మున్సిపల్ ఎన్నికల్లో ఫ్యాన్ తిరగాలి | fan rotate in municipal elections | Sakshi
Sakshi News home page

మున్సిపల్ ఎన్నికల్లో ఫ్యాన్ తిరగాలి

Published Mon, Mar 24 2014 3:32 AM | Last Updated on Tue, Oct 16 2018 6:33 PM

మున్సిపల్ ఎన్నికల్లో ఫ్యాన్ తిరగాలి - Sakshi

మున్సిపల్ ఎన్నికల్లో ఫ్యాన్ తిరగాలి

ఇచ్ఛాపురం,న్యూస్‌లైన్: మున్సిపల్ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్త రెడ్డి శాంతి కోరారు. ఆది వారం సాయంత్రం మున్సిపాలిటీలోని 5, 6,7, 8, 9 వార్డుల్లో ఎన్నికల ప్రచారాన్ని ఆమె నిర్వహించారు.
 
ఓటర్లను పలకరించి, పార్టీ కరపత్రాలను అందజేస్తూ వైఎస్సార్‌సీపీని గెలిపించాలని కోరారు. వైఎస్ జగన్‌తోనే రాజన్న రాజ్యం వస్తుందన్నారు. వైఎస్‌ఆర్‌సీపీని గెలిపించి మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలన్నా రు. మహిళలు శాంతికి పూల మాలలు వేసి హారతులిచ్చి స్వాగతం పలికారు. కాగా వృద్ధులకు పూలమాల లు వేసి వారిని శాంతి గౌరవించారు.
 
 మంగళవారం పేటలొ ఓ వృద్ధురాలు తన ఇంటికి వచ్చిన రెడ్డి శాంతిని అప్యాయంగా పలకరించి వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌కే తన మద్దతు అని చెప్పారు. కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త నర్తు నరేంద్రయాదవ్, మాజీ ఎమ్యెల్యే పిరియా సాయిరాజ్, జిల్లా ఎస్సీసెల్ కన్వీనర్ ఎస్.దేవరాజ్, నాయకులు కాళ్ల దేవరాజ్, ఏఎంసీ చైర్మన్ శ్యాంపురియా, మున్సిపల్ కన్వీనర్స్ పిలక పోలారావు, మున్సిపల్ అభ్యర్థులు సోమయ్య, పి.మంజులత, నం దిక హరిత, పల్లంటి తారకేశ్వరి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement