local body elections 2014
-
రాయబేరాలు!
సంఖ్యాబలం సమీకరణకు ప్రలోభాలు రూ.కోటి నగదు, ఫార్చ్యూనర్ కారు ఎర టీఆర్ఎస్ గూటికి కాంగ్రెస్ సభ్యుడు? ఆసక్తికరంగా జెడ్పీ రాజకీయం సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లా పరిషత్ రాజకీయం ఆసక్తికరంగా మారింది. సంఖ్యాబలాన్ని సమకూర్చుకునేందుకు టీఆర్ఎస్, కాంగ్రెస్‌లు వ్యూహాలకు పదునుపెట్టాయి. మేజిక్ ఫిగర్‌ను చేరేందుకు, అవసరమైన సంఖ్యకు చేరుకునేందుకు జెడ్పీటీసీలతో రాయబేరాలు సాగిస్తున్నాయి. నజరానాలు, ప్యాకేజీలను ఆఫర్ చేస్తూ జెడ్పీ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు ఎత్తులు వేస్తున్నాయి. జిల్లా పరిషత్ పీఠాన్ని దక్కించుకోవాలంటే 17 మంది సభ్యులు అవసరం. మొత్తం 33 మంది జెడ్పీటీసీలకుగాను ప్రస్తుతం కాంగ్రెస్‌కు 14, టీఆర్ఎస్కు 12, టీడీపీకి ఏడుగురు సభ్యులున్నారు. దీంతో ఏ పార్టీకీ సంపూర్ణ మెజార్టీ దక్కలేదు. ఈ క్రమంలోనే మేజిక్ నంబర్ కోసం ఇరుపార్టీలూ ప్రయత్నాలు సాగిస్తున్నాయి. అటు కాంగ్రెస్, ఇటు టీఆర్ఎస్లు టీడీపీపై మద్దతుపై గట్టి ఆశలు పెట్టుకున్నప్పటికీ, ఇరుపార్టీలు తమకు ఉమ్మడి శత్రువు కనుక.. ఎవరికీ మద్దతు ఇచ్చేది లేదని తెగేసి చెబుతోంది. ఒకవేళ అనివార్యమై తే కాంగ్రెస్‌కు అండగా నిలుస్తాం తప్ప టీఆర్ఎస్తో జతకట్టేదిలేదని టీడీపీ భావిస్తోంది. కాంగ్రెస్ కూడా టీడీపీ మద్దతుపైనే ఆశలు పెట్టుకుంది. ఈ మేరకు ఆ పార్టీ పెద్దలు మంతనాలు కూడా సాగిస్తున్నారు. నజరానాల ఎర జిల్లా పరిషత్ చైర్మన్‌పై కన్నేసిన ఓ ప్రధాన పార్టీ.. ప్రత్యర్థి పార్టీల సభ్యులపై వల విసురుతోంది. సరిపడా సంఖ్యాబలాన్ని సమకూర్చుకునేందుకు భారీ మొత్తంలో ముట్టజెప్పేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో తూర్పు డివిజన్లోని ఓ కాంగ్రెస్ సభ్యుడితో టీఆర్ఎస్ నాయకత్వం సంప్రదింపులు జరిపినట్లు ప్రచారమవుతోంది. కోటి రూపాయల నగదు, ఫార్చునర్ కారును ఎరవేయడం ద్వారా సదరు జెడ్పీటీసీని ఆకర్షించడంలో సక్సెస్ అయినట్లు తెలిసింది. ఇదే తరహాలో మిగతా సభ్యులను కూడా చేరదీయాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే కాంగ్రెస్, టీఆర్ఎస్లు క్యాంపు రాజకీయాలు నెరపుతున్నప్పటికీ, మరోవైపు ఆయా పార్టీల జెడ్పీటీసీలను తమవైపు తిప్పుకొనేందుకు పావులు కదుపుతున్నాయి. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం రావడం, విప్ ఉల్లంఘించినా ఏమీ కాదనే ధీమాతో కొందరు సభ్యులు గోడ దూకేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇదే అదనుగా ఇటీవల పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందున సస్పెన్షన్ వేటు పడ్డ కాంగ్రెస్ జెడ్పీటీసీ, గులాబీ గూటికి చేరే అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న కాంగ్రెస్‌లో నైరాశ్యం అలుముకోవడం, జెడ్పీ చైర్మన్ అభ్యర్థి యాదవరెడ్డి కూడా సొంత పార్టీ సభ్యుల గొంతెమ్మ కోరికలను తీర్చే విషయంలో వెనుకడుగు వేస్తుండడాన్ని అనువుగా మలుచుకున్న టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా అసంతుష్టులను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తోంది. వారిని సంతృప్తి పరచడం ద్వారా మేజిక్ ఫిగర్‌ను సులువుగా చేరుకోవచ్చని అంచనా వేస్తోంది. మరోవైపు టీఆర్ఎస్ వ్యూహాలకు అడ్డుకట్ట వేసేందుకు కాంగ్రెస్ కూడా ప్రతి వ్యూహాలను రూపొందిస్తోంది. క్యాంపుల్లో ఉన్న జెడ్పీటీసీలపై వల విసరకుండా అప్రమత్తమైంది. సభ్యుల కదలికలపై నిఘాను విస్తృతంచేసింది. -
మొదలైన క్యాంపులు
సాక్షి, హన్మకొండ: తొందరపడి ఓ కోయిల ముందే కూసింది అన్నాడో సినీ కవి. మునిసిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడడానికి ముందు రోజే రాజకీయ నేతలు తమ పార్టీ తరఫున వార్డు కౌన్సిలర్లుగా బరిలో నిలి చిన అభ్యర్థులను రహస్య ప్రదేశాలకు తరలిస్తున్నారు. గెలిచిన వారు ఎట్టి పరిస్థితుల్లోను తమ పట్టు నుంచి జారిపోకుండా... ఇతర పార్టీల్లో చేరకుండా ఉండేందుకు ప్రధాన పార్టీల నేతలు క్యాంపు రాజకీయాలు ప్రారంభించారు. జనగామ, మహబూబాబాద్ మునిసిపాలిటీలు... పరకాల, నర్సంపేట, భూపాలపల్లి నగర పంచాయతీలకు ఈ ఏడాది మార్చి 30న పోలింగ్ జరిగింది. మొత్తం 115 మంది వార్డులకు 651 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈసారి చైర్పర్సన్ ఎన్నిక ప్రత్యక్ష పద్ధతిలో కాకుండా పరోక్ష పద్ధతిలో జరగనుంది. ఈ మేరకు ప్రతి మునిసిపాలిటీలో ఎక్కువ వార్డుల్లో విజయం సాధించిన పార్టీ అభ్యర్థులు, తమలో ఒకరిని మునిసిపాలిటీ చైర్మన్‌గా, మరొకరిని వైస్‌చైర్మన్‌గా ఎ న్నుకుంటారు. దీంతో గెలిచిన ప్రతి వార్డు మెంబరూ కీలకం గా మారారు. ఈ నేపథ్యంలో ఐదు మునిసిపాలిటీలకు సం బంధించిన కౌంటింగ్ ప్రక్రియ జరుగుతున్న నిట్ క్యాంపస్ కేంద్రంగా క్యాంపు రాజకీయాలు జరుగుతున్నాయి. ఒక రోజు ముందుగానే... భూపాలపల్లి, పరకాల, మహబూబాబాద్‌లో చైర్పర్సన్ సీటుకు డిమాండ్ ఎక్కువగా ఉంది. భూపాలపల్లిలో కాంగ్రెస్, సీపీఐ పార్టీలు జతకట్టగా... మహబూబాబాద్‌లో టీఆర్ఎస్ సీపీఐలు ఒక జట్టుగా ఎన్నికల బరిలో నిలిచాయి. భూపాలపల్లి నుంచి వార్డు మెంబర్లుగా బరిలో నిలిచిన అభ్యర్థులను ఒకరోజు ముందుగానే టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నేతలు హన్మకొండలోని రహస్య ప్రదేశాలకు తరలించారు. సోమవారం ఫలితాలు వెలువడిన తర్వాత గెలిచిన అభ్యర్థులను అక్కడి నుంచి అటే పుణ్యక్షేత్రాలకు తీసుకెళ్లే యోచనలో నాయకులు ఉన్నారు. కాగా.. మహబూబాబాద్ టీఆర్ఎస్ వార్డు మెంబర్లుగా పోటీ చేసిన అభ్యర్థులు ఒక బృందంగా ఏర్పడి ఆదివారం రాత్రి మహబూబాబాద్ నుంచి హన్మకొండకు చేరుకున్నారు. వీరందరూ కౌంటింగ్ కేంద్రానికి దగ్గరల్లో ఉన్న లాడ్జిలో బస చేసినట్లుగా సమాచారం. మరోవైపు భూపాలపల్లిలో టీఆర్ ఎస్ పార్టీ నుంచి పోటీ చేసిన వార్డు మెంబర్లు సోమవారం తెల్లవారు జామున మొలుగూరి బిక్షపతి ఇంటికి చేరుకుని... అక్కడి నుంచి ప్రత్యేక వాహానంలో హన్మకొండకు చేరుకునేలా ప్రణాళిక రూపొందించారు. పరకాలలో టీడీపీ, బీజేపీ గణనీయమైన సంఖ్యలో వార్డుమెంబర్లుగా గెలుస్తామని అంచనా వేస్తున్నాయి. రెండు పార్టీలు ఒక జట్టుగా ఏర్పడి చైర్పర్సన్, వైస్ చైర్మన్ ఎంపికలో కీలక పాత్ర పోషించాలనే నిర్ణయానికి వచ్చాయి. ఈ క్రమంలో ఈ రెండు పార్టీల నుంచి గెలిచిన వార్డు మెంబర్లు ఇతర పార్టీల వైపు వెళ్లకుండా కట్టడి చేయడంపై స్థానిక నాయకత్వం దృష్టి పెట్టింది. ఇదిలా ఉండగా... జనగామ, నర్సంపేట మునిసిపాలిటీల్లో ఫలితాలు వెలువడిన తర్వాత రంగంలోకి దూకాలని అక్కడి నేతలు భావిస్తున్నారు. -
రేపే ‘స్థానిక’ ఫలితాలు
చిత్తూరు (అర్బన్), న్యూస్‌లైన్: స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు వెలువడడానికి ఇక 24 గంటలు మాత్రమే ఉంది. అభ్యర్థుల భవితవ్యం మంగళవారం తేలనుంది. జిల్లాలోని 65 జెడ్పీటీసీ స్థానాలకు 266 మంది, 887 ఎంపీటీసీ స్థానాలకు 2414 మంది పోటీ పడ్డారు. ఫలితాలపై అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. ఫలితాలు రాత్రికే.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల బ్యాలెట్ పత్రాలను లెక్కించడానికి జిల్లా వ్యాప్తంగా ఆరు కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే బ్యాలెట్ పత్రాల లెక్కింపునకు ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. అయినప్పటికీ ఒక్కో మండలం కౌంటింగ్ పూర్తవుతుండగానే ఎంపీటీసీ, జెడ్పీటీసీలుగా గెలుపొందిన వారికి అప్పటికప్పుడే ధ్రువీకరణ పత్రాలు ఇచ్చేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించుకున్నారు. ఈసారి ఎంపీటీసీ, జెడ్పీటీసీ బ్యాలెట్ పత్రాలను ఒకేసారి లెక్కించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. దీంతో మొత్తం కౌంటింగ్ ప్రక్రియ పూర్తవడానికి రాత్రి 10 గంటలు దాటుతుందని అధికారులు భావిస్తున్నారు. వైఎస్సార్సీపీ ధీమా జెడ్పీ పీఠం కచ్చితంగా తమకే దక్కుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధీమాతో ఉంది. మహానేత డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, రుణమాఫీ, వైఎస్.జగన్మోహన్రెడ్డిపై కాంగ్రెస్, టీడీపీ కలిసి చేసిన కుట్రలు ఆ పార్టీలకు డిపాజిట్లు కూడా దక్కకుండా చేస్తాయని వైఎస్సార్ సీపీ నేతలు చెబుతున్నారు. దీనికితోడు టీడీపీకి 13 మండలాల్లో రెబల్స్ బెడద ఉండటం, చంద్రబాబు గత పాలన వద్దంటూ రైతులే బహిరంగంగా చెప్పడంతో ఆ పార్టీ నేతలకు ఎన్నికల ఫలితాలపై దిగులు పట్టుకుంది. అయినప్పటికీ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ మెజారిటీ స్థానాలు తమకే వస్తాయంటూ చెప్పుకుంటున్నారు. మొత్తం మీద ఓటర్లు చెప్పిన తీర్పు బహిరంగం కావడానికి మరికొన్ని గంటలు ఆగాల్సిందే. -
కౌంటింగ్‌కు పక్కా ఏర్పాట్లు
కడప కలెక్టరేట్, న్యూస్‌లైన్: ఈనెల 13న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపునకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ శశిధర్ శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. రాజంపేట డివిజన్‌కు కడపలోని శ్రీనివాస ఇంజనీరింగ్ కళాశాలలో, జమ్మలమడుగు డివిజన్‌కు మదీనా ఇంజనీరింగ్ కళాశాలలో, కడప డివిజన్‌కు కేశవరెడ్డి స్కూలులో కౌంటింగ్ జరుగుతుందన్నారు. బ్యాలెట్ బాక్సులను డీజీటీ వాహనాల్లో కౌంటింగ్ కేంద్రాలకు తరలిస్తామని, ఈ సమాచారాన్ని అభ్యర్థులకు తెలపాలని సూచించారు. కౌంటింగ్ శిక్షణ తరగతులు ఆదివారం ఉదయం 10 గంటలకు కౌంటింగ్ కేంద్రాల్లోనే నిర్వహిస్తారన్నారు. అలాగే పార్లమెంటు, అసెంబ్లీ ఓట్ల లెక్కింపు శిక్షణ కార్యక్రమం ఈ నెల 14 ఉదయం 10 గంటలకు మున్సిపల్ హైస్కూలులో నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ రామారావు, ఏజేసీ సుదర్శన్‌రెడ్డి, ట్రైనీ కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్, ఏఓ గుణభూషణ్ తదితరులు పాల్గొన్నారు. కౌంటింగ్ తేదీల్లో మద్యం విక్రయాలు బంద్ కడప అర్బన్: జిల్లా కేంద్రంలో ఈనెల 12, 13, 16 తేదీల్లో నిర్వహించే ఆయా ఎన్నికల కౌంటింగ్ల ఈ నేపధ్యంలో జిల్లా కేంద్రంలో కార్పొరేషన్ పరిధితోపాటు చుట్టు ఐదు కిలోమీటర్ల మేరకు మద్యం షాపులను మూసి వేయనున్నట్లు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ విజయకుమారి తెలిపారు. శనివారం కడప ఎక్సైజ్ పోలీసుస్టేషన్లో ఆమె విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో ఎన్నికల నేపధ్యంలో ఎన్నికల కోడ్ వెలువడినప్పటి నుంచి ఎక్సైజ్ అధికారులు ముమ్మరంగా దాడులు నిర్వహించారన్నారు. ఎన్నికలు జరిగే రోజుల్లో కూడా 48 గంటలపాటు మద్యంషాపులను మూసి వేయించామన్నారు. అలాగే కౌంటింగ్ జరగనున్న తేదీలలో కూడా ఈ నిబంధన వర్తిస్తుందన్నారు. 12వ తేదీ ఉదయం 6 నుంచి 13వ తేది సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు మూసి వేయాలన్నారు. అలాగే 16న సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఆ రోజు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు మద్యం షాపులను మూసి వేయాలని కోరారు. నిబంధనలకు వ్యతిరేకంగా మద్యం విక్రయిస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ సమావేశంలో డీసీతోపాటు కడప ఎక్సైజ్ సీఐ చంద్రశేఖర్ పాల్గొన్నారు. గట్టి బందోబస్తు కడప అర్బన్, న్యూస్‌లైన్: జిల్లాలో ఈనెల 12న మున్సిపల్,13న జెడ్పీటీసీ, ఎంపీటీసీ, 16న సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌తోపాటు నగరంలో 30 పోలీసు యాక్టు అమలులో ఉంటుందన్నారు. విజయోత్సవ ర్యాలీలు, డప్పులు లేదా బ్యాండులతో ఊరేగింపులు, బాణసంచా కాల్చడం నిషిద్ధమన్నారు. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం సమీపంలో పార్కింగ్ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ జరగనున్న నాగార్జున మహిళా డిగ్రీ కళాశాల సమీపంలో వాహనాలకు పార్కింగ్ ఏర్పాటు చేసినట్లు ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ తెలిపారు. కొత్త బస్టాండు ఎదురుగా ఉన్న ఎగ్జిబిషన్ గ్రౌండ్లో వాహనాలను పార్కింగ్ చేసుకోవాలని ఎస్పీ సూచించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌కు సంబంధించి వాహనాలను నగర శివార్లలో పార్కింగ్ చేయాలన్నారు. అభ్యర్థులు తమ ఏజెంట్లను మాత్రమే కౌంటింగ్ కేంద్రాలకు తీసుకు రావాలని పేర్కొన్నారు. -
12న మునిసిపల్, 13న ప్రాదేశిక ఓట్ల లెక్కింపు
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: మునిసిపాలిటీలు, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు పకడ్బందీగా చేపట్టేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని కలెక్టర్ సి.సుదర్శన్‌రెడ్డి తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ...జిల్లాలో ఎనిమిది మునిసిపాలిటీల ఓట్ల లెక్కింపు ఈనెల 12న కర్నూలు శివారులోని సెయింట్ బాలికల జూనియర్ కళాశాల జరుగుతుందని తెలిపారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈనెల 13న కర్నూలు డివిజన్లో అన్ని మండలాల ఓట్ల లెక్కింపు కర్నూలులోని సిల్వర్ జూబ్లీ, డాక్టర్స్ కాలనీలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల(మెన్)లోను జరుగుతుందని పేర్కొన్నారు. ఆదోని డివిజన్లకు సంబంధించి ఆయా డివిజన్‌కేంద్రాల్లో బ్యాలెట్ పేపర్ల లెక్కింపు జరుగుతోందని వివరించారు. వీటికి కూడా 14 టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు ప్రతి మండలానికి ఒక అధికారిని నియమించినట్లు పేర్కొన్నారు. -
రాజకీయ పార్టీల్లో గుబులు
సాక్షి ప్రతినిధి, వరంగల్ : ఈ నెల 12న మునిసిపల్, 13న మండల, జిల్లా ప్రాదేశిక, 16న అసెంబ్లీ, పార్లమెంట్ ...ఇలా వరుసగా ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే ఘడియ సమీపిస్తుండడంతో అన్ని రాజకీయ పార్టీల్లో గుబులు నెలకొంది. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులతో పాటు ప్రధాన నేతలు, ద్వితీయ శ్రేణి నాయకులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రత్యర్థులను చిత్తు చేసే వ్యూహాలతో వరుస ఎన్నికలను ఎదుర్కొన్న రాజకీయ పార్టీల అభ్యర్థులకు ఫలితాల గడువు సమీపించే కొద్దీ.. పల్స్ రేటు పెరుగుతోంది. ఫలితాలు ఎలా ఉంటాయోననే ఆలోచనలతో అభ్యర్థులు రోజులను భారంగా గడుపుతున్నారు. ఫలితాల టెన్షన్ నుంచి బయటపడేందుకు ఏదో ఒక కార్యక్రమం పెట్టుకుంటున్నారు. కుటుంబంతో గడపడం, కార్యక్రమాలకు వెళ్లడం చేస్తున్నారు. అయితే అభ్యర్థులు ఇంట్లో ఉన్నా, బయటికి వెళ్లినా... ఫలితాల ప్రస్తావనే వెంటాడుతోంది. ‘పుర’ పరీక్షే.. గతంలో ఎప్పుడూ లేనివిధంగా సాధారణ ఎన్నికలకు ముందు వచ్చిన మునిసిపల్, పరిషత్ ఎన్నికల ఫలితాలు ఎమ్మెల్యే అభ్యర్థులకు ఇబ్బందికరంగా మారాయి. జిల్లాలో జనగామ, మహబూబాబాద్ మునిసిపాలిటీలు, పరకాల, నర్సంపేట, భూపాలపల్లి నగర పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. వీటి ఫలితాలు ఈ నెల 12న వెలువడనున్నారుు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సొంత నియోజకవర్గం కావడంతో జనగామ మునిసిపల్ ఎన్నికల ఫలితం ఆసక్తికరంగా ఉండనుంది. గత ఎన్నికల్లో మాదిరిగానే ప్రస్తుత సాధారణ ఎన్నికల్లోనూ పొన్నాల లక్ష్మయ్యకు టీఆర్ఎస్ అభ్య ర్థి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి మధ్య హోరాహోరీగా పోరు సాగింది. గెలుపుపై రెండు పార్టీలు ధీమాతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఫలితాలు రావడానికి నాలుగు రోజుల ముం దు వెల్లడయ్యే జనగామ మునిసిపల్ ఫలి తంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. భూపాల పల్లి నగరపంచాయతీ ఎన్నికల ఫలితాలు అసెంబ్లీ ఎన్నికల తీర్పును ప్రభావితం చేస్తుందనే వాదనలు వినపడుతున్నారుు. మునిసిపల్ ఎన్నికల తర్వాత ఇక్కడి రాజ కీయ పరిస్థితులు మారిపోగా... గండ్ర వెంకట రమణారెడ్డి భవితవ్యాన్ని తేల్చనున్నట్లు శ్రేణు లు భావిస్తున్నారుు. మానుకోట మునిసిపల్ ఎన్నికల ఫలితం ఇదే తీరుగా ఆసక్తిని పెంచుతోంది. నర్సంపేట, పరకాల నగర పంచాయతీల ఎన్నికల ఫలితాలు ఇక్కడి రాజకీయ పార్టీల అభ్యర్థులకు పరీక్షగానే మారాయి. ‘పరిషత్’ ప్రామాణికం... సాధారణ ఎన్నికలకు ముందు జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఫలితాలపైనే అన్ని పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థులు ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. ఈ ఎన్నికల్లో మెజారిటీ ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవడంతోపాటు వీటి ఫలితాలు, ఎమ్మెల్యే ఎన్నికల ఫలితాలకు దగ్గరగా ఉంటాయనే అభిప్రాయం నేతల్లో ఉంది. ఎంపీటీసీ ఎన్నికలు ఆయా గ్రామాల్లోని స్థాని క సమీకరణలపై జరిగినా... జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు మాత్రం సాధారణ ఎన్నికల ఫలితాలకు దగ్గరగా ఉంటాయని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 13న వెల్లడ య్యే పరిషత్ ఫలితాలను ఎమ్మెల్యే అభ్యర్థులు తమ గెలుపోటములకు ప్రామాణికంగా తీసుకుంటున్నారు. నర్సంపేట, భూపాలపల్లి, పరకాల నియోజకవర్గాల్లో పరిషత్, సాధారణ ఎన్నికల మధ్య రాజకీయ పరిస్థితుల్లో తేడా ఉంది. అప్పటివరకు నర్సంపేట కాంగ్రెస్ ఇన్చార్జ్గా స్థానిక ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దొంతి మాధవరెడ్డికి ఎమ్మెల్యే టికెట్ దక్కలేదు. భూపాలపల్లి నియోజకవర్గంలో టీడీపీ ఇన్చార్జ్గా ఉన్న గండ్ర సత్యనారాయణరావు... బీజేపీ అభ్యర్థిగా సాధారణ ఎన్నికల బరిలోకి దిగారు. పరకాల నియోజకవర్గం లో టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేకు టికెట్ దక్కలేదు. ఆయన స్థానంలో సహోదర్‌రెడ్డి పోటీ లో ఉన్నారు. ఇలా మూడు సెగ్మెంట్లు మినహాయిస్తే... మిగిలిన అన్నింటిలోనూ స్థానిక, సాధారణ ఎన్నికలను ఆయా పార్టీల నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ నేపథ్యం లో స్థానిక ఫలితాలు వచ్చిన తర్వాత మూడో రోజు సాధారణ తీర్పు వెలువడుతుండడం అభ్యర్థుల్లో టెన్షన్ పెంచుతోంది. -
ఫలితాల మేళా ఎదురుచూపులు
సాక్షిప్రతినిధి, నల్లగొండ : ఎన్నికల ఫలితాల కోసం ఏకంగా రెండువారాలు ఎదురు చూడాల్సి రావడంతో అటు అభ్యర్థులు, ఇటు ఆయా పార్టీల నేతలు ఉత్కంఠకు గురవుతున్నారు. సార్వత్రిక ఎన్నికల కంటే ముందే పూర్తయిన మున్సిపల్, స్థానిక ఎన్నికల ఫలితాలూ వెలువడక పోవడంతో ఓ అంచనాకు రాలేక పోతున్నారు. ఈ నెల 12న మున్సిపల్, 13వ తేదీన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ మేరకు అధికార యంత్రాంగం ఇప్పటికే ఏర్పాట్లలో తలమునకలైంది. ఈ ఫలితాల ఆధారంగా తమ గెలుపోటములపై ఓ అంచనాకు వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయం ఎమ్మెల్యే అభ్యర్థుల్లో వ్యక్తం అవుతోంది. జిల్లాలో ఏడు నియోజకవర్గ కేంద్రాల్లో ఐదు మున్సిపాలిటీలు, మరో రెండు నగర పంచాయతీలు ఉన్నాయి. స్థానిక అంశాలు ప్రభావితం చేసినా, మున్సిపాలిటీ ఎన్నికల్లో పట్టణ ఓటరు ఏ పార్టీ వైపు మొగ్గుచూపాడో, సార్వత్రిక ఎన్నికల్లోనూ దాదాపు అదే పార్టీ అభ్యర్థి వైపు మొగ్గు చూపే అవకాశం ఉందన్న అంచనాలతో ఎమ్మెల్యే అభ్యర్థులు మున్సిపల్ ఫలితాల కోసం నిరీక్షిస్తున్నారు. ఇక, మిగిలిన ఐదు నియోజకవర్గాల్లో రూరల్ ఓటరు కీలకం కానున్నాడు. ఈ కారణంగానే 16వ తేదీన వెలువడనున్న సార్వత్రిక ఫలితాల కంటే ముందే 12,13 తేదీల్లో వెలువడే మున్సిపల్, ప్రాదేశిక ఫలితాల కోసం ఎదురుచూసే వారి సంఖ్య పెరిగిపోయింది. ఇదీ ... లెక్క నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గంలో 2.21లక్షల పైచిలుకు ఓటర్లు ఉంటే, ఒక్క నల్లగొండ మున్సిపాలిటీలోనే 1.21లక్షల పైచిలుకు ఓట్లున్నాయి. అంటే సగానికి సగం ఓట్లు పట్టణ ఓటర్లవే. దీంతో మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పడ్డాయో తెలిస్తే, సార్వత్రిక ఎన్నికల్లోనూ దాదాపు ఇదే తరహాలో ఓటింగ్ సరళి ఉంటుంది కాబట్టి ఏ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అభ్యర్థి గెలిచే అవకాశం ఉందో ఇట్టే ఓ అవగాహనకు రావచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదే తరహాలో మిర్యాలగూడ నియోజకవర్గంలో 2.07లక్షల ఓట్టుంటే, మున్సిపాలిటీలో 75,364, సూర్యాపేట నియోజకవర్గంలో 2.16లక్షల ఓట్లకు గాను, మున్సిపాలిటీలో 77,638 ఓట్లున్నాయి. భువనగిరి, కోదాడ మున్సిపాలిటీలు, హుజూర్నగర్, దేవరకొండ నగర పంచాయతీల్లోనూ చెప్పుకోదగిన రీతిలోనే పట్టణ ఓటర్లు ఉన్నారు. మొత్తంగా జిల్లాలో 3.96లక్షల పైచిలుకు పట్టణ ఓటర్లు ఉన్నారు. ఇరవై అయిదు లక్షల పైచిలుకు జిల్లాలో ఉన్న ఓట్లలో మిగిలినవ న్నీ రూరల్ ఓట్లే. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు జరిగిన ఫలితాలు వెలువడితే ఏ పార్టీ ఎన్ని జెడ్పీటీసీ, ఎన్ని ఎంపీటీసీ స్థానాలను గెలుచుకుందో తెలిస్తే, రూరల్ ఓటు ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థికి పడ్డాయో అంచానా వేసే వీలుంది. అందుకే సార్వత్రిక ఎన్నికల ఫలితాల కంటే ముందే వెలువడుతున్న మున్సిపల్, స్థానిక సంస్థల ఫలితాల కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎన్నికలు ముగిశాక ఫలితాల కోసం రెండువారాలు ఎదురు చూడాల్సి రావడంతో ఉత్కంఠకు గురవుతున్న ఆయా పార్టీల అభ్యర్థులు, పార్టీల నేతలు కనీసం మున్సిపల్, స్థానిక ఫలితాలతో అంచనాకు రావచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే ఆయా నియోకవర్గాల్లో అభ్యర్థుల గెలుపోటములపై రకరకాల సమీకరణలు, అంచనాలు తెరపైకి వచ్చాయి. కొన్నిచోట్ల ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్ కూడా సాగుతోందని సమాచారం. మునుపెన్నడూ లేని విధంగా ఈసారి దాదాపు అన్ని నియోజకవర్గాల్లో బహుముఖ పోటీలే జరగడంతో అభ్యర్థుల గెలుపుపై స్పష్టమైన ఓ అంచనాకు రాలేకపోతున్నామని విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
ప్రచారంలో ఫైటింగ్ సీన్
నడిరోడ్డుపై తన్నుకున్న కాంగ్రెస్ నాయకులు రాహుల్ యువసేన కన్వీనర్ వర్సెస్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎమ్మెల్యే కవిత ఎదుటే బాహాబాహీ అడ్డుకున్న శ్రీరాంభద్రయ్య, భరత్‌చందర్‌రెడ్డి, పార్టీ శ్రేణులు కేసముద్రం, న్యూస్‌లైన్ : కాంగ్రెస్ పార్టీలో నాయకుల మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న వర్గవిభేదాలు ఎన్నికల వేళ మరోసారి భగ్గుమన్నాయి. మొదటి నుంచి ఒకరికొకరు పోటీపడుతూ ప్రచారంలో పాల్గొంటున్న ఇద్దరు నాయకుల మధ్య వివాదం చివరికి తన్నులాటకు దారితీసింది. సాక్షాత్తు ఎమ్మెల్యే కవిత, మాజీ ఎమ్మెల్యే శ్రీరాంభద్రయ్య, పీసీసీ సభ్యుడు జెన్నారెడ్డి భరత్‌చంద్‌రెడ్డి ఎదుట ఈ ఫైటింగ్ జరిగింది. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన రాహుల్ యువసేన మండల కన్వీనర్ చిలువేరు సమ్మయ్యగౌడ్ ఎమ్మెల్యే కవిత ప్రచారానికి తన అనుచరులతో బైక్‌ర్యాలీతో హాజరయ్యాడు. అలాగే కాట్రపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గుగులోతు దస్రూనాయక్ కూడా ప్రచారంలో పాల్గొన్నాక కేసముద్రంవిలేజ్లోని ఓ నాయకుడి ఇంట్లో ఏర్పాటు చేసిన భోజనాల వద్దకు పార్టీశ్రేణులతో కలిసి వెళ్లారు. ఈ క్రమంలో దస్రూనాయక్ ఎమ్మెల్యే ఎదుటకు సమ్మయ్యగౌడ్‌ను పిలిపించి తన గ్రామానికి చెందిన తన వ్యతిరేకులను నువ్వు ఎలా ప్రచారానికి పిలుస్తావని అడిగాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఆగ్రహంతో ఊగిపోతూ దస్రూనాయక్ ఎమ్మెల్యే ఎదుటే సమ్మయ్యగౌడ్పై చేయిచేసుకున్నాడు. దీంతో అక్కడున్న ఎమ్మెల్యే కవితతోపాటు మాజీ ఎమ్మెల్యే శ్రీరాంభద్రయ్య, పీసీసీ సభ్యుడు జెన్నారెడ్డి భరత్‌చంద్‌రెడ్డి కంగుతిని ఘర్షణను అడ్డుకున్నారు. కంటతడి పెట్టిన సమ్మయ్యగౌడ్‌ను బుజ్జగించి, కారులో తీసుకుని బయల్దేరారు. విషయం తెలుసుకున్న సమ్మయ్యగౌడ్ అనుచరులు అక్కడికి చేరుకున్నారు. శ్రీరాంభద్రయ్య, భరత్‌చందర్‌రెడ్డి కారులో తమతోపాటు సమ్మయ్యగౌడ్‌ను కూర్చొబెట్టుకుని ఆయనకు సర్ధిచెపుతూ అక్కడున్న దస్రూను కూడా కారులోకి రమ్మని పిలిచారు. ప్రచార వాహనం నుంచి కారు వద్దకు వెళ్తున్న దస్రూనాయక్ను వెంబడించిన సమ్మయ్య అనుచరులు తీరా కారు డోర్ తీస్తుండగానే దస్రూపై మూకుమ్మడిగా దాడి చేశారు. అక్కడున్న నాయకులు ఎందరు అడ్డుకున్నా వారు ఆగలేదు. పరిస్థితి చేయి దాటుతుండడంతో కారులో నుంచి ఇద్దరు నాయకులు దిగి రెండు వర్గాల నాయకులను చెరోవైపు చెదరగొట్టారు. స్థానికుల విస్మయం.. ఓట్లడగడానికి వచ్చిన నాయకులు ఇలా కొట్టుకుంటున్నారేమిటంటూ అక్కడున్న ప్రజలు విస్మ యం వ్యక్తం చేశారు. పార్టీలో ఇలా క్రమశిక్షణ లేకుం డా ముందుకెళితే పరిస్థితి చేయిదాటుతుందంటూ మరికొందరు నాయకులు వాపోయారు. కాంగ్రెస్ శ్రేణుల్లో విబేధాలు తరచూ రచ్చకెక్కుతుండడం ఎమ్మెల్యే కవితకు తలనొప్పిగా మారింది. -
కాళ్లు పట్టుకున్నా కనికరించలేదు..
కైకలూరు, న్యూస్‌లైన్ : అయ్యా.. చంద్రబాబు గారు.. నా భర్త 33 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీకి సేవలందించారు.. గతంలో టిక్కెట్టు ఇస్తానని చెప్పి మోసం చేశారు.. ఒక్కసారి అవకాశం ఇవ్వండంటూ ఆయన కాళ్లు పట్టుకున్నా కనికరించలేదు’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చలమలశెట్టి రామానుజయ్య భార్య లక్ష్మీపార్వతి. ఈ దంపతులిద్దరూ శనివారం చివరి నిమిషంలో నామినేషన్లు దాఖలు చేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ టీడీపీలో తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. శుక్రవారం చంద్రబాబును కలిసి కాళ్లావేళ్లాపడి వేడుకున్నా ఏ మాత్రం కనికరించకుండా.. నేనెవరికి చెప్పుకోవాలి అంటూ మాట్లాడారని వాపోయారు. రామానుజయ్య మాట్లాడుతూ గోడు తెలపడానికి వెళ్లిన తన భార్యను, అభిమానులను మహిళ అని చూడకుండా చంద్రబాబు యాత్రలోని పోలీసులు, సెక్యూరిటీ చితకబాదారన్నారు. ఈ ఘటనలో ఒకరి చేయి విరిగిందన్నారు. అస్పత్రిలో చికిత్ర పొందుతుంటే పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమా, ఎంపీ అభ్యర్థి కొనకళ్ల నారాయణ కనీసం ఎలా ఉందని పలకరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పొత్తులలో భాగంగా బీజేపీకి కాకుండా సిట్టింగ్ ఎమ్మెల్యే జయమంగళకు గాని, తనకు గాని టిక్కెట్టు కేటాయిస్తే కలసి పనిచేస్తామని చెప్పినా చంద్రబాబు వినలేదన్నారు. తనకు పార్టీలో జరిగిన అన్యాయాన్ని నియోజకవర్గ ప్రజలకు వివరిస్తానని ఈ సందర్భంగా ఆయన వివరించారు. -
జనాభా కంటే ఓటర్లెక్కువ!?
2011 జనగణన ప్రకారం ‘గ్రేటర్ ’ జనాభా 67,31,790 జీహెచ్ఎంసీలో ప్రస్తుత ఓటర్లు 78,48,259 ఇదీ గ్రేటర్ వి‘చిత్రం’ సాక్షి, సిటీబ్యూరో : సాధారణంగా మొత్తం జనాభాలో ఓటర్లు 70 శాతానికి అటూ ఇటూగా ఉంటారనేది నిపుణుల అంచనా. అదేమి విచిత్రమో కానీ.. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)లో మాత్రం జనాభా కంటే ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. అయితే జనాభా 2011 జనగణన వివరాల మేరకు కాగా.. ఓటర్ల సంఖ్య మాత్రం తాజాది. 2011 జనగణన ప్రకారం గ్రేటర్ జనాభా 67,31,790 ఉంటే ఓటర్లు 78,48,259 మంది ఉన్నారు. అంటే కేవలం మూడేళ్లలోనే ఓటర్లు జనాభాను మించిపోయారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నగరానికి వలస వచ్చిన వారు ఎక్కువగా ఉన్నారా? అంటే గత మూడేళ్ల పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే అదీ లేదు. అయినా గ్రేటర్లో జనాభా కంటే ఓటర్లు సుమారు 11 లక్షలకు పైగా పెరిగిపోయారు. ఇదే అంశంపై వివిధ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 2011లో జనగణన జరిగిన సమయంలో టీ ఆర్ఎస్, వివిధ జేఏసీల ఆధ్వర్యంలో సకల జనుల సమ్మె, ఇతరత్రా ఆందోళనలు జరిగాయని జీహెచ్ఎంసీ ఉద్యోగులు గుర్తు చేసుకుంటున్నారు. నిర్ణీత వ్యవధిలోగా జనగణన వివరాలు అందజేయాలి కనుక అప్పట్లో జనగణన కార్యక్రమం గ్రేటర్‌లోని అన్ని ప్రాంతాల్లో సవ్యంగా జరగలేదని ప్రైవేట్ సంభాషణల్లో అంగీకరిస్తున్నారు. దీనికితోడు ఓటు హక్కుపై పెరిగిన ప్రచారం, సోషల్ నెట్వర్కింగ్ సైట్ల వల్ల పెరిగిన చైతన్యం వెరసి ఓటర్లు ఇటీవల భారీగా పెరిగారు. గడచిన మూడుమాసాల్లోనే కొత్త ఓటర్లుగా 3.66 లక్షల మంది పేర్లు నమోదు చేయించుకున్నారంటేనే ఓటుపై ప్రచారం ఏ మేరకు జరిగిందో అర్థం చేసుకోవచ్చు. గతంలో కంటే ఓటర్లుగా పేరు నమోదు చేయించుకున్న వారు పెరిగినప్పటికీ.. జనాభా కంటే ఎక్కువైతే ఉండరు. జనగణన సరిగా చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి దాపురించింది. మరో ముఖ్యవిషయమేమిటంటే.. మెదక్‌జిల్లా పరిధిలోని పటాన్చెరు డివిజన్ కూడా గ్రేటర్‌లోనే ఉంది. ఈ నియోజకవర్గంలోని రెండు డివిజన్లు మాత్రమే గ్రేటర్లో ఉన్నందున ఆ నియోజకవర్గ ఓటర్లను పరిగణనలోకి తీసుకోలేదు. ఆ నియోజకవర్గ మొత్తం ఓటర్లను (2,93,768మందిని) పరిగణనలోకి తీసుకుంటే ఓటర్లు 81,42,027 గా ఉన్నారు. ఈ లెక్కల్ని బట్టి గ్రేటర్ జనాభా దాదాపు కోటికి చేరి ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు. -
వైఎస్ విజయమ్మకుజననీరాజనం
పశ్చిమ కృష్ణా జనసంద్రంగా మారింది. అడుగడుగునా ఆత్మీయ స్వాగతాలు.. దారిపొడవునా ప్రజల నీరాజనాలు నడుమ మండుటెండను సైతం లెక్కచేయకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ జిల్లాలో వైఎస్సార్ జనభేరి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తన కోసం నిరీక్షించిన ప్రజలను ఉద్దేశించి పలుచోట్ల ప్రసంగిస్తూ జిల్లాలో రోడ్‌షో నిర్వహించారు. కొద్ది రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల శంఖారావం పూరించారు. సోమవారం జిల్లాలోని జగ్గయ్యపేట నియోజవర్గంలో ప్రారంభమైన యాత్ర మైలవరం నియోజకవర్గంలో ముగిసింది. -
పచ్చి మోసగాడు ‘బాబు’
చంద్రబాబు రోడ్‌షోలో పాత చెప్పులతో నిరసనకు నిర్ణయం ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు చిన సుబ్బారావు రాజమండ్రి రూరల్, న్యూస్‌లైన్ : మాదిగలకు మాటిచ్చి మోసం చేసిన తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు మంగళవారం మండపేటలో నిర్వహించే రోడ్‌షోలో పాతచెప్పులతో నిరసన తెలియజేస్తామని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ముమ్మిడివరపు చిన సుబ్బారావు మాదిగ హెచ్చరించారు. సోమవారం ఆయన జిల్లా ఎమ్మార్పీఎస్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. మాదిగనై పుడతానని చెప్పుకున్న చంద్రబాబు జిల్లాలో మూరు రిజర్వ స్థానాల్లో ఒకటి మాదిగలకు కేటాయిస్తానని హామీ ఇచ్చి మాట తప్పారన్నారు. మంగళవారం జిల్లాలో పర్యటించే చంద్రబాబుకు ప్రతి మాదిగ ఒక చెప్పుతో నిరసన తెలిపాలని పేర్కొన్నారు. యనమల వెన్నుపోటు పొడిచాడు మాదిగలకు సీటు రాకుండా ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. రాజానగరం జడ్పీటీసీ స్థానం కేటాయిస్తానని చెప్పి మోసం చేసిన పెందుర్తి వెంకటేష్‌ను ఎన్నికల్లో ఓడించి తీరుతామన్నారు. 2004, 2009 ఎన్నికలలో మాలలకు, మాదిగలకు సమాన రాజకీయ అవకాశం కల్పించింది వైఎస్సార్ ఒక్కరే అన్నారు. చంద్రబాబు మాట నిలబెట్టుకోకపోతే మహాజన సోషలిస్టు పార్టీ అన్ని స్థానాలకు పోటీ చేస్తుందన్నారు. -
రైతులకు కన్నీళ్లు మిగిల్చిన వడగళ్లు
సాల్వాపూర్, మన్సాన్పల్లిలో భారీగా పంటనష్టం వెయ్యి ఎకరాల్లో ధ్వంసమైన వరి పంట రాలిపోయిన మామిడి కాయలు బచ్చన్నపేట, న్యూస్‌లైన్ : ప్రకృతి మరోసారి కన్నెర్ర చేసింది. రైతులను కోలుకోలేని దెబ్బతీసింది. వారం రోజుల క్రితం కురిసిన వడగళ్లతో కుదేలైన రైతులు, ఆదివారం రాత్రి మరోసారి ప్రకృతి సృష్ట్టించిన బీభత్సానికి విలవిలలాడారు. వంద కిలోమీటర్ల వేగంతో వీచిన గాలి, వాన దుమారంతో వందలాది ఎకరాల్లో మామిడి చెట్లు విరిగిపోవడమేగాక, కాయలు రాలిపోయాయి. మండలంలోని సాల్వాపూర్, మన్సాన్పల్లి, లింగంపల్లి, కొన్నె, పడమటికేశ్వాపూర్, ఇటికాపల్లి, బచ్చన్నపేట, తమ్మడపల్లి, కట్కూరు, చినరామన్‌చర్ల, బసిరెడ్డిపల్లి గ్రామాలతోపాటు మండలవ్యాప్తంగా గోలి సైజులో గంటన్నరపాటు కురిసిన వడగళ్లు వెయ్యి ఎకరాల్లో వరి పంటను నాశనం చేశాయి. సుమారు 250 ఎకరాలకుపైగా మక్క పంట, మామిడి తోటలకు తీవ్రనష్టం వాటిల్లింది. దీంతో బాధిత రైతులు బోరున విలపిస్తున్నారు. బాధిత రైతులను ఆదుకోవాల ని ఆయా గ్రామాల సర్పంచ్‌లు చొక్కం వరల క్ష్మి, బండకింది చంద్రకళ, భైరగోని బాలమణి, బేజాటి సిద్దులు, కాంగ్రెస్ నాయకులు గూడ చెన్న కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. ఆయా గ్రామాల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో గ్రామాలు అంధకారంలోనే ఉండిపోయాయి. మద్దూరులో గాలి దుమారం మద్దూరు : మండలంలో ఆదివారం సాయంత్రం భారీ గాలిదుమారం రావడంతో చేతికందిన వరి పంట నాశనమైంది. వందలాది ఎకరాల్లో మామిడి కాయలు నేల రాలాయి. ఇంటి పైకప్పు రేకులు లేచిపోయి నిలవ నీడలేకుండా చేశాయి. అప్పులు చేసి పండించిన పంటలు చేతికందే సమయంలో గాలి దుమారం రావడంతో రైతు లు కన్నీరుమున్నీరయ్యారు. చేసిన అప్పులు ఎలా తీరేదని వాపోతున్నారు. మామిడి రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ప్రభుత్వం స్పందించి రైతులకు తగిన సాయం అందించి ఆదుకోవాలని కోరుతున్నారు. -
విధుల పంచాయితీ
వివాదంగా మారిన ఉద్యోగుల కాపలా {స్టాంగ్‌రూంల వద్ద సెక్యూరిటీ గార్డు బాధ్యతలపై విమర్శలు జెడ్పీ సీఈఓ ఆదేశాలపై సర్వత్రా నిరసన విధుల్లో చేరిన సూపరింటెండెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు మహిళా ఉద్యోగులకు ఊరటనిచ్చిన మినహాయింపు జిల్లా పరిషత్, న్యూస్‌లైన్ : స్థానిక ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్ బాక్స్‌లు భద్రపర్చిన స్ట్రాంగ్‌రూంల వద్ద జిల్లా పరిషత్ పరిధిలో పనిచేస్తున్న సూపరింటెండెంట్లు, సీనియర్ అసిస్టెంట్లను కాపలా పెట్టడం వివా దంగా మారింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ ముగిసిన విషయం తెలిసిందే. ఈ మేరకు జిల్లాలోని ములుగు, పరకాల, మహబూబాబాద్, వరంగల్, నర్సంపేట, జనగామ రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో ఆరు స్ట్రాంగ్ రూంలను ఏర్పాటు చేసి బ్యాలెట్ బాక్స్‌లను భద్రపర్చారు. వీటి భద్రత బాధ్యతలను పోలీసు యంత్రాంగం చేపట్టింది. అయితే ఓట్ల లెక్కింపు ప్రక్రియను సుప్రీం కోర్టు వాయిదా వేయడంతో స్ట్రాంగ్ రూంల వద్ద రాష్ట్ర ఎన్నికల కమిషన్ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. సుప్రీం ఆదేశాల ప్రకారం వచ్చే నెల ఏడో తేదీ తర్వాతే లెక్కింపు చేపట్టాలి. తుది విడత పోలింగ్ జరిగిన రోజు నుంచి లెక్కేస్తే... సుమారు 30 రోజుల వ్యవధి ఉంది. ఈ నేపథ్యంలో స్ట్రాంగ్ రూంలలో భద్రపర్చిన బ్యాలెట్ బాక్సులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని సీఈసీ నిర్ణయం తీసుకుంది. స్ట్రాంగ్ రూంలు జిల్లా కేంద్రంలో ఉంటే కలెక్టర్ గానీ... జేసీ గానీ, రెవెన్యూ డివిజన్లలో ఉంటే ఆయా డివిజన్లకు చెందిన ఆర్డీఓలు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో పరిశీలించాలని ఉత్తర్వులు జారీ చేసింది. బ్యాలెట్ పేపర్లు చెదలు, చీడపురుగులతో పాడవకుండా పరిశీలించేందుకు ఆర్డీఓలతోపాటు ఆయా మండలాలకు చెందిన ఆర్ఓలు, ఏఆర్ఓలు... పోటీ చేసిన అభ్యర్థుల సమక్షంలో వారంలో ఒక రోజు స్ట్రాంగ్ రూముల్లో ఉన్న బ్యాలెట్ బాక్స్‌లను పరిశీలించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎస్ఈసీ రాష్ట్రవ్యాప్తంగా ఈ విధానాన్ని అమలు చేస్తోంది. ఇంతవరకు వ్యవహారం బాగానే ఉంది. ఈ క్రమంలో జిల్లాలో పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తున్న సూపరింటెండెంట్లు, సీనియర్ అసిస్టెంట్లకు స్ట్రాంగ్ రూంల వద్ద కాపలా ఉండాలని సీఈఓ ఆంజనేయులు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతిరోజూ ముగ్గురు చొప్పున సూపరింటెండెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు మూడు షిప్టులుగా ఎనిమిది గంటలపాటు విధులు నిర్వర్తించాలని ఆదేశాలు జారీ చేయడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. అరుుతే ఈ విధుల నుంచి మహిళా ఉద్యోగులను మినహాయించడం వారికి ఊరటనిస్తోంది. ఇది సరికాదు... ఎన్నికల్లో భాగంగా బ్యాలెట్ బాక్సులను భద్రపర్చిన స్ట్రాంగ్‌రూంల వద్ద పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేపట్టినప్పటికీ... పీఆర్ ఉద్యోగులను కాపలా పెట్టడం సరికాదని తెలంగాణ పంచాయతీరాజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బేహర శ్రీకాంత్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా స్ట్రాంగ్‌రూంల వద్ద పోలీసులు భద్రతా ఏర్పాట్లు చూస్తుంటే... ఇక్కడ పీఆర్‌కు చెందిన ఉద్యోగులకు కూడా డ్యూటీలు వేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు. పీఆర్ ఉద్యోగులు ఇప్పటి వరకు ఎన్నడూ స్ట్రాంగ్ రూంల వద్ద విధులు నిర్వర్తించలేదని... జెడ్పీ సీఈఓ నిర్ణయంతో వారు ఆందోళనలకు గురవుతున్నారన్నారు. స్ట్రాంగ్‌రూంల వద్ద పీఆర్ ఉద్యోగులను కాపలా పెట్టడం పోలీసులను అవమానించినట్లేనని పేర్కొన్నారు. ఇలాంటి వివాదాస్పదమైన నిర్ణయంపై సీఈఓ పునరాలోచించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. -
పాతికేళ్లలో కుప్పానికి ఏంచేశారు?
బాబు తీరుపై ప్రజల ఆగ్రహం తప్పని నీటి కష్టాలు ట్రాఫిక్ సమస్య యథాతథం కుప్పంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ కూడా లేదు ‘కుప్పం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాష్ట్రానికి తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్నారు. పది సంవత్సరాలు ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నారు. అంతకు ముందు ఆర్థిక, రెవెన్యూ శాఖ మంత్రిగా పని చేశారు. కనీసం తాగునీటి కష్టం తీర్చలేకపోయారు. పిల్లలు చదువుకునేందుకు డిగ్రీ కాలేజీ లేదు. ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది. ఎందుకు నీకు ఓటేయాలి బాబూ’ అంటూ కుప్పం ప్రజలు చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుప్పం నుంచి ఎంపికవుతూ పాతికేళ్ల కాలంలో చంద్రబాబు అనేక ఉన్నత శిఖరాలు అధిరోహించారు తప్ప, తమను మాత్రం సరిగా పట్టించుకోలేదని కుప్పం మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవీ సమస్యలు సాగు, తాగునీటికి శాశ్వత సౌకర్యం కల్పించలేదు. నియోజకవర్గంలో చిన్నపాటి నీటి ప్రాజెక్టును కూడా నిర్మించలేదు. పాలారు ప్రాజెక్టు నిర్మాణం అప్పట్లో చేపట్టి ఉంటే ఇప్పుడు కుప్పం ప్రాంతంలో నీటి కొరత ఉండేది కాదు. ఇంటర్ విద్య వరకే కుప్పంలో అవకాశం ఉంది. కనీసం ప్రభుత్వ డిగ్రీ కళాశాల కూడా లేదు. రాతి పనిచేసేవారు అధికంగా ఉన్న కుప్పం ప్రాంతంలో కార్మికులకు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు. సువూరు 8 వేల వుంది నిత్యం బెంగళూరు పట్టణానికి కూలి పనుల కోసం రాకపోకలు సాగిస్తున్నారు. పారిశ్రామిక వాడకు శంకుస్థాపన చేశారే గానీ, ఒక్క పరిశ్రవును కూడా తీసుకురాలేదు. కుప్పంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పూర్తయినా ట్రాఫిక్ సవుస్య తీరలేదు. పట్టణంలోని ఆర్ఎస్ పేట, కొత్తపేటలకు అనుసంధానంగా ఉన్న రైల్వే గేట్‌ను వుూసివేయూలని రైల్వే అధికారులు ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇదే జరిగితే పట్టణం రెండు భాగాలై, కొత్తపేట వాసులతో పాటు అటువైపు ఉన్న గ్రావూల ప్రజలు వ్యాపార, రాకపోకలకు ఇబ్బంది పడాల్సిందే. అండర్ బ్రిడ్జి నిర్మించాలన్న డిమాండ్ పదేళ్లుగా ప్రతిపాదనలకే పరిమితమైంది. నియోజకవర్గ పరిధిలోని రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. వీటికి వురవ్ము తులు చేసిన దాఖలాలు లేవు. జాతీయు రహదారి వురవ్ముతుల కోసం అధికారులు రూ.42 కోట్లతో పంపిన ప్రతిపాదనలు బుట్టదాఖలయ్యాయి. వుుందుచూపు లేకపోవడంతో రూ.కోటి వ్యయంతో నిర్మించిన కొత్తపేటలోని కాంప్లెక్స్ నిరుపయోగంగా వూరింది. రైల్వేగేట్ వుూసివేతకు గురైతే ఈ కాంప్లెక్స్‌లో గదులు అద్దెకు అడిగే వారుండరు. స్పోర్ట్స్ స్టేడియుం, వూర్కెట్ యూర్డు, గార్మెంట్స్ పరిశ్రవుల నిర్మాణం శిలాఫలకాలకే పరిమితమైంది. రూ.కోట్లతో నిర్మించిన వాటర్ ప్లాంట్ పట్టణ ప్రజల దాహార్తిని తీర్చడం లేదు. ప్రత్యావ్నూయు ఏర్పాట్లూ చేయలేదు. తాగునీరు ఇస్తున్న సాయిబాబా ట్రస్ట్ కుప్పం నియోజకవర్గంలోని ప్రతి గ్రావుంలోనూ పుట్టిపర్తి సారుుబాబా ట్రస్టు ఆధ్వర్యంలో వుంచినీటి ట్యాంకుల నిర్మాణం జరిగింది. ఈ ట్యాంకుల ద్వారానే ప్రస్తుతం ప్రజలకు తాగునీరు అందుతోంది. సాయిబాబా ట్రాస్ట్ వారికి ఉన్న మనస్సు కూడా ఆ నియోజకవర్గాన్ని పాలించే పాలకుడికి లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించే అంశం. తమను పట్టించుకోకున్నా ఇన్నేళ్లుగా ఓట్లు వేస్తున్న ప్రజలు, ఇప్పుడు ఆలోచించాల్సిన సమయం ఆసన్నమయింది. -
వైఎస్ఆర్సీపీలో మైనారిటీలకు పెద్దపీట
జెడ్పీకి నీలూఫర్ మదనపల్లెకు షమీమ్ అస్లాం, పుంగనూరు మునిసిపాలిటీకి షమీం చైర్పర్సన్ అభ్యర్థులను ప్రకటించిన మిథున్‌రెడ్డి మదనపల్లె, న్యూస్‌లైన్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లీం మైనారిటీలకు పెద్దపీట వేసిందని రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి స్పష్టంచేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక కార్యాలయంలో శనివారం జరిగిన సమావేశంలో మిథున్‌రెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్, మదనపల్లె, పుంగనూరు మునిసిపల్ చైర్పర్సన్ అభ్యర్థులను ప్రకటించారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ అభ్యర్థిగా రొంపిచెర్లకు చెందిన నీలూఫర్, మదనపల్లె మునిసిపల్ చైర్పర్సన్ అభ్యర్థిగా గుండ్లూరి షమీం అస్లాం, పుంగనూరు మునిసిపల్ చైర్పర్సన్ అభ్యర్థిగా షమీంను ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ముస్లీం మైనారిటీలకు రాజకీయ ప్రాధాన్యాన్ని కల్పిస్తూ అభ్యర్థులను ప్రకటించారని, ఇందులో భాగంగా మన జిల్లాలో కూడా ప్రకటించినట్లు మిథున్‌రెడ్డి తెలిపారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఇక్కడ కూడా ఆభ్యర్థులను ఖరారుచేసి ప్రకటించామని చెప్పారు. మునిసిపల్ చైర్పర్సన్ అభ్యర్థి గుండ్లూరి షమీమ్ అస్లామ్ మాట్లాడుతూపమాణ స్వీకారంచేసిన వెంటనే నీరుగట్టువారిపల్లెలో మరమగ్గాలు ఉన్న భవనాలను కమర్షియల్ నుంచి నాన్ కమర్షియల్‌కు మారుస్తామని చెప్పారు. పట్టణానికి శాశ్వత తాగునీటి పరిష్కారం కోసం ప్రతిపాదించిన సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు నిర్మాణానికి యుద్ధప్రాతిపదికన పనులు చేపడతామన్నారు. మైనారిటీల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హాజీ అక్తర్ అహ్మద్ మాట్లాడుతూ మైనారిటీలంతా పార్టీకి పట్టుకొమ్మల్లా ఉంటూ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల గెలుపుకోసం సైనికుల్లా పనిచేస్తారని తెలిపారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ దేశాయ్ తిప్పారెడ్డి, రాష్ట్ర బీసీ నాయకులు పాల్ బాలాజీ, జిల్లా యువజన విభాగం కార్యదర్శి ఎస్ఏ కరీముల్లా, సింగిల్ విండో చైర్మన్ ఆనంద్, సర్పంచ్ శరత్‌రెడ్డి, మైనారిటీల నాయకులు బాబ్జాన్, జింకా వెంకటా చలపతి, సురేంద్ర, లక్ష్మీనారాయణ, దండాల రవిచంద్రారెడ్డి, మహిళా నాయకులు కొంగా పద్మావతి, శ్రీదేవి,మల్లిక, వైజయంతి, గిరిజ, కార్యకర్తలు పాల్గొన్నారు. -
నేడే తేలేది..
నేడే తేలేది.. బరిలో మిగిలేదెవరో.. తప్పుకునేదెవరో! ఊపందుకున్న బుజ్జగింపులు ప్రచారాస్త్రాలతో సమరాంగణంలోకి.. వ్యూహ ప్రతివ్యూహాలకు పదును సాక్షి, సిటీబ్యూరో: వాడివేడి వ్యూహాలు.. బుజ్జగింపులు..బేరసారాలు.. సిద్ధమైన ప్రచారాస్త్రాలు.. గ్రేటర్లో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. హోరాహోరీ పోరులో అమీతుమీ తేల్చుకునేందుకు అభ్యర్థులంతా నేటి నుంచి సమరాంగణంలోకి దూకనున్నారు. శనివారం నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు కావడంతో ఆయా పార్టీల నుంచి రెబల్స్‌గా బరిలో దిగిన వారిని బుజ్జగించే యత్నాలు జోరందుకున్నాయి. రెబల్స్ నామినేషన్లను ఉపసంహరించుకోకుంటే ఎన్నికల బ్యాలెట్లో వారి పేరుంటుంది. దీన్ని నివారించేందుకు ఆయా పార్టీల ప్రధాన అభ్యర్థులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. పలుచోట్ల పోటీ నుంచి తప్పుకునేందుకు రెబల్స్ ససేమిరా అంటున్నారు. వెనక్కి తగ్గబోమని తెగేసి చెబుతున్నారు. ఈ పరిణామాలు ఉత్కంఠ కలిగిస్తున్నాయి. పోటాపోటీగా ప్రచార సన్నాహాలు తుదిగా బరిలో ఎవరెవరు ఉంటారో నేడు తేలిపోనుంది. ప్రత్యర్థులెవరో దాదాపు తెలిసిపోయింది. దీంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారాస్త్రాలకు పదును పెడుతున్నారు. హంగు ఆర్భాటాలు, అనుచరగణంతో జనంలోకి వెళ్లేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. ఈసారి గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రచార కార్యక్రమాల్ని ఆయా పార్టీల ముఖ్య నాయకులు ప్రారంభించనుండటం ఆసక్తి కలిగిస్తోంది. వైఎస్సార్సీపీ ముఖ్య నాయకురాలు వైఎస్ షర్మిల, టీడీపీ, టీఆర్ఎస్ అధినేతలు చంద్రబాబు, కేసీఆర్ గ్రేటర్ వ్యాప్తంగా రోడ్‌షోలు, ర్యాలీలు, బహిరంగసభలు నిర్వహించనున్నారు. ఆయా కార్యక్రమాలకు భారీగా జనాన్ని తరలించేందుకు అభ్యర్థులు ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ ముఖ్యనేతల రాక తమకు అనుకూలంగా మారుతుందని, కార్యకర్తల్లో ఊపు తెస్తుందని వారంతా భావిస్తున్నారు. అధికారులకు ఈవీఎంల బెడద నామినేషన్ల ఉపసంహరణకు శనివారం చివరి రోజు కావడంతో, చివరకు బరిలో ఎందరు మిగులుతారనే దానిపై ఎన్నికల అధికారులు దృష్టి పెట్టారు. పోలింగ్‌కు వినియోగించే ఈవీఎంలలో మొత్తం 16 బటన్లుండగా, వీటిలో ఒకటి ‘నోటా’కు పోను 15 పార్టీ చిహ్నాల డిస్ప్లేకు వీలుంటుంది. అంతకుమించి రంగంలో మిగిలితే మరో ఈవీఎంను అదనంగా వాడాల్సిందే. శనివారం ఈ విషయంలో స్పష్టత ఏర్పడనుంది. కొందరు దారిలో.. ఇంకొందరు బరిలోనే.. శేరిలింగంపల్లిలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి, హఫీజ్‌పేట కార్పొరేటర్ జగదీశ్వర్‌గౌడ్.. ప్రజల మద్దతున్న తాను పోటీలోనే ఉంటానని చెబుతున్నారు. పలు బస్తీలవాసులు ఆయనను కలిసి అండగా నిలుస్తున్నారు. దీంతో ఆయన మనసు మారే పరిస్థితి కనిపించట్లేదు. ఆయన పోటీలో ఉంటే అది లోక్‌సభ ఎన్నికల్లోనూ ప్రభావం చూపుతుందని భావిస్తున్న చేవెళ్ల లోక్‌సభ అభ్యర్థి కార్తీక్‌రెడ్డి, ఆయన తల్లి సబితా ఇంద్రారెడ్డి జగదీశ్వర్‌గౌడ్‌ను పోటీ నుంచి తప్పించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది శేరిలింగంపల్లిలో టీడీపీకీ రెబల్ పోటు తప్పేలా లేదు. మొవ్వా సత్యనారాయణ పట్టు వీడేది లేదని చెబుతున్నారు. గడువులోగా ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాల్సిందే ఎల్బీనగర్ నుంచి టీడీపీ తిరుగుబాటు అభ్యర్థి సామ రంగారెడ్డి పోటీలో ఉంటాననే చెబుతున్నారు సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ రెబల్స్‌గా బరిలో ఉన్న పీఎల్ శ్రీనివాస్, బద్రినాథ్, ఏడుకొండ లు ఆంతర్యం పార్టీ వర్గాలకు అంతుబట్టడం లేదు గోషామహల్లో పార్టీ అభ్యర్థికి సవాల్ విసురుతున్న గోవింద్‌రాఠి, నందకిశోర్‌వ్యాస్, రామస్వామిలను బుజ్జగించడంలో బీజేపీ అధిష్ఠానం కొంతమేర సఫలమైనట్లు తెలుస్తోంది ముషీరాబాద్‌లో కాంగ్రెస్ రెబల్స్ సునీతాప్రకాశ్, బీసీ సెల్ చైర్మన్ నగేష్ముదిరాజ్లను బుజ్జగించే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. పార్టీ అభ్యర్థి డాక్టర్ వినయ్‌కుమార్ సునీతా ప్రకాశ్ ఇంటికి వెళ్లి సహకరించాలని కోరడంతో ఆమె మెత్తబడ్డట్లు సమాచారం. నగేశ్ ముదిరాజ్‌ను దారిలోకి తెచ్చుకునే పనిలో పీసీసీ ఉన్నట్టు తెలుస్తోంది -
బాబు కపటప్రేమను నమ్మొద్దు
కిరణ్కూ ప్రజలే బుద్ధి చెబుతారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడి మబ్బు చెంగారెడ్డిది గొప్ప మనసు : భూమన కరుణాకరరెడ్డి తిరుపతి కార్పొరేషన్, న్యూస్‌లైన్ : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులపట్ల చూపుతున్న కపటప్రేమకు మోసపోవద్దని వైఎస్సార్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. విద్యుత్, ఆర్టీసీ బస్సుచార్టీలను విపరీతంగా పెంచిన ఘనత ఆయనదేనని, వాటిని తగ్గించాలని కోరినందుకు రైతులు, మహిళలను లాఠీలతో కొట్టించి, తుపాకులతో కాల్పించిన విషయూన్ని ప్రజలు మరచిపోరాదని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నాయకులు, దివంగత నేత, తిరుపతి మాజీ ఎమ్మెల్యే మబ్బు రామిరెడ్డి కుమారుడు మబ్బు చెంగారెడ్డి శుక్రవారం ఉదయం రెండు వేలమందితో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. చెంగారెడ్డికి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా హాజరైన పెద్దిరెడ్డి మాట్లాడుతూ కరెంట్ బిల్లులు చెల్లించలేదని రైతులపై కేసులు మోపించిన చంద్రబాబు ప్రస్తుతం వారిపై కపటప్రేమను చూపుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర బడ్జెట్‌ను మించిన విధంగా టీడీపీ మేనిఫెస్టోలో అలవికాని హామీలిస్తున్నారని, వీటికి ప్రజలు మోసపోవద్దన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి తూట్లు పొడిచిన మరో మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఓ పార్టీ పెట్టారని, ఆయనకు ఈ ఎన్నికల్లో ఁచెప్పురూ. గుర్తుతోనే తగిన బుద్ధిచెప్పేందుకు ఓటర్లు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీతో సుదీర్ఘకాలం అనుబంధం ఉన్న మబ్బు కుటుంబం వైఎస్ఆర్ కాంగ్రెస్‌లో చేరడం శుభపరిణామన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం రాష్ట్రంలో ఏర్పడిన ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి (వైఎస్ఆర్ కాంగ్రెస్) పార్టీని ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. ప్రజాసంక్షేమమే ధ్యేయంగా మంచి పథకాలన్ఙుమేనిఫెస్టోరూ.లో రూపొందించారని స్పష్టం చేశారు. జగన్ బాటలో పయనిస్తున్న ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, ఎంపీగా పోటీచేస్తున్న వరప్రసాద్‌ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ గుండెలు హత్తుకునేలా ఆత్మీయుడైన తమ్ముడు మబ్బు చెంగారెడ్డిని హృదయపూర్వకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారూ. అని చెప్పారు. పది మందికి సాయం చేసే గొప్ప మనసు చెంగారెడ్డిదని, ఆయన పార్టీలోకి రావడం అభినందనీయమని తెలిపారు. ఆయన సేవలను పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించదని, భవిష్యత్‌లో ఆయనకు సమున్నత స్థానం కల్పిస్తుందని స్పష్టం చేశారు. జగన్ నాయకత్వంలో స్వార్థ రాజకీయలకు అతీతంగా తిరుపతిని సాంస్కృతిక నగరంగా తీర్చిదిద్దుకుందామని పిలుపునిచ్చారు. మబ్బు చెంగారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో 30 ఏళ్ల పాటు మబ్బు కుటుంబాన్ని ఆదరించినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. మబ్బు కుటుంబంలో ఎలాంటి విభేదాలు లేవన్నారు. మా అన్న మబ్బుదేవ నారాయణరెడ్డి అన్నా, మబ్బు కుటుంబం అన్నా ఎనలేని గౌరవం ఉందరూ.న్నారు. తాను తన అన్నను విభేదిస్తున్నట్టు వస్తున్న ప్రచారాన్ని కొట్టిపడేశారు. కాంగ్రెస్ పార్టీని, సిద్ధాంతాలను మాత్రమే విభేదించి బయటకు వచ్చా, మబ్బు కుటుంబం అన్నా, మా అన్న అన్నా ఎప్పటికీ గౌరవం ఉంటుందిరూ. అని స్పష్టం చేశారు. ఎంపీగా పోటీచేస్తున్న వరప్రసాద్ మాట్లాడుతూ ప్రజానాయకుడు, రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన చెంగారెడ్డి పార్టీలో చేరడం సంతోషమఅన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు పాలగిరి ప్రతాప్‌రెడ్డి, నాయకులు దొడ్డారెడ్డి సిద్దారెడ్డి, ఎస్కే బాబు, ఆదికేశవులురెడ్డి, అమరనాథరెడ్డి, మబ్బు యువసేన నాయకులు కాండ్ర సత్యనారాయణ, ఆర్ఆర్ శ్రీనివాసులు, వెంకటముని యాదవ్, పరందామ్, గుణశేఖర్, మహిళా నాయకురాలు పద్మజ తదితరులు పాల్గొన్నారు. మబ్బు యువసేన నాయకులు పెద్ద ఎత్తున పూలమాలలతో చెంగారెడ్డి, కరుణాకరరెడ్డి, పెద్దిరెడ్డిని సన్మానించారు. పెద్ద ఎత్తున బాణసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. -
టీడీపీ దౌర్జన్యకాండ
తుది విడత పోరులో చెదురుమదురు ఘటనలు జెడ్పీటీసీల్లో 82.46, ఎంపీటీసీల్లో 82.64 శాతం పోలింగ్ ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు మధ్యాహ్నానికే 60 శాతం పోలింగ్ మలి విడత ప్రాదేశిక ఎన్నికల్లో టీడీపీ నాయకులు దౌర్జన్యకాండకు దిగారు. రామచంద్రాపురం మండలం కమ్మకండ్రిగలో వీరంగం చేశారు. దళితులపై విచక్షణారహితంగా దాడిచేశారు. మహిళలను కూడా చూడకుండా తరిమి తరిమి కొట్టారు. మాకు ఎన్నికలే వద్దు వెళ్లిపోతామని కాళ్లుపట్టుకున్నా కనికరించలేదు. సాక్షి, తిరుపతి : పరిషత్ ఎన్నికల్లో శుక్రవారం జరిగిన తుదివిడత ప్రాదేశిక పోలింగ్ సందర్భంగా చెదురుమదురు సంఘటనలు చోటుచేసుకున్నారుు. పలుచోట్ల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దౌర్జన్యాలకు పాల్పడ్డారు. తొలివిడత కన్నా ఈసారి ఎక్కువ పోలింగ్ నమోదైంది. పోలింగ్ ప్రారంభమైన ఉదయం ఏడు గంటల నుంచే ఓటర్లు క్యూ లు కట్టారు. మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మధ్యాహ్నం భోజన విరామానికే సుమారు 60 శాతం ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయం తొమ్మిది గంటలకు 16.4, 11 గంటలకు 39.31, ఒంటి గంటకు 59.3, మధ్యాహ్నం మూడు గంటలకు 72.33 శాతం పోలింగ్ జరిగింది. ఎండ తీవ్రతను సైతం లెక్కచేయకుండా ఓటింగ్‌కు హాజరైనట్టు పోలింగ్ సరళి తెలియజేస్తోంది. పోలింగ్ ప్రారంభం నుంచే ఓటర్లు బారులుతీరడంతో పోలింగ్ సిబ్బంది కొంత ఇబ్బందిపడ్డారు. కొన్నిచోట్ల పోలింగ్ ప్రారంభించడానికి సమయం తీసుకున్నారు. మొత్తానికి స్వల్ప సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. తుదివిడతలో 34 జెడ్పీటీసీ , 442 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి మొత్తం 11,15,630 ఓట్లకు గాను 9,19,938 ఓట్లు పోల్ కాగా 82.46 శాతం పోలింగ్ నమోదైంది. ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి 10,86,804 ఓట్లకు గాను 9,98, 184 ఓట్లు పోలయ్యాయి. 82.64 శాతం పోలింగ్ నమోదైంది. విజయపురంలో స్వల్పంగా లాఠీచార్జి .. - విజయపురంలో ఒక పోలింగ్ కేంద్రం వద్ద పోలీసులు స్వల్పంగా లాఠీచార్జి చేశారు. స్థానికేతరులు ఓటింగ్‌లో పాల్గొంటున్నారని ఏజెంట్లు అభ్యంతరం చెప్పారు. దీంతో రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకోవడంతో పోలీసులు గుంపులను చెదరగొట్టేందుకు స్వల్పంగా లాఠీచార్జి చేశారు. పంగూరులో పంచాయతీ కార్యదర్శి గృహనిర్బంధం ఏర్పేడు మండలం పంగూరు పోలింగ్ కేంద్రంలో రాజకీయపార్టీలకు వేర్వేరు ఓటర్ల జాబితాలు ఇవ్వడంతో పోలింగ్ సమయంలో ఏజెంట్లు ఇబ్బందిపడ్డారు. ఈ సమస్యకు పంచాయతీ కార్యదర్శి కారణమని తెలుసుకున్న గ్రామస్తులు అతడిని గృహనిర్బంధంలో ఉంచారు. పోలింగ్‌కు అంతరాయం కలగడంతో అధికారులు, పోలీసులు నచ్చజెప్పి అతడిని విడిపించారు. పోలింగ్ కొనసాగింది. వాహనాల్లో ఓటర్ల తరలింపు తుది విడత పోలింగ్ జరిగిన పలు మండలాల్లో ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు అభ్యర్థులు పోటీపడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలు దూరంగా ఉండటంతో ఓటర్ల కోసం ఆటోలు, ట్రాక్టర్లు ఏర్పాటు చేశారు. గంగాధరనెల్లూరు నియోజకవర్గంలో వెదురుకుప్పం, పెనుమూరు మండలాల్లో ఈ ఏర్పాట్లు ఎక్కువగా జరిగాయి. తెలుగుతమ్ముళ్ల దౌర్జన్యాలివీ.... - పరిషత్ ఎన్నికల్లో గెలుపుకోసం ఓటర్లను పెద్ద ఎత్తున ప్రలోభపెట్టిన తెలుగుదేశం పోలింగ్ రోజున దౌర్జన్యాలకు దిగింది. విజయావకాశాలు లేనిచోట్ల ఓటర్లను, పోలింగ్ అధికారులను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నం చేసింది. - పాలసముద్రం మండలం శ్రీకావేరిరాజపురం పోలింగ్ స్టేషన్లో విధినిర్వహణలో ఉన్న ఎస్ఐ మహేష్ ఓటర్లను క్యూ లో నిలుచోవాలని సూచిస్తున్న సమయంలో టీడీపీ కార్యకర్తలు ఒక్కసారిగా ఆయనపై దాడికి పాల్పడ్డారు. పోలింగ్ స్టేషన్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఉన్నతాధికారులు ప్రత్యేక బలగాలను అక్కడికి రప్పించారు. దాడికి పాల్పడిన వారిని గుర్తించినప్పటికీ పరారైనట్టు సమాచారం. - చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం మండలం కమ్మకండ్రిగలో టీడీపీ కార్యకర్తలు రిగ్గింగ్ చేసుకున్నట్టు ఎస్సీ వర్గానికి చెందిన ఓటర్లు ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఈ ధ ర్నాలో వైస్సార్సీపీ సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. మూడు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ జరపాలని డిమాండ్ చేశారు. చంద్రగిరి మండలం పుదిపట్ల పోలింగ్ స్టేషన్లో ఓటింగ్ సరళి పరిశీలించేందుకు వెళ్లిన వైఎస్సార్సీపీ జనరల్ ఏజెంట్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. అక్కడి నుంచి భాస్కర్‌రెడ్డి వెళ్లిపోవాలంటూ గొడవకు దిగారు. పోలీసులు జోక్యం చేసుకుని టీడీపీ కార్యకర్తలను చెదరగొట్టారు. - చంద్రగిరి మండలం ఎం. కొంగరపల్లి, ముంగిలిపట్టు పోలింగ్స్టేషన్లలో టీడీపీ కార్యకర్తలు ఏకపక్షంగా పోలింగ్ చేసుకున్నారు. వైఎస్సార్సీపీ ఏజెంట్లను బయటకు తరిమివేసి ఓటింగ్ జరుపుకున్నారు. - శ్రీకాళహస్తి నియోజకవర్గంలో రూరల్ మండలం ఎంపేడులో ఓటు చూపించి వేయాలని తెలుగుదేశం నాయకులు ఓటర్లను భయభ్రాంతులకు గురిచేశారు. పోలీసులను కూడా లెక్కచేయలేదు. - మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి స్వగ్రామం ఊరందూరులో ఆయన సోదరుడు హరినాథరెడ్డి పోలింగ్ కేంద్రం వద్దనే కూర్చుని ఓటర్లను ప్రలోభపెట్టారు. - సత్యవేడు మండలం మదనంబేడు పోలింగ్ కేంద్రంలో టీడీపీ కార్యకర్త ఒకరు మద్యం సేవించి విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్‌పై దౌర్జన్యానికి పాల్పడ్డారు. - పుత్తూరు రూరల్ మండలం నేసనూరులో ఓట్లు చూపించి వేయాలని టీడీపీ జనరల్ ఏజెంట్ వాజ్పేయినాయుడు బెదిరించడంతో గ్రామస్తులు దాడి చేశారు. ఈ దాడిలో ఆయనతో పాటు మరొకరికి దేహశుద్ధి చేశారు. - పూతలపట్టు మండలం వేపనపల్లి పోలింగ్ కేంద్రంలో టీడీపీ సర్పంచ్ చిట్టిబాబు ఓటు వేసేందుకు వచ్చిన వెంకటేశ్వర్లు అనే ఓటరుపై దౌర్జన్యం చేశారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే మండలం ఎగువపాలకూరు గ్రామానికి చెందిన దళితులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం ఇవ్వాలని పోలింగ్ కేంద్రం వద్ద ధర్నాకు దిగారు. ఇక్కడ కొంతకాలంగా టీడీపీ నాయకులు తమ ఓట్లు వేసుకోనీకుండా అడ్డుకుంటున్నారని వారు ఆరోపించారు. -
‘పరిషత్’లో ఫ్యాను స్పీడు
రెండో విడతలోనూ మెజారిటీ జెడ్పీటీసీ స్థానాల్లో వైఎస్సార్ సీపీ గెలుపు అవకాశాలు గెలుపుకోసం ప్రలోభాలను రెట్టింపు చేసిన టీడీపీ సాక్షి, తిరుపతి: పరిషత్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు విజయావకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ నెల ఆరో తేదీన మదనపల్లె డివిజన్ పరిధిలో తొలివిడతలో జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో ఆ పార్టీ జోరు ప్రదర్శించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం జరగనున్న రెండోవిడత ఎన్నికల్లోనూ ఆ పార్టీ అదే జోరు ప్రదర్శించనున్నట్టు రాజకీయ పరిశీలకు లు అంచనా వేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ప్రాతినిథ్యం వహిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ హవా కనిపిస్తోంది. అంతేకాకుండా కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన గల్లా అరుణకుమారి, గుమ్మడి కుతూహలమ్మ ప్రాతినిథ్యం వహిస్తున్న చంద్రగిరి, గంగాధరనెల్లూరు నియోజకవర్గాల్లోనూ వైఎస్సార్ సీపీ అభ్యర్థులకు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గంగాధరనెల్లూరు నియోజకవర్గంలోని పాలసముద్రం, కార్వేటినగరంలో టీడీపీ అభ్యర్థులు గట్టి పోటీ ఇస్తున్నా, వైఎస్సార్ సీపీ అభ్యర్థులకే గెలుపు అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో ఒక్క చంద్రగిరిలో టీడీపీ, వైఎస్సార్ సీపీ మధ్య నువ్వానేనా అన్నట్టు పోటీ నెలకొంది. మిగిలిన మండలాల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులకు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నగరి నియోజకవర్గంలో వడమాలపేట మండలంలో మాత్రం పోటాపోటీగా ఉంది. మిగిలిన మండలాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ సులువుగా గెలుస్తుందనే అభిప్రాయం ఉంది. హస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలంలో కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కు కావడంతో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థికి గట్టి పోటీ ఇవ్వగలుగుతున్నారు. మిగిలిన మండలాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థుల విజయం నల్లేరు మీద నడకగా మారింది. సత్యవేడు నియోజకవర్గంలో చంద్రబాబు సామాజికవర్గం ఓటర్లు ఎక్కువగా ఉన్న ఒకటిరెండు మండలాలు మినహాయిస్తే మిగిలిన మండలాల్లో వైఎస్సార్ సీపీకి అనుకూలపవనాలు వీస్తున్నాయి. పూతలపట్టు నియోజకవర్గంలోనూ టీడీపీ సంప్రదాయ ఓటర్లు ఉన్న మండలాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులకు ఓ మోస్తరు పోటీ ఉంది. మెజారిటీ జెడ్పీటీసీలను వైఎస్సార్ కాంగ్రెస్ కైవసం చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. సత్యవేడు నియోజకవర్గంలో ఒకటి రెండు చోట్ల మాత్రమే తెలుగుదేశం అభ్యర్థులు గట్టి పోటీ ఇస్తున్నారు. తొలివిడత జరిగిన పరిషత్ ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం లో నాలుగు జెడ్పీటీసీ స్థానాల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇచ్చింది. ఇందులో రెండు చోట్ల గెలిచే అవకాశం ఉంది. పలమనేరు, పుంగనూరు, మదనపల్లె, పీలేరు, తంబళ్లపల్లె నియోజకవర్గాల పరిధిలో సైతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మెజారిటీ స్థానాలు గెలుచుకోనున్నారు. రెట్టింపు మొత్తంలో ‘దేశం’ ప్రలోభాలు తొలివిడత ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు పెద్ద ఎత్తున డబ్బు, మద్యం పంపిణీ చేసిన తెలుగుదేశం పార్టీ రెండో విడతలోనూ కొనసాగించింది. తొలివిడత ఎన్నికల ఓటింగ్ సరళి ప్రతికూలంగా ఉన్నట్టు అంచనాకు రావడంతో రెండో విడతలో రెట్టింపు మొత్తంలో డబ్బు పంపిణీ చేసింది. ఓటర్లను ఆకట్టుకునేందుకు అన్ని రకాల ఎత్తులు వేసింది. చంద్రగిరి నియోజకవర్గంలో గురువారం ఒక్కరోజు రెండు చోట్ల మద్యం పంపిణీ చేస్తుండగా పోలీసులు టీడీపీ కార్యకర్తలను అరెస్టు చేశారు. అదేవిధంగా పుత్తూరు రూరల్ మండలంలోనూ ఐదుగురు టీడీపీ కార్యకర్తలు మద్యం పంపిణీ చేస్తూ పట్టుబడ్డారు. పూతలపట్టు నియోజకవర్గంలో యువకులకు ఆహ్లాదకరమైన ప్రాంతాల్లో భారీ విందులు ఏర్పాటు చేశారు. పూతలపట్టు, ఐరాల మండలాల్లో ఓటర్లకు ఒక్కొక్కరికి *500 నుంచి *2000 వరకు డబ్బు పంపిణీ చేశారు. గంగాధరనెల్లూరు నియోజకవర్గం పెనుమూరు మండలంలోని కామచిన్నయ్యపల్లె, రామకృష్ణాపురం ఎంపీటీసీ సెగ్మెంట్లలో మహిళలకు ముక్కుపుడకలు పంపిణీ చేశారు. చంద్రగిరి -2 ఎంపీటీసీ సెగ్మెంట్లో వెండి దీపపు స్తంభాలు ఇంటింటికి చేరవేశారు. -
12నుంచి లోకేష్ యువప్రభంజనం
కోనేరుసెంటర్(మచిలీపట్నం), న్యూస్‌లైన్ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కుమారుడు నారా లోకేష్ జిల్లాలో 12వ తేదీ నుంచి యువప్రభంజనం పేరుతో బస్సు ర్యాలీ నిర్వహించనున్నట్లు టీడీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. ఎంపీ కార్యాలయంలో గురువారం స్థానిక నాయకులతో కలిసి ఉమా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ తొలి విడత ఎన్నికల్లో కనీస వసతులు లేక ఓటర్లు ఇబ్బందులకు గురయ్యారని చెప్పారు. రెండో విడత జరగబోయే ఎన్నికల్లోనైనా అధికారులు కనీస వసతులు కల్పించాలని కోరారు. 12వ తేదీ మధ్యాహ్యం 3 గంటలకు లోకేష్ నిమ్మకూరులోని దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు, బసవతారకమ్మల విగ్రహాలకు పూలమాలలు వేసి ర్యాలీ ప్రారంభిస్తారని చెప్పారు. అక్కడి నుంచి బస్సు ర్యాలీగా పామర్రు మీదుగా గుడివాడ చేరుకుని అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొంటారన్నారు. అనంతరం కంకిపాడు మీదుగా విజయవాడ చేరుకుని అక్కడ జరిగే సభలో పాల్గొంటారన్నారు. ఆ రోజు రాత్రి విజయవాడలో బస చేసి అనంతరం గుంటూరుకు వెళతారన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ళ బుల్లయ్య , మోటమర్రి బాబాప్రసాద్, గోపు సత్యన్నారాయణ, చిలంకుర్తి తాతయ్య, నారగాని ఆంజనేయప్రసాద్, పల్లపాటి సుబ్రహ్మణ్యం, బత్తిన దాసు, సాతులూరి నాంచారయ్య పాల్గొన్నారు. -
తుది సమరం
ప్రాదేశిక ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రత మారుమూల గూడేలకు గుర్రాలపై బ్యాలెట్‌బాక్సుల తరలింపు విశాఖ రూరల్/పాడేరు, న్యూస్‌లైన్ : మలి విడత ప్రాదేశిక సమరానికి రంగం సిద్ధమైంది. మన్యంలోని మారుమూల గూడేలకు బ్యాలెట్బాక్సులు, పోలింగ్ సిబ్బంది తరలింపునకు అధికారులు అష్టకష్టాలు పడ్డారు. పెదబయలు మండలం ఇంజరి సెగ్మెంట్లోని చీకుపనస, ఇంజరి కేంద్రాలకు ఎన్నికల సామగ్రి,సిబ్బందిని చేరవేసేందుకు గుర్రాలను ఆశ్రయించారు. స్థానిక ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టులు పిలుపునివ్వడంతో అంతటా భయానక వాతావరణం నెలకొంది. 17 మండలాల్లో 38 సమస్యాత్మక,73 అత్యంత సమస్యాత్మక, 189 మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మొత్తం 572 పోలింగ్ కేంద్రాలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో పోలీసులు గట్టి భద్రత చర్యలు చేపట్టారు. కొయ్యూరు మండలం యు.చీడిపాలెం, బూదరాళ్ళ, జీకేవీధి మండలం గుమ్మరేవుల, గాలికొండ, జర్రెల, వంచెల, దేవరాపల్లి, పెదవలస, చింతపల్లి మండలం కుడుముసారి, తమ్మెంగుల, జి.మాడుగుల మండలం లువ్వాసింగి, కోరాపల్లి, బీరం, బొయితిలి, పెదబయలు మండలం ఇంజరి, జామిగుడ, బొంగరం, ముంచంగిపుట్టు మండలం బూసిపుట్టు, కుమడ, లక్ష్మిపురం, రంగబయలు, బుంగాపుట్టు వంటి మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు బ్యాలట్ పత్రాలు, బాక్సుల తరలింపు కత్తిమీద సామైంది. చాలా మంది సిబ్బంది కాలినడకనే పోలింగ్ కేంద్రాలకు వెళ్లారు. ఏర్పాట్లు పూర్తి : 17 జెడ్పీటీసీ, 273 ఎంపీటీసీ స్థానాలకు శుక్రవారం పోలింగ్ జరగనుంది. ఇందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జెడ్పీటీసీ స్థానాలకు 100 మంది, ఎంపీటీసీలకు 1062 మంది అభ్యర్థులు తలపడుతున్నారు. ఈ ఎన్నికల్లో మొత్తం 6,84,825 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో 3,33,545 మంది పురుషులు, 3,51,279 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. వీరి కోసం మొత్తం 795 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 1624 బ్యాలెట్ బాక్సులను వినియోస్తున్నారు. ఎన్నిల నిర్వహణకు 874 మంది పీవో, 874 మంది ఏపీవో, 2620 మంది వోపీవో మొత్తంగా 4368 మంది సిబ్బందిని నియమించారు. వీరు గురువారం మధ్యాహ్నం ఆయా పోలింగ్ కేంద్రాలకు బయలుదేరి వెళ్లారు. వారి కోసం అధికారులు ఆర్టీసీ బస్సులను కూడా ఏర్పాటు చేశారు. 29 కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ : సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో ఇంటర్నెట్ సదుపాయం ఉన్న పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. పోలింగ్ సరళిని జిల్లా కేంద్రం నుంచి స్వయంగా పర్యవేక్షించేందుకు 29 కేంద్రాల్లో ఈ సదుపాయాన్ని కల్పిస్తున్నారు. అలాగే ఇంటర్నెట్ సదుపాయం లేని 519 కేంద్రాల్లో పోలింగ్‌ను వీడియో తీసేందుకు వీడియోగ్రఫర్లను, స్టాటిక్ ఫోర్స్‌ను నియమించారు. 41 కేంద్రాలకు మైక్రో అబ్జర్వర్లతో ప్రశాంతం వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా చర్యలు చేపడుతున్నారు. రెవెన్యూ కేంద్రాల్లో స్ట్రాంగ్ రూమ్‌లు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఓట్ల లెక్కింపు మే 7వ తేదీ తరువాత జరగనుంది. దీంతో అప్పటి వరకు బ్యాలెట్ బాక్సులను రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో భద్రపరచాలని అధికారులు నిర్ణయించారు. పోలింగ్ అనంతరం ఎన్నికల సిబ్బంది బ్యాలెట్ బాక్సులను ఆయా మండలాల రిసెప్షన్ సెంటర్‌కు తీసుకువచ్చి అక్కడ నుంచి పోలీసు బందోబస్తు మధ్య స్ట్రాంగ్ రూమ్‌లకు తరలిస్తారు. అనకాపల్లి డివిజన్‌కు ఏఎంఏఎల్ కాలేజీలోను, నర్సీపట్నం డివిజన్‌తో పాటు పాడేరులో మూడు మండలాల బ్యాలెట్ బాక్సులను నర్సీపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోను, పాడేరులో మిగిలిన 8 మండలాలకు సంబంధించి పాడేరు ప్రభుత్వ డిగ్రీకాలేజీలో స్ట్రాంగ్‌రూమ్‌లు ఏర్పాటు చేశారు. -
టీడీపీ సూట్‌కేసుల పార్టీ
కంటతడి పెట్టిన మొవ్వా ‘కుటుంబాన్ని వదిలి పార్టీయే సర్వస్వంగా పనిచేస్తే డబ్బులకు అమ్ముడుపోయిన పార్టీ నన్ను దూరం పెట్టింది’ అని శేరిలింగంపల్లి టీడీపీ ఇన్చార్జి మొవ్వా సత్యనారాయణ కం టతడి పెట్టారు. శేరిలింగంపల్లి టీడీపీ టికెట్ ఆశించి భంగపడిన ఆయన బుధవారం స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం సన్నిహితులు, కార్యకర్తలతో మియాపూర్‌లోని పార్టీ కార్యాలయంలో సమావేశమై అభిప్రాయాలనుసేకరించారు. ‘పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి సర్వస్వం కోల్పోయాను. చివరకు మొండిచేయి చూపారు. టీడీపీ సూట్‌కేసుల పార్టీలా తయారైంది’ అని వ్యాఖ్యానిస్తూ మొవ్వా కన్నీరు పెట్టుకున్నారు. దీంతో నాయకులు, కార్యకర్తలు కంటతడి పెట్టారు. అనంతరం మొవ్వా మాట్లాడుతూ- కార్యకర్తల మనోభావాలు దెబ్బతీసే ఏ పార్టీ మనుగడ సాగించలేదన్నారు. నియోజకవర్గంలోని పలు డివిజన్లు, జిల్లా, రాష్ట్రస్థాయి నాయకులు ఈ సందర్భంగా టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. -
ఖాకీలకు ఎన్నికల పరేషాన్
