చూశారు కదా అని గుర్తు చేసుకున్నారు. అలాగే చంద్రబాబుకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మిత్రుడు అయిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబుది అంతా వెన్నుపోటు చరిత్ర అని విమర్శించారు. ఎన్టీఆరే పరుష పదాలతో వీడియో విడుదల చేశారు. ముఖ్యమంత్రి అయ్యాక చంద్రబాబు తన భార్యతో కలిసి ఎన్టీఆర్ ఇంటికి వెళితే, ఆయన తలుపులు వేసు కున్నారు. ఇన్ని పరిణామాల తర్వాత కూడా బాలకృష్ణకు తన తండ్రి పదవి పోయిందన్న బాధకన్నా, తన బావను వెన్నుపోటుదారుడు అంటున్నారనీ, ఆ వెన్నుపోటుకు తాము సహకరించామని అంటు న్నారనీ ఆవేదన వ్యక్తం చేస్తే ఇప్పటికీ వారిలో ఆ రియలైజేషన్ రాలేదన్నమాట. వెన్నుపోటో, ఎదురుపోటో పొడిచి తండ్రిని పదవి నుంచి దించేసిన వాస్తవమైనా బాలకృష్ణ అంగీకరిస్తారా? తండ్రి మరణించిన తర్వాత రాజకీయ అవసరాలకు ఆయన ఫొటో పెట్టు కుని తిరగడాన్ని ఏమంటారో కూడా బాలకృష్ణ తెలుసుకోవాలి. ఎన్టీఆర్ ఒక వీడియోలో అన్నట్లుగా చంద్రబాబు రాజకీయాలలో క్రియాశీలంగా ఉన్నంతకాలం ఆయన ఈ విమర్శలకు గురికాక తప్పదేమో! కొమ్మినేని శ్రీనివాసరావు వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు -
ఎంతోమంది ఆప్తుల్ని ఇచ్చారు...
మా నాన్నగారండీ.. ఆయనకి ఇద్దరు భార్యలండీ.. నేను మొదటి భార్య కొడుకునండీ ... అంటూ శంకరాభరణంలో అల్లురామలింగయ్య దగ్గరకు న్యాయం కోసం వచ్చారు.. శ్రీవారికి ప్రేమలేఖలో మరచెంబు పాత్రలో చతుర్ముఖ పారాయణం ఆడారు... చిన్న చిన్న పాత్రలే వేసినా, తెలుగువారి హృదయాల మీద హాస్య పన్నీరు జల్లారు. నాన్నకి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ అంటున్నారు వాడ్రేవు విశ్వనాథమ్ ఉరఫ్ థమ్ కుమార్తె శ్రీకాంతి. నాన్న తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో పుట్టారు. తాతగారు వాడ్రేవు చలమయ్య, బామ్మ లక్ష్మీకాంతమ్మ. వారికి నాన్న ఎనిమిదో సంతానం. ఇద్దరు అక్కలు, ముగ్గురు అన్నయ్యలు, ఇద్దరు తమ్ముళ్లు. ‘తాతగారి పేరు, మార్కెట్‌కి ఎదురుగా ఉన్న వాడ్రేవు బిల్డింగ్, పిఠాపురం’ అని అడ్రస్ రాస్తే చాలు పోస్టు వెళ్లిపోతుంది. తాతగారు డ్రాయింగ్ మాస్టారుగా పనిచేసేవారు. మా పెద్దనాన్నగారే ఇంటి పెద్దగా అందరి బాగోగులు చూసుకున్నారు. నాన్న ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి డిప్లొమా ఇన్ యాక్టింగ్ చేశారు. ఆదిరాజు ఆనంద్‌మోహన్ మా అమ్మకి బాబాయ్. ఆయన ‘పెళ్లి కాని పెళ్లి’ అనే సినిమా తీశారు. అందులో నాన్న చిన్న వేషం వేశారు. అలా మా బాబాయ్ ద్వారా అమ్మకి నాన్నతో పెళ్లి సంబంధం కుదిరి, వివాహం జరిగింది. నాన్నగారికి ఆడవాళ్లంటే చాలా గౌరవం. అమ్మని ఎప్పుడూ ఏమీ అనేవారు కాదు. నేను పుట్టినప్పుడు ‘మా అమ్మే మళ్లీ పుట్టింది’ అని ఎంతో సంతోషంగా అందరికీ స్వీట్స్ పంచారుట. మా అన్నయ్య కొంచెం అమాయకంగా ఉంటాడని వాడిని ఎప్పుడూ కోప్పడేవారు కాదు. నాటకాలలో పరిచయం... నాన్నకి నాటకాలంటే ప్రాణం. నాటకాల ద్వారానే సాక్షి రంగారావు గారు, పొట్టి ప్రసాద్ గార్లతో పరిచయం ఏర్పడింది. సాక్షి రంగారావు గారిని నాన్న ‘మా రంగడు’ అనేవారు. పొట్టిప్రసాద్ గారు తనకు గురువుతో సమానమని చెప్పేవారు. సాక్షి రంగారావు గారిని పెద్దనాన్న అని, పొట్టి ప్రసాద్ గారిని మావయ్య అని పిలిచేవాళ్లం. రాళ్లపల్లి గారు మాకు దేవుడు ఇచ్చిన మావయ్యే. అన్న, అక్క అంటే మాకు వాళ్ల పిల్లలే. రాళ్లపల్లి మావయ్య వాళ్ల అమ్మాయి బయటికి వెళితే నన్ను తనతో తీసుకుని వెళ్లేది. సీతారామశాస్త్రి గారు, దివాకర్‌బాబు గారు.. అందరం చెన్నైలోని సాలిగ్రామంలోనే దగ్గరదగ్గరగా ఉండేవాళ్లం. ఇప్పటికీ అందరితో టచ్‌లో ఉన్నాం. మా నాన్న మాకు ఇచ్చి వెళ్లిన