MPTC-ZPTC
-
వలసలు..!
‘దేశం’ లక్ష్యంగా పావులు ఎంపీపీలపై కన్నేసిన టీఆర్ఎస్ టీడీపీ సభ్యులు లక్ష్యంగా ఎత్తులు అవసరమున్న చోట కాంగ్రెస్ వైపు గుడ్‌బై చెప్పేందుకు తమ్ముళ్లు రెడీ ‘స్థానిక’ కుర్చీలపై దృష్టిసారించిన టీఆర్ఎస్ తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ,జెడ్పీటీసీ సభ్యులను లక్ష్యంగా చేసుకొని ఎత్తుగడలు వేస్తోంది. తమ వైపు చూసే వారికి ‘ఆకర్ష’ పద్ధతిని గూట్లోకి లాక్కొని పదవులను నిలబెట్టుకోవాలని పథక రచన చేస్తోంది. ‘పల్లె పోరులో’ పట్టు సాధించిన కమలం, సైకిల్ పక్షాల వారిని ఆకట్టుకొని మండల పరిషత్‌ల్లో పాగా వేయాలని యోచిస్తోంది. మహబూబ్‌నగర్ : జిల్లా, మండల పరిషత్ చైర్మన్ పదవులపై కన్నేసిన టీఆర్ఎస్ వలసల ద్వారా కుర్చీలు దక్కించుకోవాలనే వ్యూహంతో కనిపిస్తోంది. ఇతర పార్టీల నుంచి జడ్పీటీసీ, ఎంపీటీసీలుగా గెలుపొందిన వారిని ఆకర్షించడం ద్వారా లక్ష్యం చేరుకోవాలని భావిస్తోంది. కాంగ్రెస్‌ను మినహాయిస్తే జిల్లాలో టీడీపీ, బీజేపీ మాత్రమే ప్రాదేశిక ఎన్నికల్లో ఓ మోస్తరు ఫలితాలను సాధించాయి. దీంతో తెలుగుదేశం పార్టీ ప్రాదేశిక సభ్యులు, నేతలు లక్ష్యంగా చేరికల వ్యూహానికి పదును పెడుతోంది. త్వరలో జిల్లా, మండల పరిషత్ చైర్మన్ల ఎంపిక నోటిఫికేషన్ వెలువడుతుందనే వార్తల నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ పీఠం కైవసం చేసుకునే దిశగా పావులు కదుపుతోంది. జిల్లాలో 64 మండల పరిషత్‌లకు గాను 20కి పైగా మండల పరిషత్‌లలో ఏ పార్టీకి స్పష్టమైన సంఖ్యా బలం దక్కలేదు. ప్రాదేశిక ఎన్నికల్లో అనూహ్యంగా పుంజుకున్న టీఆర్ఎస్ ప్రస్తుత రాజకీయ పరిస్థితులను ఆసరాగా తీసుకుని అటు జిల్లా, ఇటు మండల పరిషత్ పీఠాలను దక్కించుకునేలా వ్యూహ రచన చేస్తోంది. జిల్లా పరిషత్ పీఠాన్ని దక్కించుకునేందుకు కనీసం 33 మంది జడ్పీటీసీ సభ్యుల మద్దతు అవసరం కాగా, టీఆర్ఎస్కు 25 మంది సభ్యులున్నారు. దీంతో తొమ్మిది మంది సభ్యుల బలమున్న టీడీపీ మద్దతు కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో ఓ వైపు టీడీపీ మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తూనే మరోవైపు ఆ పార్టీ సభ్యులను పార్టీలో చేరేలా పావులు కదుపుతోంది. అచ్చంపేట నియోజకవర్గానికి చెందిన ఓ కీలక నేతను పార్టీలో చేర్చుకోవడం ద్వారా అక్కడి నుంచి గెలుపొందిన ఓ టీడీపీ జడ్పీటీసీ సభ్యుడి మద్దతు కూడగట్టుకునే యోచన కనిపిస్తోంది. ఇదే వ్యూహాన్ని మిగతా నియోజకవర్గాల్లోనూ అనుసరించాలని టీఆర్ఎస్ భావిస్తోంది. కొడంగల్ నియోజకవర్గంలో గెలుపొందిన నలుగురు జడ్పీటీసీ సభ్యులను మినహాయిస్తే మిగతా ఐదుగురు టీడీపీ సభ్యులను పార్టీ గొడుగుకు రప్పించే వ్యూహంతో వున్నట్లు టీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. టీడీపీ నేతలను ఆకర్షించే బాధ్యతను పార్టీకి చెందిన కీలక నేతకు పార్టీ అధినేత కేసీఆర్ అప్పగించినట్లు ప్రచారం జరుగుతోంది. ‘దేశం’ సభ్యుల పక్కచూపు జిల్లాలో 982 మండల పరిషత్ ప్రాదేశిక స్థానాలకు గాను కాంగ్రెస్ 367, టీఆర్ఎస్ 298, టీడీపీ 178, బీజేపీ 69, సీపీఐ మూడు, సీపీఎం నాలుగు, స్వతంత్రులు 63 చోట్ల విజయం సాధించారు. కాంగ్రెస్ సొంతంగా 28 మండల పరిషత్ అధ్యక్ష పదవులను దక్కించుకునే పరిస్థితి కనిపిస్తోంది. మండల పరిషత్ ప్రాదేశిక స్థానాల్లో సంఖ్యా పరంగా టీఆర్ఎస్ రెండో స్థానంలో వున్నా చాలా చోట్ల సొంత బలంపై ఆధార పడి అధ్యక్ష పదవులు దక్కించుకునే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీలను ఆకర్షించడం ద్వారా మండల పరిషత్ అధ్యక్ష పదవులను దక్కించుకోవాలని భావిస్తోంది. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నామమాత్రంగా తయారైన పరిస్థితుల నేపథ్యంలో అవసరమైన చోట టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు మద్దతు ఇచ్చే యోచన టీడీపీ సభ్యుల్లో కనిపిస్తోంది. అధికార పార్టీకి దూరంగా వుంటే అభివృద్ధి నిధులు దక్కవనే భావన కూడా టీడీపీ ఎంపీటీసీ సభ్యుల్లో కనిపిస్తోంది. కొడంగల్, నారాయణపేట, వనపర్తి, మక్తల్ మినహా మిగతా నియోజకవర్గాల్లో టీడీపీకి నియోజకవర్గ స్థాయిలో నాయకత్వం లేకుండా పోయింది. పార్టీ పరంగా తమను పట్టించుకునే వారు కూడా లేకపోవడంతో ఇతర పార్టీల వైపు టీడీపీ శ్రేణులు చూస్తున్న పరిస్థితి నెలకొంది. టీడీపీ పరిస్థితిని ఆసరాగా చేసుకుని జిల్లా, మండల పరిషత్ అధ్యక్ష పదవులపై టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది -
జి.కొండూరులో వైఎస్సార్ సీపీ హవా
జి.కొండూరు మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హవా నడుస్తోంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు ఈ విషయాన్ని తేట తెల్లం చేస్తున్నాయి. దివంగత శాసనసభ్యుడు చనమోలు వెంకట్రావ్ సొంత మండలమైన జి.కొండూరు ఆది నుంచి కాంగ్రెస్ పార్టీకి మంచి పట్టుంది. ఇదే నేపధ్యంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి కూడా ఈ ప్రాంత అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. మహానేత మరణానంతరం నిలిచిపోయిన సంక్షేమ పథకాలు,పాలన తీరుపై అప్పటివరకు పార్టీకి వెన్నుదన్నులా నిలిచిన కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తల్లో నిస్తేజం నెలకొంది. ఈ క్రమంలో మహానేత వైఎస్ అమలు చేసిన సంక్షేమ పథకాలు అమలు ఒక్క వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డికే సాధ్యమవుతాయని భావించిన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు వేలాది సంఖ్యలో ఆయా పార్టీలను వీడి వైఎస్సార్సీపీలో చేరారు. గ్రామ పంచాయతీ ఎన్నికల సమయానికి కొంత గందరగోళ పరిస్థితులు ఉన్న పార్టీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సమయానికి పూర్తి స్థాయిలో బలోపేతంగా మారింది. దీనికి తోడు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉన్న సీనియర్ నాయకులు మాజీ ఎంపీపీ పులిపాక థామస్, మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు దగ్గుమళ్లి భారతి, కోణా భిక్షమేశ్వరరావు, వెల్లటూరు గ్రామ మాజీ సర్పంచి జీఎన్ఎం.కృష్ణ ప్రసాద్,దేశం సుధాకర్ రెడ్డి,ఈలప్రోలు వెంకటేశ్వరరావు,పామర్తి శ్రీనివాసరావు తదితరులు వైఎస్సార్ సీపీలో చేరడంతో పార్టీకి అదనపు బలం పెరిగింది. దీంతోపాటు ముందు నుంచి పార్టీలో కొనసాగుతున్న జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు పామర్తి వెంకటనారాయణ,వేమిరెడ్డి వెంకటరెడ్డి,వేమిరెడ్డి పుల్లారెడ్డి,సంఘి రెడ్డి,చెరుకూరి శ్రీనివాసరావు లతో పాటు కొత్తగా వచ్చిన పార్టీ నాయకులు సమన్వయంతో పార్టీని ముందుకు తీసుకెళ్లారు. దీంతో నియోజకవర్గంలో మిగిలిన మండలాలకు భిన్నంగా ఎంపీటీసీ,జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు ఏకపక్షమయ్యాయి. ఇదే తరహాలో రానున్న అసెంబ్లీ ,పార్లమెంట్ ఫలితాలు కూడ వస్తాయని పార్టీ అభిమానులు భావిస్తున్నారు. అత్యధిక స్థానాలు కైవసం మండలంలో మొత్తం 16 ఎంపీటీసీ సెగ్మెంట్లు ఉండగా అందులో 11 స్థానాల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు విజయ దుందుభి మోగించారు. ఎంపీపీ అభ్యర్థిగా జి.కొండూరు-2 స్థానం నుంచి బరిలో ఉన్న వేములకొండ సాంబశివరావు సమీప టీడీపీ అభ్యర్థి ఉయ్యూరు నరసింహారావుపై 395 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మండల పరిషత్‌లు వచ్చినప్పటినుంచి ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపునా పులిపాక థామస్ రెండు సార్లు,లంకా శ్రీ గౌరి దేవి ఒక సారి కొనసాగారు. తెలుగుదేశం పార్టీ నుంచి ఉయ్యూరు నరసింహారావు ఒక సారి మాత్రమే ఎంపీపీగా బాధ్యతలు చేపట్టారు. జెడ్పీటీసీ అభ్యర్థి బ్రహ్మయ్యకు అత్యధిక మెజార్టీ జి.కొండూరు మండల జెడ్పీటీసీగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో ఉన్న కాజా బ్రహ్మయ్య కూడా అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. నియోజకవర్గంలో ఉన్న మిగిలిన మండలాల్లో జెడ్పీటీసీలు టీడీపీ కైవసం చేసుకున్నా జి.కొండూరులో మాత్రం వైఎస్సాఆర్ సీపీ హవా కొనసాగింది. పార్టీ అభ్యర్థి కాజా బ్రహ్మయ్య సమీప టీడీపీ అభ్యర్థి ఆలూరి రాజబాబుపై 951 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కాజా బ్రహ్మయ్య సతీమణి కాజా సంధ్యారాణి గడిచిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచిగా కొన సాగి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారు. దీంతోపాటు చనమోలు అనుయాయుడిగా కొనసాగిన కాజా బ్రహ్మయ్య మండలంలో ఉన్న నాయకులు,కార్యకర్తలతో సంబంధాలు ఉండడం,గ్రామాల్లో వైఎస్సార్ సీపీకి ఉన్న ఆదరణ కలిసిరావడంతో కాజా గెలుపు సునాయాసమైంది. ఇప్పటివరకు మండల జెడ్పీటీసీ పదవుల్లో టీడీపీ నుంచి దొప్పల మురళి ఒకసారి, కాంగ్రెస్ పార్టీ నుంచి దగ్గుమళ్లి భారతి ఒకసారి, జోగి వెంకటేశ్వరరావు ఒకసారి కొనసాగారు. ఎంపీటీసీ విజేతలు వీరే జి.కొండూరు-2 స్థానం నుంచి ఎంపీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న వేములకొండ సాంబశివరావు, గంగినేని నుంచి పిల్లి వెంకటేశ్వరరావు,చెరువుమాధవరం నుంచి మండల సుమలత, జి.కొండూరు-1 నుంచి వేములకొండ శైలజ, చెవుటూరు నుంచి పుప్పాల సుబ్బారావు, వెంకటాపురం నుంచి యరమల విజయశ్రీ, వెల్లటూరు-1 నుంచి చింతపల్లి పద్మావతి, వెల్లటూరు-2 నుంచి మారాసి కోటయ్య, కందులపాడు నుంచి వేములకొండ తిరుపతి రావు, వెలగలేరు నుంచి పోలుదాసు వెంకటలక్ష్మీ, కవులూరు-2 నుంచి గుణదల వెంకటేశ్వరరావు విజయం సాధించారు. -
నేడే.. పల్లె ఫలితాలు
మూడు కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ఒక టేబుల్లో ఓ ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు ఒక్కో రూములో ఆరు టేబుళ్లు మధ్యాహ్నంలోపు ఎంపీటీసీ ఫలితాలు సాయంత్రానికల్లా జెడ్పీటీసీ ఫలితాలు కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి ఏర్పాట్లను పరిశీలించిన జెడ్పీ సీఈఓ మాల్యాద్రి కడప : ప్రతిష్టాత్మకంగా సాగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఫలితాలపై ఉత్కంఠతకు మంగళవారంతో తెరపడనుంది. జిల్లాలో రెండు విడతల్లో ఏప్రిల్ 6, 11 తేదీల్లో 535 ఎంపీటీసీ స్థానాలు, 50 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఎంపీటీసీ బరిలో 1695 మంది అభ్యర్థులు, జెడ్పీటీసీ బరిలో 237 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇప్పటికే 24 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. రాజంపేట డివిజన్‌కు సంబంధించి శ్రీనివాస ఇంజనీరింగ్ కళాశాలలో, కడప డివిజన్ లెక్కింపు కేశవరెడ్డి స్కూలులో, జమ్మలమడుగు డివిజన్ లెక్కింపు మదీనా ఇంజనీరింగ్ కళాశాలలో జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. 50 మండలాలకు సంబంధించి మూడు కౌంటింగ్ కేంద్రాలలో 50 రూములలో ఒక్కొక్క రూముకు ఆరు టేబుళ్లు చొప్పున ఏర్పాటు చేశారు. ఒక్కొక్క ఎంపీటీసీ ఫలితాల లెక్కింపును ఒక్కో టేబుల్‌పైన చేపడతారు. జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాల లెక్కింపులో ఒక్కో రౌండ్‌కు వెయ్యి ఓట్ల చొప్పున లెక్కిస్తారు. ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు మధ్యాహ్నం లోపే వెల్లడి కానున్నాయి. జెడ్పీటీసీ ఫలితాలు సాయంత్రంలోగా రానున్నాయి. మొదటగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు చేపడతారు. కౌంటింగ్ కేంద్రాలకు ఆరు గంటల్లోపే బాక్సుల తరలింపు కొత్త కలెక్టరేట్లోని స్ట్రాంగ్ రూములో ఎంపీటీసీ, జెడ్పీటీసీ బ్యాలెట్ పత్రాలను భద్రపరిచారు. వీటిని ఆయా మండలాల తహశీల్దార్లు, ఎంపీడీఓలు, ఆర్వోల నేతృత్వంలో ఉదయం 3 నుంచి ఆర్టీసీ డీజీటీల ద్వారా కౌంటింగ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక స్ట్రాంగ్ రూములకు చేరుస్తారు. వీటిని తరలించే సమయంలో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. కౌంటింగ్ కేంద్రంలోకి కౌంటింగ్ ఏజెంటుతోపాటు అభ్యర్థినిమాత్రమే అనుమతిస్తారు. అభ్యర్థి ఆర్వో వద్ద ఉంటే కౌంటింగ్ సరళిని ఏజెంటు పరిశీలిస్తారు. ఒక్కో టేబుల్ వద్ద ఒక సూపర్‌వైజర్‌తోపాటు ముగ్గురు కౌంటింగ్ అసిస్టెంట్లను ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం మీద ఒక్కొక్క కౌంటింగ్ కేంద్రం వద్ద 400 మందికి పైగా పోలీసులను మోహరిస్తున్నారు. 2200 మందికి పైగా సిబ్బంది ఓట్ల లెక్కింపులో పాల్గొంటున్నారు. కడప డివిజన్‌కు సంబంధించి కౌంటింగ్ కేంద్రంలో బందోబస్తు ఏర్పాట్లను కడప డీఎస్పీ రాజేశ్వరరెడ్డి పరిశీలించారు. కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించిన జెడ్పీ సీఈఓ కౌంటింగ్ కేంద్రంలో ఓట్ల లెక్కింపునకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులోభాగంగా జెడ్పీ సీఈఓ మాల్యాద్రి తమ సిబ్బందితో మూడు కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించారు. లెక్కింపు సందర్బంగా సిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. సంబంధిత డీఎస్పీలతో బందోబస్తుపై చర్చించారు. పోలింగ్ కేంద్రం వద్ద ఏర్పాటుచేసిన వసతులపై సిబ్బందితో ఆరా తీశారు. కౌంటింగ్ రోజున ఓట్ల లెక్కింపును జిల్లా కలెక్టర్ కోన శశిధర్, ఎన్నికల పరిశీలకులు మురళీధర్‌రెడ్డి, బాల దిగంబర్, జేసీ రామారావు, ఏజేసీ సుదర్శన్‌రెడ్డితోపాటు సంబంధిత మూడు రెవెన్యూ డివిజన్ల అధికారులు, మండల స్పెషల్ ఆఫీసర్లు, ఆర్వోలు పర్యవేక్షిస్తారు. -
లెక్కల్లో పార్టీలు..!
సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడుతున్న తరుణంలో అభ్యర్థుల జాబితాపై ప్రధాన పార్టీలు చేస్తున్న కసరత్తు తుది దశకు చేరుకుంది.ఎంపికను పూర్తి చేసిన ప్రధాన పార్టీలు ఈ నెల నాలుగైదు తేదీల వరకు ఫైనల్ లిస్టును ప్రకటించి ...నామినేషన్ల దాఖలు చేసుకునే వెసులుబాటు కల్పించేందుకు తగిన ప్లానుతో ముందుకు సాగుతున్నాయి.అప్పటి వరకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ మొదటి విడత ఎన్నికలు ూడా పూర్తి కాగలవని భావిస్తున్నారు. ల్లాలోని రెండు లోక్‌సభ, 14 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల తుది జాబితాను సిద్ధం చేసిన కాంగ్రెస్ పార్టీ ఈ నెల 4 లేదా 5న అధికారికంగా ప్రకటించాని యోచిస్తోంది.సీపీఐతో సీట్ల సర్దుబాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కాంగ్రెస్ సంఖ్యాపరంగా సీట్లను ఫైనల్ చేసినప్పటికీ నియోజక వర్గాల చిక్కు ముడి వీడక పోవటం వల్ల అధికారికంగా వెల్లడించలేక పోతున్నారు.ఒకటి, రెండు రోజుల్లో ఈ చిక్కముడి విడిపోగలదని ఇరు పార్టీలు భావిస్తున్నాయి.సీపీఐ మాత్రం సర్దుబాటులో భాగంగా నాగరుకర్నూల్ అసెంబ్లీ స్థానాన్ని ప్రతిప్రాదించినట్టుగా చెప్పుతుండగా...ఈ జిల్లానుంచి ఏమి ఉండక పోవచ్చునని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదిలా ఉండగా టీడీపీ, బీజెపీ ల మధ్య కూడా సీట్ల సర్దుబాటు వ్యవహారం ఎటూ తేలడం లేదు. ఒక వేళ జరిగితే బీజెపీ జిల్లా నుంచి మహబూబ్‌నగర్ లోక్‌సభతో పాటు మహబూబ్‌నగర్,నాగరుకర్నూల్,నారాయణపేట,కల్వకుర్తి, కొడంగల్, మక్తల్ అసెంబ్లీ స్థానాలు ప్రతి ప్రాదించినట్టు తెలుస్తోంది. జిల్లా విషయానికి వస్తే ఈ స్థానాలపైనే చర్చజరుగుతున్నట్లు విశ్వనీయ వర్గాల సమాచారం.టీడీపీ కూడా ఈ సీట్లల్లో ఒకటి, రెండు అటో,ఇటో అన్నరీతిలో చర్చలు సాగిస్తున్నట్టు భోగట్టా. సీపీఎం అభ్యర్థిగా జబ్బార్..: సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తున్న సీపీఎం ...జిల్లాలోని కొల్లాపూర్ అసెంబ్లీ నియోజక వర్గ అభ్యర్థిగా జబ్బార్ ను ఆ పార్టీ తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మంగళవారం ప్రకటించారు.కొల్లాపూర్ సీపీఎం డివిజన్ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న జబ్బార్ పానుగల్ మండలం రేమొద్దుల గ్రామ సర్పంచిగా పనిచేశారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం రైతు సంఘం జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. -
331 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం
హైదరాబాద్: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణ సోమవారం ముగిసింది. బరిలో మిగిలిన అభ్యర్థుల సంఖ్యను ఎన్నికల సంఘం బుధవారం తేల్చింది. 1,096 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ జారీ కాగా.. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటలో ఒక స్థానం ఏకగ్రీవం అరుు్యంది. ఖమ్మం జిల్లాలోని కుక్కనూరు, వేలేర్పాడు స్థానాలకు ఎవరూ నామినేషన్లు దాఖలు చేయలేదు. దీంతో 1,093 స్థానాల్లో పోటీ జరుగ నుంది. ఈ స్థానాలకు 5,034 మంది పోటీ పడుతున్నారు. 16,589 ఎంపీటీసీ స్థానాలకు షెడ్యూల్ విడుదల చేయగా, అందులో 331 సీట్లల్లో అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్వతంత్రులు 105, టీడీపీ 102, వైఎస్సార్ కాంగ్రెస్ 70, కాంగ్రెస్ 31, టీఆర్ఎస్ 15, సీపీఎం 4, సీపీఐ 2, బీజే పీ, బీఎస్పీ ఒక్కో స్థానంలో ఏకగ్రీవమయ్యూరుు. ఖమ్మం జిల్లా కుక్కనూరులో 8, వేలేర్పాడులో 7 ఎంపీటీసీ స్థానాలకు ఎవరూ నామినేషన్లు వేయలేదు. మిగిలిన 16,243 స్థానాలకు 52,568 మంది రంగంలో ఉన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు రంగారెడ్డి జిల్లాలోని 21 పంచాయతీలు, విశాఖపట్నం జిల్లాలోని ఐదు గ్రామ పంచాయతీలకు ఎన్నికల నిర్వహణకు మంగళవారం నోటిఫికేషన్ జారీ చేశారు. వీటికి ఏప్రిల్ 13వ తేదీన ఎన్నికలు నిర్వహిస్తారు. -
‘పరిషత్తు’ ఎన్నికల వాయిదాపై మీ వైఖరేమిటి?
కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలకు హైకోర్టు ఆదేశం హైదరాబాద్:సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యే వరకు పురపాలక, జెడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికలను వాయిదా వేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై వైఖరి ఏమిటో తెలియచేయాలని హైకోర్టు కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలను ఆదేశించింది.ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహనరావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పురపాలక, జెడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికల ఫలితాల ప్రభావం సార్వత్రిక ఎన్నికలపై ఉంటుందని, దీని వల్ల ఓటర్లు నిష్పాక్షికంగా ఓటు వేయలేరని, ఈ దృష్ట్యా పురపాలక, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను నిలుపుదల చేయాలని, లేదా కనీసం వాయిదా వేయాలని కోరుతూ వి.పవన్‌కుమార్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారించిన న్యాయమూర్తి... దాదాపు 45 రోజుల పాటు బ్యాలెట్ బాక్సులకు రక్షణ కల్పించడం సాధ్యమేనా? అని ఎన్నికల సంఘాలను ప్రశ్నించారు. దీనిపై వైఖరి ఏమిటో తెలియచేయాలని కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలను ఆదేశిస్తూ విచారణను వచ్చే వారానికి వాయిదా వేశారు. మున్సి‘పోల్స్’ ఫలితాలపై పిల్ : సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగిసేవరకు మునిసిపల్ ఎన్నికల ఫలితాలు నిలిపేసేలా ఉత్వర్వులివ్వాలని కోరుతూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. మునిసిపల్ ఎన్నికల ప్రభావం త్వరలో జరగబోయే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలపై ఉంటుందని, అందువల్ల మునిసిపల్ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి ప్రక్రియను చేపట్టకుండా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలంటూ నల్లగొండ జిల్లాకు చెందిన బుక్యా సైదా, నెల్లూరు జిల్లాకు చెందిన న్యాయవాదులు రమేష్‌రెడ్డి, వి.రమణారెడ్డి, హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది ఎం.శివారావు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని బుధవారం ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించనున్నది. -
ప్రాదేశిక పోరు
ప్రాదేశిక సమరానికి తెరలేచింది. సోమవారం జిల్లా పరిషత్ ఎన్నికలకు కలెక్టర్ టి.చిరంజీవులు అధికారికంగా షెడ్యూల్ ప్రకటించనున్నారు. షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచే ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభిస్తారు. నామినేషన్ల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు పంచాయతీరాజ్ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. స్థానిక ఎన్నికల పోరుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. జిల్లావ్యాప్తంగా ఎంపీటీసీ 835, జెడ్పీటీసీ 59 స్థానాలకు సోమవారం నుంచి నామినేషన్లు స్వీక రిస్తారు. 20వ తేదీ నాటికి నామినేషన్ల గడువు పూర్తవుతుంది. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఎంపీటీసీ అభ్యర్థులు ఎంపీడీఓ కార్యాలయాల్లో, జెడ్పీటీసీ అభ్యర్థులు జిల్లా పరిషత్ కార్యాలయంలో నామినేషన్లు వేయాల్సి ఉంటుంది. జెడ్పీటీసీ అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు వీలుగా జెడ్పీ కార్యాలయంలో 5 ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. జిల్లాస్థాయి అధికారులను మండల ఎన్నికల రిటర్నింగ్ అధికారులుగాను, అసిస్టెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారులుగా ఎంపీడీఓలు, తహసీల్దార్లు వ్యవహరిస్తారు. అదే విధంగా జెడ్పీటీసీలకు ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా జిల్లా పరిషత్ సీఈఓ దామోదర్‌రెడ్డి, అసిస్టెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా సీపీఓ డిప్యూటీ డెరైక్టర్ మోహన్‌రావు వ్యవహరిస్తారు. అభ్యర్థుల ఎంపికపై మల్లగుల్లాలు... సార్వత్రిక ఎన్నికలకు ముందు జరుగుతున్న జిల్లా పరిషత్ ఎన్నికలు రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. అభ్యర్థుల ఎంపిక మొదలు, వారిని గెలిపించుకునే బాధ్యత వరకు రాజకీయ పార్టీల మీదనే ఆధారపడి ఉంది. దీంతో పార్టీ జెండా మోసిన వారిని కాకుండా ఆర్థిక, అంగబలం ఉన్న అభ్యర్థులనే బరిలో నిలబడితే తమ పని మరింత సులువుగా ఉంటుందని ప్రధాన పార్టీలు అంచనా వేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థులు గెలిపించుకోన్నట్లయితే త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో తాము గట్టెక్కడం అసాధ్యమన్న భావన వారిలో ఆందోళన రేకెత్తిస్తోంది. స్థానికంగా కలిసొచ్చే పార్టీలతో పొత్తు పెట్టుకుంటూనే సాధారణ ఎన్నికల్లో లాభసాటిగా ఉంటుందని ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైన సరే కాంగ్రెస్‌ను మట్టికరిపించాలన్న ఉద్దేశంతో వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, సీపీఎం, సీపీఐ వంటి పార్టీలు పొత్తులపై విశ్లేషణ చేస్తున్నాయి. సోమవారం నుంచి నామినేషన్ల జాతర ప్రారంభం కానున్నప్పటికీ రాజకీయ పార్టీలో అభ్యర్థుల ఎంపిక ఏటూ తేలకపోవడం దీనికి అద్దం పడుతోంది. నామినేషన్లు వేసే అభ్యర్థులు పాటించాల్సినవి... జెడ్పీటీసీ స్థానాలకు బీసీ/ఎస్సీ/ఎస్టీ/బీసీ ఈ (ముస్లింమైనార్టీలు)లు రూ.2,500, ఇతరులు 5,000 ఎంపీటీసీ స్థానాలకు బీసీ/ఎస్సీ/ఎస్టీ/బీసీఈ రూ.1250, ఇతరులు రూ.2500 జనరల్ స్థానాల్లో పోటీ చే సే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థుల కూడా ఇదే రాయితీ వర్తిస్తుంది రిజర్వేషన్లు వర్తింపచేసుకునే అభ్యర్థులు తహసీల్దారు/మీ సేవా కేంద్రాల నుంచి కుల ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా కలిగి ఉండాలి. బీసీ‘ఈ’ అభ్యర్థులు కూడా కుల ధ్రువీకరణ సమర్పించాలి. అంగన్వాడీ వర్కర్లు, ప్రభుత్వ నుంచి గౌరవ వేతనం పొందుతున్న వారు, ఉద్యోగులు ఎన్నికల్లో పోటీకి అనర్హులు. రేషన్‌డీలర్లు, కోఆపరేటివ్ సొసైటీలో ఉన్నవారు పోటీకి అర్హులు. ఎంపీటీసీ అభ్యర్థులు పంచాయతీ పరిధిలో ఎక్కడైనా ఓటు హక్కు కలిగి ఉండాలి. అయితే వారిని ప్రతిపాదించే వారు మాత్రం సంబంధిత ఎంపీటీసీ పరిధిలో ఓటరు అయి ఉండాలి. ఉదాహరణకు ఎంపీటీసీ 1 వ స్థానంలో పోటీ చేసే అభ్యర్థికి పంచాయతీ పరిధిలో ఎక్కడైనా ఓటు ఉండొచ్చుగానీ, ప్రతిపాదించే వ్యక్తికి మాత్రం 1వ స్థానంలో ఓటు హక్కు ఉన్నవారే బలపర్చాలి. జెడ్పీటీసీ అభ్యర్థులు జిల్లాలో ఎక్కడైనా ఓటు హక్కు కలిగి ఉండాలి. మున్సిపాలిటీలు, నగర పంచాయతీలో ఓటు హక్కు ఉన్న వారు పోటీకి అనర్హులు. బలపర్చే అభ్యర్థికి స్థానిక మండలంలోనే ఓటు హక్కు ఉండాలి. నామినేషన్ వేయడానికి ముగ్గురు వ్యక్తులను మాత్రమే లోపలికి అనుమతిస్తారు. అభ్యర్థి రాని పక్షంలో ప్రతిపాదించే వ్యక్తులకు కూడా ఇదే వర్తిస్తుంది. 30.5.1995కు పూర్వం ఇద్దరు సంతానానికి పైబడి ఉన్నవారు పోటీకి అర్హులు. ఆ తర్వాత ఇద్దరికి మించి సంతానం ఉన్నవారు పోటీకి అనర్హులు. ముగ్గురు సంతానంలో ఒకరు మరణించినట్లయితే అలాంటి అభ్యర్థులు పోటీకి అర్హులు. ముగ్గురు సంతానంలో ఒకరిని ఇతరులకు దత్తత ఇచ్చినప్పటికి కూడా వారు పోటీకి అనర్హులు. ఇద్దరు లేదా ముగ్గురు భార్యలు కలిగి ఉండి ఒక భార్యకు ఒకరు, మరొక భార్యకు ఇద్దరు సంతానం ఉన్న కుటుంబాల్లో పోటీ చేసేందుకు భార్యలకు అవకాశం ఉంటుంది కానీ, భర్తలకు పోటీ అర్హత ఉండదు. -
పాదేశికాలకు రేపటి నుంచి నామినేషన్లు
ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్ల ప్రక్రియ ఈనెల 17వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈమేరకు నామినేషన్ల స్వీకరణకు జెడ్పీ అధికారులు కసరత్తు పూర్తిచేశారు. ఎన్నికల నిర్వహణ కోసం నియమించిన సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ఎన్నికల్లో 19.56 లక్షల మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం 790 ఎంపీటీసీ స్థానాలు, 56 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జర గనున్నాయి. జిల్లాలో ఓటర్లు 19,56,304 మంది ఉండగా వీరిలో మహిళలు 9,78,920 మంది, పురుషులు 9,77,384 మంది ఉన్నారు. 790 ఎంపీటీసీ స్థానాల్లో 384 స్థానాలను మహిళలకు రిజర్వ్ చేశారు. 56 ఎంపీపీ స్థానాలకుగాను 27 స్థానాలను మహిళలకు రిజర్వు చేశారు. 56 జెడ్పీటీసీ స్థానాల్లో 28 స్థానాలు మహిళలకు కేటాయించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పార్టీపరంగా జరుగుతుండడంతో గ్రామస్థాయిలో ఎన్నికల వేడి పుంజుకుంది. దీంతో నామినేషన్ల కోసం పార్టీ నాయకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. ఈనెల 20వ తేదీతో నామినేషన్ల ప్రక్రియ ముగుస్తుంది. ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్లను స్వీకరించేందుకుగాను అన్ని మండల కార్యాలయాల్లో ఎన్నికల రిటర్నింగ్ అధికారిని, మరో ఇద్దరు అసిస్టెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారులను నియమించారు. జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి జాయింట్ కలెక్టర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగాను, మరో ఏడుగురు జిల్లా స్థాయి అధికారులను అసిస్టెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారులుగా నియమించారు. జెడ్పీటీసీ నామినేషన్ల స్వీకరణకుగాను జిల్లా పరిషత్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఆరు కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో కౌంటర్లో పది మండలాల చొప్పున నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్ల పరిశీలన ఈనెల 21న ఉదయం 11 గంటల నుంచి ప్రారంభమవుతుంది. ఈనెల 22న తిరస్కరించిన నామినేషన్లకు సంబంధించి అభ్యంతరాలను ఆర్డీవోలకు దాఖలు చేసుకోవచ్చు. వాటిపై తుది నిర్ణయాన్ని 23వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా అధికారులు ప్రకటిస్తారు. 24వ తేదీ సాయంత్రం 3 గంటల్లోగా నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తికావాలి. అనంతరం బరిలో ఉన్న అభ్యర్థుల వివరాలను, వారికి కేటాయించిన గుర్తులను ఎన్నికల అధికారులు ప్రకటిస్తారు. 2587 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. ఎన్నికలు ఏప్రిల్ 6న జరుగుతాయి. కౌంటింగ్ 8వ తేదీ చేపట్టి పూర్తికాగానే ఫలితాలు ప్రకటిస్తారు. -
పల్లె వేడెక్కింది
సార్వత్రిక ఎన్నికలలో ఎలా గట్టెక్కేదని ప్రధాన పార్టీల నేతలు ఆందోళన చెందుతుంటే, పురపాలక ఎన్నికలు, ఆపై వచ్చిన మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు వారికి తల నొప్పి తె చ్చిపెడుతున్నాయి. జిల్లాలో మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు మూడు మున్సిపాలిటీలలో ఎన్నికలు జరుగనున్నాయి. వాటికి సంబంధించి నామినేషన్ల ప్ర క్రియ ముగిసింది. అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేయడంతో ఎవరికి బీ ఫారం ఇవ్వాల న్న దానిపై ఇంకా నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇదే సమయంలో నిన్నమొన్నటి వరకు పరిషత్ ఎన్నిక లు వాయిదా పడుతాయనుకున్న వారికి ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయంతో కొత్త టెన్షన్ మొదలైంది. ఎన్నికలకు సిద్ధం జిల్లాలో 36 మండలాలున్నాయి. ఆయా మండలాలకు సంబంధించి ఎంపీటీసీలు, జడ్పీటీసీలకు ఎన్నికలు వచ్చే నెల 6న జరుగనున్నాయి. నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 17 నుంచే మొదలుకానుంది. ఈ నేపథ్యంలో టిక్కెట్ల లొల్లి మొదలైంది. అన్ని పార్టీల్లోనూ టికెట్ నాకంటే నాకంటూ పోటీపడుతున్నారు. దీంతో ఎవరిని అభ్యర్థిగా ప్రకటించాలో తెలియక ఆయా పార్టీల నేతలు తలలుపట్టుకోవలసి వస్తోంది. సార్వత్రిక ఎన్నికల ముందు ఈ ఎన్నికలు రావడంతో ఎవరిని కాదన్నా తమకు ఎక్కడ నష్టం జరుగుతుందోనని వారు ఆందోళన చెందుతున్నారు. అభ్యర్థిత్వాల ఎంపిక సమయంలో జాగ్రత్తలు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒక్కో చోట ఒక పార్టీ నుం చి నలుగురైదుగురు టిక్కెట్ రేసులో నిలుస్తున్నారు. దీంతో అందరినీ సముదాయించడం తలకుమించిన భారంగా మారింది. పార్టీల టిక్కెట్లు ఆశిస్తున్న నేతలు పది మ ందిని వెంటేసుకుని ముఖ్య నాయకుల వద్దకు తరలివస్తుండడంతో నేతల ఇండ్లు సందడిగా మారుతున్నాయి. అప్పుడే సిట్టింగులు ఎన్నికలలో పోటీ పడాలనుకుంటున్నవారు గ్రామాలలో అప్పుడే సిట్టింగులు ఏర్పాటు చేసి అందరినీ కలుపుకుపోయే ప్రయత్నాలు చేస్తున్నారు. టికెట్ వస్తుందన్న నమ్మకం ఉన్నవారు మాత్రం ఏకంగా ప్రచారాన్ని మొదలుపెట్టారు. ముఖ్యంగా కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీల నుంచి టికెట్లు ఆశిస్తున్నవారు ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. కామారెడ్డి నియోజక వర్గంలో రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉన్న భిక్కనూరు మండలంలో ఓ పార్టీకి చెందిన నాయకుడు జడ్పీటీసీగా బరిలో నిలవడానికి సిద్ధమై తనకు సంబంధించిన భూమిని అమ్మకానికి పెట్టినట్టు తెలిసింది . మరొకరు జడ్పీటీసీగా పోటీ చేస్తే ఎలా ఉంటుందని తెలుసుకునేందుకు గాను తన స్నేహితుల తో విందు ఏర్పాటు చేయగా అందరూ మద్దతు తెలిపి రూ. 20 లక్షల వరకు సహాయం అందిస్తామని ముందుకు వచ్చినట్టు సమాచారం. ఎస్సీ మహిళకు రిజర్వు అయిన మాచా రెడ్డి జడ్పీటీసీ స్థానంలో తమ కుటుంబ సభ్యులను పోటీకి నిలపడానికి పలువురు నాయకులు సిద్ధమయ్యారు. ముఖ్యంగా కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల్లో టికెట్ ఆశించే వారు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. పోటీ ఎక్కువే పార్టీలో ముగ్గురు, టీఆర్ఎస్లో ఇద్దరు టిక్కెట్ రేసులో నిలిచారు. ఎవరి ప్రయత్నాల్లో వారు మునిగిపోయారు. దోమకొండ జడ్పీటీసీ స్థానం కూడా జనరల్ కావడంతో కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీ ల్లో తీవ్ర పోటీ నెలకొంది. టీఆర్ఎస్ నుంచి నలుగురైదుగురు పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ నుంచి కూడా అదే స్థాయిలో పోటీపడుతున్నట్టు తెలుస్తోంది. ఎంపీటీసీ సభ్యులుగా పోటీ చేయడానికి అన్ని చోట్లా తీవ్ర పోటీ కనిపిస్తోంది. తనకు టిక్కెట్ ఇవ్వకుంటే ఇతర పార్టీల నుంచి పోటీచేస్తామని కొందరు, ఇండిపెండెంట్‌గా నిలిచి తన సత్తా చూపుతామనేవాళ్లు కొందరు కనిపిస్తున్నారు. మండల, జిల్లా పరిషత్ ఎన్నికలేమో గాని పల్లెల్లో మాత్రం రాజకీయాలు వేడెక్కాయి. పార్టీల ఫిరాయింపులు కూడా పెరిగాయి. ఎవరు ఏ పార్టీలోకి వెళుతున్నారో, ఏ పార్టీలో ఉన్నారో కూడా తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. నిన్నొక పార్టీలోకి వెళ్లిన నేత, నేడొక పార్టీ గడప తొక్కుతున్నాడు. -
సునామీ వచ్చింది.
కడప: ఎన్నికల సునామీ వచ్చింది. వారం రోజుల్లో మూడు ఎన్నికలకు నోటిఫికేషన్లు వెలువడ్డాయి.ఈ పరిణామం రాజకీయ పార్టీ నేతలకు ముచ్చెమటలు పట్టిస్తోంది. అధికారులకు ఎన్నికలు అగ్నిపరీక్షగా మారాయి. ఈ ప్రభావం అన్ని వర్గాలపై పడుతోంది. పరీక్షల సీజన్లో వచ్చిన సుదీర్ఘ ఎన్నికల షెడ్యూల్ తమ పిల్లల భవిషత్తును ఎక్కడ దెబ్బతీస్తోందనే అందోళన తల్లి దండ్రుల్లో మొదలైంది. ఎన్నికల గండం నుంచి ఎలా గట్టెక్కాలని రాజకీయ పార్టీ నేతలు, అధికారులు అందోళన చెందుతున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకుసంబంధించి ఎన్నికల కమిషన్ సోమవారం షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఎన్నికలను వాయిదా వేయాలని సుప్రీం కోర్టులో వేసిన పిటీషన్లు 12వ తే దీకి వాయిదా పడ్డాయి. దీంతోఎన్నికలు తప్పక జరిగే అవకాశం ఉందని పరీశీలకులు పేర్కొంటున్నారు. ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లలో అధికారులు ఇప్పటికే నిమగ్నమయ్యారు. ఓటర్ల జాబితాలను సిద్ధం చేశారు. పోలింగ్ సిబ్బంది నియామకాలపై కసరత్తు చేస్తున్నారు. పోలింగ్ స్టేషన్ల తుది జాబితాను సైతం ఈ నెల 18వ తేదీ నాటికి విడుదల చేసేలా షెడ్యూల్ ఖరారైంది ఎంపీటీసీ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు రూ. 1250, జనరల్ అభ్యర్థులకు రూ. 2,500. జెడ్పీటీసీలకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రూ. 2,500 జనరల్ అభ్యర్ధులకు రూ. 5000 డిపాజిట్‌గా నిర్ణయించారు. వరుస ఎన్నికలతో ఉక్కిరి బిక్కిరి! మూడేళ్లుగా ఎన్నికలు ఎప్పడెప్పడా అని ఎదురు చూసిన రాజకీయ పార్టీ నేతలకు కోలుకోలేని దెబ్బతగిలింది. ఊహించిన విధంగా మున్సిపల్, సార్వత్రిక, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఒకే సారి రావడంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఎన్నికల గండం నుంచి ఎలా గట్టెక్కాలా అని తలలు పట్టుకుంటున్నారు. అభ్యర్థుల ఎంపిక, ప్రచారం ప్రధాన రాజకీయ పార్టీలకు కత్తి మీద సాముగా మారాయి. సార్వత్రిక ఎన్నికల్లో గట్టెక్కాలంటే మున్సిపల్,ఎంపీటీసీ,జెడ్పీటీసీ ఎన్నికలు కీలకం కావడంతో ప్రధానంగా అసెంబ్లీ ,లోక్‌సభ అభ్యర్థులు వాటిపై దృష్టి సారించారు. కలవరపడుతున్న ఉద్యోగులు ఓ ఎన్నిక నిర్వహించడమంటేనే జిల్లా యంత్రాంగం కంటిమీద కునుకు లేకుండా పని చేయాల్సి ఉంటుంది. మూడు ఎన్నికలు ఎలా నిర్వహించాలని ఉద్యోగులు అందోళన చెందుతున్నారు. ఎన్నికల నిర్వహణలో కీలకం కావడంతో కలెక్టరేట్లో ఉద్యోగులు క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. అధికారుల నుంచి ఫోన్లు, వీడియో కాన్ఫరెన్స్‌లు, పోలింగ్ సిబ్బంది ఏర్పాట్ల నియామకంలో ఊపిరి సలపనంత బిజీబిజీ అయ్యారు. ఈ మూడు నెలలపాటు ఎలాంటి వ్యక్తిగత పనులు చేసుకునే అవకాశం లేదని, విద్యార్థులకు పరీక్షాకాలం కావడంతో పిల్లల చదువులపై దృష్టి సారించే అవకాశం లేకుండా పోతోందని ‘సాక్షి’తో ఓ అధికారి పేర్కొన్నారు. కనీసం మాట్లాడే అవకాశం కూడా లేదని వాపోయారు. మొత్తం మీద ఈ పరిణామం ఉద్యోగులను కలవరపెడుతోంది -
‘లోకల్’ ఫైట్..
ఇప్పటివరకు ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో ఒక్కసారిగా ఎన్నికల వేడి పుట్టింది. నాలుగేళ్లుగా ఖాళీగా ఉన్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ జారీ చేయడమే ఇందుకు కారణం. సార్వత్రిక ఎన్నికలకు ముందే స్థానిక సంస్థల షెడ్యూల్ జారీ కావడంతో రాజకీయ నాయకులతోపాటు అధికారులు కూడా తలలు పట్టుకుంటున్నారు. తక్కువ సమయంలో ఎన్నికల నిర్వహణ వీరికి సవాల్‌గా మారింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మునిసిపల్, సాధారణ ఎన్నికలు ఒకేసారి వచ్చిన దాఖలాలు ఇప్పటివరకు లేవు. సుప్రీంకోర్టు జోక్యంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్థానిక ఎన్నికలను నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర ఎన్నికల అధికారి రమాకాంత్‌రెడ్డి సోమవారంఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు. జిల్లాల వారీగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్‌ను ఈనెల 17వ తేదీన జారీ చేయనున్నట్లు వెల్లడించారు. జెడ్పీలో జెడ్పీటీసీ నామినేషన్ల స్వీకరణ జిల్లాలోని 50 మండలాల్లో జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యులుగా పోటి చేసే అభ్యర్థుల నామినేషన్లను జిల్లా పరిషత్ కాార్యాలయంలో స్వీకరించనున్నారు. రెవెన్యూ డివిజన్ల వారీగా జిల్లాపరిషత్‌లో నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం ఎస్డీసీ, ఆర్డీఓ కేడర్ అధికారులను నియమించనున్నారు. మండల కార్యాలయాల్లో ఎంపీటీసీల నామినేషన్లు... మండల ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులుగా పోటి చేసే అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణకు ఆయా మండల పరిషత్ కార్యాలయాల్లో స్వీకరణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఆయా మండల ప్రత్యేక అధికారులే ఆర్‌ఓలుగా ఈ నామినేషన్లను స్వీకరించనున్నారు. ఆర్ఓలు, ఏఆర్ఓ నియామకానికి కసరత్తు మండల పరిషత్ కార్యాలయాల్లో ఎంపీటీసీల నుంచి నామినేషన్లు స్వీకరించడమే కాకుండా ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ తదితర కార్యక్రమాలు నిర్వహించేందుకు మండల రిటర్నింగ్ అధికారులు (ఆర్ఓ), అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ (ఏఆర్ఓ) నియామకానికి జిల్లా పరిషత్ ఎలక్షన్ విభాగం కసరత్తు ప్రారంభించింది. ఆయా మండలాలకు చెందిన స్పెషల్ ఆఫీసర్లను రిటర్నింగ్ అధికారులుగా, తహసీల్దార్, ఎంపీడీఓలను ఏఆర్ఓ (సహాయక రిటర్నింగ్ అధికారి)లుగా నియమించనున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్. మార్చి 17 : జిల్లాల వారీగా నోటిఫికేషన్ జారీ, ఓటర్ల జాబితా ప్రద ర్శన మార్చి 17 : నామినేషన్ల స్వీకరణ ప్రారంభం మార్చి 20 : నామినేషన్ల స్వీకరణకు తుది గడువు మార్చి 21 : నామినేషన్ల స్క్రూటినీ, తిరస్కరణ మార్చి 22 : తిరస్కరణ నామినేషన్లపై అప్పీళ్ల స్వీకరణ మార్చి 23 : అప్పీళ్ల పరిష్కారం మార్చి 24 : నామినేషన్ల ఉపసంహరణ (మ. 3 గంటల లోపు), బరిలో ఉన్న అభ్యర్థుల జాబితా ప్రదర్శన ఏప్రిల్ 6 : పోలింగ్ (ఉ. 7-సా. 