NT Rama Rao
-
రైతు ప్రధానికి సముచిత గౌరవం
పేదవర్గాలకు ఎనలేని సేవలందించిన భారత మాజీ ప్రధానమంత్రి దివంగత చరణ్ సింగ్‌కు ఆయన చనిపోయిన 45 ఏళ్ళ తర్వాత కేంద్ర ప్రభుత్వం ‘భారత రత్న’ అవార్డుకు ఎంపిక చేయటం హర్ష ణీయం. అదే విధంగా తెలుగుజాతికి ప్రపంచంలో గుర్తింపు తెచ్చిన ఎన్టీ రామా రావుకు కూడా భారతరత్న ఇస్తే సముచితంగా ఉంటుంది. 1977లో ఎమర్జెన్సీ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఇందిరాగాంధీని ఓడించటంలో చరణ్ సింగ్‌ది ప్రధానపాత్ర. వాస్త వానికి 1971 ఎన్నికలలో రాయబరేలీలో ఇందిరమ్మపై పోటీచేసిన రాజ్ నారాయణ్ ఎన్నికల పిటిషన్ వేసి, అలహాబాద్ హైకోర్టులో నెగ్గడం వెనుక కూడా చరణ్‌సింగ్ చాణక్యం లేకపోలేదు. మధు లిమాయే 1977లో ఒక మాటన్నారు: ‘ఉత్తరభారతంలో రామ్ మనోహర్ లోహియా విఫలం కాగా చరణ్ సింగ్ సమర్థంగా వ్యవ సాయ కులాలను, మైనార్టీలను, వెనుకబడిన వర్గాలను గుదిగుచ్చి మాల తయారు చేయటంలో విజయం సాధించారు.’ 1937లో చరణ్ సింగ్ రెవిన్యూ మంత్రిగా ఉత్తరప్రదేశ్‌లో రైతురుణ విమోచన చట్టం తెచ్చి, రైతాంగాన్ని ఆనాడే అప్పుల బాధ నుండి బయట పడేశారు. 1979లో చరణ్‌సింగ్ ఆర్థికశాఖను చేపట్టి 1979–80 ఫిబ్రవరి 28న బడ్జెట్‌ను ప్రతిపాదించారు. ఆ సందర్భంలో ఓ రోజు ఉదయం ఫిబ్రవరి మొదటివారంలో చరణ్‌సింగ్‌ను కలుద్దామని తుగ్లక్ రోడ్డుకెళ్ళాను. అప్పట్లో ఆయన ఉప ప్రధానిగా కూడా ఉన్నారు. చరణ్ సింగ్ ఇంటి ముందు మూడు కార్లున్నాయి. వాటినిండా ఫైళ్ళు మూట గట్టి నింపేస్తున్నారు. వ్యక్తిగత భద్రతాధికారి కర్తార్ సింగ్ నన్ను చూడగానే, ‘చౌధరీ సాబ్ బడ్జెట్ రూపొందించేందుకై హరియాణాలోని సూరజ్‌కుండ్‌కు వెళ్తు న్నారు. నీవు ఇక్కడే ఉండు, చౌధరీసాబ్ బయటకు రాగానే కనపడ’ మని సలహా చెప్పారు. వాకిలి వద్దే నిలుచున్నాను. చౌధరీ బయటకు రాగానే నన్ను చూసి ‘ఏమిటింత ప్రొద్దున్నే వచ్చావు. గొడ్డుచలిలో?’ అని వాకబు చేశారు. ‘రెండు, మూడు సమస్యలున్నాయి. బడ్జెట్ ప్రతిపాదనలలో పొందుపరచాలి’ అని వివరించాను. కారు ఎక్కమన్నారు. వెనుక సీటులో చౌధరీసాబ్ పక్కన కూర్చున్నాను. ముందు సీటులో కర్తార్ సింగ్ కూర్చున్నారు. రైతులు పండించే పొగాకుపై ఎక్సైజ్ సుంకం రద్దుచేయవలసిన అవసరాన్ని వివరించాను. అదే మాదిరి పేదవారు వాడుకొనే అల్యూమినియం పాత్రలపై కూడా సుంకం తొలగించాలని వివరించాను. దానికి సంబంధించిన వివరాలతో, ముసాయిదా పత్రాన్ని కూడా తయారు చేశానని చెప్పాను. ఆ పత్రాలు లాక్కొని తన ఫైలులో పెట్టుకొన్నారు. ఆ రెంటినీ బడ్జెట్ ప్రతిపాదనలలో పొందుపరిచారు. చాలా ఆశ్చర్యమేసింది. అంతకు ముందు బడ్జెట్లు రూపొందించే కసరత్తులో భాగంగా సలహాల కోసం బొంబాయి వెళ్ళి ఆర్థికవేత్తలు, ప్రణాళికా నిపుణులు, పారిశ్రామిక, వాణిజ్య వర్గాల వారు, పాలనాదక్షులతో చర్చలు జరిపితే బడ్జెట్ మరింత నాణ్యంగా రూపొందించడానికి ఉపయోగపడగలదని సూచించాను. సరేనన్నారు. బొంబాయి సమావేశంలో పాల్గొన్న పెద్దలు చెప్పినవన్నీ జాగ్రత్తగా రికార్డు చేయించి, ఆ కాగితాలు తీసుకొని ఆ సూచనలలో ప్రతి ఒక్కదానికీ పూర్తి వ్యతిరేకంగా బడ్జెట్ ప్రతిపాద నల్లో చేర్చారు. ‘బొంబాయిలోని వారంతా బడా బాబులు. వారు చెప్పినదానికి పూర్తి వ్యతిరేకంగా చేస్తే, మనం సరైన మార్గంలో ఉన్నట్లు! మనం చేసిన పని బాగుందని వారు కితాబిస్తే మనం ఎక్కడో తప్పు చేశామని అర్థం! అని గీతోపదేశం చేశారు. 1979 జులైలో జనతాపార్టీ చీలిపోయింది. మొరార్జీ స్థానంలో చరణ్ సింగ్ ప్రధాన మంత్రి అయ్యారు. ఆయన కాలంలో లోక్ సభ రద్దయి, మధ్యంతర ఎన్నికలు ప్రకటించారు. డీసీఎం అధిపతి అయిన భరత్ రామ్ భారత వాణిజ్య, పారిశ్రామిక మండలి అధ్యక్షులుగా చరణ్ సింగ్ దగ్గరకు వెళ్లి ఆయనకు ఎన్నికల నిధి ఇవ్వజూపారు. ఏమిటిదని అడిగారు చరణ్ సింగ్. ‘ఏమీ లేదు – ఇది మామూలే. ప్రతి ఎన్నికల సమయంలోనూ ప్రధానమంత్రు లందరికీ మేము ఇలాగే సమర్పించుకొంటుంటాం. ఇందులో కొత్త ఏమీలేదు. ఇప్పుడు ప్రధాని కుర్చీలో మీరు కూర్చున్నారు గనుక మీకు సమర్పిస్తున్నాం’ అన్నారు. ‘ఏమిటీ నాకు డబ్బులిస్తావా? పోలీసులకు అప్ప జెబుతాను. నేను రైతుల దగ్గరికెళ్ళి రూపాయి – రూపాయి అడుక్కొంటాను గానీ, పారిశ్రామికవేత్తల విరాళాలతో ఎలక్షన్‌కు వెళ్తానా?’ అని కోపగించారు చరణ్ సింగ్. భరత్ రామ్ రాష్ట్రపతి భవన్ కెళ్ళి రాష్ట్రపతిగా ఉన్న నీలం సంజీవరెడ్డిని కలిసి ‘భలేవాడిని ప్రధాన మంత్రిగా చేశారు సార్. ఎన్నికల నిధికి ఏదో పదిరూపాయలిద్దామని వెడితే, అరెస్ట్ చేయిస్తానని వెంటబడతాడే మిటి సార్’ అని వాపోయారు. ఎమ్వీఎస్ సుబ్బరాజు, గణపా రామస్వామి రెడ్డి, దొడ్డపనేని ఇందిర జనతాపార్టీ శాసనసభ్యులు, నీలం సంజీవరెడ్డికి ఆత్మీయులు. వారు వాస్తవానికి మానసికంగా లోక్ దళ్‌కూ, చరణ్ సింగ్ భావజాలానికీ దగ్గర. వారిని పిలిపించారు సంజీవరెడ్డి. ‘ఇదెక్కడ గోలయ్యా. తుండు, తుపాకీ లేకుండా యుద్ధానికి వెళతానంటాడు. ఎవరో పెద్దమనిషి పది రూపాయ లిస్తానంటే అరెస్టు చేయిస్తానంటాడు. ఈ సిద్ధాంత మూర్ఖుడితో కూడుగాదు, మీరు కాంగ్రెస్‌లో చేరిపోండి’ అని సలహా ఇచ్చారు. అలాగే చేశారు వారు ముగ్గురూ. ప్రధానమంత్రిగా నుండగా 1979 అక్టోబరులో గుంటూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ. చౌధరీ సాబ్ ఉపన్యా సాన్ని తెలుగులోకి నేనే తర్జుమా చేశాను. ‘శివాజీ, నా ఉపన్యాసం కన్నా, నీ తర్జుమా మరింతగా శ్రోతలను ఆకట్టుకొంది. లేకుంటే సభ అంత రక్తికట్టేది కాదు’ అని సభానంతరం మనసారా అభినందించారు చరణ్ సింగ్. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఉన్న ఓట్ల చీలిక వల్లనే కాంగ్రెస్ నెగ్గు కొస్తున్నదనీ, ఆ పార్టీలన్నీ ఐక్యం అయితే కాంగ్రెస్ పాలన ముగు స్తుందనీ చరణ్ సింగ్ విశ్వాసం. ఆ దిశగా ఆలోచన చేసే 1974 ఆగస్టు 29న భారతీయ క్రాంతిదళ్, సోషలిస్టుపార్టీ, సంయుక్త సోషలిస్టు పార్టీలు, ముస్లిం మజ్లిస్, స్వతంత్ర పార్టీ, రాష్ట్రీయ లోక్ దళ్, మజ్దూర్ పార్టీ, పంజాబ్ ఖేతీ భారీ జమీందారీ యూనియన్లను విలీనం గావించి భారతీయ లోక్‌దళ్‌ను రూపొందించారు. జాతీయ స్థాయిలో నిరంతరం రైతుల కోసం పరితపించిన చరణ్ సింగ్‌కు భారతరత్న ఇవ్వటం ఎంతో సముచితం. కేంద్ర ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాన్ని రైతులందరూ స్వాగతిస్తున్నారు. డా‘‘ యలమంచిలి శివాజి వ్యాసకర్త రాజ్యసభ మాజీ సభ్యుడు ‘ 98663 76735 -
'తాతను మరచి ముందుకు సాగిన మనుమడి' పాదయాత్ర!
అనకాపల్లి: జెండాల హడావుడే గానీ జనం సందడి లేని నారా లోకేష్ పాదయాత్ర జిల్లాలో పేలవంగా ప్రారంభమైంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి చేపట్టిన ‘యువగళం’ తొలిరోజు చప్పగా సాగింది. జేజేలు పలకాల్సిన పార్టీ శ్రేణులు నిరసన గళానికే ప్రాధాన్యమిచ్చాయి. తుని పర్యటన ముగించుకుని సోమవారం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో లోకేష్ పాయకరావుపేటలోకి అడుగుపెట్టారు. గౌతం సెంటరు వద్ద మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత తన అనుయాయులతో స్వాగతం పలికారు. జనం ఆసక్తి చూపకపోయినా.. అదే సమయానికి సినిమాహాళ్ల నుంచి బయటకు వచ్చినవారు, భవన నిర్మాణ పనులకు వెళ్లిన కార్మికులు, విధులు ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్లే ఉద్యోగులు కనిపించడంతో పార్టీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు. మెయిన్‌రోడ్డులో పార్టీ ఫ్లెక్సీలు, జెండాలతో నింపేసినా తెలుగు తమ్ముళ్ల జాడ అంతంతమాత్రంగానే ఉంది. పాయకరావుపేటలో అనిత వ్యతిరేక, అనుకూల వర్గాలు ఎవరికి వారు వేర్వేరుగా లోకేష్‌కు స్వాగతం పలికేందుకు రావడం గమనార్హం. పాదయాత్రలో జనసేన కార్యకర్తలు పెద్దగా పాల్గొనలేదు. ఆ పార్టీ నాయకులు గెడ్డం బుజ్జి, మాజీ ఎమ్మెల్సీ లక్ష్మీశివకుమారి లోకేష్‌ను కలిశారు. ఈ పాదయాత్రలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, మాజీ మంత్రులు అయ్యన్నపాత్రుడు, బండారు సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యేలు కళా వెంకటరావు, గండి బాబ్జీ, మాజీ ఎమ్మెల్సీ బుద్దనాగజగదీష్ తదితరులు పాల్గొన్నారు. తాతను మరచిన మనుమడు లోకేష్ పాదయాత్ర గౌతం సెంటరు, మంగవరంరోడ్డు మీదుగా పాయకరావుపేట వై జంక్షన్‌కు చేరుకుంది. అక్కడ దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విగ్రహం ఉంది. ఈ విగ్రహం ముందు నుంచే లోకేష్ జాతీయ రహదారిపైకి చేరుకున్నారు. తాత విగ్రహం ముందు నుంచి వెళ్లి కూడా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించకపోవడం పట్ల తెలుగు తమ్ముళ్లు విస్తుపోయారు. చెట్టు పేరు చెప్పుకుని కాయలమ్ముకుంటున్నారని, ఆయన పెట్టిన పార్టీ లాక్కుని పదవులు అనుభవిస్తూ కనీసం ఆయన విగ్రహానికి దండ వేయకపోవడమేంటని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అనితకు అసమ్మతి సెగలు! యువగళం పాదయాత్రలో నియోజకవర్గంలో పార్టీ కుమ్ములాటలు మరోసారి బయటపడ్డాయి. నారా లోకేష్ సాక్షిగా మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనితకు నిరసన సెగ తగిలింది. అనిత అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న పార్టీ మాజీ జిల్లా ఉపాధ్యక్షుడు గొర్లె రాజబాబు, మాజీ పట్టణ అధ్యక్షుడు మజ్జూరి నారాయణరావు జీవీఆర్ నగర్ వద్ద ఉన్న వంగవీటి మోహన్‌రంగా విగ్రహం వద్ద అనిత ఫొటో లేకుండా ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. లోకేష్ పాదయాత్ర అక్కడకు చేరుకోగానే అనిత వద్దు, టీడీపీ ముద్దు అంటూ నినాదాలు చేశారు. ఈ నినాదాలు గమనించిన అనిత వెంటనే అక్కడకు వచ్చి వారిని సముదాయించే ప్రయత్నం చేయగా ‘మమ్మల్ని పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయించారు. మేం చేసిన తప్పేంటి’ అని నిలదీశారు. లోకేష్ వారిని సముదాయించి యాత్ర కొనసాగించారు. బైపాస్ జంక్షన్, ప్రకాష్ కళాశాల, పీఎల్‌పురం, సీతారాంపురం మీదుగా నామవరం చేరుకొని, అక్కడ ప్రైవేటు లేఅవుట్లో రాత్రి బస చేశారు. ఇవి చదవండి: 15న మంత్రివర్గ సమావేశం -
ఆనాడు సీఐడీ ఆఫీసర్‌గా NTR.. చంద్రబాబును ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
'నీ పాపం పండెను నేడు.. నీ భరతం పడతా చూడు..' ఇది సినిమా పాటే అయినా ప్రస్తుత పరిస్థితులకు చక్కగా సరిపోతుంది. దొంగగడ్డి మేసే గొడ్డయినా కట్టుకొయ్య వద్దకు రాక తప్పదు అన్నట్లు దొంగపనులు, పాపాలు చేసిన చంద్రబాబు ఆ పాపాలకు మూల్యం చెల్లించుకోకా తప్పదు. దొరికినకాడికి దోచుకున్న బాబు ఇటీవలే కటకటాలపాలైన సంగతి తెలిసిందే! నేడు(సెప్టెంబర్ 23న) ఆయన సీఐడీ విచారణకు హాజరయ్యాడు. ఇక్కడ ఓ ఆసక్తికర విషయం చెప్పుకోవాలి. అన్యాయాన్ని చీల్చి చెండాడే ఆఫీసర్‌గా ఎన్టీఆర్ సరిగ్గా 58 ఏళ్ల కిందట ఇదే రోజు C.I.D. సినిమా విడుదలైంది. ఈ సినిమాలో హీరోగా నటించింది ఎవరనుకుంటున్నారు? ఎన్టీ రామారావు. తాపి చాణక్య డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ సీఐడీ ఆఫీసర్ రవి పాత్ర పోషించారు. తండ్రి చలపతిగా గుమ్మడి వెంకటేశ్వరరావు నటించారు. అన్యాయాన్ని సహించలేని తత్వం హీరోదైతే, దురలవాట్లు, అక్రమాలతో అడ్డదారిలో డబ్బు సంపాదించి జల్సా చేసే తత్వం ఆయన తండ్రిది. C.I.D కథ ఇదీ.. ఈ క్రమంలోనే ఓ వ్యక్తిని చంపి అజ్ఞాతంలోకి వెళ్లిపోతాడు చలపతి. తాను చనిపోయినట్లు నమ్మించి తర్వాత బాబా అవతారమెత్తి మరెన్నో తప్పులు చేస్తాడు. మరోవైపు అతడి కొడుకు రవి పెద్ద చదువులు చదివి సీఐడీ ఆఫీసర్‌గా మారతాడు. బ్యాంకుకు కన్నం వేసిన బాబా గ్యాంగ్‌ను పట్టుకునేందుకు వేట మొదలుపెడతాడు. చట్టం కళ్లు తప్పి ఎవరూ తప్పించుకోలేరన్నట్లు చివరకు కొడుకు చేతిలోనే అరెస్ట్ అవుతాడు చలపతి. ఇదీ సీఐడీ సినిమా కథ! అప్పుడు సీఐడీ రిలీజ్.. ఇప్పుడు సీఐడీ విచారణలో బాబు వెనక్కు తిరిగి చూసుకుంటే లెక్కలేనన్ని తప్పులు చేసిన చంద్రబాబు సైతం చివరకు అరెస్ట్ అవక తప్పలేదు. నేడు, రేపు సీఐడీ బృందం చంద్రబాబును విచారించనుంది. ఎన్టీఆర్ సీఐడీ సినిమా రిలీజైన రోజే చంద్రబాబు సైతం సీఐడీ విచారణకు హాజరవడం యాధృచ్చికమే అయినా పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో దీని గురించి పోస్టులు పెడుతున్నారు. వెన్నుపోటు పాపం ఊరికే పోలేదంటూ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: బాలయ్య ఇవన్నీ మరిచిపోయావా..? -
Balayya : బాలయ్య ఇవన్నీ మరిచిపోయావా..?
పేరేమో నందమూరి బాలకృష్ణ.. మా బ్లడ్ వేరు, మా బ్రీడు వేరు అంటూ కామెంట్లు చేస్తూ అందరికంటే తాను మాత్రమే గొప్ప అనుకుంటూ భ్రమలో బతికేస్తుంటాడు బాలయ్య. సినిమాల్లో హీరోయిన్లు, ఇతర ఆర్టిస్టులతో అమర్యాదగా వ్యవహిరించినట్లుగా మొన్న యువగళం విజయోత్సవ సభలో ఆయన తీరు కనిపించింది. చంద్రబాబు తన బావమరిది అయిన బాలకృష్ణకు మైక్ ఇచ్చాడు. ఇంకేముంది దొరికిందే సందు అన్నట్టు ఆయన నోటికి పని చెప్పాడు. పిచ్చోడి చేతికి రాయి ఇస్తే ఎలా ఉంటుందో యువగళం సభలో మరోసారి బాలయ్య చేష్టలతో రుజువు చేశాడు. నోటికి ఏదొస్తే అది మాట్లాడి తాజాగా మరోసారి వార్తల్లోకి వచ్చాడు. వాస్తవానికి హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మానసిక రోగి అని వైద్యులు ఎప్పుడో ధ్రువీకరించారు. ఆ సర్టిఫికెట్ కూడా ఆయన వద్ద ఇప్పటికీ భద్రంగా తన బీరువాలో ఉంది. అందుకే ఆయన జోలికి ఎవరూ పోరు.. ఎందుకంటే గన్ తీసుకుని ఎవరిని, ఎక్కడ కాల్చిపడేస్తాడో అనే భయం. అంతే కాకుండా ఆయనకు చికిత్స అవసరమని కూడా మెడికల్ సర్టిఫికేట్లో వైద్యులు కూడా ధ్రువీకరించారు. కానీ తన బావ చంద్రబాబు రాజకీయ అండతో ప్రజల్లో తిరుగుతున్నాడు. కాలక్రమేనా రాజకీయ నాయకుడిగా మారిన ఈ నటుడు అభిమానులను శారీరకంగా లేదా అసభ్య పదజాలంతో కొట్టడం సరిపాటిగా జరుగుతున్నది. బాలయ్య మానసిక స్థితి గురించి అభిమానులకు కూడా తెలుసు కాబట్టి వారు కూడా సర్ధుకుపోతున్నారు. బాలయ్య కొట్టినా.. ఇష్టానుసారంగా కామెంట్లు చేసినా ఎగిరి గంతులేస్తూ ఆనందపడుతారు. తాజాగా ఏపీ అసెంబ్లీలో బాలయ్య చేష్టలు చూసిన వారంత అర్జెంట్‌గా ఆయన ఇంకా పరిణితి చెందాలంటున్నారు. గతంలో ఆయన ఖాతాలో ఇలాంటివి లెక్కలేనన్ని ఉన్నాయి. మహిళలపై గతంలో అసభ్యకర వ్యాఖ్యలు గతంలో నారా రోహిత్ సినిమా వేడుకలో మహిళల పట్ల బాలయ్య నోటి నుంచి జారిన అణిముత్యాలు ఇప్పటికీ ప్రజలు మరిచిపోలేదు. ‘అమ్మాయిల వెంటపడే పాత్రలు నేను చేస్తే ఒప్పుకోరు కదా! ముద్దయినా పెట్టాలి లేదా కడుపైనా చేయాలి. అంతే కమిట్ అయిపోవాలి. హీరో నారా రోహిత్‌కు మా పోలికలు కొద్దిగా అయినా రావాలి. గిల్లడాలు.. పొడవడాలు.. నేను ఎక్కని ఎత్తుల్లేవు.. చూడని లోతుల్లేవు.’ అని సభ్యసమాజమే సిగ్గుపడే వ్యాఖ్యలు చేశాడు ‘నాదో లోకం.నేను ఎలా వ్యవహరించినా..ఏం మాట్లాడినా తప్పులేదు’ అన్నట్టుగా ఆయన ఇప్పటికీ అలానే ప్రవర్తిస్తున్నాడు. మహిళలు, తెలుగు సంస్కృతీ సంప్రదాయాలపై గొప్పగొప్ప మాటలు చెప్పే బాలయ్య అసలు స్వరూపం ఇదే అని ప్రజలతో పాటు టీడీపీ కార్యకర్తలు కూడా ఎప్పుడో గ్రహించారు. అందుకే ఆయనకు దగ్గరగా వెళ్లేందుకు ఏ టీడీపీ నాయకుడు కూడా సాహసం చేయడు. బాధ్యాతాయుత ప్రవర్తన కాదది.! చంద్రబాబు బావ జైలుకు వెళ్లాడని ఏపీ అసెంబ్లీలో మీసం మెలేసి తొడ కొడుతున్న బాలయ్యపై నెటిజన్ల నుంచి విమర్శలు వస్తున్నాయి. కన్న తండ్రి మీద నాడు చంద్రబాబు చెప్పులేయిస్తుంటే వైస్రాయ్ హోటల్లో కూర్చొని 'అరె బావా ఏక్ పెగ్ లా' అంటూ మ్యాన్షన్ హౌస్ తీసుకుని చిందులేసి నిద్రపోలేకపోయావా అంటూ ప్రశ్నిస్తున్నారు. అప్పుడెందుకు తొడ కొట్టలేదు.? ఇదే పౌరుషం అప్పుడెందుకు చూపించలేదంటున్నారు. వెన్నుపోటు ఎపిసోడ్లో "ఎవడ్రా మా నాన్న గారి జోలికి వచ్చేదని ఎందుకు అడ్డంగా నిలబడలేదు..?" అని ఉంటే వ్యక్తిత్వంలో ఎంతో మిన్నగా ఉండిపోయేవారంటున్నారు. తండ్రి కన్నీరు పెడుతుంటే.. బావకు భజన చేసిన బాలయ్య జీవిత చరమాంకంలో తండ్రిని ఘోరంగా అవమానించి, మానసికంగా వేధించి ఆయన చావుకు ఎన్టీఆర్ వారసులు తలా ఒక చేయి వేశారనే విమర్శలు లేకపోలేదు. ఎన్టీఆర్‌కు పది మంది పిల్లలున్నప్పటికీ ఏ ఒక్కరూ తండ్రి ఆవేదనలో పాలు పంచుకోలేదు. పైగా ఆయన కన్నీళ్లకు కారకులై, తండ్రికి శాశ్వతంగా రుణపడ్దారనే చెడ్డపేరును తెచ్చుకున్నారు. ఇది చాలదన్నట్టు ఆ రోజు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడవడాన్ని సమర్థిస్తూ... అన్‌స్టాపబుల్ ఎపిసోడ్లో సమర్థించుకోవడం తనయుడిగా నందమూరి బాలకృష్ణకు నిజంగా సిగ్గుచేటే. తండ్రి కష్టాల్లో ఉంటే కొడుకు ఒక మూల స్థంబంలా నిలబడుతాడు. కానీ బాలయ్యకు ఆ ఆలోచన ఏమాత్రం లేదు. 'ఎన్టీఆర్ కడుపున పుట్టడం మీ అదృష్టం, ఆ పెద్దాయన దురదృష్టం' అని నెటిజన్లు తీవ్రస్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు. ఇలాంటి పిల్లల వల్లే చంద్రబాబు ఆటలు ఇన్నేళ్లపాటు నందమూరి కుటుంబంలో సాగాయని, మరే నాయకుడికి ఎన్టీఆర్‌కు పట్టిన దుస్థితి రాకూడదని నెటిజన్లు పోస్టులు పెట్టడం గమనార్హం. ఈ పని చేసి చెప్పు నీ బ్లడ్, బ్రీడు గురించి ఏనాడు అసెంబ్లీకి సాధారణంగా రాని బాలయ్య చంద్రం బావ కళ్లలో ఆనందం చూడటానికి మీసాలు తిప్పుతూ తొడలు కొడుతున్నాడని విమర్శలు వస్తున్నాయి. కన్నతండ్రి కంటే.. బావ ఎక్కువయ్యాడా బాలయ్యా..? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఎన్టీఆర్ లేకపోతే బాలయ్య ఎక్కడా..? బాలయ్య అడ్రస్ ఏంటీ..? ఎన్టీఆర్ లేకపోతే చంద్రబాబు ఎవడు..? చంద్రబాబు అడ్రస్ ఏంటీ..? జీవితం, రాజకీయ జీవితం ఇచ్చిన ఎన్టీఆర్ మీద చెప్పులేసినప్పుడు నీ పౌరుషాన్ని ఎక్కడ పెట్టుకున్నావు బాలయ్యా..? నీవు నిజమైన ఎన్టీఆర్ బిడ్డవైతే.. టీడీపీని ఇప్పటికైనా చేతిలోకి తీసుకో.. ఎన్టీఆర్ అభిమానులు తొడ గొట్టి, మీసాలు తిప్పేలా చేయ్.. అదీ ఒక వారసుడి లక్షణం.. అప్పుడు చెప్పు నీ బ్లడ్, బ్రీడు గురించి అని అన్నగారి అభిమానులు ఫైర్ అవుతున్నారు. రాజకీయ వారసుడిగా మారిన చంద్రబాబు నందమూరి వంశాన్నే కూలదోయాలని రాజకీయ చదరంగం ఆడటం చంద్రబాబు ఎప్పుడో మొదలు పెట్టాడు. అప్పటికే అన్నగారి బిడ్డ అయిన భువనేశ్వరిని పెళ్లి చేసుకుని నందమూరి ఇంట్లోనే రాజకీయ కాపురం చంద్రబాబు పెట్టాడు. అలా ఎన్టీఆర్‌కు అంతగా రాజకీయం గురించి తెలియదని పసిగట్టేశాడు. ఎంతైనా చంద్రబాబుది కాంగ్రెస్ బుర్ర కదా..! చాప కింద నీరులా తన వర్గాన్ని పెంచుకుంటూ వచ్చాడు.. రామోజీ లాంటి మీడియా అధిపతితో 1995 వరకు రహస్య స్నేహం చేసి ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి గద్దె దించారు. నిజానికి ఎన్టీఆర్‌కు కూడా రాజకీయం అంతగా తెలియదు. తెలిసుంటే బాబు చేతికి చిక్కేవారు కాదు. 1980ల్లో కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేకత ఎన్టీఆర్‌కు కలిసి వచ్చి సీఎం అయ్యారు. 1994లో కూడా కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేకతనే ఆయన మళ్లీ గెలిపించింది. కొన్నిరోజుల తర్వాత ఏపీ రాజకీయాల్లో నందమూరి పోయి నారా బ్రాండ్ వచ్చింది. ఎప్పటికైనా తనకు నందమూరి వారసులు నుంచి వ్యతిరేకత వస్తుందేమోనని తెలివిగా గ్రహించిన చంద్రబాబు మరో ప్లాన్ వేశాడు. తన కుమారుడు అయిన లోకేశ్‌కు బ్రాహ్మణిని జతకలిపాడు. ఇలా తన రాజకీయ చదరంగంలో బుర్రలేని బాలయ్యతో పాటు నందమూరి వారసులందరూ బలిపశువులు అయ్యారు. -
ఈ యుద్ధం ఓ వరం!
యుద్ధం అనాగరికం. అమానుషం. యుద్ధం ఒక విధ్వంసం. అది వినాశనానికి విశ్వరూపం. ఆయుధాలతో చేసేది మాత్రమే యుద్ధం కాదు. అధికార బలంతో చేసేది కూడా యుద్ధమే! అధికారం రాజకీయం మాత్రమే కానక్కరలేదు. ఆర్థికం కూడా! సామాజికం, సాంస్కృతికం కూడా! ఈ అంశాల్లో ఆధిపత్యం చలాయించేవాళ్లు సంఘంలో గుప్పెడుమంది మాత్రమే ఉండ వచ్చు. వారినే పెత్తందార్లని అంటున్నాము. విశాలమైన సామా న్యుల సమూహం మీద పెత్తందార్లు స్వారీ చేయడం కొత్త విషయం కాదు. ఆర్థిక – సామాజిక – సాంస్కృతిక ఆధిపత్యం అతి ప్రమాదకరమైన ఆయుధం. ఈ ఆయుధాన్ని చూసి మెజా రిటీ ప్రజలు ఝడుస్తూ జీవిస్తారు. ఇటువంటి స్థితినే కొందరు దోపిడీ అన్నారు. పీడన అన్నారు. అణచివేత అన్నారు. అణచివేతకు గురయ్యేవాడికి యుద్ధం కంటే కొన్నిసార్లు జీవితమే బీభత్సంగా కనిపిస్తుంది. తన జీవితం మీద ఎవరో దండయాత్ర చేస్తున్నట్టూ, దురాక్రమణ చేస్తున్నట్టూ అనిపిస్తుంది. జీవన్మృత్యువేదన గుండెలో కెలుకుతుంది. ఇంతకంటే చావోరేవో తేల్చే సాయుధ రణమే జీవన బృందావనంగా మదిలో మెదులుతుంది. స్పార్టకస్ కాలం నుంచి రెండువేల సంవత్సరాల మానవ ప్రస్థానంలో ఇటువంటి సందర్భాలు చాలానే కనిపిస్తాయి. అప్పుడు యుద్ధంలో విధ్వంసం కాదు, విముక్తి కనిపిస్తుంది. యుద్ధం ఓ వరంలా తోస్తుంది. సిద్ధాంతపరంగా చూస్తే ప్రజలే ప్రభువులుగా భావించే ప్రజాస్వామ్య వ్యవస్థలో అణచివేత ఉండకూడదు. నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వమనే నిట్టూర్పులు వినిపించకూడదు. నిరాశలు వ్యాపించకూడదు. సర్వమానవ సమతా పత్రాన్ని రాజ్యాంగంగా తలదాల్చిన భారతదేశంలో ఈపాటికే అసమానతలు తగ్గుముఖం పట్టి ఉండాలి. పెత్తందారీ భావజాలం మ్యూజియాల్లోకి చేరి ఉండాలి. కానీ అలా జరగ లేదు. ఆర్థిక అసమానతలు వెయ్యి రెట్లు పెరిగాయి. ఐక్యరాజ్య సమితి, ఆక్స్‌ఫామ్ ఇంటర్నేషనల్ సంస్థల నివేదికలు ఈ విష యాన్ని కుండబద్దలు కొట్టి చెబుతున్నాయి. సాంఘిక వివక్ష మరింత ఘనీభవించింది. అట్టడుగు వర్గాల ప్రజలు జారుడు మెట్ల మార్గంలో ప్రయాణిస్తున్నారు. అగ్రవర్ణ పేదలు కూడా ఇందుకు మినహాయింపు కాదు. రాజ్యాంగ ఆశయాలను మన ప్రజాస్వామ్య వ్యవస్థ ఎందుకు నెరవేర్చలేకపోతున్నది? కారణం... వ్యవస్థల మీద పెత్తందారీ వర్గాలకున్న పట్టు. ఈ ఉడుంపట్టు నుంచి వ్యవస్థ లను ప్రజాస్వామ్యీకరించే ప్రయత్నాలు పలుమార్లు జరిగాయి. జాతీయ స్థాయిలో పండిత్ నెహ్రూ కాలంలోనే కొన్ని ప్రయ త్నాలు జరిగాయి. కానీ, అప్పటికింకా మన వ్యవస్థలు ప్రాథమిక దశలోనే ఉన్నాయి. పెత్తందారీ వర్గ ప్రయోజనాలపై ఇందిరమ్మ కొంత గట్టి పోరాటమే చేశారు. ఈ వర్గాలన్నీ కలిసి ఎదురు దాడికి దిగడంతో వారిని ప్రతిఘటించడం కోసం ఆమె నియంతగా ముద్ర వేసుకోవలసి వచ్చింది. విశ్వనాథ ప్రతాప్ సింగ్ ఇదే పనిలో విఫలమై పదవీచ్యుతుడయ్యారు. వివిధ రాష్ట్రాల్లోనూ అక్కడక్కడా కొన్ని ఇటువంటి ప్రయత్నాలు జరి గాయి. ఆ మేరకు పేద ప్రజలు కొంత ముందడుగు వేశారు. పేద వర్గాల కోసం నిలబడిన కారణంగానే ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో ఎన్టీ రామారావు, వైఎస్ రాజశేఖరరెడ్డి జనప్రియ నాయకులయ్యారు. కానీ, వారు పెత్తందారుల కంటగింపునకు గురికావలసి వచ్చింది. ఎన్టీ రామారావును పదవీచ్యుతుని చేసిన పెత్తందారీ శక్తులే, రాజశేఖరరెడ్డిని ఓడించడానికి మహాకూటాలు కట్టి విఫలమైన శక్తులే, ఇప్పుడు జగన్మోహన్రెడ్డిపై ఓ మహా కుట్రను నడుపుతున్నాయి. పెత్తందారీ వర్గాల బెదిరింపులను లెక్కచేయకుండా జగన్ ప్రభుత్వం పేదల పక్షాన నిలబడటం, రాజ్యాంగ ఆశయాల అమలుకు పూనుకోవడమే ఇందుకు కారణం. ఈ ప్రస్థానంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఓ రోల్ మోడల్‌గా మారింది. పేద వర్గాల అభ్యున్నతికి, మహిళల సాధికారతకు ఇంత విస్తృతంగా, ఇంత బహుముఖంగా గతంలో ఎన్నడూ ప్రయత్నాలు జరగలేదు. ఈ ప్రయత్నాలు ఇలానే కొన సాగితే రానున్న నాలుగైదేళ్లలో ఆంధ్రప్రదేశ్ సామాజిక, ఆర్థిక, రాజకీయ పొందికలో గుణాత్మకమైన మార్పులు చోటుచేసుకుంటాయి. అందువల్ల అక్కడి పెత్తందారీ వర్గాలు రాష్ట్ర ముఖ్యమంత్రిపై ప్రత్యక్షంగా, పేదవర్గాల ప్రజలపై పరోక్షంగా యుద్ధాన్ని ప్రకటించాయి. ఈ యుద్ధాన్ని పేదవర్గాలు కూడా స్వాగతిస్తు న్నాయి. పెత్తందార్లను ఓడించడానికి ఇది ఆఖరి మోకాగా వారు భావిస్తున్నారు. ఇక్కడ పెత్తందార్లెవరో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. వారు ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచినవారే! వారు రాజశేఖరరెడ్డిపై దుష్ప్రచారాలు చేసి అడ్డు తొలగించుకోవాలని చూసినవారే! వారు చంద్రబాబు, రామోజీ అండ్ కో ముఠా సభ్యులే! తనను గెలిపిస్తే జగన్మోహన్రెడ్డి అమలుచేస్తున్న కార్యక్రమాలన్నీ చేస్తానని చంద్రబాబు చెబుతున్నారు కదా! మరి పెత్తందారీవర్గ ప్రతినిధి ఎలా అవుతాడని కొందరి ప్రశ్న. పులి తన మచ్చల్ని దాచుకోలేదు. పెత్తందార్లు వారి స్వభావాన్ని మార్చుకోలేరు. చంద్రబాబు తొలి రెండు దఫాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన తొమ్మిదేళ్ల చేటుకాలం కథ తెలిసిందే. రైతులకు ఉచితంగా విద్యుత్ ఇవ్వకూడదని వాదించిన సంగతి జ్ఞాపకమే. ప్రభుత్వ ఆస్పత్రులు, కార్యాలయాలు ప్రజల నుంచి యూజర్ ఛార్జీలు వసూలు చేయాలని ఆదేశాలిచ్చిన సంగతి గుర్తే. వ్యవ సాయం దండగని చెప్పడం – రైతుల్ని పిట్టల్లా కాల్చిచంపడం మరిచిపోలేని మహావిషాదం. పదేళ్ల విరామం తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్‌కు తొలి ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు కూడా ఆయన పెత్తందారీ స్వభావం మారలేదు. పైపెచ్చు మరింత ముదిరింది. ముఖ్యమంత్రి హోదాలో ఉండి కొన్ని మీడియా సమా వేశాల్లో చంద్రబాబు మాట్లాడిన మాటలు ఇప్పటికీ చెవుల్లో మార్మోగుతూనే ఉన్నాయి. ‘ఎస్సీ కులాల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా?’ అని బాహాటంగా ప్రశ్నించిన మహానాయ కుడు ఆయన. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు దిగువశ్రేణి పౌరులనే భావన నరనరాన జీర్ణించుకొనిపోయిన పెత్తందారీ మనస్తత్వం ఆయనది. ‘కోడలు మగపిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా?’ ఇది మరో మీడియా సమావేశంలో సీఎం హోదాలో బాబు పేల్చిన డైలాగ్. దాని అర్థమేమిటంటే మగపిల్లాడిని కనడం అనేది గొప్ప విషయం. అంత గొప్ప పని కోడలు చేస్తానంటే అత్త ఎందుకు వద్దంటుందని చెప్పడం. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మగపిల్లాడెక్కువ, ఆడపిల్ల తక్కువ అనే పురుషాహంకార భావజాలాన్ని వెదజల్లవచ్చునా? పెత్తందార్లకుండే మరో అలంకారం పురుషాహంకారం కూడా! పేద వర్గాల సాధికారతే కాదు మహిళల సాధికారత కూడా వారికి ఆమోదయోగ్యం కాదు. తొలిసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన దగ్గరి నుంచి ఆయన తీసుకున్న విధాన నిర్ణయాలు, ‘మనసులో మాట’ పుస్తకంలో ఆయన పొందు పరుచుకున్న ఐడియాలజీ, చివరి దఫా పదవీకాలంలో తీసు కున్న విధాన నిర్ణయాలూ, వెలిబుచ్చిన అభిప్రాయాలు అన్నీ ఆయన పెత్తందారీ స్వభావాన్నీ, పెత్తందార్ల తాబేదారు పాత్రను చాటిచెబుతూనే ఉన్నాయి. ఒక్క ఉదాహరణ చాలు... అమరా వతి శాసన రాజధాని ప్రాంతంలో పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ కోర్టు వ్యాజ్యాలు నడిపిన వ్యక్తి చంద్రబాబు. పేద వర్గాలకు ఇళ్ల స్థలాలిస్తే అక్కడ సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని కూడా కోర్టులో వాదించారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అక్కడ చేరితే రాజధానికి గౌరవ భంగమట! ఇది పేదల ఆత్మగౌరవాన్నీ, రాజ్యాంగ ప్రతిష్ఠనూ అవమానపరచడంతో సమానం. పెత్తందారీ రాజకీయ బంటుగా వ్యవహరిస్తున్న చంద్ర బాబుకు గురుపాదుల వారు రామోజీరావు. ఈయన చట్ట విరుద్ధంగా జనం నుంచి డిపాజిట్లు వసూలు చేసి వారి సొమ్ముతో వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న వైనాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. ఎదుటివారికి చెప్పేటందుకే శ్రీరంగనీతులు తప్ప తాము ఎక్కడ దూరినా తప్పులేదని బలంగా నమ్మే వ్యక్తిత్వం ఈయనది. రెండు రాష్ట్రాల్లోని పెత్తందారీ శక్తులకు వీరిద్దరూ జాయింటుగా నాయకత్వం వహిస్తు న్నారు. వీరి టీమ్‌లో కొత్తగా చేరిన వ్యక్తి – సినీనటుడు పవన్ కల్యాణ్. ఈయన ద్వంద్వ ప్రమాణాల మీద ఇప్పటికే బోలెడు జోకులున్నాయి. కమ్యూనిస్టు విప్లవకారుడైన చేగువేరాను కొంత కాలం అనుసరించారు. ఆ తర్వాత జనసంఘ్ వ్యవస్థాపకుడైన శ్యామాప్రసాద్ ముఖర్జీపై హఠాత్తుగా ప్రేమ పుట్టుకొచ్చింది. ముప్పయ్ సీట్లయినా రాలేదు, తనకెవరు ముఖ్య మంత్రి పదవి ఇస్తారని కొన్నాళ్లు నిర్వేదం వ్యక్తం చేస్తారు. నెల తిరక్కుండానే ముఖ్యమంత్రి పదవి ఇస్తే తీసుకోవడానికి రెడీగా ఉన్నానంటారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలవడమే తన లక్ష్యమని ప్రకటించి తన రాజకీయ స్థాయి ఏమిటో ఆయన చెప్పకనే చెప్పారు. ఇంట ర్మీడియట్‌లో తాను చదివిన గ్రూపు గురించి నాలుగు సంద ర్భాల్లో నాలుగు రకాలుగా చెప్పారు. ఇటువంటి ‘అపరిచితుడు’ మోడల్‌ను రాజకీయ నాయకునిగా జనం అంగీకరించరు. వారు తమ నాయకుడి నుంచి నీతిని, నిజాయితీని, పారదర్శకతను కోరుకుంటారు. పుస్తకాలను తెరిచి పట్టుకొని ఫోటోలు దిగి ప్రచారం చేసుకుంటే చాలదు. జీవితాన్ని తెరిచిన పుస్తకంలా మలుచుకుంటేనే ప్రయోజనం నెరవేరుతుంది. అసలు సిసలైన ప్రజాస్వామ్యాన్ని అమలుచేయడానికీ, పేద ప్రజల అభ్యున్నతికీ తొలిమెట్టు పరిపాలనా వికేంద్రీకరణ. ఫలితంగా పారదర్శకత పెరుగుతుంది. ప్రజలకు పరిపాలనపై అవగాహన పెరుగుతుంది. తమ కళ్ల ముందటే ఉన్న ప్రభు త్వాన్ని వారు ఎప్పుడైనా ప్రశ్నించగలుగుతారు. తమకు అంద వలసిన పథకాలు, సేవల విషయంలో పెత్తందార్ల జోక్యం తొలగిపోతుంది. అందుకని వికేంద్రీకరణకు పెత్తందార్లు వ్యతి రేకం. చంద్రబాబు పద్నాలుగేళ్ల పదవీ కాలంలో ఒక కొత్త జిల్లాను కానీ, మండలాన్ని కానీ ఏర్పాటు చేసిన పాపాన పోలేదు. ఎన్టీ రామారావు మండల వ్యవస్థ ఏర్పాటు చేసిన తర్వాత, పాలనను మరింత వికేంద్రీకరించి పల్లెపల్లెనా సచివా లయాలు స్థాపించి వికేంద్రీకరణను చివరి అంచుకు చేర్చిన వ్యక్తి జగన్మోహన్రెడ్డి. వికేంద్రీకరణతోపాటు మరో ఆరు అంశాలపై ప్రభుత్వం పెట్టిన ఫోకస్ ఆ రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి వర్గాల ప్రజల తలరాతను మార్చబోతున్నది. నాణ్యమైన ఇంగ్లిష్ మీడియం ఉచిత విద్య, గడప గడపకూ ప్రజారోగ్యాన్ని ప్రాధ మ్యంగా ప్రకటించుకున్న వైద్యరంగం, వ్యవసాయ రంగంలో రైతును చేయి పట్టుకొని నడిపిస్తున్న ఆర్బీకే సెంటర్లు, మహిళల సాధికారత కోసం చేపట్టిన పథకాలు – ఇస్తున్న పదవులు, చిన్న, సూక్ష్మ పరిశ్రమల రంగంలో ఉత్తేజాన్ని నింపడం, సుదీర్ఘ సముద్ర తీరాన్ని అభివృద్ధికి ఆలంబనగా మలుచుకోవడానికి పెద్ద ఎత్తున పోర్టులను, ఫిషింగ్ హార్బర్లను ఏర్పాటు చేయడం. వికేంద్రీకరణతో కలిసి ఈ ఏడు ఫోకస్ ఏరియాలు గేమ్ ఛేంజర్స్‌గా మారబోతున్నాయి. బడుగుల జీవితాలను మార్చ బోతున్నాయి. అందువల్లనే పెత్తందారీ వర్గాలు ప్రకటించిన యుద్ధాన్ని పేద వర్గాలు స్వాగతిస్తున్నాయి. ఈ ఒక్కసారి ఓడిస్తే పెత్తందారీ పీడ విరగడవుతుందని వారు ఆశిస్తున్నారు. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
ఎన్టీఆర్ కు జరిగిన అవమానాలను నేను ప్రత్యక్షంగా చూశా
-
కథానాయకుని వ్యథ!.. ది పొలిటికల్ ట్రాజెడీ ఆఫ్ ఎన్టీఆర్
ఇదీ కుట్ర జరిగిన తీరు... తెలుగుదేశం వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావును ఆయన సొంతవారే ఎలా కూలదోశారు? అన్నది ఆసక్తికరమైన అంశం. ఆనాడు చకచకా జరిగిపోయిన ఘటనలలో ఎన్టీఆర్ నిస్సహాయుడిగా మిగిలిపోయిన తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. 1994 శాసనసభ ఎన్నికలలో తన భార్య లక్ష్మీపార్వతితో కలిసి ప్రచారం చేసి అసాధారణమైన రీతిలో మిత్రపక్షాలతో కలిసి సుమారు 250కి పైగా సీట్లు గెలుచుకున్న ఎన్టీఆర్ చెప్పులు వేయించుకోవడమా? తెలుగువారికి ఆత్మగౌరవ నినాదంతో పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ తన చరమాంకంలో కుటుంబ సభ్యుల చేతిలో ఆత్మాభిమానం కోల్పోయిన తీరు అత్యంత విషాదకరం. 1995 ఆగస్టులో ‘ప్రజల వద్దకు ప్రభుత్వం’ పేరుతో శ్రీకాకుళం జిల్లాలో ఎన్టీఆర్ ఆధ్వర్యంలో ఒక కార్యక్రమం జరిగింది. అప్పటి ఆర్థిక, రెవెన్యూ శాఖల మంత్రి, ఎన్టీఆర్ అల్లుడు అయిన చంద్రబాబుతో సహా పలువురు మంత్రులు తరలివెళ్లారు. అది జరుగుతున్నప్పుడే చంద్రబాబు తన సొంత గ్రూప్‌తో విశాఖ డాల్ఫిన్ హోటల్లో ఒక సమావేశం నిర్వహించారు. తదుపరి సచివాలయంలో ఆయన తన ఛాంబర్లో ఉండగా, కొందరు ఎమ్మెల్యేలు కలిసిన తీరు సంచలనం అయింది. ఎన్టీఆర్ దీనిని సీరియస్‌గా తీసుకోలేదు. చంద్రబాబుకు సన్నిహితంగా ఉండే ఎమ్మెల్యేలు, మంత్రులు వైస్రాయ్ హోటల్లో క్యాంప్ పెట్టాలని అనుకున్నారు. వాళ్లు ఆయా జిల్లాలకు ఫోన్లు చేసి ఎమ్మెల్యేలను వైస్రాయికి రావాలని కోరారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే అయితే తాను అసలు ఎందుకు వైస్రాయ్ హోటల్‌కు వెళ్లానో తెలియదనీ, జిల్లాకు చెందిన ఒక మంత్రి పిలవడంతో వెళ్లాననీ, ఆ తర్వాత కాని విషయం బోధపడలేదనీ అప్పట్లో నాకు చెప్పారు. ఆ రోజుల్లో సోషల్ మీడియా లేకపోవడం కూడా చంద్రబాబు వర్గానికి కలిసి వచ్చింది. వైస్రాయ్ హోటల్లో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారన్న దానిపై రకరకాల ప్రచారాలు జరిగిపోయాయి. లక్ష్మీపార్వతిని ముఖ్యమంత్రిగా చేసే అవకాశం ఉందనీ, లేదా ఉప ముఖ్యమంత్రిగా అయినా నియమిస్తారనీ అనుకూల మీడియాలో ప్రచారం జరిగింది. ఢిల్లీలో ఉన్న ఎన్టీఆర్ మరో అల్లుడు, అప్పట్లో ఎంపీగా ఉన్న దగ్గుబాటి వెంకటేశ్వరరావును హైదరాబాద్ రప్పించారు. ఉప ముఖ్యమంత్రి చేస్తామని నమ్మబలికారు. ఎన్టీఆర్ కుమారుడు హరికృష్ణకు పార్టీ అధ్యక్ష పదవి ఇస్తామని అన్నారు. తామేమీ తప్పు చేయలేదన్న పిక్చర్ ఇవ్వడానికి ముగ్గురు నేతలు అశోక్ గజపతిరాజు, ఎస్వీ సుబ్బారెడ్డి, దేవేందర్ గౌడ్లను ఎన్టీఆర్ వద్దకు సంప్రతింపుల పేరుతో పంపించారు. అప్పట్లో స్పీకర్‌గా ఉన్న యనమల రామకృష్ణుడును తుని నుంచి హెలికాప్టర్లో రప్పించారు. ఎమ్మెల్యేలతో ఆయన అభిప్రాయ సేకరణ జరిపించినట్లు గవర్నర్‌కు ఒక నివేదిక ఇప్పించారు. ఈ తరుణంలోనే ఎన్టీఆర్‌కు ఒక ప్రముఖ న్యాయవాది అసెంబ్లీని రద్దు చేద్దామన్న సలహా ఇచ్చారు. నిజానికి అది కూడా కుట్రలో భాగమేనని ఆ తర్వాత వెల్లడైంది. అసెంబ్లీని రద్దు చేస్తారని చెబితే ఎమ్మెల్యేలంతా తమ పదవులు పోతాయన్న భయంతో తమ వద్దకు వచ్చేస్తారని చంద్రబాబు ప్లాన్ చేశారు. అది బాగా వర్కవుట్ అయింది. మొత్తం పరిస్థితి చేయిదాటిపోతున్న తరుణంలో లక్ష్మీపార్వతితో కలిసి ఎన్టీఆర్ వైస్రాయ్ హోటల్‌కు బయల్దేరారు. పరిటాల రవి, దేవినేని నెహ్రూ తదితరులు ఆయనతో పాటు ఉన్నారు. ఆయన మైకు తీసుకుని ‘తమ్ముళ్లూ వచ్చేయండ’ని ఉపన్యాసం ఇస్తున్న సందర్భంలో హోటల్ గేటు లోపల నుంచి చెప్పులు పడ్డాయి. అది చూసినవారంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. మరుసటి రోజు చంద్రబాబు వర్గం ఎమ్మెల్యేలు ఒక సినిమా థియేటర్లో సమావేశమై ఎన్టీఆర్‌ను పార్టీ పదవి నుంచి, ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించినట్లు, చంద్రబాబును ఎన్నుకున్నట్లు ప్రకటించారు. ఇదిలా ఉండగా, ఎన్టీఆర్ అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరారు. ఆయనను పరామర్శించడానికి వెళ్లిన గవర్నర్ కృష్ణకాంత్ అక్కడే రాజీనామా పత్రం తీసుకున్నారు. చంద్రబాబుతో సహా ఐదుగురు నేతలను మంత్రి పదవుల నుంచి తొలగించడమే కాకుండా, పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఎన్టీఆర్ ప్రకటించినా, ఆ కాపీని గవర్నర్‌కు పంపించినా, ఆయన దానిని విస్మరించి చంద్రబాబుకు పట్టం కట్టారు. ఈ పరిణామాల నేపథ్యంలో 1995 సెప్టెంబర్ 1న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీలో విశ్వాస పరీక్షలో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని ఎన్టీఆర్ వేడుకున్నా స్పీకర్ యనమల రామకృష్ణుడు అంగీకరించలేదు. చంద్రబాబుకు సహకరించిన దగ్గుబాటికి ఉప ముఖ్యమంత్రి పదవి హుళక్కి అయితే, హరికృష్ణను ఆరు నెలల మంత్రిగా మార్చి పరువు తీశారు. ఈ క్రమంలో న్యాయ వ్యవస్థ ద్వారా చంద్రబాబు టీడీపీ గుర్తు సైకిల్‌ను సొంతం చేసుకోవడమే కాకుండా, బ్యాంక్‌లో ఉన్న నిధులను కూడా కైవసం చేసుకున్నారు. ఫలితంగా గుండెపోటుతో ఎన్టీఆర్ కాలం చేశారు. ఆ తర్వాత రోజులలో ఎన్టీఆర్‌ను పొగుడుతూ చంద్రబాబు ఉపన్యాసాలు ఇవ్వడం ఆరంభించారు. ఎన్టీఆర్ పేరు చెబితేనే ఓట్లు పడతాయని భావిస్తున్న చంద్రబాబు వర్గం అదే వ్యూహం అమలు చేస్తోంది. పాపం... ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తూనే ఉంది! కొమ్మినేని శ్రీనివాసరావు వ్యాసకర్త ఏపీ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అవమానాలకు ఆగిన గుండె! చంద్రబాబు 1995 సెప్టెంబర్ 1న ఎన్టీఆర్ నుండి లాక్కున్న ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక ఎన్టీఆర్ ఆ అవమానాల్ని తట్టుకోలేకపోయారు. 1993 జూన్‌లో ఆయనకు పెరాలసిస్ వచ్చినప్పుడు నిమ్స్ డాక్టర్లు ఆయనకు బ్రెయిన్లో క్లాట్ ఏర్పడిందనీ ఏమాత్రం ఒత్తిడి ఉన్నా అది ఆయన మరణానికి దారి తీస్తుందనీ కుటుంబ సభ్యులందరినీ హెచ్చరించారు. అయినా వాళ్ళెవ్వరూ ఆ మాటలను పట్టించుకున్నట్లే లేరు. మాటిమాటికీ అవమానాలతో వేధించారు. అయినా ఆయన వెనక్కు తగ్గదలుచుకోలేదు. చంద్రబాబు మీద పోరాడాలనే నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు దుర్మార్గాన్ని ప్రజలకు చె΄్పాలనే ఉద్దేశ్యంతో మహారథి, వేల్చూరి వెంకట్రావులచే ‘జామాత దశమ గ్రహః’ అనే క్యాసెట్‌కు స్వయంగా తన పర్యవేక్షణలో రచన చేయించి డి.రామానాయుడు స్టూడియోలో తనే మాట్లాడుతూ ఆడియో రికార్డ్ చేయించారు. ‘తమ్ముళ్లూ ఇదిగో మీ అన్నను మాట్లాడుతున్నాను’ అని ్రపారంభించి రాష్ట్ర రాజకీయాల్లో జరిగిన చంద్రబాబు కుట్రనూ మోసాన్నీ బయటపెట్టారు. ఈ క్యాసెట్‌ను విజయవాడలో ఫిబ్రవరిలో జరగబోయే ‘సింహగర్జన’ సదస్సులో విడుదల చేయాలని సంకల్పించారు. నేషనల్ ఫ్రంట్ నాయకులు ఎన్టీఆర్ లేకపోతే రాబోయే ఎన్నికలు ఎదుర్కోవడం కష్టమని భావించారు. సంధి ప్రయత్నంలో వీపీ సింగ్, బొమ్మై, దేవెగౌడ, పాశ్వాన్, శరద్ యాదవ్‌లు ఎన్టీఆర్ దగ్గరకు వచ్చి చంద్రబాబుతో కలిసిపొమ్మని నచ్చచెప్పటానికి ప్రయత్నం చేశారు. ఈ కలహం వలన నేషనల్ ఫ్రంట్‌కు నష్టం వస్తుందనీ, కొంచెం పెద్ద మనస్సుతో ఈ సంధికి అంగీకరించమనీ పార్టీకి అధ్యక్షులుగా కొనసాగి చంద్రబాబు నాయుడి ప్రభుత్వానికి సలహాలివ్వమనీ సూచించారు. ఆయన ఏమాత్రం అంగీకరించలేదు. చంద్రబాబు మీద పోరాటాన్ని కొనసాగించటానికి ఆయన కోర్టులను కూడా ఆశ్రయించారు. అదే సమయంలో ఆయనకు ఇంకో విషయం తెలిసింది. వైస్రాయ్ ప్రభాకర్ రెడ్డి బంధువులు, మరికొంతమంది లిక్కర్ లాబీ వాళ్ళు కోట్లాది రూపాయలు చంద్రబాబుకు అందించారనీ, ఆ డబ్బుతో ఆయన మీడియాతో పాటు న్యాయవ్యవస్థను కూడా మేనేజ్ చేసుకుని ఎన్టీఆర్‌ను పదవి నుండి దించేశాడనీ! ఇక్కడ జరిగిందంతా గందరగోళమే. ప్రజలకు వాస్తవాలేంటో తెలియనీకుండా, తెలుసుకునే అవకాశం కూడా ఇవ్వకుండా ఇదే పచ్చ మీడియా ఆనాడు నిర్వహించిన పాత్ర కడు శోచనీయమైనది. ఇదంతా లక్ష్మీ పార్వతి వల్లనే జరుగుతోందని చెప్పటం ద్వారా ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూల్చినా అది ప్రజల్లో వ్యతిరేకత కలిగించదనేది వారి వ్యూహం. ఆ పెద్ద కుట్రలో ప్రధాన పాత్ర వారిదే! ఆయన ఆరోగ్యం రోజు రోజుకు క్షీణిస్తూ వస్తున్నది. ఒక కన్ను పని చేయటం లేదు. రానురాను మానసికంగానూ, శారీరకంగానూ బలహీనపడుతున్నారు. 1996 ఫిబ్రవరిలో జరగబోయే ‘సింహ గర్జన’ సదస్సు గురించి చర్చించడానికి దేవినేని నెహ్రూ విజయవాడ నుండి వచ్చారు. చాలాసేపు మాట్లాడుకున్నాక ఆ సదస్సుకు 30 లక్షల రూపాయల ఖర్చవుతుందని అంచనా వేశారు. అందుకోసం బ్యాంక్ ఆఫ్ బరోడాలో తన పేరుతో ఉన్న పార్టీ ఎకౌంట్ నుండి డబ్బు తీసుకురమ్మని చెక్ రాసి తన పీఏను పంపించారు ఎన్టీఆర్. వెంటనే బ్యాంక్ వాళ్ళు చంద్రబాబుకు మెసేజ్ ఇచ్చారు. చంద్రబాబు మానవత్వాన్ని మర్చిపోయి ఆ డబ్బుకోసం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ప్రస్తుతం తనే గనుక సొమ్ము తనకే చెందాలని హైకోర్టులో ఎమర్జెన్సీ పిటిషన్ వేయించాడు. ఇది జనవరి 17వ తారీఖు జరిగిన సంఘటన. అప్పటికప్పుడే సీజే ప్రభాకర శంకర మిశ్రా ఆదేశం మేరకు హైకోర్టు జస్టిస్ బి. మోతీలాల్ నాయక్ స్టే ఆర్డర్ ఇచ్చేశారు. అంత ఎమర్జెన్సీగా వారు స్పందించారు! సాయంత్రం 5 గంటలకు లాయర్లు వచ్చి విషయం చెప్పగానే ఎన్టీఆర్ ఆగ్రహంతో ఊగిపోయారు. ఆయన శరీరం అదుపు తప్పింది. కుర్చీలోంచి లేచి నిలబడబోయి కిందపడబోయారు. అక్కడున్న వాళ్ళు పట్టుకుని ఆపారు. ముఖం, కాళ్లు ఎర్రగా అయిపోయాయి. పెద్దగా కేకలు వేశారు. నెహ్రూ సర్దిచెప్పినా ఆయన పట్టించుకోలేదు. డబ్బు లేకుండా పార్టీ భవిష్యత్తు ఏమవుతుందోనని ఆందోళన పడ్డారు. ఇదంతా అయ్యేసరికి రాత్రి 7 గంటలయ్యింది. 10 గంటలకు రామానాయుడు ‘జామాత దశమగ్రహః’ క్యాసెట్ ఇచ్చి వెళ్లారు. అయితే సింహగర్జన సదస్సులో ఈ క్యాసెట్ రిలీజ్ చేసి ప్రజలకు చంద్రబాబు నాయుడు చేసిన దుర్మార్గాల్ని గురించి చె΄్పాలనుకున్న ఆయన నోరు శాశ్వతంగా మూగబోయింది. పార్టీ డబ్బు సీజ్ చేసిన 8 గంటల లోపే ఈ అవమానాలు తట్టుకోలేని ఆ గుండె ఆగిపోయింది. ప్రత్యర్థులను మట్టి కలపాలనుకునే సమయంలో విధి ఆయనను వెక్కిరించింది. కలల్నీ, కలతల్నీ తనలో కలుపుకొంటూ మృత్యువు ఆయనకు శాశ్వత విశ్రాంతి కల్పించింది. ఇప్పుడు చెప్పండి... దుర్మార్గుడైన చంద్రబాబు నాయుడి అధికార దాహం వలనే కదా ఆయనకీ అకాల మృత్యువు ్రపాప్తించింది. తెలుగు ప్రజలందరూ ఎన్టీఆర్ ఆవేదనను అర్థం చేసుకోవాలని మనవి చేస్తూ... అశ్రునయనాలతో సెలవు. -నందమూరి లక్ష్మీపార్వతి,వ్యాసకర్త ఎన్టీఆర్ సతీమణి, ఏపీ తెలుగు అకాడమీ ఛైర్పర్సన్ -
దివంగత ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు విజయవాడలో నిర్వహిస్తాం
-
శతజయంతి వేడుకలకు దూరం అసలు కారణం..!
