rangareddy
-
పేదల భూముల వ్యవహారం.. ఆర్ఎఫ్సీకి అల్టిమేటం జారీ
రంగారెడ్డి, సాక్షి: పేదలకు ఇచ్చిన భూములను ఆక్రమించిన రామోజీ ఫిల్మ్ సిటీ(Ramoji Film City) యాజమాన్యానికి అల్టిమేటం జారీ అయ్యింది. వైఎస్సార్ హయాంలో ప్రభుత్వం ఇచ్చిన భూముల్ని ఆర్ఎఫ్సీ యాజమాన్యం తమ గుప్పిటే ఉంచుకుంది. అయితే.. తమ భూములు తమకు ఇవ్వకపోతే ఫిల్మ్ సిటీని ముస్తామని పేద లబ్ధిదారులు హెచ్చరించారు. తాజాగా.. సీపీఎం ఆధ్వర్యంలో లబ్ధిదారులు రంగారెడ్డి కలెక్టరేట్(Rangareddy Collectorate) ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంతో.. నేడు చర్చల కోసం ఇరు వర్గాలను ఆర్డీవో ఆహ్వానించారు. అయితే.. చర్చలకు రాకుండా ఆర్ఎఫ్సీ యాజమాన్యం డుమ్మా కొట్టింది. ఈ పరిణామంతో బాధితులు మరోసారి ఆందోళకు దిగారు.ఈ పరిణామాన్ని ఆర్డీవో తీవ్రంగా పరిగణించారు. గురువారం చర్చలకు ఖచ్చితంగా రావాల్సిందేనంటూ ఆర్ఎఫ్సీ యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేశారాయన. మరోవైపు.. ప్రత్యామ్నాయ భూములు ఇస్తామని RFC యాజమాన్యం లిఖిత పూర్వకంగా హామీ ఇచ్చిందని, ఏడాది కాలంగా సమస్య పరిష్కారం చేయకుండా సాగదీస్తోందని బాధితులు వాపోతున్నారు. రేపు చర్చల్లో పాల్గొని తమ స్థలాలను చూపించకపోతే గనుక.. రామోజీ ఫిల్మ్ సిటీని ముట్టడిస్తామన్న సీపీఎం(CPM) నేతలు, లబ్ది దారులు హెచ్చరికలు జారీ చేశారు. -
గురుకులాల్లో మార్పులు తీసుకొస్తున్నాం : సీఎం రేవంత్
-
రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది
-
లేడీ కానిస్టేబుల్ హత్యలో ట్విస్ట్.. వెలుగులోకి కొత్త కోణం
సాక్షి,రంగారెడ్డిజిల్లా: ఇబ్రహీంపట్నంలో లేడీ కానిస్టేబుల్ హత్య సంచలనం రేపింది. హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నాగమణిని సొంత తమ్ముడే హత్య చేశాడు. ఇది పరువు హత్య అని తొలుత భావించినప్పటికీ పోలీసుల ప్రాథమిక విచారణలో ఆస్తి గొడవలే హత్యకు కారణమని తెలుస్తోంది. రాయపోల్‌కు చెందిన శ్రీకాంత్,నాగమణిలు నవంబర్ ఒకటో తేదీన యాదగిరిగుట్టలో ప్రేమ వివాహం చేసుకున్నారు. వివాహం అనంతరం హయత్‌నగర్‌లో నాగమణి, శ్రీకాంత్ నివాసం ఉంటున్నారు. నిన్న సెలవు కావడంతో నాగమణి తన సొంత గ్రామానికి వెళ్ళింది.నాగమణి స్కూటీపై డ్యూటీకి వెళుతుండగా వెంబడించిన తమ్ముడు పరమేష్ తొలుత ఆమెను కారుతో ఢీకొట్టి అనంతరం కొడవలితో మెడ నరికి చంపాడు.హత్య చేసిన పరమేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కేసులో ట్విస్ట్.. వెలుగులోకి అసలు నిజాలుఆస్తి కోసమే అక్క నాగమణిని తమ్ముడు పరమేష్ చంపినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. నాగమణికి తల్లిదండ్రులు లేకపోవడంతో అన్నీ తానే చూసుకున్నాడు పరమేష్. కాగా నాగమణికి ఇదివరకే వివాహమై విడాకులు కూడా అయ్యాయి. తమ వారసత్వ భూమిని మొదటి వివాహం తర్వాత నాగమణి తమ్ముడికి ఇచ్చేసింది.రెండవ భర్త శ్రీకాంత్‌ను ఇటీవలే కులాంతర వివాహం చేసుకున్న నాగమణి భూమిలో తనకు వాటా ఇవ్వాలని తమ్ముడిని మళ్లీ ఒత్తిడి చేసినట్లు తెలిసింది. దీంతో ఆగ్రహించిన పరమేష్ నాగమణి స్కూటీపై వెళుతుండగా కారుతో ఢీకొట్టి అనంతరం కొడవలితో నరికి చంపాడు. ఇదీ చదవండి: ఎస్సై ఆత్మహత్య.. ప్రేమ వ్యవహారమే కారణం..? -
నందిగామలో భారీ అగ్నిప్రమాదం
సాక్షి, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా నందిగామ కాంసన్ హైజెన్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఈ అగ్ని ప్రమాదం కారణంగా భారీ ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం. అగ్ని ప్రమాదం కారణంగా మంటలు ఎగిసిపడుతున్నాయి.వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా నందిగామ సమీపంలోని కాంసన్ హైజెన్ పరిశ్రమలో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు పోలీసు ధికారులు చెబుతున్నారు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిప్రమాక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు. పక్కనే ఉన్న ఇతర పరిశ్రమలకు మంటలు వ్యాపించకుండా ప్రయత్నిస్తున్నారు. అగ్ని ప్రమాదం కారణంగా మంటలు ఎగిసిపడుతున్నాయి. -
Telangana: జీపీ లేఔట్లన్నీ నిషేధిత జాబితాలోకి..
ఇబ్రహీంపట్నంలోని ఆదిబట్లలో 289/పీ సర్వే నంబరులోని ఓ జీపీ లేఔట్లో శ్రీనివాస్ రెడ్డి కొన్నేళ్ల క్రితమే 250 గజాల స్థలాన్ని కొనుగోలు చేశారు. కూతురు పెళ్లి సమయానికి కట్నం కింద ఉపయోగపడుతుందని భావించారు. వచ్చే నెలలో ముహూర్తాలు ఉండటంతో పెళ్లి పెట్టుకున్నారు. అల్లుడికి కానుకగా ఇద్దామనుకున్న ఓపెన్ ప్లాట్‌ను రిజిస్ట్రేషన్ చేసే వీలు లేకుండాపోయింది. దీనికి కారణం ప్రభుత్వం ఆ లేఔట్‌ను నిషేధిత జాబితాలో చేర్చడమే. దీంతో శ్రీనివాస్‌రెడ్డి లబోదిబోమంటున్నాడు.సాక్షి, హైదరాబాద్: వాస్తవానికి గత ప్రభుత్వ హయాంలోనే గ్రామ పంచాయతీ (జీపీ) లేఔట్ల రిజిస్ట్రేషన్లను నిలిపివేశారు. కానీ, తాజాగా రేవంత్ సర్కారు జీపీ లేఔట్లను నిషేధిత జాబితాలో చేర్చింది. ఈమేరకు హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని అనధికార లేఔట్ల సర్వే నంబర్లను నిషేధిత జాబితా 22–ఏ (1)(ఈ) కిందకు బదలాయించింది. దీంతో భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడుతుందని కొనుగోలు చేసిన ప్లాట్లను విక్రయించుకోలేక సామాన్య, మధ్యతరగతి ప్రజలు కష్టాలు పడుతున్నారు. సాధారణంగా సామాన్య, మధ్య తరగతి ప్రజలు పైసా పైసా కూడబెట్టుకొని ప్లాట్ కొనుగోలు చేస్తుంటారు. కూతురు పెళ్లి కోసమో, కొడుకు ఉన్నత చదువుల కోసమో అత్యవసర సమయంలో ఉపయోగపడుతుందనుకుంటారు. నగదు అవసరమైన³్పుడు ప్లాట్ అమ్మితే సొమ్ము వస్తుందనే భరోసాతో ఉంటారు. కానీ, తాజాగా ప్రభుత్వం సామాన్య, మధ్య తరగతి ప్రజల నడ్డి విరిచింది. ఎంపిక చేసిన సర్వే నంబర్లలోని జీపీ లేఔట్లు, అందులోని ఓపెన్ ప్లాట్లను నిషేధిత జాబితాలోకి చేర్చింది. దీంతో ఆయా స్థలాలకు రిజిస్ట్రేషన్లు జరగకుండా అడ్డుకట్ట వేశారు. ఫలితంగా స్థల యజమానులు ప్లాట్లను విక్రయించుకోలేరు. రిజిస్ట్రేషన్లు జరగకపోతే కొనుగోలుదారులెవరూ ముందుకు రారు. దీంతో భవిష్యత్తు అవసరాల కోసమని కొనుగోలు చేసిన ప్లాట్ ఎందుకూ పనికిరాకుండా మిగిలిపోయినట్టయింది.ఏ చట్టం ప్రకారం చేర్చారు?జీపీ లేఔట్లు ఉన్న సర్వే నంబర్లన్నింటినీ ప్రభుత్వం నిషేధిత జాబితాలో పెడుతూ నిర్ణయం తీసుకుంది. పట్టా స్థలాలను నిషేధిత జాబితా 22–ఏ (1)(ఈ)లో పెట్టే అధికారం ప్రభుత్వానికి లేదు. లేఔట్లకు అనుమతి ఇచ్చే అధికారం గ్రామ పంచాయతీలకు లేదు. హెచ్ఎండీఏ, డీటీసీపీ విభాగాలు మాత్రమే లేఔట్లకు అనుమతి ఇచ్చే అధికారం ఉంది. మరి, హుడా ఏర్పడకుముందే ఈ లేఔట్లు వెలిస్తే.. డీటీసీపీ ఏం చేస్తున్నట్టు? కొత్తగా అవి జీపీ లేఔట్లని పేర్కొంటే నిషేధిత జాబితాలోకి ఏ చట్టం ప్రకారం చేర్చారు? అని డెవలపర్ల సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. వాస్తవానికి ప్రభుత్వ భూములు లేదా కోర్టు కేసుల్లో ఉన్న స్థలాలను 22–ఏ జాబితా కింద చేర్చుతారు.ఇందులో ప్రభుత్వ, దేవాదాయ, వక్ఫ్ భూములు ఇలా ఐదు వర్గాలుగా ఉంటాయి. ఈ స్థలాలను ఎవరూ ఆక్రమించకుండా, రిజిస్ట్రేషన్లు జరగకుండా ఆయా సర్వే నంబర్లను 22–ఏ కింద చేర్చుతారు. తాజాగా ప్రభుత్వం జీపీ లేఔట్లను సైతం 22–ఏ జాబితాలోకి చేర్చడం గమనార్హం. దీంతో లేఔట్, పట్టాదారు స్థలాలు కూడా ప్రభుత్వ భూముల పరిధిలోకి వస్తాయని ఓ న్యాయవాది అభిప్రాయపడ్డారు. దీంతో చాలామంది భూ యజమానులు హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. డాక్యుమెంట్లను క్షుణ్నంగా పరిశీలించిన తర్వాత న్యాయస్థానం ఆయా స్థలాలను నిషేధిత జాబితా నుంచి తొలగించి, రిజిస్ట్రేషన్లు చేయాలంటూ సబ్ రిజిస్ట్రార్లకు ఆదేశాలు జారీ చేసే అవకాశముంటుందన్నారు. అయితే ఇలా ఎంతమంది సామాన్యులు కోర్టును ఆశ్రయిస్తారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. కాగా, జీపీ లేఔట్లను నిషేధిత జాబితాలో పెడితే వాటిని ఎల్ఆర్ఎస్ ఎలా చేస్తారని పీర్జాదిగూడ మాజీ మేయర్ జక్కా వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. -
హైదరాబాద్ పబ్బుల్లో దాడులు.. ఆరుగురికి డ్రగ్స్ పాజిటివ్
హైదరాబాద్, సాక్షి: హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో అర్ధరాత్రి మరోసారి పబ్బులు, బార్లలో పోలీసులు దాడులచేశారు. టీజీనాబ్, ఎక్సైజ్ పోలీసులు సంయుక్తంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలోని 25 పబ్బులపై ఆకస్మిక తనిఖీలు చేశారు. పబ్బుల్లో 107 మందికి అనుమానితులకు డ్రగ్స్ డిటెక్షన్ కిట్లతో పరీక్షలు చేయగా.. ఐదుగురికి పాజిటివ్‌గా తేలింది. శుక్రవారం రాత్రి 11 గంటల నుండి ఒంటి గంట వరకు పోలీసులు తనిఖీలు కొనసాగించారు. ఎక్సోరాలో గంజాయి పరీక్షల్లో ఇద్దరికి పాజిటివ్ వచ్చింది. రంగరెడ్డి జిల్లాలో బార్లలో మరో ముగ్గురు వ్యక్తులు పాజిటివ్‌గా తేలారు. మొదటిసారి తనిఖీల్లో డ్రగ్ డీటెక్షన్ పరీక్షల్లో పాజిటివ్ రావడంతో ఆ వ్యక్తులను టీజీనాబ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం ఆరు కేసుల్లో జీ 40లో ఇద్దరికి, విస్కీ సాంబ పబ్బులో ఇద్దరికి, జోరా పబ్బులో ఒకరికి, క్లబ్ రొగ్లో ఒకరికి డ్రగ్స్ తీసుకున్నట్లు పాజిటివ్ వచ్చినట్లు అధికారుల తెలిపారు. -
పొంచి ఉన్న కోవిడ్ జేజమ్మ!
‘కోవిడ్–19 మానవాళిని మూడేళ్లు మాత్రమే ఇబ్బందులకు గురి చేసింది. దీనికి జేజమ్మలా తయారైంది యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఏఎమ్మార్). ఇది భవిష్యత్‌లో మానవాళిని నిరంతరం ఇబ్బందులకు గురి చేయనుంది. దీనివల్ల భవిష్యత్‌లో ప్రపంచం తీవ్రమైన గడ్డు పరిస్థితిని చవిచూడబోతున్నాం’ అని ఇండియన్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ అకాడమీ చైర్మన్ డాక్టర్ బుర్రి రంగారెడ్డి హెచ్చరించారు. ఈ విపత్తు నుంచి బయటపడాలంటే ప్రజలు యాంటీబయోటిక్స్ విచ్చలవిడి వినియోగం తగ్గించాలని సూచించారు. వీటిని వైద్యుల సూచనలు లేకుండా సొంతంగా వినియోగించకూడదని స్పష్టం చేశారు. వైద్యులు సైతం క్లినికల్ పరీక్షల అనంతరం,, వ్యాధి నిర్ధారణ అయ్యాక ప్రోటోకాల్స్ ప్రకారమే యాంటీబయోటిక్స్‌ను చికిత్స కోసం వాడాలన్నారు. కంటికి కనిపించకుండా చాపకింద నీరులా మానవ ఆరోగ్యానికి పెను విపత్తుగా మారుతున్న ఏఎమ్మార్ నియంత్రణ, ప్రజలు, వైద్యులు పాటించాల్సిన జాగ్రత్తలను ‘సాక్షి’తో రంగారెడ్డి పంచుకున్నారు. ఆయన భారత, ఏపీ ఏఎమ్మార్ యాక్షన్ ప్లాన్ రూపకల్పనలో సలహాదారుగా ఉన్నారు. ఏఎమ్మార్పై రంగారెడ్డి ఏమంటున్నారంటే.. –సాక్షి, అమరావతిటాప్–10లో ఇదే ప్రధానం అలెగ్జాండర్ ఫ్లెమింగ్ కనిపెట్టిన పెన్సిలిన్ ఇంజెక్షన్ 1940 దశకంలో వినియోగంలోకి వచ్చింది. ఇది ఆరోగ్య రంగం, రోగుల సంరక్షణలో విప్లవాత్మక మార్పులను తెచ్చింది. అనంతరం రకరకాల యాంటీబయోటిక్స్ తయారీ ఊపందుకుంది. వీటివల్ల సూక్ష్మ క్రిముల ద్వారా వచ్చే అనేకానేక ఇన్ఫెక్షన్లను నయం చేస్తూ బ్యాక్టీరియా వ్యాప్తిని నిరోధిస్తూ వైద్య రంగం ముందుకు వెళ్లింది. పెన్సిలిన్ కనుగొన్న సమయంలోనే దీన్ని విచ్చలవిడిగా వినియోగిస్తే బ్యాక్టీరియాలో ఒకరకమైన నిరోధకత పెరిగి మనం ఇచ్చే ఏ మందులకు పని చేయకుండా సూపర్ బగ్స్‌గా మారతాయని అలెగ్జాండర్ హెచ్చరించారు. వైద్యులు, ప్రజలు లెక్కలేనితనంతో విచ్చలవిడిగా యాంటీబయోటిక్స్‌ని వినియోగించడంతో ఏఎమ్మార్ సమస్య ఉత్పన్నం అవుతోంది.ప్రపంచ ప్రజారోగ్య రంగంలో ఎదుర్కొంటున్న టాప్–10 సమస్యల్లో ఏఎమ్మార్ ప్రధానమైందని డబ్ల్యూహెచ్‌వో సైతం హెచ్చరించింది. అతిగా యాంటీబయోటిక్స్ వినియోగంతో మనుషుల్లో సూపర్ బగ్స్ పెరిగిపోతున్నాయి. దీంతో 80 శాతం యాంటీబయోటిక్స్ పనిచేయడం లేదని ఐసీఎంఆర్, డబ్ల్యూహెచ్‌వో తేల్చాయి.అడ్వాన్స్డ్ డ్రగ్స్ సైతం 10 మందికి ఇస్తే అందులో 9 మందిలో పనిచేయడం లేదు. సెప్సిస్ వంటి జబ్బులు వచి్చనప్పుడు యాంటీబయాటిక్స్ పనిచేయక చేతులు ఎత్తేసే పరిస్థితులు చూస్తున్నాం.యాక్షన్ ప్లాన్‌ను ఆచరణలో పెట్టాలి2016లో డబ్ల్యూహెచ్‌వో ఏఎమ్మార్‌ను విపత్తుగా పరిగణించి గ్లోబల్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. దానికి అనుగుణంగా 2022లో యాక్షన్ ప్లాన్‌ను రూపొందించిన నాలుగో రాష్ట్రంగా ఏపీ నిలిచింది. ప్రస్తుత రోజుల్లో ఏదైనా జబ్బు చేస్తే వైద్యుడి దగ్గరకు వెళ్లిన ఒకటి రెండు రోజుల్లో నయమవ్వాలని ప్రజలు భావిస్తున్నారు. వైద్యులపై ఒత్తిడి తెచ్చి యాంటీబయోటిక్స్ రాయించుకుంటున్న వారు ఉంటున్నారు. లేదంటే ఆ వైద్యుడిని పనికిమాలిన వాడికింద లెక్కగడుతున్నారుమరికొందరైతే వైద్య పరీక్షలు దండగని భావించి.. నేరుగా మెడికల్ షాపులకు వెళ్లి ఫార్మాసిస్ట్ ఇచి్చన యాంటీబయోటిక్స్ వేసుకుంటున్నారు. ఈ చర్యలతో తెలియకుండానే వారి ఆరోగ్యాన్ని వారే పాడుచేసుకుంటున్నారు. చనిపోతామని తెలిసి ఏ వ్యక్తిని కావాలనే విషాన్ని కొనుక్కుని తినడు. యాంటీబయోటిక్స్ విషయంలోనూ ప్రజలు అదే విధంగా ఆలోచించాలి. రోగులు, ప్రభుత్వాలపై ఆర్థిక భారం ఏఎమ్మార్‌ను అత్యంత ప్రాధాన్యత అంశంగా ప్రభుత్వాలు, వైద్యులు పరిగణించాలి. లేదంటే ప్రజారోగ్య వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుంది. ప్రజలు, దేశాలు ఆర్థికంగానూ నష్టపోవాల్సి వస్తుంది. గతంలో చాలా పెద్దపెద్ద జబ్బలకు పెన్సిలిన్, సల్ఫర్ డ్రగ్ ఇస్తే మూడు నుంచి నాలుగు రోజుల్లో రోగి కోలుకుని ఇంటికి వెళ్లిపోయే పరిస్థితి ఉండేది. ప్రస్తుతం చాలా సందర్భాల్లో అవి పనిచేయకపోవడంతో ఒక డోస్, రెండో డోస్ అని డోస్‌ల మీద డోస్‌లు యాంటీబయోటిక్ మందులు వాడాల్సి వస్తోంది. దీంతో రోగులు, ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతోంది. చికిత్సా సమయం పెరుగుతోంది. ఒక రోగాన్ని తగ్గించడం కోసం యాంటీబయోటిక్స్‌ను డోస్‌ల మీద డోస్‌లు ఇవ్వడం శరీరంలో మరో సమస్యకు దారితీస్తోంది. జీర్ణవ్యవస్థలో ఉండే మంచి బ్యాక్టీరియా నిరీ్వర్యమై, జీర్ణకోశ వ్యాధులు ఎక్కువవుతున్నాయి. -
గ్లాస్ తయారీ పరిశ్రమలో ఘోర ప్రమాదం
షాద్‌నగర్: గ్లాస్ తయారీ పరిశ్రమలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందగా, 13 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ సమీపంలోని బూర్గుల గ్రామశివారులో వాహనాలకు సంబంధించిన గ్లాస్ అద్దాలను తయారుచేసే సౌత్ గ్లాస్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమ ఉంది. ఈ పరిశ్రమలో వివిధ రాష్ట్రాలకు చెందిన 200 మంది కార్మికులు పని చేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం పరిశ్రమలోని ఆటో క్లేవ్ యూనిట్లో అద్దాలను గ్యాస్, వేడితో అతికించి, బాయిలర్ నుంచి బయటకు తీసే క్రమంలో ప్రమాదం జరిగింది.ప్రమాద సమయంలో ఆటో క్లేవ్ యూనిట్ వద్ద ఐదుగురు కార్మికులు పనిచేస్తున్నారు. యూనిట్లో తయారైన గ్లాస్‌ను బయటకు తీసే క్రమంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో కార్మికులు తీవ్రంగా గాయపడి మృత్యువాత పడ్డారు. ఈ పేలుడుతో మృతుల శరీరభాగాలు చెల్లాచెదురుగా సుమారు వంద మీటర్ల దూరం వరకు ఎగిరి పడ్డాయి. ఓ కార్మికుడి మృతదేహం పరిశ్రమ షెడ్డు రేకులను చీల్చుకొని బయటకు ఎగిరిపడింది. మరో కార్మికుడి మృతదేహం పూర్తిగా యంత్రంలో ఇరుక్కుపోయింది. ముగ్గురి మృతదేహాలు ఏమాత్రం గుర్తుపట్టలేని విధంగా సుమారు వంద మీటర్ల దూరంలో ఎగిరిపడ్డాయి.శరీరాల నుంచి కాళ్లు, చేతులు, తల, తదితర భాగాలు చెల్లాచెదురుగా ఎగిరిపడ్డాయి. మృతి చెందినవారిలో బిహార్ రాష్ట్రానికి చెందిన చిత్తరంజన్ (25), రాంఆశిష్ (18), రవుకాంత్ (25), రోషన్ (36), రతన్ దేవరియా (30) ఉన్నారు. వీరితోపాటు బిహార్‌కు చెందిన గోవింద్, మంటు, సమీద్కుమార్, రోషన్‌కుమార్, సురేంద్ర పాశ్వాన్, జార్ఖండ్‌కు చెందిన మైకేల్ ఎంబ్రామ్, కార్తీక్, సు¿ోద్, బూర్గుల గ్రామానికి చెందిన పుల్లని సుజాత, కాశిరెడ్డిగూడకు చెందిన నీలమ్మ, మమత, ఒడిశాకు చెందిన రేతికాంత్, రాజేశ్‌లు తీవ్రంగా గాయపడినట్టు అధికారులు తెలిపారు. కేటీఆర్ దిగ్భ్రాంతిబీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా బాధిత కుటుంబాలకు ప్రగాడ సానుభూతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలోని అన్ని కర్మాగారాల్లో భద్రత తీరుపై పరిశీలన చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ప్రమాదాలు: హరీశ్‌రావు రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పలు పరిశ్రమల్లో ప్రమా దాలు జరుగుతున్నాయని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు శుక్రవారం ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని పరిశ్రమల్లో వరుసగా ప్రమా దాలు జరుగుతున్నా, భద్రతా చర్యలు చేపట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందన్నారు.ప్రమాద ఘటనపై సీఎం ఆరా ప్రమాద ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి ఆరా తీశారు. ఢిల్లీలో ఉన్న ఆయన వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి తగిన వైద్య చికిత్స అందించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. రెవెన్యూ, పోలీసు, అగి్నమాపక శాఖ, కార్మిక, పరిశ్రమల శాఖ అధికారులు, వైద్య బృందాలు ఘటనాస్థలిలోనే ఉండి సమన్వయంతో సహాయక చర్యలు ముమ్మరం చేయాలన్నారు. దీంతో కలెక్టర్ శశాంక, శంషాబాద్ డీసీపీ రాజేష్, అడిషనల్ డీసీపీ రాంకుమార్, ఆర్డీఓ వెంకటమాధవరావులు ఘటనా స్ధలాన్ని సందర్శించి సహాయక చర్యలు చేపట్టారు. -
‘రంగారెడ్డి’ కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది..?
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా పార్టీ క్యాడర్లో ఇంకా అయోమయం కొనసాగుతోంది. హస్తం శ్రేణుల్లో ఈ ఆందోళనకు కారణమేంటి? పాత, కొత్త నేతల మధ్య కోల్డ్ వార్ కొనసాగుతోందా ? గ్రూపు తగాదాలు పార్టీ క్యాడర్‌కు ఇబ్బందికరంగా మారాయా ? కొత్తవారు పెద్ద ఎత్తున చేరడంతో పాత నేతలు సైలెంట్ అయ్యారా ? ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది ?ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మెజార్టీ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచినప్పటికీ...గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి జంప్ అవుతారనే ప్రచారంతో పార్టీ క్యాడర్‌కు కునుకుపట్టనివ్వడం లేదు. హైదరాబాద్ నగర శివారులోని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ పలుమార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసినప్పటికీ వివిధ కారణాలతో కాంగ్రెస్‌లోకి వెళ్లడం లేదని తాత్కాలికంగా ప్రకటించారు. మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి... కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను కలిసి వచ్చారు. కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి రెడీగా ఉన్నప్పటికీ... పార్టీ నేతలు మాత్రం ఒప్పుకోవడం లేదట. ఒకవేళ నేతలు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఏ క్షణంలోనైనా మామా అల్లుళ్లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవచ్చని ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాలన్నీ కాంగ్రెస్ క్యాడర్ లో కన్య్ఫూజన్ క్రియేట్ చేస్తున్నాయి.ఇక బీఆర్ఎస్ చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి.. అనుకోని పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ కండువా కప్పుకుని రెండోసారి ఎంపీగా పోటీ చేశారు. అటు కాంగ్రెస్ క్యాడర్ సహకరించకపోవడం.. ఇటు బీఆర్ఎస్ క్యాడర్ తన వెంట రాకపోవడంతో రంజిత్ రెడ్డి చేవెళ్లలో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నారు.మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో అక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసిన కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి సైలెంట్ అయిపోయారు. చేవెళ్లలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు అన్ని రకాలుగా సిద్ధమై బీఆర్ఎస్ నుంచి వచ్చిన పట్నం సునీతారెడ్డి... రంజిత్ రెడ్డి కారణంగా మల్కాజిగిరి కాంగ్రెస్ లోక్ సభ స్థానానికి షిఫ్ట్ అయ్యారు. స్థానిక క్యాడర్ సహకారం లేకపోవడంతో పట్నం సునీతా మహేందర్ రెడ్డి చాలా ఇబ్బంది పడ్డారు. తాండూరు కాంగ్రెస్‌లో ప్రస్తుతం విచిత్రమైన పరిస్థితి నెలకొంది. అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని రోజులు ముందు కాంగ్రెస్‌లో చేరి మనోహర్ రెడ్డి... ఎమ్మెల్యేగా గెలిచారు. తొలుత మనోహర్ రెడ్డి సోదరుడు శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించారు.అంతలోనే సోదరుడు మనోహర్ రెడ్డి రావడంతో పోటీ నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు సోదరుల మధ్య ఆధిపత్య పోరు పతాకస్థాయికి చేరింది. ఎవరికి వారు గ్రూపులుగా విడిపోయారు. ఇంతలోనే పార్లమెంట్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి... తాండూరును వదిలిపెట్టే ప్రసక్తే లేదని.. వచ్చే ఎన్నికల్లో తానే పోటీ చేస్తానని ప్రకటించారు. దీంతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ నేతల మధ్య కోల్డ్ వార్ ఇప్పుడిప్పుడే ముదురుతోంది. -
షాద్‌నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న 50 మంది
సాక్షి, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో శుక్రవారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నందిగామ మండల కేంద్రంలోని అల్విన్ ఫార్మసీ కంపెనీలో ప్రమదవశాత్తు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే అగ్నికీలలు ఎగిసిపడటంతో.. కంపెనీ మొత్తానికి మంటలు వ్యాపించాయి. ప్రమాద సమయంలో కంపెనీలో సుమారు 100కుపైగా కార్మికులు ఉండగా.. ప్రాణ భయంతో చాలా మంది బయటకు పరుగులు తీశారు. అయితే.. దట్టమైన పొగ అలుముకోవటంతో.. ఎటువెళ్లలేక సుమారు 50 మంది వరకు లోపలే చిక్కుకుపోయినట్టుగా తెలుస్తోంది.సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అయిదు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే పరిశ్రమను ఆనుకుని నూతనంగా నిర్మిస్తున్న షెడ్డులో వెల్డింగ్ పనులు జరుగుతుండగా.. మంటలు అంటుకున్నాయని కార్మికులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో దాదాపు 50 మంది కార్మికులు విధుల్లో ఉన్నారు. కొందరు కార్మికులను కిటికీల్లోంచి నిచ్చెనల సాయంతో బయటకు తీసుకొచ్చారు. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగిందన్నది తెలియాల్సి ఉంది.బాలుడి సాహసంఅగ్ని ప్రమాద సమయంలో ఓ బాలుడు ధైర్య సాహసాలు ప్రదర్శించాడు. ప్రమాదాన్ని ముందుగా గుర్తించిన బాలుడు సాయిచరణ్.. కంపెనీ మంటల్లో చిక్కుకున్న బాధితులను కాపాడాడు. అగ్నిప్రమాద తీవ్రతను పసిగట్టిన బాలుడు.. భవనం పైకి ఎక్కి తాడు కట్టాడు. కిటీకి ద్వారా కార్మికులు కిందకు దిగేందుకు సాయచరణ్ సాయం చేశాడు. మొత్తం 50 మందిని కార్మికులను కాపాడాడు. -
Hyd : చిలుకూరి టెంపుల్‌కు జనం ఎందుకు పోటెత్తారంటే?
