మండలాలవారీగా రిజర్వేషన్లు ఇలా..గిరిజనతెగలు (ఎస్టీ): గండేడ్ (మహిళ), ధారూరు, యాచారం దళితవర్గాలు(ఎస్సీ): దోమ, తాండూరు (మహిళ), పరిగి (మహిళ), మహేశ్వరం,కీసర, శంకర్‌పల్లి, పెద్దేముల్ (మహిళ) వెనుకబడిన తరగతులు (బీసీ): శామీర్‌పేట, యాలా ల, హయత్‌నగర్ (మహిళ), మొయినాబాద్, శంషాబాద్, షాబాద్ (మహిళ), మేడ్చల్ (మహిళ), చేవెళ్ల, కందుకూరు, ఘట్‌కేసర్, కుత్బుల్లాపూర్ (మహిళ), మంచాల (మహిళ), బషీరాబాద్ (మహిళ) జనరల్: కుల్కచర్ల, రాజేంద్రనగర్, ఇబ్రహీం పట్నం, వికారాబాద్(మహిళ), మోమిన్‌పేట(మహిళ), నవాబ్‌పేట, మర్పల్లి(మహిళ), సరూర్‌నగర్, పూడూరు (మహిళ), బంట్వారం (మహిళ
రంగారెడ్డి జిల్లా ‘ప్రాదేశిక’ ఎన్నికలకు మరో ముందడుగు పడింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీల రిజర్వేషన్లను జిల్లా యంత్రాంగం పూర్తి చేసింది. రెండురోజుల్లో ఎన్నికల షెడ్యూల్/నోటిఫికేషన్ విడుదల చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించిన నేపథ్యంలో శనివారం సెలవురోజు అయినప్పటికీ, అధికారులు రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియను కొలిక్కితెచ్చారు. జిల్లాలోని 33మండలాల జెడ్పీటీసీ, 614 మండల ప్రాదేశిక స్థానాల రిజర్వేషన్లను శుక్రవారం ఖరారు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మండల పరిషత్ అధ్యక్ష స్థానాల రిజర్వేషన్లను జిల్లా యంత్రాంగం ప్రకటించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 50శాతం రిజర్వేషన్ల మేరకు మొత్తం స్థానాల్లో 15మండలాలను మహిళలకు కేటాయించారు. గతంలో మూడు దఫాల రిజర్వేషన్లను పరిగణనలోకి తీసుకొని.. రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్లను వర్తింప చేశారు. మూడు మండలాలు గిరిజనులకు కేటాయించగా... ఇందులో ఒకటి మహిళలకు నిర్దేశించారు. ఏడు మండల పరిషత్‌లు దళితులకు నిర్దేశించారు.
దీంట్లో మూడు స్థానాలు అతివలకు రిజర్వ్ చేశారు. 13 ఎంపీపీలు బీసీలకు కేటాయించగా...ఆరు సీట్లు మగువలకు నిర్దేశించారు. ఇక జనరల్‌కు పది మండల పరిషత్‌లు కేటాయించగా... దీంట్లో ఐదు స్థానాలు మహిళలకు రిజర్వ్ చేశారు.