-
ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు జూనియర్ ఎన్టీఆర్ దూరం
-
అందరి ముందు ఎన్టీఆర్ నా కాళ్లు పట్టుకున్నారు!: రోజా రమణి
నటిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా తెలుగు చిత్రసీమలో రాణించింది రోజా రమణి. బాలనటిగా భక్తప్రహ్లాదతో అబ్బురపరిచిన ఆమె ఆ తర్వాతి కాలంలో హీరోయిన్‌గానూ అనేక సినిమాల్లో నటించి మెప్పించింది. హీరోయిన్గా బిజీ అవుతున్న సమయంలో పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరమైంది. తెలుగు హిట్స్ అయిన ఆడపడుచు, లవకుశ, సతీ అనసూయ ఒరియా రీమేకుల్లో హీరో చక్రపాణితో కలిసి నటించింది రోజా రమణి. వీరిద్దరూ కలిసి నటించిన కవి సామ్రాట్ ఉపేంద్ర బంజు అక్కడ పెద్ద హిట్. వీరి స్నేహం ప్రేమగా మారడం, దాన్ని పెద్దలు ఆశీర్వదించడంతో పెళ్లి జరిగిపోయింది. వీరికి ఇద్దరు పిల్లలు. అందులో ఒకరు తరుణ్ హీరోగా ఎదిగిన తీరు అందరికీ తెలిసిందే. అయితే పెళ్లైన కొంతకాలం వరకు కుటుంబానికే పెద్ద పీట వేస్తూ సినిమాలకు దూరమైంది రోజా రమణి. నటించడం మానేసినా 1984 నుంచి డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా మారి స్క్రీన్‌పై తన గొంతు పలికించింది. దాదాపు 300 మంది హీరోయిన్లకు గాత్రదానం చేసింది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో దివంగత నటుడు నందమూరి తారక రామారావు గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. 'నందమూరి తారకరామావు అంటే నాకు ఎంతో అభిమానం. ఆయనతో నటించడం నా అదృష్టం. ఆయనతో మొదటిసారి 'తాతమ్మ కల' చేశాను. ఈ చిత్రంలో ఆయన నటించి, దర్శకత్వం వహించడమే కాక స్వయంగా నిర్మించారు. ఆయనతో నాలుగైదు సినిమాలు చేశాను. డ్రైవర్ రాముడు సినిమాలో ఏమని వర్ణించను.. పాట చాలా పెద్ద హిట్. ఈ సినిమాలో నేను కళ్లు లేని అమ్మాయిగా, ఆయనకు చెల్లిగా నటించాను. ఆ పాట చివర్లో నేను చిన్న బిట్ పాడుతూ ఎన్టీఆర్ కాళ్ల మీద పడి ఏడుస్తూ ఉండిపోయాను. డైరెక్టర్ రాఘవేంద్రరావు మమ్మల్ని చూసి ఎమోషనలై కట్ చెప్పకుండా సీన్లో లీనమైపోయారు. ఓ సంఘటన నాకింకా గుర్తుంది. విజయవాడ కృష్ణా బ్యారేజ్ మీద షూటింగ్ జరుగుతోంది.. సూసైడ్ చేసుకోవడానికి పరుగెత్తుతున్నాను. నా వెనకాల హరికృష్ణ గారు ఆగు, చెల్లెమ్మా అంటూ పరిగెత్తుకుంటూ వస్తున్నారు. నడిరోడ్డు మీద ఎన్టీ రామారావు డైరెక్షన్ చేస్తున్నారు. వేలాదిమంది జనం గుమిగూడి షూటింగ్ చూస్తున్నారు. నేను బ్యారేజీ రెయిలింగ్ దగ్గర కాస్త హైట్ కోసం ఖాళీ క్యాన్ల మీద నిలబడ్డాను. ఆ క్యాన్లు ఊగిపోతుండటంతో రామారావు వెంటనే వచ్చి నేను పడిపోకుండా నా కాళ్లు పట్టుకుని యాక్ట్ చేయమన్నారు. కాస్త అజాగ్రత్తగా ఉన్నా నిజంగా అక్కడ సూసైడ్ జరుగుతుందని ఆయన భయపడ్డారు. అందుకే ఆయనే స్వయంగా వచ్చి వేలాది మంది జనం ముందు ఏమాత్రం ఆలోచించకుండా కాళ్లు పట్టుకున్నారు. ఆయన చేసిన పనికి తెలియకుండానే కన్నీళ్లు వచ్చేశాయి' అని ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది రోజా రమణి. చదవండి: ఆ హీరోతో డేటింగ్.. మరో హీరోతో లవ్ అంటూ రూమర్స్.. ఎట్టకేలకు క్లారిటీ ఆ ఓటీటీలోకి రానున్న ఏజెంట్.. -
ఎన్టీఆర్‌తో ప్రత్యేక అనుబంధం.. కంచు కంఠంతో ఆకర్షించిన కైకాల
టాలీవుడ్ సీనియర్ నటుడు, నవరస నట సార్వభౌమ కైకాల సత్యనారాయణ మృతితో టాలీవుడ్లో విషాదచాయలు అలుముకున్నాయి. 60 ఏళ్ల సినీ జీవితంలో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా,కామెడీ పాత్రల్లో దాదాపు 750కి పైగా సినిమాల్లో నటించారాయన. చిన్నప్పటి నుంచే నాటకాలపై ఉన్న ఇష్టంతో 1959లో ‘సిపాయి కూతురు’ అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.మొదటి సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోయినా నిండైన రూపం, కంచు కంఠంతో కైకాల అందరి దృష్టిని ఆకర్షించారు. మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ పోలికలకు దగ్గరగా ఉండడం సత్యనారాయణకు కలిసొచ్చింది. ఈ విషయం గ్రహించిన ఎన్టీఆర్ కూడా ఆయనకు తన సినిమాల్లో అవకాశాలిచ్చారు. ఇక వీరిద్దరు కలిసి 100సినిమాలకు పైగా నటించారు. అంతేకాకుండా ఎన్టీఆర్ పోలికలు ఉండటంతో తొలి రోజుల్లో ''రాముడు-భీముడు' వంటి ఎన్.టి.ఆర్. ద్విపాత్రాభినయ చిత్రాలలో ఆయనకు డూప్ గా నటించారు.నటనలోనే కాదు.. రాజకీయ రంగంలో కూడా ఆయనతో కలిసి అడుగులేశారు సత్యనారాయణ. 1996లో ఆయన రాజకీయాల్లోకి వచ్చి, మచిలీపట్నం నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి 11వ లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఇక ‘ఉమ్మడి కుటుంబం’ సినిమాలో ఓ పాత్రకోసం ఎన్టీఆర్కే సవాల్ విసిరారు కైకాల. అప్పటికే విలన్‌గా రాణిస్తున్న కైకాల ఈ చిత్రంలో సెంటిమెంట్ పాత్ర చేయగలడా అని సందేహంతో కైకాలను వద్దని చెప్పారట ఎన్టీఆర్. దీంతో కైకాల.. రెండు రోజులు షూట్ చేయండి, నేను చేసింది నచ్చకపోతే పంపించేయండి అంటూ ఎన్టీఆర్ కి సవాలు విసిరారు. ఇక చేసేది లేక ఆ పాత్రని కైకాలతో చేయించిన ఎన్టీఆర్.. ఆ తరువాత కైకాల నటన చూసి ప్రశంసించకుండా ఉండలేకపోయారట. ఇలా ఎన్టీఆర్‌తో కైకాల ప్రత్యేక అనుబంధం ఉండేదని గుర్తుచేసుకుంటున్నారు సినీ విశ్లేషకులు. -
ఎన్టీఆర్- ఏఎన్నార్ మధ్య విబేధాలు.. సీఎం చెప్పినా వినలేదట
ఎన్టీఆర్ - ఏఎన్నార్ తెలుగు సినిమాకి రెండు కళ్ల లాంటివారు. ఎన్నో వైవిధ్యమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.పౌరాణిక పాత్రలకి ఎన్టీఆర్ చెరగనా ముద్ర వేసుకుంటేప్రేమకథా చిత్రాల్లో తనకెవరూ సాటిలేరని ఏఎన్ఆర్ నిరూపించుకున్నారు.ఇద్దరి మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండేది.అంతేకాకుండా పోటీపడి మరీ ఒకేసారి సినిమాలను రిలీజ్ చేయించుకునేవారు. కలెక్షన్ల విషయంలోనూ వీరు ఎన్నో రికార్డులు తిరగరాశారు. సాధారణంగా ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటించడం చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే జరుగుతుంది. కానీ ఎన్టీఆర్ - ఏఎన్నార్ మాత్రం 15 సినిమాల్లో కలిసి నటించారు. ఎంతో సాన్నిహిత్యంగా ఉన్న వీళ్లిద్దరి మధ్య కూడా అప్పట్లో మనస్పర్థలు వచ్చాయి. ఓసారి తన సినిమాలో కృష్ణుడి వేషాన్ని వేయాల్సిందిగా ఏఎన్నార్‌ను ఎన్టీఆర్ కోరారట. దీనికి ఆ ఒక్కమాట మాత్రం అడగకండి మహానుభావా అంటూ ఏఎన్నార్ సున్నితంగా తిరస్కరించారట. అప్పటి సీఎం జలగం వెంగళరావుతోనూ ఎన్టీఆర్ రికమెండ్ చేయించినా ఏఎన్నార్ ఒప్పుకోలేదు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య విబేధాలు వచ్చాయని చెబుతుంటారు. దీంతో వీళ్లిద్దరు అప్పట్లో మల్టీస్టారర్ సినిమాలు చేయకూడదనే నిర్ణయానికి వచ్చారట. ఇక ఎన్టీఆర్-ఏఎన్నార్ మధ్య అభిప్రాయబేధాలపై ప్రముఖ రచయిత సి నారాయణ రెడ్డి గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఏమన్నారంటే.. ఎన్టీఆర్ గులేబకావళి అనే సినిమాకు పాటలు రాసే అవకాశం వచ్చింది. అయితే తన మొదటి సినిమా కావడంతో మొత్తం అన్ని పాటలకు రాసే అవకాశం ఇస్తేనే రాస్తాను అని కండీషన్ పెట్టాను. దీంతో ఎన్టీఆర్ ఒప్పుకొని మొత్తం 10 పాటలకు అవకాశం కల్పించారు. ఇదే క్రమంలో ఏఎన్నార్ హీరోగా 'ఇద్దరు మిత్రులు' సినిమాలో ఓ పాట రాసేందుకు అవకాశం వచ్చింది. ఆ సినిమా డైరెక్టర్ దిక్కుపాటి మధుసూదన్ రావు ఓసారి ఫోన్ చేసి అడగ్గా.. నేను సున్నితంగా తిరస్కరించాను. ఒకవేళ మీకు రాసిన మొదట విడుదలైతే, ఆ ప్రత్యేకత, క్రెడిట్ మీకే దక్కుతుంది. అప్పుడు నా మొదటి సినిమాకే మొత్తం పాటలు రాసే ఛాన్స్ ఇచ్చిన ఎన్టీఆర్‌కు ఆ క్రెడిట్ రాదు అని చెప్పి సున్నితంగా ఆ ఆఫర్‌ను తిరస్కరించాను. కానీ తర్వాతి రోజుల్లో ఎన్టీఆర్-ఏఎన్నార్‌కి మధ్య అభిప్రాయబేధాలు ఉన్న సమయంలోనూ ఇద్దరికీ పాటలు రాశాను' అంటూ చెప్పుకొచ్చారు. -
ఆ హీరోయిన్ను రెండో పెళ్లి చేసుకోవాలనుకున్న సీనియర్ ఎన్టీఆర్
సీనియర్ ఎన్టీఆర్ ఏ పాత్రలో నటించినా ఆ పాత్రకే వన్నె వస్తుందనడంలో అతిశయోక్తి లేదు. ఆయన భగవంతుడిగా వేషం కట్టినప్పుడయితే.. నిజంగానే ఆ దేవుడే ఈయన రూపంలో ఉన్నాడేమో అనేంతగా తేజస్సుతో ఉట్టిపడేవారు. ఎంతోమంది ఆయన్ను దైవంగా కొలిచేవారు కూడా! ఇక సీనియర్ ఎన్టీఆర్ నిజ జీవిత విషయానికి వస్తే ఆయన మొదటి భార్య పేరు బసవతారకం. వీరికి 12 మంది సంతానం. సినిమా షూటింగ్స్ సమయంలో ఎన్టీఆర్ హీరోయిన్ కృష్ణ కుమారితో లవ్‌లో పడ్డారు. ఆమెను పెళ్లి కూడా చేసుకుందామనుకున్నారు. ఆనాటి వారి ప్రేమ విషయాన్ని గతంలో ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది కృష్ణ కుమారి సోదరి, నటి షావుకారు జానకి. 'ఎన్టీఆర్- కృష్ణ కుమారి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారంటూ ఓ టాక్ నడిచింది. కానీ అప్పటికే ఆయనకు 11 మంది పిల్లలు. నిజంగా వీరి పెళ్లి జరిగి ఉంటే నా చెల్లెలికి అంత శ్రేయస్కరంగా ఉండేది కాదేమో! అయితే వీళ్లు విడిపోయారో, గొడవపడ్డారో తెలీదు కానీ, కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలో కృష్ణ కుమారి ఒక్క ఫోన్ కాల్‌తో 17 సినిమాలు క్యాన్సిల్ చేసుకుంది. తర్వాత ఆమె ఓ సీనియర్ జర్నలిస్ట్ అజయ్ మోహన్ కైఠాన్‌ను పెళ్లి చేసుకుంది. కానీ అప్పుడు ఓ బడా నిర్మాత ఫోన్ చేసి కైఠాన్‌తో మీ చెల్లి పెళ్లి ఆపండన్నారు. కానీ నేను ఆ పని చేయనని చెప్పాను' అంటూ ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది షావుకారు జానకి. చదవండి: కార్తికేయ 2 ఈ ఓటీటీలోకే రాబోతోంది! బ్రెయిన్ పని చేయని స్థితిలో కమెడియన్ -
ఎన్టీఆర్ టీడీపీ సొత్తు కాదు
గుడివాడ టౌన్: ఆంధ్రుల అభిమాన నాయకుడైన ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ సొత్తు కాదని కృష్ణా జిల్లా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. ఆయన విగ్రహాలకు పసుపు రంగు పులమడం ఎంత వరకు సబబని అన్నారు. గుడివాడ రూరల్ మండలంలో ఎన్టీ రామారావు విగ్రహానికి రంగులు వేసే విషయంలో తలెత్తిన వివాదంపై ఆయన మంగళవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. ఎన్టీఆర్ తనకు ఆరాధ్యదైవమని చెప్పారు. ‘1995లో ఎన్టీ రామారావును పార్టీ నుంచి సస్పెండ్ చేసిన దొంగ చంద్రబాబునాయుడు. ఆయన చనిపోయే వరకు పార్టీలోకి రానివ్వని నీచుడు బాబు. కోర్టుకు వెళ్ళి ఎన్టీఆర్‌కు, పార్టీకి ఏ విధమైన సంబంధం లేదని, పార్టీ గుర్తు, పార్టీ కార్యాలయం తనదేనని ఆదేశాలు తెచ్చుకున్న వ్యక్తి చంద్రబాబు. ఎన్టీ రామారావును టీడీపీ వ్యక్తిగా ఎలా గుర్తిస్తారు?’ అని ప్రశ్నించారు. ఎన్టీఆర్ విగ్రహాలన్నీ బంగారు రంగులో ఉంటాయని, ఆయనకు పసుపురంగు పులమడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ఆయనకు ప్రత్యేక రంగులేమీ లేవన్నారు. ఒకడు పచ్చ రంగు వేసుకుంటే మరొకరు నీలి రంగు వేసుకుంటారని, ఎవరి ఇష్టం వారిదన్నారు. 2004లో తాను ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేశానన్నారు. ఇటీవల ఆ దిమ్మెపై ఉన్న తన పేరును తొలగించడంతో ఆ పార్టీ పెద్దలను పిలిచి వివరణ కోరానన్నారు. త్వరలో తిరిగి ఏర్పాటు చేస్తామన్న ఆ నాయకులు ఇప్పటివరకు అంతులేరని తెలిపారు. దీంతో తమ కార్యకర్తలు పార్టీ రంగు వేసుకుంటారని, ఇందులో తప్పేమీ లేదని అన్నారు. చంద్రబాబు ప్రకృతి కూడా సహకరించదని, అందుకే గుడివాడలో ప్రకృతి వర్షాల రూపంలో మినీ మహానాడును అడ్డుకుందని చెప్పారు. -
ఎన్టీఆర్ శతజయంతి: ఎన్టీఆర్ ఘాట్ వద్దకు రాజకీయ ప్రముఖులు
సాక్షి, హైదరాబాద్: టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు, టాలీవుడ్ లెజెండరీ నటుడు స్వర్గీయ ఎన్టీ రామారావు జయంతి సందర్భంగా.. శనివారం ఎన్టీఆర్ఘాట్ వద్ద ప్రముఖుల సందడి నెలకొంది. పార్టీలకు అతీతంగా రాజకీయ ప్రముఖులు ఘాట్ వద్దకు చేరుకుని నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా.. ఎన్టీఆర్ తనయ దగ్గుబాటి పురంధేశ్వరి నివాళులు అర్పించి మాట్లాడారు. తెలుగు గడ్డ తరపున నందమూరి తారక రామారావు ఒక సంచలనం. తెలుగు రాష్ట్రాల్లో మే 28 -2022 నుంచి మే 28 -2023 వరకు ఆయన శతజయంతి ఉత్సవాలు నిర్వహిస్తాం. ఇందుకోసం 12 కేంద్రాలను ఏర్పాటు చేశాం. నిర్వహణ బాధ్యతలను చూసుకునేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేశాం. కమిటీలో బాలకృష్ణతో పాటు రాజేంద్ర ప్రసాద్ లాంటి ప్రముఖులు ఉన్నారు. అలాగే ఎన్టీఆర్ బొమ్మను వంద రూపాయల నాణెం పై ముద్రణ చేసే విధంగా అర్బీఐతో సంప్రదింపులు జరుపుతున్నాం. ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో భాగంగా.. నిష్ణాతులైన కళాకారులని ఘనంగా సత్కరిస్తాం అని పేర్కొన్నారామె. ఆపై టీఆర్ఎస్ నాయకులు- మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, మల్లారెడ్డి, జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, నామా నాగేశ్వరరావులు నివాళులు అర్పించి.. భారతరత్న డిమాండ్ వినిపించారు. ఒక తెలుగు బిడ్డ ప్రపంచ ఖ్యాతి గడించిన వ్యక్తి ఎన్టీఆర్. అయన అదేశాల మేరకు అభిమానులు పని చేస్తున్నారు. ప్రధాని మంత్రి కావాల్సిన అర్హతలున్న వ్యక్తి. కానీ, కాస్తలో అది జరగలేదు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ వినిపించారు. శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం మా అదృష్టం. రాజకీయాల్లో, సినిమాలలో ఆయనకు తారాస్థాయిలో అభిమానులు ఉన్నారు. పేదల కష్టం తెలుసుకున్న నాయకుడు ఎన్టీఆర్ అని నామ నాగేశ్వరావు అన్నారు. భూస్వాముల పెత్తనం పక్కన పెట్టిన నాయకుడు ఎన్టీఆర్. మహా నాయకుడి స్ఫూర్తిని తీసుకోని సీఎం కెసీఆర్ నడుస్తున్నారు. దళిత బంధు అందులో భాగమే. నా వివాహానికి వచ్చారు.. నన్ను ముందు ఉండి నడిపిన వ్యక్తి ఎన్ టి ఆర్ అని గుర్తు చేసుకున్నారు మోత్కుపల్లి నర్సింహులు. -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి రోజా
-
ఏపీతో పాటు టీడీపీకి శని చంద్రబాబే: మంత్రి రోజా
సాక్షి, తిరుమల: రాష్ట్రానికి, తెలుగుదేశం పార్టీకి పట్టిన శని చంద్రబాబు నాయుడే అని గతంలోనే ఎన్టీఆర్ చెప్పిన మాటలను గుర్తుచేశారు ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా. శనివారం ఉదయం నియోజకవర్గ నేతలతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి రోజా మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి, తెలుగుదేశం పార్టీకి శని అని గతంలోనే స్వర్గీయ ఎన్టీఆర్ అన్నారు. ఆయన ప్రాణాలు తీసి.. నేడు వారి ఫొటోకి దండలు, దండం పెడుతున్నాడు. ఎన్టీఆర్ పేరు ఓ జిల్లాకి పెడితే.. కనీసం బాబు కృతజ్ఞత కూడా ప్రదర్శించలేదన్నారు ఆమె. మహానాడులో చేసిన తప్పులను సరిదిద్దుకోకుండా.. సీఎం వైఎస్ జగన్‌ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నాడని మంత్రి రోజా మండిపడ్డారు. ఇక మంత్రి విశ్వరూప్ ఇంటిపై జరిగిన దాడిని అమానుష చర్యగా అభివర్ణించిన ఆమె... అల్లర్లను అణచివేయడానికి పోలీసులు ఎంతో సమన్వయంగా వ్యవహరించారని మెచ్చుకున్నారు. అల్లర్లకు పాల్పడిన వాళ్లు ఎంతటి వాళ్లు అయినా వదిలేదేలే అని స్పష్టం చేశారు మంత్రి రోజా. చదవండి: జూనియర్ ఎన్టీఆర్ పేరు విన్నా చంద్రబాబుకు నిద్ర పట్టదు -
ఇలాంటప్పుడు తప్ప ఎన్టీఆర్ గుర్తురారా?
సాక్షి, అమరావతి: నలభై ఏళ్లు నిండిన టీడీపీ సభలో ఆ పార్టీ అధ్యక్షుడు అన్నీ అబద్ధాలే వల్లెవేశారని ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో మండిపడ్డారు. టీడీపీ ఆవిర్భావమో లేదంటే మçహానాడు కార్యక్రమమో తప్ప మిగతా సమయాల్లో ఎన్టీ రామారావును చంద్రబాబు ఎందుకు గుర్తుపెట్టుకోరని ప్రశ్నించారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలనే చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఒక్క జిల్లాకు కూడా ఆయన పేరు పెట్టలేదని గుర్తుచేశారు. సీఎం వైఎస్ జగన్ కృష్ణాజిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టి ఆయన పట్ల తనకున్న గౌరవాన్ని చాటుకున్నారని, బీసీ డిక్లరేషన్ తీసుకురావడంతోపాటు వారి అభివృద్ధికి 53 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. చంద్రబాబు ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడవడం తప్ప ఆయనకు మంచి చేసింది ఏమీలేదని విమర్శించారు. -
భార్యను అడ్డుపెట్టుకుని రాజకీయం చేయడం బాబుకు కొత్తేమీ కాదు!
బంజారాహిల్స్: చంద్రబాబు.. భార్యను అడ్డుపెట్టుకుని సానుభూతి రాబట్టుకోవడం ఇదేం కొత్త కాదని మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్‌రావు స్పష్టం చేశారు. గతంలో ఇందిరాగాంధీ అనుమతి ఇస్తే మామ ఎన్టీఆర్పైనే పోటీ చేస్తానని ప్రగల్భాలు పలికిన తరువాత.. కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరేందుకు తన భార్యను అడ్డుపెట్టుకుని ఎన్టీఆర్‌పై ఒత్తిడి పెంచిన విషయాన్ని తామెవరూ మరచిపోలేదన్నారు. శనివారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. బాబును టీడీపీలో చేర్చుకోని పక్షంలో.. గర్భవతినైన తాను ప్రసవించేది లేదని భువనేశ్వరి బెట్టు చేసిందని.. అందుకే చంద్రబాబును పార్టీలోకి చేర్చుకున్నానని స్వయంగా ఎన్టీఆర్ తనతో చెప్పారని వెల్లడించారు. శుక్రవారం ఏపీ అసెంబ్లీలో జరిగిన చర్చతో పాటు అంబటి రాంబాబు, కొడాలి నాని, సీఎం జగన్ మాట్లాడిన మాటలను మూడు నాలుగుసార్లు విన్నానని, వారెవరూ చంద్రబాబు భార్య గురించి ప్రస్తావించినట్లు తనకు కనబడలేదు.. వినబడలేదని అన్నారు. గతంలో అప్పుడప్పుడూ చంద్రబాబు తన ఇంటికి వచ్చేవాడని.. ఆ సమయంలో మామను దుర్బాషలాడే వాడని వివరించారు. సానుభూతి కోసమే ఇదంతా చేసినట్లుగా నిన్నటి ఘటన అనిపించిందన్నారు. రాజకీయ ఎత్తుగడలు వేయడంలో బాబును మించినవారు లేరని చెప్పారు. గతంలో టీడీపీకే చెందిన ఓ ఎమ్మెల్యే చంద్రబాబు సతీమణి గురించి తప్పుగా మాట్లాడాడని.. ఇది సభలో మాట్లాడింది కాదన్నారు. ఎన్టీఆర్ వృద్ధాప్యంలో ఖర్చుల కోసం దాచుకున్న రూ.20 లక్షలు కూడా బ్యాంకు నుంచి ఆయనకు రాకుండా చంద్రబాబు అడ్డుపడ్డాడని చెప్పారు. తనను అందరూ మోసం చేశారని ఎన్టీఆర్ ఒక రాత్రంతా ఏడ్చిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. తనను బీజేపీలో చేర్చుకోవాలంటూ బాబు డబ్బులు కూడా పంపించినట్లు విమర్శలున్నాయని నాదెండ్ల చెప్పారు. -
ఎన్టీఆర్ విగ్రహానికి పూలదండ వేయమన్నా వేయని లోకేశ్
ఎటపాక: తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీలో మంగళవారం పర్యటించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఆ పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్)ను విస్మరించారు. కనీసం ఆయన విగ్రహాలకు ఎక్కడా పూలమాల కూడా వేయలేదు. తొలుత లోకేశ్ ఎటపాక మీదుగా నెల్లిపాక చేరుకున్నారు. షెడ్యూల్ ప్రకారం నెల్లిపాక జాతీయ రహదారి సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేయాల్సి ఉంది. ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు రెండురోజులుగా స్వాగత బ్యానర్లు కట్టి గజమాల సిద్ధం చేశారు. నెల్లిపాక చేరుకున్న లోకేశ్ కారులో నుంచే అక్కడి వారికి అభివాదం చేసి వెళ్లిపోయారు. పూలమాల వేయలేనంటూ కారుదిగక పోవటంతో కార్యకర్తలే ఎన్టీఆర్ విగ్రహానికి గజమాల వేయటం గమనార్హం. లోకేశ్ తీరుతో కార్యకర్తలు కొంత నొచ్చుకున్నారు. బతిమిలాడినా కారు కూడా దిగకుండా వెళ్లటం సరికాదని ఆపార్టీ నేతలు ఆవేదన చెందారు. కూనవరం మండలం నర్శింగపేటలో కూడా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేయలేదు. దీనిపైనా పార్టీ కార్యకర్తల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. (చదవండి: నలుగురు బ్యాంకు ఉద్యోగుల సస్పెన్షన్) -
మాకూ పింఛన్ ఇవ్వండి..
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: బ్రిటిష్, నిజాం కాలం నుంచి గ్రామాల్లో రెవెన్యూ, శాంతిభద్రతలను చక్కదిద్దేందుకు గ్రామాల్లో పట్వారీ, పటేల్ వ్యవస్థ కొనసాగుతూ వచ్చింది. భూములకు సంబంధించిన కీలకమైన రెవెన్యూ రికార్డుల నిర్వహణతో పాటు గ్రామాల్లో శాంతిభద్రతలు కాపాడుతుండేవారు. 1984లో అప్పటి సీఎం ఎన్టీ రామారావు ఈ వ్యవస్థను రద్దు చేశారు. దీంతో వేలాది మంది ఉపాధి కోల్పోయారు. సుదీర్ఘ పోరాటం తర్వాత సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు 1992లో తిరిగి వీరిలో అర్హులైన వారిని వీఏఓలుగా ప్రభుత్వం నియమించింది. అప్పట్లో రూ.600 గౌరవ వేతనంతో తాత్కాలిక ఉద్యోగులుగా పని చేశారు. చివరకు పదో తరగతి, ఇంటర్మీడియట్ చదివిన వారిని 2002 జనవరి ఒకటి నుంచి పూర్తి స్థాయి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి పే స్కేల్ ఇచ్చారు. వారిని వీఆర్వోలుగా, పంచాయతీ కార్యదర్శులుగా నియమించారు. 2002లో ప్రభుత్వ ఉద్యోగులుగా నియమితులై 2008 జూన్ 30లోగా ఉద్యోగ విరమణ పొందిన వారికి కనీసం ఏడేళ్ల సర్వీసు లేదంటూ పింఛన్ ఇచ్చేందుకు నిరాకరించారు. ఇలాంటి వారు ఉమ్మడి ఏపీలో 2,225 మంది ఉన్నారు. తాము దాదాపు రెండు నుంచి మూడు దశాబ్దాలుగా సేవలందించామని, తమకు కనీస పింఛన్ మంజూరు చేసేందుకు గతంలో 1992 నుంచి 2002 మధ్య పని చేసిన కాలాన్ని కలపాలని ఏపీ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. ట్రిబ్యునల్ ఆదేశాలు, 1980 ఆర్పీఆర్ జీవోలను పరిశీలించిన తర్వాత ఫైలు నం.28496/అ/2013 ప్రకారం పాత సర్వీసును పరిగణనలోకి తీసుకుని 2,225 మందికి కనీస పింఛన్ సౌకర్యం కల్పిస్తూ 2014 ఫిబ్రవరి 2న ఫైలుపై అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సంతకం చేశారు. ఏపీలో అమలు.. తెలంగాణలో ఎదురుచూపులు! ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్న నిర్ణయాలను అమలు చేయాలని విభజన చట్టంలో పొందుపరిచిన మేరకు ఫైలు 28496/అ/2013 ప్రకారం ఏపీకి చెందిన 1,733 మందికి ఆ రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ సౌకర్యం కల్పిస్తూ 2014 నవంబర్ 20న జీవో నంబర్ 388 జారీ చేసింది. దీంతో ఆ ప్రాంతంలోని రిటైర్డ్ వీఆర్వోలు పింఛన్ పొందుతున్నారు. అయితే తెలంగాణలోని 492 మందికి మాత్రం ఆరేళ్లకుపైగా ఎదురుచూపులు తప్పట్లేదు. ఆర్థిక, రెవెన్యూ శాఖల నుంచి అనుమతి లభించినా ఫైలు మాత్రం ముందుకు కదలలేదు. ఈ జాప్యానికి అధికారులే కారణమని రిటైర్డ్ వీఆర్వోలు ఆరోపిస్తున్నారు. ఈ ఫొటోలోని వ్యక్తి పేరు శ్రీనివాసరావు.. వనపర్తి జిల్లా గోపాల్పేట మండలంలోని తాడిపర్తికి చెందిన ఈయన వీఆర్వోగా పనిచేస్తూ 2008లో రిటైర్ అయ్యారు. పింఛన్ సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారు. బీపీ, షుగర్‌తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈయన ఇటీవల పెరాలసిస్ బారిన పడ్డారు. మందులు కొనుగోలు చేయలేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ..ఇది ఒక్క శ్రీనివాసరావు దీనగాథ మాత్రమే కాదు. 2008 జూన్ 30లోపు ఉద్యోగ విరమణ పొందిన తెలంగాణలోని పలువురు వీఏఓలు, వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులందరూ ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అటు ఉద్యోగానికి, ఇటు పింఛన్ కోసం కోర్టులు, ట్రిబ్యునళ్లను ఆశ్రయించి సుదీర్ఘ పోరాటం చేసి 2014లో విజయం సాధించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో వారికి పింఛన్ అందుతుండగా.. తెలంగాణలో ఉన్న వారికి మాత్రం ఎదురుచూపులు తప్పట్లేదు. పైస్థాయి అధికారుల నిర్లక్ష్యంతోనే.. ఆరున్నరేళ్లుగా ఎదురుచూస్తున్నాం. వృద్ధాప్యంలో ఉన్న మేం చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం. పైస్థాయి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే జాప్యం జరుగుతోంది. – డీకే మోహన్‌రావు, అధ్యక్షుడు, తెలంగాణ వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శుల సంఘం సీఎం దృష్టికి తీసుకుపోనందుకే.. సీఎం కేసీఆర్ దృష్టికి అధికారులు మా సమస్యను తీసుకుని పోకపోవడం వల్లే జాప్యం జరుగుతోంది. ఆయనకు తెలిస్తే మా పింఛన్ ఫైల్‌పై సంతకం చేస్తారనే నమ్మకం ఉంది. – వి.నర్సింహారావు, ప్రధాన కార్యదర్శి, తెలంగాణ వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శుల సంఘం చచ్చే వరకైనా పింఛన్ వచ్చేనా? పింఛన్ కోసం ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నాం. ఇప్పటికే చాలా మంది చనిపోయారు. మిగిలిన వాళ్లు పింఛన్ వస్తుందో లేదోననే ఆందోళనలో ఉన్నారు. మేం చనిపోయే వరకైనా వస్తుందో రాదో కూడా తెలియట్లేదు. – ప్రకాశ్‌రావు, రిటైర్డ్ వీఆర్వో, గజ్వేల్, సిద్దిపేట -
ఎంతోమంది ఆప్తుల్ని ఇచ్చారు...
మా నాన్నగారండీ.. ఆయనకి ఇద్దరు భార్యలండీ.. నేను మొదటి భార్య కొడుకునండీ ... అంటూ శంకరాభరణంలో అల్లురామలింగయ్య దగ్గరకు న్యాయం కోసం వచ్చారు.. శ్రీవారికి ప్రేమలేఖలో మరచెంబు పాత్రలో చతుర్ముఖ పారాయణం ఆడారు... చిన్న చిన్న పాత్రలే వేసినా, తెలుగువారి హృదయాల మీద హాస్య పన్నీరు జల్లారు. నాన్నకి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ అంటున్నారు వాడ్రేవు విశ్వనాథమ్ ఉరఫ్ థమ్ కుమార్తె శ్రీకాంతి. నాన్న తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో పుట్టారు. తాతగారు వాడ్రేవు చలమయ్య, బామ్మ లక్ష్మీకాంతమ్మ. వారికి నాన్న ఎనిమిదో సంతానం. ఇద్దరు అక్కలు, ముగ్గురు అన్నయ్యలు, ఇద్దరు తమ్ముళ్లు. ‘తాతగారి పేరు, మార్కెట్‌కి ఎదురుగా ఉన్న వాడ్రేవు బిల్డింగ్, పిఠాపురం’ అని అడ్రస్ రాస్తే చాలు పోస్టు వెళ్లిపోతుంది. తాతగారు డ్రాయింగ్ మాస్టారుగా పనిచేసేవారు. మా పెద్దనాన్నగారే ఇంటి పెద్దగా అందరి బాగోగులు చూసుకున్నారు. నాన్న ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి డిప్లొమా ఇన్ యాక్టింగ్ చేశారు. ఆదిరాజు ఆనంద్‌మోహన్ మా అమ్మకి బాబాయ్. ఆయన ‘పెళ్లి కాని పెళ్లి’ అనే సినిమా తీశారు. అందులో నాన్న చిన్న వేషం వేశారు. అలా మా బాబాయ్ ద్వారా అమ్మకి నాన్నతో పెళ్లి సంబంధం కుదిరి, వివాహం జరిగింది. నాన్నగారికి ఆడవాళ్లంటే చాలా గౌరవం. అమ్మని ఎప్పుడూ ఏమీ అనేవారు కాదు. నేను పుట్టినప్పుడు ‘మా అమ్మే మళ్లీ పుట్టింది’ అని ఎంతో సంతోషంగా అందరికీ స్వీట్స్ పంచారుట. మా అన్నయ్య కొంచెం అమాయకంగా ఉంటాడని వాడిని ఎప్పుడూ కోప్పడేవారు కాదు. నాటకాలలో పరిచయం... నాన్నకి నాటకాలంటే ప్రాణం. నాటకాల ద్వారానే సాక్షి రంగారావు గారు, పొట్టి ప్రసాద్ గార్లతో పరిచయం ఏర్పడింది. సాక్షి రంగారావు గారిని నాన్న ‘మా రంగడు’ అనేవారు. పొట్టిప్రసాద్ గారు తనకు గురువుతో సమానమని చెప్పేవారు. సాక్షి రంగారావు గారిని పెద్దనాన్న అని, పొట్టి ప్రసాద్ గారిని మావయ్య అని పిలిచేవాళ్లం. రాళ్లపల్లి గారు మాకు దేవుడు ఇచ్చిన మావయ్యే. అన్న, అక్క అంటే మాకు వాళ్ల పిల్లలే. రాళ్లపల్లి మావయ్య వాళ్ల అమ్మాయి బయటికి వెళితే నన్ను తనతో తీసుకుని వెళ్లేది. సీతారామశాస్త్రి గారు, దివాకర్‌బాబు గారు.. అందరం చెన్నైలోని సాలిగ్రామంలోనే దగ్గరదగ్గరగా ఉండేవాళ్లం. ఇప్పటికీ అందరితో టచ్‌లో ఉన్నాం. మా నాన్న మాకు ఇచ్చి వెళ్లిన బెస్ట్ గిఫ్ట్ ఈ కుటుంబాలే. చదివితే చాకొలేట్లు... నాన్న షూటింగ్స్‌లో ఎంత బిజీగా ఉన్నా మా చదువు విషయంలో ఎన్నడూ అశ్రద్ధ చేయలేదు. సెలవుల్లో కూడా చదువుకోవాలనేవారు. ఆయన సూట్‌కేస్‌లో థ్రెప్టిన్ బిస్కెట్ల డబ్బా, క్యాడ్బరీ చాకొలేట్ బాక్స్ ఉండేవి. రోజూ నాన్న బయటకు నుంచి ఇంటికి రాగానే మేం ఆయన వెనకాల నిలబడేవాళ్లం. మేము చదువుకున్నామని చెప్పాక ఇద్దరికీ రెండు బిస్కెట్లు, రెండు చాకొలేట్లు ఇచ్చేవారు. చదవకపోతే నో ట్రీట్. రెండో క్లాసు చదువుతున్నప్పుడు... ఒకరోజున ఇంటి దగ్గర టీవీ సీరియల్ షూటింగ్ జరుగుతోంది. అందులో చిన్న సీన్లో నేను, అన్నయ్య ఇద్దరం నటించాం. టీవీలో టెలికాస్ట్ అయినప్పుడు అన్నయ్య సీన్ వచ్చింది, నా సీన్ ఎడిట్ అయిపోయింది. నేను ఏడ్చాను. అప్పుడు నాన్న, ‘ఆడపిల్ల ఏడవకూడదు. నేను రాకపోతేనేం... అన్నయ్య టీవీలో కనిపించాడు కదా... అని నువ్వు సంతోషంగా ఉండాలి తల్లీ’ అని బుజ్జగించారు. చాలా సైలెంట్‌గా ఉండేవారు... సినిమాలలో హాస్య పాత్రలు వేసేవారు కానీ, ఇంటి దగ్గర చాలా సైలెంట్. ఎక్కువ మాట్లాడేవారు కాదు. నాన్న ఇంట్లో ఉన్నప్పుడు నిశ్శబ్దంగా ఉండేవాళ్లం. ఆయన బయటకు వెళ్లగానే కిటికీలోంచి తొంగి చూసేవాళ్లం. నాన్న గేట్ దాటాక, మేం గేటు దాకా వచ్చి, బస్‌స్టాప్‌లో ఉన్నారా, వెళ్లిపోయారా అని చూసి, ఆయన వెళ్లిపోయారని నిర్ధారించుకుని వెంటనే ఆడుకోవటానికి పారిపోయేవాళ్లం. ఒకసారి టీనగర్లో మా తాతగారి ఇంటికి వెళ్లాం. అక్కడ ఉండిపోతానని పేచీ పెట్టటంతో నన్ను అక్కడ ఉంచి వెళ్లిపోయారు నాన్న. అమ్మ సాయంత్రం వరకు ఉండి, ఆ తరవాత ఇంటికి వెళ్లిపోయింది. అమ్మ వెళ్లిన కాసేపటికే బెంగ వచ్చి ఏడుపు మొదలుపెట్టాను. అప్పటికి నాన్న ఏదో పని మీద ఇంకా టీ నగర్లోనే ఉన్నారు. తాతగారు నాన్నకి ఫోన్ చేసి, విషయం చెప్పటంతో, నాన్న వచ్చి ఇంటికి తీసుకెళ్లారు. నాన్న దగ్గర అంత చేరిక నాకు. నేను పదో తరగతి ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయినప్పుడు వాచ్ ఇచ్చారు. నాన్నగారు ఆంధ్ర యూనివర్సిటీలో డిప్లొమో ఇన్ యాక్టింగ్ చేశారని నేను కూడా నా ఎంబిఏ అక్కడ నుంచే చేశాను. ఏయన్నార్‌కి కోపం వచ్చింది... మా చిన్నప్పటి కంటె, మేం కొంచెం పెద్దవాళ్లం అయ్యాకే నాన్నతో గడిపే అవకాశం వచ్చింది. అప్పటికి సినిమా షూటింగ్స్ తగ్గి, సీరియల్స్‌లో మాత్రం వేస్తుండేవారు. ఎక్కువసేపు ఇంట్లో ఉండటం వల్ల, మాతో క్యారమ్బోర్డు అడేవారు. అప్పుడప్పుడు ఏవైనా సినిమా కబుర్లు చెప్పేవారు. నాన్నకి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ. ఒకసారి అక్కినేని నాగేశ్వరరావు గారితో... రాళ్లపల్లి ఏ క్లాస్ ఆర్టిస్ట్, నేను బి క్లాస్ ఆర్టిస్ట్, మీరు సి క్లాస్ ఆర్టిస్ట్ అన్నారట. అక్కినేని గారికి కొంచెం కోపం వచ్చిందట. అప్పుడు నాన్న.. అపార్థం చేసుకోకండి. రాళ్లపల్లిగారు ఆటోలో తిరుగుతున్నారు కాబట్టి ఆయన ఏ గ్రేడ్ ఆర్టిస్ట్, నేను బస్సుల్లో తిరుగుతున్నాను కాబట్టి బి గ్రేడ్ ఆర్టిస్ట్, మీరు కారులో తిరుగుతున్నారు కాబట్టి సి గ్రేడ్ ఆర్టిస్ట్ అన్నారట. ఏయన్నార్‌గారు ఫక్కుమని నవ్వారుట. ఎన్టీఆర్ సహాయం చేశారు... ఎన్టీఆర్‌లో ఉన్న ఒక గొప్ప గుణం గురించి చెప్పారు నాన్న. ఆయనకి చిన్న చిన్న కళాకారులు కూడా గుర్తు ఉంటారట. ఏదైనా సినిమాలో ఒక ప్రత్యేకమైన పాత్ర ఉంటే, దానికి ఏ ఆర్టిస్టు కరెక్ట్ అని ఆలోచించి, ఆ ఆర్టిస్టు ఎక్కడున్నా కబురు పంపేవారట. వారు కష్టాల్లో ఉంటే కూడా ఎన్టీఆర్ గుర్తుపెట్టుకుంటారనటానికి పొట్టి ప్రసాద్‌గారికి చేసిన సహాయమే పెద్ద నిదర్శనం. పొట్టిప్రసాద్ మావయ్యకు ఆరోగ్యం బాగా లేనప్పుడు, హీరో బాలకృష్ణ గారితో ఒక బుట్ట నిండా పళ్లు పంపారు రామారావు గారు. బాలకృష్ణ గారిని దగ్గరుండి ఆసుపత్రికికి నేనే తీసుకువెళ్లాను. అప్పుడు నాలుగో క్లాసు చదువుతున్నాను. బాలకృష్ణ గారు ఎంతో ఆప్యాయంగా పలకరించి వెళ్లారు. ఎన్టీఆర్ గురించి నాన్న చెప్పిన మాటలు అప్పుడు నాకు బాగా గుర్తు వచ్చాయి. ఇద్దరికీ ఒకటే పేరు పెట్టారు నాన్న పూర్తి పేరు వాడ్రేవు కాశీవిశ్వనాథం. తన పేరులోని ఆఖరి అక్షరాలు తీసుకుని థమ్ అని పేరు పెట్టుకున్నారు. పేరు కూడా కామెడీగా ఉండాలని ఆయన ఆలోచన. తమిళంలో అలనాటి హాస్య నటుడు నగేశ్ అంటే ఇష్టం. అందుకే ఆయనలాగే సన్నగా ఉండేవారేమో అనుకుంటాం. అమ్మ పేరు లలిత. బి.ఎస్.సి. బిఈడీ చదివి, సైన్స్ టీచర్‌గా పనిచేసి, పెళ్లయ్యాక మానేసింది. ఇంటి బాధ్యతలు పూర్తిగా అమ్మే చూసుకుంది. వాళ్లకి మేం ఇద్దరం పిల్లలం. అమ్మమ్మ పేరు, బామ్మ పేరు ఇద్దరి పేరు ఒకటే.. లక్ష్మీ కాంతమ్మ. అందుకని నాకు శ్రీకాంతి అని, అన్నయ్యకు శ్రీకాంత్ అని పేర్లు పెట్టారు. ఇద్దరికీ ఒక్క చిన్న అక్షరం తేడా అంతే. కళ్లనీళ్లు పెట్టుకున్నారు.. నాన్నగారు ఏడవటం నా జీవితంలో నేను చూడటం అదే మొదటిసారి. పొట్టిప్రసాద్ మావయ్య ఆరోగ్యం బాగా దెబ్బ తినటంతో ఆసుపత్రిలో చేరారు. ఆయనను చూసి వచ్చిన నాన్నకు ఏడుపు ఆగలేదు. ఆ రోజు నాన్న మంచినీళ్లు కూడా తాగకుండా కూర్చుండిపోయారు. నేనే నాన్నని బుజ్జగించి, అన్నం తినిపించాను. ఆ మావయ్య కన్ను మూసిన రోజున నాన్నను ఓదార్చటం కష్టమైపోయింది. ఆయన మరణం తరవాత చాలా మార్పులు జరిగాయి. ఆప్తులందరూ హైదరాబాద్ తరలి వచ్చేశారు. నాన్న హైదరాబాద్ మారాలా వద్దా అని తర్జనభర్జన పడి, చివరకు మారటానికే నిశ్చయించుకుని, ఏవో వ్యక్తిగత పనుల మీద పిఠాపురం వెళ్లారు. అక్కడ ఉండగానే నాన్నకు అకస్మాత్తుగా హార్ట్ అటాక్ వచ్చి కాలం చేశారు. మాకు దిక్కుతోచని పరిస్థితి. అప్పటికింకా నేను డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాను. మమ్మల్ని చెన్నై నుంచి సాక్షి శివ (సాక్షి రంగారావు కుమారుడు) అన్నయ్యే పిఠాపురం తీసుకువెళ్లాడు. ఆ తరవాత మేం హైదరాబాద్‌కి షిఫ్ట్ అయ్యాం. సాక్షి రంగారావు పెద్దనాన్న సినీ ప్రముఖుల నుంచి కొంత డబ్బు సేకరించి అమ్మకు ఇచ్చారు. కె.విశ్వనాథ్ గారు పది వేలు ఇచ్చారు. సీతారామశాస్త్రి అంకుల్ ‘అమ్మాయిని నాకు ఇచ్చేయండి, పెంచుకుంటాను’ అన్నారు. ఆ రోజు నేను వెక్కివెక్కి ఏడుస్తుంటే, సీతారామశాస్త్రి అంకుల్ నన్ను ఓదారుస్తూ, ‘అమ్మాయీ! నాకూ మా నాన్నగారు లేరు, నేను ఆయనను ఎన్నటికీ చూడలేను. కాని నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ నాన్నను టీవీలో ఏదో ఒక సినిమాలో చూడగలవు కదా’ అన్నారు. ఆస్తులు పాస్తుల కన్నా అనుబంధాలు గొప్పవని నాకు అర్థమైంది. నాన్న చాలా మంది ఆప్తుల్ని మాకు ఇచ్చినందుకు మనసులోనే ఆయనకు నమస్కరిస్తాను. సంభాషణ: వైజయంతి పురాణపండ -
కమర్షియల్ విప్లవనాదం.. మనుషులంతా ఒక్కటే