సాక్షి, హైదరాబాద్: కొందరు చేసిన సోషల్ మీడియా ప్రచారం చిలుకూరు బాలాజీ దేవాలయాన్ని జన దిగ్భందనం చేసింది. ప్రస్తుతం చిలుకూరు బాలాజీ ఆలయంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల సందర్భంగా పిల్లలు లేని తల్లితండ్రులకు ప్రత్యేకంగా గరుడ ప్రసాదం ఇస్తారని నిన్న(గురువారం) సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఆలయ అధికారులు కానీ, పూజారులు కానీ ప్రత్యక్షంగా చేయకున్నా.. దీన్ని ఎవరూ ఖండించలేదు. దీంతో నేడు ఉదయం 5గంటల నుంచే భారీగా భక్తులు పోటెత్తడంతో చిలుకూరు ఏరియా మొత్తం స్తంభించిపోయింది. సిటీతోపాటు చుట్టుపక్కల నుంచి చిలుకురూరుకు భక్తులు క్యూ కట్టారు. మాసబ్‌ట్యాంక్ నుంచి మెహదీపట్నం, లంగర్‌హౌస్, సన్‌సిటీ, కాళీమందిర్ అప్పా జంక్షన్ మీదుగా హిమాయత్ సాగర్ వరకు ట్రాఫిక్ జాం ఏర్పడింది.గచ్చిబౌలిలోని ఔటర్ రింగ్ సర్వీస్ రోడ్డు కూడా వాహనాలతో నిండిపోయింది. రంగారెడ్డి జిల్లా తెలంగాణ పోలీస్ అకాడమీ దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఉదయం నుంచి చిలుకూరు ఆలయానికి 50 వేల మందికిపైగా జనాలు చేరుకున్నారని పోలీసులు చెబుతున్నారు. ఇంకా వస్తూనే ఉన్నారని తెలిపారు. ఆలయం వద్ద గరుడ ప్రసాదం ఇస్తున్నారన్న విషయం తెలిసి అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తినట్లు చెప్పారు. ప్రస్తుతం ఈ మార్గంలో ప్రయాణికులు రావొద్దని కోరారు. రంగారెడ్డి జిల్లా చిలుకూరులో ఉన్న బాలాజీ దేవాలయానికి వీసా దేవుడని పేరు. సాధారణంగానే భారీగా భక్తులు వస్తారు. ఇప్పుడు బ్రహ్మోత్సవాలు.. పైగా ప్రసాదం ప్రచారంతో భక్తులు పోటెత్తారు. ఏకంగా ఔటర్ రింగ్ రోడ్డు వరకు ట్రాఫిక్ నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. దాదాపు 12 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రాజేంద్రనగర్‌లోని కాళీమాత టెంపుల్ నుంచి చిలుకూరు టెంపుల్ వరకు ట్రాఫిక్ జాం ఏర్పడింది. ఈ రూటులో బోలెడు ఇంజినీరింగ్ కాలేజీలున్నాయి. అలాగే కొన్నిసంస్థలున్నాయి. ట్రాఫిక్‌జాంతో విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చిలుకూరు ట్రాఫిక్ జాం : గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
కాటేదాన్ పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం
సాక్షి, రంగారెడ్డి: మైలార్దేవుపల్లి పరిధి కాటేదాన్ పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుంది. పహల్ ఫుడ్ బిస్కెట్ పరిశ్రమలో తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఫైర్ ఇంజిన్ల సాయంతో అగ్నిమాపక సిబ్బంది మాట్లార్పుతోంది. దట్టమైన పొగలతో స్థానికుల ఉక్కిరిబిక్కిరి అయ్యారు. మిషనరీ, బిస్కెట్ తయారీ ముడిసరుకు పూర్తిగా మంటల్లో కాలి బుడిదైంది. కోట్లల్లో ఆస్తినష్టం వాటిల్లినట్లుగా అంచనా. నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. -
ధ్యానంతోనే విశ్వశాంతి
నందిగామ/శంషాబాద్ (హైదరాబాద్): ప్రపంచ శాంతికి ధ్యానం ఒక్కటే మార్గమని ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్ అభిప్రాయపడ్డారు. మూడు రోజులుగా రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా శాంతివనంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ ఆధ్యాత్మిక సమ్మేళనం ఆదివారంతో ముగిసింది. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ.. హార్ట్ఫుల్నెస్ సంస్థ గురూజీ కమ్లేష్ పటేల్ (దాజీ)కు కామన్వెల్త్ ఆధ్వర్యంలో గ్లోబల్ అంబాసిడర్ ఆఫ్ పీస్ అవార్డు రావడం ఆనందకరమన్నారు. కామన్వెల్త్ సెక్రటరీ జనరల్ ప్యాట్రిసియా స్కాట్లాండ్ మాట్లాడుతూ.. దాజీ 160 దేశాల్లో 16 వేల మంది వలంటీర్లు, 5 వేల కేంద్రాల్లో 5 మిలియన్లకు పైగా అభ్యాసీలను కలిగి ఉండటం ప్రపంచ స్థాయిలోనే గొప్ప విషయమని ప్రశంసించారు. ఆయన సేవలను గుర్తించి ‘గ్లోబల్ అంబాసిడర్ ఆఫ్ పీస్’ అవార్డు అందజేస్తున్నందుకు సంతోషిస్తున్నామని చెప్పారు. కమ్లేష్ పటేల్ (దాజీ) మాట్లాడుతూ.. తనకు కామన్వెల్త్ ఆధ్వర్యంలో అవార్డు అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు. అంతకుముందు అధ్యాత్మికవేత్తలు ధ్యానం చేశారు. కార్యక్రమంలో ప్రపంచ మత పెద్దల మండలి సెక్రటరీ జనరల్ భావాజైన్, సైంటిస్ట్ డాక్టర్ రోలీన్ మెక్క్రాటీ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాన్సియె ఎస్ బీయింగ్ వ్యవస్థాపకుడు డాక్టర్ జోసెఫ్ బెంటన్ హోవెల్ పాల్గొన్నారు. ఉప రాష్ట్రపతి దంపతులకు వీడ్కోలు ఆధ్యాత్మిక సమ్మేళనంలో పాల్గొన్న ఉపరాష్ట్రపతి దంపతులు జగదీప్ ధన్‌ఖడ్, సుధేష్ ధన్‌ఖడ్‌లు తమ పర్యటన ముగించుకుని ఆదివారం ఉదయం ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. ఈ సందర్భంగా వారిద్దరికీ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గవర్నర్ తమిళి సై, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి ఘనంగా వీడ్కోలు పలికారు. -
రాజధానిలోనే ఎక్కువ పోస్టులు
సాక్షి, హైదరాబాద్: డీఎస్సీలో అత్యధిక పోస్టులు రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లోనే ఉన్నాయి. హైదరాబాద్‌లో 878 టీచర్ పోస్టులు భర్తీ చేయనుండగా రంగారెడ్డి జిల్లాలో 379 ఖాళీలున్నట్లు అధికారులు తేల్చారు. ప్రాథమిక విద్యను బోధించే సెకండరీ గ్రేడ్ స్కూల్ టీచర్లు (ఎస్జీటీల) అవసరం ఎక్కువగా జగిత్యాల జిల్లాలో ఉన్నట్టు గుర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాలవారీగా టీచర్ పోస్టులు ఈ విధంగా ఉన్నాయి. -
పోలీసులకు చుక్కలు చూపిస్తున్న మొయినాబాద్ యువతి హత్య కేసు
రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ యువతి హత్య కేసులో సస్పెన్స్ వీడటం లేదు. నాలుగు రోజులుగా ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. ఒక్క ఆధారం దొరకకుండా నిందితులు జాగ్రత్తపడటంతో కేసులో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు .హత్య చేసి చాకచక్యంగా తప్పించుకు తిరుగుతూ పోలీసులకే చుక్కలు చూపిస్తున్నారు. చనిపోయిన యువతి ఎవరు, ఎందుకు చంపారు, అసలు చంపిదెవరు అనే విషయాలపై ఇంకా స్పష్టత రావడం లేదు. అసలేం జరిగిందంటే..మొయినాబాద్ మండలంలోని బాకారం గ్రామ శివారులో డ్రీమ్ వ్యాలీ రిసార్ట్‌కు వెళ్ళే మార్గంలో సోమవారం పట్టపగలే యువతిని హతమార్చి, పెట్రోల్ పోసి తగలబెట్టారు.మంటల్లో కాలిపోతున్న గుర్తు తెలియని మృతదేహాన్ని గమనించిన స్థానిక రైతులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకునే సమయానికి మృతదేహాం కాలుతూనే ఉండడంతో రైతుల సాయంతో మంటలు ఆర్పారు. అప్పటినుంచి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటన స్థలంలో సగం కాలిపోయిన సెల్ ఫోన్ లభించగా.. దానిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. మృతురాలి వయసు 25 ఏళ్లు ఉంటుందని భావిస్తున్నారు. పోలీసులకు ఈ కేసు సవాల్‌గా మారింది. ఏడు బృందాలను ఏర్పాటు చేసి విచారిస్తున్నా.. వివరాలు తెలియరావడం లేదు. బాధితురాలి ఫోన్ లభించినా.. అందులో సిమ్‌కార్డు తొలగించడం, మొయినాబాద్ చుట్టుపక్కల ఉన్న ఏ పోలీస్ స్టేషన్లో కూడా మిస్సింగ్ ఫిర్యాదు అందకపోవడంతో కేసును ఛేదించడం కష్టతరంగా మారుతోంది. మొబైల్ ఫోను పూర్తిగా కాలిపోవడంతో ఐఎంఈ నెంబర్ సిమ్ కార్డు గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు. ఆధారాలు లేకపోవడంతోనే దర్యాప్తులో ఆలస్యం అవుతుందని ఇటు పోలీసులు కూడా చెబుతున్నారు. ప్రస్తుతం యువతి మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీలో ఉంచారు. డ్రీమ్ వ్యాలీ రిసార్ట్ పరిసరాలను, సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. హత్య ప్రదేశంలో మరిన్ని ఆధారాల కోసం పోలీసులు, క్లూస్ టీమ్ జల్లెడపడుతోంది. ఆ యువతి ప్యాంట్ వెనక భాగం జేబుకు ఉన్న ఓ స్టిక్కర్ లభ్యమైంది.ఒక దారిలో వచ్చి మరో దారిలో నిందితుల పోయి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. యువతిని ఎక్కడో చంపి బైక్ మీద తీసుకువచ్చి ఇక్కడ కాల్చివేసినట్లుగా పోలీసులు అనుమానం చెందుతున్నారు. -
RangaReddy: ఆర్డీవో ఆఫీసు వద్ద ఉద్రిక్తత.. పోస్టల్ బ్యాలెట్‌కు నో సీల్!
సాక్షి, రంగారెడ్డి: ఇబ్రహీంపట్నం ఆర్డీవో కార్యాయలం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. నవంబర్ 29వ తేదీ నాటి పోస్టల్ బ్యాలెట్లను స్ట్రాంగ్ రూమ్‌కి అధికారులు పంపించకపోవడం కలకలం సృష్టించింది. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ శ్రేణులు ఆర్డీవో ఆఫీసు వద్దకు భారీగా చేరుకుంటున్నారు. వివరాల ప్రకారం.. ఇబ్రహీంపట్నం ఆర్డీవో కార్యాయలం వద్ద ఉద్రిక్తత నెలకొంది. నవంబర్ 29వ తేదీ నాటి పోస్టల్ బ్యాలెట్లను అధికారులు స్ట్రాంగ్ రూమ్‌కు తరలించలేదు. దీంతో, ఈ విషయంపై కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో, అక్కడ ఉద్రికత్త పరిస్థితి చోటుచేసుకుంది. అనంతరం, పోస్టల్ బ్యాలెట్‌ను అధికారులు స్ట్రాంగ్ రూమ్‌కు తరలించారు. ఇక, పోస్టల్ బ్యాలెట్‌ను స్ట్రాంగ్ రూమ్‌కు తరలించిన తర్వాతే అధికారులు సీల్ వేశారు. పోలింగ్ జరిగి రెండు రోజులు దాటినా స్ట్రాంగ్ రూమ్‌కు తాళం లేకపోవడం పట్ల కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే ఆర్డీవోను నిలదీశారు. -
కాంగ్రెస్‌లో గెలిచి బీజేపీలోకి జంప్ అవుతారు: కేటీఆర్ వ్యాఖ్యలు
సాక్షి, షాద్‌నగర్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న కొద్దీ మాటల యుద్ధం పెరుగుతోంది. తాజాగా కాంగ్రెస్ పార్టీపై మంత్రి కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. అధికారం ఇచ్చినపుడు ప్రజలకు ఏమీ చేయని కాంగ్రెస్ పార్టీ.. ఇవాళ ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తోందని ఎద్దేవా చేశారు. కాగా, మంత్రి కేటీఆర్ గురువారం రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. అమలు చేయలేని హామీలతో ప్రజలను ప్రలోభపెట్టాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోంది. మోసాన్ని మోసంతోనే జయించి.. ఓటు బీఆర్ఎస్ అభ్యర్థులకు వేయాలన్నారు. బీజేపీ వాళ్లకు అదానీ నుంచి బాగా పైసలు వస్తున్నాయట. కాంగ్రెస్, బీజేపీ వాళ్లను దబాయించి పైసలు అడగండి. రైతుబంధు అందితేనే.. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు వస్తేనే మాకు ఓటేయండి. తొమ్మిదేళ్లలో ఎన్నో మంచి పనులు చేసుకున్నాం. షాద్‌నగర్‌కు నీళ్లు ఇచ్చేది కేసీఆర్.. తెచ్చేది అంజయ్య యాదవ్. రేవంత్ రెడ్డి ఒక గాడ్సే. కాంగ్రెస్ నేతలు కడుపులో గుద్ది.. నోట్లో చాక్లెట్ పెడతారు. బీజేపీ నేతలు నీళ్ల వాటా తేల్చరు.. కాంగ్రెస్ వాళ్లు ప్రాజెక్టులపై కేసులేసి ఇబ్బంది పెడతారు. రేవంత్‌రెడ్డి ఆర్ఎస్ఎస్ మనిషి అని కాంగ్రెస్ నేతలే చెప్పారు. ఈ విషయంపై పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్‌సింగ్ సోనియాగాంధీకి లేఖ రాశారు. రేవంత్ రెడ్డి బీజేపీతో కలిసి పోయారు. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్లు బీజేపీలోకి జంప్ అవుతారు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి.. క్లారిటీ ఇచ్చిన వివేక్ -
రూ.27 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ
సాక్షి, రంగారెడ్డి: బాలాపూర్ లడ్డూ మరోసారి రికార్డు స్థాయి ధర పలికింది. రూ.27 లక్షలకు దాసరి దయానంద్‌రెడ్డి అనే వ్యక్తి సొంతం చేసుకున్నారు. దయానంద్‌ది తుర్కయాంజాల్ మున్సిపాలిటీలోని పాటిగూడ గ్రామం. ఈయన వ్యవసాయంతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారి కూడా. నేటితో బాలాపూర్ లడ్డూ వేలంపాట 30 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఏయేడుకాయేడు ఎక్కువ ధర పలికే లడ్డూ.. ఈసారి ఎంతకు పోతుందో అనే ఆసక్తి నెలకొనగా.. రికార్డు స్థాయిలోనే పోయింది. గతేడాది రూ. 24 లక్షలకు పోయింది బాలాపూర్ లడ్డూ. ఈసారి వేలంపాటలో 36 మంది ఔత్సాహికులు పాల్గొంటున్నారు. వీళ్లలో ముగ్గురే స్థానికులు ఉన్నారు. ఈ నేపథ్యంలో బాలాపూర్ వినాయకుడి దగ్గర సందడి నెలకొంది. అంతకు ముందు బాలాపూర్ గ్రామంలో గణేశుడిని ఊరేగించింది ఉత్సవ కమిటీ. ఉత్సవ కమిటీ రూల్స్ ప్రకారం.. స్థానికేతరులు వేలం కంటే ముందే గతేడాది కంటే ఎక్కువ సొమ్మును డిపాజిట్ చేశారు. అంటే.. రూ.25 లక్షలు చెల్లించారు. ఒకవేళ వాళ్లు గనుక సొంతం చేసుకోకుంటే తిరిగి డబ్బులు చెల్లిస్తుంది ఉత్సవ కమిటీ. వేలంపాట ముగియడంతో కాసేపట్లో నిమజ్జనం కోసం బాలాపూర్ గణేశుడు కదులుతాడు. బాలాపూర్ లడ్డూ వేలంపాట.. ఎవరు దక్కించుకున్నారు.. ఎంతకంటే.. ► 1994లో కొలను మోహన్‌రెడ్డి.. రూ. 450 ► 1995లో కొలను మోహన్‌రెడ్డి.. రూ. 4,500 ►1996లో కొలను కృష్ణారెడ్డి.. రూ. 18,000 ►1997లో కొలను కృష్ణారెడ్డి... రూ. 28,000 ►1998లో కొలను మోహన్‌రెడ్డి.. రూ. 51,000 ►1999లో కల్లెం అంజి రెడ్డి .. రూ. 65,000 ►2000లో కల్లెం ప్రతాప్‌రెడ్డి.. రూ.66,000 ►2001లో రఘునందన్‌చారి.. రూ. 85,000 ►2002లో కందాడ మాధవరెడ్డి.. రూ.1,05,000 ►2003లో చిగిరింత బాల్‌రెడ్డి.. రూ.1,55,000 ►2004లో కొలను మోహన్‌రెడ్డి...రూ. 2,01,000 ►2005లో ఇబ్రహీం శేఖర్... రూ.2,80,000 ►2006లో చిగిరింత తిరుపతి రెడ్డి..రూ.3,00,000 ►2007లో రఘునందర్‌చారి.. రూ.4,15,000 ►2008లో కొలను మోహన్‌రెడ్డి... రూ.5,07,000 ►2009లో సరిత రూ.5,10,000 ►2010లో కొడాలి శ్రీధర్‌బాబు..రూ.5,35,000 ►2011లో కొలను బ్రదర్స్... రూ. 5,45,000 ►2012లో పన్నాల గోవర్థన్‌రెడ్డి... రూ.7,50,000 ►2013లో తీగల కృష్ణారెడ్డి... రూ.9,26,000 ►2014లో సింగిరెడ్డి జైహింద్‌రెడ్డి...రూ.9,50,000 ►2015లో కొలను మదన్ మోహన్‌రెడ్డి... రూ.10,32,000 ►2016లో స్కైలాబ్‌రెడ్డి... రూ.14,65,000 ►2017లో నాగం తిరుపతిరెడ్డి... రూ.15,60,000 ►2018లో శ్రీనివాస్‌గుప్తా.. రూ.16,60,000 ►2019లో కొలను రామిరెడ్డి... రూ.17,60,000 ►2020 కరోనా కారణంగా సీఎం కెసిఆర్ కి అందజేశారు... ►2021లో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, మర్రి శశాంక్‌రెడ్డి... రూ. 18,90,000 ► 2022లో 24 లక్షల 60,000 వంగెటి లక్ష్మారెడ్డి ► 2023లో 27 లక్షలు దాసరి దయానంద్‌రెడ్డి -
భారీ పంపులతో ఎత్తిపోతలకు సిద్ధమైన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు
-
బీజేపీలో దరఖాస్తుల వెల్లువ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బీజేపీలో ఎన్నికల సందడి నెలకొంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి ఆసక్తి ఉన్న వారు మొదటిరోజే ఏకంగా 182 దరఖాస్తులు సమర్పి చారు. ఐతే కొందరు ఒకటికి మించి స్థానాలకు తమ దరఖాస్తులను సమర్పి చడంతో... వాస్తవానికి 63 నియోజకవర్గాలకే అభ్యర్థులు అప్లికేషన్లు ఇచ్చినట్లు భావించాల్సి ఉంటుందని పార్టీవర్గాలు చెబుతున్నాయి. దర ఖాస్తుల స్వీకరణ నిమిత్తం మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి, పార్టీనేతలు సుభాష్చందర్జీ, మల్లేశం గౌడ్లతో రాష్ట్ర పార్టీ కమిటీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. 4 చోట్ల పోటీకి దరఖాస్తు చేసిన శ్రీవాణి: సికింద్రాబాద్ నుంచి పోటీకి రవిప్రసాద్‌గౌడ్ మొదటగా ఈ కమిటీకి దరఖాస్తు సమర్పి చారు. భద్రాచలం స్థానం నుంచి మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి, వేములవాడ సీటుకు కరీంనగర్ మాజీ జడ్పీ చైర్పర్సన్ తుల ఉమ అప్లికేషన్ పెట్టుకున్నారు. సరూర్‌నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి ఏకంగా నాలుగు చోట్ల పోటీకి దరఖాస్తు చేసుకున్నారు. మహేశ్వరం, ఎల్బీనగర్, సనత్‌నగర్, ముషీరాబాద్ నియోజకవర్గాల నుంచి పోటీకి అవకాశమివ్వాలంటూ వేర్వేరు దరఖాస్తులు సమర్పించారు. ఎల్బీనగర్ అసెంబ్లీ టికెట్ కోసం సామా రంగారెడ్డి దరఖాస్తు చేశారు. – కిషన్‌రెడ్డి పరిశీలన కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి సోమవారం ఎన్నికల దరఖాస్తుల స్వీకరణ కేంద్రాన్ని పరిశీలించారు. అప్లికేషన్ ఇచ్చి న వారు మీడియాతో మాట్లాడకుండా నేరుగా నియోజకవర్గం వెళ్లి పనిచేసుకోవాలని ఆయన సూచించారు. మీడియా ముందు హంగామా చేసే వారి దరఖాస్తులు పక్కన పెట్టాలని పార్టీనాయకులను ఆయన ఆదేశించారు. ఇదిలా ఉంటే... ఈ నెల 10వ తేదీ వరకు ఆశావాహుల నుంచి బీజేపీ దరఖాస్తులను స్వీకరించనుంది. ఇది ముగిశాక మూడు స్థాయిల్లో అంటే జిల్లా, రాష్ట్ర, జాతీయపార్టీ స్థాయిలలో వడపోత కార్యక్రమం నిర్వహిస్తారని పార్టీ నేతల సమాచారం. – 25 స్థానాలకు ఒక్కో అభ్యర్థితోనే తొలిజాబితా పార్టీ ముఖ్యనేతలు, కచ్చి తంగా గెలిచే అవకాశాలున్న వారిని దాదాపు 25 స్థానాల వరకు కేవలం ఒక్కో అభ్యర్థితోనే తొలిజాబితా సిద్దం చేసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. మిగతా స్థానాల్లో ఒక్కో సీటుకు ముగ్గురు లేదా నలుగురు చొప్పున ప్రతిపాదిత పేర్లతో రఫ్ జాబితా సిద్ధం చేసి రాష్ట్రపార్టీ నుంచి పార్లమెంటరీ బోర్డుకు సమర్పి చవచ్చునని సమాచారం. ఇప్పటికే అధికార బీఆర్ఎస్ 113మంది అభ్యర్థులను ప్రకటించడంతో ఎక్కడికక్కడ నేతలంతా అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌పార్టీ సైతం పోటీచేసేందుకు ఆసక్తి ఉన్న వారి నుంచి దరఖాస్తులను స్వీకరించింది. ఈ నేపథ్యంలో బీజేపీలోనూ ఎన్నికల్లో పోటీకి దరఖాస్తుల ప్రక్రియ మొదటిరోజే వేగం పుంజుకుంది. రాబోయే ఆరు రోజుల్లో (ఈ నెల 10 వరకు) భారీగానే దరఖాస్తులు అందుతాయని పార్టీనాయకులు అంచనా వేస్తున్నారు. -
మద్యం మత్తులో కారు బీభత్సం.. విద్యార్థుల హల్చల్
సాక్షి, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. అతి వేగంలో ఉన్న కారు డివైడర్‌ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న డిగ్రీ విద్యార్ధి మృతి చెందాడు. మరో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల ప్రకారం.. మైలార్‌దేవ్‌పల్లిలో ఓ కారు బీభత్సం సృష్టించింది. దుర్గానగర్ చౌరస్తాలో కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ క్రమంలో కారు పల్టీలు కొట్టింది. అనంతరం.. రోడ్డుపై ఆగి ఉన్న కారును ఢీకొట్టి రోడ్డుకు అడ్డంగా కారు పడిపోయింది. ఇక, ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న డిగ్రీ విద్యార్థి చంద్రశేఖర్ మృతి చెందాడు. మరో ఇద్దరు విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో, వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. కాగా, విద్యార్థులు మద్యం సేవించి కారు నడిపినట్టు తెలుస్తోంది. ఇది కూడా చదవండి: ‘బెంగాల్ రామోజీ’ బిశ్వప్రియ గిరి అరెస్టు -
బుద్వేల్ భూం భూం.. ముగిసిన వేలం
Updates.. ►బుద్వేల్‌లో భూముల ఈ-వేలం ముగిసింది. మొత్తం 14 ప్లాట్లు 100.1 ఎకరాలను హెచ్ఎండీఏ విక్రయించింది. ఈ-వేలంలో రూ.3625.73 కోట్లు హెచ్ఎండీఏకు ఆదాయం సమకూరింది. ►ఈరోజు జరిగిన వేలంలో అత్యధికంగా ఎకరం ధర రూ.41.75కోట్లు పలికింది. ► అత్యల్పంగా ఎకరం ధర రూ.33.25 కోట్లు పలికింది. ► కాసేపట్లో బుద్వేలు భూముల ఈ-వేలం ముగియనుంది. ► భూముల వేలంంలో సరాసరి రూ.33 నుంచి 35 కోట్లతో బుద్వేల్ భూములు అమ్ముడవుతున్నాయి. ► ఈ క్రమంలో ప్రభుత్వానికి దాదాపు రూ.5వేల కోట్ల భారీ ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ► రెండో సెషన్లో రెండు ప్లాట్లకు వేలం కొనసాగుతోంది. ► రెండో సెషన్లో ప్లాట్ నెంబర్-13 కోసం హోరాహోరి బిడ్డింగ్ జరుగుతోంది. ప్లాన్ నెంబర్-13లో అత్యధికంగా ఎకరం ధర రూ.40.25కోట్లు పలుకుతోంది. ► ప్లాట్ నెంబర్-13లో మొత్తంగా 6.96 ఎకరాల ల్యాండ్ ఉంది. ► బుద్వేల్ భూముల ఈ-వేలం తొలి సెషన్ ముగిసింది. తొలిసెషన్లో 1,2,4,5,8,9,10 ప్లాట్లకు వేలం జరిగింది. ► తొలి సెషన్ బుద్వేల్ భూముల వేలంలో 58.19 ఎకరాలకు మెత్తం ఆదాయం రూ.2061 కోట్లు వచ్చింది. ► అత్యధికంగా ప్లాట్ నంబర్-4లో ఎకరం ధర రూ.39.25 కోట్లు. (14.33 ఎకరాలు) ► అత్యల్పంగా ఎకరం ధర ప్లాట్ నంబర్-2,5లో ఎకరం ధర. రూ.33.25 కోట్లు (plot no 2&5 total 18.74 ఎకరాలు) ► ప్లాట్ నెంబర్-1లో ఎకరం రూ.34.50 కోట్లు. ► ప్లాట్ నెంబర్-8లో ఎకరం రూ. 35.50 కోట్లు. ► ప్లాట్ నెంబర్-9లో ఎకరం రూ. 33.75 కోట్లు. ►ప్లాట్ నెంబర్-10లో ఎకరం రూ. 35.50 కోట్లు. ► కొనసాగుతున్న బుద్వేల్ భూముల వేలం ► రెండో సెషన్ వేలం ప్రారంభం ► రెండో సెషన్లో 11, 12,13,14,15, 16,17 ప్లాట్ల వేలం జరుగనుంది. ► మొదటి సెషన్లో ఇంకా కొన్ని ప్లాట్లకు కొనసాగుతున్న వేలం. ► మొదటి సెషన్లో సరాసరి ఎకరం 25 కోట్లు దాటి నడుస్తున్న వేలం ► అత్యధికంగా 5వ నెంబరు ప్లాట్లోలో ఎకరం 32 కోట్లు దాటిన ధర. ► ప్లాట్ నంబర్-1.. ఎకరం రూ. 33.25 కోట్లు ► ప్లాట్ నంబర్-4.. ఎకరం రూ. 33.25 కోట్లు. తొలి సెషన్లో ఇలా.. ప్లాట్ నెంబర్-9లో ఎకరం 22.75కోట్లు ప్లాట్ నెంబర్ -10లో ఎకరం 23 కోట్లు. ప్లాట్ నెంబర్-7లో ఎకరం 27కోట్లు. ప్లాట్ నెంబర్-8లో ఎకరాకు 28 కోట్లు పలికింది. ► కోకాపేట తర్వాత అంతే ప్రతిష్టాత్మకంగా అత్యంత విలువైన బుద్వేల్ భూముల వేలానికి ప్రభుత్వం సర్వం సిద్దం చేసింది. ఈ క్రమంలో వేలం కొనసాగుతోంది. కాగా, అత్యధికంగా 4వ నెంబర్‌కు 31 కోట్లు, 5వ నెంబరు ప్లాట్‌లో ఎకరం రూ.30 కోట్లు దాటి ధర పలికింది. ఇక పదో నెంబర్ ప్లాట్‌కి 23 కోట్లతో వేలం కంటిన్యూ అవుతోంది. ► ఇక, వేలం ప్రారంభం నుంచి ఈ-వేలం మందకోడిగా సాగుతోంది. వేలం ప్రారంభమై రెండు గంటలు దాటినా ధరలు మాత్రం పెద్దగా పలకడం లేదు. కాగా, సెషల్ ముగిసే సమయానికి ధరలు జోరందుకున్నాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి వేలం జోరందుకుంది. ఈ-వేలంలో ప్లాట్ నెంబర్ 9, 10లకు ఫుల్ డిమాండ్ కనిపిస్తోంది. సరాసరి ఎకరం రూ. 25 కోట్లు దాటి వేలం నడుస్తోంది. కాగా, కనీస నిర్దేశిత ధర ఎకరం రూ.20 కోట్ల రూపాయలతో వేలం ప్రారంభమైన విషయం తెలిసిందే. ► ప్లాట్ సైజులు కనిష్టంగా 3.47 ఎకరాలు.. ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) రాజేంద్రనగర్ సమీపంలో బుద్వేల్‌లో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) దాదాపు 182 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్న బుద్వేల్ లే అవుట్ ప్లాట్ల అమ్మకంలో భాగంగా గురువారం ఈ వేలం ప్రక్రియను ప్రారంభించింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు జరిగిన ఫస్ట్ సెషన్ వేలంలో ప్లాట్ నెం.1,2,4,5,8,9,10 లకు బిడ్డర్, రియల్ ఎస్టేట్ కంపెనీలు పోటాపోటీగా బిడ్లను సమర్పిస్తున్నారు. ► మధ్యాహ్నం మూడు నుంచి ఆరు గంటల వరకు రెండో సెషన్‌గా నిర్వహించే వేలంలో మరో ఏడు ప్లాట్లకు వేలం జరగనుంది. ఇక్కడి లే అవుట్ లో ప్లాట్ సైజులు కనిష్టంగా 3.47 ఎకరాలు, గరిష్టంగా 14.3 ఎకరాలుగా ఉన్నట్లు హెచ్ఎండీఏ అధికారులు వివరించారు. ఒక్కో ఎకరానికి మినిమమ్ అప్ సేట్ రేటుగా రూ. 20 కోట్లుగా నిర్ణయించి, ఈ ఆక్షన్ నిర్వహిస్తున్నారు. ఇది కూడా చదవండి: టీఎస్పీఎస్సీ ముందు తీవ్ర ఉద్రిక్తత.. స్లోగన్స్‌తో దద్దరిల్లుతున్న పరిసరాలు -
కంటోన్మెంట్ ప్రజలకు నిజంగా శుభవార్తే!
దేశంలోని సైనిక కంటోన్మెంట్లను రద్దు చేసి, వాటిలోని పౌర నివాస ప్రాంతాలను పక్కనున్న నగర పాలక సంస్థల్లో విలీనం చేయాలని, ఇక నుంచి కంటోన్మెంట్లను మిలిటరీ స్టేషన్లుగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కోట్లాది మంది ప్రజలకు నిజంగా శుభవార్త. సికింద్రాబాద్ కంటోన్మెంటు బోర్డు పరిధిలోని కొన్ని చోట్ల సైనిక దళాలు వాడుకునే రోడ్లపై పౌరులు తిరగకుండా ఆంక్షలు విధించినప్పుడు గత కొన్నేళ్లుగా నగరంలో అలజడి చెలరేగడం తెలుగు ప్రజానీకానికి తెలుసు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ఫలితంగా దేశంలోని ఈ కంటోన్మెంట్లలో సైన్యానికి అవసరం లేని, ప్రస్తుతం ఉపయోగంలో లేని లక్షలాది ఎకరాల ఖాళీ భూములను ఆయా నగరాలు, పట్టణాలు లేదా రాష్ట్రాలకు అప్పగిస్తారు. ఇప్పటికే హైదరాబాద్, ఆగ్రా వంటి 62 కంటోన్మెంటు నగరాల్లో ఖాళీ జాగాల కొరతతో జనసాంద్రత పెరిగిపోతోంది. చాలీచాలని పౌర సదుపాయాలతో జనం ఈ పట్టణాలు, నగరాల్లో నానా ఇబ్బందులు పడుతున్నారు. అదీగాక, ఎన్నికైన పౌర ప్రజానీకం ప్రతినిధులు, మిలిటరీ అధికారుల సంయుక్త ఆధ్వర్యంలో పాలనసాగే ఈ మిలిటరీ కంటోన్మెంట్ బోర్డుల పరిధిలోని ప్రాంతాల్లో మరో సమస్య ఉంది. అదేమంటే, సాధారణ ప్రజలకు ప్రభుత్వాలు అందించించే పథకాలు, సదుపాయాలు ఇప్పుడు ఇక్కడి ప్రజలకు అందడం లేదు. కేంద్రం తాజా నిర్ణయంతో కంటోన్మెంట్ల బోర్డుల రద్దుతో ఇలాంటి ప్రాంతాల్లోని ప్రజలకు ఆయా రాష్ట్రాల ప్రజలకు సర్కార్ల నుంచి అందే అన్ని ప్రయోజనాలు సమకూరుతాయి. రాష్ట్ర ప్రభుత్వాలకు అత్యంత విలువైన, అవసరమైన ఖాళీ స్థలాలు వేలాది ఎకరాల మేర అందుబాటులోకి వస్తాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం దేశంలో అతి పెద్ద భూస్వామి రక్షణ శాఖ. దేశంలో ఈ శాఖకు 17.99 లక్షల ఎకరాల భూమి ఉండగా, మొత్తం 62 మిలిటరీ కంటోన్మెంట్ల పరిధిలో 1.61 లక్షల ఎకరాల భూమి ఉందని ఢిల్లీలోని డిఫెన్స్ ఎస్టేట్స్ కార్యాలయం లెక్కలు వెల్లడిస్తున్నాయి. కోటిన్నర ఎకరాలకు పైగా ఉన్న ఈ భూములు చాలా వరకూ ఇక ముందు ప్రజోపయోగ కార్యక్రమాలకు ఉపయోగపడతాయి. నాడు బ్రిటీష్ పాలన కోసం కంటోన్మెంట్ల ఏర్పాటు బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ భారతదేశంలోని తన అధీనంలోని ప్రాంతాల ప్రజలను నియంత్రణలో ఉంచుకోవడానికి, విదేశీ దండయాత్రలను తిప్పికొట్టడానికి ఇంగ్లిష్ ఆఫీసర్లు, భారత సిపాయిలతో కూడిన కంపెనీ సైనిక దళాల మజిలీ కోసం ప్రధాన నగరాలు, పట్టణాల వెలుపల ఈ కంటోన్మెంట్లను ఏర్పాటు చేసింది. నాటి కలకత్తా సమీపంలోని బ్యారక్ పూర్ వద్ద తొలి సైనిక కంటోన్మెంటును 1765 జులై 10న ఈ కంపెనీ స్థాపించింది. బ్రిటిష్ సైనికులు స్థానిక జనంతో కలిసిపోకుండా, తమ సైనిక సంస్కృతిని కాపాడుకోవడం కోసం పెద్ద ఊళ్లకు బాగా వెలుపల ఈ కంటోన్మెంట్లను వేగంగా ఏర్పాటుచేసుకుంటూ పోయారు. సైనిక కార్యాలయాలు, ఆయుధాగారాలు, ఉదయాన పరేడ్ చేసే గ్రౌండ్లు, ఆటస్థలాలు, స్కూళ్లు, కాలేజీలు, భవిష్యత్తు ఆర్మీ అవసరాల కోసం ఉంచుకున్న స్థలాలు పోగా కంటోన్మెంటు పరిధిలో మిగిలి ఖాళీ స్థలాల్లో ఇతర సాధారణ పౌరులను ఇళ్లు కట్టుకుని నివసించడానికి కూడా అనుమతించారు. స్వాతంత్య్రం వచ్చేనాటకి 56 కంటోన్మెంట్లు ఉండగా, 1962లో అజ్మేర్ నగరంలో చివరి కంటోన్మెంటు నెలకొల్పారు. అంటే స్వతంత్ర భారతంలో ఆరింటిని కొత్తగా ఏర్పాటు చేశారు. ఈ 75 ఏళ్లలో దేశ జనాభాతో పాటు నగరాల జనసంఖ్య కూడా పెరిగిపోవడంతో జనావాసాలు కంటోన్మెంట్లను తాకేలా ముందుకు సాగిపోయాయి. ఈ నేపథ్యంలో అనేక సమస్యలు ప్రభుత్వాలు, కంటోన్మెంట్ల బోర్డులను చుట్టుముడుతున్నాయి. హైదరాబాద్ వంటి మహానగరాల్లోని కీలక ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వ కొత్త అవసరాలకు పది, పదిహేను ఎకరాల భూమి కనపడకపోవడంతో తమకు కంటోన్మెంట్ల అధీనంలోని ఆటస్థలాలు, ఇతర ఖాళీ భూములు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి చెందిన రక్షణశాఖను గతంలో అభ్యర్థించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలైతే తమ రాజధానుల ప్రాంతాలను చేర్చి ఉన్న కంటోన్మెంట్లను అక్కడ నుంచి తొలగించడానికి సిద్ధపడితే, కాస్త దూరంగా అంతకు రెట్టింపు విస్తీర్ణం గల భూములు ఇస్తామని కూడా కేంద్ర సర్కారుకు తెలిపాయి. ఈ నేపథ్యంలో సైనిక కంటోన్మెంట్ల రద్దుకు కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయం ఎంతైనా హర్షణీయం -విజయ సాయిరెడ్డి, వైఎస్సార్ సిపి, రాజ్యసభ ఎంపీ -
111 జీవో ఎత్తివేత.. 84 గ్రామాల్లో సంబరాలు
జీవో 111 అంటే ఏంటి? అసలు దీని వెనుక ఉన్న కథేంటి? ఎందుకు జీవో ఎత్తివేయాలని ప్రభుత్వం ఎందుకు అనుకుంది? 111 జీవో రద్దుకు క్యాబినెట్ ఆమోద ముద్ర పడటంతో ఎవరికి ప్రయోజనం? ఎవరికి నష్టం ? అసెంబ్లీ వేదికగా గతంలో 111 జీవోపై కీలక నిర్ణయం కేసీఆర్ ప్రకటించారు. తాజాగా 111 జీవో రద్దు చేస్తూ క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. 111 జీవో పరిధిలో పరిధిలో 1,32,600 ఏకరాల భూమి ఉంది. గతంలో జంట జలాశయ పరిరక్షణ కోసం ఈ జీవోను తెచ్చారు. హైదరాబాద్ నగరానికి ఇప్పుడు ఈ జలాశయాల నీరు అవసరం లేదని, ఇంకో వంద సంవత్సరాల వరకు హైదరాబాద్ కు నీటి కొరత ఉండదుని అందుకే ఇప్పుడున్న పరిస్థితుల్లో 111 జీవో అర్థరహితం అని కేసీఆర్ భావించారు. ఈ మేరకు అప్పట్లో ఒక నిపుణులు కమిటీ వేశారు. ఎక్స్పర్ట్స్ కమిటీ నివేదిక రాగానే 111 జీవో ఎత్తివేస్తాం అంటూ గతంలో సీఎం ప్రకటించారు. తాజాగా క్యాబినెట్ లో 111 రద్దుకు ఆమోద ముద్ర పడింది రియల్ ఎస్టేట్ రికార్డులు.. 111 వన్ జీవో.. చేవెళ్ల, రాజేంద్ర నగర్ నియోజకవర్గాల్లోని 84 గ్రామాల వ్యధ గుర్తుకు వస్తుంది. లక్ష 32 వేల ఎకరాల భూమి కథ ఇది... ఈ త్రిపుల్ వన్ జీవో. చాలా మంది పెద్దమనుషులు పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్ ఈ ప్రాంతం. ఒక్కసారి జీవో ఎత్తేస్తే… అక్కడ జరిగే రియల్ ఎస్టేట్ రికార్డులు సృష్టిస్తోంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 1,32,000 ఎకరాల్లో విస్తరించి ఉంది GO.111. ఏకంగా 84 గ్రామాలు ఈ జీవో పరిధిలోకి వస్తాయి. కొన్ని దశాబ్దాలుగా ఈ గ్రామాల ప్రజలు త్రిబుల్ వన్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ పట్టణానికి నీరందించే జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌ను కాపాడేందుకు 1996లో అప్పటి ప్రభుత్వం జీవో 111ను తీసుకువచ్చింది. ఈ జీవో పరిధిలో నిర్మాణాలు చేయడంపై నిషేధం విధించింది. వ్యవసాయం తప్ప ఏ రంగానికి ఇక్కడ భూమి కేటాయింపు చేయకూడదు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక త్రిబుల్ వన్ GO ఎత్తి వేస్తామంటూ ఎన్నికల హామీలు ఇచ్చాయి రాజకీయ పార్టీలు. దీంతో త్రిబుల్ వన్ జీరో పరిధిలో లావాదేవీలు పెద్ద ఎత్తున పెరిగాయి. చాలా ఏళ్లుగా పోరాటం.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని బడా పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకుల నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారుల వరకు చిన్నాపెద్ద అంతా 111 జీవోలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టారు. వెంచర్లు అక్రమ నిర్మాణాలతో రియల్ ఎస్టేట్ ట్రేడింగ్ భారీగా జరుగుతుంది. 111 జీవో ఎత్తివేయాలంటూ టీఆర్ఎస్ నేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డి కోర్టులో చాలా ఏళ్లుగా పోరాడుతున్నారు. సీఎం కేసీఆర్ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ ప్రాంత ప్రజలు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా జీవో ఎత్తివేయాలని ఉద్దేశంతోనే ఉంది. ఈ అంశం తెరపైకి వచ్చిన ప్రతిసారి రంగారెడ్డి ప్రజలంతా ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు. హైకోర్టు కొద్ది రోజుల క్రితం ప్రభుత్వం వేసిన కమిటీ రిపోర్టు అడగడంతో.. సీఎం కేసీఆర్ 111 జీవోపై సమీక్ష జరిపారు. రిపోర్టు కోర్టుకు అందించేందుకు కొంత సమయం కావాలని అడగాలని నిర్ణయించుకుంది. అంతేకాకుండా జీవో పరిధిలో మరింత ఉండేలా, జంట జలాశయాలు కాలుష్యం బారిన పడకుండా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. హైదరాబాద్ నగర వాతావరణ సమతుల్యతను పెంచేలా ప్రణాళికలు ఉండాలని సూచించారు. సంబరాలు మొత్తానికి 111జీవో పరిధిలో ఉన్న భూములు ఇక బంగారం కానున్నాయి. జీవో రద్దుతో 84 గ్రామాల్లోని ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. అజీజ్ నగర్ గ్రామస్థులు స్వీట్లు పంచి ఆనందం వ్యక్తం చేశారు. చదవండి: 111 పూర్తిగా రద్దు.. వీఆర్ఏల క్రమబద్ధీకరణ.. కేబినెట్ కీలక నిర్ణయాలివే.. -
రంగారెడ్డి: ప్రాణం తీసిన ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్
సాక్షి, రంగారెడ్డి: జిల్లా వ్యాప్తంగా బెట్టింగ్ జోరుగా సాగుతున్నాయి. ఇందులో డబ్బులు పందాలు కాచి పలువురు ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండలంలోని గిరాయి గుట్ట తండా పరిధిలోని నార్లగూడ తండాలో అంగోతు ప్రకాష్ (19) అనే యువకుడు బెట్టింగ్‌లో డబ్బులు కోల్పోయి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాత్రి జరిగిన ఢిల్లీ వర్సెస్ పంజాబ్ క్రికెట్ మ్యాచ్‌లో పంజాబ్ గెలుస్తుందని ప్రకాష్ కొంతమంది మిత్రులతో బెట్టింగ్ వేశాడు. ఈ మ్యాచ్‌లో పంజాబ్ ఓడిపోయింది. దీంతో బెట్టింగ్ మాఫియా డబ్బులు ఇవ్వాలని బలవంతం చేశారు. బెట్టింగ్ డబ్బులు కట్టలేని పరిస్థితిలో ఉన్న ప్రకాష్ ఏం చేయాలో తెలియక మానసిక ఒత్తిడికి గురై ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడని గ్రామస్థులు తెలిపారు. చదవండి: ఆ పేద బతుకులపై విధి కన్నెర్రచేసిందో ఏమో.. -
సా.6 గంటలకు చేవెళ్ల బహిరంగ సభలో పాల్గొననున్న అమిత్ షా
-
రంగారెడ్డి: ఉసురు తీసిన కంత్రీగాళ్లు
సాక్షి, రంగారెడ్డి: నార్సింగిలో జరిగిన దారుణ ఘటనపై స్థానికులు రగిలిపోతున్నారు. పెట్రోల్ బంక్‌లో పని చేసే కార్మికులపై ముగ్గురు యువకులు దాడి చేసి.. అకారణంగా ఒకరిని పొట్టనబెట్టుకున్నారు. అయితే దాడికి పాల్పడిన దుండగలకు నేర చరిత్ర ఉన్నట్లు ఇప్పుడు నిర్ధారణ అయ్యింది. మరోవైపు సంజయ్ మృతికి కారణమైన వాళ్లను కఠినంగా శిక్షించాలని అతని గ్రామస్తులు ధర్నా చేపట్టారు. ఏం జరిగిందంటే.. అర్ధరాత్రి 12 గంటలకు జన్వాడలోని ఓ పెట్రోల్ పంప్ వద్దకు కారులో ముగ్గురు యువకులు చేరుకున్నారు. అయితే.. సమయం దాటిపోవడం, పైగా వాళ్లు మద్యం మత్తులో ఉండడంతో పెట్రోల్ లేదని చెప్పారు కార్మికులు. అయితే.. తాము చాలా దూరం వెళ్లాలని ఆ యువకులు బతిమాలారు. దీంతో.. పెట్రోల్ పోశారు కార్మికులు. ఆపై వాళ్లు కార్డు పని చేయట్లేదని యువకులు బుకాయించారు. దీంతో.. క్యాష్ ఇవ్వమని సిబ్బంది కోరడంతో గొడవకు దిగారు. మాకే ఎదురు మాట్లాడుతారా? అంటూ ఆ మగ్గురు రెచ్చిపోయి బంక్ క్యాషియర్‌పై దాడికి దిగారు. అక్కడే పని చేసే సంజయ్ అది గమనించి.. వాళ్లను అడ్డుకోబోయాడు. దీంతో సంజయ్‌పై పిడిగుద్దులు కురిపించడంతో అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణం విడిచాడు. అది చూసి యువకులు పారిపోగా.. సంజయ్‌ను ఆస్పత్రికి తరలించినప్పటికీ లాభం లేకుండా పోయింది. పెట్రోల్ బంక్‌లో అమర్చిన సీసీ కెమెరాలో దాడికి సంబంధించిన దృశ్యాలు నమోదు అయ్యాయి. కేసు నమోదు.. వెతుకులాట ఇదిలా ఉంటే.. సంజయ్ మృతికి కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని జన్వాడ గ్రామస్తులు ధర్నాకు దిగారు. రోడ్డుపై రాస్తారోకో నిర్వహించి.. ట్రాఫిక్‌ను అడ్డుకున్నారు. జోక్యం చేసుకున్న పోలీసులు న్యాయం జరిపిస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు ఉత్తపుణ్యానికే సంజయ్ ప్రాణం పోవడంతో అతని కుటుంబం విషాదంలో కూరుకుపోయింది. మరోవైపు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు నార్సింగి పోలీసులు. నిందితులను జన్వాడ గ్రామానికి చెందిన నరేందర్, మల్లేష్, అనూక్‌గా గుర్తించారు. ప్రస్తుతం వాళ్లను పట్టుకునే యత్నంలో ఉన్నారు. ఇక నిందితులు నిందితులు అనూప్, నరేందర్, మల్లేష్ పై నార్సింగిలో పలు కేసులు నమోదు అయ్యాయి. అత్యాచారంతో పాటు దొంగతనం కేసుల్లో ప్రధాన నిందితులుగా ఉన్నారు ఈ కంత్రీగాళ్లు. గత నెలలో స్థానికంగా ఓ విలేకరిపైనా దాడి చేశారు వీళ్లు. -
ప్రయోగాత్మక విద్యతో లాభాలు
సీఎంఓ కృష్ణయ్య కొత్తూరు: ప్రయోగ్మాతకంగా విద్యాబోధన చేపడితే విద్యార్థులకు పాఠ్యాంశాలు సులువుగా అర్థమవుతాయని జిల్లా కమ్యూనిటీ మొబిలైజేషన్ అధికారి (సీఎంఓ) కృష్ణయ్య సూచించారు. మండలంలోని ఇన్ముల్‌నర్వ గ్రామ జెడ్పీహెచ్ఎస్లో పీఅండ్‌జీ పరిశ్రమ ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పరిశ్రమ ఆర్థిక సహకారంతో మైండ్ స్పార్క్ సంస్థ సమకూర్చిన కంప్యూటర్ మోడల్ ల్యాబ్‌ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు దృశ్య, వీక్షణ ద్వారా పాఠ్యాంశాలు బోధిస్తే వారికి విషయ పరిజ్ఞానం పెరగడంతో పాటు చాలాకాలం వరకు గుర్తుంటాయన్నారు. కరోనా కారణంగా చదువులో వెనకబడిన విద్యార్థులకు ఇలాంటి బోధన ఎంతో ఉపయోగకరమని అన్నారు. విద్యాభివృద్ధికి పీఅండ్‌జీ పరిశ్రమ తమ సహకారాన్ని ఎప్పటికీ అందిస్తుందని హెచ్ఆర్ డైరక్టర్ ఆశిష్ డొంగారియా, ఆపరేషన్స్ మేనేజర్ అనీష్ కులకర్ణి పేర్కొన్నారు. కార్యక్రమంలో మైండ్ స్పార్క్ సంస్థ ప్రతినిధి విశ్వనాథ్, ఎంఈవో కృష్ణయ్య, పాఠశాల హెచ్ఎం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ప్రతి కూలీకి ఉపాధి పని కల్పిస్తాం
యాచారం: జాబ్ కార్డు ఉన్న ప్రతి కూలీకి ఉపాధి పనులు కల్పిస్తామని డీఆర్డీఓ పీడీ ప్రభాకర్ పేర్కొన్నారు. మండలంలోని చింతపట్ల గ్రామంలో శుక్రవారం ఆయన పర్యటించారు. ఉపాధి పనులు చేస్తున్న కూలీల వద్దకు వెళ్లి పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఉదయం ఎన్ని గంటలకు పనులకు వస్తున్నారు, పనులు ప్రారంభించే సమయంలో, పనులు చేసే సమయంలో ఫొటోలు తీస్తున్నారా.. నింబంధనల ప్రకారం పనులు చేస్తున్నారా.. రికార్డుల నమోదు, కూలీల సంఖ్యపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలోని బృహత్ పల్లె ప్రకృతి వనం, నర్సరీలను సందర్శించారు. ఎండల తీవ్రత నేపథ్యంలో మొక్కలు ఎండిపోకుండా వారానికి మూడు రోజుల పాటు నీళ్లు అందించాలని సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా రోజూ 7 వేల మందికి పైగా కూలీలకు ఉపాధి పనులకు వస్తున్నారని తెలిపారు. రాబోయే వారం, పది రోజుల్లో ప్రతి గ్రామంలో 250కి మించి కూలీలు ఉపాధి పనులు చేసేలా చైతన్యం కల్పిస్తామన్నారు. కూలీలకు వారం, వారం డబ్బులు అందేలా కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ విజయలక్ష్మి, ఈజీఎస్ ఏపీఓ లింగయ్య, ఈసీ శివశంకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. డీఆర్డీఓ పీడీ ప్రభాకర్ -
సమస్యలపై ఫిర్యాదు చేయండి
మానవ హక్కుల కమిషన్ దక్షిణ భారత రాష్ట్రాల ఉపాధ్యక్షుడు పురుషోత్తంరెడ్డి షాద్‌నగర్: ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్, దక్షిణ భారత రాష్ట్రాల ఉపాధ్యక్షుడు వర్ధిరెడ్డి పురుషోత్తంరెడ్డి అన్నారు. శుక్రవారం షాద్‌నగర్ మున్సిపల్ పరిధిలోని శ్రీ సాయి బాలాజీ టౌన్షిప్ కాలనీని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నిబంధనలకు విరుద్దంగా వెంచర్లో డ్రైనేజీ పనులు చేపట్టారని, అదేవిధంగా పార్కులను అభివృద్ధి చేయలేదని వివరించారు. మురుగు నీటిని రీసైక్లింగ్ చేసే యంత్రాలను ఏర్పాటు చేస్తామని వెంచర్ నిర్వాహకులు హామీ ఇచ్చి నెరవేర్చలేదని ఫిర్యాదు చేశారు. నాసిరకం పైపులతో డ్రైనేజీ నిర్మించి పైప్‌లైన్‌పై మొక్కలు నాటారన్నారు. మొక్కలు పెరిగి వృక్షాలుగా మారడంతో డ్రైనేజీ పైపులు పగిలిపోతున్నాయని, దీంతో కాలనీలోకి మురు గు నీరు చేరుతోందని తెలిపారు. కాలనీలో తరచూ విద్యుత్ సమస్యలు ఎదురవుతున్నట్లు చెప్పా రు. అనంతరం పురుషోత్తంరెడ్డి మాట్లాడుతూ.. కాలనీ వాసులు సమస్యలతో కూడిన పత్రాలపై సంతకాలు చేసి మానవ హక్కుల కమిషన్ ప్రధాన కార్యాలయంలో ఫిర్యా దు చేయాలని సూచించారు. కమిషనర్ జాయింట్ సెక్రటరీ విజయేందర్‌రెడ్డి, రాంరెడ్డి, దా మోదర్‌రెడ్డి, మాధవరెడ్డి, అమర్నాథ్, రాజిరెడ్డి, ప్రభాకర్‌చారి, రాఘవేందర్‌రెడ్డి, ప్రభాకర్‌చారి, శ్రీనివాస్‌రెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, జగన్, ప్రకాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, మురళీధర్‌రెడ్డి, నాగార్జున తదితరులు పాల్గొన్నారు. -
ఎక్కడున్నా ఓటు పక్కా
షాబాద్: వలసదారుల ఓటు హక్కు విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. స్వగ్రామంలో ఓటు హక్కు ఉన్నా బతుకు దెరువు కోసం సుదూర ప్రాంతాల్లో స్థిరపడిన వారు ఎన్నికల సమయంలో ఆర్ధిక ఇబ్బందుల వల్ల రాలేకపోవడం.. ఓటు హక్కు వినియోగించుకోలేకపోవడం వంటి కారణాలను గుర్తించిన కేంద్ర ఎన్నికల సంఘం ఇలాంటి వారు ఉన్నచోటే ఓటు హక్కు వినియోగించుకునే వెసులుబాటు కల్పించనుంది. దీంతో జిల్లా నుంచి వలస వెళ్లిన వ్యక్తులకు ఎన్నికల సమయంలో ఓటు వేసేందుకు అవకాశం లభించనుంది. వ్యవసాయాధారిత జిల్లా కావడం పల్లెలు ఎక్కువగా ఉండడం.. వ్యవసాయ పనులు లేని సమయంలో పొట్టచేత పట్టుకుని హైదరాబాద్ తదితర ప్రాంతాలకు వెళ్లి పనులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఈ క్రమంలో ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి స్వగ్రామానికి వచ్చేందుకు ఆర్థిక భారం పడటం.. సుదూర ప్రాంతాల నుంచి రాలేక ఓటు వేయలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఓటింగ్ శాతం పడిపోయిన సందర్భాలున్నాయి. అయితే కేంద్ర ఎన్నికల సంఘం తీసుకురానున్న నూతన విధానం వల్ల ఉన్న చోటు నుంచే ఓటు వేసే రిమోట్ ఓటింగ్ సిస్టం ద్వారా అధిక శాతం నమోదుకు ఎన్నికల కమిషన్ ప్రయత్నిస్తోంది. ఓటర్లు తాము ఉంటున్న ప్రాంతాల నుంచే ముందస్తుగా ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నారు. పెరగనున్న ఓటింగ్ కేంద్ర ఎన్నికల సంఘం తీసుకొస్తున్న నూతన విధానం వల్ల జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది. ప్రతీ ఎన్నికల సమయంలో ఆయా నియోజకవర్గాలకు చెందిన ఓటర్లు ఇతర ప్రాంతాల్లో నివసిస్తుండటం వల్ల ఓటు హక్కు వినియోగించుకోలేక పోతున్నారు. కేంద్రం తీసుకొచ్చే నూతన విధానం ఓటర్లకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. నూతన విధానానికి కేంద్ర ఎన్నికల సంఘం శ్రీకారం వలసదారులు, కూలీలకు వెసులుబాటు ముందుగా దరఖాస్తు చేసుకున్న వారికే అవకాశం -
గుడ్‌న్యూస్! శంషాబాద్‌లో ఈఎస్ఐ ఆస్పత్రికి కేంద్రం ఆమోదం
కార్మికులకు మెరుగైన వైద్య సేవలందించేందుకుగాను రాష్ట్రంలో వంద పడకల ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు ఎట్టకేలకు ఏడాదిన్నరకు మోక్షం లభించింది. ఈ ప్రతిపాదనను ఆమోదిస్తున్నట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేంద్రయాదవ్ మంగళవారం అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు 190వ ఈఎస్ఐ సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 8 ఈఎస్ఐ వంద పడకల ఆస్పత్రులు ఏర్పాటు చేయనున్నామని, రాష్ట్రంలోని శంషాబాద్‌లో ఈఎస్ఐ ఆసుపత్రిని నిర్మించనున్నామని అధికారికంగా ప్రకటించారు. దీంతో కార్మికుల్లో హర్షం వ్యక్తమవుతోంది. హైదరాబాద్ శివారులో గగన్‌పహాడ్, కాటేదాన్, సాతంరాయి పారిశ్రామికవాడలతోపాటు కొత్తూరు, నందిగామ, బాలా నగర్, షాద్‌నగర్ పారిశ్రామిక వాడలకు శంషాబాద్ చేరువలో ఉంది. దీనికితోడు నగర శివారులోని అన్ని పారిశ్రామిక ప్రాంతాల నుంచి ఇక్కడికి రాకపోకలు సాగించేందుకు ఔటర్ రింగు రోడ్డు వంటి అనువైన అనుసంధాన రహదారులు, రైల్వే కనెక్టివిటీ ఉంది. (చదవండి: నో రూల్స్.. ఆర్టీఏ అధికారులని బురిడీ కొట్టిస్తున్న బీమా సంస్థలు) -
నార్సింగి కేసులో వీడిన మిస్టరీ.. ఇద్దరు అరెస్ట్
సాక్షి, రంగారెడ్డి: నార్సింగిలో వివాహిత కిడ్నాప్, సామూహిక లైంగిక దాడి కేసులో పోలీసులు ఇద్దరికి అరెస్ట్ చేశారు. బాచుపల్లికి చెందిన శుభంశర్మ, సుమిత్ శర్మను పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలిపారు. కాగా, గంటల వ్యవధిలోనే నిందితులను అరెస్ట్ చేయడం విశేషం. అయితే, ఓ మహిళను కిడ్నాప్ చేసి కారు డ్రైవర్లు.. ఆమెతో బలవంతంగా మద్యం తాగించారు. ఈ క్రమంలో స్పృహ కోల్పోయిన అనంతరం.. నిందితులు కారులోనే ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. తర్వాత ఆమెను గండిపేట వద్ద విచిడిపెట్టి కారులో పరారయ్యారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. గంటల వ్యవధిలోనే నిందితులను పట్టుకున్నారు. వారిపై 365, 376 (2)(g) 392, 342 సెక్షన్ ల కింద కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు. -
రంగారెడ్డి: రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి
సాక్షి, రంగారెడ్డి: జిల్లాలోని తుమ్మలూరు గేటు వద్ద ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. మృతులను నాగర్‌కర్నూల్ జిల్లావాసులుగా గుర్తించారు. వివరాల ప్రకారం.. తుమ్మలూరు గేటు వద్ద శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ డీసీఎం వ్యాన్‌ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. కాగా, మృతులను నాగర్ కర్నూల్ జిలఆ వెల్దండ మండలం పోతేపల్లి, లింగారెడ్డిపల్లి వాసులుగా గుర్తించారు. -
మేకలు, నాటు కోళ్ల పెంపకం.. ఏడాదికి రూ. 8–9 లక్షల నికరాదాయం!
మేకల పెంపకంలో పదేళ్ల అనుభవంతో స్థిరమైన నికరాదాయం పొందుతూ.. జీవాల పెంపకంపై ఆసక్తి చూపే రైతులకు మార్గదర్శిగా నిలిచారు మూల మహేందర్‌రెడ్డి. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం సింగప్పగూడ గ్రామంలో పాక్షిక సాంద్ర పద్ధతిలో ఆయన మేకలతో పాటు నాటు కోళ్లను పెంచుతూ మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. అంతేకాదు ఉచితంగా శిక్షణ ఇస్తూ వందలాది మంది రైతులకు తోడ్పాటునందిస్తున్నారు. జీవాల పెంపకంపై పూర్తి అవగాహన కలిగించుకొని, మక్కువతో పెంపకం చేపడితే వంద శాతం లాభాలు పొందుతారని నిక్కచ్చిగా చెబుతున్నారాయన. రైతు కుటుంబంలో పుట్టిన మహేందర్‌రెడ్డి బీఎస్సీ చదివి, కొంతకాలం బోర్వెల్ రంగంలో పనిచేశారు. 2005లో 14 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేసి వ్యవసాయం ప్రారంభించారు. తదనంతర కాలంలో వ్యవసాయంతోపాటు జీవాల పెంపకం కూడా తోడైతేనే నిరంతరం రైతుకు ఆదాయం వస్తుందని గ్రహించిన ఆయన మేకల పెంపకం వైపు దృష్టి సారించారు. ప్రభుత్వ పరంగా ఎలాంటి శిక్షణ, ప్రోత్సహకాలు లేకపోవటంతో సొంతంగానే అనేక రాష్ట్రాల్లో తిరిగి పరిశోధన చేశారు. గోట్ ఫార్మింగ్ పరిజ్ఞానం కోసం ఆయన పడిన కష్టం అంతా ఇంతా కాదు. కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో సొంత ఖర్చులతో పర్యటించారు. స్థానిక రైతులను కలిసి వారి అనుభవాలను తెలుసుకున్నారు. పూర్తిస్థాయిలో సక్సెస్ సాధిస్తామనే ధీమా ఎవరూ కల్పించలేకపోయారు. అయినా వెనకడుగు వేయకుండా పట్టుదలతో మేకల పెంపకం చేపట్టారు. ∙ఎలివేటెడ్ షెడ్లో విశ్రమిస్తున్న మేకలు ఎకరంలో షెడ్లు, మూడెకరాల్లో మేత... ప్రభుత్వ సబ్సిడీ పథకాలు సైతం లేక సొంతం గానే 2013లో 65 మేకలతో పాక్షిక సాంద్ర పద్ధతిలో మహేందర్‌రెడ్డి మేకల పెంపకం ప్రారంభించారు. రూ. 13 లక్షలు ఖర్చు చేసి ఎకరం విస్తీర్ణంలో షెడ్లు నిర్మించారు. మహేందర్‌రెడ్డి మూడేళ్లు కష్టపడి మేకల సంఖ్యను 250కు పెంచారు. 1 ఎకరంలో షెడ్లు, నివాస భవనం నిర్మించారు. షెడ్డులో మేకలను నేలపైన కాకుండా.. మీటరు ఎత్తున చెక్కలతో ఫ్లాట్‌ఫామ్‌ను నిర్మించి, దానిపై మేకలు విశ్రమించేలా ఏర్పాటు చేశారు. పెంటికలు చెక్కల సందుల్లో నుంచి నేల మీద పడిపోతాయి. మేకలకు గాలి, వెలుతురు చక్కగా తగులుతుంది. షెడ్‌కు పక్కనే చుట్టూ ఇనుప కంచెతో దొడ్డిని ఏర్పాటు చేశారు. మేకలు అక్కడ ఆరుబయట ఎండలో తిరుగుతూ మేత మేస్తాయి. మరో మూడు ఎకరాలు మేకలకు కావాల్సిన పచ్చిగడ్డి సాగుకు ఉపయోగిస్తున్నారు. ముగ్గురికి ఉపాధి కల్పిస్తున్నారు. ఖర్చులు పోను నెలకు రూ. 65–75 వేల నికరాదాయం, ఏడాదికి రూ. 8–9 లక్షల నికరాదాయం పొందుతూ మేకల పెంపకంలో పదేళ్లుగా ఆదర్శంగా నిలుస్తున్నారు. ఫామ్ వద్ద ఉచితం శిక్షణ తరగతులు ప్రతి శనివారం ఉచిత శిక్షణ మేకల పెంపకానికి ముందుకొచ్చే వారికి ఇప్పటికీ ప్రభుత్వపరంగా శిక్షణా కేంద్రాలు అందుబాటులో లేవు. ఈ లోటు భర్తీ చేయడానికి మహేందర్‌రెడ్డి సేవాభావంతో ముందుకొచ్చారు. సీనియర్ రైతుగా తన అనుభవాలను పంచాలనే ఆలోచనతో ప్రతి శనివారం తన ఫామ్ దగ్గరే ఉచితంగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేపట్టాల్సిన పద్ధతులను 3 గంటల పాటు సవివరంగా బోధిస్తున్నారు. ఆయన పట్టుదల, నైపుణ్యం గుర్తించిన వెటర్నరీ శాఖ ఔత్సాహిక రైతులను ఆయన ఫామ్‌కు క్షేత్రపర్యటనకు తీసుకురావటం ప్రారంభించారు. వివిధ రాష్ట్రాల నుంచి రైతులు, అగ్రి, ఫుడ్ బిజినెస్ విద్యార్థులు ఆయన వద్ద అనుభవపాఠాలు నేర్చుకుంటున్నారు. వెటరర్నీ ఉన్నతాధికారుల నుంచి ప్రసంశలు కోకొల్లలు. వ్యవసాయ కళాశాలలో అనేక సదస్సుల్లో ఆయన సుసంపన్నమైన తన అనుభవాలను పంచుతూ ఉంటారు. 2015లో రైతునేస్తం, 2016లో సీఆర్ఐడీఏ, 2018లో ఐసీఏఆర్ ఉత్తమ ఇన్నోవేటివ్ ఫార్మర్ పురస్కారాలు లభించాయి. మేకల పెంపకంలో మెలకువలు కొత్తగా గోట్ ఫార్మింగ్ చేపట్టే రైతులకు మహేందర్‌రెడ్డి చెబుతున్న సూచనలు: ►ఒక మేక సగటున రెండేళ్లలో మూడు ఈతల్లో ఈతకు రెండు పిల్లల చొప్పున ఇస్తుంది. ఒక మేక పిల్ల అమ్మకానికి రావడానికి 6 నుంచి 8 నెలల సమయం పడుతుంది. చిన్న పిల్లల పోషణను అశ్రద్ధ చేయకుండా మరణాల రేటు తగ్గించాలి. ►కనీసం 25 కేజీల బరువు ఉన్న మేకలనే అమ్ముకోవాలి. మార్కెటింగ్‌లో జీవాలను ఫారంలోనే అమ్ముకోవటం లాభాదాయంకంగా ఉంటుంది. నాణ్యమైన మేకల పెంపకమే నోటి ప్రచారంగా పనిచేస్తుంది. ►మేకల పెంపకాన్ని యాంత్రికంగా కాకుండా మనసుపెట్టి ఇష్టంగా చేస్తేనే వంద శాతం సక్సెస్ చేకూరుతుంది. ►ముందు జాగ్రత్త చర్యలను, యాజమాన్య మెలకువలు మక్కువతో పాటిస్తే.. 90 శాతం మందులు లేకుండానే మేకల సంతతిని పెంచుకుంటూ పోవచ్చు. ►మేలు రకం మేకల ఉత్పత్తితోనే లాభాలు వస్తాయి. మేకల ఉత్పత్తిలో తల్లి, తండ్రి మేకల నాణ్యత ముఖ్యం. ►పోషక విలువలు ఉండే నాణ్యమైన మేతలను మేకలకు కడుపునిండా అందించటంతో నాణ్యమైన మేకల ఉత్పత్తి ద్వారా అధిక లాభాలు సాధ్యం. ►సాంద్ర పద్ధతిలో మేకల పెంపకం ఎంతో మేలు. సగం ఎండు మేత, సగం పచ్చి మేతలను అందించాలి. ►ఇరుకుగా కాకుండా అవసరమైన విస్తీర్ణం మేరకు షెడ్ల నిర్మాణం, పరిశుభ్రత, చూడి మేకల, పిల్లల పోషణలో ప్రత్యేక జాగ్రత్తలు అవసరం. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఎలివేటెడ్ షెడ్లు నిర్మించాలి. సీజన్‌కు తగిన రీతిలో షెడ్ల నిర్వహణ ఉండాలి. ►మేకల పెంపకంలో రైతు సక్సెస్ కావాలంటే ఎట్టి పరిస్థితుల్లో యాజమాన్య లోపం రానివ్వకూడదు. జీవాలకు పోషక విలువలతో కూడిన మేతను కమం తప్పకుండా అందించాలి. మేకల రైతుల సేవలో.. నా ఫామ్‌లో 250 మేకలున్నాయి. వీటి పెంపకానికి మొత్తం 4 ఎకరాల భూమిని ఉపయోగిస్తున్నా. ముగ్గురికి ఉపాధి కల్పిస్తూ 250 మేకలను పెంచుతున్నా. మేకల పెంపకంతోపాటు నాటు కోళ్ల పెంపకం చేపట్టా. 20 కోళ్లతో ప్రారంభించా. ఇప్పుడు 100కు చేరాయి. వీటిని 500లకు పెంచేందుకు కృషి చేస్తున్నా. మేకలు, కోళ్ల పెంపకానికి మొత్తంగా ఏడాదికి ఈ సుమారు రూ. 6 లక్షల ఖర్చు అవుతుంటే దాదాపు రూ. 14–15 లక్షల ఆదాయం వస్తున్నది. ఖర్చులు పోను ఏడాదికి సుమారు రూ. 8–9 లక్షల నికరాదాయం సంపాదిస్తున్నా. నా అనుభవాలను అందరికీ అందించి సహాయ పడాలనే ఆలోచనతో ఏడేళ్లుగా ప్రతి శనివారం ఉచితంగా ఫామ్ దగ్గరే రైతులకు అవగాహన తరగతులు నిర్వహిస్తున్నా. వారికి ఎప్పుడు ఏ సమాచారం కావాల్సినా ఫోన్లో అందిస్తూ వస్తున్నా. నాకు అవకాశం ఉన్నంత వరకు ఈ సేవ కొనసాగిస్తునే ఉంటాను. రైతులకు అవగాహన కల్పించేందుకు కృషి చేస్తా. ఏడాదిలో 365 రోజులూ మేక మాంసానికి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో మంచి డిమాండ్ ఉంటుంది. హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల ప్రజల అవసరాలకు ప్రతి రోజు సగటున 7–8 వేల మేకల అవసరం ఉంటుందని అంచనా. ప్రభుత్వపరంగా కూడా జీవాల పెంపకంలో శిక్షణ ఇచ్చే ఏర్పాటు చేయాలి. మేకల పెంపకంపై అవగాహన, ఇష్టమే విజయ సోపానమవుతుంది. – మూల మహేందర్‌రెడ్డి (8008639618), ఆదర్శ మేకల పెంపకందారుడు, సింగప్పగూడ, చేవెళ్ల మం., రంగారెడ్డి జిల్లా – ఎస్.రాకేశ్, సాక్షి, చేవెళ్ల, రంగారెడ్డి జిల్లా సాగుబడి నిర్వహణ: పంతంగి రాంబాబు చదవండి: Red Rice Health Benefits: బియ్యంపై పొరలో ‘ప్రోయాంతో సైనిడిన్’..అందుకే అలా! ఎర్ర బియ్యం వల్ల.. వేలెడంత సైజు.. వండుకుని తింటే.. ఆ టెస్టే వేరు! -
కోవిడ్ టీకాలకు కటకట..!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: రాష్ట్రంలో కోవిడ్ టీకాలకు కొరత ఏర్పడింది. ముఖ్యంగా కోవిషీల్డ్ వ్యాక్సిన్ల స్టాక్ పూర్తిగా ఖాళీ అయింది. టీకా కోసం ప్రభుత్వ వ్యాక్సినేషన్ సెంటర్లకు వెళ్తున్నవారికి ప్రస్తుతం అందుబాటులో లేవన్న సమాధానమే వస్తోంది. మరోవైపు చైనాతోపాటు పలు దేశాల్లో భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయని, కొత్త వేరియంట్లు ప్రభావం చూపుతున్నాయని వస్తున్నవార్తలతో జనంలో ఆందోళన కనిపిస్తోంది. డిమాండ్ మేరకు టీకాలను సరఫరా చేయకపోవడం, ప్రభుత్వ కోల్డ్ చెయిన్ పాయింట్ (సీసీపీ), డిస్ట్రిక్స్ వ్యాక్సి నేషన్ పాయింట్ (డీవీ ఎస్) కేంద్రాలకు ఇప్పటికే సర ఫరా చేసిన కోవిషీల్డ్ టీకాల గడువు ముగిసిపోవడం వంటివి ఇబ్బందికరంగా మారింది. ఇదే టీకా తొలి రెండు డోసులు వేసుకున్న వారితోపాటు విదేశాలకు వెళ్లాల్సినవారు వ్యాక్సిన్లు అందుబాటులో లేక ప్రైవేటులో తీసు కోవాల్సి వస్తోంది. ఈ పరిస్థితిని సొమ్ముచేసు కుంటున్న ప్రైవేటు ఆస్పత్రులు టీకాలతోపాటు అదనపు చార్జీలు అంటూ అడ్డగోలుగా వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కోవిషీల్డ్ గడువు ముగియడంతో.. కరోనా వైరస్ నుంచి రక్షణ కోసం ప్రభుత్వం ప్రజలకు కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లను ఇస్తోంది. మెజార్టీ ప్రజలు మొదటి, రెండో డోసు కోవిషీల్డ్ టీకాలు తీసుకున్నారు. బూస్టర్ డోసులు పంపిణీ మొదలైనా ఇటీవలి వరకు పెద్దగా డిమాండ్ కనిపించలేదు. కానీ కొన్నిరోజులుగా కోవిడ్ కొత్త వేరియంట్లను గుర్తించడం, ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల్లో మళ్లీ ప్రభావం చూపిస్తుండటంతో.. బూస్టర్ (ప్రికాషన్) డోసు వేసుకునేందుకు ప్రజలు ముందుకొస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3,24,42,135 ఫస్ట్‌డోసు, 3,15,40,633 సెకండ్ డోసు టీకాలను పంపిణీ చేశారు. వీరిలో 1,32,93,044 మంది ప్రికాషన్ డోసు తీసుకోగా.. మరో 1,61,38,443 మందికి అవసరం ఉంది. ప్రభుత్వం ఇంతకు ముందు సరఫరా చేసిన కోవిïషీల్డ్ టీకాల గడువు ఈ నెల 10వ తేదీతో ముగిసి పోయింది. దీనితో మిగిలిన టీకాలను పక్కన పడేశారు. సంబంధిత వెబ్సైట్ కూడా మూడు రోజుల కిందే మూతపడింది. ప్రస్తుతం ఆస్పత్రుల్లో కోవాగ్జిన్ మాత్రమే అందుబాటులో ఉంది. అది కూడా 2.77 లక్షల డోసులే స్టాకు ఉంది. ఈ వ్యాక్సిన్ గడువు కూడా ఈ నెలా ఖరుతో ముగియ నున్నట్టు సమాచారం. టీకా నిల్వలు దగ్గరపడుతుండటంతో వైద్య సిబ్బంది కూడా ఏమీ చేయ లేక చేతులెత్తేస్తున్నారు. వ్యాక్సినే షన్ కోసం ఆస్పత్రు లకు వెళ్తున్నవారు నిరాశతో వెనుదిరుగుతున్నారు. కోవిషీల్డ్ బూస్టర్ డోస్ లేదన్నారు ఈ నెల 23న అమెరికా వెళ్లాల్సి ఉంది. వాక్సినేషన్ తప్పనిసరి చేశారు. ఇప్పటికే మొదటి, రెండు డోసులు కోవిషీల్డ్ తీసుకున్నా. బూస్టర్ డోసు తీసుకోవాల్సి ఉంది. టీకా కోసం గురువారం బాలాపూర్ పీహెచ్‌సీకి వెళ్లాను. కానీ ఆ టీకా లేదన్నారు. ఎనిమిది రోజుల్లో ప్రయాణం ఉంది. ఇప్పుడేం చేయాలో అర్థం కావడం లేదు. – అశోక్‌కుమార్, మీర్పేట్, హైదరాబాద్ టీకాల కోసం లేఖ రాసినా స్పందించని కేంద్రం కేంద్ర ప్రభుత్వం కంపెనీల నుంచి కరోనా టీకాలను తీసుకుని దేశవ్యాప్తంగా రాష్ట్రాలకు సరఫరా చేస్తుంది. ఆయా రాష్ట్రాల అవసరాలు, డిమాండ్‌ను బట్టి పంపిణీ చేస్తుంది. రాష్ట్రంలో కోవిడ్ టీకాల స్టాకు ఖాళీ అవుతుండటంతో వెంటనే పంపాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావు కొన్నిరోజుల కిందే కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయకు విజ్ఞప్తి చేశారు. కానీ దీనిపై కేంద్రం ఇంతవరకు స్పందించలేదని.. రాష్ట్ర అవసరాలకు తగినట్టుగా కేంద్రం నుంచి టీకాలు అందడం లేదని వైద్యారోగ్య శాఖ వర్గాలు చెప్తున్నాయి. -
రూట్ మార్చిన రైతులు.. కొత్త రకం సాగుతో అన్నదాతకు లాభాలు!
కొందుర్గు, రంగారెడ్డి జిల్లా: ఆహార, వాణిజ్య పంటలతోపాటు కూరగాయలు, ఆకుకూరలు, పూలతోటలు సాగులో అధిక పెట్టుబడులు పెట్టి నష్టాలపాలైన రైతులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఎక్కడో థాయ్‌లాండ్, వియత్నం దేశాల్లో సాగుచేసే డ్రాగన్ పండ్ల తోటలతోపాటు చేపల పెంపకంపై దృష్టి సారిస్తున్నారు. ఎలాంటి చీడపీడలు ఆశించని, తక్కువ పెట్టుబడితో సాగుచేసే డ్రాగన్ పండ్ల తోటలను రంగారెడ్డి జిల్లాలోని కొందుర్గు మండలం ఉమ్మెంత్యాల, ముట్పూర్ గ్రామాల రైతులు ఉద్యాన శాఖ అధికారుల సలహాలతో సాగు చేస్తున్నారు. ఫ్రూట్స్ పండించడంతోపాటు డ్రాగన్ మొక్కలకు సంబంధించిన నర్సరీని సిద్ధం చేసి ఇతర రైతులకు విక్రయిస్తూ లాభాలు గడిస్తున్నారు. వ్యవసాయానికి అంతగా అనుకూలించని గరపనేలల్లోనూ తక్కువనీటితో ఈ పండ్లు సాగు చేయొచ్చని చెబుతున్నారు. యూట్యూబ్ చూసి.. సాగు చేసి కొందుర్గు మండలం ఉమ్మెంత్యాల గ్రామానికి చెందిన రైతు రవీందర్ రెడ్డి యూట్యూబ్ చూసి ఈ పంటను సాగుచేసి అధునాతన ఒరవడి సృష్టించాడు. సంగారెడ్డిలో ఓ రైతు సాగుచేసిన తోటను పరిశీలించి ఆయన అనుభవాలను తెలుసుకున్నాడు. డ్రాగన్ ఫ్రూట్స్ పీ పింక్ రకం మొక్కలు ఎంపిక చేసుకొని ఒక్కో మొక్కకు రూ.70 చొప్పున మాట్లాడుకొని 2 వేల మొక్కలు తెచ్చి మూడెకరాల్లో నాటాడు. ప్రస్తుతం మరో రెండువేల మొక్కలను స్వతహాగా తయారు చేసుకొని మరో మూడు ఎకరాల్లో నాటడంతోపాటు ఇతర రైతులకు మొక్కలను సిద్ధం చేశాడు. అతడిని చూసిన మరికొంతమంది రైతులు డ్రాగన్ తోటలను సాగుచేశారు. కేశంపేట, చేవెళ్ల, భూత్పూర్, మక్తల్, నారాయణపేట ప్రాంతాల్లోనూ డ్రాగన్ తోటలను సాగుచేస్తున్నారు. దిగుబడి, మార్కెటింగ్.. ఈ పంట సాగుచేసిన 8 నెలలకు దిగుబడి ప్రారంభమవుతుంది. ఒక పండు 600 నుంచి 700 గ్రాములు ఉంటుంది. ఒక్కో మొక్కకు దాదాపు 25 కిలోల పండ్లు వస్తాయి. హైదరాబాద్‌లోని ఫ్రూట్ మార్కెట్లలో విక్రయిస్తున్నారు. కిలోకు రూ.150 నుంచి రూ.200 వరకు ధర పలుకుతుందని రైతులు చెబుతున్నారు. చెరువులు తవ్వి.. చేపలు పెంచి మరోవైపు మరికొంతమంది రైతులు చెరువులను తవ్వి చేపల పెంపకంపై దృష్టి సారించారు. ఒక్కో చేప పిల్లకు రూ.16 చొప్పున ఖర్చుచేసి నల్లగొండ నుంచి మూడు నెలల వయస్సు గల చేప పిల్లలను తెచ్చి చెరువుల్లో వదిలారు. అర ఎకరం విస్తీర్ణంలో పదివేల వరకు చేపపిల్లలను పెంచొచ్చని తెలిపారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం దాణా వేయాలని, 8 నుంచి తొమ్మిది నెలల వ్యవధిలో ఒక్కో చేప కిలో బరువు దాటుతుందని అంటున్నారు. రెండో ఏడాది నుంచి దిగుబడి డ్రాగన్ సాగుచేయడానికి మొదటగా పిల్లర్లు, డ్రిప్‌ల కోసం ఎకరాకు రూ.5 లక్షల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. మొదటి ఏడాది కాస్తా దిగబడి తక్కువగా ఉన్నా రెండో ఏడాది నుంచి పెరుగుతుంది. మూడు, నాలుగేళ్ల సమయంలో ఎకరాకు 50 నుంచి 80 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఖర్చులు పోను ఎకరాకు రూ.5 లక్షల దాకా లాభం వస్తుంది. ఈ పంట 30 ఏళ్ల వరకు దిగుబడి వస్తుంది. – రవీందర్‌రెడ్డి, రైతు, ఉమ్మెంత్యాల చేపల పెంపకంతో లాభాలు 15 గుంటల విస్తీర్ణంలో చెరువు తవ్వి 10 వేల చేపపిల్లలను వదిలాను. గుంత తవ్వడం, కవర్ వేయడం, చుట్టూ కంచె వేయడానికి రూ.5 లక్షల ఖర్చు వచ్చింది. దాణాకు మరో రూ.10 లక్షలు అయ్యింది. తొమ్మిది నెలల్లో ఒక్కో చేపపిల్ల కిలో బరువు వచ్చింది. ప్రస్తుతం చెరువు వద్దే కిలో రూ.310 చొప్పున విక్రయిస్తున్నాను. ఇప్పటికి 500 కిలోలు అమ్మగా మరో 6 వేల కిలోల వరకు దిగుబడి వస్తుంది. ఈ ఏడాది ఖర్చులు పోను రూ.5 లక్షల వరకు లాభం వస్తుంది. వచ్చే ఏడాది చేపపిల్లలు, దాణా ఖర్చు మాత్రమే ఉంటుంది. ఈ లెక్కన అర ఎకరం విస్తీర్ణంలో చెరువును తవ్వి చేపలు పెంచితే 10 నెలలకు రూ.10 లక్షలు సంపాదించొచ్చు. – రాయికంటి శ్రీనివాస్‌రెడ్డి, ఉమ్మెంత్యాల. -
నన్ను ఎందుకు పట్టించకోవడంలేదు.. వివాహేతర సంబంధం కారణంగా..
మొయినాబాద్: కీడును శంకించిన ఓ మహిళ తన హత్యకు ముందు కూతురుకు ఫోన్ చేసింది. ఓయమ్మో.. నా మానం పాయే.. ప్రాణం పాయే.. నన్ను సంపుతుండే అంటూ భయాందోళనతో చెప్పిన మాటలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మేస్త్రీ.. ఒంటరిగా ఉన్న సదరు మహిళను గొంతు నులిమి చంపాడు. ఈ దారుణ ఘటన రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్‌లో ఆదివారం వెలుగుచూసింది. ఈ ఘటనపై ఇన్స్పెక్టర్ డీకే లక్ష్మీరెడ్డి కథనం ప్రకారం.. వికారాబాద్ జిల్లా దోమ మండలం మల్లేపల్లికి చెందిన పులుకుంట లక్ష్మి (50), రాములు దంపతులకు ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు సంతానం. నాలుగేళ్ల క్రితం బతుకుదెరువు కోసం మొయినాబాద్‌కు వచ్చారు. అద్దె గదిలో ఉంటూ కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం మొగలమడక గ్రామానికి చెందిన హన్మంతు కొన్నేళ్లుగా మొయినాబాద్‌లో ఉంటూ మేస్త్రీ పని చేసేవాడు. మేస్త్రీ చేతి కింద పనికి వెళ్లిన లక్షి్మకి అతనితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. ఎనిమిది నెలల క్రితం లక్ష్మి భర్త రాములు మృతి చెందాడు. అప్పటి నుంచి ఆమె తన కొడుకుతో కలిసి సొంతూరు మల్లేపల్లికి వెళ్లి అక్కడే వ్యవసాయం చేసుకూంటూ జీవనం సాగిస్తోంది. పదిహేను రోజుల క్రితం కూలి పని కోసం మళ్లీ మొయినాబాద్‌కు వచ్చింది. అద్దె గదిలో ఉంటూ కూలి పని చేస్తోంది. విషయం తెలుసుకున్న హన్మంతు శనివారం రాత్రి ఆమె గదికి వచ్చాడు. అప్పటికే మద్యం తాగి ఉన్న అతడు తనను ఎందుకు పట్టించుకోవడం లేదని ఆమెతో గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో కోపోద్రిక్తుడైన హన్మంతు.. చీర కొంగుతో లక్ష్మి మెడకు చుట్టి గొంతు నులిమి హత్య చేశాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఇన్స్పెక్టర్ తెలిపారు. కాగా, నిందితుడు హన్మంతును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. -
మున్సిపల్ అధికారుల చేతివాటం.. 12కోట్ల విలువైన ల్యాండ్..