బెస్ట్ గిఫ్ట్ ఈ కుటుంబాలే. చదివితే చాకొలేట్లు... నాన్న షూటింగ్స్‌లో ఎంత బిజీగా ఉన్నా మా చదువు విషయంలో ఎన్నడూ అశ్రద్ధ చేయలేదు. సెలవుల్లో కూడా చదువుకోవాలనేవారు. ఆయన సూట్‌కేస్‌లో థ్రెప్టిన్ బిస్కెట్ల డబ్బా, క్యాడ్బరీ చాకొలేట్ బాక్స్ ఉండేవి. రోజూ నాన్న బయటకు నుంచి ఇంటికి రాగానే మేం ఆయన వెనకాల నిలబడేవాళ్లం. మేము చదువుకున్నామని చెప్పాక ఇద్దరికీ రెండు బిస్కెట్లు, రెండు చాకొలేట్లు ఇచ్చేవారు. చదవకపోతే నో ట్రీట్. రెండో క్లాసు చదువుతున్నప్పుడు... ఒకరోజున ఇంటి దగ్గర టీవీ సీరియల్ షూటింగ్ జరుగుతోంది. అందులో చిన్న సీన్లో నేను, అన్నయ్య ఇద్దరం నటించాం. టీవీలో టెలికాస్ట్ అయినప్పుడు అన్నయ్య సీన్ వచ్చింది, నా సీన్ ఎడిట్ అయిపోయింది. నేను ఏడ్చాను. అప్పుడు నాన్న, ‘ఆడపిల్ల ఏడవకూడదు. నేను రాకపోతేనేం... అన్నయ్య టీవీలో కనిపించాడు కదా... అని నువ్వు సంతోషంగా ఉండాలి తల్లీ’ అని బుజ్జగించారు. చాలా సైలెంట్‌గా ఉండేవారు... సినిమాలలో హాస్య పాత్రలు వేసేవారు కానీ, ఇంటి దగ్గర చాలా సైలెంట్. ఎక్కువ మాట్లాడేవారు కాదు. నాన్న ఇంట్లో ఉన్నప్పుడు నిశ్శబ్దంగా ఉండేవాళ్లం. ఆయన బయటకు వెళ్లగానే కిటికీలోంచి తొంగి చూసేవాళ్లం. నాన్న గేట్ దాటాక, మేం గేటు దాకా వచ్చి, బస్‌స్టాప్‌లో ఉన్నారా, వెళ్లిపోయారా అని చూసి, ఆయన వెళ్లిపోయారని నిర్ధారించుకుని వెంటనే ఆడుకోవటానికి పారిపోయేవాళ్లం. ఒకసారి టీనగర్లో మా తాతగారి ఇంటికి వెళ్లాం. అక్కడ ఉండిపోతానని పేచీ పెట్టటంతో నన్ను అక్కడ ఉంచి వెళ్లిపోయారు నాన్న. అమ్మ సాయంత్రం వరకు ఉండి, ఆ తరవాత ఇంటికి వెళ్లిపోయింది. అమ్మ వెళ్లిన కాసేపటికే బెంగ వచ్చి ఏడుపు మొదలుపెట్టాను. అప్పటికి నాన్న ఏదో పని మీద ఇంకా టీ నగర్లోనే ఉన్నారు. తాతగారు నాన్నకి ఫోన్ చేసి, విషయం చెప్పటంతో, నాన్న వచ్చి ఇంటికి తీసుకెళ్లారు. నాన్న దగ్గర అంత చేరిక నాకు. నేను పదో తరగతి ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయినప్పుడు వాచ్ ఇచ్చారు. నాన్నగారు ఆంధ్ర యూనివర్సిటీలో డిప్లొమో ఇన్ యాక్టింగ్ చేశారని నేను కూడా నా ఎంబిఏ అక్కడ నుంచే చేశాను. ఏయన్నార్‌కి కోపం వచ్చింది... మా చిన్నప్పటి కంటె, మేం కొంచెం పెద్దవాళ్లం అయ్యాకే నాన్నతో గడిపే అవకాశం వచ్చింది. అప్పటికి సినిమా షూటింగ్స్ తగ్గి, సీరియల్స్‌లో మాత్రం వేస్తుండేవారు. ఎక్కువసేపు ఇంట్లో ఉండటం వల్ల, మాతో క్యారమ్బోర్డు అడేవారు. అప్పుడప్పుడు ఏవైనా సినిమా కబుర్లు చెప్పేవారు. నాన్నకి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ. ఒకసారి అక్కినేని నాగేశ్వరరావు గారితో... రాళ్లపల్లి ఏ క్లాస్ ఆర్టిస్ట్, నేను బి క్లాస్ ఆర్టిస్ట్, మీరు సి క్లాస్ ఆర్టిస్ట్ అన్నారట. అక్కినేని గారికి కొంచెం కోపం వచ్చిందట. అప్పుడు నాన్న.. అపార్థం చేసుకోకండి. రాళ్లపల్లిగారు ఆటోలో తిరుగుతున్నారు కాబట్టి ఆయన ఏ గ్రేడ్ ఆర్టిస్ట్, నేను బస్సుల్లో తిరుగుతున్నాను కాబట్టి బి గ్రేడ్ ఆర్టిస్ట్, మీరు కారులో తిరుగుతున్నారు కాబట్టి సి గ్రేడ్ ఆర్టిస్ట్ అన్నారట. ఏయన్నార్‌గారు ఫక్కుమని నవ్వారుట. ఎన్టీఆర్ సహాయం చేశారు... ఎన్టీఆర్‌లో ఉన్న ఒక గొప్ప గుణం గురించి చెప్పారు నాన్న. ఆయనకి చిన్న చిన్న కళాకారులు కూడా గుర్తు ఉంటారట. ఏదైనా సినిమాలో ఒక ప్రత్యేకమైన పాత్ర ఉంటే, దానికి ఏ ఆర్టిస్టు కరెక్ట్ అని ఆలోచించి, ఆ ఆర్టిస్టు ఎక్కడున్నా కబురు పంపేవారట. వారు కష్టాల్లో ఉంటే కూడా ఎన్టీఆర్ గుర్తుపెట్టుకుంటారనటానికి పొట్టి ప్రసాద్‌గారికి చేసిన సహాయమే పెద్ద నిదర్శనం. పొట్టిప్రసాద్ మావయ్యకు ఆరోగ్యం బాగా లేనప్పుడు, హీరో బాలకృష్ణ గారితో ఒక బుట్ట నిండా పళ్లు