United Andhra Pradesh
-
‘మంచి అల్లుళ్లను ఇవ్వలేదు ఏం చేస్తాం..?’: రోశయ్య చెణుకు
Konijeti Rosaiah Timeliness Dialogues In Assembly: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య (88) శనివారం ఉదయం కన్నుమూసిన సంగతి తెలిసిందే. కాగా, సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న రోశయ్య వాక్చాతుర్యం, సమయస్ఫూర్తికి నిలువుటద్దంగా పేరు గడించారు. అధికారంలో ఉన్నప్పుడు, లేనప్పుడూ కూడా ఆయన తన గళాన్ని బలంగా వినిపించేవారు. తన సహజశైలితో, ఎలాంటి మొహమాటం లేకుండా అసెంబ్లీలో ప్రతిపక్షాలకు మొట్టికాయలు వేయడంలో ఆయనది అందె వేసిన చేయి. ఎన్టీఆర్, చంద్రబాబుల ప్రస్తావన వచ్చిందంటే చాలు.. రోశయ్య మాటలు తూటాల్లా పేలేవి. – సాక్షి, హైదరాబాద్ ఒక సందర్భంలో ఎన్టీఆర్‌ను రోశయ్య కించపర్చారంటూ నాటి ప్రతిపక్షనేత చంద్రబాబు విమర్శలు చేశారు. రోశయ్యకు కోపం ఎక్కువైందని, ఎన్టీఆర్‌ను కించపర్చారని తప్పుపట్టారు. దానిపై స్పందించిన రోశయ్య.. ‘‘నాకు కోపం వచ్చిన మాట వాస్తవమే. అసెంబ్లీలో పరిస్థితి, టీడీపీ వాళ్ల తీరు చూసి ఈ సభకు ఏం ఖర్మ పట్టిందన్న ఆవేదనతో కోపం వచ్చింది. అయినా ఎన్టీఆర్‌ను చంద్రబాబు, టీడీపీ ఎంతగా గౌరవించారో అందరికీ తెలుసు’’ అని తనదైన శైలిలో సమాధానమిచ్చారు. మంచి అల్లుళ్లను ఇవ్వలేదు ఏం చేస్తాం..? 2004–09 మధ్య రోశయ్య ఆర్థికమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అల్లుడు ఏదో విషయంలో పోలీసులకు దొరికిపోయాడంటూ చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు అరగంట పాటు అసెంబ్లీలో నానాయాగీ చేశారు. అంతసేపూ నిశ్శబ్దంగా ఉన్న రోశయ్య నెమ్మదిగా లేచి..‘‘అధ్యక్షా.. ఏం చేస్తాం.. ఆ భగవంతుడు నాకు, ఎన్టీ రామారావుకు మంచి అల్లుళ్లను ఇవ్వలేదు’’ అని చురక వేశారు. ఆ దెబ్బకు తెలుగుదేశం శిబిరం ముక్కున వేలేసుకోవాల్సి వచ్చింది. ఆయన వైఎస్ కాదు.. ఓ యస్ వైఎస్ కేబినెట్లో ఆర్థికమంత్రిగా పనిచేస్తున్న సమయంలోనే ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలు రోశయ్య దగ్గరికి వచ్చారు. తమ డిమాండ్లను పరిష్కరిస్తామని సీఎం వైఎస్సార్ హామీ ఇచ్చారని వారు రోశయ్యకు చెప్పగా.. ‘‘ఆయన ఇస్తారండి.. ఆయన వైఎస్ కాదు.. ఓయస్.. ఎవరైనా ఏదైనా కావాలని వెళితే ఆయన కాదనరు. ఆయన ఇచ్చే హామీలను అమలు చేసేందుకు నా తలప్రాణం తోకకు వస్తోంది..’’ అంటూ చిరుకోపం ప్రదర్శించారు. ఆ తర్వాత ఉద్యోగుల డిమాండ్లన్నీ నెరవేర్చేందుకు చర్యలు చేపట్టారు. వెన్నుపోటు పొడిచేవాడ్ని మరి.. మరోసారి రోశయ్య తెలివితేటలు సరిగా లేవంటూ చంద్రబాబు విమర్శలు చేశారు. దానిపై రోశయ్య స్పందిస్తూ.. ‘‘నాకు తెలివితేటలుంటే ఇలా ఉంటానా? నన్ను నమ్మిన రాజశేఖరరెడ్డిని ఎప్పుడో ఒంటరిగా కూర్చున్నప్పుడు వెన్నుపోటు పొడిచి కుర్చీ ఎక్కేవాడిని.. అంతకుముందు చెన్నారెడ్డిని, విజయభాస్కర్‌రెడ్డిని కూడా వెన్నుపోటు పొడిచేవాడిని..’’ అంటూ ఎన్టీఆర్‌కు చంద్రబాబు వెన్నుపోటు ఘటనను గుర్తుచేశారు. దీంతో చంద్రబాబు అవాక్కై కిమ్మనకుండా కూర్చుండిపోయారు. (నింగికేగిన నిగర్వి) -
నింగికేగిన నిగర్వి
సాక్షి, హైదరాబాద్/అమరావతి/తెనాలి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య (88) శనివారం ఉదయం కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో కొంతకాలంగా హైదరాబాద్‌లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న ఆయన.. శనివారం ఉదయం అచేతనంగా కనిపించడంతో కుటుంబ సభ్యులు బంజారాహిల్స్‌లోని స్టార్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ, అప్పటికే రోశయ్య తుదిశ్వాస విడిచారని వైద్యులు నిర్ధారించారు. రోశయ్యను శనివారం ఉ.8:20 గంటల సమయంలో అచేతన స్థితిలో ఆస్పత్రికి తీసుకువచ్చారని.. అప్పటికే ఆయన మరణించారని స్టార్ ఆస్పత్రి మెడికల్ డైరెక్టర్ ప్రకటించారు. రోశయ్య మరణవార్త తెలియడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో విషాదం నెలకొంది. ప్రధాని మోదీ, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, ఏపీ సీఎం వైఎస్ జగన్, తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావు, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ఇతర నేతలు సంతాపం ప్రకటించారు. రోశయ్య పార్థివదేహాన్ని సందర్శించిన ప్రముఖులు రోశయ్య పార్థివదేహాన్ని శనివారం మధ్యాహ్నం అమీర్‌పేటలోని ధరమ్‌కరమ్ రోడ్డులో ఉన్న ఆయన స్వగృహానికి తీసుకెళ్లారు. తెలంగాణ సీఎం కేసీఆర్, ఉమ్మడి రాష్ట్ర మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, దేవదాయ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, మాజీమంత్రి పత్తిపాటి పుల్లారావు, కేవీపీ రామచంద్రరావు, తెలంగాణ మంత్రులు హరీశ్‌రావు, మహమూద్ అలీ, తలసాని, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి తదితరులు అక్కడికి చేరుకుని పార్థివదేహం వద్ద నివాళులు అర్పించారు. ఇక రోశయ్యను కడసారి చూసేందుకు అభిమానులు, రాజకీయ నాయకులు, సినీ, వివిధ రంగాల ప్రముఖులు తరలివచ్చారు. నేటి ఉదయం గాంధీభవన్‌కు.. రోశయ్య పార్థివదేహాన్ని ఆదివారం ఉదయం కాంగ్రెస్ రాష్ట్ర కార్యాలయమైన గాంధీభవన్‌కు తీసుకెళ్లనున్నారు. కొంతసేపు ప్రజలు, అభిమానుల సందర్శనార్థం ఉంచి.. తర్వాత హైదరాబాద్ శివార్లలోని దేవరయాంజాల్‌లో ఉన్న వ్యవసాయ క్షేత్రానికి తరలించనున్నారు. మధ్యాహ్నం అక్కడ రోశయ్య అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ‘బడ్జెట్ల’ రోశయ్య దేశ చరిత్రలోనే అత్యధికంగా పదిహేనుసార్లు రాష్ట్ర బడ్జెట్లు ప్రవేశపెట్టిన రికార్డు రోశయ్యదే. అంతేకాదు.. ఇందులో వరుసగా ఏడుసార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం గమనార్హం. విషయ పరిజ్ఞానం గల వ్యక్తిగా రోశయ్య ఎన్నోసార్లు ప్రశంసలు అందుకున్నారు. ఓవర్ డ్రాఫ్ట్‌కు వెళ్లడమంటే పక్కింటికి వెళ్లి పంచదార అరువు తెచ్చుకోవడమేనని చెప్పే ఆయన.. ఆర్థిక క్రమశిక్షణతో రాష్ట్రాన్ని ముందుకు నడిపించడంలో కీలకపాత్ర పోషించారు. ఆయన హయాంలో ఉమ్మడి ఏపీ ఏనాడూ ఓవర్ డ్రాఫ్ట్‌కు వెళ్లలేదు. వైఎస్ మరణానంతరం సీఎంగా.. నాటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూయడంతో.. కాంగ్రెస్ అధిష్టానం రోశయ్యకు ఉమ్మడి ఏపీ సీఎంగా బాధ్యతలు అప్పగించింది. 2009 సెప్టెంబర్ 3వ తేదీ నుంచి 2010 నవంబర్ 24 వరకు రోశయ్య ఈ బాధ్యతలను నిర్వర్తించారు. తర్వాత పలు పరిణామాల కారణంగా పదవిని వదిలిపెట్టారు. ఆయన సేవలకు గుర్తింపుగా యూపీఏ ప్రభుత్వం గవర్నర్ గిరీ అప్పగించింది. 2011 ఆగస్టు 31న తమిళనాడు గవర్నర్‌గా రోశయ్య బాధ్యతలు స్వీకరించారు. అదే సమయంలో కొన్నాళ్లు కర్ణాటక ఇన్చార్జి గవర్నర్‌గా పనిచేశారు. 2016 ఆగస్టు 30 వరకు గవర్నర్ హోదాలో సేవలు అందించారు. తర్వాత హైదరాబాద్‌లోని తన స్వగృహంలో విశ్రాంత జీవితాన్ని గడిపారు. ఆయనంటే అందరికీ గౌరవం ఎవరినైనా కలుపుకొనిపోయే స్వభావం, అపార అనుభవం, విషయాలపై స్పష్టమైన అవగాహన, చక్కని భాష, దీనికితోడు సమయస్ఫూర్తి వంటివన్నీ రోశయ్యను ఉన్నత శ్రేణిలో నిలబెట్టాయి. ఆయనకు 2007లో ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. 2018 ఫిబ్రవరిలో లలిత కళాపరిషత్ ఆయనకు జీవన సాఫల్య పురస్కారాన్ని అందజేసింది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా స్వర్ణ కంకణాన్ని బహూకరించింది. కుటుంబానికీ ప్రాధాన్యమిస్తూ.. రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా కుటుంబం బాగోగులను చూసుకోవడంలోనూ, కుటుంబ సభ్యులకు ఆప్యాయత పంచడంలోనూ రోశయ్య ముందుండేవారు. రోశయ్యకు 17 ఏళ్ల వయసులోనే వివాహం జరిగింది. ఆయనకు భార్య శివలక్ష్మి, కుమారులు శివసుబ్బారావు, త్రివిక్రమ్, శ్రీమన్నారాయణమూర్తి, కుమార్తె రమాదేవి ఉన్నారు. వనభోజనాలంటే ఇష్టం 1992లో రోశయ్య ఆరు ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసి వ్యవసాయ క్షేత్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అందులో తులసి, రుద్రాక్ష, నేరేడు, వేపతోపాటు అనేక రకాల మొక్కలను రోశయ్య స్వయంగా నాటారని అక్కడి పనివారు తెలిపారు. రోశయ్యకు వనభోజనాలంటే ఇష్టమని, అక్కడికి ఎప్పుడొచ్చినా చెట్ల కిందే కూర్చుని భోజనం చేసేవారని సైట్ ఇన్చార్జి రమేశ్ వెల్లడించారు. వ్యవసాయ క్షేత్రంలో పందిరిని రోశయ్య ప్రత్యేకంగా కట్టించుకున్నారని.. ఎక్కువ సమయం అక్కడే గడిపేవారని తెలిపారు. ఎన్జీ రంగా స్ఫూర్తితో.. గుంటూరు జిల్లా వేమూరులో 1933 జూలై 4న ఆదెమ్మ, సుబ్బయ్య దంపతులకు రోశయ్య జన్మించారు. గుంటూరు హిందూ కళాశాలలో కామర్స్ డిగ్రీ చేశారు. ప్రముఖ స్వాతంత్య్రయోధుడు, రైతు నాయకుడు ఎన్జీ రంగా స్ఫూర్తితో రాజకీయాల్లోకి ప్రవేశించారు. తొలిసారిగా 1968లో ఉమ్మడి ఏపీ శాసనమండలి సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1974, 1980లోనూ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 1979లో మర్రి చెన్నారెడ్డి మంత్రివర్గంలో ఆర్ అండ్ బీ, రవాణా మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తర్వాత కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, నేదురుమల్లి జనార్దనరెడ్డి, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మంత్రివర్గాల్లో వివిధ శాఖల బాధ్యతలు నిర్వర్తించారు. 1995–97 మధ్య ఏపీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. 1998లో నరసరావుపేట నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2004లో చీరాల నుంచి అసెంబ్లీకి ఎన్నికై ఆర్థిక మంత్రిగా పనిచేశారు. 2009లో రోశయ్య ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకపోయినా.. వైఎస్సార్ ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశమిచ్చి ఆర్థికశాఖను అప్పగించారు. 3 రోజులు సంతాప దినాలు మాజీ సీఎం రోశయ్య మృతికి సంతాప సూచకంగా ఏపీ ప్రభుత్వం డిసెంబర్ 4 నుంచి 6 వరకు సంతాప దినాలను ప్రకటించింది. ఈమేరకు సాధారణ పరిపాలన శాఖ(ప్రొటోకాల్) శనివారం ఉత్తర్వులిచ్చింది. తెలంగాణ సర్కారు కూడా మూడ్రోజులు సంతాపదినాలు ప్రకటించింది. అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని నిర్ణయించింది. ఆయన కృషి గుర్తుండిపోతుంది రోశయ్య మరణం బాధాకరం. మేం ఇద్దరం సీఎంలుగా పనిచేసినప్పుడు, తర్వాత రోశయ్య గవర్నర్‌గా ఉన్నప్పుడు ఆయనతో నేను చేసిన సంప్రదింపులు గుర్తుకువచ్చాయి. ప్రజాసేవ కోసం రోశయ్య చేసిన కృషి గుర్తుండిపోతుంది. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నా..’’ – ప్రధాని నరేంద్ర మోదీ తెలుగు ప్రజలకు తీరని వేదన ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ పాలనాదక్షుడిగా పేరు పొందిన రోశయ్య మృతి తెలుగు వారికి తీరనిలోటు. రాజకీయాలకు అతీతంగా ప్రజలంతా కలిసి మెలసి ఉండాలని, తెలుగు ప్రజలు సుఖసంతోషాలతో విలసిల్లాలని రోశయ్య కోరుకునేవారు. – సుప్రీం చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ అంకిత భావం ఉన్న నేత రోశయ్య నాకు చిరకాల మిత్రుడు. రాష్ట్రంతోపాటు జాతీయ రాజకీయాల్లో అంకితభావం, నిబద్ధతతో పనిచేశారు. ఆయన ఇకలేరనే వార్త బాధాకరం. రోశయ్య ఆత్మకు శాంతి కలగాలి. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నా – ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆయనది రాజీలేని పోరాటం రోశయ్య ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేశారు. అధికారం ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా తనకంటూ ఓ ప్రత్యేకత చాటుకున్నారు. ఆర్ధికం అంటే అర్ధంకాని పరిస్ధితుల్లో ఆర్థిక వ్యవస్థకు నూతన మార్గనిర్దేశం చేశారు. ఆయనను తెలుగు జాతి మరువబోదు. – టీడీపీ అధినేత చంద్రబాబు పదవులకే వన్నె తెచ్చారు మంత్రిగా, ముఖ్యమంత్రిగా, గవర్నర్‌గా రోశయ్య పదవులకే వన్నె తెచ్చారు. సౌమ్యుడిగా, సహనశీలిగా నిలిచారు. రాజకీయాల్లో తనదైన ప్రత్యేక శైలితో హూందాగా వ్యవహరించారు. ఆయన మృతి తీరని లోటు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నా.. – తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావు నాన్న నిరాడంబరుడు దొండపర్తి (విశాఖ దక్షిణ): ‘నాన్న నిరాడంబరుడు. రాజకీయాల్లో ఎన్ని కీలక పదవులు అధిరోహించినా ఆ హోదాను ఎప్పుడు ప్రదర్శించేవారు కాదు. సింపుల్ లైఫ్ స్టైల్‌నే ఇష్టపడేవారు. అమ్మా, నాన్నలకు నేను ఏకైక కుమార్తెను కావడంతో అల్లారుముద్దుగా చూసుకునేవారు. నేను నాన్న కూతురినే. నన్ను విలువలతో పెంచారు. నా వంట అంటే నాన్నకు చాలా ఇష్టం. ఆయన లేరన్న నిజాన్ని తట్టుకోలేకపోతున్నాను’ అంటూ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య కుమార్తె రమాదేవి కన్నీరుమున్నీరుగా విలపించారు. రోశయ్య మృతితో విశాఖ బాలాజీ నగర్లో నివాసముంటున్న అతని ఏకైక కుమార్తె రమాదేవి నివాసం వద్ద విషాద ఛాయలు అలముకున్నాయి. రమాదేవి మీడియాతో మాట్లాడుతూ.. తన తండ్రికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అంటే ఎనలేని అభిమానమని చెప్పారు. ఆయన తన జీవితంలో అనేక ఉన్నత పదవులు నిర్వర్తించినా ఏరోజూ రాజకీయాలను ఇంట్లో ప్రస్తావించే వారు కాదని చెప్పారు. తనను రాజకీయాల్లోకి రావాలని ఎప్పుడూ ప్రోత్సహించలేదన్నారు. రాజకీయ జీవితంలో కొన్నిసార్లు మంచిచేసినా నిందలు భరించాల్సి వస్తుందని, తన తండ్రికి చెడ్డపేరు రాకూడదన్న ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి రాలేదని తెలిపారు. తన తండ్రి లేని లోటు తీరనిదంటూ కన్నీటి పర్యంతమయ్యారు. తండ్రిని కడసారి చూసేందుకు రమాదేవి, అల్లుడు పైడా కృష్ణప్రసాద్ విశాఖ నుంచి హైదరాబాద్‌కు పయనమయ్యారు. అంత్యక్రియలకు ముగ్గురు మంత్రులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశం సాక్షి, అమరావతి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం రోశయ్య అంత్యక్రియల కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ముగ్గురు మంత్రుల బృందాన్ని పంపిస్తోంది. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్ శనివారం ఆదేశించగా సాధారణ పరిపాలన శాఖ (ప్రొటోకాల్) ఉత్తర్వులు జారీచేసింది. దీంతో హైదరాబాద్‌లో ఆదివారం మధ్యాహ్నం జరిగే ఆయన అంత్యక్రియల కార్యక్రమానికి మంత్రులు బొత్స సత్యనారాయణ, బాలినేని శ్రీనివాసరెడ్డి, వెలంపల్లి శ్రీనివాసరావు హాజరుకానున్నారు. అజాత శత్రువు రోశయ్య రోశయ్య గారితో నాకు 40 ఏళ్లకు పైగా అనుబంధముంది. ఆయన, నేను పలుమార్లు కేబినెట్లో బాధ్యతలు నిర్వర్తించాం. ఆయన సీఎంగా ఉన్నప్పుడు పీసీసీ అధ్యక్షుడిగా కూడా చేశాను. ఆయనకు ట్రబుల్షూటర్ అనే పేరు. చక్కని చమత్కారాలతో, వాక్చాతుర్యంతో అందరితో కలివిడిగా ఉంటూ అజాత శత్రువుగా ఉన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలి. వారి కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నాను. – ధర్మపురి శ్రీనివాస్, సీనియర్ నేత, మాజీమంత్రి, పీసీసీ మాజీ అధ్యక్షుడు మంచి స్నేహితుడ్ని కోల్పోయా ఆరు శాఖలను నేను రోశయ్య గారు ఒకేసారి నిర్వహించాం. అసెంబ్లీలో కూడా ఆయన చాలా సమర్థంగా సమయస్ఫూర్తితో ప్రభుత్వానికి ఎలాంటి సమస్య ఎదురుకాకుండా చూసేవారు. విపక్షాలను ధీటుగా ఎదుర్కొనేవారు. రాజ్యసభ పదవి తప్ప ఇంచుమించు అన్ని పదవులు ఆయన సమర్ధంగా నిర్వహించారు. ప్రభుత్వానికి, పార్టీకి అనేక సేవలందించారు. మంచి స్నేహితుడిని కోల్పోయాను. – డీకే సమరసింహారెడ్డి, సీనియర్ నేత, మాజీమంత్రి 56 ఏళ్ల స్నేహం మాది రోశయ్యగారు, నేను ఇంచుమించు ఒకేసారి రాజకీయ ప్రస్థానం ప్రారంభించాం. విజయభాస్కరరెడ్డి, రాజశేఖరరెడ్డి కేబినెట్లలో ఇద్దరం పనిచేశాం. 56 ఏళ్ల స్నేహం మాది. కాంగ్రెస్‌లో దాదాపు అందరు సీఎంల కేబినెట్లో ఉండడమే కాకుండా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. 15సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. నాపట్ల చాలా అభిమానంతో ఉండేవారు. ఆయన మరణం వ్యక్తిగతంగా మాకు తీరని లోటే. – గాదె వెంకటరెడ్డి, సీనియర్ నేత, మాజీమంత్రి చీరాల నుంచే రాజకీయ అరంగేట్రం చీరాల: మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యకు ప్రకాశం జిల్లా చీరాలతో విడదీయరాని అనుబంధం ఉంది. ఆయన అకాల మరణంతో చీరాలలో విషాదఛాయలు నెలకొన్నాయి. రోశయ్య సొంత ఊరు గుంటూరు జిల్లా వేమూరు అయినా.. ఆయన రాజకీయ స్వస్థలం చీరాల అని రాజకీయ విశ్లేషకులు అంటుంటారు. 1967లో అక్కడ నుంచి రాజకీయ అరంగేట్రం చేశారు. అప్పటి నుంచి 2004 వరకు నాలుగు పర్యాయాలు పోటీచేసి రెండుసార్లు గెలుపొంది అనేక మంత్రి పదవుల్లో పనిచేశారు. 1967లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీచేసిన ప్రగడ కోట య్య స్వతంత్ర అభ్యర్థి రోశయ్యపై గెలుపొందారు. 1989లో కాంగ్రెస్ అభ్యర్థిగా రోశయ్య టీడీపీ అభ్యర్థి చిమటా సాంబుపై గెలుపొందారు. ఆ దఫా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఐదేళ్లపాటు ఆర్థిక మంత్రిగా పనిచేశారు. 1994లో టీడీపీ అభ్యర్థి పాలేటి రామారావుపై పోటీచేశారు. 2004లో కాంగ్రెస్ అభ్యర్థిగా కొణిజేటి రోశయ్య.. టీడీపీ అభ్యర్థి పాలేటి రామారావుపై విజయం సాధించి ఆర్థిక మంత్రిగా పనిచేశారు. విలువలతో కూడిన రాజకీయాలకు ప్రతీక మాజీ సీఎం రోశయ్య మృతికి గవర్నర్ హరిచందన్ సంతాపం సాక్షి, అమరావతి/నెట్వర్క్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య మృతిపట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తీవ్ర సంతాపం వ్యక్తంచేశారు. ఈ మేరకు రాజ్‌భవన్ నుంచి శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. నాటి తరం నాయకునిగా విలువలతో కూడిన రాజకీయాలకు ప్రతీకగా రోశయ్య నిలిచారని కొనియాడారు. ఉదయం అస్వస్థతకు గురైన రోశయ్య ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతిచెందడం విచారకరమన్నారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు గవర్నర్ పేర్కొన్నారు. అలాగే, పలువురు మంత్రులు, ఇతర ప్రముఖులు కూడా రోశయ్య మృతిపట్ల తీవ్ర విచారం వ్యక్తంచేసి ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ► పీసీసీ అధ్యక్షుడిగా, ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా, ఆర్థిక శాఖ మంత్రిగా, గవర్నర్‌గా అనేక ఉన్నత పదవులను రోశయ్య సమర్థంగా నిర్వహించారు. ఆయన మృతికి నా ప్రగాఢ సానుభూతి. – తమ్మినేని సీతారాం, స్పీకర్ ► రోశయ్య మృతితో రాష్ట్రం సుదీర్ఘ రాజకీయ అనుభవజ్ఞుడ్ని కోల్పోయింది. ఆయన ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. ఆర్థిక నిపుణుడిగా రాష్ట్రానికి విశిష్ట సేవలందించారు. ఒక మంచి మనిషి మనమధ్య లేకపోవడం నిజంగా బాధాకరం. – మంత్రి బొత్స సత్యనారాయణ ► వైఎస్సార్‌తో కలిసి ఆయన పనిచేసిన రోజులు మర్చిపోలేనివి. ఆయన ఆత్మకు శాంతి కలగాలి. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. – డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ► రోశయ్య మరణం రెండు తెలుగు రాష్ట్రాలకూ తీరనిలోటు. రాజకీయంగా ఎంతోమందికి ఆయన ఆదర్శనీయుడు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి ఎంతో ప్రీతిపాత్రుడు. – మంత్రి మేకతోటి సుచరిత ► ప్రముఖ స్వాతంత్య్ర యోధుడు, రాజకీయ చతురత కలిగిన నాయకుడు రోశయ్య మరణం అత్యంత బాధాకరం. – మంత్రి ఆళ్ల నాని ► రోశయ్య బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన మృతి రాష్ట్రానికి తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. – మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ► రోశయ్య మరణం నన్ను ఎంతో కలచివేసింది. ఆయనకు శ్రీ శారదా పీఠంతో ఎంతో అనుబంధం ఉంది. ఆరోగ్యకరమైన రాజకీయాల కోసం ఆయన తపించేవారు. రోశయ్య రాజకీయ ప్రస్థానం రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. – విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ ► పెద్దలు, మచ్చలేని సీనియర్ నాయకులు రోశయ్య మరణం తెలుగు రాష్ట్రాలకు తీరనిలోటు. ఆయన మృతికి నా ప్రగాఢ సంతాపం. – మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ ► సుదీర్ఘకాలం పాటు రాష్ట్ర ఆర్థిక మంత్రిగా పనిచేసిన అనుభవం రోశయ్య సొంతం. సీఎంలు ఆయన నిర్ణయాలకు విలువ ఇచ్చేవారు. – మంత్రి సీదిరి అప్పలరాజు ► రాజకీయాల్లో అజాత శత్రువు రోశయ్య మృతి జీర్ణించుకోలేనిది. విద్యార్థి సంఘ నాయకుడి నుంచి గవర్నర్ వరకు అంచలంచెలుగా ఎదిగారు. ఆయన ఆత్మకు సద్గతులు కలగాలి. – ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, అధికార భాషా సంఘం అధ్యక్షుడు ► రోశయ్య మరణం ఆంధ్ర రాష్ట్రానికి తీరని లోటు. సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆయన ప్రజలకు ఎనలేని సేవలు అందించారు. – మల్లికార్జునరెడ్డి, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ ► ఏ సీఎం దగ్గరైనా రోశయ్య తనకంటూ ఒక గుర్తింపును పొందారు. రాష్ట్ర రాజకీయాల్లో ఆయన నిర్వర్తించిన పాత్ర కీలకం. రోశయ్య మరణం సమకాలిక రాజకీయాలకు తీవ్రమైన నష్టం – సోము వీర్రాజు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ► ఆపత్కాలంలో రోశయ్య 14 నెలలపాటు సీఎంగా సేవలు అందించారు. ఆయన నిష్కళంక రాజకీయ యోధుడు. ఆయన విజ్ఞతను ఎవరూ మరచిపోలేరు. – పవన్‌కల్యాణ్, జనసేన పార్టీ అధ్యక్షుడు ► ఉమ్మడి రాష్ట్రానికి నాలుగుసార్లు ఆర్థిక మంత్రిగా.. సీఎంగా, తమిళనాడు గవర్నర్‌గా పనిచేశారు. వారి ఆకస్మిక మృతి దిగ్భ్రాంతి కలిగించింది. – మధు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి ► ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీడీపీ గ్రాంటును పునరుద్ధరించి ఆయా నియోజకవర్గాల అభివృద్ధికి రోశయ్య ఎంతో సహకరించారు. – జల్లి విల్సన్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు -
ఆ హామీలు ఇప్పుడు నెరవేర్చడం కష్టం
-
ఆ హామీలు ఇప్పుడు నెరవేర్చడం కష్టం
ఎన్నికల హామీలపై చంద్రబాబు తన చావుకబురు చల్లగా చెప్పారు. అప్పట్లో సమైక్య రాష్ట్రం ఉండేదని, అప్పుడు తాను సమైక్య రాష్ట్రంలోనే హామీలు ఇచ్చానని ఆయన అన్నారు. అయితే ఇప్పుడు రాష్ట్రం విడిపోయిందని, ఆ ఎన్నికల సమయంలో తాను ఇచ్చిన హామీలన్నింటినీ ఇప్పుడు నెరవేర్చడం కష్టమని ఆయన చెప్పారు. గోదావరి జిల్లాల పర్యటనలో భాగంగా ఆయన తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన సభలో మాట్లాడారు. ''మీరు నామీద నమ్మకం పెట్టుకున్నారు. నేనైతేనే చేయగలనని నమ్మి ఓట్లేశారు. ఒకటి కాదు, రెండు కాదు, నేను ఆ రోజు చాలా హామీలు ఇచ్చాను. కానీ ఇప్పుడవి నెరవేర్చడం కష్టం'' అని ఆయన అన్నారు. -
ఉమ్మడి రాష్ట్రాన్ని కడిగేసిన కాగ్
ఆర్థిక నిర్వహణ విషయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాగ్ నిలువునా కడిగేసింది. 2013 మార్చితో ముగిసిన ఉమ్మడి రాష్ట్ర నివేదికను తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీ ముందు ఉంచింది. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు చాలా లోపభూయిష్టంగా ఉందని కాగ్ మండిపడింది. మ్యాచింగ్ గ్రాంటును విడుదల చేయడంలో ప్రభుత్వం విఫలమైందని తెలిపింది. 2013 మార్చి నాటికి ఉమ్మడి రాష్ట్రంలో అన్నిరకాల పింఛన్లు కలిపి రూ. 72.36 లక్షల కోట్లు ఉన్నాయని తెలిపింది. కేంద్ర ప్రభుత్వ నిధులను రాష్ట్ర పథకాలకు ఖర్చుచేయడంలో ప్రభుత్వం విఫలమైందని చెప్పింది. పింఛన్ల దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను ప్రైవేటు సంస్థకు అప్పగించారని, పింఛన్ల అర్హుల నిర్ధారణకు ప్రభుత్వ యంత్రాంగం లేదని మండిపడింది. పింఛను లబ్ధిదారులు, రేషన్ కార్డులను పోల్చిచూసేందుకు సరైన డేటాబేస్ లేదని , పింఛన్ల కోసం స్మార్ట్ కార్డుల ప్రక్రియ పూర్తికాలేదని కాగ్ చెప్పింది. -
సమైక్యవాదులపై 725 కేసుల ఎత్తివేత
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల విభజనకు ముందు సంయుక్త ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ ఉద్యమం చేసిన వారిపై నమోదైన కేసులను ఎత్తివేసింది. 725 కేసులను ఎత్తివేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు సీమాంధ్రలో పెద్ద ఎత్తున సమైక్యాంధ్ర ఉద్యమం జరిగిన సంగతి తెలిసిందే. -
రోడ్ టెర్రర్
ఏడాదిలో 31,228 మంది యాక్సిడెంట్ల మృతులు 2,484 మంది హత్యలకు గుైరె నవారు.. రాష్ట్రంలో నిరుడు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఏడాది వివిధ కారణాల నేపథ్యంలో జరిగిన హత్యల్లో 2,484 మంది చనిపోగా.. రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య మాత్రం ఏకంగా 31,228 గా ఉంది. జాతీయ నేర గణాంకాల నమోదు సంస్థ (ఎన్సీఆర్బీ) విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. ఈ మరణాల్లో దేశంలో ఉమ్మడి ఏపీ వరుసగా రెండో ఏడాది ఐదో స్థానాన్ని ఆక్రమించింది. కొరవడిన మౌలిక వసతులు, వాహనచోదకుల నిర్లక్ష్యం, మద్యం తాగి వాహనాలు నడపటం, పరిమితికి మించిన వేగం.. ఇలా అనేక కారణాలతో రోడ్డు ప్రమాదాల్లో వేలాది మంది మృత్యువాత పడుతున్నారు. 2012 సంవత్సరంతో పోలిస్తే గత ఏడాది (2013లో) ప్రమాదాల సంఖ్య 1,376 పెరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ హైదరాబాద్ (సైబరాబాద్‌తో కలిపి) తొలి స్థానంలో ఉంది. మృతుల సంఖ్య 2012 కంటే గత ఏడాది విజయవాడలో తగ్గగా.. విశాఖపట్నంలో మాత్రం పెరిగింది. రోడ్డు ప్రమాదాల్లో.. ఆకతాయితనం, వేగం ఎక్కువగా ఉండే యువకుల కంటే మధ్య వయస్కులే ఎక్కువగా మృతులుగా ఉండటం మరో ఆందోళనకర అంశం. గత ఏడాది 14-29 ఏళ్ల మధ్య వయస్కులు 9,619 మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోగా.. 30-44 ఏళ్ల మధ్య వారు 11,533 మంది అశువులుబాశారు. మొత్తం మృతుల్లో 25,091 మంది పురుషులు, 6,137 మంది మహిళలు ఉన్నారు. -
వ్యభిచారం కేసుల్లో ఉమ్మడి రాష్ట్రం సెకండ్!!
ఒక పెద్దాపురం.. ఒక చిలకలూరిపేట.. పేరు ఏదైతేనేం, మన రాష్ట్రంలో వ్యభిచారం జోరుగా సాగుతోంది. ఎంతగా అంటే.. దేశం మొత్తమ్మీద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఈ విషయంలో రెండో స్థానంలో ఉందట. ఈ విషయాన్ని జాతీయ నేర గణాంకాల సంస్థ తన లెక్కల్లో వెల్లడించింది. మన కంటే ముందు ఈ విషయంలో తమిళనాడు నిలిచింది. దేశం మొత్తమ్మీద జరుగుతున్న వ్యభిచారంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి 20 శాతం వాటా ఉంది. 2013 సంవత్సరానికి సంబంధించి ఎన్సీఆర్బీ వెల్లడించిన గణాంకాలు ఈ వివరాలను తెలిపాయి. ఉమ్మడి రాష్ట్రం మొత్తమ్మీద చూసుకుంటే.. ప్రధానంగా హైదరాబాద్, సైబరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లోనే ఎక్కువ వ్యభిచారం కేసులు, ఉమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ కేసులు నమోదయ్యాయి. దేశం మొత్తమ్మీద 2,541 బ్రోతల్ కేసులు నమోదైతే.. వాటిలో 489 కేసులు ఆంధ్రప్రదేశ్వే ఉన్నాయి. తమిళనాడులో ఏకంగా 549 కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్, సైబరాబాద్ జంట కమిషనరేట్ల పరిధిలో హైటెక్ వ్యభిచారం జోరుగా సాగుతోంది. శివారు ప్రాంతాల్లోని పలు హోటళ్లలో పలువురు మోడళ్లు, చిన్న స్థాయి నటీమణులు, టీవీ సీరియల్ ఆర్టిస్టులు పలు సందర్భాలలో దొరికేశారు. ఎప్పటికప్పుడు దీన్ని అరికట్టేందుకు పోలీసులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నా.. చాపకింద నీరులా ఈ వ్యవహారం మాత్రం కొనసాగుతూనే ఉంది. వాస్తవానికి బుక్ అయిన కేసులతో పోలిస్తే పోలీసులు పట్టుకుని, పెట్టీ కేసులుగా వదిలేసినవి, వాళ్ల దృష్టివరకు రాకుండా జరిగేవి కొన్ని రెట్లు ఎక్కువ ఉంటాయి. -
ఎన్నిక లయ్యాకే రెండు రాష్ట్రాల ఏర్పాటు?
సాంకేతిక ఇబ్బందులు దాటాకే అధికారిక విభజన సమైక్య రాష్ట్రంలోనే ఎన్నికలంటున్న సీమాంధ్ర నేతలు సాక్షి, హైదరాబాద్: సాధారణ ఎన్నికలు సమైక్య రాష్ట్రంలోనే జరుగుతాయా, లేక రెండు రాష్ట్రాలు విడిపోయాకా? విభజన ప్రక్రియ దాదాపు పూర్తి కావస్తుండటంతో రాష్ట్ర కాంగ్రెస్ నేతల్లో ఈ అంశంపై చర్చ సాగుతోంది. సమైక్య రాష్ట్రంలోనే ఎన్నికలు జరుగుతాయని సీమాంధ్ర నేతలు, కొత్త రాష్ట్రాల్లోనేనని తెలంగాణ నేతలు అంటున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తూ రాష్ట్రపతి గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చాక అమలు తేదీ (అపాయింటెడ్ డే) నుంచి ఆంధ్రప్రదేశ్ అధికారికంగా రెండుగా విడిపోతుంది. అప్పటి నుంచి రెండు అసెంబ్లీలుంటాయి. ఇద్దరు సీఎంలుంటారు. అయితే ఆ అపాయింటెడ్ డే ఎప్పుడన్నది ఇప్పుడు అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది. పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించిన తెలంగాణ బిల్లును కేంద్ర హోం శాఖ రాష్ట్రపతికి పంపిస్తుంది. దానిపై ఆయన లాంఛనంగా ఆమోదముద్ర వేశాక గెజిట్ నోటిఫికేషన్ వెలువడుతుంది. అపాయింటెడ్ డేను అందులోనే రాష్ట్రపతి నిర్దేశిస్తారు. ప్రస్తుత బిల్లులో సాంకేతిక లోపాలున్నాయి. పైగా ఆస్తులు అప్పులు, ఆదాయాల పంపిణీ ఉద్యోగుల కేటాయింపు వంటి కీలకాంశాలు పూర్తవాల్సి ఉంది. అందుకు కనీసం నాలుగైదు నెలలైనా పడుతుందని అంచనా. కానీ మార్చి తొలి వారంలోనే సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ రానుంది. షెడ్యూలు వచ్చిందంటే అధికార యంత్రాంగమంతా ఎన్నికల నిర్వహణలోనే తలమునకలై ఉంటుంది. సాధారణ పరిపాలనా వ్యవహారాలు తప్ప ఆ సమయంలో మరే కార్యక్రమమూ చేపట్టే వీలుండదు. కాబట్టి ఎన్నికలయ్యేదాకా అధికారిక విభజన వీలు కాదన్నది సీమాంధ్ర కాంగ్రెస్ నేతల అంచనా. పైగా విభజన జరిగితే రెండు రాష్ట్రాల్లోనూ ఎస్సీ, ఎస్టీల జనాభాలో తేడా వచ్చి, ఆ మేరకు చట్టసభల్లో వారి రిజర్వేషన్లు కూడా సమస్యగా మారతాయి. ఎందుకంటే ఇప్పుడు సమైక్య రాష్ట్రం యూనిట్‌గా ఉన్న ఎస్సీ, ఎస్టీ స్థానాలను విభజన అనంతరం ఒక్కో రాష్ట్రాన్నీ యూనిట్‌గా తీసుకుని పునర్వ్యవస్థీకరించాల్సి ఉంటుంది. లేదంటే వారికి జనాభా ప్రాతిపదికన ప్రాతినిధ్యం దక్కదు. రాజకీయంగా కూడా రాజకీయంగా చూసుకున్నా ఎన్నికలు సమైక్య రాష్ట్రంలోనే పూర్తయితేనే మేలని అధిష్టానం భావిస్తోందని కాంగ్రెస్ నేతలంటున్నారు. ఆస్తులు అప్పులు, ఆదాయాలు, ఉద్యోగుల పంపిణీ, పెన్షన్‌దారుల వ్యవహారాలను ప్రస్తుత పరిస్థితుల్లో హడావుడిగా తలకెత్తుకోవడం మరిన్ని సమస్యలు తెచ్చిపెడుతుందని భావిస్తున్నారు. ఈ అంశాల్లో ఇరు ప్రాంతాల నేతలు, ఉద్యోగ సంఘాలు, తదితర సంస్థల మధ్య తీవ్ర విభేదాలున్నాయి. ఆస్తులు, అప్పుల పంపిణీ జనాభా ప్రాతిపదికన జరగాలని బిల్లులో పేర్కొనగా, తెలంగాణ నేతలు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. పెన్షనర్ల భారం కూడా ఇరు ప్రాంతాల మధ్య విభేదాలకు దారితీసేలా ఉంది. సాగునీరు, విద్యుత్తు తదితరాల పంపిణీ కూడా జటిలంగానే కన్పిస్తోంది. ఇలాంటి సున్నితమైన అంశాలను ఎన్నికల ముందు తెరపైకి తెస్తే రెండు చోట్లా పార్టీ దెబ్బ తింటుందని అధిష్టానం భావిస్తున్నట్టు సమాచారం. సమైక్య రాష్ట్రంలో ఎన్నికలకు వెళ్తే, ఈ సమస్యలనే సాకుగా చూపి, ‘మీకే ఎక్కువ న్యాయం చేస్తాం’ అని ఇరు ప్రాంతాల్లోనూ ప్రచారం చేయించి లబ్ధి పొందవచ్చన్న ఆలోచన ఉందంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాత్రం ఎన్నికలకు ముందే రెండు రాష్ట్రాలను అధికారికంగా ఏర్పాటు చేయాలంటున్నారు. ఏదో సాకు చూపి వాయిదా వేస్తే ప్రక్రియ చిక్కుల్లో పడుతుందంటున్నారు. చిన్న చిన్న సమస్యలేమైనా ఉంటే అధికారికంగా విడివడ్డాక పరిష్కారమవుతాయన్నది వారి వాదన. -
ఆఖరి పోరాటం చేయండి
శ్రీకాకుళం అర్బన్, న్యూస్‌లైన్: ఆంధ్ర రాష్ట్రం సమైక్యంగానే ఉండాలని కోరుతూ తమవంతు ప్రయత్నంగా సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఎంపీలంతా ఆఖరి పోరాటం చేయాలని ఎన్జీవో సంఘ నాయకులు, సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ప్రతినిధులు డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఎన్జీవోలు, సమైక్యవాదులు శ్రీకాకుళంలోని జెడ్పీ కార్యాలయం వద్ద శుక్రవారం నిరసన తెలిపారు. సమైక్యాంధ్రకు మద్దతు తెలపాలని సమైక్యవాదులు కోరగా ఉద్యోగులు విధులు బహిష్కరించి బయటకు వచ్చి సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. కార్యాలయం ఎదురుగా ప్రధాన రోడ్డుపై రాస్తారోకో చేశా రు. కళా బృందాల సభ్యులు సమైక్యాంధ్ర గీతాలు ఆలపించగా.. సమైక్యవాదులు, ఎన్జీవోలు నృత్యాలు చేశారు. అనంతరం జిల్లా కోర్టు వద్ద నాయ్యవాదుల సమైక్య శిబిరాన్ని ఎన్జీవోలు సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈసందర్భంగా సమైక్యాంధ్ర పరి రక్షణ వేదిక కమిటీ చైర్మన్ హనుమంతు సాయిరాం మాట్లాడుతూ కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వానికి తగిన మద్దతు లేదన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర విభజనకే మొగ్గుచూపడం బాధాకరమన్నారు. వేదిక ప్రతినిధులు జామి భీమశంకరరావు, దుప్పల వెంకట్రావు మాట్లాడుతూ విభజన జరిగితే ఇరుప్రాంత ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. కార్యక్రమంలో సమై క్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ప్రతినిధులు కిలారి నారాయణరావు, శోభారాణి, పూజారి జానకీరాం, బమ్మిడి నర్సింగరావు, ఎల్.జగన్మోహనరావు, పి.జయరాం పాల్గొన్నారు. -
బంద్ ప్రశాంతం
విభజన బిల్లుపై అభిప్రాయాన్ని కోరుతూ రాష్ట్రపతి నుంచి వచ్చిన వర్తమానాన్ని రాష్ట్రానికి కేంద్రం పంపిన తీరుకు నిరసనగా జిల్లాలో శుక్రవారం నిర్వహించిన బంద్ ప్రశాంతంగా జరిగింది. వైఎస్ఆర్ సీపీ పిలుపు మేరకు నిర్వహించిన ఈ బంద్‌లో వివిధ వర్గాల వారు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. బ్యాంకులు, విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. డిపోల నుంచి బస్సులు కదలకుండా ఎక్కడికక్కడ వైఎస్ఆర్ సీపీ నేతలు అడ్డుకున్నారు. అన్ని నియోజకవర్గాల్లో రాస్తారోకోలు, ర్యాలీలు నిర్వహించారు. బొబ్బిలి, న్యూస్‌లైన్ జిల్లా వాసులు శుక్రవారం సమైక్యగళం వినిపించారు. రాష్ర్టపతి నుంచి వర్తమానాన్ని కేంద్రం పంపిన తీరుకు నిరసనగా రాష్ర్ట బంద్ నిర్వహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఆ పార్టీ జిల్లాలో నిర్వహించిన బంద్ ప్రశాంతంగా జరిగింది. ఈ సందర్భంగా జిల్లాలో నిరసనలు మిన్నంటాయి. సాలూరు నియోజకవర్గ కేంద్రంలో తాజాగా వైఎస్ఆర్సీపీలో చేరిన సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర ఆధ్వర్యంలో జాతీయ, అంతర్రాష్ట్ర రహదారులను దిగ్బంధించారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్సు వద్ద బైఠాయించి ఉదయం నుంచి బస్సులను బయటకు వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. పెద్ద ఎత్తున సమైక్య నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తంచేశారు. అక్కడ నుంచి బోసు బొమ్మ వద్దకు చేరుకొని అక్కడ బైఠాయించారు. దీంతో ఇరువైపులా వాహనాలు భారీగా నిలచి పోయాయి. ఒడిశాకు రాకపోకలు స్తంభించాయి. పార్టీ కార్యనిర్వహక మండలి సభ్యుడు గరుడబిల్లి ప్రశాంత్, రాయల సుందరరావు, గొర్లె మధు, జర్జాపు ఈశ్వరరావు, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. పార్వతీపురం నియెజకవర్గ కేంద్రం లో సమన్వయకర్తలు కొయ్యాన శ్రీవాణి, జమ్మాన ప్రసన్నకుమార్, గర్భాపు ఉదయభాను శుక్రవారం ఉదయాన్నే ఆర్టీసీ కాంప్లెక్స్ వద్దకు చేరుకొని డిపోల నుంచి బస్సుల రాకపోకలను అడ్డుకున్నారు. కూడలిలో బైఠాయించి నిరసన తెలిపారు. వీరికి ఏపీ ఎన్జీఓ సంఘ నాయకుడు గంజి లక్ష్ముంనాయుడు తదితరులు సంఘీభావం తెలిపారు. ఎన్జీఓల ఆధ్వర్యంలో ప్రభుత్వ కార్యాలయాలను మూయించి వేశారు. కురుపాం నియోజకవర్గంలో బంద్‌ను విజయవంతంగా నడిపారు. జియ్యమ్మవలస మండలం పెదమేరంగి జంక్షనులో నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖరరాజు ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. గరుగుబిల్లి మండలంలో పార్టీ ప్రచార కమిటీ రాష్ట్ర సభ్యుడు ద్వారపురెడ్డి సత్యనారాయణ, కురుపాంలో మండలంలో ఆరిక సింహాచలం, కొమరాడలో జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ గులిపల్లి సుదర్శనరావుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. దుకాణాలు, పాఠశాలలు, బ్యాంకులు మూసివేయించారు. విజయనగరం జిల్లా కేంద్రంలో నియోజకవర్గ ఇన్‌ఛార్జి అవనాపు విజయ్ ఆధ్వర్యంలో విద్యాసంస్థలు, బ్యాంకులు మూసివేయించారు. నిరసన కార్యక్రమాల్లో మహి ళా కన్వీనరు గండికోట శాంతి, మజ్జి త్రినాథ తదితరులు పాల్గొన్నారు. ఎస్‌కోట నియెజకవర్గంలో సమన్వయకర్తలు బోకం శ్రీనివాస్, వేచలపు చినరామినాయుడు, డాక్టరు గేదెల తిరుప తి ఆధ్వర్యంలో ర్యాలీలు,మానవహారం నిర్వహించారు. రాష్ట్ర మహిళా కమిటీ సభ్యురాలు దమయంతి, కోళ్ల గంగాభవాని పాల్గొన్నారు. నెల్లిమర్ల నియోజకవర్గంలోని భోగాపురం వద్ద పార్టీ నాయకుడు కాకర్లపూడి శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో దుకాణాలను మూయించారు. వాహనాల రాకపోకలను అడ్డుకున్నా రు. గజపతినగరం నియోజకవర్గంలో సమన్వయకర్త కడుబండి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో చంపావతి నదీ దగ్గర నుంచి ఆర్టీసీ కాంప్లెక్సు వదరకూ ర్యాలీ జరిగింది. అలాగే పెద్దినాయుడు, మక్కువ శ్రీథర్ ఆధ్వర్యంలో నాలుగు రోడ్ల జంక్షను వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. చీపురుపల్లి నియోజకవర్గంలో సమన్వయకర్తలు వరహాలనాయుడు, సిమ్మినాయుడుల ఆధ్వర్యం లో ప్రభుత్వ కార్యాలయాలు, దుకాణాలు మూయించివేశారు. ర్యాలీ నిర్వహించి సమైక్య నినాదాలు చేశారు. గరివిడి మండల కేంద్రంలో వాకాడ గోపి, శ్రీనుల ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. బొబ్బిలి నియెజకవర్గంలోని తెర్లాం మం డల కేంద్రంలోపార్టీ నాయకుడు నర్సుపల్లి వేంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు జరిగాయి. దేశం పార్టీ ఆధ్వర్యంలో... రాష్ట్ర విభజనను నిరసిస్తూ చీపురుపల్లి, సాలూరు, పార్వతీపు రం నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఆందోళన కార్యక్రమా లు చేపట్టింది. సాలూరులో నియోజకవర్గ ఇన్‌ఛార్జి గుమ్మడి సంధ్యారాణి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహం నుంచి జాతీయ రహదారి వరకూ ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. చీపురుపల్లిలో నియోజకవర్గ ఇన్‌ఛార్జి త్రిమూర్తుల రాజు ఆధ్వర్యంలో, పార్వతీపురంలో నియోజకవర్గ ఇన్‌ఛార్జి చిరంజీవులు, నాయకు డు వెంకటనాయుడులు నిరసనలు తెలిపారు. ఎస్‌కోట నియోజకవర్గం జామిలో మండల పార్టీ నాయకులు నిరసన తెలి పారు. బొబ్బిలిలో ఎన్జీఓ నాయకులు చందాన మహందాతనాయుడు, సురేష్పట్నాయక్ల ఆధ్వర్యంలో బంద్ జరిగింది. -
