అధిష్టానాన్ని ఎదిరించైనా సమైక్యాంధ్ర సాధిస్తాం: ధర్మాన | We will fight against to congress high command to achieve united andhra pradesh | Sakshi
Sakshi News home page

అధిష్టానాన్ని ఎదిరించైనా సమైక్యాంధ్ర సాధిస్తాం: ధర్మాన

Published Sun, Aug 18 2013 2:08 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

We will fight against to congress high command to achieve united andhra pradesh

కాంగ్రెస్ అధిష్టానాన్ని ఎదిరించైనా సమైక్యాంధ్రను సాధించుకుంటామని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆదివారం శ్రీకాకుళంలో స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించామని ఆయన పేర్కొన్నారు. అలాగే అదే జిల్లాకు చెందిన మంత్రి కొండ్రు మురళి ఆదివారం శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ప్రసంగిస్తూ...హైదరాబాద్ అభివృద్ధిలో తెలుగువారందరూ భాగస్వాములే అని స్ఫష్టం చేశారు.

 

రాష్ట విభజనపై తెలుగుదేశం, భారతీయ జనతాపార్టీలు స్ఫష్టమైన లేఖలు ఇచ్చాయని ఆయన తెలిపారు. ఆ నేపథ్యంలో రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ ప్రకటన చేయావలసి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. విభజనకు అనుకూలంగా లేఖలు ఇచ్చిన ఆ రెండు పార్టీలు తమ లేఖలను ఉపసంహరించుకుంటే విభజన ప్రక్రియను తాము అడ్డుకుంటామని కొండ్రు మురళి ఈ సందర్బంగా వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement