‘లైఫ్‌ వైరో ట్రీట్‌’తో కోవిడ్‌కు కళ్లెం | NIPER Said Life Viro Treat Is Vaccine Of Coronavirus | Sakshi
Sakshi News home page

‘లైఫ్‌ వైరో ట్రీట్‌’తో కోవిడ్‌కు కళ్లెం

Published Sat, Sep 12 2020 10:55 AM | Last Updated on Sat, Sep 12 2020 11:59 AM

NIPER Said Life‌ Viro Treat Is Vaccine Of Coronavirus - Sakshi

బాలానగర్‌(హైదరాబాద్‌): కోవిడ్‌ వైరస్‌తోపాటు అన్ని శ్వాసకోశ ఇన్ఫెక్షన్లనూ సమర్థంగా నియంత్రించే ‘లైఫ్‌ వైరో ట్రీట్‌’ అనే వ్యాక్సిన్‌ను కనుగొన్నట్లు బాలానగర్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌(నైపర్‌) సంస్థ వెల్లడించింది. నైపర్, లైఫ్‌ ఆక్టివ్స్, సుప్రీం ఇండస్ట్రీస్‌ సంయుక్త ఆధ్వర్యంలో అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్‌ను శుక్రవారం నైపర్‌లోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రదర్శించారు. అనంతరం నైపర్‌ డైరెక్టర్‌ డా.శశిబాలాసింగ్‌ మాట్లాడారు. వ్యాక్సిన్‌ పనితీరు వివరించారు. నెబ్యులైజర్‌ సహాయంతో మందు పనితీరు ప్రదర్శించారు.

అందరికీ అందుబాటులో తక్కువ ధరకే ఈ మందు తీసుకొస్తున్నట్లు చెప్పారు. వ్యాక్సిన్‌తో ఎలాంటి వైరల్‌ ఇన్ఫెక్షన్లు అయినా నియంత్రణలోకి వస్తాయని ఆమె తెలిపారు. వైరల్‌ ఇన్ఫెక్షన్లకు సంబంధించిన క్రిములు కేవలం 3 రోజుల్లో శరీరం నుంచి తొలగిపోతాయని వివరించారు. ఈ మందును ముందు జాగ్రత్త చర్యగా ప్రివెంటివ్‌ మెడిసిన్‌గానూ వాడవచ్చని తెలిపారు. కోవిడ్‌ బాధితులకూ మందుగా ఉపయోగించవచ్చని తెలిపారు. జంతువులు, మానవులపై ప్రయోగాలు విజయవంతంగా పూర్తి చేసుకొని అందుబాటులోకి వస్తోందని చెప్పారు. అన్ని శ్వాసకోశ వైరల్‌ ఇన్ఫెక్షన్లకూ వ్యతిరేకంగా ‘లైఫ్‌ వైరో ట్రీట్‌’ పనిచేస్తుందని, మానవాళికి సహాయపడుతుందని అన్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement