darmana prasadrao
-
‘వ్యవసాయరంగంలో ఏపీ ఆదర్శంగా నిలుస్తోంది’
సాక్షి, శ్రీకాకుళం : చితికిపోయిన వ్యవసాయ వృత్తిని గాడిలో పెట్టి రైతులను సంతోషపెట్టాలనే ప్రయత్నం ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతుందని మాజీ మంత్రి, శ్రీకాకుళం శాసనసభ్యుడు ధర్మాన ప్రసాదరావు అన్నారు. మేనిఫెస్టోలో రూ.12వేల5వందలు ఇస్తామని చెప్పి రూ.13వేల5వందలు రైతులకు ఇచ్చిన ఘనత వైఎస్సార్సీపీ ప్రభుత్వానిదేనన్నారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడానికి రూ.15వందల కోట్లతో విద్యుత్ లైన్లు మెరుగుపరుస్తున్నామని తెలిపారు. రైతు భరోసా కేంద్రం రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తుందని ధర్మాన ప్రసాదరావు అన్నారు. సకాలంలో రైతులకు సలహాలు ఇచ్చే వ్యవస్థ ఇంతవరకు లేదని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చారని తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో లక్ష మెట్రిక్ టన్నుల మొక్కజొన్న పండిస్తే ప్రభుత్వమే కొనుగోలు చేసి ధరను స్థిరీకరించిందని పేర్కొన్నారు. దేశంలోనే వ్యవసాయరంగంలో ఏపీ ఆదర్శంగా నిలుస్తుందన్నారు. వంశధార నది, బంగాళాఖాతంలో కలిసే చోట నది దిశ మారిపోయిందన్నారు. ఏడున్నర కోట్లతో రివర్ కన్సర్వేషన్ జోన్లో నివారణా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. కళింగపట్నం బీచ్ కోతకు గురవ్వకుండా కాపాడేందుకు ఇంజనీరింగ్ అనుమతులు వచ్చాయన్నారు. -
అచ్చెన్న, కూనకు షాక్
అమరావతి ముద్దు– వికేంద్రీకరణ వద్దు అనే నినాదంతో జిల్లా ప్రజలకు అన్యాయం చేస్తున్న ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు, మాజీ విప్ కూన రవికుమార్‌కు ఆ పార్టీ నాయకులే షాక్ ఇచ్చారు. సంక్రాంతి పూట వారిద్దరికీ కోలుకోలేని దెబ్బకొట్టారు. వెనుకబడిన జిల్లాను ముందుకెళ్లకుండా తీరని ద్రోహం చేస్తున్న టీడీపీకి గుడ్‌బై చెప్పి వైఎస్సార్సీపీలో చేరారు. అన్ని ప్రాంతాలను సమదృష్టితో అభివృద్ధి చేసేందుకు పరితపిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి అండగా ఉంటామంటూ వేలాది మంది సోమవారం వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: వైఎస్సార్సీపీ గాలిలో కూడా కింజరాపు అచ్చెన్నాయుడు ఎమ్మెల్యేగా గెలిచారు. రిగ్గింగ్ తదితర ఆరోపణలు ఏమున్నప్పటికీ జిల్లాలో గెలిచిన టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. అటువంటి నాయకుడు ఎలా ఉండాలి. ప్రజల అభీష్టం మేరకు పనిచేయాలి. జిల్లా అభివృద్ధికి పాటుపడాలి. కానీ అచ్చెన్నాయుడు అందుకు విరుద్ధంగా జిల్లా ప్రజల మనోభావాలను ముఖ్యంగా నియోజకవర్గ ప్రజల ఆలోచనలకు భిన్నంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అజెండాను మోస్తున్నారు. పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకర ణ జరిగితే రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు ప్రగతి పథంలో నడుస్తాయన్న ఉద్దేశంతో మూడు రాజధానుల ప్రతిపాదనను తీ సుకొస్తే అదేదో తప్పు అన్నట్టుగా, రాష్ట్రానికి అన్యాయం చేసి నట్టుగా టీడీపీ అగ్రనేతలు ఆందోళనలు చేస్తున్నారు. అమరావతిలో ఉన్న భూములను కాపాడుకునేందుకు, అక్కడున్న స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేస్తూ వెనకబడిన ప్రాంతాలకు అన్యాయం చేస్తున్నారు. విశాఖపట్నం రాజధాని అయితే పక్కనున్న విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు కూడా అభివృద్ధి చెందుతాయని ప్రజలంతా ఆశిస్తుంటే అందుకు విరుద్ధంగా పనిచేస్తున్నారు. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా ఉన్న ఈ ధోరణి నచ్చని టీడీపీ శ్రేణులు తమకు రాజకీయ భవిష్యత్ లేకుండా చేస్తారన్న భయంతో పారీ్టకి గుడ్‌బై చెప్పేస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో అచ్చెన్నాయుడుకు అండగా నిలిచిన టెక్కలి, సంత»ొమ్మాళి మండలాలకు చెందిన వెయ్యికి పైగా కుటుంబాలు టీడీపీకి స్వస్తి చెప్పి సోమవారం వైఎస్సార్సీపీలో చేరారు. ఆ రెండు మండలాల్లో టీడీపీకి సంబంధించి పంచాయతీలకు పంచాయతీలే ఖాళీ అయిపోయాయి. కూనదీ అదే పరిస్థితి.. అధికారంలో ఉన్నంతసేపూ దౌర్జన్యాలతో, ఓడిపోయాక అనుచిత వైఖరితో వివాదాస్పదమైన కూన రవికుమార్‌కు సైతం ఆ పార్టీ నేతలు ఝలక్ ఇచ్చారు. పొందూరు మండలానికి చెందిన తోలాపి గ్రామంలో వందలాదిమంది టీడీపీ నాయకులు, కార్యకర్తల స్పీకర్ తమ్మినేని సీతారాం సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. దీంతో కూన రవికుమార్‌కు కోలుకోలేని దెబ్బ తగిలినట్టయింది. వైఎస్సార్సీపీలో భారీగా చేరికలు శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలను తూచా తప్పకుండా పాటించడమే అందరి కర్తవ్యమని రోడ్లు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. టెక్కలి, సంతబొమ్మాళి మండలాల నుంచి సుమారు వెయ్యి కుటుంబాలు వైఎస్సార్ కాంగ్రెస్ పారీ్టలోకి సోమవారం చేరాయి. శ్రీకాకుళం నగరంలో పార్టీ కార్యాలయంలో పార్టీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షురాలు, పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్ సమక్షంలో భారీగా చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. వైఎస్ జగన్ పా లన చూసి పార్టీలోకి చేరేందుకు ముందుకు వస్తున్నారని మంత్రి అన్నారు. పార్టీలో చేరేందుకు వచ్చే వారందరినీ స్వాగతించాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జెండా ఎగురవేయడమే లక్ష్యమని తెలిపారు. అనంతరం పార్టీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షురాలు కిల్లి కృపారాణి మా ట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లాలో టెక్కలి, సంత»ొమ్మాళి మండలాల నుంచి అత్యధిక మెజార్టీ ఇచ్చి విజయపతాకం ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 17న తేదిన ఉత్తరాంధ్ర అభివృద్ధిని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శ్రీకాకుళం నగరంలో వైఎ స్సార్ కూడలి నుంచి భారీ ర్యాలీ నిర్వహించనున్నామని అందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో పరిపాలన రాజధాని ఏర్పా టు చేసి నిరంతరం వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి సీఎం జగన్ కృషి చేస్తున్నారని తెలిపారు. భారీగా చేరికలు సంతబొమ్మాళి మండలం నుంచి 8 గ్రామాల నుంచి సు మారు వెయ్యి కుటుంబాలు చేరాయి. ఇందులో ముఖ్యులు పాలవానిపేట నుంచి పాల వసంతరెడ్డి సమక్షంలో అత్యధికంగా చేరారు. మాజీ సర్పంచ్‌లు పాల మహేష్ బైపల్లి ప్రకాస్, చెట్టి అప్పలరాజు, కారాడ పోతయ్య, గొరకల ఆదినారాయణ, అంగూరు మధు, బైపల్లి ప్రకాస్, పిన్నింటి ఎండయ్య, అట్టాడ వెంకటరమణ, అల్లుపల్లి పోతయ్య, దర్మవరపు పూర్ణచారి, లోపింటి రామిరెడ్డి, గెద్దల కేశవరావు, ఎమ్.వెంకటరావు (విద్యాకమిటీ చైర్మన్), శిర్ల ప్రకాష్, చిన్నారెడ్డి, మోస శ్రీరాములు, సిహెచ్ చిన్నారెడ్డి, సుగ్గు రమేష్‌రెడ్డి, లింగుడు ప్రసాదరెడ్డి, దుంగ నర్శింహులు, గీత చెంచులతో పాటు టెక్కలి మండలం నుంచి కొప్పుల నగేష్‌బాబు, బొడ్డు సింహాద్రి, బగల శ్రీనివాసరావు, కొప్పుల మాధవరావు, మోద వసంతరావు, ముద్దాడ చలపతిరావు, బగల వినోద్, బద్రి ఉమాశంకర్, పటా్నన కళ్యాణ్, టి.గోవింద, కె.వీరయ్యలు పార్టీలో చేరారు. తమ్మినేని ఆధ్వర్యంలో భారీగా చేరికలు పొందూరు: తోలాపి గ్రామానికి చెందిన ముఖ్య నాయకులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని చిరంజీవి నాగ్ ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. స్పీకర్ తమ్మినేని సీతారాంకు నిర్వహించిన పౌరసన్మాన సభ ప్రారంభానికి ముందుకు పారీ్టలో చేరికలు జరిగాయి. దుంపల రామారావు (లక్ష్మణరావు) ఉపాధ్యాయ వృత్తిని విడిచిపెట్టి ప్రజలకు సేవ చేద్దామనే సంకల్పంతో అఖిల భారత వెనుకబడిన కులాల ఫెడరేషన్ (ఏఐబీసీఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బీసీలకు ఇస్తున్న గౌరవానికి, ప్రాముఖ్యతకు, విధివిధానాలు, ప్రజారంజక పాలనకు ఆకర్షితులై వైఎస్సార్ కాంగ్రెస్ పారీ్టలోకి చేరానని చెప్పారు. తమ్మినేని చిరంజీవి నాగ్ పార్టీ కండువాను కప్పి దుంపల లక్ష్మణరావుతో విశ్రాంత ఆర్ఐఓ దుంపల శ్యామలరావు, డాక్టర్ పొన్నాడ జోగినాయుడు, కూన తిరుపతిరావు, తుంపల ప్రభాకరరావు, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు పి. శ్రీనివాసరావులతోపాటు సుమారు 300 మందిని పారీ్టలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల పార్టీ అధ్యక్షుడు కొంచాడ రమణమూర్తి, వైఎస్సార్సీపీ నాయకులు సువ్వారి గాం«దీ, పప్పల మున్న, లోలుగు కాంతారావు, పీఏసీఎస్ అధ్యక్షుడు గంట్యాడ రమేష్, తోలాపి నాయకులు పప్పల రాధాకృష్ణ, పప్పల రమేష్, పప్పల అన్నాజీ, పప్పల దాలినాయుడు, తదితరులు పాల్గొన్నారు. -
కులంతో కాదు కష్టంతో..