పంపారు రామారావు గారు. బాలకృష్ణ గారిని దగ్గరుండి ఆసుపత్రికికి నేనే తీసుకువెళ్లాను. అప్పుడు నాలుగో క్లాసు చదువుతున్నాను. బాలకృష్ణ గారు ఎంతో ఆప్యాయంగా పలకరించి వెళ్లారు. ఎన్టీఆర్ గురించి నాన్న చెప్పిన మాటలు అప్పుడు నాకు బాగా గుర్తు వచ్చాయి. ఇద్దరికీ ఒకటే పేరు పెట్టారు నాన్న పూర్తి పేరు వాడ్రేవు కాశీవిశ్వనాథం. తన పేరులోని ఆఖరి అక్షరాలు తీసుకుని థమ్ అని పేరు పెట్టుకున్నారు. పేరు కూడా కామెడీగా ఉండాలని ఆయన ఆలోచన. తమిళంలో అలనాటి హాస్య నటుడు నగేశ్ అంటే ఇష్టం. అందుకే ఆయనలాగే సన్నగా ఉండేవారేమో అనుకుంటాం. అమ్మ పేరు లలిత. బి.ఎస్.సి. బిఈడీ చదివి, సైన్స్ టీచర్‌గా పనిచేసి, పెళ్లయ్యాక మానేసింది. ఇంటి బాధ్యతలు పూర్తిగా అమ్మే చూసుకుంది. వాళ్లకి మేం ఇద్దరం పిల్లలం. అమ్మమ్మ పేరు, బామ్మ పేరు ఇద్దరి పేరు ఒకటే.. లక్ష్మీ కాంతమ్మ. అందుకని నాకు శ్రీకాంతి అని, అన్నయ్యకు శ్రీకాంత్ అని పేర్లు పెట్టారు. ఇద్దరికీ ఒక్క చిన్న అక్షరం తేడా అంతే. కళ్లనీళ్లు పెట్టుకున్నారు.. నాన్నగారు ఏడవటం నా జీవితంలో నేను చూడటం అదే మొదటిసారి. పొట్టిప్రసాద్ మావయ్య ఆరోగ్యం బాగా దెబ్బ తినటంతో ఆసుపత్రిలో చేరారు. ఆయనను చూసి వచ్చిన నాన్నకు ఏడుపు ఆగలేదు. ఆ రోజు నాన్న మంచినీళ్లు కూడా తాగకుండా కూర్చుండిపోయారు. నేనే నాన్నని బుజ్జగించి, అన్నం తినిపించాను. ఆ మావయ్య కన్ను మూసిన రోజున నాన్నను ఓదార్చటం కష్టమైపోయింది. ఆయన మరణం తరవాత చాలా మార్పులు జరిగాయి. ఆప్తులందరూ హైదరాబాద్ తరలి వచ్చేశారు. నాన్న హైదరాబాద్ మారాలా వద్దా అని తర్జనభర్జన పడి, చివరకు మారటానికే నిశ్చయించుకుని, ఏవో వ్యక్తిగత పనుల మీద పిఠాపురం వెళ్లారు. అక్కడ ఉండగానే నాన్నకు అకస్మాత్తుగా హార్ట్ అటాక్ వచ్చి కాలం చేశారు. మాకు దిక్కుతోచని పరిస్థితి. అప్పటికింకా నేను డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాను. మమ్మల్ని చెన్నై నుంచి సాక్షి శివ (సాక్షి రంగారావు కుమారుడు) అన్నయ్యే పిఠాపురం తీసుకువెళ్లాడు. ఆ తరవాత మేం హైదరాబాద్‌కి షిఫ్ట్ అయ్యాం. సాక్షి రంగారావు పెద్దనాన్న సినీ ప్రముఖుల నుంచి కొంత డబ్బు సేకరించి అమ్మకు ఇచ్చారు. కె.విశ్వనాథ్ గారు పది వేలు ఇచ్చారు. సీతారామశాస్త్రి అంకుల్ ‘అమ్మాయిని నాకు ఇచ్చేయండి, పెంచుకుంటాను’ అన్నారు. ఆ రోజు నేను వెక్కివెక్కి ఏడుస్తుంటే, సీతారామశాస్త్రి అంకుల్ నన్ను ఓదారుస్తూ, ‘అమ్మాయీ! నాకూ మా నాన్నగారు లేరు, నేను ఆయనను ఎన్నటికీ చూడలేను. కాని నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ నాన్నను టీవీలో ఏదో ఒక సినిమాలో చూడగలవు కదా’ అన్నారు. ఆస్తులు పాస్తుల కన్నా అనుబంధాలు గొప్పవని నాకు అర్థమైంది. నాన్న చాలా మంది ఆప్తుల్ని మాకు ఇచ్చినందుకు మనసులోనే ఆయనకు నమస్కరిస్తాను. సంభాషణ: వైజయంతి పురాణపండ -
బాలయ్య నోట శ్రీరామ దండకం.. వీడియో వైరల్
బాలయ్య నోట శ్రీరామ దండకం.. వీడియో వైరల్ విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారకరామారావు(ఎన్టీఆర్) జయంతి నేడు(మే 28). ఈ సందర్భంగా తారకరామారావుకు ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ గాత్ర నివాళులర్పించారు. ఎన్టీఆర్‌ను స్మరించుకుంటూ బాలకృష్ణ శ్రీరామ దండకాన్ని స్వయంగా ఆలపించారు. బాలయ్య నిర్మాణ సంస్థ నందమూరి బాలకృష్ణ ఫిల్మ్స్ ఈ వీడియోని తమ ట్విటర్లో విడుదల చేయగా, ఇది అభిమానులని ఎంతగానో అలరిస్తుంది. ఎంతో కష్టతరమైన సంస్కృత పదాలను ఈజీగా పలికేశారు బాలయ్య. సాహిత్యం పట్ల ఆయనకున్న అభిరుచికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇక గతేడాది అత్యంత ‘శివ శంకరి ..’ పాడి, తన అభిమానులకు విందుగా విడుదల చేసిన విషయం తెలిసిందే. చదవండి : గుండె తల్లడిల్లిపోతోంది తాతా: ఎన్టీఆర్ ఎమోషనల్ ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి: చిరంజీవి డిమాండ్ -
ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి: చిరంజీవి డిమాండ్
తెలుగు జాతి కీర్తిని, తెలుగు భాష ఖ్యాతిని దశదిశలా చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి నందమూరి తారక రామారావు. నోరు తిరగని డైలాగులను కూడా సింగిల్ టేక్‌లో చెప్పే ఈ దివంగత హీరోకు విశ్వ విఖ్యాత నట సార్వభౌముడని బిరుదు కూడా ఉంది. రాముడు, కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రల్లో మెప్పించి తెలుగు వారి గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న ఎన్టీఆర్ బర్త్‌డే నేడు(మే 28). ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఎప్పటి నుంచో వినిపిస్తున్న ఓ డిమాండ్‌ను మరోసారి తెర మీదకు తీసుకొచ్చాడు. "ప్రముఖ గాయకులు, నవయుగ వైతాళికులు భూపేన్ హజారికాకు మరణానంతరం భారతరత్న ఇచ్చినట్లుగా.. మన తెలుగు తేజం, దేశం గర్వించే నాయకుడు ఎన్టీఆర్‌కు భారత రత్న ఇస్తే అది తెలుగువారందరికీ గర్వ కారణం. వారి 100వ జయంతి దగ్గర పడుతున్న సందర్భంగా ఎన్టీఆర్‌కు ఈ గౌరవం దక్కితే అది తెలుగువారికి దక్కే గౌరవం" అని చిరు ట్వీట్ చేశాడు. #RememberingTheLegend#BharatRatnaForNTR pic.twitter.com/efN2BIl8w7 — Chiranjeevi Konidela (@KChiruTweets) May 28, 2021 మరణంలేని జననం ఆయనిది.. అలుపెరగని గమనం ఆయనిది.. అంతేలేని పయనం ఆయనిది.. ‘తెలుగు జాతి’కి గర్వకారణం మరియూ ‘తెలుగు పలుకు’లను తన కంఠంతో కొత్తపుంతలు తొక్కించిన అవిశ్రాంతయోధుడు #NTR 🙏#BharatRatnaForNTR #JoharNTR #LegendaryNTRJayanthi @tarak9999 pic.twitter.com/dlPEN9K6WG — MassGodNTRFc (@massgod_ntr_fc) May 28, 2021 చదవండి: బాహుబలి, రేసుగుర్రం బాలనటుడు హీరోగా 'బ్యాచ్' మూవీ -
నందమూరి ఫ్యాన్స్‌కి బాలయ్య బాబు అదిరిపోయే అప్డేట్
నందమూరి అభిమానులకు సర్ప్రైజ్ ఇవ్వడానికి సిద్దమయ్యాడు బాలకృష్ణ. ఈ మేరకు రేపు (మే 27) ఉదయం 8.45 గంటలకు ఓ చిన్న సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాం బాలకృష్ణకు సంబంధించిన నిర్మాణ సంస్థ ఎన్బీకే ఫిల్మ్స్ నుంచి ఓ ప్రకటన వెలువడింది. అందులో ఎన్టీఆర్ ఫోటో ఉంచడంతో ఆ సర్ప్రైజ్ ఏమై ఉంటుందా అని నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే బాలయ్య ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ’అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే 80 శాతం వరకూ పూర్తైంది. ప్రస్తుతం కరోనా ప్రభావం కారణంగా చిత్రీకరణను నిలిపివేశారు. 'సింహా', 'లెజెండ్' వంటి భారీ హిట్ల తర్వాత రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా మే 28న ‘అఖండ’నుంచి ఓ పాట విడుదల కాబోతుందని ప్రచారం కూడా జరుగుతోంది. దానికి సంబంధించిన వివరాలనే రేపు వెల్లడిస్తాడని అభిమానులు చర్చించుకుంటున్నారు. మరోవైపు ఎన్టీఆర్ 99వ జయంతి సందర్భంగా బాలకృష్ణ తండ్రికి నివాళిగా తన గానంతో ‘శ్రీరామదండకం’విడుదల చేయనున్నాడని, దానికి సంబంధించిన అధికారిక ప్రకటన రేపు ఉదయం 8.45కి రాబోతోందనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. మరి బాలయ్య బాబు ఇచ్చే సర్ప్రైజ్ ఏంటో తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే. A surprise at 8:45AM tomorrow. Stay Tuned.#NandamuriTarakaRamaRao #NandamuriBalaKrishna@NBKFilms_ pic.twitter.com/NtJkF4cuc9 — NBK FILMS (@NBKFilms_) May 26, 2021 -
దుష్ట శిక్షణ.. శిష్ట రక్షణ..!