ఎన్నికల హడావుడి...షురూ..!
సాక్షిప్రతినిధి, నల్లగొండ నాయకుల హల్చల్ అపుడే మొదలైంది. ప్రధాన రాజకీయ పార్టీల నేతలు సార్వత్రిక ఎన్నికలకు మానసికంగా సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది ప్రథమార్థంలోనే రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో వివిధ రాజకీయ సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి. అదే సమయంలో కొన్ని పార్టీల కేడర్‌లో అయోమయమూ నెల కొంది. ఏపార్టీ ఎవరితో పొత్తుపెట్టుకుం టుంది..? ఏ పార్టీ ఏ నియోజకవర్గం నుంచి బరిలో ఉండనుంది..? సిట్టింగ్ ఎమ్మెల్యేల పరి స్థితి ఏమిటి..? అన్న ప్రశ్నలు అటు రాజకీయ వర్గాల్లో, ఇటు ఆయా పార్టీల కేడర్‌లో చర్చనీయాంశాలుగా ఉన్నాయి. బిల్లు పాసయ్యాక ఏర్పాటయ్యే తెలంగాణ కొత్త రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయా, లేక సమైక్య ఆంధ్రప్రదేశ్‌లోనే ఎన్నికలుంటాయా అన్న ప్రశ్నకు స్పష్టమైన సమాధానము ఏదీ లేదు. మరో వైపు కాంగ్రెస్, టీఆర్ఎస్ల పొత్తా.., విలీనామా.. అన్న చర్చ జరుగుతోంది. ఇంకో వైపు టీడీపీ, బీజేపీల పొత్తు ప్రచారమూ తెరపైకి వచ్చింది. దీంతో పార్టీల శ్రేణుల్లో రకరకాల సందేహాలూ వ్యక్తమవుతున్నాయి. ఎన్నికలకు కేవలం మూడు నాలుగు నెలలే గడువు ఉండడంతో కొందరు నేతలు కొత్త సంవత్సరం ఆరంభం నుంచే తమ మనోభవాలను తెలియజేస్తూ ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టినట్టే కనిపిస్తోంది. ఇప్పటికే వారంలో కనీసం నాలుగైదు రోజులు తన నియోజకవర్గంలో ఏదో ఒక అధికారిక పర్యనట పెట్టుకుంటున్నారు. అభివృవద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో బిజీగా గడుపుతున్నారు. కొత్త ఏడాది రెండో రోజే కోమటిరెడ్డి తన మనసులోని మాట బయట పెట్టారు. నియోకవర్గంలో తాను చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పాటు, తెలంగాణ సాధన కోసం చేసిన త్యాగాన్ని గుర్తించాలని ఆయన కోరుకుంటున్నారు. తన పనితీరును పరిశీ లించి వచ్చే ఎన్నికల్లో కనీసం 80వేల మెజారిటీతో తనను గెలిపిస్తానని నియోజకవర్గ ప్రజలు తనకు హామీ ఇస్తేనే బరిలో ఉంటానని ప్రకటించారు. మామిళ్లగూడెంలో గురువారం జరిగిన ఓ కార్యక్రమం ద్వారా ఆయన ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టినట్టే కనిపిస్తోంది. ప్రధాన విపక్షం తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులూ ముందు ముందుగానే తన అభిమతాన్ని తేటతెల్లం చేస్తున్నారు. బీజేపీతో ఆ పార్టీ పొత్తుకు వెళుతుం దని, సిట్టింగ్ స్థానాలనూ బీజేపీ సీనియర్ నేత ల కోసం కోరే అవకాశం ఉందన్న ప్రచారంతో టీడీపీ నేతలూ అయోమయానికి గురవుతున్నారు. వరస విజయాలతో భువనగిరిని టీడీ పీ సొంతింటిలా మార్చుకుంది. మాధవరెడ్డి, ఆయన మరణం తర్వాత ఉమామాధవరెడ్డి ఇక్కడి నుంచి సుదీర్ఘ కాలంగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే, ఈసారి ఎన్నికల్లో టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుని, భువనగిరి స్థానా న్ని తమకు కేటాయించాలని కోరనుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. దీనికి తగిన ట్లే బీజేపీ నాయకులు ఈ నియోజకవర్గపై దృష్టి కేంద్రీకరించారు. దీంతో భువనగిరి ఎమ్మెల్యే ఉమామాధవరెడ్డి తన మనోబీష్టాన్ని వ్యక్తపరచాల్సి వచ్చింది. బీజేపీతో పొత్తున్నా, లేకున్నా, ఈసారి కూడా తాను భువనగిరి నుంచే పోటీ చేయనున్నానని ఆమె ప్రకటించారు. ఒకే రోజు అధికార, విపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు ఎన్నికల్లో పోటీ గురించి ప్రకటించడం, వారు రానున్న ఎన్నికలకు సన్నద్ధం అవుతున్నారన్న సంకేతాలను ఇస్తోంది. కాగా, పలువురు ఎమ్మెల్యేలు వివిధ కార్యక్రమాలతో నియోజకవర్గ ప్రజల్లో ఉండడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. అటు అధికార పార్టీ ఎంపీలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సైతం తమ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ సెగ్మెం ట్లను చుట్టవస్తున్నారు.నల్లగొండ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు తెలంగాణ సాధన కోసం చేసిన కృషికి ఫలితంగా 80వేల ఓట్ల మెజార్టీతో గెలిపిస్తానని నియోజకవర్గ ప్రజలు భరోసా ఇస్తేనే బరిలో ఉంటా... - కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, నల్లగొండ ఎమ్మెల్యే -
జగన్ పోరాటాన్ని అభినందించిన జేసీ
-
2014 ఎన్నికల్లోపు విభజన ఉండదు
-
'సమైక్య రాష్ట్రంలో ఇవే చివరి అసెంబ్లీ సమావేశాలు'
సమైక్య రాష్ట్రంలో ఇవే చివరి శాసన సభ సమావేశాలని టీఆర్ఎస్ శాసనసభా పక్ష నేత ఈటెల రాజేంద్ర పేర్కొన్నారు. శుక్రవారం ఆయన హైదరాబాద్‌లో మాట్లాడుతూ... తెలంగాణ బిల్లు వెంటనే శాసన సభలో ప్రవేశపెట్టాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేసే అధికారం పార్టీలకు లేదని స్పష్టం చేశారు.ఈ రోజు శాసన సభలో తెలంగాణ బిల్లుపై చర్చ జరగాల్పిందే నంటూ ఆయన పట్టుబట్టారు. -
'సమైక్య రాష్ట్రంలో ఇవే చివరి అసెంబ్లీ సమావేశాలు'
-
అక్టోబర్ 17, 26నే సమైక్య తీర్మానం కోసం జగన్ పిలుపు
-
సీఎం మార్పును వ్యతిరేకించిన కేఎల్ఆర్
-
శరద్ పవార్‌ను కలిసిన వైయస్ జగన్
-
శరద్ పవార్ తో భేటీ కానున్న జగన్ బృందం
-
సోనియాను తరిమికొట్టండి: హరికృష్ణ
-
సోనియాను తరిమికొట్టండి: హరికృష్ణ
దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ సమైక్యవాదమే తన వాదమని ఆయన కుమారుడు నందమూరి హరికృష్ణ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు సమైక్య రాష్ట్రాన్ని కోరుకుంటున్నారు ఆయన తెలిపారు. అంతేకాని ప్యాకేజీలు కాదని హరికృష్ణ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ విభజనపై తనదైన శైలీలో ముందుకు వెళ్తున్న కేంద్ర ప్రభుత్వం, సోనియా గాంధీలపై నందమూరి హరికృష్ణ శుక్రవారం రాష్ట్ర ప్రజలకు రాసిన బహిరంగ లేఖలో నిప్పలు చెరిగారు. రాష్ట్ర విభజన ద్వారా దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీ లక్ష్యంగా చేసుకుందని ఆయన ఆరోపించారు. సోనియాను దేశం నుంచి తరిమికొట్టాలని ఆయన రాష్ట్ర ప్రజలకు పిలుపు నిచ్చారు. రాజ్యసభకు తాను రాజీనామా చేసిన సమయంలోనే తెలుగుదేశం పార్టీకి మిగత ఎంపీలు కూడా రాజీనామా చేస్తే పరిస్థితి ఇంతదాక వచ్చేది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. విభజనపై కేంద్రం ఇప్పుడు ఇస్తున్న హామీలు 2014 ఎన్నికల తర్వాత ఎవరు బాధ్యత వహిస్తారని రాష్ట్ర ప్రజలకు నందమూరి హరికృష్ణ రాసిన లేఖలో కేంద్రాన్ని ప్రశ్నించారు. -
'సమైక్యానికి కిరణ్ ఒక్కడే చిత్తశుద్దితో కృషి చేస్తున్నారు'
ముఖ్యమంత్రితో సహా కాంగ్రెస్‌కు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా సమైక్యవాదానికే కట్టుబడి ఉన్నామని మంత్రి శైలజానాథ్ స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లా ఇంచార్జ్ మంత్రి అయిన శైలజానాథ్ ఆదివారం ఒంగోలులోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఎంపీ నిధులతో నిర్మించిన సందర్శకుల గదిని ప్రారంభించారు. అనంతరం శైలజానాథ్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఒక్కడే చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని తెలిపారు. సీఎం కిరణ్ రాష్ట్ర విభజనకు అంగీకరించారంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకుడు దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. కాంగ్రెస్ ఆధిష్టాన్ని దృష్టిలో పెట్టుకుని దిగ్విజయ్ చేసిన వ్యాఖ్యలవని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర విభజన ప్రక్రియపై కేంద్రం అనుసరిస్తున్న వైఖరి వల్ల రాజ్యాంగానికి కొత్త సమస్యలు వచ్చిపడతాయని శైలజానాథ్ ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమైక్యం కోసం ఉద్యోగులు సమ్మె చేస్తే రాజకీయాలకు అతీతంగా మద్దతు ఇస్తామని శైలజనాథ్ ఈ సందర్బంగా వెల్లడించారు. -
సమైక్య రాష్ట్రం కోసం ముందుండి పోరాడతాం: శోభానాగిరెడ్డి
సమైక్య రాష్ట్రం కోసం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుండి పోరాడుతుందని ఆ పార్టీ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి స్ఫష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే క్రమంలో తమ పార్టీ శక్తివంచన లేకుండా కృషి చేస్తుందని తెలిపారు. అందులోభాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సమైక్యం కోసం కోర్టులను ఆశ్రయించిన సంగతిని శోభానాగిరడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. హైదరాబాద్‌లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఘనంగా జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. అనంతరం శోభానాగిరెడ్డి మాట్లాడుతూ...వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తరపున తెలుగు ప్రజలకు శోభానాగిరెడ్డి ఈ సందర్బంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. స్వార్థ ప్రయోజనాల కోసం కొంత మంది రాష్ట్రాన్ని ముక్కలు చేయాడానికి ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు. అందులోభాగంగానే ప్రాంతాలు, ప్రజల మధ్య విద్వేషాలు రగులుస్తున్నారని వ్యాఖ్యానించారు. రాజకీయ ప్రయోజనాల కోసం సీఎం నాటకాలు ఆడుతున్నారని శోభానాగిరెడ్డి మండిపడ్డారు. భారీ వర్షాల కారణంగా నల్గొండ, ఖమ్మం జిల్లాలలో నిన్న వైఎస్ విజయమ్మ పర్యటన పట్ల రాష్ట్ర మంత్రులు జానారెడ్డి, ఉత్తమకుమార్ రెడ్డిలు ప్రవర్తించిన తీరు దారుణమని పేర్కొన్నారు. -
సమైక్య రాష్ట్రం కోసం ముందుండి పోరాడతాం
-
చీకట్లో ‘కృష్ణా’
సాక్షి, విజయవాడ : సమైక్యాంధ్రకు మద్దతుగా విద్యుత్ ఉద్యోగులు చేస్తున్న సమ్మె ప్రభావం మంగళవారం తారస్థాయికి చేరింది. జిల్లా వ్యాప్తంగా 8 గంటలకు పైగా విద్యుత్ కోతలను విధించారు. గ్రిడ్‌పై ఒత్తిడి పెరగడంతో రాత్రి మరో రెండు గంటలు అప్రకటిత విద్యుత్‌కోతను విధించినట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లాలోని పలు గ్రామాల్లో రోజు మొత్తం మీద కేవలం ఒకటి రెండు గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా జరగడంతో ప్రజలు నానా అవస్థలు పడ్డారు. రాష్ట్ర ప్రభుత్వంతో సమైక్యాంధ్ర జేఏసీ, విద్యుత్ జేఏసీ నేతల చర్చలు విఫలం అవ్వడంతో బుధవారం నుంచి విద్యుత్ కోతలను 12 గంటలకు పెంచాలని జేఏసీ నేతలు నిర్ణయించినట్లు తెలిసింది. ఉదయం ఏడు నుంచి రాత్రి ఏడుగంటల వరకు కోతలకు అవకాశం ఉంది. సీమాంధ్ర ప్రాంతం నుంచి విద్యుత్ ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోవడంతో దాని ప్రభావం గ్రిడ్‌పై పడుతోంది. ఒత్తిడి పెరిగితే విద్యుత్ కోతలు 12 గంటలు దాటిపోతాయని అధికారులు చెబుతున్నారు. రాత్రి వేళ విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని, తప్పని పరిస్థితుల్లో రాత్రివేళల్లోనూ కోతలు తప్పవని పేర్కొంటున్నారు. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలైన ఆదాయపన్నుశాఖ, బీఎస్ఎన్ఎల్, టెలికమ్యూనికేషన్స్, రైల్వేలు, బ్యాంకులకు విద్యుత్ సరఫరా కాకుండా చర్యలు తీసుకుని సమ్మె ప్రభావాన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలియచేయాలని జేఏసీ నేతలు ప్రయత్నిస్తున్నారు. -
ధైర్యమున్న నేత జగన్