సాక్షి, అరసవల్లి: చట్ట సభల్లో చేసిన శాసనాలను అమలు పరిచే బాధ్యత ఉద్యోగులందరి మీద ఉందని, ఈ విషయం లో ఉద్యోగులంతా రాష్ట్ర బంగారు భవిష్యత్ కోసం కష్టపడి పనిచేయాలని అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కోరారు. స్థానిక జెడ్పీ సమావేశ మందిరంలో ఆదివారం నిర్వహించిన ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఏపీజీఈఏ) తొలి మహా సభల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు నిర్వహించిన ఈ మహాసభలో కీలక నేతలంతా ప్రసంగించారు. చరిత్రలో ఎంతోమంది ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేశారని, వారిని ఆదర్శంగా తీసుకుని పనిచేయాలని స్పీకర్ సూచించారు. మహాసభలను సిక్కోలు నుంచి ప్రారంభించడం శుభసూచికమని అన్నారు. కులం తో కాకుండా కష్టంతో పైకి రావాలని అక్కడ పెట్టిన కొటేషన్లను ఉద్దేశిస్తూ అన్నారు. సమన్వయమే బలంగా పనిచేయాలని కోరారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటికే ఐఆర్ ప్రకటించారని, అలాగే పదవీ విరమణ అయ్యేలోగా ఇళ్ల నిర్మాణాలను కూడా ఉద్యోగులు చేపట్టుకునేలా ప్రభుత్వం చర్యలు చేపట్టనుందన్నారు. ఉద్యోగులు అడిగిన మేరకు అన్ని డిమాండ్ల పరిష్కారానికి తాను ముఖ్యమంత్రితో చర్చిస్తానని భరోసా ఇచ్చారు. ఉద్యోగుల సంక్షేమం ముఖ్యం.. అనంతరం రాష్ట్ర ఆర్అండ్బీ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ మాట్లాడారు. ఈ సంఘాన్ని వైఎస్ జగన్ హయాంలోనే 103వ సంఘంగా గుర్తించినట్లు తెలిపారు. ఉద్యోగుల సంక్షేమానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఏపీ ఎన్జీఓ సంఘ నేతలు స్వార్థ రాజకీయాలు చేశారని విమర్శించారు. అశోక్ బాబు వంటి వారు ఉద్యోగులను వాడుకున్నారని ఘా టుగా వ్యాఖ్యానించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి, సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నంబర్ వన్ సంఘంగా.. శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు మా ట్లాడుతూ ఉద్యోగుల మద్దతుతోనే రాష్ట్రం లో బలంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చింద ని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం ఉద్యోగులకు స్నేహపూర్వకంగా నడుస్తుందన్నారు. సీఎం జగన్‌కు ఉద్యోగులంతా సహకరించాలని కోరారు. సూర్యనారాయణ లాంటి మంచి, నిజాయితీ గల వ్యక్తి ఉద్యోగులందరికీ నాయకుడిగా ఉం డడం మంచి పరిణామమని, ఈ సంఘం రాష్ట్రంలో నంబర్ వన్‌గా నిలుస్తుందనే నమ్మకం తనకుందన్నారు. హక్కులతో పాటు బాధ్యతలు కూడా తలకెత్తుకోవాలని కోరారు. ఎన్జీవో నేత అక్రమాలకు కేరాఫ్ ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్ మాట్లాడుతూ ఎన్జీవో నేత చౌదరి పురుషోత్తం నాయుడు అవినీతి అక్రమాలకు అడ్డాగా మారిపోయాడని, ఆయన అసలు ప్రభుత్వ ఉద్యోగ విధులే ఎక్క డా నిర్వర్తించరని, సొంతంగా పేపర్ నడుపుకుంటూ, ఉద్యోగులకు బెదిరింపులు చేస్తూ అక్ర మాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఉద్యోగుల సంక్షేమం పూర్తిగా మరిచిపోయి తన స్వ లాభం కోసం దందాలు నడుపుకుంటున్నారని ధ్వజమెత్తారు. బదిలీల సమయంలో సచివాలయంలో దళారీగా పనిచేశారని ఆరోపించారు. ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ఏపీజీఈఏ రాష్ట్ర సంఘ అధ్యక్షుడు కె.రామసూర్యనారాయణ మాట్లాడుతూ రాజకీయాలకు అ తీతంగా, నిజాయితీగా పనిచేస్తామని, అయితే ప్రస్తుతం ఉద్యోగుల సంక్షేమంపై సానుకూలంగా వ్యవహరిస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వానికి తమ సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నామన్నారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తామని ప్రకటించడంతో పాటు ఉద్యోగులందరికీ ఇళ్లు ఇ స్తామని సీఎం ప్రకటించారని, ఈ విషయంలో ఉద్యోగులకు ఇంటి స్థలాలు కాకుండా కేవలం ఇళ్లు మాత్రమే ఇవ్వాలని కోరారు. స్థలాలిస్తే రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు అవకాశముం టుందని, గతంలో గచ్చిబౌలిలోని 487 ఎకరాల స్థలాల వ్యవహారాన్ని గుర్తుచేశారు. జిల్లాలో ఎన్జీవో సంఘ నేతలు సంఘాన్ని అడ్డం పెట్టుకుని మాఫియా నడుపుతున్నారని, భారీగా అక్రమాలు చేశారని, ఉద్యోగులెవరైనా తమ మాట వినకపోతే, తమ సొంత మీడియాలోనే వార్తలు రాయించుకుని బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర సంఘ ప్రధాన కార్యదర్శి జి.ఆస్కారరావు మాట్లాడుతూ ఇంత వరకు ఉద్యోగ సం ఘాల పేర్లతో అక్రమాలకు తెగబడ్డారని, దీన్ని నిలువరించేందుకు అలాగే స్వచ్ఛందంగా ఉద్యోగుల సంక్షేమానికి కృషి చేయడానికే ఈ సంఘం ఏర్పడిందని వివరించారు. జిల్లాలో ఎన్జీవో సంఘ నేతల అక్రమాలు త్వరలోనే బయటపెడతామని, గత బదిలీల వ్యవహారంపై బహిరంగ విచారణకు తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. సమావేశంలో ఏపీజీఈఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఐ.రఘుబాబు, సంఘ రాష్ట్ర కార్యవర్గం పింగళి గిరిధర్, డి.శ్రీకాంత్‌రాజు, వినయ్మోహ జిల్లా సంఘ అధ్యక్షుడు నాగేశ్వరరావు, జాయింట్ సెక్రటరీ జి.సీతారాం, జిల్లా గౌరవాధ్యక్షుడు కిలారి నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. మహాసభ ముగింపు సందర్భంగా హాజరైన ప్రజాప్రతినిధులకు ప్రత్యేకంగా కార్యవర్గ సభ్యులు ఘనంగా సత్కరించారు. వినతుల వెల్లువ సీపీఎస్ రద్దు కోరుతూ ఏపీ సీపీఎస్ ఉద్యోగుల సంఘ నేతలు ఎం.సురేష్, ప్రధాన కార్యదర్శి రెడ్డి సూరిబాబు, తదితరులు ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు వినతిపత్రం సమర్పించారు. అలాగే తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కె.రామసూర్యనారాయణకు స్థానిక ఆర్డబ్ల్యూఎస్ విబాగంలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ల్యాబ్ అసిస్టెంట్లు సంఘాల ప్రతినిధులు పి.సురేష్, కె.సత్యన్నారాయణ, లోకేశ్వరరావులు వినతిపత్రం సమర్పించి కోరారు. -
అప్పుడు లేని అనుమానం ఇప్పుడు వచ్చిందా?