సాక్షి, రంగారెడ్డి: తట్టిఅన్నారంలో మున్సిపల్ అధికారులు చేతవాటం చూపించారు. కబ్జాదారుడు కేవీ సత్యనారాయణ రెడ్డితో అధికారులు చేతులు కలిపి అవినీతికి పాల్పడ్డారు. వివరాల ప్రకారం.. కేవీ సత్యనారాయణతో చేతులు కలిపిన మున్సిపల్ అధికారులు వివాదాస్పద ప్రైవేటు భూమిలో సీసీ రోడ్డు నిర్మాణం చేపించారు. రూ.12 కోట్ల విలువైన భూమిని కాజేసేందుకు క్రుట చేశారు. ఈ క్రమంలో స్థానికులు వారిపై ఫిర్యాదు చేసినా మున్సిపల్ ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. రోడ్డు ఆపేశామని చెప్పి తెల్లారేసరికి రోడ్డు పనులు పూర్తిచేశారు. ఈ క్రమంలో రోడ్డు నిర్మాణం అడ్డుకున్న బాధితున్ని కబ్జాదారుడు బెదిరింపులకు గురిచేశాడు. దీంతో, ఈ విషయాన్ని పోలీసు కమిషనర్ దృష్టికి బాధితులు తీసుకెళ్లారు. ఈ సందర్భంగానే ప్రతీరోజు ప్రైవేటు గూండాలను పెట్టి పహరా కాస్తున్నట్టు తెలిపారు. దీంతో, పోలీసులు సత్యనారాయణరెడ్డిపై హయత్‌నగర్ పీఎస్‌లో కేసు నమోదు చేశారు. -
కలిసి చదివి.. ఒకేచోట ఉద్యోగం
రంగారెడ్డి: ఆ ముగ్గురు చిన్నప్పుడు కలిసి చదువుకున్నారు.. ఉన్నత చదువుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లారు. చదువులు ముగించుకుని ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. మళ్లీ ఆ ముగ్గురిని ప్రభుత్వ పాఠశాల కలిపింది. పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులుగా ఒక్కరు పాఠశాల సబార్డినేటర్గా విధులు నిర్వహిస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా ముసాపేట మండల కేంద్రానికి చెందిన అస్కాని శ్రీనివాససాగర్, సుజాత, శంకరయ్యలు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలో పదో తరగతి వరకు కలిసి చదువుకున్నారు. 1985–86వ సంవత్సరంలో పదవ తరగతి పూర్తి చేసుకుని ఉన్నత విద్యకు వేర్వేరు ప్రాంతాలకు వెళ్లారు. అనంతరం ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఒకరు సబార్డినేటగా ఉద్యోగాలు సాధించారు. రాష్ట్ర ప్రభుత్వం 317 జీఓలో గద్వాల జిల్లా నుంచి సుజాత, మహబూబ్‌నగర్ జిల్లా నుంచి శంకరయ్య మండల పరిధిలోని కొత్తపేట జెడ్పీహెచ్‌ఎస్‌కు బదిలీపై వచ్చారు. అప్పటికే ఇక్కడ విధులు నిర్వహిస్తున్న అస్కాని శ్రీనివాససాగర్తో కలిసి ఇదే పాఠశాలలో మిగతా ఇద్దరు చేరారు. బాల్య మిత్రులు మళ్లీ ఒకే పాఠశాలలో కలుసుకోవడం పట్ల పలువురు ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
యువతి కిడ్నాప్ కేసు.. వీడియోలు వైరల్.. నవీన్‌రెడ్డి సోదరుడి అరెస్ట్
సాక్షి, రంగారెడ్డి: ఆదిభట్ల పరిధిలోని మన్నెగూడ యువతి వైశాలి కిడ్నాప్ కేసులో నిందితుడు నవీన్‌రెడ్డి సోదరుడు నందీప్రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. నవీన్‌రెడ్డి, వైశాలి వీడియోలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేశారనే నేపథ్యంలో నందీప్ రెడ్డిని అందుపులోకి తీసుకున్నారు. గోవాలో నవీన్‌రెడ్డి వీడియోలను రికార్డు చేసిన నందీప్ రెడ్డి.. వాటిని మీడియాకు పంపినట్లు పోలీసులు గుర్తించారు. వైశాలి ఫిర్యాదుతో నందీప్‌రెడ్డి, వంశీభరత్‌రెడ్డిని ఆదిభట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. మీడియాలో వైశాలి వీడియోలు ప్రసారం చేయొద్దని పోలీసులు పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా వైశాలి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడైన నవీన్ రెడ్డిని పోలీసులు కోర్టు ఎదుట హాజరుపర్చగా.. 14 రోజుల రిమాండ్ విధించారు. మరోవైపు నవీన్ రెడ్డికి చెందిన రెండు వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాను ఒక గంట నిడివి ఉన్న వీడియో విడుదల చేస్తే.. తప్పు ఒప్పుకున్నట్లు ఒక్క నిమిషం మాత్రమే ఎడిట్ చేసి చూపించారని నవీన్ పేర్కొన్నాడు. వీడియోలో తాను వైశాలిని ఎంతగా ప్రేమించాను, తాము ఎక్కడెక్కడికి వెళ్లాం, తిరిగిన ప్రదేశాలు, షాపింగ్‌లకు సంబంధించిన విషయాలు, తమ ప్రేమకు ఎవరకు అడ్డంకులు సృష్టించారనే విషయాలు అందులో చెప్పుకొచ్చాడు నవీన్. తన వీడియోను చూసి పోలీసులు తనకు న్యాయం చేయాలని కోరాడు. ఈ వీడియో గోవాలో రికార్డ్ చేసినట్లు తెలుస్తోంది. చదవండి: వివాహేతర సంబంధానికి భర్త అడ్డు..గ్రామంలో జాతర ఉందని చెప్పి! -
వేడెక్కిన రాజకీయం.. నోటిఫికేషన్‌కు ముందే జోరుగా ప్రచారం
సాక్షి, రంగారెడ్డిజిల్లా: హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నోటిఫికేషన్‌కు ముందే రసవత్తరంగా మారింది. ఉపాధ్యాయ సంఘాలు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించడంతో పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. జిల్లాలు, మండలాల వారీగా పర్యటించి ఉపాధ్యాయుల మద్దతు కూడగట్టే పనిలో నిమగ్నమయ్యారు. పాఠశాలల వారీగా ఉపాధ్యాయ ఓటర్లను గుర్తించి వారి పేర్లను ఓటర్ల జాబితాలో నమోదు చేయిస్తున్నారు. ఒకవైపు ఓటర్లను ఆకర్షిస్తూనే.. మరోవైపు అధికార, ప్రతిపక్ష పార్టీల మద్దతు కూడగట్టేందుకు యత్నిస్తున్నారు. జిల్లాల వారీగా ఉన్న ముఖ్య నేతలతో సమావేశమై మద్దతు ప్రకటించాల్సిందిగా అభ్యర్థిస్తున్నారు. పీఆర్టీయూ తెలంగాణ మద్దతుతో ప్రస్తుత ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్‌రెడ్డి మళ్లీ బరిలోకి దిగుతుండగా, పీఆర్టీయూ టీఎస్ అభ్యర్థిగా గుర్రం చెన్నకేశవరెడ్డి, యూటీఎఫ్ నుంచి మాణిక్‌రెడ్డి, ఎస్టీయూ నుంచి భుజంగరావు పోటీలో ఉన్నారు. మొదలైన ఓటర్ల నమోదు ప్రక్రియ 2023 మార్చితో హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్ ఉపాధ్యాయ ప్రస్తుత ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్‌రెడ్డి పదవీకాలం ముగుస్తుంది. ఈ నేపథ్యంలో తిరిగి ఎన్నికలు నిర్వహించనున్నారు. డిసెంబర్ చివరి నాటికి ఓటర్ల జాబితాను ప్రకటించి.. ఫిబ్రవరి, మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్ వెల్లడించనున్నారు. ఈ మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో మొత్తం 33,116 మంది ఓటర్లు ఉన్నట్లు అంచనా. వీరిలో ఇప్పటికే 22 వేల మంది ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈనెల 9తో ఆన్లైన్ దరఖాస్తు గడువు ముగియనుంది. గడువు సమీపిస్తుండటంతో ప్రధాన ఉపాధ్యాయ సంఘాలన్నీ ఓటరు నమోదుపై దృష్టి సారించాయి. అభ్యర్థులంతా ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులతో పాటు ఇంటర్మీడియెట్, డిగ్రీ కాలేజీ, యూనివర్సిటీల్లో పని చేస్తున్న అధ్యాపకులు, ప్రొఫెసర్లను స్వయంగా కలిసి మద్దతు ఇవ్వాల్సిందిగా అభ్యర్థిస్తున్నారు. రెండుగా చీలిపోయిన పీఆర్టీయూ ఉపాధ్యాయ సంఘాల్లో పీఆర్టీయూ కీలకపాత్ర పోషిస్తూ వస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా ఈ సంఘానికి 72 వేలకుపైగా సభ్యత్వాలు ఉన్నాయి. 2014కు ముందే ఈ సంఘం రెండుగా చీలిపోయింది. కొంతమంది ఉపాధ్యాయులు మాతృసంస్థ పీఆర్టీయూ తెలంగాణ నుంచి విడిపోయి పీఆర్టీయూ టీఎస్‌గా ఏర్పడ్డారు. గతంలో ఈ రెండు సంఘాలు కలిసే అభ్యర్థిని ప్రకటించి, ఈ మేరకు గెలిపించుకున్నాయి. పీఆర్టీయూ టీఎస్ రంగారెడ్డి జిల్లాకు చెందిన గుర్రం చెన్న కేశవరెడ్డిని అభ్యర్థిగా ప్రకటిస్తే.. అధికార పార్టీ కనుసన్నల్లో మెలుగుతున్న పీఆర్టీయూ తెలంగాణ ఇప్పటికే రెండు సార్లు ఎమ్మెల్సీగా పని చేసిన కాటేపల్లి జనార్దన్‌రెడ్డి పేరును మరోసారి ఖరారు చేసింది. వీరిద్దరూ గతంలో ఒకే సంఘంలో పని చేసిన వారే. ప్రస్తుతం కీలక నేతలిద్దరూ పోటీలో ఉండడంతో ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. 317 జీఓ ఉపసంహరణ కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంలో విఫలమయ్యారనే అపవాదు ప్రస్తుత ఎమ్మెల్సీ జనార్దన్‌రెడ్డిపై ఉంది. జిల్లాలోని మెజార్టీ ఉపాధ్యాయులు గుర్రం చెన్నకేశవరెడ్డి వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. మరోవైపు ఒకే ఉపాధ్యాయ సంఘం నుంచి చీలిపోయి ఇద్దరు పోటీలో ఉండటం ప్రత్యర్థులకు కలిసిరానుంది. ఇద్దరి మధ్యలో యూటీఎఫ్ అభ్యర్థికి సైతం గెలుపు అవకాశాలు ఉంటాయని పలు ఉపాధ్యాయ సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు. ఎవరిని విజయం వరిస్తుందో వేచి చూడాలి. -
పెద్దగా బుసలు కొడుతూ.. బయటకు లాక్కొచ్చి మరీ కాటేసింది!
వికారాబాద్ జిల్లా: మూడు కుక్క పిల్లలను నాగుపాము కాటేసి చంపిన హృదయ విదారక ఘటన జిల్లాలోని బషీరాబాద్ మండలం మంతట్టి గ్రామంలో చోటు చేసుకుంది. తన పిల్లలను రక్షించుకునేందుకు తల్లి కుక్క పోరాటం చేసినా ఫలితం లేకుండా పోయింది. ఒక చోట ఉన్న మూడు కుక్క పిల్లలను బయటకు లాక్కొచ్చి కాటేసి చంపేసింది నాగుపాము. కుక్క పిల్లలను బయటకు లాక్కొచ్చి కాటేసి సమయంలో నాగుపాము పెద్ద పెద్దగా బుసలు కొడుతూ అక్కడ ఉన్న వారిని భయభ్రాంతులకు గురి చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. -
వైరల్ వీడియో : కుక్కపిల్లలను కాటేసిన కసాయి నాగు
-
రసవత్తర రాజకీయం.. సీఎం కేసీఆర్ నిర్ణయం సరైనదేనా?
సాక్షి, హైదరాబాద్/రంగారెడ్డి జిల్లా: రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటినుంచే సిద్ధం కావాలని, ప్రస్తుత సిట్టింగ్‌లకే మళ్లీ టికెట్లిస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. దీంతో సిట్టింగ్‌ల్లో ఆనందం వెల్లివిరుస్తుండగా.. గ్రేటర్ పరిధిలోని నియోజకవర్గాల్లో కొంతకాలంగా గ్రౌండ్ సిద్ధం చేసుకుంటున్న ఆశావహుల్లో మాత్రం ఆందోళన మొదలైంది. రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు అవకాశం లభిస్తుందనే ఆశతో వివిధ నియోజకవర్గాల్లో ఎందరో నేతలు ఎదురుచూస్తున్నారు. సీఎం ప్రకటనతో వారి ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. రాజకీయ భవిష్యత్ అగమ్య గోచరంగా మారడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో పడ్డారు. గులాబీ పార్టీలోనే కొనసాగడమా? లేక మరో దారి చూసుకోవడమా? అనే మీమాంసలో కొందరు నేతలు కొట్టుమిట్టాడుతున్నట్లు తెలుస్తోంది. ప్రత్యామ్నాయమే ఉత్తమమా..? అధికారంలోకి వచ్చాక.. వివిధ పార్టీల్లో ఎమ్మెల్యేలుగా ఉన్నవారిని గులాబీ గూటికి వచ్చేలా చేసేందుకు కొందరికి రాబోయే ఎన్నికల్లో టికెట్లిస్తామనే హామీలున్నాయి. దాంతో వారు ఆయా నియోజకవర్గాలను నమ్ముకొని పనులు చేస్తున్నారు. ప్రస్తుతమున్న ఎమ్మెల్యేలపై ఉన్న తీవ్ర వ్యతిరేకత సైతం తమకు కలిసి వస్తుందని భావించారు. కానీ.. ఇటీవల టీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో సీఎం చేసిన ప్రకటనతో హతాశులైన వారిలో కొందరు ప్రత్యామ్నాయ మార్గం చూసుకోవడమే ఉత్తమమని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ మేరకు ప్రతిపక్ష పార్టీల వైపు దృష్టి సారించినట్లు ప్రచారం జరుగుతోంది. గ్రేటర్ పరిధిలో.. - ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాగా.. రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ తనకు వస్తుందని భావించిన ఇదే పారీ్టకి చెందిన కార్పొరేటర్ విజయారెడ్డి.. తనకు టికెట్ వచ్చే పరిస్థితి లేదని గ్రహించి కాంగ్రెస్‌లో చేరారు. ఇటీవల బీజేపీ నుంచి టీఆర్ఎస్లో చేరిన శ్రవణ్‌కుమార్.. రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ లభిస్తుందనే చేరినట్లు ఆయన వర్గీయులు భావిస్తున్నారు. మన్నె గోవర్ధన్‌రెడ్డి, మరికొందరు సైతం ఎంతో కాలం నుంచి ఇదే నియోజకవర్గంపై కన్నేసి ఉన్నారు. కానీ.. కేసీఆర్ ప్రకటనతో ఆశావహులకు ఏమీ పాలుపోవడం లేదు. - ముషీరాబాద్‌లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ముఠా గోపాల్ ఉన్నారు. ఈ నియోజకవర్గంపై ఎప్పటినుంచో కన్నేసి ఉన్న ఎమ్మెన్ శ్రీనివాస్ మంత్రి తలసాని అండదండలతో ఇక్కడి టికెట్‌ను దక్కించుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో టీడీపీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా పని చేసిన అనుభవం తదితరాలు తనకు కలిసి వస్తాయని ఆయన ఆశలు పెంచుకున్నారు. - అంబర్‌పేట నియోజకవర్గం నుంచి కాలేరు వెంకటేశ్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనగసాగుతున్నారు. గతంలో ఇక్కడి నుంచి పోటీ చేసి కిషన్‌రెడ్డి చేతిలో ఓటమిపాలైన ఎడ్ల సుధాకర్‌రెడ్డితో పాటు ఓ కార్పొరేటర్ భర్త తదితరులు ప్రయత్నాలు చేసుకుంటున్నట్లు సమాచారం. సాయన్న ప్రాతినిధ్యం వహిస్తున్న కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి మూడు కార్పొరేషన్ల చైర్మన్లు గజ్జెల నగేశ్, ఎర్రోళ్ల శ్రీనివాస్, కృషాంక్‌లు రాబోయే ఎన్నికల్లో టికెట్‌పై కన్నేసి ఉన్నారు. పొరుగు జిల్లాలో.. - ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు రాబోయే ఎన్నికల్లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఎల్బీనగర్ ఎమ్మెల్యేగా గెలిచిన దేవిరెడ్డి సు«దీర్‌రెడ్డి.. అనంతరం టీఆర్ఎస్లో చేరడం తెలిసిందే. టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన ఆయన చేతిలో ఓటమి పాలైన ఎం.రామ్మోహన్‌గౌడ్ సైతం వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆశపడుతున్నారు. - ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా మంచిరెడ్డి కిషన్‌రెడ్డి గెలుపొందారు. గతంలో డీసీసీ అధ్యక్షుడిగా పని చేసిన క్యామ మల్లేష్ ఆ పారీ్టకి రాజీనామా చేసి, అధికార టీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరిన సమయంలో ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తానని సీఎం హామీ కూడా ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు ఆయనకు ఆ అవకాశం కల్పించలేదు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ తనకే వస్తుందని, ఇప్పటికే నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటున్నారు. టీఆర్ఎస్ సీనియర్ నేత (సినీ నటుడు అల్లు అర్జున్ మామ) చంద్రశేఖర్‌రెడ్డి కూడా ఇదే నియోజక వర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. - గత ఎన్నికల్లో మహేశ్వరం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యరి్థగా పోటీ చేసి గెలిచిన సబితారెడ్డి.. అనంతరం టీఆర్ఎస్లో చేరి మంత్రిగా ఉన్నారు. ఇదే సెగ్మెంట్ నుంచి టీఆర్ఎస్ తరపున పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి సీటుపై ఆశలు పెట్టుకున్నారు. రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో ఏదైనా ఒక చోట నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి సహా మంత్రి సబిత తనయుడు కార్తీక్‌రెడ్డి భావించారు. ఆ మేరకు పావులు కూడా కదిపారు. - ఉప్పల్ నియోజకవర్గం నుంచి పోటీచేసేందుకు మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఎంతో కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. గత ఎన్నికల్లోనే టిక్కెట్ వస్తుందని ఆశించి ఇప్పటికీ ఈ నియోజకవర్గంపైనే దృష్టి కేంద్రీకరించారు. ప్రస్తుతం ఇక్కడ బేతి సుభాష్‌రెడ్డి టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. సమయానుకూల నిర్ణయాలు.. సీఎం ప్రకటన చేసినప్పటికీ, సమయానుకూల నిర్ణయాలుంటాయని కొందరు ఆశావహులు అభిప్రాయపడుతున్నారు. వయోభారం, ఆరోగ్య పరిస్థితులు తదితరాలు పరిగణనలోకి తీసుకోవడంతోపాటు ఇప్పట్నుంచే టికెట్లు రావంటే పక్కచూపులు చూస్తారని కూడా అలా ప్రకటించి ఉండవచ్చని వారు పేర్కొంటున్నారు. -
జైలుకెళ్లినా బుద్ధి మారలే.. సహజీవనం చేయాలని కానిస్టేబుల్ ఒత్తిడి
సాక్షి, రంగారెడ్డి: ఓ మహిళపై లైంగిక దాడికి పాల్పడిన స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సీఐ మహేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సైదాబాద్‌కు చెందిన పి.వెంకటేశ్వర్లు గతంలో మాదన్నపేట పీఎస్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తించాడు. వీరి ఇంటి సమీపంలో నివాసముండే బాధిత మహిళ (34) కుటుంబం.. ఫ్యామిలీ ఫ్రెండ్స్‌లా ఉండేవారు. వెంకటేశ్వర్లు గతంలో మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించగా ఆమె తిరస్కరించింది. అయినా వినకుండా మానసికంగా, శారీరకంగా వేధించసాగాడు. దీంతో విసిగిపోయిన బాధితురాలు 25 జనవరి, 2021 రోజున సైదాబాద్ పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. ఈ సమయంలో పోలీసులు అతనికి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. అయినా వెంకటేశ్వర్లు బుద్ధి మార్చుకోకుండా మహిళను వేధించడంతో పాటు తనతో లైంగిక సంబంధం పెట్టుకోవాలని బలవంతం చేశాడు. ఎంతకీ అతనిలో మార్పు రాకపోవడంతో మరోసారి సైదాబాద్ పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో 2021, మే నెలలో వెంకటేశ్వర్లును అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. ఈ సమ యంలో సదరు మహిళ ఫోన్ నంబర్‌తో పాటు తమ నివాసాన్ని మొదట ఈసీఐఎల్‌కు, అక్కడి నుంచి మీర్‌పేట సీతాహోమ్స్కు మార్చింది. జైలు నుంచి బయటకు వచ్చిన వెంకటేశ్వర్లు హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్‌గా విధుల్లో చేరాడు. అనంతరం మహిళ ఫోన్ నంబర్, ఇంటి అడ్రస్ తెలుసుకుని భర్త, పిల్లలు లేని సమయంలో ఇంటికి వచ్చి వేధించడం ప్రారంభించాడు. 2022, ఆగస్టు 17న మధ్యాహ్నం ఇంట్లోకి చొరబడి తనతో సహజీవనం చేయకపోతే తీవ్ర పరిణామాలుంటాయని బెదిరించి అత్యాచారం చేసి, వీడియోలు ఫొటోలు తీశాడు. ఈ నెల 14న మళ్లీ వెళ్లి.. గతంలో తనపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని ఒత్తిడి చేశాడు. పరుష పదజాలంతో దూషిస్తూ లైంగిక దాడికి యత్నించగా ఆమె గట్టిగా కేకలు వేసింది. దీంతో ఆగ్రహానికి గురైన అతడు నీ నగ్న చిత్రాలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని హెచ్చరించి వెళ్లిపోయాడు. బాధితురాలి నుంచి ఫిర్యాదు అందుకున్న మీర్పేట్ పోలీసులు వెంకటేశ్వర్లుపై అత్యాచారంతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు పెట్టి బుధవారం రిమాండ్‌కు తరలించారు. -
చదువులు సాగేదెలా?
సాక్షి, హైదరాబాద్: సర్కారు బడుల్లో పాఠ్య పుస్తకాలే కాదు... ఏకరూప దుస్తులు సైతం అందని ద్రాక్షగా తయారయ్యాయి, ఒకవైపు విద్యార్థులకు పూర్తిస్థాయి పాఠ్య పుస్తకాలు లేకుండానే చదువులు సాగుతుండగా.. యూనిఫాంల జాడ కూడా లేకుండా పోయింది. 2022– 23 విద్యా సంవత్సరం ప్రారంభమై 6 నెలలు గడిచినా 60 శాతం మించి పాఠ్యపుస్తకాలు సరఫరా కాలేదని అధికారుల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రధాన ప్రచురణ కేంద్రం నుంచి గోదాములకే అరకొర స్టాక్ వచ్చి చేరడంతో పాఠశాలలకు పుస్తకాల సరఫరా అంతంత మాత్రంగా ఉంది. ఇప్పటి వరకు వచి్చన వాటిలో సైతం ఏ ఒక్క తరగతికి సైతం పూర్తి స్థాయి పుస్తకాల సెట్ అందలేనట్లు తెలుస్తోంది. విద్యా సంవత్సరం ప్రారంభంలో పాఠ్యపుస్తకాల పంపిణీ ఆలస్యం కావడంతో అప్పటిదాకా బ్రిడ్జి కోర్సులు నిర్వహించారు. అనంతరం బోధన ప్రారంభించినప్పటికీ పూర్తి స్థాయి పాఠ్య పుస్తకాల కొరత వెంటాడుతోంది. పాత పుస్తకాలతోనే.. గత విద్యా సంవత్సరం ప్రభుత్వ బడుల్లో చాలా తరగతులకు సగం పుస్తకాలే పంపిణీ చేశారు. పాత వాటిని సైతం ఈసారి సేకరించి సర్దుబాటు చేసినా విద్యార్థులందరికీ సరిపోని పరిస్థితి నెలకొంది. కొన్ని పాఠశాలల్లో అయిదుగురు విద్యార్థులను ఒక గ్రూప్‌గా చేసి వారికి ఒక్కో పాఠ్య పుస్తకాన్ని ఇచ్చి సర్దుబాటు చేశారు. దీంతో చేతిలో పుస్తకాలు లేక విద్యార్థులు దిక్కు తోచని స్థితిలో పడ్డారు. తోటి విద్యార్థుల పుస్తకాలపై ఆధారపడి చదువులు కొనసాగించడం ఇబ్బందిగా తయారైంది. తరగతి గదిలో బోధన తర్వాత ఇంటివద్ద హోంవర్కు సమస్యగా తయారైంది. పాఠ్య పుస్తకాలపై విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణలో నిర్లక్ష్యం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు శాపంగా తయారైంది. 24.73 లక్షలపైనే.. గ్రేటర్‌లోని హైదరాబాద్–రంగారెడ్డి–మేడ్చల్ జిల్లా పరిధిలోని ప్రభుత్వ బడులకు సుమారు 24.73 లక్షల పాఠ్యపుస్తకాల అవసరం ఉంటాయని విద్యాశాఖాధికారులు అంచనా వేశారు. ఈ మేరకు ఇండెంట్ పెట్టారు. అందులో 60 శాతం మాత్రమే ప్రింటింగ్ ప్రెస్ నుంచి గోదాములకు చేరాయి. అందులో సైతం తరగతులకు సంబ ంధించిన అన్ని పాఠ్యపుస్తకాలు అందలేదు. ఈ విద్యా సంవత్సరం ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెట్టడంతో ఒకే సా రి ఇంగ్లి‹Ù, తెలుగు మీడియం పుస్తకాల ప్రచురణ తలపెట్టడంతో పూర్తి స్థాయి కోటాకు ఆటంకంగా తయారైంది. ఊసే లేని యూనిఫాంలు.. సర్కారు బడుల విద్యార్థులకు ఇప్పటి వరకు యూనిఫాంల ఊసే లేకుండా పోయింది. విద్యార్థులకు రెండు జతల చొప్పున ఉచితంగా యూనిఫాంలను అందించాల్సి ఉంది. సాధారణంగా వేసవి సెలవుల్లోనే వీటికి అవసరమైన వ్రస్తాన్ని టెస్కో ద్వారా కొనుగోలు చేసి, ఆయా జిల్లాలు, మండలాల వారీగా స్కూళ్లకు అందించాలి. ఈ ఏడాది యూనిఫాంలకు అవసరమైన వస్త్రం కొనుగోలు ప్రక్రియలో తీవ్ర జాప్యం ఏర్పడింది. దీంతో సకాలంలో దుస్తుల పంపిణీ ప్రశ్నార్థకంగా మారింది. (చదవండి: ఆ సొమ్మంతా ఎవరికి వెళ్లింది?) -
కారు పార్టీలో కోల్డ్‌వార్.. టీఆర్ఎస్లో ఎవరి దారి వారిదే!
సాక్షి, రంగారెడ్డి: అధికార పార్టీలో నేతల మధ్య సయోధ్య కరువవుతోంది. ఇప్పటికే ఇబ్రహీంపట్నం, మీర్‌పేట, బడంగ్పేట్, తుక్కుగూడ మున్సిపాలిటీల్లో అధికార పార్టీ పాలక మండలి సభ్యులు రెండుగా చీలిపోయి పరస్పర ఫిర్యాదులు చేసుకుంటుండగా తాజాగా అసెంబ్లీ నియోజక వర్గాల్లోనూ అంతర్గత కుమ్ములాటలు అధికమయ్యాయి. ఇప్పటి వరకు మిన్నకుండిన ద్వితీయశ్రేణి నేతలు వచ్చే ఎన్నికల్లో పోటీకి ఇప్పటి నుంచే దారులు సిద్ధం చేసుకుంటున్నారు. అధిష్టానం వద్ద తమకే గుర్తింపు ఉందని, వచ్చే ఎన్నికల్లో టికెట్ తమకు వస్తుందంటే తమకేనంటూ పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తుండడం విశేషం. ఒకే నియోజకవర్గం నుంచి ఇద్దరు, ముగ్గురు కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో కేడర్ అయోమయానికి గురవుతోంది. చేవెళ్లలో కాలె వర్సెస్ రత్నం చేవెళ్ల నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే కాలె యాదయ్య, మాజీ ఎమ్మెల్యే రత్నం మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఎవరికి వారు తమకే టికెట్ వస్తుందని, అధిష్టానం ఆశీస్సులు తమకే ఉన్నాయంటూ నియోజకవర్గంలో తిరుగుతున్నారు. ఎవరికి వారు సొంతంగా కేడర్‌ను తయారు చేసుకుని అభివృద్ధి, ఇతర సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఒకరిపై మరొకరు అవినీతి ఆరోపణలు చేసుకుంటూ చర్చనీయాంశమవుతున్నారు. మహేశ్వరంలో తీగల.. పటోళ్ల మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబితారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మధ్య విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఆయన కోడలు జెడ్పీ చైర్ పర్సన్ తీగల అనితారెడ్డి ప్రత్యేకంగా కార్యక్రమాలు చేపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి సబిత, తీగల ఇద్దరూ పోటీకి సిద్ధమవుతున్నారు. ఇద్దరు నేతల మధ్య అంతర్గత విభేదాలు పార్టీకి తలనొప్పిగా మారాయి. ఎల్బీనగర్లో దేవిరెడ్డి.. ముద్దగోని ఎల్బీనగర్ నియోజకవర్గం నుంచి అధికారపార్టీ తరఫున గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన ముద్దగోని రామ్మోహన్‌గౌడ్ మళ్లీ తన అస్థిత్వాన్ని నిలుపుకొనేందుకు యత్నిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి గెలుపొంది ఆ తర్వాత అధికారపారీ్టలో చేరిన ఎమ్మెల్యే దేవిరెడ్డి్కి దీటుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తానూ ఎన్నికల బరిలో ఉన్నాననే సంకేతాలు అటు కేడర్, ఇటు అధిష్టానానికి పంపే ప్రయత్నం చేస్తున్నారు. ‘పట్నం’లో మంచిరెడ్డి వర్సెస్ క్యామ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి గత ఎన్నికల్లో స్వల్ప మెజార్జీతో గెలుపొందారు. మనీలాండరింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణ లపై తాజాగా ఆయన ఈడీ ఎదుట హాజరయ్యారు. యాచారం ఫార్మాసిటీ, వెలిమనేడు ఇండ్రస్టియల్ పార్కు, ఇబ్రహీంపట్నంలోని ప్రభుత్వ కార్యాలయాలకు భూసేకరణ విషయంలో ఆయనపై కొంత వ్యతిరేకత ప్రారంభమైంది. గత ఎన్నికలకు ముందే కాంగ్రెస్‌ను వీడి అధికార పారీ్టలో చేరిన క్యామ మల్లేశ్ దీన్ని అవకాశంగా మల్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్లో చేరిన సమయంలోనే సీఎం కేసీఆర్ తనకు హామీ ఇచ్చారని.. వచ్చే ఎన్నికల్లో తనకే బి ఫాం అంటూ నియోజకవర్గంలో కలియ తిరుగుతున్నారు. కల్వకుర్తిలో జైపాల్.. కసిరెడ్డి కల్వకుర్తిలో పార్టీ రెండుగా చీలిపోయింది. ఒకరు నిర్వహించే కార్యక్రమంలో మరొకరు పాల్గొనని పరిస్థితి నెలకొంది. ప్రస్తుత ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మళ్లీ తనకే టికెట్ వస్తుందని, పోటీ చేసేది తానేనని ప్రచారం చేసుకుంటున్నారు. నిత్యం ప్రజలతో మమేకం అయ్యేందుకు ప్రయతి్నస్తున్నారు. ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి సైతం పోటీకి సిద్ధమవుతున్నారు. కల్వకుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ ఎన్నిక విషయంలో ఎమ్మెల్యే వైఖరికి నిరసనగా వెల్దండ ఎంపీపీ, మరో ఆరుగురు సర్పంచ్‌లు ఇటీవల తిరుగుబాటుబావుటా ఎగురవేయడం గమనార్హం. మరోవైపు తలకొండపల్లి జెడ్పీటీసీ సభ్యుడు వెంకటేశ్ సైతం పోటీకి సిద్ధమవుతున్నారు. టికెట్ తనకే అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. అసెంబ్లీపై చేవెళ్ల ఎంపీ గురి చేవెళ్ల ఎంపీ వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ బరిలో నిలిచేందుకు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. క్షేత్రస్థాయిలో బలమైన కేడర్ లేకున్నా తనకున్న ఆర్థిక వనరులు, అధిష్టానం ఆశీస్సులతో శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్‌లలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. -
చెరువులో ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి
-
Telangana: మద్యం అమ్మకాల రికార్డు.. ఏడాది రాబడి 9 నెలల్లోనే!
సాక్షి, హైదరాబాద్: మద్యం ఆదాయం రాష్ట్ర ప్రభుత్వ అంచనాలకు మించి సమకూరుతోంది. మందుబాబులు తెగ తాగేసి ఖజానాకు కాసుల కళ తెస్తున్నారు. ఏడాది మొత్తం అమ్మకాల ద్వారా వస్తుందని భావించిన రాబడి కేవలం తొమ్మిది నెలల్లోనే ఖజానాకు చేరే అవకాశముంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎక్సైజ్ ఆదాయం రూ.17,500 కోట్లు రావచ్చని ప్రభుత్వం బడ్జెట్ అంచనాల్లో ప్రతిపాదించింది. సంవత్సరం మొత్తం రూ. 22,500 కోట్ల మేర అమ్మకాలు సాగితే అందులో 70శాతం.. అంటే రూ.17,500 కోట్ల ఆదాయం రావచ్చనేది రాష్ట్ర ప్రభుత్వం లెక్క. కానీ, తొలి ఆరునెలల్లోనే రూ.17,324 కోట్ల మేర మద్యం అమ్మకాలు జరిగాయని తెలంగాణ రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీఎస్‌బీసీఎల్) లెక్కలు వెల్లడిస్తున్నాయి. అందులో 70 శాతం అంటే... దాదాపు రూ.12 వేల కోట్లకుపైగా ఆదాయం ఇప్పటికే రాష్ట్ర ఖజానాకు చేరిందన్నమాట. ఈ లెక్కనæ మరో రెండు నెలల్లోనే రూ.17,500 కోట్ల ఆదాయ లక్ష్యాన్ని చేరుకుంటుందని అర్థమవుతోంది. 2021 నేషనల్ హెల్త్ సర్వే–5 ప్రకారం మద్యం ఎక్కువగా సేవించే రాష్ట్రాల్లో అరుణాచల్‌ప్రదేశ్, సిక్కింల తర్వాత మూడోస్థానాన్ని తెలంగాణ దక్కించుకుంది. ఈ సర్వే ప్రకారం తెలంగాణలో 29 శాతానికిపైగా మందుబాబులున్నారు. ఈ మందుబాబులు తెగ తాగేస్తుండటంతోపాటు ఈ ఆర్థిక సంవత్సరంలో మద్యం ధరలు కూడా పెంచినందున అంచనాలకు మించి ఆదాయం వస్తుండటం గమనార్హం. నాలుగోవంతు రంగారెడ్డిలోనే.. రాష్ట్రంలోనే అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో ఎక్కువగా మద్యం విక్రయాలు జరిగాయని బేవరేజెస్ కార్పొరేషన్ లెక్కలు చెబుతున్నాయి. 2022 ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఈ జిల్లాలో రూ. 3,970.82 కోట్ల మేర మద్యం అమ్మకాలు జరిగాయి. రూ.వెయ్యి కోట్ల మార్కు దాటిన జిల్లాల్లో హైదరాబాద్ (రూ.1,828.10 కోట్లు), కరీంనగర్(1,469.93), ఖమ్మం(1,100.38), మహబూబ్‌నగర్ (1,233.53),మెదక్ (1,424.09), నల్లగొండ(1,774.46), వరంగల్ అర్బన్ (రూ.1,745.73 కోట్లు) ఉన్నాయి. రాష్ట్రంలోని ఈ ఎనిమిది జిల్లాల్లోనే రూ.14 వేల కోట్లకుపైగా మద్యం విక్రయాలు జరగ్గా, మిగిలిన అన్ని జిల్లాలు కలిపి రూ.3 వేల కోట్ల మేర అమ్మకాలు జరగడం విశేషం. కేసులవారీగా పరిశీలిస్తే గత ఆరునెలల్లో రాష్ట్రంలోని మందుబాబులు 1.7 కోట్ల లిక్కర్ కేసులు, 2.5 కోట్ల బీర్ కేసులు లాగించేశారని గణాంకాలు చెబుతున్నాయి. -
‘దసరాకి కొత్త దుస్తులు నాన్నా.. ఈ రోజే తెద్దాంలే కన్నా’.. అంతలోనే
సాక్షి, రంగారెడ్డి: ‘నాన్నా.. దసరా పండగకి నాకు కొత్త దుస్తులు కావాలి..’ ఇదీ కొడుకు కోరిక. తెద్దాంలే నాన్న.. ఈ రోజే తీసుకుందాం.. ఇదీ చిరునవ్వుతో తండ్రి వాగ్దానం. అంతలోనే విధి వక్రీకరించింది. గంట వ్యవధిలోనే కొడుకును నీటి గుంత పొట్టనపెట్టుకుంది. పండుగ దుస్తు లు కావాలన్న కొడుకు విగతజీవిగా కనిపించడంతో ఆ తండ్రి రోదనకు అంతే లేకుండా పోయింది. షాద్‌నగర్ మున్సిపల్ పరిధిలోని సోలీపూర్ శివారులో నీటి గుంతలో పడి బాలుడు మృతి చెందిన సంఘటనలో నెలకొన్న విషాదం ఇదీ. వ్యవసాయ కూలీగా పని చేసే భిక్షపతి కుమారుడు అక్షిత్ సోమవారం ఉదయాన్నే పండుగ దుస్తులు అడిగాడు. తీసుకుందాం అనుకున్నంతలోనే ఈ ఘోరం జరిగిందని తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. ఇలాంటి పరిస్థితి ఏ తండ్రికీ రాకూడదని కన్నీరుమున్నీరయ్యాడు. ముగ్గురు కుమారుల్లో చిన్న వాడైన అక్షిత్‌ను అల్లారుముద్దుగా చూసుకున్నామని.. ఇలా జరుగుతుందనుకోలేదని తల్లిదండ్రులు భిక్షపతి, శివలీల రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. ఆ ఇద్దరూ అన్నదమ్ముల కొడుకులు మృతి చెందిన మరో ఇద్దరిలో సైఫ్, ఫరీద్ అన్నదమ్ముల పిల్లలు. మృతుల తండ్రులు సలీం, నయూం వరుసకు అన్నదమ్ములు. ఎక్కడికి వెళ్లినా సైఫ్, ఫరీద్ ఒకరిని విడిచి ఒకరు ఉండే వారు కాదని.. ఒకరంటే మరొకరికి ఎంతో ప్రాణమని కుటంబ సభ్యులు తెలిపారు. బతుకమ్మలు, నవరాత్రులతో సందడిగా ఉన్న గ్రామంలో ముగ్గురి మరణం ఒక్కసారిగా విషాదాన్ని నింపింది. -
నీట మునిగి ఐదుగురు విద్యార్థుల మృతి
షాద్‌నగర్/ హత్నూర (సంగారెడ్డి): రెండు వేర్వేరు ఘటనల్లో నీట మునిగి ఐదుగురు విద్యార్థులు మృత్యువాతపడ్డారు. ఇందులో ముగ్గురు చిన్నారులు సరదాగా ఆడుకోవడానికి వెళ్లి నీటి గుంతలోపడి ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు బాలురు చెరువులో స్నానానికి వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్నారు. వివరాలిలా ఉన్నాయి.. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని సోలీపూర్ గ్రామానికి చెందిన సలీం, ఫిర్దోస్ దంపతుల కుమారుడు సైఫ్ (7), నయీమ్, ఖతీజా దంపతుల కొడుకు ఫరీద్ (13), భిక్షపతి, శివలీల దంపతుల కుమారుడు అక్షిత్‌గౌడ్ (8), సంజయ్‌కుమార్‌లు స్నేహితులు. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో వీరు చదువుకుంటున్నారు. స్కూలుకు దసరా పండుగ సెలవులు ఇవ్వడంతో సోమవారం ఉదయం గ్రామ శివారులో ఏర్పాటు చేసిన ఓ రియల్ ఎస్టేట్ వెంచర్ వద్ద ఆడుకునేందుకు వెళ్లారు. కొద్దిసేపటి తర్వాత అక్కడ పనులకోసం తీసిన నీటి గుంతలోకి దిగారు. అయితే గుంత దాదాపు పది అడుగుల లోతు ఉండటంతో సైఫ్, ఫరీద్, అక్షిత్‌గౌడ్ నీటిలో మునిగి చనిపోయారు. ఈ ఘటనలో సంజయ్ త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. తమ పిల్లలను విగతజీవులుగా చూసి వారి తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. షాద్‌నగర్‌లో ధర్నా ఈ సమాచారం అందుకున్న ఏసీపీ కుషాల్కర్, సీఐ నవీన్‌కుమార్ చిన్నారుల మృతదేహాలను బయటకు తీయించి పోస్టుమార్టం నిమిత్తం షాద్‌నగర్ ప్రభుత్వ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. రోడ్డు కోసం మట్టి వేసేందుకు తీసిన గుంతల్లో పడి చిన్నారులు మృతి చెందారని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మృతుల కుటుంబ సభ్యులు ఆస్పత్రి వద్ద ఆందోళన చేపట్టారు. అక్షిత్‌గౌడ్ మృతదేహాన్ని గ్రామానికి తీసుకెళుతున్న క్రమంలో కుటుంబ సభ్యులు చౌరస్తాలో ఒక్కసారిగా మెరుపు ధర్నా నిర్వహించారు. మృతదేహంతో అక్కడ బైఠాయించారు. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టి మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. చెరువులో స్నానానికి వెళ్లి.. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన చిరుమని చెన్నయ్య అనే వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందగా, సోమవారం అంత్యక్రియలు జరిగాయి. అనంతరం చెన్నయ్య బంధువులైన చిలువరి మహేశ్ (17), చిలువరి అరవింద్ (16)లు బంధువులతో కలసి గ్రామ సమీపంలోని చెరువులోకి స్నానానికి వెళ్లారు. అయితే చెరువులో లోతైన ప్రదేశంలోకి వెళ్లిన వీరు నీటిలో మునుగుతూ తేలుతూ అరుస్తుండగా, అక్కడే ఉన్న బంధువులు రక్షించే ప్రయత్నం చేశారు. కానీ ఫలితం లేకుండా పోయింది. అరగంట తర్వాత మహేశ్, అరవింద్‌లు విగతజీవులుగా కనిపించారు. మహేశ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతుండగా, అరవింద్ ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. దీనిపై పోలీసులను సంప్రదించగా తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని తెలిపారు. -
రంగారెడ్డి జిల్లా రాయికల్ టోల్ ప్లాజా వద్ద ఉద్రిక్తత
-
ఇబ్రహీంపట్నంలో ఘోరం.. చిన్నారులపైకి దూసుకెళ్లిన స్కూల్ వ్యాన్
సాక్షి, రంగారెడ్డి: ఇబ్రహీంపట్నం పరిధిలోని శేరిగుడలో మంగళవారం ఉదయం దారుణం జరిగింది. నడుచుకుంటూ వెళ్తున్న విద్యార్థులపైకి ఓ ప్రైవేట్ స్కూల్ వ్యాన్ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒక చిన్నారి అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే వ్యాన్‌ను అక్కడే వదిలేసి డ్రైవర్ పరారయ్యాడు. మృతి చెందిన విద్యార్థి స్థానికుడు కాదని.. అతనిది బీహార్‌కు చెందిన కుటుంబంగా గుర్తించారు. మరో విద్యార్థికి తీవ్ర గాయాలయాలు కావడంతో చికిత్స కోసం హాస్పిటల్‌కు తరలించారు. మృతదేహంతో కుటుంబ సభ్యులు సాగర్ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ క్రమంలో భారీగా ట్రాఫిక్ జామ్ కాగా, పోలీసులు జోక్యం చేసుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ఇదీ చదవండి: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. చిన్నారిపై కుక్క దాడి! -
22 రోజులకు రూ.1,17,694 కరెంట్ బిల్లు.. యాజమాని షాక్
సాక్షి, రంగారెడ్డి: కరెంటు బిల్లు చూసిన ఓ ఇంటి యజమాని గుండె గు‘బిల్లు’మంది. ఏకంగా లక్ష రూపాయల బిల్లు రావడంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. షాద్‌నగర్ మున్సిపల్ పరిధి చటాన్‌పల్లిలో రమాదేవి ఇంటికి సంబంధించిన విద్యుత్ మీటర్ గత నెల కాలిపోయింది. దీంతో ఆశాఖ సిబ్బంది కొత్త మీటర్ ఏర్పాటు చేశారు. గత నెలలో కాలిపోయిన మీటర్‌కు సంబంధించిన బిల్లును బుధవారం యజమానికి ఇచ్చివెళ్లారు. ఇందులో ఆగస్టు 16నుంచి ఈనెల 7వ తేదీ వరకు 22 రోజులకు గానూ 10,510 యూనిట్ల విద్యుత్ వాడినట్లు, ఇందుకు రూ.1,17,694 చెల్లించాలని బిల్లులో నమోదైంది. ప్రతి నెల రూ.వందల్లో వచ్చే బిల్లు ఒకేసారి లక్ష రూపాయలు దాటడంతో ఆందోళనకు గురయ్యారు. ఈ విషయమై రూరల్ ఏఈ రాకేశ్‌ను అడగగా పొరపాటు ఎక్కడ జరిగిందో తెలుసుకుని, సరిచేస్తామమన్నారు. -
ఇక్కడ రాజకీయాలు కూడా అంతే రిచ్‌గా..!
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ మహానగరం చుట్టూ వ్యాపించి ఉంది. ఈ ప్రాంతాలు గ్రేటర్ నగరం కంటే కూడా కాస్ట్లీగా తయారయ్యాయి. ఐటీ కారిడార్‌లోని అత్యధిక భాగం, ఫార్మా సిటీ, అంతర్జాతీయ విమానాశ్రయం, జంట జలాశయాలు వంటి ఎన్నో ప్రాంతాలు ఈ జిల్లాలోనే ఉన్నాయి. రాష్ట్రంలోనే ఖరీదైన జిల్లాగా రంగారెడ్డి పేరు తెచ్చుకుంది. ఈ జిల్లా రాజకీయాలు కూడా అంతే రిచ్‌గా తయారయ్యాయి. 2009లో ఏర్పడిన రాజేంద్రనగర్సెగ్మెంట్కు మూడుసార్లుగా ప్రకాశ్ గౌడ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. టీడీపీతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ప్రకాశ్‌గౌడ్ ప్రస్తుతం కారు పార్టీలో కొనసాగుతున్నారు. చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి అలాగే మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్‌రెడ్డి కూడా ఈసారి రాజేంద్రనగర్‌నుంచి పోటీకి ప్రయత్నాలు చేస్తున్నారు. గులాబీ బాస్ ఎవరికి టిక్కెట్ ఇస్తారో చూడాలి. ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులను తానే డిసైడ్ చేస్తారని ప్రకాశ్‌గౌడ్‌కు పేరుంది. ఎదుటి పార్టీల్లో బలహీనమైన అభ్యర్థులను నిలపడం ద్వారా తనకు ఇబ్బంది లేకుండా చూసుకుంటారని చెబుతారు. ఈసారి పరిస్థితులు ఆయనకు సానుకూలంగా లేవనే మాట వినిపిస్తోంది. కాంగ్రెస్ నుంచి పోటీ చేయడానికి ముగ్గురు ప్రయత్నిస్తున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ అనుచరుడుగా ఉన్న కోకాపేట జైపాల్‌రెడ్డి పోటీలో ఉంటానంటున్నారు. అదేవిధంగా మణికొండ మున్సిపల్ ఛైర్మన్ నరేందర్ ముదిరాజ్ కూడా ఎమ్మెల్యే టికెట్ రేస్‌లో ఉన్నట్లు చెబుతున్నారు. ఇక బీజేపీ ఈసారి రాజేంద్రనగర్ నియోజకవర్గంపై పట్టుబిగించాలని చూస్తుంది. జీహెచ్ఎంసీ పరిధిలోని మూడు డివిజన్లను గెలిచిన ఉత్సాహంతో నియోజకవర్గంలో గెలుపు ప్రణాళికలను రచిస్తోంది. మైలార్‌దేవ్‌పల్లి కార్పోరేటర్ తోకల శ్రీనివాస్‌రెడ్డి ఎమ్మెల్యే బరిలో నిలిచేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీలో చాలాకాలం నుంచి పనిచేస్తున్న బొక్కా బాల్‌రెడ్డి కూడా అధిష్టానం తనకు అవకాశమిస్తుందనే ధీమాలో ఉన్నారు. ఇక నియోజకవర్గంలో ఎంఐఎం ప్రాబల్యం కూడా ఎక్కువగానే ఉంది. జీహెచ్ఎంసీ పరిధిలోని రెండు డివిజన్లను గెలిచిన ఎంఐఎం..వచ్చే ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీలను గట్టిదెబ్బకొట్టేందుకు సిద్ధమవుతోంది. రాజేంద్రనగర్‌లో ఈసారి చతుర్ముఖపోటీ ఉండే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. గ్రేటర్ శివార్లలో కాస్ట్ లీ సెగ్మెంట్‌గా పేరు తెచ్చుకున్న మహేశ్వరంలో రెండుసార్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి విజయం సాధించారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన తీగల కృష్ణారెడ్డి..ఇటీవల సొంత పార్టీకి చెందిన మంత్రి మీదే విమర్శలు గుప్పించి వార్తల్లోకెక్కారు. మొన్నటి ఎన్నికల్లో గెలిచిన సబిత, ఓడిన తీగల ఇద్దరూ వేరే పార్టీల నుంచి వచ్చినవారే. వచ్చే ఎన్నికల్లో మహేశ్వరం సీటుపై భారీ ఆశలు పెంచుకున్నారు తీగల కృష్ణారెడ్డి. అయితే మంత్రి సబితారెడ్డిని కాదని.. తీగలకు టికెట్ ఇస్తారా ? అనే చర్చ గులాబీ పార్టీలో జరుగుతోంది. సబితా ఇంద్రారెడ్డి టిఆర్ఎస్ గూటికి చేరడంతో మహేశ్వరంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇటీవల బడంగ్ పేట మేయర్ పారిజాత నర్సింహారెడ్డి టిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే టికెట్ భరోసాతోనే కండువా కప్పుకున్నట్లు చెబుతున్నారు. అయితే ఇక్కడ సీనియర్ని అయిన తనకే టిక్కెట్దక్కుతుందని దేపా భాస్కర్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు డిసిసి అధ్యక్షుడు నర్సింహారెడ్డి కూడా బరిలో దిగడానికి సిద్ధమవుతున్నారు. తుక్కుగూడాలో అమిత్ షా సభతో జోరు మీద ఉన్నారు కాషాయ శ్రేణులు. గతంలో పోటీ చేసిన శ్రీరాములు యాదవ్ఈసారి కూడా బరిలోకి దిగడానికి సిద్ధమవుతున్నారు. ఇక మాజీ హోమ్ మంత్రి దేవేందర్ గౌడ్ తనయుడు వీరేందర్ గౌడ్ ఇదే నియోజకవర్గంపై ఆశలు పెంచుకున్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సొంత ఊరు తిమ్మాపూర్ఈ నియోజకవర్గం పరిధిలోనే ఉంది. కిషన్ రెడ్డి ఎవరి పేరు ప్రతిపాదిస్తారనేది కూడా ఆసక్తి కరంగా మారింది. మంత్రి సబిత, మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి సొంత ఇలాకా చేవెళ్ళ. అయితే 2009 నుంచి ఎస్సీ రిజర్వుడు సెగ్మెంట్‌గా మారింది. ప్రస్తుత ఎమ్మెల్యే యాదయ్య, మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం మధ్య గులాబీ పార్టీలో టిక్కెట్పోరు సాగుతోంది. ఇద్దరు నేతల మధ్య ఉప్పు నిప్పు పరిస్థితి కొనసాగుతోంది. ఇక కాంగ్రెస్, బీజేపీలకు చేవెళ్ళలో అభ్యర్థులే కనిపించడంలేదు. గులాబీ గూటి నుంచి బయటపడే నేతల కోసం ప్రతిపక్షాలు ఎదురుచూస్తున్నాయి. శంషాబాద్ కు చెందిన సిద్దేశ్వర్ కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటే బీఎస్పీ నేత, మాజీ ఐపిఎస్ ప్రవీణ్ కుమార్ చేవెళ్ల నుంచి పోటీకి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఎల్బీనగర్ టిఆర్ఎస్లో వర్గ విభేదాలు కొంత ఇబ్బంది కరంగా మారాయి. సిటింగ్‌ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, పార్టీ ఎల్బీ నగర్ ఇన్చార్జ్ రామ్మోహన్ గౌడ్లు కాంగ్రెస్‌నుంచి వచ్చినవారే. నియోజకవర్గంలో అన్నదమ్ముల్లా కలసి పని చేసినవారే. కాంగ్రెస్‌లో ఎమ్మెల్యేగా సుధీర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ గా రామ్మోహన్ గౌడ్ గతంలో పనిచేశారు. ఇద్దరి మధ్యా విబేధాలు రావడం, ఇద్దరూ అధికార పార్టీలోకి రావడంతో ఇప్పుడు వర్గ పోరు తీవ్రమైంది. కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నేత మల్ రెడ్డి రాంరెడ్డి పోటీ చేయాలని భావిస్తున్నారు. నియోజకవర్గంలో 11 జీహెచ్ఎంసీ డివిజన్ల లో గెలిచి జోష్ లో ఉన్నారు కమలనాథులు. బీజేపీ కార్పొరేటర్లు వంగా మధుసూదన్ రెడ్డి, కొప్పుల నర్సింహారెడ్డి ఎమ్మెల్యే గా ప్రమోషన్ కొట్టేయాలని ప్లాన్ వేస్తున్నారు. భువనగిరి పార్లమెంట్ పరిధిలోకి వచ్చే ఇబ్రహీంపట్నం అసెంబ్లీ స్థానంపై పట్టుకోసం అన్ని పార్టీలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఇబ్రహీంపట్నం సెమీ అర్బన్ నియోజకవర్గం. గత ఎన్నికల్లో 376 ఓట్లతో అసెంబ్లీలో అడుగుపెట్టిన టీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి వచ్చే ఎన్నికల్లో తనయుడిని బరిలో దించాలని ప్లాన్ చేస్తున్నారు. కిషన్‌రెడ్డి తనయుడు ప్రశాంత్‌కుమార్ గ్రేటర్లో ఐఎస్ సదన్కార్పోరేటర్గా పనిచేశారు. 2014లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి.. వచ్చే ఎన్నికల్లో తనకు అవకాశమివ్వాలని అధిష్టానాన్ని కోరుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ నుంచి పోటీ చేసి స్వల్ప ఓట్లతో ఓడిన మల్రెడ్డి రంగారెడ్డి ఈసారి కాంగ్రెస్ టిక్కెట్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. అయితే సొంత పార్టీలో వర్గ విబేధాలు చిచ్చురేపుతున్నాయి. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తన అనుచరుడైన నిరంజన్‌రెడ్డికే ఇబ్రహీంపట్నం టికెట్ ఇప్పిస్తానని మాట ఇచ్చారట. ఈ ఇద్దరిలో ఎవరికి గ్రీన్ సిగ్నల్ లభిస్తుందో చూడాలి. గత ఎన్నికల్లో ఇక్కడ కేవలం 9 శాతం ఓట్లకే పరిమితమైన బీజేపీ వచ్చే ఎన్నికల్లో పట్టుసాధించాలని భావిస్తోంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పోటీచేసి ఓడిపోయిన అశోక్ గౌడ్ ఈసారి బీజేపీ వేవ్..బీసీ కార్డ్‌తో ఎలాగైనా గెలవాలని అనుకుంటున్నారు. గతంలో మూడు సార్లు సీపీఎం అభ్యర్థులు గెలిచిన చరిత్ర ఇబ్రహీంపట్టణానికి ఉంది. అందువల్ల లెఫ్ట్ ప్రభావం కొంతవరకు ఉంటుంది. అదేవిధంగా బీఎస్పీ నేత ప్రవీణ్‌కుమార్ ప్రభావం కూడా ఇక్కడ పనిచేసే అవకాశం కనిపిస్తోంది. శేరిలింగంపల్లి అసెంబ్లీ స్థానం ఓటర్లు గత మూడు ఎన్నికల్లో మూడు పార్టీలకు పట్టం కట్టారు. గులాబీ పార్టీకి చెందిన సిటింగ్‌ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ మరోసారి గెలిచి సత్తా చాటాలని భావిస్తున్నారు. టిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న బండి రమేష్ కూడా పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. కాంగ్రెస్ నుంచి బీజేపీ లో చేరిన రవికుమార్ యాదవ్ తో పాటు గత ఎన్నికల్లో బిజేపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన యోగానంద్ మధ్య పార్టీలో గట్టి పోటీ నడుస్తోంది. ఈ సీటు కోసం కారు, కమలం పార్టీల మధ్య హోరాహోరీ పోరు సాగే అవకాశం ఉంది. -
వికటించిన కుటుంబనియంత్రణ ఆపరేషన్.. ముగ్గురు మృతి
సాక్షి, రంగారెడ్డిజిల్లా: మౌలిక సదుపాయాల లేమి, ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం వెరసి అనేక మంది తల్లీపిల్లలకు తీరని కడుపుకోతను మిగుల్చుతోంది. పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వ ఆస్పత్రిలో మెరుగైన వైద్యసేవలు పొందవచ్చని భావించి ఎంతో ఆశతో ఆస్పత్రులకు చేరుకుంటున్న గర్భిణులు, బాలింతల ను మృత్యుపాశాలు వెంటాడుతున్నాయి. రోగుల నిష్పత్తికి సరిపడా మౌలిక సదుపాయాలు, వైద్య సిబ్బ ందిని ఏర్పాటు చేయాల్సిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పట్టానట్టుగా వ్యవహరించడమే ఇందుకు కారణమని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తల్లులను కోల్పోయిన పిల్లలు ►ఇబ్రహీంపట్నం సీహెచ్‌సీలో కు.ని చికిత్సలు వికటించి రెండు రోజుల్లో ముగ్గురు తల్లులు మృత్యువాత పడగా, మరొకరు వెంటిలేటర్‌పై చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. పిల్లలు గుక్కపట్టి ఏడుస్తున్నారు. ►ఆమనగల్లు మండలం గౌరారం గ్రామానికి చెందిన ఆశా కార్యకర్త ఈశ్వరమ్మ కొంత కాలంగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతోంది. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి (ఆదిలక్ష్మీ నర్సింగ్ హోం/సీబీఎం) తరలించారు. ఈ నెల 23న వైద్యులు ఆమెకు గర్భసంచి తొలగింపు సర్జరీ చేశారు. తీవ్ర రక్తస్రావంతో ఆమె మృతిచెందగా పిల్లలు అనాథలయ్యారు. బిడ్డలను కోల్పోయిన తల్లులు ►కొందుర్గు మండలం, తంగెళ్లపల్లికి చెందిన మేఘమాల పురిటి నొప్పులతో బాధపడుతుండటంతో కుటుంబ సభ్యులు గత గురువారం చికిత్స కోసం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అడ్మిట్ చేసుకున్న సిబ్బంది ఆ తర్వాత నిర్లక్ష్యం చేశారు. రాత్రి పొద్దుపోయిన తర్వాత నొప్పులు అధికమై బిడ్డ కడుపులో అడ్డం తిరగడంతో తమ వల్ల కాదంటూ చేతులెత్తేశారు. హుటాహుటిన ప్లేట్లబురుజు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే బిడ్డ చనిపోయింది. ►నందనవనంలో నివసించే సరిత(24) పురిటి నొప్పులు రావడంతో ప్రసవం కోసం ఈ నెల 4న వనస్థలిపురం ఏరియా ఆస్పత్రికి చేరుకుంది. పరీక్షించిన వైద్యులు ప్రసవానికి మరో నెల ఉందన్నారు. నొప్పులు భరించలేక పోతున్నానని సరిత చెప్పడంతో అడ్మిట్ చేశారు. ఉదయం అడ్మిటైన గర్భిణిని సాయంత్రం వరకు ఎవరూ పట్టించుకోలేదు. చివరికి సిజేరియన్ చేయగా అప్పటికే కడుపులోని బిడ్డ కడుపులోనే కన్నుమూసింది. అట్టుడికిన ఇబ్రహీంపట్నం ఇబ్రహీంపట్నం: కు.ని ఆపరేషన్లు వికటించి ముగ్గు రు మహిళలు మృతి చెందిన సంఘటనతో సోమవా రం ఇబ్రహీంపట్నంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. మృతుల కుటుంబసభ్యులు, బంధువులు స్థానిక అంబేడ్కర్ చౌరస్తాలో బైఠాయించారు. బాధితులకు న్యాయం జరిగేంత వరకు కదిలేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. సుష్మ మృతదేహన్ని అంబులెన్స్‌లో ఉంచి ఆందోళనకు దిగారు. మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, కాంగ్రెస్ నాయకులు చిలుక మధుసూదన్‌రెడ్డి తదితరులు వీరికి మద్దతుగా నిలిచారు. మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా వైద్యాధికారి స్వరాజ్వలక్ష్మిని చుట్టుముట్టి నిలదీశారు. ఎక్స్‌గ్రేషియా.. డబుల్ బెడ్రూం.. విచారణకు హామీ ఆందోళన చేస్తున్న వారికి ఆర్డీఓ వెంకటాచారి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామని ప్రకటించినా ససేమిరా అనడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో ఆర్డీఓ విషయాన్ని ఫోన్‌ద్వారా కలెక్టర్‌కు విన్నవించారు. రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామని, డబుల్ బెడ్రూం ఇల్లు ఇస్తామని, పూర్తిస్థాయి విచారణ జరిపి సంబంధిత వైద్యాధికారులపై చర్యలు తీసుకుంటామని సర్దిచెప్పారు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు శాంతించారు. సమగ్ర విచారణ జరిపిస్తాం ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపిస్తామని కమిషనర్ ఆఫ్ హెల్త్ ఫ్యామిలీ ప్లానింగ్ అడిషనల్ డైరెక్టర్ రవీందర్ నాయక్ తెలిపారు. సోమవారం ఆయన ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రిని డిప్యూటీ డీహెంహెచ్‌ఓ నాగజ్యోతితో కలిసి పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ఈ నెల 25న డీపీఎల్ క్యాంపులో 34 మందికి ట్యూబెక్టమీ ఆపరేషన్లు చేసినట్లు చెప్పారు. వీరిలో నలుగురికి మాత్రమే ఆరోగ్య సమస్యలు తలెత్తాయన్నారు. వీరిలో ముగ్గురు చనిపోవడం బాధాకరమన్నారు. ఈ ఘటనపై ఎక్స్పర్ట్ కమిటీ వేసి విచారణ జరిపిస్తామని, త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామన్నారు. – ఫ్యామిలీ ప్లానింగ్ అడిషనల్ డైరెక్టర్ రవీందర్ నాయక్ చదవండి: (తెలంగాణలో భారీగా పెరిగిన క్రైం రేటు.. దేశంలోనే నెం.1) -