సాక్షి, చిత్తూరు: చిత్తూరు జిల్లా పోలీసు యంత్రాంగానికి గత ఎన్నికలకు భిన్నంగా ఈసారి పని ఒత్తిడి పెరిగింది. గతంలో సార్వత్రిక ఎన్నికల వరకు బందోబస్తు నిర్వహించి, కౌంటింగ్ ముగియగానే సేద తీరేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సుప్రీంకోర్టు, హైకోర్టులు స్థానిక ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాల్సిందేనని ఉత్తర్వులు ఇవ్వడంతో ఒకటిన్నర నెల వ్యవధిలో వరుసగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే మార్చి 30న మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి. ఏప్రిల్ 6న మదనపల్లె డివిజన్లో మొదటి విడత పరిషత్ ఎన్నికలు పూర్తి అయ్యాయి. ఈ క్రమంలో ఈవీఎంలను భద్రపరచడం, బ్యాలెట్బాక్స్లకు భద్రత కల్పించడం కత్తిమీద సాముగా మారింది. ఇందు కోసం పారా మిలటరీ దళాలతోపాటు, స్థానిక ఆర్మ్డ్ రిజర్వు పోలీసులను ఉపయోగించేందుకు ప్రణాళిక రూపొందించారు. అయితే ఒకేసారి మూడు ఎన్నికలకు సంబంధించిన ఈవీఎంలు, బ్యాలెట్‌బాక్స్‌లు భద్రపరచాల్సి రావడంతో ఇబ్బందులు తలెత్తనున్నాయి. తిరుపతి అర్బన్, చిత్తూరు జిల్లా పోలీసులు మున్సిపల్ ఎన్నికలకు ఆయా మున్సిపాల్టీల్లోనే స్ట్రాంగ్‌రూమ్‌లు ఏర్పా టు చేసి భద్రత కల్పిస్తున్నారు. దీనికితోడు మూడు డివిజన్ల జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు ఆయా డివిజన్లలోనే స్ట్రాంగ్‌రూమ్‌లు ఏర్పాటు చేసి భద్రత కల్పించాల్సి ఉంది. ఇప్పటికే మదనపల్లె పరిషత్ ఎన్నికల బ్యాలెట్ బాక్సులకు స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటుచేసి భద్రపరిచారు. ఏప్రిల్ 11న జరిగే చిత్తూరు, తిరుపతి రెండు డివిజన్ల పరిషత్ ఎన్నికల బ్యాలెట్బాక్స్లకు కూ డా స్ట్రాంగ్‌రూమ్‌లు అవసరం. ఈ రెండు ఎన్నికల ఫలితాలు మే 7వ తేదీ సార్వత్రిక ఎన్నికలు పూర్తి అయ్యాకే వెల్లడి కానున్నాయి. అప్పటి వరకు వీటిని కాపలా కాయాల్సి రావడం పోలీసులకు అదనపు భారంగా మారింది. అదే సమయంలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జిల్లాలో గ్రామ గ్రామానికి, ప్రతి పోలింగ్‌బూత్‌కు భద్రత కల్పించాల్సి ఉంది. ఇందు కోసం వేల సంఖ్యలో కేంద్ర పారా మిలటరీ దళాలను రంగంలోకి దించుతున్నారు. స్ట్రాంగ్‌రూమ్‌ల వివరాలు జిల్లాలో ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ పూర్తయిన తరువాత ఈవీఎంలకు సంబంధించి స్ట్రాంగ్ రూములను అన్నినియోజకవర్గాలకు చిత్తూరులోనే ఏర్పాటు చేస్తున్నారు. పోలింగ్ పూర్తి అయిన సాయంత్రమే ఈవీఎంలను చిత్తూరుకు తరలించనున్నారు. చిత్తూరు లోక్‌సభతోపాటు, అన్ని నియోజకవర్గాల ఈవీఎంలను చిత్తూరు సమీపంలోని ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాలలో భద్రపరిచి , కౌంటింగ్ చేపడుతారు. తిరుపతి, రాజంపేట పార్లమెంట్ పరిధిలోని మన జిల్లాలో వచ్చే నియోజకవర్గాల ఈవీఎంలను చిత్తూరు సమీపంలోని సీతమ్స్ కళాశాలలో భద్రపరచి కౌంటింగ్ చేపడతారు. భద్రతా పరంగా సాయుధ పారా మిలటరీ దళాలకు స్ట్రాంగ్‌రూంల భద్రత అప్పగిస్తారు. ఆ పరిసరాల్లో నిషేధాజ్ఞలు ఉంటాయి. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ అనుమతి లేనిదే ఎన్నికల సిబ్బందిని కూడా స్ట్రాంగ్‌రూంల వద్దకు అనుమతించరు. రెండో విడత పరిషత్ ఎన్నికలకు భారీ బందోబస్తు జిల్లాలో జరిగే రెండో విడత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. చిత్తూరు పోలీసు జిల్లాతో పాటు, తిరుపతి అర్బన్ పోలీసు జిల్లా పరిధిలోని తిరుపతి డివిజన్‌లోనూ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. చిత్తూరు ఎస్పీ పీహెచ్డీ రామక్రిష్ణ, అర్బన్ ఎస్పీ రాజశేఖర్‌బాబు ఎన్నికల భద్రతపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. చిత్తూరు ఎస్పీ పరిధిలోని 25 మండలాల్లో భద్రత వివరాలు.... ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ ఆధ్వర్యంలో ఏఎస్పీలు 2 , డీఎస్పీలు 10 మంది ఎన్నికల బందోబస్తును పర్యవేక్షిస్తారు. సీఐలు 17, ఎస్ఐలు 75, ఏఎస్సై, హెడ్ కానిస్టేబుళ్లు 285, కానిస్టేబుళ్లు 820, స్పెషల్ పార్టీ పోలీసులు 190, నాలుగు సెక్షన్ల పారా మిలటరీ బలగాలను బందోబస్తు నిర్వహించనున్నారు. -
‘రెండో విడత’ టీడీపీ డబ్బు పంపిణీ
సాక్షి, తిరుపతి: రెండో విడత పరిషత్ ఎన్నికల ప్రచారానికి బుధవారం సాయంత్రంతో తెరపడటంతో ఓటర్లను తాయిలాలతో ఆకట్టుకునేందు కు తెలుగుదేశం పార్టీ శ్రీకారం చుట్టింది. పోలింగ్ కు 24 గంటలు మాత్రమే సమయం ఉండటంతో డబ్బు పంపిణీతో పాటు రకరకాల విన్యాసాలు ప్రదర్శిస్తోంది. తొలివిడతలో భారీగా డబ్బు పంపిణీ చేసినా ఓటింగ్ సరళి అనుకూలంగా లేకపోవడంతో రెండో విడత మరింత ఎక్కువగా పంపిణీ చే స్తున్నారు. ఆ పార్టీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ అభ్యర్థి, జెడ్పీటీసీ అభ్యర్థులు, ఎంపీపీ అభ్యర్థులు పోటీలు పడి ఎంపీటీసీ అభ్యర్థులకు డబ్బు చేరవేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో ఎంపీటీసీ అభ్యర్థులు డబ్బుతో పాటు తాయిలాల పం పిణీలో తలమునకలయ్యారు. సత్యవేడు నియోజకవర్గం వరదయ్యపాళెం మండలంలో టీడీపీ వారు రూ.కోటి వరకు పంపిణీ చేశారని సమాచారం. ఇక్కడ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీడీపీ ఓటుకు వెయ్యి నుంచి రెండు వేల రూపాయల వరకు పంపిణీ చేసినట్టు తెలుస్తోంది. సత్యవేడు మండలం లో ఒక్కో ఎంపీటీసీ స్థానానికి పది లక్షల రూపాయలు అందజేశారు. ఇక్కడ ఓట్ల సంఖ్యతో పనిలేకుండా ఇంటికి రెండు వేల రూపాయల వంతున పంపిణీ చేస్తున్నారు. పుత్తూరు మండలంలో మహిళలకు ముక్కుపుడకలు, వెండి కుంకుమ భరిణెలు, యువకులకు క్రికెట్ కిట్లు అందజేస్తున్నారు. ఇంటింటికి వెళ్లి బ్యాలెట్ నమూనాలు చూపించి తాయిలాలు ఇస్తున్నారు. ఇక్కడ మద్యం కూడా భారీగా పంపిణీ చేస్తున్నారు. ఈ వ్యవహారం పోలీసులకు తెలిసినా పట్టించుకోవడం లేదు. పూతలపట్టు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోనూ ఓటుకు 500 నుంచి వెయ్యి రూపాయలు వంతున పం పిణీ చేస్తున్నారు. ఇంకా కొన్ని నియోజకవర్గాల్లో గురువారం డబ్బు పంపిణీ చేపట్టేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. -
భారీగా మద్యం సీసాల పట్టివేత
టాస్క్‌ఫోర్స్ అదుపులో 11 మంది వీరిలో పలువురు ‘దేశం’ కార్యకర్తలే విజయవాడ క్రైం, న్యూస్‌లైన్ : జెడ్పీటీసీ, ఎంపీటీసీ మలివిడత ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు మద్యం నిల్వ చేసిన తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు పలువురిని బుధవారం టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారినుంచి పెద్ద మొత్తంలో మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. మద్యం షాపులు మూసేయడంతో పలు ప్రాంతాల్లో మద్యం నిల్వ చేసినట్టు వచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఆయా ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో ఎస్సైలు సురేష్‌రెడ్డి, సుబ్రహ్మణ్యం సిబ్బందితో కలిసి ఉంగుటూరు, గన్నవరం, ఉయ్యూరు మండలాల్లో దాడులు నిర్వహించారు. మొత్తం 1163 మద్యం సీసాలు, 10 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకొని 11మందిని అదుపులోకి తీసుకున్నారు. ఉంగుటూరు మండలం నందమూరులో 230, మానికొండలో 140, ఇందుపల్లిలో 144, ఉంగుటూరులో 35 మద్యం సీసాలను, నాలుగు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకొని, ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. గన్నవరంలోని ఓ ప్రాంతంలో 178, మరో చోట 15 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు, గొల్లనపల్లిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త వద్ద 190 మద్యం బాటిళ్లు, రూ.34వేల నగదు, రామచంద్రపల్లిలోని ఓ రెస్టారెంట్ నుంచి 30 మద్యం సీసాలతో పాటు నాలుగు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఉయ్యూరు రూరల్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఆకునూరులో తెలుగుదేశం పార్టీ కార్యకర్త వద్ద 134 మద్యం సీసాలను పట్టుకున్నారు. ఉయ్యూరు టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలోని గండిగుంటలో ఓ వ్యక్తి నుంచి 67 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. వీరి నుంచి రెండు ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. దాడుల్లో అదుపులోకి తీసుకున్న వ్యక్తులను తదుపరి విచారణ కోసం సంబంధిత పోలీసు స్టేషన్లలో అప్పగించారు. -
జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి
వైఎస్సార్ సీపీ జెడ్పీ చైర్పర్సన్ అభ్యర్థి తాతినేని పద్మావతి గుడ్లవల్లేరు, ఉయ్యూరు, కలిదిండి మండలాల్లో ప్రచారం మచిలీపట్నం, న్యూస్‌లైన్ : జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీ చైర్పర్సన్ అభ్యర్థిని తాతినేని పద్మావతి అన్నారు. రెండో విడత ప్రాదేశిక ఎన్నికలు జరిగే గుడివాడ రెవెన్యూ డివి జన్లలోని గుడ్లవల్లేరు మండలం పెంజండ్ర, ఉయ్యూరు మండలం కాటూరు, కలిదిండి మండలం పెదలంక, మూలలంక, భాస్కరరావుపేట తదితర గ్రామాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు, పార్టీ నాయకులతో కలిసి పద్మావతి బుధవారం ప్రచారం చేసి ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమ పార్టీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే నెలకు రూ.100 మాత్రమే విద్యుత్ బిల్లు వసూలు చేస్తామన్నారు. డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలు తీసుకున్న రుణాలన్నింటినీ మాఫీ చేస్తామని, రైతులను ఆదుకునేందుకు స్థిరీకరణ నిధి ఏర్పాటుచేస్తామని వైఎస్సార్ సీపీ అధినేత జగన్ మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలు తప్పక అమలవుతాయని పేర్కొన్నారు. గుడ్లవల్లేరు మండలంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు అల్లూరి శిరీష, బి.శ్రీసంధ్య, ఉయ్యూరులో మండలంలో పార్టీ పెనమలూరు నియోజకవర్గ కన్వీనర్ పడమట సురేష్‌బాబు, జెడ్పీటీసీ అభ్యర్థి వల్లే శ్రీనివాసరావు, కలిదిండి మండలంలో జెడ్పీటీసీ అభ్యర్థి మోకా లక్ష్మి పాల్గొన్నారు. కైకలూరులో జెడ్పీటీసీ అభ్యర్థి మీగడ చంద్రావతి, నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కైకలూరులో ర్యాలీ నిర్వహించి ఓట్లు అభ్యర్థిం చారు. ముదినేపల్లిలో జెడ్పీటీసీ అభ్యర్థి మోతుకూరి స్వర్ణలక్ష్మి, మండవల్లి జెడ్పీటీసీ అభ్యర్థి ఎం.నాంచారమ్మ, పార్టీ నాయకులు పలువురు ప్రచారం నిర్వహించారు. ఆగిరిపల్లిలో తోట చంద్రశేఖర్ ప్రచారం ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ కన్వీనరు తోట చంద్రశేఖర్ ఆగిరిపల్లిలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. నూజివీడు నియోజకవర్గ సమన్వయకర్త మేకా ప్రతాప్‌అప్పారావు అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారంలో పాల్గొన్నారు. గంపలగూడెం మండలంలో తిరువూరు నియోజకవర్గ సమన్వయకర్త రక్షణనిధి ప్రచారం నిర్వహించారు. రెడ్డిగూడెం మండలంలో కోనేరు ప్రచారం మండలంలోని నాగులూరు, తాడిగూడెం, బూరుగగూడెం, రంగాపురం, రెడ్డిగూడెం, అన్నేరావుపేట, సీతారామపురం, మద్దులపర్వ, శ్రీరామపురం,ముచ్చనపల్లి గ్రామాల్లో వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల తరుఫున పార్టీ విజ యవాడ పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్ కోనేరు రాజేంద్రప్రసాద్ బుధవారం ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఈ గ్రామాల్లో మోటారుసైకిళ్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి 1600 కిలో మీటర్ల పాదయాత్ర చేసి అన్ని వర్గాల ప్రజల కష్టాలను తెలుసుకుని, వాటిని పరిష్కరించేందుకు పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి, పూర్తిస్థాయిలో అమలు చేశారని గుర్తుచేశారు. ఆ సంక్షేమ పథకాలను పూర్తిస్థాయిలో అమలు చేయగల సమర్థుడు జగన్మోహన్రెడ్డి మాత్రమేనని అన్నారు. పార్టీ మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త జోగి రమేష్ మాట్లాడుతూ అతి త్వరలో రాష్ట్రంలో రాజన్న రాజ్యం వస్తుందని, పేదల కష్టాలు తీరుతాయని అన్నారు. ఫ్యాన్ గుర్తుపై ఓటువేసి ఎంపీటీసీ, జెట్పీటీసీ అభ్యర్థులను గెలిపించాలని కోనేరు, జోగి కోరారు. -
ష్.. గప్‌చుప్
ఇక ప్రలోభాల వల జోరుగా నగదు, మద్యం పంపిణీ మచిలీపట్నం, న్యూస్‌లైన్ : ప్రాదేశిక ఎన్నికల తుది పోరులో ప్రచారం ముగిసింది. ప్రతిష్టాత్మకమైన జిల్లా పరిషత్ పీఠాన్ని దక్కించుకునేందుకు ప్రధాన పార్టీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. రెండో విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రచారానికి బుధవారం చివరిరోజు కావడంతో అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. నూజివీడు, గుడివాడ రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఈ నెల 11న ఎన్నికలు జరగనున్నాయి. నూజివీడు డివిజన్లో 14 జెడ్పీటీసీ, 234 ఎంపీటీసీ, గుడివాడ డివిజన్లో 9 జెడ్పీటీసీ, 129 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలను పకడ్భందీగా నిర్వహించేందుకు కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు, జెడ్పీ సీఈవో డి.సుదర్శనం నేతృత్వంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రలోభాలకు తెర తీశారు... రెండో విడత ఎన్నికల ప్రచారం ముగియటంతో అభ్యర్థులు ప్రలోభాలకు తెర తీశారు. ఓటుకు రూ.300 నుంచి పోటీని బట్టి వెయ్యి వరకు పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. బుధవారం రాత్రి నుంచే నగదు పంపిణీ కార్యక్రమం గుట్టు చప్పుడు కాకుండా చేస్తున్నారు. గుడివాడ, నూజివీడు డివిజన్లలో మద్యం పంపిణీ ఊపందుకుంది. ఏర్పాట్లు పూర్తి... రెండో విడత ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ ఎం రఘునందన్‌రావు తెలిపారు. 11న ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని ఆయన చెప్పారు. రెండు డివిజన్లలో 9,36,252 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని తెలిపారు. 1230 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. గుడివాడ డివిజన్లో 9 జెడ్పీటీసీ స్థానాలకు 27 మంది అభ్యర్థులు, 129 ఎంపీటీసీ స్థానాలకు 309 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు ఆయన చెప్పారు. నూజివీడు డివిజన్లోని 14 జెడ్పీటీసీ స్థానాలకు గాను 51 మంది అభ్యర్థులు, 234 ఎంపీటీసీ స్థానాలకు 610 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు తెలిపారు. ఎన్నికల నిర్వహణలో లోపాలు తలెత్తితే సమాచారం తెలుసుకునేందుకు జిల్లా పరిషత్‌లో కంట్రోల్ రూమ్ ల్యాండ్ లైన్ 08672-252572, టోల్ ఫ్రీ నంబరు 1077కు తెలియజేయాలని సూచించారు. 11న నూజివీడు, గుడివాడ డివిజన్లలోని సమస్యాత్మక, అతి సమస్యాత్మక గ్రామాల్లో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ జె.ప్రభాకరరావు తెలిపారు. ఏఎస్పీతో పాటు ఎనిమిది మంది డీఎస్పీలు, 25 మంది సీఐలు, 110 మంది ఎస్సైలు, 275 మంది ఏఎస్సైలు, హెడ్‌కానిస్టేబుళ్లు, 1050 మంది కానిస్టేబుళ్లు, 700 మంది హోంగార్డులు, రెండు ప్లటూన్ల ఏఆర్, ఏపీఎస్పీ బృందాలతో పాటు అటవీశాఖ, ఎక్సైజ్, స్పెషల్ ఫోర్స్ సిబ్బందిని ఎన్నికల్లో విధుల్లో నియమించినట్లు చెప్పారు. -
అందరికీ ‘సంక్షేమం’ జగన్‌తోనే సాధ్యం
తిరుపతి(మంగళం), న్యూస్‌లైన్: ‘ఫ్యాను గుర్తుకు ఓటెయ్యండి.. వైఎస్ జగన్మోహన్రెడ్డి అందించే సంక్షేమ ఫలాలతో అభివృద్ధి చెందండి’ అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్, సినీ నటుడు టీఎస్. విజయ్‌చందర్ విజ్ఞప్తి చేశారు. తిరుపతి పరిధిలోని చంద్రశేఖర్‌రెడ్డి కాలనీలో వైఎస్ఆర్ సీపీ నాయకుడు పోతిరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ప్రజాబాట నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విజయ్‌చందర్ మాట్లాడుతూ వైఎస్.జగన్మోహన్రెడ్డి సీఎం కాగానే అందించే సంక్షేమ పథకాలతో అన్ని వర్గాల ప్రజలూ అభివృద్ధి చెందుతారన్నారు. టీటీడీ చైర్మన్‌గా ఉండి శ్రీవారి పవిత్రతను ప్రపంచ దేశాలకు చాటిచెప్పిన మహోన్నత వ్యక్తి భూమన కరుణాకరరెడ్డి అని కొనియాడారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ముస్లిం, మైనార్టీలను ఊచకోత కోసిన నరహంతకుడు నరేంద్రమోడి అని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు గెలుపుకోసం బీజేపీతో పొత్తు పెట్టుకున్నారన్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు నరేంద్రమోడి ఎలా చెబితే అలా ఆడే గంగిరెద్దులా మారతాడని, దీంతో ముస్లిం, మైనార్టీలకు పూర్తిగా రక్షణ లేకుండా పోతుందన్నారు. మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కుమ్మక్కు రాజకీయాలతో కిరణ్, చంద్రబాబు నీరుగార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. తండ్రి ఆశయాల కోసం నిరంతరం పాటుపడుతున్న వ్యక్తి ఒక్క వైఎస్. జగన్మోహన్రెడ్డి మాత్రమేనన్నారు. ప్రజల అభ్యున్నతి కోసం నిరంతరం పాటు పడే జగనన్న నాయకత్వం కావాలా? లేదా అధికారం కోసం ఉత్తుత్తి హామీలు ఇచ్చి వంచించే చంద్రబాబునాయుడు కావాలా అన్న విషయాన్ని ఒక్కసారి ప్రజలు ఆలోచించుకుని ఓటేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రచార కమిటీ సహాయ కో-ఆర్డినేటర్ జొన్నల శ్రీనివాసులురెడ్డి, పార్టీ నగర అధ్యక్షుడు పాలగిరి ప్రతాప్‌రెడ్డి, దొడ్డారెడ్డి సిద్దారెడ్డి, ఎస్కె. బాబు, కొమ్ము చెంచయ్యయాదవ్, నీలకంఠారెడ్డి, హర్షవర్ధన్, కేతం జయచంద్రారెడ్డి, పుల్లయ్య, అమరనాథరెడ్డి, రామచంద్రారెడ్డి, పాముల రమేష్‌రెడ్డి, ఎస్కె.చోటా, తాల్లూరి ప్రసాద్, చింతా రమేష్‌యాదవ్, లోకేష్‌బాబు, రఫీ, కొండారెడ్డి, రవిచంద్ర, గఫూర్, గీతాయాదవ్, పుణీత, శాంతారెడ్డి, మల్లికమ్మ తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్‌కు సిపాయి గుడ్‌బై
రెండు రోజుల్లో కొత్తపార్టీ తీర్థం రాష్ట్ర విభజనలో కాంగ్రెస్-బీజేపీ సమాన భాగస్వాములు బీజేపీతో పొత్తున్న పార్టీలకు భంగపాటు తప్పదు స్పష్టం చేసిన అనుచరులు శ్రీకాళహస్తి, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనకు దోహదపడిన కాంగ్రెస్ పార్టీకి డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం గుడ్‌బై చెప్పనున్నారు. మరో రెండురోజుల్లో కొత్త పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. సోమవారం ఆయన పట్టణంలోని పొన్నాలమ్మగుడి ఆవరణలో తమ అనుచరులతో రెండు గంటల పాటు చర్చించారు. రాష్ట్ర విభజనలో కాంగ్రెస్, బీజేపీ సమాన భాగస్వాములని ఆయన అనుచరులు స్పష్టం చేశారు. దీంతో బీజేపీకి గానీ ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న పార్టీలకు గానీ ప్రజలు ఈ ఎన్నికల్లో బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. అలాంటి పార్టీలు అవసరం లేదన్నారు. ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించే బడుగు బలహీన వర్గాల పార్టీలో చేరితేనే రాజకీయ భవిష్యత్ ఉంటుందని స్పష్టం చేశారు. టీడీపీతో భవిష్యత్ ఉండదని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతోనే బంగారు భవిష్యత్ ఉంటుందని పరోక్షంగా పేర్కొన్నారు. దీంతో సిపాయి సుబ్రమణ్యం ఆ దిశగా ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. మరోసారి చర్చలు జరిపి నిర్ణయం వెల్లడించనున్నారు. తిరుపతిలో ప్రముఖ డాక్టర్‌గా పేరొందిన రష్ ఆస్పత్రి అధినేత సిపాయి సుబ్రమణ్యం 2009 ఎన్నికల్లో తొలిసారిగా రాజకీయాల్లోకి వచ్చారు. సినీనటుడు చిరంజీవితో సన్నిహిత సంబంధాలు ఉండడంతో శ్రీకాళహస్తి నుంచి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. 25 వేలకు పైగా ఓట్లు సంపాదించారు. ఆ తర్వాత చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడంతో ఇష్టం లేకున్నా సిపాయి కూడా అదే పార్టీలో కొనసాగారు. పట్టణంలో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజలకు దగ్గరయ్యారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఇటీవల శ్రీకాళహస్తిలో జరిగిన సమైక్యాంధ్ర ఉద్యమంలో చుర్గుగా పాల్గొన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగితే భవిష్యత్ ఉండదని గ్రహించిన ఆయన సోమవారం తన అనుచరులతో చర్చలు జరిపారు. సీమాంధ్ర ప్రాంతంలో వైఎస్సార్ సీపీ తప్పక అధికారంలోకి వస్తుందని, ఆ పార్టీలోకి వెళితేనే రాజకీయ భవిష్యత్ ఉంటుందని ఆయనకు అనుచరులు సూచించారు. రాష్ట్ర విభజన ప్రక్రియలో కాంగ్రెస్‌తో పాటు బీజేపీ ప్రధానపాత్ర పోషించిందని, అలాంటి పార్టీతో పొత్తుపెట్టుకున్న టీడీపీలోకి వెళితే రాజకీయ ఇబ్బందులు తప్పవని వివరించారు. దీంతో మంగళ, బుధవారాలు తన అనుచరులతో మరోసారి చర్చలు నిర్వహించి నిర్ణయం తీసుకోనున్నారు. విభజనతో సీమాంధ్రకు నష్టం రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయడాన్ని ప్రజలు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. స్వార్థం కోసం రాష్ట్రాన్ని విభజించారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తాను. రెండు రోజుల్లో నిర్ణయాన్ని ప్రకటిస్తాను. -డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం -
చిచ్చు రాజుకుంది
బీజేపీ పొత్తుపై మన్యం టీడీపీ నేతల ఆగ్రహం అరకు ఎంపీ..పాడేరు అసెంబ్లీ కమలానికి కేటాయించడంపై సెగలు బాబును నమ్ముకుని నష్టపోయామంటూ నిరసనలు బీజేపీకి సహకరించేది లేదంటూ తెగేసి చెబుతున్న వైనం ఏజెన్సీలో ఉనికి కోల్పోతున్న తెలుగుదేశం సాక్షి, విశాఖపట్నం: ఏజెన్సీలో పొత్తు చిచ్చు రాజుకుంది. అంతంతమాత్రంగా ఉన్న టీడీపీ బలాన్ని ఇది కుంగదీసింది. అరకు ఎంపీ.. పాడేరు అసంబ్లీ స్థానాలు కమలనాథుల కోటాలో చేరడంతో తెలుగుతమ్ముళ్ల పరిస్థితి దిక్కుతోచనివిధంగా తయారైంది. పార్టీ అధినేత ఆదేశాలతో పనిచేసుకుంటున్న ఆశావహులు నీరుగారిపోయారు. తాము ఖర్చుపెట్టిన సొమ్మంతా బూడిదలో పోసినట్టేనని వాపోతున్నారు. పాడేరులో బీజేపీకి కనీస బలం కూడా లేదని వీరు గుర్తుచేస్తున్నారు. సీటు చే జార్చి అధినేత తమ గొంతుకోశారంటూ ఇక్క డి టీడీపీ నాయకులు నిప్పులు కక్కుతున్నారు. మాజీ మంత్రి మణికుమారి, కొట్టుగుల్లి సు బ్బారావు, లోకుల గాంధీ, బొర్రా నాగరాజు,చల్లంగి జ్ఞానేశ్వరి,ఎంవీఎస్ ప్రసాద్ తదితరులు ఇప్పటికే భారీగా ఖర్చుచేశారు. చంద్రబాబు జిల్లాకు వచ్చిన ప్రతిసారి వీరిని పిలిపించి గట్టిగా పనిచేయండి, కచ్చితంగా టిక్కెట్ ఇస్తానని అనేక సార్లు నమ్మబలకడంతో వీరంతా ఎవరికివారే పోటీగా పనిచేశారు. 2009 ఎన్నికల్లో ఈసీటును సీపీఎంకు కేటాయించారు. అప్పుడే పార్టీ బాగా బలహీనపడింది. మరోమారు అదే చరిత్ర పునరావృతం చేస్తామని టీడీపీ నేతలు హెచ్చరిస్తున్నారు. బీజేపీకి సహకరించేదిలేదని కరాఖండిగా చెబుతున్నారు. అరకులోనూ ఇరకాటమే.. అరకులో సిట్టింగ్ ఎమ్మెల్యే సిరివేము సోమ ఈఎన్నికల్లో టిక్కెట్ తనకే వస్తుందని భావించారు. కాని బాబు ఇటీవల పార్టీలో చేరిన కుంభా రవిబాబుకు టిక్కెట్ ఇచ్చేందుకు నిర్ణయించినట్లు సమాచారం. దీంతో సోమ పరిస్థితి అయోమయంగా మారింది. అటు అరకు పార్లమెంట్ సీటుకూడా బీజేపీకి కట్టబెట్టడంపై ఆశావహులు పార్టీని వీడడానికి సమాయత్తమవుతున్నారు. పాడేరులో పోటీ తీవ్రంగా ఉన్నందున తనకు అక్కడ సీటు ఇవ్వకపోతే కనీసం పార్లమెంట్ ఇవ్వాలని మణికుమారి చంద్రబాబును కోరారు. విజయనగరం జిల్లా పార్వతీపురానికి చెందిన డాక్టర్ పార్వతీశం కూడా ఈ టిక్కెట్‌పై కన్నేశారు. ప్రజాబలం లేని బీజేపీకి ఇవ్వడంతో ఇప్పుడు వీరందరి దారెటో అర్థంకావడంలేదు. మొత్తానికి ఏజన్సీ కంచుకోట అని గొప్పలు చెప్పుకునే టీడీపీకి ఇప్పుడు ఉనికి ప్రశ్నార్థమయ్యే పరిస్థితి ఉత్పన్నమైంది. ఇప్పటికే మన్యంలో తగిన బలం లేక ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో బోర్లాపడింది. ఈనెల 11న జరగబోయే మలివిడత జెడ్పీ ఎన్నికలపైనా బీజేపీతో పొత్తు ప్రభావం పార్టీని మరింత దెబ్బతీయనుంది. -
క్యా సీన్ హై...
*తలసాని హైడ్రామా.. *చెప్పిందొకటి.. చేసిందొకటి *అయోమయానికి గురైన క్యాడర్ ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీ నేతలు ఊసరవెల్లులే అవాక్కయ్యే రీతితో సన్ని‘వేషాలు’ సృష్టిస్తున్నారు. పరిస్థితులకు అనుగుణంగా క్షణాల్లో రూటు మార్చేసి.. మాట తప్పేసి క్యాడర్‌నే అయోమయంలో పడేస్తున్నారు. హైదరాబాద్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ శని, ఆదివారాల్లో నడిపిన రాజకీయమే ఇందుకు నిదర్శనం. సీన్ తారుమారైందిలా.. నిజానికి శనివారం నాటి ఎజెండాతో సమావేశం జరిగి ఉంటే సీన్ మరోలా ఉండేది. నాటి ఆవేశకావేశాలు ఏ నాయకుల్లోనూ కనపడలేదు. కొందరు నేతలు రప్పించిన మనుషులు కొద్దిసేపు ఆయా నేతలకు అనుకూలంగా నినదించారు. మధ్యలో కిరోసిన్ పోసుకోవడాలు, ఫ్లకార్డుల డ్రామాలు రక్తి కట్టించాయి. గ్రేటర్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల నేతలూ సమావేశానికి వస్తారన్నారు. అయితే, కనీసం హైదరాబాద్ జిల్లా పరిధిలోని వారూ రాలేదు. ముఖ్య నేతలూ హాజరు కాలేదు. పొత్తులో భాగంగా పోతుందని తెలిసిన ముషీరాబాద్ నేతలతో పాటు నియోజకవర్గాల ఇన్‌చార్జులైన కె.విజయరామారావు, సాయన్న, ముజఫర్ అలీ, మైనార్టీ సెల్ అధ్యక్షుడు షాబాజ్అహ్మద్ఖాన్ తదితరులు ముఖం చాటేశారు. ఏ అంశంపైనైతే అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారో.. దాన్ని చక్కగా పక్కదారి పట్టించారు. సర్దుకుపొమ్మన్నారు. తలసాని మార్కు రాజకీయం! తలసాని శ్రీనివాస్‌యాదవ్.. టీడీపీలో ఆయన స్టైలే వేరు. అనుకున్నది ఏదోలా దక్కించుకోవడం ఆయన నైజం. తొలిసారిగా ఎమ్మెల్యే టిక్కెట్ ద క్కించుకోవడంనుంచి.. నేటి అత్యవసర సమావేశం దాకా అదే తీరు. వాస్తవానికి శనివారం వరకు త లసాని పోటీ చేయాలని భావించిన సనత్‌నగర్ నియోజకవర్గం టీడీపీకి వస్తుందో.. బీజేపీకి వెళ్తుందో తెలియని పరిస్థితి. బీజేపీ ఆ స్థానం కోసం గట్టి పట్టుదలతో ఉంది. ఆ సీటు చేజారిపోతుందనే సందేహంతో.. అప్పటికప్పుడు భేటీ కావాలని అధ్యక్షుని హోదాలో జిల్లా పార్టీ యంత్రాంగాన్ని ఆదేశించారు. పొత్తుకు ఒప్పుకుంటే జిల్లాలో పార్టీకి మనుగడే ఉండదనే ప్రకటనలు ఇప్పించారు. అందుకు తగ్గట్టే టెంట్లు, పులిహోర వంటి వాటితో హడావుడి చేశారు. తీరా శనివారం రాత్రి పొద్దుపోయాక ‘సనత్‌నగర్’పై హామీ లభించింది. ఇంకేముంది.. ఆందోళన కోసం ఏర్పాటు చేసిన సమావేశాన్ని అనువుగా మార్చేసుకున్నారు. దేశ, రాష్ట్ర ప్రయోజనాల పేరుతో ముగించేశారు. శ్రేణుల్లో ఎమోషన్స్ పెరిగితే పరిస్థితి చేయి దాటుతుందని గ్రహించి త్వరితంగా ముగించేశారు. ఈ లోగుట్టంతా తెలియని కొందరు నేతలు, శ్రేణులు ఇప్పటికీ ఎందుకిలా జరిగిందో అర్థం కాక అయోమయంలోనే ఉన్నారు. శనివారం సాయంత్రం.. పార్టీ నేతలు, శ్రేణుల అభిప్రాయానికి వ్యతిరేకంగా గ్రేటర్లో ఎక్కువ స్థానాలు బీజేపీకివ్వాలనే అధిష్ఠానం నిర్ణయానికి వ్యతిరేకంగా హైదరాబాద్ టీడీపీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. తలసాని తమ వెంటే ఉన్నారని, జిల్లా కార్యవర్గమంతా రాజీనామా చేస్తుందని ప్రకటించారు. ‘బీజేపీ హటావో.. టీడీపీ బచావో’ అనే నినాదాన్ని సృష్టించి హోరెత్తించారు. ఆదివారం ఉదయం.. జిల్లా పార్టీ కార్యాలయ ఆవరణలో భారీ టెంట్లు.. పార్టీతో సంబంధం లేనివారూ పోగయ్యారు. పులిహోర పొట్లాలు పంచారు. ఒకరిద్దరు నేతలు మాట్లాడుతూ- ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తులకు ఒప్పుకునేది లేదని కుండబద్దలు కొట్టారు. 2009 లోనూ పొత్తు వల్లే చంద్రబాబు సీఎం కాలేకపోయారన్నారు. మన నాయకుడు తలసాని నాయకత్వం లో మన దారిలో మనం వెళ్దామంటూ ప్రసంగించా రు. అంతలో తలసాని కల్పించుకున్నారు. ‘మీ ఆవేదన నాకు తెలుసు. కానీ, మారుతున్న రాజకీయ పరిణామాలకు అనుగుణంగానే ముందుకు సాగాలి. ‘దేశం’ క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. అందుకిప్పుడు మనకొక అండ అవసరం. అందుకే బీజేపీతో పొత్తు.. ఇది మీరు అర్థం చేసుకోవాలి. మీకు అండగా నేనుంటా. క్రమశిక్షణగా ఉండండి’ అంటూ ముగించారు. శనివారం నాటి హాట్ హాట్ పరిణామాలకు కొనసాగింపుగా ఆదివారం నాటి సమావేశం ఆందోళనలలో అట్టుడికిపోతుందనుకుంటే, గాలి తీసేసిన సైకిల్ చక్రంలా సీన్ మారిపోవడంతో క్యాడర్ అయోమయానికి గురైంది. -
‘దేశా’నికి మైనార్టీలు దూరం
సాక్షి, సిటీబ్యూరో: బీజేపీతో దోస్తీ కట్టిన చంద్రబాబుపై టీడీపీ మైనార్టీ శ్రేణులు నిప్పులు కక్కుతున్నాయి. పొత్తును నిరసిస్తూ రాజీనామాలు సంధించారు. గత ఎన్నికల్లో హైదరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి టీడీపీ పక్షాన పోటీ చేసిన జాహెద్ అలీఖాన్ ఆదివారం రాజీనామా చేయడం కలకలం సృష్టించింది. పార్టీ మైనార్టీ సెల్ మాజీ అధికార ప్రతినిధి అనాస్ సయ్యద్ సలీం సైతం రాజీనామ సమర్పించారు. ఇంకొందరు పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. ఇది రానున్న ఎన్నికల్లో ప్రభావం చూపనుంది. గ్రేటర్ హైదరాబాద్‌లో మైనార్టీ ఓట్లు సుమారు 19.38 లక్షల వరకు ఉన్నాయి. రెండు లోక్‌సభ, 15 అసెంబ్లీ నియోజక వర్గాల్లో ముస్లిం ఓటర్లు ప్రభావం చూపే అవకాశం ఉంది. -
తొలిపోరు ప్రశాంతం
తొలివిడత ప్రాదేశిక ఎన్నికల్లో 80.52 శాతం నమోదు అక్కడక్కడా చెదురుమదురుసంఘటనలు, స్వల్పంగా లాఠీచార్జ్ ఓటు వేసేందుకు ఉదయం నుంచి బారులుతీరిన జనం కిరణ్ స్వగ్రామంలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలను అడ్డుకుని ఏకపక్షంగా పోలింగ్ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు సాక్షి, తిరుపతి: జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల్లో భాగంగా ఆదివారం మదనపల్లె డివిజన్లో జరిగిన తొలివిడత పోలింగ్ చెదురుమదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. 31 జెడ్పీటీసీ స్థానాలకు 445 ఎంపీటీసీ స్థానాలకు నిర్వహించిన ఎన్నికల్లో మొత్తం 80.52 శాతం ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం 10,85,763 మందికి గాను 8,78,339 మంది ఓటర్లు పోలింగ్‌కు హాజరయ్యారు. వీరిలో ఎక్కువ మంది మహిళలు ఉన్నారు. అత్యధికంగా చిన్నగొట్టిగల్లు మండలంలో 89.12, అత్యల్పంగా పీలేరు మండలంలో 69.72 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ ప్రారంభం అయింది. ఎండ తీవ్రత కారణంగా ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులుతీరారు. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి మూడు గంటల వరకు పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు కనిపించలేదు. కుప్పంలో ఒక పోలింగ్ కేంద్రంలో పోలింగ్ ముగియడానికి కొద్దిసేపటికి ముందు కేంద్రానికి ఎక్కువ మంది ఓటర్లు చేరుకోవడంతో ఆలస్యంగా ముగిసింది. అక్కడక్కడా చెదురుమదురు సంఘటనలు మినహా తొలివిడత పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఉదయం నుంచే బారులు తీరిన ఓటర్లు ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఓటర్లు ఉదయం నుంచే ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద బారులుతీరారు. పనులకు వెళ్లే వారు కూడా ఉదయాన్నే ఓటు వేసేందుకు వచ్చారు. మహిళలకు కేటాయించిన క్యూలు భారీగా కనిపించాయి. ఉదయం ఏడు-తొమ్మిది గంటల మధ్య 15 శాతం నమోదు కాగా 9-11 గంటల మధ్య 36 శాతం, 11-01 గంటల మధ్య 55.47 శాతం పోలింగ్ నమోదు కావడం గమనార్హం. పోలింగ్ ముగిసే సమయానికి 80.52 శాతం నమోదైంది. కుప్పం మండలం లక్ష్మీపురం, శాంతిపురం మండలం కడపల్లె పోలింగ్ కేంద్రాల్లో ఓట్లు గల్లంతు కావడంతో ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద ఆందోళనకు దిగారు. పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళన విరమింపజేశారు. కుప్పం ఎంపీటీసీ సెగ్మెంట్ పరిధిలోని డీకేపల్లెలో ఆందోళన చేస్తున్న ఓటర్లను స్వల్పంగా లాఠీచార్జి చేసి అక్కడి నుంచి తరిమివేశారు. పీలేరు మండలం ముడుపులవేములలోనూ పోలీసులు లాఠీచార్జి చేశారు. పలమనేరు మండలం మొరవ పోలింగ్ స్టేషన్లో బ్యాలెట్ పత్రాలపై ఓటర్లు వేసే స్వస్తిక్ గుర్తు ఇంకు ముద్దగా రావడంతో బ్యాలెట్ మడిచినప్పుడు ఇంకో అభ్యర్థి సింబ ల్‌పై కూడా ఆ గుర్తు పడుతుందని భావించిన అధికారులు కొద్దిసేపు పోలింగ్ నిలిపివేశారు. ఆ తరువాత కొనసాగించారు. మదనపల్లె మండలం పోతనపల్లె పోలింగ్ కేంద్రంలో పోలింగ్ అధికారి టీడీపీకి అనుకూలంగా వ్యహరిస్తున్నారని ఓటర్లు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ కొద్దిసేపు పోలింగ్‌కు అంతరాయం కలిగింది. పుంగనూరు మండలం బీముగారిపల్లె పోలింగ్ కేంద్రంలో ఓటర్లకు వసతులు కల్పించలేదని ఓటు హక్కు వినియోగించుకునేందుకు నిరాకరించారు. దీంతో అధికారులు అప్పటికప్పుడు తాగునీటి సౌకర్యం కల్పించడంతో పోలింగ్ కొనసాగింది. కుప్పంలో టీడీపీ డబ్బు పంపిణీ కుప్పం మండలంలోని పలు పోలింగ్ కేంద్రాల వద్ద టీడీపీ నాయకులు ఓటర్లకు డబ్బు పంపిణీ చేస్తూ కనిపించారు. కుప్పం- 1 ఎంపీటీసీ సెగ్మెంట్ పరిధిలోనూ సమాగుట్టపల్లె, అనుంగానిపల్లె, పెద్దబంగారునత్తం తదితర కేంద్రాల్లో ఓటర్లకు డబ్బు పంపిణీ చేస్తున్నప్పటికీ పోలీసులు, పోలింగ్ సిబ్బంది పట్టించుకోలేదు. ఓట్లు గల్లంతైన కారణంగా దళావాయినత్తపల్లె, చీమినాయునిపల్లె పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు ఆందోళనకు దిగడంతో పోలీసులు స్వల్పంగా లాఠీచార్జి చేశారు. ఓట్లు టేబుల్ డ్రాలో వేసినా.. వి.కోట మండలం దానమయ్యగారిపల్లెపోలింగ్ కేంద్రంలో ఓటర్లు, ఓటు వేసిన బ్యాలెట్ పత్రాలను అక్కడి టేబుల్ డ్రాలో పడవేసి వెళ్లారు. ఇలాంటివి 16 బ్యాలెట్ పత్రాలు డ్రాలో కనిపించాయి. బ్యాలెట్ పత్రాలను బాక్సులో వేయాలన్న అవగాహన లేకపోవడంతో ఈ సమస్య ఉత్పన్నమైంది. అంతమంది ఓటర్లు బ్యాలెట్ బాక్సులో వేయనప్పటికీ పోలింగ్‌సిబ్బంది గుర్తించలేకపోవడం వారి నిర్లక్ష్యానికి పరాకాష్ట. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ కార్యకర్తలు ఈ విషయం తెలుసుకుని అధికారులను నిలదీయడంతో వారు అప్రమత్తమయ్యారు. కొద్దిసేపు పోలింగ్ నిలిపివేసి ఏజెంట్లకు నచ్చజెప్పి కొనసాగించారు. కాగా పలమనేరు నియోజకవర్గం పెదపంజాణి మండలంలో ఎమ్మెల్సీ రెడ్డెప్పరెడ్డి అనుచరులు పలుచోట్ల దౌర్జన్యాలకు పాల్పడ్డారు. -
ఓట్లేశారు...
{పాదేశిక పోరు ప్రశాంతం గూడూరులో రాత్రి 8 గంటల వరకూ ఓటింగ్ భూపాలపల్లిలో అర గంట ఆలస్యం ఆగ్రహం వ్యక్తం చేసిన ఓటర్లు పలు ప్రాంతాల్లో స్వల్ప ఘర్షణలు కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి, డీఐజీ, ఎస్పీ 11న రెండో విడత స్థానిక ఎన్నికలు హన్మకొండ/జిల్లాపరిషత్, న్యూస్‌లైన్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జిల్లాలో ఆదివారం జరిగిన తొలి దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. నర్సంపేట, ములుగు రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 20 మండలాల్లో 20 జెడ్పీటీసీ, 244 ఎంపీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 84.38 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 6,07,943 మంది ఓటర్లుండగా... 5,12,987 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అత్యల్పంగా గోవిందరావుపేట మండలంలో 77.43 శాతం.. అత్యధికంగా నర్సంపేటలో 90.04 శాతం ఓట్లు పోలయ్యూయి. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. మధ్యాహ్నం వరకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల్లో క్యూ కట్టారు. ఆ తర్వాత ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో కొంత సేపు తగ్గుముఖం పట్టినా... చివరకు మళ్లీ జోరందుకుంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 70 శాతం పోలింగ్ నమోదుకాగా... సాయంత్రం రెండు గంటల వ్యవధిలో సగటున 14.38 శాతం నమోదైంది. రేగొండలో రాత్రి 8 గంటల వరకూ పోలింగ్ సాగగా... భూపాలపల్లిలోని 15, 18వ పోలింగ్ కేంద్రాల్లో 30 నిమిషాల ఆలస్యంగా ఓటింగ్ మొదలైంది. దీంతో క్యూలో నిల్చున్న ఓటర్లు ఎన్నికల అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ సరళిని నర్సంపేటలో వరంగల్ రేంజ్ డీఐజీ కాంతారావు, ఎన్నికల అబ్జర్వర్ జగన్మోహన్రావు, గూడూరులో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కిషన్, రేగొండ, తిర్మలగిరిలో రూరల్ ఎస్పీ లేళ్ల కాళిదాసు పరిశీలించారు. కాగా, వరంగల్, జనగామ, మహబూబాబాద్ రెవెన్యూ డివిజన్లలో జెడ్పీటీసీ. ఎంపీటీసీ స్థానాలకు ఈ నెల 11వ తేదీన రెండో విడత పోలింగ్ జరగనుంది. చెదురుమదురు సంఘటనలు జిల్లా, మండల పరిషత్ ప్రాదేశిక స్థానాలకు ఆది వారం జరిగిన పోలింగ్‌లో అక్కడక్కడా చెదురు ముదురు సంఘటనలు చోటు చేసుకున్నాయి. నర్సంపేట మండలం ఇటుకాలపల్లి, ఖానాపూర్ మండలం ధర్మరావుపేటలో రోడ్లపై ప్రచారం చేస్తున్న పలు పార్టీల కార్యకర్తలు, నాయకులపై పోలీసు సిబ్బంది స్వల్ప లాఠీచార్జ్ చేశారు. నల్లబెల్లి మండలం రామతీర్థం గ్రామంలోపోలింగ్ కేంద్రాల వద్దే ప్రచారం చేస్తున్నారంటూ టీడీపీ, టీఆర్ఎస్ శ్రేణులు గొడవకు దిగాయి. పోలీసులు లాఠీచార్జ్ చేసి వారిని చెదరగొట్టారు. చెన్నారావుపేట మండలం జల్లి గ్రామంలో రిగ్గింగ్ చేస్తున్నారంటూ టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఏజెంట్ పోలింగ్ బూత్‌లో గొడవకు దిగాడు. రిగ్గింగ్ జరగలేదని అధికారులు నిర్ధారించారు. ఈ విషయం బయటకు రావడంతో పోలింగ్ కేంద్రం బయట టీడీపీ, టీఆర్ఎస్ వర్గాలు గొడవకు దిగాయి. ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. భూపాలపల్లి నియోజకవర్గంలో చెదురుముదురు సంఘటనలు మినహా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదు. పలు ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాల వద్ద ప్రచారం చేస్తున్నారంటూ రాజకీయ పార్టీల నేతలు వాగ్వాదానికి దిగినా... పోలీసులు చెదరగొట్టారు. పరకాల మండలం నాగారంలో వంద మీటర్ల పరిధిలోనే ప్రచారం చేస్తున్నారంటూ పోలీసులు కార్యకర్తలను చెదరగొట్టారు. మాదారం పోలీంగ్ కేంద్రం వద్ద క్యూలో ఉన్న వారిని ఓటేయూలని టీ ఆర్ఎస్ అభ్యర్థి అభ్యర్థించడంతో గొడవ జరిగింది. కామారెడ్డిపల్లి గ్రామంలో దొంగ ఓటు వేస్తున్నారంటూ పోలింగ్ కేంద్రంలో ఎన్నికల అధికారులకు ఏజెంట్లు ఫిర్యాదు చేశారు. అధికారులు పరిశీలించి అటువంటిది ఏమీ లేదని తేల్చిచెప్పారు. -
బాబుతో దోస్తీ.. బాధించిం
పార్టీ పదవికి రాజీనామా చేస్తున్నా.. తెలంగాణ ద్రోహి చంద్రబాబు సిగ్గులేకుండా బీజేపీ అధిష్టానం వద్ద మోకరిల్లాడు బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి కేసముద్రం, న్యూస్‌లైన్ : సమైక్యవాద టీడీపీతో తమ పార్టీ పొత్తుపెట్టుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నానని... ఇందుకు నిరసనగా పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి తెలిపారు. ఆయన ఆదివారం కేసముద్రం మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ ద్రోహి చంద్రబాబు బీజేపీ హైకమాండ్ వద్ద మోకరిల్లి సిగ్గులేకుండా పొత్తుకుదుర్చుకున్నాడని విమర్శించారు. తెలంగాణ ప్రాంతంలో ఇప్పటికే చచ్చిపోయిన టీడీపీని కాస్త బతికించుకోవాలనే ఉద్దేశంతో ఈ నాటకం ఆడాడని, తమ పార్టీ నేత వెంకయ్యనాయుడుతో ఈ పొత్తును ఖరారు చేయించుకున్నాడని మండిపడ్డారు. టీడీపీతో ఎన్నికల్లోకి పోతే బీజేపీకి ఓటమి ఖాయమన్నారు. ఒకప్పుడు మతోన్మాద పార్టీ అయిన బీజేపీతో తాము పొత్తుపెట్టుకుని చారిత్రక తప్పుచేశానన్న చంద్రబాబు మళ్లీ ఇప్పుడు ఏ తప్పు చేసి పొత్తుపెట్టుకున్నాడని ప్రశ్నించారు. ఎన్నోమార్లు తాము పార్టీ అధిష్టానం వద్ద పొత్తువద్దని, సమైక్యవాద పార్టీతో పొత్తుపెట్టుకుంటే నష్టపోతామని చెప్పినా.. చివరకు పొత్తుపెట్టుకోవడం తనను మనస్థాపానికి గురిచేసిందన్నారు. గత 30 సంవత్సరాల నుంచి ఎన్నో కష్టనష్టాలకు ఓర్చుకుని, కనీసం పార్టీ నుంచి పావులా బిళ్ల కూడా ఇవ్వనప్పటికీ ఇంట్లో ఉన్న బంగారాన్ని అమ్మి స్వతహాగా ఖర్చుపెట్టుకుని తమ కార్యకర్తలు,నాయకులు పని చేశారని, అలాంటిది తమ అభిప్రాయాన్ని లెక్కచేయకుండా పార్టీ ఈ నిర్ణయం తీసుకోవడం బాధించిందన్నారు. అందుకే పార్టీ పదవికి రాజీనామా చేసి.. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి ప్యాక్స్ ద్వారా రాజీనామా పత్రాన్ని సమర్పించినట్లు ఆయన తెలిపారు. ఇప్పటికైనా బీజేపీ నాయకత్వం నిజం తెలుసుకోవాలని కోరారు. ఆయనతో పాటు రాష్ట్ర కిసాన్‌మోర్చా ఉపాధ్యక్షుడు రామచందర్‌రావు, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వల్లబు వెంకటేశ్వర్లు, గిరిజన మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు భుక్యా బాలునాయక్, కేసముద్రం మండల పార్టీ అధ్యక్షుడు కందునూరి నగేష్‌గౌడ్ తమ పదవులకు రాజీనామా చేసినట్లు తెలిపారు. -
పసుపు..కాషాయం
టీడీపీ, బీజేపీ పొత్తు ఖరారు బీజేపీకీ ఒక ఎంపీ... 4 అసెంబ్లీ స్థానాలు వరంగల్ తూర్పు, పశ్చిమ, జనగామ, భూపాలపల్లి కేటాయింపు వర్ధన్నపేటపై తొలగని అస్పష్టత మిగిలిన స్థానాల్లో తెలుగుదేశం పోటీ సాక్షిప్రతినిధి, వరంగల్ : తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీల మధ్య పొత్తు కుదిరింది. పొత్తులో భాగంగా బీజేపీకి జిల్లాలో ఒక లోక్‌సభ, నాలుగు అసెంబీ స్థానాలు దక్కాయి. వరంగల్ లోక్‌సభ స్థానంతో పాటు వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, జనగామ, భూపాలపల్లి అసెంబ్లీ స్థానాలను టీడీపీ.. బీజేపీకి కేటాయించింది. వర్ధన్నపేటను సైతం బీజేపీకే ఇవ్వగా.. ఈ సీటుకు బదులుగా స్టేషన్‌ఘన్‌పూర్ ఇవ్వాలని బీజేపీ పట్టుబడుతోంది. వర్ధన్నపేటలో మహాజన సోషలిస్టు పార్టీ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ పోటీ చేయనున్న నేపథ్యంలో ఈ సెగ్మెంట్లో ఆయనకు మద్దతు తెలపాలని బీజేపీ ప్రాథమికంగా నిర్ణయింది. దీంతో స్టేషన్‌ఘన్‌పూర్ సీటు కోసం ఇంకా ప్రయత్నిస్తోంది. అయితే టీడీపీ దీనికి నిరాకరిస్తోంది. కాంగ్రెస్ పొత్తులో భాగంగా ఈ నియోజకవర్గాన్ని సీపీఐకి ఇస్తే... స్టేషన్‌ఘన్‌పూర్‌కు చెందిన కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ఒకరు టీడీపీలో చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. దీని వల్లే టీడీపీ సైతం ఈ సీటు కోసం పట్టుబడుతున్నట్లు తెలిసింది. టీడీపీతో పొత్తుపై బీజేపీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. తెలుగుదేశం పార్టీతో పొత్తును నిరసిస్తూ బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి పార్టీ పదవికి రాజీనామా చేశారు. ఇదే బాటలో మరికొందరు నేతలు పార్టీకి దూరమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. రాజీనామా నిర్ణయాలు తీసుకోని చాలా మంది నేతలు అసంతృప్తితో ఎన్నికల్లో పనిచేయబోమని చెబుతున్నారు. బీజేపీతో పొత్తు విషయంలో టీడీపీలోనూ అసంతృప్తులు వ్యక్తమవుతున్నాయి. భూపాలపల్లి టీడీపీ నియోజకవర్గ ఇంచార్జీ గండ్ర సత్యనారాయణరావు పొత్తును తీవ్రంగా వ్యతిరేకిస్తన్నారు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్తో పొత్తుతో సత్యనారాయణకు పోటీ చేసే అవకాశం రాలేదు. ఇప్పుడు కూడా అలాగే జరగడంతో ఈయన స్వతంత్రంగా పోటీ చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. పొత్తులతో అసంతృప్తులు ఎలా ఉన్నా... పోటీ చేసే స్థానాల సంఖ్య తేలడంతో రెండు పార్టీలు ఇప్పుడు అభ్యర్థుల ఖరారుపై దృష్టి పెట్టాయి. -
పోల్ కేక
అత్యధికం.. పెందుర్తిలో 92.1 అత్యల్పం.. కశింకోటలో 69.66 6.30 గంటలకేబారులు తీరిన ఓటర్లు ఓటింగ్ సరళిని వెబ్కెమేరా ద్వారా తెలుసుకున్న అధికారులు డీఎల్‌పురంలో ఓటేసి వృద్ధుని మృతి బ్యాలెట్‌పై సిరాతో అనకాపల్లి బీఆర్టీ కాలనీలో వివాదం విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : తొలిదశ ప్రాదేశిక పోరు ముగిసింది. చెదురుమదురు సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా సాగింది. ఉదయం కొంత మందకొడిగా ప్రారంభమైనా..ఆ తర్వాత క్రమంగా వేగం పుంజుకుంది. 22 జెడ్పీటీసీలకు, 379 ఎంపీటీసీ స్థానాలకు సాయంత్రానికి అంచనాలకు మించి 83.2 శాతం ఓటింగ్ నమోదయింది. అత్యధికంగా పెందుర్తిలో 92.10 శాతం ఓటింగ్ జరగగా, అత్యల్పంగా కశింకోటలో 69.66 శాతం మాత్రమే ఓట్లు పోలయ్యాయి. ఉదయం 6.30 నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల కోలాహలం మొదలైంది. ఎండ తీవ్రత ఉన్నా.. యువ ఓటర్ల నుంచి పండుటాకుల వరకూ ఉత్సాహంగా తరలి వచ్చి కేంద్రాల వద్ద బారులు తీరి ఓటు హక్కును వినియోగించుకున్నారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక కేంద్రాల్లో ఇంటర్నెట్ సదుపాయమున్న 29 కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేసి అధికారులు జిల్లా కేంద్రం నుంచి స్వయంగా పోలింగ్ సరళిని పర్యవేక్షించారు. రాష్ట్ర పరిశీలకుడు టి. కృష్ణబాబు నక్కపల్లి మండలపరిషత్ కార్యాలయం నుంచి వెబ్కెమేరా ద్వారా పోలింగ్ సరళిని తెలుసుకున్నారు. అలాగే 225 మంది వీడియోగ్రాఫర్లను నియమించి పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ తీరును వీడియో తీయించారు. కొన్ని చోట్ల ఆలస్యంగా.. : 22 మండలాల్లో 2397 పోలింగ్ కేంద్రాల్లో జరిగిన ఈ ఎన్నికల్లో కొని చోట్ల పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. బ్యాలెట్ విధానం ద్వారా జరిగిన ఈ క్రతువులో ఎన్నికల సిబ్బంది ప్రారంభంలో కొంత ఇబ్బం దులు పడ్డారు. దీంతో పెందుర్తి మండలం కోట్నివానిపాలెం దాదాపు 45 నిమిషాల ఆలస్యంగా ప్రారంభమైంది. గొరపల్లిలో 7.30 అధికారులు పోలింగ్ ప్రక్రియను ప్రారంభించారు. అనేక కేంద్రాల్లో నిర్ణీత సమయం కంటే 10 నుంచి 20 నిమిషాలు ఆల స్యంగా పోలింగ్ మొద లైంది. ఆ తరువాత మాత్రం ఓటర్లు అధిక సంఖ్యలో కేంద్రాలకు వచ్చినప్పటికీ వేగవంతంగా ప్రక్రియను పూర్తి చేశారు. నక్కపల్లి మండలం డిఎల్పురంలో కిల్లాడ నాగరాజు ఉరఫ్ కొండయ్య(68) ఓటేసి ఇంటికెళ్లాక మృతి చెందాడు. అనకాపల్లి మండలం బీఆర్టీకాలనీ పోలింగ్ కేంద్రంలో బ్యాలెట్‌పై సిరా అంటుకోవడం వివాదాస్పదమైంది. దీంతో పోలీసులు అత్యత్సాహం కనబరిచి లాఠీచార్జి చేశారు. ఉద్రిక్తత నేపథ్యంలో ఏఎస్పీ పకీరప్ప అదనపు బలగాలను రప్పించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఎండను లెక్క చేయక.. : ఓటర్ల సంకల్పం ముందు ఎండ చిన్నపోయింది. ఉక్కిరిబిక్కిరి చేసే ఉక్కపోత సైతం ఓటర్లను నిలువరించలేకపోయిం ది. మంటలు పుట్టించే వేడి వాతావరణంలో భారీగా లైన్లలో నిలబడి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రధానంగా మహిళలు, వృద్ధులు సైతం ఇబ్బందులు పడుతూనే పోలింగ్ కేంద్రాలకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ ప్రక్రియ తొలి రెండు గంటలు భీమిలి(21 శాతం), ఎస్.రాయవరం(21 శాతం), రాంబిల్లి(18 శాతం) మినహా మి గిలిన మండలాల్లో కాస్త మందకొడిగానే జరిగింది. 9 గంటలకు 13.39 శాతం జరగగా...11 గంటలకు 30 శాతానికి పెరిగింది. మధ్యాహ్నం ఒంటి గంటకు 47.30 శాతం నమోదైంది. ఒకే సమయంలో భారీగా కేంద్రాలకు రావడంతో క్యూలైన్లలో ఇబ్బం దులు పడ్డారు. వసతుల కల్పనలో అధికారుల వైఫల్యంతో అవస్థలకు గురయ్యారు. మధ్యాహ్నం 3 గంటలకు 62.70 శాతం, సాయంత్రం 5 గంటలకు మొత్తంగా 83.2 శాతం పోలింగ్ జరిగింది. కట్టుదిట్టమైన భద్రత ఈ ఎన్నికల కోసం అధికారులు కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లోనే కాకుండా అన్ని కేంద్రాల్లోను పకడ్బందీ చర్యలు చేపట్టారు. దీంతో చిన్నచిన్న సంఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. పెందుర్తి, భీమిలి మండలంలో కొన్ని కేంద్రాల వద్ద పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారంటూ ఓటర్లు కొంత అసహనం వ్యక్తం చేశారు. అయితే ఎక్కడా ఎటువంటి కొట్లాటలు, అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు నిలువరించగలిగారు. తొలి దశ ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో జిల్లా అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. రెండో దశ ఎన్నికలు ఈ నెల 11న 17 జెడ్పీటీసీ, 277 ఎంపీటీసీ స్థానాలకు జరగనున్నాయి. సిబ్బంది గైర్హాజరుపై కలెక్టర్ కొరడా ఎన్నికల విధులకు డుమ్మా కొట్టిన సిబ్బందిపై కలెక్టర్ కొరడా ఝుళిపించారు. ప్రాదేశిక ఎన్నికలకు 220 మంది గైర్హాజరవడాన్ని తీవ్రంగా పరిగణించారు. వారందరిపై శాఖాపరమైన చర్యలకు ఉపక్రమిస్తున్నారు. తొలివిడత పోలింగ్‌కు 1295 మంది పీవోలు, 3883 మంది ఏపీవో, 1295 మంది ఓపీవోలు మొత్తంగా 6473 మందిని ఎన్నికల విధులకు నియమించారు. వీరిలో 220 మంది గైర్హాజరయ్యారు. కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ ఆదేశాలమేరకు విధులకు రాని వారి జాబితాను జెడ్పీ సీఈవో మహేశ్వరరెడ్డి ఆదివారం సాయంత్రమే అందజేశారు. వారందరిపై ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. స్ట్రాంగ్ రూముల్లో బ్యాలెట్ బాక్సులు పోలింగ్ అనంతరం ఎన్నికల సిబ్బంది బ్యాలెట్ బాక్సులను ఆయా మండలాల రిసెప్షన్ సెంటర్‌కు తీసుకొచ్చారు. అక్కడి నుంచి పోలీసు బందోబస్తు మధ్య స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించారు. విశాఖ డివిజన్లోనివి శ్రీనివాస ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్‌లోను, అనకాపల్లి డివిజన్‌వి ఏఎంఏఎల్ కళాశాలలోను, నర్సీపట్నం డివిజన్‌వి డాన్‌బాస్కో స్కూల్లోని స్ట్రాంగ్‌రూమ్‌ల్లో భద్రపరిచారు. -
చోడవరం టీడీపీలో అసంతృప్తి సెగలు
ఎమ్మెల్యే రాజుపై మండిపడుతున్న ఓ వర్గం సీనియర్లను విస్మరిస్తున్నారని ఆరోపణ తమ కొంప ముంచుతుందేమోనని ‘స్థానిక’ అభ్యర్థుల్లో ఆందోళన చోడవరం రూరల్, న్యూస్‌లైన్ : చోడవరం టీడీపీలో అసంతృప్తి సెగలు బలంగా కనిపిస్తున్నాయి. గడచిన ఐదేళ్లుగా టీడీపీకి అంతా తానై వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.రాజు పట్ల పలువురు నాయకులు అసంతృప్తితో ఉన్నారు. జెడ్పీటీసీ అభ్యర్థి ఎంపిక విషయంలో కేఎస్ఎన్ చివరి వరకు నాటకీయతకు తెరతీయడంతో టికెట్టుపై ఆశపెట్టుకున్న అభ్యర్థుల్లో మరింత అసంతృప్తికి కారణమైంది. ముందుగా అభయం ఇచ్చిన వారికి కాకుండా చివరి నిమిషంలో మరో అభ్యర్థిని రంగంలోకి దింపడంతో ఆశావహులు అసంతృప్తితో రగిలిపోతూ వస్తున్నారు. వీరంతా అదనుకోసం చూస్తున్నట్లు పార్టీ నేతలే చెబుతున్నారు. గతంలోను ఇటువంటి అసంతృప్తులే అప్పటి జెడ్పీటీసీ అభ్యర్థి దాడి గంగరాజు ఓటమికి కారణమయ్యాయన్న అభిప్రాయం ఉంది. ఈసారి కూడా అదే పరిస్థితి పునరావృతమవుతుందనే అనుమానం సర్వత్రా వ్యక్తమవుతోంది. చోడవరం జెడ్పీటీసీ అభ్యర్థిగా బెన్నవోలుకు చెందిన మజ్జి గౌరీశంకర్‌కు టికెట్టు దాదాపు ఖరారయిందని భావించిన సమయంలో ఇదే టికెట్టు కోసం మండలంలోని గంధవరం మాజీ సర్పంచ్ పల్లా అర్జున యాదవ్ కూడా ఆశ పెట్టుకున్నారు. వీరితోబాటు గోవాడకు చెందిన ఏడువాక సన్యాసినాయుడు, గజపతినగరం గ్రామానికి చెందిన కనిశెట్టి సన్యాసిరావు(మత్స్యరాజు ) పోటీ పడ్డారు. చివరి నిమిషంలో అనూహ్యంగా కనిశెట్టి మత్య్సరాజుకు టికెట్టు ఖరారు కావడంతో మిగిలిన ఆశావాహులంతా కంగుతిన్నారు. ఇంతకాలం ఎమ్మెల్యే రాజు వెంట ఉన్నప్పటికీ ధన బలం ఉన్న వారికే టికెట్టు ఇచ్చారని ఆశావహులు మధనపడుతున్నారు. ఇటీవలే టీడీపీలో చేరిన గంటా వర్గీయులకు తగిన గుర్తింపు ఇవ్వకపోవడంపై కూడా ఆ వర్గీయులు గుర్రుగా ఉన్నారు. గంటా వర్గీయులు జెడ్పీటీసీ, లేదా ఎంపీపీ పదవికాని తమకు కేటాయించాలని పట్టుబట్టారు. ఎమ్మెల్యే రాజు వీరిని పట్టించుకోకపోవడంతో వారంతా రాజు తీరు పట్ల వ్యతిరేకంగా ఉన్నారు. గ్రామాల్లోని సీనియర్ కార్యకర్తలను పక్కనపెట్టి తనకు అనుకూలమైన వారినే ప్రోత్సహిస్తున్న రాజు తీరుపై సీనియర్లు అక్కసుతో ఉన్నారు. ఈ విధంగా అన్ని విధాలా రాజుపై ఉన్న వ్యతిరేకత తమ కొంప ముంచుతుందేమోనని ‘స్థానిక’ అభ్యర్థులు మధనపడుతున్నారు. -
అటు చేరికలు..ఇటు పొత్తు..టీడీపీ చిత్తు
పార్టీని వెన్నాడుతున్న తాజా కష్టాలు తలనొప్పిగా మారిన సీట్ల సర్దుబాటు గంటా బృందం చేరికతో కుమ్ములాట బీజేపీ డిమాండ్లతో మరింత సంక్షోభం తెలుగుతమ్ముళ్లలో ఆగ్రహం సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : చేరికలు, బీజేపీలో కుదురుతుందనుకుంటున్న పొత్తు జిల్లా టీడీపీకి వరంగా మారకపోగా శాపంగా పరిణమించింది. కొత్తగా వచ్చిన నేతలకుు సర్దుబాటు చేయలేక అష్టకష్టాలు పడుతుంటే బీజేపీ పొత్తు మరింతభారంగా తయారైంది. పొత్తు పెట్టుకొని అన్యాయం చేయవద్దంటూ అనితా సుకురు నేతృత్వంలో టీడీపీ కార్యకర్తలు శనివారం పెద్ద ఎత్తున పార్టీ కార్యాలయం ఎదుట ఆందోళనకు సైతం దిగారు. మరోవైపు టీడీపీ ప్రతిపాదిస్తున్న సీట్లు వద్దని బీజేపీ ఎదురుదాడికి దిగుతోంది. పొత్తు వల్ల ఓట్ల మాట అటుంచి ఎన్ని సీట్లు పోతాయోనన్న ఆందోళన టీడీపీని వెంటాడుతోంది. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుతో పాటు శానసభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాస్, చింతలపూడి వెంకట్రామయ్య, పంచకర్ల రమేష్‌బాబు, యూవీ రమణమూరిలు చేరిన తరువాత పార్టీ ప్రతిష్ట పెరగకపోగా కుమ్ములాటలతో దిగజారింది. కన్నబాబు వందల కోట్ల దోపిడిదారు అని స్వయంగా చంద్రబాబు గతంలో ఆరోపించడం, రమేష్‌బాబు, వెంకట్రామయ్య, శ్రీనివాస్‌ల భూకబ్జాలకు వ్యతిరేకంగా టీడీపీ ఉద్యమాలు నిర్వహించడంతో వీరి చేరికను క్యాడర్ ఇప్పటికీ ఆమోదించలేకపోయింది. ఈ ముగ్గురు ప్రభుత్వ అధికారులను గుప్పెట్లో పెట్టుకొని టీడీపీ నేతలు, కార్యకర్తలను పలు రకాలుగా వేధించడం చర్చనీయాంశంగా మారింది. మంత్రిగా గంటా కోట్ల రూపాయల ప్రభుత్వ గ్రంధాలయ స్ధలాన్ని దుర్వినియోగం చేయడం,పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్పడడంపై అప్పట్లో టీడీపీ విరుచుకుపడింది. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న అనకాపల్లిలో ఎన్టీఆర్ విగ్ర హ ఆవిష్కరణను అడ్డుకోవడం,సమైక్యాంధ్రా ఉద్యమకారులను అరెస్టులు చేయించి జైలుకు పంపడం వంటివాటిని టీడీపీ నేతలు మరువలేకపోతున్నారు. వీరి వెంట కాంగ్రెస్ క్యాడర్ రాక,టీడీపీ క్యాడర్ వీరితో కలవక ఇబ్బందులు ఎదురౌతున్నాయి. ఈ పరిస్ధితులను దృష్టిలో వుంచుకొని పార్టీ అధిష్టానం ఈ ఐదుగురిలో ముగ్గురికి టికెట్లకు నామం పెట్టేందుకు ఎత్తులు వేస్తోంది. టికెట్ రాదేమోఅన్న అభద్రతాభావంతో గంటా మిత్రులు, వీరి చేరికవల్ల తమ అవకాశాలు సన్నగిల్లాయని సీనియర్లు మదనపడుతున్నారు. కన్నబాబు, వెంకట్రాయమ్య, శ్రీనివాస్‌ల టికెట్ల విషయంలో సందిగ్ధత నెలకొంది. ఇక, వీరి చేరికల వల్ల టీడీపీ సీనియర్ నేతలు భరణికాణ రామారావు, కోన తాతారావు, మాజీ మంత్రి అప్పల నరసింహరాజు, మాజీ ఎంపీ పప్పల చలపతిరావు, పార్టీ నగర అధ్యక్షుడు వాసుపల్లి గణేష్‌కుమార్ తదితరులు రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారింది. బీజేపీతో పొత్తు పార్టీని మరింత సంక్షోభంలోకి నెట్టనుంది. నగర మొదటి మేయర్ బీజేపీ నుంచే ఎన్నిక కావడం, గతంలో ఈ జిల్లానుంచి ఆ పార్టీకి శానసభ్యులుండడంతో కనీసం ఒక ఎంపీ, రెండు ఎంఎల్ఏ టి కెట్లు ఇవ్వాలని ఆ పార్టీ పట్టుపడుతోంది. బీజేపీ సీమాంధ్రా అధ్యక్షుడు డాక్టర్ కంభంపాటి హరిబాబు కూడా విశాఖ వాసే కావడం, డీవీ సుబ్బారావు, పీవీ చలపతిరావు వంటి పెద్ద నేతలు వుండడంతో ఆ పార్టీ టికెట్లకు డిమాండు పెరిగింది. ఇటీవల పలువురు నగర ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు, వ్యాపారులు బీజేపీలో చేరారు. పోటీకి వీరు సిద్ధపడ్డం టీడీపీకి తలనొప్పిగా మారింది. ఈనేపథ్యంలో పొత్తు కుదిరితే కుమ్ములాటలు తప్పవని టీడీపీ జిల్లా నేతలు భయపడుతున్నారు. విశాఖ ఎంపీతో పాటు విశాఖ ఉత్తర, దక్షిణ లేదా అరకు శాసనసభాస్ధానాలు కావాలని బీజేపీ అడుగుతుండడం టీడీపీలో టెన్షన్‌ను పెంచుతోంది. -
నేడే పోలింగ్
తొలివిడత ప్రాదేశిక సమరానికి సర్వం సిద్ధం కర్నూలు(అర్బన్), న్యూస్‌లైన్ : జిల్లాలో ఆదివారం తొలి విడత ప్రాదేశిక ఎన్నికల పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. కర్నూలు, నంద్యాల డివిజన్లలోని 36 జెడ్పీటీసీ స్థానాలు, 496 ఎంపీటీసీ స్థానాలకు ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. కర్నూలు డివిజన్లోని 19 జెడ్పీటీసీ స్థానాలకు 73 మంది.. నంద్యాల డివిజన్లోని 17 జెడ్పీటీసీ స్థానాలకు 52 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. రెండు డివిజన్లలోని 496 ఎంపీటీసీ స్థానాలకు 1,311 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. పోలింగ్ కోసం 1,575 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 9,451 మంది సిబ్బంది ఎన్నికల విధులకు గాను శనివారం ఆయా గ్రామాలకు తరలివెళ్లారు.169 అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో 400 మంది ఇంజనీరింగ్ విద్యార్థుల సేవలను వినియోగించుకుంటున్నారు. ఆయా ప్రాంతాల్లోని పోలింగ్ సరళిని వెబ్ కాస్టింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. 400 మంది సూక్ష్మ పరిశీలకులను కూడా నియమించారు. ఎన్నికలు జరుగుతున్న మండలాలకు ఇప్పటికే బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలను తరలించారు. మండలాల్లోని ఆర్ఓ, ఏఆర్ఓలు ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి అవసరమైన సామగ్రిని అందజేసి, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన సూచనలు, సలహాలను మరోసారి వివరించారు. పోలింగ్ ప్రక్రియ ముగిసిన అనంతరం సిబ్బంది తిరిగి గమ్యస్థానాలకు చేరుకునేందుకు.. బ్యాలెట్ బాక్సులను తీసుకొచ్చేందుకు అవసరమైన వాహనాలను సిద్ధం చేశారు. కర్నూలు డివిజన్‌కు సంబంధించి 57 జోన్లు.. 111 రూట్లను ఏర్పాటు చేయగా.. 76 జీపులు, 118 ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులను వినియోగిస్తున్నారు. నంద్యాల డివిజన్లోని 49 జోన్లు, 94 రూట్లకు 67 జీపులు, 97 ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులను ఏర్పాటు చేశారు. -
బీజేపీలో ‘స్థానిక’ పోరు!
పొత్తులతో చిక్కులు స్థానికులకే టికెట్ ఇవ్వాలంటున్న నేతలు గెలుపే ముఖ్యమంటున్న మరి కొందరు నేతలు సాక్షి, విజయవాడ : టీడీపీతో పొత్తు బీజేపీకి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. పొత్తు దాదాపుగా ఖరారవుతుండటంతో టికెట్లు ఆశించేవారిలో ఆందోళన ప్రారంభమయింది. పొత్తులో భాగంగా విజయవాడ సెంట్రల్, పశ్చిమం, కైకలూరు అసెంబ్లీ సీట్లలో ఒకటి రెండే బీజేపీకి దక్కే అవకాశం ఉంది. దీంతో తెలుగుదేశం పార్టీలోనూ అంతర్గత పోరు మొదలైంది. విజయవాడ సెంట్రల్ సీటు తమకే కావాలని బీజేపీ నేతలు పట్టుబడుతున్నారు. అయితే పశ్చిమం లేదా కైకలూరు సీట్లలో ఒకటే ఇస్తామంటూ టీడీపీ నేతలు సూచిస్తున్నారు. చివరకు సెంట్రల్ బీజేపీకే దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. బీజేపీలో సుదీర్ఘకాలంగా పనిచేసిన సీనియర్లు చాలా మంది ఉన్నారని, వారికే అవకాశం కల్పించాలని, కొత్తవారిని తీసుకొస్తే ఊరుకొనేది లేదని ఆ పార్టీ నేతలు ఇప్పటి నుంచే నిరసన గళం వినిపిస్తున్నారు. హైదరాబాద్ నుంచి దిగుమతి చేసుకునేవారి వల్ల పార్టీకి పెద్దగా ఉపయోగమేమీ ఉండదని సలహాలిస్తున్నారు. వారు గెలి చినా, ఓడిపోయినా హైదరాబాద్‌లోనే ఉంటారని, దీనివల్ల స్థానికంగా పార్టీ అభివృద్ధి చెందదని పేర్కొంటున్నారు. బీజేపీ కూడా టీడీపీలాగానే ‘కార్పొరేట్ సంస్థ’గా మారిపోయిం దని, హైదరాబాద్‌లో నేతలకు డబ్బు సంచులు ఇచ్చి సీట్లు తెచ్చుకోవచ్చని కొంతమంది నేతలు భావిస్తున్నారని, అందువల్లనే స్థానికేతరుడికి సీటు ఇవ్వకూడదని బలంగా వాదిస్తున్నారు. ఏనాడూ పార్టీ జెండా పట్టుకోనప్పటికీ ముఖ్యనేతలను సంతృప్తి పరిచి బీఫారంతో దిగుమతి అయితే సహించబోమని ఈ సందర్భంగా తేల్చిచెబుతున్నారు. స్థానికుల కోటాలో బీజేపీ సీమాంధ్ర కన్వీనర్ ఉప్పలపాటి శ్రీనివాసరాజు, సీనియర్ నేతలు వీరమాచినేని రంగ ప్రసాద్, రామసాయి తదితర పేర్లు పరిశీలించవచ్చని సూచిస్తున్నారు. గెలుపుగుర్రాలపైనే దృష్టిపెట్టాలి సెంట్రల్ సీటు బీజేపీకి దక్కితే పార్టీని గెలిపించే వారికే అవకాశం కల్పించాలి తప్ప స్థానికుడికే ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదని అర్బన్ పార్టీలోనే మరికొంతమంది నేతలు వ్యాఖానిస్తున్నారు. సీనియార్టీనే ప్రాధాన్యతగా తీసుకుంటే జనసంఘ్ నుంచీ పనిచేసే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఉన్నారని, వారికే టికెట్ ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. గతంలో టికెట్ ఆశించి భంగపడి, కొన్నేళ్లుగా పార్టీకి దూరంగా ఉన్న కొందరు నేతలు ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చి ‘స్థానికుడికే సీటు’ అంటూ కొత్తవాదనలు తెస్తున్నార ని ఈ వర్గం వాదిస్తోంది. బీజేపీకి ఉన్న ఓటింగ్‌కు తోడు తన ప్రభావంతో పార్టీకి పది ఓట్లు తీసుకొచ్చే అభ్యర్థి అవసరమని, కేవలం సీనియార్టీని మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదని అంటున్నారు. వాణిజ్య, వ్యాపార, ఉద్యోగ వర్గాలతో మంచి సంబంధాలు, సినీ రంగంతో పరిచయం ఉన్నవారైతే నాలుగు ఓట్లు ఎక్కువ వస్తాయని వివరిస్తున్నారు. కొత్తవారి కోటాలో వాణిజ్యపన్నుల శాఖ ఉద్యోగుల అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు సూర్యనారాయణ, సినీ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు పేర్లు పరిశీలించవచ్చని తెలుస్తోంది. పశ్చిమం, కైకలూరు సీటు లభించినా అక్కడ నుంచి కూడా పోటీ చేసేందుకు నలుగురైదుగురు నేతలు పోటీ పడుతున్నారు. అయితే లభించే ఒకటి రెండు సీట్ల విషయంలో ఆచి తూచి అడుగు వేయాలని బీజేపీ అగ్రనేతలు భావిస్తున్నారని సమాచారం. -
ఓటుపై వేటు..
వైఎస్సార్సీపీ అనుకూల ఓటుపై టీడీపీ కుట్ర ఓటరు స్లిప్‌ల పంపిణీలో గిమ్మిక్కులు పెనమలూరులో వెలుగులోకి ఓటరు స్లిప్ లేకున్నా అనుమతిస్తామన్న కలెక్టర్ సాక్షి, మచిలీపట్నం : రాజకీయాల్లో ఎత్తుకు పై ఎత్తులు వేయడం.. వ్యూహాలకు పదును పెట్టడం సర్వసాధారణం. కానీ ఏకంగా ఇతర పార్టీలకు పడే ఓట్లపై వేటు వేసేందుకు జరిగే ప్రయత్నాలను మాత్రం ఎవరూ హర్షించరు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అనేకచోట్ల ఓటరు జాబితాల్లో తమకు అనుకూలంగా ఉండేవారి ఓట్ల నమోదు, వ్యతిరేక పార్టీకి చెందినవారివి తొలగింపు అనేక పర్యాయాలు వివాదాస్పమైన సంగతి తెల్సిందే. తాజాగా జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కొత్త ఎత్తుగడ పన్నింది. జిల్లాలో పలు పంచాయతీల్లో తమకు అనుకూలంగా ఉన్న సర్పంచ్, వార్డు సభ్యులు, సిబ్బందిని ప్రయోగించి వైఎస్సార్సీపీకి అనుకూల ఓటర్లకు ఓటరు స్లిప్‌లు ఇవ్వకుండా అడ్డుకుంది. గతంలో ఏ పార్టీ, ఏ అభ్యర్థి ఓటరు స్లిప్ ఇచ్చినా దాన్ని తీసుకుని వెళితే పోలింగ్ కేంద్రంలో ఎన్నికల సిబ్బంది బ్యాలెట్ ఇచ్చేవారు. ఆ బ్యాలెట్లో ఓటరు తనకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేసేవారు. కానీ ఈసారి పార్టీలు, అభ్యర్థులు గుర్తులతో ఇచ్చే ఓటరు స్లిప్‌లను అనుమతించేది లేదని, నేరుగా ఎన్నికల సిబ్బంది ఇంటింటికి తిరిగి ఇచ్చే ఓటరు స్లిప్‌లనే అనుమతిస్తామంటూ ఎన్నికల కమిషన్ నిబంధన పెట్టింది. దీంతో ఈసారి ఎన్నికల్లో ప్రతీ ఇంటికి ఆయా గ్రామాల్లోని సిబ్బంది ఓటరు స్లిప్‌ల పంపిణీ చేపట్టారు. అంతవరకు బాగానే ఉన్నా అసలు మెలికను టీడీపీ నేతలు ఇక్కడే పెట్టారు. ఓటరు స్లిప్ లేకుండా ఓటు లేదనుకునో, ఓటు వేయనివ్వరనుకునో ఓటర్లు పోలింగ్ కేంద్రానికి మానేస్తారు. దీంతో టీడీపీ వ్యతిరేక ఓటుకు అడ్డుకట్ట వేసే కుట్ర గ్రామాల్లో పురుడుపోసుకుంది. ఇది పెరిగి పెద్దదై జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో టీడీపీ మద్దతుదారులు, ఆయా గ్రామ సర్పంచ్‌లు, వార్డు సభ్యులు ఎన్నికల దిగువస్థాయి సిబ్బందిని తమ చేతిలోకి తీసుకుని వైఎస్సార్సీపీ అనుకూల ఓటర్లకు ఓటరు స్లిప్‌లు ఇవ్వకుండా అడ్డుకుంటున్నట్టు ఆరోపణలు వచ్చాయి. ఉదాహరణకు పెనమలూరు నియోజకవర్గంలో ఆదివారం జరగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి పడే ఓటర్లను టార్గెట్‌గా చేసుకుని అవి పడకుండా వేటు వేసేందుకు ఓటరు స్లిప్‌లు ఇవ్వలేదని అధికారులకు ఫిర్యాదులు అందాయి. కానూరులో వెలుగులోకి... పెనమలూరు మండలం కానూరు పంచాయతీలో ఓటరు స్లిప్‌లను అంగన్వాడీ వర్కర్‌కు బదులు వార్డు సభ్యుడి చేతుల మీదుగా పంపిణీ చేశారు. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేసే ఆ వార్డు సభ్యుడు ఒక ఇంటి వద్దకు వెళ్లి మొదట ఓటరు స్లిప్‌లు ఇచ్చాడు. మీరు ఓటు ఎవరికి వేస్తారని ఆ ఇంటి యజమానిని పంచాయతీ వార్డు సభ్యుడు ప్రశ్నించాడు. దీంతో నేను వైఎస్సార్సీపీకి ఓటేస్తానని ఇంటి యజమాని బదులివ్వడంతో అతనికి ఇచ్చిన ఓటరు స్లిప్‌ను లాగేసుకుని వెళ్లిపోయినట్టు అతను వైఎస్సార్సీపీ నాయకుల దృష్టికి తేవడంతో ఈ వ్యవహారం గుప్పుమంది. ఇలా జిల్లాలో చాలా చోట్ల ఓటర్లకు స్లిప్‌లు ఇవ్వకుండా కుట్ర చేశారని చెబుతున్నారు. ఓటరు స్లిప్ లేకుంటే తమ ఓటు లేదనో, స్లిప్ ఇవ్వలేదు కాబట్టి ఓటు వేయనివ్వరనో కారణంతో చాలా మంది ఓటర్లు ఓటుకు దూరమయ్యే ప్రమాదం ఉంది. తెల్లకాగితంపై రాసి తెచ్చినా ఓటిస్తాం : కలెక్టర్ ఓటరు స్లిప్ లేదని కంగారుపడనవసరం లేదని, తెల్ల కాగితంపై వివరాలు రాసుకుని వచ్చినా ఓటిస్తామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు స్పష్టం చేశారు. పెనమలూరులో జరిగిన ఉదంతాన్ని ‘సాక్షి’ ఆయన దృష్టికి తెచ్చింది. ఈ విషయాన్ని అన్ని నియోజకవర్గాల్లోని ఎన్నికల అధికారుల నుంచి ఆరా తీస్తానని ఆయన తెలిపారు. ఓటరు స్లిప్ అందలేదని ఓటర్లు కంగారు పడక్కర్లేదని చెప్పారు. పార్టీల గుర్తులు, రంగులు లేని తెల్లకాగితంపై ఓటరు పేరు, ఓటరు జాబితాలో సీరియల్ నంబర్ వంటివి రాసుకుని తెస్తే ఓటు వేసే అవకాశం ఇస్తామని అన్నారు. ఓటరు ఏదైనా గుర్తింపు కార్డు కూడా తప్పనిసరిగా వెంట తీసుకురావాలని కలెక్టర్ సూచించారు. పెనమలూరులో హెల్ప్ డెస్క్ ఏర్పాటు పెనమలూరులో వైఎస్సార్సీపీ అనుకూల ఓట్లను పడకుండా చేసేందుకు టీడీపీ చేసిన కుట్రను నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, విజయవాడ సబ్ కలెక్టర్ దాసరి హరిచందనకు ఫిర్యాదు చేసినట్టు వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త పడమట సురేష్‌బాబు ‘సాక్షి’కి శనివారం రాత్రి చెప్పారు. ఓటు వేసేందుకు కీలకమైన ఓటరు స్లిప్‌లు మండల కార్యాలయాలు, పంచాయతీల్లో ఇచ్చి పర్యవేక్షణ చేయకపోవడంతో వాటి పంపిణీలో పక్షపాత ధోరణులు ఉన్నాయని సురేష్‌బాబు తెలిపారు. ఓటరు స్లిప్‌లు లేవని కంగారుపడవద్దని, పోలింగ్ కేంద్రాల వద్ద హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తామంటూ సబ్‌కలెక్టర్ హరిచందన హామీ ఇచ్చారని ఆయన వివరించారు. ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద హెల్స్ డెస్క్‌లు ఏర్పాటు చేసి ఓటరు స్లిప్‌లు లేనివారికి వాటిని అందించేలా చర్యలు తీసుకుంటానని సబ్‌కలెక్టర్ తెలిపారని ఆయన వెల్లడించారు. -
పోరుకు సర్వం సిద్ధం
రేపు మదనపల్లె డివిజన్లో తొలి విడత స్థానిక ఎన్నికలు సన్నద్ధమైన యంత్రాంగం 31 జెడ్పీటీసీలు, 447 ఎంపీటీసీలకు పోలింగ్ బరిలో 1408 మంది అభ్యర్థులు చిత్తూరు (అర్బన్), న్యూస్‌లైన్ : జిల్లాలో తొలి విడతగా జరిగే స్థానిక సంస్థల ఎన్నికలకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది. 6వ తేదీన జిల్లాలో తొలి విడతగా మదనపల్లె డివిజన్ లోని 31 మండలాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించనున్నారు. 144 మంది జెడ్పీటీసీ స్థానాలకు, 1264 మంది ఎంపీటీసీ స్థానాల్లో పోటీ పడుతున్నారు. 10.77 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించనుకోనుండగా, మొత్తం 1408 మంది అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. పోలింగ్ మండలాలు ఇవే... మదనపల్లె డివిజన్ పరిధిలోని 31 మండలాల్లో ఆదివారం ఎన్నికలు జరుగనున్నాయి. ఈ డివిజన్లో బి.కొత్తకోట జెడ్పీటీసీ స్థానంతోపాటు 17 ఎంపీటీసీ సెగ్మెంట్లకు బెరైడ్డిపల్లెలో 16, చిన్నగొట్టిగల్లు 7, చౌడేపల్లె 12, గంగవరం 16, గుడుపల్లె 13, గుర్రంకొండ 12, కంభంవారిపల్లె 12, కలకడ 10, కలికిరి 14, కుప్పం 34, కురబలకోట 12, ములకలచెరువు 13, మదనపల్లె రూరల్ 27, నిమ్మనపల్లె 9, పలమనేరు 9, పెద్దమండ్యం 10, పెద్దపంజాణి 17, పెద్దతిప్పసముద్రం 15, పీలేరు 21, పుంగనూరు 16, రామకుప్పం 16, రామసముద్రం 14, రొంపిచెర్ల 8, శాంతిపురంలో 18, సదుం 10, సోమల 12, తంబళ్లపల్లె 11, వాల్మీకిపురం 13, వి.కోట 25, ఎర్రావారిపాళెంలోని 8 ఎంపీటీసీ సెగ్మెంట్లతో పాటు జెడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ జరుగనుంది. 7 వేలకు పైగా సిబ్బంది తొలి విడత ఎన్నికలకు మొత్తం 7,742 మంది సిబ్బందిని నియమించారు. ఒక్కో పోలింగ్ కేంద్రానికి ఒక పోలింగ్ అధికారి, ఒక సహాయ పోలింగ్ అధికారి, ముగ్గురు సిబ్బందిని నియమించారు. 1,550 మంది పీవోలు, 1,550 మంది ఏపీవోలు, 4,642 మంది పోలింగ్ సిబ్బందిని నియమించారు. మొత్తం 1.381 పోలింగ్ కేంద్రాలు ఉండగా వీటిలో 141 సమస్యాత్మక, 152 అత్యంత సమస్యాత్మక కేంద్రాలు న్నాయి. ఇక్కడ పోలింగ్ సవ్యంగా నిర్వహించడానికి 146 మంది వీడియోగ్రాఫర్లు, లైవ్ వెబ్‌కాస్టింగ్‌కు 140 మంది ఇంజినీరింగ్ విద్యార్థులు, 99 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు. సిబ్బంది కోసం 347 బస్సులను కూడా ఏర్పాటు చేశారు. బ్యాలెట్ పత్రాలతో తీర్పు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఓటర్లు వారి నిర్ణయాన్ని బ్యాలెట్ పత్రాల ద్వారా తెలియజేయనున్నారు. రాజకీయ పార్టీలకు చెందిన గుర్తులతో ఈ ఎన్నికలు జరుగనున్నాయి. మదనపల్లె డివిజన్లో 31 మంది జెడ్పీటీసీ అభ్యర్థుల్ని ఎన్నుకోవడానికి 12.95 లక్షల బ్యాలెట్ పత్రాలు, 447 మంది ఎంపీటీసీ అభ్యర్థుల్ని ఎన్నుకోవడానికి 17.61 లక్షల బ్యాలెట్ పత్రాలు ముద్రించి ఇప్పటికే వాటిని ఆయా పోలింగ్ కేంద్రాల సమీపంలోని మండల కేంద్రాలకు తరలించారు. -
కుమ్మరిస్తున్నారు..
నోట్లతో ఓట్ల కోసం టీడీపీ ఎర కుప్పంలో ఆకు, వక్కతోపాటు డబ్బు పంపిణీ పీలేరులో విచ్చలవిడిగా మద్యం పంపిణీ చేసిన జై సమైక్యాంధ్ర పార్టీ పోలింగ్ రోజున మాంసం కోసం టీడీపీ టోకన్లు సాక్షి, తిరుపతి: పరిషత్ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టడం ద్వారా విజయం సాధించేం దుకు తెలుగుదేశం పార్టీ రకరకాల ఎత్తుగడలు వేస్తోంది. డబ్బుతోపాటు విచ్చలవిడిగా మద్యం పంపిణీ చేస్తోంది. ఒక్కోచోట ఒక్కోరకమైన ప్రలోభాలకు తెరతీసింది. పోలింగ్‌కు ఇక 24 గంటలు మాత్రమే ఉండడంతో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు చివరి ప్రయత్నాలు ముమ్మ రం చేసింది. మదనపల్లెలో డబ్బు పంపిణీ చేస్తూ తెలుగుదేశం పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థి సుధాకర్ పోలీసులకు చిక్కారు. దీన్నిబట్టి ఓట్ల కోసం ప్రలోభాలపైనే టీడీపీ ఎంతగా ఆధారపడిందో అర్థమవుతోంది. పరిషత్ ఎన్నికల్లో భాగంగా తొలివిడతగా మదనపల్లె రెవెన్యూ డివిజన్ పరిధిలోని 31 జెడ్పీటీసీ, 447 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరుగనున్న విషయం తెలిసిందే. మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశంపార్టీ అధినేత ఎన్.చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దూకుడును ఎదుర్కొనేందుకు ఆ పార్టీ శ్రేణులు డబ్బు కుమ్మరిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల ముందు జరుగుతున్న ఎన్నికలు కావడంతో కుప్పంలో ఏదో రకంగా గెలుపు సాధించాలనే ప్రయత్నం జరుగుతోంది. ప్రతి ఎంపీటీసీ సెగ్మెంట్లోనూ ఓటుకు రేటు కట్టారు. కుప్పం మండల సెగ్మెంట్లో మహిళలకు ఆకు, వక్కతో పాటు డబ్బు పంపిణీ చేశారు. ఈ సెగ్మెంట్లో అత్యధికంగా వెయ్యి రూపాయలు కూడా పం పిణీ చేసినట్టు సమాచారం. పలమనేరు నియోజకవర్గం వి.కోట మండలంలో యువతను ఆక ర్షించేందుకు క్రికెట్ కిట్లు, వాలీబాల్ కిట్లు పంపిణీ చేశారు. కొన్ని గ్రామాల్లో యువతకు ప్రత్యేకంగా యూత్ డిన్నర్స్ ఏర్పాటు చేశారు. ఈ విందులో మందు, మాంసాహారం అందించారు. బెరైడ్డిపల్లెలో మహిళలకు ముక్కుపుడకలు పంపిణీ చేశారు. గంగవరం మండలంలో పది మందికి పైగా ఓట్లు ఉన్న ఇళ్లకు టోకుగా ప్యాకేజీలు నిర్ణయించి ఆ మేరకు కొనుగోలు చేసే ప్రయత్నం చేశారు. పలమనేరు మండలంలో పోలింగ్ జరిగే ఆదివారం రోజున మాంసం తెచ్చుకునేందుకు వీలుగా టోకెన్లు పంపిణీ చేశారు. కుటుంబంలోని ఓటర్ల సంఖ్యను బట్టి రెండు నుంచి మూడు కేజీల చికెన్, మటన్ టోకెన్లు ఇచ్చారు. పీలేరు, పుంగనూరు నియోజకవర్గాల్లోనూ టీడీపీ నాయకులు విచ్చలవిడిగా మద్యం, డబ్బు పంపిణీ చేశారు. చౌడేపల్లె మండలంలో టీడీపీ అభ్యర్థులు తెప్పించినదిగా భావిస్తున్న 210 కేసుల బీరు, బ్రాందీ బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జెడ్పీటీసీ అభ్యర్థి అరెస్ట్ మదనపల్లె జెడ్పీటీసీ అభ్యర్థి సుధాకర్ శుక్రవారం ఎన్నికల ప్రచారం ముగిసిన తరువాత ఓటర్లకు డబ్బు పంపిణీ చేశారు. కోటపోలు గ్రామంలో స్వయంగా డబ్బు పంపిణీ చేస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన నుంచి రూ.25 వేలు స్వాధీనం చేసుకున్నారు. రామసముద్రం మండలంలో ఓటుకు వెయ్యి రూపాయలు పంపిణీ చేశారు. నిమ్మనపల్లెలో ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు ఓటుకు రేటు కట్టారు. కిక్కెక్కించిన జై సమైక్యాంధ్ర పార్టీ పీలేరు నియోజకవర్గంలో జై సమైక్యాంధ్ర పార్టీ నాయకులు పెద్ద ఎత్తున మందు పంపిణీ చేశారు. కొన్నిచోట్ల డబ్బు పంపిణీ చేసినప్పటికీ మద్యం పంపిణీకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. వైఎస్సార్ సీపీ హవా ఉన్న సెగ్మెంట్లలో జై సమైక్యాంధ్ర వారు ఐదు నుంచి వెయ్యి రూపాయల వరకు డబ్బు పంపిణీ చేశారు. -
తొలి విడత...ప్రచారానికి తెర
పరిషత్ పోరు 6న మొదటి విడత పోలింగ్ విజయవాడ, మచిలీపట్నం డివిజన్లలో నిర్వహణ 26 జెడ్పీటీసీ స్థానాలకు 99 మంది పోటీ 450 ఎంపీటీసీలకు బరిలో 1,187 మంది పోలింగ్ కేంద్రాలు 1,437 నేడు సిబ్బందికి ఎన్నికల సామగ్రి అప్పగింత మచిలీపట్నం, న్యూస్‌లైన్ : ప్రాదేశిక ఎన్నికల మొదటి విడత ప్రచారానికి శుక్రవారంతో తెరపడింది. విజయవాడ, మచిలీపట్నం రెవెన్యూ డివిజన్లలోని 26 జెడ్పీటీసీ, 450 ఎంపీటీసీ స్థానాలకు ఈ నెల ఆరో తేదీన ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జెడ్పీ సీఈవో, స్థానిక సంస్థల ఎన్నికల రిటర్నింగ్ అధికారి డి.సుదర్శనం ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. గత నెల 24తో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసిన అనంతరం మొదటి విడత ఎన్నికలు జరిగే మచిలీపట్నం, విజయవాడ డివిజన్లలో జెడ్పీటీసీ స్థానాలకు 99 మంది, ఎంపీటీసీ స్థానాలకు 1,187 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో అధికంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. విస్తృత ప్రచారం... గత 11 రోజులుగా మొదటి విడత ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు విస్తృత ప్రచారం నిర్వహించారు. మొదటి విడత ఎన్నికలు జరిగే మండలాల్లో ప్రచారానికి చివరిరోజైన శుక్రవారం అభ్యర్థులు, వారి తరఫున నాయకులు పోటాపోటీగా పర్యటించారు. బ్యాలెట్ బాక్సుల్లోనే... జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు బ్యాలెట్ పత్రాల ద్వారానే నిర్వహించనున్నారు. శనివారం ఉదయం 10 గంటల నుంచి ఆయా మండల పరిషత్ కార్యాలయాల వద్ద ఎన్నికల అధికారులు, సిబ్బందికి సామగ్రిని అప్పగించేందుకు ఏర్పాట్లు చేశారు. వైఎస్సార్ సీపీ జెడ్పీ చైర్పర్సన్ అభ్యర్థి తాతినేని పద్మావతి పోటీలో ఉన్న తోట్లవల్లూరు జెడ్పీటీసీ స్థానానికి మొదటి విడతలోనే ఎన్నికలు జరగనున్నాయి. రెండు డివిజన్లలోని 26 మండలాల్లో 11,56,122 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొదటి విడత ఎన్నికలు జరిగే విజయవాడ డివిజన్లో 10, మచిలీపట్నం డివిజన్లో 4 ఎంపీటీసీ స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. 1,437 కేంద్రాల్లో పోలింగ్... మచిలీపట్నం రెవెన్యూ డివిజన్లోని 12 జెడ్పీటీసీ స్థానాలకు, 157 ఎంపీటీసీ స్థానాలకు, విజయవాడ రెవెన్యూ డివిజన్లోని 14 జెడ్పీటీసీ స్థానాలకు, 293 ఎంపీటీసీ స్థానాలకు ఆదివారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మొత్తం 1,437 పోలింగ్ కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు. 42 అతి సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అక్కడ వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని తెలుసుకునేందుకు చర్యలు తీసుకున్నారు. 26 మంది మైక్రో అబ్జర్వర్లు ఎప్పటికప్పుడు పోలింగ్ సరళిని పరిశీలించనున్నారు. ఒక్కొక్క పోలింగ్ స్టేషన్‌కు ప్రిసైడింగ్ అధికారి, సహాయ ప్రిసైడింగ్ అధికారితో పాటు మరో ముగ్గురిని నియమించారు. మొత్తం 7,185 మంది సిబ్బందితో పాటు మరికొంతమందిని రిజర్వులో ఉంచారు. పటిష్ట బందోబస్తు... మొదటి విడత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్పీ జె.ప్రభాకరరావు, ఏఎస్పీ బీడీవీ సాగర్ నేతృత్వంలో బందోబస్తు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడైనా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుని ఎన్నికలు నిలిచిపోతే ఈ నెల ఏడో తేదీన రీపోలింగ్ నిర్వహిస్తామని అధికారులు చెబుతున్నారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయిన అనంతరం మండల కేంద్రంలో బ్యాలెట్ బాక్సులు స్వాధీనం చేసుకుని అక్కడి నుంచి ఆయా డివిజన్ కేంద్రాలకు తరలించి స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రపరుస్తారు. నగదు, మద్యం జోరు... ఎన్నికల ప్రచారం ముగియటంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. ఆయా గ్రామాల్లో మద్యం పంపిణీని ప్రారంభించారు. పోటీ తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో గుట్టుచప్పుడు కాకుండా ఓటుకు వెయ్యి నుంచి రూ.3 వేల వరకు పంపిణీ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఎంపీపీ స్థానం ఆశిస్తున్న అభ్యర్థులు పోటీ చేసే స్థానాల్లో ఓటుకు రూ.3 వేలు వరకు పలుకుతోంది. ఐదారు ఓట్లు ఉన్న కుటుంబంలో వారు నగదు తీసుకోరని భావిస్తే గృహోపయోగమైన వస్తువులను అందిస్తున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా గ్రామాల్లో మద్యం పరవళ్లు తొక్కుతోంది. పురపాలక సంఘ ఎన్నికల అనంతరం చెక్‌పోస్టులలో నిఘా తగ్గించటంతో ఎలాంటి ఆటంకం లేకుండానే మద్యం, నగదు గ్రామాలకు చేరిపోతోంది. -
ఇక ఆపదే
5 అసెంబ్లీ స్థానాలకు టీడీపీ టికెట్లు ఖరారు! సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మూడు పది స్థానాలపై తొలగని అనిశ్చితి గంటా బృందం టిక్కెట్లపై సస్పెన్స్ ఇరకాటంలో అరకు టికెట్ సాక్షి,విశాఖపట్నం: టీడీపీ నాన్చినాన్చి ఐదు అసెంబ్లీ స్థానాలకు టికెట్లను ఖరారు చేసింది. శుక్రవారం వీటిపై స్పష్టత వచ్చినా పొత్తుల సాకుతో శనివారానికి వాయిదా వేసింది. మూడుచోట్ల సిటింగ్ ఎమ్మెల్యేలకు ఖరారు చేసింది. విశాఖ తూర్పు- వెలగపూడి, చోడవరం- కేఎస్ఎన్ రాజు, మాడుగుల-గవిరెడ్డి రామానాయుడు పేర్లు ఖరారయ్యాయి. పశ్చిమం- గణబాబు, నర్సీపట్నం- అయ్యన్నపాత్రుడు పేర్లు కూడా బయటకు వచ్చాయి. సిట్టింగ్‌లను ప్రకటించిన చోట అసమ్మతి స్వరం భగ్గుమంది. ఇక్కడ టికెట్లు ఆశిస్తున్న వారంతా శుక్రవారం రాత్రి నుంచి కారాలుమిరియాలు నూరుతున్నారు. తమను పార్టీ వంచించిందని ఆరోపిస్తున్నారు. ముందుంది అసలు పండగ జిల్లాలో మిగిలిన పది సీట్ల విషయమే పీటముడిగా తయారైంది. ఒకరి పేరు ప్రకటిస్తే మరొకరు భగ్గుమనే పరిస్థితులు కనిన్నాయి. దీంతో వివాదంగా మారిన వాటి జోలికి పోలేదని భోగట్టా. బీజేపీతో పొత్తు తేలక అభ్యర్థులను ప్రకటించలేదని అధిష్టానం పేర్కొంటుండడంతో సస్పెన్స్ వీడక ఆశావహులు, పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జులు తలపట్టుకుంటున్నారు. ఇటీవల పార్టీలో చేరిన గంటా బృందమైతే ముచ్చెమటల్లో మునుగుతోంది. వీరంతా రాజధానిలో మకాం పెడుతున్నారు. ఎలమంచి,గాజువాకల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు కన్నబాబురాజు, చింతలపూడికి టికెట్లు కష్టమని తెలుస్తోంది. ఇప్పుడు బీజేపీతో పొత్తు, ఇతర సీనియర్ నేతల నుంచి పోటీ కారణంగా ఉత్తరం నుంచి ప్రస్తుత పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబుకు కూడా టికెట్ గగనమని తెలుస్తోంది. ఇక్కడి టికెట్‌పై గంటా బాబు వద్ద పంచాయతీ పెట్టినట్లు భోగట్టా. భీమిలిలో గంటా వర్గం నేత అవంతికి పోటీ తీవ్రంగా ఉంది. విశాఖ దక్షిణంలో వాసుపల్లికి టిక్కెట్ ఖరారని ప్రచారమైనా చివరి నిమిషంలో బీజేపీకి ఇవ్వడానికి చంద్రబాబు నిర్ణయించారని పార్టీ వర్గాలంటున్నాయి. దీంతో అక్కడ పనిచేస్తోన్న వాసుపల్లితో తలనొప్పి ఎదురుకానుంది. ఇప్పటికే ఆయన గురువారం చంద్రబాబును కలిసి అసంతృప్తి కూడా వెల్లగక్కారు. ముగ్గురు సిటింగులకు టికెట్ కేటాయించిన బాబు అరకు విషయంలో ఇరకాటంలో పడ్డారు. ప్రస్తుత ఎమ్మెల్యే సిరివేము సోమ పేరును మాత్రం ప్రకటించలేదు. ఆస్థానం బీజేపీకి ఇవ్వవచ్చనే ప్రచారం ఉంది. పెందుర్తి,పాయకరావుపేట,పాడేరు,భీమిలి,అనకాపల్లి,గాజువాక తదితర స్థానాల్లో చిక్కుముడుల కారణంగా మున్ముందు ఏప్రకటన వెలువడుతుందో తెలియక రాజధానిలోనే పాగావేశారు. -
పొత్తులు.. కత్తులు
‘దేశం’లో ముసలం తమ్ముళ్ల తిరుగుబాట అధినేత ఇంటి వద్ద నిరసన అమీతుమీకి సిద్ధం స్వతంత్రులుగా పోటీకి సై సాక్షి, సిటీబ్యూరో: పోటీకి ముందే సొంత పార్టీల్లో పేచీలు.. ఒకపక్క పొత్తుల కోసం ఎత్తులు పై ఎత్తులు.. మరోపక్క అవి పొసగక కత్తులు దూస్తున్న శ్రేణులు.. సార్వత్రిక ఎన్నికల వేళ కాంగ్రెస్, టీడీపీ, బీజేపీల్లో చిచ్చు రగులుతోంది. పోటీపై స్పష్టత కొరవడటంతో మంటలు రేగుతున్నాయి. ఇన్నాళ్లూ తాము పోటీ చేద్దామని ఆశించిన నియోజకవర్గాలను పొత్తుల్లో భాగంగా ఇతర పార్టీలకు ధారాదత్తం చేస్తున్నారనే సమాచారంతో ఆయా పార్టీల శ్రేణులు మండిపడుతున్నాయి. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతానికి కృషి చేసిన తమను లెక్కలోకి తీసుకోకుండా ఇష్టానుసారం ఇతర పార్టీలకు ఆ సీట్లను కట్టబెడుతుండటాన్ని జీర్ణించుకోలేని నాయకులు అధిష్ఠానాలతోనే అమీతుమీకి సిద్ధమవుతున్నారు. దీన్ని చూస్తూ ఊరుకోబోమని, ఇతర పార్టీల్లోకి ఫిరాయించైనా పోటీ చేస్తామని, లేకుంటే స్వతంత్రంగానైనా బరిలోకి దిగుతామని సవాల్ విసురుతున్నారు. ప్రధానంగా ఈ పరిణామాలు గ్రేటర్ హైదరాబాద్‌లోని తెలుగుదేశం పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పొత్తులో భాగంగా తమ నియోజకవర్గాలు బీజేపీ ఖాతాలోకి వెళ్తున్నాయని భావించిన ఆయా నియోజకవర్గాల నేతలు ఏకంగా చంద్రబాబు ఇంటి వద్ద ఆందోళనలకు దిగుతున్నారు. ఇంకొందరు వేచి చూసే ధోరణిలో ఉన్నారు. పార్టీ అధిష్ఠానం తీరును నేతలు తీవ్రంగా దుయ్యబడుతున్నారు. ఆర్నెళ్ల ముందే అభ్యర్థులను ప్రకటిస్తామన్న అధిష్ఠానం అది చేయకపోగా, తీరా నామినేషన్ల సమయంలో ఉత్తచేయి చూపడాన్ని ఆయా నియోజకవర్గాల నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. మరోవైపు, అభ్యర్థుల ఎంపికకు ఐవీఆర్ఎస్ను వినియోగిస్తున్నామని చెప్పిన అధినేత.. బీజేపీతో పొత్తుపై ఎందుకు అభిప్రాయాలు సేకరించడం లేదని ప్రశ్నిస్తున్నారు. ‘దేశం’లో ఇదీ వరస.. మహేశ్వరం నియోజకవర్గం టిక్కెట్‌ను టీడీపీ.. బీజేపీకి కేటాయించనుందనే ప్రచారంతో మాజీ మేయర్, ఆ స్థానాన్ని ఆశిస్తున్న తీగల కృష్ణారెడ్డి తన అనుచరులతో కలిసి గురువారం చంద్రబాబు ఇంటి ఎదుట ఆందోళన చేపట్టారు. మహేశ్వరం సీటును బీజేపీకి ఇవ్వరాదని, అందుకు భిన్నంగా వ్యవహరిస్తే, తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు ఎల్బీనగర్ టిక్కెట్ ఆశిస్తున్న ఆ నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఎస్వీ కృష్ణప్రసాద్ సైతం చంద్రబాబు ఇంటి సమీపంలో బైఠాయించారు. ఈ సీటు బీజేపీకి ఇస్తే సహించమని తేల్చి చెప్పారు సికింద్రాబాద్ నియోజకవర్గానికి చెందిన హైదరాబాద్ జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి బద్రినాథ్‌యాదవ్ సైతం ఆందోళనకు దిగారు ఖైరతాబాద్‌ను బీజేపీకి కేటాయించవద్దని ఆ నియోజకవర్గ ఇన్‌ఛార్జి కె.విజయరామారావు మూడ్రోజుల క్రితం చంద్రబాబుకి విజ్ఞప్తి చేశారు ఎన్టీఆర్‌కు జై.. చంద్రబాబు నై నై! బీజేపీతో పొత్తులో భాగంగా సీట్లు కోల్పోయే అవకాశం ఉన్న నేతలంతా కూటమిగా ఏర్పడి ప్రచారం నిర్వహించాలని భావిస్తున్నారు. ప్రచారంలో.. పార్టీ జెండాలు, బ్యానర్లు వాడాలని, అయితే వాటిలో ఎక్కడా చంద్రబాబు బొమ్మ లేకుండా, పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ బొమ్మ మాత్రమే ఉండాలని నిర్ణయించినట్లు సమాచారం. ఎంతో కాలంగా పార్టీని నమ్ముకున్న తమకు అదే పార్టీలో జరిగిన అన్యాయాన్ని ప్రజలకు తెలిపేందుకు, ఎన్టీఆర్ ఏ ఆశయాలతో టీడీపీని ఏర్పాటు చేశారో అందుకు వ్యతిరేకంగా ప్రస్తుత టీడీపీ నడుస్తోందని చెప్పేందుకు ఈ ప్రదర్శనలు ఉపకరిస్తాయని భావిస్తున్నారు. అసలైన టీడీపీ వాళ్లం తామేనని ప్రకటించుకోవడంతో పాటు, టీడీపీ మద్దతిచ్చిన బీజేపీ అభ్యర్థికి ఓటు వేయవద్దని ప్రచారం చేసేందుకూ ఇది తోడ్పతుందని అంచనా వేస్తున్నారు. ముషీరాబాద్, అంబర్‌పేట, గోషామహల్ నియోజకవర్గాల నేతలు ఈ యోచనకొచ్చినట్లు తెలుస్తోంది. ఇందువల్ల తమ గెలుపు సంగతెలా ఉన్నా.. తమకు టిక్కెట్ రాకపోవడానికి కారకులైన వారూ గెలవరాదనేది వీరి తలంపుగా ఉంది. ప్రచారంలో ‘ఎన్టీఆర్ జిందాబాద్’ నినాదమే తప్ప ఎక్కడా చంద్రబాబు పేరు, బొమ్మల్ని ప్రస్తావించరాదని నిర్ణయించినట్లు సమాచారం. తద్వారా ‘చంద్రబాబు ముర్దాబాద్’ అని వేరుగా చెప్పాల్సిన పనిలేదని భావిస్తున్నారు. కాగా, కార్వాన్, యాకుత్‌పురా/చార్మినార్, ఉప్పల్, మల్కాజిగిరి/కుత్బుల్లాపూర్‌ను సైతం బీజేపీ కోరుతుండటంతో ఆ నియోజకవర్గాల టీడీపీ నేతలూ ఆందోళనలకు సిద్ధమవుతున్నారు. -
బావకు బిర్యానీ పెట్టండ్రా..!!