సాక్షి, శ్రీకాకుళం: గత ఎన్నికల సమయంలో ఈవీఎంలను తప్పుపట్టని చంద్రబాబు ఇప్పుడు ఈవీఎలంపై అనుమానం వ్యక్తం చేయడం హాస్యాస్పదమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు అన్నారు. అప్పుడు లేని అనుమానం ఇప్పుడొచ్చిందా అని ప్రశ్నించారు. దేశంలో జరిగే ఎన్నికలు ఆక్షేపణకరమైనవి కావని, ఎన్నో ఏళ్లుగా సజావుగా జరుగుతున్నాయని ఆయన గుర్తుచేశారు. ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు అపనమ్మకం కలిగే విధంగా చంద్రబాబు ప్రయత్నించడం సరికాదన్నారు. కాగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈవీఎంల్లో లోపాలు ఉన్నాయని చంద్రబాబు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. దీనిపై శనివారం మీడియా సమావేశంలో ధర్మాన స్పందిస్తూ.. స్వర్థ ప్రయోజం కోసం చంద్రబాబు నాయుడు రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలకు నచ్చిన వారిని ఎన్నుకునే హక్కు ప్రజాస్వామ్యం కల్పించిందన్నారు. రోజుకు రెండు మాటలు మాట్లాడే తత్వం చంద్రబాబుదని విమర్శించారు. 130 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన మరుసటి రోజే.. ఈవీఎంలు సరిగా పనిచేయలేదని అంటున్నారని గుర్తుచేశారు. చంద్రబాబు మాటలపై ఆయనకే నమ్మకం లేదని ఎద్దేవా చేశారు. ఎన్నికల సంఘాన్ని, ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని ధర్మాన సూచించారు. -
ఎన్నికల పోరుకు సిద్ధం
బీసీలే టీడీపీకి అండ అనే నినాదంతో ఇన్నాళ్లూ బలహీనవర్గాల గడ్డ సిక్కోలులో పాగా వేయగలిగారు.. కానీ ఆచరణలో బీసీల అభ్యున్నతికి టీడీపీ చేసిందేమీ లేదని తేలిపోయింది! ఇలాంటి నేపథ్యంలో బీసీలకు నేనున్నాను అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అభయమిచ్చారు. శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి సహా జిల్లాలో రాజాం (ఎస్సీ), పాలకొండ (ఎస్టీ) మినహా మిగిలిన ఎనిమిది నియోజకవర్గాల్లోనూ బీసీ అభ్యర్థులకే టిక్కెట్లు ఇచ్చి తన ఉద్దేశమేమిటో చెప్పకనే చెప్పారు. మరోవైపు టీడీపీ కూడా అభ్యర్థులను ఖరారు చేయడంతో బరిలో నిలిచేదెవరో తేలిపోయింది. జగన్‌కో అవకాశం ఇద్దామని అన్ని వర్గాల ప్రజలూ కోరుకుంటున్న నేపథ్యంలో ప్రజల అండతో టీడీపీ కోట బద్దలుకొట్టడానికి వైఎస్సార్సీపీ అభ్యర్థులు సై అంటున్నారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: మరోసారి ధర్మాన వర్సెస్ గుండ శ్రీకాకుళం నియోజకవర్గంలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు గుండ కుటుంబంతో మరోసారి తలపడనున్నారు. 2004, 2009 ఎన్నికలలో మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణను ఓడించారు. 2014 ఎన్నికలలో మాత్రం చంద్రబాబు అప్పలసూర్యనారాయణను కాదని ఆయన భార్య లక్ష్మీదేవిని పోటీకి దింపారు. ఈ ఎన్నికలలో ధర్మాన ఓటమి పాలయ్యారు. టీడీపీ ఐదేళ్ల పాలనలో శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోనే కాదు జిల్లా మొత్తంమీద ఎక్కడా అభివృద్ధి కానరాలేదని అన్ని వర్గాల ప్రజలు భావిస్తున్నారు. ఇదే సమయంలో ధర్మాన హయాంలో జరిగిన అభివృద్ధిని గుర్తు చేసుకుంటున్నారు. ఈసారి ఏదైనా ధర్మాననే గెలుపించుకోవాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో జగన్ మరోసారి ఆయననే బరిలోకి దించారు. టీడీపీ కూడా లక్ష్మీదేవికే ఈసారీ అవకాశం ఇచ్చింది. పాత ప్రత్యర్థుల మధ్యే ఆమదాలవలస పోరు ఆమదాలవలసలో 1983, 1985, 1991 (ఉప ఎన్నిక), 1994, 1999 ఎన్నికలలో మొత్తం ఐదుసార్లు గెలిచి ఎన్టీఆర్, చంద్రబాబు మంత్రివర్గాల్లో సభ్యుడిగా వ్యవహరించిన తమ్మినేని సీతారాంకు జిల్లాలో మంచి గుర్తింపు ఉంది. గత మూడు దఫాల్లో ఆయనకు విజయం దక్కకపోయినా ఈసారి విజయమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. చింతాడ రవికుమార్, కోట బ్రదర్స్, మున్నా సహా పలువురు నాయకులను పార్టీలోకి చేర్పిస్తూ ఆమదాలవలసలో వైఎస్సార్సీపీని మరింత బలోపేతం చేశారు. తిత్లీ తుఫానులో అనేకమంది బాధితులకు విశేషంగా సహాయం చేసిన యువ శాస్త్రవేత్త గేదెల శ్రీనుబాబు కూడా గత వారం వైఎస్సార్సీపీలో చేరారు. ఆయన కూడా ఆమదాలవలస నియోజకవర్గంలో బూర్జ మండలానికి చెందినవారే కావడం విశేషం. మరోవైపు సిటింగ్ ఎమ్మెల్యే కూన రవికుమార్‌నే టీడీపీ మరోసారి బరిలోకి దించింది. నాగావళి, వంశధార నదుల్లో ఇసుక అక్రమ తవ్వకాలతో చెరబట్టిన మాఫియాకు కూన అండదండలు అందించడంపై ప్రజలు ఇప్పటికే గుర్రుగా ఉన్నారు. అక్రమ సంపాదన వెదజల్లినా ప్రజలు మాత్రం ఫ్యాన్‌కే చాన్స్ ఇద్దామనే ఆలోచనలో ఉన్నారు. నరసన్నపేటలోనూ పాత ప్రత్యర్థులే.. ధర్మాన కుటుంబానికి తొలి నుంచి బాసటగా నిలుస్తున్న నరసన్నపేట నియోజకవర్గంలో కృష్ణదాస్ 2009, 2012 (ఉప ఎన్నిక) ఎన్నికలలో విజయం సాధించారు. 2014 ఎన్నికలలో ఓడిపోయినా నిత్యం ప్రజల్లో ఉంటూ వారికి అండగా ఉన్నారు. గత ఎన్నికలలో కృష్ణదాస్‌పై గెలిచిన బగ్గు రమణమూర్తికే టీడీపీ ఈసారి కూడా టికెట్ ఇచ్చింది. పాత ప్రత్యర్థినే మరోసారి ఎదుర్కొనేందుకు కృష్ణదాస్ పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యారు. టెక్కలిలో త్రిమూర్తుల విశ్వరూపం టెక్కలిలో టీడీపీ అభ్యర్థిగా కింజరాపు అచ్చెన్నాయుడు మరోసారి బరిలోకి దిగుతున్నారు. ఏదిఏమైనా అచ్చెన్నపై విజయమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ యువకుడైన పేరాడ తిలక్‌కు టికెట్ ఇచ్చింది. శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా వైఎస్సార్సీపీ తరఫున బరిలోకి దిగిన దువ్వాడ శ్రీనివాస్ సొంత ప్రాంతం కూడా టెక్కలే. ఇటీవలే కాంగ్రెస్ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరిన కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి కూడా ఈ ప్రాంతవాసే. త్రిమూర్తుల్లాంటి ముగ్గురు నాయకులు సమష్టి కృషితో టీడీపీని మట్టి కరిపించడానికి కృషి చేస్తున్నారు. పలాసలో కొత్తవారి మధ్య పోటీ పలాసలో వైఎస్సార్సీపీ తరఫున యువ వైద్యుడు సీదిరి అప్పలరాజు పోటీచేస్తుండగా, ఆయనకు పోటీగా గౌతు శివాజీకి బదులు ఆయన కుమార్తె శిరీషకు టీడీపీ టికెట్ ఇచ్చింది. పలాస బరిలో పోటీ చేస్తున్న ఇద్దరు ప్రధాన ప్రత్యర్థులు కొత్తగా రాజకీయాల్లో అడుగుపెట్టినవారే. సిట్టింగ్‌ల వైపే వైఎస్సార్సీపీ మొగ్గు పాలకొండలో వైఎస్సార్సీపీ సిటింగ్ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతినే జగన్ మరోసారి బరిలోకి దించారు. గత ఎన్నికలలో ఆమె చేతిలో ఓడిపోయిన నిమ్మక జయకృష్ణనే టీడీపీ ఈసారి కూడా నమ్ముకుంది. రాజాంలో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే కంబాల జోగులు మరోసారి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. అయితే గత ఎన్నికలలో టీడీపీ తరఫున పోటీచేసి ఓడిపోయిన కావలి ప్రతిభాభారతిని కాదని, అదే ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా కనీసం డిపాజిట్ కూడా దక్కని కొండ్రు మురళీమోహన్ను ఇటీవల టీడీపీ పార్టీలోకి చేర్చుకుని టికెట్ ఇచ్చింది. గతంలో పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న కొండ్రు దూకుడు కూడా జిల్లా ప్రజలకు తెలిసిందే. అలాంటి కొండ్రు కన్నా సౌమ్యుడైన జోగులుకే రాజాం ప్రజలు పట్టం కడతారనే విశ్లేషణలు ఉన్నాయి. ఇచ్ఛాపురంలో మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్‌కు పోటీగా టీడీపీ తరఫున బెందాళం అశోక్ మరోసారి బరిలోకి దిగుతున్నారు. ఇటీవలే టీడీపీలోకి వెళ్లిన యాదవ సంఘ నాయకుడు నర్తు నరేంద్ర యాదవ్ అక్కడి పరిస్థితుల్లో ఇమడలేక మళ్లీ వైఎస్సార్సీపీలోకి వచ్చేశారు. మరో మాజీ ఎమ్మెల్యే నరేష్కుమార్ అగర్వాల (లల్లూ) కూడా చేరడంతో ఇప్పుడు ఇచ్ఛాపురంలో వైఎస్సార్సీపీ బలీయంగా కనిపిస్తోంది. ఇక ఎచ్చెర్లలో కిమిడి కళావెంకటరావుకే టీడీపీ మరోసారి టికెట్ ఇచ్చింది. గత ఎన్నికలలో స్వల్ప తేడా ఆయన చేతిలో ఓటమి చూసిన గొర్లె కిరణ్‌కుమార్ ఈసారి కూడా వైఎస్సార్సీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. అవినీతి టీడీపీ నాయకులను ప్రజలు తిప్పికొట్టి ఈసారి ఫ్యాన్‌కే ప్రజలు పట్టం కడతారని కిరణ్‌కుమార్ బలంగా చెబుతున్నారు. గత ఎన్నికలలో వైఎస్సార్సీపీ జెండాపై గెలిచి టీడీపీ ప్రలోభాలతో ఫిరాయించిన కలమట వెంకటరమణ మరోసారి పాతపట్నంలో పోటీపడటానికి నానా అగచాట్లు పడాల్సి వచ్చింది. తాను నమ్మి వెళ్లిన టీడీపీ అధిష్టానమే అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనకు టికెట్ ఇచ్చేందుకు తటాపటాయించాల్సి వచ్చింది. చివరి నిమిషంలో సీటు తెచ్చుకున్నా వైఎస్సార్సీపీ తరఫున రెడ్డి శాంతి రూపంలో గట్టి పోటీ ఎదురవుతోంది. శాంతి ఇప్పటికే నియోజకవర్గంలోని ఐదు మండలాల్లోనూ గ్రామగ్రామాన పార్టీని పటిష్టం చేస్తూ వచ్చారు. ఆమె కృషికి తగినట్లుగానే వైఎస్సార్సీపీలోకి చేరికలు కూడా భారీగా సాగుతున్నాయి. -
హ్యాట్రిక్ విజయాలు వీరి సొంతం
