మహిళా సంక్షేమానికి ప్రాధాన్యం
శ్రీకాకుళం అర్బన్, న్యూస్‌లైన్:
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సంక్షేమ పథకాల్లో మహిళలకు పెద్దపీట వేస్తామని ఆ పార్టీ శ్రీకాకుళం అసెంబ్లీ, లోక్‌సభ సమన్వయకర్తలు ధర్మాన ప్రసాదరావు, రెడ్డి శాంతి పేర్కొన్నారు. శ్రీకాకుళంలోని 30వ వార్డు కస్పావీధి, చంపాగల్లివీధి, సరంగడోలవీధి, ఎచ్చెర్లవీధి, కుమ్మరవీధి, కొల్లావారివీధి తదితర ప్రాంతాల్లో వారిద్దరూ శనివారం పర్యటించి ఇంటింటికీ ప్రచార కార్యక్రమం నిర్వహించారు.
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలు ప్రజలకు వివరించి ఫ్యాన్ గుర్తుపైనే ఓటు వేసి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని సీఎం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే డ్వాక్రా రుణాలు మాఫీ చేసి మహిళలకు అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. పేద, సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రతి మండలంలో ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసి అన్ని పథకాలకు సంబంధించిన కార్డులను అక్కడే జారీ చేయడం జరుగుతుందన్నారు.
తండ్రి ఆశయం కోసం పోరాటం సాగించే కొడుకుగా జగన్‌మోహనరెడ్డి చరిత్రలో నిలిచిపోతారన్నారు. మహానేత ఆశయాలు చిత్తశుద్ధితో నెరవేర్చేందుకు వైఎస్‌ఆర్ సీపీని గెలిపించి జగన్‌ని ముఖ్యమంత్రిగా చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. రెడ్డి శాంతి మాట్లాడుతూ దివంగత వైఎస్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ద్వారా ఎంతోమంది పేద విద్యార్థులు ఇంజినీరింగ్, మెడిసిన్ వంటి ఉన్నతవిద్యనభ్యసించారన్నారు. అదే బాట లో జగన్ కూడా అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టడంద్వారా ఎల్‌కేజీ నుంచి పీజీ వరకూ ఉచిత విద్య అందించనున్నారన్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చెందుకు అంతా ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని పిలుపునిచ్చారు.
ప్రచార కార్యక్రమంలో పార్టీ నేతలు ఎం.వి.పద్మావతి, చల్లా అలివేలు మంగ, పైడి రాజారావు, అంధవరపు సూరిబాబు, జె.ఎం.శ్రీనివాస్, అబ్దుల్ రెహమాన్, టి.కామేశ్వరి, ఎన్ని ధనుంజయ్, మండవిల్లి రవి, కె.ఎల్. ప్రసాద్, శిమ్మ వెంకట్రావు, గుడ్ల మల్లేశ్వరరావు, రావాడ జోగినాయుడు, శ్రీనివాస్ పట్నాయక్, కూన వాసుదేవరావు, అంధవరపు రామ, పుట్టా వెంకటి, శాసనపురి శ్రీనివాస్, హరిసింగ్, పాలిశెట్టి కేశవ, లంక రమేష్, వట్టి చిన్నబాబు, చిట్టి మాస్టారు, డాక్టర్ లక్ష్మణ, సోమేష్ పాల్గొన్నారు.