reddy shanti
-
గత ప్రభుత్వం మహిళలను దగా చేసింది
-
రాష్ట్రంలో ప్రతి మహిళ గర్వపడేలా...
-
శాసనసభకు ఎన్నికైన మేము...
సాక్షి, శ్రీకాకుళం: రాష్ట్ర శాసనసభ కొలువుదీరింది. ప్రజాక్షేత్రంలో విజయాన్ని దక్కించుకున్న జిల్లాకు చెందిన పదిమంది ఎమ్మెల్యేలు శాసనసభలో సభ్యులుగా ప్రమాణం చేశారు. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత శాసనసభ తొలి సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ సభలో ఆరోసారి అడుగుపెడుతున్న ఆమదాలవలస ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం అత్యంత సీనియర్ నాయకుడిగా నిలిచారు. శాసనసభాపతిగా గురువారం ఆయన ఎన్నిక లాంఛనప్రాయమే! రెడ్డి శాంతి, డాక్టర్ సీదిరి అప్పలరాజు, గొర్లె కిరణ్‌కుమార్ తొలిసారిగా శాసనసభలో అడుగుపెట్టారు. ఎన్నో విశేషాలు ఈసారి శాసనసభలో జిల్లాకు సంబంధించి అనేక విశేషాలున్నాయి. పది నియోజకవర్గాల్లో ఎనిమిది చోట్ల వైఎస్సార్సీపీ విజయకేతనం ఎగురవేసింది. 2014 ఎన్నికలలో మూడు స్థానాలకే పరిమితమైన వైఎస్సార్సీపీ ఈసారి మాత్రం తిరుగులేని ఆధి క్యం సాధించింది. అధికార పార్టీగా బరిలోకి దిగిన టీడీపీ చావుతప్పి లొట్టబోయి రెండు స్థానాలకు పరిమితమైంది. ఇచ్ఛాపురం నియోజకవర్గం నుంచి బెందాళం అశోక్ రెండోసారి గెలుపొందారు. గత ఐదేళ్లలో జిల్లా మంత్రిగా చక్రం తిప్పిన కింజరాపు అచ్చెన్నాయుడికి టెక్కలిలో మరోసారి గె లుపొందడానికి ముచ్చెమటలు పట్టాయి. ఐదోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన ఈసారి టీడీపీ శాసనసభాపక్ష ఉపనేతగా బుధవారం అడుగుపెట్టారు. శాసనసభలో సీనియారిటీ... ఎన్నోసారి ఎంతమంది ఎవరు ఆరోసారి ఒకరు తమ్మినేని సీతారాం (ఆమదాలవలస) ఐదోసారి ఇద్దరు ధర్మాన ప్రసాదరావు (శ్రీకాకుళం) కింజరాపు అచ్చెన్నాయుడు (టెక్కలి) నాలుగోసారి ఒకరు ధర్మాన కృష్ణదాస్ (నరసన్నపేట) మూడోసారి ఒకరు కంబాల జోగులు (రాజాం) రెండోసారి ఇద్దరు విశ్వాసరాయి కళావతి (పాలకొండ) బెందాళం అశోక్ (ఇచ్ఛాపురం) తొలిసారి ముగ్గురు రెడ్డి శాంతి (పాతపట్నం) డాక్టరు సీదిరి అప్పలరాజు (పలాస) గొర్లె కిరణ్‌కుమార్ (ఎచ్చెర్ల) అత్యంత సీనియర్ తమ్మినేని ఆమదాలవలస నుంచి ఆరోసారి విజయం సాధించిన తమ్మినేని సీతారాం జిల్లాలోనే సీనియర్ నాయకుడిగా నిలిచారు. 1983లో టీడీపీ అభ్యర్థిగా తొలిసారి పోటీ చేసిన ఆయన నాటి కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే పైడి శ్రీరామమూర్తిని ఓడించారు. 1985 ఎన్నికలలోనూ ఆయనపైనే గెలిచినా 1989లో మాత్రం పరాజయం తప్పలేదు. కానీ శ్రీకాకుళం రాజకీయ ఉద్దండుడైన బొడ్డేపల్లి రాజగోపాలరావును 1991 ఉప ఎన్నికలలో ఓడించి సంచలనం సృష్టించారు. టీడీపీ నుంచే 1994, 1999 ఎన్నికలలోనూ విజయం సాధించారు. అయితే 2004లో మాత్రం మహానేత డాక్టరు వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభంజనంతో ఓటమి తప్పలేదు. తర్వాత 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసినా బొడ్డేపల్లి సత్యవతి చేతిలో ఓడిపోయారు. 2014లోనూ త్రుటిలో విజయం చేజారింది. ఇలా వరుసగా మూడుసార్లు ఓటమి ఎదురైనా మొక్కవోని దీక్షతో, వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభంజనంతో 2019 ఎన్నికలలో ఘన విజయం సాధించారు. బుధవారం ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. శాసనసభాపతిగా గురువారం ఆయన ఎన్నిక లాంఛనప్రాయం కానుంది. జిల్లా నుంచి ఈ పదవిని నిర్వహించిన మూడో వ్యక్తిగా సీతారాం నిలిచారు. గతంలో తంగి సత్యనారాయణ, కావలి ప్రతిభాభారతి స్పీకరుగా పనిచేశారు. నాడు తమ్ముడు... నేడు