సాక్షి, శ్రీకాకుళం : ఆటలోనైనా.. ఎన్నికల్లో అయినా హ్యాట్రిక్ విజయాలు సాధించడం గొప్ప విషయమే. క్రికెట్ ఆటలోనే ఎక్కువ హ్యాట్రిక్ ప్రస్తావన వస్తుంది. వరుసగా మూడు వికెట్లు తీస్తే హ్యాట్రిక్ అని బౌలర్‌ను ఆకాశానికి ఎత్తేస్తారు. అలాంటిది ఎన్నికల్లో హ్యాట్రిక్ సాధిస్తే.. అంతకన్నా గొప్ప విషయమే. అందరికీ ఇది సాధ్యం కాదు. అన్ని వేళలా ప్రజలకు అండగా ఉంటూ.. వారి మెప్పు పొందిన వారికే ఇలాంటి రికార్డు దక్కుతుంది. ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు విజయం సాధించిన వారు అరుదుగా ఉంటారు. ఆ ఖ్యాతి దక్కించుకున్నవారు శ్రీకాకుళం జిల్లాలో 17 మంది ఉన్నారు. ఆనాటి తరం నాయకులు గౌతులచ్చన్న, లుకలాపు లక్ష్మణదాసు, పోతుల గున్నయ్య, శిమ్మ జగన్నాథం, తమ్మినేని పాపారావు, కింజరాపు ఎర్రన్నాయుడు, నిమ్మక గోపాలరావులతో పాటు ఈ తరంలో కూడా చాలామంది ఉన్నారు. రాష్ట్రంలో తొలి మహిళా స్పీకరుగా గుర్తింపు పొందిన కావలి ప్రతిభా భారతి ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి వరుసగా 1985, 89, 94, 99 ఎన్నికల్లో విజయం సాధించారు. 2004లో వైఎస్ఆర్ ప్రభంజనంలో ఓటమి పొందారు. నరసన్నపేట నియోజకవర్గం నుంచి శిమ్మ జగన్నాథం 1955 నుంచి 1972 వరకూ వరుసగా గెలుపొందారు. ధర్మాన కృష్ణదాసు 2004, 2009, 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో విజయం పొంది హ్యాట్రిక్ నమోదు చేశారు. శ్రీకాకుళం నియోజకర్గం నుంచి గుండ అప్పలసూర్యనారాయణ, ధర్మాన ప్రసాదరావులు వరుస విజ యాలు సాధించారు. అప్పలసూర్యనారాయణ 1985 నుంచి 1999 వరకూ వరుస ఎన్నికల్లో విజయం సాధించా రు. 2004 నుంచి ఆయనకు అపజయాలు పలకరిస్తున్నాయి. ధర్మాన ప్రసాదరావు 1999, 2004, 2009 ఎన్నికల్లో వరుసగా గెలుపొందారు. నరసన్నపేట నుంచి 1999లో ప్రత్యర్థి బగ్గు లక్ష్మణరావుపై గెలవగా, 2004, 09 ఎన్నికల్లో వరుసగా శ్రీకాకుళం నుంచి గుండ అప్పలసూర్యనారయణపై విజయం సాధించి హ్యాట్రిక్ నమోదు చేశారు. పాతపట్నం నియోజకవర్గం నుంచి కలమట మోహనరావు ఐదుసార్లు గెలుపొందారు. 1978లో గెలిచి అనంతరం ఒకసారి ఓటమి పొందారు. తరువాత ఎన్నికల్లో 89, 94, 99, 2004ల్లో వరుసగా విజయం సాధించి ఆ నియోజకవర్గంలో తనదైన ముద్ర వేశారు. లుకలావు లక్ష్మణదాసు ఐదుసార్లు గెలుపొందగా పాతపట్నం (ద్విసభ్య) నియోజకవర్గం నుంచి 1952, 55, 62ల్లో గెలుపొంది హ్యాట్రిక్ నమోదు చేశారు. జిల్లాలో మొదట హ్యాట్రిక్ విజయం సాధించింది ఈయనే.. ఆమదాలవలస నుంచి తమ్మినేని సీతారాం 1998, 85,ఎన్నికల్లో గెలిచి 89లో ఓటమి పొందారు. 1991 లో జరిగిన ఉప ఎన్నికల్లో రాజకీయ కురువృద్ధుడు బొడ్డేపల్లి రాజగోపాలరావును ఓడించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందిన తమ్మినేని 1994, 99 ఎన్నికల్లో కూడా విజయం సాధించి హ్యాట్రిక్ నమోదు చేశారు. పార్వతీపురం ప్రాంతానికి చెందిన పోతుల గున్నయ్య 1952లో చీపురుపల్లి, 55లో పాతపట్నం, 62లో కొత్తూరు, 67లో పాతపట్నం నియోజకవర్గాల నుంచి వరుసగా గెలుపొందారు. కింజరాపు ఎర్రన్నాయుడు 1983 నుంచి 94 వరకూ వరుసగా విజయాలు సాధించారు. 83, 85 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి గెలిచారు. 89లో టీడీపీ టికెట్ నిరాకరించడంతో ఇండిపెండెంట్‌గా పోటిచేసి ఘనవిజయం నమోదు చేశారు. 1996లో జరిగిన ఉప ఎన్నికల్లో హరిచ్చంద్రపురం నుంచి అరంగేట్రం చేసిన కింజరాపు అచ్చన్నాయుడు 99, 2004, సంవత్సరాల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి హ్యాట్రిక్ నమోదు చేశారు. ఇచ్ఛాపురం నుంచి ఎంవీ కృష్ణారావు 1983, 85, 89 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించారు. కొత్తూరు ఎస్సీ నియోజకవర్గం నుంచి నిమ్మక గోపాలరావు నాలుగుసార్లు గెలిచారు. 1972లో రాజకీయంలో ప్రవేశించిన ఆయన 1989, 94, 99 సంవత్సరం ఎన్నికల్లో వరుసగా విజయం సాధించారు. అంతకు ముందు 1983లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. తరువాత 1985లో జరిగిన ఎన్నికల్లో ఓటమి పొందారు. కిమిడి కళా వెంకటరావు కూడా 1983, 85, 89 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించారు. పూర్వపు నగిరికటకం (ప్రస్తుతం ఆమదాలవలస) నియోజకవర్గం నుంచి తమ్మినేని పాపారావు కూడా హ్యాట్రిక్ విజయం నమోదు చేశారు. గౌతు లచ్చన్న సోంపేట నియోజకవర్గం నుంచి ఐదు సార్లు వరుసగా విజయం పొందారు.అలాగే ఈయన కుమారుడు గౌతు శ్యామసుందర శివాజీ కూడా నాలుగుసార్లు గెలుపొందారు. -
డ్వాక్రా,వ్యవసాయ రుణాలేమయ్యాయి?
