Withdrawal of nominations
-
నేటితో ఉపసంహరణకు గడువు ముగింపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానా ల్లో అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారంతో ముగియనుంది. అనంతరం ఎన్నికల బరిలో మిగలనున్న తుది అభ్యర్థుల జాబితాలు వెల్లడి కానున్నాయి. పరిధిలో మొత్తం 893 మంది నామినేషన్లు దాఖలు చేయగా, వివిధ కారణాలతో 268 మంది అభ్యర్థుల నామినేషన్లను శుక్రవారం నిర్వహించిన పరిశీలనలో తిరస్కరించారు. మొత్తంగా 625 మంది అభ్యర్థుల నామినేషన్లను ఆమోదించారు.ఎవరైనా అభ్యర్థులు తమ అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకోవాలనుకుంటే సోమవారం మధ్యాహ్నం 3 గంటలలోగా స్థానిక లోక్‌సభ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నిర్దేశిత ఫారం–5 దరఖాస్తును సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థి స్వయంగా లేదా తన ఎన్నికల ఏజెంట్/ప్రపోజర్ ద్వారా రిటర్నింగ్ అధికారికి ఫారం–5 దర ఖాస్తును సమర్పించాలి.అభ్యర్థి తరఫున ఏజెంట్/ ప్రపోజర్ ఫారం–5 దరఖాస్తును సమర్పించే సందర్భాల్లో వారికి నామినేషన్ ఉపసంహరణ దరఖాస్తును సమర్పించడానికి అధికారం(ఆథరైజేషన్) కలి్పస్తూ అభ్యర్థి రాతపూర్వకంగా జారీ చేసిన లేఖను సైతం జత చేయాల్సి ఉంటుంది. ఈ స్థానాల్లో బ్యాలెట్ బద్దలు కావాల్సిందే రాష్ట్రంలోని 16 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఈసారి ఒకటికి మించి ఎక్కువ సంఖ్యలో బ్యాలెట్ యూని ట్లను వినియోగించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. నామినేషన్ల ఉపసంహరణ తర్వాతే పూర్తి స్పష్టత వస్తుంది. రాష్ట్రంలోని 16 లోక్‌సభ నియోజకవర్గాల్లో 15 మందికి మించి అభ్యర్థుల నామినేషన్లు చెల్లుబాటైనట్టు ఎన్నికల యంత్రాంగం ప్రకటించింది. లోక్‌సభ స్థానాల వారీగా పరిశీలిస్తే పెద్దపల్లిలో 49 మంది, కరీంనగర్లో 33 మంది, నిజామాబాద్ లో 32 మంది, జహీరాబాద్‌లో 26 మంది, మెదక్‌లో 53 మంది, మల్కాజ్‌గిరిలో 37 మంది, సికింద్రబాద్‌లో 46 మంది, హైదరాబాద్‌లో 38 మంది, చెవెళ్లలో 46 మంది, మహబూబ్‌నగర్‌లో 35 మంది, నాగర్‌కర్నూల్‌లో 21 మంది, నల్లగొండలో 31 మంది, భువనగిరిలో 51 మంది, వరంగల్‌లో 48 మంది, మహబూబాబాద్‌లో 25 మంది, ఖమ్మంలో 41 మంది అభ్యర్థుల నామినేషన్లను ఎన్నికల యంత్రాంగం ఆమోదించింది. నామినేషన్ల ఉపసంహర ణ ముగిసిన తర్వాత ఆయా స్థానాల్లో ఎన్ని బ్యాలె ట్ యూనిట్లతో ఎన్నికల నిర్వహించాలో స్పష్టత రానుంది. 15మంది అభ్యర్థులు, ఆలోపు ఉంటే ఒక బ్యాలెట్ యూనిట్ సరిపోనుంది. అభ్యర్థుల సంఖ్య 16–31 మధ్యలో ఉంటే రెండు బ్యాలెట్ యూనిట్లు అవసరం కానున్నాయి. అభ్యర్థుల సంఖ్య 32–47 మధ్య ఉంటే మూడు బ్యాలెట్ యూనిట్లను వాడాల్సి ఉండనుంది. 48–63 మధ్యలో ఉంటే నాలుగు బ్యాలెట్ యూనిట్లు వినియోగించక తప్పదు. ప్రస్తుతానికి అత్యధికంగా మెదక్ స్థానంలో 53 మంది, భువనగిరి స్థానంలో 51 మంది అభ్యర్థులుండడం గమనార్హం. -
అభ్యర్థులు జారిపోకుండా జాగ్రత్త !
హన్మకొండ : భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు జారిపోకుండా ఉండేలా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంది. అధికార పక్షం వేసే ఎత్తుగడలకు అందకుండా పార్టీ అభ్యర్థులపై ఆచితూచీ వ్యవహరించింది. తమ పార్టీ అభ్యర్థులకు టీఆర్ఎస్ గాలం వేసిందనే సమాచారంతో బీజేపీ నాయకులు నామినేషన్ల ఉపసంహరణ రోజు శుక్రవారం కావాలనే బీజేపీ అభ్యర్థుల సమావేశం ఏర్పాటు చేసింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి హన్మకొండకు చేరుకుని తమ సమక్షంలో అభ్యర్థులను రోజంతా ఉంచుకున్నారు. పార్టీ ఎన్నికల ఇన్చార్జి, బీజేపీ శాసనసభ పక్ష ఉపనేత చింతల రాంచంద్రారెడ్డి, అర్బన్ జిల్లా ఇన్చార్జి రాష్ర్ట కార్యదర్శి డాక్టర్ కాసర్ల వెంకటేశ్వర్లు, రాష్ట్ర సంస్థాగత కార్యదర్శి మంత్రి శ్రీనివాస్ వరంగల్‌లో మకాం వేసి టీఆర్ఎస్ పార్టీకి బీజేపీ అభ్యర్థులు చిక్కకుండా చూశారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు ఎన్నికల కమిషన్ అవకాశం కల్పించింది. అధికార టీఆర్ఎస్ పక్షానికి చిక్కకుండా ఉండేందుకు బీజేపీ రోజంతా సమావేశం జరిపింది. ఎన్నికల్లో ఎలా ప్రచారం చేయాలో, ఏఏ జాగ్రత్తలు తీసుకోవాలో నాయకులు వివరించారు. ఉదయం 8 గంటలకు మొదలైన సమావేశంలో సాయంత్రం 3.30 గంటల వరకు కొనసాగించారు. నామినేషన్ల ఉపసంహరణ సమయం దాటిపోయే వరకు సమావేశం నిర్వహించారు. మధ్యాహ్న భోజన సమయంలో అభ్యర్థులు బయటకు వెళ్లకుండా సమావేశం నిర్వహించిన వేధ బాంక్వెట్ హాల్ తలుపులు మూసి తాళం వేసి నిర్భందించారు. అల్పాహారం, మధ్యాహ్న భోజనం ఫంక్షన్ హాల్లోనే ఏర్పాటు చేసి అభ్యర్థులు బయటకు వెళ్లకుండా జాగ్రత్తపడ్డారు. పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ టి.రాజేశ్వర్‌రావు, మార్తినేని ధర్మారావు, రావు పద్మతో పాటు మరికొందరు ముఖ్యనాయకులు కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్లి అభ్యర్థుల వైపు నుంచి బీఫాంలు అందజేశారు. ప్రచార సమయంలోను అభ్యర్థులు అధికార పక్షానికి లొంగి ప్రచారం నుంచి తప్పుకోకుండా ఉండేలా పార్టీ అన్ని చర్యలు చేపట్టింది. కాంగ్రెస్, టీడీపీల నుంచి టీఆర్ఎస్లోకి భారీగా వలసలు వెళ్లడం, ఆ పార్టీల ప్రధాన నేతలు టీఆర్ఎస్లో చేరడంతో ఆ రెండు పార్టీలో గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో ఆ రెండు పార్టీలో పోటీ చేసేందుకు అభ్యర్థులు లే కుండా పోయారు. దీంతో భవిష్యత్‌లో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం తామే అనే ధీమాలో బీజేపీ నాయకత్వం ఉంది. ఈ సమావేశంలో ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రమాణ చేయించారు. -
గ్రేటర్ వార్ 23rdJanuary 2016
-
7 నామినేషన్లు ఉపసంహరణ
-
7 నామినేషన్లు ఉపసంహరణ
టీఆర్ఎస్, టీడీపీ, రిజిస్టర్డ్ పార్టీల నుంచి ఒక్కొక్కరు నలుగురు ఇండిపెండెంట్లు సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ మంగళవారం ప్రారంభమైంది. తొలిరోజు ఏడుగురు అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. వీరిలో అధికార పార్టీ టీఆర్ఎస్ నుంచి ఒకరు... ప్రతిపక్ష టీడీపీ నుంచి ఒకరు ఉన్నారు. ఎన్నికల సంఘం వద్ద పేరు నమోదు చేసుకున్న పార్టీ నుంచి మరొకరు... ఇండిపెండెంట్లు నలుగురు ఉపసంహరించుకున్నారు. సరూర్‌నగర్ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన కందాడి లత... అక్బర్‌బాగ్ డివిజన్‌కు టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన మహ్మద్ అఫ్జల్ షా ఖాన్ ఉపసంహరించుకున్నారు. దత్తాత్రేయ నగర్ నుంచి రిజిస్టర్డ్ పార్టీకి చెందిన అభ్యర్థి, గచ్చిబౌలి నుంచి ఇద్దరు, ఉప్పుగూడ, కొండాపూర్‌ల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఇండిపెండెంట్లు నామినేషన్లు ఉపసంహరించుకున్నారని జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ సురేంద్ర మోహన్(ఎన్నికలు) తెలిపారు. మంగళవారం సాయంత్రం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ....మొత్తం 150 వార్డుల స్క్రూటినీ మంగళవారం మధ్యాహ్నానికి పూర్తయిందని చెప్పారు. వివరాలిలా ఉన్నాయి... మొత్తం 4,039 నామినేషన్లకుగాను 189 తిరస్కరించారు. మిగతా 3,850 నామినేషన్లను అధికారులు ఆమోదించారు. పార్టీల వారీగా పరిశీలిస్తే టీఆర్ఎస్- 839, టీడీపీ-658, కాంగ్రెస్-659, బీజేపీ-426, ఎంఐఎం- 85, బీఎస్పీ-106, సీపీఐ-29,సీపీఎం-41, లోక్‌సత్తా-47, రిజిస్టర్డు పార్టీలు-74, ఇండిపెండెంట్లు-886 ఉన్నాయి. హోర్డింగుల తొలగింపు ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో అమలులో భాగంగా ఇప్పటి వరకు 1,71,641 అనధికార ప్రచార హోర్డింగులు, ఫ్లెక్సీలు తొలగించామని సురేంద్రమోహన్ తెలిపారు. శాంతిభద్రతల అంశాల్లో భాగంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ 1,363 లెసైన్సుడు ఆయుధాలను స్వాధీనపరచుకున్నారని, 372 మందిని బైండోవర్ చేశారని తెలిపారు. ఇరవై మందికి నాన్‌బెయిలబుల్ వారెంట్లు జారీ చేసినట్లు చెప్పారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 182 మందిని బైండోవర్ చేసినట్లు తెలిపారు. సమావేశంలో జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ శివకుమార్‌నాయుడు పాల్గొన్నారు. -
‘ఢీ’పీసీ..
సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లా ప్రణాళిక కమిటీ (డీపీసీ) ఎన్నికల్లో కీలక ప్రక్రియ ముగిసింది. మంగళవారం సాయంత్రంతో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసింది. దీంతో బుధవారం జిల్లా పరిషత్‌లో ఓటింగ్ ప్రక్రియ జరుగనుంది. ఇందుకు జెడ్పీ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. డీపీసీలో 24 మంది సభ్యుల ఎన్నికకు సంబంధించి ఈ నెల 8న జిల్లా యంత్రాంగం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నామినేష్ల స్వీకరణ, వాటి పరిశీలన పూర్తిచేయగా.. మంగళవారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. ఈ క్రమంలో 21 స్థానాల్లో సింగిల్ నామినేషన్లే ఉండడంతో వాటి ఎన్నిక ఏకగ్రీవమే. మున్సిపల్ కోటాలోని బీసీ జనరల్ కోటాలో ఉన్న మూడు స్థానాలపై నేతల మధ్య సయోధ్య కుదరకపోవడంతో వాటికి ఓటింగ్ అనివార్యమైంది. మూడు బీసీ జనరల్ సీట్లకు ఓటింగ్.. డీపీసీ సభ్యుల ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మొత్తం 24 సభ్యులకుగాను 10 మందిని జెడ్పీటీసీలు ఎన్నుకోనుండగా, 14 మందిని మున్సిపల్ కౌన్సిలర్లు ఎన్నుకోవాల్సి ఉంది. ఈ క్రమంలో నామినేషన్ల ప్రక్రియలో జెడ్పీటీసీ కోటాలో 10 సీట్లకుగాను 11 మంది, మున్సిపల్ కౌన్సిలర్ కోటాలో 14 సీట్లకుగాను 25 మంది పోటీపడ్డారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన రాజకీయ పార్టీలు.. పోటీకంటే సర్దుకుపోవడమే మేలని భావించి బలాబలాల ప్రకారం సీట్లు దక్కించుకునేలా ఎత్తుగడ వేశాయి. ఈ క్రమంలో ఏకాభిప్రాయానికి వచ్చి పార్టీల వారీగా సీట్ల సంఖ్యను ఖరారు చేసుకున్నాయి. దీంతో పోటీలో ఉన్న పలువురిని పార్టీ నేత లు బుజ్జగించి రాజీయత్నానికి తీసుకువచ్చారు. ఈ క్రమంలో జెడ్పీటీసీ కోటాలో అదనంగా ఉన్న ఒకరు పోటీ నుంచి తప్పుకున్నారు. మున్సిపల్ కోటాలోనూ ఏకాభిప్రాయానికి వచ్చినప్పటికీ.. బీసీ జనరల్ కోటాలోని 3సీట్లపై అభ్యర్థులు పట్టుబట్టారు. దీంతో ఆ సీట్లు మినహా మిగతా అన్ని స్థానాల్లో సింగిల్ నామినేషన్లు మిగలడంతో వాటి ఓటింగ్ నామమాత్రమే అయ్యింది. బీసీ జనరల్ కోటాలోని మూడు సీట్లకు సంబంధించి జిల్లా పరిషత్‌లో బుధవారం ఓటింగ్ జరగనుంది. ఈ మూడు సీట్లకుగాను ఐదు మంది బరిలో ఉన్నారు.ఉదయం 10.30గంటల నుంచి సాయంత్రం 5గంటలవరకు ఓటింగ్ కొనసాగనుంది. అనంతరం ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. గుర్తింపు కార్డులు తప్పనిసరి.. జెడ్పీటీసీ కోటాలోని సీట్ల ఎన్నికలు ఏకగ్రీవం కాగా, మున్సిపల్ కౌన్సిలర్ల కోటాలో ఉన్న మూడు బీసీ జనరల్ స్థానాలకు ఓటింగ్ అనివార్యమైంది. ఈ క్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లంతా ఓటింగ్‌లో పాల్గొనాల్సి ఉంది. వీరిలో ముగ్గురికి ఓట్లు వేసి గెలిపించాలి. ఓటింగ్‌కు హాజరయ్యే కౌన్సిలర్లు తప్పకుండా వారి గుర్తింపు కార్డులు తీసుకురావాల్సి ఉంటుంది. లేకుంటే అనుమతించబోమని జిల్లాపరిషత్ సీఈఓ చక్రధర్‌రావు తెలిపారు. -
నేడు నామినేషన్ల ఉపసంహరణ
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : కాంగ్రెస్ పార్టీ తిరుగుబాటు అభ్యర్థులను బుజ్జగించేందుకు అధిష్టానం చేసిన ప్రయత్నాలు ఫలించేలా లేవు. పలుచోట్ల స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేసిన కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థులు పోటీకీ సిద్ధమవుతున్నారు. నామినేషన్ల ఉప సంహరణ గడువు శనివారంతో ముగుస్తుంది. దీంతో టిక్కెట్లు దక్కిన అభ్యర్థుల గుండెల్లో రె‘బెల్స్’ మోగుతున్నాయి. తిరుగుబావుటా ఎగురవేసిన డీసీసీ అధ్యక్షుడు సి.రాంచంద్రారెడ్డి కూడా పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు ఆయన అనుచరులు పేర్కొంటున్నారు. బోథ్ నుంచి నామినేషన్ వేసిన కొమురం కోటేశ్వర్, ఖానాపూర్ బరిలోకి దిగాలని నిర్ణయించిన భరత్‌చౌహాన్‌లు శనివారం నిర్ణయం తీసుకోనున్నారు. సీపీఐ స్థానంలోనూ.. సీపీఐతో పొత్తులో భాగంగా బెల్లంపల్లి స్థానాన్ని కాంగ్రెస్ ఆ పార్టీకి కేటాయించింది. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే గుండా మల్లేష్ సీపీఐ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. ఈ స్థానంపై కూడా కాంగ్రెస్ నేతలు కన్నేశారు. స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి చిలుముల శంకర్ పోటీకి సిద్ధమయ్యారు. ఆయనను పోటీలో ఉండాలని జిల్లా కాంగ్రెస్‌లోని ఓ కీలక నేత ప్రోత్సహిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ టిక్కెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి కూడా పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో తమకు కేటాయించిన స్థానంలో కాంగ్రెస్ నాయకులు ఎలా పోటీ చేస్తారని సీపీఐ అభ్యర్థి గుండా మల్లేష్ ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ద్వారా కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. నామినేషన్ ఉపసంహరించుకోవాలని చిలుముల శంకర్‌పై టీ కాంగ్రెస్ ముఖ్యనాయకులు ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. చెన్నూరు స్థానానికి నామినేషన్ వేసిన కాంగ్రెస్ నాయకుడు దాసారపు శ్రీనివాస్ మాత్రం ఉపసంహరణకు అంగీకరించినట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్లో.. సిర్పూర్ స్థానానికి టీఆర్ఎస్ మహిళా నాయకురాలు పాల్వయి రాజ్యలక్ష్మి తన కుమారుడు హరీష్‌రావుతో నామినేషన్ వేయించారు. ఆమె తన కుమారుడితో నామినేషన్ ఉపసంహరింప చేయాలనే నిర్ణయానికి వచ్చినప్పటికీ, టీఆర్ఎస్ అభ్యర్థి కావేటి సమ్మయ్యకు మద్దతుగా ఎన్నికల్లో పనిచేయడం ప్రశ్నార్థకమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ అభ్యర్థి ప్రేంసాగర్‌రావుకే పరోక్ష మద్దతిచ్చే అవకాశాలు లేకపోలేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన టీఆర్ఎస్ మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు జబ్బార్‌ఖాన్ పోటీలో ఉండే అవకాశాలే ఉన్నాయి. మంచిర్యాలలో టీఆర్ఎస్ రెబల్‌గా నామినేషన్ వేసిన సిరిపురం రాజేష్ శనివారం తన నామినేషన్‌ను ఉపసంహరించుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఆసిఫాబాద్ స్థానానికి నామినేషన్ వేసిన టీఆర్ఎస్ నాయకులు పెందూరు గోపి మాత్రం బరిలో ఉండాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఖానాపూర్ స్థానానికి నామినేషన్ వేసిన విజయలక్ష్మిచౌహాన్ బరి నుంచి తప్పుకునే అవకాశాలు కనిపించడం లేదు. పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించిన స్థానాల్లో నామినేషన్లు వేసిన టీడీపీ నాయకులు దుర్గం నరేష్ (చెన్నూరు), నారాయణరెడ్డి (ముథోల్), ఓం ప్రకాష్లడ్డా (ముథోల్)లు శనివారం నామినేషన్లు ఉపసంహరించుకోనున్నారు. సిర్పూర్ స్థానానికి నామినేషన్ వేసిన బుచ్చిలింగం ఉపసంహరణపై శనివారం నిర్ణయం తీసుకోనున్నారు. -
నేటితో తొలి విడత ప్రచారానికి తెర
కర్నూలు(అర్బన్), న్యూస్‌లైన్: ఈ నెల 6వ తేదీన జరగనున్న తొలి విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారంతో తెర పడనుంది. ఈ ఎన్నికలకు సంబంధించి గత నెల 17న నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కాగా.. 24వ తేదీన నామినేషన్ల ఉప సంహరణ పూర్తయింది. 25వ తేదీ నుంచే స్థానిక సంస్థల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులంతా ప్రచారపర్వం హోరెత్తించారు. జిల్లాలో రెండు విడతలుగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ నెల 6న జరగనున్న తొలి విడత ఎన్నికలకు సంబంధించి కర్నూలు, నంద్యాల డివిజన్లలోని అభ్యర్థులంతా ఈ నెల 4న సాయంత్రం 5 గంటల్లోపు ప్రచారం ముగించాల్సి ఉంది. మలి విడత పోలింగ్ 11వ తేదీన జరగనున్న దృష్ట్యా ఆదోని డివిజన్లోని అభ్యర్థులు ఈ నెల 9వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ప్రచారం చేసుకునే వీలుంది. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు: జెడ్పీ సీఈఓ ఎన్నికల కమిషన్ నిబంధనలను అభ్యర్థులందరు పాటించాలని, ధిక్కరిస్తే చర్యలు తప్పవని జిల్లా ఎన్నికల అదనపు అధికారి, జెడ్పీ సీఈఓ ఎ.సూర్యప్రకాష్ తెలిపారు. తొలి విడత ఎన్నికలు జరగనున్న ప్రాంతాల్లో 4వ తేదీ సాయంత్రం 5 గంటల తర్వాత ఎలాంటి ప్రచారాలు జరగరాదన్నారు. ఆయా ప్రాంతాల్లోని దేవాలయాలు, కల్యాణమండపాలు, ఇతరత్రా బహిరంగ ప్రదేశాల్లో ఎన్నికలకు సంబంధించిన సభలు, సమావేశాలు నిర్వహించినా, చట్టపరంగా చర్యలు తప్పవన్నారు. -
331 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం
హైదరాబాద్: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణ సోమవారం ముగిసింది. బరిలో మిగిలిన అభ్యర్థుల సంఖ్యను ఎన్నికల సంఘం బుధవారం తేల్చింది. 1,096 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ జారీ కాగా.. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటలో ఒక స్థానం ఏకగ్రీవం అరుు్యంది. ఖమ్మం జిల్లాలోని కుక్కనూరు, వేలేర్పాడు స్థానాలకు ఎవరూ నామినేషన్లు దాఖలు చేయలేదు. దీంతో 1,093 స్థానాల్లో పోటీ జరుగ నుంది. ఈ స్థానాలకు 5,034 మంది పోటీ పడుతున్నారు. 16,589 ఎంపీటీసీ స్థానాలకు షెడ్యూల్ విడుదల చేయగా, అందులో 331 సీట్లల్లో అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్వతంత్రులు 105, టీడీపీ 102, వైఎస్సార్ కాంగ్రెస్ 70, కాంగ్రెస్ 31, టీఆర్ఎస్ 15, సీపీఎం 4, సీపీఐ 2, బీజే పీ, బీఎస్పీ ఒక్కో స్థానంలో ఏకగ్రీవమయ్యూరుు. ఖమ్మం జిల్లా కుక్కనూరులో 8, వేలేర్పాడులో 7 ఎంపీటీసీ స్థానాలకు ఎవరూ నామినేషన్లు వేయలేదు. మిగిలిన 16,243 స్థానాలకు 52,568 మంది రంగంలో ఉన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు రంగారెడ్డి జిల్లాలోని 21 పంచాయతీలు, విశాఖపట్నం జిల్లాలోని ఐదు గ్రామ పంచాయతీలకు ఎన్నికల నిర్వహణకు మంగళవారం నోటిఫికేషన్ జారీ చేశారు. వీటికి ఏప్రిల్ 13వ తేదీన ఎన్నికలు నిర్వహిస్తారు. -
జెడ్పీటీసీ బరిలో135 మంది
విజయనగరం ఫోర్ట్, న్యూస్‌లైన్ : జిల్లాలో 34 జెడ్పీటీసీ స్థానాలకు 135 మంది, 549 ఎంపీటీసీ స్థానాలకు 1,495 మంది బరిలో నిలిచారు. స్థానిక సంస్థలకు సోమవారం మధ్యాహ్నం 3గంటలతో నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగిసింది. మంగళవారం నుంచి అన్ని రాజకీయ పార్టీలు ప్రచారంలో పాల్గొననున్నాయి. 549 ఎంపీటీసీ స్థానాలకు గాను 3,286 మంది నామినేషన్లు వేశారు. వీరిలో 1791 మంది బరిలో నుంచి తప్పుకున్నారు. అలాగే 34 జెడ్పీటీసీ స్థానాలకు 250 నామినేషన్లు దాఖలుకాగా, ఒక నామినేషన్‌ను తిరస్కరించారు. 114 మంది నామినేషన్లను ఉపసంహరించుకోగా, 135 మంది బరిలో నిలిచారు. జిల్లాలో టీడీపీ, వైఎస్సార్ సీపీ మధ్యే అసలైన పోటీ నెలకొంది. చాలా మండలాల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్లు పడని పరిస్థితి నెలకొంది. 549 ఎంపీటీసీలకు గాను కేవలం 296 స్థానాల్లోనే ఆ పార్టీ అభ్యర్థులను నిలబెట్టింది. 34 జెడ్పీటీసీ స్థానాలకు గాను 24 స్థానాల్లో మాత్రమే ఆ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. -
నాలుగు ఎంపీటీసీలు ఏకగ్రీవం
చేవెళ్ల రూరల్/యాలాల/బంట్వారం, న్యూస్‌లైన్: ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారంతో ముగిసింది. దీంతో బరిలో ఎవరున్నారో తేలిపోయింది. జిల్లాలో రెండు ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. చేవెళ్ల మండలం మల్కాపూర్ గ్రామం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగిన గండు అంతమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామ ఎంపీటీసీ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వు కావడంతో గ్రామస్తులంతా కలిసి ఆమె ఒక్కరితోనే నామినేషన్ వేయించారు. ఇక యాలాల మండలం అగ్గనూరు ఎంపీటీసీగా జంగం కమలాక్షి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ స్థానానికి నామినేషన్లు వేసిన మిగితా ఇద్దరూ బరిలోంచి తప్పుకున్నారు. దీంతో కమలాక్షి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు మండల రిటర్నింగ్ అధికారి శోభారాణి ప్రకటించారు. యాలాల మండల పరిధిలోని కోకట్ ఎంపీటీసీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఆవుటి శంకర్ కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బంట్వారం మండలం సల్బత్తాపూర్ ఎంపీటీసీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి చిప్పే సుజాత సోమవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీడీపీ నుండి బద్రప్ప, టీఆర్ఎస్ నుంచి లచ్చమ్మ, స్వతంత్ర అభ్యర్థులుగా చంద్రమౌళి, బస్వరాజులు నామినేషన్లు వేయగా, వీరంతా సోమవారం బరిలోంచి తప్పుకున్నారు. దీంతో తిప్పే సుజాత ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి వేణుగోపాల్, ఎంపీడీఓ సుధారాణిలు వెల్లడించారు. -
వర్గల్లో త్రిముఖ పోటీ
వర్గల్,న్యూస్‌లైన్: ‘స్థానిక’ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. వర్గల్ మండలంలో 13 ఎంపీటీసీ (మండల పరిషత్ ప్రాదేశిక నియోజక వర్గాలు) స్థానాలకు గాను మొత్తం 116 నామినేషన్లు దాఖలయ్యాయి. సోమవారం నామినేషన్ల ఉపసంహరణ ము గియడంతో 42 మంది బరిలో నిలిచారు అన్ని స్థానాల్లో కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ల మధ్య త్రిముఖ పోరు నెలకొంది. పాములపర్తిలో బీజేపీ, సీపీఐ అభ్యర్థులు, నెం టూరులో ఒక స్వ తంత్ర అభ్యర్థి పోటీలో ఉన్నారు. అభ్యర్థుల వివరాల ను ఎంపీడీఓ శోభారాణి వెల్లడించా రు. మజీద్‌పల్లి నుంచి హజారి వేణుగోపాల్‌రావు (కాంగ్రెస్), హజారి సుధాకర్‌రావు(టీడీపీ),పాలేటిరాజు(టీఆర్ఎస్) నెంటూరు నుంచి మాసాన్‌పల్లి నర్సయ్య (కాంగ్రెస్), డాకని సత్తయ్య (టీడీపీ), కొత్తోల్ల భిక్షపతి (టీఆర్ఎస్), కంటం రవికుమార్ (స్వతంత్ర) పాములపర్తి నుంచి కొంచెంల స్వప్న (కాంగ్రెస్), సిల్వేరు లక్ష్మి (టీడీపీ), బోయిని సావిత్రి (టీఆర్ఎస్), దాచారం కలమ్మ (బీజేపీ), గుండ వెంకటమ్మ (సీపీఐ) చౌదరిపల్లి నుంచి ఎర్ర కొండల్‌రెడ్డి (కాంగ్రెస్), ప్రొద్దుటూరి శ్రీనివాస్ (టీడీపీ), జిన్న బాషయ్య (టీఆర్ఎస్) గౌరారం నుంచి గుండు భాగ్యమ్మ (కాంగ్రెస్), కడపల బాల్‌రెడ్డి (టీడీపీ), పాశం శ్రీనివాస్‌రెడ్డి (టీఆర్ఎస్),తున్కిఖాల్సా నుంచి గడ్డమీది కళావతి (కాంగ్రెస్), బొర్ర అర్చన (టీడీపీ), గౌసియాబీ (టీఆర్ఎస్) అంబర్‌పేట కీసరి నాగమణి (కాంగ్రెస్), జాలిగామ లక్ష్మి (టీడీపీ), జనగామ మంజుల (టీఆర్ఎస్) వేలూరు అట్ల రాధిక (కాంగ్రెస్), పంజాల సంతోషి (టీడీపీ), మల్లెల నవనీత (టీఆర్ఎస్) గిర్మాపూర్ నుంచి కొండ మహేష్ (కాంగ్రెస్), పూస రమేష్ (టీడీపీ), మహ్మద్ హసన్ (టీఆర్ఎస్) మైలారం నుంచి లింగ సువర్ణ (కాంగ్రెస్), శేషమ్మగారి పద్మ (టీడీపీ), లింగ కవిత (టీఆర్ఎస్) నాచారం నుంచి ఏమ చంద్రకళ (కాంగ్రెస్), ఎల్లంకుల బుచ్చమ్మ (టీడీపీ), బక్కోల్ల పోచమ్మవర్గల్-1 నుంచి మక్తాల మల్లమ్మ (కాంగ్రెస్), గజ్వేల్ నాగమణి (టీడీపీ), రాపర్తి ఈశ్వరమ్మ (టీఆర్ఎస్) వర్గల్-2 నుంచి పసుల కుమార్ (కాంగ్రెస్), గుర్రాల యాదయ్య (టీడీపీ), దేవగణిక సాయి ప్రవీణ్ కుమార్ (టీఆర్ఎస్) పోటీలో ఉన్నారు. -
బహుముఖం
మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మరో ఘట్టం పూర్తయింది. నామినేషన్ల ఉపసంహరణ మంగళవారం ముగిసింది. తుది పోరులో నిలిచే అభ్యర్థులు ఎవరు, ఎంతమందన్నది తేలింది. జిల్లావ్యాప్తంగా ఐదు మున్సిపాలిటీలు, రెండు నగరపంచాయతీల వార్డు సభ్యుల పదవుల కోసం ఈ నెల 30వ తేదీన ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. మొత్తం 210 వార్డులకు 1,311మంది తుది బరిలో నిలిచారు. అత్యధికంగా కోదాడలో 362 నామినేషన్లు విత్ డ్రా అయ్యాయి. మిర్యాలగూడలో 36 వార్డులకు 351 మంది పోటీ పడుతున్నారు. నల్లగొండ మున్సిపాలిటీలో 40వార్డులకు 220మంది పోటీ పడుతున్నారు. పోటాపోటీ.... దాదాపు అన్ని మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కాంగ్రెస్ ఒంటరి పోరు చేయనుంది. చాలా చోట్ల కాంగ్రెస్‌కు ఇంటిపోరు ఎక్కువఉంది. ఆఖరి వరకు టికెట్ ఆశించి భంగపడ్డ వారంతా రెబల్స్‌గా బరిలోకి దిగారు. కొన్ని చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులపై రెబల్స్దే పైచేయి ఉండొచ్చని తెలుస్తోంది. మరికొన్ని చోట్ల కాంగ్రెస్.. ఇతర పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి రంగంలోకి దిగాయి. టీడీపీకి అన్ని వార్డుల్లో పోటీ చేయడానికి అభ్యర్థులు కరువయ్యారు. అయితే ఆయా మున్సిపాలిటీల్లో స్థానికంగా క్యాడర్ని బట్టి కొన్ని పార్టీలు ఓ ఒప్పందానికి వచ్చాయి. భువనగిరిలో వర్గపోరు.... భువనగిరి కాంగ్రెస్‌లో వర్గపోరు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఇక్కడున్న 30 వార్డుల్లో కాంగ్రెస్ బరిలోకి దిగింది. అయితే ఎంపీ వర్గం, స్థానిక నేత వర్గం తమ అభ్యర్థులను వేర్వేరుగా రంగంలోకి దింపాయి. ప్రధానంగా పోటీ కూడా వీరి మధ్యే ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ వర్గపోరును టీడీపీ సానుకూలంగా మలుచుకోవడానికి తహతహలాడుతోంది. మొత్తం గా బరిలో 175 మంది నిలిచారు. సూర్యాపేటలోనూ రెబల్స్ బెడద... ఈ మున్సిపాలిటీలోనూ కాంగ్రెస్‌కు రెబల్స్ బెడద ఉంది. ఉన్న 34 వార్డుల్లో కాంగ్రెస్ ఒంటిరిగా బరిలోకి దిగింది. 10 వార్డుల్లో కాంగ్రెస్ రెబల్స్ పోటీపడుతున్నారు. టీడీపీ32, బీజేపీ 31 వార్డుల్లో తమ అభ్యర్థులను పోటీకి దించాయి. టీడీపీతో కొన్ని వార్డుల్లో రెబల్స్ తలపడుతున్నారు. టీఆర్ఎస్, సీపీఐ పొత్తు కుదుర్చుకున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 10 వార్డుల్లో అభ్యర్థులను బరిలోకి దించింది. తుదిపోరులో 193మంది నిలిచారు. మిర్యాలగూడలో... ఈ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ అన్ని వార్డుల్లో బరిలోకి దిగింది. టీడీపీ, సీపీఎం 25 చొప్పున, బీజేపీ 11 వార్డుల్లో తమ అభ్యర్థులను పోటీకి దించాయి. అయితే కొన్ని వార్డుల్లో టీడీపీ, సీపీఎం ఒప్పందానికి వచ్చాయి. ఇంకొన్ని వార్డుల్లో కాంగ్రెస్, కాంగ్రెస్సేతర పార్టీలు ఏకమయ్యాయి. మొత్తం మీద ఈ మున్సిపాలిటీల్లో పురుపోరు ఆసక్తికరంగా ఉండే అవకాశం ఉంది. మొత్తం 36 వార్డుల్లో 351 మంది బరిలో నిలిచారు. కోదాడలో కూటములుగా.. కొత్తగా ఏర్పడిన ఈ మున్సిపాలిటీకి తొలిసారి జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరి పోరు చేయనుంది. ఇక్కడ టీడీపీ, బీజేపీ, వైఎస్సార్సీపీ, సీపీఎంలు కూటమిగా ఏర్పడ్డాయి. మరోపక్క టీఆర్ఎస్, సీపీఐ జతకట్టాయి. దాదాపు పది వార్డుల్లో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మొత్తం 30 వార్డుల్లో 175 మంది త లపడుతున్నారు. దేవరకొండలో టీఆర్ఎస్, కాంగ్రెస్ ఒంటరిగా.. దేవరకొండ నగర పంచాయతీలో మొత్తం 99 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక్కడ నగర పంచాయతీ చైర్మన్ పదవి ఎస్టీలకు రిజర్వ్ అయ్యింది. 8, 9, 12 వార్డుల్లో బరిలో నిలిచిన అభ్యర్థులు చైర్మన్ స్థానానికి ఎంపికయ్యే అవకాశముంది. ఇక్కడ కాంగ్రెస్, టీఆర్ఎస్లు ఒంటరిగానే బరిలోకి దిగాయి. టీడీపీ, బీజేపీ పొత్తులు కుదుర్చుకున్నాయి. హుజూర్నగర్... హుజూర్నగర్ నగరపంచాయతీలో వైఎస్సార్ కాంగ్రెస్, సీపీఎం, టీడీపీలు కూటములుగా ఏర్పడ్డాయి. కాంగ్రెస్, సీపీఐ కూటమిగా బరిలోకి దిగాయి. కాంగ్రెస్‌కు ఇక్కడా రెబల్స్పోరు తప్పడం లేదు. నాలుగు వార్డుల్లో కాంగ్రెస్‌కు, రెండు వార్డుల్లో టీడీపీకి రెబల్స్ బెడద ఉంది. మొత్తం 20వార్డుల్లో 98 మంది అభ్యర్థులు తలపడనున్నారు. నల్లగొండలో టీడీపీ, కాంగ్రెస్‌లకు రెబెల్స్ బెడద నల్లగొండలో కాంగ్రెస్, టీడీపీకి అధికంగా రెబల్స్ భయం పట్టుకుంది. 40 వార్డుల్లో దాదాపు 20వార్డుల్లో కాంగ్రెస్ రెబల్స్ బరిలో నిలిచారు. టీడీపీకి కూడా 16 వార్డుల్లో రెబల్స్ తలపడుతున్నారు. కొన్ని వార్డుల్లో టీడీపీ, బీజేపీ, ఇంకొన్ని వార్డులో సీపీఎం, టీఆర్ఎస్ కలిసి సర్దుబాటు చేసుకున్నాయి. ప్రత్యర్థి ఓటమే లక్ష్యంగా వారు కలిసి తిరుగుతున్నారు. అంతేగాక ఇక్కడి మొత్తం 40 వార్డులో ఉండగా వీటిలో 220మంది తుది బరిలో నిలిచారు.