అన్న... నరసన్నపేట నియోజకవర్గం నుంచి 1989, 1999 ఎన్నికలలోనూ, తర్వాత శ్రీకాకుళం నుంచి 2004, 2009 ఎన్నికలలోనూ, తాజాగా 2019 ఎన్నికలలోనూ విజయం సాధించిన ధర్మాన ప్రసాదరావు నలుగురు ముఖ్యమంత్రుల మంత్రివర్గంలో పని చేశారు. ఇప్పుడు అదే నరసన్నపేట నుంచి నాలు గోసారి భారీ మెజార్టీతో గెలుపొందిన ఆయన అన్న ధర్మాన కృష్ణదాస్ వైఎస్ జగన్మోహన్రెడ్డి మంత్రివర్గంలో రోడ్లు–భవనాల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. సోదరులిద్దరూ బుధవారం ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరెంతో ప్రత్యేకం... ఎమ్మెల్యేగా మూడోసారి శాసనసభలో అడుగుపెట్టిన కంబాల జోగులు, రెండోసారి అడుగుపెట్టిన విశ్వాసరాయి కళావతి బుధవారం ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. రాజాం నియోజకవర్గంలో 2014 ఎన్నికలలో మాజీ స్పీకరు, మాజీ మంత్రి కావలి ప్రతిభాభారతిని, 2019 ఎన్నికలలో మాజీ మంత్రి కోండ్రు మురళీమోహన్ను మట్టికరిపించిన ఘనత జోగులుకు దక్కుతుంది. ఆ ముగ్గురికీ తొలి అడుగు... 2014 ఎన్నికలలో శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గంలో పోటీ చేసి త్రుటిలో ఓటమి పొందిన రెడ్డి శాంతి ఈసారి మాత్రం పాతపట్నం అసెంబ్లీ నియోజకవర్గంలో ఘన విజయం సాధించారు. గత ఎన్నికలలో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా గెలుపొంది తర్వాత చంద్రబాబు ప్రలోభాలతో టీడీపీలోకి ఫిరాయించిన కలమట వెంకటరమణను కంగుతినిపించారు. తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టిన ఆమె బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఇక గౌతు కుటుంబానికి కంచుకోటగా ఉన్న పలాసలో శివాజీ వారసురాలు శిరీషపై భారీ విజయం సాధించిన డాక్టర్ సీదిరి అప్పలరాజు తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆయనతో పాటు ఎచ్చెర్ల నుంచి విజయం పొందిన గొర్లె కిరణ్‌కుమార్ కూడా ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి కిమిడి కళావెంకటరావు వంటి సీనియర్ నాయకుడిని కిరణ్ అవలీలగా ఓడించారు. -
తొలి గెలుపు అదుర్స్
సాక్షి, శ్రీకాకుళం: ఫ్యాన్ గెలుపు సునామీలో సైకిల్ కొట్టుకుపోయింది. తలపండిన టీడీపీ నేతలకు దిమ్మతిరిగేలా ఓటర్లు షాక్ ఇచ్చారు. అవినీతిపరుల పాలనను మూకుమ్మడిగా తిరస్కరించారు. రాజకీయ ఓనమాలు నేర్చుకుంటున్న నవ నాయకత్వానికి పట్టం కట్టారు. జిల్లాలో ఎచ్చెర్ల, పాతపట్నం, పలాస నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులకు తొలిసారి గెలుపు రుచేంటో చూపించారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో తొలిసారి అడుగిడునున్న రెడ్డి శాంతి, గొర్లె కిరణ్‌కుమార్, సీదిరి అప్పలరాజుల గెలుపునకు దోహదపడిన కొన్ని అంశాలు చదివిద్దేమిలా.. డాక్టర్ దెబ్బకు టీడీపీ కోట బద్దలు మందస: ఓ వైపు సుదీర్ఘ రాజకీయ అనుభవం.. సామ, దాన, భేద, దండోపాయాలు తెలిసిన నాయకత్వం గౌతు శ్యామసుందర శివాజీ సొంతం. మరోవైపు పిన్న వయస్కుడు, అతిసామాన్య కుటుంబం నుంచి వచ్చిన యువ నాయకుడు డాక్టర్ సీదిరి అప్పలరాజు భారతంలోని అభిమన్యుడు లాంటి వాడే. ఈయన కురువృద్ధుడు లాంటి శివాజీ రాజకీయ బాణాలను, పాశుపతాస్త్ర, బ్రహ్మాస్త్రాలతో ఎదుర్కొని జయకేతనం ఎగురవేశారు. వజ్రపుకొత్తూరు మండలంలోని ఓమారుమూల గ్రామమైన దేవునల్తాడలో ఓ సామాన్య మత్స్యకార కుటుంబానికి చెందిన సీదిరి దాలయ్య, నీలమ్మ దంపతులకు అప్పలరాజు జన్మించారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్న సామెతను రుజువు చేస్తూ, విద్యలో మంచి ప్రతిభ చూపారు. ఎంబీబీఎస్ చదివి పలాస–కాశీబుగ్గలో ప్రాక్టీసు చేస్తూ ఎంతో మంచి వైద్యునిగా పేరు తెచ్చుకున్నారు. రెండేళ్ల క్రితం వైఎస్సార్సీపీ అప్పలరాజు ప్రతిభ, నిపుణత చూసి, పలాస నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించింది. ఏమాత్రం రాజకీయ అనుభవం లేకున్నా రాజకీయాల్లో దూసుకుపోయారు. ప్రజల మనసులో మంచిస్థానం సంపాదించగలిగారు. ఈయన్ను ఎదుర్కొనలేక టీడీపీ కుటిల యత్నాలకు దిగింది. ఎన్నికల్లో టీడీపీ తరపున ఎమ్మెల్యే గౌతు శివాజీ, అభ్యర్థిగా శిరీష, ఆమె భర్త వెంకన్నచౌదరి, గౌతు విజయలక్ష్మి, జీకే నాయుడు, పీరికట్ల విఠల్‌రావు, వజ్జ బాబురావు ఇలా ఒకరేమిటి ఎంతోమంది రాజకీయ అనుభవం గల నాయకులు ఒక వైపు.. తానొక్కడే ఒంటిచేత్తో మరో వైపు పోరాడిన అప్పలరాజు సునాయాస విజయాన్ని చేజిక్కించుకున్నారు. అత్యధికంగా ఎమ్మెల్యేగా ఎన్నికైన శివాజీ కుమార్తె శిరీషను ఓడించి, పలాసలో వైఎస్సార్సీపీకి స్థానం కల్పించిన డాక్టర్ సీదిరి అప్పలరాజు రాజకీయ వ్యూహానికి రాజకీయ విశ్లేషకులు కూడా ఆశ్చర్యపోతున్నారు. రెడ్డి శాంతి ప్రభంజనం ఎల్.ఎన్.పేట: పాతపట్నం నియోజకవర్గంలో రెడ్డి శాంతి గెలుపు జన ప్రభంజనంగా నిలిచింది. ఈమెను ఓడించాలని అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు పన్నిన కుయుక్తులు ఓటర్ల సునామీలో కొట్టుకుపోయాయి. స్థానికేతరాలని, ఈమెను కలవాలంటే ఢిల్లీ వెళ్లాలా అంటూ ప్రత్యర్థి పార్టీ నాయకులు చేసిన ప్రచారాన్ని ప్రజలు తిప్పికొట్టారు. వంశధార నిర్వాసితులను బలవంతంగా గ్రామాల నుంచి బయటకు పంపించిన తెలుగుదేశం పార్టీకి వారి ఉసురే తగిలిందని నిర్వాసిత గ్రామాల్లో చర్చించుకుంటున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యే కలమట వెంకటరమణకు నిర్వాసితుల అండగా నిలుస్తారని భావించినప్పటికీ గట్టి గుణపాఠమే చెప్పారు. మెళియాపుట్టి మండలంలో ఆఫ్‌షోర్ రిజర్వాయర్‌లో నష్టపోయిన బాధితుల సమస్యలతోపాటు వంశధార నిర్వాసితుల సమస్యలపైన పోరాటం చేస్తూ అండగా నిలిచిన ఈమె తన విజయానికి బాటలు వేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ తమ్ముళ్లు చేసిన అక్రమాలు ప్రజలకు వివరించడంతోపాటు ప్రజలకు అండగా ఉంటానని నియోజకవర్గం మొత్తంగా పర్యటించినందుకు ప్రజలంతా అక్కున చేర్చుకున్నారు. కిరణ్‌కే పట్టం ఎచ్చెర్ల క్యాంపస్: రాజకీయ కురువృద్ధుడు, మంత్రి కళా వెంకటరావును ఎచ్చెర్ల నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మట్టి కరిపించారు. టీడీపీ పాలనలో ప్రతిపక్ష పార్టీ ఉనికి లేకుండా చేసిన కళాకు ఓటర్లు సైతం గట్టి సమాధానమిచ్చారు. ఈ మేరకు స్థానిక నేత గొర్లె కిరణ్‌కుమార్‌కు బ్రహ్మరథం కట్టారు. 2014 ఎన్నికల్లో కళా వెంకటరావు చేతిలో కిరణ్ ఓటమి చవిచూశారు. అయినప్పటికీ నిరాశ చెందకుండానే వైఎస్సార్సీపీ శ్రేణులతో కలసి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ స్థానిక సమస్యలపై పోరాడుతూ వచ్చారు. ఈ దఫా ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్టు కోసం మీసాల నీలకంఠంనాయుడు కూడా పోటీపడినప్పటికీ కొన్ని నెలల క్రితం ఈయన మంత్రి కళా లాబీయింగ్‌తో టీడీపీలో చేరిపోయారు. దీంతో కిరణ్‌కుమార్‌కు టిక్కెట్టు ఖాయమైంది. ఈ నేపథ్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఆర్థికంగా బలమైన అభ్యర్థి కావటంవ వల్ల కళా విజయం తథ్యంగా టీడీపీ వర్గాలు భావించాయి. అయితే కిరణ్‌కుమార్ స్థానికుడు కావటం, ఎన్నికల్లో ఓడినా నిరంతరం ప్రజల్లో ఉండటంలో అన్ని వర్గాల ప్రజలు మద్దతుగా నిలిచారు. -
బీసీ సంక్షేమం ఎన్నికల ముందే గుర్తొచ్చిందా?