-
టీడీపీ కార్యకర్తలే కొంగ దీక్ష అంటున్నారు : ధర్మాన
సాక్షి, శ్రీకాకుళం : వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర ముగింపు సభ చరిత్రలో నిలిచి పోయే విధంగా ఈనెల 9న ఇచ్చాపురంలో జరగనుందని వైఎస్సార్సీపీ రీజినల్ కోఆర్డినేటర్ ధర్మాన ప్రసాదరావు అన్నారు. గతంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర వల్ల ఎటువంటి మార్పు రాష్ట్రంలో వచ్చిందో మళ్లీ వైఎస్ జగన్ పాద యాత్రతో అటువంటి మార్పే వస్తుందని తెలిపారు. గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను పూర్తి చేశామని సీఎం చంద్రబాబు నాయుడు ధైర్యంగా చెప్పగలరా అని ప్రశ్నించారు. తనకుతానుగా గొప్పవాడు అని చెప్పుకునే వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు. సింగపూర్ కంపెనీలతో పెట్టుకున్న అగ్రి మెంటులను పబ్లిక్ డొమైన్లో పెట్టగలరా అని నిప్పులు చెరిగారు. 'ధర్మపోరాట దీక్షను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కొంగ దీక్ష అంటున్నారు. అవినీతిలో దేశంలోనే నుంబర్ వన్ రాష్ట్రంగా ఏపీని తయారు చేశారు. సమర్ధవంతమైన పాలన అంటే ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలియదు. తెలుగుదేశం కార్యకర్తల జేబులు నింపేందుకే నీరు మీరు కార్యక్రమం పెట్టారు. మీ ప్రభుత్వంలో పని చేసిన ప్రధాన కార్యదర్శిలే బయటకు వచ్చి మీరు చేసిన అవినీతి గురించి చెబుతున్నారు. మొదటి విడత ఇల్లులకు బిల్లులు చేయకుండా ఇప్పుడు జన్మభూమిలో ఇల్లు మంజూరు అంటున్నారు, ఇది ప్రజలను మోసం చేయడం కాదా? ఆరోగ్యశ్రీ కి ఇప్పటికీ బిల్లులు చెల్లించలేని ముఖ్యమంత్రిది సమర్థవంతమైన పాలనంటరా ? ప్రజలు పెద్ద ఎత్తున ప్రశ్నించే పరిస్థితి ఉంది. వైఎస్ జగన్ కేంద్రాన్ని అడగడం లేదు అనడం ఎంతవరకు సమంజసం. ప్రధాని నరేంద్రమోదీని ప్రశ్నించే ముందు చంద్రబాబును ప్రశ్నించాలి. రూల్స్ వ్యతిరేకంగా కేబినెట్లో తీసుకున్న అన్ని నిర్ణయాలను రేపు ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే బయట పెడతాం. ఒక ప్రతిపక్ష నాయకుడు సుదీర్ఘ కాలం పాదయాత్ర చేస్తున్నారంటే ఆ ప్రభుత్వం విఫలమైందని చెప్పడానికి నిదర్శనం' అని ధర్మాన ప్రసాదరావు అన్నారు. -
సీఎంగా చంద్రబాబు ఘోర వైఫల్యం
సాక్షి, హైదరాబాద్: చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఘోరంగా విఫలమయ్యారని, తన వైఫల్యాలన్నింటినీ అధికారుల మీద వేసి తాను తప్పించుకోవాలని చూస్తున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు ధ్వజమెత్తారు. టీడీపీ కార్యకర్తలను చట్టానికి అతీతులుగా చూడాలని, వారెలాంటి అక్రమాలు, అవినీతికి పాల్పడినా చూసీ చూడనట్టుండాలని, చంద్రబాబు తొలి కలెక్టర్ల సమావేశంలో ఆదేశించారని గుర్తుచేశారు. పరిపాలన గాడి తప్పే దిశలోకి తీసుకు వెళుతున్నారని తమ పార్టీ అప్పుడే హెచ్చరించిందని, ఇప్పుడదే అక్షరాలా నిజమైందని చెప్పారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ధర్మాన మాట్లాడుతూ... చంద్రబాబు తాను చేసిన తప్పులను ఎవరి మీదకు నెట్టాలన్న తపనే కలెక్టర్ సదస్సులో ఎక్కువగా కనిపించిందన్నారు. -
మహిళా సంక్షేమానికి ప్రాధాన్యం
శ్రీకాకుళం అర్బన్, న్యూస్‌లైన్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సంక్షేమ పథకాల్లో మహిళలకు పెద్దపీట వేస్తామని ఆ పార్టీ శ్రీకాకుళం అసెంబ్లీ, లోక్‌సభ సమన్వయకర్తలు ధర్మాన ప్రసాదరావు, రెడ్డి శాంతి పేర్కొన్నారు. శ్రీకాకుళంలోని 30వ వార్డు కస్పావీధి, చంపాగల్లివీధి, సరంగడోలవీధి, ఎచ్చెర్లవీధి, కుమ్మరవీధి, కొల్లావారివీధి తదితర ప్రాంతాల్లో వారిద్దరూ శనివారం పర్యటించి ఇంటింటికీ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలు ప్రజలకు వివరించి ఫ్యాన్ గుర్తుపైనే ఓటు వేసి వైఎస్ జగన్మోహన్రెడ్డిని సీఎం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే డ్వాక్రా రుణాలు మాఫీ చేసి మహిళలకు అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. పేద, సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రతి మండలంలో ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసి అన్ని పథకాలకు సంబంధించిన కార్డులను అక్కడే జారీ చేయడం జరుగుతుందన్నారు. తండ్రి ఆశయం కోసం పోరాటం సాగించే కొడుకుగా జగన్మోహనరెడ్డి చరిత్రలో నిలిచిపోతారన్నారు. మహానేత ఆశయాలు చిత్తశుద్ధితో నెరవేర్చేందుకు వైఎస్ఆర్ సీపీని గెలిపించి జగన్‌ని ముఖ్యమంత్రిగా చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. రెడ్డి శాంతి మాట్లాడుతూ దివంగత వైఎస్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ద్వారా ఎంతోమంది పేద విద్యార్థులు ఇంజినీరింగ్, మెడిసిన్ వంటి ఉన్నతవిద్యనభ్యసించారన్నారు. అదే బాట లో జగన్ కూడా అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టడంద్వారా ఎల్కేజీ నుంచి పీజీ వరకూ ఉచిత విద్య అందించనున్నారన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చెందుకు అంతా ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ప్రచార కార్యక్రమంలో పార్టీ నేతలు ఎం.వి.పద్మావతి, చల్లా అలివేలు మంగ, పైడి రాజారావు, అంధవరపు సూరిబాబు, జె.ఎం.శ్రీనివాస్, అబ్దుల్ రెహమాన్, టి.కామేశ్వరి, ఎన్ని ధనుంజయ్, మండవిల్లి రవి, కె.ఎల్. ప్రసాద్, శిమ్మ వెంకట్రావు, గుడ్ల మల్లేశ్వరరావు, రావాడ జోగినాయుడు, శ్రీనివాస్ పట్నాయక్, కూన వాసుదేవరావు, అంధవరపు రామ, పుట్టా వెంకటి, శాసనపురి శ్రీనివాస్, హరిసింగ్, పాలిశెట్టి కేశవ, లంక రమేష్, వట్టి చిన్నబాబు, చిట్టి మాస్టారు, డాక్టర్ లక్ష్మణ, సోమేష్ పాల్గొన్నారు. -
అధిష్టానాన్ని ఎదిరించైనా సమైక్యాంధ్ర సాధిస్తాం: ధర్మాన