టాలీవుడ్ నటుడుకి కత్తులు, గన్‌తో బెదిరింపు.. పోలీసులకు ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ఆగడాలు రోజురోజుకూ శ్రుతిమించిపోతున్నాయి. ఇందుకు సంబంధించి స్థానికులు, పోలీసుల వివరాలు ఇలా ఉన్నాయి.. పూడూరు మండలం కేరవెళ్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లు 14, 15, 16, 17, 18, 19లలో 29.19 ఎకరాల పొలాన్ని హైదరాబాద్‌కు చెందిన నటుడు రణధీర్‌రెడ్డి కొనుగోలు చేశారు. ఈయన పేరున ధరణి పట్టాదారు పాస్‌బుక్కులు సైతం వచ్చాయి. కొనుగోలు చేసిన పొలంలో పంటలు వేశారు. అందులో చుట్టూ కంచె వేస్తుండగా.. హైదరాబాద్‌కు చెందిన సుల్తాన్ హైమద్ పనులను అడ్డుకున్నాడు. అంతటితో ఆగకుండా తనవద్ద ఉన్న గన్ తీసి బెదిరించాడు. అతనితో పాటు వచ్చిన స్నేహితులు సైతం కత్తులతో రణధీర్‌రెడ్డిని భయబ్రాంతులకు గురిచేశారు. గతంలోనూ హైమద్ రైతులను బెదిరించి ఇక్కడ ఓ షెడ్ నిర్మించాడు. గుంపులుగా గుర్రాలపై తిరుగుతూ తమతో పాటు ఇక్కడ భూములను కొనుగోలు చేసిన వారిని భయపెడుతూ.. కబ్జాలకు పాల్పడుతున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. హైమద్ తన అనుచరులతో వచ్చి గన్, కత్తులతో తమను బెదిరించాడని రణధీర్‌రెడ్డి చన్గోముల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గన్ స్వాధీనం.. సుల్తాన్ హైమద్ వద్ద గన్ ఉన్నది వాస్తవమేనని.. అది లైసెన్సుడ్ గన్ అని చన్గోముల్ ఎస్ఐ శ్రీశైలం తెలిపారు. నటుడు రణధీర్‌రెడ్డి 29.19 ఎకరాలు కొనుగోలు చేశాడని, అతని వద్ద పూర్తి రికార్డులు ఉన్నాయని చెప్పారు. హైమద్ మాత్రం తన పూర్వికులకు సంబంధించిన భూమి అని కబ్జాలో ఉన్నాడన్నారు. అతని నుంచి గన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. చదవండి: Dhanush: నువ్వు హీరో ఏంట్రా? అంటూ హేళన చేశారు -
TS: బీజేపీ సభ వేళ టీఆర్ఎస్కు ఊహించని షాక్
Badangpet Mayor Chigirintha Parijatha Narasimha Reddy: తెలంగాణలో అధికారం కోసం బీజేపీ ప్లాన్స్ రచిస్తున్న వేళ అధికార టీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో గులాబీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. టీఆర్ఎస్ పార్టీకి బడంగ్పేట్ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆదివారం ఆమె తన రాజీనామా లేఖను జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డికి పంపించారు. ఈ సందర్భంగా తన రాజీనామా లేఖలో గులాబీ పార్టీకి, క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో కొన్ని అనివార్య, వ్యక్తిగత కారణాల వల్లే పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. పార్టీలో తనకు సహాకరించిన ప్రతీ ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. బడంగ్ పేట అభివృద్ధిని కాంక్షించి పార్టీలో చేరడం జరిగిందని, అప్పటి నుంచి నేటి వరకూ పార్టీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమం విజయవంతం చేయడం కోసం కృషి చేశామని ఆమె పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: బీజేపీ సమావేశాలు.. తెలంగాణ పోలీస్ అత్యుత్సాహం -
కేసీఆర్‌కు పదవే ముఖ్యం: టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి
శామీర్‌పేట్: కేసీఆర్ సీఎం అయ్యాక రాష్ట్రంలో రోజుకు సగటున నలుగురు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని, రైతు ఏడ్చిన రాజ్యం ఎన్నటికీ బాగుపడదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. కేసీఆర్‌కు తన పదవి, రాజకీయాలే ముఖ్యమని ఆయన ధ్వజమెత్తారు. సోమవారం పీసీసీ ఆధ్వర్యంలో మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మండలంలోని సీఎం కేసీఆర్ దత్తత గ్రామమైన లక్ష్మాపూర్‌లో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. ధరణి పోర్టల్ ప్రారంభించిన మండలంలోనే భూ సమస్యలు అధికంగా ఉన్నాయని, నేటికీ లక్ష్మాపూర్ గ్రామంలో రైతులకు రైతుబంధు, రైతుబీమా అందడం లేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న రైతుల సమస్యలు పరిష్కరించలేని కేసీఆర్, పంజాబ్ రైతులను ఆదుకుంటానని వెళ్లడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రూ.2,500 మద్దతు ధరతో ధాన్యం కొనుగోలు చేస్తామని, హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న గ్రామాల్లో రైతులు కూరగాయల సాగు చేసేందుకు ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు. జిల్లా మంత్రి మల్లారెడ్డి దున్నపోతుమీద వాన పడ్డ చందంగా వ్యవహరిస్తున్నారని, వేల ఎకరాల పేదల భూములను కబ్జాచేస్తున్నారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే మల్లారెడ్డి గుంజుకున్న పేదల భూములను వారికే అప్పగిస్తామని హామీ ఇచ్చారు. సీఎం ఫాంహౌస్‌కు వెళ్లే మార్గంలో రోడ్డు విస్తరణలో ఇల్లు కోల్పోయిన కుమ్మరి ఎల్లమ్మ బాధ్యత తనదేనని, రూ.5 లక్షలతో ఇల్లు నిర్మించి ఇస్తానని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర ఓబీసీ సెల్ కార్యదర్శి జంగయ్యయాదవ్, మేడ్చల్ నేతలు హరివర్ధన్‌రెడ్డి, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. పంజాబ్ రైతులకు పరిహారం ఇవ్వడం విడ్డూరం తెలంగాణలో రోజుకు ముగ్గురు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే వాళ్లను పరామర్శించడానికి ఫాంహౌస్ గడప దాటని సీఎం కేసీఆర్, పంజాబ్ వెళ్లి అక్కడి రైతులకు పరిహారం ఇవ్వడం విడ్డూరంగా ఉందని టీపీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్‌రెడ్డి సోమవారం ట్వీట్ చేశారు. ‘అయిన వారికి ఆకుల్లో కానివారికి కంచాల్లో అంటే ఇదేనేమో!’అని ఎద్దేవా చేశారు. ‘మర్మమేమిటో మన రైతన్నలకు అర్థం కాదనుకుంటున్నారా!’అని ట్విట్టర్ వేదికగా సీఎంను రేవంత్ నిలదీశారు. -
ఎల్బీనగర్లో మిస్సింగ్.. ఖమ్మం జిల్లాలో మృతదేహం లభ్యం
నాగోలు: ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 16న అదృశ్యమైన వ్యక్తి ఖమ్మం జిల్లాలోని సాగర్ ప్రధాన కాల్వలో శవమై తేలిన సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా, రాఘవాపురం గ్రామానికి చెందిన పదిర భాను చందర్ నగరానికి వలస వచ్చి నాగోలు సాయినగర్ గుడిసెల్లో ఉంటూ సెంట్రింగ్ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా టీఎస్ ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి పని చేస్తున్నాడు. ఈ నెల 16న ఇంటి నుంచి బయటకు వెళ్లిన భానుచందర్ తిరిగి రాలేదు. దీంతో అతని భార్య గాలింపు చేపట్టినా ఆచూకీ తెలియరాలేదు. అదే రోజు భార్యకు ఫోన్ చేసిన భానుచందర్ యాదాద్రి జిల్లా, రాయగిరిలోని ఇంటికి వస్తున్నట్లు చెప్పి ఫోన్ పెట్టేశాడు. తర్వాత ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో ఆందోళనకు గురైన అతని భార్య కావ్య ఈ నెల 17న ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా ఖమ్మం జిల్లా, రఘునాథ పాలెం మండలం, మూలగూడెం వద్ద సాగర్ ప్రధాన కాల్వలో ఈనెల 21న ఓ వ్యక్తి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు అతడి వద్ద ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ హాస్పిటల్ మార్చురీలో భద్రపరిచారు. మృతుడి ఆనవాళ్లపై పోలీస్స్టేషన్లకు సమాచారం అందించడంతో అప్పటికే అతడికోసం వెతుకుతున్న ఎల్బీనగర్ ఏసీపీ శ్రీధర్‌రెడ్డి, సీఐ అశోక్‌రెడ్డి, తదితరులు ఆదివారం రాత్రి ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో మృతదేహాన్ని పరిశీలించారు. మృతడి వేలికి ఉన్న ఉంగరం ఆధారంగా భానుచందర్‌గా గుర్తించారు. ఈ మేరకు ఎల్బీనగర్ పోలీసు లు అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సోమవారం పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని నాగోలు సాయినగర్‌కు తీసుకువచ్చారు. పాత కక్షలతోనే భాను చందర్ హత్య... సాయినగర్ గుడిసెల్లో ఉంటున్న భాను చందర్‌కు అదే ప్రాంతానికి చెందిన వ్యక్తులతో విబేధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతానికి చెందిన ముగ్గురు వ్యక్తులు, హయత్‌నగర్ ప్రాంతానికి చెందిన మరొకరితో కలిసి భాను చందర్‌ను పథకం ప్రకారం బయటికి తీసుకెళ్లి హత్య చేసి ఖమ్మం జిల్లా, పాలేరు సమీపంలోని సాగర్ ప్రధాన కాల్వలో పారవేయగా మృతదేహం నీటిలో మూలగూడెం వరకు కొట్టు కొచ్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. కాగా ఇప్పటికే దర్యాప్తు చేపట్టిన ఎల్బీనగర్ పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.. నిందితులను కఠినంగా శిక్షించాలి భానుచందర్ హత్య కేసులో నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని టీఎస్ ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులు మేడి పాపయ్య, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సూర్యప్రకాష్, పలువురు నాయకులు డిమాండ్ చేశారు. బీజేపీ నాయకుల ధర్నా.. నిందితులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కోశాధికారి చింతల సురేందర్ యాదవ్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు సాయినగర్ కాలనీలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సురేందర్ యాదవ్ అక్కడే ఉన్న ఆమ్ఆద్మీ పార్టీ నాయకురాలు ఇందిరాశోభన్ పట్ల దురుసుగా ప్రవ ర్తించాడు. దీంతో పోలీసులు బీజేపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. సాయినగర్ గుడిసెల వద్ద భారీ ఎలాంటి అవాంఛ నీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. -
మూడేళ్ల కిందట మాటలు బంద్.. మూగవాడికి మాటలొచ్చాయ్!
కేశంపేట: ఓ ప్రమాదంలో మాట కోల్పోయిన వ్యక్తికి తిరిగి మాటలు వచ్చాయన్న ఉదంతం రంగారెడ్డి జిల్లా కేశంపేటలో ఆదివారం చర్చనీయాంశమైంది. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కేశంపేట గ్రామానికి చెందిన బ్రహ్మచారి మూడేళ్ల కిందట ప్రమాదవశాత్తు ఇంట్లో కిందపడ్డాడు. బ్రెయిన్‌కు గాయాలవ్వడంతో అతడు మాట కోల్పోయాడు. వైద్యులను సంప్రదించగా రూ.3లక్షలకు పైగా ఖర్చవుతుందన్నారు. (చదవండి: స్టంట్లు చేస్తున్నారా.. జర జాగ్రత్త.. పోలీసులు ఇంటికే వచ్చేస్తారు!) అంత మొత్తం చెల్లించే స్థోమత లేకపోవడంతో కుటుంబసభ్యులు అలాగే వదిలేశారు. ఈ క్రమంలో గ్రామంలోని వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయంలో శనివారం విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానికులతో కలిసి బ్రహ్మచారి సైతం వీరబ్రహ్మేంద్రస్వామి దీక్ష చేపట్టాడు. దీక్షలో ఉన్న బ్రహ్మచారి ఆదివారం ఉదయం ఆలయ గర్భగుడిని శుభ్రం చేస్తుండగా ఒక్కసారిగా పూనకం వచ్చినట్టు ఊగిపోయి మాట్లాడడం మొదలుపెట్టాడు. మొదటగా గర్భగుడిలో ఉంటేనే మాటలు రావడం.. బయటికి వస్తే రాకపోవడం గమనించారు. దీంతో స్వామివారికి 11బిందెలతో అభిషేకం చేయడంతో మాటలు పూర్తిగా రావడం మొదలైంది. గ్రామంలో వీరబ్రహ్మేంద్రస్వామి విగ్రహ ప్రతిష్ఠాపన చేయడంతో ఈ అద్భుతం జరిగిందని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. గతంలో మాటలు రాలేదని.. తిరిగి రావడం వాస్తవమేనని పలువురు స్థానికులు ధ్రువీకరిస్తున్నారు. కాగా, దీనిపై డిప్యూ టీ డీఎంహెచ్ఓ దామోదర్ వివరణ కోరగా బ్రెయిన్‌కు గాయం అయినప్పుడు ఇలా మాటలు కోల్పోయే అవకాశం ఉంటుందని.. గాయం మానినప్పుడు అనుకోని పరిణామాల్లో తిరిగి రావచ్చని అభిప్రాయపడ్డారు. (చదవండి: వాలీబాల్ ఆడుతూ 15 ఏళ్ల బాలుడు మృతి) -
రంగారెడ్డి: అబ్దుల్లాపుర్ మెట్లో చైన్‌స్నాచర్ వీరంగం
-
అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా ఫాంహౌస్‌లు.. రెచ్చిపోతున్న పోకిరీలు
సాక్షి, రంగారెడ్డి: పగలు ప్రశాంతంగా ఉండే పల్లెలు చీకటైతే చాలు గానాబజానా.. డీజే చప్పుళ్లతో హోరెత్తుతున్నాయి. ఫాంహౌస్‌లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. వేడుకల పేరుతో మద్యం, హుక్కా, గంజాయి మత్తులో తూలుతున్నా పట్టించుకునేవారు లేకుండాపోయారు. నగరాల్లోనే కనిపించే పాడు కల్చర్ ఇప్పుడు పల్లెలకూ పాకింది. పేకాట, కోళ్ల పందేలు, రెయిన్ డాన్స్, ముజ్రా పార్టీలకు సైతం ఫాంహౌస్‌లు వేదికలవుతున్నాయి. పా ర్టీల పేరుతో నిర్వహించే ఈవెంట్లతో యువత పెడ దారి పడుతోంది. నగరానికి అతి చేరువలో ఉన్న శివారు ప్రాతాల్లో వేల సంఖ్యలో ఫాంహౌస్‌లు ఉ న్నాయి. నిత్యం ఏదో ఒక ఈవెంట్ నిర్వహిస్తున్నా రు. కొన్ని సందర్భాల్లో డ్రగ్స్ కూడా వినియోగిస్తున్నారు. మొయినాబాద్, శంకర్పల్లి, చేవెళ్ల, శంషాబాద్, కొత్తూరు, షాద్‌నగర్, మహేశ్వరం, కందుకూ రు, ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లోని ఫాంహౌస్‌లలో ఈ వ్యవహారం ఎక్కువగా నడుస్తోంది. పోకిరీలతో ఇబ్బందులు.. సాధారణంగా గ్రామీణ ప్రాంతాలన్నీ ప్రశాంతమైన వాతావరణంలో ఉంటాయి. ఇక్కడ మాత్రం ఫాంహౌస్‌లు గ్రామాలకు అతి చేరువలో ఉండడంతో గానా బజానాల్లో మునిగి తేలుతున్నాయి. పోకిరీలు మద్యం మత్తులో గ్రామాల్లోకి వచ్చి గొడవలకు దిగుతున్నారు. డీజే సౌండ్స్, గొడవలతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల మొయినాబాద్ మండలం చిన్నషాపూర్లోని ఓ ఫాంహౌస్‌లోకి వచ్చిన పోకిరీలు అర్థరాత్రి గ్రామంలో సంచరిస్తుండగా గ్రామస్తులు ప్రశ్నించారు. దీంతో వారిపై దాడికి తెగబడ్డారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. వారం రోజులపాటు స్టేషన్ చుట్టూ తిరిగితే అప్పుడు కేసు నమోదు చేసి చేతులు దులుపుకొన్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇలాంటి సంఘటనలు నిత్యం ఏదో ఒకచోట జరుగుతూనే ఉన్నాయి. అనుమతులు లేకుండా.. నగరానికి చేరువలో ఫాంహౌస్‌లు నిర్మించి వాటిని ఆన్లైన్ ద్వారా అద్దెకిస్తున్నారు. ఏదైనా వేడుక చేసుకోవాలనుకున్నవారు ఆన్లైన్లో బుక్‌చేసుకుంటారు. మద్యం వినియోగిస్తే ఎక్సైజ్ అధికారుల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అవేవీ పట్టించుకోకుండా మద్యం వినియోగం కొనసాగుతోంది. దీనికి తోడు హుక్కా, గంజాయిని సైతం వినియోగిస్తున్నారు.మూడు నెలల క్రితం ఓ ఫాంహౌస్‌లో జరిగిన జన్మదిన వేడుకల్లో గంజాయి వినియోగిస్తుండగా ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. ఇటీవల షాద్‌నగర్, కొత్తూరు ప్రాంతాల్లోనూ గంజాయి పట్టుకున్నారు. ఇలాంటి ఘటనలు తరచూ బయటపడుతున్నా ఎక్సైజ్, స్థానిక పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంపై ఆరోపణలు వస్తున్నాయి. అనుమతి తీసుకోవాలి.. ఫాంహౌస్‌లలో చిన్నచిన్న వేడుకలు, పార్టీలు జరిగితే యజమానులు ఎలాంటి అనుమతి తీసుకోవడం లేదు. పార్టీలు, ఈవెంట్లు జరిగినప్పుడు మద్యం వినియోగిస్తే ఎక్సైజ్ అధికారుల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. వేడుకల్లో మాదకద్రవ్యాలు వినియోగిస్తే చర్యలు తప్పవు. – రాజు, ఇన్స్పెక్టర్, మొయినాబాద్ -
మహాక్రతువు సుసంపన్నం.. శాంతి కల్యాణం వాయిదా
సాక్షి, రంగారెడ్డిజిల్లా: పన్నెండు రోజుల పాటు ఐదువేల మంది రుత్వికులు అత్యంత భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించిన శ్రీ లక్ష్మీనారాయణ మహాక్రతువు సోమవారంతో పరిపూర్ణమైంది. రామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహంలో భాగంగా ప్రవచన మండపంలో రోజూ అష్టాక్షరీ మంత్ర పఠనం, విష్ణుసహస్ర పారాయణం నిర్వహించారు. అలాగే, 114 యాగశాలల్లో 1035 హోమకుండలాల్లో రెండు లక్షల కేజీల స్వచ్ఛమైన ఆవు నెయ్యితో విష్వక్సేనేష్టి, నారసింహ ఇష్టి, లక్ష్మీనారాయణ ఇష్టి, పరమేష్టి, వైభవేష్టి, హయగ్రీవ ఇష్టి, వైవాయిహిక ఇష్టి, సుదర్శన ఇష్టి, వైనతే ఇష్టి యాగ పూజలను నిర్వహించారు. ఉదయం త్రిదండి చినజీయర్ స్వామి యాగశాలలో పంచసూక్త హవనం అనంతరం శాంతిహోమం నిర్వహించారు. యాగశాలకు నలుదిక్కుల యజ్ఞ గుండాల దగ్గరున్న ద్వారపాలకుల అనుమతి తీసుకుని మహాపూర్ణాహుతి నిర్వహించారు. ఆ తర్వాత యాగశాల నుంచి సమతామూర్తి విగ్రహం వరకు పెరుమాళ్ యాత్రను నిర్వహించారు. 120 కేజీల రామానుజాచార్యుల బంగారు ప్రతిమకు చినజీయర్ స్వామి ప్రాణప్రతిష్ఠ చేశారు. ప్రతి యాగశాల నుంచి దేవతామూర్తులను ఆవాహన చేసిన కలశాలను సమంత్రకంగా సమతాక్షేత్ర స్ఫూర్తి కేంద్రానికి తీసుకెళ్లి కుంభప్రోక్షణ చేసి అభిషేకాన్ని నిర్వహించారు. ప్రాణప్రతిష్ఠ, కుంభాభిషేకం కార్యక్రమంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి, మైహోం గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వరరావు పాల్గొన్నారు. సాయంత్రం గ్లైడర్స్ సమతమూర్తి విగ్రహంపై పూలవర్షం కురిపించారు. అనంతరం దేశవిదేశాల నుంచి వచ్చిన రుత్వికులను ఘనంగా సత్కరించారు. ఈ పన్నెండు రోజులు అష్టాక్షరీ మంత్ర పఠనం, చతుర్వేద పారాయణం, ఐదు వేల మంది కళాకారుల ప్రదర్శనలు, మహా పూర్ణాహుతితో ఈ మహాక్రతువు సుసంపన్నమైంది. గొప్ప ఆధ్యాత్మిక కేంద్రం: కిషన్‌రెడ్డి ముచ్చింతల్ భవిష్యత్తులో గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా, హిందూ దర్శన ప్రదేశంగా విలసిల్లుతుందని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి జోస్యం చెప్పారు. శ్రీరామనగరంలో శిలాసంపద అత్యద్భుతంగా ఉందని కొనియాడారు. దేశంలోని ప్రముఖ దివ్యదేశాలను ఒకే చోట దర్శించుకోవడం ఆనందంగా ఉందని, కార్యనిర్వాకుల కృషి, వైదిక ప్రక్రియలు ఈ వేడుకకు వన్నె తెచ్చాయన్నారు. ఈ ఉత్సవాలు ప్రారంభమైన రోజు నుంచి చివరి వరకు ఎనిమిది లక్షల మందికిపైగా శ్రీరామనగరాన్ని సందర్శించుకున్నట్లు అంచనా. శాంతి కల్యాణం వాయిదా నిజానికి సోమవారం ఉదయం మహా పూర్ణాహుతి కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరవుతారని నిర్వాహకులకు సమాచారం ఇచ్చారు. దీంతో టీఆర్ఎస్ శ్రేణులు ముచ్చింతల్ రహదారులు, సమతామూర్తి ప్రాంగణంలో భారీగా కేసీఆర్, కేటీఆర్ కటౌట్లను ఏర్పాటు చేశారు. పోలీసు అధికారులు కూడా ఆ మేరకు భద్రతా ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం తర్వాత కూడా సీఎం రాలేదు. సాయంత్రం ఆయా దివ్యదేశాల్లోని మూర్తులకు నిర్వహించే శాంతి కల్యాణంలో పాల్గొంటారని ప్రచారం జరిగింది. కానీ ఈ వేడుకలకు కూడా ఆయన దూరంగా ఉన్నారు. ఈ సమయంలో శాంతి కల్యాణం నిర్వహిస్తే.. సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చిన రుత్వికులు, సేవకుల తిరుగు ప్రయాణానికి ఇబ్బంది కలిగే అవకాశం ఉందంటూ ఈ శాంతి కల్యాణాన్ని 19వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు చినజీయర్ స్వామి ప్రకటించారు. ఆయా ఆలయాల్లోని 108 విగ్రహ స్వరూపాలకు ఒకే చోట, ఒకే సమయంలో శాంతి కల్యాణం జరిపించడం చరిత్రలో ఇదే మొదటిసారి అవుతుందని చెప్పారు. -
భార్యభర్తల మధ్య గొడవ.. భర్త అదృశ్యం
సాక్షి, మీర్‌పేట(రంగారెడ్డి): భార్య కేసు పెట్టిందని మనస్తాపం చెందిన వ్యక్తి ఇంట్లో నుంచి బయటకు వెళ్లి కనిపించకుండా పోయిన సంఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో చోటు చేసుకుంది. ఏఎస్ఐ తిరుపతయ్య ప్రకారం.. మీర్‌పేట జనప్రియా మహానగర్‌కు చెందిన టి.రవీందర్ (45), వృత్తి రీత్యా ప్రైవేటు ఉద్యోగి. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ కలహాలతో కొంత కాలంగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. దీంతో రవీందర్‌పై గతంలో భార్య పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కోర్టులో కేసు నడుస్తోంది. దీంతో మనస్తాపం చెందిన రవీందర్ కొన్ని రోజుల క్రితం ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఆచూకీ కోసం వెతికినా ప్రయోజనం లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆదివారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
స్థానిక మహిళతో వివాహం.. రాత్రి పూట బయటి కాలనీల్లో తిరుగుతూ..
సాక్షి, హైదరాబాద్: రాత్రి పూట రెక్కీ నిర్వహిస్తారు. పార్కింగ్ చేసిన కార్లను అపహరిస్తారు. రాత్రికి రాత్రే మహారాష్ట్రకు తీసుకెళ్లి విక్రయిస్తారు. ఈ అంతర్రాష్ట్ర ఆటోమొబైల్ గ్యాంగ్‌ను రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. ముఠాలోని ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.50 లక్షల విలువైన 8 కార్లను స్వాధీనం చేసుకున్నారు. వివరాలను మల్కాజిగిరి డీసీపీ రక్షితకే మూర్తి, డీసీపీ క్రైమ్స్ యాదగిరిలతో కలిసి రాచకొండ పోలీస్ కమిషనరేట్ అడిషనల్ సీపీ సుధీర్ బాబు వెల్లడించారు. ► మహారాష్ట్రలోని కొల్హాపూర్‌కు చెందిన ఉదయ్ మారుతీ పాటిల్, ఫర్మాల్ అలీఖాన్, ఇమ్రాన్ ఖాన్ పఠాన్, సోహ్రబ్ అలీ, యెవరుల్లా ఖాన్, సంతోష్ జగన్నాథ పవార్ ముఠాగా ఏర్పడ్డారు. ఇమ్రాన్ ఖాన్ పఠాన్ (36) కుషాయిగూడ హెచ్‌బీ కాలనీలో స్థానికంగా ఓ మహిళను పెళ్లి చేసుకొని ఇక్కడే ఉంటున్నాడు. ► రాత్రిపూట కాలనీల్లో తిరుగుతూ బయట కార్లు ఎక్కడ పార్క్ చేశారు? కెమెరాలు ఉన్నాయా? రాత్రి వేళల్లో జన సంచారం ఉంటుందా? వంటి వాటిపై రెక్కీ నిర్వహించి.. సమాచారాన్ని మహారాష్ట్రల్లోని తన గ్యాంగ్‌కు చేరవేస్తాడు. ► సమాచారం అందుకున్న ఉదయ్ మారుతీ పాటిల్ ప్లాన్ చేసి.. అనుచరులను రంగంలోకి దింపుతాడు. ఇమ్రాన్‌ఖాన్ సూచించిన ప్రాంతంలో రాత్రికి వెళ్లి కార్‌ను చోరీ చేస్తారు. ► మారుతీ స్విఫ్ట్, హోండా ఐ 10, అమేజ్ కార్లను మాత్రమే వీళ్లు లక్ష్యంగా చేసుకుంటారు. రిపేరు లేదా స్క్రాప్‌లో వచ్చిన కార్ల నంబర్ ప్లేట్లను తీసుకొని అలాంటి రంగు ఉండే కార్లనే చోరీ చేస్తారు. వాటికి అసలు కార్ నంబర్ ప్లేట్‌ను తగిలించి కస్టమర్‌కు విక్రయిస్తారు. ► వీళ్ల ప్రత్యేక మెకానిజం కారణంగా కార్ డోర్‌ను ఓపెన్ చేసినప్పుడు అలారం కూడా మోగదు. కారు డోర్‌ను ఓపెన్ చేసి నకిలీ తాళం చెవితో స్టార్ట్ చేసి రాత్రికి రాత్రే మహారాష్ట్రకు తరలిస్తారు. అక్కడికి వెళ్లాక కారు ఇంజిన్, చాసిస్ నంబర్లను మార్చేస్తారు. ఒక్కో కారుకు రూ.2 లక్షల నుంచి 3 లక్షల లాభం చూసుకొని విక్రయిస్తుంటారు. ► ఈ గ్యాంగ్ ఐదేళ్లుగా వేర్వేరు రాష్ట్రాల్లో చోరీలు చేస్తోంది. ఇప్పటివరకు తెలంగాణ, ఏపీతో పాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో 50కి పైగా కార్లను చోరీ చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ► ఇద్దరు నిందితులు ఇమ్రాన్‌ఖాన్ పఠాన్, సంతోష్ జగన్నాథ పవార్లను కస్టడీకి తీసుకొని లోతుగా విచారణ చేస్తే అసలు ఎన్ని కార్లు దొంగిలించారు? ఎవరెవరికి విక్రయించారో బయటపడుతుందని మల్కాజిగిరి డీసీపీ రక్షిత కే మూర్తి తెలిపారు. చదవండి: నాలుగేళ్ల క్రితం వివాహం.. పురుగులమందు తాగిన వివాహిత -
భర్త వేధింపులు.. తమ్ముడితో కలిసి..