‘ఎవడిదిరా ఈ భూమి? ఎవ్వడురా భూస్వామి?దున్నేవాడిదె భూమి... పండించేవాడే ఆసామి’. తీవ్రమైన ఆ ప్రశ్నలు... తెగువతో కవి కలం ఇచ్చిన ఆ బలమైన ఆ సమాధానాలు వింటే – ఇప్పుడంటే మాదాల రంగారావు, ఆర్. నారాయణమూర్తి తరహా ఎర్ర సినిమాలు గుర్తొస్తాయి. కానీ, వాటికన్నా ముందే ఓ స్టార్ సినిమా... వెండితెరపై విప్లవం పండించిందని తెలుసా? ఎన్టీ రామారావు లాంటి స్టార్ హీరో, వరుస విజయాల మీదున్న దాసరి నారాయణరావు లాంటి దర్శకుడు కలసి నాలుగున్నర దశాబ్దాల క్రితమే చేసిన సమసమాజ నినాదం ‘మనుషులంతా ఒక్కటే’ (1976 ఏప్రిల్ 7). ఆ సినిమాకు 45 వసంతాలు. ఆనాటి పరిస్థితులే... అలా తెరపై... వ్యవసాయ ఆధారితమైన మన దేశంలో స్వాతంత్య్రం వచ్చిన వెంటనే భూ సంస్కరణలు మొదలయ్యాయి. 1950లోనే జమీందారీ వ్యవస్థ రద్దు బిల్లు వచ్చింది. 1956లో అనేక ప్రాంతాలు ఆ బిల్లును చట్టం చేశాయి. ఆర్థిక అసమానతలెన్నో ఉన్న మన దేశానికి కమ్యూనిజమ్, సోషలిజమ్ తారక మంత్రాలయ్యాయి. నెహ్రూ, శాస్త్రి తర్వాత ప్రధాని అయిన ఇందిరా గాంధీ 1970లో రాజభరణాలను రద్దు చేశారు. 1971 ఎన్నికల్లో ‘గరీబీ హఠావో’ నినాదం మారుమోగించారు. ఆ సామాజిక పరిస్థితుల్లో, జనంలో బలపడుతున్న భావాలతో తెరకెక్కిన కథ – ‘మనుషులంతా ఒక్కటే’. బ్రిటీషు కాలం నాటి పెత్తందారీ జమీందారీ వ్యవస్థనూ, సమకాలీన సామ్య వాద భావనలనూ అనుసంధానిస్తూ తీసిన చిత్రం ఇది. తాతను మార్చే మనుమడి కథ కథ చెప్పాలంటే... జమీందారు సర్వారాయుడు (కైకాల సత్యనారాయణ), ఆయన కొడుకు రాజేంద్రబాబు (ఎన్టీఆర్) పేదలను ఈసడించే పెత్తందార్లు. కానీ, పేదింటి రైతు పిల్ల రాధ (జమున) వల్ల పెద్ద ఎన్టీఆర్ మారతాడు. ఆమెను పెళ్ళాడతాడు. పేదల పక్షాన నిలిచి, న్యాయం కోసం పోరా డతాడు. ప్రాణాలు కూడా కోల్పోతాడు. కానీ, ఆ పేదింటి అమ్మాయికీ, అతనికీ పుట్టిన రాము (రెండో ఎన్టీఆర్) పెరిగి పెద్దవాడై, జమీందారు తాతకు బుద్ధి చెబుతాడు. వర్గ భేదాలు, వర్ణ భేదాలు లేకుండా మనుషులంతా ఒక్కటే అని వాణిజ్యపంథాలో చెప్పడంలో సూపర్ హిట్టయిందీ చిత్రం. విప్లవ కథాచిత్రాలకు కమర్షియల్ మూలం కళాదర్శకుడు– పబ్లిసిటీ డిజైనింగ్ ‘స్టూడియో రూప్ కళా’ ఓనరైన వి.వి. రాజేంద్ర కుమార్ కు సినిమా చేస్తానంటూ అప్పటికి చాలా కాలం ముందే ఎన్టీఆర్ మాటిచ్చారు. మాటకు కట్టుబడి, డేట్లిచ్చారు. పౌరాణికం తీయాలని రాజేంద్ర కుమార్ మొదట అనుకున్నారు. చివరకు ఎన్టీఆర్ – దాసరి కాంబినేషన్‌కు శ్రీకారం చుడుతూ, సాంఘికం ‘మనుషులంతా ఒక్కటే’ తీశారు. రాజేంద్ర కుమార్ సమర్పణలో, ఆయన సోదరుడు – కథా, నవలా రచయిత వి. మహేశ్, గుంటూరుకు చెందిన దుడ్డు వెంకటేశ్వరరావు నిర్మాతలుగా ఈ సినిమా నిర్మాణమైంది. ‘మనుషులంతా ఒక్కటే’ అనే పేరు, ‘దున్నేవాడిదే భూమి’ లాంటి అంశాలు అచ్చంగా వామపక్ష భావజాలంతో కూడిన సినిమాల్లో కనిపిస్తాయి. కానీ ప్రజాపోరాటంతో పాటు, పెద్ద కుటుంబానికి చెందిన హీరో తక్కువ కులపు పేదింటి అమ్మాయిని పెళ్ళాడడం లాంటివన్నీ ఈ కమర్షియల్ చిత్రంలో ఉన్నాయి. అలా చూస్తే ‘భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం’ అనే విప్లవ భావాలతో వచ్చిన తర్వాతి సినిమాలకు ఒక రకంగా ‘మనుషులంతా ఒక్కటే’ మూలమనేవారు దాసరి. అంతకు మునుపు కూడా పెత్తందార్లపై, రైతు సమస్యలపై సినిమాలు వచ్చినా, అవన్నీ పూర్తిగా గ్రామీణ నేపథ్యంలోవే! బ్లాక్ అండ్ వైటే!! ఇలా కమర్షియల్, కలర్ చిత్రాలు కావనేది గమనార్హం. కథ వెనుక కథేమిటంటే... దాసరి రచయితగా, దర్శకత్వ శాఖలో సహాయకుడిగా ఉన్నప్పటి నుంచి ఎన్టీఆర్‌కు తెలుసు. ‘ఒకే కుటుంబం’ (1970 డిసెంబర్ 25)తో సెట్స్‌పై దాసరి దర్శకత్వ ప్రతిభ కూడా ఎన్టీఆర్‌కు తెలిసింది. మరో హిందీ షూటింగుతో క్లాష్ వచ్చి, దర్శకుడు ఎ. భీమ్‌సింగ్ అందుబాటులో లేనప్పుడు కొద్దిరోజులు ‘ఒకే కుటుంబం’ షూటింగ్ చేసింది ఆ చిత్రానికి సహ రచయిత, అసోసియేట్ డైరెక్టరైన దాసరే! అంతకు ముందు రచయితగానూ దాసరి ఒకటి రెండు కథలతో ఎన్టీఆర్ దగ్గరకు వెళ్ళినా, రకరకాల కారణాలతో అవేవీ సెట్స్ పైకి రాలేదు. ఈ ‘మనుషులంతా ఒక్కటే’కు దాసరి ముందు అనుకున్న మూలకథ కూడా వేరే ఎన్టీఆర్ నిర్మాతల దగ్గరకు వెళ్ళిందట! ఎన్టీఆర్, జమునలతో తీయాలనేది ప్లాన్. కానీ, అప్పటికే వచ్చిన ‘మంగమ్మశపథం’(1965)తో పోలికలున్నాయంటూ, ఆ నిర్మాత వెనక్కి తగ్గారట! ఆ తరువాత చాలాకాలానికి దాసరి దర్శకుడయ్యాక ఆ మూల కథే మళ్ళీ ఎన్టీఆర్, జమునలతోనే తెరకెక్కడం విచిత్రం. ‘మనుషులంతా ఒక్కటే’ నిర్మాతల్లో ఒకరైన నవలా రచయిత వి. మహేశ్ గతంలో దాసరి దగ్గర పలు చిత్రాలకు అసిస్టెంట్ స్టోరీ రైటర్. చాలాకాలం క్రితం తాను అనుకున్న కథలో మహేశ్, ఆర్కే ధర్మరాజు సహకారంతో మార్పులు, చేర్పులు చేశారు దాసరి. దాంతో, ఈ కథ నేపథ్యమే మారింది. దున్నేవాడిదే భూమి, జమీందారీ వ్యవస్థ, తాతకు మనుమడు బుద్ధి చెప్పడం లాంటి అంశాలతో కథ కొత్త హంగులు దిద్దుకుంది. నిర్మాత మహేశ్, ఆర్కే ధర్మరాజులకే కథారచన క్రెడిట్ ఇచ్చి, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, దర్శకత్వ బాధ్యతల క్రెడిట్ తీసుకున్నారు దాసరి. ఈ సినిమాలో తెరపై రెండో ఎన్టీఆర్‌ను హోటల్ రిసెప్షన్ దగ్గర పలకరించే చిరువేషంలోనూ మెరిశారు మహేశ్. సమాజానికి మంచి చెప్పే ఈ కథతో ఆ ఏటి ద్వితీయ ఉత్తమ కథారచయితగా మహేశ్ రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డు అందుకున్నారు. క్రేజీ కాంబినేషన్! దాసరి కొడుకుకు ఎన్టీఆర్ పేరు!! దర్శకుడిగా దాసరికి ఇది 12వ సినిమా. అంతకు ముందు 11 సినిమాల్లో ‘సంసారం – సాగరం’, ‘రాధమ్మ పెళ్ళి’, ‘తిరపతి’, యావరేజ్ ‘యవ్వనం కాటేసింది’ పోగా మిగతా 7 సక్సెస్. ఆ మాటకొస్తే ‘మనుషులంతా ఒక్కటే’ రిలీజైన 1976కు ముందు సంవత్సరం 1975లో రిలీజైన దాసరి చిత్రాలు నాలుగూ శతదినోత్సవ చిత్రాలే. దాసరి మంచి క్రేజు మీదున్నారు. అయితే, శోభన్‌బాబు ‘బలిపీఠం’ మినహా అప్పటి దాకా ఆయన తీసిన సినిమాలన్నీ బ్లాక్ అండ్ వైటే! స్టార్ల కన్నా కథకే ప్రాధాన్యమున్న లోబడ్జెట్ చిత్రాలే! ఆ టైములో ఎన్టీఆర్ లాంటి టాప్ స్టార్‌తో, కలర్లో, ఔట్‌డోర్‌లో, భారీ బడ్జెట్‌తో తొలిసారిగా దర్శకత్వం వహించే ఛాన్స్ రాగానే దాసరి రెట్టించిన ఉత్సాహంతో పనిచేశారు. 1975 నాటికి శోభన్‌బాబు జోరు మీదున్నారు. టాప్ స్టార్‌గా ఎన్టీఆర్ కెరీర్ కొనసాగుతోంది. అప్పట్లో ఎన్టీఆర్ సెంటిమెంటల్ క్రైమ్ కథ ‘అన్నదమ్ముల అనుబంధం’ (1975 జూలై 4), ప్రయోగాత్మక ‘తీర్పు’(1975 అక్టోబర్ 1), మాస్‌ఫార్ములా ‘ఎదురులేని మనిషి’ (1975 డిసెంబర్ 12), విభిన్నమైన క్లాస్ ప్రేమకథ ‘ఆరాధన’ (1976 మార్చి 12) చిత్రాలతో 9 నెలల కాలంలో 4 హిట్లు, చారిత్రక కథా చిత్రం ‘వేములవాడ భీమకవి’ (1976 జనవరి 8) తర్వాత ‘మనుషులంతా ఒక్కటే’తో జనం ముందుకొ చ్చారు. జమీందారీ కథకు తగ్గట్టు రాతి కట్టడంతో కోటలా కనిపించే బెంగళూరులోని మైసూర్ మహారాజా ప్యాలెస్‌లో షూటింగ్ చేసిన తొలి తెలుగు చిత్రమూ ఇదే. అంతకు ముందొచ్చిన ‘దేవుడు చేసిన మనుషులు’ (1973) లాంటివన్నీ తెల్లగా, పాలరాతితో చేసినట్టు తోచే మైసూరులోని లలితమహల్ ప్యాలెస్‌లో తీసినవి. చిత్రమేమిటంటే, ఏ.వి.ఎం స్టూడియోలో ‘మనుషులంతా ఒక్కటే’ షూటింగ్ ప్రారంభమైనరోజునే దాసరికి అబ్బాయి పుట్టాడు. ఆ సంతోష వార్త తెలియగానే ఎన్టీఆర్‌తో పంచుకున్న దాసరి, ‘తారక రామారావు అనే మీ పేరు కలిసొచ్చేలా మా తొలి సంతానానికి నామకరణం చేస్తున్నాం’ అని చెప్పారు. కొడుకుకి‘తారక హరిహర ప్రభు’ అని పేరు పెట్టారు. ఎస్పీబీ గాత్రానికి ఓ కొత్త ఊపు ఇద్దరు ఎన్టీఆర్‌లు, ఇద్దరు హీరోయిన్లున్నా – ‘మనుషులంతా...’లో ఎన్టీఆర్‌కు ఒక్క డ్యుయెటైనా ఉండదు. బాపు సూపర్ హిట్ ‘ముత్యాల ముగ్గు’ సహా అక్కినేని ‘సెక్రటరీ’, కృష్ణంరాజు ‘భక్త కన్నప్ప’ తదితర చిత్రాల ఆడియోలతో గాయకుడు రామకృష్ణ హవా నడుస్తున్న రోజులవి. ఆ పరిస్థితుల్లో అప్పటికి ఇంకా వర్ధమాన గాయకుడైన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ‘మనుషులంతా ఒక్కటే’లోని సోలో పాటలన్నీ ఎస్. రాజేశ్వరరావు స్వరసారథ్యంలో పాడి, ఆకట్టుకున్నారు. ‘అను భవించు రాజా..’, ‘తాతా బాగున్నావా..’, ‘ఎవడిదిరా ఈ భూమి..’ (రచన సినారె), ‘కాలం కాదు కర్మా కాదు..’ (ఆత్రేయ) – ఇలా ఆ సోలో సాంగ్స్ అన్నీ పాపులరే. ఇక, ‘ముత్యాలు వస్తావా...’ డ్యూయట్లో అచ్చంగా అల్లు రామలింగయ్యే పాడారేమో అనేట్టుగా ఎస్పీబీ తన గళంతో మాయాజాలం చేయడం మరో విశేషం. అలా ఆయన కెరీర్‌కు ఈ చిత్రం ఓ కొత్త ఊపు. హాస్యనటి రమాప్రభ ఈ సినిమాలో అల్లు రామలింగయ్య, నాగేశ్‌ల సరసన ద్విపాత్రాభినయం చేయడం ఓ గమ్మత్తు! అల్లుతో రమాప్రభకు ‘ముత్యాలు వస్తావా... అడిగింది ఇస్తావా...’ అంటూ డ్యూయెట్ పెట్టడం మరో గమ్మత్తు!! రాజేశ్ ఖన్నా, షర్మిలా టాగోర్ నటించిన హిందీ సినిమా ‘ఆరాధన’ (1969 సెప్టెంబర్ 27)లో ఎస్.డి. బర్మన్ బాణీకి ఆయన కుమారుడు ఆర్.డి. బర్మన్ హంగులు చేర్చగా, దేశమంతటినీ ఊపేసిన పాపులర్ శృంగారగీతం ‘రూప్ తేరా మస్తానా.’ సరిగ్గా ఆ బాణీనే అనుసరిస్తూ, కొసరాజు రాసిన ‘ముత్యాలు వస్తావా..’ అప్పట్లో రేడియోలో మారుమోగింది. ఇప్పటికీ ఎమోషనల్‌గా... ఆ బుర్రకథలు ఇదే సినిమాలో ఇంటర్వెల్‌కు ముందు పెద్ద ఎన్టీఆర్ పాత్ర ఒంటరిగా దుండగుల చేతిలో చనిపోయే ఉద్విగ్నభరిత ఘట్టం ఉంటుంది. ఆ సందర్భానికి తగ్గట్టు మహాభారతంలోని అభిమన్యుడి బుర్రకథను సినారె ప్రత్యేకంగా రాశారు. ప్రసిద్ధ బుర్రకథకుడు నాజర్ బృందంతో ఈ బుర్రకథ తీయాలనుకున్నారు. అయితే, ఆయన వయోభారం అడ్డమైంది. దాంతో, సినారె సూచనతో హైదరాబాద్‌కు చెందిన మరో ప్రముఖ బుర్రకథకుడు పి. బెనర్జీ బృందంతో ఆ బుర్రకథ తీశారు. ఆ బుర్రకథ, తెరపై దాని చిత్రీకరణ ఓ ఎమోషనల్ ఎక్స్పీరియన్స్. నాలుగున్నరేళ్ళ తర్వాత ఎన్టీఆర్ –దాసరి కాంబినేషన్లోనే వచ్చిన ‘సర్దార్ పాపారాయుడు’ లోనూ ఇంటర్వెల్ ముందు ఇదే బెనర్జీ బృందంతో శ్రీశ్రీ రాసిన అల్లూరి సీతారామరాజు బుర్రకథ పెట్టడం విశేషం. యాభైకే... 100 రోజుల వసూళ్ళు తరువాతి కాలంలో దర్శకులైన కె. దుర్గానాగేశ్వరరావు ‘మనుషులంతా ఒక్కటే’కు కో–డైరెక్టరైతే, శతచిత్ర దర్శకుడైన కోడి రామకృష్ణ అప్పట్లో అసిస్టెంట్ డైరెక్టర్. దాసరి శిష్యుడు – ఇప్పటి విప్లవ చిత్రాలకు చిరునామాగా మారిన ఆర్. నారాయణమూర్తి కూడా ఈ విప్లవాత్మక కథాచిత్రంలో క్లైమాక్స్‌లో ఒక చిన్న డైలాగు వేషంలో కనిపిస్తారు. తమిళనాడులోని మద్రాసు, కర్ణాటకలోని బెంగళూరు, నందీహిల్స్, ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు పరిసరాల్లో – ఇలా 3 రాష్ట్రాల్లో భారీ వ్యయంతో ఈ సినిమా చిత్రీకరణ సాగింది. 33 ప్రింట్లతో 50 థియేటర్లలో రిలీజైన ఈ కలర్ చిత్రం అప్పట్లో దాదాపు అన్ని కేంద్రాలలో 50 రోజులు ఆడింది. నాలుగు కేంద్రాల్లో శతదినోత్సవం చేసుకుంది. విజయవాడ లక్ష్మీ టాకీస్‌లో అత్యధికంగా 128 రోజులు ప్రదర్శితమైంది. ఇక, హైదరాబాద్ కేంద్రంలో షిఫ్టింగులతో, సంయుక్త రజతోత్సవం మాత్రం జరుపుకొంది. క్లైమాక్స్ చిత్రీకరణ సాగిన నెల్లూరులో విపరీతంగా ఆదరణ లభించింది. అలా నెల్లూరు, గుంటూరు లాంటి కొన్ని కేంద్రాలలో సర్వసాధారణంగా ఒక సినిమాకు వందరోజులకు వచ్చే వసూళ్ళను ‘మనుషులంతా ఒక్కటే’ కేవలం యాభై రోజులకే సాధించడం అప్పట్లో చర్చ రేపింది. ఆ ఏడాది జూలై 26న మద్రాస్ తాజ్ కోరమాండల్ హోటల్లో దర్శకుడు పి. పుల్లయ్య, నిర్మాత డి.వి.ఎస్ రాజు ముఖ్య అతిథులుగా సినిమా వంద రోజుల వేడుక ఘనంగా చేశారు. అప్పట్లో ఎమ్జీఆర్తో తమిళంలో ఈ సినిమాను రీమేక్ తీయాలనుకున్నారు. కానీ, ఆ వెంటనే జరిగిన ఎన్నికల్లో ఆయన ముఖ్యమంత్రి కావడంతో అది కుదరలేదు. ఏది ఎలా ఉన్నా, మనుషులంతా ఒక్కటే అనే సార్వకాలిక సత్యాన్ని జనరంజకంగా చెప్పిన చిత్రంగా ‘మనుషులంతా ఒక్కటే’ ఎప్పటికీ గుర్తుంటుంది. ఎన్టీఆర్ సహకారంతో... ‘మనుషులంతా...’ తరువాత రాజేంద్ర కుమార్‌కు ఎన్టీఆర్ ఇంకో సినిమా చేశారు. ‘రక్తసంబంధం’ ఫక్కీలోని ఆ అన్నాచెల్లెళ్ళ సెంటిమెంట్ చిత్రం – ‘మహాపురుషుడు’. ‘ఆబాలగోపాలుడు’ టైటిల్ మధ్యలో అనుకొని, చివరకు ‘మహాపురుషుడు’ (1981 నవంబర్ 21)గానే రిలీజైందా సినిమా. నిర్మాణం సగంలో ఉండగానే రాజేంద్ర కుమార్ హఠాత్తుగా కన్నుమూశారు.చిత్ర నిర్మాణం సందిగ్ధంలో పడి, ఆలస్యమైంది. ఎన్టీఆర్ సహకరించి, సినిమా పూర్తి చేయించి, రిలీజ్ చేయించడం విశేషం. పబ్లిసిటీలో... పేరు వివాదం! ‘మనుషులంతా ఒక్కటే’తో మొదలైన ఎన్టీఆర్ – దాసరి కాంబినేషన్లో ఆ తరువాత మరో 4 సినిమాలు వచ్చాయి. ఈ సినిమా తీసేనాటికే ప్రింట్, పోస్టర్ పబ్లిసిటీలో దర్శకుడిగా దాసరి పేరు సినిమా టైటిల్ కన్నా పైన మేఘాలకు ఎక్కింది. కానీ, ఎన్టీఆర్‌తో తొలిసారి తీస్తున్న ‘మనుషులంతా ఒక్కటే’ ప్రిరిలీజ్ పబ్లిసిటీకి దాసరి తన పేరును సినిమా టైటిల్ కన్నా కిందే వేసుకున్నారు. ఆ పైన తమ కాంబినేషన్లో రెండో సినిమా ‘సర్కస్ రాముడు’ (1980 మార్చి 1)కు మాత్రం ఎందుకనో టైటిల్ పైన తన పేరు వేసుకున్నారు దాసరి. అది చూసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ దాసరి దగ్గర పంచాయతీ పెట్టారు. దాంతో, ఇకపై ప్రధాన పబ్లిసిటీలో ముందుగా పైన ఎన్టీఆర్ నటించిన అని పేరు వేసి, ఆ తరువాతే మరోవైపు తన పేరు మేఘాలలో వేయడానికి దాసరి రాజీ కొచ్చారు. ఒప్పుకున్నట్టే, ఆ తరువాత తీసిన ‘సర్దార్ పాపారాయుడు’ (1980 అక్టోబర్ 30), ‘విశ్వరూపం’ (1981 జూలై 25) ప్రధాన పబ్లిసిటీకి ఆ పద్ధతే అనుసరించారు. ఆఖరుగా వచ్చిన ‘బొబ్బిలిపులి’ (1982 జూలై 9)కి సైతం ‘‘నవరస నాయకుడు నటరత్న యన్.టి.ఆర్. నటనా వైభవం’’ అని ముందు వేసి, ఆ తరువాతే మేఘాలలో తన పేరు పబ్లిసిటీలో కనిపించేలా చూశారు. పబ్లిసిటీలో పేరెక్కడ ఉండాలనే ఈ వివాదం సినీప్రియుల్లో అప్పట్లో ఓ ఇంట్రెస్టింగ్ టాపిక్ అయింది. నాగభూషణం లాస్... సత్యనారాయణకు గెయిన్! ఈ సినిమాలో కీలకమైనది – మనుమడైన రెండో ఎన్టీఆర్ ఢీ కొట్టే తాత పాత్ర. అహంకారం నిండిన జమీందారుగా ఆ విలనీ తాత పాత్ర, ఆ గెటప్ అప్పట్లో నటుడు నాగభూషణం ట్రేడ్ మార్క్. నిజానికి, ఎన్టీఆర్ కూడా ఆయన పేరే సూచించారట. కానీ, నాగభూషణం సమర్పించిన ‘ఒకే కుటుంబం’కి పనిచేసిన దాసరి ఆ మాట వినలేదు. ‘తాత – మనవడు’లో నాగభూషణం బదులు గుమ్మడితో వేషం వేయించిన దాసరి ఈసారీ వ్యక్తిగత కారణాల రీత్యా నాగభూషణాన్ని వద్దనే అనుకొన్నారు. సత్యనారాయణ పేరు పైకి తెచ్చారు. అదేమంటే, ‘నన్ను నమ్మండి. ఆయన అద్భుతంగా చేస్తారని నిరూపిస్తా’ అని వాదించి మరీ ఒప్పించారు. నిరూపించారు. ‘ఎన్టీఆర్‌కు తాతగా మహామహులు చేయాల్సింది నేను చేయడమేమిట’ని సత్యనారాయణ సైతం భయపడ్డారు. కానీ, తాత పాత్రకు ప్రాణం పోశారు. ఆయన అభినయం, ‘తాతా బాగున్నావా’ లాంటి పాటలతో నేటికీ ఆ పాత్ర చిరస్మరణీయమైంది. ‘కర్ణ’ ఛాన్స్ ఇచ్చిన... జమున కెమేరా అందం పెద్ద ఎన్టీఆర్‌కు భార్యగా, చిన్న ఎన్టీఆర్‌కు తల్లిగా, ఆత్మాభిమానం ఉన్న పేదింటి రైతుబిడ్డగా జమునది క్లిష్టమైన పాత్ర. ఆ పాత్రను ఆమె అభినయంతో మెప్పించారు. నలభై ఏళ్ళ వయసులోనూ జమున లంగా, ఓణీలతో సినిమా ఫస్టాఫ్‌లో ఆకర్షణీయంగా, చలాకీగా కనిపిస్తారు. ఆ వయసులోనూ, ఆ కాస్ట్యూమ్స్‌తో ఆమెను అందంగా, హుందాగా చూపడంలో కెమేరామ్యాన్ కన్నప్ప ప్రతిభ కూడా ఉంది. ఆ పనితనం ఎన్టీఆర్‌కు బాగా నచ్చింది. ఆ వెంటనే ఎన్టీఆర్ తన 54వ ఏట స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తూ, త్రిపాత్రాభినయం చేస్తున్న పౌరాణిక చిత్రం ‘దాన వీర శూర కర్ణ’ (1977 జనవరి 14)కు కన్నప్పనే కెమేరామ్యాన్‌గా తీసుకున్నారు. కర్ణుడు, సుయోధనుడు, శ్రీకృష్ణుడు – ఈ మూడు పాత్రల్లోనూ తెరపై అందంగా కనువిందు చేశారు. ఆ పాట... అలా స్పెషల్! ఇదే సినిమాలో దాసరి చేసిన మరో మ్యాజిక్ – సినిమాల టైటిల్స్‌తోనే ఏకంగా ఓ పాటంతా రాసి, మెప్పించడం! ‘నిన్నే పెళ్ళాడుతా... రాముడూ భీముడూ...’ అంటూ ఆ పాట అంతా ఎన్టీఆర్ నటించిన సినిమాల టైటిల్స్‌తోనే సాగుతుంది. పి. సుశీల గానంలో హీరోయిన్ మంజుల స్టేజీపై నర్తిస్తుండగా, ఎన్టీఆర్ మీదే దాన్ని చిత్రీకరించడం విశేషం. అంతకు ముందు ‘ఒకే కుటుంబం’ లాంటి సినిమాల్లో గీతరచన చేసినా, దర్శకుడయ్యాక దాసరికి ఇదే ఫస్ట్ సాంగ్. ఈ సినిమాలో ఈ సందర్భం కోసం మొదట వేరే పాట అనుకున్నారు. ఎన్టీఆర్ పౌరాణిక గెటప్పుల్లో కనిపించేలా సినారె రాశారు. అయితే, ఆఖరి నిమిషంలో ఆ గెటప్పుల ప్రతిపాదన విరమించుకొని, ఆపద్ధర్మంగా దాసరి ఈ సినిమా టైటిల్స్పాట రాశారు. సినీటైటిల్స్తోనే ఓ పాట రావడం తెలుగులో అదే తొలిసారి. అప్పటికే ఎన్టీఆర్ దాదాపు 250 సినిమాల్లో నటించారు. అందులోని 34 టైటిల్స్ ఈ పాటలో ఉన్నాయి. అలా ఒక హీరోపై ఆయన సినీటైటిల్స్తోనే ఓ పాట రాసి, ఆయనపైనే చిత్రీకరించడం తెలుగులో ఇదొక్కసారే జరిగింది. తర్వాత ‘మరోచరిత్ర’ లాంటి సినిమాల్లో వేర్వేరు సినిమాల టైటిల్స్ తోనే పాటంతా రాయడమనే ధోరణి కొనసాగింది. - రెంటాల జయదేవ -
నాడు ఎన్టీఆర్ ఉసురుతీసి ఇప్పుడు దండలేస్తావా!
సాక్షి, అమరావతి: దివంగత నేత ఎన్టీ రామారావు పేరు కూడా ఉచ్ఛరించే కనీస అర్హత కూడా చంద్రబాబుకు లేదని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు (నాని) అన్నారు. పిల్లనిచ్చిన పాపానికి మామకే వెన్నుపోటు పొడిచి, ఎన్టీఆర్ మరణానికి కారణమైన దుర్మార్గుడు చంద్రబాబు అని ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. సాధారణ కుటుంబంలో పుట్టిన ఎన్టీఆర్ అసాధారణ స్థాయికి ఎదిగి.. పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రజల హృదయాల్లో నిలిచిపోయారన్నారు. మంత్రి నాని ఇంకా ఏమన్నారంటే.. అఖిలప్రియ అరెస్టుపై మాట్లాడవేం! కిడ్నాప్ కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి అఖిలప్రియను తెలంగాణ పోలీసులు అరెస్టు చేసి పది రోజులైనా చంద్రబాబు, ఆయన కొడుకు, ఆ పార్టీ నేతలకు మాట్లాడే దమ్మే లేదు. ఆమె ఏపీలో అరెస్టయి ఉంటే ఇదే చంద్రబాబు నట విశ్వరూపం చూపించేవాడు. ఇలాంటి నీచమైన రాజకీయాలు చేసే వ్యక్తి ఇంకెవరైనా ఉంటారా? డీజీపీని ఎందుకు బెదిరిస్తున్నారు? ఊరికి దూరంగా.. సీసీ కెమెరాలు లేని.. దేవదాయ శాఖకు సంబంధం లేని గుడిలో విగ్రహాన్ని ధ్వంసం చేస్తే చంద్రబాబు నానా రభస చేస్తాడు. జగన్మోహన్రెడ్డి, డీజీపీ, హోంమంత్రి అంతా క్రిస్టియన్లు అంటాడు. 9 ఆలయాల్లో ఘటనలతో టీడీపీ, బీజేపీకి చెందిన వారికి సంబంధం ఉందని చెబితే డీజీపీని బెదిరిస్తారా? 80 గుళ్లపై జరిగిన దాడిలో వాళ్ల ప్రమేయం ఉందని డీజీపీ చెప్పలేదే. డీజీపీని బెదిరించడం వెనుక అసలు కథ వేరు. చంద్రబాబు హయాంలో కాల్‌మనీ కేసు వెలుగులోకి వచ్చింది. ఇప్పుడున్న డీజీపీ అప్పట్లో విజయవాడ నగర సీపీ. కాల్‌మనీ కేసులో టీడీపీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతల ప్రమేయం ఉందని తేల్చాడు. వాళ్ల పేర్లు బయటపెట్టొద్దని డీజీపీపై చంద్రబాబు ఒత్తిడి తెచ్చాడు. వినలేదని ట్రాన్స్ఫర్ చేశాడు. సీనియారిటీ ఉన్నా డీజీపీ పోస్టు ఇవ్వలేదు. తమ ప్రభుత్వం ఆయన అర్హతలను గుర్తించి ఉన్నత స్థానం కల్పిస్తే చంద్రబాబు విమర్శలు చేస్తున్నాడు. చంపేసి.. దండేస్తావా బాబూ! ఎన్టీఆర్ పెట్టిన పార్టీనే లాక్కుని, ఆయననే సస్పెండ్ చేసి, ముఖ్యమంత్రి పదవినీ లాక్కున్న దొంగవు నువ్వు. నువ్విప్పుడు ఆయన విగ్రహాలకు దండలేయడం, ఎన్టీఆర్ గురించి గొప్పలు చెప్పడం విడ్డూరంగా ఉంది. ఎన్టీఆర్ వర్ధంతి రోజునో.. జయంతి రోజునో ఆయనకు భారతరత్న ఇవ్వాలంటావు. ఢిల్లీలో చక్రాలు తిప్పానని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు అప్పుడేం చేశాడు. ఎందుకు అప్పుడే భారతరత్న ఇప్పించలేదు. వాజ్‌పేయితో ఐదేళ్లు, నరేంద్రమోదీతో మరో ఐదేళ్లు అంటకాగినప్పుడు భారతరత్న విషయం గుర్తుకు రాలేదా? మోసం, దగా, వంచన తెలిసిన చంద్రబాబుకు ప్రపంచరత్న అవార్డు ఇవ్వాలి. ప్రజలంతా జగన్ వైపే.. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీలు, అగ్రవర్ణ పేదలతోపాటు 80 శాతం ప్రజలకు సీఎం వైఎస్ జగన్ సంక్షేమ పథకాలను అందిస్తుండటంతో వారంతా ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. అందుకే చంద్రబాబు కుట్రపన్ని గుళ్లను కూల్చి మొసలి కన్నీరు కార్చే నీచ రాజకీయాలు చేస్తున్నాడు. విద్వేషాల వెనుక ఎవరున్నా చొక్కా పట్టుకుని బయటకు తీసుకొస్తాం. మతాలను అడ్డుపెట్టుకుని బతకాల్సిన అవసరం వైఎస్సార్సీపీకి లేదు. వైఎస్ జగన్ మానవతావాది. గుడికెళ్లినా, మసీదుకెళ్లినా, చర్చికెళ్లినా ఆ సంప్రదాయాలను గౌరవించే వ్యక్తి జగన్. ఓట్లకోసం చంద్రబాబు చేసే చిల్లర రాజకీయాలు ప్రజలు నమ్మొద్దు. మతమే అజెండాగా పనిచేసే బీజేపీ ఆటలు ఈ రాష్ట్రంలో ఎంతమాత్రం సాగవు. -
చంద్రబాబుపై కొలుసు పార్థసారథి తీవ్ర విమర్శలు
-
‘వెన్నుపోటుకు సిల్వర్ జూబ్లీ చేసుకోవడం సిగ్గు చేటు’
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు వెన్నుపోటుకు టీడీపీ నేతలు సిల్వర్ జూబ్లీ వేడుకలు చేసుకోవడం సిగ్గుచేటు అన్నారు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘చంద్రబాబు చేసిన వెన్నుపోటుపై ప్రజలు తలదించుకుంటున్నారు. ఎన్టీఆర్‌పై కుట్రలు పన్ని ఆయనను పదవి నుంచి దించడమే కాకుండా చెప్పులతో కొట్టి అవమానించారు. టీడీపీ నేతలు చేస్తున్న పనికి ఎన్టీఆర్ ఆత్మ ఘోషిస్తుంది. ఆయన నుంచి అన్యాయంగా పార్టీతో పాటు సింబల్‌ని కూడా లాక్కున్నారు. చంద్రబాబుకు ఎన్టీఆర్‌పై ప్రేమ ఉంటే ఎందుకు భారత రత్న అవార్డ్‌కు సిఫార్సు చేయలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా బలంతో అధికారంలోకి వస్తే.. చంద్రబాబు వెన్నుపోటుతో అధికారంలోకి వచ్చారు. 25 ఏళ్ళలో చంద్రబాబు రాష్ట్రనికి చేసింది ఏమీలేదు. ఒక్క పథకం కూడా చంద్రబాబు పేరు గుర్తుకు వచ్చేలా పెట్టలేదు’ అంటూ తీవ్ర విమర్శలు చేశారు. (చదవండి: తండ్రివి నీవే చల్లగ కరుణించిన దీవెన నీవే) అంతేకాక ‘మీడియా మేనేజ్మెంట్తో చంద్రబాబు బతుకుతున్నారు. వ్యవసాయం దండగన్న సీఎంగా చంద్రబాబు చరిత్రలో నిలిచిపోయారు. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన కిలో 2 రూపాయల బియ్యం, మద్యపాన నిషేధం ఎత్తివేసిన ఘనత చంద్రబాబుది. ఆయన ఇచ్చిన లేఖతో రాష్ట్ర విభజన జరిగింది. ప్రత్యేక హోదకు బదులు ప్యాకేజీకి అంగీకరించారు. అమరావతిలో 55 వేల కోట్లకు టెండర్లు పిలిచి ఒక్క రూపాయి కూడా బడ్జెట్లో కేటాయించలేదు. వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు హీరోనా...151 సీట్లు సాధించిన జగన్మోహన్ రెడ్డి హీరోనా’ అంటూ పార్థసారథి ప్రశ్నించారు. -
ఎన్టీఆర్ జీవితమే సందేశం
తెలుగు సినీ జగత్తులో నందమూరి తారక రామారావు నట సార్వభౌముడు. ఎన్టీఆర్‌గా, అన్నగా తెలుగు జాతి హృదయాలను గెలుచుకున్న విశ్వనటుడు. తెలుగు ప్రజల సంస్కృతి సాంప్రదాయాలకు నిలువుటద్దం. తెలుగు భాషా నుడి కారాలకు పర్యాయపదం. ఆత్మగౌరవ పతాక. మరోవైపు ఎన్టీఆర్ అంటే క్రమశిక్షణ. తన వైవిధ్యభరితమైన పాత్రలతో ఆబాల గోపాలాన్ని అలరించారు. నాలుగు దశాబ్దాల పైబడిన సినీ ప్రస్థానంలో నాలుగు వందలకు పైబడి నటించిన చిత్రాల్లో తెలుగువారి జీవన నేపథ్యమే ప్రతిఫలించింది. పురాణ పాత్రల ద్వారా ఆరాధ్యదైవంగా నిలి చారు. మూసధోరణికి భిన్నంగా కుటుంబ బాధ్య తలు చేపట్టిన పెద్దగా, అన్నగా, ప్రేమికుడుగా, స్నేహితుడుగా అనుబంధం, మమకారం, దుఃఖం, రాచరికాలు వంటి బహుముఖ రసాన్విత పాత్రలతో తెలుగునేల సాంఘిక జీవనాన్ని దృశ్యకావ్యాలుగా మలిచారు. భిన్న పాత్రలతో సాగిన ఎన్టీఆర్ సినీ ప్రస్థానం ఆయన్ని వెండితెర వేల్పుగా, ఒక కర్మయోగిగా ప్రజల ముందు నిలిపింది. వెండితెర అగ్ర కథానాయకుడుగా వెలుగొందుతూ ప్రతినాయక పాత్రలయిన రావణాసురుడు, దుర్యోధనుడు వంటి పాత్రలకు సైతం రాజసం అద్దారు. సర్వావేశ సంకలితం, ఆనందం, ఆవేశం, ఆగ్రహం, సహనం, అసూయ, భక్తి, ధిక్కారం వంటి రావణుని పరస్పర విరుద్ధ ప్రవృత్తులన్నీ ఎన్టీఆర్ వ్యక్తీకరించారు. ఎన్టీఆర్ క్రమశిక్షణ శ్వాసగా బ్రతికిన వ్యక్తి. భావోద్వేగాలను నియంత్రించుకోవడంలో నేర్పరి. కళాకారుడు దేనికి కట్టుబడి ఉండడనే లోకోపవాదుని ఎన్టీఆర్ తిరగరాశారు. సామా జిక దురాచారాలపై ఎన్టీఆర్ తన పాత్రల ద్వారా కత్తి ఝుళిపించారు. పౌరాణిక పాత్రలు ఎన్టీఆర్ ఆంగిక, హావభావాల్లో ఇట్టే ఒదిగేవి. పౌరాణిక పాత్రల్లో ఎన్టీఆర్ నట విశ్వరూపాన్ని చూపిన చిత్రం ‘దాన వీర శూర కర్ణ’. కృష్ణుడిగా, దుర్యోధనుడిగా, కర్ణుడిగా త్రిపాత్రాభినయం చేశారు. సుయోధనునిగా ఎన్టీఆర్ అసమానంగా నటించారని సినీ విమర్శకులు ప్రశంసలు కురిపించారు. అలాగే ‘శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర’ చిత్రం ద్వారా సామాజిక కుటిల నీతిని బహిర్గతం చేశారు. బహుముఖంగా అనేక భిన్న పాత్రల్లో నటిస్తూ తన మనసు దాహార్తిని తీర్చే సామాజిక సందేశాత్మక చిత్రాలు అనేకం నిర్మించారు. పదిహేడు చిత్రాలకు స్వయంగా దర్శకత్వం చేశారు. నర్తనశాల చిత్రం కోసం వెంపటి చిన సత్యం వద్ద నృత్యాన్ని నేర్చుకున్నారు. ఎన్టీఆర్ పాత్రలలో పరకాయ ప్రవేశం చేస్తాడనటానికి ఇది నిదర్శనం. వారి నట కౌశలాన్ని తెలుగు ప్రేక్షకులు దృశ్యమానంగా తిలకించారు, పులకించిపోయారు. ఎన్టీఆర్‌కు తెలుగు సాహిత్యం, భాషపై ఎనలేని మమకారం. భాషపై అపారమైన పట్టువున్న వెండితెర నాయకుడు. శ్రీశ్రీ సాహిత్యాన్ని కరతలామలకంగా తెలుసుకున్నారు. ఇటువంటి నేపథ్యంలోంచే ‘ప్రజలే దేవుళ్లు, సమాజమే దేవాలయం’ అనగలిగారు. సాహిత్య ప్రియుడయిన ఎన్టీఆర్ ‘పల్నాటి యుద్ధం’ సినిమా యుద్ధ సన్నివేశంలో యోధులకు యుద్ధ నియమాలు బోధించే సందర్భానికి మహాకవి గుర్రం జాషువా పద్యాలు రాయించుకున్నారు. పలు ప్రసంగాల్లో ‘దేశభాషలందు తెలుగు లెస్స’ అన్న శ్రీకృష్ణ దేవరాయలవారి మాటల్ని వల్లె వేసేవారు. తెలుగు భాష ఔన్నత్యాన్ని శ్లాఘిస్తూ తాదాత్మ్యం చెంది మాట్లాడేవారు. విద్యార్థి దశలోనే తెలుగు భాషమీద ప్రాణాలు నిలిపి చదువుకున్నానంటారు ఎన్టీఆర్. చదువు నేర్పిన గురువుల పట్ల అత్యంత గౌరవ ప్రపత్తులతో వుండేవారు. ఈ ప్రభావంతోనే ఆయన తెలుగు విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. సామాజికార్థిక సమన్యాయం ప్రాతిపదికగా ‘అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ’ని నెలకొల్పారు. భారతీయ తాత్విక ధారల్లో ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రజాస్వామికవాది అయిన బుద్ధుడిని, జ్ఞాన ముద్రలో ప్రతిష్ఠింప జేశాడు. బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఎన్టీఆర్ జీవితం కొనసాగింది. ఆయన కట్టు, నడక, ఆహార్యం, నిండైన నిలువెత్తు తెలుగుదనం. ఎన్టీఆర్ నటించిన సినిమాలన్నిటా తెలుగు వారి జీవితం ఉంటుంది. ఎన్టీఆర్ జీవితమే ఒక సందేశం. (నేడు ఎన్టీఆర్ జయంతి) వ్యాసకర్త : డొక్కా మాణిక్యవరప్రసాద్, మాజీమంత్రి -
మండలితో ఎలాంటి లాభం లేదు
సాక్షి, అమరావతి: శాసనమండలి ఉండాల్సిందేనని ఇప్పుడు చెబుతున్న ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు, 2004లో మండలి వల్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని స్పష్టంగా చెప్పారు. శాసనాలు ఆలస్యం అవుతాయని పేర్కొన్నారు. 2004 శాసనమండలి పునరుద్ధరణ బిల్లును వ్యతిరేకిస్తూ చంద్రబాబు అప్పుడు ఏమన్నారో సోమవారం అసెంబ్లీలో ప్రదర్శించారు. ఆయన ఏమన్నారంటే.. ‘‘శాసనమండలి పునరుద్ధరించాలనే నిర్ణయం వల్ల వీళ్లల్లో (కాంగ్రెస్) కొంతమందికి రాజకీయ పునరావాసం కల్పిస్తారేమో గానీ.. దీనివల్ల రాష్ట్రానికి, ప్రజలకు ఏం లాభం లేదు. బ్రహ్మాండమైన శాసనాలు వస్తాయనేది, రాష్ట్రానికి ప్రయోజనం ఉంటుందనేది వాస్తవం కాదు. చరిత్రను చూసినా ఇది అవసరం లేదు. ఒకప్పుడు అక్షరాస్యత ఎక్కువ ఉండేది కాదు. చదువుకునే వాళ్లు అసెంబ్లీకి ఎక్కువ వచ్చేవాళ్లు కాదు. అందుకే శాసనమండలికి మేధావులను తీసుకొచ్చి చర్చించాలన్న ఉద్దేశం ఉండేది. ఈ రోజు శాసనసభలో 294 మందిలో మంచి క్వాలిటీ వచ్చింది. చదువుకున్న వాళ్లు, బాగా అనుభవం ఉండేవాళ్లు వచ్చారు. 1930లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌లో రాష్ట్రాలు రెండో సభ కావాలంటే పెట్టుకోవచ్చు కానీ, దీనివల్ల ఏం లాభం ఉండదని, అప్పట్లో కాంగ్రెస్ కూడా వ్యతిరేకించింది. 1934 అక్టోబర్ 26న బాబూ రాజేంద్రప్రసాద్ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ సమావేశంలో మాట్లాడుతూ, దీనివల్ల ఏమాత్రం లాభం ఉండదని, నష్టం ఉంటుందని, ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని, శాసనాలు ఆలస్యమయ్యే అవకాశం ఉంటుందని చాలా స్పష్టంగా చెప్పారు. 1950 నుంచి చూస్తే... 8 రాష్ట్రాల్లో మాత్రం రెండు సభలొచ్చాయి. కాలక్రమేణా మూడు రాష్ట్రాల్లో రద్దయ్యి ఐదు రాష్ట్రాల్లో మాత్రం మండలి ఉంది. మండలి వల్ల రూ.20 కోట్లు ఆర్థిక భారం పడుతుంది. బిల్లుల ఆమోదంలో కాలయాపన జరుగుతుంది. అసెంబ్లీ నుంచి ఒక బిల్లు పంపిస్తే అక్కడికి పోవడం, తిరిగొస్తే మళ్లీ చర్చించడంతో కాలయాపన అవుతుంది. ఆర్థిక సంబంధమైన బిల్లుల విషయంలో మండలికి పటిష్టమైన అధికారాలు లేవు. ఈ బిల్లులన్నీ శాసనసభే ఆమోదిస్తుంది. ఏదైనా బిల్లును చట్టం కాకుండా అడ్డుకునే శక్తి మండలికి నాలుగు నెలలు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత దానంతట అదే చట్టమవుతుంది. ఏవైనా రాజ్యాంగ సవరణలు చేయాల్సి వస్తే అసెంబ్లీ తప్ప మండలికి ఏమాత్రం ప్రమేయం లేదు. ఆఖరుకు రాష్ట్రపతి ఎన్నికల విషయంలోనూ మండలి సభ్యులకు ఓటింగ్ హక్కు లేదు. పరిమిత అధికారాలు తప్ప ఏమీ మండలికి ఉండవు. అందులో కూడా పెద్ద మేధావులు వస్తారని లేదు.ఎవరిని పెడతారో తెలుసు. ప్రజాధనం దుర్వినియోగం చేసే మండలి బిల్లు వల్ల లాభం కాదు నష్టమొస్తుంది. ప్రజలకు భారమవుతుంది. దీని వల్ల ఏ ప్రయోజనం లేదని వ్యతిరేకిస్తున్నాను..’’ మండలి వద్దని అప్పుడు చెప్పా..: చంద్రబాబు మండలిని రద్దు చేస్తూ సోమవారం అసెంబ్లీ తీర్మానం చేసిన నేపథ్యంలో చంద్రబాబు ఏమన్నారంటే... ‘‘శాసనమండలి రద్దు విచారకరం. కౌన్సిల్‌ను రద్దు చేసే అధికారం శాసనసభకు లేదు. గతంలో మండలి వద్దని నేను చెప్పాను. కానీ ఇప్పుడు రద్దు సమంజసం కాదు. పరిస్థితుల ఆధారంగా సిద్ధాంతాలు మారుతుంటాయి. శాసనమండలి రద్దు చేయాలని అప్పట్లో ఎన్టీ రామారావు నిర్ణయించారు. అది టీడీపీ సిద్ధాంతం. దాన్ని సమర్థించాం. కానీ పాదయాత్ర చేస్తున్నప్పుడు మండలి ప్రాధాన్యత ప్రజల నుంచి తెలుసుకున్నాను. మండలి ఉంటే బడుగు బలహీనవర్గాలకు అవకాశం వస్తుంది. కౌన్సిల్ స్వతంత్ర ప్రత్తిపత్తి కలిగినది. 10 రాష్ట్రాలు మండలి కావాలంటున్నాయి. టీచర్లు, మేధావులు మండలికొస్తారు. ఆర్థిక భారం అని చెప్పడం ఓ సాకే. ఎందుకంటే ఏడాదికి 40 రోజులకు మించి సభ ఎప్పుడూ జరగదు. కౌన్సిల్‌కు రాజకీయాలు ఆపాదించడం సరికాదు..’’ -
నాడు ఎన్టీఆర్.. నేడు జగన్
సాక్షి, అమరావతి: శాసన మండలి వల్ల ఎటువంటి ప్రయోజనం లేకపోగా రాష్ట్రంపై ఆర్థిక భారం పడుతోందని పేర్కొంటూ 1985లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం ఎన్టీ రామారావు కౌన్సిల్‌ను రద్దు చేశారు. రాష్ట్ర విభజన అనంతరం విభజిత ఆంధ్రపద్రేశ్లో నేడు మరోసారి మండలి రద్దుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆర్థిక భారంతోపాటు రాష్ట్ర ప్రజలకు మేలు చేయకపోగా అన్యాయం చేసేలా ప్రతిపక్ష తెలుగుదేశం ఎమ్మెల్సీలు వ్యవహరించడంతో మండలి రద్దుకు వైఎస్ జగన్ తాజాగా నిర్ణయం తీసుకుని ఆ మేరకు అసెంబ్లీలో సోమవారం తీర్మానం ఆమోదింపజేశారు. ఎన్టీఆర్ హయాంలో మూడు నెలల్లో రద్దు.. 1958 జూలై 1న ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ శాసనమండలిని 1985లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ రద్దు చేశారు. అప్పట్లో మండలి రద్దు ప్రక్రియ కేవలం మూడు నెలల వ్యవధిలో పూర్తయింది. 1985 మార్చిలో రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో గెలిచి అధికారాన్ని చేపట్టిన ఎన్టీఆర్ వెంటనే మండలిని రద్దు చేయాల్సిందిగా అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపగా.. అదే ఏడాది మే 31న మండలిని రద్దు చేస్తూ కేంద్రప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో 1–06–1985న మండలి రద్దయిపోయింది. నేడు జగన్ నేతృత్వంలో మండలి రద్దు తీర్మానం.. రాష్ట్ర ప్రజలందరికీ మేలు చేసే బిల్లులను అడ్డుకునేందుకు ప్రతిపక్ష తెలుగుదేశం ప్రస్తుతం శాసనమండలిని వేదికగా చేసుకుంది. ఇదే క్రమంలో తాజాగా మూడు రాజధానుల ఏర్పాటుతో పాటు వికేంద్రీకరణ బిల్లుకు, సీఆర్డీయే రద్దు బిల్లుకు సైతం మోకాలడ్డింది. ప్రజాశ్రేయస్సుకు ఏమాత్రం ఉపయోగపడకపోగా, ప్రజలకు మేలు చేసే బిల్లులను సైతం అప్రజాస్వామిక రీతిలో అడ్డుకుంటుండడంతో తాజాగా వైఎస్ జగన్ శాసన మండలి రద్దుకు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదింపజేశారు. ప్రజలచేత ఎన్నుకోబడ్డ శాసనసభ ఆమోదించిన బిల్లులను కేవలం రాజకీయకోణంతో తాత్కాలికంగా అడ్డుకునేందుకు మాత్రమే మండలి పనిచేస్తోందని, కాలయాపన, ప్రజాప్రయోజనాలకు విఘాతం తప్ప ఎలాంటి మంచి జరిగే అవకాశం కనిపించట్లేదని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇలాంటి మండలిని కొనసాగించాల్సిన అవసరం లేదని సీఎం స్పష్టం చేశారు. మండలి రద్దు ప్రక్రియ ఇలా.. - రాజ్యాంగంలోని 169(1) అధికరణ కింద శాసన మండలిని రద్దు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. - మండలిని రద్దు చేయాలంటే.. రాజ్యాంగంలోని 169(1) అధికరణ కింద రద్దు ప్రతిపాదనను తొలుత రాష్ట్ర కేబినెట్ ఆమోదించాలి. అనంతరం మండలిని రద్దు చేయాలని కేంద్రప్రభుత్వాన్ని కోరుతూ అసెంబ్లీలో ముఖ్యమంత్రి తీర్మానం ప్రవేశపెట్టాలి. ఆ తర్వాత సభలో చర్చ అనంతరం 2/3వ వంతు మెజారిటీతో తీర్మానం ఆమోదం పొందాలి. అసెంబ్లీ ఆమోదించిన తీర్మానాన్ని కేంద్రానికి పంపించాలి. - రాష్ట్ర అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని కేంద్ర హోంశాఖ పరిశీలించి స్వల్ప రాజ్యాంగ సవరణకు లోక్‌సభ, రాజ్యసభ ముందుకు తీసుకువెళ్లాలి. ప్రస్తుతం రాష్ట్రంలో శాసనసభ, శాసనమండలి ఉన్నాయి. ఇప్పుడు శాసనసభ మాత్రమే ఉంటుందని అతిసాధారణమైన రాజ్యాంగ సవరణలకు లోక్‌సభ, రాజ్యసభ ఆమోదించాల్సి ఉంది. - లోక్‌సభ, రాజ్యసభ ఆమోదించాక రాష్ట్రపతి ఆమోదానికి పంపుతారు. రాష్ట్రపతి ఆమోదముద్ర వేయగానే మండలిని రద్దు చేస్తూ కేంద్రప్రభుత్వమే గెజిట్ నోటిఫికేషన్ జారీ చేస్తుంది. ఈ ప్రక్రియ చాలా సాధారణమైన అంశమని, రాష్ట్ర ప్రభుత్వం కోరిన విధంగా కేంద్రం చేయాల్సిన బాధ్యత ఉంటుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. -
ఎన్టీఆర్ కంటే గొప్ప మేధావా కేసీఆర్..?
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వంపై ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గురువారం ఆయన ఆర్టీసీ జేఏసీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ...‘ నా ఫోన్ కూడా ట్యాప్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి పదవి ఎవరికీ శాశ్వతం కాదు. ఎంతోమంది నేతలు వస్తుంటారు... వెళుతుంటారు. ఎన్టీఆర్ కన్నా కేసీఆర్ మేధావా? 1993-94 సంక్షోభాన్ని కేసీఆర్ మర్చిపోకూడదు. ప్రజాస్వామ్య పునాదులు కదులుతున్నాయ్. ఆర్టీసీ సమస్య పరిష్కారం కాకుంటే 1994 తరహా సంక్షోభం రావొచ్చు. ఇద్దరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ఇస్తూ మాట్లాడారు. ఆర్టీసీ సమ్మెపై మంత్రులు హరీశ్ రావు, ఈటల రాజేందర్, జగదీశ్ రెడ్డి మౌనం వీడాలి. మేధావులు మౌనంగా ఉండకూడదు. పలువురు మంత్రులు కార్మికులను విమర్శించి ఇంటికి వెళ్లి ఏడుస్తున్నారు. ప్రభుత్వంతో ఇప్పటికీ చర్చలు జరిపేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. హైకోర్టు సూచనలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలి’ అని కోరారు. కాగా తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 13వ రోజు కూడా కొనసాగుతోంది. -
చరిత్ర పునరావృతం
ఎన్టీఆర్ హయాంలో 1983 ఎన్నికల్లో జిల్లా నుంచి కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థి శ్రీనివాసులురెడ్డి మినహా మిగిలిన అన్ని స్థానాల్లో టీడీపీ విజయం సాధించింది. తిరిగి 1994లో కాంగ్రెస్ నుంచి సీకే బాబు మాత్రం గెలిచారు. ప్రస్తుతం 14 నియోజకవర్గాల్లో 13 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు వైఎస్సార్సీపీ అభ్యర్థుల చేతిలో ఘోరంగా ఓటమిపాలయ్యారు. కుప్పం నుంచి టీడీపీ తరఫున చంద్రబాబు మాత్రమే మిగిలారు. చిత్తూర్ ,బి.కొత్తకోట: సమైక్య రాష్ట్రంలో ఎదురులేకుండా సాగిన కాంగ్రెస్ పాలనకు అడ్డుకట్టవేసిన టీడీపీ 1983, 1994 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీని కోలుకోలేకుండా చేసింది. చిత్తూర్ జిల్లాలోనూ ఇదే పరిస్థితి వచ్చింది. ఈ రెండు ఎన్నికల్లో ఒకసారి స్వతంత్య్ర అభ్యర్థి, ఇంకోసారి కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందగా, మిగిలినవాళ్లంతా టీడీపీ చేతిలో ఓటమిపాలయ్యారు. సరిగ్గా 25 ఏళ్ల తర్వాత వైఎస్సార్సీపీ చేతిలో అడ్రస్ లేకుండా పోయింది. అభ్యర్థులు ఘోర పరాజయం పాలవగా, ముఖ్యమంత్రిగా కుప్పంలో పోటీచేసిన చంద్రబాబు నాయుడు ఊహించని విధంగా మెజారిటీ కోల్పోవాల్సి వచ్చింది. ప్రస్తుత టీడీపీ పరిస్థితి చూస్తుంటే ఇప్పట్లో కోలుకునేలా లేదు. 1983లో మహామహులు ఓటమిపాలు 1983 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ప్రభంజనంలో మహామహులు ఓటమిపాలయ్యారు. ఇదే ఎన్నికలో సాధారణ వ్యక్తులూ ఎమ్మెల్యేలయ్యారు. జిల్లాలోని పుత్తూరు, వేపంజేరి, చిత్తూరు, పలమనేరు, కుప్పం, పుంగనూరు, తంబళ్లపల్లె, వాయల్పాడు, పీలేరు, చంద్రగిరి, తిరుపతి, సత్యవేడు, శ్రీకాళహస్తి, నగరి నియోజకవర్గాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 13 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించగా, ఒక్క తంబళ్లపల్లెలో మాత్రం టీడీపీ గెలవలేకపోయింది. తంబళ్లపల్లె నుంచి కాంగ్రెస్ రెబల్‌గా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీచేసిన టీఎన్ శ్రీనివాసులురెడ్డి ఒక్కరే గెలుపొందగా, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. 1994లోనూ చిత్తూరు తప్ప..అన్నింటా ఓటమి జిల్లాలో 1983 నాటి రాజకీయ పరిస్థితి 1994లో టీడీపీతోనే పునరావృత్తం అయ్యింది. 1989 నుంచి 1994 నవంబర్ వరకు అధికారానికి దూరమైన టీడీపీ డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో ప్రభంజనం కొనసాగించింది. అప్పటి నియోజకవర్గాలు తంబళ్లపల్లె, వేపంజేరి, శ్రీకాళహస్తి, చిత్తూరు, పుత్తూరు, నగరి, పుంగనూరు, కుప్పం, పలమనేరు, సత్యవేడు, మదనపల్లె, వాయల్పాడు, పీలేరు, చంద్రగిరి, తిరుపతి నియోజకవర్గాలకు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే చిత్తూరు మినహా 14 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను చిత్తుగా ఓడించి టీడీపీ గెలిచింది. ఒక్క చిత్తూరులో మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థి సీకే బాబు విజయం సాధించి జిల్లాలో ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2019లో టీడీపీ ఘోర పరాజయం ఎన్టీ రామారావు సారధ్యంలో జరిగిన 1983,1994 ఎన్నికల్లో టీడీపీ కొనసాగించిన ప్రభంజనం 2019లో ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో ఘోరంగా, కోలుకోలేని విధంగా దెబ్బతింది. 14 నియోజకవర్గాల్లో 13 నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు వైఎస్సార్సీపీ అభ్యర్థుల చేతిలో ఘోరంగా ఓటమిపాలయ్యారు. కుప్పంలోనూ చంద్రబాబు మెజారిటీకి అడ్డుకట్ట పడింది. ప్రతి ఎన్నికలోనూ జిల్లాలో అత్యధిక మెజారిటీ సాధించే చంద్రబాబుకు ఈ ఎన్నికల్లో మెజ్టారిటీ తగ్గిపోగా తంబళ్లపల్లె వైఎస్సార్సీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డికి చంద్రబాబు సహా జిల్లాలో అందరికంటే అత్యధిక మెజారిటీ దక్కింది. జిల్లాలో టీడీపీ ఎప్పుడు గెలిచినా చంద్రబాబు మినహా ఎవరూ అధిక మెజారిటీ సాధించిన దాఖలాలు లేవు. ఈ ఎన్నికల్లో టీడీపీని మట్టికరిపించిన వైఎస్సార్సీపీ అభ్యర్థులంతా చంద్రబాబును మించిన అత్యధిక మెజారిటీ సాధించడం రికార్డు. 1995 నుంచి గెలుపు కష్టంగానే... 1995లో చంద్రబాబు సీఎం అయిన తర్వాత నుంచి సొంత జిల్లాలో జరిగిన 1999, 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో మెజారిటీ అసెంబ్లీ స్థానాలను గెలవలేకపోయారు. ఎన్టీఆర్ హయాంలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోతే...చంద్రబాబు హయాంలో టీడీపీ తుడిచిపెట్టుకుపోయింది. ప్రస్తుతం వైఎస్సార్సీపీ ప్రభంజనానికి టీడీపీ గల్లతయ్యింది. సమైక్య, విభజనానంతర ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఎన్నికలకు వెళ్లిన ప్రతిసారి సొంత జిల్లాలో నిరాదరణ తప్పలేదు. 1983 ఎన్నికల్లో తంబళ్లపల్లెలో కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థి శ్రీనివాసులురెడ్డి ఇండిపెండెంట్‌గా గెలిస్తే, 1994లో కాంగ్రెస్ నుంచి సీకే.బాబు గెలిచి అప్పటి కాంగ్రెస్‌కు ఏకైక దిక్కయ్యారు. అదే దుస్థితి టీడీపీకి కలగగా, పార్టీ అధ్యక్షుడైన చంద్రబాబు నాయుడు ఒక్కరే జిల్లాలో గెలిచి ఆ పార్టీ మొత్తానికి దిక్కయ్యారు. -
సదాశివా...చంద్రమౌళి!
ఎన్టీ రామారావు, ఎస్వీ రంగారావు, దేవిక, రాజశ్రీ...నటించిన, ఆరుద్ర పాటలు, మాటలు రాసిన చిత్రంలోని కొన్ని దృశ్యాలు ఇవి. సినిమా పేరేమిటో చెప్పుకోండి చూద్దాం... ‘‘మహాదేవా...మహాదేవా! దక్షప్రజాపతి ఉగ్రనేత్రుడై వస్తున్నాడు. పాల ముంచినా నీట ముంచినా మీదే భారం స్వామి’’ అంటూ మహాశివుడి శరణుజొచ్చాడు చంద్రుడు. ‘‘భయపడకు చంద్రా’’ అంటూ అభయమిచ్చాడు శంకరుడు. ఇంతలో దక్షప్రజాపతి పట్టలేనంత ఆవేశంగా అక్కడికి దూసుకు వచ్చాడు. ‘‘ఇదేనా నీ వాగ్దానం నిలుపుకునే తీరు! ముల్లోకాలలో నీ మాటకు తిరుగుండదని బాస చేసి నీచాతి నీచమైన చంద్రుడికి ఆశ్రయం ఇస్తావా!’’ అంటూ కోపంతో ఊగిపోతున్నాడు దక్షప్రజాపతి. ‘‘దక్షా! ఆవేశం చెందకు. జరిగింది సావధానంగా విను. కూర్చో’’ అన్నాడు శంకరుడు. ‘‘కూర్చోవడానికి రాలేదు. ముందు ఆ శాపగ్రస్తుడిని విడిచిపెట్టు’’ చంద్రుడిని ఉద్దేశించి అన్నాడు దక్షప్రజాపతి. ‘‘నువ్వు శాపం ఇచ్చిన సంగతి తెలియక చంద్రుడికి అభయం ఇచ్చాను. శరణు ఒసంగిన పిమ్మట విడిచిపెట్టడం సముచితం కాదు’’ చెప్పాడు శంకరుడు. శంకరుని మాటలు దక్షుడి ఆవేశానికి ఆజ్యం పోశాయి. ‘‘అల్పునికి ఆశ్రయమిచ్చి నావంటి అధికుడికి ఇచ్చిన మాట తప్పడం సముచితమా?’’ అడిగాడు దక్షుడు. ‘‘ఆర్తత్రాణ పరాయణత్వంలో అల్పుడు, అధికుడు అనే తారతమ్యాలు పాటించడం పాడి కాదు’’ అన్నాడు శివుడు. ‘‘ప్రజాపతులలో ప్రముఖుడైన నన్ను పరాభవించడం పాడియా?’’ అడిగాడు దక్షుడు. ‘‘దక్షా! నువ్వు నా భక్తుడివి. నిన్ను పరాభవించెదనా?’’ అన్నాడు శాంతస్వరంతో శివుడు. ‘‘పరాభవం కాక ఇంకేమిటి! అభిమానవంతుడిని అలక్ష్యం చేసింది చాలక అవమానిస్తావా?’’ అంటూ రుసరుసలాడాడు దక్షుడు. ‘‘దక్షా! యుక్తాయుక్త విచక్షణ లేకుండా ఆవేశంలో ఏదో మాట్లాడుతున్నావు. భక్తులు పొరపాటు చేసినప్పుడు దిద్దుట నా కర్తవ్యం. నీవు నీ కుమార్తెల భావి సౌభాగ్యాన్ని ఆలోచించకుండా నీ అల్లుడికి శాపం ఇచ్చావు. నేను చంద్రునికి అభయమిచ్చి, నీకు నీ కుమార్తెలకు ఉపకారమే చేశాను’’ అన్నాడు శివుడు. ‘‘నా కుమార్తెల గురించి నీవు చింతించాల్సిన అవసరం లేదులే’’ అని శివుడు చెప్పినదాన్ని తోసిపుచ్చుతూ... ‘‘శుష్కవాదాలతో కాలయాపన చేయక తక్షణం చంద్రుడిని విడిచి పెట్టు లేదా నా శక్తిని ప్రదర్శించక తప్పదు’’ అని శివుడికి హెచ్చరిక చేశాడు దక్షుడు. ‘‘దక్షా! అహంకారం అనర్థదాయకం సుమా!’’ హితవు చెప్పాడు శివుడు. ‘‘ఇది అహంకారం కాదు ఆత్మవిశ్వాసం. నా శక్తిసామర్థ్యాలతో చంద్రుడిని ఎలా శిక్షిస్తానో నీవే చూడు’’ అన్నాడు దక్షుడు. ‘‘నీ చేతనైతే ప్రయత్నించు’’ అని దక్షుడి మాటల్ని తేలిగ్గా తీసుకున్నాడు శివుడు. ‘‘శంకరా! మరోసారి హెచ్చరిస్తున్నాను. మర్యాదగా చంద్రుడిని విడిచిపెట్టు. లేదా నా గదాదండంతో నిన్ను ఖండఖండలుగా చండాడగలను’’ కన్నూమిన్నూ కానకుండా అన్నాడు దక్షుడు. శివుడి కోపం ఆకాశాన్ని అంటింది. ‘‘మదాంధా! కండకావరంతో కళ్లు మూసుకుపోయి... నాపైనే గదాదండం ఎత్తెదవా! ఈ ఫాలాక్షుడి త్రిశూల ధాటికి గురికాక ముందే క్షమాపణ వేడుకో’’ ఆగ్రహంతో ఊగిపోతూ అన్నాడు శివుడు. ‘‘ఛీ...ఈ దక్షప్రజాపతి నీవంటి నీచుణ్ణి క్షమాభిక్ష కోరేంత నీచుడు కాదు. నిన్నే పాదాక్రాంతం చేసుకోగల ప్రతిభావంతుడు’’ అన్నాడు దక్షుడు అహంకరిస్తూ. ఇరువైపుల ఆవేశాగ్నులు ప్రజ్వరిల్లుతున్న ఆ సమయంలో మహావిష్ణువు ప్రత్యక్షమై... ‘‘దక్షా! నీకు ఈ దురహంకారం తగదు. ఫాలక్షుడితో బాంధవ్యమే నీకు శ్రేయోదాయకం. కాని విరోధం సమంజసం కాదు’’ హితువు పలికాడు విష్ణువు. శివుడి ఆగ్రహాన్ని చల్లర్చడానికి... ‘‘శాంతించు మహాదేవా! మీ ఇరువురి ప్రతిజ్ఞలకు భంగం వాటిల్లకుండా చేస్తాను. సమ్మతమేనా?’’ అని ఇరువురినీ అడిగాడు. ‘‘నేను ఇచ్చిన అభయం ఎట్టి పరిస్థితుల్లోనూ నిష్ఫలం కాకూడదు’’ అన్నాడు శివుడు పట్టుదలగా. ‘‘కాదు...కానే కాదు’’ అన్నాడు విష్ణువు. ‘‘ఆ శాపం అప్రతిహతం కావల్సిందే’’ అన్నాడు దక్షుడు గట్టి పట్టుదలతో. ‘‘అవుతుంది’’ అన్నాడు విష్ణువు. ఆ తరువాత... ‘‘వినండి. నా ప్రభావంతో చంద్రుడిని రెండు భాగములుగా విభజిస్తాను. ఒక భాగం దక్షప్రజాపతి శాపఫలితం అనుభవించేదిగానూ, రెండో భాగం పరమేశ్వరుడి అభయఫలాన్ని అనుభవించేదిగానూ చేసెదను. ఇది మీకు సమ్మతమే కదా!’’ అడిగాడు విష్ణువు. ‘‘ఉభయతారకం నాకు అంగీకారమే’’ అన్నాడు శివుడు. ‘‘ఏం దక్షా!’’ అంటూ దక్షుడి అభిప్రాయం అడిగాడు విష్ణువు. ‘‘సరే’’ అన్నాడు దక్షప్రజాపతి. అప్పుడు... ‘‘చంద్రా ఇటురా’’ అంటూ పిలిచాడు విష్ణువు. ‘‘నమస్కారం దేవా!’’ అంటూ భయభక్తులతో అక్కడికి వచ్చాడు చంద్రుడు. అలా వచ్చిన చంద్రుడిని ఇద్దరిగా చేశాడు విష్ణువు. ‘‘చంద్రా మీ మామగారి ఆజ్ఞను మన్నించి దినమున ఒక నక్షత్రకాంతతో కాపురం చేస్తూ సుఖించు. శాపగ్రస్తుడవై దినదినము క్షీణించి వెను వెంటనే దినదినాభివృద్ధి నొందుచుండగలవు. అదే శుక్లపక్షం–కృష్ణపక్షం పేరున నీయందు వర్తించును’’ ఆదేశించాడు విష్ణువు. ‘‘తమ ఆదేశం శిరసావహిస్తాను స్వామి’’ అన్నాడు చంద్రుడు. ‘‘దక్షా! నీ మాట చెల్లుబాటు అయినందుకు సంతోషమే కదా’’ అడిగాడు విష్ణువు. ‘సంతోషమే’ అన్నట్లుగా ఉన్నాయి అతడి హావభావాలు. ‘‘చంద్రా! బాలచంద్ర రూపమున నీవు సదా శివ సాన్నిధ్యంలో ఉందువుగాక’’ ఆజ్ఞ ఇచ్చాడు మహావిష్ణువు. ‘‘మహాప్రసాదం’’ అంటూ శివుడి కాళ్లకు నమస్కరించి కూర్చున్నాడు చంద్రుడు. ‘‘చంద్రా...నువ్వు ఉండాల్సిన చోటు అది కాదు’’ అంటూ నెలవంకగా మారిన చంద్రుడిని శిరస్సున ధరించాడు శివుడు. అది చూసి... ‘‘సదాశివా! ఇప్పుడు నవ్వు చంద్రమౌళివై విలసిల్లు’’ ఆనందంగా అన్నాడు మహావిష్ణువు. -
తేనె పూసిన కత్తి.. మేకవన్నె పులి
సాక్షి, అమరావతి : తేనె పూసిన కత్తిలాంటివాడు.. దుర్మార్గుడు.. మేకవన్నె పులి.. గాడ్సేనే మించిన వాడు.. అభినవ ఔరంగజేబు.. మూర్తీభవించిన పదవీ కాంక్షగల ప్రజాస్వామ్య హంతకుడు.. కుట్రకు కొలువు.. గూడు పుఠాణీకి గురువు.. మోసానికి మూలస్తంభం.. నా గుండెల్లో చిచ్చు రగిల్చాడు.. గొడ్డు కన్నా హీనుడు.. చీమల పుట్టలో పాములా చేరిన మోసగాడు.. తమ్ముళ్లారా.. చెల్లెళ్లారా.. ఇదిగో మీ అన్నను మాట్లాడుతున్నాను. శ్రద్ధగా వినండి. మీ బుద్ధితో ఆలోచించండి. మీ నిర్ణయంతో నన్ను ఆదేశించండి. మీరు చెప్పేదే న్యాయం. చేసేదే ధర్మం. నాటి నుంచి నేటి వరకు జరిగిన చరిత్రను మీ ముందు, అంటే ప్రజా న్యాయస్థానం ముందుంచుతున్నాను. మంచేదో చెడేదో, నిజమేదో అబద్ధమేదో, ఆశయమేదో ఆశేదో మీకు తెలియాలనే నా ఈ ప్రయత్నం. నీతికి, అవినీతికి మధ్య జరుగుతున్న ఈ పోరాటంలో న్యాయనిర్ణేతలు మీరే. ఎవరు విజేతలో తేల్చాల్సింది కూడా మీరే. ప్రజలు నన్ను నమ్మారు. నాకు ఓట్లు ఇచ్చారు. చంద్రబాబు ప్రజల దగ్గరకు వెళ్లలేదు. ఓట్లు అడగలేదు. ఎవరిని గెలిపించడానికి కూడా ఆయనేమీ శ్రమ చేయలేదు. ఆయన చేసిందల్లా ఒక్కటే. ఎవరిని ఏ విధంగా లోబర్చుకోవాలో.. ఏ ప్రలోభంతో ఏ విధంగా తన వైపు తిప్పుకోవాలో ఆ ప్రయత్నాలు మాత్రమే చేశాడాయన. నాతో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన వాళ్లు నా తమ్ముళ్లు, నాచెల్లెళ్లు, నా శాసనసభ్యులు ఉన్నారు. వారికి తెలుసు. నాకు తెలుసు. అయినప్పటికీ వారందరూ చంద్రబాబు ప్రలోభానికి లోనయ్యారంటే ఏవిధమైన ప్రలోభాలతో వారిని లోబర్చుకున్నారో ప్రజలు ఆలోచించాలి. అది నా తమ్ముళ్లది తప్పుకాదు. ప్రలోభ పెట్టిన వాడిదే.. చంద్రబాబుదే తప్పు. రామాయణంలో రావణాసురుడు కూడా ఉన్నాడు. రాముడికి పట్టాభిషేకం చేద్దామనుకున్నాడు తండ్రి దశరథుడు. కానీ పట్టాభిషేకం జరగక ముందే రాముడు అరణ్య వాసానికి పంపించబడ్డాడు. ఆ తర్వాత రావణాసురుడిని ఎదుర్కొన్నాడు. ఎంతో మంది స్వార్థపరులను మనం ఎదుర్కోవాల్సి వస్తూనే ఉంటుంది. లక్ష్మీపార్వతి పట్టాభిషేకం కోరలేదు. నా భార్యగానే ఉండాలనేది ఆమె కోరిక. అందుకే నా గృహిణిగా వచ్చింది. వారసత్వమంటే ఇంటికి ఉండొచ్చు.. ఆస్తులకు ఉండొచ్చు.. మరోదానికి ఉండొచ్చు కానీ పార్టీలో కూడా వారసత్వముంటుందని నేను అనుకోలేదు. ఎన్టీఆర్ చనిపోయిన ఇన్నేళ్ల తర్వాత కూడా ఆయనంటే చంద్రబాబు ఎంత ద్వేషంతో రగిలిపోతున్నారో, ఆయన పేరునే తెరమరుగు చేసేందుకు ఎలా కుట్ర పన్నుతున్నారో.. తోకపత్రిక యజమాని రాధాకృష్ణ వద్ద ఆయన చేసిన వ్యాఖ్యలు (సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతోంది) స్పష్టం చేస్తున్నాయి. చంద్రబాబు వెన్నుపోటుకు గురై అధికారం కోల్పోయాక ఎన్టీఆర్ సింహగర్జన సభలో, ఆయా సందర్భాల్లో బాబును దునుమాడుతూ నిప్పులు చెరిగారు. అత్యధిక మెజార్టీతో అధికారంలోకి వచ్చిన ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచి, అడ్డదారిలో డబ్బు మూటలతో ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి సీఎం పీఠాన్ని, తెలుగుదేశం పార్టీని లాక్కున్నారు. ఎమ్మెల్యేలతో క్యాంపు ఏర్పాటు చేసిన వైస్రాయ్ హోటల్ వద్దకు వెళ్లిన ఎన్టీరామారావుపై చెప్పులు వేయించి ఆయన్ను తీవ్రంగా అవమానించారు. ఆ ఘటనతో తీవ్ర మానసిక క్షోభకు గురైన ఎన్టీరామారావు కుంగిపోయి చివరకు చంద్రబాబు చేసిన ఘోరానికి ప్రాణాలు విడిచిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ తన చివరి దశలో కనీసం చంద్రబాబు పేరును ఉచ్ఛరించేందుకు కూడా ఇష్టపడలేదని ఆయన మాటల్ని బట్టే అర్థమవుతోంది. పిల్లనిచ్చిన మామనే అంతగా వేధించిన ఘన చరిత్ర చంద్రబాబుది. 224 సీట్లతో అధికారం చేపట్టిన తెలుగుదేశం ప్రాభవాన్ని ప్రతిఘటించడం చేతకాని కొన్ని వ్యతిరేక శక్తులు 1995లో లోలోన గూడుపుఠాణీ ఆరంభించాయి. దీనికి గురువు, ఈ కుట్రకు కొలువు, మోసానికి మూలస్తంభం, ఈ పద్మవ్యూహానికి కేంద్ర బిందువు చంద్రబాబునాయుడు. నా అల్లుడనబడుతున్నవాడే నా గుండెల్లో చిచ్చుపెట్టాడు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించడానికి ముందు అతనేమిటో మీ అందరికీ తెలుసు. కాంగ్రెస్‌లో ఉండి మామ ఎన్టీఆర్‌పై కూడా పోటీ చేస్తానంటూ ప్రగల్భాలు పలికి, చివరకు తెలుగుదేశం మహా ప్రభంజనంలో కొట్టుకుపోయిన ఓ చిన్న మిడత. తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక, అతను పార్టీలో చేరతానని వస్తే, చేర్చుకోవద్దని కొందరు నాకు హితవు చెప్పారు. కానీ పశ్చాత్తాప పడ్డాడనే ఔదార్యంతో చేర్చుకున్నాను. తర్వాత పార్టీలో ముఖ్యమైన పదవులన్నీ ఇచ్చాను. అయితే అతడు ప్రజాసేవ కోసం కాక పదవి కోసమే పార్టీలో చేరాడన్న దుర్మార్గాన్ని నేను కనిపెట్టలేకపోయాను. అతడు కడుతున్న ముఠాల గురించి, చేరదీస్తున్న గ్రూపుల గురించి పట్టించుకోలేదు. అతడిలో పదవీ కాంక్ష ఇంతగా గూడుకట్టుకుంటుందని, అతడి వల్ల ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వం తప్పుకోవాల్సి వస్తుందని, ప్రజాభీష్టమే వ్యర్థమై పోతుందని, ప్రజాస్వామ్యం పట్టపగలే హత్యకు గురవుతుందని, అధికారం కోసం ఇంతటి అల్పమైన, నీచమైన, దారుణమైన వెన్నుపోటుకు కూడా సిద్ధపడతాడని నేనూ సహించలేకపోయాను. నా మీద ఒక అభియోగం సృష్టించాడు. కార్యకర్తలకేదో అన్యాయం జరిగిందట. ఏమిటా అన్యాయం? ఎవరికా అన్యాయం? పార్టీ పట్ల శ్రద్ధాభక్తులతో, అంకిత భావంతో పనిచేసి ప్రజల విశ్వాసం చూరగొన్న ఏ నా కార్యకర్తలకూ, ఏ నా తెలుగు తమ్ముళ్లకూ అన్యాయం జరగలేదు. ఒకవేళ ఏదైనా లోటు జరిగితే అది అవకాశవాదులకు మాత్రమే జరిగింది. చంద్రబాబు.. ఆ మేకవన్నె పులి.. ఆ తేనెపూసిన కత్తి తయారు చేసిన కుట్రదారులకే జరిగింది. అతడి పక్కన చేరి, కుహనా కార్యకర్తలుగా చెలామణై, దళారీలుగా ఉన్నవారికే జరిగింది. పేరు ఉచ్ఛరించేందుకూ అనర్హుడే ఇవాళ నేను మాట్లాడుతున్న వ్యక్తి (చంద్రబాబు) ఓడిపోయి తెలుగుదేశంలోకి వచ్చాడు. అతని మనసులో ఉన్న దురాశ మాత్రం పోలేదు. నేను పదవులిచ్చాను. ఆయన ఓ గుంపును తయారు చేసుకున్నాడు. అది నేను గమనించలేదు. ఎవరూ ఊహించని విధంగా 1994 ఎన్నికల్లో మాకు 214 సీట్లు వచ్చాయి. ఆ తర్వాత పార్టీలో చేరిన వారితో చూసుకుంటే 224 సీట్లు. కాబట్టి వాళ్లేం చేయలేకపోయారు. అదే ఏ 130 లేదా 140 సీట్లో వచ్చుంటే వాళ్లేమైనా చేసి ఉండేవాళ్లు. మాకిది కావాలి, అది కావాలంటూ కోరేవారు. ఎందుకంటే అంతకు ముందే రంగం ఏర్పాటై ఉంది. అందరికీ డబ్బిచ్చాడు ఈయన. ఆయన పేరు చెప్పడం కూడా నాకిష్టం లేదు. పేరు చెప్పేందుకు కూడా ఆయన అర్హుడు కాదు. అందరికీ 5 లక్షలు, 10 లక్షలు డబ్బులిచ్చి ‘ఇదిగో ఎన్నికల కోసం మీ అందరికీ డబ్బిస్తున్నాను. మీరంతా నా మనుషులుగా ఉండాలి’ అంటూ ఏర్పాటు చేసుకున్నాడు. ఇక ఎప్పుడైతే 224 సీట్లు టీడీపీకి వచ్చాయో ఆయన ఆటలు సాగలేదు. తప్పనిసరిగా ఎన్టీఆర్‌నే నాయకుడిగా ఎన్నుకోవాల్సి వచ్చింది. కానీ ఎలాగైనా ముఖ్యమంత్రి కావాలన్న ఆశ మాత్రం ఆయన మనసులో చావలేదు. ఆ ఆశతోనే తన గ్రూపును తయారు చేశాడు. ఇట్స్ ఏ ప్లాన్డ్ ట్రెచెరీ (విశ్వాస ఘాతుకం). మరో ఔరంగజేబు చరిత్రను చూస్తే... తండ్రిని జైల్లో పెట్టిన సమ్రాట్లున్నారు. రాజ్యాధికారం కోసం అన్నల్ని చంపిన సోదరుడున్నాడు... ఔరంగజేబు. అలాంటి దురదృష్టకరమైన విధానం మళ్లీ ఇన్ని వందల ఏళ్ల తర్వాత తెలుగు జాతి చరిత్రలో మన రాష్ట్రంలో ఈనాడు తిరిగి జరిగింది. అది మన దురదృష్టం. అలాంటి చిన్నబుచ్చేతనాన్ని మన జాతి అనుభవించడం అనేది కేవలం నేను చేసుకున్న పాపం. ఎందుకంటే నా వాళ్లుగా ఉంటూ ఈనాడు జాతికే ద్రోహం చేసి మాయని మచ్చను తెచ్చారు. ప్రజాస్వామ్యానికిది చిన్నతనం. (1995 ఆగస్టు 23 నాటి వెన్నుపోటు సమయంలో) నేను శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం వెళ్లినప్పుడు అక్కడ కూడా ఈ మహానుభావుడే, ఎవరైతే ఈనాడు జాతికే చిన్నతనం తెచ్చారో.. అవమానకరంగా వ్యవహరించారో.. తెలుగుజాతిని కించపరిచారో.. ఆ మహానుభావుడే ‘రామారావు గారు లేకపోతే మా పార్టీ (తెలుగుదేశం) లేదు. ఆయన వల్లే పార్టీ నడుస్తోంది. మేమాయన వెనకాల ఉంటున్నాం. ఈ ఖ్యాతి, గౌరవం అంతా ఆయనదే. రామారావే మా నాయకుడు..’ అన్నాడు. అలా చెప్పినవాడే 23వ తేదీ సాయంత్రానికల్లా ఎందుకు మారారంటారు? ఎలా మోసం చేశాడో మనసుపెట్టి ఆలోచించండి చంద్రబాబుకు నా రక్తం పంచుకుపుట్టిన నా కూతుర్ని ఇస్తే.. తండ్రి లాంటి వాడిని ఏవిధంగా మోసం చేశాడో ఒక్కసారి మనసుపెట్టి ఆలోచించాలని అడుగుతున్నాను. చంద్రబాబు మనిషి అయితే అలా చేసేవాడా అని అడుగుతున్నాను. ప్రజలు నన్ను నమ్మారు. నాకు ఓట్లు వేశారు. ఓట్టు వేశారంటే రామారావు కోసం వేశారు. తెలుగుదేశం అంటే రామారావనే వేస్తారు. ఈ మోసగాళ్లు ప్రజలకు జవాబు చెప్పాలి. నామిత్రులు వచ్చారు. మేము కూడా ఒక క్యాంపు పెడతామన్నారు. కానీ నేను వద్దని చెప్పాను. ఐడోంట్ వాంట్. అందరినీ మనుషులుగా బతకనిస్తాను తప్ప ఎక్కడో నిర్బంధించి జంతువుల్లాగ అక్కడ ఉంచడానికి నేను అంగీకరించను. వారంతా నా అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు. వారిని స్వేచ్ఛగా తిరగనివ్వండి. కావాలనుకుంటే వారు నాతో ఉంటారు.. లేదంటే వెళ్తారు. నమ్మిన వాళ్లకు ద్రోహం చేస్తాం.. గొంతులు కోస్తాం.. అని నిరూపించుకున్న ఘాతకుడు వాడు (చంద్రబాబు). వాడిని చరిత్ర మరువదు. ఎవరైతే దేశానికి, ప్రజాస్వామ్యానికి సేవ చేస్తారో వారే నిజమైన వారసులవుతారు. రాజకీయాల్లో వారసత్వముండదనేదే నా అభిప్రాయం. గాడ్సేను మించినవాడు.. ఈ వెన్నుపోటు జరిగింది నాకొక్కడికి మాత్రమే కాదు. ప్రజలకు, మీకు, మీరు వేసిన ఓటుకు. మీరు నమ్మిన ప్రజాస్వామ్యానికి, మీరు విశ్వసించిన ఆశయాలకు, ఆదర్శాలకు ఇది వెన్నుపోటు. ఇంత నీచానికి ఒడిగట్టిన చంద్రబాబు.. ఎన్టీఆర్లాగే ఆయన విధానాలే కొనసాగిస్తామని చెబుతుంటే ఎలా ఉందో తెలుసా? చేతులు జోడించి, నమస్కారం చేసి, తుపాకీ పేల్చి గాంధీ మహాత్ముడ్ని పొట్టనబెట్టుకున్న గాడ్సేనే మించిపోయాడనిపిస్తోంది. ఇది సిగ్గుచేటు. క్షమించరాని నేరం. వీళ్లంతా ఇలా ఎందుకు చేశారు? ఎందుకు వెన్నుపోటు పొడిచారు? ఏమిటి ఎన్టీఆర్ చేసిన తప్పు? ఏమిటి ఎన్టీఆర్ చేసిన నేరం? అయామ్ ద లయన్. నేను సింహాన్ని. ఎందుకంటే సింహం మృగరాజు. ఏ అవమానాన్నీ సహించదు. కాబట్టి నాకెలా అవమానం జరిగింది, నా వాళ్లు, నా అన్నవాళ్లు నన్నే విధంగా మోసం చేశారో ప్రజలకు తెలుసు. అయినా నేను చెప్పడం నా ధర్మం. నా కర్తవ్యం. ప్రజల ప్రతినిధిని నేను. నాకేం జరిగినా ప్రజలకు తెలియజెప్పడం నా బాధ్యత. దేవుడు సహా ఎవరూ క్షమించలేని ఘాతుకానికి బాబు ఒడిగట్టాడు. దీన్ని జాతి, చరిత్ర ఎప్పటికీ క్షమించదు. ఆ మహానుభావుడే ‘రామారావు గారు లేకపోతే మా పార్టీ (తెలుగుదేశం) లేదు. ఆయన వల్లే పార్టీ నడుస్తోంది. మేమాయన వెనకాల ఉంటున్నాం. ఈ ఖ్యాతి, గౌరవం అంతా ఆయనదే. రామారావే మా నాయకుడు..’ అన్నాడు. అలా చెప్పినవాడే 23వ తేదీ సాయంత్రానికల్లా ఎందుకు మారారంటారు? -
‘చంద్ర గ్రహమే ..దశగ్రహం’
సాక్షి, అమరావతి : మహానటుడు ఎన్టీ రామారావు పేరును కాలగర్భంలో కలిపేయడం ముఖ్యమంత్రి చంద్రబాబు తరం కాదని.. వెన్నుపోటుతో పార్టీని లాగేసుకున్న చంద్రబాబు స్వర్గీయ ఎన్టీఆర్ చెప్పినట్లుగా ‘జామాత.. దశమగ్రహమే’ అని ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అవసరం వచ్చినప్పుడల్లా ఆయన ఫొటోకు దండేసి.. ఆయన పేరును వాడుకున్న నీచమైన వ్యక్తి చంద్రబాబు అని ధ్వజమెత్తుతున్నారు. ఈ దశమగ్రహాన్ని సాగనంపే రోజులు వచ్చాయని.. కాలగర్భంలోనూ కలిసిపోతాడని శాపనార్థాలు పెడుతున్నారు. తెలుగుదేశం వ్యవస్థాపకుడు, అన్న నందమూరి తారకరామారావు పేరును ఏ ప్రభుత్వ పథకానికీ లేకుండా చేసేందుకు చంద్రబాబు, ఆంధ్రజ్యోతి యజమాని రాధాకృష్ణతో కలసి ఎన్టీఆర్‌ను దూషించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి అధికారాన్ని చేజిక్కించుకోవడమే కాకుండా.. అసలు ఆయన పేరే ఎక్కడా కనిపించకుండా చేసేందుకు ఇద్దరూ కలసి పన్నిన కుట్రపై ఎన్టీఆర్ అభిమానుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ పేరు ఇంకా ఎందుకు మార్చలేదు అన్న ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణతో.. తెలుగుదేశం వ్యవస్థాపకుడు అన్న ఎన్టీ రామారావును ఉద్దేశించి ‘‘వాణ్ణి అనవసరంగా క్యారీ చేస్తున్నాం.. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీలోంచి వాడి పేరు ఎత్తేసి మన మీడియాలో ఫుల్ పబ్లిసిటీ ఇద్దాం. ఆరు నెలల తర్వాత ఇక చూసుకో..’’ అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఎన్టీఆర్ అభిమానులు భగ్గుమంటున్నారు. బాబు మాటలు విని బాధపడుతున్నాం ఎన్టీఆర్ అభిమానిగా చంద్రబాబు మాటలు విని చాలా బాధపడుతున్నాం. అన్న ఎన్టీఆర్ ఫొటోను పార్టీ సభ్యత్వ పుస్తకాలపై తొలగించడానికి చేసిన ప్రయత్నాలను పార్టీలోని వారంతా వ్యతిరేకించడంతో చంద్రబాబు మళ్లీ ఎన్టీఆర్ ఫొటోను ముద్రించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసిన పథకాలకు చంద్రన్న కానుక, చంద్రన్న పెళ్లి కానుక, చంద్రన్న బీమా అంటూ ఆయన పేరు పెట్టుకున్నాడే కానీ ఎన్టీఆర్ పేరు ఎక్కడా పెట్టలేదు. ఎన్టీఆర్ ప్రవేశ పెట్టిన పథకాలతోనే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎన్టీఆర్ మరణానంతరం ఆయన అభిమానుల ప్రతి ఇంటిలోనూ ఎన్టీఆర్ ఫొటో ఉంది. అలాంటి ఎన్టీఆర్ పేరును తొలగిస్తానంటూ చంద్రబాబు అనడం చాలా దారుణం. ఏ మాత్రం గౌరవం లేకుండా వాడు, వీడు అంటూ మాట్లాడం శోచనీయం. ఎన్టీఆర్ అభిమానులు ఒక సారి ఆలోచించుకోవాలి. చంద్రబాబు వెన్నుపోటుకు ఎన్టీఆర్ ఆత్మ క్షోభించింది. ఇప్పుడు చంద్రబాబు మాటలకు ఆ ఆత్మ మరింతగా క్షోభిస్తుంది. ఇప్పటికైనా ఎన్టీఆర్ అభిమానులు ఆలోచించి చంద్రబాబుకు తగిన గుణపాఠం చెప్పాలి. – నల్లమోతు రమేష్ చౌదరి మరోసారి వెన్నుపోటు రాజ్యాధికారం కోసం మామను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఆయన పేరును ఆరోగ్యశ్రీ పథకం నుంచి తొలగించడానికి ప్రయత్నించి మరోసారి వెన్నుపోటుదారుడిగా ముద్రపడ్డారు. భారతదేశ రాజకీయాల్లో చంద్రబాబును మించిన మోసగాడు ఉండడు. – చావా వెంకటేశ్వరరావు, గంపలగూడెం ప్రజాసేవకు అనర్హుడు ఆరోగ్యశ్రీ పథకం పేరును మార్పు చేయాలనే ఆలోచన రావడమే చంద్రబాబు పతనానికి తొలిమెట్టు. తనకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన ఎన్టీఆర్ పేరును తొలగించేందుకు ప్రయత్నిస్తున్న చంద్రబాబు వంటి కుట్రదారులు ప్రజాసేవకు అనర్హులు. – శీలం నాగనర్సిరెడ్డి, మునుకుళ్ల -
అన్నగారి ఆత్మను చంపేశాడు
సాక్షి , గుంటూరు : చంద్రబాబు మాయ ముసుగు ఒక్కొక్కటిగా తొలగిపోతోంది. దివంగత నేత నందమూరి తారక రామారావు పట్ల చంద్రబాబు వైఖరి తేటతెల్లమైంది. అన్నగారిని వెన్నుపోటు పొడిచి అధికారాన్ని కైవసం చేసుకున్నారన్నది జగమెరిగిన సత్యమైనా.. తెలుగుదేశం పార్టీ నేతల బుకాయిస్తూనే ఉన్నారు. ఎన్టీఆర్ చావుకు కారకుడైన బాబును వెనకేసుకొస్తున్నారు. తాజాగా ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణతో చంద్రబాబు సంభాషణ విన్న అన్నగారి అభిమానులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. ఎన్టీఆర్‌ను ఏక వచనంతో సంబోధించిన బాబు తీరును అసహ్యించుకుంటున్నారు. ఆరోగ్యశ్రీకి ఎన్టీఆర్ పేరు తొలగిస్తామని, ఇప్పటికే ప్రజలు మరిచిపోయారని చంద్రబాబు అంటుంటే.. ఆవేదనతో చెమ్మగిల్లుతున్నారు. ఇలాంటి నేతకా తాము ఇప్పటి వరకు మద్దతిచ్చిందని మధన పడుతున్నారు. అన్నగారి ఆత్మను సైతం చంపేసిన చంద్రబాబుకు బుద్ధి చెబుతామని నిప్పులు కక్కుతున్నారు. మహానటుడు ఎన్టీ రామారావు పేరును కాలగర్భంలో కలిపేయడం ముఖ్యమంత్రి చంద్రబాబు తరం కాదని.. వెన్నుపోటుతో పార్టీని లాగేసుకున్న చంద్రబాబు స్వర్గీయ ఎన్టీఆర్ చెప్పినట్లుగా ‘జామాత.. దశమగ్రహమే’ అని ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ దశమగ్రహాన్ని సాగనంపే రోజులు వచ్చాయని.. కాలగర్భంలోనూ కలిసిపోతాడని శాపనార్థాలు పెడుతున్నారు. అన్న నందమూరి తారకరామారావు పేరును ఏ ప్రభుత్వ పథకానికీ లేకుండా చేసేందుకు చంద్రబాబు, ఆంధ్రజ్యోతి యజమాని రాధాకృష్ణతో కలసి ఎన్టీఆర్‌ను దూషించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి అధికారాన్ని చేజిక్కించుకోవడమే కాకుండా.. అసలు ఆయన పేరే ఎక్కడా కనిపించకుండా చేసేందుకు ఇద్దరూ కలసి పన్నిన కుట్రపై ఎన్టీఆర్ అభిమానుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ పేరు ఇంకా ఎందుకు మార్చలేదు అన్న ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణతో.. తెలుగుదేశం వ్యవస్థాపకుడు అన్న ఎన్టీ రామారావును ఉద్దేశించి ‘‘వాణ్ణి అనవసరంగా క్యారీ చేస్తున్నాం.. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీలోంచి వాడి పేరు ఎత్తేసి మన మీడియాలో ఫుల్ పబ్లిసిటీ ఇద్దాం. ఆరు నెలల తర్వాత ఇక చూసుకో..’’ అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఎన్టీఆర్ అభిమానులు భగ్గుమంటున్నారు. ఎన్టీఆర్‌పై బాబుది కపట ప్రేమ తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన మహనీయుడు అన్న ఎన్టీఆర్. ఆయన స్థాపించిన పార్టీనే లాక్కుని, ఆయన మరణానికి కారణమైన చంద్రబాబు ఇప్పటి వరకు ఎన్టీఆర్‌పై కపట ప్రేమ నటిస్తూ వచ్చారు. ఇందుకు నిదర్శనమే సామాజికి మాధ్యమాల్లో తిరుగుతున్న చంద్రబాబు, రాధాకృష్ణల సంభాషణ వీడియో. అసలు ఎన్టీఆర్ పేరు లేకుండా, వినిపించకుండా చేయాలను కోవడం వారి అవివేకం. ఏనాడో ఎన్టీఆర్ తెలుగు ప్రజల గుండెల్లో గూడుకట్టుకున్నారు. ఇప్పటికైనా చంద్రబాబు నిజ స్వరూపాన్ని గుర్తించాలి. –మెగలిపువ్వు నాగేశ్వరరావు, ఎన్టీఆర్ అభిమాని, చెరుకుపల్లి -
ఎన్టీఆర్ పేరునే చెరిపేస్తారా?
చంద్రబాబునాయుడు నీచాతినీచమైన, ఒక పశు ప్రవర్తన కలిగిన వ్యక్తి. తెలుగుదేశం పార్టీని అన్న నందమూరి తారక రామారావు స్థాపించి తన చెమట, రక్తంతో ఒక స్థాయికి తీసుకొచ్చారు. అలాంటి అన్నకు వెన్నుపోటు పొడిచాడు. ఉచ్ఛం, నీచం లేని దుర్మార్గుడు చంద్రబాబు అని నేను ఎన్టీఆర్ అభిమానిగా ముందునుంచీ చెబుతూనే వస్తున్నా. – కొడాలి వెంకటేశ్వరరావు (నాని), వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే సాక్షి, అమరావతి: తెలుగుదేశం వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు పేరు ఎక్కడా కనిపించకుండా, వినిపించకుండా చేయాలని, ఇప్పుడదే పార్టీకి అధినేతగా ఉన్న సీఎం చంద్రబాబు, తోక పత్రిక రాధాకృష్ణతో కలసి పన్నిన కుట్రపై రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్ అభిమానుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచి, పార్టీనీ, అధికారాన్నీ లాక్కుని, ఓట్ల కోసం ఆ మహానుభావుడి పేరునే వాడుకుంటూ.. చివరకు ఆయనకే ద్రోహం తలపెడతారా? చరిత్ర పుటల్లో ఆయన పేరు లేకుండా చేయాలనే పన్నాగం పన్నుతారా? అంటూ అభిమానులు మండిపడుతున్నారు. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీలో వాడి (రామారావు) పేరు తొలగించాలని, కొత్త పేరు పెట్టి విస్తృతంగా ప్రచారం చేద్దామంటూ, ఇక వాడి పని అయిపోయినట్టేనంటూ.. టీవీ లైవ్ షోకు ముందు చంద్రబాబు – రాధాకృష్ణలు జరిపిన సంభాషణల వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం తెలిసిందే. ఈ సంభాషణలను ‘సాక్షి’ బహిర్గతం చేసిన నేపథ్యంలో ఎన్టీఆర్ అభిమానులు రగిలిపోతున్నారు. ఆంధ్రుల ఆత్మగౌరవమే పరమావధిగా తెలుగుదేశం పార్టీని ఏర్పాటుచేసిన ఎన్టీ రామారావు పేరును తుడిచేసేందుకు ఇంతటి విషపు కుట్రలకు తెగబడతారా? అంత నీచానికి దిగజారుతారా? అంటూ మండిపడుతున్నారు. ఎన్టీఆర్ పేరుంటే తప్పేమిటి? ‘లక్ష్మీపార్వతి ఏదో చేస్తోందంటూ అసత్యాలు చెప్పి, ఆయన కుటుంబసభ్యులందరినీ మీ వైపు తిప్పుకుని, కుట్రకు పాల్పడి ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుణ్ణి చేశారు. వైస్రాయ్ హోటల్లో ఎమ్మెల్యేల క్యాంపు నిర్వహించి ఆయనపై చెప్పులు వేయించారు. అసెంబ్లీలో మాట్లాడటానికి కూడా అవకాశం లేకుండా చేసి, రామారావు కంటతడి పెట్టుకునేలా చేశారు. రెండు రూపాయలకే కిలో బియ్యం వంటి పథకాలతో ప్రజా సంక్షేమానికి కొత్త నిర్వచనం చెప్పిన వ్యక్తి ఎన్టీఆర్. అలాంటి వ్యక్తి పేరిట ప్రభుత్వ ఆరోగ్య పథకం (ఎన్టీఆర్ వైద్యసేవ) ఉంటే తప్పేమిటి?’ అంటూ ఎన్టీఆర్ అభిమానులు, పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు నిలదీస్తున్నారు. ‘‘చంద్రబాబు స్వార్థపరుడు కాబట్టే ఇలా కుట్రలు చేస్తుంటారు. ఎన్టీఆర్‌ను వాడు అనడం మరీ దారుణం. బాబుకు ప్రచార యావ ఎక్కువైంది. చంద్రన్న బీమా, చంద్రన్న పెళ్లి కానుక, చంద్రన్న ఉగాది కానుక..అంటూ పేర్లు పెట్టుకోవడమే ఇందుకు నిదర్శనం. బతికున్న వారి పేర్లను ఎవరూ పథకాలకు పెట్టరు. బతికుండి ప్రభుత్వ పథకాలకు తన పేరు పెట్టుకున్న ఏకైక వ్యక్తి చంద్రబాబే..’ అని సీనియర్ మంత్రి ఒకరు వ్యాఖ్యానించారు. చంద్రబాబు నీచాతినీచమైన వ్యక్తి చంద్రబాబునాయుడు నీచాతినీచమైన, ఒక పశు ప్రవర్తన కలగిన వ్యక్తి. తెలుగుదేశం పార్టీని అన్న నందమూరి తారక రామారావు స్థాపించి తన చెమట, రక్తంతో ఒక స్థాయికి తీసుకొచ్చారు. అలాంటి అన్నకు వెన్నుపోటు పొడిచి ఆయన పదవినీ, పార్టీని లాక్కుని ఆయన మరణానికి కారకుడైన దుర్మార్గుడు చంద్రబాబు. ఉచ్చం, నీచం లేని దుర్మార్గుడు చంద్రబాబు అని నేను ఎన్టీఆర్ అభిమానిగా ముందునుంచీ చెబుతూనే వస్తున్నా. బయట అలా మాట్లాడితే ప్రజలు రాళ్లతో కొడతారని, అన్న విగ్రహాలకు దండలు వెయ్యటం, పథకాలకు పేర్లు పెట్టి నటిస్తుంటారు. ఎన్టీఆర్‌ను కించపరిచే విధంగా మాట్లాడిన చంద్రబాబునాయుణ్ణి రాజకీయంగా భూస్థాపితం చేయటానికి నేను ముందు ఉంటా. ఎన్టీఆర్ అభిమానులు అందరూ నాతో కలసి రావాలని కోరుతున్నా. చంద్రబాబు మాటలు విన్నాక కూడా ఎన్టీఆర్ అభిమానులు ఇంకా ఆయన వెంటే ఉంటే ఎన్టీఆర్ అత్మ క్షోభిస్తుంది. – కొడాలి వెంకటేశ్వరరావు (నాని), వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఎన్టీఆర్‌కు భారతరత్నబాబే అడ్డుకున్నాడేమో? ఇది ఎన్టీఆర్ జ్ఞాపకాలను ప్రజల్లో నుంచి తొలగించేందుకు తలపెట్టిన కుట్రగా స్పష్టమవుతోంది. ఇదంతా చూస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఎన్టీఆర్‌కు ‘భారతరత్న’ పురస్కారం ఇస్తామన్నా.. చంద్రబాబే అడ్డుతగిలాడా? అన్న అనుమానం కలుగుతోంది. అలాగే ఎన్టీ రామారావుకు వెన్నుపోటు ఉదంతంలో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ప్రమేయం కూడా ఉందేమోనని అనుమానం కలుగుతోంది. ఎన్టీ రామారావును పార్టీలకు అతీతంగా అందరూ గౌరవవిస్తారు. తెలుగు ప్రజలను, తెలుగు జాతిని దేశం గుర్తించే విధంగా చేసిన ఘనత ఎన్టీ రామారావుది. అలాంటి ఎన్టీఆర్ గురించి చంద్రబాబు, రాధాకృష్ణలు మాట్లాడుకున్న వీడియో చూసిన తరువాత ఎన్టీఆర్‌పై ఈర‡్ష్య, ద్వేషంతో చంద్రబాబు, రాధాకృష్ణ రగిలిపోతున్నట్టుగా ఆర్ధమైంది. వాడిపేరు తీసేద్దామంటూ మాట్లాడుకోవడం దారుణం. – ముప్పాళ్ల సుబ్బారావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు ఎన్టీఆర్‌ను దూషించటం తగదు... తెలుగువారి ఆత్మగౌరవాన్ని దశదిశలా చాటిన గొప్పవ్యక్తి, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్. ఎంతోమందికి పేదలకు మేలు చేశారు. అటువంటి మహనీయుడిని సీఎం చంద్రబాబునాయుడు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అవమానిస్తూ మాట్లాడటం దారుణం. ఎన్టీఆర్ చంద్రబాబును ఎంతగానో నమ్మారు. కానీ చంద్రబాబు ఆయనకే వెన్నుపోటు పొడిచి ఆయన మరణానికి కారణమయ్యాడు. చంద్రబాబు కుట్ర రాజకీయాల్ని టీడీపీ కార్యకర్తలు అర్థం చేసుకోవాలి. – కాట్రగడ్డ మస్తాన్‌రావు, నాదెండ్ల, గుంటూరు జిల్లా దమ్ముంటే ఎన్టీఆర్ పేరు లేకుండా ఎన్నికలకు వెళ్లు చంద్రబాబుకు దమ్ము, ధైర్యం ఉంటే అన్ని పథకాల్లో ఎన్టీఆర్ పేరు తొలగిస్తున్నట్లు బహిరంగంగా ప్రకటించాలి. ఆయన పేరు చెప్పకుండా ఎన్నికలకు వెళ్లాలి. ఎన్టీఆర్ పార్టీకి నారావారి పార్టీ అని పేరు పెట్టుకుంటే డిపాజిట్లు కూడా రావు. నేను ఎన్టీఆర్ హయాంలో రెండుసార్లు మంత్రిగా పనిచేశా. వెన్నుపోటు పొడిచి పది సంవత్సరాలు బతకాల్సిన ఎన్టీఆర్‌ను చంపేశారు. ఆ పాపం ఊరికే పోదు. చనిపోయిన ఒక మహానేతను వాడు వీడు అని సంబోధిస్తారా? ఎన్టీఆర్ భిక్షతో బతుకుతున్న చంద్రబాబుకు ఆయన అభిమానుల సత్తా ఏమిటో తెలిసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. – దాడి వీరభద్రరావు, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్టీఆర్ పేరును తుడిచేయలేరు టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పేరును ఎక్కడా లేకుండా చేయాలనుకోవడం అవివేకం. చంద్రబాబు నీచ రాజకీయాలకు నిదర్శనం. ఆయన పేరును తుడిచేయలేరు. చంద్రబాబు కారణంగానే ఎన్టీఆర్ ఆత్మక్షోభకు గురై చనిపోయారు. ఇలాంటి వ్యక్తి ప్రజలకు ఏం మేలు చేస్తాడు? –పెంటేల వీరయ్య,గణపవరం, నాదెండ్ల మండలం, గుంటూరు జిల్లా ఎన్టీఆర్‌ను దూషిస్తూ మాట్లాడటం దారుణం సంజీవపురం(ఓబులవారిపల్లె): టీడీపీ వ్యవస్థాపకులు దివంగత ఎన్టీ రామారావును చంద్రబాబు వాడు అంటూ మాట్లాడటం దారుణమని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి సి.రామచంద్రయ్య అన్నారు. ఆయన సోమవారం వైఎస్సార్ జిల్లా సంజీవపురంలో విలేకరులతో మాట్లాడుతూ.. పిల్లనిచ్చిన మామ తండ్రితో సమానమని, ఎన్టీఆర్ ఫొటో పెట్టుకుని సీఎం అయిన చంద్రబాబుకు ఇంగితజ్ఞానం లేదని దుయ్యబట్టారు. ఇలాంటి విలువలులేని వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిగా అవసరమా? అని ప్రశ్నించారు. -
టీడీపీ ఎన్టీఆర్‌ది.. హెరిటేజ్ ఫుడ్స్ నాది..
సాక్షి, అమరావతి : చంద్రబాబుది అంతా కరివేపాకు పాలసీ. యూజ్ అండ్ త్రో. అదే ఆయన క్యారెక్టర్. ఎన్టీ రామారావు సహా చంద్రబాబు తనను నమ్మిన వాళ్లందర్నీ మోసం చేశారు. నాకు చేసిన మోసం అదో చరిత్ర. హెరిటేజ్ ఫుడ్స్ నాది.. నాది.. నాది ఎక్కువ శాతం. చంద్రబాబు, నేను, దాగా అనే మరో స్నేహితుడు కలిసి హెరిటేజ్ ఫుడ్స్‌ను స్థాపించాం. నేను ప్రధాన భాగస్వామిని. అంటే నాది ఎక్కువ పెట్టుబడి. చంద్రబాబుది తక్కువ పెట్టుబడి. దాగా అనే అయనది మరికొంత తక్కువ పెట్టుబడి. స్థాపించిన కొన్నాళ్ల తరువాత చంద్రబాబు కొన్ని బ్లాంక్ పేపర్లు పంపించి సంతకాలు పెట్టమన్నారు. బ్లాంక్ పేపర్ల మీద సంతకాలు ఎందుకని అడిగితే ఏదో చెప్పారు. అప్పట్లో నేను సినిమా హీరోగా అగ్రస్థానంలో ఉన్నాను. కెరీర్ పీక్స్‌లో ఉండటంతో చాలా బిజీగా ఉన్నాను. అప్పట్లో నాకు ఇన్ని విషయాలు కూడా తెలీవు. స్నేహితుడు అని నమ్మి చంద్రబాబు చెప్పినట్లు బ్లాంక్ పేపర్ల మీద సంతకాలు చేశాను. తరువాత మరికొన్ని పేపర్ల మీద కూడా సంతకాలు తీసుకున్నారు. తరువాత కొన్నేళ్లకు హెరిటేజ్ సంస్థతో నాకు సంబంధం లేదని చెప్పడంతో ఒక్కసారి షాక్ తిన్నాను. కోర్టుకు వెళ్లాను. కేసు చాలా కాలం సాగింది. కానీ చంద్రబాబు పరపతి ఉన్నవాడు. ఆయనతో మనం తట్టుకోలేం అని కుటుంబ సభ్యులు, కొందరు స్నేహితులు చెబితే ఆ కేసు వదిలేశాను. ఓ సినిమా తీశాం. ఫెయిల్ అయ్యింది అనుకుని సరిపెట్టుకున్నాను. నా తరువాత దాగానూ అలాగే మోసం చేసి బయటకు పంపేశారు. హెరిటేజ్ సంస్థ విషయంలో చంద్రబాబు మమ్మల్నే కాదు రైతులను, ప్రభుత్వాన్ని కూడా మోసం చేశారు. చంద్రబాబు ఏం చేశారో తెలుసా. కంపెనీ డబ్బును ఖర్చుల కోసమని చెప్పి బ్యాంకు నుంచి డ్రా చేసేవారు. ఆ డబ్బును తనకు తెలిసిన కొందరు రైతులకు ఇచ్చేవారు. వాళ్లు హెరిటేజ్ కంపెనీలో షేర్లు కొన్నట్టు చూపించేవారు. కొన్నాళ్లకు మళ్లీ ఆ షేర్లను తానే కొనుక్కున్నట్లు డ్రామా నడిపించారు. హెరిటేజ్ సంస్థలో వాటాలు పెట్టినట్టు గానీ వాటిని చంద్రబాబుకు అమ్మినట్టు గానీ ఆ రైతులకే తెలియకుండా వ్యవహారం నడిపారు. రైతులు ఇస్తే పన్నులు ఉండవు. అంత ఘోరాలు చేశారు. ఎన్టీ రామారావును మోసం చేసి టీడీపీని తీసుకున్నట్టుగా.. నన్ను మోసం చేసి హెరిటేజ్ సంస్థను తీసుకున్నారు. దాన్ని రూ.వేల కోట్లకు అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. ఈ విషయం మీద తిరుపతిలో లేదా కాణిపాకంలో గానీ విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో గానీ కుటుంబ సభ్యులతో వచ్చి ఒట్టేసి చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మరి చంద్రబాబు తన కుటుంబ సభ్యులతో వచ్చి అలా చెప్పగలరా? -
తప్పక చూడాల్సిందే..
