
'నీ పాపం పండెను నేడు.. నీ భరతం పడతా చూడు..' ఇది సినిమా పాటే అయినా ప్రస్తుత పరిస్థితులకు చక్కగా సరిపోతుంది. దొంగగడ్డి మేసే గొడ్డయినా కట్టుకొయ్య వద్దకు రాక తప్పదు అన్నట్లు దొంగపనులు, పాపాలు చేసిన చంద్రబాబు ఆ పాపాలకు మూల్యం చెల్లించుకోకా తప్పదు. దొరికినకాడికి దోచుకున్న బాబు ఇటీవలే కటకటాలపాలైన సంగతి తెలిసిందే! నేడు(సెప్టెంబర్ 23న) ఆయన సీఐడీ విచారణకు హాజరయ్యాడు. ఇక్కడ ఓ ఆసక్తికర విషయం చెప్పుకోవాలి.
అన్యాయాన్ని చీల్చి చెండాడే ఆఫీసర్‌గా ఎన్టీఆర్
సరిగ్గా 58 ఏళ్ల కిందట ఇదే రోజు C.I.D. సినిమా విడుదలైంది. ఈ సినిమాలో హీరోగా నటించింది ఎవరనుకుంటున్నారు? ఎన్‌టీ రామారావు. తాపి చాణక్య డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ సీఐడీ ఆఫీసర్ రవి పాత్ర పోషించారు. తండ్రి చలపతిగా గుమ్మడి వెంకటేశ్వరరావు నటించారు. అన్యాయాన్ని సహించలేని తత్వం హీరోదైతే, దురలవాట్లు, అక్రమాలతో అడ్డదారిలో డబ్బు సంపాదించి జల్సా చేసే తత్వం ఆయన తండ్రిది.
C.I.D కథ ఇదీ..
ఈ క్రమంలోనే ఓ వ్యక్తిని చంపి అజ్ఞాతంలోకి వెళ్లిపోతాడు చలపతి. తాను చనిపోయినట్లు నమ్మించి తర్వాత బాబా అవతారమెత్తి మరెన్నో తప్పులు చేస్తాడు. మరోవైపు అతడి కొడుకు రవి పెద్ద చదువులు చదివి సీఐడీ ఆఫీసర్‌గా మారతాడు. బ్యాంకుకు కన్నం వేసిన బాబా గ్యాంగ్‌ను పట్టుకునేందుకు వేట మొదలుపెడతాడు. చట్టం కళ్లు తప్పి ఎవరూ తప్పించుకోలేరన్నట్లు చివరకు కొడుకు చేతిలోనే అరెస్ట్ అవుతాడు చలపతి. ఇదీ సీఐడీ సినిమా కథ!
అప్పుడు సీఐడీ రిలీజ్.. ఇప్పుడు సీఐడీ విచారణలో బాబు
వెనక్కు తిరిగి చూసుకుంటే లెక్కలేనన్ని తప్పులు చేసిన చంద్రబాబు సైతం చివరకు అరెస్ట్ అవక తప్పలేదు. నేడు, రేపు సీఐడీ బృందం చంద్రబాబును విచారించనుంది. ఎన్టీఆర్ సీఐడీ సినిమా రిలీజైన రోజే చంద్రబాబు సైతం సీఐడీ విచారణకు హాజరవడం యాధృచ్చికమే అయినా పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో దీని గురించి పోస్టులు పెడుతున్నారు. వెన్నుపోటు పాపం ఊరికే పోలేదంటూ కామెంట్లు చేస్తున్నారు.
చదవండి: బాలయ్య ఇవన్నీ మరిచిపోయావా..?
Comments
Please login to add a commentAdd a comment