జిల్లాలో 34 జెడ్పీటీసీ స్థానాలకు 135 మంది, 549 ఎంపీటీసీ స్థానాలకు 1,495 మంది బరిలో నిలిచారు. స్థానిక సంస్థలకు సోమవారం మధ్యాహ్నం 3గంటలతో నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగిసింది.
విజయనగరం ఫోర్ట్, న్యూస్‌లైన్ :
జిల్లాలో 34 జెడ్పీటీసీ స్థానాలకు 135 మంది, 549 ఎంపీటీసీ స్థానాలకు 1,495 మంది బరిలో నిలిచారు. స్థానిక సంస్థలకు సోమవారం మధ్యాహ్నం 3గంటలతో నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగిసింది. మంగళవారం నుంచి అన్ని రాజకీయ పార్టీలు ప్రచారంలో పాల్గొననున్నాయి.
549 ఎంపీటీసీ స్థానాలకు గాను 3,286 మంది నామినేషన్లు వేశారు. వీరిలో 1791 మంది బరిలో నుంచి తప్పుకున్నారు. అలాగే 34 జెడ్పీటీసీ స్థానాలకు 250 నామినేషన్లు దాఖలుకాగా, ఒక నామినేషన్‌ను తిరస్కరించారు. 114 మంది నామినేషన్లను ఉపసంహరించుకోగా, 135 మంది బరిలో నిలిచారు.
జిల్లాలో టీడీపీ, వైఎస్సార్ సీపీ మధ్యే అసలైన పోటీ నెలకొంది. చాలా మండలాల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్లు పడని పరిస్థితి నెలకొంది. 549 ఎంపీటీసీలకు గాను కేవలం 296 స్థానాల్లోనే ఆ పార్టీ అభ్యర్థులను నిలబెట్టింది. 34 జెడ్పీటీసీ స్థానాలకు గాను 24 స్థానాల్లో మాత్రమే ఆ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.