ఓటరు మారాజుకు మహద్భాగ్యం బిందెలు, చీరలు, స్టీలు క్యాన్లు పంపిణీ తాగినోడికి తాగినంత...మస్తుగా బిర్యానీ పల్లెల్లో పండగ వాతావరణం నర్సీపట్నం టౌన్, న్యూస్‌లైన్: ‘ఒరేయ్...మా సిమాచలం బావొచ్చాడు...కూకోబెట్టి బిర్యానీ పెట్టండ్రా...ఏటి గంగక్కా ఈ మద్దిన కనబడ్నేదు......మా మేన కోడలు బాగా సదువుతందా ? ఇదా ఈ స్టీలు బిందె, చీర ఉంచు...వచ్చేవారం జరిగే ఎలచ్చన్లలో ఈ తమ్ముడికి ఓటెయ్యడం మర్సిపోకు సుమీ...’ పల్లెల్లో ఎక్కడ చూసినా ఇదే సందడి...సంక్రాంతి, శివరాత్రి, ఉగాది పండగలు ముగిశాక వస్తున్న ఈ ఓట్ల పండక్కి నేతలు సిద్ధమై, ప్రజల్నీ సంసిద్ధుల్ని చేస్తున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి అన్ని పార్టీలూ శక్తియుక్తులు ధారపోస్తున్నాయి. గతంలో వేలల్లో అయ్యే ఖర్చు ఇప్పుడు లక్షలు దాటింది. అప్పట్లో జాకెట్ ముక్క ఇస్తే గొప్ప...మరిప్పుడు ఖరీదైన చీర, ఇంకా స్టీలు బిందెలు ఇవ్వాల్సిందే. దీంతోబాటు విచ్చలవిడిగా తాగినోడికి తాగినంత మద్యం. తిన్నోడికి తిన్నంత బిర్యానీ...రోజూ రాత్రిళ్లు విందు సమావేశాలతో పల్లెల్లో ఒకటే సందడి నెలకొంది. నర్సీపట్నంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు పోటీచేస్తున్న అభ్యర్థులు పోలింగ్‌కు సమయం దగ్గరపడుతుండడంతో ఓటర్లను తమకు తోచిన స్థాయిలో ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు. గతంలో ఎంపీటీసీగా అభ్యర్థికి రూ.20-30 వేలు ఖర్చయ్యేది. ఇప్పుడది కొన్నిచోట్ల రూ.2-5లక్షలకు చేరింది. గత ఎన్నికల్లో మహిళలను అకట్టుకునేందుకు జాకెట్ ముక్కలు ఇచ్చే వారు. పురపాలక ఎన్నికల్లో ఈ పరిస్థితి మారింది. జాకెట్ ముక్కలకు బదులు చీరలను ఇవ్వడంతో పాటు గాజుల ఖర్చు నిమిత్తం మరో రెండొందలు ఇస్తున్నారు. పరిషత్ ఎన్నికలు గ్రామాలకు పరిమితం కావడంతో మహిళలు, రైతులను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు వినూత్న ప్రలోభ పథకాలు అమలు చేస్తున్నారు. రైతులు పాలు కేంద్రానికి తీసుకువెళ్లడానికి వీలుగా పాల క్యాన్లు, ఇళ్లలో వినియోగానికిగాను స్టీల్ క్యాన్లు ఇస్తున్నారు. పలు గ్రామాల్లో అయితే ఇరు పార్టీల అభ్యర్థులు ఒకరు మీద ఒకరు ఫిర్యాదు చేసుకోకుండా ఈ సరుకులు పంపిణీ చేసుకుందామని, ఓటరుకు ఎవరు ఇష్టమైతే వారికే ఓటు వేస్తారని ఒప్పందానికి వచ్చారు. ఇక మద్యం పంపిణీకి హద్దులేదు. -
గప్ చుప్
తొలి విడత 22 మండలాల్లో నేటితో ప్రచారానికి తెర అంతటా అభ్యర్థుల హడావుడి రాజకీయ వేడితో గ్రామాలు గరం గరం 22 జెడ్పీటీసీ, 379 ఎంపీటీసీలకు 6న పోలింగ్ విశాఖ రూరల్, న్యూస్‌లైన్: ప్రాదేశిక తొలి విడత ఎన్నికల ప్రచార హోరుకు నేటితో తెరపడనుంది. పోలింగ్ ముగిసే సమయానికి 48 గంటల ముందు ఆపేయాలన్న నిబంధన మేరకు శుక్రవారం సాయంత్రంతో అంతటా గప్‌చుప్ వాతావరణం నెలకొన నుంది. దీంతో ఆఖరి రోజు ప్రచారానికి అభ్యర్థులు తమదైన శైలిలో ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. ఉన్న కొద్ది సమయాన్ని పల్లె వాసులను ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు. జిల్లాలో 39 జెడ్పీటీసీ, 656 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. వీటికి రెండు దశల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. తొలి దశగా 6న 22 జెడ్పీటీసీ, 379 ఎంపీటీసీలకు, రెండో విడతగా 11న 17 జెడ్పీటీసీ, 277 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మొదటి విడతగా 7,37,269 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్‌కు రెండు రోజులే గడువుండడంతో ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అభ్యర్థులు తమ వద్ద ఉన్న అస్త్రాలన్నింటినీ ప్రయోగిస్తున్నారు. రకరకాల విన్యాసాలతో జనానికి దగ్గరయ్యేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అభ్యర్థులతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా ఇంటింటికి తిరిగి తమ వారికి ఓట్లను వేయాలంటూ అభ్యర్థిస్తున్నారు. గ్రామాల్లో నాయకుల మకాం ‘పరిషత్’ పోలింగ్‌కు సమయం సమీపిస్తున్నకొద్దీ నియోజకవర్గ నేతలంతా గ్రామాల్లోనే తిష్టవేశారు. వీరంతా స్థానిక ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూనే సార్వత్రికం దృష్ట్యా తమ పనులు చక్కబెట్టుకుంటున్నారు. ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నచందంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులతో పాటు తమను బలపరచాలని కోరుతూ గ్రామాల్లో రాజకీయాలు నడుపుతున్నారు. పగలంతా ప్రచారంలో మునిగి, రాత్రిళ్లు మండలాల్లో పోటీలో ఉన్న అభ్యర్థుల ఇళ్లలోను, పట్టున్న నేతల విడిదిలోను బస చేస్తూ వ్యూహాలు పన్నుతున్నారు. దీంతో గ్రామాల్లో రాజకీయాలు ఊపందుకున్నాయి. గెలుపే లక్ష్యంగా తాయిలాలు ఆయా పార్టీల అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్లు కూడా గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు దీటుగా ఖర్చుకు సైతం వెనుకాడడం లేదు. పల్లెల్లో కులసంఘాలు, మహిళా సంఘాలకు తాయిళాల ఎర వేసి తమ వైపు తిప్పుకోడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. సామాజిక వర్గాల వారీగా గంపగుత్తుగా ఓటర్లను కొనుగోలు చేస్తున్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికలకు మించి డబ్బులు ఖర్చు చేస్తున్నారు. ఒక్కో ఓటుకు రూ.500 నుంచి రూ.1000 వరకు ముట్టజెబుతున్నారు. ప్రధానంగా యువతకు క్రీడా సామాగ్రి, ఆటవస్తువులు, మహిళలకు చీరలు పంచిపెడుతున్నారు. తాగినోడికి తాగినంత అన్నట్టు పీకలదాక మందు పట్టిస్తున్నారు. గెలుపు గుర్రం ఎక్కేందుకు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ఈ ఎన్నికలను పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో స్థానిక పోరు రసవత్తరంగా మారుతోంది. ఎన్నికల సిబ్బందికి బస్సులు తొలి దశలో ఆనందపురం, భీమిలి, పద్మనాభం, పెందుర్తి, పరవాడ, సబ్బవరం, అనకాపల్లి, బుచ్చెయ్యపేట, చోడవరం, చీడికాడ, కశింకోట, కె.కోటపాడు, మునగపాక, అచ్యుతాపురం, యలమంచిలి, రాంబిల్లి, నర్సీపట్నం, పాయకరావుపేట, మాకవరపాలెం, కోటవురట్ల, ఎస్.రాయవరం, నక్కపల్లి మండలాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఆయా మండలాల్లో ఎన్నికల విధులకు 2633 మందిని అధికారులు నియమించారు. వీరు ఆయా పోలింగ్ కేంద్రాలకు వెళ్లేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశారు. శనివారం తెల్లవారు జామున ఆర్టీసీ కాంప్లెక్సు నుంచి ఐదు బస్సులు బయలు దేరుతాయని జెడ్పీ సీఈవో ఎం.మహేశ్వరెడ్డి తెలిపారు. -
విచ్చలవిడిగా మద్యం పంపిణీ
ఓ సాధువు శిష్యులతో కలిసి ఊరూరూ పర్యటిస్తుంటారు. వీలున్న చోట బస చేస్తుంటారు. ఒకరోజు తన శిష్యులతో కలిసి బస చేసిన ఊళ్లో ఒక వ్యాపారి ఆయనను చూడ్డానికి వచ్చాడు. ‘‘గురువుగారూ, నన్ను క్షమిం చాలి’’ అని పాదాలకు నమస్కరించాడు. ‘‘నువ్వెవరు? నిన్నెందుకు క్షమించాలి? నువ్వు చేసిన తప్పేంటి?’’ అని సాధువు అడిగారు. ‘‘నేను ముప్పై ఏళ్లుగా ఇదే ఊళ్లో వ్యాపారం చేస్తున్నాను. గత ఏడాది నాకు పోటీగా ఒకడు వ్యాపారం మొదలుపెట్టాడు. నా దగ్గరకు వచ్చే వాడుకదారులు అందరూ అతని దగ్గరకు వెళ్తున్నారు. నాకు నష్టం వస్తోంది. దాంతో అతన్ని నేను కోపావేశంతో శాపనార్థాలు పెట్టాను’’ ‘‘ఏంటా శాపనార్థాలు?’’ ‘‘అతని వ్యాపారం దెబ్బతినాలని శపించాను, దాంతో అతడు ఏడాది తిరగకముందే తీవ్రంగా నష్టపోయాడు. అయితే నాకు అతని నష్టం ఏ మేరకూ తోడ్పడలేదు. ఇంకా ఆర్థిక బాధలతోనే సంసారాన్ని లాగిస్తు న్నాను’’ అన్నాడు వ్యాపారి. సాధువు ఒక నవ్వు నవ్వారు. ‘‘నువ్వు చేసిన ఆ పాత పాపానికి క్షమించమని అడిగేకన్నా దానిని మరచిపోయి ఏదైనా మంచి పని చెయ్యడం మొదలుపెట్టు. నలుగురూ బాగుండేలా ఏదైనా చెయ్యి’’ అని సూచించారు. కానీ అతను అందుకు ఒప్పుకోలేదు. ‘‘లేదు గురువుగారూ, నన్ను మీరు మన్నించాలి. అప్పుడే నా మనసు శాంతిస్తుంది. ఇందుకు ఏదైనా సలహా ఇవ్వండి’’ అని మళ్లీ ఆయన పాదాలపై పడ్డాడు. సాధువు తన శిష్యులవైపు చూశారు. ‘‘మనం ఈ ఊరు విడిచిపెట్టి వెళ్లవలసిన సమయం ఆసన్నమైంది’’ అని శిష్యులతో చెప్పారు. శిష్యులు తమ గురువు వైపు ప్రశ్నార్థకంగా చూశారు. ‘‘కొందరు జరిగిపోయిన కాలంలోనే జీవిస్తుంటారు. అలా ఉండటమే వారికి నచ్చుతుంది. ఎవరు ఎన్ని చెప్పినా వినిపించుకోరు. ఆనందమో, ఆవేదనో దానినే స్మరించుకుంటూ గతంలోనే జీవిస్తుంటారు. అటువంటి వాళ్లు వర్తమానంలో అడుగులు వేసి ఏదీ చెయ్యలేరు. భవిష్యత్తులోనూ తొంగి చూడలేరు’’ అని గురువుగారు ఆ వ్యాపారిని ఉద్దేశించి ఈ నాలుగు మాటలు చెప్పి పొరుగూరికి వెళ్లేందుకు సన్నద్ధమయ్యారు. - యామిజాల జగదీశ్ -
కాంగ్రెస్‌కు చెయ్యిచ్చి.. సైకిలెక్కేశారు
విలువలకు పాతర...పదవులకు పాకులాట బుద్ధప్రసాద్‌కు అవనిగడ్డ ? పిన్నమనేనికి ఏదో ఒకటి! సాక్షి ప్రతినిధి,విజయవాడ : విలువలు.. విశ్వసనీయతకు చెల్లుచీటీ రాసేసి పదవే పరమావధిగా జిల్లాలో కీలక నేతలు ఇద్దరూ కాంగ్రెస్‌కు చెయ్యిచ్చి సైకిలెక్కేశారు. అధికార భాషా సంఘం మాజీ చైర్మన్ మండలి బుద్ధప్రసాద్, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు బుధవారం హైదరాబాద్‌లో చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో కాంగ్రెస్‌ను నమ్ముకుంటే పదవులు దక్కవనే ఆలోచనతో వాళ్లు పార్టీ ఫిరాయించడంపై ఆయా నియోజకవర్గాల ప్రజలు విస్తుపోతున్నారు. వారి తండ్రుల కాలం నుంచి కరుడుగట్టిన కాంగ్రెస్ వాదులుగా తెచ్చుకున్న మంచి పేరు కాస్తా పార్టీ ఫిరాయింపుతో పోగొట్టుకున్నారన్న విమర్శలు రేగుతున్నాయి. గాంధేయవాది కృష్ణారావు... మండలి బుద్ధప్రసాద్ తండ్రి మండలి వెంకట కృష్ణారావు గాంధేయవాదిగా గుర్తింపు పొందడంతో పాటు ఎంత కష్టమొచ్చినా కాంగ్రెస్‌ను వీడలేదు. దాదాపు మూడు దశాబ్దాలకు పైగా ఆయన జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పారు. 1957లో కృష్ణారావు మచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు. అనంతరం 1962లో కూడా లోక్‌సభకు ఇక్కడి నుంచే పోటీచేసి ఓటమి చవిచూశారు. 1972లో జరిగిన అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల్లో ఆయన అవనిగడ్డ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం 1978, 1983 వరుస ఎన్నికల్లో మండలి వెంకట కృష్ణారావు గెలుపొందారు. 1983లో రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం గాలి వీచినప్పుడు కూడా ఆయన గెలుపొందడం విశేషం. ఎమ్మెల్యేగా అవనిగడ్డ నుంచి హ్యాట్రిక్ సాధించిన మండలి వెంకట కృష్ణారావు పలుమార్లు మంత్రి పదవులను నిర్వహించారు. జలగం వెంగళరావు, పీవీ నరసింహారావు, కోట్ల విజయభాస్కరరెడ్డి మంత్రివర్గాల్లో మండలి కృష్ణారావు మంత్రిగా పనిచేశారు. జై ఆంధ్ర ఉద్యమంలోను సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్న ఆయన ఉద్యమకారుల నుంచి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయినా మండలి వెంకట కృష్ణారావు తాను నమ్మిన సిద్ధాంతాన్ని వీడలేదు. ఉనికి కోసం పాట్లు... వెంకట కృష్ణారావు వంటి రాజకీయ నేతకు వారసుడిగా వచ్చిన మండలి బుద్ధప్రసాద్ పదవుల కోసం పార్టీ ఫిరాయించడం, ఉనికి కోసం కునికిపాట్లు పడటంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. 1999, 2004 ఎన్నికల్లో రెండు పర్యాయాలు వరుస విజయాలు సాధించిన మండలి బుద్ధప్రసాద్ 2009 ఎన్నికల్లో అంబటి బ్రాహ్మణయ్య చేతిలో పరాజయం పాలయ్యారు. వైఎస్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ అప్పట్లో అధికారం చేపట్టడంతో.. ఓడిపోయినప్పటికీ బుద్ధప్రసాద్‌కు తగిన గుర్తింపు లభించింది. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనకు కేబినెట్ హోదా కలిగిన అధికార భాషా సంఘం చైర్మన్ పదవిని ఇచ్చింది. కాంగ్రెస్‌లో పదవులను ఎంజాయ్ చేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆయన తన పదవికి రాజీనామా ప్రకటించారు. ఇప్పుడు జరిగే ఎన్నికల్లో కచ్చితంగా కాంగ్రెస్ అడ్రస్ గల్లంతేనని గుర్తించారు. అంతే గత కొద్ది రోజులుగా పావులు కదిపిన ఆయనకు చంద్రబాబు నుంచి సానుకూల సంకేతాలు రావడంతో పార్టీ ఫిరాయించారు. గతనెల 27న విజయవాడలో చంద్రబాబు నిర్వహించిన మహిళా గర్జనలో బుద్ధప్రసాద్ చేరాల్సి ఉంది. అప్పుడు రాజ్యసభ సభ్యుడు గరికిపాటి రామ్మోహన్రావు ఫోన్ చేసి బ్రేక్ వేయడంతో ఆలస్యంగానైనా బుద్ధప్రసాద్ హైదరాబాద్ వెళ్లి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ముత్తంశెట్టికి హ్యాండిస్తారా? టీడీపీలో చేరిన బుద్ధప్రసాద్‌కు అవనిగడ్డ ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చేందుకు బాబు హామీ ఇచ్చారన్న ప్రచారం సాగుతోంది. అదే జరిగితే సీటు ఇస్తామంటూ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు ఖర్చులు పెట్టించిన ముత్తంశెట్టి కృష్ణారావును నమ్మించి మోసగిస్తారా అనే అనుమానాన్ని తెలుగు తమ్ముళ్లు వ్యక్తం చేస్తున్నారు. నోవా విద్యా సంస్థల అధిపతిగా ఉన్న ముత్తంశెట్టి ఎమ్మెల్యే పదవిపై మోజుతో చంద్రబాబు ఆమోదంతో అవనిగడ్డ నియోజకవర్గ టీడీపీ కన్వీనర్‌గా క్యాడర్‌ను చక్కబెట్టుకుంటున్నారు. మొదట్లో ముత్తంశెట్టిని తెలుగు తమ్ముళ్లు తీవ్రంగా వ్యతిరేకించారు. అయినా స్థానిక సమరంలో అభ్యర్థుల ఖర్చు ఆయనే పెట్టుకుని క్యాడర్‌ను బుజ్జగించుకుంటున్న తరుణంలో తీరుబడిగా పార్టీలో చేరి ఎమ్మెల్యే టిక్కెట్ ఎగరేసుకుపోయేలా బుద్ధప్రసాద్ రావడం ముత్తంశెట్టి అనుచరులకు మింగుడు పడటంలేదు. శ్రీహరిప్రసాద్‌ను కాదని.. అవనిగడ్డలో అంబటి బ్రాహ్మణయ్యపై సానుభూతిని ఓట్లుగా మలుచుకునేందుకు ఆయన కుమారుడిని ఎన్నికల్లో దించి ఎమ్మెల్యే సీటు దక్కించుకున్న టీడీపీ అంబటి శ్రీహరిప్రసాద్‌ను కాదని ముత్తంశెట్టిని రంగంలోకి తీసుకొచ్చింది. ఇప్పుడు ముత్తంశెట్టికి చెయ్యిచ్చి బుద్ధప్రసాద్‌కు పచ్చకండువా కప్పేసింది. అవనిగడ్డ కాకుంటే బందరు నుంచి బుద్ధప్రసాద్‌ను పోటీకి దించేలా మరో ప్రతిపాదన కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఏదేమైనా దాదాపు ఐదు దశాబ్దాలకు పైగా బుద్ధప్రసాద్ కుటుంబానికి కాంగ్రెస్‌తో ఉన్న అనుబంధాన్ని తెంచుకుని పదవుల కోసం టీడీపీ పంచన చేరిపోవడం ప్రజలను విస్మయానికి గురిచేస్తోంది. పిన్నమనేనికి ఏదో ఒకటి చేస్తారంట... టీడీపీలో చేరితే ఏదోక అవకాశం రాకపోదనుకున్న కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు సైతం 50 ఏళ్లకు పైగా కాంగ్రెస్‌తో తన కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని తెగదెంపులు చేసుకున్నారు. మూడు పర్యాయాలు జెడ్పీ చైర్మన్ పదవిని చేపట్టిన పిన్నమనేని కోటేశ్వరరావు రెండు పర్యాయాలు ముదినేపల్లి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. ఆయన కుమారుడిగా పిన్నమనేని వెంకటేశ్వరరావు 1989, 1999, 2004లో ముదినేపల్లి ఎమ్మెల్యేగా గెలిచారు. పిన్నమనేని వెంకటేశ్వరరావు 2004లో వైఎస్ క్యాబినెట్లో ఉన్నత విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇటీవల జరిగిన సహకార ఎన్నికల్లో పిన్నమనేని వెంకటేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి కృష్ణా జిల్లా కేంద్ర సహకార (కేడీసీసీ) బ్యాంక్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. అప్పట్లో ఆప్కాబ్ చైర్మన్ పదవి దక్కకపోవడంతో కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. తాజాగా రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్‌కు నూకలు చెల్లాయని ఆయన పదవుల కోసం టీడీపీలో చేరిపోయారు. ప్రస్తుతానికి ఆయనకు ఎమ్మెల్యే టిక్కెట్ హామీ ఇవ్వలేదని తెలుగుదేశం పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. పార్టీ కోసం పనిచేస్తే ఏదో ఒక పదవి ఇస్తారనే ధీమాతో పిన్నమనేని వెంకటేశ్వరరావు వ్యూహాత్మకంగా పార్టీ ఫిరాయించేయడం కొసమెరుపు. -
కమలంలో అయోమయం
టీడీపీతో కొలిక్కిరాని బీజేపీ చర్చలు ఇప్పటికే కొందరు అభ్యర్థుల పేర్లు లీక్ నేడు మదనపల్లెలో బీజేపీ బహిరంగసభ సాక్షి, తిరుపతి: తెలుగుదేశంతో ఎన్నికల పొత్తు ఇంకా ఒక కొలిక్కి రాకపోవడంతో జిల్లా బీజేపీ శ్రేణుల్లో అయోమయం చోటుచేసుకుంది. ఈ రెండు పార్టీల నడుమ అవగాహన ఉంటుందని భావిస్తున్నప్పటికీ చర్చల్లో ప్రతిష్టంభన నెలకొనడంతో ఆ పార్టీ శ్రేణులు ఒకింత నిరాశకు గురవుతున్నాయి. ఇప్పటికే తిరుపతి లోక్‌సభ స్థానంతో పాటు తిరుపతి, మదనపల్లె, సత్యవేడు, పూతలపట్టు నియోజకవర్గాలకు అభ్యర్థుల జాబితాను బీజేపీ లీక్ చేసింది. పొత్తులపై చర్చలకు ముందే లీకులు రావడంతో ఆ పార్టీ కార్యకర్తల్లో కొంత ఉత్సాహం వచ్చింది. ఆ తరువాత కొత్త పరిణామాలు చోటుచేసుకోవడం, టీడీపీతో సీట్ల సర్దుబాటు ఉంటుందనే ప్రచారం జరగడంతో కార్యకర్తలను నిస్తేజం ఆవహించింది. ఒకవేళ సీట్ల సర్దుబాటు జరిగితే జిల్లాలో తిరుపతి లోక్‌సభ స్థానంతో పాటు మదనపల్లె లేదా తంబళ్లపల్లె అసెంబ్లీ స్థానాల్లో ఒకటి ఖాయంగా బీజేపీకి కేటాయిస్తారని అంటున్నారు. 1999లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీతో పొత్తులో భాగంగా తిరుపతి లోక్‌సభ స్థానానికి పోటీ చేసిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వెంకటస్వామి విజ యం సాధించారు. దీంతో ఈసారి కూడా తిరుపతి లోక్‌సభ స్థానంపై బీజేపీ కన్నేసింది. ఈ స్థానానికి ఇప్పటికే ముగ్గురి పేర్లు పరిశీలనలోకి తీసుకుంది. ప్రస్తుతం ఇంకా కొందరు పోటీ పడుతున్నారు. వైద్యవృత్తిలో ఉన్న కొందరు ప్రముఖులు ఈ స్థానంపై ఆశలు పెట్టుకున్నారు. ప్రజారాజ్యం పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన ఆర్టీసీ జేఏసీ చైర్మన్ మునిసుబ్రమణ్యం, డాక్టర్ సుకుమార్ పేర్లు తిరుపతి లోక్‌సభకు పముఖంగా వినిపిస్తున్నాయి. మరోవైపు మాజీ లోక్‌సభ సభ్యులు వెంకటస్వామి కుమారుడు గౌతమ్ పేరు కూడా వినిపిస్తోంది. చల్లపల్లెకు మదనపల్లె టీడీపీతో పొత్తు కుదిరినా, ఒంటరి పోరాటమైనా బీజేపీ తరఫున శాసనసభకు పోటీ చేసేందుకు ఆ పార్టీ కిసాన్‌మోర్చా జాతీయ కార్యదర్శి చల్లపల్లె నరసింహారెడ్డి సిద్ధమవుతున్నారు. పొత్తు కుదిరితే మదనపల్లె నుంచి పోటీ చేస్తారని బీజేపీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఒంటరిగా పోటీ చేయాల్సి వస్తే తంబళ్లపల్లె లేదా మదనపల్లె నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. తంబళ్లపల్లె నుంచి ఒక దఫా పోటీ చేసిన చల్లపల్లె విజయం అంచుల వరకు వెళ్లారు. అప్పట్లో 620 ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని తంబళ్లపల్లె, మదనపల్లె స్థానాల్లో ఏదో ఒక చోట నుంచి పోటీ చేస్తారనే అభిప్రాయం ఉంది. నేడు బహిరంగ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం సాయంత్రం మదనపల్లెలో బీజేపీ ఆధ్వర్యంలో భారీ బహిరంగసభ ఏర్పాటు చేశారు. ఈ సభకు జాతీయ నేత ఎం.వెంకయ్యనాయుడుతో పాటు మాజీ కేంద్రమంత్రి పురందేశ్వరి కూడా హాజరవుతున్నారు. ఈ సభ పార్టీ శ్రే ణుల్లో కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని ఆ పార్టీ నాయకులు ఆశిస్తున్నారు. -
లోకల్ అలయెన్స్!
సాక్షి ప్రతినిధి, వరంగల్: స్థానిక ఎన్నికల్లో కొత్త రాజకీయం తెరపైకి వచ్చింది. ఉప్పునిప్పులా ఉంటున్న పార్టీల మధ్య పొత్తులు కుదిరాయి. రాష్ట్రస్థాయిలో పొత్తులు ఉంటాయో... లేదో... ఇంకా స్పష్టత రాలేదు. కానీ... స్థానిక సమరంలో ఇప్పటికే కలిసి నడుస్తున్నాయి. జిల్లా, మండల పరిషత్ ఎన్నికల్లో రాజకీయ పార్టీల మధ్య పొత్తులు ఆవిష్కృతమయ్యాయి. రాష్ట్ర స్థాయిలో రోజూ తిట్టుకుంటున్న కాంగ్రెస్, టీఆర్ఎస్లు జిల్లాలోని జెడ్పీటీసీ ఎన్నికల్లో కలిసి నడుస్తున్నాయి. సీట్ల పంపకం విషయంలో పేచీ వచ్చిందంటూ.... ఒకరోజు దూరంగా, మరొక రోజు దగ్గరగా ఉంటున్న టీడీపీ, బీజేపీలు కొన్ని మండలాల్లో కలిసిపోయాయి. ఎంపీటీసీ ఎన్నికల్లో పరిస్థితి మరింత విచిత్రంగా ఉంది. జిల్లాలో మొత్తం 50 జెడ్పీటీసీ స్థానాలు లోకల్ అలయెన్స్!ఉన్నాయి. అన్నింటిలోనూ కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ చే స్తున్నారు. టీఆర్ఎస్ 49 స్థానాల్లో పోటీ చేస్తోంది. టీడీపీ 47 స్థానాల్లోనే బరిలో ఉంది. తమ అభ్యర్థులు లేని స్థానా ల్లో ఈ రెండు పార్టీలు మిగిలిన పార్టీలతో కలిసి నడుస్తుండడం గమనార్హం. టీఆర్ఎస్.. కాంగ్రెస్ కాంగ్రెస్‌లో టీఆర్ఎస్ విలీనం ఉంటుందని రెండు పార్టీల శ్రేణులు భావించాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం రోజు న విలీనం పూర్తవుతుందని ఆ రెండు పార్టీల నేతలు అంచ నా వేశారు. ఈ క్రమంలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా మారిపోయూరుు. విలీనం లేదు కదా... కనీసం పొత్తు కూడా కుదిరే పరిస్థితి కనబడడం లేదు. ఇప్పుడు తెలంగాణలో ఎక్కువగా విమర్శలు చేసుకునేది కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలే. ఇలా ప్రధాన ప్రత్యర్థులుగా మారిన టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ములుగు నియోజకవర్గంలోని కొత్తగూడ జెడ్పీటీసీ ఎన్నికల్లో పొత్తు కుదిరింది. ఇక్కడ టీఆర్ఎస్ ఎవరినీ పోటీలో దింపలేదు. కాంగ్రెస్ అభ్యర్థికి టీఆర్ఎస్ పూర్తిగా సహకరిస్తోంది. నామినేషన్ల ప్రక్రియకు ముందే ఇక్కడ రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరింది. కాంగ్రెస్, టీడీపీ మధ్యే కీలక పోరు కొనసాగనుంది. టీడీపీ... బీజేపీ తెలంగాణ ఉద్యమంతో జిల్లాలో టీడీపీ పూర్తి దెబ్బతిన్నది. మూడు స్థానాల్లో అభ్యర్థులు దొరకని పరిస్థితి ఉంది. జనగామ, రేగొండ, హసన్‌పర్తి మండలాల్లో జెడ్పీటీసీ స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టలేదు. జిల్లాలో వరుసగా రెండుసార్లు జిల్లాపరిషత్ పీఠాన్ని దక్కించుకున్న టీడీపీకి... ఇప్పుడు అభ్యర్థులు దొరకకపోవడం ఆ పార్టీ దుస్థితిని తెలియజేస్తోంది. అభ్యర్థులు లేకపోవడంతో టీడీపీ తప్పనిసరి పరిస్థితుల్లో ఇతర పార్టీలకు మద్దతు ఇస్తోంది. రాష్ట్ర స్థాయిలో పొత్తు ఉంటుందని ఒక రోజు, ఉండకపోవచ్చని మరొక రోజు వార్తలు వస్తున్నా... జిల్లాలో మాత్రం రెండు మండలాల్లో బీజేపీకి మద్దతు ఇస్తోంది. గెలిచే పార్టీలతో పొత్తు పెట్టుకోవడం సూత్రంగా పని చేసే తెలుగుదేశం... ఇప్పుడు నరేంద్రమోడీ హవాను సొమ్ము చేసుకునే ఉద్దేశంతో వెళ్తోంది. అభ్యర్థులు లేని జనగామ, రేగొండ మండలాల్లో బీజేపీ అభ్యర్థులకు టీడీపీ సహకరిస్తోంది.టీడీపీకి అభ్యర్థి లేని హసన్‌పర్తిలో దేశం శ్రేణులు చెరోదారిగా వ్యవహరిస్తున్నాయి. టీడీపీలోని రెండు వర్గాల్లో ఒక వర్గం కాంగ్రెస్‌కు, మరొక వర్గం టీఆర్ఎస్కు సహకరిస్తున్నాయి. -
ఎవరి లెక్కలు వారివే !
పోలింగ్‌పై నేతల విశ్లేషణలు కౌన్సిలర్ అభ్యర్థుల్లోనూ ఎడతెగని చర్చలు మున్సిపల్ కౌంటింగ్‌పై నేడు హైకోర్టు తీర్పు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ముగియడంతో అన్ని పార్టీల అభ్యర్థులు జయాపజయాల లెక్కలు వేసుకుంటున్నారు. అన్ని మున్సిపాలిటీల్లో 70 శాతం పోలింగ్ దాటడంతో ఎవరికివారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సాక్షి, చిత్తూరు: జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సరళిని చూస్తే ప్రధానంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీల మధ్యే పోటీ నెలకొని ఉంది. అయితే కొన్నిచోట్ల స్వతంత్రులు కూడా విజయావకాశాలను ప్రభావితం చేసే అవకాశం లేకపోలేదు. చిత్తూరు కార్పొరేషన్లో రెండు ప్రధాన రాజకీయపార్టీలతో పాటు, సీకే.బాబు స్వతంత్ర ప్యానల్ కూడా గట్టిపోటీ ఇవ్వడంతో ఇక్కడ గెలుపు లెక్కల్లో చాలావరకు స్పష్టత లేదు. జగన్మోహన్రెడ్డి ప్రకటించిన సంక్షేమ పథకాలు, ప్రజల్లో వైఎస్.రాజశేఖరరెడ్డిపై ఉన్న అభిమానం, మహిళలు ఎక్కువగా ఓటింగ్‌లో పాల్గొనటం తమ పార్టీ అభ్యర్థుల గెలుపునకు లాభించే అంశాలుగా ైవె ఎస్సార్ సీపీ నేతలు భావిస్తున్నారు. నగరి మున్సిపాలిటీలో జిల్లాలోనే అత్యధికంగా 88 శాతం పోలింగ్ నమోదు కావడంతో ఇక్కడ ఫ్యాను గాలి ఓట ర్లలో బలంగా వీచిందని పోలింగ్ సరళి తేటతెల్లం చేసింది. ఒక దశలో దీనిని సహించలేక 3వ వార్డులో మాజీ మంత్రి చెంగారెడ్డి అనుచరులు గొడవకు దిగారు. పుత్తూరు మున్సిపాలిటీలోనూ పోలింగ్ సరళి వైఎస్సార్ సీపీకి అనుకూలంగా ఉంది. పుంగనూరులోనూ అత్యధిక స్థానాలు గెలుచుకుని చైర్మన్ కుర్చీ కైవసం చేసుకునే దిశగా వైఎస్సార్ సీపీ ఉంది. పలమనేరులోనూ అత్యధిక స్థానాల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థు లు గెలుస్తారని, పోలింగ్‌సరళి తమకు అనుకూలంగా ఉందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. శ్రీకాళహస్తిలోనూ అత్యధిక స్థానాల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని నేతల విశ్లేషణ. మున్సిపాలిటీల్లో ఇలా వైఎస్సార్ సీపీ, టీడీపీ నేతలు లెక్కలు వేసుకుంటుండగా, ఎన్నికల సారథ్యం వహించిన రెండు పార్టీల నియోజకవర్గ సమన్వయకర్తలు, ఇన్‌చార్జ్‌లు ఫలితాలు వెల్లడైతే ఎమ్మెల్యే ఎన్నికలపై ప్రభావం ఉంటుందనే ఆందోళనలో ఉన్నారు. వార్డుల్లో అభ్యర్థులుగా పోటీ చేసినవారు తాము పెట్టిన ఖర్చులకు గెలుపు వరిస్తుందా? వార్డుల్లో పోలింగ్ సరళి ఎలా ఉంది? తమకు అనుకూలంగా ఎన్ని ఓట్లు పోలయి ఉంటాయనే విశ్లేషణలో పడ్డారు. నేడు మున్సిపల్ కౌంటింగ్‌పై తీర్పు జిల్లాలో నిర్వహించిన చిత్తూరు కార్పొరేషన్, మరో ఆరు మున్సిపాలిటీల ఎన్నికల కౌంటింగ్‌కు సంబంధించి మంగళవారం కోర్టు తీర్పు వెలువడనుంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలను సార్వత్రిక ఎన్నికల తర్వాత ప్రకటించాలని కోరుతూ కొందరు వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు ఏప్రిల్ 1వ తేదీకి వాయిదా వేసింది. మంగళవారం కోర్టు తీర్పుకోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు మే 7 తరువాత వెల్లడి కానున్నాయి. అలాగే జరిగితే బాగుంటుందని అందరూ భావిస్తున్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ల విశ్లేషణలు మున్సిపల్ ఎన్నికల్లో హోరాహోరీగా పోరాడిన వైఎస్సార్ సీపీ, తెలుగుదేశం మున్సిపల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థులు, ఇన్‌చార్జ్‌లుగా ఉన్నవారు తమ తమ వర్గాల నుంచి వివరాలు, ఓటింగ్ సరళి తెప్పించుకుని సొంతంగా విశ్లేషిస్తున్నారు. శాసనసభ ఎన్నికల్లో నిలబడేందుకు ఈ ఎన్నికల ఫలితాలు తమకు ఎంతవరకు అనుకూలంగా ఉంటాయి? ఎంతవరకు ప్రతికూలంగా ఉండొచ్చునని లెక్కలు వేస్తున్నారు. ఒక రకంగా తమకు మున్సిపల్ ఎన్నికల వల్ల మంచే జరుగుతుందని, ఒకవేళ ప్రతికూల పవనాలు వీస్తున్న వార్డులు ఏవనేది గుర్తించి అక్కడ ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలకు జాగ్రత్త వహించేందుకు అవకాశం ఉంటుందని ప్రధాన రాజకీయ పార్టీ నాయకులు చెబుతున్నారు. -
రెండో విడత.. అభ్యర్థులకు కలత
5 రోజులపాటు అదనపు వ్యయం ఒక్కో స్థానానికి రూ.2.5 కోట్లని అంచనా టీడీపీని వెంటాడుతున్న నైరాశ్యం ఏంచేయాలో పాలుపోని పరిస్థితి విశాఖ రూరల్, న్యూస్‌లైన్: ప్రాదేశిక ఎన్నికలు అభ్యర్థులకు సంకటంగా మారాయి. తొలి విడత 22 జెట్పీటీసీ, 379 ఎంపీటీసీ స్థానాలకు ఈ నెల 6న జరగనుండగా అయిదు రోజులు తరువాత రెండో విడత పోలింగ్ జరగనుంది. ఈనెల 11న రెండో విడత కింద 17 జెట్పీటీసీ, 277 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆ అయిదు రోజులు ప్రచారాలకు సమయముందన్న ఆనందం కంటే.. అధిక వ్యయం రెండో దశ అభ్యర్థులకు కంటి మీద కనుకు లేకుండా చేస్తోంది. సాధారణ ఎన్నికలకు ముందు జరుగుతున్న ఈ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ ఫలితాల ప్రభావం సార్వత్రిక ఎన్నికలపై ఉంటుందని భావించిన పార్టీలు సర్వశక్తులు ఒడ్డయినా ఇందులో అత్యధిక స్థానాలు కైవసం చేసుకోడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రధానంగా గత పదేళ్లుగా అధికారం కోసం కొట్టుమిట్టాడుతున్న టీడీపీకి ఈ ఎన్నికలు చావోరేవోలా మారాయి. ఒకవైపు పార్టీపై ప్రజల్లో విశ్వాసం లేకపోవడం, ప్రతీ సర్వే ఫలితాలు వ్యతిరేకంగా వస్తుండడంతో ఆ పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం అలుముకుంది. ఎలాగైనా ఇందులో విజయం సాధించడానికి పార్టీలు కోట్లకు కోట్లను వెదజల్లుతున్నాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో అసెంబ్లీ ఎన్నికలకు ధీటుగా ఒక్కో స్థానానికి రెండు నుంచి రెండున్న కోట్లు ఖర్చు చేయడానికి సిద్ధమయ్యాయి. సాధారణ ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్నా.. అభ్యర్థిత్వాలు ఖరారు కాని పార్టీల్లో ఆశావహులు తమ సీట్లను పదిలం చేసుకోడానికి మండలాల్లో విపరీతంగా డబ్బును కుమ్మరిస్తున్నారు. తొలి దశలో జరిగే స్థానాలకు ఒక్కో దానికి రూ.2 కోట్లు నుంచి రూ.2.5 కోట్లు ఖర్చు చేయడానికి సిద్ధమయ్యారు. రెండో దశ గుబులు తొలి ఎన్నికలకు ఇంకా అయిదు రోజులు సమయం మాత్రమే ఉంది. ఈ అయిదు రోజుల్లోనే అభ్యర్థులకు కోట్లు ఖర్చుకానున్నాయి. రెండు దశ ఎన్నికలకు 10 రోజులు సమయముంది. దీంతో ఈ దశలో జరిగే 17 స్థానాల అభ్యర్థుల్లో గుబులు మొదలైంది. తొలి దశ ఎన్నికల తరువాత అప్పటి ట్రెండ్స్‌కు అనుగుణంగా అవసరాన్ని బట్టి మరింత ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుందని అభ్యర్థులు భావిస్తున్నారు. అదనపు సమయంలో అభ్యర్థులు ఓటర్లకు డబ్బు, కానుకలు సమర్పణతో పాటు, మందు, విందులకు చేతి చమురు అధనంగా వదిలించుకోవాల్సిందేనని తర్జన భర్జన పడుతున్నారు. కోట్లకు కోట్లు ఖర్చుపెట్టయినా ఈ స్థానిక ఎన్నికల్లో విజయం సాధించి ఆ ప్రభావంతో సాధారణ ఎన్నికలకు వెళ్లాలనుకున్న పార్టీలకు సుప్రీం కోర్టు తీర్పుతో చుక్కెదురైంది. ఈ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు మే 7వ తేదీ తరువాత చేపట్టనుండడంతో ఆ పార్టీలకు ఏం చేయాలో దిక్కుతీచకుండా పోయింది. సాధారణ ఎన్నికల్లోపు ప్రజలను తమవైపునకు తిప్పుకోడానికి ఇప్పటికే విజయం కోసం కోట్లకు కోట్లు ఖర్చు చేసిన పార్టీలు ఇప్పుడు తలలు పట్టుకుంటున్నాయి. -
ఓటెత్తారు!
సాక్షి, గుంటూరు: పట్టణ ఓటర్లలో చైతన్యం వెల్లివిరిసింది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. జిల్లాలో 12 మునిసిపాలిటీలకు ఆదివారం పోలింగ్ నిర్వహించగా స్వల్ప ఘటనలు మినహా అంతా ప్రశాంతంగా జరిగింది. సగటు పోలింగ్ శాతం 78.94గా నమోదైంది. మంగళగిరిలో అత్యధికంగా 86.59 శాతం నమోదు కాగా, అత్యల్పంగా తెనాలిలో 73.72 శాతం నమోదైంది. రేపల్లెలో 79.83 శాతం, సత్తెనపల్లిలో 80.08, బాపట్లలో 76.45, మాచర్లలో 75.62, పొన్నూరులో 79.89, తాడేపల్లిలో 83.57, పిడుగురాళ్ళలో 79.05, నరసరావుపేటలో 79.14, వినుకొండలో 80.34, చిలకలూరిపేటలో 81.34 శాతంగా నమోదైంది. జిల్లా వ్యాప్తంగా అన్ని మునిసిపాలిటీల్లో ఉదయం 7 గంటలకే పోలింగ్ మొదలైంది. ఆ వెంటనే మంగళగిరి, పొన్నూరులలో ఈవీఎంలు మొరాయించాయి. కరెంటు కోతలతో పోలింగ్ స్టేషన్లలో ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాడేపల్లిలో కరెంటు కోతతో పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలో పార్టీ గుర్తులు సరిగా కనిపించక ఇబ్బందులు పడ్డారు. ఓటింగ్ మొదలైన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులు డబ్బు పంచుతూ పోలీసులకు దొరికిపోయారు. మాచర్లలో మాజీ ఎమ్మెల్యే వీరంగం మాచర్ల 29 వార్డులో మాజీ ఎమ్మెల్యే, టీడీపీ మద్దతుదారుడు పిన్నెల్లి లక్ష్మారెడ్డి ఈవీఎంను పగలకొట్టేందుకు ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలింగ్ కేంద్రంలో ప్రవేశించిన లక్ష్మారెడ్డి ఈవీఎంను నేలకేసి కొట్టగా పోలింగ్ సిబ్బంది ఒక్కసారి భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే వైఎస్సార్ సీపీ నాయకులు, టీడీపీ నేతలు భారీగా అక్కడకు చేరుకున్నారు. రేంజ్ ఐజీ సునీల్‌కుమార్ ఆ సమయంలో అక్కడే ఉండటడంతో అప్రమత్తమైన పోలీసులు లాఠీఛార్జ్ చేసి నేతల్ని, కార్యకర్తల్ని చెదరగొట్టారు. లక్ష్మారెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు ఆయనపై నాన్ బెయిల్‌బుల్ కేసులు నమోదు చేశారు. ఈవీఎంను నేలకేసి కొట్టడంతో వార్డులో పోలింగ్ గంట ఆలస్యం అయింది. దీంతో రిటర్నింగ్ అధికారి మరో గంట సమయం పొడిగించి ఆరు గంటల వరకు పోలింగ్ నిర్వహించారు. నరసరావుపేటలో పోలీసులు ఓవరాక్షన్‌తో ఓటర్లు ఇబ్బందులు పడ్డారు. వినుకొండలో పోలీసుల లాఠీఛార్జి కారణంగా ఓ యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. సత్తెనపల్లిలో టీడీపీ అభ్యర్ధికి పోలింగ్ సిబ్బందికి సహకరిస్తున్నారని అక్కడ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త అంబటి రాంబాబు ఎన్నికల సంఘం ఉన్నతాధికారి నవీన్ మిట్టల్‌కు ఫిర్యాదు చేశారు. -
వామ్మో.. పెరుగన్నం, వాటర్ బాటిల్ రూ.300 !
శ్రీకాళహస్తి, న్యూస్‌లైన్: అదేదో ఫైఫ్స్టారో, త్రీస్టారో హోటల్ కాదు; అయినా పెరుగన్నం, వాటర్ బాటిల్ ఖరీదు అక్షరాలా రూ.300..! ఇదేమి చోద్యం అని అనుకుంటున్నారా? మున్సిపల్ ఎన్నికల్లో శ్రీకాళహస్తి మున్సిపల్ అధికారుల వడ్డన ఇది..! ఆ పెరుగున్నంలోకి స్పూను పెడితే... మున్సిపల్ ఎన్నికల్లో విధుల నిర్వహణకు పలమనేరు నుంచి 150 మంది ఉద్యోగులు శనివారం శ్రీకాళహస్తికి వచ్చారు. ఆదివారం పోలింగ్ ముగిసిన తర్వాత ఉద్యోగులకు మున్సిపల్ అధికారులు రూ.500 మాత్ర మే ఇచ్చారు. వాస్తవానికి రూ.800 ఇవ్వాల్సి ఉంది. మరో రూ.300 ఇవ్వాలని ఉద్యోగులు మున్సిపల్ అధికారులను ప్రశ్నించారు. శనివారం మధ్యాహ్నం పెరుగు అన్నం, వాటర్ బాటిల్‌కు రూ.300 కట్ చేసినట్లు చెప్పారు. దీంతో ఉద్యోగులు షాక్‌కు గురయ్యారు. పెరుగన్నం, వాటర్ బాటిల్‌కు మూడు వందలా!? అంటూ మండిపడ్డారు. అధికారులతో వాగ్వివాదానికి దిగారు. దీంతో అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొని ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళన చేస్తున్న ఉద్యోగులకు నచ్చజెప్పారు. గంటపాటు ధర్నా చేసిన వారు చేసేదేమీలేక పలమనేరు బస్సు ఎక్కి వెళ్లిపోయారు. ఎన్నికల సిబ్బంది ఆకలి కేకలు మదనపల్లె సిటీ, న్యూస్‌లైన్: మున్సిపల్ ఎన్నికల్లో విధులు నిర్వర్తించిన సిబ్బంది ఆదివారం ఆకలికేకలతో అలమటించారు. మదనపల్లె మున్సిపాలిటీలో 34 వార్డుల్లో ఎన్నికల సిబ్బందికి ప్యాకెట్లలో ఇచ్చిన అల్పాహారం, భోజనం పాచిపోయి ఉండడంతో వాటిని ఎవరూ తినలేదు. పోలింగ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఏమీ పట్టనట్టు వ్యవహరించారు. వాస్తవానికి ఎన్నికల సిబ్బందికి రెండు రోజులకుగాను రూ.300 ఖర్చు చేయాల్సి ఉండగా మున్సిపల్ అధికారులు చేతివాటం ప్రదర్శించారని ఎన్నికల సిబ్బంది ఆరోపణ. దాదాపు 100 కిలోమీటర్ల దూరం నుంచి ఎన్నికల విధులకు వస్తే డీఏలో కూడా కోతలు పెట్టారని పేర్కొన్నారు. -
అరుణమ్మపై సీనియర్ల గుర్రు
సాక్షి, తిరుపతి: ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరిన మాజీ మంత్రి గల్లా అరుణకుమారిపై ఆ పార్టీ సీనియర్ల జంట గుర్రుగా ఉంది. సొంత నియోజకవర్గాలకు వెళ్లిన సమయంలో తప్పితే జిల్లా లో జరిగే పార్టీ కార్యక్రమాలకు ఎప్పుడూ ఒకటిగా వెళ్లే ఈ సీనియర్లు పార్టీలో అరుణమ్మ చేరికను జీర్ణించుకోలేకపోతున్నారు. జిల్లాలో గల్లా కుటుం బానికి అంతోఇంతో పేరుంది. దీంతోపాటు ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్నారు. నిన్నటి వరకు రాష్ట్ర కేబినెట్లో మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఉంది. దీంతో భవిష్యత్తులో అధినేత చంద్రబాబు దగ్గర తమ ప్రాధాన్యం తగ్గుతుంద నేది సీనియర్లయిన మాజీ మంత్రులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, గాలి ముద్దుకృష్ణమనాయుడుల ఆందోళనగా టీడీపీ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఇందుకు పలు ఉదాహరణలు కూడా ఆ వర్గాలు వివరిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతున్న సమయంలోనే గల్లా అరుణకుమారి కుటుంబ సభ్యులు టీడీపీలో చేరుతారనే ఊహాగానాలు వచ్చాయి. ఆ మేర కు అరుణకుమారి కుమారుడు గల్లా జయదేవ్ తిరుపతి అసెంబ్లీ నుంచి పోటీ చేసేందుకు ముందుకువచ్చారు. ఆ తర్వాత పరిణామాల్లో ఆయన మనసు మార్చుకుని గుంటూరు నుం చి లోక్‌సభకు పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. కుమారుని రాజకీ య భవిష్యత్తు దృష్ట్యా గల్లా అరుణకుమారి కూడా గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈ నెల 8వ తేదీన చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ మొత్తం వ్యవహారం ఏడాది కాలంగా నడుస్తున్నప్పటికీ బొజ్జల గాని ముద్దుకృష్ణమ గాని గల్లా చేరికపై పెదవి విప్పలేదు. రాష్ట్ర కేబినెట్ నుంచి వైదొలిగి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్టు అరుణకుమారి ప్రకటించిన తర్వాత కూడా ఇద్దరు సీనియర్ల నుంచి ఎటువంటి స్పందన రాకపోవడం గమనార్హం. అంతేకాకుండా వారి చేరిక సమయంలోనూ జిల్లా పార్టీలో కీలకం గా వ్యవహరిస్తున్న బొజ్జల, ముద్దుకృష్ణమ లేరు. ఈ కార్యక్రమానికి వారిని ఆహ్వానించినా వెళ్లలేదని తెలిసింది. అరుణకుమారితో ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని వారు భావిస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నిన్నటివరకు విమర్శించిన నోటితోనే ఆమెను ప్రశంసిస్తూ ఆహ్వానం పలకడమంటే ప్రజల్లో చులనభావం ఏర్పడే ప్రమాదం ఉన్నందునే తాము ఆ కార్యక్రమానికి హాజరు కాలేదని సీనియర్లు అక్కడక్కడ మాట్లాడుతున్నట్టు చెబుతున్నారు. నిజానికి వారి గైర్హాజరు వెనుక ఉన్న అసలు విషయం వీలైనం త వరకు అరుణమ్మకు దూరంగా ఉండాలన్న అభిప్రాయమని తెలిసిం ది. టీడీపీలో చేరిన తర్వాత కూడా ముగ్గురు మాజీ మంత్రులు ఒక వేదికపైకి వచ్చిన సందర్భం లేదు. మరీ ముఖ్యంగా నగరి ఎమ్మెల్యే ముద్దుకృష్ణమనాయుడు అంతర్గతంగా రగిలిపోతున్నట్టు సమాచారం. ఒకే సామాజికవర్గం కావడంతో తన అవకాశాలను అరుణమ్మ ఎక్కడ ఎగరేసుకుపోతారోనన్న ఆందోళన ఆయనలో ఉన్నట్టు టీడీపీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇప్పటివరకు ఒకటిగా ఉంటూ వస్తున్న ముద్దుకృష్ణమ, గోపాలకృష్ణారెడ్డి ఇదే ఐక్యత కొనసాగించాలనే నిర్ణయంతో ఉన్నట్టు తెలిసింది. ఎవరి అవకాశాలకు అరుణమ్మ గండికొట్టే ప్రయత్నం చేసినా ఇద్దరూ కలసికట్టుగా ఎదుర్కోవాలని వారు భావిస్తున్నారు. చంద్రగిరిలో అరుణమ్మకు పొగబెట్టే ప్రయత్నం? చంద్రగిరి నియోజకవర్గంలో అరుణకుమారికి పొగబెట్టేప్రయత్నం జరుగుతున్నట్టు తాజా పరిణామాలను బట్టి తెలుస్తోంది. ముద్దుకృష్ణమనాయుడుకు అత్యంత సన్నిహితంగా మెలిగే చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ నేతలు అరుణమ్మకు ఏ మాత్రం సహకరించడంలేదు. ఈ నియోజకవర్గ టికెట్టుపై ఆశలు పెట్టుకున్న పేరం హరిబాబు, వలపల దశరథనాయుడు తదితరులను తెరవెనుక నుంచి ముద్దుకృష్ణమ ప్రోత్సహిస్తున్నారని అంటున్నారు. ఇటీవల నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోనూ అరుణమ్మ ఏర్పాటు చేసిన పార్టీ సమావేశాల్లో కార్యకర్తల నుంచి ఆగ్రహావేశాలు రావడం కూడా ఇందులో భాగమేనని చెబుతున్నారు. ఎంపీ శివప్రసాద్పైనా సీనియర్ల ఆగ్రహం కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలో చేరిన మాజీ మంత్రి గల్లా అరుణకుమారికి పూర్థిస్థాయిలో సహకారం అందిస్తున్న చిత్తూరు లోక్‌సభ సభ్యులు ఎన్.శివప్రసాద్‌పై కూడా శ్రీకాళహస్తి, నగరి ఎమ్మెల్యేలు ఆగ్రహంతో ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబు దగ్గర సొంత ఇమేజ్ పెంచుకునేందుకు అవసరానికి మించి శివప్రసాద్ వ్యవహరిస్తున్నారనే భావన ఇద్దరు సీనియర్లలో ఉందని అంటున్నారు. మొత్తానికి టీడీపీలో అరుణమ్మ చేరిక వ్యవహారం ఒక వర్గానికి ఇబ్బందికరంగా ఉందనేది మాత్రం స్పష్టం అవుతోంది. -
ఎదుర్కొనే దమ్ములేక దౌర్జన్యాలు
నగరి, న్యూస్‌లైన్: మున్సిపల్ పరిధిలోని 27 వార్డుల్లో అభ్యర్థులను పోటీకి పెట్టే దమ్ము లేక తెలుగుదేశానికి బహిరంగంగా వత్తాసు పలుకుతూ మాజీ మంత్రి చెంగారెడ్డి దౌర్జన్యాలు చేయిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యనిర్వాహక కమిటీ సభ్యురాలు ఆర్కే రోజా అన్నారు. ఆదివారం మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా 3వ వార్డులో జరిగిన గొడవల నేపథ్యంలో పోలీస్ స్టేషన్ వద్ద ఆమె విలేకరులతో మాట్లాడారు. మూడో వార్డులో పోలింగ్ జరుగుతుండగా ఆ వార్డుకు సంబంధంలేని కాంగ్రెస్ నాయకులు చిరంజీవిరెడ్డి, బాబురెడ్డి ఓట్లడగడం గొడవకు కారణమన్నారు. కాంగ్రెస్ పార్టీ పోటీలో లేకపోయినా ఆ ప్రాంతానికి మాజీ మంత్రి చెంగారెడ్డి, ఆయన కుమార్తె రావడమే ఘర్షణకు దారి తీసిందన్నారు. రచ్చలు పెట్టడమే కాక పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఆయన ఫిర్యాదులు చేస్తున్నారన్నారు. చేతకాని కాంగ్రెస్ నాయకులు టీడీపీతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్‌ను తుంచేయాలనే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇది వారి తాతమ్మలు, జేజమ్మలు దిగివచ్చినా జరిగే పని కాదన్నారు. వైఎస్ఆర్ సీపీలో ఉన్నవారు రౌడీలని చెంగారెడ్డి చెబుతున్నారని, 35 సంవత్సరాలుగా ఆయన వెనుక పని చేసినపుడు రౌడీలని ఆయనకు తెలియలేదా అన్నారు. ఆయన ప్రవర్తన నచ్చక వచ్చినవారు వైఎస్ఆర్ సీపీలో ఉన్నారని, రౌడీలు ఆయన వెంటే ఉన్నారన్నారు. ఎర్రచందనం స్మగ్లర్లు ఎమ్మెల్యే ముద్దుకృష్ణమనాయుడు వెంట ఉన్నారన్నారు. 3వ వార్డుపై ప్రత్యేకంగా కాంగ్రెస్, టీడీపీ దృష్టి సారించాయని, పలుమార్లు గొడవలకు కూడా లాగారన్నారు. పోలింగ్ రోజున కూడా గొడవలు జరిగే ఆస్కారముందని మూడు రోజులుగా పోలీసులకు చెబుతూనే ఉన్నామన్నారు. చివరకు ఊహించిందే జరిగిందన్నారు. మూడో వార్డు అభ్యర్థి కుమారుడు రామ్‌కుమార్‌కు గాయాలయ్యాయన్నారు. -
ఓటెత్తారు
7 గంటలకేబారులు తీరిన ఓటర్లు పోలింగ్‌పై కానరాని పండగ ప్రభావం కొన్నిచోట్ల పోలీసుల ఓవర్ యాక్షన్ ఓటింగ్ సరళిని పరిశీలించిన కలెక్టర్,ఎస్పీ నర్సీపట్నం/యలమంచిలి, న్యూస్‌లైన్ : జిల్లాలోని నర్సీపట్నం, యలమంచిలి మున్సిపాలిటీల్లో పోలింగ్ ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. అభ్యర్థుల అంచనాలకు మించి యలమంచిలిలో 82.99 శాతం, నర్సీపట్నంలో 76.14శాతం నమోదయింది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు పోటెత్తారు. ఉదయం 7 గంటలకే బారులు తీరారు. కొత్త అమావాస్య పం డగ ప్రభావంతో ఒకదశలో మందకొడిగా సాగినప్పటికీ మధ్యాహ్నానికి పుంజుకుంది. మరోపక్క ఎండ తీవ్రత తగ్గడం కూడా పోలింగ్ శాతం పెరిగేందుకు దోహదపడింది. అభ్యర్థులు, వారి అనుచరులు, ఆయా పార్టీల కార్యకర్తలు ఓటర్లను ఆటోలు, రిక్షాలు, ద్విచక్రవాహనాల్లో పోలింగ్ కేంద్రాలకు తరలించారు. ఒకేసారిగా పెద్ద ఎత్తున ఓటర్లు తరలిరావడంతో కొన్ని కేంద్రాల వద్ద గంటలతరబడి క్యూలో వేచి ఉండాల్సి వచ్చింది. వృద్ధులు, వికలాంగులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలవద్ద ప్రత్యేక ఏర్పాట్లు చే శారు. సాయంత్రం 5గంటలకు పోలింగ్ పూర్తయింది. యలమంచిలి మున్సిపాలిటీలో 32,459 మంది ఓటర్లు ఉన్నారు. రెండో వార్డు ఏకగ్రీవం అయింది. 23 వార్డుల్లోని 31,168 మందికి 25,867 ఓట్లు పోలయ్యాయి. 82.99 శాతంగా నమోదయింది. 23 వార్డుల్లో 58మంది అభ్యర్థులు పోటీపడ్డారు. ఉదయం 9గంటలకు 19శాతం, 11గంటలకు 40.80శాతం, 1గంటకు 60.18శాతం, 3గంటలకు 74.86శాతం పోలింగ్ నమోదయింది. 8వ వార్డులో వైఎస్సార్సీపీ చైర్పర్సన్ అభ్యర్థి ఆడారి లక్ష్మీదేవి, టీడీపీ అభ్యర్థి పిళ్లా రమాకుమారిలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లా కలెక్టర్ ఆరోఖ్యరాజ్ కొక్కిరాపల్లి పోలింగ్‌స్టేషన్‌ను పరిశీలించి పోలింగ్ శాతం, భద్రతా ఏర్పాట్లపై ఆరాతీశారు. ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ పెదపల్లి, యలమంచిలి తులసీనగర్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించి భద్రతా ఏర్పాట్లపై సిబ్బందిని ఆరా తీశారు. నర్సీపట్నంలోని 27 వార్డుల్లో మొత్తం 76.14 శాతం మంది ఓటు వేశారు. ఈ పట్టణంలోని మొత్తం 44,097 ఓటర్లకు 33,574 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొత్త అమావాస్య పండగ సందర్భంగా ఇక్కడి మహిళలంతా ఆలయాలకు వెళ్లడంతో ఉదయం మందకొడిగా పోలింగ్ ప్రారంభమైంది. మధ్యాహ్నానికి పుంజుకుంది. ఈ విధంగా ఉదయం 9 గంటలకు 16శాతం, 11 గంటలకు 35, ఒంటి గంటకు 57.8, 3 గంటలకు 66.33, పోలింగ్ ముగిసే సమయానికి 76.14 శాతం పోలింగు నమోదయింది. ఇక్కడి పోలింగ్ సరళిని కలెక్టరు ఆరోఖ్యరాజ్, ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్, ఎన్నికల ప్రత్యేక పరిశీలకురాలు అనితా రామచంద్రన్‌తో పాటు ఆర్డీవో సూర్యారావు, మున్సిపల్ ఎన్నికల అధికారి సింహాచలం పరిశీలించారు. జిల్లాలో రెండు మున్సిపాలిటీల్లోనే ఎన్నికలు జరుగుతుండడంతో అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ పరిస్థితుల్లో కొందరు పోలీసులు, పోలీసు అధికారులు కేంద్రాలవద్ద ఓవర్‌యాక్షన్ చేశారు. బూత్‌లకు సమీపంలో ఉన్న అభ్యర్థులను సైతం జీపుల్లో ఎక్కించి, సాయంత్రం వరకు స్టేషన్లోనే ఉంచారు. అలాగే ఏజెంట్లను సైతం బూత్‌ల్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ కారణంగా కొన్నిచోట్ల వివాదాస్పదమైంది. చిన్న, చిన్న అవాంతరాల నడుమ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. -
హాస్టల్ విద్యార్థినుల నిర్బంధం
అమలాపురం టౌన్, న్యూస్‌లైన్ :వైఎస్సార్ సీపీకి మద్దతుగా ఉన్నారన్న నెపంతో హాస్టల్ విద్యార్థినులు ఓటేయకుండా.. వారిని నిర్బంధించిన టీడీపీ నేతలకు చుక్కెదురైంది. అమలాపురం 9వ వార్డులో ఈ ఘటన జరగ్గా, పోలీసుల చొరవతో ఆ విద్యార్థినులు తమ ఓటేశారు. వివరాలు... తొమ్మిదో వార్డులో ఉన్న కోనసీమ నర్సింగ్ హాస్టల్‌కు చెందిన 30 మంది విద్యార్థినులకు మున్సిపాలిటీలో కొత్తగా ఓటు హక్కు లభించింది. వైఎస్సార్ కాంగ్రెస్‌కు మద్దతుగా ఉన్న వీరంతా గత వారం అమలాపురంలో ‘వైఎస్సార్ జనభేరి’ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డికి స్థానిక ఎర్రవంతెన సాయిబాబా ఆలయం వద్ద ఘన స్వాగతం పలికారు. వీరిని జగన్మోహన్రెడ్డి ఆ ప్యాయంగా పలకరించారు. వీరంతా వైఎస్సార్ సీపీకే ఓటు వేస్తారని 9వ వార్డుకు చెందిన ఓ టీడీపీ నాయకుడు నిర్ధారణకు వచ్చాడు. వీరు పోలింగ్ కేంద్రాలకు వెళ్లకుండా అడ్డుకోవాలనుకున్నాడు. విద్యార్థినులు బయటకు రానీయకుం డా ఆదివారం ఉదయం నుంచి ఒత్తిడి చేయ డం మొదలుపెట్టాడు. ఆ ప్రాంత టీడీపీ నాయకుడొకరు హాస్టల్ సిబ్బందిని మభ్యపెట్టి.. వి ద్యార్థినులను బయటకు రానీయకుండా చేయడంలో సఫలీకృతుడయ్యాడు. భయాందోళనకు గురైన విద్యార్థినులు సాయంత్రం 4 గంటల వరకు హాస్టల్లోనే ఉండిపోయారు.ఓ అజ్ఞాత వ్యక్తి ఈ విషయాన్ని అమలాపురం పోలీసులకు సమాచారం అందించాడు. అమలాపురం రూ రల్ సీఐ ద్వారంపూడి శ్రీనివాసరెడ్డి తన సిబ్బం దితో ఆ హాస్టల్‌కు చేరుకున్నారు. పోలీసులను చూసి, అక్కడున్నవారు పరారయ్యారు. మొత్తం 30 మంది విద్యార్థినులకు సీఐ భద్రత కల్పించి, పోలింగ్ కేంద్రానికి తీసుకువచ్చారు. దీంతో వారు నిర్భయంగా ఓటు వేయగలిగారు. టీడీపీ కార్యకర్త వీరంగం ఇంతలో లక్ష్మణరావు అనే టీడీపీ కార్యకర్త అక్కడకు చేరుకుని హాస్టల్ విద్యార్థినులతో ఓట్లెలా వే యిస్తారని సీఐని ప్రశ్నించాడు. విద్యార్థినుల చేతి లో ఉన్న ఓటర్ స్లిప్పులను సీఐ చూపించారు. ఏమైనా అభ్యంతరముంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ చూసుకుంటారని పోలీసులు అతడిని నిలువరిం చారు. ఓ సందర్భంలో ఆ కార్యకర్తకు, పోలీసుల కు మధ్య వాగ్వాదం జరిగింది. ఇదంతా దళితుల వల్లే జరిగిందంటూ ఓ టీడీపీ కార్యకర్త కులం పేరుతో దూషించాడని ఆరోపిస్తూ.. పోలింగ్ బూత్ ఎదురుగా 216 జాతీయ రహదారిపై ఆ సామాజిక వర్గీయులు బైఠాయించారు. సీఐ హామీతో వారు శాంతించారు. -
9393610113 నంబరు నుంచి మాజీ మంత్రి బెదిరింపులు ?
స్వతంత్రులకు మద్దతివ్వాలంటూ హుకుం వ్యాపారుల నుంచి చందాలకు డిమాండ్ ? పట్టణంలో కలకలం రేపిన వైనం ఉయ్యూరు, న్యూస్‌లైన్ : మునిసిపల్ ఎన్నికల్లో బెదిరింపుల పర్వం పెచ్చుమీరింది. వైఎస్సార్ సీపీలో క్రియాశీలంగా వ్యవహరిస్తూ ఆయా వార్డుల్లో అభ్యర్థుల విజయం కోసం శ్రమిస్తున్న నాయకులను, కార్యకర్తలను, వ్యాపారులను మీ అంతు చూస్తామంటూ ప్రత్యర్థి పార్టీల నేతలు వార్నింగ్‌లు ఇవ్వడం సంచలనం రేకెత్తించింది. కృష్ణా జిల్ల ఉయ్యూరులో ఆరో వార్డు వైఎస్సార్ సీపీ అభ్యర్థి వంగవీటి శ్రీనివాసప్రసాద్‌కు మద్దతుగా రజక సంఘ నాయకుడు, వైఎస్సార్ సీపీ అభిమాని కె.సాయిశ్రీనివాస్ ప్రచారం చేశారు. అక్కడ మాజీ మంత్రి పార్థసారథి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో నిలిపిన సయ్యద్ అజ్మతుల్లా గెలుపునకు సాయి శ్రీనివాస్ ఆటంకంగా మారారు. ఇది సారథికి ఆగ్రహాన్ని తెప్పించింది. ఇంకేముంది సదరు మాజీ మంత్రి అగ్గిమీద గుగ్గిలమై 9393610113 నంబరు నుంచి ఫోన్ చేసి సాయిశ్రీనివాస్‌తో దుర్భాషలాడారు. బెదిరించారు. ‘ఏరా సాయి.. ఒళ్లు బలిసిందా.. నాతో పనులు చేయించుకుని వాడెమ్మట తిరుగుతావా.. వైఎస్సార్ సీపీకి మద్దతుగా వెళ్తే నీ అంతు చూస్తా.. నా మద్దతుదారుడికే చేయ్.. లేకుంటే తొక్కేస్తా..’ అంటూ తీవ్ర అసభ్య పదజాలంతో తిడుతూ విరుచుకుపడ్డారు. దీంతో కంగుతిన్న శ్రీనివాస్ ఈ విషయాన్ని రజకసంఘం, పార్టీ నాయకుల దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన రజక సంఘం జిల్లా అధ్యక్షుడు నాగభూషణం, నాయకులు చాగంటి సాంబశివరావు, సుబ్రహ్మణ్యం, బాపట్ల సుబ్బారావు స్థానిక రాయల్ సమావేశపు హాల్లో శనివారం సమావేశమై మాజీ మంత్రి సారథి బేషరతు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇలానే మరికొందరి వ్యాపారులపైనా సారథి, ఆయన అనుచరులు చిందులు వేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ‘నేను అధికారంలో ఉండగా పనులు చేయించుకుని ఇప్పుడు షాపుల్లో కూర్చుంటారా. స్వతంత్ర అభ్యర్థులకు మద్దతుగా ప్రచారానికి వెళ్లకపోతే మీ అంతు చూస్తా..’ అంటూ బెదిరిస్తున్నట్లు పట్టణం కోడై కూస్తోంది. ఇదిలా ఉంటే సారథి అనుచరుల ఆగడాలు మరింత పెరిగాయి. ఓ బడా వ్యాపారి వద్దకు వెళ్లి చందా అడగ్గా, ఆ వ్యాపారి కొంత మొత్తం ఇచ్చాడు. ‘ఈ మొత్తం చాలదు. నీవు లక్ష ఇవ్వాల్సిందే’ అంటూ పట్టుబట్టాడు సదరు మాజీ మంత్రి అనుచరుడు. దీంతో నివ్వెరపోయిన ఆ వ్యాపారి ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉండగా, ఓ మధ్యవర్తి జోక్యం చేసుకుని మధ్యేమార్గంగా సర్దుబాటు చేసినట్లు తెలిసింది. -
ముమ్మరంగా ఎన్నికల ప్రచారం
ఒంగోలు రూరల్, న్యూస్‌లైన్ : ఒంగోలు మండల పరిధిలో 8 ఎంపీటీసీ స్థానాలు, ఒక జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేస్తున్న వైఎస్సార్ సీపీ అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేశారు. శనివారం ఉదయం వల్లేటివారిపాలెంలో ఎంపీటీసీ అభ్యర్థి కామని రాఘవేంద్రరావు, కరవది దక్షిణంలో మన్నే సుజాత ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. ప్రచారంలో ఆ పార్టీ నాయకులు వాకా బసివిరెడ్డి, నాయకులు మన్నే శ్రీనివాసరావు, మన్నే చిరంజీవి, డాకా అంజిరెడ్డి, నల్లమలపు హనుమారెడ్డి, డాకా ఆదిరెడ్డి, చేజర్ల వెంకటేశ్వర్లు, దగ్గుమాటి గోపాల్‌రెడ్డి, సొసైటీ మాజీ అధ్యక్షుడు సోమన హనుమంతరావు, నంది అవార్డు గ్రహీత యలమంద, బాలినేని యూత్‌ఫోర్స్ బాబురావు, కైలా శ్రీను, రమేష్, కోటి పాల్గొన్నారు. దేవరంపాడు, బొద్దులూరిపాలెంలో గంటా అంజమ్మ విజయాన్ని కాంక్షిస్తూ మండువ సుబ్బారావు నేతృత్వంలో సాగి ప్రసాద్, సాగి అంగిరాజు, చుంచు నాగేశ్వరరావు, నడిపినేని రాంబాబు, మాజీ సర్పంచ్ కొట్టే హనుమంతరావులు ప్రచారం చేశారు. మండల కన్వీనర్ రాయపాటి అంకయ్య నేతృత్వంలో మండలంలోని యరజర్ల, వలేటివారిపాలెం, ఉలిచి, చింతాయిగారిపాలెం, చేజర్ల, మండువవారిపాలెం, దశరాజుపల్లి గ్రామాల్లో ప్రచారం చేశారు. కొత్తపట్నం మండలంలో.. కొత్తపట్నం-2 ఎంపీటీసీ స్థానానికి వెఎస్సార్ సీపీ తరఫున పోటీ చేస్తున్న తంబి కాంతారావు శనివారం స్థానిక డీటీ కాలనీ, డీడీ కాలనీల్లో ప్రచారం చేశారు. కాలనీ వాసులకు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసులరెడ్డి చేసిన సేవలను వివరించి ఓట్లు అభ్యర్థించారు. ప్రచారంలో పార్టీ కొత్తపట్నం గ్రామ అధ్యక్షుడు ఎం సుధాకర్‌రెడ్డి, బేతాళ రమేష్, కొత్తపట్నం ఉప సర్పంచ్ మాకాణి ఏడుకొండలు, హరి, రామ్మోహన్, రాగాల పోలయ్య, మూగ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. అదే విధంగా కొత్తపట్నం-1లో సీపీఐ అభ్యర్థి మేడా సుబ్బారావు కొత్తపట్నం బస్టాండ్, బీసీ కాలనీ పోస్టాఫీస్ బజారులో ప్రచారం చేశారు. -
ఎమ్మెల్యేకు తొత్తుగా వ్యవహరిస్తున్న ఆర్వో
గిద్దలూరు, న్యూస్‌లైన్: నగర పంచాయతీ రిటర్నింగ్ అధికారి ఎస్ఎండీ అస్లాం ఎమ్మెల్యే వర్గానికి తొత్తుగా వ్యవహరిస్తున్నారు. చనిపోయిన వారి ఓటరు స్లిప్పులు, వైఎస్సార్ సీపీ కౌన్సిలర్ అభ్యర్థి దమ్మాల జనార్దన్, అతని భార్యకు చెందిన ఓటరు స్లిప్పులను ఎమ్మెల్యే అన్నా వెంకటరాంబాబు బలపరుస్తున్న బీఎస్పీ అభ్యర్థి పరుచూరి సుభాషిణికి అప్పగించారు. స్వయంగా రిటర్నింగ్ అధికారి, తహసీల్దారు సుధాకరరావు శనివారం రాత్రి ఆమె గృహంలో సోదాలు నిర్వహించగా 28 మంది ఓటరు స్లిప్పులు బయటపడ్డాయి. అభ్యర్థి గృహంలో స్లిప్పులు దొరికినప్పటికీ, అవి ఎలా వచ్చాయో అభ్యర్థితోనే స్టేట్మెంట్ తీసుకోవాల్సిన అధికారులు, అలా కాకుండా వారి బంధువుల అమ్మాయి చేత స్టేట్మెంట్ రికార్డు చేయించారు. అభ్యర్థి సుభాషిణి ఎదురుగా ఉండగానే..ఆమె ఇంట్లో లేదని వేరే బాలిక చేత స్టేట్మెంట్ రికార్డు చేయడం గుర్తించిన వైఎస్సార్ సీపీ అభ్యర్థి దమ్మాల జనార్దన్ ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త ముత్తుముల అశోక్‌రెడ్డితో కలిసి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఎస్ సత్యం దృష్టికి తీసుకెళ్లారు. నగర పంచాయతీ కార్యాలయానికి చేరుకున్న సత్యం ఓటరు స్లిప్పులను, బాలిక చేత నమోదు చేయించిన స్టేట్మెంట్ రికార్డును పరిశీలించారు. అభ్యర్థి ఇంట్లో ఉంటే, ఆమెతో కాకుండా బాలికతో స్టేట్మెంట్ ఎందుకు తీసుకున్నారని నగర పంచాయతీ రిటర్నింగ్ అధికారి అస్లాంపై మండిపడ్డారు. ఓటరు స్లిప్పులు ఒక అభ్యర్థి ఇంటికి ఎలా చేరాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్మాల జనార్దన్, అతని భార్య భాగ్యలక్ష్మి ఓటరు స్లిప్పులు వారి ఇంట్లో ఉండటమేంటని ప్రశ్నించారు. తమ అభ్యర్థిని ఓటేయకుండా చేయడానికి, చనిపోయిన వారి ఓట్లు వేసుకునేందుకు ఇలా కుట్రపన్నారని అశోక్‌రెడ్డి మండిపడ్డారు. అధికారులు ఒక పార్టీకి వత్తాసు పలుకుతూ, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై విచారించి న్యాయం చేయాలని నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి సత్యంను కోరారు. ప్రభుత్వం తరఫున తాను క్షమాపణ చెబుతున్నానని, అవగాహనా రాహిత్యం వలనే ఇలా జరిగిందని సత్యం అన్నారు. రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే పూర్తి విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. తమ వద్ద ఉన్న 26 ఓటరు స్లిప్పుల్లోని ఓటర్లను విచారించి అవి సంబంధించిన వారికి ఇచ్చారా లేదా అని తెలుసుకుని తగిన చర్యలు తీసుకుంటామని తెలిపా రు. 5వ వార్డులో అవకతవకలకు ఎక్కువగా పాల్పడుతున్నారని, వీటిని అడ్డుకోవాలని ముత్తుముల అశోక్‌రెడ్డి కోరారు. దీనిపై మున్సిపల్ ఎన్నికల అధికారి అస్లాంను వివరణ కోరగా, బాలికతో స్టేట్మెంట్ రికార్డు చేసింది తాను కాదన్నారు. తహసీల్దారు సుధాకరరావు తీసుకున్నాడని, తనకు పూర్తిగా తెలియకనే ఇలా జరిగిందన్నారు. ఉద్యోగిగా ఉంటూ తాను ఒక పార్టీకి కొమ్ముకాయాల్సిన అవసరం లేదన్నారు. -
నేడే పోలింగ్
తుదిఘట్టానికి చేరిన మునిసిపల్ ఎన్నికలు 115 వార్డుల్లో 1,390 మంది పోటీ.. 1,63,068 మంది ఓటర్లు సాక్షి, హన్మకొండ: మునిసిపల్ ఎన్నికల్లో అత్యంత కీలక ఘట్టానికి తెరలేచింది. జనగామ, మహబూబాబాద్ మునిసిపాలిటీలు.. పరకాల, భూపాలపల్లి, నర్సంపేట నగర పంచాయతీలకు సంబంధించి ఆదివారం పోలింగ్ జరగనుంది. ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. వాయిదా పడిన వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ మినహా మిగతా మునిసిపాలిటీలు, నగర పంచాయతీల పరిధిలో 116 వార్డులు ఉంన్నాయి. జనగామలో ఒక వార్డు ఏకగ్రీవం కావడంతో... మిగిలిన 115 వార్డులకు పోలింగ్ జరగనుంది. మొత్తం 1,390 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ మేరకు ఎన్నికల నిర్వహణ ఏరాపట్లను జిల్లాయంత్రాంగం పూర్తి చేసింది. మొత్తం 151 పోలింగ్ కేంద్రాలను ఏర్పా టు చేయగా... 169 ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను (ఈవీఎం) అందుబాటులో ఉంచింది. 1,005 మంది ప్రభుత్వ సిబ్బంది ఎన్నికల విధులు నిర్వర్తించనున్నారు. పోలింగ్ పూర్తికాగానే ఈవీఎంలను స్ట్రాంగ్‌రూంలలో భద్రపరచనున్నారు. ఆదివారం జరిగే పోలింగ్ ప్రక్రియలో ఏమైనా ఇబ్బందులు తలెత్తితే ఏప్రిల్ ఒకటో తేదీన రీపోలింగ్ నిర్వహించనున్నారు. ఓటర్ల వివరాలు రెండు మునిసిపాలిటీలు, మూడు నగరపంచాయతీల పరిధిలో 1,63,068 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 82,265 మంది, మహిళలు 80,794 మంది ఉన్నారు. మహబూబాబాద్ మునిసిపాలిటీలో అత్యధికంగా 40,164 మంది ఓటర్లు ఉండగా... పరకాల నగర పంచాయతీలో అతి తక్కువగా 20,729 మంది ఓటర్లు ఉన్నారు. జనగామలో పోటాపోటీ జనగామ మునిసిపాలిటీ ఎన్నికల్లో 27 వార్డుల నుంచి అత్యధికంగా 408 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. భూపాలపల్లి నగరపంచాయతీలో 20 వార్డుల నుంచి అతి తక్కువగా 171 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. -
పురపోరులో ‘ఫ్యాన్’ స్పీడు
షర్మిల యాత్రతో పట్టణాల్లో పట్టు విజయవాడకే పరిమితమైన బాబు గర్జన జిల్లాలో ప్రచారంలో తెలుగుదేశం వెనుకబాటు టీడీపీ, కాంగ్రెస్ కుమ్మక్కు కుట్రలు సాక్షి ప్రతినిధి, విజయవాడ : పురపాలకులను ఎన్నుకునే సమయం ఆసన్నమైంది. జిల్లాలోని విజయవాడ నగరంతో పాటు ఎనిమిది మున్సిపాలిటీల్లో ఆదివారం పోలింగ్ జరగనుంది. జయాపజయాలపై అప్పుడే సర్వేలు, బెట్టింగులు ఊపందుకున్నాయి. రాజకీయ పార్టీల సమీకరణల మాట ఎలా ఉన్నా నేతల పర్యటనలు సైతం ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల జిల్లాలో మూడురోజులపాటు మెరుపు వేగంతో ప్రచారం నిర్వహించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మాత్రం విజయవాడలో మహిళాగర్జనకు పరిమితమయ్యారు. ఇంకా కాంగ్రెస్, మిగిలిన పార్టీలు కనీసం పురప్రజలను పట్టించుకున్న దాఖలాలు లేవు. ‘ఫ్యాన్’ గాలి... తన ప్రచార యాత్రతో కేడర్‌లో మరింత ఉత్సాహం కలిగించిన షర్మిల పలు మున్సిపాలిటీల్లో ఓటర్లను ఆకట్టుకుని ఫ్యాన్ గాలి స్పీడు పెంచారు. జిల్లాలోని ఉయ్యూరు, పెడన, నూజివీడు, తిరువూరు, నందిగామ, జగ్గయ్యపేట మున్సిపాలిటీల్లో షర్మిల ప్రచారానికి విశేష స్పందన లభించింది. చంద్రబాబు మహిళా గర్జన సాకుతో షర్మిల యాత్రకు బందోబస్తు ఇవ్వలేమని విజయవాడ పోలీసులు చేతులెత్తేశారు. దీంతో విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థుల తరఫున షర్మిల ప్రచారానికి అవాంతరం వచ్చింది. అయినా మున్సిపల్ ప్రచారంతోనే షర్మిల ఆగిపోకుండా ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసేలా పామర్రు, గన్నవరం, మైలవరం నియోజకవర్గాలతో పాటు విజయవాడ రూరల్ ప్రాంతంలోను నిర్వహించిన యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. దీంతో జిల్లాలో జరగనున్న వరుస ఎన్నికలపై ఆమె ప్రచార ప్రభావం వైఎస్సార్సీపీకి మరింత బలం పెంచింది. మున్సిపల్ ఎన్నికల్లో షర్మిల యాత్ర కారణంగా వైఎస్సార్సీపీ అభ్యర్థులు, పార్టీ శ్రేణుల్లో జోష్ పెరిగింది. చంద్రబాబు చిర్రుబుర్రులు.. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పూర్తిగా వెనుకబడ్డ చంద్రబాబు మహిళా గర్జన కోసం జిల్లాకు వచ్చి పార్టీ నేతలపై చిర్రుబుర్రులాడారు. మహిళా గర్జనకు జన సమీకరణ బాగాలేదని జిల్లా నేతలను తిట్టిపోసిన చంద్రబాబు మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని పట్టించుకోకపోవడంతో తెలుగు తమ్ముళ్లు పెదవి విరుస్తున్నారు. ఇప్పటికే షర్మిల యాత్రతో కలవరపడుతున్న తెలుగు తమ్ముళ్లను బాబు పట్టించుకోకపోవడంతో వారు కినుక వహించారు. సొంత పార్టీలో ఏళ్ల తరబడి సేవలందించినవారిని వదిలి కొత్తవారి కోసం అర్రులు చాస్తున్న చంద్రబాబు తీరుతో ఆ పార్టీలోనే సీనియర్లు గుర్రుగా ఉన్నారు. ఇవేమీ పట్టించుకోని చంద్రబాబు మున్సిపల్ ఎన్నికలను అస్సలు పట్టించుకోకుండా ఎప్పుడో జరిగే సార్వత్రిక ఎన్నికలపై హడావుడి చేయడంతో చాలా పట్టణాల్లో సైకిల్ పరుగుపెట్టలేకపోతోందని తెలుగు తమ్ముళ్లు ఆవేదన చెందుతున్నారు. మున్సిపాలిటీల్లోను కుమ్మక్కు కుట్ర.. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ టీడీపీతో కుమ్మక్కు కుట్రలు సాగిస్తోంది. మున్సిపల్ ఎన్నికల సాక్షిగా మరోమారు నిస్సిగ్గుగా కలిసిమెలిసి ప్రచారం చేశారు. గతంలో సహకార ఎన్నికలు, పంచాయతీ ఎన్నికల్లోను కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కు రాజకీయాలు సాగించిన సంగతి తెల్సిందే. తాజాగా మున్సిపల్ ఎన్నికలు వచ్చేనాటికి జిల్లాలో కాంగ్రెస్ అడ్రస్ గల్లంతయ్యే దుస్థితి దాపురించింది. దీంతో ఆ పార్టీ నేతలు మరోమారు టీడీపీతో కుమ్మక్కై పురపోరులో పాల్గొంటున్నారు. తమకు కొన్ని మున్సిపల్ వార్డులు ఇచ్చినా చాలు అని బేరసారాలు జరిపిన కాంగ్రెస్ చాలాచోట్ల బాహాటంగానే టీడీపీ అభ్యర్థుల గెలుపుకోసం ప్రచారం నిర్వహించడం కొసమెరుపు. ఏది ఏమైనా కుమ్మక్కు కుట్రలను నిశితంగా గమనిస్తున్న ఓటర్లు విజ్ఞతను ప్రదర్శించే సమయం వచ్చింది. -
మున్సి‘పల్స్’పోలింగ్ నేడే
ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు విజయవాడ కార్పొరేషన్, 8 మున్సిపాలిటీల్లో ఏర్పాట్లు 945 పోలింగ్ కేంద్రాలు సిద్ధం ఈవీఎంలలోనే పోలింగ్ పటిష్ట బందోబస్తు ఏర్పాటు మచిలీపట్నం, న్యూస్‌లైన్ : జిల్లాలోని ఎనిమిది మున్సిపాలిటీలు, ఒక నగర పాలక సంస్థకు జరుగుతున్న ఎన్నికల్లో పోలింగ్ ప్రక్రియ ఆదివారం జరగనుంది. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగనుంది. ఎన్నికలు సక్రమంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. మొబైల్ టీమ్‌లను ఏర్పాటు చేసి పోలీసులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాల్లో వెబ్‌కాస్టింగ్ ద్వారా నిఘా ఏర్పాటు చేశారు. ఎన్నికల నేపథ్యంలో సిబ్బందికి శనివారం ఈవీఎంలు తదితర సామగ్రిని అందజేశారు. ఈవీఎంలు సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులు పరిశీలించిన అనంతరం శనివారం మధ్యాహ్నం నుంచి అధికారులు పోలింగ్స్టేషన్లకు తరలివెళ్లారు. పోలింగ్ సామగ్రి పంపిణీలో, సిబ్బంది నియామకంలో కొద్దిపాటి ఇబ్బందులు తలెత్తినా అధికారులు సకాలంలో స్పందించటంతో పరిస్థితి చక్కబడింది. మచిలీపట్నం పురపాలక సంఘంలో ఎన్నికల సామగ్రిని, సిబ్బందిని నియమించే సమయంలో కొంత గందరగోళం నెలకొంది. దూరప్రాంతాల నుంచి వచ్చినవారిని ఎన్నికల విధుల్లో చేర్చుకునేందుకు అధికారులు జాప్యం చేస్తున్నారని పలువురు ఉపాధ్యాయులు వాగ్వాదానికి దిగారు. ఏజేసీ చెన్నకేశవరావు జోక్యం చేసుకోవటంతో వివాదం సద్దుమణిగింది. ఎన్నికల విధుల్లో 1088 మంది ప్రిసైడింగ్ అధికారులు, 1088 మంది సహాయ ప్రిసైడింగ్ అధికారులు, 3700 మంది సిబ్బందిని నియమించారు. ఆయా పోలింగ్ కేంద్రాల్లో ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు సిబ్బందిని నియమించిన అనంతరం మిగిలినవారిని రిజర్వులో ఉంచారు. ఏదైనా పోలింగ్ స్టేషన్లో ఈవీఎంలు పనిచేయకుంటే వెంటనే వాటిని మార్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. 10.21 లక్షల మంది ఓటర్లు... విజయవాడ కార్పొరేషన్‌తో పాటు జిల్లాలోని ఎనిమిది పురపాలక సంఘాల్లో 10 లక్షల 21 వేల 914 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంది. జిల్లాలోని ఎనిమిది పురపాలక సంఘాల్లో 218 వార్డుల్లో 859 మంది, విజయవాడ కార్పొరేషన్‌లోని 59 డివిజన్లలో 508 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. విజయవాడ కార్పొరేషన్, మచిలీపట్నం, గుడివాడ, జగ్గయ్యపేట, నూజివీడు, తిరువూరు, ఉయ్యూరు, నందిగామ పురపాలక సంఘాల్లో కలిపి మొత్తం 277 వార్డుల్లో కౌన్సిలర్ అభ్యర్థులను ఓటర్లు ఎన్నుకోవాల్సి ఉంది. ఆయా మున్సిపాలిటీల్లోని మొత్తం 945 కేంద్రాల్లో పోలింగ్ జరగనుంది. ఓటుకు రూ.2,500... పురపాలక సంఘ ఎన్నికల నేపథ్యంలో మద్యం విచ్చలవిడిగా పంపిణీ చేశారు. పోలీసులు గస్తీ తిరుగుతున్నా వారి కళ్లుగప్పి అభ్యర్థుల అనుచరులు మద్యం పంపిణీలో తమ పంతం నెగ్గించుకున్నారు. శనివారం రాత్రి మద్యం పంపిణీ అన్ని ప్రాంతాల్లో జోరుగా సాగింది. గత రెండు, మూడు రోజులుగా ఓటర్లకు నగదు పంపిణీ కార్యక్రమం అభ్యర్థులు గుట్టుగా చేపట్టారు. ఉయ్యూరు పురపాలక సంఘంలోని ఓ వార్డులో టీడీపీ, ఇండిపెండెంట్ల అభ్యర్థుల మధ్య నగదు పంపిణీలో పోటీ నెలకొనడంతో ఒక్కొక్కరు ఓటరుకు రూ.2,500 చొప్పున పంపిణీ చేసినట్లు సమాచారం. జగ్గయ్యపేట పురపాలక సంఘంలోనూ ఒకటి, రెండు వార్డుల్లో నగదు పంపిణీ చేశారు. తిరువూరు పురపాలక సంఘంలో ఓటుకు వెయ్యి రూపాయలు చొప్పున అభ్యర్థులు పంపిణీ చేసినట్లు తెలిసింది. మచిలీపట్నంలో ఓటుకు రూ.200 నుంచి రూ.500 వరకు పంపిణీ చేశారు. -
సిబ్బంది లేక ఇబ్బంది!