శ్రీకాకుళం, ఎల్.ఎన్.పేట: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీసీలను అణగదొక్కుతునే వస్తున్నారని, న్యాయమూర్తి పదవులకు బీసీలు పనికిరారని కేంద్రానికి నివేదిక పంపించిన ఈ పెద్దమనిషి.. ఎన్నికలు రెండు నెలల్లో వస్తున్నాయనేసరికి బీసీలపై కపట ప్రేమను వలకబోస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి శాంతి దుయ్యబట్టారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. నాలుగున్నరేళ్లు అధికారంలో ఉన్నప్పుడు చేతకాని చంద్రబాబుకు ఎన్నికల్లో గెలిపిస్తే బీసీలకు ప్రత్యేక కార్పొరేషన్ అంటూ హడావుడి చేయడం విడ్డూరంగా ఉందన్నారు. అమరావతి సచివాలయం సాక్షిగా నాయీబ్రాహ్మణలకు తోకలు కత్తిరిస్తాం.. తాట తీస్తామని బెదిరించి, వారి ఆత్మగౌరవాన్ని దెబ్బదీసిన నాయకుడిని ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. విభజన తర్వాత రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీలో బీసీలకు ప్రాధాన్యం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీసీల స్థితిగతులపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి బీసీ సెల్ అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి నేతృత్వంలో ఒక కమిటీ వేశారని గుర్తు చేశారు. ఈ కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు బీసీ గర్జన సమావేశంలో పలు అంశాలపై ప్రకటన చేయనున్నారని పేర్కొన్నారు. -
శ్రీకాకుళం జిల్లాలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం
-
రాజన్న పాలన వైఎస్ జగన్‌తో సాధ్యం
-
రాష్ట్రంలో దోపిడీ పాలన
ఎచ్చెర్ల క్యాంపస్ : దోచుకోవడం, దాచుకోవడానికే తెలుగుదేశం నాయకులు ప్రాధాన్యమిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి ధ్వజమెత్తారు. చిలకపాలెంలో గురువారం ఎచ్చెర్ల నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ప్లీనరీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శ్రీకాకుళం అంటే టీడీపీ ప్రభుత్వానికి చిన్నచూపు ఉందని విమర్శించారు. అమరావతి, భోగాపురంలలో ల్యాండ్ పూలింగ్‌లో అనేక ప్రయోజనాలు కల్పించిన ప్రభుత్వం కొవ్వాడ విషయంలో నిరుపేదల భూములు అక్రమంగా, చౌకగా దోచుకుంటోందని దుయ్యబట్టారు. మంత్రి కళావెంకటరావు అనుచరులు దందాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కొవ్వాడ అణుపార్కుకు సంబంధించి ప్రభుత్వ భూములను దోచుకుంటున్నా సర్కారు చోద్యం చూస్తోందని ధ్వజమెత్తారు. దివాలా సంస్థ వెస్టింగ్ హౌస్‌కు పనులు అప్పగించడం దారుణమన్నారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 2019 ఎన్నికల్లో గెలుపొంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావటం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీ రాష్ట్ర హైవర్ కమిటీ సభ్యుడు తమ్మినేని సీతారాం మాట్లాడుతూ ప్రస్తుతం టీడీపీ అంపశయ్యపై ఉందన్నారు. పార్టీ సమావేశాలకు సైతం డబ్బులు పెట్టి ప్రజలను తరలిస్తున్నారని విమర్శించారు. గడపగడపకు వైఎస్సార్‌లో ప్రభుత్వ వైఫల్యాలు బయటపడ్డాయని చెప్పారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలో 2019లో వైఎస్సార్ సీపీ జెండా ఎగురవేయటం ఖాయమన్నారు. పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ ప్రభుత్వ వ్యతిరేక ఓటు, తటస్థుల ఓట్లు వైఎస్సార్ సీపీకి పడేలా సన్నద్ధం కావాలన్నారు. బూత్ కమిటీల నుంచే సమర్థ నాయకత్వం ఉండాలన్నారు. రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు మాట్లాడుతూ రాష్ట్రంలో నియంతృత్వ ప్రభుత్వం ఉందన్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గ సమన్వయకర్త గొర్లె కిరణ్‌కుమార్ మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో లేని రాష్ట్ర మంత్రి కళావెంకటరావు దోపిడీని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. కొవ్వాడ అణుపార్కు భూముల్లో జరుగతున్న అక్రమాలే ఇందుకు ఉదాహరణగా వివరించారు. ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే మీసాల నీలకంఠంనాయుడు మాట్లాడుతూ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ప్రభుత్వ వైఫల్యాలపై తీర్మానాలు.. ప్రభుత్వ వైఫల్యాలపై చేసిన తీర్మానాలు, ప్రస్తుతం ప్రభుత్వ పథకాలు అమలు తీరుపై నాయకులు విశ్లేషణలు ఆకట్టుకున్నాయి. కార్యకర్తలు చప్పట్లతో తమ మద్దతు తెలియజేశారు. ఉపాధి హామీ అక్రమాలపై సీనియర్ నాయకులు గొర్లె అప్పలనాయుడు, జన్మభూమి కమిటీలు వైఫల్యంపై ఎచ్చెర్ల మండల అధ్యక్షుడు సనపల నారాయణరావు, నీరు–చెట్టు, బెల్టు షాపులు, ఇసుక విధానంపై రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి బల్లాడ జనార్దన రెడ్డి, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌పై జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు టొంపల సీతారాం, అణుపార్కుపై రణస్థలం పార్టీ అధ్యక్షుడు పైడి శ్రీనివాసరావు, భూగర్భజల కాలుష్యంపై మూగి శ్రీరాములు, డ్వాక్రా సంఘాలకు జరుగుతున్న అన్యాయంపై లావేరు పార్టీ అధ్యక్షుడు దన్నాన రాజీనాయుడు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై రణస్థలం జెడ్పీటీసీ సభ్యుడు గొర్లె రాజగోపాల్, ఆరోగ్య శ్రీ, 104, 108 వైఫల్యాలపై బొందు సూర్యనారాయణ, రైతులు, కూలీల సంక్షేమ వైఫల్యంపై జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు రొక్కం బాలకృష్ణ, ప్రజాసంక్షేయ పథకాల అమలు వైఫల్యంపై కేవీవీ సత్యనారాయణ చేసిన ప్రసంగాలు, విశ్లేషణలు ఆకట్టుకున్నాయి. జన్మభూమి కమిటీలు తీవ్రవాదుల కంటే ప్రమాదంగా మారారని, నీరు–చెట్టు పనుల పేరుతో కళావెంటకరావు బినామీ విశ్రాంత ఉద్యోగి మహేష్ దోచుకుంటున్నారని ఘాటైన విమర్శలు చేశారు. కార్యక్రమంలో జిల్లా పార్టీ కార్యదర్శులు పిన్నింటి సాయికుమార్, మాడుగుల మురళీధర్‌బాబా, నాయకులు నక్క కృష్ణమూర్తి, ప్రసాద్, మీసాల అప్పారావు, కేఎల్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
బాబు పర్యటనతో ఒరిగింది శూన్యం
శ్రీకాకుళం అర్బన్: ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనలతో జిల్లా ప్రజలకు ఒరిగిందేమీ లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి అన్నారు. శ్రీకాకుళంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాటాడారు.నరసన్నపేటలో సీఎం పర్యటన కేవలం కాలక్షేపానికే తప్ప ప్రజలకు ఉపయోగపడింది ఏమీ లేదన్నారు. బాబు పర్యటన సందర్భంగా జిల్లాలో వచ్చే నెలలో లక్ష పెన్షన్లు ఇస్తానని, డ్వాక్రా సంఘాలను ఆదుకుంటానని, మత్స్యకార పిల్లలను రెసిడెన్షియల్ స్కూల్లో చేరుస్తామని, నరసన్నపేటలో 50 పడకల ఆస్పత్రి నిర్మిస్తామని, సారవకోటలో బొంతు వద్ద రూ.175 కోట్ల తో ఎత్తిపోతల పథకం, జిల్లాలో వంద రోజుల్లో లక్ష మరుగుదొడ్లు, పైడిభీమవరంలో నాలుగు కంపెనీలు, జిల్లా అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు.. ఇలా మరిన్ని వీలుకాని, ఆచరణలో అమలు సాధ్యంకాని హామీలను సీఎం గుప్పించారని పేర్కొన్నారు. జిల్లావాసుల అమాయకత్వాన్ని, బలహీనతలను ఆసరా చేసుకుని మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. మహిళా సంఘాలకు రుణామఫీ ఏదీ? జిల్లాలో రుణమాఫీ ప్రక్రియను నిలిపివేసి రైతులను న ట్టేట ముంచారన్నారు. జిల్లాలో 39వేల మహిళా సంఘాలు ఉండగా ఒక్క మహిళా సంఘానికీ రుణమాఫీ జరగలేదన్నారు. మహిళలంతా ముఖ్యమంత్రి తన మానసపుత్రికలంటూ ఆ మహిళా సంఘాలనే మట్టుపెట్టేందుకు కంకణం కట్టుకున్నారని విమర్శిం చారు. వంశధార రెండోదశ పనుల నిర్మాణానికి ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం శోచనీయమన్నారు. హుదూద్ తుపానులో దెబ్బతిన్న మత్స్యకారుల కుటుంబాలను ఆదుకుంటామని హామీఇచ్చి, వాటిని గాలికి వదిలేశారని దుయ్యబట్టారు. ఈ హామీలు మరిచారా సీఎంగారూ? ఆమదాలవలసలో చక్కెర కర్మాగారం తెరిపించి ప్రజలకు అంకితం చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చి వాటిని మరిచారన్నారు. భావనపాడు షిప్పింగ్హార్బర్ను బాగు చేయిస్తానని, కోల్డ్‌స్టోరేజీల నిర్మాణం చేపడతానని చెప్పి వాటి ఊసే ఎత్తకపోవడం శోచనీయమన్నారు. జిల్లాలో జీడి పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేసి జీడిపరిశ్రమను ఆదుకుంటామన్నారని, అయితే వాటి ప్రస్తావనే చేయకపోవడం దారుణమన్నారు. ఇటీవల ఎగువసీది గ్రామంలో జ్వరంతో నలుగురు చనిపోగా 15మంది జిల్లా వైద్యశాలల్లో వైద్యం పొందుతున్నారన్నారు. గిరిజనులపై ప్రభుత్వం కనీస శ్రద్ధ చూపకపోవడం దుర్మార్గమన్నారు. విభజన సమయంలో రాష్ట్రానికి 11 జాతీయ సంస్థలు కేటాయిస్తామన్నారని, అందులో ఒక్క జాతీయ సంస్థ కూడా రాలేదన్నారు. రైతులు, మహిళలు, బడుగు, బలహీన వర్గాల అృవద్ధికి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంతోృకషిచేశారని, చంద్రబాబు మాత్రం ఎమ్మెల్యేలు, మంత్రుల కుటుంబాల్లో జరిగే వివాహ వేడుకల మాటున జిల్లాపర్యటనలకు రావడం సిగ్గుచేటని విమర్శించారు. జిల్లా సమస్యల పరిష్కారంపై చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రత్యేక పర్యటనలు పెట్టుకుని ప్రజల సమస్యలు తెలుసుకోవాలని, ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని శాంతి డిమాండ్ చేశారు. అలా పర్యటనలకు వచ్చి అడ్డగోలు హామీలు గుప్పించి పర్యటనలు ముగించడం చంద్రబాబు రాజకీయ ప్రాపకానికి ఎద్దేవా చేశారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడు అంధవరపు సూరిబాబు, పార్టీ నాయకులు ఎన్ని ధనుంజయ్, మండవిల్లి రవి, గొర్లె రాజగోపాల్, తంగుడు నాగేశ్వరరావు, గుడ్ల మల్లేశ్వరరావు, లబ్బ శ్రీను, ఎృకష్ణ తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీకి ఓటు అభివృద్ధికి రూటు...
నరసన్నపేట రూరల్, న్యూస్‌లైన్: వైఎస్సార్సీపీకి ఓటు వేయడం ద్వారా అభివృద్ధికి బాట వేయడమేనని ఆ పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త రెడ్డి శాంతి అన్నారు. మంగళవారం మండలంలోని పలు గ్రామాల్లో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సాగునీటి సమస్య తీరాలన్నా, అర్హులకు పింఛను అందాలన్నా, పిల్లలు చదువుకోవాలనుకున్నా, 9 గంటల విద్యుత్ అందాలన్నా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రాదేశిక ఎన్నికల్లో ఫ్యాన్‌గుర్తుపై ఓటేసి వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే కృష్ణదాస్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. మడపాంలో పిల్లా రమణ, కోమర్తిలో ఉంగటి రాజు, యారబాడులో పుట్టా శిరీష, లుకలాంలో శానాపతి అప్పన్నమ్మ, నడగాంలో లుకలాపు కళావతి పోటీ చేస్తున్నారని చెప్పారు. ఈ సందర్భంగా పార్టీ అభ్యర్థులను పరిచయం చేశారు. మడపాంలో పని చేస్తున్న ఉపాధి వేతనదారుల వద్దకు వెళ్లి మాట్లాడారు. యారబాడు, వీఎన్‌పురం, నర్శింగరాయుడుపేట తదితర గ్రామాల్లో ఓటర్లతో మాట్లాడారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు ఆరంగి మురళీధర్, పొన్నాన దాలినాయుడు, బెహరా అప్పన్న, పతివాడగిరీశ్వరరావు, పుట్టా ఆదిలక్ష్మి, మడ్డు కృష్ట, జాయి శేషు,యాబాజి రమేష్, సురవరపు జగదీశ్వరరావు, ఎస్వీ రమణ,మానికల సూర్యనారాయణ, దుల్ల రమణ,రువ్వవాసు, మామిడి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. రాడ మద్దతు కోరిన శాంతి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రాడ మోహనరావును నడగాంలోని ఆయన స్వగృహంలో వైఎస్సార్సీపీ పార్లమెం టరీ, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు రెడ్డి శాంతి, ధర్మాన కృష్ణదాస్ కలి శారు. త్వరలో జరగనున్న పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులకు మద్దతివ్వాలని కోరారు. పాలవలస రాజశేఖరంతో తన కు ఎంతో అనుబంధం ఉందన్నారు. ఆయనను పార్టీలోకి రావాలని నేతలు ఆహ్వానించారు. బాగున్నారా అంటూ పలకరింపులు జలుమూరు: బాగున్నారా అంటూ అం దరినీ పలకరిస్తూ ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు వైఎస్సార్సీపీ పార్లమెం టరీ నియోజకవర్గ సమన్వయకర్త రెడ్డి శాంతి. మంగళవారం జలుమూరు మం డలంలోని అందవరం, పర్లాం గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి అందరినీ నమస్కరిస్తూ పలకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుత ఎన్నికల్లో జెడ్పీటీసీ ఎంపీటీసీ సభ్యులుగాఎం.విజయశాంతి, కొయ్యాన సుశీల, వెలమల ప్రభావతిని గెలిపించాలని కోరారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ జగన్ అధికారంలోకి వస్తే జిల్లా అభివృద్ధి జరుగుతుందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వి.కృష్ణారావు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు కె. సూర్యారావు, వైఎస్సార్ సీపీ నాయకులు ఎం.రాంబాబు,సర్పంచ్‌లు పి.తవిటినాయడు, కె.కృష్ణవేణి, ఎ.పద్మావతి, కె.మిధున్‌చక్రవర్తి, పి.విఠలరావు, ధర్మాన జగన్, కె.ప్రకాశరావు, ఆర్.నరుసునాయు డు, ఎన్.గోవిందరావు, ఎన్.రామారా వు, కె.ఉత్తరుడు, కె.నాగరాజు, అల్లు రామారావు తదితరులు పాల్గొన్నారు. -
మున్సిపల్ ఎన్నికల్లో ఫ్యాన్ తిరగాలి
ఇచ్ఛాపురం,న్యూస్‌లైన్: మున్సిపల్ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్త రెడ్డి శాంతి కోరారు. ఆది వారం సాయంత్రం మున్సిపాలిటీలోని 5, 6,7, 8, 9 వార్డుల్లో ఎన్నికల ప్రచారాన్ని ఆమె నిర్వహించారు. ఓటర్లను పలకరించి, పార్టీ కరపత్రాలను అందజేస్తూ వైఎస్సార్సీపీని గెలిపించాలని కోరారు. వైఎస్ జగన్‌తోనే రాజన్న రాజ్యం వస్తుందన్నారు. వైఎస్ఆర్సీపీని గెలిపించి మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలన్నా రు. మహిళలు శాంతికి పూల మాలలు వేసి హారతులిచ్చి స్వాగతం పలికారు. కాగా వృద్ధులకు పూలమాల లు వేసి వారిని శాంతి గౌరవించారు. మంగళవారం పేటలొ ఓ వృద్ధురాలు తన ఇంటికి వచ్చిన రెడ్డి శాంతిని అప్యాయంగా పలకరించి వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌కే తన మద్దతు అని చెప్పారు. కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త నర్తు నరేంద్రయాదవ్, మాజీ ఎమ్యెల్యే పిరియా సాయిరాజ్, జిల్లా ఎస్సీసెల్ కన్వీనర్ ఎస్.దేవరాజ్, నాయకులు కాళ్ల దేవరాజ్, ఏఎంసీ చైర్మన్ శ్యాంపురియా, మున్సిపల్ కన్వీనర్స్ పిలక పోలారావు, మున్సిపల్ అభ్యర్థులు సోమయ్య, పి.మంజులత, నం దిక హరిత, పల్లంటి తారకేశ్వరి పాల్గొన్నారు. -
