
ప్రతీకాత్మక చిత్రం
కీసర: కరోనాతో చనిపోయిన వారి వద్దకు సొంత బంధువులే వెళ్లి చూసే ధైర్యం చేయలేని పరిస్థితులు ఇప్పుడు చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో కరోనాతో చనిపోయిన వారి ఒంటిపై ఉన్న ఆభరణాలు తీసేందుకు ముందుకురావడం సాహసమే. ఇలాంటి ఘటన కీసరలో మంగళవారం జరిగింది. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కీసర దాయరకు చెందిన వృద్ధురాలు కరోనాతో మృతి చెందింది.
ఆమె మృతదేహాన్ని శ్మశాన వాటికకు తీసుకొచ్చారు. ఆమె ఒంటిపై రూ.లక్ష పైగా విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలు ఉన్నాయి. వాటిని కుటుంబసభ్యులు ఎవరూ తీసేందుకు ముందుకు రాలేదు. ఇందుకోసం ఓ వ్యక్తితో రూ.14వేలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ వ్యక్తి మృతురాలి ఒంటిపై ఉన్న బంగారు, వెండి ఆభరణాలను తీసి కుటుంబసభ్యులకు అందజేశారు. ఇది సామాజిక మాధ్యమంలో చక్కర్లు కొడుతోంది.
చదవండి: సీఎం హోదాలో తొలిసారిగా గాంధీకి కేసీఆర్