రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ నాయకత్వాన్ని బలపర్చాలని, అందుకు ప్రతీ ఒక్కరు కంకణం కట్టుకొని సైనికుల్లా పనిచేయాలని శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్త రెడ్డి శాంతి పిలుపునిచ్చారు.
నందిగాం, న్యూస్‌లైన్:రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ నాయకత్వాన్ని బలపర్చాలని, అందుకు ప్రతీ ఒక్కరు కంకణం కట్టుకొని సైనికుల్లా పనిచేయాలని శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్త రెడ్డి శాంతి పిలుపునిచ్చారు. గురువారం నందిగాంలో నామినేషన్ వేసేందుకు వచ్చిన వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ అభ్యర్థులతో సమావేశమయ్యారు.
మండలంలోని 16 స్థానాలను పార్టీ అభ్యర్థులు గెలుపొందాలన్నారు. కాంగ్రెస్, టీడీపీలకు ప్రజలు గుణపాఠం చెప్పి వైఎస్‌ఆర్ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వాన్ని బలపర్చాలన్నారు.
టీడీపీ నుంచి వైఎస్సార్ సీపీలోకి..
దిమ్మిడిజోల పంచాయతీ నుంచి అధికమంది టీపీపీ కార్యకర్తలు రెడ్డి శాంతి సమక్షంలో వైఎస్‌ఆర్ సీపీలో చేరారు. కొల్లి దండాసి, కొల్లి చంద్రయ్య, చలపతిరావు, గణపతిరావు, కొత్తపేట నారాయణరావు, సవర నరసింహులు కింతల ధర్మారావు, నడుపూరి శ్రీరామ్మూర్తి, ఎర్రా చక్రవర్తి, పోలాకి మోహనరావు, తమిరె బలరాం, బొమ్మాళి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.