హైదరాబాద్: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణ సోమవారం ముగిసింది. బరిలో మిగిలిన అభ్యర్థుల సంఖ్యను ఎన్నికల సంఘం బుధవారం తేల్చింది.
1,096 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ జారీ కాగా.. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటలో ఒక స్థానం ఏకగ్రీవం అరుు్యంది. ఖమ్మం జిల్లాలోని కుక్కనూరు, వేలేర్పాడు స్థానాలకు ఎవరూ నామినేషన్లు దాఖలు చేయలేదు. దీంతో 1,093 స్థానాల్లో పోటీ జరుగ నుంది. ఈ స్థానాలకు 5,034 మంది పోటీ పడుతున్నారు.
16,589 ఎంపీటీసీ స్థానాలకు షెడ్యూల్ విడుదల చేయగా, అందులో 331 సీట్లల్లో అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
స్వతంత్రులు 105, టీడీపీ 102, వైఎస్సార్ కాంగ్రెస్ 70, కాంగ్రెస్ 31, టీఆర్‌ఎస్ 15, సీపీఎం 4, సీపీఐ 2, బీజే పీ, బీఎస్పీ ఒక్కో స్థానంలో ఏకగ్రీవమయ్యూరుు.
ఖమ్మం జిల్లా కుక్కనూరులో 8, వేలేర్పాడులో 7 ఎంపీటీసీ స్థానాలకు ఎవరూ నామినేషన్లు వేయలేదు.
మిగిలిన 16,243 స్థానాలకు 52,568 మంది రంగంలో ఉన్నారు.
హైకోర్టు ఆదేశాల మేరకు రంగారెడ్డి జిల్లాలోని 21 పంచాయతీలు, విశాఖపట్నం జిల్లాలోని ఐదు గ్రామ పంచాయతీలకు ఎన్నికల నిర్వహణకు మంగళవారం నోటిఫికేషన్ జారీ చేశారు. వీటికి ఏప్రిల్ 13వ తేదీన ఎన్నికలు నిర్వహిస్తారు.
331 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం
Published Thu, Mar 27 2014 3:51 AM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM
Advertisement