సాక్షి, అమరావతి : చంద్రబాబు ఆనాడు ఎన్టీఆర్కే కాదు.. ఈనాడు రాష్ట్రంలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’సినిమాకూ వెన్నుపోటు పొడిచారు.. సినిమా విడుదల కాకుండా అడ్డుకున్నారు.. ఆనాడు మీడియా చంద్రబాబు చేతిలో ఉంది.. అందుకే పూర్తి నిజాలు ప్రజలకు చెప్పలేదు.. అయినా ఇప్పుడు సినిమా పొరుగు రాష్ట్రాల్లో విడుదలైంది.. నిజాలు తెలుసుకోకుండా అడ్డుకోలేరు.. ఇదీ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న తాజా కబురు. ఎన్టీరామారావుకు 1995లో చంద్రబాబు వెన్నుపోటు పొడిచి సీఎం పదవి నుంచి తొలగించి ఆయన అధికారం చేజిక్కించుకోవడం ఇతివృత్తంగా రాంగోపాల్‌వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను తీశారు. కుట్రతో మరుగు పరిచిన నిజాలను ప్రజలకు చెప్పేందుకు ఈ సినిమా నిర్మించడంతో చంద్రబాబు హడలిపోయారు. ఈ సినిమా రాష్ట్రంలో విడుదల కాకుండా అడ్డుకున్నారు. దీంతో శుక్రవారం తెలంగాణాతోపాటు ఇతర రాష్ట్రాల్లో సినిమా విడుదలైంది. అభిమానులు సరిహద్దు రాష్ట్రాల్లోని సినిమా థియేటర్లకు పరుగులు తీశారు. అనంతరం సినిమా గురించి వివరిస్తూ సోషల్ మీడియాలో పోస్టులతో వైరల్ చేశారు. ప్రధానంగా కొన్ని సన్నివేశాలు బాగా హైలైట్ అయ్యాయి. కుటుంబ సభ్యులు పట్టించుకోకపోవడంతో తాను తోడు కోసం లక్ష్మీ పార్వతిని వివాహం చేసుకుంటానని ఎన్టీఆర్ చెప్పినప్పుడు చంద్రబాబు అండ్ బ్యాచ్ వ్యతిరేకించడం.. ఎన్టీఆర్, లక్ష్మీపార్వతిలకు వ్యతిరేకంగా ఆనాడు పత్రికల్లో దుష్ప్రచారం చేసేలా ఓ పత్రికాధిపతితో చంద్రబాబు కుట్ర పన్నడం.. ఎన్టీఆర్‌ను పదవి నుంచి తొలగించి వైస్రాయ్ హోటల్ వద్ద ఆయనపై చెప్పులు వేయించడం.. చివరికి ఎన్టీఆర్ చనిపోయాక ఆయన మృతదేహం వద్దకు లక్ష్మీ పార్వతి రాకుండా చంద్రబాబు, బాలకృష్ణ తదితరలు అడ్డుకోవడం.. ఇలా ఈ సినిమాలోని సన్నివేశాలన్నీ వెబ్సైట్లలో హల్చల్ చేస్తున్నాయి. ఈ సినిమాలోని సన్నివేశాలు, డైలాగులు, పాత్రధారుల గురించి సినిమా చూసిన వారు ఇతర మిత్రులతో చర్చిస్తున్నారు. చంద్రబాబు ఎంతటి దుర్మార్గానికి పాల్పడ్డారన్నది యువతరానికి బోధపడింది. ‘టీడీపీ అనుకూల మీడియా చంద్రబాబును ఓ పరిపాలనా దక్షుడిగా చూపిస్తూ వచ్చింది.. కానీ ఆయన అసలు స్వరూపం ఏమిటో ఇప్పుడు తెలిసింది’ అని ఓ యువకుడు వ్యాఖ్యానించారు. ‘ఆనాడు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పోవడంలో టీడీపీ మీడియా చంద్రబాబుకు ఎంతగా సహకరించిందో తమకు అర్థమైంది’ అని ఓ యువతి వ్యాఖ్యానించారు. ‘ప్రస్తుతం రాష్ట్రంలో చంద్రబాబు గురించి టీడీపీ అనుకూల మీడియా అంతగా ఎందుకు అబద్ధాలు చెబుతోందన్నది కూడా తెలిసింది’అని ఆమె చెప్పడం గమనార్హం. ఈసారి తాము మోసపోమని, చంద్రబాబును ఓడించి తీరుతామని స్పష్టం చేశారు. చంద్రబాబు ఎంతటి మోసగాడో ఈ సినిమాలో రామ్‌గోపాల్ వర్మ నేటి తరానికి తెలియజేశారని ఓ రిటైర్డ్ ఉద్యోగి చెప్పారు. ‘సినిమాలో కామెడీ సీన్లు లేవని ఎవరూ అనుకోవద్దు.. బాలకృష్ణ పాత్రధారి చెప్పిన డైలాగులతో కామెడీ బాగా పండింది’ అని ఓ ప్రేక్షకుడు వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ‘ఏపీలో సినిమా రిలీజ్ కాలేదని బాధపడొద్దు ఆంధ్రా బ్రదర్స్.. తెలంగాణాకు రండి.. ఈ సినిమా చూసి చంద్రబాబు నైజం ఏమిటో తెలుసుకోండి..’అని హైదరాబాద్‌వాసి ఒకరు ఆహ్వానం పలికారు. -
ఉప ఎన్నికలకు కారణం ఆ హీరోలే
సాక్షి,తిరుపతి: తిరుపతి అసెంబ్లీకి ఇంతవరకూ రెండుసార్లు ఉప ఎన్నికలు జరగ్గా.. రెండు సందర్భాల్లోను ఇద్దరు ప్రముఖ సినీ నటుల రాజీనామా వల్లే జరిగాయి. టీడీపీ ఆవిర్భావం అనంతరం 1983లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్టీ రామారావు తిరుపతి, హిందూపురం నుంచి పోటీ చేశారు. ఆయన రెండు చోట్లా విజయం సాధించారు. అయితే తిరుపతికి రాజీనామా చేయడంతో అక్కడ ఉప ఎన్నికలు జరిగాయి. ఇక 2009లో పీఆర్పీ అధినేత, ప్రముఖ నటుడు చిరంజీవి పాలకొల్లు, తిరుపతి నుంచి పోటీ చేశారు. ఆయన పాలకొల్లులో ఓడిపోవడంతో తిరుపతి నుంచి ఎమ్మెల్యేగా కొనసాగారు. 2012లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికవడంతో తిరుపతి స్థానానికి రాజీనామా చేశారు. దీంతో మళ్లీ తిరుపతిలో ఉప ఎన్నికలు జరిగాయి. -
ఆరాధ్యులకు గుడి కట్టేవాడా...
సాక్షి, కృష్ణా : కళలకు కేంద్ర బిందువే కాదు... రాజకీయాలకు గుండెకాయ గుడివాడ. ఒకప్పుడు కృష్ణాజిల్లా రాజకీయమంతా గుడివాడ నుంచే. పచ్చని పొలాలు.. పల్లెసీమలు.. అనుబంధాలు.. ఆత్మీయతలకు చిరునామా ఈ పచ్చటిసీమ.వర్తక, వాణిజ్యాలతోపాటు, విద్య, వైద్య, రాజకీయ రంగాల ప్రముఖులకు పెట్టింది పేరు. ఎందరెందరో మహానుభావులు ఈ ప్రాంతంలో పుట్టిపెరిగి దేశ–విదేశాల్లో కీలకమైన కొలువులు చేపట్టి తమ ప్రాంతానికి వన్నెలీనారు. నియోజకవర్గ అభివృద్ధికి బాటలు వేశారు. మాటమీద నిలబడే నేతల భుజం తట్టి ప్రోత్సహించే ఓటర్లు పుష్కలంగా ఉన్న గుడివాడలో గెలుపోటములు ప్రభుత్వ ఏర్పాటుకు కీలకం అవుతాయంటారు సీనియర్లు. పాతికేళ్లు జెడ్పీ చైర్మన్‌గా చేసిన పిన్నమనేని కోటేశ్వరరావు నుంచి, మూడు సార్లుగా శాసనసభ్యునిగా ఎన్నికైన కొడాలి నాని వరకు నియోజకవర్గంలో హ్యాట్రిక్సే.గుడివాడ నియోజక వర్గం రాజకీయ, సినీ రంగానికి పుట్టినిల్లు.. ఎందరో సినీ ప్రముఖులు ఈ గడ్డనుంచి వెళ్లి వెండి తెరపై వెలుగొందిన వారే. ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, కైకాల సత్యన్నారాయణ వంటి వారంతా ఇక్కడి నుంచి చిత్రసీమకు వెళ్లిన వారే. సినీ రంగంతో పాటు రాజకీయ రంగంలో ఎన్టీఆర్ ఇక్కడి నుంచి వెళ్లి ముఖ్యమంత్రిగా పనిచేసి దేశానికే వన్నెతెచ్చారు. కేవలం కాలువ నీటిపైనే సాగు భూమి కలిగి ఆక్వా పంటకు పేరున్న నియోజక వర్గం ఇది. అటువంటి నియోజక వర్గంలో ఎన్నికల సందడి మొదలైంది. ఈనియోజక వర్గం పేరు చెప్పగానే ప్రస్తుతం కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని ) గుర్తుకు వస్తారు. ఇప్పటికి మూడుసార్లు విజయం సాధించి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇప్పటికి 15 సార్లు ఎన్నికలు గుడివాడ నియోజకవర్గంలో మొదటి సారిగా 1955 సంవత్సరంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇప్పటి వరకు 15సార్లు ఎన్నికలు జరిగాయి. నియోజకవర్గాల పునర్విభజన కాకముందు గుడివాడ నియోజకవర్గంలో గుడివాడపట్టణంతో పాటు మూడు మండలాలు ఉండేవి. ( గుడివాడ, పామర్రు, పెదపారుపూడి). పునర్విభజన అనంతరం పామర్రు కొత్త నియోజక వర్గం కాగా అందులో పెదపారుపూడి కలిసింది. దీంతో గుడివాడ నియోజక వర్గంలోకి గుడివాడ పట్టణంతో పాటు, గుడివాడ మండలం,రద్దయిన ముదినేపల్లి నియోజక వర్గంలోని నందివాడ, గుడ్లవల్లేరుమండలాలు గుడివాడ నియోజక వర్గంలోకి చేరాయి. అత్యధిక మెజారిటీతో గెలిచిన అభ్యర్థులు2000లో జరిగిన ఉప ఎన్నికల్లో (రావి వెంకటేశ్వరరావు (31997ఓట్లు) ఆయన సోదరుడి మరణానంతరం) 1983లో ఎన్టీ రామారావు (26538ఓట్లు) ,1985 ఎన్టీఆర్ రాజీనామా చేయటంతో రావి శోభనాద్రి చౌదరి (21643ఓట్లు మెజార్టీ)తో గెలుపొందారు. నియోజకవర్గంలో ఒక ఉప ఎన్నికతో సహా 15 పర్యాయాలు ఎన్నికల జరగ్గా వైఎస్సార్ సీపీ–1 కాంగ్రెస్(ఐ)లు –6, ఒక ప్రత్యేక్ష ఎన్నికలో టీడీపీ – 7, ఇండిపెండెంట్లు – 0, బీజేపీ – 0, సీపీఐ–1 ఎన్నికయ్యారు. గత ఎన్నికలలో టీడీపీ అభ్యర్ధి రావి వెంకటేశ్వరరావుపై వైఎస్సార్సీపీ తరుపున పోటీ చేసిన కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) విజయం సాధించారు. నియోజకవర్గంలో వరుసగా మూడుసార్లు కొడాలి నాని విజయం సాధించారు. దళితుల ఓట్లే కీలకం గుడివాడ నియోజక వర్గంలో దళితుల ఓట్లు కీలకంగా ఉంటాయి. మొత్తం ఓటర్లులో దాదాపు 50 వేల ఓట్లు దళితులవే ఉంటాయి. వీరి తరువాత బీసీ ఓటర్లు, కాపులు అధికంగా ఉన్నారు. గుడివాడ నియోజక వర్గం పునర్విభన అనంతరం గుడివాడ పట్టణం ఓటర్లే కీలకంగా ఉంటాయి. దాదాపు లక్ష మంది ఓటర్లు గుడివాడ పట్టణంలోనే ఉన్నారు. దీంతో గుడివాడ పట్టణం ఓటర్లు ఎటువైపు ఉంటే వారిదే గెలుపని చెప్పారు. హ్యాట్రిక్ సాధించిన నాని గుడివాడ నియోజక వర్గంలో ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో వరుసగా విజయం సాధించిన వారు లేరు. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని మూడుసార్లు వరుసగా గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు. ప్రస్తుతం నాల్గొవ సారి విజయానికి సిద్ధ్దంగా ఉన్నారు. గుడివాడ అనగానే రాష్ట్రంలో గుర్తుకు వచ్చేది కొడాలి నాని నియోజక వర్గం అని చెప్పాల్సిందే . గుడివాడ రాజకీయాలపై తనదైన ముద్రవేసి ప్రజల మనస్సుల్లో నిండై ఉన్నారు. నియోజకవర్గంలో ఓటర్లు... మొత్తం ఓటర్లు : 1,99,423 పురుషులు : 96233 మహిళలు : 1,03,171 ఇతరులు : 19 కుల సామాజిక పరంగా ఎస్సీలు : 52,000 కాపులు : 25,000 యాదవులు : 20,000 గౌడ : 14,000 రజక : 5000 బ్రాహ్మణ : 3500 ముస్లీం : 12000 కమ్మ : 12500 రెడ్డి : 5000 -
నారాసురుడి నలభై ఏళ్ల రక్త చరిత్ర..!
ఉన్నత స్థానానికి ఎదగడానికి కుట్రలు, కుతంత్రాలు, హత్యల మార్గాన్నే ఎంచుకున్న చంద్రబాబు జీవితంలో ఉన్నత స్థానానికి ఎదిగేందుకు చెమట చిందించడం ఒక మార్గం.. కుట్రలు, కుతంత్రాలు, హత్యలతో రక్తపుటేరులు పారించడం మరొక మార్గం. మనందరం కష్టాన్ని, తెలివితేటల్ని, చెమట చిందించే మార్గాన్ని నమ్ముకుంటాం.. కానీ.. శకునిలోని కుటిలత్వం.. దుర్యోధనుడిలోని క్రూరత్వం.. దుశ్శాసనుడిలోని కిరాతకం.. ధృతరాష్ట్రుడిలోని కపటత్వం.. వెరసి దుష్టచతుష్టయ లక్షణాలను పుణికిపుచ్చుకున్న రెండున్నర ఎకరాల రైతు కుటుంబానికి చెందిన నారా చంద్రబాబునాయుడు.. రెండో మార్గాన్నే ఎంచుకున్నారు.. విద్యార్థి దశలోనే ఏడుకొండలవాడి పాదాల చెంత శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయాన్ని సం‘కుల’ సమరానికి వేదికగా మార్చారు.. కుల రాజకీయాలతో దాడులకు తెగబడ్డారు. విద్యార్థి నాయకుడి దశ నుంచి రాజకీయ నాయకుడిగా రూపాంతరం చెందాక.. కుట్రలు, కుతంత్రాలు, హత్యారాజకీయాలతో రక్తపుటేరులకు కేరాఫ్‌గా మారారు. చంద్రబాబు నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో అడుగడుగునా రక్తపు మరకలే..! ప్రజాపోరాటాలతో తిరుగులేని నేతగా ఎదిగి.. తనకు కంటగింపుగా మారిన వంగవీటి మోహన రంగా దారుణ హత్య నుంచి మొదలైన నారాసుర రక్త దాహం.. ఎన్కౌంటర్ పత్రిక ఎడిటర్ పింగళి దశరథరాం.. నాడు సీఎం ఎన్టీఆర్ కార్యదర్శిగా పనిచేస్తున్న రాఘవేంద్రరావు.. కడప లోక్‌సభ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన వెంకటసుబ్బయ్య.. వైఎస్ రాజశేఖరరెడ్డి తండ్రి వైఎస్ రాజారెడ్డి.. నిన్నటికి నిన్న వైఎస్ సోదరుడు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని కిరాతకంగా అంతమొందించడం వరకూ.. ఆ హత్యాకాండ నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది. తీరని అధికార దాహంతో నారాసురుడు గత నలభై ఏళ్లుగా సాగిస్తున్న దారుణ మారణ కాండలో ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే! పరోక్షంగా తెగిన నరకంఠాలకు లెక్కేలేదు!! ముఖ్యంగా నారాసురుడు తన రాజకీయ ప్రాబల్యం నిరాటంకంగా కొనసాగించుకునేందుకు.. అత్యంత ప్రజాదరణ కలిగిన మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబాన్ని కడతేర్చాలని ఎప్పటికప్పుడు కుట్రలు పన్నడం విస్తుగొల్పుతోంది అంటున్నారు పరిశీలకులు. ఆ మహానేత కుటుంబంలో ఇప్పటికే ముగ్గురు బలైపోగా.. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ తనపై జరిగిన హత్యాయత్నం నుంచి అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డారు. ఓ అనామకుడిగా జీవితాన్ని ప్రారంభించి.. ఇలా అడుగడుగునా అడ్డదారుల్లో ముందుకెళ్తూ.. ఎదురొచ్చిన వారిని అత్యంత కిరాతకంగా అడ్డుతొలగించుకుంటూ.. ఎదిగిన నారాసురుడి ఆ రక్తచరిత్ర పుటలను తిరగేస్తే.. పేజీకో కుట్ర, కుతంత్రం, కుటిల నీతి, హత్యలు కన్పిస్తాయి. రాజకీయ ప్రత్యర్థులను వర్గ శత్రువులుగా పరిగణించి హత్యా రాజకీయాలకు చంద్రబాబు తెరతీశారు. అలాంటి నారాసురుడి నలభై ఏళ్ల రక్త చరిత్ర.. సాక్షి, అమరావతి: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు, మృదుస్వభావి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని సొంతింట్లో కిరాతకంగా హత్యకు గురైన సంఘటన గురించి సీఎం చంద్రబాబు మాట్లాడిన తీరు చూస్తుంటే ఇందులో ఆయన హస్తం ఉందని వైఎస్ అభిమానులు, కుటుంబ సభ్యులే కాదు.. పలు రాజకీయ పార్టీల సీనియర్ నేతలు, సామాన్య ప్రజలు సైతం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు వ్యవహార శైలి మొదటి నుంచి ఇలానే ఉందని చెబుతున్నారు. చంద్రబాబు వ్యవహార శైలి, గతంలో జరిగిన సంఘటనలను పరిశీలిస్తే.. విద్యార్థి దశలోనే సం‘కుల’ సమరం చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లెలో ఏప్రిల్ 20, 1950న జన్మించిన చంద్రబాబు.. విద్యార్థి దశలో తిరుపతిలోని గోవిందరాజస్వామి డిగ్రీ కళాశాల, వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో సం‘కుల’ సమరాన్ని రాజేసి.. విద్యాలయాలను భ్రష్టుపట్టించారని నాటి సహ విద్యార్థులు చెబుతున్నారు. కుల రాజకీయాలతో ఎదిగిన చంద్రబాబు.. కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేశారు. గల్లా రాజగోపాలనాయుడి శిష్యరికంతో 1978లో కాంగ్రెస్ పార్టీ టికెట్ సాధించి.. చంద్రగిరి నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నిక అయ్యారు. అనంతరం రాజకీయ భిక్ష పెట్టిన గల్లా రాజగోపాలనాయుడుకి తీరని ద్రోహం చేశారనే విమర్శలు ఉన్నాయి. మహానేత సహకారంతో మంత్రి పదవి దివంగత ముఖ్యమంత్రి మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సహకారంతో టి.అంజయ్య మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్న చంద్రబాబు– ఆ తర్వాత ఆయన పట్ల కనీసం కృతజ్ఞత ప్రదర్శించని స్వార్థపరుడని రాజకీయ విశ్లేషకులు స్పష్టీకరిస్తున్నారు. మంత్రిగా ఉన్న సమయంలోనే ఎన్టీ రామారావు కుమార్తె భువనేశ్వరిని చంద్రబాబు వివాహం చేసుకున్నారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించాక... 1983లో జరిగిన ఎన్నికల్లో తన మామ ఎన్టీఆర్పైనే పోటీ చేస్తానంటూ బీరాలు పలికిన చంద్రబాబు– చంద్రగిరి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఘోర పరాజయం పాలయ్యారు. రాజకీయ అస్థిత్వం కోసం మామను బతిమాలి టీడీపీలో చేరారు. వద్దని వారించినా అల్లుడనే కనికరంతో చంద్రబాబును ఎన్టీఆర్ చేరదీశారని టీడీపీ సీనియర్ నేతలు పలు సందర్భాల్లో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. కుట్రలు, కుతంత్రాలే శ్వాసగా టీడీపీ తీర్థం పుచ్చుకున్న తర్వాత చంద్రబాబు తన సహజ లక్షణాలైన కుట్రలు, కుయుక్తులకు మరింత పదును పెట్టారన్నది రాజకీయ పరిశీలకుల విశ్లేషణ. ఎన్టీ రామారావు మంత్రివర్గంలోనూ, టీడీపీలోనూ నాదెండ్ల భాస్కర్‌రావు, నల్లపురెడ్డి శ్రీనివాసులురెడ్డి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు అత్యంత కీలకంగా వ్యవహరించేవారు. వారిని అడ్డుతొలగించకపోతే తాను ఎదగలేననే భావనతో.. ఆ ముగ్గురిని టీడీపీ నుంచి సాగనంపడానికి కుట్రలు చేశారు. జనవరి, 1984 నాటికి ఎన్టీఆర్ సీఎంగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా.. హైదరాబాద్‌లో ఎల్బీ స్టేడియంలో భారీఎత్తున సభ నిర్వహించారు. ఈ సభలో ఎన్టీఆర్‌పై మల్లెల బాబ్జీని ఉసిగొలిపి..హత్యాయత్నం చేయించి..ఆ నెపాన్ని తనపైకి నెట్టడానికి ప్రయత్నించారని నాదెండ్ల భాస్కర్‌రావు అనేక సందర్భాల్లో చెప్పారు. ఆ తర్వాత మల్లెల బాబ్జీకి ఇస్తానన్న రూ.3 లక్షల సుపారీ ఇవ్వకుండా చంద్రబాబు ద్రోహం చేశారని.. ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన మల్లెల బాబ్జీ 1988లో ఆత్మహత్య చేసుకున్నాడనే విమర్శలు ఉన్నాయి. నాదెండ్ల భాస్కర్‌రావు తిరుగుబాటులో ఎన్టీఆర్ ప్రభుత్వం కుప్పకూలింది. దీనికి నిరసనగా ఎన్టీ రామారావు శాంతియుతంగా ప్రజా పోరాటాన్ని చేశారు. కానీ.. ఎన్టీఆర్‌కు తెలియకుండా అప్పట్లో రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలకు ప్రేరేపించి.. అగ్నిగుండం చేసిన చరిత్ర చంద్రబాబుదేనని టీడీపీ సీనియర్ నేత ఒకరు ఆరోపించారు. ఆ తర్వాత 1985 ఎన్నికల్లో ఓటమి భయంతో పోటీ చేసేందుకు చంద్రబాబు జంకారు. టీడీపీ అధికారంలోకి రావడంతో ఎన్టీఆర్ దన్నుతో కర్షక పరిషత్ ఛైర్మన్‌గా దొడ్డిదారిన పదవిని పొంది.. ఓ వర్గం నేతలను చేరదీసి వర్గ రాజకీయాలకు తెరతీశారని అప్పట్లో పలువురు నేతలు అధినేతకు ఫిర్యాదులు కూడా చేశారు. విద్యార్థి దశలోనే కుల రాజకీయాలతో ఎస్వీ యూనివర్శిటీని భ్రష్టు పట్టించారంటున్న నాటి విద్యార్థులు అస్థిత్వం కోసం టీడీపీలో చేరి కుట్రలు, కుతంత్రాలు, హత్యా రాజకీయాలతో ఎదిగారంటున్న సీనియర్ నేతలు టీడీపీపై పట్టు కోసం ఎన్టీ రామారావుపై మల్లెల బాబ్జీతో హత్యాయత్నం చేయించారని ఆరోపించిన మాజీ సీఎం నాదెండ్ల వంగవీటి రంగాను అంతమొందించడంలో చంద్రబాబుదే కీలకపాత్ర అని స్పష్టం చేసిన సీనియర్ నేత చేగొండి హరిరామజోగయ్య 1995 నుంచి 2004 మధ్య కాలంలో రాజకీయ ప్రత్యర్థులను వెంటాడి వేటాడి తుదముట్టించారంటున్నరాజకీయ పరిశీలకులు రాజకీయ ప్రాబల్యం కోసం అత్యంత ప్రజాదరణ కలిగిన మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబాన్ని కడతేర్చేందుకు ఎప్పటికప్పుడు కుట్రలు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యతో మరోసారి చంద్రబాబు తన క్రూర స్వభావం బయటపడిందంటున్న సీనియర్ రాజకీయ నేతలు తొమ్మిదేళ్ల పాలనలో రక్తపుటేరులు ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడవడం ద్వారా సీఎం పీఠాన్ని అధిరోహించిన చంద్రబాబు.. 1995 నుంచి 2004 మధ్య కాలంలో రాజకీయాల్లో ప్రత్యర్థులను వర్గ శత్రువులుగా పరిగణిస్తూ వచ్చారు. రాయలసీమలో ఫ్యాక్షన్ ను రాజేసి.. అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయ ప్రత్యర్థులను అంతమొందించారనే ఆరోపణలు ఉన్నాయి. అనంతపురం జిల్లాలో ప్రత్యర్థి రాజకీయ పార్టీలకు చెందిన 415 మందిని వెంటాడి వేటాడి చంపేయడంలో కీలక భూమిక పోషించారనే విమర్శలు అప్పట్లో బలంగా వ్యక్తమ్యాయి. ఇలా హత్యకు గురైన వారిలో 300 మంది మృతదేహాల ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. రాజకీయ ప్రయోజనాల కోసం కర్నూల్లో ఫ్యాక్షన్ రక్కసిని రాజేసి వందలాది హత్యలకు కారణమయ్యారని బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. కడప జిల్లాలో ఫ్యాక్షన్ తారాస్థాయికి చేరడానికి చంద్రబాబు ఎప్పటికప్పుడు కుట్రలు చేశారని టీడీపీ సీనియర్ నేతలే పలు సందర్భాల్లో ఆరోపించారు. చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లోనూ ఇదే రీతిలో ప్రత్యర్థులను మట్టుబెట్టారనే విమర్శలు ఉన్నాయి. 2003లో చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే తనకు రక్షణ కల్పించాలని పరిటాల రవి కోరారు. కానీ.. పరిటాల రవికి భద్రత కల్పించలేదు. 2005లో పరిటాల రవి హత్యకు గురైన తర్వాత రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చేలా టీడీపీ శ్రేణులను ఉసిగొల్పడంలో చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ పెట్టారని.. జిల్లాల వారీగా టార్గెట్లు పెట్టి మరీ ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేయించారని ఆ పార్టీ సీనియర్ నేతలే వివిధ సందర్భాల్లో తీవ్ర విమర్శలు చేశారు. వంగవీటి రంగా హత్యలో కీలక పాత్ర రాష్ట్రంలో 1985 ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో గెలుపొందిన వంగవీటి మోహనరంగా.. ప్రజాపోరాటాలతో తిరుగులేని నాయకుడిగా ఆవిర్భవించారు. రంగాను అడ్డుతొలగించకోకపోతే కోస్తాలో రాజకీయ మనుగడ ఉండదని చంద్రబాబు భావించారని చెబుతున్నారు. అందుకే అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌కు తెలియకుండా కుట్ర చేసి.. డిసెంబర్ 26, 1988న ప్రజా సమస్యల పరిష్కారం, వ్యక్తిగత భద్రత కోసం ఆమరణదీక్ష చేస్తున్న రంగాను అతి దారుణంగా హత్య చేయించడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారని సీనియర్ నేత చేగొండి హరిరామజోగయ్య తన ఆత్మకథలో ఏకరవు పెట్టారు. అదేవిధంగా నాడు సీఎం ఎన్టీఆర్ కార్యదర్శిగా పనిచేస్తున్న రాఘవేంద్రరావును.. చంద్రబాబు కుట్ర చేసి యాక్సిడెంట్లో చంపేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఎన్కౌంటర్ పత్రిక ఎడిటర్ పింగళి దశరథరాం దారుణ హత్యకు చంద్రబాబు నాయుడు కారకుడనే విమర్శలు వచ్చాయి. కడప లోక్‌సభ ఎన్నిక వాయిదా కోసం హత్య దేశ వ్యాప్తంగా 1991లో లోక్‌సభకు ఎన్నికలు జరిగాయి. కడప లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా వైఎస్ రాజశేఖరరెడ్డి పోటీ చేశారు. వైఎస్‌ని ఓడించాలనే లక్ష్యంతో ఎన్నికలను ఎలాగైనా వాయిదా వేయించాలని చంద్రబాబు కుట్ర చేశారు. దీంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న వెంకటసుబ్బయ్యను అంతమొందించడానికి వ్యూహం రచించారని.. దాన్ని అమలు చేసి ఆయన్ని హత్య చేయించారని అప్పట్లో తీవ్ర ఆరోపణలు వచ్చాయి. వెంకటసుబ్బయ్య హత్యతో కడప లోక్‌సభ స్థానం ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఆ లోక్‌సభ స్థానానికి ప్రత్యేకంగా ఎన్నికలు నిర్వహించేలా చేసినా.. వైఎస్ రాజశేఖరరెడ్డి విజయదుందుబికి అడ్డుకట్ట వేయలేకపోయారు. రంగాది టీడీపీ ప్రభుత్వ హత్యే వంగవీటి మోహనరంగాను అప్పటి టీడీపీ ప్రభుత్వమే హత్య చేయించింది. రంగా హత్యతో దేవినేని నెహ్రూకు ఎలాంటి సంబంధం లేదు. 1988లో టీడీపీ ప్రభుత్వం పాల ధర లీటర్‌పై రూ.2 పెంచింది. దీంతోపాటు ఆర్టీసీ ఛార్జీలూ పెంచింది. టీడీపీ సర్కార్ ప్రజాకంఠక విధానాలపై రంగా భారీ ఎత్తున ఉద్యమాలు చేయడంతో టీడీపీ ప్రభుత్వానికి కంటగింపుగా మారింది. 1988లో డిసెంబర్ 20న మొగల్రాజపురంలో ఇంటి పట్టాల పంపిణీ వివాదాస్పదంగా మారింది. ఆ ప్రాంతానికి వెళ్తున్న రంగాను అప్పటి హోం మంత్రి కోడెల శివప్రసాద్‌రావు కార్యక్రమం ఉందనే నెపంతో ఏసీపీ అడ్డుకున్నారు. దీనికి నిరసనగా రంగా రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. అదే సమయంలో అక్కడి వచ్చిన కోడెల ప్రభుత్వానికి రంగా పెద్ద తలనొప్పిగా మారారని అన్నారు. అప్పటి నుంచే రంగా హత్యకు టీడీపీ ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ప్రధానంగా చంద్రబాబు రంగా హత్యకు స్కెచ్ వేశారు. 1988, డిసెంబర్ 26న ఆమరణ దీక్ష చేస్తున్న రంగాను దీక్షా శిబిరంలోనే అంతమొందించారు. విచారణ సమయంలో ఇదే అంశాన్ని సీబీఐ అధికారులు మాట్లాడుకుంటుండగా నేను విన్నా. సీబీఐ విచారణలో భాగంగా కేసులో ప్రత్యక్ష సాక్షి అయిన నన్ను నెహ్రూ వద్దకు కూడా తీసుకెళ్లారు. అప్పటి సీఐలు శివాజీ, విజయ్‌బాబులు రంగా హత్యతో నెహ్రూకు సంబంధం లేదని, చంద్రబాబే ఈ హత్య చేయించారని అనుకుంటుండగా కూడా నేను విన్నా. –గాళ్ల సుబ్రమణ్యం, జాతీయ అధ్యక్షుడు, కాపునాడు వెన్నుపోటుతో ఎన్టీఆర్ కన్నుమూత కుట్రలు, కుయుక్తులతో టీడీపీలో ఎదిగిన చంద్రబాబు.. 1995లో రాజకీయ అస్థిత్వాన్ని కల్పించిన మామ ఎన్టీఆర్కే ద్రోహం తలపెట్టి వెన్నుపోటు పొడిచారు. వైశ్రాయ్ హోటల్లో నిర్భందించిన తన ఎమ్మెల్యేలను విడిపించుకోవడానికి వచ్చిన ఎన్టీ రామారావుపై చెప్పులతో దాడి చేయించిన నైజం చంద్రబాబుది అన్నది జగద్విదితం. తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, బావమరిది ఎన్.హరికృష్ణలను మభ్యపెట్టి.. వారి సహకారంతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే వారిద్దరినీ టీడీపీ నుంచి సాగనంపారు. చంద్రబాబుకు సహకరించి తప్పు చేశానని దగ్గుబాటి వెంకటేశ్వరరావు అనేక సందర్భాల్లో ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు వెన్నుపోటుతో అధికారాన్ని కోల్పోయిన ఎన్టీఆర్.. వైశ్రాయ్ హోటల్ వద్ద చెప్పులు వేయించిన ఘటనతో మరింత క్షోభకు గురై ఆ ఆవేదనతోనే కన్నుమూశారు. ఎన్టీఆర్ కన్నుమూయడానికి కొద్దిరోజుల ముందు చంద్రబాబు గురించి చేసిన వ్యాఖ్యలు ఆయన నేర చరిత్రను ఎత్తిచూపాయి. అధికారం అండతో హత్యాకాండ ఐదేళ్లుగా టీడీపీ పాలనలో సాగుతున్న హత్యాకాండలో 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 2014 జూలై 3న అనంతపురం జిల్లా యల్లనూరు మండల వైఎస్సార్సీపీ నాయకుడు ప్రకాశం శెట్టిని టీడీపీ నేతలు హత్య చేశారు. 2014 ఆగస్టు 11న కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం గొట్టుముక్కల గ్రామంలో వైఎస్సార్సీపీ గ్రామ పంచాయతీ ఉపసర్పంచి ఆలోకం కృష్ణారావు(55)ను టీడీపీ కార్యకర్తలు హత్య చేశారు. తర్వాత అదే గ్రామంలోని వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యుడు గుదే అక్కారావు ఇంటిపైనా దాడి చేసి హత్యయత్నానికి పాల్పడ్డారు. 2014 ఆగస్టు 21న గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలం మేళ్లవాగు గ్రామంలో వైఎస్సార్సీపీకి చెందిన అన్నదమ్ములు బూసి పెదనాగిరెడ్డి, చిననాగిరెడ్డిపై తెలుగుదేశం కార్యకర్తలు దాడి చేసి చంపేశారు. 2014 ఆగస్టు 22న అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామంలో వైఎస్సార్సీపీ నేత మల్లిఖార్జునను హత్య చేశారు. 2014 సెప్టెంబరు 1న అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం కణేకల్ మండలం హనుమాపురం సర్పంచ్ విశ్వనాథ్ ప్రాణం తీశారు. 2014 సెప్టెంబర్ 11న గుంటూరు జిల్లా చినగార్లపాడులో వైసీపీ కార్యకర్త గోవింద్‌రెడ్డి హత్యకు గురయ్యాడు. 2014 నవంబర్ 27న కర్నూలు జిల్లా పలుకురులో వైఎస్సార్సీపీ నేత ప్రభాకర్‌నాయుడు హత్యకు గురయ్యారు. 2014 డిసెంబర్ 30న నెల్లూరు జిల్లాలో అల్లం నరేంద్ర హత్యను హత్య చేశారు. 2015 మార్చి 31న అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం పెద్దవడుగూరు మండలం కిష్టిపాడు సింగిల్‌విండో అధ్యక్షుడు విజయభాస్కర్‌రెడ్డిని సింగిల్‌విండో కార్యాలయంలోనే టీడీపీ నేతలు కత్తులు, వేటకొడవళ్లతో దారుణంగా నరికి చంపారు. ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రోద్బలంతోనే ఈ హత్య జరిగిందనే ఆరోపణలున్నాయి. 2015 ఏప్రిల్ 29న అనంతపురం జిల్లా రాప్తాడు వైఎస్సార్సీపీ మండల మాజీ కన్వీనర్ ప్రసాద్‌రెడ్డిని రాప్తాడు తహశీల్దార్ కార్యాలయంలో పట్టపగలే దారుణంగా హత్య చేశారు. ఒక్క అనంతపురం జిల్లాలోనే దాదాపు 12 రాజకీయ హత్యలు జరిగినట్టు సమాచారం. 2015 మే 15న కర్నూలు జిల్లా వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు వసంతరావుపై దాడి చేసి చంపేశారు. 2015 అక్టోబర్ 14న కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని చింతకుంటలో వైఎస్సార్సీపీ నేత రాఘవరెడ్డిని హత్య చేశారు. 2016 డిసెంబర్ 9న వైఎస్సార్ జిల్లాలోని పులివెందుల నియోజకవర్గం వేంపల్లె మండలం అలవలపాడు ఎంపీటీసీ గజ్జెల రామిరెడ్డి ప్రత్యర్థుల చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. మండల సర్వసభ్య సమావేశం ముగించుకొని వేంపల్లె నుంచి అలవలపాడు గ్రామానికి మోటార్ సైకిల్‌పై రామిరెడ్డి వెళ్తుండగా టీడీపీకి చెందిన కృష్ణారెడ్డి, ఆయన అనుచరులు సుమోతో ఢీకొట్టి, వేటకొడవళ్లతో నరికి చంపారు. 2017 మే 6న కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో గోవిందపల్లిలో వైఎస్సార్సీపీ నేత ఇందూరి ప్రభాకర్‌రెడ్డి, ఆయన బావమరిదిని దారుణంగా హత్య చేశారు. పింగళి దశరథరామ్(జర్నలిస్టు)... తమ అక్రమాలు, ఆగడాలను ప్రశ్నించిన రాజకీయ నాయకుల్నే కాదు.. జర్నలిస్టులను సైతం టీడీపీ నేతలు మట్టుబెట్టారు. విజయవాడలో ‘ఎన్కౌంటర్’ అనే పక్షపత్రికకు పింగళి దశరథరామ్ వ్యవస్థాపక సంపాదకుడు, పబ్లిషర్‌గా వ్యవహరించేవారు. కాంగ్రెస్, టీడీపీల ప్రజావ్యతిరేక విధానాలను తీవ్రంగా విమర్శించేవారు. కారంచేడు దళితులపై దాడులను, అప్పటి మంత్రి కోడెల శివప్రసాదరావు తదితరుల అవినీతి, అక్రమాలపై తన పత్రికలో ఎండగట్టారు. ఈ నేపథ్యంలో 1985 అక్టోబర్ 20వ తేది రాత్రి 9 గంటలకు విజయవాడలోని సత్యనారాయణపురంలో రిక్షాలో వెళ్తున్న దశరథరామ్‌ను గూండాలు అత్యంత కిరాతంగా హత్య చేశారు. ఈ హత్య చేయించిందని చంద్రబాబేనని ప్రజలు ఇప్పటికీ భావిస్తుంటారు. ముత్యాల శోభనాద్రి.. వంగవీటి రంగా ముఖ్య అనుచరుడే ముత్యాల శోభనాద్రి. టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రంగా నిర్వహించే ధర్నాల్లో కీలకపాత్ర పోషించేవారు. దీంతో ఆయన్ని మట్టుబెట్టాలని టీడీపీకి చెందిన దేవినేని నెహ్రూ సోదరుడు దేవినేని మురళి నిర్ణయించుకున్నాడు. శోభనాద్రి 1987 మే 17న తన ఇంటి నుంచి స్కూటర్‌పై సూర్యారావుపేటలోని కుమార్తె ఇంటికి వెళ్లాడు. గర్భిణి అయిన కుమార్తెకు పళ్లు, పూలు ఇవ్వబోతుండగా వెనుక నుంచి వచ్చిన మురళి, ఆయన అనుచరులు శోభనాద్రిని మట్టుబెట్టారు. శోభనాద్రి చనిపోయే నాటికి ఆయన పెద్ద కుమారుడు నాగేంద్రబాబుకు 18 ఏళ్లు. శోభనాద్రి హత్య తర్వాత తమ వ్యాపారాన్ని నెహ్రూ హస్తగతం చేసుకోవడంతో రోడ్డున పడ్డామని.. ఇప్పుడిప్పుడే నిలదొక్కుకొని జీవిస్తున్నామని తెలిపారు. -
పెరిగిన బీసీ,ఎస్సీలు
1994లో తెలుగుదేశం ప్రభంజనం వీచింది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ, దాని మిత్రపక్షాలుగా ఉన్న సీపీఐ, సీపీఎంలకు కలిపి 90 సీట్లు వస్తే, టీడీపీ మద్దతు ఇచ్చిన మరో ముగ్గురు ఇండిపెండెంట్లు కూడా గెలిచారు. ఆ ఎన్నికలలో కాంగ్రెస్‌కు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. తెలంగాణలో కేవలం ఆరు సీట్లే దక్కాయి. అయితే, ఇంత భారీ మెజార్టీ సాధించుకున్న తెలుగుదేశం అధినేత ఎన్.టి.రామారావు ఈసారి ఎనిమిది నెలలకే ఆయన అల్లుడు, అప్పటి మంత్రి చంద్రబాబు చేతిలో పరాభవానికి గురై ముఖ్యమంత్రి పదవిని కోల్పోయారు. ఈ ఎన్నికల్లో సామాజిక వర్గాలవారీగా చూస్తే తెలంగాణలో రెడ్డి వర్గానికి చెందిన వారు అత్యధిక సంఖ్యలో అసెంబ్లీకి ఎన్నికయ్యారు. మొత్తం 35 మంది రెడ్డి నేతలు ఎమ్మెల్యేలుగా ఎన్నికైతే, కాంగ్రెస్ తరపున అతి తక్కువగా కేవలం నలుగురే ఎన్నికయ్యారు. తెలుగుదేశం పార్టీ నుంచి 21 మంది, బిజెపి నుంచి ఒకరు, సిపిఐ తరపున ఇద్దరు, సిపిఎం పక్షాన నలుగురు రెడ్డి నేతలు ఎమ్మెల్యేలు కాగా, ఇండిపెండెంట్లుగా ముగ్గురు రెడ్డి నేతలు గెలుపొందారు. వెలమ నేతలు 12 మంది గెలుపొందగా, ఎనిమిది టీడీపీ, బీజేపీ ఒకరు, సీపీఐ నుంచి ఇద్దరు, ఇండిపెండెంట్ ఒకరు గెలిచారు. ముస్లింలు ఐదుగురు గెలుపొందగా, టీడీపీ, సీపీఐ, ఎంఐఎం లకు చెందినవారు ఒక్కొక్కరు ఉన్నారు. ఇద్దరు ఎంబీటీ పక్షం నుంచి విజయం సాధించారు. ఎంఐఎంలో చీలిక వచ్చి కొత్తగా ఏర్పడ్డ ఎంబీటీ రెండుస్థానాలు సాధించింది. కమ్మ నేతలు ఆరుగురు గెలుపొందగా, నలుగురు టీడీపీ, సీపీఐ, సీపీఎంల నుంచి ఒక్కొక్కరు గెలిచారు. ఎస్సీ వర్గాల నుంచి 17 మంది విజయం సాధించగా, వారిలో 12 మంది తెలుగుదేశం, ఇద్దరు సీపీఐ, ఇద్దరు సీపీఎం, ఇండి పెండెంట్ ఒకరు గెలిచారు. ఎస్టీలు ఎనిమిది మందికి గాను, కాంగ్రెస్ ఒకరు, టీడీపీ మూడు, సీపీఐ మూడు, సీపీఎం ఒకురు గెలిచారు. బీసీ వర్గాలు 21 మంది గెలిస్తే, ఒకరు కాంగ్రెస్ నుంచి, 17 మంది టీడీపీ నుంచి గెలిచారు. బీజేపీ ఒకరు, సీపీఐ నుంచి ఇద్దరు గెలుపొందారు. ఇతర వర్గాలకు చెందిన ఆరుగురు టీడీపీ నుంచే గెలిచారు. వీరిలో బ్రాహ్మణులు ఇద్దరు, వైశ్య ఒకరు, ఇతరులు ముగ్గురు ఉన్నారు. ఆయా వర్గాల నుంచి గెలుపొందిన ప్రముఖులలో కాంగ్రెస్ పక్షాన కె.ఆర్ సురేష్ రెడ్డి, పి.జనార్దన్‌రెడ్డి , మర్రి శశిధర్‌రెడ్డి, టీడీపీ పక్షాన పోచారం శ్రీనివాసరెడ్డి, ఇ.పెద్దిరెడ్డి, ముద్దసాని దామోదరరెడ్డి, పి.ఇంద్రారెడ్డి, నాగం జనార్దన్‌రెడ్డి, ఎ.మాధవరెడ్డి తదితరులు ఉన్నారు. సీపీఎం నేత నర్రా రాఘవరెడ్డి ఆరోసారి శాసనసభకు ఎన్నికయ్యారు. సీపీఐ నేత విఠల్ రెడ్డి మరోసారి చట్టసభకు వచ్చారు. కాంగ్రెస్ నేత ఆర్.దామోదరరెడ్డి టిక్కెట్ రాకపోవడంతో తిరుగుబాటు చేసి ఇండిపెండెంట్‌గా గెలిచారు. కమ్మవర్గం వారు టీడీపీ మిత్రపక్షాల నుంచే గెలిచారు. మండవ వెంకటేశ్వరరావు, తుమ్మల నాగేశ్వరరావు(టీడీపీ)పువ్వాడ నాగేశ్వరరావు(సీపీఐ), బోడేపూడి వెంకటేశ్వరరావు గెలిచినవారిలో ఉన్నారు. వెలమ నేతలలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు, యతిరాజారావు, (టీడీపీ) చెన్నమనేని రాజేశ్వరరావు(సీపీఐ), సీహెచ్ విద్యాసాగరరావు (బీజేపీ) ఉన్నారు. బీసీ వర్గాలలో మున్నూరు కాపు నుంచి ఐదుగురు, గౌడ ఇద్దరు, యాదవ ముగ్గురు, ముదిరాజ్ నలుగురు, పద్మశాలి 1, విశ్వబ్రాహ్మణ 1, పెరిక 1, పట్కారి 2, ఆర్య మరాఠా ఇద్దరు ఉన్నారు. బీసీ ప్రముఖులలో దేవేందర్ గౌడ్, తలసాని శ్రీనివాసయాదవ్, పి.చంద్రశేఖర్, ఎల్.రమణ, ఎస్.మధుసూదనాచారి, దానం నాగేందర్ ప్రభృతులు ఉన్నారు. ఎస్సీల్లో బోడ జనార్దన్, మోత్కుపల్లి నరసింహులు, కడియం శ్రీహరి, గుండా మల్లేష్, తదితరులు ఉన్నారు. ఎస్టీల్లో గోవింద నాయక్, చందూలాల్, రెడ్యాలు ఉన్నారు. ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ తొలిసారి ఎన్నికయ్యారు. సామాజిక విశ్లేషణ కొమ్మినేని శ్రీనివాసరావు -
మారిన ముఖచిత్రం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 1983 ఎన్నికలు పెనుమార్పులకు మూలమయ్యాయి. ఇక్కడి రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చివేశాయి. రెండు పార్టీల వ్యవస్థకు బలమైన పునాది ఈ ఎన్నికలలో పడింది. కొన్నిసార్లు చీలినా మూడు దశాబ్దాల పాటు ఏపీని పాలించిన కాంగ్రెస్ పార్టీ మొదటిసారిగా పరాజయం పాలైంది. ప్రఖ్యాత నటుడు ఎన్.టి.రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి అధికారాన్ని కైవసం చేసుకున్నారు. అయితే తెలంగాణలో మెజార్టీ సీట్లను ఆయన పొందలేకపోవడం విశేషం. కాంగ్రెస్, ఇతర పక్షాలకు వచ్చిన సీట్లన్నిటిని కలిపితే, టీడీపీకి తక్కువ సీట్లు వచ్చినట్లు లెక్క. ఆ ఎన్నికలలో తెలంగాణలో మొత్తం 107 స్థానాలకు గాను తెలుగుదేశం పార్టీకి 43 సీట్లు మాత్రమే వచ్చాయి. వీరిలో 39 మంది కొత్తవారు, మొదటిసారి శాసనసభకు ఎన్నికైన వారు కావడం మరో ప్రత్యేకత. కాంగ్రెస్ పక్షాన 43 మంది గెలుపొందారు. బీజేపీకి రెండు, సీపీఐకి నాలుగు, సీపీఎంకు రెండు, జనతా పార్టీకి ఒకటి, ఇండిపెండెంట్లు పది మంది గెలుచుకున్నారు. సామాజిక వర్గాల వారిగా చూస్తే మొత్తం 34 మంది రెడ్లు విజయం సాధించగా, వారిలో 14 మంది కాంగ్రెస్, పన్నెండు మంది టీడీపీ, ఇద్దరు బీజేపీ, ఇద్దరు సీపీఎం, ఒకరు జనతా, ముగ్గురు ఇండిపెండెంట్లు ఉన్నారు. కమ్మ వర్గం వారు ఏడుగురు గెలవగా వారంతా తెలుగుదేశం పక్షానే గెలిచారు. వెలమ సామాజికవర్గం వారు ఎనిమిది మంది గెలవగా వారిలో నలుగురు కాగ్రెస్, నలుగురు టిడిపి తరపున నెగ్గారు. ఎస్సీలలో ఎనిమిది మంది కాంగ్రెస్, ఏడుగురు టీడీపీ, ఇద్దరు సీపీఐ పక్షాన గెలిచారు. ఎస్టీలలో నలుగురు కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, ఇండిపెండెంట్లు ఒక్కొక్కరు చొప్పున గెలిచారు. జనరల్ సీటు బాన్స్ వాడ నుంచి టీడీపీ తరపున ఒక ఎస్టీ అభ్యర్థి గెలిచారు. బీసీలలో తొమ్మిది మంది కాంగ్రెస్, ఏడుగురు టీడీపీ, ఒకరు ఇండిపెండెంట్‌గా నెగ్గారు. ముస్లింలలో కాంగ్రెస్, టీడీపీ, సీపీఐల తరుపున ఒక్కొక్కరు గెలవగా, ఐదుగురు ఇండిపెండెంట్లు నెగ్గారు. రెడ్డి వర్గం నుంచి.. రెడ్డి సామాజికవర్గం నుంచి 34 మంది గెలిస్తే కాంగ్రెస్ నుంచే ఎక్కువ మంది గెలిచారు. టీడీపీ తరపున గెలిచిన రెడ్డి ప్రముఖులలో జానారెడ్డి ఒకరు. కాంగ్రెస్ నుంచి ఎం.బాగారెడ్డి, ఆర్.సురేంద్రరెడ్డి, శీలం సిద్ధారెడ్డి, పాల్వాయి గోవర్దన్‌రెడ్డి, టి.అంజయ్య, బీజేపీ నుంచి నల్లు ఇంద్రసేనారెడ్డి, చందుపట్ల జంగారెడ్డి ఉండగా, జనతా పార్టీ పక్షాన ఎస్.జైపాల్ రెడ్డి గెలుపొందారు. సీపీఎం నుంచి నర్రా రాఘవరెడ్డి, మల్లు స్వరాజ్యం ఉన్నారు. ఇండిపెండెంటుగా గెలిచినవారిలో పి.రామచంద్రారెడ్డి ఉన్నారు. వెలమ.. వెలమ సామాజికవర్గం నుంచి తెలుగుదేశం పక్షాన కొత్తవారు గెలిస్తే, కాంగ్రెస్ పార్టీ తరపున పాత తరం నేతలు గెలిచారు. కాంగ్రెస్ నుంచి గెలిచినవారిలో ఎన్.యతిరాజారావు, జలగం ప్రసాదరావు వంటి నేతలు ఉన్నారు. టీడీపీ, కాంగ్రెస్ నుంచి నలుగురు చొప్పున గెలిచారు. అందరూ టీడీపీ వారే.. తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత కమ్మ సామాజికవర్గం ఆ పార్టీని సొంత పార్టీగా భావించడం ఆరంభించింది. దానికి తగినట్లే తెలంగాణలో అత్యధికంగా ఏడుగురు కమ్మనేతలు ఎన్నికైతే వారంతా టీడీపీ నుంచి గెలవడం విశేషం. ఏడుగురిలో ఒక్క టి.రజనీబాబు తప్ప మిగిలిన వారంతా రాజకీయంగా కొత్తవారని చెప్పాలి. ఏడుగురు తొలిసారి ఎన్నికయ్యారు. బ్రాహ్మణ వర్గం.. బ్రాహ్మణ వర్గం నుంచి ఏడుగురు గెలిస్తే, ముగ్గురు కాంగ్రెస్, ముగ్గురు టీడీపీ వారు.ఒకరు సీపీఎం నుంచి గెలిచారు. టీడీపీ నుంచి గెలిచినవారిలో కరణం రామచంద్రరావు ప్రముఖులు. కాంగ్రెస్‌లో చకిలం శ్రీనివాసరావు, బొప్పరాజు లక్ష్మీకాంతరావు, డి.శ్రీపాదరావు గెలిచారు. సీపీఎం నేత మంచికంటి రామకిషన్ రావు గెలుపొందారు. ముస్లింలు 8 మంది.. హైదరాబాద్ పాతబస్తీ నుంచి అత్యధికంగా ఐదుగురు ముస్లిం నేతలు గెలిచారు. వారంతా మజ్లిస్ పక్షంవారే. సలావుద్దీన్ ఒవైసీ నాయకత్వంలో వారు ఉండేవారు. సీపీఐ నుంచి మహ్మద్ రజబ్ అలీ గెలిచారు. బీసీలు 17 మంది .. వెనుకబడిన తరగతుల వారిలో కాంగ్రెస్ నుంచి తొమ్మిది మంది, టీడీపీ నుంచి ఏడుగురు, సీపీఎం నుంచి ఒకరు గెలుపొందారు. టీడీపీ తెలంగాణలో బీసీలపై పట్టు సాధించలేకపోయింది. మున్నూరుకాపు, గౌడ, ముదిరాజ్ వర్గాల నుంచే ఎక్కువ మంది గెలిచారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన ప్రముఖులలో సి.జగన్నాథరావు, మాణిక్ రావు, మదన్ మోహన్ వంటి ప్రముఖులు ఉన్నారు. బీసీల నుంచి గెలిచిన టీడీపీ ఎమ్మెల్యేలంతా తొలిసారి గెలిచినవారే. సీపీఎం నేత ఓంకార్ కూడా బీసీ నేతే. ఎస్సీల్లో కాంగ్రెస్ వారే అధికం ఎస్సీల్లో కూడా కాంగ్రెస్ వారే ఎక్కువ మంది గెలిచారు. 8 మంది కాంగ్రెస్, ఏడుగురు టీడీపీ నుంచి గెలిచారు. టీడీపీలో గెలిచిన వారిలో పుట్టపాగ మహేంద్రనాథ్ తప్ప మిగిలినవారంతా కొతవారే. కాగా కాంగ్రెస్‌లో గోకా రామస్వామి, పి.శంకరరావు ఉన్నారు. సామాజిక విశ్లేషణ కొమ్మినేని శ్రీనివాసరావు -