జీహెచ్ఎంసీ ఎన్నికల విభాగంలో... ఉన్నవారి పైనే మోయలేని భారం ఔట్సోర్సింగ్ వారికి వేతనాల్లేవు పని లేని విభాగాల్లో అదనపు సిబ్బంది సాక్షి, సిటీబ్యూరో : హైదరాబాద్ జిల్లా ఎన్నికల బాధ్యతలు నిర్వహిస్తున్న జీహెచ్ఎంసీలోని ఎన్నికల విభాగంలో తగినంతమంది సిబ్బంది లేక ఇబ్బందవుతోంది. ఉన్నవారిపైనే అదనపు భారం పడుతోంది. ఎన్నికల నిర్వహణ కోసం వివిధ విభాగాలు.. ఆయా విభాగాలకు తగినంతమంది సిబ్బంది.. ఆయా పనుల నిర్వహణకు నోడల్ ఆఫీసర్లు.. వివిధ కార్యక్రమాల నిర్వహణకు ఆయా విభాగాల అధికారులు.. నియమావళి ఉల్లంఘనలను పరిశీలించేందుకకు ఫ్లయింగ్ స్క్వాడ్స్ వంటి ఏర్పాట్లున్నాయి. కానీ ఎన్నికలకు సంబంధించిన కార్యాలయ విధులను నిర్వహించేందుకు తగినంతమంది సిబ్బంది లేరు. జీహెచ్ఎంసీ ఎన్నికల విభాగమే జన గణన తదితర విధులు నిర్వహిస్తోంది. స్పెషల్ కమిషనర్, అడిషనల్ కమిషనర్ వంటి ఉన్నత పోస్టులు పోను కార్యాలయ పనులకు సంబంధించిన విధుల నిర్వహణలో ఒక సూపరింటెండెంట్, ఒక సీనియర్ అసిస్టెంట్, ముగ్గురు ఎల్డీసీలు మాత్రం ఉన్నారు. వీరికి సహాయకులుగా ముగ్గురు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఓటర్ల జాబితా లో పేర్ల నమోదుకు సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తుల పరిశీలన నుంచి అర్హులను జాబితాలో చేర్చడం వరకు.. నియోజకవర్గాల వారీగా ఓటర్ల వివరాలు.. ఆయా నియోజకవర్గాల్లో జరుగుతున్న ఎన్నికల పనుల క్రోడీకరణ తదితర బాధ్యతలన్నీ ఈ విభాగంపై ఉన్నాయి. ఓటరు జాబితాలో పేరు నమోదుకు ఎప్పటికప్పుడు గడువు పెంచుతూ పోతుండటంతో, ఆ మేరకు వీరికి పనిభారం పెరుగుతోంది. పెరిగిన దరఖాస్తులకు అనుగుణంగా కొత్తగా పెరిగిన ఓటర్లు.. పురుషు లు, మహిళల నిష్పత్తి.. కొత్త ఓటర్లు.. వయస్సుల వారీగా ఓటర్ల విభజన, డూప్లికేట్లను గుర్తించ డం తదితర బాధ్యతలన్నీ వీరిపైనే ఉంటున్నాయి. ఎన్నికలకు సంబంధించిన ఇలాంటి పనులన్నింటినీ నిర్ణీత వ్యవధిలోగా పూర్తి చేయాల్సి ఉండటంతో, ఉన్న సిబ్బందిపైనే మోయలేని భారం పడుతోంది. ఉన్నతాధికారులు తరచూ నిర్వహిస్తున్న సమీక్షలకు అవసరమైన సమాచారాన్ని క్రోడీకరించడం ఇతరత్రా బాధ్యతలూ వీరిపైనే ఉన్నాయి. దీంతో, ఈ విభాగంలోని ఉద్యోగులు పని ఒత్తిడితో తరచూ ఆస్పత్రుల పాలవుతున్నారు. ఓవైపు ఎన్నికల సమయం కావడంతో సెలవులు తీసుకోలేకపోవడం.. మరోవైపు ఆరోగ్య సమస్యలతో వారు సతమతమవుతున్నారు. కార్యాలయంలోని విధులతోపాటు ఎన్నికలకు సంబంధించి ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులు కోరే సమస్త సమాచారాన్ని ఆగమేఘాల మీద అందజేయలేక తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారని జీహెచ్ఎంసీ వర్గాలు చెబుతున్నాయి. ఓటర్ల నమోదు సందర్భంగా ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు తదితర పనుల్లోనూ వీరిని భాగస్వాములను చేస్తున్నారు. ఎంసీహెచ్‌గా ఉన్నప్పుడు ఉన్న సిబ్బందితోనే జీహెచ్ఎంసీగా మారాక కూడా నెట్టుకొస్తున్నారు. స్టాఫింగ్ ప్యాట్రన్‌పై సిఫార్సు చేసిన ప్రసాదరావు కమిటీ సైతం జీహెచ్ఎంసీ ఎన్నికల విభాగంలో అవసరమైనంతమంది సిబ్బంది లేక లోపభూయిష్టంగా ఉందని పేర్కొంది. పనితీరు మెరుగుపడాలంటే కొత్తగా తీసుకోవాల్సిన 145 మంది అసిస్టెంట్ కమిషనర్లలో కొందరిని ఎన్నికల విభాగంలో నియమించాలని కూడా సూచించింది. వారితో పాటు అదనపు సిబ్బంది అవసరమని పేర్కొంది. ఆ నియామకాల ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు. ఎన్నికల సమయంలో తాత్కాలికంగానైనా అదనపు సిబ్బంది అవసరం ఉంది. ఎన్నికల విభాగంలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు గత ఐదునెలలుగా వేతనాలు అందకపోయినా పట్టించుకున్నవారు లేరు. ఓవైపు వేతనాల్లేక, మరోవైపు అద నపు భారం మోయలేక వారు సతమతమవుతున్నారు. పనుల్లేని చోట అదనపు సిబ్బంది ఎన్నికల సమయంలో.. జీహెచ్ఎంసీ ఎన్నికల విభాగంలో తగినంతమంది సిబ్బంది లేకపోవడం ఒకవైపు దృశ్యం కాగా.. మరోవైపు పనులు పెద్దగా లేని పలు విభాగాల్లో భారీ సిబ్బంది ఉన్నారు. అవసరమున్నా, లేకపోయినా వివిధ కారణాలతో పలువురిని ఆయా విభాగాల్లో తీసుకున్నారు. రెగ్యులర్ ఉద్యోగులే కాక.. ఔట్సోర్సింగ్ సిబ్బంది నియామకాల్లోనూ ఇదే వరుస. పైరవీలతో.. పై వారి ఆదేశాలతో ఇబ్బడి ముబ్బడిగా తీసుకున్న వారిని ఖాళీగా కూర్చోబెట్టి వేతనాలిస్తున్నారనే ఆరోపణలున్నాయి. మేయర్, కమిషనర్ కార్యాలయాల్లో సైతం లేనంతమంది సిబ్బంది కొందరు హెచ్ఓడీల అజమాయిషీలో పనిచేస్తున్నారు. ఔట్‌సోర్సింగ్‌పై తీసుకున్న వారిలోనూ కొందరు హెచ్ఓడీలకు ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ(ఓఎస్డీ) వంటి వారు కూడా ఉన్నారంటే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. వారు చేసే పనులేమిటో ఎవరికీ తెలియదు. కారుణ్య నియామకాల కింద తీసుకున్నవారితో పాటు ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు విధానంలో తీసుకున్న పలువురికి పని చూపించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో అత్యవసర పనులున్న సమయంలో సైతం ఎన్నికల విభాగంలో అవసరమైనంతమంది సిబ్బంది లేకపోవడమే విచిత్రం. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఈ అంశాల్ని పరిశీలించి, అదనపు సిబ్బంది ఉన్న విభాగాల్లోని వారిని సిబ్బంది కొరత తీవ్రంగా ఉన్న విభాగాల్లో నియమించాలని పలువురు జీహెచ్ఎంసీ ఉద్యోగులు కోరుతున్నారు. సమస్యలివీ... జీహెచ్ఎంసీకి ఎన్నికల విభాగానికి 2 సూపరింటెండెంట్ల పోస్టులు మంజూరు కాగా, ఒక్కరే పనిచేస్తున్నారు. యూసీడీ పోస్టులు మంజూరైనవి 17. పనిచేస్తున్నది ఇద్దరు. ఎల్డీసీ పోస్టులు 24 మంజూరైనా, ఆరుగురు మాత్రమే ఉన్నారు. గ్రేటర్ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో ఎన్నికల విభాగంలో 24 మంది కంప్యూటర్ ఆపరేటర్లను ఔట్‌సోర్సింగ్‌పై తీసుకున్నారు. వారికి గత ఐదునెలలుగా వేతనాల్లేవు. -
స్థానిక ఎన్నికల్లో సత్తా చూపుతాం
మామిడికుదురు, న్యూస్‌లైన్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సత్తా చూపిస్తామని పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి, అమలాపురం పార్లమెంట్ అభ్యర్థి పినిపే విశ్వరూప్ పేర్కొన్నారు. పాశర్లపూడిలో శనివారం జరిగిన సమావేశంలో పలువురు సర్పంచ్‌లు, మాజీ ప్రజా ప్రతినిధులు వైఎస్సార్ సీపీలో చేరారు. సర్పంచ్‌లు మొల్లేటి త్రిమూర్తులు, దాకే సుభాష్ చంద్రబోస్, తాడి లక్ష్మణరావు, మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు తోరం సూర్యభాస్కర్, పాశర్లపూడి సత్రం చైర్మన్ గుండాబత్తుల గోవిందరావు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు కాండ్రేగుల మహలక్ష్మి, మాజీ సర్పంచ్ కొనుకు నాగరాజు, ఎంపీటీసీ మాజీ సభ్యులు తోలేటి ఆదినారాయణమూర్తి, పసుపులేటి మహలక్ష్మీరావు, వీరవల్లి చిట్టిబాబు, నాయకులు చిట్టూరి బుల్లియ్య, జాలెం సుబ్బారావు, బొంతు మణిరాజు, జక్కంపూడి వాసు తదితరులు వైఎస్సార్ సీపీలో చేరారు. వారికి జిల్లా కన్వీనర్ చిట్టబ్బాయి, మాజీ మంత్రి విశ్వరూప్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ మండల శాఖ అధ్యక్షుడు బొలిశెట్టి భగవాన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో విశ్వరూప్ మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరికీ అందించిన ఘనత దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డికే దక్కిందన్నారు. రాష్ట్రాన్ని పాలించే సత్తా కేవలం జగన్మోహన్రెడ్డికి మాత్రమే ఉందని చిట్టబ్బాయి పేర్కొన్నారు. జెడ్పీటీసీ అభ్యర్థి నయనాల రామకృష్ణ, జిల్లా అధికార ప్రతినిధి పి.కె. రావు, మిండగుదుటి మోహన్, కొండేటి చిట్టిబాబు, యాళ్ల దొరబాబు, యూవీవీ సత్యనారాయణ, అడ్డగళ్ల వెంకటసాయిరామ్, తాడి పుష్పరాజ్, పిల్లి శ్రీను, ముత్యాల నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు. -
తెగ పంచారు
యథేచ్ఛగా సాగిన ప్రలోభాల పర్వం రంగంలోకి దిగిన లిక్కర్ లాబీలు పాలకొల్లులో గరిష్టంగా ఓటుకు రూ.3 వేలు తాడే పల్లిగూడెంలో టీడీపీ నేతలకు పోలీసుల సహకారం ! సాక్షి, ఏలూరు : మునిసిపల్ ఎన్నికలు ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. గెలుపే ధ్యేయంగా అభ్యర్థులు సర్వశక్తులూ ఒడ్డారు. ప్రజాదరణ మెండుగా ఉన్న వైఎస్సార్ సీపీ అభ్యర్థుల్ని లక్ష్యంగా చేసుకుని టీడీపీ, కాంగ్రెస్ శ్రేణులు వ్యూహాత్మకంగా పతాక స్థా యిలో ప్రలోభాలకు తెరతీశాయి. చీరలు, బిందెలు, వెండి వస్తువులు, కరెన్సీ నోట్లు పంపిణీ చేస్తూ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేశాయి. ఎన్నికల మంత్రాంగంలో ఎంతో అనుభవం ఉండి, ప్రలోభాల ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేయడంలో ఆరితేరిన నాయకులంతా కలిసి వైఎస్సార్ సీపీ అభ్యర్థుల్ని దెబ్బతీసేందుకు కుయుక్తులు పన్నారు. శనివారం మధ్యాహ్నం నుంచే పలు మునిసిపాలిటీల్లో టీడీపీ, దాని మిత్రపక్షాల నేతలు చివరి మంత్రాంగాలను కొనసాగించారు. ఈ ఎన్నికలు రాజకీయం గా జీవన్మరణ సమస్యగా భావిస్తున్న ఆయా పార్టీల నేతలు ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవడమే లక్ష్యంగా ముం దుకు సాగారు. ఇవేమీ పట్టని వైఎస్సార్ సీపీకి చెందిన అధికశాతం మంది అభ్యర్థులు ఓటరు దేవుళ్లపైనే ఆధారపడి ఓట్లను అభ్యర్థిస్తూ ముందుకు సాగారు. డబ్బు వెదజల్లారు 2005 ఎన్నికల్లో అధిక శాతం మునిసిపాలిటీల్లో ఓటమి పాలైన టీడీపీ ఈసారి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముం దే క్షేత్రస్థాయి సర్వేల ద్వారా వైఎస్సార్ సీపీ బలాన్ని అంచనా వేసుకుంది. ప్రజలు ఆ పార్టీ వైపే మొగ్గు చూపుతున్నారన్న విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు కీలక సమయంలో ప్రలోభాలపైనే దృష్టిపెట్టారు. విజయావకాశాలను ప్రభావితం చేసే వర్గాల ఓటర్లను, స్వతంత్ర అభ్యర్ధులను తమవైపు తిప్పుకునేందుకు నానాతంటాలు పడ్డారు. గుట్టు చప్పుడు కాకుండా పార్టీ శ్రేణుల్ని పంపి ఓట్లు కొనుగోలు చేయించారు. ఏలూరు, భీమవరం, తాడేపల్లిగూడెం, పాలకొల్లు మునిసిపాలిటీల్లో ఇప్పటికే నగదు పంపిణీ పూర్తయ్యింది. ఒక్కో ఓటుకు రూ.వెయియ వరకూ పంపిణీ చేసినట్లు సమాచారం. పాలకొల్లులో ఒకట్రెండు వార్డుల్లో గరిష్టంగా ఓటుకు రూ.3 వేల వరకూ పంపిణీ చేసినట్లు తెలి సింది. తాడేపల్లిగూడెంలో రూ.500 వరకూ పంపిణీ చేసినట్లు సమాచారం. కొన్ని వార్డుల్లో కొందరు అభ్యర్థులు గరిష్టంగా రూ.25 లక్షల వరకూ ఖర్చు చేశారు. తాడేపల్లిగూడెంలోని ఒకరిద్దరు పోలీసు అధికారులు తాజా, మాజీ ఎమ్మెల్యేలకు పూర్తి సహకారం అందిస్తున్నారనే విమర్శలు, ఆరోపణలు వినిపిస్తున్నాయి. టీడీపీ అభ్యర్థులకు అనుకూలంగాను, వైఎస్సార్సీపీ అభ్యర్థులకు ప్రతి కూలంగాను వ్యవహరిస్తున్నారు. వైఎస్సార్ సీపీకి చెందిన ఎక్కువ మం దిపై బైండోవర్ కేసులు పెట్టిన పోలీ సులు టీడీ పీ నేతలను చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. తాడేపల్లిగూడెం టూటౌన్ ప్రాంతంలో టీడీపీకి చెందిన ఓ అభ్యర్థినుంచి రూ.8 లక్షలను స్వాధీ నం చేసుకున్న పోలీసులు ఓ ప్రధాన నాయకుడు ఫోన్ చేయడంతో ఆ మొత్తాన్ని తిరిగి అప్పగించేశారనే ఆరోపణలు గుప్పుమన్నాయి. జంగారెడ్డిగూడెంలోని 12 వార్డుల్లో వైఎస్సార్ సీపీ, టీడీపీల మధ్య హోరాహోరీ పోరు నెలకొం ది. భీమవరం, తణుకు, నిడదవోలు, కొవ్వూరు, నరసాపురం మునిసిపాలిటీల్లోనూ ప్రలోభాల పరంపర కొనసాగుతూనే ఉంది. ఆదివారం ఉదయానికి చివరి విడత పంపిణీని పూర్తి చేసేందుకు అభ్యర్థులు అడుగులు వేస్తున్నారు. ఊపందుకున్న లిక్కర్ లాబీలు ఇదిలావుండగా చాలాచోట్ల లిక్కర్ లాబీలు రంగంలోకి దిగాయి.పలువురు అభ్యర్థులు ఊరి శివార్లలోని దాబాల్లో శిబి రాలు నడిపారు. తణుకు, తాడేపల్లిగూడెం, ఏలూరు, భీమవరం, జంగారెడ్డిగూడెం మునిసిపాలిటీల్లో శనివారం మధ్యాహ్నం నుంచి దాబాల్లో మకాంవేసి వర్గాల వారీ ఓటర్ల లెక్క లు తీసి కొత్త సమీకరణలకు మంత్రాంగాలు నడిపారు. కొవ్వూరు, ఏలూరు, తాడేపల్లిగూడెం, భీమవరం మునిసిపాలిటీల్లో కొందరు నేతలు విందు రాజకీయాలు నిర్వహిం చారు. కీలకమైన వార్డుల్లో ఓటర్లను ప్రభావితం చేసే వివిధవర్గాల నాయకుల్ని విందుకు ఆహ్వానించి ఆయా వర్గాల ఓట్లకు పెద్దఎత్తున గాలాలు వేసినట్లు సమాచారం. -
బరితెగింపు
అసత్య ప్రచారాలకు తెరలేపిన టీడీపీ పందాలకు రమ్మని.. మొహం చాటు వాస్తవాలను జనం పసిగట్టడంతో కలవరం సాక్షి, ఏలూరు: మునిసిపల్ ఎన్నికల్లో ప్రజా తీర్పుకు సమయం ఆసన్నమైంది. చివరి నిమిషంలో అనూహ్యంగా మారిన రాజకీయ సమీకరణలతో టీడీపీ నేతలకు దిమ్మతిరుగుతోంది. దీంతో ఓటర్లను ఓ వైపు ప్రలోభపెడుతూనే మరోవైపు అసత్య ప్రచారాలను ఆ పార్టీ నేతలు ముమ్మరం చేశారు. అన్నిచోట్లా తమదే పైచేయి అంటూ పుకార్లు పుట్టిస్తున్నారు. అనుమానం ఉంటే పందెం కాయండంటూ రెచ్చగొడుతున్నారు. చివరకు టీడీపీ సృష్టించిన మబ్బులు వీడుతున్నాయి. ఆ పార్టీ చేస్తున్న కుట్రలను గ్రహించిన ఓటర్లు వైసీపీ వైపు మళ్లుతున్నారు. ఆఖరి క్షణంలో తమ ఎత్తులు జనం పసిగట్టారని తెలిసి పార్టీవర్గాలు కలవరపడుతున్నాయి. వార్డుల్లో టీడీపీ నేతల బరితెగింపు తారస్థాయికి చేరుకుంది. పంచాయతీ ఎన్నికల్లో చేసిన విధంగానే మైండ్‌గేమ్ ఆడుతున్నారు. అప్పట్లో పంచాయతీలన్నీ తమ ఖాతాలోకే వచ్చేస్తున్నాయని టీడీపీ నాయకులు ప్రచారం చేశారు. ఫలితాలు వెలువడ్డాక వాస్తవం ఏమిటనేది ప్రజలకు తెలిసింది. పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టడమే కాకుండా ఓట్లను సైతం గల్లంతు చేశారు. ఆ తర్వాత సహకార ఎన్నికల్లోనూ ఇదే పద్ధతిని అవలంభించారు. తమకు అనుకూలంగా లేని సహకార సంఘాల్లో రైతుల ఓట్లు సైతం తొలగించారు. కొన్నిచోట్ల లేని ఓట్లు సృష్టించారు. అప్పుడూ అన్నిచోట్లా తమదే గెలుపు అని గొప్పలు చెప్పుకున్నారు. చివరకు చతికిలపడ్డారు. మునిసిపల్ ఎన్నికల్లోనూ అదే తరహాలో అసత్య ప్రచారం చేస్తున్నారు. వైసీపీ అభ్యర్థులే ఏకైక లక్ష్యంగా... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను లక్ష్యంగా చేసుకుని తస్మదీయులు కుటిల రాజకీయాలుఉపయోగించి ఎత్తులు వేశారు. టీడీపీకి ప్రజల్లో ఆదరణ లేకపోయినా ఏకపక్షంగా గెలిచేస్తామంటూ ప్రచారానికి తెరలేపారు. అనుమానం ఉంటే పందెం కాయండం టూ సవాలు విసిరారు. తీరా పందానికి సిద్ధమైతే పత్తాలేకుండా పోతున్నారని కొం దరు వెల్లడించారు. విజ్ఞులైన ఓటర్లు టీడీపీ కుతంత్రాలను చివరి నిమిషంలో పసిగట్టారు. దీంతో పురపోరులో అనూహ్య పరి ణామాలు చోటుచేసుకుంటున్నాయి. నేత ల అంచనాలు తారుమారు కానున్నాయి. జనం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పట్టం గట్టేం దుకు సిద్ధపడుతున్నారు. తామెంత తప్పు డు ప్రచారం చేసినా, విచ్చలవిడిగా డబ్బు లు వెదజల్లినా జనం వైసీపీ వైపు మొగ్గుచూపడం టీడీపీ వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. పోలింగ్‌కు రెండురోజుల ముం దు తమ ఎత్తులు చిత్తవడంపై ఆ పార్టీ నేతలు ఉన్నత స్థాయిలో పోస్ట్‌మార్టం నిర్వహిస్తున్నారు. దాదాపుగా ఏలూరు నగరపాలక సంస్థతోపాటు అన్ని మునిసిపాలిటీల్లోనూ వైసీపీకి అనుకూల పవనాలు వీస్తున్నాయి. ఇన్నాళ్లూ తెలుగుదేశం పార్టీ చెప్పింది, చేసింది అవాస్తవమనే విషయూలను గ్రహించి వైఎస్సార్ పార్టీ అభ్యర్థులకు పట్టం గట్టేందుకు ఓటర్లు ముందుకు వస్తున్నారు. -
‘పుర’పోరుకుసర్వం సిద్ధం
ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ 532 పోలింగ్ స్టేషన్లు... 608 ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు మునిసిపాలిటీల్లో మొత్తం ఓటర్లు 5,72,115 మంది అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 128 2,089 మందితో భారీ పోలీస్ బందోబస్తు సాక్షి ప్రతినిధి, ఏలూరు : మునిసిపల్ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. ఆదివారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ నిర్వహించేందుకు ఏలూరు నగరపాలక సంస్థ, భీమవరం, తాడేపల్లిగూడెం, పాల కొల్లు, నరసాపురం, తణుకు, నిడదవోలు, కొవ్వూరు మునిసిపాలిటీలు, జంగారెడ్డిగూడెం నగర పంచాయతీల్లో అధికారులు విసృ్తత ఏర్పాట్లు చేశారు. ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలోని 50 డివిజన్లు, మిగిలిన పట్టణాల్లో 291 వార్డుల్లో పోలింగ్ జరగనుంది. మొ త్తంగా 291 స్థానాల్లో 946 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇందులో 143 మంది మహిళా అభ్యర్థులు. 5,72,115 మంది ఓటర్లు ఏలూరు నగరపాలక సంస్థ, 8 పట్టణాల్లో మొత్తంగా 5,72,115మంది ఓటర్లు ఉన్నారు. ఏలూరులో 1,39,363 మంది, పాలకొల్లులో 44,518 మంది, భీమవరంలో 1,02,725, నిడదవోలులో 32,303 మంది, తణుకులో 72,462 మంది, కొవ్వూరులో 28,739 మంది, తాడేపల్లిగూడెంలో 72,251 మంది, నరసాపురంలో 42,566, జంగారెడ్డిగూడెంలో 37,188 మంది ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉం ది. వీటిలో 585 పోస్టల్ బ్యాలెట్లు, 112 సర్వీస్ ఓట్లు ఉన్నాయి. జిల్లాలో మొత్తంగా 539 పోలింగ్ కేంద్రాలు నెలకొల్పారు. 608 ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను సిద్ధం చేశారు. జిల్లాలో 135 సమస్యాత్మకమైనవికాగా, 128 ఘర్షణలు జరగడానికి అవకాశం ఉండే పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. వెబ్ కెమెరాల ఏర్పాటు పోలింగ్ జరిగే ప్రాంతాలను 38 జోన్లు, 56 రూట్లుగా విభజించా రు. పోలింగ్ కేంద్రాలతోపాటు ఇతర చోట్ల 197 వెబ్ కెమెరాలను అమర్చారు. ఏ పోలింగ్ స్టేషన్లో ఏం జరుగుతుందనేది ఈ వెబ్‌కెమెరాల ద్వారా ఉన్నతాధికారులు వీక్షించే ఏర్పాట్లు చేశారు. 34 మంది వీడియోగ్రాఫర్లను సిద్ధం చేశారు. పోలింగ్‌ను పర్యవేక్షించేందుకు 121 మంది సూక్ష్మ పరిశీలకులను నియమించారు. 595మంది పోలింగ్ అధికారులు, మరో 595 మంది సహాయ పోలింగ్ అధికారులు, 1,785 మంది పోలింగ్ సిబ్బందిని నియమించారు. 60 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 19 షాడో బృందాలను రంగంలోకి దింపారు. 2,089 మందితో బందోబస్తు అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. ఎన్నికలు జరిగే 9 పట్టణాల్లో 2,089 మంది సిబ్బందిని నియమించారు. 10 మంది డీఎస్పీలు, 25 మంది సీఐలు, 94 మంది ఎస్సైలు, 96 మంది ఏఎస్సైలు, 109 మంది హెడ్‌కానిస్టేబుళ్లు, 1,230 మంది కానిస్టేబుళ్లు, 493 మంది హోంగార్డులు, 32మంది ఆర్మ్డ్ రిజర్వు సిబ్బంది బందోబస్తు నిర్వహించనున్నారు. ఓటరు స్లిప్‌ల పంపిణీ.. ఈసారి ఓటరు స్లిప్పులను అధికార యంత్రాంగమే పంపిణీ చేయాలని నిర్ణయించి కొంతమేరకు చేయగలిగింది. కొన్నిచోట్ల రాజకీయ పార్టీలు జోక్యం చేసుకుని స్లిప్పులను పంపిణీ చేశాయి. వైఎస్సార్సీపీ, టీడీపీ మధ్యే పోటీ మునిసిపాలిటీల్లో ప్రధాన పోటీ వైఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల మధ్యే నెలకొంది. కాంగ్రెస్ పార్టీ ప్రభావం ఈ ఎన్నికల్లో నామమాత్రంగా ఉంది. వామపక్షాలు అక్కడక్కడా బరిలో ఉండగా, టీడీపీ పొత్తుతో బీజేపీ కొన్నిచోట్ల పోటీకి దిగింది. మరోవైపు స్వతంత్ర అభ్యర్థులు చాలామంది రంగంలో ఉన్నా రు. పోటీ మాత్రం వైఎస్సార్సీపీ, టీడీపీల మధ్యే ఉంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్నిచోట్ల విసృ్తతంగా ప్రచారం చేసింది. ప్రజల్లో ఉన్న ఆదరణను ఓట్ల రూపంలో మలచుకునేందుకు ఆ పార్టీ నేతలు, అభ్యర్థులు ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లారు. తెలుగుదేశం పార్టీ ప్రచారంతోపాటు రకరకాల ఊహాగానాలు, దుష్ర్పచారాలకు తెరలేపి ఓటర్లను అయోమయానికి గురిచేసే ప్రయత్నం చేసింది. అయినా జనంలో వైఎస్సార్ సీపీకి ఆదరణ కన్పిస్తోంది. -
మున్సిపల్ ఫలితాల ప్రకటనపై ఉత్కంఠ
సాక్షి, నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫలితాల తరహాలోనే మున్సిపల్ ఎన్నికల ఫలితాలపైనా టెన్షన్ నెలకొంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలను మే 7 తర్వాత ప్రకటించాలని ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. తాజాగా మున్సిపల్ ఎన్నికల ఫలితాలపైనా ఈ ప్రభావం పడింది. మున్సిపల్ ఎన్నికల ఫలితాల ప్రకటనపై హైకోర్టులో శుక్రవారం వాదనలు జరిగాయి. కోర్టు తీర్పును ఏప్రిల్ 1కి వాయిదా వేసింది. ఈ క్రమంలో ముందుగా ప్రకటించినట్లు 2వ తేదీ ఓట్లు లెక్కిస్తారా..లేదా అనే ఉత్కంఠ అందరిలో మొదలైంది. షెడ్యూల్ ప్రకారం ఆదివారం నెల్లూరు కార్పొరేషన్‌తో పాటు గూడూరు, కావలి, వెంకటగిరి, ఆత్మకూరు, సూళ్లూరుపేట, నాయుడుపేట మున్సిపాలీట్లో ఎన్నికలు జరుగుతున్నాయి. అవసరమైన చోట్ల 31న రీపోలింగ్ నిర్వహిస్తారు. ఓట్ల లెక్కింపు మాత్రం ఒకటో తేదీన కోర్టు వెల్లడించే తీర్పుపై ఆధారపడి జరగనుంది. -
పుత్తూరులో టీడీపీ అరాచకాలు
పుత్తూరు న్యూస్‌లైన్: పుత్తూరులో తెలుగుదేశం నాయకుడు గాలి ముద్దుకృష్ణమనాయుడు తనదైన శైలిలో ప్రత్యర్థి అభ్యర్థులపై దాడికి దిగారు. మున్సిపల్ ఎన్నికల్లో దూసుకుపోతున్న వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను భయపెట్టే ప్రయత్నాలకు తెరతీశారు. 19వ వార్డులో వైఎస్ఆర్ సీపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న జి.బాబుపై శుక్రవారం అక్రమ కేసు పెట్టించారు. పరోక్షంగా పోలీసులు సహకరించారనే వాదన వినిపిస్తోంది. 19వ వార్డు అభ్యర్థి జి.బాబు 16వ వార్డుకు వెళ్లి వస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ సమయంలో అతని వద్ద రూ.15 వేలు ఉంది. ఇది ఎన్నికల నియమావళికి విరుద్ధం కూడా కాదు. ఏ అభ్యర్థి అయినా రూ.25 వేల వరకు ఎన్నికల ఖర్చుల నిమిత్తం ఉంచుకోవచ్చని ఎన్నికల నియామావళి ఉంది. ఓటర్లను ప్రలోభపెడుతూ డబ్బు ఇవ్వచూపినప్పడు అరెస్ట్ చేయవచ్చు. అయితే బాబు విషయంలో అరెస్ట్ చేయడానికి ఎలాంటి ఆధారం లేకపోయినా కేవలం ముద్దుకృష్ణమనాయుడు ఆరోపణను ఆధారంగా చేసుకొని పోలీసు అధికారులు అత్యుత్సాహం చూపించారు. ఈ విషయంపై డీఎస్పీ కృష్ణకిషోర్‌రెడ్డి మాట్లాడుతూ 19వ వార్డు అభ్యర్థి రూ.15 వేలు తన వద్ద ఉంచుకుని ఓటర్లను ప్రభావితం చేస్తున్నారనే అభియోగంపై అరెస్టు చేసినట్లు వివరించారు. దుకాణానికి నిప్పు జీవనాధారమైన దుకాణానికి తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు నిప్పు పెట్టారని బాధితుడు దావూద్ ఆరోపిస్తున్నారు. పుత్తూరు మున్సిపాల్టీలోని 11వ వార్డు నుంచి డి.విమల అనే స్వతంత్ర అభ్యర్థికి తాను మద్దతు ఇస్తున్నందుకే ఈ దాడి జరిగిందని దా వూద్ ఆరోపిస్తున్నాడు. ముస్లిం మైనారిటీలకు చెం దిన తాను స్వతంత్ర అభ్యర్థికి మద్దతు తెలుపుతుండడంతో గెలుపు కష్టమవుతోందని భావించిన తెలుగుదేశం పార్టీ వారు ఇలా తన పాతసామాన్ల దుకాణానికి నిప్పుపెట్టారని ఆరోపించారు. ఈ అగ్ని ప్రమాదంలో రూ.2 లక్షల విలువైన వస్తువులు కాలిపోయాయని వాపోయారు. టీడీపీ మద్యం స్వాధీనం ఆటోతో సహా 432 క్వార్టర్ బాటిళ్లు ఉన్న 9 బాక్సులను పుత్తూరులో ఎక్సైజ్ శాఖ సీఐ గౌస్ మహమ్మద్ స్వాధీ నం చేసుకున్నారు. నిందితుడు ఆటో డ్రైవర్ సి.మోహన్‌ను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. చెర్లోపల్లికి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండు సమీపంలో బ్రాందీషాపు నుంచి 9 కేసుల మద్యం ఆటోలో తీసుకెళ్తుండగా ఎక్సైజ్‌శాఖ సీఐ తన సిబ్బందితో దాడి చేసి పట్టుకున్నారు. అయితే ఈ ఘటనలో మద్యం కొనుగోలు చేసిన వ్యక్తు లు తప్పించుకోగా ఆటో డ్రైవర్ దొరికిపోయాడు. విచారిస్తే తెలుగుదేశం పార్టీకి చెందిన వారు బేరం మాట్లాడి, తాను పట్టుబడిన తర్వాత తప్పుకోవడం దురదృష్టకరమని నిందితుడు ఆవేదనకు లోనయ్యారు. ఇది అన్యాయం: రోజా ఎన్నికల నియమావళి మేరకు రూ.25 వేల వరకు డబ్బు కలిగి ఉండవచ్చనే విషయాన్ని మరచి తెలుగుదేశం నేత ముద్దుకృష్ణమనాయుడు ఇచ్చిన సూచనలతో వైఎస్ఆర్ సీపీ అభ్యర్థిని అరెస్టు చేయడం అన్యాయమని ఆ పార్టీ నగరి నియోజకవర్గ సమన్వయకర్త ఆర్కే రోజా ఖండించారు. ఓడిపోతామన్న భయంతోనే టీడీపీ వారు అడ్డదారులు తొక్కుతున్నారని ధ్వజమెత్తారు. ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళతామని వైఎస్ఆర్ సీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు యుగంధర్‌రెడ్డి తెలిపారు. -
స్థానిక’ తేదీలు ఖరారు
6న మదనపల్లె డివిజన్ 11న చిత్తూరు, తిరుపతి డివిజన్లు మే 16 తరువాత ఓట్ల లెక్కింపు? చిత్తూరు(అర్బన్), న్యూస్‌లైన్: జిల్లాలో జరగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి ఎట్టకేలకు తేదీలు ఖరారయ్యాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏప్రిల్ 6, 11వ తేదీల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని భావించినప్పటికీ ఏయే తేదీల్లో ఎక్కడెక్కడ పోలింగ్ నిర్వహించాలనే విషయంపై గురువారం కూడా అధికారులు ఒక నిర్ణయానికి రాలేకపోయారు. దీంతో శుక్రవా రం జెడ్పీ సీఈవో వేణుగోపాలరెడ్డి జిల్లా కలెక్టర్‌ను కలిసి పోలింగ్ తేదీలపై వివరణ ఇవ్వడం తో జిల్లా కలెక్టర్ వీటిని ఆమోదించారు. ముం దుగా అనుకున్నట్లుగానే మదనపల్లె డివిజన్లో ఏప్రిల్ 6న, చిత్తూరు, తిరుపతి డివిజన్లలో ఏప్రిల్ 11న జెడ్పీటీసీ, ఎంపీటీపీ ఎన్నికలు నిర్వహించాలని కలెక్టర్ రాంగోపాల్ రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదిక పంపారు. ఎన్నికల సంఘం సైతం దీన్ని వెంటనే ఆమోదించడంతో ఇక సవ్యంగా పోలింగ్ నిర్వహించడం ఒక్కటే మిగిలింది. మదనపల్లెలో తొలి విడత జిల్లాలో రెండు విడతలుగా జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తొలివిడతగా మదనపల్లె డివిజన్లో నిర్వహించనున్నారు. ఏప్రిల్ 6న మదనపల్లె డివిజన్ పరిధిలోని బి.కొత్తకోట, బెరైడ్డిపల్లె, చిన్నగొట్టిగల్లు, చౌడేపల్లె, గంగవరం, గుడుపల్లె, గుర్రంకొండ, కంబంవారిపల్లె, కలకడ, కలికిరి, కుప్పం, కురబలకోట, ములకలచెరువు, మదనపల్లె (రూరల్), నిమ్మనపల్లె, పలమనేరు, పెద్దమండ్యం, పెద్దపంజాణి, పెద్దతిప్పసముద్రం, పీలేరు, పుంగనూరు, రామకుప్పం, రామసముద్రం, రొంపిచెర్ల, శాంతిపురం, సదుం, సోమల, తంబళ్లపల్లె, వాల్మీకిపురం, వి.కోట, ఎర్రావారిపాళెం మండలాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహిస్తారు. ఏప్రిల్ 11న రెండో విడత ఇక రెండో విడతలో చిత్తూరు, తిరుపతి డివిజన్ల పరిధిలోని ఎన్నికలు నిర్వహిస్తారు. చిత్తూరు డివిజన్లోని బంగారుపాళెం, చిత్తూరు, గంగాధరనెల్లూరు, గుడిపాల, ఐరాల,రామచంద్రాపురం, కార్వేటినగరం, నగరి, నారాయణవనం, నిండ్ర, పాలసముద్రం,పెనుమూరు, పూతలపట్టు, పుత్తూరు, ఎస్.ఆర్.పురం,తవణంపల్లె, వడమాల పేట, వెదురుకుప్పం, విజయపురం, యాదమరి మండలాల్లో ఏప్రిల్ పోలింగ్ నిర్వహిస్తారు. అలాగే తిరుపతి డివిజన్లోని బుచ్చినాయుడుకండ్రిగ, చంద్రగిరి, కేవీబీపురం, నాగలాపురం, పాకాల, పిచ్చాటూరు, పులిచెర్ల,రేణిగుంట, సత్యవేడు, శ్రీకాళహస్తి, తొట్టంబేడు, తిరుపతి రూరల్, వరదయ్యపాళెం, ఏర్పేడు మండలాల్లో సైతం ఇదే రోజు పోలింగ్ జరుగుతుంది. 50 లక్షల బ్యాలెట్ పత్రాలు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఈ సారి కూడా బ్యాలెట్ పత్రాలనే ఉపయోగించనున్నారు. ఇందు కోసం దాదాపు 12 టన్నుల కాగితాన్ని ఉపయోగిస్తున్నారు. ఒక్కో టన్నుకు 2 లక్షలకు పైగా బ్యాలెట్ పత్రాలను ఇప్పటికే డివిజన్ల వారీగా ముద్రిస్తున్నారు. జిల్లాలోని 65 జెడ్పీటీసీ, 901 ఎంపీటీసీ స్థానాలకు దాదాపు 50 లక్షల బ్యాలెట్ పత్రాలను ముద్రించనున్నారు. అయితే 901 ఎంపీటీసీ స్థానాల్లో 14 ఏకగ్రీమవడంతో 887 సెగ్మెంట్లలో మాత్రమే ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో 22 లక్షల మంది ఓటర్లు వారి ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. జెడ్పీటీసీ బరిలో 65 స్థానాలకు 266 మంది ఉండగా, 887 ఎంపీటీసీ స్థానాల్లో 2414 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. ఓట్ల లెక్కింపు వాయిదా సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలను ప్రకటించకూడదని అధికారులు నిర్ణయించారు. మే 7 తరువాత ఎన్నికల ఫలితాలు వెల్లడించొచ్చని సుప్రీంకోర్టు చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మే 16 తరువాత ఓట్ల లెక్కింపు ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. -
విశ్వసనీయతే జగన్ ఆయుధం
మైలవరం,న్యూస్‌లైన్,విలువలకు, విశ్వసనీయతకు, ఇచ్చినమాటకు కట్టుబడే వ్యక్తి జగన్ అని వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ పేర్కొన్నారు. జయభేరిలో భాగంగా దొమ్మరనంద్యాల నుంచి వేపరాల వరకు శుక్రవారం సాయంత్రం రోడ్‌షో జరిగింది. ఈ సందర్భంగా దొమ్మరనంద్యాల గ్రామ చావిడి దగ్గర ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ గ్రామంలో అధిక శాతం ఉన్న చేనేత కార్మికులను రాబోయే తమ ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందన్నారు. జనతావస్త్రాలను పునరుధ్ధరీకరించి, సబ్సిడీపై చేనేతలకు నూలును అందించే కార్యక్రమాన్ని చేపడతామన్నారు. నేతన్నల అత్మహత్యలకు అడ్డుకట్ట వేసి అన్నివిధాల ఆదుకుంటామన్నారు. చేనేత కార్మికులకు వడ్డీలేని రుణాలను ఇస్తామన్నారు. గతంలో చేనేతలు తీసుకున్న రుణాలు పూర్తిస్తాయిలో రుణమాఫీ కాలేదని బడ్జెట్లో రూ. 316 కోట్లు కేటాయించగా అందులో రూ. 96 కోట్లతోనే కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కార్ సరిపెట్టిందన్నారు. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాలన్నారు. ఎమ్మెల్సీ నారాయణరెడ్డి మాట్లాడుతూ వైఎస్ ఆశయాలు జగన్‌తోనే సాధ్యమన్నారు. సభలో కడప ఎంపీ అభ్యర్ధి అవినాష్‌రెడ్డి, జెడ్పీటీసీ అభ్యర్థి సుబ్బిరామిరెడ్డి(భూపేష్) తదితరులు పాల్గొన్నారు. అనంతరం వేపరాల వరకు రోడ్‌షో జరిగింది. -
కాంగ్రెస్ నేతల్లో టికెట్ టెన్షన్
దిగ్విజయ్‌తో బలరామ్, కవిత భేటీ ఏఐసీసీ నేతల చుట్టూ ప్రదక్షిణలు ఢిల్లీలో జిల్లా కాంగ్రెస్ నేతల మకాం వరంగల్, న్యూస్‌లైన్ : కాంగ్రెస్ సిట్టింగ్లతో సహా ఆశావహుల్లో టికెట్ టెన్షన్ పెరుగుతోంది. నిన్నటి వరకు తమకు టికెట్ గ్యారంటీ అని భావించిన నేతల్లో సైతం అంతర్గతంగా ఆందోళన వ్యక్తమవుతోంది. మారిన సమీకరణల నేపథ్యంలో భయం వెంటాడుతోంది. ఈ ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన సిట్టింగ్‌లు, ఆశావహులంతా ఢిల్లీలో మకాం వేశారు. ఏఐసీసీ నేతలు దిగ్విజయ్‌సింగ్, వయలార్ రవి, కుంతియాలను కలుసుకొని ప్రసన్నం చేసుకునేందుకు యత్నిస్తున్నారు. శుక్రవారం తొలి జాబితా వస్తుందని భావించిన నేపథ్యంలో వాయిదా పడడంతో మరింత ఆందోళనకు లోనవుతున్నారు. పొత్తు ప్రచారంతో ఆందోళన టీఆర్ఎస్తో పొత్తులేదని ఇరుపార్టీల నేతలు ప్రకటిస్తున్నప్పటికీ ఉన్నత స్థాయిలో పొత్తుంటుందనే ప్రచారం సాగుతోంది. ఈ కారణంగా తొలి జాబితా విడుదల జాప్యమైనట్లు భావిస్తున్నారు. టీఆర్ఎస్తో పొత్తుంటే తమ స్థానం గల్లంతేనని భావించేవారు, సీపీఐతో పొత్తుంటే తమ పరిస్థితేమిటని ఆందోళన చెందేవారు, కొత్తగా టికెట్ కోరుకునే నేతలంతా ఢిల్లీలో మకాం వేసి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కొందరు ఇప్పటికే నేతలను కలిసి వచ్చారు. పనితీరుపై ప్రజల్లో అసంతృప్తి ఢిల్లీలో కేంద్ర మంత్రి పోరిక బలరాంనాయక్, మహబూబాబాద్ ఎమ్మెల్యే మాలోతు కవితలు కాంగ్రెస్ రాష్ర్ట వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్‌సింగ్‌ను కలిసి ఈ ఎన్నికల్లో తమకే టికెట్ కేటాయించాలని విన్నవించారు. అయితే బలరాంనాయక్, కవితల పని తీరుపై ప్రజల్లో అసంతృప్తి నెలకొందనే ప్రచారం ఊ పందుకున్నది. ఈ దఫా సిట్టింగ్లైనప్పటికీ టికెట్ దక్కుతుందో?లేదో?ననే చర్చ సాగుతోంది. నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతల్లో వర్గపోరుతో ఈ సమ స్య మరింత పెరిగింది. ఒక కుటుంబం నుంచి ఒకరి కే టికెట్ అని ప్రచారం కావడంతో ఎమ్మెల్యే కవితలో ఆందోళన నెలకొంది. తాజాగా శుక్రవారం మహబూబాబాద్‌కు వచ్చిన సీపీఐ నేత నారాయణ సైతం ఎంపీ, ఎమ్మెల్యేలు దద్దమ్మలంటూ వారికి ప్రజాదరణ లేదని వ్యాఖ్యానించడం గమనార్హం. సీపీఐతో పొత్తుంటే ఈ స్థానాన్ని కోరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీటన్నింటి నేపథ్యంలోనే మంత్రి, ఎమ్మెల్యే ఢిల్లీకి వెళ్లినట్లు భావిస్తున్నారు. ఆశావహులంతా అక్కడే.. టికెట్ ఆశిస్తున్న ఆశావహులు, టికెట్ వస్తుందోరాదోననే భయం ఉన్న నాయకులు ఢిల్లీలో మకాం వేశారు. ఇప్పటికే వర్ధన్నపేట ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, పాలకుర్తి మాజీ ఎమ్మెల్యే దుగ్యాల శ్రీనివాసరావు ఢిల్లీలో ఏఐసీసీ నేతలను కలిసి తమకు మరోసారి పోటీకి అవకాశం కల్పించాలని కోరారు. వరంగల్ పశ్చిమ టికెట్ ఆశిస్తున్న జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాయిని రాజేందర్‌రెడ్డి, బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఘంటా నరేందర్‌రెడ్డి, జంగా రాఘవరెడ్డి, తాజాగా పాలకుర్తి నుంచి తమకు అవకాశం కల్పించాలని మాజీ జెడ్పీ చైర్పర్సన్ ధన్వంతి భర్త డాక్టర్ లక్ష్మీనాయణ, స్టేషన్‌ఘన్‌పూర్ ఆశావహులు డాక్టర్ విజయరామారావు, రాజారపు ప్రతాప్, భువనగిరి ఆరోగ్యం, పరకాల టికెట్ ఆశిస్తున్న ఇనుగాల వెంకట్రాంరెడ్డి తదితరులు ఢిల్లీలో ఏఐసీసీ నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. -
మానుకోట ఎంపీ, ఎమ్మెల్యే దద్దమ్మలు
పనిచేసే నాయకులకే ఓట్లు వేయండి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ మహబూబాబాద్, న్యూస్‌లైన్ : మానుకోట ఎంపీ, ఎమ్మెల్యే చేతగాని దద్దమ్మలు.. కనీసం గాడిదలు కాయడానికి కూడా పనికిరారు.. వారి నిర్లక్ష్యం వల్లే పట్టణ ప్రజలు తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. మున్సిపల్, స్థానిక ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలో సీపీఐ పోటీచేస్తున్న వార్డుల్లో శుక్రవారం ఆయన రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణ విగ్రహానికి పూలమాల వేశారు. నెహ్రూ సెంటర్, పాతబజార్‌లో ఆయన మాట్లాడారు. కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా ఆర్యూబీ నిర్మాణం ఏళ్లతరబడి కొనసాగుతోంది.. ఇందుకు స్థానిక ప్రజాప్రతినిధుల అసమర్ధతే కారణమని ధ్వజమెత్తారు. పట్టణ సమస్యలపై సీపీఐ అలుపెరుగని పోరాటాలు చేసింది.. పనిచేసే నాయకులకే ఓట్లు వేయాలని పిలుపునిచ్చారు. మున్సిపాలిటీ ఎన్నికల అనంతరం పాలక మండలి ఏర్పడిన తరువాత ఆరు నెలల్లో తాగునీటి సమస్య, ఆర్యూబీ పూర్తి కాకుంటే దీక్ష చేపట్టి పరిష్కరించుకుంటామని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షు డు రవీందర్రావు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో మానుకోటకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. రాష్ట్రం కోసం పోరాడిన టీఆర్ఎస్, సీపీఐ అభ్యర్థులకే ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ప్రజల సమస్యలు పరిష్కరించని ఎమ్మెల్యే, ఎంపీలకు ఓటు అడిగే ధైర్యం లేకే ప్రచారంలో పాల్గొనలేద న్నారు. ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ ఆర్యూ బీ నిర్మాణంతో వ్యాపారుల కుటుంబాలు వీధినపడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమ ని, రాబోయే ఎన్నికల్లో తమదే విజయమని ధీమా వ్యక్తం చే శారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు, ఏఐఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడు వలీఉల్లా ఖాద్రీ, మార్నేని వెంకన్న, అంజయ్య, శంకర్‌నాయక్, విశ్వేశ్వరరావు, రవి, విజయ్ సారథి తదితరులు పాల్గొన్నారు. బీజేపీని భూస్థాపితం చేయూలి : నారాయణ జనగామ, న్యూస్‌లైన్ : మతోన్మాద రాజకీయాలు చేస్తూ దేశంలో అరాచకాలకు అడ్రస్‌గా మారిన బీజేపీని భూస్థాపితం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. శుక్రవారం ఆయన జనగామలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సినీహీరోలు పవన్‌కల్యాణ్, అక్కినేని నాగార్జున రాజకీయాలలోకి రావడం సంతోషకరమని, కానీ దేశ పరిస్థితులను వారు అర్థం చేసుకోకుండా మోడీ చెంతకు వెళ్లడం దురదృష్టకరమన్నారు. పవన్‌కల్యాణ్ చెగువెరాను ఆదర్శంగా తీసుకుని.. అందుకు భిన్నవైన వ్యక్తిత్వం గల మోడీ దగ్గరకు వెళ్లడాన్ని తప్పుపట్టారు. నాగార్జున తనకు ఉన్న భూసంపదను కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నాడని ఆరోపించారు. బీజేపీలో పురందేశ్వరి చేర డం అవకాశవాద రాజకీయాలకు ఉదాహరణగా పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితులలో బీజేపీకి ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతు ఇవ్వడాన్ని ఆయన ఆత్మహత్య సదృశ్యంగా పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నిక ల్లో సీపీఐ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాంనర్సింహారావు, మాజీ ఎమ్మెల్యే సీహెచ్ రాజారెడ్డి పాల్గొన్నారు. -
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు తొలి, మలి దశలు ఖరారు
గుడ్లవల్లేరు, న్యూస్‌లైన్ : జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో తొలి, మలి దశల పోలింగ్ ఖరారైంది. జిల్లాలో నాలుగు డివిజన్లు ఉండగా మచిలీపట్నం, విజయవాడల్లో ఏప్రిల్ ఆరో తేదీన తొలి దశ పోలింగ్ జరగనుంది. నూజివీడు, గుడివాడ డివిజన్లలో 11న మలి దశ పోలింగ్ నిర్వహించనున్నారు. స్థానిక ఎన్నికల జిల్లా పర్యవేక్షణాధికారిణి, ఉడా వైస్ చైర్పర్సన్ పి.ఉషాకుమారి శుక్రవారం ఈ విషయాన్ని వెల్లడించారు. గుడ్లవల్లేరు మండల పరిషత్ కార్యాలయానికి శుక్రవారం సాయంత్రం వచ్చిన ఆమె స్థానిక అధికారులతో సమావేశమయ్యారు. గుడ్లవల్లేరు మండలంలోని సమస్యాత్మక, అతి సమస్యాత్మక గ్రామాలపై ఎంపీడీవో పి.రమాదేవిని ఆమె ఆరా తీశారు. ఓటరు జాబితాల్లో సమస్యలు ఏమైనా ఉంటే చెప్పాలని అడిగారు. ఎన్నికల అధికారులకు మెటీరియల్ అందజేసే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎన్నికల బడ్జెట్ విడుదలపై ఆరా తీశారు. ఎన్నికల మెటీరియల్ చేరకపోతే తెలియజేయాలన్నారు. ఎన్నికల కేంద్రాల్లో స్టాంప్ ప్యాడ్లు, రూలర్లు పూర్తిస్థాయిలో పనిచేసేలా చూసుకోవాలని చెప్పారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో మంచినీరు, ర్యాంప్‌ల వసతుల్ని ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఎన్నికల విధులకు హాజరయ్యే అధికారులందరికీ సమాచారం ఇవ్వాలని, వారికి శిక్షణ నిర్వహించాలని ఆదేశించారు. ఎన్నికల్లో ఇచ్చే కోడింగ్‌ను జాగ్రత్తగా చేయాలన్నారు. బ్యాలెట్ బాక్సుల వల్ల ఇబ్బందులు తలెత్తకుండా అపమ్రత్తంగా ఉండాలని తెలిపారు. జోనల్, రూట్ ఆఫీసర్లతో పాటు వాహనాల్ని ఏర్పాటు చేసుకోవాలన్నారు. పోలీసు బందోబస్తు తీసుకోవాలని ఆదేశించారు. స్ట్రాంగ్ రూమ్ గుడివాడలోనే... గుడ్లవల్లేరు మండలంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాక బ్యాలెట్ బాక్సుల్ని ఎక్కడ భద్రపరచనున్నారని గుడివాడ ఆర్గీవో వెంకట సుబ్బయ్యను ఉషాకుమారి అడిగారు. దీనికి ఆయన స్పందిస్తూ గుడివాడ ఏఎన్నార్ కాలేజీలోనే స్ట్రాంగ్ రూమ్‌ను ఏర్పాటు చేశామన్నారు. పామర్రు మండల బాక్సులు కూడా గుడివాడలోనే భద్రపరిచేందుకు ప్రయత్నించాలని ఈ సందర్భంగా ఉషాకుమారి సూచించారు.