5గం.) ఏప్రిల్ 7 : రీపోలింగ్ (అవసరముంటే) ఏప్రిల్ 8 : ఓట్ల లెక్కింపు (ఉ. 8గం.కు షురూ), ఫలితాల ప్రకటన -
15 మండలాలు మహిళలకే
మండలాలవారీగా రిజర్వేషన్లు ఇలా..గిరిజనతెగలు (ఎస్టీ): గండేడ్ (మహిళ), ధారూరు, యాచారం దళితవర్గాలు(ఎస్సీ): దోమ, తాండూరు (మహిళ), పరిగి (మహిళ), మహేశ్వరం,కీసర, శంకర్పల్లి, పెద్దేముల్ (మహిళ) వెనుకబడిన తరగతులు (బీసీ): శామీర్‌పేట, యాలా ల, హయత్‌నగర్ (మహిళ), మొయినాబాద్, శంషాబాద్, షాబాద్ (మహిళ), మేడ్చల్ (మహిళ), చేవెళ్ల, కందుకూరు, ఘట్కేసర్, కుత్బుల్లాపూర్ (మహిళ), మంచాల (మహిళ), బషీరాబాద్ (మహిళ) జనరల్: కుల్కచర్ల, రాజేంద్రనగర్, ఇబ్రహీం పట్నం, వికారాబాద్(మహిళ), మోమిన్‌పేట(మహిళ), నవాబ్‌పేట, మర్పల్లి(మహిళ), సరూర్‌నగర్, పూడూరు (మహిళ), బంట్వారం (మహిళ రంగారెడ్డి జిల్లా ‘ప్రాదేశిక’ ఎన్నికలకు మరో ముందడుగు పడింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీల రిజర్వేషన్లను జిల్లా యంత్రాంగం పూర్తి చేసింది. రెండురోజుల్లో ఎన్నికల షెడ్యూల్/నోటిఫికేషన్ విడుదల చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించిన నేపథ్యంలో శనివారం సెలవురోజు అయినప్పటికీ, అధికారులు రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియను కొలిక్కితెచ్చారు. జిల్లాలోని 33మండలాల జెడ్పీటీసీ, 614 మండల ప్రాదేశిక స్థానాల రిజర్వేషన్లను శుక్రవారం ఖరారు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మండల పరిషత్ అధ్యక్ష స్థానాల రిజర్వేషన్లను జిల్లా యంత్రాంగం ప్రకటించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 50శాతం రిజర్వేషన్ల మేరకు మొత్తం స్థానాల్లో 15మండలాలను మహిళలకు కేటాయించారు. గతంలో మూడు దఫాల రిజర్వేషన్లను పరిగణనలోకి తీసుకొని.. రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్లను వర్తింప చేశారు. మూడు మండలాలు గిరిజనులకు కేటాయించగా... ఇందులో ఒకటి మహిళలకు నిర్దేశించారు. ఏడు మండల పరిషత్‌లు దళితులకు నిర్దేశించారు. దీంట్లో మూడు స్థానాలు అతివలకు రిజర్వ్ చేశారు. 13 ఎంపీపీలు బీసీలకు కేటాయించగా...ఆరు సీట్లు మగువలకు నిర్దేశించారు. ఇక జనరల్‌కు పది మండల పరిషత్‌లు కేటాయించగా... దీంట్లో ఐదు స్థానాలు మహిళలకు రిజర్వ్ చేశారు. -
మిగిలినయ్ నాలుగూళ్లే!
హసన్‌పర్తి/హన్మకొండ సిటీ, ఏదైనా పదవికి పోటీ చేయాలంటే కనీస కోరం అవసరం... అలాంటి కోరం ఇక్కడ అవసరమే లేదు. రిజర్వేషన్ అయితే చాలు... ఎన్నిక ఏకగ్రీవమే. ఓపెన్ అయితే కొంత ఇబ్బంది అరుునప్పటికీ ఎన్నిక లాంఛనమే. ఇదీ... నాలుగు గ్రామాలున్న హన్మకొండ మండల ప్రత్యేకత. వరంగల్ నగర పాలక సంస్థలో గ్రామాల విలీనం నేపథ్యంలో ఈ మండలం అందరి నోళ్లలో నానగా... తాజాగా స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమైన తరుణంలో మరోసారి తెరపైకి వచ్చింది. గతంలో హన్మకొండ మండల అధ్యక్ష పదవికి తీవ్ర పోటీ ఉండేది. 23 గ్రామాలకు 23 ఎంపీటీసీ సభ్యులు, ఒక జెడ్పీటీసీ సభ్యుడు ఉండేవారు. హన్మకొండ మండలం నగరానికి చుట్టుపక్కల విస్తరించి ఉండడం... మండల పరిషత్ కార్యాలయం నగర నడి బొడ్డున ఉండడంతో ఎంపీపీ పదవి కోసం కుస్తీ పడేవారు. కానీ... హన్మకొండ మండల పరిధిలోని 19 గ్రామాలు ఏడాది క్రితం గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్లో విలీనమైన నేపథ్యంలో అక్కడి పరిస్థితి తారుమారైంది. ఆ మండలంలో మిగిలినవి నాలుగు గ్రామాలు మాత్రమే. ప్రస్తుతం హన్మకొండ మండలంలోని కొండపర్తి, ముల్కలగూడెం, నర్సింహులగూడెం, వనమాల కనపర్తి గ్రామాలకు రెండు ఎంపీటీసీ స్థానాలు మాత్రమే ఉన్నాయి. గురువారం ప్రకటించిన రిజర్వేషన్ ప్రకారం కొండపర్తి ఎంపీటీసీ బీసీ మహిళకు రిజర్వ్ కాగా, వనమాల కనపర్తి (నర్సింహులగూడెం, ముల్కలగూడెం) ఎంపీటీసీ స్థానాన్ని ఎస్సీ మహిళకు కేటాయించారు. ఇందులో ఎవరు గెలిచినా... చివరకు మండల పరిషత్ అధ్యక్షురాలిగా మహిళ ఎన్నిక కావడం లాంఛనమే. రిజర్వేషన్ అయితే ఏకగ్రీవమే... హన్మకొండ మండల ఎంపీపీ పీఠం రిజర్వేషన్ అయితే ఏకగ్రీవమే. బీసీ కేటగిరిలో రిజర్వేషన్ చేస్తే కొండపర్తి నుంచి ఎన్నికయ్యే అభ్యర్థి ఎంపీపీ పీఠం అధిరోహిస్తారు. ఒకవేళ ఎస్సీ రిజర్వేషన్ అయితే వనమాల కనపర్తి నుంచి ఎన్నికయ్యే అభ్యర్థి ఎంపీపీగా బాధ్యతల స్వీకరిస్తారు. ఓపెన్ కేటగిరి అరుుతే... ఇద్దరి మధ్య పోటీ తప్పదు. జెడ్పీటీసీ మహిళే... హన్మకొండ మండలంలోని నాలుగు గ్రామాల్లో సుమారు ఎనిమిది వేల జనాభా ఉంది. ఈ లెక్కన సుమారు ఆరు వేల ఓటుండగా... ఒక జెడ్పీటీసీ స్థానాన్ని కేటాయించారు. రెండు ఎంపీటీసీ స్థానాలు మహిళలకే రిజర్వ్ కాగా... జెడ్పీటీసీ స్థానం కూడా బీసీ మహిళకే రిజర్వ్ కావడం విశేషం.