ఓడిన ఎన్టీఆర్.. ఆసక్తి రేపిన 1989 ఎన్నికలు
తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్.టి.రామారావు ఏడేళ్ల పాలన తర్వాత (మధ్యలో నాదెండ్ల భాస్కరరావు నెల రోజులు మినహాయిస్తే) 1989 డిసెంబర్లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం సాధించింది. రాష్ట్ర అసెంబ్లీ పదవీకాలం1990 మార్చి వరకూ ఉన్నా లోక్‌సభ ఎన్నికలు ముందే రావడంతో ఎన్టీఆర్ జమిలి ఎన్నికలకే నిర్ణయం తీసుకున్నారు. రాజీవ్‌గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జాతీయస్థాయిలో ప్రతిపక్షాలతో కలిసి నడిచిన రామారావు..అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని రీతిలో పరాజయం పాలయ్యారు. టీడీపీ స్థాపించాక జరిగిన మొదటి రెండు అసెంబ్లీ ఎన్నికల్లో రెండుసార్లూ 200కిపైగా సీట్లు లభించగా, 1989 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ 74 సీట్లే దక్కించుకుని మొదటిసారి ప్రతిపక్షమైంది. లోక్‌సభ ఎన్నికల్లో తెలుగుదేశం కేవలం రెండు సీట్లే (బొబ్బిలి, నర్సాపురం) సాధించి ఘోర పరాజయం చవిచూసింది. 1983 జనవరి నుంచీ ప్రతిపక్ష స్థానానికే పరిమితమైన కాంగ్రెస్ 1989 డిసెంబర్ 3న మళ్లీ రాష్ట్రంలో అధికారం చేపట్టింది. సీనియర్ నేత, పీసీసీ(ఐ) అధ్యక్షుడు మర్రి చెన్నారెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. 1988, 89లో జరిగిన రాజకీయ పరిణామాలు, టీడీపీ సర్కారు వేసిన తప్పటడుగులు, విజయవాడలో కాంగ్రెస్ ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగారావు హత్యతో ఆయన సామాజికవర్గంలో తెలుగుదేశంపై పెల్లుబికిన వ్యతిరేకత, 1989 ఆరంభంలో ఒకేసారి తన మంత్రివర్గంలోని సభ్యులందరితో ఎన్టీఆర్ రాజీనామా చేయించడం వంటి అనేక కారణాలు టీడీపీ ఓటమికి దోహదంచేశాయి. మూడు నెలలు ముందు జరిగిన తెలుగు శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం ఓడిపోతుందని ఎక్కువ మంది రాజకీయ పరిశీలకులు ఊహించలేకపోయారు. అనంతపురం జిల్లా హిందూపురంతోపాటు మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి నుంచి కూడా పోటీచేసిన రామారావు రెండో స్థానంలో ఓడిపోవడం సంచలనం సృష్టించింది. అల్లుడికి అందలం! ఎన్టీఆర్ 1985లో మరోసారి సీఎం అయ్యాక మూడో అల్లుడు నారా చంద్రబాబు నాయుడు గుట్టు చప్పుడు కాకుండా తెలుగుదేశంలో చేరారు. ఆయనకు తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి పదవిని కూడా ఎన్టీఆర్ ఇచ్చారు. అయితే ఏ చట్ట సభలోనూ సభ్యత్వం లేని చంద్రబాబుకు కొత్తగా ఏర్పాటు చేసిన కర్షక పరిషత్ చైర్మన్ పదవి అప్పగించారు. ఈ నియామకం చెల్లదని హైకోర్టు తీర్పు ఇవ్వడం కూడా ఎన్టీఆర్‌కు, టీడీపీకి రాజకీయంగా ఇబ్బంది కలిగించింది. ప్రకాశం జిల్లా కారంచేడులో దళితులపై ఊచకోత కూడా తెలుగుదేశం ఎస్సీల్లో కొంత మేరకు మద్దతు కోల్పోవడానికి దారితీసింది. నెల్లూరు జిల్లాలో సీనియర్ నేత, మంత్రి నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డికి పార్టీ నాయకత్వంతో విభేదాలు రావడంతో పార్టీకి దూరమయ్యారు. తర్వాత ఒకేసారి మంత్రులందరినీ తొలగించినప్పుడు టీడీపీలో అంతర్గత ప్రజాస్వామ్యం కోసం ప్రయత్నం చేసిన సీనియర్ నేతలు ముద్రగడ పద్మనాభం, వసంత నాగేశ్వరరావు, కుందూరు జానారెడ్డి, కేఈ కృష్టమూర్తి వేర్వేరు సమయాల్లో పార్టీ నుంచి బయటికొచ్చి తెలుగునాడు అనే కొత్త పార్టీ ప్రారంభించారు. చివరికి ఎన్నికల ముందు వారంతా కాంగ్రెస్‌లో చేరారు. ఇంత జరిగినా పేద, బడుగు వర్గాల్లో ఎన్టీఆర్‌కు జనాకర్షణ శక్తి తగ్గలేదనీ, తెలుగుదేశమే మళ్లీ అధికారంలోకి వస్తుందని చాలా మంది అంచనావేశారు. కాని, ఏడేళ్ల తెలుగుదేశం పాలనపై జనం వ్యతిరేకంగా తీర్పు ఇచ్చి కాంగ్రెస్‌కే అధికారం కట్టబెట్లారు. జెయింట్ కిల్లర్ చిత్తరంజన్! ఈ ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి అసెంబ్లీకి పోటీచేసిన ఎన్టీఆర్ అప్పటి జనతాదళ్ నేత ఎస్ జైపాల్‌రెడ్డి సూచనతో కల్వకుర్తిలో నామినేషన్ వేసి కాంగ్రెస్ అభ్యర్థి జక్కుల చిత్తరంజన్‌దాస్ చేతిలో ఓడిపోయారు. అనంతపురం జిల్లా హిందూపురం నుంచి ఆయన రెండోసారి విజయం సాధించారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన చెన్నారెడ్డి సనత్‌నగర్ నుంచి పోటీచేసి గెలిచారు. - సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
సంక్షోభం.. మధ్యంతరం
ఆంధ్రప్రదేశ్‌లో సుదీర్ఘకాలం పాటు సాగిన కాంగ్రెస్ పాలనకు 1983 జనవరి ఎన్నికల్లో సినీనటుడు ఎన్టీ రామారావు నేతృత్వంలోని టీడీపీ అడ్డుకట్ట వేశాక అనూహ్య రాజకీయ పరిణామాల నేపథ్యంలో 1985 మార్చిలోనే ఏపీ అసెంబ్లీకి మధ్యంతర ఎన్నికలు జరిగాయి. టీడీపీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన నాదెండ్ల భాస్కరరావు సీఎం ఎన్టీఆర్‌తో విభేదించారు. రాష్ట్ర కేబినెట్లో నెంబర్ టూగా తనకు తగినంత గౌరవం లభించడం లేదని భావించిన నాదెండ్ల.. కాంగ్రెస్‌తో చేతులు కలిపారు. ఎన్టీఆర్ గుండె శస్త్రచికిత్స కోసం అమెరికా వెళ్లినపుడు ఆయన్ను గద్దె దింపే వ్యూహం పన్నారు. స్వపక్షంలోనే అసమ్మతికి కేంద్ర బిందువుగా మారిన నాదెండ్ల, ఆయన అనుయాయులను కేబినెట్ నుంచి ఎన్టీఆర్ తొలగించారు. అయితే, తనకు 91 మంది టీడీపీ ఎమ్మెల్యేలతోపాటు 57 మంది కాంగ్రెస్, ఐదుగురు ఎంఐఎం, ఇద్దరు రాష్ట్రీయ సంజయ్ మంచ్, ఆరుగురు ఇండిపెండెంట్ల మద్దతు ఉందని (మొత్తం 161 మంది ఎమ్మెల్యేలు) గవర్నర్ రాంలాల్‌కు నాదెండ్ల వినతిపత్రం సమర్పించారు. మెజారిటీ కోల్పోయినందున ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయడం, ప్రభుత్వ ఏర్పాటుకు నాదెండ్లను ఆహ్వానించడం, ఆయన ప్రమాణం చేయడం వెంటవెంటనే జరిగిపోయాయి. నెల రోజుల్లో అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవాలని నాదెండ్లకు గడువు విధించారు. స్పీకర్ తంగి సత్యనారాయణ, డిప్యూటీ స్పీకర్ భీంరెడ్డి కూడా నాదెండ్ల వర్గంలో చేరడంతో బలపరీక్ష సమయంలో ప్రోటెమ్ స్పీకర్‌ను నియమించారు. అయితే టీడీపీ నుంచి ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకునేందుకు నాదెండ్ల చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఎన్టీఆర్‌ను అప్రజాస్వామికంగా గద్దె దింపడాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ప్రజాస్వామ్య ఉద్యమాలు మొదలయ్యాయి. జనతా, సీపీఐ, సీపీఎం, బీజేపీ, లోక్‌దళ్‌తో సహా ఇతర విపక్ష పార్టీలన్నీ ఈ ఉద్యమానికి మద్దతిచ్చాయి. రాష్ట్రంలో నెలరోజుల పాటు తీవ్రస్థాయిలో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. ప్రభుత్వ పాలన పూర్తిగా స్తంభించింది. ఈ ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం దేశవ్యాప్తంగా విస్తరించింది. ఎన్టీఆర్ 161 మంది ఎమ్మెల్యేలతో ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ ముందు పరేడ్ చేయించారు. దీంతో కేంద్రం అప్రతిష్టపాలైన రాంలాల్‌ను తొలగించి శంకర్ దయాళ్శర్మను కొత్త గవర్నర్‌గా నియమించింది. దీంతోనెల రోజుల్లోనే (1984 సెప్టెంబర్) ఎన్టీ రామారావు మళ్లీ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. అయితే, మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రజాస్వామ్య పరిరక్షణ పేరిట ఇతర రాజకీయ పక్షాలు అందించిన మద్దతు, ప్రజల సహకారం వంటి సానుకూల అంశాలను పరిగణనలోకి తీసుకున్న ఎన్టీఆర్.. శాసనసభను రద్దు చేయాలని నిర్ణయించుకున్నారు. అంతేకాకుండా నాదెండ్ల వర్గంలోకి వెళ్లి వచ్చిన ఎమ్మెల్యేలు శాసనసభ్యులుగా కొనసాగడం ఇష్టం లేక అసెంబ్లీని రద్దు చేసి 1985లో మధ్యంతర ఎన్నికలకు వెళ్లారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ ముందు ఎమ్మెల్యేల పరేడ్ లోక్‌సభ ఎన్నికల్లోనూ తెలుగుదేశం సత్తా... తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి ఏపీలో అధికారంలోకి వచ్చాక, తొలిసారి 1984లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 30 సీట్లు గెలుచుకుని సత్తా చాటింది. ప్రధాని ఇందిరాగాంధీ హత్యకు గురైన నేపథ్యంలో జరిగిన ఈ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా సానుభూతి పవనాలు పెల్లుబికినా ఏపీలో అవేమీ పనిచేయలేదు. కాంగ్రెస్ కేవలం ఆరు సీట్లకే పరిమితమైంది. సీపీఐ, సీపీఎం, జనతా, బీజేపీ, ఎంఐఎం, ఐసీఎస్ చెరో సీటు గెలుచుకున్నాయి. కోస్తా, రాయలసీమ ప్రాంతాల నుంచి టీడీపీ టికెట్‌పై గెలిచినవారిలో పి.ఆనందగజపతిరాజు (బొబ్బిలి), భాట్టం శ్రీరామమూర్తి (విశాఖపట్నం), భూపతిరాజు విజయ కుమారరాజు (నరసాపూర్), వడ్డే శోభనాద్రీశ్వరరావు (విజయవాడ), నిశ్శంకరరావు వెంకటరత్నం( తెనాలి), ఎన్పీ ఝాన్సీలక్ష్మి (చిత్తూరు), ఎరాసు అయ్యపురెడ్డి (కర్నూలు) ఉన్నారు. కాంగ్రెస్ నుంచి కావూరు సాంబశివరావు (మచిలీపట్నం), ఆచార్య ఎన్జీరంగా (గుంటూరు), సీపీఐ నుంచి సోడే రామయ్య (భద్రాచలం–ఎస్టీ), ఐసీఎస్ అభ్యర్థిగా వైరిచర్ల కిషోర్‌చంద్రదేవ్ (పార్వతీపురం–ఎస్టీ) విజయం సాధించారు. ఓడిన ప్రముఖులు... కాంగ్రెస్ నుంచి ఓడిన వారిలో కాసు బ్రహ్మానందరెడ్డి (నరసారావుపేట), కోట్ల విజయభాస్కరరెడ్డి (కర్నూలు), పెండేకంటి వెంకటసుబ్బయ్య (నంద్యాల), చెన్నుపాటి విద్య(విజయవాడ), సింగం బసవపున్నయ్య (తెనాలి), నల్లారి అమరనాథరెడ్డి (చిత్తూరు) ఉన్నారు. తెలంగాణలో గెలిచిన ప్రముఖులు... మాజీ ముఖ్యమంత్రులు టి.అంజయ్య (కాంగ్రెస్–సికింద్రాబాద్), జలగం వెంగళరావు (కాంగ్రెస్– ఖమ్మం)తో పాటు సూదిని జైపాల్‌రెడ్డి (జనతాపార్టీ–మహబూబ్‌నగర్), సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ (హైదరాబాద్), జె.చొక్కారావు (కరీంనగర్), చందుపట్ల జంగారెడ్డి (బీజేపీ–హనుమకొండ), టి.కల్పనాదేవి (టీడీపీ–వరంగల్), భీంరెడ్డి నర్సింహారెడ్డి (సీపీఎం–మిర్యాలగూడ) గెలుపొందారు. ఓడినవారిలో మాజీ సీఎంలు పీవీ నరసింహారావు (కాంగ్రెస్–హనుమకొండ), మర్రి చెన్నారెడ్డి (ఎన్డీపీఐ–కరీంనగర్), పి.శివశంకర్ (కాంగ్రెస్–మెదక్), ఎం.మల్లికార్జున్ (కాంగ్రెస్–మహబూబ్‌నగర్), మల్లు అనంతరాములు (కాంగ్రెస్–నాగర్‌కర్నూలు–ఎస్సీ) నంది ఎల్లయ్య (కాంగ్రెస్–సిద్దిపేట), కమాలుద్దీన్ అహ్మద్ (కాంగ్రెస్ –వరంగల్), నల్లమల గిరిప్రసాద్ (సీపీఐ–ఖమ్మం), పరసా సత్యనారాయణ (సీపీఎం–ఖమ్మం), చకిలం శ్రీనివాసరావు (కాంగ్రెస్ –మిర్యాలగూడ), బండారు దత్తాత్రేయ (బీజేపీ–సికింద్రాబాద్), వి.హనుమంతరావు (కాంగ్రెస్ –హైదరాబాద్) ఉన్నారు. నాదెండ్లతో సీఎంగా ప్రమాణం చేయిస్తున్న రామ్‌లాల్ కూటమిలో కామ్రేడ్లు, కమలనాథులు.. ఈ ఎన్నికల్లో పరస్పర విరుద్ధ రాజకీయ సిద్ధాంతాలున్న వామపక్షాలు, బీజేపీ, జనతా పార్టీలను కలుపుకుని ఎన్టీఆర్ కూటమిని రూపొందించారు. ఆగస్టు సంక్షోభం సందర్భంగా టీడీపీకి చేదోడువాదోడుగా నిలిచిన సీపీఐకు 15, సీపీఎంకు 12, బీజేపీకి 10, జనతాపార్టీకి 5 సీట్లు కేటాయించారు. మొత్తం 249 సీట్లకు పోటీ చేసిన టీడీపీ 202 స్థానాల్లో గెలవగా, కేవలం రెండుచోట్ల మాత్రమే డిపాజిట్ కోల్పోయింది. సీపీఐ, సీపీఎం చెరో 11 సీట్లు, బీజేపీ 8, జనతా 3 సీట్లు గెలుపొందాయి. ఈ నాలుగు పార్టీల నుంచి పోటీచేసిన అభ్యర్థులంతా ధరావతు దక్కించుకోవడం విశేషం. లోక్‌దళ్ 14 సీట్లకు పోటీ చేసి అన్నిచోట్లా డిపాజిట్‌ను కోల్పోయింది. మరోవైపు కాంగ్రెస్ మొత్తం 292 సీట్లకు పోటీపడి 50 స్థానాలు దక్కించుకుంది. 19 చోట్ల డిపాజిట్లు దక్కలేదు. 1983 ఎన్నికలతో పోల్చితే ఆ పార్టీ బలం పదిసీట్ల మేర తగ్గింది. ఎంఐఎం ఏడు స్థానాల్లో పోటీ చేసి ఐదు చోట్ల గెలుపొందింది. స్వతంత్ర అభ్యర్థులుగా పోటీచేసిన 1,337 మందిలో అత్యధికశాతం ధరావతు కోల్పోయారు. బడ్జెట్ వివరాలు లీక్.. కేబినెట్ ఔట్... శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందే దానికి సంబంధించిన వివరాలు కొన్ని తెలుగుపత్రికల్లో ముందుగానే లీక్ అయ్యాయనే కోపంతో 1989 ఆరంభంలో ఎన్టీ రామారావు మంత్రుల నుంచి రాజీనామాలు స్వీకరించి 23 మంది కొత్తవారితో కేబినెట్ ఏర్పాటుచేశారు. దీంతో కేఈ కృష్ణమూర్తి, వసంత నాగేశ్వరరావు తదితర మంత్రులు అసెంబ్లీకి రాజీనామా చేయగా, కుందూరు జానారెడ్డి పార్టీకి కూడా రాజీనామా చేశారు. ఎన్టీఆర్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయం పార్టీలో తీవ్ర అసంతృప్తికి దారితీసింది. తెలంగాణ నుంచి ఒకే మహిళ... ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలు కలిపి (అన్ని పార్టీల నుంచి) అత్యధిక సంఖ్యలో 66 మంది మహిళలు పోటీచేయగా.. పదిమందే గెలుపొందారు. వారిలో కోస్తా, రాయలసీమ ప్రాంతాల నుంచి 9 మంది గెలవగా, తెలంగాణ నుంచి ఒక్కరే ఉన్నారు. తెలంగాణ నుంచే 24 మంది (15 మంది ఇండిపెండెంట్లు) పోటీచేశారు. కాంగ్రెస్ అభ్యర్థులు ఏడుగురు, టీడీపీ నుంచి ఇద్దరు బరిలో నిలిచారు. షాద్‌నగర్ (ఎస్సీ) సీటు నుంచి ఎం.ఇందిర (టీడీపీ) గెలుపొందారు. ఈ ప్రాంతం నుంచి మొత్తం 17 మందికి ధరావతు కూడా దక్కలేదు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ (ఎస్సీ) స్థానం నుంచి ఇండిపెండెంట్లుగా పోటీ చేసిన జెట్టి ఈశ్వరీబాయి, కేపీ జయశ్రీ డిపాజిట్లు కోల్పోయారు. గెలిచిన, ఓడిన ప్రముఖులు... ఈ ఎన్నికల్లో సీఎం ఎన్టీ రామారావు మూడుచోట్ల (గుడివాడ, హిందూపురం, నల్లగొండ) నుంచి పోటీచేసి గెలుపొందారు. హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా కొనసాగారు. మహరాజ్‌గంజ్ నుంచి గెలిచిన సీనియర్ న్యాయవాది జి.నారాయణరావు (టీడీపీ) ఆ తర్వాత సభాపతిగా నియమితులయ్యారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు (టీడీపీ) సిద్దిపేట నుంచి 15వేలకు పైగా మెజారిటీతో మొదటిసారి గెలుపొందారు. నరసాపూర్ నుంచి చిలుముల విఠల్‌రెడ్డి (సీపీఐ) సి.జగన్నాథరావు (కాంగ్రెస్)పై విజయం సాధించారు. జహీరాబాద్ నుంచి ఎం.బాగారెడ్డి గెలిచారు. ఆందోల్ (ఎస్సీ) సీటు నుంచి సి.రాజనర్సింహ (కాంగ్రెస్)పై మల్యాల రాజయ్య (టీడీపీ) విజయం సాధించారు. జీవీ సుధాకరరావు (కాంగ్రెస్– లక్సెట్టిపేట), దుద్దిళ్ల శ్రీపాదరావు (కాంగ్రెస్–మంథని), చెన్నమనేని రాజేశ్వరరావు (సీపీఐ–సిరిసిల్ల) చెన్నమనేని విద్యాసాగరరావు (బీజేపీ–మెట్పల్లి), కుందూరు జానారెడ్డి (కాంగ్రెస్–చలకుర్తి) నాగం జనార్దనరెడ్డి (టీడీపీ–నాగర్‌కర్నూలు), చిట్టెం నర్సిరెడ్డి ( మక్తల్–జనతాపార్టీ), నర్రారాఘవరెడ్డి (సీపీఎం–నకిరేకల్) దేశిని చినమల్లయ్య (సీపీఐ–ఇందుర్తి), నెమురుగొమ్ముల యతిరాజారావు (టీడీపీ–చెన్నూరు), కొప్పుల హరీశ్వర్‌రెడ్డి (టీడీపీ–పరిగి), పి.ఇంద్రారెడ్డి (చేవెళ్ల–టీడీపీ), నాయిని నర్సింహారెడ్డి (జనతాపార్టీ), ఆలె నరేంద్ర (బీజేపీ–హిమాయత్‌నగర్), మహ్మద్ రజబ్ అలీ (సీపీఐ–సుజాతనగర్), రావుల రవీంద్రనాథ్‌రెడ్డి (బీజేపీ–ఆలంపూర్), శ్రీపతి రాజేశ్వర్ (టీడీపీ–సనత్‌నగర్), అల్లాడి పి.రాజ్‌కుమార్ (టీడీపీ–సికింద్రాబాద్), పి.జనార్దనరెడ్డి (కాంగ్రెస్–ఖైరతాబాద్), నల్లు ఇంద్రసేనారెడ్డి (బీజేపీ–మలక్‌పేట), బద్ధం బాల్‌రెడ్డి (బీజేపీ–కార్వాన్) ,కరణం రామచంద్రరావు (టీడీపీ–మెదక్), ఎలిమినేటి మాధవరెడ్డి (టీడీపీ–భువనగిరి), ఎస్.వేణుగోపాలాచారి (టీడీపీ–నిర్మల్), గుండా మల్లేష్ (సీపీఐ–ఆసిఫాబాద్ ఎస్సీ), సి.ఆనందరావు (టీడీపీ–కరీంనగర్), జి.రాజేశం గౌడ్ (టీడీపీ–జగిత్యాల), రామసహాయం సురేందర్‌రెడ్డి (కాంగ్రెస్–డోర్నకల్), మద్దికాయల ఓంకార్ (నర్సంపేట–ఎంసీపీఐæ), వన్నాల శ్రీరాములు (బీజేపీ–వర్థన్నపేట), అజ్మీరా చందూలాల్ (టీడీపీ–ములుగు ఎస్టీ), కుంజా బొజ్జి (సీపీఎం–భద్రాచలం ఎస్టీ), చందా లింగయ్య (కాంగ్రెస్–బూర్గుంపహాడ్), తుమ్మల నాగేశ్వరరావు (టీడీపీ–సత్తుపల్లి), బోడెపూడి వెంకటేశ్వరరావు (సీపీ ఎం–మధిర), గుమ్మడి నర్సయ్య (సీపీఐఎంఎల్–ఇల్లెందు ఎస్టీ), ఉజ్జిని నారాయణరావు ( సీపీఐ– మునుగోడు) విజయపతాకం ఎగురవేశారు. ఓడిన అభ్యర్థులు... ప్రజాస్వామ్య తెలుగుదేశం టికెట్‌పై పోటీచేసిన నాదెండ్ల భాస్కరరావు (మలక్‌పేట), మల్లుస్వరాజ్యం (సీపీఎం–తుంగతుర్తి), కాంగ్రెస్ నుంచి డీకే సమరసింహారెడ్డి (గద్వాల), జి.చిన్నారెడ్డి (వనపర్తి), శనిగరం సంతోష్‌రెడ్డి (ఆర్మూరు), జి.గడ్డెన్న (ముథోల్), గీట్ల ముకుందరెడ్డి (పెద్దపల్లి), వి.జగపతిరావు (కరీంనగర్), పొన్నాల లక్ష్మయ్య (జనగామ), రాంరెడ్డి వెంకటరెడ్డి (సుజాతనగర్),రాగ్యానాయక్ (చలకుర్తి) ఓటమి చవిచూశారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ఎన్టీఆర్ తర్వాత అడుగు పెట్టని సీఎంలు
సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రుల పదవికి కేజీహెచ్ ఎసరు పెడుతుందా? కేజీహెచ్‌ను సందర్శించిన సీఎంలకు పదవీ గండం కలుగుతుందా? ఇది ఎంత వరకు వాస్తవమో తెలియదు గాని.. ముఖ్యమంత్రులు కేజీహెచ్ వైపు తొంగి చూడడం లేదు. ఏడాది రెండేళ్ల నుంచి కాదు.. దాదాపు 23 ఏళ్ల నుంచి అడుగు పెట్టడం లేదు. 1995లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు కేజీహెచ్‌ను సందర్శించారు. ఇక్కడ నుంచి వెళ్లిన వెంటనే అల్లుడు చంద్రబాబునాయుడు ఆయనను వెన్నుపోటు పొడవడంతో పదవీచ్యుతుడయ్యారు. ఇక అప్పట్నుంచి ఒక్క ముఖ్యమంత్రి కూడా కేజీహెచ్‌కు వచ్చే సాహసం చేయలేకపోతున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా గతంలో రెండు మూడు పర్యాయాలు కేజీహెచ్‌ను ఆకస్మిక తనిఖీలు చేయడానికి సిద్ధపడ్డారు. ఇంతలో కేజీహెచ్‌కు వచ్చిన సీఎంలు పదవులు పోగొట్టుకున్నారని, ఎమ్మెల్యేలు వద్దని వారించారు. దీంతో ఆఖరి నిమిషంలో ఆ సందర్శనను రద్దు చేసుకున్నారు. తాజాగా శ్రీకాకుళం పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం రాత్రి విశాఖ వచ్చారు. టీడీపీకి చెందిన ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి అనారోగ్యం పాలవడంతో ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. అటు నుంచి వచ్చేటప్పుడు కేజీహెచ్‌ను ఆకస్మిక తనిఖీ చేస్తారంటూ ఆస్పత్రి అధికారులకు సమాచారం అందింది. దీంతో కలవరపడ్డ కేజీహెచ్ అధి కారులు రాత్రి విధుల్లో ఉండేæ వైద్యులను అప్రమత్తం చేశారు. అంతా విధుల్లో ఉండాలని, రోగులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చూడాలని సెల్‌ఫోన్ మెసేజీలను పంపారు. ఇంతలో కొంతమంది ఎమ్మెల్యేలు సీఎంను కేజీహెచ్‌కు వెళ్లే సాహసం చేయవద్దని, వెళ్తే పదవీ గండం ఖాయమని చెప్పడంతో ఆయన నిర్ణయాన్ని మార్చుకున్నట్టు తెలిసింది. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు కేజీహెచ్‌కు రావడం లేదని అధికారుల నుంచి సమాచారం వచ్చిం ది. దీంతో వైద్యులు ఊపిరి పీల్చుకున్నారు! -
వంగవీటి పేరును పరిశీలించాలి
గాంధీనగర్(విజయవాడ): గన్నవరం విమానాశ్రయానికిగానీ, పశ్చిమ కృష్ణాజిల్లాకు గానీ వంగవీటి మోహనరంగా పేరు పెట్టాలని అమరావతి రాష్ట్ర కాపునాడు అధ్యక్షుడు సుంకర శ్రీనివాసరావు (కబడ్డి శ్రీను) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గవర్నర్‌పేటలోని కాపునాడు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేదల అభ్యున్నతికి వంగవీటి మోహనరంగా ఎంతో కృషి చేశారన్నారు. అయన చేసిన సేవలకు గుర్తింపుగా గన్నవరం విమానాశ్రయానికి రంగా పేరు పెట్టి గౌరవించాలని డిమాండ్ చేశారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి, ఎన్టీ రామారావు, వంగవీటి మోహనరంగా ఈ ముగ్గురు వ్యక్తులే రాష్ట్రంలో పేదల అభ్యున్నతికి పాటుపడ్డారన్నారు. అటువంటి వారిని గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. తాము అధికారంలోకి రాగానే కృష్ణాజిల్లాకు ఎన్టీ రామారావు పేరు పెడతామని ప్రతిపక్షనేత జగన్ మోహన్‌రెడ్డి ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పేదలకు సేవచేసిన ఆయన పేరును జిల్లాకు పెడతామని ప్రకటించడం సరైన నిర్ణయం అన్నారు. సీఎం చంద్రబాబు చేయలేని పని జగన్ మోహన్‌రెడ్డి చేస్తాననడం సంతోషకరమన్నారు. కాపులను బీసీల్లో చేరుస్తానని చంద్రబాబు హామీ ఇచ్చి కాపులను మోసం చేశారన్నారు. హడావిడిగా తీర్మానం చేసి కేంద్రానికి పంపి ఆ విషయాన్ని మరుగున పడేశారన్నారు. కాపులు చంద్రబాబును నమ్మే పరిస్థితి లేదన్నారు. కాపులను చంద్రబాబు అనేక కష్టనష్టాలకు గురి చేశారన్నారు. గన్నవరం ఎయిర్‌పోర్టుకు వంగవీటి రంగా పేరును చంద్రబాబు ప్రభుత్వం పెడుతుందన్న నమ్మకం తమకు లేదన్నారు. 2019లో జగన్ మోహన్‌రెడ్డి అధికారంలోకి రాగానే తమ ప్రతిపాదనను పరిశీలించాలని కోరారు. జగన్‌పై తమకు అపారనమ్మకం ఉందన్నారు. రంగా పేరు పెడితే ఆయనను అభిమానించే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలంతా వైఎస్సార్సీపీకి అండగా నిలబడతారన్నారు. సమావేశంలో కాపునాడు నాయకులు జి.పానక్‌దేవ్, ఒగ్గు విక్కి, తాడికొండ విజయలక్ష్మి, రాంబాబు, రామ్మోహన్ పాల్గొన్నారు. -
వలదన్న వినదీ మనసు కలనైన నిన్నే తలచు
‘ఏమో ఏమో ఇది నాకేమొ ఏమొ అయినది’.... ‘అగ్గిపిడుగు’లో ఎన్టీఆర్ పక్కన కృష్ణకుమారి పాడుతూ ఉంటే ఆ జంట బాగుందనిపిస్తుంది. కురులు విరబోసుకుని, ముడి దగ్గర నక్షత్రం లాంటి ఆభరణం పెట్టుకుని ఆమె పాడుతుంటే ఏ మగాడికైనా ‘కురులలో– నీ కురులలో– నా కోరికలూగినవి’ అనే అనాలపిస్తుంది. ఈ పాట ఎంత హిట్టంటే చాలా ఆర్కెస్ట్రాలు నేటికీ ఆ పాట పాడుతూనే ఉంటాయి. ఎన్టీఆర్‌కు కృష్ణకుమారి అంటే ఆకర్షణ. అందుకే గుర్రం ఎక్కి వెతుక్కుంటూ ’‘వగలరాణివి నీవే అని ‘బందిపోటు’లో పాడుకున్నాడు. ఆమెకు దూరంగా ఉండటం వల్ల ‘ఊహలు గుసగుసలాడే నా హృదయము ఊగిసలాడే’ అని విరహం అనుభవించాడు. కృష్ణకుమారి మాత్రం తక్కువా? ఆమెకు కూడా ఎన్టీఆర్ అంటే చాలా అభిమానం. అందుకే ‘కోవెల ఎరుగని దేవుడు కలడని’ అంటూ ‘తిక్క శంకరయ్య’లో అతడిని దేవుడిలా ఆరాధించింది. అతను పక్కన ఉన్నప్పుడు ‘మనసు పాడింది సన్నాయి పాట’ అంటూ ‘పుణ్యవతి’లో మురిసి పోయింది. ‘మబ్బులో ఏముంది నా మనసులో ఏముంది’ తెలుసుకోమంటూ ‘లక్షాధికారి’లో తొందర పెట్టింది. ఎన్టీఆర్‌తో ‘పల్లెటూరి పిల్ల’తో మొదలైన కృష్ణకుమారి తెర అనుబంధం దాదాపు 25 సినిమాల వరకూ సాగింది. ఇక అక్కినేని, కృష్ణకుమారిది రొమాంటిక్ పెయిర్. ఆమెను చూసి అతడు ‘ఈ మౌనం ఈ బిడియం ఇదేనా ఇదేనా చెలియ కానుక’ అని ‘డాక్టర్ చక్రవర్తి’లో సాగుతున్న ట్రైన్లో కిటికీ పక్కన చేరి పాడుకోవడం మనమెలా మర్చిపోగలం? ‘నువ్వంటే నాకెందుకో అంత ఇది’ అని ఏయన్నార్ ‘అంతస్తులు’ సినిమాలో ఆమె కోసం పడి చచ్చినట్టుగా మరెవరి కోసమూ పడి చావలేదు. ‘చెలికాడు నిన్నే రమ్మని పిలువ చేర రావేలా’ అని ‘కులగోత్రాలు’లో ప్రాధేయ పడినట్టుగా ఎవ్వరినీ ప్రాధేయపడలేదు. ఏయన్నార్ కోమల మనస్కుడు. సున్నిత హృదయడు. అతడిని నిరాకరించడం తగదు. అందుకే ఆమె కూడా అతడి ప్రేమను అర్థం చేసుకుంది. ‘నా కంటి పాపలో నిలిచిపోరా’ అని ‘వాగ్దానం’లో అతడిని కోరింది. ‘నీతోటే ఉంటాను శేషగిరి బావా నీ మాటే వింటాను మాటకారి బావా’ అంటూ ‘జమిందార్’లో మాట ఇచ్చింది. ‘పులకించని మది పులకించెను’ అంటూ ‘పెళ్లికానుక’లో ఫైనల్‌గా అతడి ప్రేమను యాక్సెప్ట్ చేసింది. తెలుగు సూపర్ స్టార్స్ ఎన్టీఆర్, ఏయన్నార్ ఇద్దరూ కృష్ణకుమారితో హిట్ సినిమాలు చేశారు. ఆమె ప్రమేయం పెర్ఫార్మెన్స్ కోసం కంటే గ్లామర్ కోసమే ఎక్కువ అవసరమని ఇండస్ట్రీ భావించింది. పాటలలో ఆ రోజులలో కృష్ణకుమారి చాలా హుషారుగా కనిపించేది. తెల్లచీర కట్టుకుని ఆమె చేసిన పాటలు జనాన్ని ఉడుకులాడించాయి. ‘తెల్లచీర కట్టుకున్నది ఎవరి కోసము’ పాటలో ఏయన్నార్‌తో, ‘దేవతయే దిగి వచ్చి మనషులలో కలిసిన కథ’ పాటలో ఎన్టీఆర్‌తో ఆమె తెల్ల చీరలో కనిపిస్తుంది. కృష్ణకుమారి డ్యాన్సింగ్ టాలెంట్ చూడాలంటే ‘పునర్జన్మ’లోని ‘దీపాలు వెలిగె పరదాలు తొలిగె’ పాటలో చూడాలి. అంత పొడగరి వెన్నును విల్లులా వంచి నర్తిస్తుంటే కళ్లార్పబుద్ధి కాదు. కృష్ణకుమారి పాటలలో కూడా కొన్ని తమాషాలు జరిగాయి. ఒకసారి ఒక పాట షూటింగ్ ఉందనగా కృష్ణకుమారి జ్ఞానదంతం వాచి దవడ పొంగిపోయింది. షూటింగ్ తప్పించుకోవడానికి వీల్లేదు. అవతల రిలీజ్ డేట్ పెట్టుకున్నారు. ఇక ఆమె ఆలోచన చేసి చెంపల మీదకు వచ్చేలా స్కార్ఫ్ కట్టుకుని పాట పాడింది. జనం అది కొత్త ఫ్యాషన్ అనుకున్నారు. మెచ్చుకున్నారు. ఆ పాట ‘చదువుకున్న ఆమ్మాయిలు’లోని– ‘కిలకిల నవ్వులు చిలికిన’... ఆ తర్వాత ఆమె కాంతారావుతో కూడా చాలా డ్యూయెట్స్ పాడింది. ‘ఇద్దరు మొనగాళ్లు’, ‘గురువును మించిన శిష్యుడు’, ‘పేదరాశి పెద్దమ్మ’ లాంటి చాలా సినిమాల్లో వాళ్లిద్దరి పాటలు ఉన్నాయి. అయితే కృష్ణకుమారి పొడగరి. ‘చిలకా గోరింక’తో కృష్ణంరాజు వచ్చేంతవరకూ ఆమెకు ఈడూ జోడూలాంటి హీరో దొరకలేదనే చెప్పాలి. తన కాలంలో సావిత్రి, జమున సూపర్ స్టార్స్‌గా చెలామణి అవుతున్నా తన మర్యాదకరమైన వాటా తాను తీసుకోగలిగింది కృష్ణకుమారి. అన్నట్టు సావిత్రిని టీజ్ చేస్తూ అక్కినేనితో కలిసి ‘అభిమానం’లో ఆమె పాడిన ‘ఓహో బస్తీ దొరసాని ఆహా ముస్తాబయ్యింది’... కూడా చాలా పెద్ద హిట్టే. సావిత్రితో కలిసి కృష్ణకుమారి ‘వరకట్నం’లోనూ నటించింది. ఈ సీజనల్ హిట్స్ మధ్యలోనే కృష్ణకుమారిని తలుచుకోవడానికి ఇంకో మంచి పాట కూడా ఉంది. చాలా ఆహ్లాదకరమైన పాట. ఏమిటో గుర్తుందా? ‘కానిస్టేబుల్ కూతురు’లోని ‘చిగురాకుల ఊయలలో ఇల మరచిన ఓ చిలుకా’... పట్టీల పాదాలతో పరిగెడుతూ కృష్ణకుమారి ఆ అరటి పాదుల పెరడులో పాడుతుంటే చూడముచ్చటగా ఉంటుంది. ఆ తోటలో పాదులు తీస్తూ అన్నగా నటిస్తున్న జగ్గయ్య íపీబీ శ్రీనివాస్ గొంతులో ‘మా చెల్లెలు బాల సుమా ఏమెరుగని బేల సుమా’ అనడం ఎంతో మురిపెంగా అనిపిస్తుంది. కాలానిది అనంతమైన పల్లవి. అంతులేని చరణం. నడుమ దొరికిన, ఇవ్వబడిన సమయంలో కృష్ణకుమారి తన పాట తాను అందంగా పాడి ముగించింది. ఆ తెర వెలుగుకు సెలవు. – కె -
ద్రోహం @ బాబు.కామ్
-
ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి: బాలకృష్ణ
బంజారాహిల్స్ : తెలుగుజాతి అభ్యున్నతికై పాటుపడ్డ మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని ఆయనకు భారత రత్న ఇవ్వాలని ఈ దిశగా ఇప్పటికే కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నామని హీరో బాలకృష్ణ స్పష్టం చేశారు. ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకొని బుధవారం బంజారాహిల్స్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో ఆయన విగ్రహానికి పుష్పాంజలి ఘటించి పేద రోగులకు పండ్లు, దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచారని అన్నారు. దేశ రాజకీయాల్లో కొత్త ఒరవడి సృష్టించిన నాయకుడిగా విభిన్న సినీ తారగా సామాజిక సేవకుడిగా భారతావనికి సేవలు అందించారని అన్నారు. బాలకృష్ణ అభిమాని గోపీచంద్ క్యాన్సర్ పేషంట్ల సహాయార్థం రూ.లక్ష చెక్కును బాలకృష్ణకు అందజేశారు. ఆశాకుమారి అనే మహిళ రూ.50 వేల చెక్కును అందజేశారు. ఎన్టీఆర్ అమరజ్యోతి ర్యాలీ సనత్‌నగర్: ఎన్టీఆర్ అభిమాన సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఎన్టీఆర్ అమరజ్యోతి ర్యాలీని నిర్వహించారు. సినీహీరో , ఎమ్మెల్యే బాలకృష్ణ, టీడీపీ నేతలు రమణ, రేవంత్‌రెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి, నగర నాయకులు ఎంఎన్‌శ్రీనివాస్, సారంగపాణి తదితరులు పాల్గొన్నారు. మొదట బేగంపేట్ రసూల్ చౌరస్తాలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం శాంతికపోతాలను గాలిలోకి ఎగురవేసి ఎన్టీఆర్ ఘాట్ వరకు కొనసాగే అమరజ్యోతి ర్యాలీని ప్రారంభించారు. మాజీ ఎమ్మెల్యే, ఎన్టీఆర్ అభిమాన సంఘం వ్యవస్థాపకుడు శ్రీపతి రాజేశ్వర్ ప్రారంభించిన అమరజ్యోతి ర్యాలీని ఆయన తనయుడు శ్రీపతి సతీష్, కుటుంబసభ్యులు 21 ఏళ్లుగా నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు బీఎన్‌రెడ్డి, దీపక్‌రెడ్డి, సనత్‌నగర్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి కూన వెంకటేష్‌గౌడ్, ఎన్టీఆర్ అభిమాన సంఘం అధ్యక్షుడు శ్రీపతి సతీష్, గంగాధర్‌గౌడ్, కానూరి జయశ్రీ, బాస కృపానందం తదితరులు పాల్గొన్నారు. -
ఆయన మృతి.. వెంటాడే స్మృతి
డేట్లైన్ హైదరాబాద్ ఎన్టీఆర్ చనిపోయినప్పుడు అంత హడావుడి చేసిన చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ ఆ తరువాత ఆయనను పూజించారా? ఎన్టీఆర్ ఫొటోలు ఎక్కడా కనిపించకుండా కొంతకాలం పాటు జాగ్రత్తపడ్డ విషయం రేవంత్‌కు తెలియక పోవచ్చు. ఆయన ఫొటోలు సచివాల యంలో, ప్రభుత్వ కార్యాలయాల్లో రాష్ట్ర వ్యాప్తంగా పాత సామాను గదుల్లో, పనికిరాని వస్తువుల మధ్యనా, విరిగిన కుర్చీలు, బల్లల మధ్యన చాలా రోజులు పడి ఉన్న విషయం పత్రికలు ఫొటోలతో సహా ప్రచురించిన విషయం కూడా రేవంత్‌కు తెలియకపోవచ్చు. జనవరి 18, 1996. సరిగ్గా ఇరవై ఒక్క ఏళ్ల క్రితం ఇదేరోజు తెల్లవారు జామున ఫోన్ మోగింది. ఫోన్ ఎత్తి్తతే అవతల ముఖ్యమంత్రి నారా చంద్ర బాబునాయుడు దగ్గర ప్రధాన పౌర సంబంధాల అధికారిగా పనిచేస్తున్న విజయ్‌కుమార్. ఆందోళన ధ్వనించే గొంతుతో ‘‘బాసూ! ఎన్టీ రామారావు గారు చనిపోయారు, వెంటనే బయలుదేరి ఆయన ఇంటికి రాగలవా!’’ బతి మాలుతున్నట్టు అడిగాడు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చనిపోయిన వార్త ఆయన శత్రు శిబిరం నుంచి రావడం ఏంటి అని ఒక్కక్షణం సందేహం వచ్చింది. నమ్మశక్యంగా లేదు. అంతకుముందు సాయంత్రమే ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్‌కు నేనూ వెళ్లాను. ఆరోగ్యంగా కనిపించారు. వెన్నుపోటు పొడిచి తన నుంచి∙అధికారం లాక్కున్న చంద్రబాబు మీద మరోసారి విరుచుకు పడ్డారు. రాత్రికి రాత్రి ఏం జరిగి ఉంటుంది? ఆలోచనల్లో ఉండగానే విజయ్ కుమార్ మళ్లీ ‘‘బాసూ! సీఎం బయలుదేరి వెళ్లారు, ఎన్టీఆర్ ఇంటికి. అక్కడ ఏం జరుగుతుందో ఏమో, సీనియర్ జర్నలిస్టులంతా ఉంటే మంచిది’’ అన్నాడు. నాకు అర్థమైంది. ఎన్టీఆర్ చనిపోయాడని తెలిస్తే ఆయన అభిమానులు అక్కడికి చేరుకుంటారు. కొద్దిమాసాల క్రితమే తమ అభిమాన నేత నుంచి అధికారం లాక్కున్నాడన్న ఆగ్రహంతో చంద్రబాబును అడ్డుకోవచ్చు. దాడి కూడా చేయొచ్చు. పరిస్థితి తప్పకుండా ఉద్రిక్తంగా మారే అవకాశం ఉంది. వెంటనే స్కూటర్ వేసుకుని బంజారాహిల్స్‌లో ఆయన ఇంటికి వెళ్లాను. అప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అక్కడికి చేరుకో వడం, ఎన్టీఆర్ మాత్రమే కూర్చునే సింహాసనం లాంటి కుర్చీలో కూర్చుని పరిస్థితిని తన అదుపులోకి తెచ్చుకునే పనిలో పడటం కనిపించింది. బంజా రాహిల్స్ ఇంటి నుంచి ఆయన మృతదేహాన్ని ఫతేహ్ మైదాన్ స్టేడియంకు తరలించే ప్రయత్నాలు కూడా మొదలు పెట్టేశారు. ఒకరొకరు మీడియా వాళ్లు కూడా అక్కడికి చేరుకున్నారు. సమయం గడుస్తూ ఉంటే సందర్శకులు కూడా పెరుగుతారు. మృతదేహం అక్కడే ఉంటే పరిస్థితి తమ అదుపులో లేకుండా పోయే అవకాశం ఉంది, కాబట్టి అక్కడి నుంచి తరలిస్తే వ్యవహారం ప్రభుత్వ అదుపులోకి వస్తుందనేది చంద్రబాబు ఆలోచన. బంజారాహిల్స్ ఇల్లు అప్ప టికి ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి అధీనంలో ఉంది కాబట్టి ఆమె దగ్గరి నుంచి ఆయన lమృతదేహాన్ని దూరం చేసేందుకు, తరువాత జరిగే తంతులో ఆమె పాత్ర లేకుండా జాగ్రత్త పడేందుకు చేసిన ఆలోచన అది. దృశ్యమానమైన శవ రాజకీయాలు శవ రాజకీయాలు అంటుంటాం. అవి ఎట్లా ఉంటాయో ఎన్టీ రామారావు మృతి సందర్భంగా కళ్లారా చూశాం. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు అందరూ ఇంకా అక్కడికి చేరుకోక ముందే ఆయన పార్థివ దేహాన్ని ఫతేహ్ మైదాన్‌లో లాల్ బహదూర్ స్టేడియంకు తరలించేశారు. విదేశీ పర్యటనలో ఉన్న అప్పటి రవాణ శాఖ మంత్రి, ఎన్టీఆర్ కుమారుడు హరికృష్ణ హుటాహుటిన తిరిగొ చ్చిన క్షణం నుంచి లక్ష్మీపార్వతిని దూరం పెట్టారు. ఆ మరునాడు నెక్లెస్ రోడ్లో ఆయన అంత్యక్రియలు జరిపిన చోటు వరకూ సాగిన ఊరేగింపులో కూడా లక్ష్మీపార్వతిని ప్రధాన వాహనం మీదకు రానివ్వకుండా జాగ్రత్త పడ్డారు. ఆ కార్యక్రమం వరకు ఎన్టీఆర్ వారసులం తామే అని ప్రదర్శించు కునే విషయంలో చంద్రబాబు వ్యూహం విజయవంతమైంది. 1995 ఆగస్ట్‌లో వైస్రాయ్ హోటల్ ముందు ఎన్టీఆర్ మీద చెప్పులు వేయించిన వాళ్లే ఆయన భౌతికకాయం దగ్గర హడావుడి చేసి, అంతిమయాత్రలో అగ్రభాగాన నిలవడం పెద్ద విషాదం. అడగవలసిన వాళ్లను అడగొచ్చు కదా! 21 సంవత్సరాల తరువాత ఈ వర్ధంతి రోజున ఆనాటి విషయాలు జ్ఞాపకం చేసుకోవడం ఎందుకూ అంటే, తెలంగాణ తెలుగుదేశం పార్టీ కార్యాధ్యక్షుడు, శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి చేసిన ఒక ప్రకటన అందుకు కారణం. తెలంగాణ రాష్ట్రంలో ఎన్టీఆర్ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా జరపా లని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు రాజకీయ జన్మనిచ్చింది ఎన్టీఆర్ కాబట్టి అధికారికంగా ఈ వేడుకలు జరపాలని రేవంత్ రెడ్డి డిమాండ్. అంతేకాదు, హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో డొమెస్టిక్ టెర్మినల్‌కి ఎన్టీఆర్ పేరు పెట్టాలని కూడా ఆయన కోరారు. ఇవి జరగకపోతే కేంద్రానికి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి కేంద్రానికి ఏమని ఫిర్యాదు చేస్తారు? తెలంగాణ ప్రభుత్వం మీద కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోగలుగుతుంది ఈ విషయంలో? ఎన్టీఆర్ జయంతి, వర్ధంతి అధికారికంగా జరపండి అని తెలంగాణ ముఖ్యమంత్రికి కేంద్రం హుకుం జారీ చేస్తుందా? విమానాశ్రయం టెర్మినల్‌కి ఎన్టీఆర్ పేరు పెట్టే అధికారం తెలంగాణ ప్రభుత్వానికి ఉందా? ఆ పని కేంద్ర ప్రభుత్వం చెయ్యాలి, మళ్లీ మాట్లాడితే కేంద్రంలోని విమానయాన శాఖ చెయ్యాలి. విమాన యాన శాఖకు మంత్రిగా ఉన్న తెలుగుదేశం పార్ల మెంట్ సభ్యుడు అశోక్ గజపతిరాజు చెయ్యాలి. రెండున్నర ఏళ్లుగా కేంద్రంలో ఆ శాఖను నిర్వహిస్తున్న అశోక్ గజపతిరాజు కానీ, ఎన్డీఏ ప్రభుత్వంలో భాగ స్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కానీ ఈ విషయంలో ఎటువంటి ప్రయత్నమూ ఎందుకు చెయ్యలేదు? అన్న ప్రశ్నకు రేవంత్ రెడ్డి జవాబు చెప్పాలి. పార్లమెంట్లో ఎన్టీ రామారావు విగ్రహాన్ని ఏర్పాటు చేయించే విష యంలో జరిగిన రాజకీయాలు మన కళ్ల ముందు కనిపిస్తుంటే దేశీయ టెర్మి నల్కి ఎన్టీఆర్ పేరు పెట్టడం గురించి దానితో సంబంధం లేని వాళ్లను రేవంత్ రెడ్డి బెదిరిస్తున్నట్టు వ్యవహరించడం హాస్యాస్పదంగా ఉంది. అజ్ఞాతంలో అన్నగారి ఫొటోలు ఎన్టీ రామారావు చనిపోయినప్పుడు అంత హడావుడి చేసిన చంద్రబాబు నాయుడు, ఆయన నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ ఆ తరువాత ఆయ నను పూజించారా? ఎన్టీఆర్ ఫొటోలు ఎక్కడా కనిపించకుండా కొంతకాలం పాటు జాగ్రత్తపడ్డ విషయం రేవంత్‌కు తెలియక పోవచ్చు. ఆయన ఫొటోలు సచివాలయంలో, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో రాష్ట్ర వ్యాప్తంగా పాత సామాను గదుల్లో, పనికిరానిæ వస్తువుల మధ్యనా, విరిగిపోయిన కుర్చీలు, బల్లల మధ్యన చాలా రోజులు పడి ఉన్న విషయం పత్రికలు ఫొటోలతో సహా ప్రచురించిన విషయం కూడా రేవంత్‌కు తెలియకపోవచ్చు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు పుస్తకాల మీదా ఎన్టీఆర్ బొమ్మను తొలగించినందుకు ఎన్నికల ముందు హరికృష్ణ అలిగితే, మళ్లీ ఆయన బొమ్మలు ప్రత్యక్షమైన విషయం కూడా రేవంత్ రెడ్డికి తెలియక పోవచ్చు, ఎందుకంటే ఆ సమ యంలో ఆయన తెలుగుదేశంలో లేరు. ఆ తరువాత పన్నెండు సంవత్స రాలకు ఆయన తెలుగుదేశం తరఫున 2009 లో మొదటి సారి ఎమ్మెల్యే అయ్యారు. అంతకు ముందు మిడ్జెల్ నుంచి జెడ్పీటీసీగా, ఆ తరువాత ఎమ్మెల్సీగా స్వతంత్రంగానే గెలిచారు. ఆయన ఆశయాలను గుర్తు చేసుకుంటే చాలు ఎన్టీ రామారావు పార్టీ పెట్టింది 1982లో. అప్పటికి రేవంత్ రెడ్డి 13 ఏళ్ళ పసి వాడు. ఆ తరువాత తెలుగుదేశం పార్టీ తరఫున ప్రజా ప్రతినిధి అయింది మాత్రం 2009లో. అంటే ఎన్టీ రామారావు చనిపోయిన 13 సంవత్సరాల తరువాత. రామారావు విగ్రహాలకు క్షీరాభిషేకాలు చేస్తేనో, ఏటేటా అధికారి కంగా జయంతులూ, వర్ధంతులూ చేస్తేనో ఆయనను గౌరవించినట్టు కాదు. సమావేశాలు జరిగినప్పుడు ఆయన విగ్రహానికి ఒక పూలదండ వేసి నమ స్కారం పడేస్తే , ఏవో కొన్ని పథకాలకు ఆయన పేరు తగిలించేస్తే కూడా ఆయనను గౌరవించినట్టు కాదు. ఎన్టీ రామారావు రాజకీయాలు నీతిమం తంగా ఉండాలన్నారు. రేవంత్ రెడ్డి, ఆయన బాస్ చంద్రబాబునాయుడు ఆ విషయంలో పార్టీ వ్యవస్థాపక నేత ఎన్టీఆర్‌ను అనుసరిస్తే అదే ఆయనకు ఇచ్చే పెద్ద గౌరవం అనిపించుకుంటుంది. (నేడు ఎన్టీ రామారావు 20వ వర్ధంతి) దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
కొత్త జిల్లాల కల్లోలం!