తారకరామ పిక్చర్స్ వారి సినిమాలో ఎన్టీఆర్ శ్రీకృష్ణుడిగా, శోభన్‌బాబు నారదుడిగా నటించిన సినిమాలోని కొన్ని దృశ్యాలు ఇవి. సినిమా పేరేమిటో చెప్పుకోండి చూద్దాం.. ‘‘నారద మునీంద్రా! దేవగణం మహర్షి మండలంతో పాటు భూదేవి కూడా మా సన్నిధానానికి వచ్చింది. ఏమిటి విశేషం?’’ ఆరా తీశాడు శ్రీమహావిష్ణువు. ‘‘సర్వజ్ఞడవు. నీకు తెలియనిది ఏముంది స్వామి! దానవుల బాధలను భరించలేకే మిమ్మల్ని ఆశ్రయించడానికి వచ్చారు’’ అని చెప్పాడు నారదుడు. ‘‘యజ్ఞయాగాదులు సాగడం లేదు. నానా హింసలకు లోనవుతున్నాం. భూలోకం నరకమైపోతున్నది. సర్వలోక శరణ్యుడైన మీరు అడ్డుపడకపోతే ధర్మానికి నిలువ నీడ ఉండదు’’ అని వాపోయారు మునులు. ‘‘ధర్మానికి అంత హాని సంభవించిందా!’’ అని అడిగింది లక్ష్మీదేవి. ‘‘దానవాంశసంభూతులైన కంస,నరకాసుర, జరాసంధుల అక్రమాలు పెచ్చుమీరిపోతున్నాయి. ఆ పాపభారం భరించలేకుండా ఉన్నాను తల్లీ’’ అన్నది బాధగా భూమాత. ‘‘దేవీ భూమాతా! కలవరపడకు. ఆచిరకాలంలోనే దేవకి గర్భవాసాన శ్రీకృష్ణుడనై జన్మించి పాప భారాన్ని నిర్మూలిస్తాను. దుష్టశిక్షణ, శిష్టరక్షణ శ్రీకృష్ణావతార పరమార్థం’’ అని హమీ ఇచ్చాడు శ్రీమహావిష్ణువు. భూలోకంలో.... చెల్లి. బావలను కూర్చొబెట్టుకొని రథం నడుపుతున్నాడు కంసుడు. ఆ దృశ్యం చూడముచ్చటగా ఉంది. ఇంతలో ఆకాశవాణి గర్జించింది... ‘‘కంస రాజేంద్రా! మూర్ఖుడవై ముందున్న ముప్పు తెలుసుకోలేకుండా ఉన్నావు. ఆమె అష్టమగర్భమే నీ పాలిట మృత్యువై నిన్ను అంతరింపజేస్తుంది’’ అప్పటి వరకు ఆనందోత్సాహాలతో ఉన్న కంసుడికి చెమటలు పట్టాయి. అప్పటి వరకు చెల్లితో ఎంతో ప్రేమగా మాట్లాడిన కంసుడు ఆకాశవాణి హెచ్చరికతో ఒంటికాలి మీద లేచి... ‘‘ఆమె అష్టమగర్భమే నా పాలిట మృత్యువా? ఏమిటి ఈ వైపరీత్యం?’’ అని చెల్లి మీది కత్తి దూయబోయాడు. ‘‘అన్నా.. నన్ను ప్రేమతో పెంచి పెళ్లి చేసింది నీ చేతులారా వధించడానికేనా? నీ భయంకర కరవాలానికి నన్ను బలి చేస్తావా?’’ రోదిస్తూ అన్నను అడిగింది దేవకి. చెల్లెలి రోదన విని కూడా ఆ అన్న మనసు కరగడం లేదు. కోపంతో బుసలు కొడుతూనే ఉన్నాడు కంసుడు. అప్పుడు వసుదేవుడు కంసుడి భుజం మీద చేయి వేసి... ‘‘బావా తొందరపడకు! ఎట్టి పాపం ఎరుగని అమాయకురాలు. ఈమెను వధించుట ధర్మమేనా? నీ మృత్యుకారణం ఈమె సంతానమేగానీ ఈమె కాదు కదా బావా’’ అన్నాడు. ‘‘కాని ఈమె జనించే ప్రతి శిశువును పుట్టగానే మాకు అప్పగించాలి’’ అని షరతు విధించాడు కంసుడు. ‘‘తప్పకుండా అప్పగిస్తాను బావా’’ ఒప్పుకున్నాడు వసుదేవుడు. ‘‘నేటి నుంచి కారాగారమే మీ నివాసమందిరం’’ అంటూ చెల్లి బావలను కనికరం లేకుండా కారాగారంలో వేశాడు కంసుడు. కొంతకాలం తరువాత... ‘‘బావా! ఇదిగో దేవకి ప్రథమగర్భం. నా మాట నిలబెట్టుకున్నా! ఆపై నీ దయ!’’ అంటూ శిశువును కంసుడికి అప్పగించాడు వసుదేవుడు. ‘‘విధికి నా మీద లేని దయ నాకు ఈ శిశువు మీదనా!’’ అంటూ ఆ శిశువును ఆకాశంలోకి విసిరేసి కత్తి వేటుకు బలి చేశాడు కంసుడు. చేదిరాజు శిశుపాలుడు మందువిందులో తేలియాడుతున్నాడు. ‘‘ఆనందానికి అంతరాయం కలుగలేదు కదా’’ అంటూ అప్పుడే అక్కడకు వచ్చాడు నారదుడు. ‘‘ఇది నిరంతరం సాగే నిత్యానందం’’ అన్నాడు దంతవక్త్రుడు. ‘‘ఈ ఆనందం తాత్కాలికమే కాని శాశ్వతం కాదు దంతవక్త్రా’’ వేదాంత ధోరణిలో అన్నాడు నారదుడు. ‘‘శాశ్వత ఆనందమార్గం?’’ అడిగాడు చేదిరాజు. ‘‘సంసారత్యాగం చేసి సన్యాసులం కావడమే’’ కాస్త వ్యంగ్యంగా అన్నాడు దంతవక్త్రుడు. ‘‘నారాయణ నారాయణ... ఆ యోగం అందరికీ లభ్యం కాదయ్యా. తగిన రాచకన్యను పెళ్లాడి సాటి రాజుల్లో కీర్తిని సంపాదించండి’’ అని సలహా ఇచ్చాడు నారదుడు. ‘‘మా ఘనతకు తగ్గ కన్య తారసిల్లాలి కదా మహర్షి’’ అన్నాడు చేదిరాజు. ‘‘మీ ప్రాణస్నేహితుడు విదర్భరాకుమారుడు... ఆమె చెల్లెలు రుక్మిణీ...’’ గుర్తు చేశాడు నారదుడు. ‘‘చక్కగా గుర్తు చేశారు మహర్షి. ఆ బాలామణి అత్యంత సుందరీమణే’’ కళ్లలో సంతోషం ఉట్టిపడుతుండగా అన్నాడు చేదిరాజు. ‘‘దూరంగా ఉన్నవారని నిన్నే నమ్ముకున్నవారిని నిరాదరిస్తావా?’’ కాస్త ఆలకబూని అడిగాడు నారదుడు. ‘‘నిరాదరణా! అది నేను ఎన్నడూ చేయలేదే’’ అన్నాడు కృష్ణుడు. ‘‘సాక్షాత్తు ఆదిలక్ష్మి అవతారమైన రుక్మిణిదేవిని ఆ శిశుపాలునికి అంటగట్టబోతున్నారు. అహోరాత్రాలు నిన్నే కలవరించే ఆ రుక్మిణీదేవికి ఈ అవమానం జరగాల్సిందేనా!’’ విచారపడ్డాడు నారదుడు. రుక్మిణీదేవి కన్నీరుమున్నీరవుతోంది. ‘‘స్వామీ! ఎందుకు ఈ మౌనం. ఎంతకాలం ఈ ఏకాంతధ్యానం. నా మనసును ఎందుకు అపహరించావు?’’ తనలో తాను గొణుక్కుంటోంది రుక్మిణీదేవి. ఈలోపు చెలికత్తె పరుగెత్తుకు వచ్చి... ‘‘అమ్మా... అంతా అయిపోయిందమ్మా... పెళ్లి నిశ్చయమైపోయింది’’ అని ఆందోళనగా చెప్పింది. ‘‘నాకు తెలియకుండా ఎవరు వరుడు?’’ అని అడిగింది రుక్మిణి ‘‘ఆ శిశుపాలుడే’’ అని చెప్పింది చెలికత్తె. కృష్ణుడిని బొమ్మను చేతిలోకి తీసుకొని... ‘‘కృష్ణా! కృష్ణా!! ఈ సంబంధం నీకు ఇష్టం లేదని చెప్పు...’’ అంటూ కన్నీళ్లపర్యంతం అయింది రుక్మిణీదేవి. ‘‘ఈ వివాహం నాకు ఇష్టం లేదు అని చెప్పండి’’ అని చెప్పింది చెలికత్తె. ‘‘ఎలా చెప్పేది? ఇంతవరకు ఎన్నడూ అన్నయ్య మాటకు ఎదురాడలేదు’’ సంశయంగా అన్నది రుక్మిణీదేవి. ‘‘అలా అని మీ పచ్చని జీవితం పాడు చేసుకుంటారా. మీ ఆశయాలు, అనురాగాలు నాశనం చేసుకుంటారా!’’ అడిగింది చెలికత్తె. ‘‘అన్నయ్య తన పట్టేగానీ మన గోడు ఆలకించడు. ఈ కళ్యాణాన్ని ఆపగల సమర్థుడు ఆ వాసుదేవుడొక్కడే’’ కృష్ణుడిపై భారం వేస్తూ అన్నది రుక్మిణి. సమాధానం : శ్రీ కృష్ణావతారం -
బాలయ్య యాక్షన్.. ఎన్టీఆర్ వాయిస్..!
