
సోనియాను తరిమికొట్టండి: హరికృష్ణ
దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ సమైక్యవాదమే తన వాదమని ఆయన కుమారుడు నందమూరి హరికృష్ణ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు సమైక్య రాష్ట్రాన్ని కోరుకుంటున్నారు ఆయన తెలిపారు. అంతేకాని ప్యాకేజీలు కాదని హరికృష్ణ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ విభజనపై తనదైన శైలీలో ముందుకు వెళ్తున్న కేంద్ర ప్రభుత్వం, సోనియా గాంధీలపై నందమూరి హరికృష్ణ శుక్రవారం రాష్ట్ర ప్రజలకు రాసిన బహిరంగ లేఖలో నిప్పలు చెరిగారు.
రాష్ట్ర విభజన ద్వారా దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీ లక్ష్యంగా చేసుకుందని ఆయన ఆరోపించారు. సోనియాను దేశం నుంచి తరిమికొట్టాలని ఆయన రాష్ట్ర ప్రజలకు పిలుపు నిచ్చారు. రాజ్యసభకు తాను రాజీనామా చేసిన సమయంలోనే తెలుగుదేశం పార్టీకి మిగత ఎంపీలు కూడా రాజీనామా చేస్తే పరిస్థితి ఇంతదాక వచ్చేది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. విభజనపై కేంద్రం ఇప్పుడు ఇస్తున్న హామీలు 2014 ఎన్నికల తర్వాత ఎవరు బాధ్యత వహిస్తారని రాష్ట్ర ప్రజలకు నందమూరి హరికృష్ణ రాసిన లేఖలో కేంద్రాన్ని ప్రశ్నించారు.