జగన్ చేతిలోనే రాష్ట్ర ప్రగతి
శ్రీకాకుళం అర్బన్, న్యూస్‌లైన్: రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపించగల శక్తిసామర్థ్యాలు గల సాహసోపేత నాయకుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఒక్కరేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాకుళం నియోజకవర్గ సమన్వయకర్త ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. అలాంటి నిబద్ధత కలిగిన జగన్‌ను ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రజలు తోడ్పాటునందించాలని కోరారు. శ్రీకాకుళంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లోక్‌సభ సమన్వయకర్త రెడ్డి శాంతితో కలిసి ఆయన మాట్లాడారు. అధికార కాంక్షతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని విమర్శించారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న తొమ్మిదేళ్ల పాలనలో అనుసరించిన ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలు ఇంకా మరచిపోలేదన్నారు. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు నిరంకుశ విధానాలతో ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న విషయాన్ని ఈ సందర్భంగా ధర్మాన గుర్తు చేశారు. రాష్ట్ర విభజన విషయంలో నోరు మెదపని చంద్రబాబు కొత్త రాష్ట్రాన్ని ఏవిధంగా పునర్నిర్మిస్తారని ప్రశ్నించారు. పార్టీ లోక్‌సభ నియోజకవర్గ సమన్వయకర్త రెడ్డి శాంతి మాట్లాడుతూ వైఎస్జగన్మోహన్రెడ్డిని సీఎం చేయడం ద్వారానే రాష్ట్రంలో మళ్లీ 2004-09నాటి అభివృద్ధి విప్లవం సాధ్యమన్నారు. జిల్లాతోపాటు రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న వెనుకబడిన మత్యకార సామాజికవర్గాన్ని ఎస్టీలలో చేర్పించేందుకు కృషి చేస్తామన్నారు. ఒడిశా, తమిళనాడులలో మత్స్యాకారులను ఎస్టీలుగా గుర్తించిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు. కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్ల నిర్మాణం, భావనపాడు షిప్పింగ్‌హార్బర్ అభివృద్ధికి తోడ్పడతానన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ పార్టీ అధినేత జగన్ ప్రకటించిన సంక్షేమ పథకాలు అమలుకావాలంటే ప్రజలంతా ఫ్యాన్ గుర్తుపై ఓటేసి వైఎస్సార్ కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. ప్రత్యర్థి పార్టీలు చేస్తున్న దుష్ర్పచారాన్ని తిప్పికొట్టేలా ఎంపీ, ఎమ్మెల్యే రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి జిల్లాలో పార్టీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు కొయ్య ప్రసాదరెడ్డి మాట్లాడుతూ జగన్‌ని ఎదుర్కొనే సత్తాలేక టీడీపీ, బీజేపీ, లోక్‌సత్తా, జనసేన పార్టీలన్నీ చీకటి ఒప్పందం చేసుకున్నాయని విమర్శించారు. ఈ కుట్రను ప్రజలు తిప్పికొడతారని ధీమా వ్యక్తం చేశారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలను వైఎస్ఆర్ సీపీ గెలుచుకుంటుందన్నారు. సమావేశంలో పార్టీ నేతలు ఎం.వి.పద్మావతి, అంధవరపు వరహానరసింహం, మార్పు ధర్మారావు, పేడాడ తిలక్, అంధవరపు సూరిబాబు, గొండు కృష్ణమూర్తి, చల్లా అలివేలు మంగ, జేఎం శ్రీనివాస్, ఎన్ని ధనుంజయ్, మండవిల్లి రవి, మహమ్మద్ సిరాజుద్దీన్ పాల్గొన్నారు. -
మహిళా సంక్షేమానికి ప్రాధాన్యం
శ్రీకాకుళం అర్బన్, న్యూస్‌లైన్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సంక్షేమ పథకాల్లో మహిళలకు పెద్దపీట వేస్తామని ఆ పార్టీ శ్రీకాకుళం అసెంబ్లీ, లోక్‌సభ సమన్వయకర్తలు ధర్మాన ప్రసాదరావు, రెడ్డి శాంతి పేర్కొన్నారు. శ్రీకాకుళంలోని 30వ వార్డు కస్పావీధి, చంపాగల్లివీధి, సరంగడోలవీధి, ఎచ్చెర్లవీధి, కుమ్మరవీధి, కొల్లావారివీధి తదితర ప్రాంతాల్లో వారిద్దరూ శనివారం పర్యటించి ఇంటింటికీ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలు ప్రజలకు వివరించి ఫ్యాన్ గుర్తుపైనే ఓటు వేసి వైఎస్ జగన్మోహన్రెడ్డిని సీఎం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే డ్వాక్రా రుణాలు మాఫీ చేసి మహిళలకు అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. పేద, సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రతి