సాక్షి, మీర్‌పేట(రంగారెడ్డి): వేధింపులకు గురిచేస్తున్నారని బావను హతమార్చిన అక్కాతమ్ముడిని మీర్‌పేట పోలీసులు అరెస్ట్ చేసి సోమవారం రిమాండ్ చేశారు. సీఐ మహేందర్‌రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జిల్లెలగూడ సత్యసాయినగర్ కాలనీకి చెందిన సభావత్ సరోజ, జరుప్లావత్ శ్రీను అక్కాతమ్ముడు. సరోజ భర్త కొంత కాలం క్రితం చనిపోయాడు. వీరిద్దరూ స్థానికంగా ఉన్న టైల్స్ షాపులో పనిచేస్తున్నారు. చంపాపేట కృష్ణానగర్ కాలనీకి చెందిన కొడావత్ రెడ్యా (45) మొదటిభార్య చనిపోవడంతో పదేళ్ల క్రితం సరోజ, శ్రీనుల సోదరి అయిన లక్ష్మీని ఇచ్చి వివాహం జరిపించారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. రెడ్యా కూడా టైల్స్ షాపులో పనిచేస్తుంటాడు. రెడ్యా కొంత కాలంగా సరోజతో సన్నిహితంగా ఉంటూ వస్తున్నాడు. ఈ క్రమంలో రెడ్యా తరచూ మద్యం సేవించి సరోజ ఇంటికి వచ్చి చిన్న చిన్న విషయాలకు గొడవపడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. దీంతో విషయం తెలుసుకున్న శ్రీను అనవసరంగా ఇంటికి వచ్చి గొడవ పడుతున్నాడని, మరోసారి వస్తే తగిన బుద్ధిచెబుతామని పలుమార్లు రెడ్యాతో పాటు కుటుంబ సభ్యులను హెచ్చరించాడు. అయినప్పటికీ రెడ్యా తన ప్రవర్తన మార్చుకోకుండా ఈ నెల 2న రాత్రి మద్యం సేవించి సరోజ ఇంటికి వచ్చి నానా హంగామా చేశాడు. దీంతో విసుగెత్తిన సరోజ, శ్రీనులు బావ రెడ్యాను హతమార్చాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో రెడ్యాపై రోటీ కర్రతో దాడి చేయడంతో తీవ్ర రక్తస్రావమై అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. మరుసటి రోజు తెల్లవారుజామున ఇద్దరూ కలిసి అపస్మారక స్థితిలో ఉన్న బావ రెడ్యాను హస్తినాపురంలోని నవీన ఆస్పత్రికి తరలించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించగా ఆదివారం మధ్యాహ్నం రెడ్యా మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు సరోజ, శ్రీనులను అదుపులోకి తీసుకుని విచారించగా రెడ్యా మద్యం మత్తులో ఇంటికి వచ్చి గొడవపడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నాడని, వేధింపులు తాళలేకనే దాడి చేసి హత్య చేశామని నేరాన్ని అంగీకరించారు. ఈ మేరకు పోలీసులు వారిద్దరిని సోమవారం రిమాండ్‌కు తరలించారు. -
ఒకదానివెనుక మరోటి.. నుజ్జునుజ్జయిన 7 కార్లు
చేవెళ్ల: అతివేగం.. ఏడు కార్లను ధ్వంసం చేయగా పలువురిని గాయపడేలా చేసింది. ఈ సంఘటన చేవెళ్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఆలూరు–అంతారం బస్‌స్టేజీల మధ్య చోటు చేసుకుంది. చేవెళ్ల నుంచి ఆదివారం వికారాబాద్ వైపు వెళ్తున్న ఓ కారు డ్రైవర్ వేగంగా వచ్చి సడన్ బ్రేక్ వేశాడు. వెనుక వస్తున్న ఆరుకార్లు అంతే వేగంతో ఒకదానికొకటి ఢీకొట్టాయి. కార్లు నుజ్జునుజ్జాయంటే ఏ మేరకు వేగంతో వెళ్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రమాదంలో కార్లలో ఉన్న పలువురికి స్వల్ప గాయలయ్యాయి. ఓ కారులో ఉన్న బాలుడి చేయికి, కాలికి.. ఓ మహిళ తలకు గాయమైంది. వెంటనే ట్రాఫిక్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రోడ్డుపై నుంచి కార్లను పక్కకు తీయించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. హైదరాబాద్–బీజాపూర్ రహదారిపై తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. రోడ్డు విస్తరణ పనులు త్వరగా జరిగితేనే ప్రమాదాల నివారణ సాధ్యమని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
పక్కా ప్లాన్.. ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను..
సాక్షి, కొందుర్గు(రంగారెడ్డి): వివాహేతర సంబంధం మోజులో పడి ఓ మహిళ కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి గొంతు నులిమి చంపేసింది. మొదట అనారోగ్యంతో చనిపోయాడని నమ్మించే ప్రయత్నం చేశారు. కుటుంబీకులు అనుమానం వ్యక్తం చేయగా పోలీసులు తమదైన శైలిలో విచారించి నిందితులిద్దరిని కటకటాల వెనక్కి పంపించారు. కొందుర్గు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా పొదిలి మండలం మర్రిపాడు గ్రామానికి చెందిన రూతమ్మ, వేణు దంపతులు. రూతమ్మకు గతంలో పొరుగు గ్రామానికి చెందిన శ్రీనుతో వివాహేతర సంబంధం ఉండేది. విషయం తెలుసుకున్న ఆమె భర్త వేణు భార్యాపిల్లలను తీసుకొని కొందుర్గుకు వలస వచ్చాడు. ఓ ఇల్లు అద్దెకు తీసుకొని స్థానికంగా కూలీపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. తమ సంబంధానికి అడ్డుగా ఉన్న శ్రీనును ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని పథకం వేసిన రూతమ్మ తన ప్రియుడితో కలిసి గతనెల 29 రాత్రి వేణు గొంతు నులిమి చంపేసింది. ఈ విషయం బయటకు పొక్కకుండా తన భర్త అనారోగ్యంతో మృతిచెందిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించి అక్కడ అంత్యక్రియలు నిర్వహించే క్రమంలో వేణు గొంతు నులిమి వేసినట్లుగా గాయాలు కనిపించాయి. గమనించిన కుటుంబసభ్యులు ఈనెల 1న కొందుర్గు పోలీసులకు ఫిర్యాదు చేశారు. షాద్‌నగర్ రూరల్ సీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో కేసు విచారణ చేపట్టారు. పలు కోణాల్లో దర్యాప్తు చేశారు. అనుమానంతో రూతమ్మను అదుపులోకి తీసుకొని విచారించగా తన ప్రియుడు శ్రీను కలిసి వేణును హత్యచేసినట్లుగా నేరం అంగీకరించింది. ఈమేరకు మంగళవారం నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. -
Rangareddy: ఆస్పత్రిలో సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య
రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. రాజేంద్ర నగర్ పరిధిలో ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన సుదీప్తి అనే మహిళ.. అదే ఆసుపత్రిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని చనిపోవడం కలకలంరేపింది. అనారోగ్యంతో బాధపడుతున్న సుదీప్తి ఈనెల 6వ తేదిన బండ్లగూడలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేరింది. ఈ క్రమంలో.. ఆరోగ్యం కుదుటపడటంతో నిన్ననే డిశ్చార్జ్ కావాల్సిన మహిళ తన రూమ్‌లో.. ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృత దేహన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. -
ఆర్టీసీ బస్సులు రావడంలేదని.. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్‌కు బాలిక ఫిర్యాదు
సాక్షి,రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా మంచాల మండలం చిడేడు గ్రామానికి చెందిన ఓ బాలిక ఆర్టీసీ బస్సులు సరిగా నడవడంలేదని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ దృష్టికి తీసుకెళ్లింది. తాను పాఠశాలకు వెళ్లే సమయంలో ఆర్టీసీ బస్సులు సరిగ్గా నడపడం లేదనే విషయాన్ని సీజేఐకి ఓ లేఖ ద్వారా తెలియజేసింది. ప్రస్తుతం బాలిక వైష్ణవి 8వ తరగతి చదువుతోంది. అయితే విద్యార్థిని అభ్యర్థనపై స్పందించిన సీజేఐ.. ఈ విషయాన్ని టీఎస్ఆర్టీసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అప్రమత్తమైన ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆర్టీసీ బస్సులను తక్షణమే పునరుద్ధరించినట్లు వెల్లడించారు. అదేవిధంగా బస్సుల పునరుద్ధరణపై అప్రమత్తం చేసినందుకు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కృతజ్ఞతలు తెలియజేశారు. -
‘పాలమూరు’ కోసంమళ్లీ కసరత్తు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాలపై ఆధారపడి చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి పర్యావరణ అనుమతుల ప్రక్రియలో వేగం పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అనుమతులు పొందే వరకు నిర్మాణ పనులు పూర్తిగా నిలిపివేయాలంటూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశించిన నేపథ్యంలో అనుమతుల సాధన ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇప్పటికే అవసరమైన అన్ని నివేదికలు సిద్ధం చేసిన ఇంజనీర్లు.. ప్రభుత్వం అనుమతించిన వెంటనే అనుమతుల కోసం కేంద్ర పర్యావరణ శాఖకు దరఖాస్తు చేయనున్నారు. ఈఏసీ ఓకే అంటేనే అనుమతి.. ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న రిజర్వాయర్లు, పంప్‌హౌస్‌లు, ఇతర నిర్మాణాలకు 27,193 ఎకరాల మేర భూసేకరణ చేయాల్సి ఉండగా మరో 205.48 హెక్టార్ల మేర అటవీ భూములు అవసరం కానున్నాయి. ఇందులో ఇప్పటికే 26 వేల ఎకరాల మేర భూసేకరణ పూర్తికాగా ఆగస్టులో ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. ఈ వివరాలతోపాటు ఇతర అంశాలపై ఇరిగేషన్ శాఖ అధికారులు సమగ్ర నివేదికలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే కేంద్ర పర్యావరణ శాఖకు ఈ వివరాలు సమర్పించాల్సి ఉన్నా ప్రభుత్వం మొదట గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టుల అనుమతుల ప్రక్రియను ముగించి ఆ తర్వాత కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల అనుమతుల ప్రక్రియ మొదలు పెట్టాలని భావించడంతో దీన్ని పక్కనపెట్టింది. అయితే ఎన్జీటీ పర్యావరణ అనుమతులు వచ్చేవరకు పనుల కొనసాగింపుపై ముందుకెళ్లొద్దని స్పష్టం చేయడంతో ఇప్పటికే సిద్ధం చేసిన నివేదికలను కేంద్ర పర్యావరణ శాఖకు పంపాలని ఇరిగేషన్ శాఖ భావిస్తోంది. ఈ నివేదికలను ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ (ఈఏసీ) పరిశీలించి పర్యావరణంపై పడే ప్రభావాన్ని మదింపు చేస్తుంది. ప్రాజెక్టు నిర్మాణాలకు ఎలాంటి అభ్యంతరం లేదని కమిటీ తేలిస్తేనే అనుమతుల ప్రక్రియ పూర్తి కానుంది. కేంద్రానికి దరఖాస్తు చేసిన రెండు నెలల్లో అనుమతులు వచ్చే అవకాశం ఉంటుందని ప్రాజెక్టు ఇంజనీర్లు చెబుతున్నారు. -
‘పాలమూరు–రంగారెడ్డి’ని ఆపాల్సిందే..
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వం పర్యావరణ అనుమతులు లేకుండా చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు నిలిపివేయాల్సిందేనని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) స్పష్టం చేసింది. పిటిషన్లకు విచారణ అర్హత లేదన్న తెలంగాణ ప్రభుత్వ వాదనను తోసిపుచ్చింది. పర్యావరణ అనుమతులు తప్పించుకోవడానికే తాగునీటి పేరు చెప్పి సాగునీటి ప్రాజెక్టు చేపడుతోందన్న ఏపీ ప్రభుత్వ వాదనతో ఏకీభవించింది. పిటిషనర్లు పర్యావరణ అంశంతో ఆశ్రయించిన నేపథ్యంలో విచారణ పరిధి తమకుందని పేర్కొంది. పర్యావరణ అనుమతులు పొందే వరకూ ప్రాజెక్టుపై తెలంగాణ ముందుకు వెళ్లకూడదని ఆదేశాల్లో పేర్కొంది. సంయుక్త కమిటీలో తెలంగాణ సభ్యులు మినహా మిగతా సభ్యులు పర్యావరణ ఉల్లంఘనలు జరిగాయని పేర్కొన్న అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రాజెక్టు నిర్మాణంలో పర్యావరణ ఉల్లంఘనలు జరిగాయని తాము విశ్వసిస్తున్నామని జస్టిస్ రామకృష్ణన్, విషయ నిపుణుడు సత్యగోపాల్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశాల్లో స్పష్టం చేసింది. ‘పాలమూరు–రంగారెడ్డి’ని తెలంగాణ ప్రభుత్వం పర్యావరణ అనుమతులు లేకుండా నిర్మిస్తోందని, ఇది ఆంధ్రప్రదేశ్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుందంటూ డి.చంద్రమౌళీశ్వర్‌రెడ్డి, అవ్వ వెంకటసుబ్బారెడ్డి, ఎస్కే.జానీబాషా, వజ్రాల కోటిరెడ్డి, నరబోయిన వెంకటరావు, సిద్దదాపు గాంధీ, గరికపాటి వెంకటరామనాయుడు, అన్నెం సోరెడ్డి, పండిపాటి వెంకయ్యలు దాఖలు చేసిన పిటిషన్‌పై ఎన్జీటీ చెన్నై ధర్మాసనం శుక్రవారం ఆదేశాలు వెలువరించింది. అనుమతులు తీసుకున్నాకే... తెలంగాణ, ఏపీ, పిటిషనర్ల, కేంద్రం తరఫున న్యాయవాదుల వాదనలు విన్న ధర్మాసనం ఉత్తర్వులు వెలువరించింది. ‘కేంద్ర పర్యావరణ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం అటవీ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోగా అనుమతించింది. అయితే ఇది ప్రాజెక్టు నిర్మాణానికి కాదని గుర్తుచేసింది. అపెక్స్ కౌన్సిల్ సమావేశం సందర్భంగా ఏపీ ప్రభుత్వం అభ్యంతరం తెలిపిన ప్రాజెక్టులపై ముందుకెళ్లొద్దని తెలంగాణకు కేంద్రం సూచించింది. సమగ్ర ప్రాజెక్టు నివేదిక సమర్పించలేదని.. ప్రాజెక్టు పనులు నిలిపివేయాలని కృష్ణా బోర్డు కూడా స్పష్టం చేసింది. ఇవన్నీ ఇలా ఉన్నా.. తెలంగాణ పర్యావరణ నిబంధనలకు వ్యతిరేకంగా ఈ ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించింది. ఈ నిర్ణయం పర్యావరణంపై ప్రభావం చూపడంతోపాటు ఏపీ ప్రజలు, పిటిషనర్ల (రైతులు) ప్రయోజనాలపైనా ప్రభావం చూపుతుంది. చెంచు గిరిజనులు ఉన్న ప్రాంతంలో ప్రాజెక్టు నిర్మాణం(పంప్‌హౌస్) చేపట్టడానికి తెలంగాణకు అనుమతి లేదు. 90 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్లు నిర్మిస్తే ఇక సాగునీటికి కాలువలు తీయడం మినహా ఏమీ లేదు’అని తెలంగాణ సర్కార్‌కు తేల్చిచెబుతూ ఉత్తర్వులు జారీచేసింది. ► ‘ఎన్జీటీ చట్టంలోని సెక్షన్ 14(3) ప్రకారం కాజ్ ఆఫ్ యాక్షన్ జరిగిన ఆరు నెలల్లోనే పిటిషన్ దాఖలు చేయాలనడం వాస్తవమే, సెక్షన్ 15 ప్రకారం పిటిషన్‌ను పరిశీలించే అధికారం మాత్రం మాకుంది’ ► ‘తెలంగాణ పేర్కొన్నట్లు 7.5 టీఎంసీలు తాగునీటికి అవసరం కాగా.. 90 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్లు కడుతున్నారంటే సాగునీటి అవసరాలకు కూడా అని భావిస్తున్నాం. పర్యావరణ అనుమతులు కూడా తాగునీటికే ఉన్నాయి.. సాగునీటికి కాదని కమిటీ స్పష్టం చేసింది’. ► ‘అటవీ, పర్యావరణ శాఖలకు సంబంధించి అనుమతుల ప్రక్రియ పూర్తయిన తర్వాత.. కృష్ణా బోర్డు, సీడబ్ల్యూసీ, అపెక్స్ కౌన్సిల్ అనుమతితో పనులు చేపట్టాలి’ – పాలమూరు–రంగారెడ్డి కేసులో ఎన్జీటీ -
మంత్రి వర్గంలో సంస్కార హీనులు
ఇబ్రహీంపట్నం: ‘తెలంగాణ మంత్రివర్గంలో సంస్కారం లేని వ్యక్తులు ఉన్నారు. చందమామను చూసి కుక్కలు మొరిగినట్లు మంత్రులు మొరుగుతున్నారు’అని వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల విమర్శించారు. మంత్రి నిరంజన్‌రెడ్డి తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆమె తీవ్రంగా మండిపడ్డారు. కేసీఆర్ కుమార్తె కవితను కూడా ఇలాగే హేళన చేస్తారా అని ప్రశ్నించారు. ఈ కుక్కకు కేసీఆర్ బిడ్డ కవిత ఏమవుతుందో ప్రజలు అడగాలని కోరారు. ఆయనకు భార్య బిడ్డలు, తల్లి, చెల్లి లేరా..? అంటూ నిలదీశారు. ఈ కుక్కలను తరిమి కొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించారు. తెలంగాణలో వైఎస్సార్ సంక్షేమ పాలనే ధ్యేయంగా ఈ నెల 20న చేవెళ్ల నుంచి వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పేరుతో ప్రారంభించిన పాదయాత్ర గురువారం ఎలిమినేడు, కప్పపహాడ్, తుర్కగూడ, చెర్లపటేల్‌గూడ మీదుగా ఇబ్రహీంపట్నానికి చేరుకుంది. 9 రోజుల్లో వంద కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేసుకున్న సందర్భంగా తల్లి విజయమ్మతో కలసి వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కేసీఆర్ పాలనకు చరమగీతం కేసీఆర్ నియంత పాలనకు చరమగీతం పాడాలని, రాజన్న రాజ్యం కోసం పోరాడాలని షర్మిల ప్రజలకు పిలుపునిచ్చారు. పాదయాత్రలో భాగంగా గురువారం ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. ఫార్మాసిటీ పేరుతో ప్రభుత్వ భూములే కాకుండా పట్టా, అసైన్డ్ భూములను రైతుల నుంచి లాక్కున్న ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కిందని విమర్శించారు. అమ్మకు అన్నం పెట్టని వాడు.. పిన్నమ్మకు బంగారు గాజులు ఇస్తామన్నట్లు స్థానిక ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి తీరు ఉందని విమర్శించారు. ఆయన స్వగ్రామమైన ఎల్మినేడు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతుందని చెప్పారు. రాష్ట్రంలో సమస్యలు లేకుంటే ముక్కు నేలకు రాసి ఇంటికి వెళ్లిపోతానంటూ çషర్మిల సవాల్ విసిరారు. సమస్యలుంటే సీఎం పదవికి రాజీనామా చేసి దళితుడిని ముఖ్యమంత్రి చేస్తారా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో పార్టీ ప్రచార కమిటీ కోఆర్డినేటర్ నీలం రమేశ్, కొండా రాఘవరెడ్డి, పి.రాంరెడ్డి, ఏనుగు సునీల్‌కుమార్, అమృతసాగర్, మాదగోని జంగయ్యగౌడ్, ముస్తాఫాలు పాల్గొన్నారు. షర్మిల మాటకు ప్రాణమిచ్చే మనిషి మాటకు కట్టుబడే మనిషి షర్మిల అని, ఆమె సంకల్పబలం చాలా గొప్పది అని దివంగత వైఎస్సార్ సతీమణి వైఎస్ విజయమ్మ అన్నారు. ప్రజలతో మమేకమైతేనే సమస్యలు తెలుస్తాయని..అందుకు ఎంతో ముఖ్యమైన సాధనం పాదయాత్రని, వైఎస్సార్ కూడా ఇదే అంశాన్ని చెప్పే వారని గుర్తు చేశారు. అయన బాటలో షర్మిల పాదయాత్ర చేపట్టి ప్రజల కష్టసుఖాల్లో పాలపంచుకుంటుందని చెప్పారు. ఆమెను ఆశీర్వదించాలని విజయమ్మ కోరారు. -
Vikarabad: రెచ్చిపోయిన సర్పంచ్.. సామాన్యుడిని కాలితో తంతూ..
వికారాబాద్ (రంగారెడ్డి): గ్రామ సమస్యలపై ప్రశ్నించినందుకు ఒక సామాన్యుడిపై సర్పంచ్ తన ప్రతాపాన్ని చూపాడు. ప్రస్తుతం ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, మార్పల్లి మండలం దామాస్తాపూర్‌కు చెందిన శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి గ్రామంలోని డ్రైనేజీ సమస్యలను పరిష్కారించాలని స్థానిక సర్పంచ్ జైపాల్ రెడ్డిని కోరాడు. ఈ క్రమంలో ఆగ్రహంతో ఊగిపోయిన సదరు సర్పంచ్ నన్నే ప్రశ్నిస్తావా? అంటూ శ్రీనివాస్ రెడ్డిపై పిడిగుద్దులు కురిపించాడు. అంతటితో ఆగకుండా అతడిని కిందపడేసి విచక్షణ రహితంగా కాలితో తన్నాడు. దీంతో బాధితుడు తనపై అకారణంగా దాడిచేసిన సర్పంచ్ జైపాల్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కాగా, ఒక బాధ్యాతాయుత పదవిలో ఉండి అనుచితంగా ప్రవర్తించిన సర్పంచ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టినట్లు తెలిపారు. చదవండి: హైటెక్ వ్యభిచారం.. తప్పించుకోవడానికి రహస్య మార్గం.. -
రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం.. బంగారం ఇవ్వడం ఆలస్యమైందని
సాక్షి, అనంతగిరి(రంగారెడ్డి): మనస్తాపంతో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంగళవారం వికారాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ రాజశేఖర్ కథనం ప్రకారం.. వికారాబాద్ పట్టణంలోని అనంతగిరిపల్లికి చెందిన ఊరడి మమత(21) స్థానిక రామయ్యగూడకు చెందిన నవీన్ రెండేళ్ల క్రితం పెద్దలను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లి సమయంలో 3 తులాల బంగారం పెడతామని మమత తండ్రి భాగయ్య హామీ ఇచ్చాడు. కొన్నాళ్ల తర్వాత ఇస్తామని చెప్పాడు. భాగయ్య ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆర్థిక పరిస్థితి క్షీణించింది. కూతురికి బంగారం ఇవ్వడంలో ఆలస్యమైంది. ఇటీవల పుట్టింటికి వెళ్లిన మమత బంగారం విషయమై తల్లిదండ్రులను అడిగింది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని, కొన్నిరోజుల తర్వాత ఇస్తామని చెప్పారు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె ఈనెల 15న మధ్యాహ్నం గుళికల(తిమ్మెట) మందు మింగింది. ఇది గమనించిన తల్లిదండ్రులు వెంటనే వికారాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం స్థానికంగా ఓ ప్రైవేట్ ఆస్పత్రికి, అక్కడి నుంచి ఉస్మానియాకు తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో మమత సోమవారం రాత్రి 10గంటలకు చనిపోయింది. వికారాబాద్ తహసీల్దార్ రవీందర్ శవ పంచనామా చేశారు. అనంతరం పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. మృతురాలి భర్త నవీన్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. చదవండి: యజమాని షాక్.. నగల దుకాణం గోడకు కన్నం.. -
రంగారెడ్డి: మహిళ గొంతు కోసి.. కాలు నరికి..
సాక్షి, ఆమనగల్లు: ఓ మహిళపై అత్యాచారం జరిపి దారుణంగా హత్య చేసిన ఘటన బుధవారం ఆమనగల్లు మున్సిపల్ పరిధిలోని నుచ్చుగుట్ట తండా సమీపంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మున్సిపల్ పరిధిలోని ముర్తుజపల్లికి చెందిన కొమ్ము గాలయ్య, పోచమ్మ (39) దంపతులు. బతుకుదెరువు నిమిత్తం హైదరాబాద్‌కు వెళ్లగా.. కరోనా నేపథ్యంలో పోచమ్మ తల్లిగారి ఊరైన మాడ్గుల మండలం చంద్రాయణపల్లికి వచ్చి నివాసం ఉంటున్నారు. హైదరాబాద్‌లో పారిశుధ్య కారి్మకురాలిగా పనిచేస్తున్న పోచమ్మ.. ప్రతిరోజు చంద్రాయణపల్లి నుంచి హైదరాబాద్‌కు వెళ్లి వస్తుంది. ఈ నేపథ్యంలో ఎప్పటిలాగే మంగళవారం ఉదయం ఇంటి నుంచి వెళ్లింది. సాయంత్రం 6 గంటల సమయంలో భర్త ఫోన్ చేయగా ఆమనగల్లులో ఆటో ఎక్కి వస్తున్నానని చెప్పింది. రాత్రయినా ఇంటికి చేరుకోకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం నుచ్చుగుట్టతండా సమీపంలో రోడ్డు పక్కన మహిళ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు.. పోలీసులకు సమాచారమి చ్చారు. ఆమనగల్లు సీఐ ఉపేందర్, ఎస్ఐ ధర్మేశ్ çఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. దుండగులు మహిళ గొంతు కోసి, కాలు నరికారు. మృతురాలిని పోచమ్మగా గుర్తించారు. సమీపంలో మృతురాలి దుస్తులు, మద్యం సీసాలు న్నాయి. వివాహేతర సంబంధమే హత్యకు కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ఆస్పత్రికి తరలించారు. చదవండి: Hyderabad: బాలికపై సవతి తండ్రి అత్యాచారం ఐదు ప్రత్యేక బృందాలు హత్య కేసులో నిందితులను పట్టుకోవడానికి ఐదు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు శంషాబాద్ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి వెల్లడించారు. ఘటనా స్థలాన్ని షాద్‌నగర్ ఏసీపీ కుషాల్కర్‌తో కలసి పరిశీలించారు. ఆమనగల్లు పోలీస్ స్టేషన్లో విలేకరులతో మాట్లాడారు. డాగ్‌స్కా్వడ్, క్లూస్‌టీం ద్వారా ఆధారాలు సేకరించామని, వీలైనంత త్వరలో నిందితులను పట్టుకుంటామని వెల్లడించారు. పోలీసులు అదుపులో నిందితుడు? పోచమ్మను హత్య చేసిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. ఘటనా స్థలం వద్ద లభించిన ఆధారాలు, ఫోన్‌కాల్ లిస్టు ఆధారంగా ఆమనగల్లులో ఓ చికెన్ సెంటర్లో పనిచేస్తున్న యువకుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. మృతదేహంతో ఆందోళన పోస్టుమార్టం పూర్తయిన అనంతరం పోచమ్మ మృతదేహాన్ని పోలీసులు ముర్తుజపల్లికి తరలించారు. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ మృతురాలి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కలిసి ఆందోళనకు సిద్ధమయ్యారు. మృతదేహాన్ని తీసుకుని ఆమనగల్లులో ధర్నా చేయడానికి తరలుతుండగా జంగారెడ్డిపల్లి వద్ద పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే ఆందోళనకు దిగారు. న్యాయం జరిగేలా చూస్తామని పోలీసులు వారికి హామీ ఇచ్చారు. -
విజయ మెగా డెయిరీ లక్ష్యం.. 8 లక్షల లీటర్లు
తుక్కుగూడ: పాడి పరిశ్రమ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ చెప్పారు. కులవృత్తులకు చేయూత ఇచ్చి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తోందన్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని రావిర్యాలలో తెలంగాణ పాడిపరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య ఆధ్వర్యంలో నిర్మించ తలపెట్టిన విజయ తెలంగాణ మెగా డెయిరీ నిర్మాణ పనులకు మంత్రి సబితారెడ్డితో కలసి ఆయన శంకుస్థాపన చేశారు. 32 ఎకరాల విస్తీర్ణంలో రూ.246 కోట్ల వ్యయంతో మెగా డెయిరీని ఏర్పాటు చేస్తున్నామని తలసాని చెప్పారు. దీన్ని రెండేళ్లలో పూర్తి చేస్తామన్నారు. గతంలో ఈ డెయిరీ ద్వారా రోజూ లక్ష లీటర్ల పాలను మాత్రమే సేకరించేవారని, ప్రస్తుతం 4 లక్షల లీటర్లకు పెరిగిందని చెప్పారు. మెగా డెయిరీ పూర్తయితే రోజుకు 8 లక్షల లీటర్ల పాలు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. విజయ డెయిరీకి 2014లో రూ.300 కోట్ల ఆదాయం ఉండగా.. ఇప్పుడు రూ.750 కోట్లకు పెరిగిందన్నారు. విజయ డెయిరీ దేశంలో మొదటి స్థానంలో ఉందని చెప్పారు. 15 రోజుల్లో బీమా పరిహారం చెల్లిస్తాం పాడి రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ప్రతి లీటర్‌పై రూ.4 బోనస్ ప్రకటించారని తలసాని గుర్తు చేశారు. బోనస్‌రాని రైతులకు తమ శాఖ ఆధ్వర్యంలో త్వరలో చెల్లిస్తామన్నారు. మంత్రి సబితారెడ్డి సూచన మేరకు రంగారెడ్డి జిల్లాను పైలెట్ ప్రాజెక్టు కింద చేపట్టి రైతులకు సబ్సిడీపై పశువులను పంపిణీ చేస్తామని వెల్లడించారు. బీమా ఉండి మరణించిన పశువులు, గేదెలకు 15 రోజుల్లో పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు. ‘విజయ డెయిరీ కేవలం పాల ఉత్పత్తులే కాకుండా నెయ్యి, పెరుగు, బటర్ మిల్క్, లస్సీ, ఫ్లేవర్డ్ మిల్క్ ఇలా 28 రకాలను ఉత్పత్తి చేస్తోంది. ఇవి తెలంగాణలోనే కాకుండా ఏపీ, ఢిల్లీ, ముంబైలో కూడా అందుబాటులో ఉన్నాయి. ఏడాది పొడవునా రైతుల నుంచి పాలను సేకరిస్తాం. రాష్ట్రవ్యాప్తంగా 200 అవుట్లెట్లు, 600 పార్లర్లు ఉన్నాయి. రాష్ట్రంలో 2 లక్షల 13 వేల మంది రైతులు సహకార సంఘంలో సభ్యులుగా ఉన్నారు. గొల్లకుర్మలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో రూ.11 వేల కోట్లతో గొర్రెలను పంపిణీ చేశాం’అని తలసాని చెప్పారు. మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ.. రావిర్యాలలో మెగా డెయిరీని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. దీని ద్వారా స్థానికులకు ఉపాధి లభిస్తుం దని చెప్పారు. ప్రైవేట్ రంగానికి దీటుగా విజయ డెయిరీ పని చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య చైర్మన్ లోక భూమారెడ్డి తదితరులు పాల్గొన్నారు.