కాంగ్రెస్ అధిష్టానాన్ని ఎదిరించైనా సమైక్యాంధ్రను సాధించుకుంటామని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆదివారం శ్రీకాకుళంలో స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించామని ఆయన పేర్కొన్నారు. అలాగే అదే జిల్లాకు చెందిన మంత్రి కొండ్రు మురళి ఆదివారం శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ప్రసంగిస్తూ...హైదరాబాద్ అభివృద్ధిలో తెలుగువారందరూ భాగస్వాములే అని స్ఫష్టం చేశారు. రాష్ట విభజనపై తెలుగుదేశం, భారతీయ జనతాపార్టీలు స్ఫష్టమైన లేఖలు ఇచ్చాయని ఆయన తెలిపారు. ఆ నేపథ్యంలో రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ ప్రకటన చేయావలసి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. విభజనకు అనుకూలంగా లేఖలు ఇచ్చిన ఆ రెండు పార్టీలు తమ లేఖలను ఉపసంహరించుకుంటే విభజన ప్రక్రియను తాము అడ్డుకుంటామని కొండ్రు మురళి ఈ సందర్బంగా వెల్లడించారు. -
ధర్మాన సహా ఐదుగురు ఎమ్మెల్యేల రాజీనామా
సీఎంకు లేఖల సమర్పణ సాక్షి, హైదరాబాద్: సమైక్యాంధ్రకు మద్దతుగా మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుతో పాటు శ్రీకాకుళం జిల్లాకు చెందిన నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శాసనసభ్యత్వాలకు రాజీనామా చేశారు. శుక్రవారం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిసి తమ రాజీనామా పత్రాలను ఆయనకు అందజేశారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని, తమ ప్రాంత ప్రజల మనోభావాలకు అనుగుణంగా తాము రాజీనామా చేశామని స్పష్టంచేశారు. తాము కూడా ప్రజల వెంటే నడుస్తామని ప్రకటించారు. రాష్ట్రం సమైక్యంగా ఉంచాలని, అలా కాని పక్షంలో తమ రాజీనామా పత్రాలను శాసనసభాపతికి పంపించాలని వారు సీఎంను కోరారు. దర్మానతో పాటు జుట్టు జగన్నాయకులు, కొర్ల భారతి, మీసాల నీలకంఠంనాయుడు, బొడ్డేపల్లి సత్యవతి రాజీనామా చేసిన వారిలో ఉన్నారు. వీరితో పాటు ఎమ్మెల్సీ విశ్వప్రసాద్ కూడా మండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. అనంతరం ధర్మాన తదితరులు అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల ఆకాంక్ష మేరకు నడచుకుంటామని ముఖ్యమంత్రికి స్పష్టం చేశామన్నారు. రాష్ట్ర విభజనతో తలెత్తే సమస్యలపై సీఎం కిరణ్ లేవనెత్తిన సందేహాలు వాస్తవమేనని, ఆయన వాదనను తాము సమర్థిస్తున్నామని చెప్పారు. విభజన అంశంపై అసెంబ్లీలో కానీ లేదా ఏ వేదికపైనైనా చర్చ జరిగితే సమైక్యాంధ్రప్రదేశ్ వాదనను గట్టిగా వినిపిస్తామని చెప్పారు. -
మంత్రి ధర్మాన, సబితాల జ్యుడీషియల్ కస్టడీకి నో: సీబీఐ ప్రత్యేక కోర్టు
సాక్షి, హైదరాబాద్: వైఎస్ జగన్మోహన్రెడ్డి కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారానికి సంబంధించి నిందితులుగా ఉన్న మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డిలకు సీబీఐ ప్రత్యేక కోర్టులో ఊరట లభించింది. కేసును ప్రభావితం చేసేలా తరచుగా మీడియాతో మాట్లాడుతున్న వీరిద్దరినీ జ్యుడీషియల్ కస్టడీకి పంపాలని కోరుతూ సీబీఐ దాఖలు చేసిన మెమోను ప్రత్యేక కోర్టు బుధవారం కొట్టివేసింది. వీరిద్దరూ మీడియాతో మాట్లాడిన సీడీలను పూర్తిగా పరిశీలించామని, వీరి వ్యాఖ్యలు సాక్షులను ప్రభావితం చేసేలా లేవని ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావు తన ఉత్తర్వుల్లో అభిప్రాయపడ్డారు. సీబీఐ సమర్పించిన అన్ని రికార్డులను పరిశీలించామని, వారు చేసిన నేరారోపణలకు సంబంధించి ఆధారాలేవీ కనిపించడంలేదని స్పష్టంచేశారు. ధర్మాన, సబితలు చేసిన వ్యాఖ్యల్లో ఎటువంటి దురుద్దేశం లేదన్నారు. అయినా సాక్షులు వాటిని తప్పుగా అర్థం చేసుకుంటే అందుకు వీరు బాధ్యులు కారని తేల్చిచెప్పారు. వీరిద్దరినీ జ్యుడీషియల్ కస్టడీకి పంపాలని కోరుతూ సీబీఐ వేసిన మెమోలో సరైన కారణాలేవీ లేవని న్యాయమూర్తి స్పష్టంగా చెప్పారు. ‘‘మంత్రివర్గ సమష్టి నిర్ణయాల మేరకే వ్యవహరించామని, తాము ఎటువంటి తప్పు చేయలేదని మీడియా ద్వారా ప్రజలకు వివరించడమే మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డిలు చేసిన తప్పా? సీబీఐ తరఫున వాదనలు వినిపిస్తున్న అదనపు సొలిసిటర్ జనరల్ అశోక్‌భాన్ మీడియాతో మాట్లాడితే తప్పు లేనప్పుడు.. ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు మాట్లాడితే చట్ట విరుద్ధం ఎలా అవుతుంది. దర్యాప్తు చేస్తున్నప్పుడు, చార్జిషీట్ దాఖలు చేసినప్పుడు ధర్మాన, సబితలు సాక్షులను ప్రభావితం చేయనప్పుడు.. ఇప్పుడెలా చేస్తారు? మంత్రులుగా ఉన్నపుడు సాక్షులను ప్రభావితం చేయని వారు మంత్రి పదవులు కూడా లేని ఈ సమయంలో ఎలా చేస్తారు? చార్జిషీట్ దాఖలు చేసిన తర్వాత కూడా వీరిని కస్టడీకి తీసుకోవాలని సీబీఐ కోరలేదు కదా!! కోర్టు ప్రశ్నించినప్పుడు సైతం సమన్లు ఇస్తే సరిపోతుందని పేర్కొంది కదా!! అందుకని సహేతుకమైన కారణాలు చెప్పకుండా వీరిని జ్యుడీషియల్ కస్టడీకి పంపాలని కోరుతూ సీబీఐ దాఖలు చేసిన మెమో విచారణార్హం కాదు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రపతి, గవర్నర్లను కలిసి కళంకిత మంత్రులంటూ ధర్మాన, సబితలపై ఫిర్యాదు చేశారు. వాటికి సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులుగా వారిపై ఉంది. ఆరోపణలకు వివరణ ఇవ్వకపోతే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయి. అందుకే వారు మీడియాతో మాట్లాడారు. తాము ఎటువంటి తప్పు చేయలేదని, తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటామని, న్యాయవ్యవస్థపై తమకు పూర్తి విశ్వాసం ఉందని మాత్రమే వారు వ్యాఖ్యానించారు’’ అని మంత్రుల తరఫున న్యాయవాది ఉమామహేశ్వర్రావు చేసిన వాదనతో న్యాయస్థానం ఏకీభవించింది.