మండలంలో ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసి అన్ని పథకాలకు సంబంధించిన కార్డులను అక్కడే జారీ చేయడం జరుగుతుందన్నారు. తండ్రి ఆశయం కోసం పోరాటం సాగించే కొడుకుగా జగన్మోహనరెడ్డి చరిత్రలో నిలిచిపోతారన్నారు. మహానేత ఆశయాలు చిత్తశుద్ధితో నెరవేర్చేందుకు వైఎస్ఆర్ సీపీని గెలిపించి జగన్‌ని ముఖ్యమంత్రిగా చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. రెడ్డి శాంతి మాట్లాడుతూ దివంగత వైఎస్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ద్వారా ఎంతోమంది పేద విద్యార్థులు ఇంజినీరింగ్, మెడిసిన్ వంటి ఉన్నతవిద్యనభ్యసించారన్నారు. అదే బాట లో జగన్ కూడా అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టడంద్వారా ఎల్కేజీ నుంచి పీజీ వరకూ ఉచిత విద్య అందించనున్నారన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చెందుకు అంతా ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ప్రచార కార్యక్రమంలో పార్టీ నేతలు ఎం.వి.పద్మావతి, చల్లా అలివేలు మంగ, పైడి రాజారావు, అంధవరపు సూరిబాబు, జె.ఎం.శ్రీనివాస్, అబ్దుల్ రెహమాన్, టి.కామేశ్వరి, ఎన్ని ధనుంజయ్, మండవిల్లి రవి, కె.ఎల్. ప్రసాద్, శిమ్మ వెంకట్రావు, గుడ్ల మల్లేశ్వరరావు, రావాడ జోగినాయుడు, శ్రీనివాస్ పట్నాయక్, కూన వాసుదేవరావు, అంధవరపు రామ, పుట్టా వెంకటి, శాసనపురి శ్రీనివాస్, హరిసింగ్, పాలిశెట్టి కేశవ, లంక రమేష్, వట్టి చిన్నబాబు, చిట్టి మాస్టారు, డాక్టర్ లక్ష్మణ, సోమేష్ పాల్గొన్నారు. -
వికలాంగుల పింఛన్ రూ. వెయ్యికి పెంచుతాం
వైఎస్ఆర్ సీపీ పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త రెడ్డి శాంతి పలాస రూరల్, న్యూస్‌లైన్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయితే వికలాంగులకు వెయ్యి రూపాయల పింఛన్‌ను ఇస్తారని ఆ పార్టీ శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్త రెడ్డి శాంతి అన్నారు. పలాస పెద్దవీధిలో శనివారం ఆమె 17, 19వ వార్డు కౌన్సిలర్లుగా పోటీ చేయనున్న బళ్ల ఉష, నాగరాణిపాత్రోకు మద్దతుగా ప్రచారం చేపట్టారు. అనంతరం ఆమె మాట్లాడుతూ వృద్ధులు, వితంతువులకు ప్రస్తుతం అందజేస్తున్న రూ.200లు పింఛన్‌ను రూ. 700లకు పెంచుతామన్నారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత విస్తరిస్తామని, నిరుపేద రైతులకు ఎకరా భూమి పంపిణీ చేస్తామన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం రాష్ట్ర ప్రజలు దిక్కులేని స్థితిలో ఉంటే వైఎస్ జగన్ ఓదార్పు యాత్ర చేశారని గుర్తు చేశారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో వైఎస్ఆర్ సీపీ విజయం ఖాయమన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలాస ఎమ్మెల్యే జుత్తు జగన్నాయకులు, పలాస అసెంబ్లీ సమన్వయకర్త వజ్జ బాబూరావు, పట్టణ, మండల కన్వీనర్లు బళ్ల గిరిబాబు, కుప్పిలి కామరాజు,మాజీ కౌన్సిలర్ డబ్బీరు భవానీశంకర్, యవ్వారి మోహన్‌రావు, దుర్గాప్రసాద్పాత్రో, సాసుమాన చంద్రమౌళి, చింతాడ మాధవరావు పాల్గొన్నారు. -
వైఎస్ఆర్ సీపీకి పట్టం కట్టాలి
నందిగాం, న్యూస్‌లైన్:రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ నాయకత్వాన్ని బలపర్చాలని, అందుకు ప్రతీ ఒక్కరు కంకణం కట్టుకొని సైనికుల్లా పనిచేయాలని శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్త రెడ్డి శాంతి పిలుపునిచ్చారు. గురువారం నందిగాంలో నామినేషన్ వేసేందుకు వచ్చిన వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ అభ్యర్థులతో సమావేశమయ్యారు. మండలంలోని 16 స్థానాలను పార్టీ అభ్యర్థులు గెలుపొందాలన్నారు. కాంగ్రెస్, టీడీపీలకు ప్రజలు గుణపాఠం చెప్పి వైఎస్ఆర్ సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి నాయకత్వాన్ని బలపర్చాలన్నారు. టీడీపీ నుంచి వైఎస్సార్ సీపీలోకి.. దిమ్మిడిజోల పంచాయతీ నుంచి అధికమంది టీపీపీ కార్యకర్తలు రెడ్డి శాంతి సమక్షంలో వైఎస్ఆర్ సీపీలో చేరారు. కొల్లి దండాసి, కొల్లి చంద్రయ్య, చలపతిరావు, గణపతిరావు, కొత్తపేట నారాయణరావు, సవర నరసింహులు కింతల ధర్మారావు, నడుపూరి శ్రీరామ్మూర్తి, ఎర్రా చక్రవర్తి, పోలాకి మోహనరావు, తమిరె బలరాం, బొమ్మాళి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.