నందమూరి బాలకృష్ణ స్వయంగా నటిస్తూ నిర్మిస్తున్న సినిమా యన్.టి.ఆర్. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ బయోపిక్కు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా రెండు భాగాలుగా జనవరిలో రిలీజ్ కానుంది. తొలి భాగంలో ఎన్టీఆర్ సినీ జీవితం, రెండో భాగంలో ఆయన రాజకీయ జీవితాన్ని చూపించనున్నారు. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ రాజకీయ ప్రసంగాలను ప్రత్యేకంగా చూపించనున్నారట. ఎంతో ఆవేశంగా సాగే ఎన్టీఆర్ ప్రసంగాలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. అందుకే సినిమాలో ఆ సన్నివేశాలకు మరింత స్కోప్ ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. అంతేకాదు ఆ సన్నివేశాల్లో బాలయ్య ఎన్టీఆర్ పాత్రలో కనిపించినా.. డబ్బింగ్ మాత్రం చెప్పటం లేదట. అప్పట్లో ఎన్టీఆర్ చేసిన ప్రసంగాల వాయిస్కే బాలయ్య యాక్ట్ చేస్తారట. అంటే బాలయ్య తెర మీద కనిపించినా గొంతు మాత్రం సీనియర్ ఎన్టీఆర్‌దే వినిపిస్తుందనమాట. ప్రస్తుతం ఈ ప్రచారం టాలీవుడ్ లో గట్టిగానే జరుగుతోంది. మరి ఈ వార్తలపై చిత్రయూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి. -
టీడీపీ కార్యకర్తలు ఈ చర్యను అడ్డుకోవాలి
-
అమ్మకానికి 'అన్న'గారి ఇళ్లు
-
అమ్మకానికి 'అన్న'గారి ఇళ్లు
సాక్షి, ప్రతినిధి, చెన్నై: 28 బజుల్లా రోడ్.. టీ నగర్.. చెన్నై.. దూర ప్రాంతాల నుంచి అక్కడకు తరలివెళ్లే అభిమానులకు ఆ ఇల్లు మరో తిరుపతి! అన్నగారి పట్ల అంతులేని అనురాగానికి అది చిరునామా. తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన అన్న నందమూరి తారక రామారావు నివాసం ఇప్పుడు అంగడి సరుకుగా మారింది. ఎన్నో అనుబంధాలు, మధుర జ్ఞాపకాలకు గుర్తుగా నిలిచిన చెన్నైలోని ఎన్టీఆర్ నివాసం కొనుగోలు చేసేవారి కోసం దీనంగా ఎదురు చూస్తోంది. బ్రోకర్ ఏలుమలై పేరు, సెల్‌ఫోన్ నెంబర్‌తో ఆ ఇంటి గేటుకు వేలాడుతున్న బోర్డు తెలుగు ప్రజల హృదయాలను కలచివేస్తోంది. ఎన్టీఆర్‌కు ఆ ఇంటితో అనుబంధం గురించి ఆయనతో అత్యంత సన్నిహితంగా మెలిగిన ఓ వ్యక్తి అందించిన వివరాలు ఇవీ... బెడ్రూం పక్కనే పిల్లల గది... ఎన్టీఆర్ నటుడిగా స్థిరపడిన తరువాత చెన్నై రంగరాజపురంలో ఓ చిన్న ఇంటిని కొనుగోలు చేశారు. ఆయన రాకతో ఆ వీధి ఎన్టీఆర్ స్ట్రీట్‌గా మారింది. అక్కడ ఉండగా ఒక కుక్కను పెంచుకుంటూ షూటింగ్ లేని సమయాల్లో దానితో గడిపేవారు. (బజుల్లా రోడ్డుకి మారిన తర్వాత ఆ కుక్కను, ఇంటిని తన సోదరుడు త్రివిక్రమరావుకు అప్పగించారు) అనంతరం ఆర్థిక పరిస్థితి మెరుగుపడిన తరువాత ఆనాటి ప్రముఖ హాస్య నటుడు కస్తూరి శివరావు నుంచి బజుల్లా రోడ్డులోని ఇంటిని 1953లో కొనుగోలు చేశారు. రెండంతస్థుల ఆ ఇంటికి కొద్దిగా మెరుగులు దిద్ది నివాసం, ఆఫీస్ అక్కడే ఏర్పాటు చేసుకున్నారు. గేటు దాటి ప్రవేశించగానే రెండు ఏనుగుల బొమ్మలు అందంగా కనిపించేవి. మిద్దెపైన పిల్లల గదులు, ఆయన బెడ్రూం ఉండేది. కింద పోర్షన్లో ఆఫీస్, సందర్శకుల కోసం మరో గది, మేకప్ రూం ఉండేవి. కంటిచూపు సరిగా కనపడని ప్రసాద్ అనే వ్యక్తి ఆయనకు మేనేజర్‌గా వ్యవహరించేవారు. ఆయన్ను ‘కళ్లజోడు’ ప్రసాద్ అని పిలిచేవారు. ఎన్టీఆర్ కూర్చునే గదిలో తల్లిదండ్రుల ఫోటో, ఆరుగురు కూర్చునే సోఫా, ఆయన కోసం ఒక విలాసవంతమైన కుర్చీ ఉండేది. 6.00 గంటలకు చికెన్‌తో భోజనం ... ఎన్టీఆర్ నిత్యం తెల్లవారుజామున 3.30 గంటలకు నిద్ర లేచేవారు. మేడపై నుంచి దిగుతూ గట్టిగా గొంతు సవరించుకునేవారు. అది వినపడగానే ఆయన కోసం వేచి ఉండే వారంతా అప్రమత్తమయ్యేవారు. తనను కలిసేందుకు వచ్చిన వారితో మాట్లాడిన అనంతరం ఉదయం 6.00 గంటలకు కొద్దిగా చికెన్‌తో కలిపి భోజనం చేసేవారు. ఏ ఊరు మనది...? ఎన్టీఆర్ 7.00 గంటలకు మేకప్‌తో బయటకు వచ్చి మెయిన్ గేటు తెరవాలని ఆదేశించటమే ఆలస్యం అప్పటికే అక్కడ గుమికూడిన అభిమానులు ఇంటి వరండాలోకి చేరుకునేవారు. రెండు చేతులూ జోడించి వారికి నమస్కరిస్తూ ‘ఏ ఊరు మనది..?’ అంటూ గంభీరంగా ప్రశ్నించేవారు. ‘షూటింగ్ చూస్తారా...?’ అని అభిమానులను ప్రశ్నించి అందుకు ఏర్పాట్లు కూడా చేసేవారు. నేలపైనే ఆయన నిద్ర... భక్తి ప్రపత్తులు ఎక్కువగా కలిగిన ఎన్టీఆర్‌కు చాలా సెంటిమెంట్లు ఉండేవి. ఆదివారం పూర్తిగా ధవళ వస్త్రాలు ధరించి నుదుటిన అడ్డంగా విభూది పెట్టుకునేవారు. ఎవరికైనా ఆర్థిక సాయం చేయదలిస్తే తన చేత్తో కాకుండా భార్య బసవతారకం లేదా ఇతరుల చేతుల మీదుగా అందించేవారు. వారు అందుబాటులో లేని పక్షంలో సమీపంలోని కుర్చీ లేదా గోడపై డబ్బును ఉంచి తీసుకోమనేవారు. రాత్రి 8.30 గంటలకు నిద్ర పోవడానికి ముందుగా చపాతి తిని పాలు తాగేవారు. ప్రతి రోజూ నేలపైనే ఒంటరిగా పడుకునేవారు. దిగ్గజాలను మళ్లీ కలిపిన ప్రేమాభిషేకం.. ఎన్టీఆర్, ఏఎన్నార్‌ల మధ్య వృత్తిపరమైన విభేదాలు తలెత్తిన సమయంలో ప్రేమాభిషేకం చిత్రం వారిని తిరిగి కలిపింది. ఈ సినిమా కచ్చితంగా ఏడాది ఆడుతుందని ఏఎన్నార్ గ్రేట్ అని ఎన్టీఆర్ ప్రశంసించారు. ఊటిలో షూటింగ్లో ఉన్న ఏఎన్నార్‌కు ఫోన్ చేసి సినిమా సూపర్‌హిట్ అని చెప్పారు. ప్రొడక్షన్ వాళ్లు యావరేజ్ అంటున్నారని అక్కినేని చెప్పగా.. లేదు సూపర్ హిట్ అవుతుందని చెప్పి తన ఇంటికి భోజనానికి ఆహ్వానించారు. ఈ సినిమాలో హీరోగా తాను కూడా చేయలేనని చెప్పి ఎన్టీఆర్ గొప్ప మనసు చాటుకున్నారు. ‘బ్రదర్.. మన ఇద్దరి మధ్యన ఎవరెవరో ఏదో పెడుతుంటారు. మనం సర్దుకుపోవాలి..’ అని ఏఎన్నార్‌కు స్నేహహస్తం అందించారు. -
తాత సెంటిమెంట్‌ని నమ్ముకున్న నందమూరి హీరో
పటాస్ సినిమాతో చాలా కాలం తరువాత ఫాంలోకి వచ్చిన యంగ్ హీరో కళ్యాణ్ రామ్, ప్రస్తుతం ఇజం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. తన కెరీర్లోనే బిగెస్ట్ బడ్జెట్‌తో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై కళ్యాణ్ రామ్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఇజం ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు ఈ నయా సిక్స్ ప్యాక్ హీరో. అదే డేట్ రోజు తన తాత హీరోగా తెరకెక్కిన మూడు సినిమాలు రిలీజ్ అయి ఘనవిజయాలుగా నిలిచాయి. 1955లో జయసింహా, 1970లో కోడలు దిద్దిన కాపురం, 1977లో యమగోల సినిమాలు అక్టోబర్ 21నే రిలీజ్ అయి సూపర్ హిట్స్‌గా నిలిచాయి. దీంతో ఇజం సినిమా కూడా మంచి సక్సెస్ సాధిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు కళ్యాణ్ రామ్ అండ్ టీం. -
అన్నగారితో సిల్లీబ్రాండ్