ఆళ్లగడ, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర ఉద్యమంలో ధైర్యమున్న నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమేనని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా శోభానాగిరెడ్డి అన్నారు. పట్టణంలోని నాలుగు రోడ్ల కూడలిలో సమైక్యాంధ్ర కోసం 48 గంటల దీక్ష చేపట్టిన ఆమెకు రెండో రోజు గురువారం సంఘీభావం తెలిపేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా జగన్ జైలుల్లోనే ఉంటూ పోరాడారన్నారు. ఆమరణ దీక్ష చేస్తే ములాఖత్‌లు రద్దు చేస్తారని, తీహార్ జైలుకు పంపుతారని అనుమానం ఉన్నా భయపడలేదన్నారు. సమైక్యాంధ్ర కోసం సీమాంధ్ర ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేయడానికి ముందుకు రాని సమయంలో మొట్టమొదటి రాజీనామా చేసిన నేత జగనేన్నారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చేత రాజీనామాలు చేయించారన్నారు. నోట్ రాక ముందే అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేయాలన్న ప్రతిపాదనకు కాంగ్రెస్, టీడీపీలు ముందుకు రాకపోవడంతోనే పార్టీల నైజం బయటపడిందన్నారు. ఉత్తుత్తి ఉద్యమాలు చేస్తున్న పార్టీల నాయకులను తరిమికొట్టాలని ప్రజలను కోరారు. శోభకు సంఘీభావంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్రపాలక మండలి సభ్యుడు భూమా నాగిరెడ్డి, నాయకులు ఏవీ సుబ్బారెడ్డి, ఎస్వీ నాగిరెడ్డి దీక్షా శిబిరంలో కూర్చున్నారు. -
అధిష్టానంకు తలవంచుతూనే సమైక్యవాదం: మంత్రి ఆనం
హైదరాబాద్: రాష్ట్ర విభజన విషయంలో అధిష్టానం నిర్ణయానికి కట్టుబడుతూనే సమైక్యవాదం వినిపిస్తామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, మంత్రి రఘువీరా రెడ్డి మంత్రి ఆనంతో సమావేశమై విభజన అంశంపై చర్చించారు. అనంతరం మంత్రి ఆనం మాట్లాడుతూ శాసనసభలో తెలంగాణ బిల్లు వచ్చినప్పుడు ప్రాంతాలకు అనుగుణంగా ఎవరి అభిప్రాయాలు చెప్పాలని పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్ చెప్పినట్లు తెలిపారు. శాసనసభలో తమ అభిప్రాయాలు చెబుతామన్నారు. -
సీమలో ఉవ్వెత్తున ఎగసి పడుతోన్న సమైక్య ఉద్యమం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను నిరసిస్తూ సమైక్యాంధ్రకు మద్దతుగా రాయలసీమ ప్రాంతంలో సీమాంధ్రులు చేపట్టిన ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడుతోంది. సమైక్యాంధ్రకు మద్దతుగా శనివారం వైఎస్ఆర్ జిల్లాలోని పులివెందులలో సమైక్యవాదులు ఏర్పాటు చేసిన పొలికేక కార్యక్రమం ప్రారంభమైంది. అలాగే కడపలోని జిల్లా పరిషత్ హాల్లో ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో రాష్ట్ర విభజనతో జల వివాదాల అంశంపై నేడు సదస్సును నిర్వహించనున్నారు. ఆ సదస్సుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎం.వీ.మైసూరారెడ్డితోపాటు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. అలాగే అనంతపురంలో జిల్లాలో సమైక్యవాదులు చేపట్టిన ఆందోళనలు నేడు 60వ రోజుకు చేరాయి. నేడు ఉరవకొండలో విద్యార్థుల ఆధ్వర్యంలో విద్యార్థి గర్జన ఏర్పాటు చేశారు. జిల్లాలో జాక్టో, పంచాయతీరాజ్, మున్సిపల్ ఉద్యోగుల దీక్షలు కొనసాగుతోన్నాయి. గత రెండు నెలలుగా జిల్లాలోని దాదాపు 1000 ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమైనాయి. దాంతో రూ. 50 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ఆర్టీసీ ప్రాంతీయ అధికారి వెల్లడించారు. ఆక్టోబర్ 2వ తేదీ నుంచి ఆందోళనలు తీవ్రతరం చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత విశ్వేశ్వరరెడ్డి తెలిపారు.1000 మందితో ప్రతిరోజు దీక్షలు చేపటనున్నట్లు విశ్వేశ్వరరెడ్డి వివరించారు. చిత్తూరు జిల్లాలో సమైక్యాంధ్రకు మద్దతుగా వరదయ్యపాలెం మండలం బతలావలం వద్ద YSRCP నేత ఉజ్వాలరెడ్డి ఆధ్వర్యంలో ఉపాధి కూలీలు రాస్తారోకో నిర్వహించారు. దాంతో తిరుపతి-చెన్నై మార్గంలో రాకపోకలు స్తంభించాయి. దాంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ బారులు తీరింది. -
సమైక్యంపై.. వెనక్కి తగ్గం
సాక్షి , విజయవాడ : సమైక్యవాదంపై వెనక్కి తగ్గేది లేదని, ఉద్యమంలో వెనకడుగేయబోమని సమైక్యవాదులు స్పష్టం చేస్తున్నారు. జిల్లాలో 42వ రోజైన మంగళవారం ఆందోళనలు హోరెత్తాయి. మరోపక్క సమైక్యాంధ్ర కోసం 48 గంటల బంద్‌కు జేఏసీ పిలుపునిచ్చింది. ఇప్పటికే పలు విద్యాసంస్థలు రెండురోజులు సెలవు ప్రకటించాయి. విజయవాడలో బుధవారం ఉదయం 5.30 నుంచే పారిశుద్ధ్య సిబ్బందిని అడ్డుకోవాలని మున్సిపల్ జేఏసీ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, ఆర్థిక లావాదేవీలు జరిగే కార్యాలయాలపై దృష్టి పెట్టాలని జేఏసీ నిర్ణయించింది. అత్యవసర సేవలైన ఆస్పత్రులు మినహా విద్యాసంస్థలు, ఇంజినీరింగ్ కళాశాలలు, హోటళ్లు, వ్యాపార సంస్థలు, పెట్రోలు బంకులు, సినిమాహాళ్లు మూసివేయనున్నారు. మరోవైపు సమైక్యాంధ్ర ఉద్యమం కొత్త పుంతలు తొక్కుతోంది. వినాయకచవితి పర్వదినాన హిందువులు ఇళ్లలో పూజలు చేసుకోవాల్సి ఉండటంతో ఉద్యమ బాధ్యతలను ముస్లిములు, క్రైస్తవులు పంచుకున్నారు. నూజివీడులో ముస్లిములు నిరాహార దీక్షలు చేపట్టగా, ఉయ్యూరులో క్రైస్తవులు భారీ ప్రదర్శన నిర్వహించారు. జగ్గయ్యపేట పట్టణంలోని బస్టాండ్‌లో జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే దీక్షలకు సామినేని విశ్వనాధం, ఎమ్మెల్యే రాజగోపాల్ సంఘీభావం తెలిపారు. సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో కంభంపాడు గ్రామంలో చేస్తున్న దీక్షలు మంగళవారంతో ఏడోరోజుకు చేరాయి. పామర్రులో ఉపాధ్యాయ సంఘాలు, పసుమర్రు పంచాయతీ పాలకవర్గ సభ్యులు పామర్రు నాలుగు రోడ్ల కూడలి రిలేదీక్షల్లో పాల్గొన్నారు. నూజివీడులో వైఎస్సార్సీపీ నాయకులు చేస్తున్న రిలేదీక్షలు 15వ రోజుకు చేరాయి. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కైకలూరు పార్టీ కార్యాలయం వద్ద కొనసాగుతున్న రిలే దీక్షలు 35వ రోజుకు చేరుకున్నాయి. జగ్గయ్యపేట విజ్ఞాన్ తెలుగు, ఇంగ్లిష్ మీడియం హైస్కూల్ విద్యార్థులు మానవహారం నిర్వహించి తమ నిరసన వ్యక్తం చేశారు. పట్టణంలోని వివిధ పాఠశాలల విద్యార్థులు రాష్ట్రపతికి తమ అభిప్రాయాలను తెలియజేస్తూ రాసిన పోస్టుకార్డులను స్థానిక పోస్టాఫీస్‌లో అందజేశారు. గుడివాడలో మూడు వేల మంది విద్యార్థులు తెలుగుతల్లి గీతం, వందేమాతరం, జాతీయగీతాలాపన చేస్తూ రాష్ట్రాన్ని విడదీయొద్దంటూ నిరసన వ్యక్తం చేశారు. గ్రామీణ వైద్యులు స్థానిక నెహ్రూచౌక్ సెంటర్లో వినూత్న రీతిలో నిరసన తెలిపారు. నడిరోడ్డుపై వ్యక్తికి వైద్య చికిత్సలు చేసి తమ నిరసన తెలిపారు. గుడివాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు జలదీక్షలు చేసి నిరసన వ్యక్తం చేశారు. కంచికచర్ల జాతీయ రహదారిపై ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో వంటావార్పు చేసి సహపంక్తి భోజనాలు నిర్వహించారు. ఇబ్రహీంపట్నంలోని ఎన్టీటీపీఎస్ మెయిన్ గేట్ ఎదుట ఉద్యోగులు నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు తొమ్మిదోరోజుకు చేరాయి. మచిలీపట్నంలో న్యాయశాఖ జేఏసీ నాయకులు జిల్లా కోర్టు ఎదుట కళ్లకు గంతలు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. దాడి ఘటనపై ఫిర్యాదు.. ఈ నెల ఏడున సేవ్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తున్న న్యాయశాఖ ఉద్యోగులపై దాడిచేసిన వారిని శిక్షించాలని కోరుతూ న్యాయశాఖ జేఏసీ నాయకులు ఏఎస్పీ షెముశీబాజ్పాయ్కి ఫిర్యాదు చేశారు. మచిలీపట్నంలో 108 సిబ్బంది ర్యాలీ నిర్వహించి సమైక్యాంధ్రకు మద్దతు పలకగా బందరు, గూడూరు మండలాలకు చెందిన ఉపాధ్యాయులు దీక్షలో పాల్గొన్నారు. కలిదిండి సెంటరులో ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. పెడనలో వీవీఆర్ ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా రిలే నిరాహార దీక్షలో కొమాళ్లపూడి గ్రామానికి చెందిన పలువురు నాయకులు కూర్చున్నారు. కత్తివెన్ను ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల సరిహద్దు పల్లెపాలెం - లోసరి వారధి నుంచి కత్తివెన్ను వరకు భారీ మోటారు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కత్తివెన్ను ప్రధాన సెంటరులో 216 జాతీయ రహదారిపై ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించారు. నిడుమోలు సెంటర్లో రాస్తారోకో నిర్వహించి వంటా వార్పు చేశారు. -
సమైక్య రాష్ట్రామే లక్ష్యం: శైలజానాథ్
సమైక్య రాష్ట్రమే తమ లక్ష్యమని రాష్ట్ర మంత్రి ఎస్.శైలజానాథ్ మంగళవారం హైదరాబాద్‌లో స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్య ఉంచేందుకు అన్ని అవకాశాలను వినియోగించుకుంటామన్నారు. హైదరాబాద్ నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చే అంశాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. సమైక్యాంధ్ర రాష్ట్రం కోరుతూ నేడు అసెంబ్లీ అవరణలోని జాతిపిత మహాత్మ గాంధీ విగ్రహం వద్ద సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులంతా దీక్ష చేపట్టనున్నారు. కాగా ఆ దీక్షకు ఆ ప్రాంత ప్రజాప్రతినిధులంతా తరలివస్తారని ఎస్.శైలజానాథ్ తెలిపారు. -
సమైక్యం డిమాండ్‌తో సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల సమ్మె షురూ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే ప్రధాన డిమాండ్‌తో సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు సోమవారం అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెకు దిగారు. ఉద్యోగుల హక్కులు, ప్రయోజనాల పరిరక్షణ, హైదరాబాద్‌లో వారి రక్షణకు ప్రభుత్వం స్పష్టమైన భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగబద్ధంగా ఎంపికైన ఉద్యోగులకు హక్కుల సాధన కోసం సమ్మె చేసే హక్కును అదే రాజ్యాంగం ప్రసాదించిందని, తాము నిర్దేశించుకున్న లక్ష్యం చేరేవరకూ సమ్మె విరమించబోమని సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం అధ్యక్షుడు యు.మురళీకృష్ణ స్పష్టం చేశారు. అటెండర్ నుంచి అదనపు కార్యదర్శివరకూ సీమాంధ్ర ఉద్యోగులందరూ సమ్మెలో పాల్గొంటారని తెలిపారు. తెలంగాణ ఉద్యోగులకు తాము వ్యతిరేకం కాదన్నారు. రాష్ట్ర విభజన వల్ల ప్రధానంగా నష్టపోయేది ఉద్యోగులేనని, అలాంటిది తమను సంప్రదించకుండా తెలంగాణ ఏర్పాటు ప్రకటన చేసిన యూపీఏ ప్రభుత్వం తీరు గర్హనీయమని చెప్పారు. వెంటనే ప్రకటనను వెనక్కి తీసుకోవాలన్నదే తమ ప్రధాన డిమాండ్‌గా తెలిపారు. ‘జీతం కంటే జీవితం ముఖ్య’మనే నినాదంతో నిరవధిక సమ్మెకు నడుం బిగించామని, ప్రభుత్వం జీతాలు చెల్లించకున్నా, ఎస్మా చట్టాలు ప్రయోగించినా వెనకడుగు వేయబోమని ఫోరం కార్యదర్శి కేవీ కృష్ణయ్య చెప్పారు. 33 రోజులుగా శాంతియుతంగా నిరసనలు చేసినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో సమ్మెబాట పట్టామన్నారు. భవిష్యత్తు తరాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సీమాంధ్ర ఉద్యోగులంతా సమ్మెలో పాల్గొనాలని కోరారు. అవాస్తవ పునాదుల మీద తెలంగాణ ఉద్యమాన్ని నడుపుతున్న తెలంగాణ ఉద్యోగులు వాస్తవాలను చెప్పాలనుకుంటున్న తమ నోరు నొక్కేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ఉద్యోగుల వాదనలో వాస్తవాలుంటే తమ నిరసనలు చూసి ఎందుకు భయపడుతున్నారో చెప్పాలన్నారు. మార్మోగిన సచివాలయం సమైక్య, తెలంగాణ వాదుల నిరసనలు, నినాదాలతో సచివాలయం సోమవారం మార్మోగింది. సీమాంధ్ర సచివాలయ ఉద్యోగులు భారీ ఎత్తున ర్యాలీ చేశారు. అదే సమయంలో తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని తెలంగాణ ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు. ఇరువర్గాలూ పోటాపోటీ నినాదాలు చేశారు. హైదరాబాద్ అందరిదనీ, నగరంపై తెలుగు వారందరికీ హక్కు ఉందని సీమాంధ్ర ఉద్యోగులు నినదించారు. సచివాలయంలోని ఎల్ బ్లాక్ ఎదుట సీమాంధ్ర ఉద్యోగులు చేరి సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. తెలంగాణ ఉద్యోగులు కూడా అక్కడికి చేరుకుని ప్రతి నినాదాలు చేశారు. ఉద్యోగుల మధ్య ఘర్షణ తలెత్తకుండా పోలీసులు మధ్యలో నిల్చుని ఇరువర్గాలను నిలువరించారు. -