డేట్లైన్ హైదరాబాద్ ఇదంతా చూస్తుంటే రాజకీయ అవసరాల కోసమో, ఒత్తిడి కారణంగానో జరిగినట్టుందే తప్ప శాస్త్రీయంగా చేసినట్టు మాత్రం కనిపించదు. జనగామ, గద్వాల జిల్లాల ఏర్పాటును అంగీకరించడానికి ఒప్పుకోక, భీష్మించుకుని కూర్చున్న ముఖ్యమంత్రి తన కుమారుడి రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సిరిసిల్ల జిల్లా ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవాలి కాబట్టి, ఆ రెండు జిల్లాల ఏర్పాటును కూడా ఈ లెక్కలో తోసేశారన్న విమర్శ ఎదుర్కోక తప్పదు. ఈ ప్రక్రియ శాస్త్రీయంగా జరగడంలేదనడానికి బోలెడు ఉదాహరణలు. మొత్తానికి కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రానికి బోలెడు కొత్త జిల్లాలు దసరా కానుకగా రానున్నాయి. ప్రజాస్వామ్యంలో పాలకుల ప్రథమ లక్ష్యం పరిపాలనను ప్రజలకు అత్యంత చేరువలోకి తీసుకుపోవడం. చిన్న పనికి కూడా జిల్లా కేంద్రానికో, రాష్ట్ర రాజధానికో వందల మైళ్లు ప్రయాణించి, డబ్బు ఖర్చు చేసుకుని, శ్రమకోర్చి పడిగాపులు పడి, నానా ఇక్కట్లు ఎదు ర్కొని, చివరికి పనికాక మళ్లీ మళ్లీ జిల్లా కేంద్రానికి వెళ్లాల్సిన అవసరం ప్రజ లకు రాకూడదు. పంచాయతీ సమితులు, తాలూకాలకు స్వస్తి చెప్పి మూడంచెల వ్యవస్థకు శ్రీకారం చుట్టిన మహానుభావుడు ఎన్.టి. రామారావు. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మండల వ్యవస్థ ఆవిర్భవించింది. వీలైనంత వరకు పరిపాలనను ప్రజలకు చేరువగా తీసుకుపోవడానికి వికేంద్రీకరణను మించిన మార్గంలేదు. పునర్ విభజన తప్పుకాదు కానీ... ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలలోనూ పరిపాలనా వికేంద్రీకరణ కోసం జిల్లాల విభజన ఎంతో అవసరమన్న విషయంలో ఎవరికీ భిన్నా భిప్రాయం ఉండనక్కరలేదు. ఇతర రాష్ట్రాల జనాభాతో పోల్చితే ఈ రెండు రాష్ట్రాలలోని జిల్లాల వారీ జనాభా చాలా ఎక్కువ. దేశంలో చాలా రాష్ట్రా లలో ఒక్కొక్క జిల్లా జనాభా అత్యధికంగా పది లక్షలు ఉండగా, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ సంఖ్య 30 లక్షల దాకా ఉంది. జనాభా ప్రాతిపదికగా జిల్లాల విభజన తప్పకుండా జరగాల్సిందే. అందునా దశాబ్దాల పోరాటం తరువాత తెచ్చుకున్న రాష్ట్రం కాబట్టి తెలంగాణలో అభివృద్ధి ఫలితాలను జనానికి వేగంగా అందించేందుకు ప్రభుత్వం ఆలోచించడం మంచిదే. తెలం గాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఉన్న 10 జిల్లాలను ఇప్పుడు ప్రభుత్వం 31 జిల్లా లుగా పునర్ విభజించాలని ఆలోచిస్తున్నది. అంటే జనాభాను మూడొం తులుగా విభజించి పరిపాలన అందించాలన్న ఆలోచన. 31 జిల్లాలేం ఖర్మ, అవసరమైతే 40 జిల్లాలుగా విభజించడానికి కూడా అభ్యంతరం లేదని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రకటించారు. ‘పండుగపూట వాళ్లెందుకు ఏడవాలి? నన్నెందుకు తిట్టాలి?’ అని ముఖ్యమంత్రి అన్నట్టు కూడా వార్తలు వచ్చారుు. ప్రజాభీష్టానికే పెద్ద పీట వేస్తామని కూడా ముఖ్యమంత్రి ఈ సందర్భంగా చెప్పారు. మంచిదే, 30 లక్షల మందికి ఒక కలెక్టర్ ఉండటం కంటే, 10 లక్షల మందికి ఒక కలెక్టర్ చొప్పున ఉంటే సమస్యల మీద దృష్టి పెట్టడానికైనా, వాటిని సత్వరం పరిష్కరించడానికైనా ఎంతో ఉపయోగ కరంగా ఉంటుంది. కొన్నిచోట్ల జనాభా కారణంగా జిల్లాల విభజన అనివా ర్యం కాగా, కొన్నిచోట్ల భౌగోళిక స్వరూపం కారణంగా కొత్త జిల్లాల ఏర్పాటు అవసరమైంది. పరిపాలన మీద దృష్టి ఉన్న ఏ ప్రభుత్వమైనా ఈ పని చెయ్యా ల్సిందే. ఉదాహరణకు కొన్ని తెలంగాణ జిల్లాలనే తీసుకుందాం. పెద్దలు కొండా వెంకటరంగారెడ్డి పేరును చిరస్మరణీయం చేయడానికి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రంగారెడ్డి జిల్లా పేరిట హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలను ఒక జిల్లాగా ఏర్పాటు చేశారు. జిల్లా యంత్రాం గమంతా హైదరాబాద్‌లో ఉంటుంది, ఆ జిల్లాలో ఒక ప్రాంతానికి ఇంకో ప్రాంతంతో సంబంధం ఉండదు. రంగారెడ్డి జిల్లాలో భాగమైన తాండూర్, వికారాబాద్ వంటి దూరప్రాంతాల నుండి ఏ చిన్న పనికైనా జనం హైదరా బాద్ రావాలి. మెదక్ జిల్లా కేంద్రం ఓ మూలన సంగారెడ్డిలో ఉంటుంది. ఆదిలాబాద్ అతి పెద్ద జిల్లా. దాన్ని రెండుగా విడగొట్టాలని తూర్పు ప్రాం తంలో చాలాకాలంగా డిమాండ్ ఉంది. ఇట్లా కచ్చితంగా జిల్లాలని విభజించి, సంఖ్య పెంచాల్సిన అవసరం కచ్చితంగా ఉంది, దాన్ని ఎవరూ కాదన డంలేదు. రాజకీయంగా ఎన్ని విభేదాలున్నా ప్రతిపక్షాలన్నీ కూడా జిల్లాల విభజనకు సంబంధించి అధికారపక్షం ఆలోచనను వ్యతిరేకించలేదు. అరుునా జిల్లాల విభజనకు సంబంధించి ఎందుకు ఇంత చర్చ, రగడ ఇన్ని మాసాలు జరిగింది? ఎందుకు నిరసనలు, రాజీనామాలు, ఆమరణ దీక్షల దాకా పరిస్థితి వెళ్ళింది? ఎన్ని జిల్లాలు చేయడానికైనా సిద్ధమేనని ముఖ్యమంత్రి ప్రకటిస్తుంటే ప్రతిపక్షాలకు ఏమిటి అభ్యంతరం? ఎన్ని జిల్లాల ఏర్పాటుకైనా సిద్ధమేనా? జిల్లాల విభజనకు సంబంధించి ముఖ్యమంత్రి ఆరంభంలో ఒక అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు, అన్ని పక్షాల అభిప్రాయాలు అడిగారు. ఆ తరు వాత అంతా అధికారపక్షం తెలంగాణ రాష్ట్ర సమితి సొంత వ్యవహారం లాగా, మళ్లీ మాట్లాడితే ముఖ్యమంత్రి సొంత వ్యవహారం లాగా సాగింది తప్ప ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రతిపక్షాలను, ప్రజలను, మేధావులను, ఇతరులను కలుపుకొని వెళ్లి వారి అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకుని చేసిన ట్టుగా లేదన్న విమర్శ పెద్ద ఎత్తున వచ్చింది. గద్వాల జిల్లా సాధించుకోవడం కోసం మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు డీకే అరుణ నిరసన దీక్ష చేపట్టాల్సి వచ్చింది, పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. అరుణ తన శాసన సభ్యత్వానికి రాజీనామా చేసే దాకా వెళ్లారు. జనగామను ప్రత్యేక జిల్లా చేయాలని మాజీ మంత్రి, మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య నాయక త్వంలో దాదాపు అన్ని పార్టీల వారూ, ప్రజలూ ఆందోళనకు దిగారు. స్వయానా ముఖ్యమంత్రి కుమారుడు, రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు నియోజకవర్గం సిరిసిల్లను జిల్లా చెయ్యాలని కూడా ఆందోళన సాగింది. తన నియోజకవర్గ ప్రజలు కోరినా సిరిసిల్ల జిల్లా ఏర్పరచడానికి ముఖ్యమంత్రి అంగీకరించలేదంటే తమ ప్రభుత్వం ఎంత నిష్పక్షపాతంగా ఉందో అర్థం చేసుకోవాలని కేటీఆర్ స్వయంగా ప్రకటించారు. మొదటి సమావేశం తప్ప మళ్లీ ప్రతిపక్షాలతో మాట్లాడే ఆలోచన కూడా చెయ్యని ముఖ్యమంత్రి రెండురోజులనాడు అన్ని జిల్లాల నుండి తమ పార్టీ ప్రజా ప్రతినిధులను, నాయకులను రెండురోజుల పాటు క్యాంప్ కార్యాలయానికి పిలిపించుకుని జిల్లాల పంచారుుతీ తెంపివే శారు. ఇంకా ఏమైనా పంచారుుతీ మిగిలి ఉంటే తేల్చండని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కె. కేశవరావు నాయకత్వంలో ఒక కమిటీ వేశారు. ఒకటి రెండు రోజుల్లో ఈ కమిటీ నివేదిక అందిస్తుంది. ముఖ్యమంత్రి మాటల్లోనే అర్థమైంది ఆయన మనోగతం, కావాలంటే మరికొన్ని జిల్లాలు కూడా ఏర్పాటు చేసేస్తారు. శాస్త్రీయంగా జరిగిందనుకోగలమా? ఇదంతా చూస్తుంటే రాజకీయ అవసరాల కోసమో, ఒత్తిడి కారణంగానో జరిగినట్టుందే తప్ప శాస్త్రీయంగా చేసినట్టు మాత్రం కనిపించదు. జనగామ, గద్వాల జిల్లాల ఏర్పాటును అంగీకరించడానికి ఒప్పుకోక, భీష్మించుకుని కూర్చున్న ముఖ్యమంత్రి తన కుమారుడి రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సిరిసిల్ల జిల్లా ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవాలి కాబట్టి, ఆ రెండు జిల్లాల ఏర్పాటును కూడా ఈ లెక్కలో తోసేశారన్న విమర్శ ఎదుర్కోక తప్పదు. ఆదిలాబాద్ భౌగోళికంగా పెద్ద జిల్లా. దానిని నాలుగు జిల్లాలుగా విభజించడం, అందునా ఆసిఫాబాద్ కేంద్రంగా గిరిజన జిల్లాను ఏర్పాటు చేయాలని నిర్ణయించడం హర్షించదగ్గది. అదే సమయంలో కొన్ని జిల్లాలకు యాదాద్రి, భద్రాద్రి, రాజాద్రి అన్న పేర్లు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించడం ఆధ్యాత్మిక భావాలు గల వారిని సంతృప్తి పరచవచ్చు. కానీ, మన రాజ్యాం గంలో రాసుకున్న సెక్యులర్ స్టేట్ అన్న మాటకు అర్థం లేకుండా పోతున్నదని అనిపిస్తుంది. ఇక జిల్లాల ఏర్పాటు ఇట్లా ఉంటే ఏ మండలాలు ఏఏ జిల్లాలలో ఉండాలన్న విషయంలో, ఏవి రెవిన్యూ డివిజన్లు కావాలన్న విషయం కూడా ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నది. ఉద్యమాలు చేస్తున్నారు. ఈ ప్రక్రియ శాస్త్రీయంగా జరగడంలేదనడానికి బోలెడు ఉదాహరణలు. విభజ నలో భాగంగా నగరానికి దగ్గరగా ఉన్న మొయినాబాద్ మండలాన్ని తీసుకు పోయి అక్కడెక్కడో ఉన్న వికారాబాద్ జిల్లాలో కలపాలని నిర్ణయించి మళ్లీ ప్రజాభిప్రాయానికి తలొగ్గి శంషాబాద్‌లో చేర్చారు. కల్వకుర్తి రెవిన్యూ డివిజన్ కోసం కాంగ్రెస్ యువ శాసనసభ్యుడు వంశీచంద్ రెడ్డి ఆమరణ దీక్ష చేసే దాకా వెళ్లాల్సివచ్చింది. ఇంకా చాలా మండలాలు, రెవిన్యూ డివిజన్ల సమస్య పరిష్కారం కావాల్సి ఉన్నది. కొత్త జిల్లాల ఏర్పాటు వ్యవహారంలో ఏయే ప్రాంతాలను లేదా మండలాలను ఏ జిల్లాలలో కలపాలనే విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలాచోట్ల ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా కూడా ఉందనడానికి ఒక్క ఉదాహరణ కరీంనగర్ జిల్లా. సామాజిక మాధ్య మాల్లో ఇప్పుడు విస్తృత ప్రచారంలో ఉన్న ‘కరీంనగర్ ఒంటరి అయింది’ శీర్షికన రాసిన కొన్ని పంక్తులు ‘‘ఏములాడ రాజన్న లేడు/అంజన్న అండ లేదు/ధర్మపురి దర్శనం లేదు /కొమురెల్లి మల్లన్న లేడు/ కాళేశ్వరం ఇక కాన రాదే/ఓదెల మల్లన్న లేడు/బసంత్‌నగర్ వసంతం పాయే/ సింగరేణి సిరులు పోయే /రామగుండం వెలుగు పాయే/ సిరిసిల్ల సింగారం పోయే/ కళ్లలోని కన్నీరు కడుపులో దాచుకున్న /మానేరు నిండు కుండలా /రెక్కలు విరిగిన పక్షిలా / కొమ్మలు నరికిన చెట్టులా /కొడుకులు వదిలిన ముసలిలా / ఒంట రిగా మిగిలింది నా జిల్లా.’’ విభజనలో కరీంనగర్ నాలుగు జిల్లాలయింది. అసెంబ్లీలో ఏదీ చర్చ? అన్నీ అందరికీ కావాలంటే సాధ్యం కాకపోవచ్చు కానీ అధికారంలో ఉన్న వారు ఇంతటి ప్రధాన నిర్ణయాలు చేసేటప్పుడు ప్రతిపక్షాల మనోగతాన్ని తెలుసుకోవడంతోపాటు ప్రజల భావోద్వేగాలను కూడా పరిగణనలోకి తీసుకుంటే మరింత మంచి పేరు తెచ్చుకోవచ్చు. ముఖ్యమంత్రి చెప్పినట్టు 2019 ఏం ఖర్మ, ఇంకా ఎక్కువ కాలం పరిపాలన చెయ్యవచ్చు. పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చెయ్యడం కోసం తీసుకుంటున్న ఇంత ప్రధాన నిర్ణయం ప్రతిపాదనలను రాష్ట్ర శాసనసభ చర్చించక పోవడం అన్యాయం. - దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
ఎన్టీఆర్‌పై చెప్పులు విసిరిన చరిత్ర మీదికాదా..
► ప్రజలను అన్ని విధాలా మోసం చేసిన మిమ్మల్ని ఏమనాలి.. ► మహానాడులో మహిళ చెప్పు చూపిన విషయం నిజం కాదా ► వైఎస్ జగన్‌ను విమర్శించే అర్హత మీకు లేదు ► పోలీసులను అడ్డుపెట్టుకుని దిష్టిబొమ్మ దహనం హేయం ► బాబుపై వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ ధ్వజం సాక్షి, గుంటూరు : తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎన్టీ రామారావుపైనే చెప్పులు వేయించిన చరిత్ర చంద్రబాబునాయుడిదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గుంటూరులో శుక్రవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. మంత్రులు, ఎమ్మెల్యేలు సభ్యత, సంస్కారం మరిచి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పోలీసులను అడ్డుపెట్టుకుని దిష్టి బొమ్మలు దహనం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు సాధ్యం కాని హామీలిచ్చి.. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను అన్ని విధాలా మోసం చేసిన చంద్రబాబును ఏమనాలో చెప్పాలంటూ ఆయన ప్రశ్నించారు. హోదా తెస్తానని చెప్పి.. ఇప్పుడు తప్పించుకు తిరగడంలేదా..? రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తానని చెప్పి ఇప్పుడు తప్పించుకు తిరుగుతున్నారని విమర్శించారు. తిరుపతిలో వారు ఏర్పాటు చేసుకున్న మహానాడు కార్యక్రమంలోనే వారి పార్టీకి చెందిన మహిళా కార్యకర్త చంద్రబాబుకు చెప్పు చూపడం అన్ని పత్రికలు, టీవీల్లో వచ్చింది నిజం కాదా అని ప్రశ్నించారు. ప్రభుత్వంపై ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏముందని ఆయన ప్రశ్నించారు. తాము మాత్రం ప్రజాసమస్యలపై పోరాడేందుకు రోడ్లపైకి వస్తే కేసులు పెట్టడం, దిష్టి బొమ్మలు లాక్కెళ్లడం వంటివి చేసే పోలీసులు ఇప్పుడు వారికి తొత్తుల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్లు కొంటూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని విమర్శించారు. ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు చేసే సూచనలు పాటిస్తూ తప్పులను సరిదిద్దుకోవాల్సిందిపోయి అధికార పార్టీ నేతలు ఎదురు దాడులకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. -
లక్ష్మీ పార్వతి పుణ్యమా అని సీఎం అయ్యా
► ఎన్టీఆర్ బొమ్మతో ఎన్నికల్లో గెలవలేదు ► ఎన్టీఆర్ కు ఛరిష్మా ఉంటే 1989 లో ఎందుకు ఓడిపోయారు ► ఎన్టీఆర్ నన్ను వెన్నుపోటుదారుడని అంటారు ► వెన్నుపోటు పొడిచే తత్వం నా రక్తంలో లేదు ► అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు అన్న మాటలివి హైదరాబాద్ ఎక్కడ ఏ ఎన్నికలు జరిగినా చంద్రబాబు నాయుడు టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్ టీ రామారావు పేరును స్మరించకుండా ప్రచారం చేయరు. ఆయన పేరు చెప్పకోకుండా చంద్రబాబు ఎన్నికల ప్రచారం చేయరు. ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలని ప్రతి మహానాడులోనూ తీర్మానం చేయిస్తారు. (అయితే ఆ విషయంలో కేంద్రానికి మాత్రం లేఖ రాయరు అది వేరే విషయం) ఎన్టీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని టీడీపీ మహానాడు (సర్వసభ్య సమావేశం) నిర్వహిస్తుంటారు. ప్రతి ఏటా చేసే తంతులో భాగంగా ఈసారి కూడా తిరుపతిలో నిర్వహిస్తున్న టీడీపీ మహానాడులో (మే 28 ఎన్టీఆర్ జన్మదినం) ఎన్టీఆర్ ను మరోసారి స్మరించబోతున్నారు. అయితే ఇవన్నీ ఎన్టీఆర్ మరణించిన తర్వాత చంద్రబాబు నాయుడు చేస్తున్న రాజకీయ ప్రక్రియలు మాత్రమే. 1995 ఆగస్టు సంక్షోభంలో ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి అధికారం దక్కించుకున్న చంద్రబాబు ఆ తర్వాత కాలంలో అసెంబ్లీలో ఎన్టీఆర్ గురించి ఏం మాట్లాడారో విన్నవారికి బాబు నైజమేంటో బాగా తెలుసు. ఇప్పటి తరానికి ఆ విషయాలు పెద్దగా తెలియకపోవచ్చు... కానీ లక్ష్మీపార్వతి పుణ్యమా అని సీఎం అయ్యాననీ అసెంబ్లీ వేదికగా అంగీకరించారు, ఎన్టీఆర్ బొమ్మతో తామంతా ఎన్నికల్లో గెలవలేదని, వెన్నుపోటు పొడిచే తత్వం తన రక్తంలో లేదని ఆయన అన్నారు. 1995 డిసెంబర్ 5 న జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఎన్టీఆర్ గురించి చంద్రబాబు ఏమన్నారంటే... (ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి గద్దె దింపిన సందర్భంగా అసెంబ్లీలో, స్పీకర్ నివాసం వద్ద జరిగిన నిరసనలకు సంబంధించిన చర్చ సందర్భంగా...) ''(ఎన్టీఆర్) ప్రతిరోజూ వెన్నుపోటుదారుడని మాట్లాడుతున్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒకసారి ఆలోచించుకోవలసిన అవసరం ఉంది. ఎన్టీఆర్ ఏ డెసిషన్ తీసుకుంటారో అని ప్రతిరోజూ టెన్షన్ గా ఉండేది. ఆయన ఏ డెసిషన్ తీసుకుంటారో మాకు తెలిసేది కాదు. 35 మంది మంత్రులను ఒక్కసారిగా రిమూవ్ చేయడం... (అప్పట్లో ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మొత్తం కేబినెట్ ను రద్దు చేశారు) ఆ విధంగా ఆయన ఎన్ని డెసిషన్స్ వారు తీసుకున్నా మేము అందరం సహకరించి ఎప్పటికప్పుడు ఆ తప్పులను దిద్దుకుంటూ ముందుకు తీసుకుపోయాం.'' (పూర్తిపాఠం చదవండి... ఏ డెసిషన్ తీసుకుంటారో.. ) ''5 సంవత్సరాలు సుమారు 74 మంది ఎమ్మెల్యేలు ఇలా శ్రమపడ్డామో, ఏ విధంగా ఫైట్ చేసి తిరిగి అధికారంలోకి వచ్చామనేది అందరికీ తెలుసు. ఒక వ్యక్తి బొమ్మ పెట్టుకొని గెలిచామనే మాట కాదు. ప్రతి ఒక్కరి కాంట్రిబ్యూషన్ ఉంది. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ప్రముఖులు, కార్యకర్తలు మొదలైన వారి కాంట్రిబ్యూషన్ ఉంది. రామారావు గారి కాంట్రిబ్యూషనూ ఉంది. నేను ఒప్పుకుంటున్నాను. అందరూ కలిసి ఎన్నికల్లో గెలిచాం. ఎన్టీఆర్ కు చరిష్మా ఉంటే 1989లో ఆయన ఎందుకు ఓడిపోయారని అడుగుతున్నా. 1983లో చూసినట్లయితే 200 సీట్లు గెలవడం జరిగింది. (1983లో చంద్రబాబు టీడీపీలో లేరు. ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేశారు) 84 ఆగస్టు నెల క్రైసిస్ లో మిత్రపక్షాలు అందరూ కలిసి బీజేపీతో సహా 240 మంది గెలిచాం. తిరిగి 1994 లో జరిగిందేంటో అందరికీ తెలుసు. కాంగ్రెస్ 26 అయితే మిత్రపక్షాలతో కలిసి మేం 254 సీట్లు గెలిచాం. ఆ విధంగా ప్రతి ఒక్కరి పర్ఫార్మెన్స్ తో గెలిచాం. ఏ ఒక్కరితో కాదని తెలుపుతున్నాను.'' ''ఒక వ్యక్తి కోసం పార్టీని రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను విస్మరించి ఆ వ్యక్తి కోసం ఏమైనా చేయడానికి నాయకుడు రావడం జరిగింది. మేమంతా చెప్పాం. ఎన్ని చెప్పినా వినలేదు. మా సీనియర్ కొలీగ్స్ చెప్పారు. వినలేదు. వారు ఏమీ వినకుండా ఏకపక్ష ధోరణిలో పోయారు. కాబట్టే మేం నిర్ణయం తీసుకోవలసి వచ్చిందని చెబుతున్నా.'' (పూర్తిపాఠం చదవండి... మేం ఎన్ని చెప్పినా వినలేదు) ఈ సందర్భంగా అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యుడు కె. బాపిరాజు జోక్యం చేసుకుని... ''బాబు ముఖ్యమంత్రి అయ్యారంటే ఆవిడ (లక్ష్మీపార్వతి) పుణ్యమా...'' అని ప్రశ్నించగా... చంద్రబాబు స్పందిస్తూ... ''మీరు తెలుసుకున్న వాస్తవం కూడా ఎన్టీ రామారావు ఇంకా తెలుసుకోలేదు. నేను ఎప్పుడూ ముఖ్యమంత్రి పదవి కావాలని కోరుకోలేదు. వాస్తవంగా చెబుతున్నాను. ఎన్టీఆర్ బతికున్నంత వరకు ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకున్న వాడిని. మొన్నటి వరకు నా స్టాండ్ అదే. కానీ ఎప్పుడైతే రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీన్నాయో... పార్టీ మొత్తం పోయే పరిస్థితి వచ్చిందో ఎమ్మెల్యేలందరం కలిసి నా మీద ఒత్తిడి తెచ్చినప్పుడు విధిలేని పరిస్థితుల్లో ఒప్పుకున్నాను. ఎన్ టీ రామారావు అంటుంటారు. వెన్నుపోటు పొడిచే తత్వం నా రక్తంలో లేదు. ఆరోజు మేము పోరాడి చెప్పి చెప్పి విసిగిపోయి తిరుగుబాటు చేసి ఈ ప్రభుత్వాన్ని పార్టీని నిలబెట్టుకున్నాం. అంతేగానీ ఇంకొకటి కాదు. '' ''ప్రజాస్వామ్యం... ప్రజాస్వామ్యం... అని (ఎన్టీఆర్) మాట్లాడితే నాకే అర్థం కావడం లేదు. అసలు ప్రజాస్వామ్యానికి డెఫినిషన్ ఏంటని అడుగుతున్నాను. ఎన్ టి రామారావు గారు ఏం చేశారంటే పార్టీ కాన్ స్టిట్యూషన్ రాసుకున్నామని అన్నారు. ఆయన ఎప్పుడు రాసుకున్నారో నాకు తెలియదు. శాశ్వతంగా పార్టీ అధ్యక్షుడిగా కూడా ఆయన రాసుకున్నారు. మన కాన్ స్టిట్యూషన్ పర్మిట్ చేస్తే ఆయనే శాశ్వతంగా ముఖ్యమంత్రి అని రాసుకునే వారేమో నాకు తెలియదు కానీ... ఆయన (ఎన్టీఆర్) ఎన్ని శాపనార్థాలు పెట్టినా వాటిని ఆశీర్వచనాలుగానే నేను తీసుకుంటా. నేను ఎప్పుడూ తొందరపడే పరిస్థితి లేదు. డెస్పరేట్ మూడ్ లో ఎన్ని చేయాలో అన్నీ చేస్తున్నారు. (ఎన్టీఆర్‌ను గద్దె దించే రోజున అసెంబ్లీలో ఎన్టీఆర్ కు మద్దతుగా నిలిచిన ఎమ్మెల్యేలు గొడవ చేయడంపై) ప్రజలు ఎక్కడ గుణపాఠం చెప్పాలో అక్కడ చెబుతారు. అది కూడా తొందరలోనే చూస్తారు....'' (పూర్తిపాఠం చదవండి... ఆయన ఎన్ని శాపనార్థాలు పెట్టాలో అన్నీ పెడుతున్నారు) ఇదీ ఎన్టీఆర్ గురించి చంద్రబాబు ఆనాడు అసెంబ్లీ వేదికగా అన్న మాటలు. స్పీకర్‌ను శాసనసభకు రాకుండా ఎన్టీఆర్‌కు మద్దతిచ్చిన శాసనసభ్యులు అడ్డుకున్న తీరును గర్హిస్తూ వారిపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా సభ ఏకగ్రీవంగా తీర్మానం కూడా చేసింది. -
ప్రజలను చైతన్యపరిచిన ఎన్టీఆర్ ప్రసంగాలు
ప్రసంగ పాఠాల పుస్తకావిష్కరణ సభలో సీఎం చంద్రబాబు సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు చేసిన ప్రసంగాలు ప్రజలను చైతన్య పర చటంతోపాటు, ఆలోచింపచేసి కర్తవ్యోన్ముఖులను చేశాయని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. ఆయన మరణించి 20 ఏళ్లు గడిచినా ఆయన జ్ఞాపకాలు ప్రజల్లో సజీవంగా ఉన్నాయన్నారు. ఆయన సేవలను రెండు తరాల ప్రజలు గుర్తుంచుకున్నారని చెప్పారు. అసెంబ్లీలో ఎన్టీఆర్ చేసిన ప్రసంగ పాఠాలతో కూడిన పుస్తకాన్ని మంగళవారం సాయంత్రం అసెంబ్లీ కమిటీ హాలులో సీఎం ఆవిష్కరించారు. సీఎం మాట్లాడుతూ.. శాసనసభలో గతంలో ప్రతిపక్ష నేతలుగా పనిచేసిన పుచ్చలపల్లి సుందరయ్య, వావిలాల గోపాలకృష్ణయ్య, చెన్నమనేని రాజేశ్వరరావు లాంటివారు అసెంబ్లీలో ప్రసంగించటానికి ముందు విస్తృత అధ్యయనం, సుదీర్ఘ కసరత్తు చేసేవారన్నారు. ఎన్టీ రామారావు తన ప్రసంగాల ద్వారా ప్రజలను చైతన్యం చేశారన్నారు. భాషపై ఎన్టీఆర్‌కు విపరీతమైన పట్టుండేదని, ప్రజలకు చెప్పదలచుకున్న సమాచారాన్ని సూటిగా చెప్పేవారన్నారు. స్పీకర్ కోడెల ప్రసంగిస్తూ శాసనసభలో ప్రముఖులు చేసిన ప్రసంగాలను గతంలో పుస్తక రూపంలో తీసుకొచ్చామన్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రసంగాలను పుస్తక రూపంలో తీసుకొస్తున్నామని, ఇవి భావితరాలకు ఉపయోగపడతాయన్నారు. కార్యక్రమంలో స్పీకర్ కోడెల, యనమలతోపాటు పలువురు మంత్రులు, చీఫ్ విప్ కాలవ శ్రీనివాసులు, అసెంబ్లీ ఇన్చార్జి కార్యదర్శి సత్యనారాయణ పాల్గొన్నారు. -
నేడు లెజండరీ బ్లడ్ డొనేషన్: ఎన్టీఆర్ ట్రస్ట్
సాక్షి,హైదరాబాద్: టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్.టి.రామారావు 20వ వర్ధంతి సందర్భంగా సోమవారం ‘లెజండరీ బ్లడ్ డొనేషన్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్ ట్రస్ట్ సీఈవో టి.విష్ణువర్ధన్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో జరిగే ఈ కార్యక్రమాన్ని ట్రస్ట్ సభ్యులు నారా భువనేశ్వరి, లోకేష్, బ్రహ్మణి ప్రారంభిస్తారని పేర్కొన్నారు. అలాగే ‘తెలుగు వారి జ్ఞాపకం’ పేరుతో నిర్వహించే ఎన్టీఆర్ సినీ, రాజకీయ విశేషాలకు సంబంధించిన ప్రదర్శన కార్యక్రమంలో నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ముఖ్యఅతిథిగా పాల్గొంటారని తెలిపారు. -
ఆదిలోనే హంసపాదు
చెన్నై, సాక్షి ప్రతినిధి: ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కే ప్రయత్నం చేసినట్లుగా తయారైంది తెలుగుదేశం పార్టీ వాలకం. పార్టీని తమిళనాడులో విస్తరించేందుకు శుక్రవారం చెన్నైలో నిర్వహించిన సన్నాహక సమావేశం ఆదిలోనే హంసపాదు అనే విమర్శలకు తావిచ్చింది. ఆంధ్రుల ఆత్మాభిమానం నిలబెట్టాలనే లక్ష్యంతో నటరత్న ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని 1982లో స్థాపించారు. రాష్ట్ర చరిత్రలో ఒక బలమైన ప్రాంతీయ పార్టీగా ఆవిర్భవించిన టీడీపీ అనతికాలంలోనే అందరి అభిమానాన్ని చూరగొని అధికారంలోకి వచ్చింది. తెలుగువారంతా తమ పార్టీ అని భావించేస్థాయికి ఎన్టీఆర్ తీసుకువచ్చారు. ఎన్టీఆర్ చేతి నుంచి బలవంతంగా పార్టీ పగ్గాలు లాక్కున్న చంద్రబాబు తాజాగా అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీని జాతీయపార్టీగా విస్తరించే ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందులో భాగంగా తమిళనాడుపై దృష్టి సారించారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంగా ఉన్ననాటి నుంచి తెలుగువారు తమిళనాడులో స్థిరపడిపోయారు. రాష్ట్రంలో 30 శాతానికి పైగా తెలుగువారున్నట్లు అంచనా. పొరుగు రాష్ట్రాల్లో టీడీపీని బలోపేతం చేసేందుకు తొలి అడుగును తమిళనాడులో వేశారు. తమిళనాడులో భారీఎత్తున సభ్యత్వ నమోదు చేయడం ద్వారా ప్రాంతీయపార్టీని జాతీయస్థాయి పార్టీగా తీర్చిదిద్దే ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందులో భాగంగా ఇటీవల చంద్రబాబు తనయుడు నారా లోకేష్ తమిళనాడులోని తెలుగుదేశం అభిమానులతో సమావేశమై ఇన్చార్జ్ పేర్లను ప్రకటించి దిశా నిర్దేశం చేశారు. సభ్యత్వ నమోదుతో తమిళనాడులో పార్టీని బలోపేతం చేసేందుకు టీడీపీ అభిమానులతో శుక్రవారం సన్నాహక సమావేశం అంటూ నిర్వహించారు. తమిళనాడు పరిశీలకులుగా నియమితులైన ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బీదా మస్తాన్‌రావు నేతృత్వంలో జరిగిన సమావేశంలో కనీసం 5 లక్షల సభ్యత్వాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రకటించారు. జాతీయ పార్టీ బీజేపీతో పోల్చుకుంటూ ఒకప్పటికి తమ పార్టీ సైతం కేంద్రంలో అధికారం చేపట్టేస్థాయికి చేరుకోవడం తథ్యమని బీరాలకు పోయారు. ఈనెల 17వ తేదీ నుండి సభ్యత్వ నమోదు కార్యక్రమానికి పార్టీ అంకితం కావాలని ఉద్బోధించారు. అసలుకు లేదు ఆహ్వానం ః అంతాబాగానే ఉన్నా... పార్టీ కోసం ఇన్నాళ్లు కష్టపడిన వారిని సన్నాహక సమావేశానికి ఆహ్వానించకపోవడం విమర్శలకు దారితీసింది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పార్టీ తరుపున అనేక కార్యక్రమాలు జరిగాయి. ఎంతో కష్టనష్టాల కోర్చి పార్టీని భుజాన వేసుకుని తిరిగినవారున్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నా లేకున్నా ఆయన చెన్నైకి వచ్చినపుడల్లా నీడలా వెంట తిరిగిన వారు ఉన్నారు. మౌళివాక్కంలో బహుళ అంతస్తుల మేడ కుప్పకూలిన సమయంలో సీఎం హోదాలో చంద్రబాబు పరామర్శకు రాగా ఆరోజు అనధికారికంగా అన్ని ఏర్పాట్లు చేసిన వారు ఎందరో ఉన్నారు. అయితే పార్టీ సన్నాహక సమావేశానికి వీరెవ్వరికీ ఆహ్వానాలు కాదుకదా కనీసం సమాచారం లేదు. సాక్షాత్తు లోకేష్‌తో ఇటీవల హైదరాబాద్‌లో సమావేశం అయిన వారు కూడా ముఖం చాటేశారు. తమిళనాడులో అత్యున్నత హోదాపరంగానేకాక కులపరంగా సైతం పెద్ద దిక్కుగా నిలిచే చంద్రబాబు సన్నిహితుడే మీడియాలో వార్త చూసే సన్నాహక సమావేశం గురించి తెలుసుకున్నానని తెలిపారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిందని సంబరపడిపోయిన మరెందరినో సన్నాహక కమిటి నుండి పిలుపు అందలేదు. తమిళనాడులో పార్టీ ఇంకా మొలకెత్తక ముందే ఇన్ని వర్గాలు, విభేదాలు, అవగాహనా లోపాలా అంటూ అదే పార్టీకి చెందిన నేతలు మెటికలు విరిచారు. పార్టీకోసం ఇన్నాళ్లూ ఎవరు పాటుపడ్డారో గుర్తించని స్థితిలో 5 లక్షల సభ్యత్వం ఎలా సాధ్యమని వారు ఎద్దేవా చేశారు. తాము మరుగున పడిపోతామనే భయంతోనే సన్నాహక సమావేశం నిర్వాహకులు తనను ఆహ్వానించలేదని ఒక టీడీపీ ముఖ్యనేత వ్యాఖ్యానించడం గమనార్హం. -
మీరు లేరు.. మీ జ్ఞాపకాలు మిగిలే ఉన్నాయి!
హైదరాబాద్ లోని బషీర్ బాగ్ మీదుగా వెళ్లే సమ యంలో... ప్రస్తుతం ఉన్న లోకాయుక్త కార్యాలయ భవనాన్ని చూసినప్పుడ ల్లా ఆంధ్రపత్రిక కార్యాల యం, అందులో పని చేసి న మహామహులతో సాన్ని హిత్యాలు సముద్రపు అల లలాగా, నదీ తీరాన నిలబడినప్పుడు వినిపించే ప్రవాహపు సవ్వడి లాగా గుర్తుకొచ్చి నన్ను జ్ఞాప కాల మహల్లోకి తీసుకెళతాయి. నన్ను శివలెంక రాధాకృష్ణ్ణ గారే స్టాఫ్ రిపోర్టర్‌గా ఎంపిక చేసి నియ మించటం... బషీర్‌బాగ్ భవనంలోనే ఎడిటర్ సీవీ రాజగోపాలరావు, చీఫ్ రిపోర్టర్ పాపయ్య శాస్త్రి గారల వద్ద పని చేయటం. మహా రచయితలు తిరు మల రామచంద్ర, రామ్‌ప్రసాద్, నిడదవోలు శివ సుందరేశ్వరరావు, ద్రోణంరాజు కృష్ణమోహన్, సం తానం గోపాలరావు, మందరపు లలిత, రామచం ద్రయ్య సహా సీనియర్ జర్నలిస్టులు పాశం యాద గిరి, జొన్నలగడ్డ రాధాకృష్ణ, ప్రభంజన్ (కార్టూ నిస్టు), కడెంపల్లి వేణుగోపాల్, మొక్కరాల వెంకట రత్నం తదితరులతో కలిసి పని చేయడం నా అదృష్టం.. వీరంతా నన్ను ఎంతో ప్రో త్సహించారు, వార్తా రచన విషయంలో మరింత మెరుగులు దిద్దారు. రాజగో పాలరావు, రామ్‌ప్రసాద్, సుందరేశ్వర రావు ఉన్నారంటే అటు ఎడిటోరియల్ డిపార్ట్మెంటులో ఇటు రిపోర్టింగ్ సెక్ష న్లో సందడే సందడి. కోట్ల విజయ భాస్కరరెడ్డి, మర్రి చెన్నారెడ్డి, ఎన్టీ రామారావు సీఎంలుగా ఉండే రోజు ల్లో ఉదయం 8 గంటలకల్లా సమీక్షా సమావేశాలు ప్రారంభమయ్యేవి. సమాచారాన్ని కవర్ చేసుకొని హడావుడిగా ఆఫీసు చేరుకొని ఈవినింగ్ ఎడిషన్‌కు వార్త రాసేసి గబగబా మరో ఎసైన్మెంట్ కవర్ చేసేందుకు బయలుదేరే వాళ్లం. ఈవినింగ్ ఎడిష న్కు వార్త ఇచ్చేద్దామని రిపోర్టర్స్ సెక్షన్లో కూర్చో వటమే ఆలస్యం... మెలమెల్లగా ఓ టాల్కం పౌడర్ వాసన మా సెక్షన్లోకి చొరబడేది. ఆ వెనకే నవ్వు తూ సీవీఆర్ వచ్చేసి ఎదురుగా ఎవరి టేబుల్ ఖాళీగా కనిపిస్తే ఆ టేబుల్‌పై కూర్చొని ‘ఏం స్వామీ, ఫస్ట్ పేజీ కోసం ఏమిస్తున్నారూ...’ అం టూ పలకరించేవారు. మా ఎడిటర్ సీవీ రాజగోపాలరావు గారిని మేమంతా సీవీ ఆర్ అని పిలుచుకునే వారం. ఫలానా అంశంపై స్టోరీ, ఫలానా ప్రోగ్రాంలో సీఎం మాట్లాడిన విషయంపై వార్త ఇస్తు న్నానని చెప్పగానే త్వరత్వరగా ఇచ్చే యండి అని చెబుతూనే ఆఫీస్ బాయ్‌తో ‘ఇదిగో.. దుర్గారావ్.. విద్యారణ్యగారికి, నాకూ కాఫీ పట్టుకొచ్చేయ్... డెస్క్‌లో రామ్‌ప్రసాద్ గారు వచ్చినట్లున్నారు, ఆయన్ని రమ్మను’ అని ఆర్డ రేసేసే వారు. ‘ఆయనింకా రాలేదండీ’ అని దుర్గా రావ్ జవాబిస్తే ‘అదేంటయ్యా.. ఆఫీస్ వరండాలో చుట్ట వాసన కొడుతుంటేనూ..’ అని నవ్వేసేవారు.. ఈ లోగా రాంప్రసాద్‌గారు కూడా మా సెక్షన్లో కొచ్చి కూర్చొని సీవీఆర్ గారితో బాతాఖానీ వేసే వారు. ఆ బాతాఖానీలో తెలుగు జర్నలిజం చరిత్ర, తెలుగు సాహిత్యం, ఆనాటి రాజకీయాలపై విశ్లేషణ చోటు చేసుకునేవి. మధ్య మధ్యలో సీవీఆర్గారు జోక్యం చేసుకుని ‘విద్యారణ్యగారూ, ఎప్పుైడైనా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలపై నిష్పాక్షికంగా రాయండి... వార్తా రచనలో పదాలను ఆచి తూచి ఉపయోగించాలి’ అంటూ నిర్దేశించేవారు. ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులుగారి ప్రజాపత్రి కలో విలేకరి/ఉప సంపాదకుడిగా ఉద్యోగంలో చేరి న సీవీఆర్ ఆ తర్వాత ఆంధ్రపత్రికలో చేరి ఎడిటర్ స్థాయికి చేరుకున్నారు. ఎంతటి తీవ్ర సమస్య అయి నా సంయమనాన్ని పాటించి, విశ్లేషించి విలేకరుల తో రాయించటం, అందుకు తగ్గట్టు అద్భుతమైన శీర్షికలు పెట్టడం సీవీఆర్గారి స్టైల్. నాటి సీఎం ఎన్టీ ఆర్, ఎన్నికల్లో ఆనాటి ప్రముఖుడు ఆరేటి కోటయ్య కు టికెట్ ఇచ్చేందుకు నిరాకరించారు. మరుసటి రోజు మిగతా తెలుగు పత్రికలలో ‘కోటయ్యకు టికె ట్ లేదు. కోటయ్యకు చెయ్యిచ్చిన ఎన్టీఆర్’ లాంటి శీర్షికలతో వార్తలొచ్చాయి. అయితే ఆంధ్రపత్రికలో వచ్చిన వార్తా శీర్షిక ‘‘కోటయ్యకు ఎన్టీఆర్ ‘నమస్కా రం’-టికెట్‌కు బదులు ఆర్టీసీ ఛైర్మన్ పదవి’’ అని. కలం పట్టిన వాడు నిజాయితీగా నిబద్ధతతో పనిచే యాలేగాని, సెన్సేషన్ సృష్టించడం కోసం తన రాత లతో ఎవరినీ హర్ట్ చేయకూడదంటారు సీవీఆర్. (వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు) ఈమెయిల్: vidyaranyahgmail.com -
వినేవాడు లోకువ అయితే..!
సాక్షి ప్రతినిధి, కడప: ‘వినేవాడు లోకువైతే చెప్పేవాడు చంద్రబాబు’ అన్న సూక్తి మరోమారు రుజువు అయింది. గండికోట ప్రాజెక్టుకు శంకుస్థాపన మినహా ఆ ప్రాజెక్టు సాధనలో గతంలో ఏమాత్రం చిత్తశుద్ధి ప్రదర్శించలేదు. ఇప్పుడేమో తానే నీళ్లు తెస్తున్నానని ప్రకటిస్తున్నారు. తొమ్మిది సంవత్సరాల చంద్రబాబు హయాంలో కేవలం రూ.19 కోట్లు మాత్రమే ఖర్చు చేశారంటే దీనిపై ఆయనకున్న చిత్తశుద్ధి ఏపాటిదో అర్థం అవుతుంది. పైగా జిఎన్ఎస్ఎస్ సాధ్యం కాదని కృష్ణస్వామి కమిటీ ఏర్పాటు చేసి రద్దు చేయాలని చూశారు. 3 టీఎంసీల సామర్థ్యంతో పెన్నా వరదను ఆధారంగా చేసుకుని నిర్మిస్తే సరిపోతుందని అప్పట్లో ప్రాజెక్టుకు గండికొట్టబోయారని సాగునీటి రంగ నిపుణులు ఆరోపిస్తున్నారు. గాలేరి-నగరి సుజల స్రవంతి రూపకర్త దివంగత ఎన్టీరామారావు అని, గండికోట ప్రాజెక్టుకు తానే శంకుస్థాపన చేశానని, కాలువు గట్టుపై నిద్రించైనా గండికోటకు నీరు తెస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం ప్రకటించారు. మెట్ట ప్రాంతానికి నీరు తీసుకరావడం హర్షించదగ్గ పరిణామం. అయితే ఆచరణ సాధ్యంకానీ హామీలు గుప్పించడంలో చంద్రబాబుకు మరెవ్వరూ సాటిరారనేది గతం చెబుతున్న సత్యం. జిఎన్ఎస్ఎస్ రూపకర్త ఎన్టీరామారావు అయినప్పటికీ చిత్తశుద్ధితో ఆ ప్రాజెక్టును పూర్తికి భారీగా నిధులు మంజూరు చేసింది మాత్రం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అన్నది వాస్తవం. 2004-09 మధ్య దివంగతనేత హయాంలోనే రూ.3800 కోట్లు జిఎన్ఎస్ఎస్ కోసం ఖర్చు చేశారని లెక్కలు చెబుతున్నాయి. నాడు జిఎన్‌ఎస్‌ఎస్‌కు మంగళం పలికే ఎత్తుగడ.... చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా 1998లో జిఎన్ఎస్ఎస్ ప్రాజెక్టు సాధ్యం కాదనే నిర్ణయానికి వచ్చారు. ప్రాజెక్టుపై వాస్తవ విషయాలను తెలుసుకునే పేరుతో కృష్ణస్వామి నేతృత్వంలో కమిటీ నియమించారు. ఆమేరకు కృష్ణస్వామి కమిటీ జిఎన్ఎస్ఎస్ సాధ్యం కాదని, ఎక్కడికక్కడ స్థానికంగా రిజర్వాయర్లు నిర్మించుకోవాలని నివేదిక అందించింది. అందులో భాగంగా పెన్నానదిలో ప్రవహించే వరద నీటితో 3 టీఎంసీల సామర్థ్యంతో గండికోట నిర్ణయించాలని నివేదించారు. అలాంటి తరుణంలో రాయలసీమ నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం అయింది. మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు ఎంవి మైసూరారెడ్డి గండికోట నుంచి నగరి వరకూ పాదయాత్ర చేపట్టారు. ప్రజాసంఘాలతో కలుపుకుని 420 కిలోమీటర్లు 21 రోజలకు పైగా పాదయాత్ర చేపట్టారు. అందువల్లే జిఎన్ఎస్ఎస్ రద్దు యోచన చంద్రబాబు విరమించుకున్నారు. వాస్తవ పరిస్థితులు ఇలా ఉంటే తనవల్లే గండికోట సాధ్యమైందని చంద్రబాబు చెప్పుకోవడం అంటే బాకా ఊదుకోవడమే అవుతుంది. రాయలసీమ పట్ల కంటితుడుపు మాటలే.... ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాయలసీమ పట్ల ప్రేమలేదని, కేవలం కంటితుడుపు మాటలేనని ఈమారు శ్రీశైలం ప్రాజెక్టు నీటి వాటాలను పరిశీలిస్తే అర్థం అవుతుంది. మొన్నటి వర్షాకాలంలో కృష్ణ, తుంగభద్ర నదులు పరవళ్లు తొక్కాయి. ఆ నదుల ద్వారా 2014 జూలై 30 నుంచే శ్రీశైలం ప్రాజెక్టులోకి వరదనీరు చేరిక మొదలైంది. కృష్ణా జలాలు 182 టిఎంసీలు శ్రీశైలం లోకి వచ్చాయి. తుంగభద్ర నుంచి 302 టీఎంసీలు వచ్చిచేరాయి. అందులో కేవలం 82 టీఎంసీలు మాత్రమే ఎస్సార్బీసీ, తెలుగుగంగ, చెన్నై తాగునీటి అవసరాలతో పాటు రాయలసీమకు ఇచ్చినట్లు అధికారికవర్గాలు ధ్రువీకరిస్తున్నాయి. 2008లోనే బ్రహ్మంసాగర్‌కు 12టిఎంసీలు నీరు చేరితే, పుష్కలంగా నీరున్నప్పుడు 1టిఎంసీ కూడా చేరలేదన్నది యధార్థం. రాయలసీమ ప్రాంతవాసే ముఖ్యమంత్రిగా ఉండి కూడా సాగు, తాగునీరు అందించడంలో తీవ్ర అన్యాయం చేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా నిధులు కేటాయించి, సత్వరమే పెండింగ్ పనులు పూర్తి చేయాలని జిల్లా వాసులు కోరుతున్నారు. సాగునీటి సంకల్పంతో నిరవదిక దీక్ష... వెనుకబడ్డ ప్రాంతంలో సాగు, తాగునీటి ఆవశ్యకతను గుర్తించిన దివంగతనేత వైఎస్ రాజశేఖరరెడ్డిని ఆదర్శంగా తీసుకుని ఆయన వారసత్వంతో వెలిసిన వైఎస్సార్సీపీ కంకణం కట్టుకుంది. అందులో భాగంగా రాజకీయపార్టీలను ప్రజా సంఘాలను కలుపుకుని అఖిలపక్షంగా ఏర్పడి ప్రాజెక్టుల సాధన కోసం ఉద్యమిస్తోంది. రెండురోజలుగా పోతిరెడ్డిపాడు నుంచి గండికోట వరకూ క్షేత్రస్థాయిలో పర్యటన చేపట్టారు. అనంతరం సర్వరాయసాగర్‌ను సత్వరమే పూర్తి చేయాలని, కమలాపురం నియోజకవర్గానికి తాగునీరు, సాగునీరు అందించాలనే సంకల్పంతో ఆదివారం నుంచి వీరపునాయునిపల్లెలో కమలాపురం ఎమ్మెల్యే పి రవీంద్రనాథరెడ్డి నిరవదిక నిరహార దీక్ష చేపట్టనున్నారు. -
చరిత మరువని నటనా చతురత
సందర్భం: ఎన్టీఆర్ వర్ధంతి నటులు చాలామందే ఉండవచ్చు. కానీ, భౌతికంగా కనుమరుగైనా కాలానికి అతీతంగా మనసుల్లో చిరంజీవులుగా నిలిచేవారు కొందరే. ‘నటరత్న’ అని అప్పటి ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి అభివర్ణించిన నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) అచ్చంగా అలాంటి చిరంజీవి. దానికి కారణం లేకపోలేదు. గణాంకాలను బట్టి చూస్తే, ఆయన నటించిన 300 పైచిలుకు చిత్రాల్లో 123 సాంఘికేతర చిత్రాలే. (57 జానపదాలు, 48 పౌరాణికాలు, 18 చారిత్రకాలు). అన్ని విభిన్న సాంఘికేతర చిత్రాల్లో నటించిన ఒకే ఒక్క హీరో ఆయన. ఏ పాత్ర పోషిస్తే, ఆ పాత్రే ఆయన అన్నట్లుగా అందులో ఒదిగిపోవడం ఈ చిత్రాలన్నిటిలో చూడవచ్చు. పౌరాణిక పాత్రలైతే ఇక చెప్పనే అక్కరలేదు. అందుకే, ఇవాళ్టికీ తెలుగు నాట ఏ పండగ వచ్చినా, టీవీల్లో ప్రత్యేకంగా ఆయన చిత్రాలే కనిపిస్తాయి. సాంఘిక చిత్రాల్లో కూడా దర్శకుడిగా తాను చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక సందేశం, పరమార్థం ఉండేలా చూడడం ఎన్టీఆర్లోని విశిష్టత. మరోపక్క 1940ల చివర నుంచి 1980ల దాకా సుదీర్ఘకాలం స్టార్‌గా నిలవడంతో, ఏకంగా 7 తరాల వాళ్లు ఆయనకు నాయిక లయ్యారు. అలాగే, తల్లీకూతుళ్లిద్దరికీ హీరోగా నటించిన అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. తల్లి సంధ్యతో ‘మాయాబజార్’- కూతురు జయలలితతో ‘కథానాయకుడు’, తల్లి అమ్మాజీతో ‘దైవబలం’ - కూతురు జయచిత్రతో ‘బొబ్బిలిపులి’ మచ్చుకు కొన్ని. గమ్మత్తేమిటంటే, ఆయన పౌరాణిక చిత్రాలు ఇటు టీవీల్లోనే కాక, అటు అప్పటి వీడియో క్యాసెట్లు నుంచి ఇప్పటి డీవీడీల దాకా అమ్ముడవుతూనే ఉన్నాయి. ‘దానవీరశూర కర్ణ’ లాంటి ఆయన చిత్రాల డీవీడీలు, డైలాగ్‌లు ఇవాళ్టికీ హాట్‌కేకులు. తెలుగు సినీ చరిత్రలో ఎన్టీఆర్‌ది చెరగని సంతకమనేదందుకే. తెర మరుగైన వెంటనే నటులూ జనం మనసులో నుంచి కనుమరుగయ్యే కాలంలో... కన్నుమూసి 19 ఏళ్ళు నిండిన తరువాత ఇవాళ్టికీ నిత్యస్మరణీయుడిగా మిగలడం ఆయనకే దక్కిన జన నీరాజనం. అందుకే, ‘దానవీర శూర కర్ణ’లోని డైలాగుల ఫక్కీలోనే చెప్పాలంటే... ‘చరిత మరువదు నీ (నటనా) చతురత, జనం మదిలో నిలిచిన నీకే దక్కును ఎనలేని ఘనత!’ -
ప్రతి భాషనూ నేర్చుకుని నటించాను
అంతర్వీక్షణం: రతీ అగ్నిహోత్రి రతీ అగ్నిహోత్రి అంటే... ప్రేమసింహాసనం, కలియుగరాముడు సినిమాల్లో ఎన్.టి. రామారావు పక్కన బంగారు తీగలా కనిపించిన అమ్మాయి. సత్యం శివంలో ఏఎన్నార్‌కి జోడీ. ఇంకా చెప్పాలంటే ‘శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర’ సినిమాలో బాలకృష్ణ సరసన నటించి సినిమాకు డ్యూయెట్ల గ్లామర్నద్దిన రూపసి. మరోచరిత్రలో నటి సరిత నటించిన పాత్రను హిందీలో ‘ఏక్ తుజే కే లియే’ సినిమాతో దేశమంతటికీ పరిచయం చేసిన నటి. ఇవాళ రతి అగ్నిహోత్రి పుట్టిన రోజు. ఈ సందర్బంగా ఆమె అంతర్వీక్షణం. పంజాబీ కుటుంబంలో పుట్టిన మీకు దక్షిణాది సౌకర్యంగా అనిపించిందా? మాది పంజాబీ కుటుంబమే అయినా నేను పుట్టేనాటికి మా కుటుంబం ముంబయిలో ఉండేది. నా స్కూలు రోజుల్లోనే నాన్నకు చెన్నైకి బదిలీకావడంతో ఆ వాతావరణం బాగా అలవాటైంది. నాకెప్పుడూ దక్షిణాది కొత్తగా అనిపించలేదు. నా పుట్టింటిలాగానే భావించాను. సినిమారంగంలో అవకాశం వచ్చినప్పుడు ఎలా అనిపించింది? నేను చెన్నైలోని ‘గుడ్ షెఫర్డ్స్’ కాన్వెంట్లో చదువుకుంటున్నప్పుడు పాఠశాల వార్షికోత్సవంలో ఓ నాటకంలో నటించాను. ఆ సాంస్కృతిక కార్యక్రమాలకు వచ్చిన వారు దర్శకులు భారతీరాజా అనే విషయం కూడా తెలియదు. ఆయన నేరుగా నాన్నగారిని కలిసి తన సినిమాలో నటించమని అడిగినప్పుడు నేను చాలా ఉద్వేగానికి లోనయ్యాను. భారతీరాజా వంటి పెద్దాయన అడగడంతో కాదనలేక నాన్న అయిష్టంగానే అంగీకరించారు. అన్ని దక్షిణాది భాషల్లోనూ నటించారు కదా! మరి అన్ని భాషలూ నేర్చుకున్నారా? ఇప్పుడెవరూ అంత పట్టుదలగా నేర్చుకుంటున్నట్లు కనిపించడం లేదు! భాష నేర్చుకుని డైలాగ్‌ని పలికితే నటనలో యాభై శాతం పాసైనట్లే. నేను ప్రతి భాషనూ నేర్చుకుని నటించాను. తెలుగు, కన్నడ బాగా మాట్లాడతాను. మలయాళం కూడా ఫర్వాలేదు ఓ మోస్తరుగా వచ్చు. హిందీ సినిమాల్లో కెరీర్ ఉన్నత స్థాయిలో ఉండగానే తెరమరుగయినందుకు తర్వాత చింతించారా? ఏ మాత్రం లేదు. అనిల్‌ని పెళ్లి చేసుకోవడం నేను ఇష్టపడి తీసుకున్న నిర్ణయం. పెళ్లి తర్వాత వైవాహిక జీవితానికి, కుటుంబానికి పరిమితం కావాలనేది కూడా నేను ఇష్టంగా తీసుకున్న నిర్ణయమే. పైగా అది అవసరమైన నిర్ణయం కూడా. మరి దాదాపు 15 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ నటించాలని ఎందుకనిపించింది? మా అబ్బాయి తనూజ్ పెద్దయ్యాడు. నాకు అవసరానికి మించినంత ఖాళీ సమయం ఉంది. ‘మళ్లీ నటించవచ్చు కదా’ అని మావారు, అబ్బాయి ఇద్దరూ ప్రోత్సహించడంతో అంగీకరించాను. ఆ పదిహేనేళ్ల కాలాన్ని వెనక్కి చూసుకుంటే మీకేమనిపిస్తోంది? ఆ విరామంలో నేను చాలా నేర్చుకున్నాను. మా వారు ఆర్కిటెక్ట్ కావడంతో ఆయన వృత్తి వ్యవహారాల్లో ల్యాండ్ స్కేప్ డిజైనింగ్ వంటి నాకు తోచినవేవో చేసేదాన్ని. గ్లాస్ పెయింటింగ్స్ వేశాను. శిల్పాల తయారీలో శిక్షణ తీసుకున్నాను. నేను సొంతంగా డ్రై ఫ్లవర్స్ తయారు చేస్తాను కూడా. వీటన్నింటితోపాటు ‘రేకీ’ అనే వైద్య ప్రక్రియలో కోర్సు చేశాను. వివాహం, భర్త ఎంపిక విషయంలో తొందరపడి నిర్ణయం తీసుకున్నానని ఎప్పుడైనా అనిపించిందా? నా పెళ్లయి దాదాపు 30 ఏళ్లయింది. సరైన నిర్ణయం తీసుకున్నాననే విశ్వాసంతోపాటు జీవితాన్ని చక్కగా మలుచుకున్నాననే సంతోషం కూడా ఉంది. -
ఎన్టీఆర్ మృతిపై విచారణ
తెలంగాణ సీఎం కేసీఆర్‌కు లక్ష్మీపార్వతి లేఖ సాక్షి, హైదరాబాద్: ఏపీ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు మృతిపై విచారణ కోరుతూ ఆయన సతీ మణి, మాజీ ఎమ్మెల్యే నందమూరి లక్ష్మీపార్వతి తెలంగాణ సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. శంషాబాద్ విమానాశ్రయ దేశీయ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు కొనసాగించినంత మాత్రాన తెలంగాణకు నష్టం వాటిల్లదని, దానిపై వివాదానికి తావ్వివద్దని కోరారు. లక్ష్మీపార్వతి శుక్రవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లేఖ ప్రతులను విడుదల చేశారు. విమానాశ్రయ టెర్మినల్ తిరిగి ఎన్టీఆర్ పేరు పెట్టిన నేప థ్యంలో కాంగ్రెస్ ఎంపీ వి.హనుమంతరావు మాట్లాడుతూ... ఎన్టీఆర్ మృతిపై విచారణ జరపాలంటూ డిమాండ్ చేయడాన్ని లేఖలో ప్రస్తావించారు. వీహెచ్ డిమాండ్‌కు స్పందిస్తూ తానూ కేసీఆర్‌కు లేఖ రాస్తున్నట్టు చెప్పారు. ఎన్టీఆర్ చనిపోవడానికి ముందు రోజు 1996 జనవరి 17వ తేదీన ఏం జరిగిందన్న దానిపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని ఆమె డిమాండ్ చేశారు. విచారణ కమిటీలో టీడీపీ సీనియర్ నాయకుడిని కూడా సభ్యుడి నియమించినా తనకు అభ్యంతరం లేదని చెప్పారు. చంద్రబాబు, ఆయన తోకపత్రికలు మసిపూసి మారేడుకాయ చేసిన వాస్తవాలు వెలుగులోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. -
తీసేసిన తహసిల్దార్‌గా కూడా దిగ్విజయ్ పనికిరారు: సోమిరెడ్డి
శంషాబాద్ విమానాశ్రయంలోని డొమెస్టిక్ టెర్మినల్ పేరు మార్పుపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ మతిభ్రమించి మాట్లాడుతున్నారని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి మండిపడ్డారు. ఎన్టీ రామారావు జాతీయస్థాయి నేత అన్న విషయాన్ని దిగ్విజయ్ గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు. తెలంగాణలో బడుగు, బలహీనవర్గాల వారికి రాజ్యాధికారం కల్పించింది ఎన్టీఆరేనని సోమిరెడ్డి అన్నారు. తీసేసిన తహసిల్దార్‌గా కూడా పనికిరాని దిగ్విజయ్ సింగ్‌కు ఎన్టీఆర్ గురించి మాట్లాడే అర్హత ఏమాత్రం లేదని చెప్పారు. -
నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి
ఎయిర్పోర్ట్ టెర్మినల్ పేరు మార్పుచేస్తే సహించం సోమాజీగూడ వద్ద జరిగిన ధర్నాలో కాంగ్రెస్ నేతల డిమాండ్ సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టు దేశీయ టెర్మినల్‌కు ఎన్టీ రామారావు పేరును పెడుతూ తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. విమానాశ్రయంలోని అంతర్జాతీయ, దేశీయ టెర్మినళ్లకూ మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ పేరునే కొనసాగించాలని కోరారు. ఎన్టీఆర్‌పై ప్రేమ ఒలకబోస్తున్న వారంతా.. ఆయన్ను చెప్పులతో కొట్టించినప్పుడు ఎక్కడికి పోయారని ప్రశ్నించారు. ఏపీ సీఎం చంద్రబాబు కుట్రచేసి ఈ నిర్ణయం తీసుకునేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చారని విమర్శించారు. కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా సోమవారం (24న) అన్ని జిల్లాల్లో ధర్నా కార్యక్రమాలను చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. శనివారం సోమాజిగూడలోని రాజీవ్‌గాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన ధర్నాలో పార్టీ నాయకులు పొన్నాల లక్ష్మయ్య, కె.జానారెడ్డి, డి.శ్రీనివాస్, మహ్మద్ అలీ షబ్బీర్, వి.హనుమంతరావు, దానం నాగేందర్, పొన్నం ప్రభాకర్, సిరిసిల్ల రాజయ్య, అంజన్‌కుమార్‌యాదవ్, శ్రీశైలం గౌడ్, భిక్షపతియాదవ్ తదితరులు పాల్గొన్నారు. రాజీవ్‌గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం వారు ఆ విగ్రహానికి పాలాభిషేకం చేశారు.ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల మాట్లాడుతూ దేశం కోసం ప్రాణత్యాగం సైతం చేసిన మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీని ఇలా అవమానించడాన్ని ఖండిస్తున్నామన్నారు. -
పురందేశ్వరి ప్రతిభను ఎన్టీఆర్ గుర్తించలేకపోయారు
* మాజీ ఎంపీ లగడపాటి పావగడ : ‘కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి ప్రతిభను ఆమె తండ్రి ఎన్టీ రామారావు గుర్తించలేకపోయారు. గుర్తించి ఉంటే ఆమె త ప్పకుండా ముఖ్యమం త్రి అయ్యేవారు’ అని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. ఆదివారం ఆయన కర్ణాటకలోని పావగడ పట్టణంలో కమ్మ హాస్టల్ వద్ద బాలికల వసతినిలయం ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ.. తాను రాజకీయ సన్యాసం తీసుకున్న తరువాత వేదికలపై మాట్లాడడం ఇదే మొదటి సారని, అందులోనూ కార్యక్రమ నిర్వాహకుల ఒత్తిడి మేరకు మాట్లాడుతున్నానని చెప్పారు. రాజకీయాల గురించి అసలు మాట్లాడనని చెబుతూనే.. పురందేశ్వరిపై పొగడ్తల వ ర్షం కురిపించారు. ‘ఈమెకు ఎంతో ప్రతిభ, నైపుణ్యం ఉన్నాయి. ఎన్టీఆర్ ఎం దుకో గుర్తించలేకపోయారు. ఇప్పుడు ఎంతోమంది సీఎంలు అవుతున్నారు. ఆ పదవికి పురందేశ్వరి అన్ని విధాలా అర్హురాలు’ అని అన్నారు. పురందేశ్వరి మాట్లాడుతూ తెలుగు వాళ్లను మద్రాసీలుగా భావిస్తున్న తరుణంలో ఎన్టీఆర్ తెలుగు ఖ్యాతిని ప్రపంచానికి చాటారని కొనియాడారు. కులాభిమానం ఉండాలని.. దురభిమానం ఉండకూడదని ఎన్టీఆర్ చెప్పిన మాటలను గుర్తు చేశారు. కులమత భేదం లేకుండా విద్యార్థులకు ఉచిత హాస్టల్ వసతి కల్పించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర చౌదరి, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి, మాజీ మంత్రి సుబ్రమణ్యం నాయుడు, ఎమ్మెల్సీ ఉగ్రప్ప, ఎమ్మెల్యే తిమ్మరాయప్ప, కమ్మసంఘం నాయకులు డాక్టర్ వెంకటరామయ్య, డీసీ రామాంజనేయులు, ఎంపీ చంద్రప్ప, చన్నిగప్ప, ప్రత్తిపాటి ఆంజనేయులు పాల్గొన్నారు. -
ఏపీ విజిలెన్స్ కమిషనర్‌గా ఎస్వీ ప్రసాద్
రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు రేపటి నుంచి మూడేళ్లపాటు పదవిలో ఐఏఎస్ అధికారిగా ఉమ్మడి రాష్ట్రంలో 4 దశాబ్దాలు సేవలందించిన ప్రసాద్ సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మొదటి విజిలెన్స్ కమిషనర్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎస్వీ ప్రసాద్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఉమ్మడి రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్‌గా ఉన్న ప్రసాద్‌ను ఆంధ్రప్రదేశ్‌కు కమిషనర్‌గా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన బుధవారం నుంచి మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు. ఎస్వీ ప్రసాద్ గత నాలుగు దశాబ్దాలుగా ఉమ్మడి రాష్ట్రంలో అనేక హోదాల్లో పనిచేశారు. మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన ప్రసాద్ ఆ తర్వాత అహ్మదాబాద్ ఐఐఎంలో ఎంబీఏ చదివారు. 1975లో అఖిల భారత సర్వీసులకు ఎంపికయ్యారు. మొదట గూడూరు సబ్ కలెక్టర్‌గా నియమితులయ్యారు. ఆ తర్వాత పలు ప్రభుత్వ విభాగాల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సేవలందించారు. ఆయన ప్రతిభా పాటవాలను చూసి నలుగురు ముఖ్యమంత్రులు వారి పేషీల్లో వివిధ హోదాల్లో నియమించుకున్నారు. ఎన్టీ రామారావు, కోట్ల విజయభాస్కరరెడ్డి, ఎన్.జనార్దన్‌రెడ్డి, చంద్రబాబుల పేషీల్లో కార్యదర్శి, ముఖ్య కార్యదర్శి హోదాల్లో పనిచేశారు. ఏపీ జెన్కో చైర్మన్‌గా, ఏపీఎస్ ఆర్టీసీ వైస్‌చైర్మన్‌తోపాటు పలు కార్పొరేషన్లకు చైర్మన్‌గా కూడా ఆయన సేవలందించారు. 2010లో తుపాను వచ్చిన సమయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శింగా ప్రసాద్ చూపిన చొరవను అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కొనియాడారు. తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు కట్టబెట్టడంపై ఆయన సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. -
అధికారిక జాబితాలో ఎన్టీఆర్ పేరు లేదు
ఎల్ అండ్ టీ చైర్మన్‌కు ‘పద్మ విభూషణ్’ సిఫార్సు న్యూఢిల్లీ: పద్మ అవార్డుల కోసం ఆంధ్రప్రదేశ్ సీఎస్ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ స్కూృటినీ చేసి పంపిన జాబితాలో దివంగత ఎన్.టి. రామారావు పేరు లేదని కేంద్ర హోంశాఖ వర్గాలు తెలిపాయి. అసలు భారత రత్న కోసం ఎవరి పేరూ సిఫార్సు చేయలేదని వెల్లడించాయి. పద్మ అవార్డుల కోసం ప్రభుత్వం కేంద్రానికి పంపిన జాబితాలో ప్రతిపాదిత పేర్లివీ.. ► పద్మ విభూషణ్: ఎ.ఎం. నాయక్ (ఎల్ అండ్ టీ చైర్మన్), నోరి దత్తాత్రేయుడు (డాక్టర్), బాపు (ప్రముఖ చిత్రకారుడు, ప్రముఖ దర్శకుడు), నాగేశ్వరరెడ్డి (డాక్టర్), రాజిరెడ్డి (ఐటీ) ► పద్మ భూషణ్: చాగంటి కోటేశ్వరరావు (సంస్కృత పండితుడు), నేదునూరి కృష్ణమూర్తి (సంగీతం), మురళీమోహన్ (సినీ రంగం). ► పద్మ శ్రీ: మోహన్ కందా (రిటైర్డ్ ఐఏఎస్), సత్యవాణి (సాంఘిక సేవా రంగం), ఎ.కన్యాకుమారి (వయోలిన్ విద్వాంసురాలు), కోట శ్రీనివాసరావు (సినీనటుడు), గల్లా రామ చంద్రనాయుడు (వాణిజ్యం), పసుమర్తి శర్మ(కూచిపూడి), శ్రీధర్ (కార్టూనిస్ట్), ఐ.వెంకట్రావు (పాత్రికేయుడు) -
అన్నగారే ఆదుకున్నారు...
హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాల్లో దివంగత ఎన్.టి.రామారావుది ప్రత్యేక ముద్ర. ఆయన మరణించి దాదాపు రెండు దశాబ్దాలు కావస్తోంది. ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు నాయుడు తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. మరో పదేళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. మూడోసారి మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబుకున్న ఈ ఘనతలేవీ తాజా బడ్జెట్ సమావేశాల్లో అధికార తెలుగుదేశం పార్టీని ఆదుకోలేదు. దివంగత అన్నగారే అధికారపక్షాన్ని ఆదుకున్నారు. ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంక్షేమం గురించి, సాగునీటి ప్రాజెక్టుల గురించి సభలో ప్రస్తావించిన ప్రతిసారీ.. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టుల పేరు చెప్పి అధికార పార్టీ నెట్టుకొచ్చింది. * చంద్రబాబు హయాంలో దిష్టి చుక్కలు పెట్టినట్లు ఒక్కో వీధిలో ఒకటో, రెండో పక్కా ఇళ్లు ఇచ్చారని, వైఎస్ పార్టీలకు అతీతంగా పేదలందరికీ పక్కా ఇళ్లు మంజూరు చేసి దేశంలోనే రికార్డు సృష్టించారని ప్రతి పక్షం విమర్శలు గుప్పించినప్పుడు.. పక్కా ఇళ్ల పథకానికి ఎన్టీఆర్ కొత్త అర్థం చెప్పారని, ఆ ఘనత టీడీపీదేనని అధికార పక్ష సభ్యులు ఘనంగా చెప్పుకున్నారు. * డ్వాక్రా సంఘాల రుణాలు రద్దు చేయకుండా సంఘానికి రూ. లక్ష చొప్పున సరికొత్త పెట్టుబడి సమకూరుస్తామంటూ కొత్త రాగం ఎత్తుకున్న తీరును విపక్షం విమర్శించింది. మహిళా సాధికారత గురించి అధికారపక్షం మాట్లాడాల్సి వస్తే.. మళ్లీ అన్నగారే ఆదుకున్నారు. *బీసీల అభ్యున్నతికి ఎంతో చేస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వరాల వర్షం కురిపిస్తే.. చర్చలో పాల్గొన్న టీడీపీ సభ్యులంతా బీసీలకు రాజకీయ అధికారం చేతికందడానికి ఎన్టీఆర్ కారణమని గట్టిగా వాదించారే తప్ప.. చంద్రబాబు నాటి 9 సంవత్సరాల్లో బీసీలకు చేసిందేమిటనే విషయం జోలికి వెళ్లలేదు. * వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇచ్చి రైతులను వైఎస్ ఆదుకున్నారని విపక్షం ఘనంగా చెప్పినప్పుడు.. ఎన్టీఆర్ రూ. 50కే ఒక హార్స్పవర్ ఇచ్చిన విషయాన్ని టీడీపీ నేతలు గుర్తు చేసి తప్పించుకున్నారు. విద్యుత్ చార్జీలు పెంచి ప్రజల మీద భారం మోపిన ఘనత చంద్రబాబుదేనని, విద్యుత్ చార్జీలు తగ్గించాలని ఉద్యమించిన ప్రజలపై బషీర్‌బాగ్‌లో కాల్పులు జరిపి ప్రజల రక్తం కళ్లజూసిన ముఖ్యమంత్రి.. అవన్నీ మరిచి విద్యుత్ రంగం శ్వేతపత్రాన్ని అసత్యాలు, అర్ధసత్యాలతో నింపేశారని విపక్ష నేత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ తీరును తూర్పారబట్టినప్పుడూ.. మళ్లీ ఎన్టీఆర్ పేరునే టీడీపీ సభ్యులు స్మరించుకున్నారు. ఒక హార్స్పవర్ సామర్థ్యం ఉన్న పంప్‌సెట్‌కు నెలకు రూ. 50కే విద్యుత్ ఇచ్చి రైతులను ఎన్టీఆర్ ఆదుకున్నారని పదేపదే చెప్పారు. విద్యుత్ చార్జీల అంశం వచ్చినప్పుడు చంద్రబాబు పేరు ప్రస్తావించకుండా అధికారపక్ష సభ్యులు జాగ్రత్తపడ్డారు. * ఎన్టీఆర్ చేపట్టిన రూ. 2కే కిలో బియ్యం, సంపూర్ణ మద్య నిషేధాన్ని టీడీపీ తమ ఖాతాలో జమ వేసుకుం ది. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన రూ. 2కే కిలో బియ్యం పథకానికి, మద్య నిషేధానికి, రైతులకు రూ. 50కే ఒక హెచ్ పీ విద్యుత్ సరఫరాకు తూట్లు పొడిచింది చంద్రబాబే అని ప్రతిపక్షం దాడికి దిగినప్పుడు.. విపక్ష నేత మీద లేనిపోని ఆరోపణలతో ఎదురుదాడి చేసి బయటపడడానికి అధికార పక్షం శతవిధాలా ప్రయత్నించింది. * శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో మాట్లాడిన టీడీపీ సభ్యుల్లో దాదాపు అందరూ ఎన్టీఆర్‌ను ప్రస్తావించారు. కేవలం చంద్రబాబు 9 సంవత్సరాల పాలన గురించి మాత్రమే మాట్లాడి సరిపెట్టిన నేతలు దాదాపు లేరు. మొత్తం మీద.. చంద్రబాబుకు అధికారాన్ని అందుకోవడానికి ఉపయోగపడిన ఎన్.టి.రామారావే రెండు దశాబ్దాల తర్వాత కూడా అసెంబ్లీలో నెగ్గుకురావడానికీ అధికార పక్షానికి ఆసరాగా నిలవడం గమనార్హం. -
చేవెళ్ల-ప్రాణహిత కోసం పోరాటం
చేవెళ్ల, న్యూస్‌లైన్: చేవెళ్ల-ప్రాణహిత ప్రాజెక్టును సాధించడానికి రాజీలేని పోరాటం చేస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. మొయినాబాద్ మండల పరిధిలోని హిమాయత్‌నగర్ గ్రామశివారులో గల గండిపేట తెలుగువిజయంలో రెండు రోజులపాటు నిర్వహించిన మహానాడులో బుధవారం రాత్రి ముగింపు సమావేశంలో ఆయన ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి చేవెళ్ల-ప్రాణహిత ప్రాజెక్టు సాధనకు కృషిచేస్తానని పేర్కొన్నారు. అధికార పగ్గాలు చేపట్టబోతున్న సీమాంధ్రతోపాటుగా అధికారంలోలేని తెలంగాణను కూడా అన్ని విధాలా అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తానని చెప్పారు. గతంలో 9 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ నగరంతోపాటుగా రంగారెడ్డి జిల్లాను కూడా తామే అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. పోలవరంతో పాటుగా చేవెళ్ల-ప్రాణహిత ప్రాజెక్టును సాధించడానికి పోరాటం చేస్తానని చెప్పారు. తెలుగు ప్రజలందరినీ కలుపుకొని అన్ని ప్రాంతాల అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానని వివరించారు. అదే విధంగా శంషాబాద్ విమానాశ్రయంలోని డొమెస్టిక్ టెర్మినల్‌కు ఎన్టీ రామారావు పేరు పెట్టడానికి కృషిచేస్తానని, సాధించి తీరుతాననే నమ్మకం ఉందని పేర్కొన్నారు. తెలుగు ప్రజలందరూ బాగుండాలని తాను ఎల్లప్పుడూ కోరుకుంటున్నానని చంద్రబాబు చెప్పారు. -
ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని టీడీపీ డిమాండ్!
హైదరాబాద్: భారత దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ఆపార్టీ వ్యవస్తాపకుడు నందమూరి తారక రామారావు(ఎన్టీఆర్)కు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది. ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలని గండిపేటలో జరుగుతున్న మహానాడు సమావేశాల్లో తెలుగుదేశం పార్టీ ఏక్రగ్రీవంగా తీర్మానం చేసింది. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని తెలుగుప్రజలంతా కోరుకుంటున్నారని మహానాడులో చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలని ప్రధాని నరేంద్రమోడీ దృష్టికి తీసుకువెళ్తానని, ఒత్తిడి తీసుకువస్తానని చంద్రబాబు తెలిపారు. అలాగే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు ఎన్టీఆర్ పేరు పెట్టేలా కృషి చేస్తానన్నారు. కేంద్రంలో పౌర విమానశాఖ మంత్రి అశోక్ గజపతి రాజు ఉన్నారని.. ఎయిర్ పోర్టుకు ఎన్టీఆర్ పేరు పెట్టేలా ప్రయత్నిస్తానని చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు. -
నైరాశ్యంలో ‘దేశం’
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: వరుస ఎన్నికలలో ఘోర పరాజయాన్ని చవి చూసిన తెలుగుదేశం పార్టీ లో మహానాడు ఉత్సాహాన్ని నింపుతుందా? ఓటమితో కుంగిపోయిన కేడర్‌లో నైరాశ్యం తొలుగుతుందా? రెండు రోజులపాటు హైదరాబాద్‌లో నిర్వహించే మహానాడుకు జిల్లా నుంచి నియోజకవర్గానికి 60 మంది చొప్పున 540 మందికి ఆహ్వానం అందింది. మిగిలిన నేతలు, కార్యకర్తల సంగతేంటి? గతం లో ఎన్నడూ లేని విధంగా టీడీపీ కోటలకు బీటలు బారిన వైనంపై ఏం చర్చిం చనున్నారు? ఓటమితో నిరాశ, నిస్పృహల్లో కూరుకుపోయిన కార్యకర్తల్లో మహానాడు స్ఫూర్తి నింపుతుందా? అన్న చర్చ రాజకీయవర్గాల్లో సాగుతోం ది. జిల్లాలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. 2014 సంవత్సరం జిల్లాలో టీడీపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. మున్సిపల్, కార్పొరేషన్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు సహా.. సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ నామ రూపాల్లేకుండా పోయింది. దయనీయ స్థితికి చేరింది. ఈ నేపథ్యంలో 27, 28 తేదీలలో హైదరాబాద్‌లో జరిగే మహానాడుకు జిల్లా నేతలకు ఆహ్వానం రావడం చర్చనీయాంశంగా మారింది. మున్సిపల్, జడ్పీటీసీ ఎన్నికలలో మున్సిపల్ ఎన్నికలలో ఇందూరు ఓటర్ల విలక్షణ తీర్పుకు టీడీపీ చిత్తయ్యింది. నిజామాబాద్ కార్పొరేషన్‌తో పాటు కామారెడ్డి, బోధన్, ఆర్మూరు మున్సిపాలిటీలలో తెలుగుదేశం పార్టీ కనుమరుగైంది. గత ఎన్నికలలో నగరంలో ఏడు డివిజన్లను కైవసం చేసుకున్న టీడీపీ ఈ సారి బోణి కొట్టలేని స్థితికి దిగజారి పురపోరులో పూర్తిగా ఉనికి కోల్పోయింది. జిల్లాలో పార్టీ కనిపించకుండా పోయింది. పార్టీ బ్యానర్‌పై పోటీ చేసిన పలువురు ఓటమిని చవిచూడగా.. వ్యక్తిగతంగా ప్రజల్లో పేరున్న నేతలు కౌన్సిలర్లుగా గెలుపొందారు. జిల్లాలో మొత్తం డివిజన్లు, వార్డులు కులుపుకుని 141 స్థానాలు ఉండగా గత ఎన్నికల్లో 35 చోట్ల గెలుపొందింది. ఈ సారి కేవలం రెండు చోట్లే కౌన్సిలర్లుగా విజయం సాధించారు. అర్మూరు, బోధన్‌లో ఒక్కొక్కరు కౌన్సిలర్లుగా నెగ్గారు. ఆ పార్టీ టికెట్‌పై పోటీ చేసిన అభ్యర్థులు ఓటమిని ఇప్పటికీ జీర్ణించు కోలేక పోతున్నారు. జిల్లాలో మొత్తం 583 ఎంపీటీసీ స్థానాలలో కేవలం 31కే పరిమితమై బీజేపీ కంటే వెనుకబడింది. జడ్పీటీసీ ఎన్నికల్లో 36 మండలాలలో ఒక్క అభ్యర్థిని కూడా గెలుపించుకోలేకపోయింది. ఓటమిపై ఇటీవలే జిల్లా కేంద్రంలో టీడీపీ సమీక్ష జరిపినా.. కార్యకర్తలు ఇంకా నైరాశ్యం నుంచి బయట పడలేదు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో దివంగత ఎన్టీ రామారావు పార్టీని స్థాపించిన సమయంలో అందలమెక్కించిన జిల్లా ప్రజలు, ఆ తర్వాత కూడ టీడీపీకి జిల్లాలో బ్రహ్మరథం పట్టారు. ఇటీవలి సార్వత్రిక ఎన్నికలను పరిశీలిస్తే ఇప్పుడా పార్టీని పట్టించుకున్న దాఖలాలు లేవు. 1985 నాటి తొలి ఎన్నికలలో 9 స్థానాలకు ఏడుచోట్ల టీడీపీ ఎమ్మెల్యేలు గెలవగా.. 2014 ఎన్నికలకు వచ్చే సరికి టీడీపీ ఒక్క స్థానాన్ని కూడ గెలుచుకోలేక పోయింది. రెండు పార్లమెంట్ స్థానాలతో పాటు 9 అసెంబ్లీ స్థానాల్లో ఆ పార్టీ కూటమి చిత్తయి పోయింది. 2009 ఎన్నికల్లో టీడీపీ టికెట్లపై ఐదుగురు ఎమ్మెల్యేలు గెలిస్తే, 2014 ఎన్నికల నాటికి ఇద్దరే మిగిలారు. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు సైతం సార్వత్రిక ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకోగా ఐదు స్థానాల్లో పోటీ చేసిన టీడీపీ, నాలుగు చోట్ల కూటమిలో భాగంగా బరిలో నిలిచిన బీజేపీలు ఓటమి చెందాయి. మాజీ మంత్రి, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డితో పాటు కామారెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్, హన్మంత్ షిండేలు టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఈసారి టీఆర్ఎస్ నుంచి గెలుపొందగా, తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ప్రతికూల పరిస్థితులను ముందే ఊహించిన మండవ వెంకటేశ్వర్రావు, ఏలేటి అన్నపూర్ణమ్మలు పోటీ నుంచి తప్పుకున్నారు. జిల్లాలో రెండు లోక్‌సభ, 9 అసెంబ్లీ స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందగా.. కాంగ్రెస్, టీడీపీలకు ఒక్కస్థానం దక్కలేదు. మొత్తంగా మున్సిపల్, పరిషత్, సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ మట్టికరిచిన నేపథ్యంలో మహానాడు ఏ మేరకు ఓదార్పునిస్తుందన్న చర్చ జరుగుతోంది. -
తిరువూరు ఆర్టీసీ డిపో ఎత్తివేత!
కార్మికుల్లో ఆందోళన శాటిలైట్ డిపోగా నిర్వహించేందుకు యత్నం తమకు తెలియదంటున్న డిపో అధికారులు తిరువూరు, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో 30 ఆర్టీసీ డిపోలను ఎత్తివేయాలని యాజమాన్యం తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఆంధ్ర, తెలంగాణ సరిహద్దుల్లోని తిరువూరు డిపోను మూసివేయనున్నారని తెలుస్తోంది. ఈ సమాచారం తెలిసిన కార్మికవర్గాలు ఆందోళన చెందుతున్నాయి. 1965లో ఏడు బస్సులతో ఫ్యాక్టరీ సెంటర్లో తిరువూరు డిపోను ప్రారంభించారు. 1969లో రాజుపేట ఊరచెరువులో గ్యారేజీ నిర్మించి 69 బస్సులతో డిపోను నిర్వహించారు. 1985లో బస్‌స్టేషన్ ను అప్పటి సీఎం ఎన్టీ రామారావు ప్రారంభిం చారు. ఈ డిపో కృష్ణా, ఖమ్మం జిల్లాల్లోని 10 మండలాల ప్రయాణికులకు సేవలందిస్తూ స్వర్ణోత్సవాలకు చేరువవుతోంది. రోజుకు 10 వేల మందికి పైగా ప్రయాణికులు తిరువూరు డిపో బస్సుల్లో తమ గమ్యస్థానాలకు చేరుతున్నారు. జిల్లాలో మారుమూల ఉన్న తిరువూరులో ఆర్టీసీ డిపో అందిస్తున్న సేవలను విద్యార్థులు, గ్రామీణ ప్రజలు వినియోగించుకుంటున్నారు. ప్రస్తుతం తిరువూరు డిపోలో 380 మంది కార్మికులు పనిచేస్తున్నారు. దీర్ఘ కాలంగా ఉన్న ఈ డిపోను వేరొకచోటికి తరలిస్తే ప్రయాణికులు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది. మైలవరానికి తరలింపు తిరువూరు, ఇబ్రహీంపట్నం డిపోలను విలీనం చేసి మైలవరంలో కొత్త డిపో ఏర్పాటు చేయడానికి ఆర్టీసీ యాజమాన్యం ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న తిరువూరు డిపో నుంచి అత్యధికంగా ఖమ్మం జిల్లాకు సర్వీసులు నడుస్తున్నాయి. రాష్ట్ర విభజన అనంతరం ఈ సర్వీసులను కుదించాల్సి వస్తుంది. ఇప్పటికే నష్టాల్లో ఉన్న డిపో మరింత వెనుకబడకుండా మైలవరానికి తరలించాలని ఆర్టీసీ ఉన్నతాధికారులు భావిస్తున్నట్లు సమాచారం. తిరువూరు డిపోను నూజివీడు డిపోకు అనుసంధానంచేసి శాటిలైట్ డిపోగా నిర్వహించాలనే మరో ప్రతిపాదన కూడా అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. పొదుపు చర్యల పేరుతో తిరువూరు డిపోను మూసివేయాలని ఆర్టీసీ యాజమాన్యం భావిస్తున్నట్లు వస్తున్న వార్తలు ప్రయాణికులను సైతం కలవర పరుస్తున్నాయి. జిల్లాలో మారుమూల ఉన్న తమకు ఆర్టీసీ బస్సులే ఆధారమని, డిపో ఎత్తివేస్తే ప్రయివేటు వాహనాలపై ఆధారపడవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకు తెలియదు తిరువూరు ఆర్టీసీ డిపో తరలింపు ప్రతిపాదనలు మాకు తెలియదు. ఇంతవరకు యాజమాన్యం నుంచి ఎటువంటి సమాచారమూ మాకు అందలేదు. - ప్రవీణ్‌కుమార్, తిరువూరు డిపో మేనేజర్ -
అన్నగారి ఆత్మక్షోభ.
-
కల్వకుర్తిలో ముఖాముఖి
అసెంబ్లీ నియోజకవర్గం: కల్వకుర్తి ప్రత్యేకతలు: హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే రహదారిపై ఉన్న ఈ నియోజకవర్గంలో గిరిజన తండాలు అధికంగా ఉన్నాయి. వ్యవసాయమే ప్రధాన ఆధారం. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పూర్తయితే ఇక్కడి ప్రజలకు పండుగే. కాలువ తవ్వకం పనులు దాదాపు పూర్తయ్యాయి.అయితే నీటి విడుదల ఎప్పుడన్నది స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. నియోజకవర్గంలో మండలాలు: కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి సొంత మండలం మాడ్గులతోపాటు, ఆమన్‌గల్, వెల్దండ, తలకొండపల్లి, కల్వకుర్తి. మొత్తం ఓటర్లు : 1.93 లక్షలు ప్రధాన అభ్యర్థులు కల్వకుర్తి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి, శ్రీకాంత్‌రావు: కల్వకుర్తి నియోజకవర్గం 1989 శాసనసభ ఎన్నికల్లో చరిత్ర సృష్టించింది. ఆ ఎన్నికల్లో అప్పటి తెలుగుదేశం అధినేత ఎన్టీ రామారావునే ఇక్కడి ప్రజలు కంగుతిని పించారు. ఇక్కడ నుంచి ఎన్టీ రామారావుపై చిత్తరంజన్‌దాస్ ఘన విజయం సాధించడంతో ఆయన జెయింట్ కిల్లర్‌గా పేరొందారు. ప్రధాన పార్టీలన్నీ రంగంలో ఉన్నా వైఎస్సార్సీపీ అభ్యర్థి ఎడ్మ కిష్టారెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి వంశీచందర్‌రెడ్డి మధ్యే పోటీ నెలకొని ఉంది. ‘ఫ్యాన్’తో కొత్త గాలి: వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎడ్మ కిష్టారెడ్డికి ప్రజల మనిషిగా మంచి పేరుంది. నియోజకవర్గంలో ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే అక్కడ ఆయన ప్రత్యక్షం అవుతారని నియోజకవర్గ ప్రజల అభిప్రాయం. కల్వకుర్తి పట్టణంలో కూరగాయల మార్కెట్ కాలిపోయినప్పుడు బాధితుల కంటే ముందే అక్కడకు చేరుకున్న కిష్టారెడ్డి మంటలు పూర్తిగా ఆరిపోయే వరకు అక్కడే ఉండడమేకాక చిరు వ్యాపారులకు ఆర్థిక సాయం అందించారని ఆ వ్యాపారుల సంఘం కార్యదర్శి శ్రీశైలం చెప్పారు. అన్ని వర్గాల ప్రజలతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నట్లు ఈశ్వరప్ప అనే వ్యవసాయదారుడు వెల్లడించారు. రాజశేఖరరెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలతోపాటు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. అదీకాక కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఉన్న నాయకులు, కార్యకర్తలను ఆయన చేరదీస్తూ ముందుకు సాగుతున్నారు. గ్రూపులతో ‘హస్త’వ్యస్తం: ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి వంశీచందర్‌రెడ్డికి ఆ పార్టీలోని గ్రూపు తగదాలు ముచ్చెటమలు పట్టిస్తున్నాయి. కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి వర్గం మనస్ఫూర్తిగా పనిచేయడం లేదు. కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడిన ఓ ప్రైవేట్ విద్యాసంస్థల అధినేత కశి నారాయణరెడ్డి కాంగ్రెస్ రెబెల్‌గా ఉండడమేకాక, ప్రచారాన్ని గట్టిగా సాగిస్తున్నారు. జైపాల్‌రెడ్డి వర్గం నారాయణరెడ్డికి మద్దతుగా నిలిచిం ది. వంశీచందర్‌రెడ్డికి మాజీమంత్రి డి.కె.అరుణ మద్దతు ఉన్నప్పటికీ ఆమె ఇక్కడకు వచ్చి ప్రచారం చేసే అవకాశం లేదు. యువకుడైన వంశీ ఒంటరి ప్రచారం సాగిస్తున్నారు. జంపింగే మైనస్: తెలుగుదేశం నుంచి టీఆర్ఎస్లోకి జంప్ అయిన జైపాల్ యాదవ్‌కు పార్టీ మారడమే మైనస్ పాయింట్‌గా మారింది. మొదటి నుంచి టీఆర్ఎస్లో ఉన్న బాలాజీ సింగ్ రెబెల్ అభ్యర్థిగా రంగంలో దిగారు. ఆయన వెంటే టీఆర్ఎస్ కేడర్ వెళ్లారు. ఇక జైపాల్ వెంట ఒకటి రెండు మండలాల నుంచి మాత్రమే టీడీపీ కేడర్ టీఆర్ఎస్లో చేరింది. గడిచిన ఐదేళ్లలో జైపాల్‌యాదవ్ చేసిన కార్యక్రమాలు ఏవీ లేవని ప్రజలు పెదవి విరుస్తున్నారు. లిఫ్టివ్వని ‘సైకిల్’: బీజేపీ-టీడీపీ పొత్తులో ఇక్కడ పోటీ పడుతున్న ఆచారికి టీడీపీ సహకారం లభించడం లేదు. ఆచారికి ఆమన్‌గల్ మండలంలోనే కాస్త పట్టుంది. ప్రతిసారి పోటీ చేయడం ఓడిపోవడం రివాజుగా మారింది. మిగిలిన మండలాల్లో టీడీపీ బలంపై ఆధారపడాలి, కానీ ఆశించిన స్థాయిలో కలయిక లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. -
వేడెక్కుతున్న వెండితెర
ఎలక్షన్ సెల్: ఎన్నికల వేళ సమకాలీన రాజకీయాల చుట్టూ కథ నడిపిస్తూ సినిమాలు రావడం, సంచలనాలు, కలకలాలు సృష్టించడం తెలుగునాట కొత్తేమీ కాదు. ఎన్‌టిరామారావు రాజకీయరంగ ప్రవేశంతో 1983 నుంచి బలపడిన ఈ ఆనవాయితీ గత ఎన్నికల వరకు బలంగా కొనసాగింది. ఎన్నికల కురుక్ష్రేతానికి సమయం ముంచుకొస్తున్నా ఈసారి మాత్రం కాస్త ఆలస్యంగానే వెండితెర వేడెక్కుతోంది. సినిమా షూటింగ్‌లు ఎప్పుడో పూర్తయి కోల్డ్‌స్టోరేజ్‌ల్లో ఉన్న బాక్సులను ఎన్నికల తేదీ దగ్గరపడుతుండటంతో నిర్మాతలు ఎట్టకేలకు ఇప్పుడు బయటకి తీస్తున్నారు. రాజకీయాలు, రాజకీయనేతలు, ప్రభుత్వాల పాలనాతీరుపై తెలుగు సినిమా పుట్టినప్పటి నుంచి ఎన్నోరకాల చిత్రాలు వచ్చాయి. కానీ 1983లో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పాలనాతీరు, వ్యక్తిగత వ్యవహారశైలిని ఎక్కుపెడుతూ వచ్చిన సినిమాల ‘కథ‘ వేరు. నేరుగా ఓ వ్యక్తిని, ఓ పార్టీని లక్ష్యంగా చేసుకుని సినిమాలు తీయడం, ఎన్నికల వేళ విడుదల చేయడం ఆయన హయాం నుంచే మొదలైంది. నేరుగా ఎన్టీఆర్‌ను పోలిన నటులతో తీసిన మండలాధీశుడు, గండిపేట రహస్యం అప్పట్లో సంచలనం సృష్టించాయి. అలాగే ఎన్టీఆర్ తీరును ఎండగడ్తూ విజయనిర్మల దర్శకత్వంలో సూపర్‌స్టార్ కృష్ణ నటించిన ‘సాహసమే నా ఊపిరి’, నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ నటించిన ‘రాజకీయ చదరంగం’ సినిమాలు 1989 ఎన్నికల ముందే విడుదలయ్యాయి. ఇక ఎన్టీఆర్ అనంతరం చంద్రబాబును లక్ష్యంగా చేసుకునీ పలు చిత్రాలు వచ్చాయి. ప్రముఖదర్శకుడు దాసరి నారాయణరావు రూపొందించిన ‘పిచ్చోడి చేతిలో రాయి’ సినిమా 1999 ఎన్నికల ముందే విడుదలైంది. గత 2009 ఎన్నికల ముందు రాజకీయాల చుట్టూ కథ నడిపిస్తూ సినిమాలు వెల్లువలా వచ్చాయి. చిరంజీవి రాజకీయరంగప్రవేశం నేపథ్యంలో 2009లో దాసరి సంధించిన ‘మేస్త్రీ’ కలకలం రేపింది. దాసరి ఆ సినిమాలో మేస్త్రీ పాత్రలో చిరంజీవిని, ఆయన పెట్టిన ప్రజారాజ్యం పార్టీని ప్రధాన లక్ష్యంగా వ్యంగ్యోక్తులతో విరుచుకుపడ్డారు. ఇక అదే ఏడాది ఎన్నికల వేళ మార్చిలో జగపతిబాబు హీరోగా వచ్చిన అధినేత, నరేంద్రనాయుడు హీరోగా నేనే ముఖ్యమంత్రినైతే, పోసాని కృష్ణమురళి తీసిన రాజా వారిచేపల చెరువు సినిమాలు తెరపైకి వచ్చాయి. ఇలా వచ్చిన ప్రతి సినిమాలోనూ ‘‘ఈ సినిమాలో పాత్రలు, సన్నివేశాలు కల్పితాలు... ఎవరినీ ఉద్దేశించినవి కావు... ఎవరూ వాటిని ఆపాదించుకోవద్దు’’ అని ప్రకటన వేసినా సినిమా అంతా సమకాలీన రాజకీయాలు, ఆ చిత్ర నిర్మాత నిర్దేశించుకున్న ప్రధాన పార్టీల నేతల తీరు చుట్టూనే తిరుగుతూంటుంది. ఎన్నికల వేళ వర్తమాన రాజకీయ నేపథ్యంలో వచ్చే సినిమాలు చూసేందుకు ఉత్సాహం చూపే ప్రేక్షకులూ ఉంటారు. గత ముప్పై ఏళ్లుగా ప్రతి ఎన్నికల ముందు ఇలాంటి ‘సిత్రాలు’ వచ్చినా ఈసారి మాత్రం ఆ ఊపు ఒకింత తగ్గిందనే చెప్పాలి. మళ్లీ ‘ప్రతిఘటన’ ప్రస్తుత రాజకీయాలు నేపథ్యంగా తెలుగు సినీ పరిశ్రమ దిగ్గజం తమ్మారెడ్డి భరద్వాజ నిర్మించిన సినిమా ‘ప్రతిఘటన’. దీన్ని ఈనెల 18న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో చార్మి, రేష్మ ప్రధాన తారాగణం. పాతికేళ్ల కితం సినీపరిశ్రమలో సంచలనం సృష్టించిన ప్రతిఘటన సినిమా మాదిరిగానే ఇది కూడా అందరినీ ఆలోచింపజేసే సినిమా అవుతుందని భరద్వాజ చెబుతున్నారు. ఇక ఓటర్లలో అవగాహన పెంచి వారిలో ఉద్యమస్ఫూర్తిని రగిలించేందుకు కృషి చేసిన నలుగురు యువకుల కథతో తెరకెక్కిన ‘ప్రభంజనం’ కూడా ఈనెల 18నే విడుదలకు రెడీ అవుతోంది. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జీవిత ఇతివృత్తమే కథాంశంగా సుమన్ హీరోగా.. జై రాజశేఖరా.. దేవుడు కాని దేవుడు ఉపశీర్షికతో ఓ సినిమా తెరకెక్కుతోంది. -
నాయకుల నిర్లక్ష్యం.. నెరవేరని లక్ష్యం..
మంచిర్యాలసిటీ, న్యూస్‌లైన్ : మాయమాటలతో తిమ్మిని బమ్మిని చేసి.. చేసే పనిలో చిత్తశుద్ధిలేని నాయకుల నిర్లక్ష్యంతో మంచిర్యాల జిల్లా ఏర్పాటు హామీలకే పరిమితమవుతోంది. తూర్పు జిల్లా కేంద్రంగా విరాజిల్లుతున్న మంచిర్యాలకు తలాపునే గోదారమ్మ, మరోవైపు సిరులు గురిపిస్తున్న నల్లబంగారం గనులు ఉన్నా యి. వీటికితోడు పచ్చని అటవీ సంపద ఉంది. వీటన్నింటినీ కలుపుకుని పారిశ్రామిక జిల్లాగా ఏర్పడాలని సంబరపడిపోతున్న మంచిర్యాల 1983 నుంచి నిరాదారణకు గురవుతూనే ఉంది. పసలేని ప్రసంగాలతో మాయమాటలు చెప్పి.. ఓట్లు వేయించుకుని గద్దె ఎక్కగానే అసలు విషయాన్ని నాయకులు మరచిపోవడం సాధారణమైంది. అల్లంత దూరాన ఉన్న ఆదిలాబాద్‌కు చిన్న, చిన్న పనులకు వెళ్లాలంటే రోజు గడుస్తోంది. ‘నాయకులారా మా కు సొంత జిల్లా ఏర్పాటు చేసి మా కష్టాలు తీర్చండి’ అంటూ అరచినా ఆలకించే వారు కరువయ్యారు. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయంటే మంచిర్యాల జిల్లా సమస్య నాయకులకు గుర్తుకొస్తుంది. ఇచ్చిన హామీ మంచిర్యాలకే పరిమితమై పోతుంది. మంచిర్యాల జిల్లా ఏర్పాటుకు సంబంధించిన కాగితాలు అసెంబ్లీ వరకు వె ళ్లడం లేదనేది వాస్తవం. ఎన్టీఆర్ పర్యటనతో.. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు 1983లో ఎన్నికల పర్యటనకు వచ్చినప్పుడు నాటి బహిరంగ సభలో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మంచిర్యాలను జిల్లా చేస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ అమలు కాకపోవడంతో 1985లో మంచిర్యాల ప్రజలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. 1993లో అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయ భాస్కరరెడ్డి జిల్లా ఏర్పాటుకు హామీ ఇచ్చారు. 1999లో ఎన్నికల ప్రచారానికి వచ్చిన చంద్రబాబు మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అడ్డు వస్తున్న నేపథ్యంలో మంచిర్యాలను జిల్లాగా ప్రకటించలేకపోతున్నానని, లేదంటే ఇప్పుడే ప్రకటించే వాడినంటూ అప్పుడే ఇచ్చేసినంత అవేశంగా మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ కాకలు తీరిన యోధుడు కాక గడ్డం వెంకటస్వామి ఎన్నికల్లో పోటీచేసిన ప్రతిసారీ ఇదే పాట పాడారు. తెలంగాణ ఏర్పడ్డాక తొలి సంతకం మంచిర్యాల జిల్లా ఏర్పాటు ఫైలు పైననే చేస్తానని తనేం తక్కువా అన్నట్టు తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ సైతం హామీ ఇచ్చారు. ప్రతిపాదన తూర్పు ప్రాంతంలోని మంచిర్యాల, చెన్నూర్, ఆసిఫాబాద్, కాగజ్‌నగర్, సిర్పూర్, బెల్లంపల్లి, కరీంనగర్ జిల్లాలోని గోదావరిఖని, మంథని, రామగుండం ప్రాంతాలను కలుపుకుని మంచిర్యాల కేంద్రంగా పారిశ్రామిక జిల్లా ఏర్పాటు చేయాలనేది ప్రతిపాదన. పరిశ్రమలే మహాబలం.. మంచిర్యాల, మందమర్రి, కాసిపేట, తాండూరు, రెబ్బన, తి ర్యాణి మండలాల్లో బొగ్గు గనులు ఉన్నాయి. దేవాపూర్, మంచిర్యాలలో సిమెంటు పరిశ్రమలు ఉన్నాయి. పదుల సం ఖ్యలో సిరామిక్స్ పరిశ్ర మలు, కాగజ్‌నగర్‌లో కాగితపు పరిశ్ర మ ఉంది. వీటితోపాటు తూర్పు ప్రాంతంలో పదుల సంఖ్య లో కార్పొరేటు విద్యాసంస్థలు ఏర్పడ్డాయి. తూర్పు భౌగోళికం.. తూర్పులో 25 మండలాలు, మంచిర్యాల, మందమర్రి, బెల్లంపల్లి, కాగజ్‌నగర్ మున్సిపాలిటీలు ఉన్నాయి. మంచిర్యాల, ఆసిఫాబాద్ రెవిన్యూ డివిజన్లు ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాకు వెళ్లడానికి తూర్పులోని పలు ప్రాంతాల నుంచి 160 కిలో మీటర్ల నుంచి 200 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. జిల్లా జనాభాలో సగానికంటే ఎక్కువగా తూర్పు ప్రాంతంలోనే ఉంది. బెజ్జూ రు, కౌటాల, దహెగాం, కోటపల్లి, వేమనపల్లి, తిర్యాని, చె న్నూరు మండలాలు అభివృద్దికి ఆమడ దూరంలో ఉన్నాయి. వైఎస్ హయాంలో.. 1998లో తూర్పు ప్రాంతంతోపాటు, కరీంనగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్యెల్యేలు సంయుక్తంగా అప్పటి ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డికి జిల్లా ఏర్పాటు చేయాలంటూ వినతిపత్రం అందజేశారు. స్పందిం చిన వైఎస్ అప్పటి కలెక్టరును నివేదికలను తయారు చేయాల్సిందిగా ఆదేశించారు. ఈ నేపథ్యంలో జిల్లా ఏర్పాటుకు సంబంధించిన వివరాలను కలెక్టర్ పంపించారు. తూర్పులో నెలలో మూడు రోజులు మంచిర్యాలలో కలెక్టరు క్యాంపు ఏర్పాటు చే యాలని అదేశించారు. క్యాంపు కొద్ది రోజులు కొనసాగినా తదుపరి కనుమరుగైంది. జిల్లా తప్పనిసరి.. వేమనపల్లి, బెజ్జూరు వంటి మారుమూల మండలాల్లో జిల్లా అధికారులు పర్యటించాలంటే 250 కిలోమీటర్లు ప్రయాణించాల్సిందే. తూర్పు ప్రాంత వాసులకు పక్కనే ఉన్న కరీంనగర్ 90 కిలోమీటర్లు, నిజామాబాద్ 170 కిలోమీటర్లు, రైలు మార్గంలో వరంగల్ 110, రోడ్డు మార్గంలో 170 కిలోమీటర్లు ఉంటుంది. 250 కిలోమీటర్ల దూరం నుంచి అధికారులు ఎప్పుడు వచ్చి వెళతారో తెలియని పరిస్థితి నెలకొంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఎలా ఉంటుందో కానరాదు. -
విజయాలు లేని సమయంలో ఒక వెలుగునిచ్చింది..!
‘‘లెజెండ్’ ఎవరనే విషయంలో కొంతమంది కొట్టుకుని ఆ పదాన్ని పాపులర్ చేశారు. అసలైన ‘లెజెండ్’ ఎవరో ఈ సినిమాలో చూపించాం. నా దృష్టిలో నిజమైన ‘లెజెండ్’ మా నాన్నగారు ఎన్టీ రామారావుగారే’’ అని నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యానించారు. బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, సాయికొర్రపాటి నిర్మించిన ‘లెజెండ్’ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. గురువారం సాయంత్రం హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్మీట్లో బాలకృష్ణ మాట్లాడుతూ - ‘‘విజయాలు లేని సమయంలో పరిశ్రమకు ఈ సినిమా ఒక వెలుగునిచ్చింది’’ అని చెప్పారు. పబ్లకూ క్లబ్‌లకూ తిరగను! దేవిశ్రీప్రసాద్ మాట్లాడుతూ- ‘‘నా కెరీర్లో అతితక్కువ సమయంలో రీరికార్డింగ్ చేసిన సినిమా ఇది. 13 రోజులు రాత్రింబవళ్లూ కష్టపడ్డాను’’ అని చెప్పారు. ఆ తరువాత బోయపాటి మాట్లాడుతూ- ‘‘దేవి 13 రోజుల్లో రీరికార్డింగ్ పూర్తి చేసిన మాట నిజమే. అన్ని రోజులూ నేను అతన్ని వెంటాడి నిద్రపోనివ్వకుండా చేయించు కున్నాను. ఫైనల్ మిక్సింగ్ కూడా దగ్గరుండి తనతోనే చేయించుకున్నాను...’’ అని ఇంకేదో చెప్పబోతుండగా దేవిశ్రీప్రసాద్ మైక్ అందుకొని ఆ వ్యాఖ్యలకు పాజిటివ్‌గానే స్పందిస్తున్నానని చెబుతూనే ఘాటుగా మాట్లాడారు. ‘‘నా బాధ్యతను ఎవ్వరూ గుర్తుచేయనవసరం లేదు. నాకు తెలిసింది సంగీతమే. పిండుకోవడానికి నేనేమన్నా ఆవునా? గేదెనా? నేను పబ్లకూ క్లబ్‌లకూ తిరగను. సినిమా తప్ప నాకు వేరే ప్రపంచం తెలియదు. ఫైనల్ మిక్సింగ్‌కి నేను ఉండననడం కరెక్టుకాదు. ఆ 13 రోజుల్లో ఆయన వున్నది మూడు రోజులు మాత్రమే. ఆ మూడు రోజులు కూడా ల్యాప్‌ట్యాప్‌లో ఇంగ్లీషు సినిమాలు చూస్తూ గడిపారు. ఎవరి క్రెడిట్ వాళ్లకు దక్కాల్సిందే అని నమ్మే వ్యక్తిని నేను. అంతే తప్ప ఎవరిని విమర్శించడానికి ఇది చెప్పడం లేదు’’ అని దేవి స్పందించారు. ఆ తరువాత బోయపాటి మాట్లాడుతూ- ‘‘నేను కూడా అదే చెప్పాలనుకున్నా. ఈలోగా తను తొందరపడి మైక్ లాక్కున్నాడు. దేవి ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు’’ అని చెప్పారు. -
రాజకీయ తెరపై సినీ‘బొమ్మ’లు!
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం దేశవ్యాప్తంగా వెండితెర వేల్పుల రాజకీయ ‘తెర’ంగేట్రం ఊపందుకుంది. ఇప్పటికే శతృఘ్నసిన్హా, రాజ్‌బబ్బర్, హేమామాలిని వంటి పాతతరం తారలు మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవగా.. కొత్తగా అనేకమంది ఎన్నికల రాజకీయాల్లోకి దూకుతున్నారు. వీరిలో కిరణ్ ఖేర్, గుల్ పనగ్, మూన్‌మూన్ సేన్ వంటివారు అనేకమంది ఉన్నారు. మరోవైపు తెలుగు సినీహీరో పవన్ కల్యాణ్ ‘జనసేన’ పేరుతో కొత్త పార్టీని స్థాపించారు. సినిమా తారలు రాజకీయ రంగంలోకి దూకడం ఇదే ప్రథమం కాదు. గతంనుంచీ కొనసాగుతున్నదే. అయితే రాజకీయరంగ ప్రవేశం చేసిన తారల్లో విజయవంతమైనవారి సంఖ్య దక్షిణాదితో పోలిస్తే.. ఉత్తరాదిన చాలా తక్కువ. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లలో ఎంజీ రామచంద్రన్, ఎన్టీ రామారావు వంటివారు తమ హవా కొనసాగించి.. అధికారపీఠాన్ని అందుకున్నారు. అదేసమయంలో ఉత్తరాదిలో అమితాబ్ బచ్చన్, రాజేష్‌ఖన్నా, ధర్మేంద్ర, గోవిందా వంటి సినీ స్టార్లు ఎంత ఉత్సాహంతో రాజకీయ ప్రవేశం చేశారో.. అంతే వేగంగా వెనుతిరిగారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్నికల రాజకీయాల్లోకి వస్తున్నవారిలో ఎందరు సత్తా చాటగలరు.. ఎంతవరకు నిలబడగలరనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుత ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న వారిలో గుల్ పనగ్ ఒకరు. చండీగఢ్ నుంచి ఆప్ తరఫున బరిలోకి దిగారు. మరోవైపు బీజేపీ.. నటి కిరణ్ ఖేర్ని రంగంలోకి దింపింది. దీంతో ఛండీగఢ్‌లో పోటీ రసవత్తరంగా మారింది. పలు ఆరోపణలవల్ల రైల్వే మంత్రి పదవి నుంచి తప్పుకున్న పవన్‌కుమార్ బన్సల్ ఇక్కడ్నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇద్దరు సినీ తారల మధ్య ఆయన కఠిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్ పార్టీ సినీతారల గ్లామర్‌పై ఆశలు పెట్టుకుంది. అందుకే పలు రాష్ట్రాల్లో సినీతారలను రంగంలోకి దింపుతోంది. భోజ్‌పురి సూపర్‌స్టార్ రవికిషన్ (జాన్పూర్), నటి నగ్మా (మీరట్), నాటితరం బాలీవుడ్ నటుడు రాజ్‌బబ్బర్ (ఘజియాబాద్) వంటివారు ఇందులో ఉన్నారు. బీజేపీ కూడా సినీగ్లామర్‌కు ఓట్లు రాలతాయని ఆశిస్తూ.. పలువురు నటులను రంగంలోకి దింపుతోంది. వీరిలో శతృఘ్నసిన్హా(పాట్నాసాహిబ్), హేమామాలిని (మథుర) వంటి పాతకాపులున్నారు. ఇంకా పరేష్ రావల్(అహ్మదాబాద్ తూర్పు), జోయ్ బెనర్జీ(బిర్భుం), బబుల్ సుప్రియో(అసన్సోల్) వంటివారినీ దింపుతోంది. తృణమూల్ కాంగ్రెస్సైతం ఈ విషయంలో ముందంజలో ఉంది. ఈ పార్టీ నుంచి ఎన్నికల బరిలోకి దిగుతున్నవారిలో మూన్‌మూన్ సేన్(బంకుర), సంధ్యాసేన్(మిడ్నపూర్), విశ్వజిత్(న్యూఢిల్లీ), సూపర్‌స్టార్ దేవ్(ఘటల్)తోపాటు గాయకులు సౌమిత్రీరాయ్, ఇంద్రనీల్ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి.. ప్రముఖ నటుడు, కేంద్ర మంత్రి చిరంజీవి సోదరుడు పవన్ కల్యాణ్ ప్రస్తుతం ‘జన సేన’ పార్టీని స్థాపించారు. తన సోదరుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీని ఓడించడం తన ధ్యేయమని పవన్ ప్రకటించడం విశేషం. -
ప్రాదేశిక పాలనే ప్రత్యేకం
విశాఖ రూరల్, పాడేరు, చోడవరం, న్యూస్‌లైన్: సుదీర్ఘ చరిత్ర కలిగిన ‘ప్రాదేశిక’ పాలనలో సింహభాగం ‘ప్రత్యేక’ పాలన సాగింది. 1959 నుంచి ఇప్పటి వరకు 16 మంది స్పెషల్ ఆఫీసర్లే పరిషత్‌ను పాలించారు. దాదాపుగా 55 ఏళ్ల చరిత్ర ఉన్న విశాఖ జిల్లా పరిషత్‌కు కేవలం ఏడుగురు మాత్రమే చైర్పర్సన్లుగా వ్యవహరించారు. ప్రతీ ఎన్నిక, పాలనలోను ఎన్నో ప్రత్యేకతలు, ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. 1959కి ముందు రాష్ట్రంలో జిల్లా బోర్డులు ఉండేవి. ఆ తరువాత జిల్లా పరిషత్, పంచాయతీ సమితులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పార్టీల రహితంగా జరిగే ఎన్నికల్లో సమితి అధ్యక్షులు జిల్లా పరిషత్ చైర్మన్‌ను ఎన్నుకొనేవారు. 1985 వరకు ఇదే విధానం ఉండేది. ఆ తర్వాత అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు అధికార వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టారు. పంచాయతీ సమితిల స్థానంలో మండల ప్రజా పరిషత్‌లను ఏర్పాటు చేశారు. 1985 కంటే ముందు రాజకీయ పార్టీల గుర్తులు లేకుండా ఎన్నికలు జరిగితే.. ఆ తర్వాత పార్టీ గుర్తులపై ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికలు నిర్వహించే విధానం ప్రవేశపెట్టారు. జిల్లా పరిషత్ చైర్మన్లను మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకునే విధానాన్ని ప్రవేశపెట్టారు. ఆ తర్వాత మరికొన్ని మార్పులు చేశారు. మండల ప్రజా పరిషత్‌లు మండల పరిషత్‌లు గాను, జిల్లా ప్రజా పరిషత్‌లు జిల్లా పరిషత్‌లుగా మార్చారు. మండల పరిషత్ అధ్యక్షులతో సంబంధం లేకుండా ప్రతీ మండలానికి ఒక జిల్లా ప్రాదేశిక సభ్యుడు (జెడ్పీటీసీ)ని ఎన్నుకోవడం, అలా ఎన్నికైన జెడ్పీటీసీలు జిల్లా పరిషత్ చైర్మన్‌ను ఎన్నుకునే విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 1959లో పరిషత్ ఏర్పాటు రాష్ట్రవ్యాప్తంగా 1959 నవంబర్ 1న జిల్లా పరిషత్‌లు ఏర్పడ్డాయి. తొలి విశాఖ జిల్లా పరిషత్ చైర్మన్‌గా రాజా సాగి సూర్యనారాయణరాజును ప్రభుత్వం నియమించింది. ఆయన 1962 వరకు పాలన సాగించగా ఆ తరువాత తొలిసారిగా పరిషత్‌కు ఎన్నికలు నిర్వహించారు. ఇందులో కాంగ్రెస్ పార్టీకి చెందిన సాగి సీతారామరాజు చైర్మన్‌గా ఎన్నికయ్యారు. మధ్యలో స్వల్పకాలం మినహా 1976 వరకు ఆయనే జెడ్పీ చైర్మన్‌గా కొనసాగారు. 1976 నుంచి 1980 వరకు స్పెషల్ ఆఫీసర్ పాలన కొనసాగింది. 1981లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నేత ద్రోణంరాజు సత్యనారాయణ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక అవిశ్వాస తీర్మానం ద్వారా పదవి నుంచి తొలగించారు. ఆ తర్వాతమాడుగుల నియోజకవర్గానికి చెందిన టీడీపీ నాయకుడు బొడ్డేడ రామారావు చైర్మన్‌గా ఎన్నికయ్యారు. 1987లో ప్రత్యక్ష పద్ధతిలో జెడ్పీ చైర్మన్‌ను ఎన్నుకునే పద్ధతి వచ్చాక బాకూరు చిన అప్పలరాజు తొలి చైర్మన్ అయ్యారు. అనంతరం పరోక్ష పద్ధతిలో మణికుమారి ఎన్నికైనప్పటికీ కోర్టు కేసుతో పదవిని చేపట్టలేకపోయారు. అనంతరం వంజంగి కాంతమ్మ, గొర్లె రామ్మూర్తినాయుడు చైర్పర్సన్ పదవులను నిర్వహించారు.