
సీనియర్ ఎన్టీఆర్ ఏ పాత్రలో నటించినా ఆ పాత్రకే వన్నె వస్తుందనడంలో అతిశయోక్తి లేదు. ఆయన భగవంతుడిగా వేషం కట్టినప్పుడయితే.. నిజంగానే ఆ దేవుడే ఈయన రూపంలో ఉన్నాడేమో అనేంతగా తేజస్సుతో ఉట్టిపడేవారు. ఎంతోమంది ఆయన్ను దైవంగా కొలిచేవారు కూడా! ఇక సీనియర్ ఎన్టీఆర్ నిజ జీవిత విషయానికి వస్తే ఆయన మొదటి భార్య పేరు బసవతారకం. వీరికి 12 మంది సంతానం. సినిమా షూటింగ్స్ సమయంలో ఎన్టీఆర్ హీరోయిన్ కృష్ణ కుమారితో లవ్‌లో పడ్డారు. ఆమెను పెళ్లి కూడా చేసుకుందామనుకున్నారు.
ఆనాటి వారి ప్రేమ విషయాన్ని గతంలో ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది కృష్ణ కుమారి సోదరి, నటి షావుకారు జానకి. 'ఎన్టీఆర్- కృష్ణ కుమారి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారంటూ ఓ టాక్ నడిచింది. కానీ అప్పటికే ఆయనకు 11 మంది పిల్లలు. నిజంగా వీరి పెళ్లి జరిగి ఉంటే నా చెల్లెలికి అంత శ్రేయస్కరంగా ఉండేది కాదేమో! అయితే వీళ్లు విడిపోయారో, గొడవపడ్డారో తెలీదు కానీ, కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలో కృష్ణ కుమారి ఒక్క ఫోన్ కాల్‌తో 17 సినిమాలు క్యాన్సిల్ చేసుకుంది. తర్వాత ఆమె ఓ సీనియర్ జర్నలిస్ట్ అజయ్ మోహన్ కైఠాన్‌ను పెళ్లి చేసుకుంది. కానీ అప్పుడు ఓ బడా నిర్మాత ఫోన్ చేసి కైఠాన్‌తో మీ చెల్లి పెళ్లి ఆపండన్నారు. కానీ నేను ఆ పని చేయనని చెప్పాను' అంటూ ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది షావుకారు జానకి.
చదవండి: కార్తికేయ 2 ఈ ఓటీటీలోకే రాబోతోంది!
బ్రెయిన్ పని చేయని స్థితిలో కమెడియన్
Comments
Please login to add a commentAdd a comment