సమైక్యాంధ్రకు మద్దతుగా రేపు సీమాంధ్ర ఎమ్మెల్యేల ధర్నా
సమైక్యాంధ్రకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీకి చెందిన సీమాంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాష్ట్ర అసెంబ్లీ ప్రాంగణంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. రాష్ట్ర విభజనపై తమ నిరసన, ఆందోళన కార్యక్రమాన్ని మంగళవారం ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు నిర్వహించనున్నట్టు ప్రాథమిక విద్యాశాఖ మంత్రి ఎస్ శైలజానాథ్, ఇతర సీమాంధ్ర నేతలు వెల్లడించారు. ఆంధ్ర ప్రదేశ్ ను విభజించకుండా యధావిధిగా ఉంచాలంటూ సీమాంధ్ర ప్రాంత నాయకులతోపాటు, ప్రజలు కూడా నిరసన, ఆందోళన కార్యక్రమాల్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. సీమాంధ్రలో ఉవ్వెత్తున లేచిన ఉద్యమ పరిస్థితులపై అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ)కి వెల్లడించారు. -
హైదరాబాద్.. హమారా! ఎలుగెత్తి చాటిన ముస్లింలు
కల్లూరు రూరల్ / కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ అందరిదని, దానిని ఒక ప్రాంతానికే పరిమితం చేయడం తగదని ముస్లింలు నినదించారు. సమైక్యాంధ్రప్రదేశ్ కోసం శుక్రవారం కర్నూలు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం నమాజు తర్వాత కమిటీ అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శులు మౌలానా అబ్దుల్‌మాజిద్, సయ్యద్ అల్తాఫ్ హుసేన్, కన్వీనర్ అయూబ్ఖాన్ల ఆధ్వర్యంలో ఉస్మానియా కళాశాల మైదానం నుంచి ర్యాలీ ప్రారంభమైంది. వన్‌టౌన్, పూలబజార్, పెద్దమార్కెట్, పాతబస్టాండు, కోట్లసర్కిల్ మీదుగా రాజ్‌విహార్ సెంటర్‌కు చేరుకుంది. అక్కడ ప్రదర్శన నిర్వహించిన అనంతరం కలెక్టరేట్‌కు చేరుకుంది. ఎన్టీఆర్ విగ్రహం ఎదుట ఏర్పాటు చేసిన బహిరంగ వేదికపై పార్టీలకు అతీతంగా పలువురు ముస్లిం నాయకులు ప్రసంగించారు. రాయలసీమ ప్రాంతం వెనకబాటులో ఉందంటూ 2009లో శ్రీకృష్ణ కమిటీ స్పష్టంగా నివేదించిందని, సీమకు న్యాయం చేయడం వదిలేసి తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా చేస్తారా అంటూ జేఏసీ అధ్యక్షుడు మౌలానా అబ్దుల్‌మాజిద్ ప్రశ్నించారు. హైదరాబాదు ముస్లింలు నిర్మించిన నగరమని, అక్కడి చార్మినార్, గోల్కొండ వంటి చారిత్రక కట్టడాలను వదులుకోడానికి ఎవరూ సిద్ధంగా లేరని ప్రధాన కార్యదర్శి సయ్యద్ అల్తాఫ్ హుసేన్ పేర్కొన్నారు. హైదరాబాదు మీది, మాది, మనందరిదని వ్యాఖ్యానించారు. లావుబాలీ దర్గా సజ్జాదే నషీన్ సయ్యద్ ఆరిఫ్‌పాషా ఖాద్రి మాట్లాడుతూ ముస్లిం జనాభా విషయంలో రాష్ట్రంలో హైదరాబాదు తర్వాత కర్నూలుకు ప్రాధాన్యముందని, విభజన సమంజసం కాదని సూచించారు. విభజన నిర్ణయం ఉపసంహరించుకునే వరకు పోరాటం: హఫీజ్‌ఖాన్ విభజన నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు పోరాటం కొనసాగిస్తామని వైఎస్ఆర్సీపీ మైనారిటీ సెల్ జిల్లా కన్వీనరు హఫీజ్ ఖాన్ అన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా వేలాదిగా ముస్లిం ప్రజలు తరలివచ్చి చరిత్ర సృష్టించారని కొనియాడారు. ఇందులో ఏ వ్యక్తి ఒక పార్టీ ప్రయోజనాల కోసం రాలేదని, అన్నిపార్టీల ముస్లింలు సమైక్యాంధ్ర కోసం ఒకే వేదికపైకి వచ్చారన్నారు. కర్నూలు రాజధానిగా కొనసాగి ఉంటే హైదరాబాదుపై కేసీఆర్ కన్ను పడేదా అని ప్రశ్నించారు. ఉన్నత విద్య, మెరుగైన వైద్యం, ఉపాధి అవకాశాల కోసం హైదరాబాదుపై ఆధారపడ్డామని, దానిని కోల్పోయేందుకు ముస్లింలు సిద్ధంగా లేరని పేర్కొన్నారు. టీడీపీ నాయకుడు బి.ఎ.కే.పర్వేజ్ మాట్లాడుతూ.. కర్నూలు ప్రజలు ఒకసారి రాజధానిని త్యాగం చేశారని, మరోసారి త్యాగం చేసేందుకు సిద్ధంగా లేరని పేర్కొన్నారు. తెలంగాణా ఎవరి సొత్తు కాదని, 700 ఏళ్ల క్రితం ‘మగ్బూలి తెలంగాణా’ అనే నవాబు పాలించడంతో దానికి ఆ పేరు వచ్చిందని మజ్లిస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గౌస్ మొహియుద్దీన్ పేర్కొన్నారు. ఎస్డీపీఐ నేత అబ్దుల్‌వారిస్ మాట్లాడుతూ.. ఏకపక్షంగా విభజించేందుకు రాష్ట్రం సోనియా సొత్తు కాదని, రాష్ట్రంలో 60 శాతం ఆదాయాన్ని సమకూర్చే హైదరాబాదును తెలంగాణకు ఇస్తే ఒప్పుకొనే ప్రసక్తే లేదన్నారు. ఒకే భాష మాట్లాడే ప్రజలను విభజించడం దారుణమని, తమ శక్తియుక్తులను సమైక్యాంద్ర కోసమే ధారపోస్తామని నోబుల్ సర్వీసెస్ సొసైటీ నాయకుడు అబ్దుల్జ్రాక్ పేర్కొన్నారు. మానవుని మనుగడకు నీరు, జీవనోపాధి చాలా అవసరమని, రాష్ట్ర విభజన జరిగితే ఇక్కడి ప్రజలు ఈ రెంటికీ ఇబ్బంది పడాల్సి వస్తుందని రిటైర్డు విజిలెన్స్ అధికారి మహ్మద్ ఇలియాస్‌సేఠ్ ఆందోళన వ్యక్తం చేశారు. కలెక్టరేట్ వద్ద జరిగిన సభకు మౌలానా జాకిర్‌అహ్మద్ రషాదీ అధ్యక్షత వహించారు. అబ్దుల్‌గనీ ఉమ్రి, మౌలానా జుబేర్ అహ్మద్‌ఖాన్, మౌలానా అబ్దుల్ జబ్బార్, డాక్టర్ కె.ఎం.ఇస్మాయిల్ హుసేన్, మౌలానా సులేమాన్ నద్వి, హాఫిజ్ అబ్దుల్లా, న్యాయవాది చాంద్‌బాష, డాక్టర్ మన్సూర్ అహ్మద్, తదితరులు పాల్గొని ప్రసంగించారు. -
లక్ష్యం చేరేవరకూ.. ఆగదు సమరం
సాక్షి, రాజమండ్రి : ‘రాష్ట్రం సమైక్యంగా ఉండాలి. విడిపోయిన అన్నదమ్ముల్లా కాదు.. కలిసి ఉమ్మడి కుటుంబంలా ఉండాలి’- సమైక్య ఉద్యమంలో అందరిదీ ఇదే మాట. సమైక్య రాష్ట్ర పరిరక్షణే లక్ష్యంగా సాగుతున్న ఉద్యమం విభజన నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే దాకా ప్రజ్వరిల్లే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యమం 24వ రోజైన శుక్రవారం కూడా అదే స్థాయిలో కొనసాగింది. జిల్లావ్యాప్తంగా పౌరసరఫరాల శాఖ మండల గోదాముల్లో పనిచేసే హమాలీలు శుక్రవారం నుంచి ఈ నెల 26 వరకూ విధులు బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే ఈ శాఖ ఉద్యోగులు అందరూ సమ్మెలో పాల్గొంటున్నారు. సమైక్యాంధ్రకు మద్దతు తెలపక పోవడంతో 16 మంది ఉపాధ్యాయులు యూటీఎఫ్‌కు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఉప్పలగుప్తం మండలం కూనవరం గ్రామంలో లంకా సత్తిబాబు(27) అనే ఆటో డ్రైవర్ శుక్రవారం ఉదయం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సత్తిబాబు రాష్ట్రం విడిపోతుందని మానసిక వ్యధకు గురై ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని స్నేహితులు తెలిపారు. రాజమండ్రిలో.. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ రాజమండ్రిలో న్యాయవాదులు పుష్కరాల రేవు వద్ద రోడ్లు తుడిచారు. ఆ సమయంలో అక్కడకు వచ్చిన ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన వాహనాన్ని అడ్డగించారు. సమీపంలోని ఉద్యోగ జేఏసీ నిరాహార దీక్షలకు మద్దతు పలికేందు ఆ శిబిరం వద్దకు వెళ్లిన ఎమ్మెల్యేకు అక్కడ కూడా చేదు అనుభవం ఎదురైంది. రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కొత్తగా పెట్టబోయే పార్టీ విధి విధానాలు తెలపాలని సమైక్య వాదులు డిమాండ్ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కోటగుమ్మం సెంటర్లో నిరవధిక రిలేనిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. పార్టీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు శిబిరానికి వచ్చి సంఘీభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగువారిని ముక్కలు చేసేందుకు కుట్రలు పన్నుతున్న సోనియాగాంధీకి ప్రజలు గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని హెచ్చరించారు. బార్ అసోసియేషన్, జేఏసీ ఫెడరేషన్, మున్సిపల్ ఉద్యోగులు, రెవెన్యూ ఉద్యోగులు, వాపారస్తుల జేఏసీలు రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. ది రాజమండ్రి టైల్స్, శానిటరీ మార్బుల్స్ అండ్ గ్రానైట్స్ అసోసియేషన్ సభ్యులు నగరంలో ర్యాలీ చేసి కోటగుమ్మం చేరుకుని వర్తక సంఘం జేఏసీ చేపట్టిన దీక్షల్లో పాల్గొన్నారు. ఆంధ్రకేసరి యువజన సంక్షేమ సంఘం, గ్రంధి రామచంద్రరావు ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో పాల్‌చౌక్ వద్ద నిరాహార దీక్ష చేపట్టారు. రాజమహేంద్రి మహిళా డిగ్రీ కశాశాల ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ చేశారు. రాజమండ్రి రూరల్ పరిధిలో కడియంలో వైఎస్సార్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రిలే దీక్షలు మూడవ రోజుకు చే రాయి. రూరల్ కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు పాల్గొన్నారు. బొమ్మూరులో వైఎస్సార్ కాంగ్రెస్ దీక్షా శిబిరం వద్ద వీర్రాజు ఆధ్వర్యంలో చెవిలో పువ్వులు పెట్టుకుని పార్టీ నేతలు నిరసన తెలిపారు. బొమ్మూరులో పార్టీ నాయకుడు నక్కా రాజబాబు, వేమగిరిలో రావిపాటి రామచంద్రరావు ఆధ్వర్యంలో కొనసాగుతున్న దీక్షా శిబిరాలను ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు సందర్శించి సంఘీభావం తెలిపారు. సమైక్యాంధ్రకు మద్దతుగా కాతేరులో ఉపాధ్యాయులు ర్యాలీ చేపట్టారు. ఏపీ ట్రాన్స్‌కో జేఏసీ ఆధ్వర్యంలో మోరంపూడి సెంటర్లో మానవహారంగా ఏర్పడి సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. కాకినాడలో... న్యాయశాఖ ఉద్యోగులు కోర్టు వద్ద వినూత్నంగా గంజి వార్పు కార్యక్రమం చేపట్టి గంజి తాగారు. రాష్ట్ర విభజన చేపడితే తమకు గంజే గతి అంటూ నిరసన తెలిపారు. వి.ఎస్. లక్ష్మి కళాశాల, బీఈడీ కళాశాలల విద్యార్థులు నగరంలో ర్యాలీ చేసి భాసుగుడి వద్ద మానవహారంగా ఏర్పడి సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. ప్రభుత్వ వైద్యులు, నర్సింగ్ విద్యార్థులు ప్రభుత్వాస్పత్రి సిబ్బంది నోటికి నల్ల గుడ్డలు కట్టుకుని నిరసన ర్యాలీ చేశారు. నర్సింగ్ విద్యార్థి అనూరాధ తెలుగుతల్లి వేషధారిణిగా ర్యాలీలో పాల్గొని అందరినీ ఆకట్టుకుంది. పీఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు జెడ్పీ సెంటర్లో ర్యాలీ చేసి అనంతరం రాస్తారోకో చేపట్టారు. జర్నలిస్టుల జేఏసీ ఆధ్వర్యంలో సమైక్య వాదులు చీపుర్లు చేత పట్టుకుని రోడ్లు తుడిచారు. జేఎన్టీయూకే వద్ద విద్యార్థులు, కలెక్టరేట్ వద్ద వివిధ శాఖల ఉద్యోగులు, ఉపాధ్యాయ జేఏసీ, వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం వద్ద ఆ శాఖ సిబ్బంది, డ్రైవర్స్ అసోసియేషన్ కార్యాలయం వద్ద ప్రభుత్వ డ్రైవర్లు, న్యాయవాదులు, న్యాయశాఖ ఉద్యోగులు కోర్టుల వద్ద, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల సంఘం జగన్నాథపురంలో రిలే దీక్షలు కొనసాగిస్తున్నారు. కాకినాడ రూరల్ పరిధిలోని సర్పవరంలో పాఠశాల విద్యార్థులు రోడ్డుపై మానవహారంగా ఏర్పడ్డారు. రమణయ్యపేటలో వాణిజ్యపన్నుల శాఖ కార్యాలయం వద్ద ఉద్యోగులు ఆందోళన చేశారు. మాధవపట్నం చైతన్య కళాశాల వద్ద విద్యార్థులు, ఉపాధ్యాయులు రిలే దీక్షలు కొనసాగించారు. కోనసీమలో.. కోనసీమ ట్రాన్స్‌పోర్టు ఆపరేటర్ల జేఏసీ ఆధ్వర్యంలో అమలాపురంలో ఆటోలు, మినీ వ్యాన్లు, లారీలు, ట్యాక్సీలు, ఆర్టీసీ అద్దెబస్సులు, ఇతర వాహనాలతో భారీ ర్యాలీ జరిగింది. సుమారు ఐదు కిలోమీటర్ల మేర వాహనాలతో సాగిన ర్యాలీ పట్టణాన్ని వాహనాలతో నింపేసింది. అమలాపురం పట్టణ శెట్టిబలిజ యువత అధ్యక్షుడు వాసంశెట్టి సుభాష్ ఆధ్వర్యంలో సమైక్య వాదులు పట్టణంలో మోటారు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం బాలుర ఉన్నత పాఠశాల సెంటర్లో వంటావార్పూ చేపట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి, నియోజక వర్గ కో ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు సంఘీభావం వ్యక్తం చేశారు. అమలాపురం గడియార స్తంభం సెంటర్ వద్ద జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే దీక్షల్లో వ్యవసాయ కూలీలు పాల్గొన్నారు. మాజీ మంత్రులు మెట్ల సత్యనారాయణ, గొల్లపల్లి సూర్యారావు సంఘీభావం తెలిపారు. కోనసీమకు చెందిన మత్స్యకారులు వందల సంఖ్యలో అమలాపురం తరలి వచ్చి గడియార స్తంభం సెంటర్లో మానవహారంగా ఏర్పడి సోనియాగాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. అల్లవరం మండలం ఓడలరేవులో వర్తక సంఘం వంటా వార్పూ చేపట్టింది. ఉప్పలగుప్తం మండలం ఎన్.