సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడుతున్న తరుణంలో అభ్యర్థుల జాబితాపై ప్రధాన పార్టీలు చేస్తున్న కసరత్తు తుది దశకు చేరుకుంది.ఎంపికను పూర్తి చేసిన ప్రధాన పార్టీలు ఈ నెల నాలుగైదు తేదీల వరకు ఫైనల్ లిస్టును ప్రకటించి ...నామినేషన్ల దాఖలు చేసుకునే వెసులుబాటు కల్పించేందుకు తగిన ప్లానుతో ముందుకు సాగుతున్నాయి.అప్పటి వరకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ మొదటి విడత ఎన్నికలు ూడా పూర్తి కాగలవని భావిస్తున్నారు.
ల్లాలోని రెండు లోక్‌సభ, 14 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల తుది జాబితాను సిద్ధం చేసిన కాంగ్రెస్ పార్టీ ఈ నెల 4 లేదా 5న అధికారికంగా ప్రకటించాని యోచిస్తోంది.సీపీఐతో సీట్ల సర్దుబాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కాంగ్రెస్ సంఖ్యాపరంగా సీట్లను ఫైనల్ చేసినప్పటికీ నియోజక వర్గాల చిక్కు ముడి వీడక పోవటం వల్ల అధికారికంగా వెల్లడించలేక పోతున్నారు.ఒకటి, రెండు రోజుల్లో ఈ చిక్కముడి విడిపోగలదని ఇరు పార్టీలు భావిస్తున్నాయి.సీపీఐ మాత్రం సర్దుబాటులో భాగంగా నాగరుకర్నూల్ అసెంబ్లీ స్థానాన్ని ప్రతిప్రాదించినట్టుగా చెప్పుతుండగా...ఈ జిల్లానుంచి ఏమి ఉండక పోవచ్చునని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదిలా ఉండగా టీడీపీ, బీజెపీ ల మధ్య కూడా సీట్ల సర్దుబాటు వ్యవహారం ఎటూ తేలడం లేదు. ఒక వేళ జరిగితే బీజెపీ జిల్లా నుంచి మహబూబ్‌నగర్ లోక్‌సభతో పాటు మహబూబ్‌నగర్,నాగరుకర్నూల్,నారాయణపేట,కల్వకుర్తి, కొడంగల్, మక్తల్ అసెంబ్లీ స్థానాలు ప్రతి ప్రాదించినట్టు తెలుస్తోంది. జిల్లా విషయానికి వస్తే ఈ స్థానాలపైనే చర్చజరుగుతున్నట్లు విశ్వనీయ వర్గాల సమాచారం.టీడీపీ కూడా ఈ సీట్లల్లో ఒకటి, రెండు అటో,ఇటో అన్నరీతిలో చర్చలు సాగిస్తున్నట్టు భోగట్టా.
సీపీఎం అభ్యర్థిగా జబ్బార్..: సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తున్న సీపీఎం ...జిల్లాలోని కొల్లాపూర్ అసెంబ్లీ నియోజక వర్గ అభ్యర్థిగా జబ్బార్ ను ఆ పార్టీ తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మంగళవారం ప్రకటించారు.కొల్లాపూర్ సీపీఎం డివిజన్ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న జబ్బార్ పానుగల్ మండలం రేమొద్దుల గ్రామ సర్పంచిగా పనిచేశారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం రైతు సంఘం జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు.
లెక్కల్లో పార్టీలు..!
Published Wed, Apr 2 2014 3:40 AM | Last Updated on Sat, Sep 2 2017 5:27 AM