కొత్తపల్లి గ్రామం నుంచి అమలాపురం వరకూ యువకులు మోటారు సైకిల్ ర్యాలీ చేశారు. ఎన్.కొత్తపల్లి గ్రామంలో పంచాయతీల పాలకవర్గం, గొల్లవిల్లిలో రేషన్ డీలర్లు ర్యాలీలు చేశారు. దీక్షలు భగ్నం వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ గుంటూరులో చేపట్టిన ఆమరణ దీక్షకు మద్దతుగా గత ఐదురోజులుగా ఆ పార్టీ నేతలు పెయ్యల చిట్టిబాబు, మిండి గోవిందరావు, పోలిశెట్టి నాగేశ్వరరావు ముమ్మిడివరంలో చేస్తున్న దీక్షలను శుక్రవారం పోలీసులు భగ్నం చేసి వారిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారు చికిత్సకు నిరాకరించి ఆస్పత్రిలో దీక్ష కొనసాగిస్తున్నారు. దీక్ష భగ్నానికి నిరసనగా ముమ్మిడివరంలో విద్యార్థులు, జేఏసీ నేతలు, మహిళలు జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. దీంతో మండలంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కొత్తపేటలో ప్రైవేట్ పాఠశాలలు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు ర్యాలీ చేసి పాతబస్టాండ్ సెంటర్లో మానవహారంగా ఏర్పడ్డారు. న్యాయశాఖ ఉద్యోగులు నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని పాత బస్టాండ్ వరకూ ర్యాలీ చేశారు. చేపలు, మాంస విక్రయదారులు దుకాణాలు బంద్ చేసి పాత బస్టాండ్ సెంటర్ వరకూ ర్యాలీ చేశారు. రావులపాలెంలో జేఏసీ సభ్యులు, సమైక్యాంధ్ర వాదులు, విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. విజయమ్మ దీక్షకు మద్దతుగా మామిడికుదురు మండలం పెదపట్నంలంకలో వైఎస్సార్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే దీక్షల్లో వికలాంగులు పాల్గొన్నారు. వారికి రాష్ట్ర రైతు విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులు జక్కంపూడి తాతాజీ సంఘీభావం తెలిపారు. పెదపట్నంలంకలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలతో పాటు ఆరు ప్రాధమిక పాఠశాలలను స్థానికులు నిరవధికంగా మూసి వేయించారు. సమైక్యాంధ్రకు అనుకూలంగా ప్రకటన వెలువడే వరకూ పాఠశాలలు తెరవరాదని అల్టిమేటం జారీ చేశారు. అంబాజీపేటలో వ్యాపారులు, రైతులు అరటిగెలలను సైకిళ్లకు కట్టుకుని నిరసన ప్రదర్శన చేశారు. సఖినేటిపల్లి మండలం కేశవదాసుపాలెంలో ఓఎన్జీసీ గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ వద్ద సమైక్యవాదులు రాస్తారోకో చేసి వంటా వార్పు నిర్వహించారు. మలికిపురం, సఖినేటిపల్లి మండలాల పంచాయతీ వీఆర్వోలు గుడిమిలంక వంతెన వద్ద రాస్తారోకో చేశారు. పిఠాపురంలో బంద్ జేఏసీ ఆధ్వర్యంలో పిఠాపురంలో రహదారుల దిగ్బంధం చేపట్టారు. పట్టణంలోకి వచ్చే రహదారులు మూసివేసి సైకిళ్లు కూడా తిరగనివ్వలేదు. శుక్రవారం పిలుపునిచ్చిన బంద్ సంపూర్ణంగా సాగింది. భవన నిర్మాణ కార్మిక సంఘం, మున్సిపల్ ఉద్యోగులు, న్యాయవాదులు, జేఏసీ సభ్యులు వేర్వేరుగా ర్యాలీలు చేశారు. వారికి వైఎస్సార్ కాంగ్రెస్ కో ఆర్డినేటర్ పెండెం దొరబాబు సంఘీభావం తెలిపారు. తునిలో జేఏసీ, ఎన్జీఓలు, వెఎస్సార్ కాంగ్రెస్ వేర్వేరుగా చేపడుతున్న రిలే దీక్షలకు పార్టీ నియోజక వర్గ కో ఆర్డినేటర్ దాడిశెట్టి రాజా, మాజీ మున్సిపల్ చైర్మన్ కె. శోభారాణి సంఘీభావం తెలిపారు. మెట్టలో మారుమోగిన సమైక్య నాదం విజయమ్మ దీక్షకు మద్దతుగా వైఎస్సార్ కాంగ్రెస్ కో ఆర్డినేటర్ వరుపుల సుబ్బారావు ఏలేశ్వరం బాలాజీ సెంటర్లో అర్ధనగ్న ప్రదర్శన చేస్తూ రాస్తారోకో చేశారు. విద్యార్థులు భారీ ర్యాలీ చేసి బాలాజీ చెరువు సెంటర్లో మానవహారం గా ఏర్పడారు. జగ్గంపేటలో విద్యార్థులు ర్యాలీ చేసి మానవహారంగా ఏర్పడి సమైక్య నినాదాలు చేశారు. వైద్య సిబ్బంది పీహెచ్సీ ఆవరణలో వంటా వార్పూ చేసి సహపంక్తి భోజనాలు చేశారు. మండల జేఏసీ ఆధ్వర్యంలో రాజానగరంలో సమైక్యవాదులు మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ఒంటికాలిపై నిలబడి నిరసన తెలిపారు. మండపేటలో జేఏసీ ఆధ్వర్యంలో సమైక్యవాదులు మోకాళ్లపై నిలబడి కలువపువ్వు సెంటర్లో రాస్తారోకో చేపట్టారు. రామచంద్రపురంలో బీసీ సంక్షేమ సంఘం ఉద్యోగులు మోటారుసైకిల్ ర్యాలీ చేశారు. ప్రైవేట్ పాఠశాలలు బస్సులతో ప్రదర్శన చేశాయి. ఏజెన్సీ ప్రాంతంలో కూడా సమైక్య నాదం బలంగా వినిపిస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ యువజన విభాగం జిల్లా కన్వీనర్ అనంత ఉదయ భాస్కర్ ఆధ్వర్యంలో అడ్డతీగలలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. రంపచోడవరంలో సమైక్య ర్యాలీ చేశారు. అంబేద్కర్ సెంటర్లో గెజిటెడ్ అధికారులు దీక్షలు చేపట్టారు. -
సమైక్యవాదానికే కట్టుబడి ఉన్నాం: సీపీఎం రాఘవులు
తమ పార్టీ సమైక్యవాదానికే కట్టుబడి ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి.రాఘవులు స్పష్టం చేశారు. గురువారం ఆయన అనంతపురంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. రాహుల్‌గాంధీని ప్రధానమంత్రిని చేయడానికే రాష్ట విభజనకు కాంగ్రెస్ పార్టీ మొగ్గు చూపుతోందని ఆయన ఆరోపించారు. రాష్ట్ర విభజన సొంతింటి వ్యవహారంగా కాంగ్రెస్ భావిస్తుందని రాఘవులు పేర్కొన్నారు. రాష్ట విభజన వల్ల తాగు,సాగు నీటి సమస్యలు అధికమవుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. రాజ్యసభ సభ్యుడు వీహెచ్‌కు దురుసుతనం ఎక్కువ... అయిన ఆయనపై సమైక్యవాదులు తిరుపతిలో దాడి చేయడం సరికాదని రాఘవులు వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఆత్మగౌరవ యాత్రపై మాత్రం ఈ సందర్భంగా రాఘవులు మండిపడ్డారు. చంద్రబాబు రాష్ట్ర విభజనను సమర్థిస్తున్నారా లేదా అనే విషయాన్ని స్ఫష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ విషయంలో స్పష్టమైన ప్రకటన చేసిన తర్వాతే ఆత్మగౌరవ యాత్ర చేపట్టాలని చంద్రబాబుకు రాఘవులు సూచించారు. -
అధిష్టానాన్ని ఎదిరించైనా సమైక్యాంధ్ర సాధిస్తాం: ధర్మాన
కాంగ్రెస్ అధిష్టానాన్ని ఎదిరించైనా సమైక్యాంధ్రను సాధించుకుంటామని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆదివారం శ్రీకాకుళంలో స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించామని ఆయన పేర్కొన్నారు. అలాగే అదే జిల్లాకు చెందిన మంత్రి కొండ్రు మురళి ఆదివారం శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ప్రసంగిస్తూ...హైదరాబాద్ అభివృద్ధిలో తెలుగువారందరూ భాగస్వాములే అని స్ఫష్టం చేశారు. రాష్ట విభజనపై తెలుగుదేశం, భారతీయ జనతాపార్టీలు స్ఫష్టమైన లేఖలు ఇచ్చాయని ఆయన తెలిపారు. ఆ నేపథ్యంలో రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ ప్రకటన చేయావలసి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. విభజనకు అనుకూలంగా లేఖలు ఇచ్చిన ఆ రెండు పార్టీలు తమ లేఖలను ఉపసంహరించుకుంటే విభజన ప్రక్రియను తాము అడ్డుకుంటామని కొండ్రు మురళి ఈ సందర్బంగా వెల్లడించారు. -
ఉద్యమానికి తోడుంటాం
అనంతపురం అర్బన్, న్యూస్‌లైన్ : ‘‘సమైక్యాంధ్రప్రదేశ్‌కు అనుకూలంగా స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు సమైక్యవాదులు వెనుకడుగు వేయకూడదు. మీ ఉద్యమానికి మేము తోడుంటాం’’ అని వైఎస్సార్సీపీ అనంతపురం ఎమ్మెల్యే బి.గురునాథరెడ్డి పేర్కొన్నారు. వైద్య, ఆరోగ్య జేఏసీ ఆధ్వర్యంలో ప్రభుత్వ సర్వజనాస్పత్రి ముందు చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు శుక్రవారం ఆయన మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ రాజకీయ స్వప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్‌ను విభజిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. విభజన చేస్తే దేవుడు కూడా క్షమించడన్నారు. సీమాంధ్ర కాంగ్రెస్ పాలకులు నిస్సహాయ స్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. కొందరు రాజీనామాలు చేస్తే.. మరికొందరు ఇంకా ఎవరైనా చేస్తారా అని ఎదురు చూస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఉద్యమం తీవ్ర స్థాయిలో జరుగుతోందన్నారు. ప్రధానంగా ‘అనంత’లో ఉద్యమం ఆజ్యం పోసుకుందన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారన్నారు. తెలంగాణ ప్రాంతం వారు పోరాడినప్పుడు సీమాంధ్ర పాలకులు నిద్రపోతున్నారా అని ప్రశ్నించారు. జిల్లా మంత్రులు సైతం సమైక్యతపై ఏమాత్రం పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సమైక్యవాదులు తననెక్కడ నిలదీస్తారోనని మంత్రి రఘువీరారెడ్డి రహస్యంగా స్వాతంత్య్ర వేడుకలు ముగించుకుని వెళ్లారన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలోకి వైద్య విభాగం ఉద్యోగులు రావడం హర్షించదగ్గ విషయమన్నారు. అత్యవసర సేవలు మినహా మిగతా అన్ని సేవలను బహిష్కరించి నిరసన వ్యక్తం చేయడాన్ని ఎమ్మెల్యే ప్రశంసించారు. రోగులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని సూచించారు. ఉద్యమం అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలవాలన్నారు. ఉద్యమం సమైక్య ప్రకటనతోనే ముగిసిపోవాలన్నారు. అగ్ని గుండంలా మార్చారు రాజకీయ స్వప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని అగ్ని గుండంగా మార్చారని వైద్య, ఆరోగ్య జేఏసీ చైర్మన్ డాక్టర్ వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలను పట్టించుకోకున్నా పర్వాలేదని, కుటుంబంలో చిచ్చు పెట్టి హాస్యం చూడడం తగదన్నారు. ప్రజల్లో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకోకముందే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతామన్న ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో ఉద్యమ సెగలకు పాలకులు మాడిమసై పోతారన్నారు. రేడియాలజీ విభాగాధిపతి డాక్టర్ రాధారాణి మాట్లాడుతూ సమైక్య రాష్ట్రాన్ని ప్రకటించే వరకు ఉద్యమం ఆగదన్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రం అతలాకుతలంగా మారిందన్నారు. అంతకు ముందు ఓపీ బ్లాక్ ముందు గంటసేపు వైద్యులు నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ శ్రీధర్, నాయకులు డాక్టర్ జగన్మోహన్రెడ్డి, డాక్టర్ వీరభద్రయ్య, డాక్టర్ కన్నేగంటి భాస్కర్, డాక్టర్ ఎండ్లూరి ప్రభాకర్, డాక్టర్ హరిప్రసాద్, డాక్టర్ ప్రవీణ్ దీన్ కుమార్, డాక్టర్ భీమసేనాచార్, ఆర్ఎంఓ వైవీ రావు, డాక్టర్ శ్రీనివాస్ శౌరి, డాక్టర్ శారద, నర్సింగ్ సూపరింటెండెంట్ రాజేశ్వరి, నర్సింగ్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శి ఎస్తేర్, మంజుల, అతావుల్లా, బాబా, మారుతి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
సమైక్యం తప్ప ప్రత్యామ్నాయం లేదు: భూమన
సమైక్య రాష్ట్రం తప్ప మరో ప్రత్యామ్నాయం లేనే లేదన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, తిరుపతి ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ నేత భూమన కరుణాకరరెడ్డి. తిరుపతి సత్యనారాయణపురం సర్కిల్లో చేపట్టిన మహాధర్నాలో ఆయన మాట్లాడారు. ఎగసి పడుతున్న సమైక్య సెగలను చూశాకయినా విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ తన నిర్ణయాన్ని పునరాలోచించాలని డిమాండ్ చేశారు. మహాధర్నాకు మహిళలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. కేంద్రం తీరుకు వ్యతిరేకంగా ఆందోళనకారులు చేసిన నినాదాలతో ఆ ప్రాంతం హోరెత్తింది. కేంద్రం, కాంగ్రెస్ పార్టీ వెంటనే తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకొని రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో ఉన్న ప్రాభవాన్ని తగ్గించేందుకే దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డిపై కాంగ్రె స్, టీడీపీ నాయకులు నిందలు వేస్తున్నారని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి శనివారం దుయ్యబట్టారు. వేలాది మంది పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ కోరుతూ 2001 ముందే కేంద్రానికి వైఎస్ లేఖ రాసినట్లు అసత్యాలు పలుకుతున్నారని చెప్పారు. ప్రజల్లో వైఎస్‌కున్న అభిమానాన్ని తగ్గించాలనే దురుద్దేశంతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఈ కుట్ర పన్నారని ఆరోపించారు. -
పది రోజులు ఎక్కడీ మగాడు ?
సాక్షి, ఖమ్మం: ‘‘ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు అనుకూలంగా యూపీఏ ప్రభుత్వం ప్రకటన చేసి పది రోజులైంది. ఇంతకాలం నిద్రావస్థలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఆయన ఒక్కడే సమైక్యాంధ్ర కోసం మాట్లాడిన మగాడని పలువురు అనటం విడ్డూరం. పది రోజులేమయ్యాడు ఈ మగాడు?’’ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి.రాఘవులు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిపై ధ్వజమెత్తారు. రాఘవులు శనివారం ఖమ్మం జిల్లా పార్టీ ప్లీనరీ సమావేశంలో మాట్లాడారు. సీడబ్ల్యూసీ సమావేశం, కాంగ్రెస్ వార్‌రూం సమీక్ష, సోనియాగాంధీ చర్చల్లో ఉన్న సీఎం అప్పుడు వారు చెప్పినట్లు తల ఊపి ఇప్పుడు ఉనికి కోసమే ప్రకటనలు చేస్తున్నారని రాఘవులు విమర్శించారు. ఇదంతా కాంగ్రెస్ అధిష్టానం కుట్రలో భాగమేనన్నారు. ప్రజల సంక్షేమాన్ని పక్కనపెట్టి రాహుల్‌గాంధీని ప్రధానిని చేసే లక్ష్యంతో పనిచేస్తున్నారని విమర్శించారు. ఎన్నికలు, ఓట్లు, సీట్లు తప్ప మరేది కాంగ్రెస్ ప్రభుత్వానికి అవసరం లేదని తూర్పారబట్టారు. జార్ఖండ్‌లో ముక్తి మోర్చా, బీహార్‌లో నితీష్‌కుమార్‌లతో చర్చలు జరపటం, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయటం కాంగ్రెస్ స్వార్థ ప్రయోజనాలకోసమే అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు తాము అడ్డుకాదని ఉత్తరం రాసిన టీడీపీ, అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని చెప్పిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు నక్కజిత్తుల వ్యవహారం చేస్తూ ఏ ఎండకాగొడుగు పడుతున్నారని విమర్శించారు. అన్ని పార్టీలు రాష్ట్ర విభజనకు అనుకూలమే అని ప్రకటించాయని.. సీపీఎం నాడు, నేడు విభజనను వ్యతిరేకిస్తోందని ఆయన పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం కావాలని అన్న చిరంజీవి, రూ. 4 లక్షల కోట్లు ఇస్తే చాలని చంద్రబాబు చెప్పటాన్ని బట్టి వారు సమైక్యవాదులో కాదో అర్థం అవుతుందని వ్యాఖ్యానించారు. ఆయా అంశాలపై స్పష్టతనివ్వాలి... తెలంగాణ విభజన జరిగితే హైదరాబాద్‌లో ఉండే ఉద్యోగులు, వ్యాపారుల పరిస్థితి ఏమిటి? నీటి పంపిణీ ఏవిధంగా చేస్తారు? పోలవరానికి జాతీయ హోదా కల్పిస్తే ముంపుకు గురయ్యే గిరిజనుల పరిస్థితి ఏమిటి? అనే అంశాలపై స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్టు కట్టటం వల్ల గిరిజనులు ముంపుకు గురికాకుండా పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. రెండు రాష్ట్రాలు ఏర్పడినంత మాత్రాన దళితుల, గిరిజనుల, కార్మికుల సమస్యలు పరిష్కారం కావని, వాటి పరిష్కారం కోసం మళ్లీ పోరాటాలు చేయాల్సిందేనన్నారు. భద్రాచలం డివిజన్‌పై ఎవరికి అనుకూలమైన విధంగా వారు మాట్లాడుతున్నారని, రాష్ట్రం ఏర్పడినా భద్రాచలం ఖమ్మం జిల్లాలోనే ఉంటుందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం, ఏర్పాటు అవుతున్న తర్వాత కూడా టీఆర్ఎస్ రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తోందని రాఘవులు తప్పుపట్టారు. ఇరు ప్రాంతాల నాయకులు చేస్తున్న రాజకీయాల మూలంగా ఉద్యోగులు, విద్యార్థులు నష్టపోతున్నారని అన్నారు. చిన్న రాష్ట్రాలు ఏర్పడితే ముందుగా లాభపడేది భారతీయ జనతా పార్టీ అని చెప్పారు. -
రాష్ట్రం సమైక్యంగా ఉంచేందుకు కృషి : కాసు
తాను సమైక్యవాదం గల కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా సీమాంధ్ర ప్రజల సెంటిమెంట్‌ను గౌరవిస్తానని రాష్ట్ర మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి శుక్రవారం హైదరాబాద్‌లో వెల్లడించారు. తమ కుటుంబం సమైక్యవాదాన్ని బలపరిచిన కుటుంబమని ఆయన పేర్కొన్నారు. సీమాంధ్ర ప్రజల అభిప్రాయాలను ఆంటోని కమిటీ ముందు వినిపిస్తానని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రం సమైక్యంగా ఉంచేందుకు తన వంతు కృషి చేస్తానని కాసు కృష్ణారెడ్డి ఈ సందర్బంగా భరోసా ఇచ్చారు. సమైక్యవాదానికి మద్దతుగా ఇటీవలే కాసు తన మంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. మంత్రులు గంటా శ్రీనివాసరావు, ఏరాసు ప్రతాప్ రెడ్డి, టీజీ వెంకటేష్ లు గతంలోనే రాజీనామా చేయగా, మంత్రి తోట నర్సింహం నిన్న తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. -
నాయకులొస్తున్నారు
సాక్షి, ఏలూరు:ప్రజలు ఎన్నుకున్న నాయకులు పదవులు వచ్చాక ఆ ప్రజలనే పట్టించుకోవడం మానేస్తే.. ఇన్నాళ్లూ పోనీలే అని వదిలేసిన జనం ఇప్పుడు వాళ్ల కాలర్ పట్టుకుని నిలదీసే పరిస్థితి వచ్చింది. కొందరి స్వార్థం కోసం రాష్ట్రాన్ని నిలువునా చీల్చుతుంటే చూస్తూ ఊరుకోలేకపోయారు. ‘నాయకులూ.. మీరున్నా లేకున్నా తెలుగుజాతిని కాపాడుకోవడానికి మేమే యుద్ధం చేస్తా’మంటూ సమైక్య సమరశంఖం పూరించారు. ఒ క రోజు కాదు రెండు రోజులు కాదు రాష్ట్ర విభజన ప్రకటనను వెనక్కు తీసుకునేవరకూ ఉద్యమం ఆగదని ప్రతినబూనారు. వారి అకుంఠిత దీక్షకు.. అవిరళ కృషికి, ఉద్యమ స్ఫూర్తికి కాకలు తిరిగిన రాజకీయ నాయకులు సైతం తలవంచక తప్పటం లేదు. ప్రజా ఉద్యమంలో భాగస్వాములుకాకపోతే రాజకీయ భవిష్యత్ ఉండదనే భయంతో ఇళ్లు వదిలి.. హంగు, ఆర్భాటాలను పక్కనపెట్టి సాదాసీదాగా జనం మధ్యకు వస్తున్నారు. తలవంచక తప్పక... సమైక్యాంధ్ర నినాదంతో ప్రజలకు చేరువై మంత్రి పదవి రాగానే మాటమార్చిన కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు వంటివారు ప్రజల ముందుకు వచ్చే సాహసం చేయలేకపోతున్నారు. కానీ.. జిల్లాలో తిరగాల్సిన నాయకులు మాత్రం ప్రజల్లోకి వెళ్లాలంటే ఉద్యమంలోకి అడుగుపెట్టక తప్పదని గ్రహించారు. విభజిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ చెప్పిన తర్వాత కూడా పదవులకు రాజీనామా చేసి నిరసన తెల పని ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లను సమైక్యవాదులు నేటికీ ముట్టడిస్తూనే ఉన్నారు. పదవుల కోసం ప్రాకులాడకుండా ప్రజల్లోకి వచ్చి ఉద్యమానికి నాయకత్వం వహించమని డిమాండ్ చేస్తున్నారు. అయినా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు చెందిన వారెవరూ పదవుల్ని వదలలేదు. ప్రకటన వెలువడగానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పదవుల్ని తృణప్రాయంగా వదిలి సమైక్య ఉద్యమాన్ని భుజాన వేసుకున్నారు. ఉద్యమం క్షణక్షణం ఉధృత రూపం దాలుస్తుండటంతో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలకు కంటిమీద కునుకు కరువైంది. అడుగడుగునా వారికి ఉద్య మ సెగ తగులుతోంది. ఇళ్లల్లో ఉంటే సమైక్యవాదులు ముట్టడిస్తున్నారు. బయటకు వస్తే కార్లకు అడ్డంగా పడుకుంటున్నారు. దీంతో ఒక్కొక్కరుగా ఉద్యమంలోకి వస్తున్నారు. విభజన ప్రకటన వెలువడిన రెండు రోజులకు నరసాపురం, తాడేపల్లిగూడెం, భీమవరం, పాలకొల్లు, తణు కు ఎమ్మెల్యేలు రాజీనామా చేయక తప్పలేదు. వీరిలో కొందరు రాజీ నామా లేఖలను స్పీకర్‌కు కాకుండా పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణకు ఇచ్చారు. మూడు రోజులకు ఉండి, నిడదవోలు ఎమ్మెల్యేలు వేటుకూరి శివరామరాజు, బూరుగుపల్లి శేషారావు, నాలుగు రోజులకు కొవ్వూరు ఎమ్మెల్యే టీవీ రామారావు రాజీనామా చేశారు. టీడీపీకి చెందిన మాజీ మంత్రి మాగంటి బాబు, అంబికా కృష్ణ మూడు రోజులుగా ఉద్యమాల్లో పాల్గొంటున్నారు. సమైక్యవాదులు ఘెరావ్ చేయడంతో తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు గురువారం బైక్ ర్యాలీ జరిపారు. -
కదం తొక్కిన విద్యుత్ ఉద్యోగ జేఏసీ నేతలు
కడప అగ్రికల్చర్,న్యూస్‌లైన్: రాష్ట్ర విభనను వ్యతిరేకిస్తూ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా నల్లబ్యాడ్జీలు ధరించి సోమవారం నిరసన వ్యక్తం చేశారు. కడప నగరంలోని శంకరాపురం వద్దనున్న 220 కేవీ విద్యుత్ ఉప కేంద్రం వద్ద నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ కృష్ణా సర్కిల్, గోకుల్ సర్కిల్, వన్‌టౌన్, పాత బస్టాండ్ మీదుగా జడ్పీ కార్యాలయానికి చేరుకుంది. ర్యాలీని ఉద్దేశించి విద్యుత్ ఉద్యోగుల ఐక్యకార్యాచరణ సమితి కన్వీనర్లు ఐ గుర్రప్ప, డి నాగరాజులు మాట్లాడుతూ రాష్ట్రాన్ని ముక్కలు చేసే అధికారాన్ని రాజకీయనేతలకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రాంతీయ ఉద్యమాలు రెండేళ్ల కిందట ప్రారంభమైనప్పుడు కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం అన్ని ప్రాంతాల ప్రజల అభిప్రాయాలను, అక్కడి వనరులను తెలుసుకునేందుకు శ్రీకృష్ణ కమిటీని వేశారన్నారు. ఆ సమయంలో అన్ని ప్రాంతాల వారు వారి మనోభావాలను కమిటీ సుభ్యులకు వివరించారన్నారు. ఇందు కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారన్నారు. అయితే ఆ కమిటీ చేసిన సిపార్సులను కాదని, రాజకీయ పార్టీలకు తలొగ్గి హడావుడిగా విభజన ప్రకటన చేశారని దుయ్యబట్టారు. విభజన ప్రకటన వెనక్కు తీసుకునే వరకు ఉద్యమాలు ఆగవని హెచ్చరించారు.ఈ ర్యాలీలో 16 విద్యుత్ యూనియన్ల అధ్యక్ష, కార్యదర్శులు, డిస్కంల అధ్యక్షులు, కార్యదర్శులు, డీఈలు, ఏడీఈలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.